gandhi bhavan
-
నవంబర్ నెలాఖరుకల్లా కులగణన పూర్తి చేయాలి: రేవంత్
-
తొలిరోజు 285 దరఖాస్తులు... 30 పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: పార్టీ కార్యకర్తలు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం ‘మంత్రులతో ముఖాముఖి’కార్యక్రమం ప్రారంభమైంది. తొలిరోజు కార్యక్రమానికి హాజరైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజల నుంచి 4 గంటల పాటు దరఖాస్తులు తీసుకున్నారు. దాదాపు 285 దరఖాస్తులు రాగా, అందులో 30కి పైగా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించారు. ఇందుకోసం బాధితుల సమక్షంలోనే ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతోపాటు పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసిన దామోదర.. వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో దరఖాస్తులు ఇచ్చేందుకు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ముఖ్యంగా 317 జీవో కారణంగా ఇబ్బందులు పడుతున్న గురుకుల ఉపాధ్యాయులు, పలు ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు వచ్చి తమ అర్జీలను అందజేశారు. ఇందిరమ్మ ఇళ్లు కావాలని, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలని, రేషన్‌కార్డులు కావాలని, ఉపాధి కల్పించాలని, చిన్నారుల ఆరోగ్య సమస్యలకు సాయం చేయాలని, 108 సిబ్బందికి ఏఎన్ఎం ఉద్యోగ నోటిఫికేషన్లలో వెయిటేజీ ఇవ్వాలని కోరుతూ పలువురు దరఖాస్తులు సమర్పించారు. గత పదేళ్లలో తమపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయించాలని మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. తొలిరోజు వచ్చిన దరఖాస్తులన్నింటినీ కంప్యూటరీకరించామని, ఎప్పటికప్పుడు ఈ సమస్యల పరిష్కార దశలను తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెప్పాయి. అద్భుత ఆలోచన: మంత్రి దామోదర గాంధీభవన్‌లో ప్రజావాణి చేపట్టడం అద్భుతమైన ఆలోచన అని మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌ను అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను పరిష్కరించే మాట అటుంచితే కనీసం వారి గోడు వినేవారు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు తాము ప్రజల సమస్యలు విని పరిష్కరించే దిశలో అడుగులు వేస్తున్నామని చెప్పారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఆయా శాఖలకు పంపుతామని, వీలున్న దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్‌రావు, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ కాంగ్రెస్ పారీ్టకి ప్రజలు, కార్యకర్తలంటే ఎంతో గౌరవమని, అందుకే వారి సమస్యల పరిష్కారం కోసం గాంధీభవన్‌లో ప్రజావాణి లాంటి కార్యక్రమాన్ని చేపట్టామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. వారంలో రెండు రోజులు మంత్రులు గాంధీభవన్‌కు వచ్చి ప్రజలు, కార్యకర్తలతో మమేకమవుతారని, వారి సమస్యలపై అర్జీలు తీసుకుంటారని చెప్పారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని ఆయన కార్యక్రమ ప్రారంభ సభలో చెప్పారు. -
దసరాకు ‘కేబినెట్’ ధమాకా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. దసరా పండుగ సమయంలో కొత్త మంత్రులను నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. టీపీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో.. కేబినెట్ విస్తరణకు అడ్డంకులు తొలగినట్టేనని, ఈసారి మంత్రివర్గ విస్తరణ ఖాయమని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే నెల 5వ తేదీ తర్వాత ఎప్పుడైనా కొత్త మంత్రులు కొలువుదీరనున్నారని నేతలు చెబుతున్నారు. ఎవరెవరికి చాన్స్ ఇవ్వాలన్న దానిపై మరోమారు చర్చలు జరిపి ఖరారు చేయనున్నట్టు వివరిస్తున్నారు.బెర్తుల కోసం పోటాపోటీనిబంధనల ప్రకారం.. రాష్ట్రంలో గరిష్టంగా సీఎం సహా 18 మందికి మంత్రివర్గంలో చోటు ఉంటుంది. ప్రస్తుతం సీఎంతోపాటు 11 మంది మంత్రులు ఉన్నారు. దీనితో మరో ఆరుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించే వెసులుబాటు ఉంది. వీటి కోసం తీవ్ర పోటీ నెలకొంది. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. తమకంటే తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం కేబినెట్లో ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచే కాకుండా.. మిగతా జిల్లాల నుంచి కూడా డజను మందికి పైగా ఎమ్మెల్యేలు తమకు కేబినెట్ బెర్త్‌పై ఆశతో ఉన్నారు.ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి పరిశీలిస్తే.. మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి (రంగారెడ్డి), జి.వివేక్, జి.వినోద్, కె.ప్రేమ్‌సాగర్‌రావు (ఆదిలాబాద్), పి.సుదర్శన్‌రెడ్డి (నిజామాబాద్), దానం నాగేందర్, అమీన్ అలీఖాన్ (హైదరాబాద్) మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలు నాయక్ (నల్లగొండ), వాకిటి శ్రీహరి (మహబూబ్‌నగర్), టి.జీవన్‌రెడ్డి (కరీంనగర్) కూడా కేబినెట్ బెర్త్ కోసం ఒత్తిడి చేస్తున్నారు. వీరికితోడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే కె.మదన్మోహన్రావు, ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, వేముల వీరేశం తదితరులు కూడా సామాజిక వర్గాల ప్రాతిపదికన చాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.సామాజిక సమీకరణాలే ప్రాతిపదికగా..కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న దానిపై అధిష్టానం ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపింది. పీసీసీ అధ్యక్ష పదవికి, కేబినెట్ విస్తరణకు మధ్య సామాజిక వర్గాల వారీగా లెక్కలు కుదరకపోవడంతో నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నేతను నియమించడంతో మిగతా సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించే విషయంలో ఓ నిర్ణయం తీసుకునే వెసులుబాటు కలిగింది. ప్రస్తుతం మంత్రిమండలిలో ఏడుగురు ఓసీ వర్గానికి చెందినవారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు బీసీలు, ఒక ఎస్టీ నేత ఉన్నారు. కులాల వారీగా చూస్తే నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. ప్రస్తుతం రెడ్లకే చెందిన మరో నేతకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వనున్నట్టు అంచనా. మాదిగ, ఎస్టీ (లంబాడా), బీసీ సామాజిక వర్గాలకు కూడా ఒక్కో బెర్త్ కేటాయించాల్సి ఉంటుందని చెబుతున్నారు. మిగతా రెండు పదవులు ఎవరికన్నది పార్టీ వెసులుబాటు ప్రకారం కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.ఇతర పదవుల భర్తీ కూడా..వివిధ వర్గాలకు మంత్రివర్గంలో స్థానంతోపాటు అసెంబ్లీలో చీఫ్ విప్, విప్ పదవులు కూడా ఇచ్చే చాన్స్ ఉంది. వీటితోపాటు కీలకమైన ఆర్టీసీ, మైనింగ్, ఎంఐడీసీ, మూసీ డెవలప్మెంట్ వంటి కీలక కార్పొరేషన్లకు ఎమ్మెల్యేలను చైర్మన్లుగా నియమిస్తారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏ పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై సామాజిక వర్గాల కోణంలో నిర్ణయం ఉంటుందని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత.. ఆయనతోపాటు సీఎం రేవంత్, సీనియర్ మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ తదితరులు ఢిల్లీ వెళ్లి.. అధిష్టానంతో చర్చించనున్నట్టు సమాచారం. మొత్తమ్మీద దసరా పండుగకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే చర్చ.. రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఆసక్తి రేకెత్తిస్తోంది. -
