manda krishna madiga
-
రాజకీయాలకు అతీతంగా వర్గీకరణ
సాక్షి, హైదరాబాద్: రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చర్చించి, మంత్రివర్గ ఉపసంఘం వేసి, న్యాయ కమిషన్ వేసి, నివేదికలను వేగంగా తీసుకుని, కేబినెట్లో చర్చించి అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో ఎలాంటి న్యాయపర చిక్కులు రావని సీఎం తెలిపారు.ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మంగళవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో సమావేశమయ్యారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై సీఎం చిత్తశుద్ధిని ఈ సందర్భంగా మంద కృష్ణ అభినందించారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలను సీఎంకు వివరించగా, వాటిని మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు కె.కేశవరావు, సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్‌తో భేటీఎస్సీ వర్గీకరణ ఉపసంఘం చైర్మన్, నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మందకృష్ణ మాదిగ సమావేశం అయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన సూచన మేరకు ఉత్తమ్‌తో భేటీ అయ్యారు. మాదిగలకు 9 శాతం కాకుండా 11 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే వర్గీకరణలో మాదిగల్లోని కొన్ని ఉపకులాలకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. -
‘ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్లలో కొన్ని లోపాలున్నాయి’
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ; రిజర్వేషన్లలో కొన్ని లోపాలున్నాయన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. దీనిలో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో సమావేశమైనట్లు మందకృష్ణ తెలిపారు. సీఎం రేవంత్‌తో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డిని కలిసినట్లు మీడియాకు తెలిపారు..‘గత మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ లో తీర్మానం చేసిన సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు. వర్గీకరణను స్వాగతిస్తున్నాం...కానీ వర్గీకరణ, రిజర్వేషన్లలో కొన్ని లోపాలు ఉన్నాయి. వెనకబడిన కులాలను ఏ గ్రూప్ లో కలపాలి అనేదానిపై సీఎం రేవంత్‌తో చర్చించాం. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను ఏ,బీ,సీలుగా వర్గీకరణ చేసింది. దీనివల్ల కొన్ని కులాలకు అన్యాయం జరుగుతోంది. ఎస్సీలలో అత్యధికంగా మాదిగలు ఉన్నారు.ఎస్సీ వర్గీకరణలో ప్రభుత్వం ఆమోదించిన నివేదికలో లోపాలను సవరించి అన్ని కులాలకు న్యాయం చేయాలని కోరుతున్నాం.కొన్ని కులాలు జనాభా లేక పోయినా వారిని మొదటి గ్రూప్‌లో ఒక శాతం రిజర్వేషన్ల ఇచ్చారు. వెనకబడిన మాదిగ కులానికి రిజర్వేషన్లు అన్యాయం జరిగింది.ఎక్కువ జనాభా ఉన్న నేతకానీలను మాలలు ఉన్న సి గ్రూప్ లో వేయడంతో వారికి అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న మాదిగలే మాలలతోని తట్టుకోలేక పోయారు. ఎక్కువ జనాభా ఉన్న బేడ బుడగ జంగాలను అత్యధికంగా వెనుకబడిన ‘ఏ’ గ్రూపులో వేశారు. అధిక జనాభా ఉన్న మాదిగలకు గ్రూప్ B లో 9 శాతం రిజర్వేషన్ల ఇచ్చారు. దాన్ని 11 శాతానికి పెంచాలని సీఎంను కోరాం.అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన మాలలకు జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ శాతం రిజర్వేషన్ కేటాయించారు.గతంలో బి అండ్ సి గ్రూప్ లో ఉన్న మన్నే కొలుపులవాండ్లు పంబాడ, పంబాల, పంపండ కులాలను గ్రూప్ సి లో ఉంచాలి.ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీకి విజ్ఞప్తులు చెప్పాం. ఎస్సీ వర్గీకరణలో అన్ని కులాలకు న్యాయం జరగాలన్నదే మా లక్ష్యం.డిప్యూటీ సీఎం మల్లు భట్టి ివిక్రమార్కను కూడా కలుస్తాం’ అని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. -
ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ వైఖరి మారుతోంది
