Sadar celebrations
-
హైదరాబాద్‌లో ఘనంగా సదర్ వేడుకలు (ఫోటోలు)
-
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ సదర్ సమ్మేళనం (ఫొటోలు)
-
హైదరాబాద్ : నారాయణగూడ చౌరస్తాలో సదర్ వేడుకలు అదరహో (ఫొటోలు)
-
అధికారికంగా సదర్: కేటీఆర్
తుర్కయాంజాల్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య జయంతితోపాటు సదర్ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మన్నెగూడలో నిర్వహించిన గొల్ల, కురుమల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. కులవృత్తులకు జీవం పోసి గ్రామీణ ఆర్థికవ్యవస్థను పరిపుష్టం చేసేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇందులో భాగంగా రూ.11 వేల కోట్లతో గొర్రెలను పంపిణీ చేసినట్లు తెలిపారు. 2014కు ముందు గొర్రెల పెంపకందారుల సొసైటీలో 2.21 లక్షలమంది సభ్యులు మాత్రమే ఉండేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 7.61 లక్షలకు పెరిగిందన్నారు. టాటాలు మాత్రమే కాకుండా, తాతల నాటి కులవృత్తులు కూడా బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ ఆలోచన అని పేర్కొన్నారు. కులమతాలకతీతంగా అందరి సంక్షేమం కోసం పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఎల్లవేళలా అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. విపక్షాలకు అభివృద్ధి కనిపించడం లేదా? నాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు గొల్ల, కురుమలకు బ్యాంక్ రుణాలిచ్చేందుకు ఎన్సీడీపై సంతకాలే పెట్టలేదని కేటీఆర్ గుర్తు చేశారు. 75 శాతం సబ్సిడీతో గొర్రెల పిల్లలను పంపిణీ చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తమ ప్రభుత్వ పనితీరును పక్క రాష్ట్రాలవారు అభినందిస్తుంటే, రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ నేతలకు అభివృద్ధి, సంక్షేమం కనబడటం లేదని విమర్శించారు. నవంబర్ 5 తర్వాత పెంపకందారులకు నచ్చినచోట గొర్రెలు కొనుక్కునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ గొల్ల, కురుమల అభివృద్ధి కోసం ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ : సదర్ సంబురాలకు సిద్ధం (ఫొటోలు)
-
స్కూటీతో పాటు మహిళను ఈడ్చుకెళ్లిన దున్నపోతు
-
సదర్ ఉత్సవాలు: స్కూటితో పాటు మహిళను ఈడ్చుకెళ్లిన దున్నపోతు
సాక్షి, హైదరాబాద్: సదర్ ఉత్సవాలకు సిద్ధమవుతున్న భాగ్యనగరంలో విషాదం చోటు చేసుకుంది. దున్నపోతు హల్చల్ చేసింది. రోడ్డుమీదకు వచ్చిన దున్నపోతు కనిపించిన వారిని కనిపించినట్లు కుమ్మేయసాగింది. ఆ వివరాలు.. (చదవండి: గాంధీభవన్‌లో ‘సదర్’ వేడుకలు) ఖైరతాబాద్ చింతల్‌బస్తీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీదకు వచ్చిన దున్నపోతు బీభత్సం సృష్టించింది. దానికి ఎదురుగా కనిపించిన వారి మీదకు పరిగెత్తింది. దున్నపోతును కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పటికి వీలు కాలేదు. ఈ క్రమంలో దున్నపోతు స్కూటీతో పాటు మహిళను ఈడ్చుకెళ్లింది. దున్నపోతు దాడిలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. చివరకు కొందరు యువకులు ఖైరతాబాద్ చౌరస్తాలో దున్నపోతును పట్టుకున్నారు. చదవండి: ఊపిరి.. ఉక్కిరిబిక్కిరి.. -
గాంధీభవన్‌లో ‘సదర్’ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా యాదవ కులస్తులు ఘనంగా జరుపుకునే సదర్ పండుగ వేడుకలను సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించారు. యూత్‌కాంగ్రెస్ ఆలిండియా కార్యదర్శి ఎం.అనిల్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో పెద్దఎత్తున యాదవులు గాంధీభవన్‌కు వచ్చారు. దున్నపోతుల ప్రదర్శనతో వచ్చిన యాదవులకు కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలు దున్నపోతులపై ఎక్కి అభివాదం చేస్తూ సందడి చేశారు. పెద్ద సంఖ్యలో యాదవులు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలిరావడంతో సోమవారం మధ్యాహ్నం సమయంలో కొంతసేపు గాంధీభవన్‌లో సదర్ కోలాహలం కనిపించింది. -