గాందీభవన్ ఆదేశాలను పాటిస్తాం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పరంగా గాం«దీభవన్ నుంచి వచ్చే ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని, ముఖ్యమంత్రి సహా యావత్ మంత్రిమండలి ఇందుకు కట్టుబడి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌గౌడ్ బాధ్యతల స్వీకరణ సభలో భట్టి మాట్లాడారు. సామాజిక న్యాయం జరిగేది కాంగ్రెస్ పారీ్టలోనేనని.. ఇందుకు మహేశ్‌గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించడమే నిదర్శనమని పేర్కొన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ కారణంగానే పార్టీ అధికారంలోకి వచి్చందని.. కార్యకర్తలను సముచితంగా గౌరవిస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లే బాధ్యతలను కార్యకర్తలు తీసుకోవాలన్నారు. సమన్వయంతో ముందుకెళ్లాలి: దీపాదాస్మున్షీ పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ సూచించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్‌గా తీసుకుని పనిచేయాలని కోరారు. మరింత బలోపేతం చేయాలి: ఉత్తమ్ కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చెప్పేందుకు మహేశ్‌గౌడ్ నియామకమే నిదర్శనమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కార్యకర్తల శ్రమ, త్యాగాలతోనే తాము పదవుల్లో ఉన్నామని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి సీఎం పరామర్శ చిన్నచింతకుంట: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. మధుసూదన్‌రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల కన్నుమూశారు. ఈక్రమంలో చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్‌లో జరిగిన దశదినకర్మ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. మధుసూదన్‌రెడ్డిని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రి జూపల్లి, చిన్నారెడ్డి, మల్లురవి ఉన్నారు.సీఎం రేవంత్ ఇంటి సమీపంలో బ్యాగు కలకలం బంజారాహిల్స్ (హైదరాబాద్): సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో ఆదివారం ఓ గుర్తుతెలియని బ్యాగు కనిపించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని రంగోలి స్టోర్ నుంచి సీఎం ఇంటికి వెళ్లేదారిలో ఈ బ్యాగును సీఎస్‌డబ్లూ (సిటీ సెక్యూరిటీ వింగ్) అధికారులు గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే వెళ్లి.. ఆ బ్యాగ్‌ను పరిశీలన కోసం అక్కడి నుంచి తరలించారు. ఇది సీఎం నిత్యం ప్రయాణించే మార్గం కావడం గమనార్హం. బ్యాగ్‌ను పరిశీలించిన అధికారులు అందులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని గుర్తించినట్లు పోలీసువర్గాలు చెప్తున్నాయి. కానీ అధికారికంగా ఏ ప్రకటనా చేయకుండా గోప్యత పాటిస్తున్నారు. -
మా జోలికొస్తే ఊరుకోం: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరి జోలికి వెళ్లబోరని.. అలాగని ఎవరైనా తమ జోలికి వస్తే ఊరుకోబోమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. పాడి కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాందీల వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘వాడొకడు వీడొకడు మోపైండు. కార్యకర్తలపై కేసులు పెట్టాలని చూస్తున్నారు. కొందరు సన్నాసులు మన వాళ్ల ఇంటికి వస్తామన్నారు. కానీ మనవాళ్లే వాళ్ల ఇంటికి వెళ్లారు. ఇంటికి రమ్మన్నవాడికి చింతపండు అయినంక దాడికి వచ్చారని అంటున్నాడు. మరి ఇంటికి ఎందుకు రమ్మనాలి? .. .. డానికి పిలవాల్నా’’ అని పేర్కొన్నారు. తమ మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుని ఎవరైనా తమ జోలికి వస్తే.. వీపు చింతపండు అవుతుందని వ్యాఖ్యానించారు. పీసీసీ కొత్త అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సౌమ్యుడేనని.. కానీ ఆయన వెనుక తాను ఉన్నానని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. పార్టీ జెండాను మోస్తున్న కార్యకర్తలను కాపాడుకుంటామని.. పార్టీని, ప్రభుత్వాన్ని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళతామని చెప్పారు. టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదివారం గాందీభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పదేళ్లు అధికారంలో ఉంటాం.. కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌పై పార్టీ గురుతర బాధ్యతను పెట్టిందని రేవంత్ అన్నారు. ‘‘మా ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు మీ ఎన్నికలు రాబోతున్నాయి. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికల్లో పార్టీ జెండా మోసిన కార్యకర్తలను గెలిపించుకునే బాధ్యతలను నేను, మహేశ్‌గౌడ్ తీసుకుంటాం. మా ఎన్నికల కంటే ఎక్కువగా మీ ఎన్నికల కోసం పనిచేస్తాం. మీరు గెలిస్తేనే మేం గెలిచినట్టు, కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు. స్థానిక ఎన్నికల్లో విజయానికి పునరంకితమవుదాం’’అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మూడు, నాలుగు నెలల్లో కులగణన పూర్తవుతుందని.. ఆ తర్వాత స్థానిక ఎన్నికలు జరుగుతాయని రేవంత్ చెప్పారు. గతంలో పదేళ్లు టీడీపీ, ఆ తర్వాత పదేళ్లు కాంగ్రెస్, మళ్లీ పదేళ్లు టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయని.. ఇదే పద్ధతిలో మరో పదేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పారు. ఆ ఎన్నికలు ఫైనల్స్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సెమీఫైనల్స్‌లో లభించిన విజయం మాత్రమేనని సీఎం రేవంత్ అన్నారు. ‘‘2029లో ఫైనల్స్ జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఢిల్లీ గద్దెపై కాంగ్రెస్ జెండా ఎగరాలి. మోదీని ఓడించి రాహుల్‌గాం«దీని ప్రధానిని చేయాలి. అప్పుడే మనం ఫైనల్స్‌లో గెలిచినట్టు. తెలంగాణ నుంచి ఆ ఎన్నికల్లో 15 మందిని కాంగ్రెస్ ఎంపీలుగా గెలిపించాలి. అప్పటివరకు ఎవరూ విశ్రమించొద్దు’’అని పిలుపునిచ్చారు. రాజీనామా చేస్తానన్న వ్యక్తి ఎక్కడ? తాను టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక ఇంద్రవెల్లిలో సమరశంఖం పూరించానని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా నేతలను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చేందుకు పనిచేశానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే ఆరు గ్యారంటీల అమలు ప్రారంభించామన్నారు. ‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఒకేసారి రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశాం. కాంగ్రెస్ రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న సన్నాసి ఎక్కడ? కావాలంటే వివరాలు పంపిస్తా..’’అని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్‌ల ఉద్యోగాలు ఊడగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తాను చెప్పానని.. చెప్పినట్టుగానే ఇప్పటికే 65 వేల ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. దేశానికి ఒలింపిక్స్ బంగారు పతకం తెస్తాం! క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. 2028 ఒలింపిక్స్‌లో దేశం తరఫున బంగారు పతకాన్ని తెచ్చే బాధ్యతను తెలంగాణ తీసుకుంటుందన్నారు. రాష్ట్ర భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. నేను పవర్ సెంటర్‌ను కాదు – సీఎం, మంత్రులు గాంధీభవన్‌కు రావాలి: టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇస్తుందనేందుకు తన నియామకమే నిదర్శనమని నూతన టీపీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని అనుకోలేదని.. పార్టీ బాధ్యతలు చూడాల్సి వస్తుందని అప్పుడప్పుడూ రేవంత్‌రెడ్డి అంటుంటే ఊరికే అంటున్నారని భావించేవాడినని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా తనకెలాంటి భేషజాలు లేవని.. తాను పవర్ సెంటర్‌ను కానని చెప్పారు. తాను ప్రభుత్వానికి, పారీ్టకి మధ్య వారధిగా ఉంటానని.. తాను పీసీసీ అధ్యక్షుడిగా, రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్నంత కాలం పార్టీ కార్యకర్తలపై గీత కూడా పడనీయమని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలు నిర్మించాలన్నదే తన లక్ష్యమని, ఆ దిశలో ప్రభుత్వం కూడా సహకారం అందించాలని కోరారు. మంత్రులు వారంలో రెండు రోజులు గాంధీ భవన్‌కు రావాలని.. జిల్లాలకు వెళ్లినప్పుడు జిల్లా పార్టీ కార్యాలయాలకు వెళ్లాలని కోరారు. సీఎం రేవంత్ కూడా వీలును బట్టి నెలకు రెండు సార్లయినా గాం«దీభవన్‌కు వచ్చి వెళ్లాలన్నారు. దీనివల్ల పార్టీ శ్రేణులతో మమేకం కావొచ్చన్నారు. సౌమ్యుడినేగానీ.. కరాటే బ్లాక్ బెల్ట్ ఉంది.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని.. సోషల్ మీడియాను సోషల్సెన్స్ లేకుండా ఉపయోగించుకుంటున్నాయని మహేశ్‌గౌడ్ విమర్శించారు. వాటిని ఎదుర్కోవాల్సింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేనని, గ్రామగ్రామానికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించాలని పిలుపునిచ్చారు. తనను సౌమ్యుడని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని.. ప్రజాస్వామ్యంలో తాను సౌమ్యుడినే అయినా కరాటేలో బ్లాక్‌బెల్ట్ ఉందని చమత్కరించారు. గాందీభవన్‌లో ‘లాల్ సలామ్’! టీపీసీసీ కొత్త చీఫ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కమ్యూనిస్టుల తరహాలో ‘లాల్‌సలామ్’ వినిపించడం ఆసక్తిగా మారింది. ప్రజాగాయకుడు గద్దర్‌కు నివాళి అరి్పస్తూ సాగిన పాటలో ‘లాల్‌సలామ్’ అనే చరణం ఉంది. ఇది విని కొందరు కాంగ్రెస్ ఆఫీసులో కమ్యూనిస్టు పాట అంటూ చమత్కరించారు. – పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ప్రసంగిస్తున్న సమయంలోనే మంత్రి శ్రీధర్‌బాబు వేదిక మీదకు వచ్చారు. ఆయనకు స్వాగతం పలికిన మహేశ్‌గౌడ్.. ‘అయ్యగారు వచ్చారు. ఆయన రాకతో మంత్రిమండలి సంపూర్ణంగా వచ్చినట్టయింది..’ అని వ్యాఖ్యానించారు. – సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ వేదికపైకి వచ్చినప్పుడు.. తొలి వరుసలో కూర్చున్న మంత్రి పొన్నం ప్రభాకర్ లేచి, వీహెచ్‌కు తన స్థానం ఇచ్చి వెనుక వరుసలోకి వెళ్లి కూర్చున్నారు. – సభలో ఎవరెవరు మాట్లాడాలనే విషయంలో గందరగోళం లేకుండా స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆ జాబితాను రాసి ఇచ్చారు. పెళ్లి ముహూర్తం పెట్టిన అయ్యగారితోనే.. మహేశ్‌కుమార్‌గౌడ్ తన పెళ్లికి ముహూర్తం పెట్టిన పురోహితుడితోనే పీసీసీ అధ్యక్ష బాధ్యతల స్వీకార కార్యక్రమంలో పూజలు చేయించారు. ఆయన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన పూజారి కృష్ణమాచార్యులు. ఆయన, గాంధీభవన్ పూజారి శ్రీనివాసమూర్తి ఇద్దరూ కలిసి పూజలు చేశారు. ఇక గాంధీభవన్‌తో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని, తన అడుగుపడని మిల్లీమీటర్ స్థలం కూడా గాందీభవన్‌లో లేదని.. ప్రతి గోడ, కిటికీ, తలుపును తాను తాకానని మహేశ్‌గౌడ్ గుర్తు చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా తన తొలి ప్రసంగంతోనే కార్యకర్తలను ఆకట్టుకున్నారు. సౌమ్యుడిని అంటూనే కరాటేలో బ్లాక్‌బెల్ట్ ఉందన్నారు. పార్టీ నేతలకు అందుబాటులో ఉండటం కోసం మంత్రులు తరచూ గాంధీభవన్‌కు, జిల్లా కార్యాలయాలకు రావాలని కోరారు. రేవంత్ నుంచి జెండా అందుకుని.. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునేందుకు మహేశ్‌గౌడ్ హైదరాబాద్‌లోని నార్సింగి నుంచి భారీ ర్యాలీగా అమరవీరుల స్థూపం వద్దకు వచ్చారు. అక్కడ నివాళులు అర్పించిన అనంతరం గాందీభవన్‌కు చేరుకుని.. సీఎం రేవంత్‌రెడ్డి నుంచి టీపీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకున్నారు. సభా ప్రాంగణంలో రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పార్టీ జెండాను అందుకున్నారు. -
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. మహిళా నేతలను అడ్డుకున్న పోలీసులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు బుధవారం(ఆగస్టు7) ఎరుపు రంగు దుస్తులు వేసుకొని రాష్ట్ర బీజేపీ ఆఫీసు ముందు నిరసనకు బయలుదేరారు. మహిళా నేతలను గాంధీభవన్ గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా పోలీసులకు మహిళా కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. దేశంలో మహిళకు రక్షణ లేదని, నిత్యావసర వస్తువుల పెరుగుదల వల్ల మహిళలపై పడుతున్న భారంపై దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఆఫీసులు ముట్టడించాలని జాతీయ మహిళా కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు సిద్ధమయ్యారు. -
గాంధీ భవన్ కు చేరుకున్న కురియన్ కమిటీ
-
ఫలితాలపై పోస్ట్‌మార్టమ్.. గాంధీభవన్‌లో కురియన్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులతో ఏఐసీసీ ఏర్పాటు చేసిన త్రీ మెన్ కమిటీ ప్రత్యేకంగా భేటీ అయ్యింది. అభ్యర్థులతో విడివిడిగా మాట్లాడుతున్న కురియన్ కమిటీ.. ఒక్కో అభ్యర్థికి 30 నిమిషాలు సమయం కేటాయించింది. తమ వాదన సైతం కురియన్ కమిటీకి వినిపిస్తామంటున్నారు టికెట్ రాని నేతలు.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది.మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో నిజనిర్ధారణ కమిటీలు వేసింది. కురియన్‌తో పాటు రక్హిబుల్ హుసేన్, పర్గత్ సింగ్‌లతో తెలంగాణ కమిటీ ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాల్లో కురియన్ కమిటీ తిరగనుంది.పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకు ఓటమి చెందారు? పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాల్లో వచ్చిన ఓటింగ్ శాతం ఎంత? లోపాలు ఏంటి? వంటి అంశాలపై కురియన్ కమిటీ ఆరా తీస్తోంది. ఓటమికి కారణాలపై వివరాలను కురియన్ కమిటీ అభ్యర్థుల నుంచి సేకరిస్తోంది. -
గాంధీ భవన్ కు కురియన్ కమిటీ
-
ఆ ఎమ్మెల్యే మనకొద్దు.. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
-
ఎల్లుండే తెలంగాణ కేబినెట్ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. జూలై మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో చెప్పిన నేపథ్యంలో.. ఈ నెల 4న మరికొంత మందిని మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశముందని సమాచారం. ఈ మేరకు పార్టీ అధిష్టానం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం సోమవారం రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ కావడాన్ని కూడా ప్రస్తావిస్తున్నాయి. కేబినెట్ విస్తరణ గురించి గవర్నర్‌కు రేవంత్ చెప్పారని, 4న అందుబాటులో ఉండాల్సిందిగా కోరారని తెలుస్తోంది. రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్‌గా, పుదుచ్చేరి ఇన్చార్జి లెఫ్టినెంట్ గవర్నర్‌గా సైతం వ్యవహరిస్తుండడంతో ఈ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. మంత్రివర్గ కూర్పు గురించి రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు కొనసాగుతుండగా, కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు మరోమారు పిలుపు వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్టానం ఇచ్చిన సమయాన్ని బట్టి మంగళ లేదా బుధవారం వారు హస్తిన చేరుకుంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన తుది జాబితాకు ఆమోదముద్ర వేస్తారని, తుది దఫా చర్చల్లో భాగంగా ఇప్పటివరకు స్పష్టత రాని ఒకట్రెండు బెర్తుల విషయంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, వాకిటి శ్రీహరిల పేర్లు దాదాపు ఖరారయ్యాయని, ప్రేంసాగర్‌రావు, వివేక్‌లలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ దఫా నాలుగు బెర్తులు భర్తీ చేస్తారని, ముస్లిం మైనారీ్టల కోసం ఒక బెర్తు, ఎస్టీల కోసం మరో బెర్తును ఖాళీగా ఉంచవచ్చని తెలుస్తోంది. ఢిల్లీలో చర్చల అనంతరం ఈ విషయంలో మరింత స్పష్టత రానుంది. నాలుగో వారంలో బడ్జెట్ భేటీ! సీఎం రేవంత్‌రెడ్డి సోమ వారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో దాదాపుగా రెండు గంటల పాటు భేటీ అయ్యారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. కాగా సీఎం పలు అంశాలను గవర్నర్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణతోపాటు ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించినట్టు తెలిసింది. ఈ నెల 22న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన పక్షంలో 23, 24 తేదీల్లో..ఒకవేళ 23న కేంద్రం బడ్జెట్ పెట్టినట్లైతే 24 లేదా 25 తేదీల్లో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చని, ఇందుకు అనుగుణంగా అసెంబ్లీ నోటిఫికేషన్ జారీ అవుతుందని సమాచారం. -
అధికారంలో ఉన్నా.. ఆశ తీరలేదేం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను కనీసం 11–12 చోట్ల గెలుస్తామని.. పరిస్థితి సానుకూలంగా ఉంటే 14 సీట్లు వస్తాయని కాంగ్రెస్ హైకమాండ్ లెక్కలు వేసుకుంది. తక్కువలో తక్కువగా 10 స్థానాలైనా గెలుస్తామని భావించింది. కానీ ఫలితాలు గతం కంటే మెరుగే అయినా.. 8 స్థానాల్లోనే కాంగ్రెస్ గెలిచింది. అదే సమయంలో బీజేపీ కూడా ఇదే సంఖ్యలో సీట్లు సాధించింది. దీంతో తెలంగాణలో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఎందుకు రాలేదని.. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశమున్నా ఎందుకిలా జరిగిందని అధిష్టానం పోస్టుమార్టం ప్రారంభించింది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలను సమీక్షించేందుకు రాజ్యసభ మాజీ చైర్మన్ కురియన్, అసోం ఎంపీ రకీబుల్ హసన్, పంజాబ్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్‌లతో కమిటీని ఏర్పాటు చేసింది. నిజానికి లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ నుంచి ఇప్పటికే అధిష్టానానికి నివేదిక వెళ్లింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ కూడా తన నివేదికను అందించారు. కాంగ్రెస్ అధిష్టానం వాటిని కాదని కమిటీని ఏర్పాటు చేయడం గాంధీభవన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఏం చేస్తారు.. ఎక్కడికి వెళ్తారు?ఇటీవలి లోక్‌సభ ఎన్నికల పనితీరుపై సమీక్షతోపాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం రూపొందించే కార్యాచరణ కోసమే కొత్తగా త్రిసభ్య కమిటీని నియమించారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఆ కమిటీ త్వరలోనే తెలంగాణకు వచ్చి పని ప్రారంభిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కమిటీ మూడు అంశాలపై దృష్టి పెట్టి పనిచేస్తుందని అంటున్నారు. ‘అధికారం, అన్ని వనరులు ఉండి కూడా బీజేపీతో అంత గట్టిగా ఎందుకు పోటీపడాల్సి వచ్చింది? తూర్పు, దక్షిణ తెలంగాణల్లో పట్టు నిలుపుకొన్న పార్టీ.. పశ్చిమ, ఉత్తర తెలంగాణల్లో ఎందుకు నిలబడలేకపోయింది? పార్టీ నాయకులందరూ తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చారా లేదా?’ అన్న కోణాల్లో పోస్టుమార్టం జరుగుతుందని నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా తక్కువ తేడాతో ఓడిపోయిన మెదక్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్ ఎంపీ స్థానాల విషయంలో ఏం జరిగిందనేది తేల్చే చాన్స్ ఉందని అంటున్నారు. ఇంకొంచెం కష్టపడి ఉంటే ఈ మూడు చోట్ల గట్టెక్కేవాళ్లమని పేర్కొంటున్నారు. ఈ స్థానాలు దక్కించుకోలేక పోవడానికి ఎలాంటి పరిస్థితులు కారణమనే అంశంపై.. పార్టీ ముఖ్య నేతలతోపాటు ఆయా చోట్ల పోటీచేసి ఓడిన అభ్యర్థులతోనూ మాట్లాడనున్నట్టు తెలిసింది. ఇక చేవెళ్ల, మల్కాజ్గిరి, ఆదిలాబాద్ స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఏ మేరకు ఉపయోగపడిందనే కోణంలోనూ త్రిసభ్య కమిటీ నిగ్గు తేలుస్తుందని సమాచారం. అన్ని విషయాల్లో ఓ అంచనాకు వచ్చిన తర్వాత ఈ కమిటీ హైకమాండ్‌కు నివేదిక ఇస్తుందని.. ఆ నివేదిక ఆధారంగా టీపీసీసీ ప్రక్షాళన జరుగుతుందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సరిగా పనిచేయని నేతలకు ఝలక్ ఇచ్చే అవకాశం ఉందని నేతలు అంటున్నారు.22న ‘నామినేటెడ్’ ఉత్తర్వులు?లోక్‌సభ ఎన్నికల కంటే ముందు రాష్ట్రంలో ప్రకటించిన 37 నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఉత్తర్వులు ఈనెల 22వ తేదీన వచ్చే అవకాశముందని తెలిసింది. వాటితోపాటు మరో 17 పోస్టులను కలిపి ఒకేసారి ఉత్తర్వులు ఇవ్వాలని సీఎం రేవంత్ భావించినా.. ఈ 17 పోస్టులకు సంబంధించిన కసరత్తు ఇంకా పూర్తికాలేదని సమాచారం. వీలునుబట్టి మొత్తం పోస్టులకు, లేదా ఇప్పటికే ప్రకటించిన 37 పోస్టులకు ఉత్తర్వులు వస్తాయని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో నేతల పనితీరు ఆధారంగా నామినేటెడ్ పోస్టుల్లో మార్పులు జరుగుతాయనే ప్రచారం జరిగినా.. ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రుల మధ్య నామినేటెడ్ పందేరంలో తలెత్తిన విభేదాల కారణంగానే జాప్యం జరిగిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడా ఇద్దరు మంత్రుల మధ్య సయోధ్య నెలకొందని, నామినేటెడ్ ఉత్తర్వులకు లైన్ క్లియర్ అయిందని అంటున్నాయి. -
నేడు గాందీభవన్‌లో ఆవిర్భావ దినోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం గాందీభవన్‌లో ఉదయం 8.30 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నా యకులు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే లు, పార్టీ నేతలు పాల్గొంటారని వెల్లడించారు. దశాబ్ది ఉత్సవాల శకటం ప్రారంభం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల శకటాన్ని శనివారం గాందీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, మెట్టుసాయి పాల్గొన్నారు. -
T Congressకి కొత్త తలనొప్పి తప్పదా?
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించిన నిర్ణయాల కోసం హైకమాండ్ ఎంతగా మల్లగుల్లాలు పడుతోంది గత కొన్ని నెలలుగా చూస్తున్నాం. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్ హైకమాండ్‌కు కొత్త తలనొప్పి తప్పదనిపిస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఎవరిని ఎంపిక చేయబోతోంది. గాంధీభవన్‌కు కొత్త బాస్ ఎవరు కానున్నారు?.. సీనియర్ల అభ్యంతరాలు-గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టి ఆ నియామకాన్ని కాంగ్రెస్ ఎలా పూర్తి చేయబోతోంది?.. పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రిగా జోడు పదవులు నిర్వహిస్తున్న ఎనుముల రేవంత్ రెడ్డి స్థానంలో.. పార్టీకి కొత్త చీఫ్‌గా ఎవరు రాబోతున్నారు?. అసలు ఆ రేసులో ఉన్న నాయకులు ఎవరు? ఈసారి అగ్ర వర్ణాలకు ఇస్తారా? బీసీలకు ప్రాధాన్యమిస్తారా? లేక ఎస్సీ వర్గంలో సీనియర్ నేతకు ఛాన్స్ ఇస్తారా? అసలు కాంగ్రెస్ హైకమాండ్ మదిలో ఏముంది? పార్టీ నాయకత్వం దృష్టిని ఆకర్షించినవారు ఎవరు?.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి...పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వెంటనే పీసీసీ అధ్యక్షుడిని మారిస్తే ఇబ్బంది అవుతుందని భావించిన హైకమాండ్ ఎన్నికల తర్వాతే కొత్త పీసీసీ చీఫ్ వస్తారని తెలిపింది. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి గనుక.. ఫలితాలు రాగానే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త నేత వస్తారంటున్నారు. రేవంత్‌రెడ్డి కూడా పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుని పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నారు. ఇక హైకమాండ్ కూడా గాంధీభవన్‌కు కొత్త బాస్‌గా ఎవరిని నియమించాలనే విషయంపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ ఎవరిని నియమిస్తే బాగుంటుందనే చర్చ కాంగ్రెస్ క్యాడర్లో విస్తృతంగా జరుగుతోంది. తర్వాత పీసీసీ చీఫ్ గా ఎవరు వస్తారనే విషయాన్ని సీఎం రేవంత్ దగ్గర ప్రస్తావిస్తే ఆ విషయం తన పరిధిలో లేని అంశమని, హై కమాండ్ ఎవరిని నియమించినా తనకు సమ్మతమేనని రేవంత్ రెడ్డి చెప్తున్నారట. పార్టీని ప్రతిపక్షం నుంచి అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి స్థాయిలో పనిచేయగలిగే వ్యక్తి ఎవరున్నారనే అంశంపై పార్టీ అధిష్ఠానం ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది? ఎవరైతే నేతలందరినీ కలుపుకొని వెళ్ళగలరు అనే దానిపై హై కమాండ్ సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.పీసీసీ చీఫ్ పదవిపై చాలా మంది సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నట్లు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చాలారోజుల నుండి అడుగుతున్నారు. ఇప్పుడు కూడా తాను పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సైతం తనకు పీసీసీ చీఫ్ పదవి కావాలని హై కమాండ్ కి రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి పీసీసీ చీఫ్ పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వరనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నేతలు పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ తనకి ఇవ్వాలని చాలా రోజుల నుండి అడుగుతున్నారట. కర్ణాటకలో డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ చీఫ్ గా ఉన్నారని తెలంగాణలో సైతం అలాంటి నిర్ణయాన్నే తీసుకోవాలని భట్టి పట్టుపడుతున్నట్లు సమాచారం. మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు. తాను విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని తనకి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ పెద్దల దగ్గర చెబుతున్నట్లు సమాచారం. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సైతం పీసీసీ రేసులో తాను ఉన్నట్లు ప్రకటించారు. మరో బీసీ నేత మధుయాష్కీ గౌడ్ కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్ సైతం పీసీసీ పదవి తనకి వస్తుందనే ధీమాలో ఉన్నారు. మొన్న నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించారు. మాదిగలకు కాంగ్రెస్ సరైన గౌరవం ఇవ్వడం లేదనే చర్చ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవి మాదిగ సామాజికవర్గానికి చెందిన సంపత్ కి ఇస్తే బాగుంటుందనే వాదన నడుస్తోంది. ఇక మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళ పేర్లు కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు వినిపిస్తోంది. అయితే ప్రధానంగా జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్ ల మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్లు సమాచారం.అధికార పార్టీ అధ్యక్ష పదవి కోసం పదికి పైగా మంది నేతలు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం నుంచి సీఎం ఉండడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నేతలనుంచి ఒకరికి పీసీసీ పదవి దక్కనుందని గాంధీభవన్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. -
ఆ మూడు స్థానాల్లో ఎవరు?