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి వైఖరి మారుతోందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి నాలుగున్నర నెలలు గడిచినా.. ఇప్పటికీ వర్గీకరణ జరగలేదని ఆవేదన వ్యకం చేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో మందకృష్ణతో సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఘాటుగా స్పందించారు. ‘వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచి్చన తర్వాత మొదటగా స్పందించిన వ్యక్తి సీఎం రేవంత్‌రెడ్డి. వర్గీకరణ అమలులో తెలంగాణ మొదటి రాష్ట్రం అవుతుందని, గత నోటిఫికేషన్లకు కూడా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పింది ఆయనే.కానీ మాట మార్చి నియామకాలు చేపడుతున్నారు. డీఎస్సీ, గ్రూప్–4 పూర్తి చేయడంతోపాటు వివిధ నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ పూర్తయ్యింది. గ్రూప్–1,2,3 కూడా త్వరలో భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలతో మాదిగలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏదో ఒక రకమైన సాకుతో వర్గీకరణను ఆపే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది. సీఎం రేవంత్ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నా, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన సోదరుడు, కుమారుడు ఈ ప్రక్రియను అడ్డుకోవాలని నిర్ణయించారు.అందుకే అధిష్టానంపైన ఒత్తిడి చేసి వర్గీకరణకు బ్రేకులు వేస్తున్నారు. వర్గీకరణలో తీవ్ర జాప్యం జరుగుతున్నందున ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో ‘లక్ష డప్పులు, వేల గొంతుకలు’కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కేవలం దళితులే కాకుండా అన్ని కులాలకు చెందినవారు ఈ కార్యక్రమానికి మద్దతుగా ఉన్నారు’అని చెప్పారు. వర్గీకరణ సాధించిన తర్వాత ప్రజాసమస్యలపై ఉద్యమాలు కొనసాగిస్తానని, ఏ పార్టీ జెండా వేసుకోనన్నారు. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలులో లోపాలున్నాయని, జనాభా కంటే రిజర్వేషన్లు ఎక్కువగా ఉండడం ఇతర వర్గాలకు నష్టం కలిగించడమే అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అన్ని సమస్యలపైనా ఉద్యమాలు కొనసాగిస్తానన్నారు. -
వైఎస్ జగన్ హయాంలోనే మాదిగలకు మేలు జరిగింది: ఆదిమూలపు సురేష్
సాక్షి,తాడేపల్లి:వైఎస్ జగన్ హయాంలోనే ఏపీలో మాదిగలకు చాలా మేలు జరిగిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సోమవారం(నవంబర్ 18) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ఆఫీసులో పార్టీ అధికార ప్రతినిధి కొమ్మూరి కనకారావుతో కలిసి సురేష్ మీడియాతో మాట్లాడారు.‘మంద కృష్ణ మాదిగ మాత్రం చంద్రబాబు పల్లకి మోస్తూ కాలం గడుపుతున్నారు. ఎస్సీ వర్గీకరణపై స్పష్టత లేదని చంద్రబాబు అంటుంటే మంద కృష్ణ ఏం చేస్తున్నారు?అంటే ఈ సమస్య ఎప్పటికీ ఇలాగే ఉండాలని మంద కృష్ణ కోరుకుంటున్నారు. అందుకే కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారు. మాదిగలకు న్యాయం జరిగేదానికంటే రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు,మంద కృష్ణ చూస్తున్నారు.మాల,మాదిగలను రెండు కళ్లుగా వైఎస్ జగన్ చూశారు. చంద్రబాబులాగ రాజకీయాలకు వాడుకోలేదు.సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా అమలు చేసేలా మంద కృష్ణ చూడాలి. అంతేగానీ వైఎస్ జగన్‌ని దూషిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. రాష్ట్రంలో అలజడి సృష్టించాలంటే కుదరదు.అన్ని ఉద్యోగాలలో దామాషా ప్రకారం మాదిగలకు దక్కేలా చూడాలి. కమిటీల పేరుతో కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తే సహించం.కొమ్మూరి కనకారావు కామెంట్స్...మంద కృష్ణమాదిగ చంద్రబాబు చేతిలో పనిముట్టులాగ మారాడువర్గీకరణ పేరుతో మందకృష్ణ మాదిగలను రాజకీయంగా వాడుకుంటున్నారుముప్పై ఏళ్లుగా మంద కృష్ణ చేస్తున్నది అదేమాల, మాదిగల మధ్య వివాదాలు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారురెండు వర్గాల మధ్య మంటలు రాజేసి చలి కాసుకుంటున్నాడుపెద్ద మాదిగలాగ ఉంటానన్న చంద్రబాబు అధికారంలో ఉన్నంతవరకు ఏమీ చేయలేదుమరి చంద్రబాబుకు మళ్ళీ ఎందుకు మద్దతు చెప్తున్నావ్?ఇద్దరి మధ్య ఉన్న లాలూచీ ఏంటి?చంద్రబాబు ఇచ్చిన టాస్క్ ప్రకారం జగన్‌ను దూషించడంంకరెక్టు కాదువైఎస్ జగన్ మాత్రమే మాదిగని ఎంపీ చేశారుఇద్దరు మాదిగలకు కీలకమైన మంత్రి పదవులు వైఎస్ జగన్ ఇచ్చారుచంద్రబాబు ముగ్గురికే నామినేట్ పదవులు ఇస్తే, వైఎస్ జగన్ ఏకంగా ఏడుగురికి పదవులు ఇచ్చారుచర్మకారులు, డప్పు కళాకారులకు వైఎస్ జగన్ పెన్షన్లు ఇచ్చారుచంద్రబాబు ఆ పెన్షన్లు చంద్రబాబు తొలగిస్తుంటే మంద కృష్ణ ఏం చేస్తున్నారు?చంద్రబాబు ప్రభుత్వంలో మాదిగలకు రక్షణ లేదు -
‘బాబును కలిశాకే పవన్‌ను మందకృష్ణ తిట్టింది’
సాక్షి, తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిసిన సంగతి తెలిసిందే. అయితే బాబుతో గంటపాటు మాట్లాడి బయటకు వచ్చిన మందకృష్ణ.. పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ వ్యాఖ్యలు మాదిగ మహిళలను అవమానించినట్లే ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యిందంటే అది హోంమంత్రినే కాదు, ప్రభుత్వం, చంద్రబాబును అన్నట్లే కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే బాబును కలిసిన తర్వాత మందకృష్ణ.. పవన్‌ను ఎందుకు తిట్టాడన్న సందేహం ఆయన అభిమానులకు రాలేదంటారా అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. పవన్ అభిమానులు కృష్ణ మాదిగని తిడుతున్నారు కానీ.. ఆయనతో తిట్టించిన చంద్రబాబును ఒక్క మాట కూడా అనడం లేదని తెలిపారు. ఇదే చంద్రబాబు మార్క్ రాజకీయమని అన్నారు.చంద్రబాబుని కలిసి ఆయనతో ఓక్క గంట మాట్లాడిన తరువాత బయటికి వచ్చి కృష్ణ మాదిగ పవన్ కళ్యాణ్ ను తిట్టారు.బాబుని కలిసిన తర్వాత ఎందుకు పవన్ ని తిట్టాడు అన్న సందేహం రాలేదంటారా పవన్ కళ్యాణ్ అభిమానులకు? కృష్ణ మాదిగని తిడుతున్నారు కాని కృష్ణ మాదిగ చేత పవన్ కళ్యాణ్ ని తిట్టించిన చంద్రబాబు…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2024 -
అడ్డంగా బుక్ చేశావు పవన్.. బాబు, అనిత మౌనం.. మందకృష్ణ మాదిగ కౌంటర్..
-
పవన్ కు మందకృష్ణ స్ట్రాంగ్ కౌంటర్..
-
పవన్ వ్యాఖ్యలపై మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం
విజయవాడ: ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోంమంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ నోటి నుంచి ఆ తరహా వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమంటూనే, మాదిగ మహిళ అనితను అవమానించినట్లే కదా అంటూ మండిపడ్డారు. ఈ విషయాన్ని తాము దృష్టిలో పెట్టుకుంటామని పవన్‌ను హెచ్చరించారు మంద కృష్ణ మాదిగ.ఈరోజు(మంగళవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అనంతరం మంద కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. ‘ఇదే విధంగా పవన్ కళ్యాణ్ తన శాఖ సరిగా చేయలేదని ఇంకో మంత్రి అంటే ఎలా వుంటుంది. పవన్ కళ్యాణ్ కాపులకు పెద్దన్నఏమో.. మాకు కాదు. జనసేనకు కేటాయించిన బిసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంకో సీటు ఎందుకు ఇవ్వలేదు. జనసేన అందరి పార్టీనా కాదా?, కమ్మ కాపులే కాదు అందరూ జనసేనకు ఓట్లేశారు. రిజర్వేషన్ మూడు సీట్లు మాలలకు ఇచ్చారు. పవన్ కల్యాన్‌ను నీ శాఖను నేను తీసుకుంటానని మరొక మంత్రి అంటే ఎలా వుంటుంది. ఎన్నికల సమయంలోనే పవన్ పట్ల మేము మా అసంతృప్తిని వ్యక్తం చేశాం. పవన్ వ్యాఖ్యలు ప్రభుత్వానికి నష్టం. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అంటే సీఎం చంద్రబాబుని అన్నట్లు కాదా? అంటూ ధ్వజమెత్తారు మంద కృష్ణ మాదిగ.ఇవీ చదవండి: నేను హోం మంత్రినైతే పరిస్థితి మరోలా ఉంటుంది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ఇది కదా జగన్ మార్క్ అంటే.. ప్రభుత్వ స్కూళ్లను చూసి పవన్ ఆశ్చర్యం! -
ఇది పరిష్కరించుకోదగిన మిత్రవైరుద్ధ్యం!
భారతదేశంలో ఉన్న నిచ్చెన మెట్ల కుల సమాజం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తోంది. ప్రతి విషయంలోనూ కులం ప్రధానపాత్ర వహిస్తోంది. కులనిర్మూలన జరగక పోగా కులం వేళ్ళు మరింత బలంగా లోలోతుల్లోకి వెళ్తున్నాయి. ప్రజాస్వామ్యంలో కుల నిర్మూలనైనా జరగాలి లేదా సంపద, అధికారాల్లో ఎవరి వాటా వారికైనా దక్కాలి. ఇవేవీ జరుగకపోగా వేలసంఖ్యలో విభజింపబడిన పాలిత కులాల మధ్య చెప్పలేనన్ని వైరుద్ధ్యాలు! తమకు దక్కాల్సిన వాటా కోసం ఉమ్మడి పోరాటాలు చేయకుండా తమలో తామే తన్నుకోవడం కనిపిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మధ్య వైరుద్ధ్యాలే కనిపిస్తున్నాయి. నిజానికివన్నీ మిత్ర వైరుద్ధ్యాలే తప్ప శత్రు వైరుద్ధ్యాలు కావు. వీటిని పరిష్కరించుకోకుండా దశాబ్దాలుగా తగవులాడుకుంటూనే ఉన్నారు.ఎస్సీల్లోని మాల–మాదిగలు, వారి ఉపకులాల మధ్య ఉండాల్సింది మిత్రవైరుద్ధ్యం కాగా అది శత్రువైరుద్ధ్యంగా కొనసాగుతుండడం బాధాకరం. ఇరువురికీ ఆరాధ్యుడు అంబేడ్కర్. ఆయన స్ఫూర్తితో దళిత జాతి విముక్తికై ఉమ్మడి పోరాటాలు చేయకుండా దశాబ్దాలుగా పాత వైరుద్ధ్యాలను మరింత విస్తృతం చేసి దళిత రాజ్యాధికార భావనకు మరింతదూరం జరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘దళిత మహాసభ’ దళితులపై జరిగిన పాశవిక దాడులను సమర్థంగా ఎదుర్కొంది. ఎండగట్టింది. దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచింది. అంబేడ్కర్ స్ఫూర్తితో, ఇంగ్లీషు చదువులతో, క్రైస్తవ చైతన్యంతో ఆంధ్ర మాలలు కొంతవరకైనా పాలక స్థాయికెదిగి ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు. రాజకీయ పదవులూ గెలుచుకున్నారు. అలాగే మూడు దశాబ్దాల క్రితం మంద కృష్ణ మాదిగ ప్రారంభించిన ‘మాదిగ దండోరా’ ఉద్యమం చరిత్రాత్మకమైనది. అది మాదిగల్లో ఆత్మగౌరవాన్ని, పోరాట పటిమను, అంబేడ్కర్ భావజాలాన్ని అర్థం చేసుకునేలా చేసింది. అది కేవలం వర్గీకరణ ఉద్యమంగానే ఉండిపోకుండా వికలాంగుల పెన్షన్, తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చింది. కొందరు ఆధిపత్య కులాల వారు తమ పేరు చివర తమ కులాలను తెలియచేసే విశేషాలను పెట్టుకున్నట్లే.. మాదిగలు కూడా తమ పేరు చివర ‘మాదిగ’ పదాన్ని చేర్చుకోవాలని మంద కృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు ఆ కులంలో ఆత్మగౌరవాన్ని ప్రోది చేసింది. ఒక్క దళిత కులాల్లోనే కాదు పీడిత కులాలందరికీ ఆత్మవిశ్వాసాన్నిచ్చిందీ దండోరా ఉద్యమం. అయితే దండోరా ప్రధాన లక్ష్యం రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ సాధించడం.కానీ వర్గీకరణ విషయంలో మాల, మాదిగల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. దేశం మొత్తంగా కొన్నిచోట్ల మాలలు, మరికొన్ని చోట్ల మాది గలు రిజర్వేషన్లలో భాగాన్ని ఎక్కువగా అనుభవిస్తున్నారన్నది వాస్తవం. వర్గీకరణ చేస్తే మాల, మాదిగ ఉపకులాలన్నీ రిజర్వేషన్ సౌకర్యాన్ని సమానంగా అనుభవించి అన్ని ఉపకులాలు పైకొస్తాయన్నది వర్గీకరణ కావాలనే వారి వాదం. వర్గీకరణ వల్ల దళితుల్లో ఐక్యత దెబ్బతింటుందని వర్గీకరణను వ్యతిరేకించే వారి వాదన. ఎక్కడ మాలల్లో గానీ, మాదిగల్లో కానీ చైతన్యం ఎక్కువగా ఉంటే అక్కడ ఆయా కులాలవారు రిజర్వేషన్ సౌకర్యాన్ని ఎక్కువ ఉపయోగించుకున్నారన్నది వాస్తవం.వర్గీకరణ కావాలనడంలో ఎవరి వాటా వారికి చెందాలన్న ప్రజాస్వామిక సూత్రముంది. ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణను ఒకసారి చేసినా కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల దాని అమలు నిలిపివేయబడింది. అప్పట్నుంచి వైరుద్ధ్యాలు మరీ ఎక్కువయ్యాయి. వర్గీకరణ ఉద్యమం దేశవ్యాప్తమైంది. దీన్ని ఆసరాగా చేసుకొని పాలకపార్టీలు ఓట్లు రాజకీయాలాడటం మొదలు పెట్టాయి. దళితుల ఓట్లు కోసం వర్గీకరణను సమర్థించడం, వ్యతిరేకించడం రాజకీయ పార్టీలకు ఓ ఆటగా మారింది.చదవండి: చేగువేరా టు సనాతని హిందూ!ఈ మధ్యనే సుప్రీంకోర్టు వర్గీకరణ చేయడం సరైన దేనని తీర్పునిచ్చింది. అందులో మెలిక పెట్టింది. క్రీమీలేయర్ పాటించాలని. తరతరాలుగా రాజకీయ, సామాజిక, విద్య, ఆర్థిక, ఉద్యోగపరమైన అధికారాలు అనుభవిస్తున్న వారికి లేని క్రీమీలేయర్ దళితుల వర్గీకరణకు కావాలనడం ధర్మ సమ్మతమేనా? కొందరు దళితనేతలు క్రీమీలేయర్ వద్దంటే మరికొందరు వర్గీకరణే వద్దంటున్నారు. మాయావతి లాంటి నాయకురాలు కూడా వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా ఇలాంటి సందర్భాల్లో వర్గీకరణ అమలవుతుందా అనే అనుమానం రావడం సహజమే. అమలు కాకుండా ఉండటానికి వర్గీకరణ వ్యతిరేకులు, అమలు చేయడానికి వర్గీకరణ అనుకూలురు ఇంకా ఎన్నేండ్లు పోరాటాలు చేస్తూ తమ ఉమ్మడి లక్ష్యాన్ని మరిచిపోతారు?దళిత సోదర సోదరీమణులు తమ మధ్యనున్న వైరుధ్యాలను మిత్ర వైరుద్ధ్యాలుగా భావించి చర్చలతో వర్గీకరణ సమస్య విషయంలో ఏకీభావానికి వచ్చి దళిత రాజ్యాధికార భావనను సాకారం చేసే దిశగా పయనం కొనసాగిస్తే మంచిది. తమ అంతిమ లక్ష్యం దళిత సాధికారత, రాజ్యాధికారం అన్న విషయాన్ని అర్థం చేసుకుంటే ఇరువైపుల వారికీ వర్గీకరణ సమస్య అతి చిన్నదిగా కనబడుతుంది.- డాక్టర్ కాలువ మల్లయ్యప్రముఖ కథా రచయిత -
ప్రధాని మోదీతో మంద కృష్ణ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలో మోదీని కలిసిన మందకృష్ణ వర్గీకరణకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దాదాపు అరగంటపాటు మోదీతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ వర్గీకరణ విషయంలో మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోవడంలో మోదీ వంద శాతం విజయం సాధించారన్నారు.రెండు రాష్ట్రాల్లో వర్గీకరణ త్వరితగతిన అమలయ్యేలా చూడాలని కోరారు. కొందరు వర్గీకరణ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని, కాబట్టి ఏపీ, తెలంగాణలో సమస్య ఉత్పన్నం కాకుండా అమలు జరిగేలా చూడాలని విన్నవించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి మోదీ మాత్రమేనని మంద కృష్ణ కొనియాడారు. -
సామాజిక న్యాయం!! అవకాశవాదమా? అమలయ్యేనా?
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యం నెరవేరింది. పట్టువదలకుండా కృషి చేస్తే ఎప్పటికైనా అనుకున్నది సాధించవచ్చని ఈ ఉద్యమం రుజువుచేసింది. ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగకు ఇది వ్యక్తిగత విజయం అని కూడా భావించవచ్చు. మాదిగ దండోరా పేరుతో సాగిన ఉద్యమం ఉమ్మడి ఎపిలో విశేష ప్రభావం చూపిందని చెప్పాలి.ఒకప్పుడు తమ పేరు చివర మాదిగ అని పెట్టుకుంటే సమాజంలో చిన్నతనం అవుతుందేమో అనుకునే దశ నుంచి మాదిగ అన్న పదానికి ఒక గౌరవాన్ని,గుర్తింపును తెచ్చిన ఘనత ఆయనది. వర్గీకరణ కన్నా మందకృష్ణ తీసుకు వచ్చిన పెద్ద సామాజిక మార్పు ఇది అని చెప్పాలి. .. గత ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో జరిగిన సభలో మంద కృష్ణను దగ్గరకు తీసుకుని తాను కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా పనిచేస్తానని ప్రకటించారు. కృష్ణను ఏకంగా తన నాయకుడుగా కూడా ఆయన ప్రకటించడం అందరిని ఆకర్షించింది. అయినా వర్గీకరణ సాధ్యమా? కాదా? అనే చర్చ కొనసాగింది. విశేషంగా గతంలో వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన సుప్రింకోర్టు ఇప్పుడు దానిని కొట్టివేసి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయానుసారం వర్గీకరణ చేసుకోవచ్చని అత్యున్నత న్యాయ స్థానం నిర్ణయం చేసింది. దీని ప్రకారం సామాజిక, ఆర్ధిక అంశాల ప్రాతిపదికన ఎస్సీలలో వర్గీకరణ చేయవచ్చని స్పష్టం చేసింది. తత్ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాలలో వర్గీకరణ ప్రాతిపదికన అవకాశాలు లభిస్తాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్ లు ఉన్నాయి. కాని ఈ రిజర్వేషన్ అవకాశాలు ఎస్సీలలో బలమైన కొన్ని వర్గాలకే అధికంగా లభించాయన్న బావనతో దండోరా ఉద్యమం ఆరంభం అయింది. ప్రధానంగా మాల వర్గంకు చెందినవారికే ఈ రిజర్వేషన్ ల ఫలాలు అధికంగా దక్కుతున్నాయన్న అభిప్రాయం మాదిగ,తదితర ఉప కులాలలో ఏర్పడింది. రాజకీయ పదవులలో సైతం మాలల ఆదిపత్యం ఎక్కువగా ఉంటున్నదని, తమ సంఖ్యకు అనుగుణంగా పదవులు దక్కడం లేదన్న ప్రచారం జరిగేది. తెలంగాణలో మాదిగలు అధిక సంఖ్యలో ఉంటారు.