హైదరాబాద్‌లో ఘనంగా సదర్ వేడుకలు
-
సందడిగా సదర్ సంబురాలు
-
ముషీరాబాద్‌లో సదర్ దున్నపోతులు హల్చల్
-
సదర్ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబు
-
సందడిగా సదర్ సంబురాలు
-
చేవెళ్ల మహరాజ్
చేవెళ్ల: హైదరాబాద్ నగరంలో ఐదు రోజుల పాటు నిర్వహించే సదర్ ఉత్సవాలకు చేవెళ్ల మహరాజ్(దున్నపోతు) సిద్ధమైంది. తెలంగాణ మహరాజ్‌గా జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిన ఈ హరియాణా దున్నపోతు గతేడాది సదర్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదే ఉత్సాహంతో ఈ ఏడాది కూడా ఉత్సవాల్లో పాల్గొనేందుకు రెడీ అయ్యింది. 2009లో పుట్టిన మహరాజ్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్లు పలుకుతున్నట్లు దాని యజమాని కోటేశ్వరరావు చెబుతున్నారు. ప్రపంచ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఈ దున్నపోతు నాలుగుసార్లు విజేతగా నిలిచింది. 2011, 2012, 2016, 2017లో పోటీలకు హాజరై బహుమతులు గెలుచుకుంది. రాజభోగం.. మహరాజ్ ఆలనాపాలనా చూసేందుకు ముగ్గురు మనుషులు ఉన్నారు. మహరాజ్‌ను రోజూ 5 కిలోమీటర్లు వాకింగ్‌కు తీసుకెళతారు. మూడు సార్లు ఆయిల్ మసాజ్ చేస్తారు. మూడుసార్లు స్నానం చేయిస్తారు. వీర్యానికి భలే క్రేజ్.. మహరాజ్ వీర్యానికి విపరీతమైన క్రేజ్ ఉంది. గతేడాది నుంచే మహరాజ్ వీర్యాన్ని సేకరించి విక్రయిస్తున్నారు. ముర్రా జాతి దున్నపోతుల ఉత్పత్తికి ఈ వీర్యాన్ని వినియోగిస్తున్నారు. ఒక్క డోస్ వీర్యం ఖరీదు రూ.450. ప్రతి ఏటా మహరాజ్ నుంచి 30 వేల డోస్‌ల వీర్యాన్ని సేకరిస్తున్నారు. దీని విలువ సుమారు కోటిన్నర వరకు ఉంటుందని దాని యజమాని కోటేశ్వరరావు చెబుతున్నారు. జూనియర్ మహరాజ్లూ సిద్ధం దేశవాళీ పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ఎన్కే పల్లి సమీపంలో డెయిరీని ఏర్పాటు చేశా. పదేళ్ల క్రితం 10 పశువులతో మొదలుపెట్టిన ఈ డెయిరీలో ప్రస్తుతం 150కి పైగా గేదెలు, ఆవులు ఉన్నాయి. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పశుగ్రాసం మాత్రమే వీటి దాణాగా వినియోగిస్తా. బ్రీడింగ్ కోసం వివిధ జాతుల పశువులను పెంచుతున్నాం. మహరాజ్ కూడా ఇక్కడే పుట్టింది. మహరాజ్ సంతానంగా రెండు జూనియర్ మహరాజ్‌లు సిద్ధమవుతున్నాయి. – ఎం.కోటేశ్వరరావు, ‘మహరాజ్’యజమాని ప్రత్యేకతలివే.. పేరు : మహరాజ్ వయసు : 8 ఏళ్లు స్వస్థలం : చేవెళ్ల మండలం,ఎన్కేపల్లి గ్రామం యజమాని : ఎం.కోటేశ్వరరావు బరువు : 1,675 కిలోలు ఎత్తు : 6.2 అడుగులు మార్కెట్ విలువ : రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్లు రోజువారీ ఆహారం.. పాలు : 16 లీటర్లు ఖర్జూరం : 500 గ్రాములు బాదం, పిస్తా : 500 గ్రాములు (వారానికి రెండుసార్లు) ఉలవలు : 15 నుంచి 20 కిలోలు వీటితో పాటు పచ్చిగడ్డి, ఎండుగడ్డి -
సదర్ సందడి
నగరంలో రెండో రోజూ సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగారుు. దున్నపోతుల విన్యాసాలు.. డప్పుదరువులు.. కళాకారుల నృత్యాలు.. యువత జోష్‌తో సదర్ సమ్మేళనం సందడిగా సాగింది. యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో నారాయణగూడ చౌరస్తాలో నిర్వహించిన తెలంగాణ యాదవ సదర్ సమ్మేళనం ఆకట్టుకుంది. వేడుకలో హోంమంత్రి నారుుని నర్సింహారెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, టీజీవో నగర అధ్యక్షులు కృష్ణయాదవ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. - కాచిగూడ -
జై..యువరాజ్!
