సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌కు వచ్చి కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు సంధించారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ బిల్లు పెట్టమంటే పెట్టలేదు. ప్రతిపక్ష పాత్రలో లేఖ రాయండని అడిగినా.. రాయలేదు. ఎస్సీ వర్గీకరణకు అండగా ఉంటేనే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తాం అని తెలిపారాయన.
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్‌పై అభిప్రాయాలు తీసుకోవడానికి గాంధీభవన్‌కు ఆయన నేతృత్వంలోని బృందం వెళ్లింది. ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్‌రావు థాక్రే సమక్షంలో కాంగ్రెస్ నేతలకు ఎస్సీల్లో ఏ, బీ, సీ, డీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్‌కు ఆయన వినతిప్రతాలు సమర్పించారు.
వర్గీకరణ అంశం సామాజిక అంశంగా గుర్తించిందే కాంగ్రెస్. ఎస్సీ వర్గీకరణ చీలీకల సమస్య కాదు. ‘‘మా ఆకాంక్ష వర్గీకరణ అంశంపై పీసీసీ రేవంత్, ఇంచార్జ్ ఠాక్రే ,భట్టికి తెలియజేసాం. ఎస్సీ వర్గీకరణ పోరాటం దళితుల మధ్య చీలిక అంశం కాదు. సామాజికాంశం. అసమానతలను పరిష్కరించడం కోసమే వర్గీకరణ అంశం. అన్ని కులాలను సమానంగా చూడడమే వర్గీకరణ.
► ఎస్సీ రిజర్వేషన్స్ ఫలాలు అన్ని కులాలకు అందడం లేదని అప్పటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి 1965లో లోకూర్ కమిటి ని నియమించింది. పంజాబ్ లో 1974 నుండి ఇప్పటి వరకు ఎస్సి వర్గీకరణ అమలు కావడం లేదు. ఎస్సి రిజర్వేషన్స్ వర్గీకరణ ను కాంగ్రెస్ సమర్థించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ కోసం వైఎస్సార్ చంద్రబాబు పై ఒత్తిడి తెచ్చారు. వైఎస్సార్ హయాంలో పార్లమెంట్ లో వర్గీకరణ అంశంపై తీర్మానం చేశారు. కేంద్రం ద్వారా వర్గీకరణ చేసే అంశం రాష్ట్రాలకు ఇస్తామని 2009 లో కాంగ్రెస్ మేనిఫెస్టో లో పెట్టింది. 2018లో రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ కట్టబెట్టాలంటూ కేంద్రం పై ఓత్తిడి తెస్తామంటూ మేనిఫెస్టో లో పెట్టారు.
► తమిళనాడులో జనార్దన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ తో dmk వర్గీకరణ అమలు చేస్తుంది. పార్లమెంట్ లో బిల్లు పెడితే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని లేఖలు రాశారు. 10 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న వర్గీకరణ బిల్లు పెట్టలేదు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని 9 ఏళ్లుగా కోరుతున్నా.2018 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతు తెలిపాం. ఇక్కడ ముగ్గురు ఎంపి లు గెలిచిన ఏనాడూ ప్రశ్నించలేదు. పార్లమెంట్ లో రేవంత్ మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు ఎస్సీ వర్గీకరణ పై మాట్లాడాల్సి ఉంటే బాగుండేది. ఆరు సంవత్సరాలు అవుతున్న అసెంబ్లీ లో వర్గీకరణ పై సిఏల్పి నేత బట్టి విక్రమార్క మాట్లాడలేదు.
► రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో జరిగిన సమావేశం లో ఎస్సి వర్గీకరణ కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు. గద్వాల్ సభలో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేస్తామని తెలిపారు.అయితే జనాభా ప్రతిపాదికాన మాదిగలకు టికెట్లు కేటాయించలేదు. వర్గీకరణ మీద అనుకూలమని మీరు చెబితే ప్రధాని కి లేఖ రాయాలి. పార్లమెంట్ లో వర్గీకరణ పై ప్రైవేట్ బిల్లు పెట్టాలి అని కోరాను. రేవంత్, ఠాక్రే మాకు అనుకూలంగా వస్తుంది అన్నారు. వారు మాకు అనుకూలంగా లెటర్ ఇస్తే మా నిర్ణయం చెబుతాం అని చెప్పాం. వర్గీకరణ పై కాంగ్రెస్ స్టాండ్ నిజాయితీగా ఉండాలి. లేదంటే రాజకీయంగా సీరియస్‌గా ఉంటాం అని మందకృష్ణ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించేవారి నుంచి దరఖాస్తులకు ఫీజులు!
మరోవైపు టీకాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కొనసాగుతోంది. టికెట్ ఆశించేవారి నుంచి దరఖాస్తు తీసుకోవాలని, దరఖాస్తుదారుల నుంచి ఫీజులు వసూలు చేయాలని, ఓసీలకు రూ.10వేలు, ఎస్సీ-ఎస్టీలకు అభ్యర్థులకు రూ.2,500 తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: గజ్వేల్‌లో దళిత బంధుకోసం రోడ్డెక్కారు!
Comments
Please login to add a commentAdd a comment