అదే విభజిత ఆంద్ర ప్రదేశ్ లో మాల వర్గం వారు ఎక్కువగా ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రాజకీయాలు కూడా ఉమ్మడి ఏపీలో సాగుతూ వచ్చాయి. తొలుత నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ ప్రక్రియ ఆరంభమైంది. మాలవర్గం నేతలు దీనిని పూర్తిగా వ్యతిరేకించారు. చంద్రబాబు ఎస్సీలలో విభజన చిచ్చు పెడుతున్నారని వారు ఆరోపించేవారు. ఎస్సీలలో ఎక్కువమంది కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటారన్న అభిప్రాయం అప్పట్లో ఉంది. ఆ వర్గంలో తనకంటూ ఓటు బ్యాంకును తయారుచేసుకునే ఉద్దేశంతో వర్గీకరణ వైపు చంద్రబాబు మొగ్గుచూపారన్న విమర్శ కూడా అప్పట్లో ఉండేది. అయితే.. ఈ వర్గీకరణ తమకు మేలు చేస్తుందని మాదిగ,తదితర ఉపకులాలు భావించి, మంద కృష్ణ ఉద్యమానికి మద్దతు ఇచ్చాయి.దాంతో వివిధ రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆయా రాజకీయ పక్షాలు ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయాలు చేశాయి. ఈ దశలో సుప్రింకోర్టులో వర్గీకరణ చెల్లదని తీర్పు రావడంతో ఇది అత్యంత జఠిల సమస్యగా మారింది. ఆ తరుణంలో ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా శాసనసభలో తీర్మానం చేసింది. కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వం వద్దకు దీనిపై అఖిలపక్షాన్ని పంపించి ఆయన సమస్య పరిష్కారానికి కృషి చేశారు. దీనికి వ్యతిరేకంగా మాలమహానాడు నేతలు నిరాహార దీక్షలకు దిగగా, వైఎస్ ఆర్ వారిని ఒప్పించి విరమింప చేశారు. అప్పట్లో ఉషా మెహ్రా నేతృత్వంలో ఒక కమిషన్ ను ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ వర్గీకరణపై వివిధ రాష్ట్రాలలో అభిప్రాయాలు సేకరించింది. ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్న పరిస్తితులను దృష్టిలో ఉంచుకునే కేంద్రం అప్పట్లో వ్యవహరించిందన్న భావన ఉంది. ఆ కమిషన్ కూడా వర్గీకరణకు సానుకూలమైన నిర్ణయాలు వెలువరించలేదు. దాంతో ఇది పెద్ద పెండింగ్ సమస్యగా మారింది. అయితే మాదిగ దండోరా ఉద్యమాన్ని మంద కృష్ణ నిలుపుదల చేయలేదు. మద్యలో దండోరాలో చీలికలు వచ్చినా, రాజకీయాల ప్రభావం పడినా, అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన తన వాయిస్ వినిపిస్తూనే వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత నాటి టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రభుత్వం కూడా దీనిపై అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. బిజెపి అగ్రనేతలు దండోరాకు మద్దతు ఇవ్వడంతో ఇది ఒకరకంగా కొత్తరూపు దాల్చిందని చెప్పాలి. సీనియర్ నేత వెంకయ్యనాయుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటివారు కృష్ణకు సహకరించారు. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ తాను ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా ఒక భారీ సభను నిర్వహించడంతో ఈ ఉద్యమం కొత్త మలుపు తిరిగింది.ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయంతీసుకుని కోర్టుకు ఆ విషయం తెలిపింది. ఒకసారి సుప్రింకోర్టు నిర్ణయం అయిన తర్వాత తిరిగి కేసును ఓపెన్ చేసి కోర్టు విచారణ జరపడం సంచలనమే అని చెప్పాలి. తదుపరి రెండు దశాబ్దాలకు సుప్రింకోర్టు తన తీర్పును మార్చుకుని వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం ఉందని తేల్చడంతో ఇది ఒక కొలిక్కి వచ్చినట్లయింది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే.. ఒకప్పుడు రాజకీయ లక్ష్యంతో ఉమ్మడి ఏపీలో రిజర్వేషన్ లకు అనుకూలంగా నిర్ణయించిన టీడీపీ, రాష్ట్ర విభజన తర్వాత దాని జోలికి వెళ్లలేదు. 