దున్నపోతుపైకి ఎక్కి సందడి చేస్తున్న జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా యాదవ కులస్తులు ఘనంగా జరుపుకునే సదర్ పండుగ వేడుకలను సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించారు. యూత్‌కాంగ్రెస్ ఆలిండియా కార్యదర్శి ఎం.అనిల్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో పెద్దఎత్తున యాదవులు గాంధీభవన్‌కు వచ్చారు. దున్నపోతుల ప్రదర్శనతో వచ్చిన యాదవులకు కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలు దున్నపోతులపై ఎక్కి అభివాదం చేస్తూ సందడి చేశారు. పెద్ద సంఖ్యలో యాదవులు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలిరావడంతో సోమవారం మధ్యాహ్నం సమయంలో కొంతసేపు గాంధీభవన్‌లో సదర్ కోలాహలం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment