
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో ఈనెల 12న సత్యాగ్రహ దీక్ష చేస్తామన్నారు. దేశ ప్రజలు ఐక్యంగా ఉండాలని రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేశారని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
కాగా, మల్లు రవి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి బీజేపీ కుట్ర చేస్తోంది. మోదీలపై మాట్లాడినందుకు దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి ఇల్లు ఖాళీ చేపించారు. భద్రతను సైతం తగ్గించారు. హైకోర్టుకు వెళ్లినా స్టే ఇవ్వకుండా చూశారు. సత్యాగ్రహ దీక్షకు రాష్ట్ర నలుమూలల నుంచి నేతలు హాజరు కావాలి అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: ఆ ఫలితం నమ్మితే మోదీ భ్రమపడ్డట్టే! కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసే ‘బండి’ తొలగింపు ఎందుకు?
Comments
Please login to add a commentAdd a comment