2014 టరమ్ లో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలో మాదిగ దండోరా ఉద్యమానికి అనుమతి ఇవ్వలేదు. దానికి కారణం ఏపీలో మాలవర్గం వారి ప్రాధాన్యత అధికంగా ఉండడమే అని భావిస్తారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో వీరి ప్రాబల్యం అధికంగా ఉంటుందని అంటారు.మాదిగ దండోరాకు వ్యతిరేకంగా మాల మహానాడు నేతలు కూడా ఆరోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించేవారు.దీంతో ఈ వ్యవహారం క్లిష్టమైన సమస్యగా ఉండేది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయం వెలువరించడంతో ఇది ఒక కొలిక్కివచ్చినట్లయిందనిపిస్తుంది. అయితే మాల మహానాడు నేతలు ఏ రకంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇప్పుడు కొత్త సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీయులలో ఏ ఉప కులంవారు ఎంత మంది ఉన్నారన్నదానిపై గణాంకాలు సేకరించవలసి ఉంటుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం వర్గీకరణ చేసి విద్య,ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ లు కల్పిస్తే సరిపోతుందా?లేదా?అనేది చూడాల్సి ఉంది. కాగా, ఎస్సీ వర్గీకరణపై సుప్రిం తీర్పును తెలంగాణలోని రాజకీయ పక్షాలు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తమ వంతు ప్రయత్నం సాగించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఒక ప్రకటన చేస్తూ తమ రాష్ట్రం వెంటనే దీనిని అమలు చేస్తుందని ప్రకటించారు.సుప్రింకోర్టులో సీనియర్ న్యాయవాదిని నియమించి కేసును బలంగా వినిపించడంతో తీర్పు అనుకూలంగా వచ్చిందని కాంగ్రెస్ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. మరో నేత కడియం శ్రీహరి టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు వర్గీకరణపై తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది తమ ఘనతేనని బిజెపి పేర్కొంది. కాగా కాంగ్రెస్ పార్టీ మాదిగలను అణచివేసే ప్రయత్నం చేస్తే.. తమ అధినేత కేసీఆర్ వారిని ఆదుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాస్త ఆచితూచి స్పందించారనిపిస్తోంది. దీనిని సామాజిక న్యాయంగా వ్యాఖ్యానించారాయన. ఎస్సీలతో పాటు ఎస్టీ వర్గీకరణపై తీర్పు రావడంతో దాని ప్రభావం ఏ రకంగా ఉండేది అప్పుడే చెప్పజాలం. అంతా హర్షిస్తారా?లేక కొత్త ఆందోళనలు ఏమైనా వస్తాయా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం లభించిందని ఆశిద్దాం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అడ్డంకులు అధిగమించాం.. విజయం సాధించాం
సాక్షి, న్యూఢిల్లీ: ‘మాదిగల 30 ఏళ్ల పోరాటానికి తెరపడింది. వర్గీకరణ పోరాటంలో అడుగడుగునా అరెస్టులు.. ఉద్యమాలను అడ్డుకున్నా, పట్టు వీడకుండా న్యాయమైన పోరాటానికి అడుగులు వేశాం. ఉద్యమం ప్రారంభించిన తొలిరోజుల్లో ఎన్ని అడ్డంకులు వచి్చనా వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడి ఈ రోజు వర్గీకరణ సాధించాం. మాదిగల్లో పోరాట స్ఫూర్తిని నింపాం. గ్రామస్థాయి నుంచి నగరస్థాయి వరకు రిజర్వేషన్లపై చైతన్యం తెచ్చాం’ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇచి్చన నేపథ్యంలో మంద కృష్ణమాదిగను ‘సాక్షి’ పలకరించింది. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.... ఎమ్మార్పీఎస్ కార్యకర్తల పోరాటం వల్లే..మాదిగల హక్కుల కోసం 1994 జూలై 7న ‘మాదిగ పోరాట సమితి’ని స్థాపించాను. గ్రామ, మండలస్థాయిలో ఎమ్మారీ్పఎస్ కార్యకర్తలు..రాజకీయపారీ్టల కార్యకర్తలకు దీటుగా నిలబడ్డారు. ఎంతోమంది మాదిగలు వర్గీకరణ కోసం బలిదానాలు చేసుకున్న సంఘటనలు నన్ను ప్రతిరోజూ కలచివేస్తుండేవి. ‘అన్నా మేం చనిపోతున్నాం..అయినా సరే పోరాటం ఆపొద్దు.మీరు ముందుండి ఉద్యమాన్ని నడపండి...ఏదో ఒకరోజు రిజర్వేషన్లు కచి్చతంగా సాధిస్తాం’అంటూ చనిపోయే ముందు కొందరు కార్యకర్తలు నాతో మాట్లాడిన మాటలు ప్రతిరోజూ నేను గుర్తు చేసుకుంటూ పోరాటాలకు పిలుపునిచ్చేవాడిని. వారి కన్నీళ్ల ప్రతిఫలమే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు. 