సాక్షి, హైదరాబాద్: అధికారికంగా ప్రకటించకుండా మిగిలిపోయిన 3 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ 3 స్థానాల విషయంలో నిర్ణయం జరిగిపోయినప్పటికీ ఫైల్ మీద సంతకం పెట్టకపోవడంతో ఆగిపోయినట్లు తెలుస్తోంది. గాందీభవన్ వర్గాల్లో చర్చ ప్రకారం.. ఖమ్మంకు పొంగులేటి ప్రసాదరెడ్డి, కరీంనగర్‌కు వెల్చాల రాజేందర్రావు, హైదరాబాద్‌కు సమీర్ వలీవుల్లా లను అభ్యర్థులుగా నిర్ణయించారు. నేడో, రేపో ఉత్తర్వులు వెలువడు తాయని తెలుస్తోంది. ఆ 3... కారణాలు అనేకం వాస్తవానికి, కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడం మార్చిలోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి మూడు దఫాల్లో 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కానీ, పలు కారణాల రీత్యా ఈ 3 చోట్ల అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఇందుకు అనేక కారణాలున్నాయని గాందీభవన్ వర్గాలంటున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల మధ్య పోటీ, సామాజిక సమీకరణలు పీటముడి వేయగా, కరీంనగర్లో కూడా సామాజిక సమీకరణలే కారణమయ్యాయని, హైదరాబాద్‌లో అభ్యర్థి ఎంపికకు రాజకీయ కారణాలున్నాయని చెబుతున్నాయి. ఖమ్మంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్, కమ్మ సామాజిక వర్గానికి చెందిన జెట్టి కుసుమ కుమార్, వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌ల పేర్లు వినిపించాయి. ఖమ్మంలో అభ్యర్థి ఎంపిక కోసం ఆ పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. అన్ని కోణాల్లో చర్చించిన తర్వాత పొంగులేటి ప్రసాదరెడ్డి పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. వెలమలకు కూడా.. కరీంనగర్ టికెట్ ఎవరికన్న విషయంలో పార్టీ హైకమాండ్ ఆది నుంచి సామాజిక కోణంలోనే ఆలోచిస్తోంది. ఇక్కడ మొదటి నుంచీ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డితోపాటు వెలమ సామాజిక వర్గానికి చెందిన వెల్చాల రాజేందర్రావు పేరు మాత్రమే పరిశీలించారు. అయితే, రాష్ట్రంలోని ఒక స్థానాన్ని వెలమలకు కేటాయించాలన్న యోచనతో రాజేందర్రావు వైపు మొగ్గు చూపినట్టు తెలిసింది. ఈ సమాచారాన్ని జిల్లా కాంగ్రెస్ నేతలకూ తెలియజేయడంతో పార్టీ అభ్యర్థిత్వాన్ని అనధికారికంగానే డీసీసీ ఖరారు చేసింది. గురువారం నాటి కార్యక్రమానికి పార్టీ అభ్యర్థి రాజేందర్‌రావుతోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తారని, వారికి ఘనంగా స్వాగతం పలకాలంటూ పార్టీ శ్రేణులకు సందేశం పంపింది. రాజకీయ కారణాలతోనే ఆలస్యం హైదరాబాద్‌లో కేవలం రాజకీయ కారణాలతోనే అభ్యర్థిత్వం ఆలస్యమైంది. ఎంఐఎం విషయంలో అనుసరించాల్సిన ధోరణి, బీజేపీని నిలువరించే ప్రయత్నాల్లో భాగంగా చివరివరకు హైదరాబాద్ అభ్యర్థిని ఖరారు చేయలేదని తెలుస్తోంది. అయితే, ఇక్కడ అభ్యర్థిత్వం కోసం చాలామంది పోటీపడ్డారు. ఫిరోజ్‌ఖాన్, అజారుద్దీన్, సమీర్ వలీవుల్లా, అలీ మస్కతి లాంటి నాయకుల పేర్లు ఈ జాబితాలో వినిపించినా, చివరకు హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సమీర్ వలీవుల్లాను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అలీ మస్కతి పేరును చివరి వరకు పరిశీలనలోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ మూడు స్థానాల విషయంలో అధిష్టానం ఓ కొలిక్కి రావడం, పోలింగ్‌కు మరో 25 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో నేడో, రేపో తుది జాబితా రానుందని తెలుస్తోంది. -
నాకు పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పా
సాక్షి, హైదరాబాద్: భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి తనను పోటీ చేయాల్సిందిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారని, గెలిపించుకునే బాధ్యత కూడా తీసుకుంటానని ఆయన చెప్పినా తనకు పోటీ చేయడం ఇష్టలేదని స్పష్టం చేశానని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలు రాజకీయంగా వెనుకబడి పోతున్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్.కృష్ణయ్యకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ద్వారా ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి బీసీలకు తగిన ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. బీఆర్ఎస్నుద్దేశించి సీఎం రేవంత్ ఒక్క మాట మాట్లాడితే ఎగిరెగిరి పడిన ఆ పార్టీ నేతలు, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్న మాటలకు, ఆయన భాషకు ఏం చెప్తారని ప్రశ్నించారు. కేటీఆర్‌కు ముసళ్ల పండుగ ముందుందని, బీఆర్ఎస్ ఆరిపోయే దీపమని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వెనక కేటీఆర్ ఉండి ఉంటారని అభిప్రాయపడ్డ మధుయాష్కీ.. ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లు ఎ1, ఎ2 అవుతారని జోస్యం చెప్పారు. ఎన్నికలకు ముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడాన్ని మాత్రమే తప్పు పట్టామని, కేజ్రీవాల్‌పై విచారణను ఏఐసీసీ తప్పు పట్టలేదని మధుయాష్కీ స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ రెండో జాబితా రెడీ!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి రెండో విడత జాబితా ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు పూర్తి చేసింది. నేతల జనాదరణను పరిగణనలోకి తీసుకుని పేర్లు ఫైనల్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి ప్రకటనా వెలువడక పోవడంతో.. ఎన్ని స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు, ఎవరెవరికి టికెట్లు లభించాయన్న దానిపై ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎనిమిది చోట్ల అభ్యర్థులు ఫైనల్ అయ్యారని ఏఐసీసీ వర్గాలు చెబుతుండగా, ఆరు స్థానాలు పరిశీలించినా, ఐదుగురు అభ్యర్థుల ఎంపిక మాత్రమే పూర్తయిందనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సీఈసీ ఆమోద ముద్ర: ఢిల్లీలో మంగళవారం సాయంత్రం సీఈసీ సమావేశం జరిగింది. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలకు సంబంధించి పలువురు అభ్యర్థులకు ఆమోదముద్ర వేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియాగాం«దీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మంత్రి ఉత్తమ్ సహా కమిటీ ఇతర సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించి చర్చ జరిగినప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఆదివారం ముంబైలో జరిగిన రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఖరారు చేసిన జాబితాపై చర్చించారు. 13 మందిని ప్రకటించాలనుకున్నా.. తొలి జాబితాలో జహీరాబాద్, మహబూబాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన 13 స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై పార్టీ పెద్ద ఎత్తున కసరత్తు జరిపింది. ఏఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం..13 మంది అభ్యర్థుల పేర్లను సీఈసీలో చర్చించి ఒకేసారి ప్రకటించాలని భావించారు. అయితే ఐదు లోక్‌సభ స్థానాలకు ఎక్కువమంది ఆశావహులు ఉండడంతో వాటిపై పీటముడి పడింది. దీంతో అవి మినహా మిగిలిన 8 స్థానాలపై చర్చించి ఆమోద ముద్ర వేశారు. చేవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డి, మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్ నుంచి డాక్టర్ సుమలత, కరీంనగర్ నుంచి ప్రవీణ్‌రెడ్డి, వరంగల్ నుంచి పసునూరి దయాకర్‌ల పేర్లు పరిగణనలోకి తీసుకుని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఖమ్మం, సికింద్రాబాద్, భువనగిరి, హైదరాబాద్, మెదక్ స్థానాలపై ఈ నెల 21న మరోసారి జరుగనున్న సీఈసీ భేటీలో చర్చించే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు చెపుతున్నాయి. ఆరు స్థానాలపైనే చర్చ: గాం«దీభవన్ వర్గాలు గాందీభవన్ వర్గాల సమాచారం ప్రకారం.. సీఈసీ భేటీలో ఆరు స్థానాలపైనే చర్చ జరిగింది. అయితే ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేశారు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, చేవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డి, మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి, ఆదిలాబాద్ నుంచి డా.సుమలతల అభ్యర్థిత్వాలకు సీఈసీ ఆమోదం తెలిపింది. భువనగిరిపై కూడా చర్చ జరిగినా.. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిల్లో ఒకరిని ఖరారు చేయాలా? ఇంకెవరికైనా అవకాశం కల్పించాలా? అన్న దానిపై మరోమారు చర్చించాలనే నిర్ణయానికి వచ్చారు. మొత్తం మీద బుధవారం అధికారికంగా జాబితా ప్రకటించే అవకాశం ఉందని, కానిపక్షంలో మరుసటి రోజు విడుదల చేస్తారని చెబుతున్నారు. అయితే 8 స్థానాలకు ప్రకటిస్తారా లేక ఐదుకే పరిమితమవుతారా? అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. -
నామినేటెడ్ పదవుల పందేరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం నియమించింది. నామినేటెడ్ పదవుల కసరత్తు పూర్తయిందని, ఏ క్షణమైనా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడవచ్చని మూడు రోజులుగా గాందీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రోజున శనివారం రాత్రి అనధికారిక సమాచారం మీడియాకు అందింది. అయితే, ఈనెల 14వ తేదీనే ఉత్తర్వులు వెలువడినట్టు ఇందులో పేర్కొన్నారు. పదవుల పంపిణీ ఇలా... 1) పటేల్ రమేశ్‌రెడ్డి – టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్; 2) కె.శివసేనారెడ్డి – స్పోర్ట్స్ అథారిటీ; 3) ఎన్.ప్రీతమ్ – ఎస్సీ కార్పొరేషన్; 4) నూతి శ్రీకాంత్–బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్; 5) ఎస్.అన్వేశ్ రెడ్డి–విత్తనాభివృద్ధి కార్పొరేషన్; 6) ఈరవత్రి అనిల్–మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్; 7) ఎం.విజయబాబు – సహకార, గృహనిర్మాణ సమాఖ్య; 8) రాయల నాగేశ్వరరావు – వేర్ హౌసింగ్ కార్పొరేషన్; 9) కాసుల బాలరాజు– ఆగ్రో ఇండస్ట్రీస్; 10 నేరెల్ల శారద – మహిళా కమిషన్; 11) బంట్రు శోభారాణి – మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్; 12) సీహెచ్ జగదీశ్వర్‌రావు – నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్; 13) జంగా రాఘవరెడ్డి – నూనె గింజల పెంపకందారుల సమాఖ్య; 14) మానాల మోహన్‌రెడ్డి – కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్; 15) బెల్లయ్యనాయక్ – గిరిజన, సహకార, ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్; 16) ఆర్,గురునాథ్‌రెడ్డి– పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్; 17) జ్ఞానేశ్వర్‌ముదిరాజ్ – డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్; 18) చల్లా నర్సింహారెడ్డి యూఎఫ్ఐడీసీ; 19) మెట్టు సాయికుమార్ – మత్స్యసహకార సొసైటీల సమాఖ్య; 20) కొత్తాకు నాగు – ఎస్టీ సహకార ఆర్థికాభివృద్ధి సంస్థ; 21) జనక్ ప్రసాద్ – కనీస వేతన సలహా మండలి; 22) ఎండీ రియాజ్ – గ్రంథాలయ పరిషత్; 23) ఎం.వీరయ్యవర్మ – వికలాంగుల కార్పొరేషన్; 24) నాయుడు సత్యనారాయణ – చేనేత; 25) ఎంఏ జబ్బార్ – వైస్ చైర్మన్, మైనార్టీస్ ఫైనాన్స్; 26) నిర్మలా జగ్గారెడ్డి – పారిశ్రామిక మౌలికసదుపాయాల కార్పొరేషన్ (టీజీఐఐసీ); 27) మల్రెడ్డి రాంరెడ్డి – రహదారుల అభివృద్ధి; 28) కల్వ సుజాత – వైశ్య కార్పొరేషన్; 29) పొడెం వీరయ్య – అటవీ అభివృద్ధి; 30) ప్రకాశ్‌రెడ్డి – ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్; 31) కె.నరేందర్‌రెడ్డి – సుడా(శాతవాహన అర్బన్ డెవలప్మెంట్); 32) పుంజాల అలేఖ్య – సంగీత నాటక అకాడమీ; 33) గిరిధర్‌రెడ్డి – చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్‌టీసీ); 34) మన్నె సతీ‹Ùకుమార్ – టీఎస్టీఎస్; 35) జెరిపేటి జైపాల్ – అత్యంత వెనకబడిన తరగతుల అభివృద్ధి కార్పొరేషన్ (ఎంబీసీ); 36) వెంకట్రాంరెడ్డి – కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా), 37) ఎంఏ ఫయీం – తెలంగాణ ఫుడ్స్ (నోట్: ఈ జాబితా అనధికారిక సమాచారం మేరకు మాత్రమే. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఈ నెల 14నే ఇచ్చినా ప్రభుత్వ వర్గాలు ఇంకా అధికారికంగా వెలువడించాల్సి ఉంది.) -
Telangana Congress: సీటు ఎవరికి ఇద్దాం?
