
సదర్ సంబరాలు అంబరాన్నంటాయి. డప్పు దరువులకనుగుణంగా దున్నపోతుల విన్యాసాలు, యాదవుల నృత్యాలు ఆకట్టుకున్నాయి

ఆదివారం ఇందిరా పార్కు సమీపంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు
