-
యువరాజ్ విలువ.. రూ. 11 కోట్లు!
-
జై..యువరాజ్!
►సదర్ ఉత్సవాల్లో సందడి చేయనున్న హరియాణా ‘యువరాజ్’ ►ప్రత్యేక ఏసీ కంటైనర్‌లో నగరానికి.. ►ఈ సారి ధర రూ.11 కోట్లు.. హైదరాబాద్: సదర్ ఉత్సవాల్లో ఈ సారి కూడా హరియాణా ‘యువరాజ్’ (దున్నపోతు) సందడి చేయనుంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 22వ తేదీన హర్యాణాలోని కురుక్షేత్ర జిల్లా సునారియో గ్రామం నుంచి బయలుదేరిన యువరాజ్ ఈ సారి తన కొడుకు ‘ధారా’ తో కలిసి వేడుకల్లో పాల్గొంటుంది. 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం నుంచి ఏసీ సదుపాయం ఉన్న ప్రత్యేక కంటెయినర్లలో నగరానికి తరలిస్తున్నారు. 10 మంది యువకులు దాంతో పాటు హైదరాబాద్ వస్తున్నారు. రోజుకు 125 కిలోమీటర్ల చొప్పున పయనిస్తూ 29వ తేదీ నాటికి నగరానికి చేరుకొనే విధంగా ప్రణాళికను రూపొందించారు. కంటెయినర్లలో దున్నల కోసం ప్రత్యేకంగా రబ్బరుతో మ్యాటింగ్ ఏర్పాటు చేశారు. గత సంవత్సరం రూ.7 కోట్ల ఖరీదు ఉన్న యువరాజ్ ధర ఈ ఏడాది రూ.11 కోట్లకు చేరినట్లు దాని యజమాని కరమ్‌వీర్‌సింగ్ ‘సాక్షి’తో చెప్పారు. యువరాజ్ , దాని కొడుకు ధారాతో పాటు, వాటికి కావలసిన నాణ్యమైన దాణా, యాపిల్స్, ఎండు ఫలాలతో మరో ప్రత్యేక వాహనం కూడా వస్తోంది. గత సంవత్సరం విశ్రాంతి లేకుండా పయనించడంతో యువరాజ్ జ్వరంతో అలసిపోయినందువల్ల ఈ సారి మరింత జాగ్రత్తగా తగిన విశ్రాంతిని అందజేస్తూ నగరానికి తీసుకొస్తున్నారు. ఇటీవల న్యూఢిల్లో జరిగిన ప్రదర్శనలో ప్రధాని నరేంద్రమోదీని సైతం అమితంగా ఆకర్షించిన యువరాజ్ నగరంలో ఈ నెల 31వ తేదీన ముషీరాబాద్‌లో, నవంబర్ 1వ తేదీన నారాయణగూడ వేడుకల్లో పాల్గొననుంది. ఇప్పటి వరకు నగరంలో ప్రదర్శించిన దున్నలు అన్నీ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖరీదు చేసేవే. కానీ ఏకంగా రూ.11 కోట్ల ఖరీదైన ముర్రా జాతికి చెందిన యువరాజ్‌ను హైదరాబాద్‌కు తెప్పించేందుకు, ప్రదర్శన నిమిత్తం రూ.20 లక్షల వరకు ఖర్చు చేయవలసి వస్తోందని అఖిల భారత యాదవ సంఘం.ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ తెలిపారు. 1800 కిలోల బరువు, 14 ఫీట్ల పొడవు, 6 ఫీట్ల ఎత్తు ఉన్న ఈ దున్నకు ప్రతి రోజు గడ్డి, దాణాతో పాటు, పాలు, బాదం, పిస్తా, కాజు, బెల్లం, క్యారెట్, వంటి ఖరీదైన ఆహారం అందజేస్తున్నట్లు చెప్పారు. ఏటా రూ.కోటికిపైగా ఆదాయం... హరియాణా ‘యువరాజ్’కు ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ మంచి పేరు ఉంది. 2007లో పుట్టిన ఈ దున్న ఇప్పటి వరకు ఎన్నో దూడలకు జన్మనిచ్చింది. దీని వీర్యం కోసం యురోపియన్ దేశాల్లో ఎంతో డిమాండ్ ఉంది. టర్కీ, స్కాట్లండ్, బ్రెజిల్ వంటి దేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. నాలుగు రోజులకు ఒక సారి దీని నుంచి వీర్యాన్ని సేకరిస్తారు. అలా సేకరించిన వీర్యాన్ని నైట్రోజన్ సిలిండర్లలో భద్రపరిచి ఇంజక్షన్ల రూపంలో విక్రయిస్తారు. ఒక్కో ఇంజక్షన్ ఖరీదు రూ.400. ఒక్కసారి విడుదలయ్యే వీర్యంపైన రూ. 