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపు కోసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందిస్తోంది. మొత్తం స్థానాల్లో నాలిగింటిని ఇప్పటికే అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఈ క్రమంలో మిగతా అభ్యర్థుల ఖరారు కోసం నేడు ఇటు హైదరాబాద్‌లో, అటు హస్తినలో కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. మిగిలిన 13 పార్లమెంట్ స్థానాలపై అభిప్రాయ సేకరణ చేస్తున్నారామె. ఆయా నియోజకవర్గాల వారీగా.. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఇతరత్రా నేతలు ఈ భేటీలో పాల్గొంటున్నారు. టికెట్ ఎవరికిస్తే బాగుంటుందనే దానిపై ఒక్కొక్కరి నుంచి విడివిడిగా ఆమె అభిప్రాయం సేకరిస్తున్నారు. ఏఐసీసీ సూచనల మేరకే అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ సమావేశం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు. కాంగ్రెస్ సీఈసీ భేటీ అనంతరం.. మరికొన్ని పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
ఆదిలాబాద్ జిల్లాకు నర్సారెడ్డి పేరు పెట్టేందుకు కృషి
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవలు చేసిన మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేరును ఆదిలాబాద్ జిల్లాకు పెట్టేందుకు కృషి చేస్తానని, ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడతానని నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన నర్సారెడ్డి సంతాప సభలో మాజీ మంత్రులు జానారెడ్డి, వి. హనుమంతరావు, ఎమ్మెల్సీ మహే ష్‌కుమార్‌గౌడ్, ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో ఎన్నో పద వులు చేపట్టిన నర్సారెడ్డి సిద్ధాంతం, విలువల కోసం ఎప్పు డూ పాటు పడేవారని కొనియాడారు. మాజీ మంత్రి జానా రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే నర్సారెడ్డి శాసనసభ ఐక్య వేదిక ఫోరాన్ని ఏర్పాటు చేసి పోరాటం చేశారని, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. వీహెచ్ మాట్లా డుతూ నర్సారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానన్నారు. మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ నర్సారెడ్డి నియమ, నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీలో పని చేశారన్నారు. కోదండరెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే పోరాటం చేశారనీ, ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన భూ సంస్కరణలో రెవెన్యూ మంత్రిగా తన భూమిని పేదలకు త్యాగం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. -
టీ కాంగ్రెస్‌లో ఒక్క ఛాన్స్ ప్లీజ్!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్‌లో ఎంపీ దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది. ఉన్న 17 లోక్‌సభ స్థానాల కోసం.. మొత్తం 306 దరఖాస్తులు గాంధీభవన్‌కు వచ్చాయి. మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు రాగా, హైదరాబాద్‌లో తక్కువగా వచ్చాయి. నిన్న(శుక్రవారం) ఒక్కరోజే 100కిపైగా అప్లికేషన్లు రాగా.. దరఖాస్తులు ఇచ్చిన వాళ్లలో నేతలతో పాటు ప్రొఫెసర్లు, పలువురు ఉన్నతాధికారులు సైతం ఉండడం గమనార్హం. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య భారీగానే ఉంది. ముఖ్యంగా కీలక నేతలు అసెంబ్లీకి బదిలీ కావడంతో.. వాళ్ల స్థానాల్లో పోటీకి బంధువులు, సన్నిహితులు ఆసక్తి చూపిస్తున్నారు. భువనగిరి ఎంపీ సీటు కోసం కోమటిరెడ్డి బంధువులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కోమటిరెడ్డి అన్న కొడుకు పవన్, బంధువు చల్లూరి మురళీధర్ అప్లికేషన్లు సమర్పించారు. రేవంత్ సీఎం కావడంతో ఖాళీ అయిన మల్కాజ్గిరి ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణతో పాటు ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ కూడా ఉన్నారు. అలాగే.. రేవంత్ సన్నిహితుడు పటేల్ రమేష్ రెడ్డి, చామలచకిరణ్లు సైతం దరఖాస్తులు సమర్పించారు. ఇక నల్గొండ సీటు కోసం జానారెడ్డి కొడుకు రఘువీర్ దరఖాస్తు ఇచ్చారు. మహబూబాబాద్ సీటు కోసం తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ రమేష్ భట్టు అప్లికేషన్ సమర్పించడం గమనార్హం. దరఖాస్తులు ఇచ్చినవాళ్లలో.. మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఆయన కుమార్తె చంద్రప్రియ (నాగర్‌కర్నూల్), ఎంఆర్జీ వినోద్‌రెడ్డి, విద్యా స్రవంతి (సికింద్రాబాద్) పెరిక శ్యామ్ (పెద్దపల్లి) తదితరులున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మల్కాజ్‌గిరితో పాటు ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గాలైన వరంగల్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్ కోసం మొత్తంగా నాలుగు దరఖాస్తులు అందజేశారు. హాట్ సీటు ఏదంటే.. తెలంగాణలో కాంగ్రెస్ తరఫున హాట్‌సీట్‌గా మారింది ఖమ్మం లోక్‌సభ స్థానం. రేణుకా చౌదరి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, పలువురు దరఖాస్తులు ఇచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి, వీ హనుమంతరావులు సైతం అప్లికేషన్లు ఇచ్చారు. తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, ప్రముఖ వ్యాపారవేత్త, వీవీసీ గ్రూపు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వంకాయల పాటి రాజేంద్రప్రసాద్‌లు సైతం దరఖాస్తు చేసుకున్నారు. హాట్ టాపిక్‌గా గడల ఖమ్మంతో పాటు సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి కూడా గడల శ్రీనివాస్ దరఖాస్తు చేశారు. గతంలో హెల్త్ డైరెక్టర్‌గా ఉండి.. అప్పటి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి వార్తల్లోకెక్కిన గడల.. కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ ఆశించారు. కానీ కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. రేవంత్ సర్కార్ కొలువుదీరిన వెంటనే గడలను ఆ పోస్టు నుంచి బదిలీ చేసినా.. లాంగ్‌లీవ్‌లో ఉండి మరీ ఆయన సన్నిహితుల ద్వారా గాంధీభవన్‌కు దరఖాస్తు పంపించడం గమనార్హం. -
ఎంపీ టికెట్ల కోసం బండ్ల, గడల దరఖాస్తులు!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తుల్లో ఇవాళ ఆసక్తికరమైన పరిణామాలు కనిపించాయి. నటుడు కమ్ సినీ నిర్మాత, కాంగ్రెస్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ ఎంపీ సీటు కోసం దరఖాస్తు ఇచ్చారు. విశేషం ఏంటంటే.. రేవంత్ రెడ్డి ఖాళీ చేసిన స్థానం కోసమే ఆయన దరఖాస్తు చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు.. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. ఆ స్థానం కోసం సినీ నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక.. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యానారాయణ ఏకంగా నాలుగు సీట్లకు నాలుగు దరఖాస్తులు సమర్పించారు. మరోవైపు నాగర్‌కర్నూల్ టికెట్ కోసం మాజీ మంత్రి చంద్రశేఖర్ కుమార్తె చంద్రప్రియ కూడా అప్లికేషన్ సమర్పించారు. కేసీఆర్ కాళ్లు మొక్కి.. ఇదిలా ఉంటే.. గాంధీభవన్‌లో ఇవాళ సమర్పించిన దరఖాస్తుల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసిన అంశం.. గడల శ్రీనివాసరావు. తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలోనే రాజకీయాంశాలతో చర్చనీయాంశంగా మారారాయన. సీఎంగా ఉన్న కేసీఆర్ కాళ్లు కూడా మొక్కుతూ వార్తల్లోకి ఎక్కారు కూడా. అంతేకాదు.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొత్తగూడెం టికెట్ ఆశించి భంగపడ్డారాయన. ఇప్పుడు.. ఖమ్మం, సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ కోసం గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకుని మరోసారి ఆయన హాట్ టాపిక్‌గా మారారు. తన సన్నిహితుల ద్వారా గాంధీ భవన్ లో దరఖాస్తు చేయించినట్లు తెలుస్తోంది. తద్వారా ఎన్నికల్లో పోటీ చేయకుండానే.. జంప్ జిలానీగా గడల మారినట్లు చర్చ నడుస్తోంది. -
వెళ్లిన వారు వచ్చేయండి: కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని వీడినవారు తిరిగి సొంతగూటికి రావాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు మంగళవారం గాందీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో భాగంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ టికెట్ ఇవ్వలేదని, సరైన అవకాశాలు కల్పించలేదనే ఆవేదనతోనే కొందరు పార్టీని వదిలివెళ్లారని, వారిని తిరిగి చేర్చుకోవాలని పీఈసీ సభ్యులను కోరారు. అయితే, ఎలాంటి నిబంధనలు పెట్టకుండా పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నవారిని మాత్రమే చేర్చుకోవాలని సూచించారు. ఈ ప్రతిపాదనకు పీఈసీ అంగీకారం తెలపడంతో ఎన్నికలకు ముందు బయటకు పోయినవారు మళ్లీ వచ్చేందుకు కాంగ్రెస్ ద్వారాలు తెరుచుకున్నట్టయ్యింది. పీఈసీ భేటీలో భాగంగా గత పదేళ్ల కాలంలో విద్యార్థి, ప్రజాసంఘాల నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్న సూచనకు కూడా కమిటీ ఆమోదం తెలిపింది. లోక్‌సభ అభ్యర్థులెవరు? వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఖరారుపై పీఈసీ ప్రధానంగా చర్చించింది. ప్రతి నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్న వారి నుంచి కొన్ని పేర్లను డీసీసీ అధ్యక్షులు ప్రతిపాదించారు. 