3 నుంచి రూ.4 లక్షల వరకు లభిస్తుంది. ఇలా ఏటా కొన్ని వందల ఇంజక్షన్లను విక్రయిస్తున్నారు. విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. హర్యానా ‘యువరాజ్’ వీర్యం విక్రయాలపైనే ఏటా రూ.కోటి వరకు ఆదాయం లభించడం గమనార్హం. బయోడేటా దున్న పేరు : యువరాజ్ పుట్టిన తేదీ : 16 జనవరి 2007 తల్లిదండ్రులు : గంగ, యోగరాజ్ స్వస్థలం : కురుక్షేత్ర, హరియాణా యజమాని : కరమ్‌వీర్‌సింగ్ ఆహారం : రోజుకు 15 కిలోల యాపిల్స్, 30 లీటర్ల పాటు, 5 కిలోల క్యారెట్, 5 కిలోల బత్తాయి, కిలో కాజు, కిలో బాదం, 5 కిలోల బెల్లం, స్వచ్ఛమైన దాన, గడ్డి, వివిధ రకాల పప్పుల పొట్టు,మొక్కజొన్న పొట్టు వ్యాయామం : ప్రతిరోజు 5 కిలోమీటర్ల నడక అవార్డులు : 12 నేషనల్ చాంపియన్ అవార్డులు, ఒక బెస్ట్ ఎనిమల్ అవార్డు ♦ హైదరాబాద్‌లో దీపావళి తరువాత 12, 13 తేదీల్లో జరుగనున్న సదర్ ఉత్సవాల కోసం ఇక్కడికి తెప్పించారు. ♦ ఇప్పటికే అందంగా ముస్తాబు చేసిన ‘యువరాజ్’కు ప్రతి రోజు డెట్టాల్‌తో శుభ్రంగా స్నానం చేయించడంతో పాటు ఖరీదైన నూనెలతో మాసాజ్ చేస్తున్నారు. -
సదరోత్సాహం..
-
వైభవంగా సదర్ ఉత్సవాలు
అలరించిన దున్నపోతుల విన్యాసాలు.. మహేశ్వరం: భిన్న స్కృతులు, విభిన్న ఆచారాలకు ఆలవాలమైన గ్రామాల్లో సదర్ ఉత్సవం ప్రత్యేకమైంది. సదర్‌ను తెలుగులో చెప్పాలంటే దున్నపోతుల పండుగ అంటారు. దీపావళి పండుగ తర్వాత రోజు జరిగేది దున్నపోతుల పండుగ. మండల పరిధిలోని రావిర్యాల గ్రామంలో సదర్ ఉత్సవాలు శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా యాదవులు దున్నపోతులను రంగుల చెమ్కీలతో అలంకరించారు. గ్రామంలో గున్నాల యాదవ సంఘం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఉప సర్పంచ్ గున్నాల చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దున్నపోతుల ఊరేగింపు నిర్వహించారు. యాదవులు దున్నపోతులకు ప్రత్యేక పూజలు చేశారు. యాదవులు ఒకే చోట చేరి తీన్మార్, డప్పు, దరువులు, డీజే స్టెప్లతో డ్యాన్సులు చేశారు. మధ్య మధ్యలోదున్నపోతుల విన్యాసాలు చూపరులను అలరించాయి. పెద్ద త్తున టపాసులు కాల్చి సందడి చేశారు. గ్రామంలో సర్దార్‌పటేల్ యూత్, నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో దున్నపోతులను ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జే.లక్ష్మయ్య యాదవ్, ఎంపీటీసీలు లింగం సురేష్, మునగని రాజు, ఉప సర్పంచ్ బోద జైపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గొనమోని మహిపాల్ ముదిరాజ్, రాగనమోని మహేందర్, గున్నాల రవీందర్ యాదవ్, గున్నాల పర్వతాలు యాదవ్, గున్నాల ఇబ్రాహీం యాదవ్, గున్నాల హరికిషన్ యాదవ్, వార్డు సభ్యులు పాండురంగారెడ్డి. పుంటికూర నవీన్‌రెడ్డి, లింగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మంఖాల్‌లో.. మంఖాల్ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. దున్నపోతులను సుందరంగా అలంకరించి నృత్యాలు చేయించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అత్తెని కౌలస్య, ఉప సర్పంచ్ కప్పల సుందరయ్య, ఎంపీటీసీ మధు, కాంగ్రెస్ సినియర్ నాయకులు అత్తెని మహేందర్ యాదవ్,మాజీ ఎంపీటీసీ రాములు యాదవ్, యాదవ సంఘం నాయకులు అందెల రాజు, బండ ఆశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బస్తీమే సదర్
దీపావళి నాడు టపాసుల మోతతో మార్మోగిన జంట నగరాలు.. మరుసటి రోజున ఆలమందల కేళితో దుమ్మురేపాయి. సదర్ సందడితో పట్నంలోని బస్తీలన్నీ జబర్దస్తీగా మారాయి. ద్వాపర యుగం నాటి ఈ సంబురం నేటికీ సిటీలో కనువిందు చేస్తోంది. యాదవులకు మాత్రమే పరిమితమైన ఈ పండుగ హైదరాబాద్ సంప్రదాయంలో ఓ భాగం. అందంగా అలంకరించిన దున్నపోతులు.. బాజాభజంత్రీలతో ఊరేగింపుగా సాగే ఉత్సవం సదర్. దున్నపోతులతో పాటు వాటి యజమానులు పలురకాల విన్యాసాలతో ప్రజలను అలరిస్తారు. ఇక ఈ రోజు రాత్రి బర్కత్‌పురలోని రెడ్డి కాలేజ్ రోడ్డు, నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాల్లో నిర్వహించే సదర్ వేడుకల కోసం సిటీ ముస్తాబైంది. ఇదే లక్ష్మీపూజ మామూలుగా వ్యాపారులకు ఉండే లక్ష్మీపూజ యాదవులకు సదర్ రూపంలో ఉంటుంది. సిటీలోని యాదవులందరిదీ దాదాపు పాల వ్యాపారమే. ఆ గోవులు, గేదెలే వారికి లక్ష్మీమాతలు. అందుకే సదర్ ఉత్సవంలో అవే ప్రత్యేకం. ‘మా బర్రెలు, దున్నపోతుల జుట్టు కత్తిరించి.. శుభ్రంగా స్నానం చేయిస్తాం. తర్వాత కొమ్ములకు రంగులేసి, మెడలో పూలదండలతో అలంకరించి వాటికి పూజ చేస్తాం. మాకు అన్నం పెట్టే తల్లులు అవే కాబట్టి అవే మాకు లక్ష్మీ సమానం. చిట్టీలు వేసుకొని మరీ ఈ పండుగ కోసం డబ్బులు దాచుకుంటారు. అప్పు చేసైనా సరే ఘనంగా సదర్ చేసేవారూ ఉంటారు’ అని చెప్తాడు నాంపల్లికి చెందిన పాల వ్యాపారి బొద్దం భాస్కర్‌యాదవ్. ఎవరిళ్లల్లో వాళ్లు.. సదర్.. దీపావళి తెల్లవారి నుంచి రెండో రోజు వరకు సాగుతుంది. పండుగ తెల్లారి డివిజన్ల వారీగా జరిగే ఈ ఉత్సవం.. ఆ మరుసటి రోజున వైభవంగా కొనసాగుతుంది. నారాయణగూడలో సాగే సదర్ ఉత్సవానికి జంటనగరాల్లోని యాదవులంతా హాజరవుతారు. ఊరేగింపుగా వచ్చిన దున్నపోతుల మెడలో పూలదండలు, మెడల్స్ వేసి తమకు ఉపాధినిస్తున్న ఆ మూగజీవాల పట్ల గౌరవం చాటుకుంటారు. అలాగే ఆ గేదెలున్న ఆసాములనూ శాలువాతో సత్కరిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ సదర్ వేడుకలోనూ కొన్ని మార్పులు వచ్చాయి. బ్యాండ్ బాజా స్థానంలో డీజే చేరి ఈ పండుగకు మోడర్న్ టచ్ ఇస్తోంది. ‘సదర్.. యాదవుల పండుగే కాదు.. వాళ్ల ఐక్యతకు చిహ్నం కూడా. ఈ పండుగను దాదాపు రూ. పది లక్షల దాకా ఖర్చుపెట్టి చేస్తాం’. - హరిబాబు యాదవ్, టీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