17 లోక్‌సభ స్థానాలకుగాను 187 పేర్లతో కూడిన జాబితాను ఎన్నికల కమిటీకి వారు అందజేశారు. ఈ జాబితాను పరిశీలించిన పీఈసీ వచ్చే నెల మూడో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది. దరఖాస్తుతోపాటు ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు అయితే రూ.25వేలు, ఇతరులు రూ.50వేల చొప్పున రుసుము చెల్లించాలని నిర్ణయించారు. ఈ దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి అదే నెల ఆరో తేదీలోపు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)తో పాటు హరీశ్‌చౌదరి, జిగ్నేశ్ మేవాని, విశ్వజిత్ కదంలతో కూడిన స్క్రీనింగ్ కమిటీకి కూడా పీఈసీ పంపనుంది. భేటీలో భాగంగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరన్న దానిపై చర్చ జరిగింది. అయితే, ఇక్కడ ఫలానా నాయకుల పేర్లపై చర్చ జరపడం సరైంది కాదని, అభ్యర్థుల ఎంపిక అధికారాన్ని ఏఐసీసీకి ఇవ్వాలనే సూచన రావడంతో ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)లకు ఈ అధికారాన్ని కట్టబెడుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని కమిటీ ఆమోదించింది. మాకు అవకాశమివ్వండి భేటీలో భాగంగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ గెలిచిన తర్వాత మెదక్ లోక్‌సభ నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ గెలవలేదని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌తో పాటు పార్టీ ఇన్చార్జ్ మున్షీ నిర్ణయిస్తే తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.యూత్‌కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం యూత్‌కాంగ్రెస్ కోటాలో ఇవ్వాలని, ఒకవేళ సమీకరణలు కుదరకపోతే రాజ్యసభ సభ్యునిగా యూత్‌కాంగ్రెస్ నాయకుడిని ఎంపిక చేసే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలపై అధిష్టానంతో మాట్లాడాలని పీఈసీ అభిప్రాయపడింది. టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు డి.శ్రీధర్‌బాబు, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కమిటీ సభ్యులు జానారెడ్డి, జీవన్‌రెడ్డి, వి.హనుమంతరావు, రేణుకాచౌదరి, మహేశ్‌కుమార్‌గౌడ్, మధుయాష్కీగౌడ్, షబ్బీర్‌అలీ, అంజన్‌కుమార్‌యాదవ్, అజారుద్దీన్, చల్లా వంశీచంద్‌రెడ్డి, బలరాంనాయక్, ప్రేంసాగర్‌రావు, సంపత్‌కుమార్, బల్మూరి వెంకట్, సునీతారావులతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. అయోధ్య అక్షింతల తరహాలో సమ్మక్క బంగారం అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా అయోధ్య నుంచి అక్షింతలు పంపినట్టుగానే తెలంగాణ ప్రభుత్వం తరఫున సమ్మక్క–సారలమ్మ బంగారాన్ని రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి పంపే అంశాన్ని పరిశీలించాలని మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపాదించారు. బెల్లంతో పాటు పసుపు, కుంకుమ పంపే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. గ్రామాలకు వెళ్లే బంగారాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, స్థానిక కేడర్ నేతృత్వంలో ప్రజలకు పంచాలనే అభిప్రాయం సభ్యుల నుంచి వ్యక్తమైంది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ ఈ ప్రతిపాదనను అమల్లోకి తెచ్చే అంశాన్ని అధికారులతో కలిసి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మంత్రులు సీతక్క, కొండా సురేఖలకు సూచించారు. -
బీసీల ఓట్లకు ‘కులగణన’ అస్త్రం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ‘కులగణన’అస్త్రాన్ని ప్రయోగించనుంది. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడంలో కులగణన కీలకపాత్ర పోషిస్తుంది. ఈ వర్గాల ఓటర్లను ఆకర్షించడమే ధ్యేయంగా మేనిఫెస్టో రూపకల్పనకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. కులగణనకు అనుకూలంగా ఇప్పటికే రాహుల్‌గాంధీ పలు సందర్భాల్లో ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ గణన ఇప్పటికే ప్రారంభించడం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ హామీని మేనిఫెస్టోలో చేర్చిన విషయం విదితమే. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రధానంగా చేర్చనున్నారన్న చర్చ జరుగుతోంది. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పడం ద్వారా బీసీవర్గాల ఓట్లు రాబట్టుకునే అంశంపై మంగళవారం టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశంలో కూడా చర్చ జరగడం గమనార్హం. అన్ని రాష్ట్రాల్లోనూ అధ్యయనం లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో భాగంగా అన్ని రాష్ట్రాలకు ఏఐసీసీ ప్రతినిధులు వెళుతున్నా రు. అందులో భాగంగానే జాతీయ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్, మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి మంగళవారం తెలంగాణకు వచ్చారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో తయారీకి టీపీసీసీ నియమించిన కమిటీతో ఆయన గాందీభవన్‌లో భేటీ అయ్యారు. టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్మున్షీ, కమిటీ సభ్యులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, తాహెర్‌బిన్ హందాన్, లింగంయాదవ్, రవళిరెడ్డి, కోట నీలిమ, పోట్ల నాగేశ్వరరావు, సామా రామ్మోహన్‌రెడ్డి, గాల్‌రెడ్డి హర్షవర్దన్‌రెడ్డి, రియాజ్, కత్తి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో రాష్ట్ర నేతల ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో పీపుల్స్ ఫ్రెండ్లీగా ఉందని, క్షేత్ర స్థాయిలోని అంశాలనూ టచ్ చేశారని అభినందించారు. ఈ సందర్భంగా మేనిఫెస్టో కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాజకీయ పారీ్టలు విస్మరించే వర్గాలను కూడా మేనిఫెస్టోలో చేర్చామని చెప్పారు. ట్రాన్స్జెండర్లు, ఇళ్లలో పనిచేసే వారి గురించి అధ్యయనం చేసి, వారి సమస్యలను కూడా ప్రస్తావించామని వివరించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజల ముందు ఒక మేనిఫెస్టో ఉంచగలిగామని చెప్పారు. ప్రజలు తమపై విశ్వాసంతో అధికారం అప్పగించారని, ఈ హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఒకట్రెండు ఆలోచనలు ప్రధాన మేనిఫెస్టోకు వెళతాయి – ప్రవీణ్ చక్రవర్తి సమావేశ అనంతరం దీపాదాస్ మున్షీ, ఇతర తెలంగాణ నేతలతో కలిసి ప్రవీణ్‌చక్రవర్తి గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రజల ఆలోచనలను తెలుసుకునేందుకు అన్ని రాష్ట్రాలకు వెళ్లి ప్రజలు, నిపుణులు, పార్టీ నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల మేనిఫెస్టో ముఖ్య సాధనమని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందని చెప్పారు.తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యులతో పాటు పౌర సంఘాలు, కొందరు ప్రజలతో సమావేశమయ్యామన్నారు. ఈ చర్చల్లో వచి్చన ఫీడ్‌బ్యాక్ నుంచి ఒకట్రెండు ఆలోచనలు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించే ప్రధాన మేనిఫెస్టోకు వెళతాయని ప్రవీణ్ చక్రవర్తి చెప్పారు. -
ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత కరెంట్ హామీ అమలు: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల తెలంగాణ అప్పులపాలైందన్నారు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందువల్లే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరుగుతోందన్నారు. ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీ అమలు చేస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి మొదలుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వరకు అన్ని హామీలను గత ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదన్న మంత్రి.. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ మంగళవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపదాస్ మున్శి , ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోలో తెలంగాణ నుంచి చేర్చాల్సిన అంశాలపై చర్చించారు. అన్ని రాష్ట్రాల్లో తిరిగి అభిప్రాయాలను సేకరిస్తున్న కేంద్ర మేనిఫెస్టో కమిటీ.. తెలంగాణ మేనిఫెస్టో కమిటీ నుంచి కూడా అభిప్రాయాలను సేకరించింది. నాలుగైదు కామన్ స్కీములతో పాటు.. రాష్ట్రాల కోసం ప్రత్యేక అంశాలను మేనిఫెస్టోలో పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం నిర్ణయించింది. చదవండి: కేటీఆర్, హరీశ్‌రావుపై బీజేపీ నేత రఘునందన్ రావు ఫైర్ ప్రతిపక్షాలవి తొందరపాటు విమర్శలు మేనిఫెస్టోతోనే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలించిందని అన్నారు పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఎంతో విశ్వసాన్ని చూపారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోకు టీ కాంగ్రెస్ సాయం తీసుకుంటాం మేనిఫెస్టో అంటే ప్రజలకు దగ్గరగా, అమలుకు నోచుకునే విదంగా ఉండాలని ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి తెలిపారు. తెలంగాణలో మంచి మేనిఫెస్టో అందించారని.. అందుకే రాష్ట్ర ప్రజలు విశ్వసించారని పేర్కొన్నారు. ఏఐసీసీ మేనిఫెస్టో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలో రూపొందుతుందని చెప్పారు. మ్యానిఫెస్టో పబ్లిక్ ఫ్రెండ్లీగా, క్రోని కాపిటల్కు దూరంగా ప్రజావసరాలకు దగ్గరకు ఉండాలన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సహకారం తీసుకుంటామన్నారు.