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు బలంగా ఉంటూ, పోరాటాలు చేశారు. ఎంతో మంది నాయకులు మా కార్యకర్తలపై భౌతికంగా దాడులు చేసినా, వేధించినా, కేసులు పెట్టినా భయపడకుండా ధైర్యంగా నిలబడ్డారు. ఎమ్మారీ్పఎస్ పోరాటస్ఫూర్తి వల్లనే ఈరోజు విజయం సాధించాం. ఎంతో మంది సహకరించారుమేం చేసిన ఈ పోరాటానికి ఎంతోమంది మద్దతు పలికారు. అనేక పర్యాయాలు ఆర్థికపరమైన సాయం, మాట సాయం, న్యాయపరమైన సాయాలు ఎందరో చేశారు. వారందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆ ఐదుగురు అలా..ఈ ఐదుగురు ఇలా2004లో జస్టిస్ సంతోష్‌హెగ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం రిజర్వేషన్లు చెల్లవు అంటూ రద్దు చేసింది. ఆ తర్వాత 2020లో అరుణ్‌మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల «ధర్మాసనం రాష్ట్రప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేయొచ్చని తీర్పు ఇచ్చింది.ఇదే సందర్భంలో ఏడుగురు సభ్యుల ధర్మాసనం దీనిపై న్యాయం చెప్పాలని సూచనలు చేసింది. ఆ సూచనల కారణంగానే తాజాగా రిజర్వేషన్లపై తీర్పు రావడం ఆనందంగా ఉంది. ముందేమో ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం వ్యతిరేకించింది, ఆ తర్వాతేమరో ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఉమ్మడి ప్రయోజనాల కోసం పోరాడుదాం వర్గీకరణ కోసం మేం పోరాటాలు చేస్తుంటే మా మాల సోదరులు రోడ్డెక్కి అడ్డుచెప్పేవారు. కానీ, కొంతకాలంగా వారి మనసులు మారాయి, మా పోరాటాలకు ఎవరూ అడ్డు పడలేదు. ఇకపై ఉమ్మడి ప్రయోజనాల కోసం ఎస్సీలందరం కలిసి పోరాడాల్సిన అవసరముంది. 2004లో తెచి్చన చట్టాన్నే ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తే సరిపోతుంది. ఇక తెలంగాణలో కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాల్సి ఉంది. వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టొద్దని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా.సీఎంకు మాదిగ ఎమ్మెల్యేల స్వీట్లుసాక్షి, హైదరాబాద్: ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పు నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డికి మిఠాయిలు తినిపించారు. అసెంబ్లీలోని సీఎం చాంబర్లో మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో డప్పు చప్పుళ్లతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో కడియం శ్రీహరి, కాలె యాదయ్య, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్య నారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, శామేలు, తోట లక్ష్మీకాంతరావు తదితరులున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు చారకొండ వెంకటేశ్, గజ్జెల కాంతం, దేవని సతీశ్, మాజీ మంత్రి పుష్పలీల కూడా సీఎం రేవంత్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
30 ఏళ్ల ధర్మపోరాటానికి ఫలితం దక్కింది: మందకృష్ణ
-
30 ఏళ్ల మా పోరాటం.. ధర్మమే గెలిచింది: మందకృష్ణ
న్యూఢిల్లీ, సాక్షి: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణల్లో వర్గీకరణకు సుప్రీం కోర్టు పచ్చ జెండా ఊపింది. ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుపై మందకృష్ణ మాదిగ స్పందించారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని నిరూపితమైంది. ఈ పోరాటంలో చాలా మంది అసువులబాశారు. సుప్రీం కోర్టులో న్యాయం గెలిచింది. ఈ విజయం కోసం 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం. ఎన్ని కష్టాలు ఎదురైనా అంకిభావంతో జాతి పోరాడింది. వర్గీకరణ పోరాటాన్ని నీరుగార్చుందుకు యత్నించారు. ఎస్సీ వర్గీకరణకు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు ధన్యవాదాలు. ఈ తీర్పుతో తెలంగాణలో 11శాతం, ఆంధ్రప్రదేశ్‌లో ఏడు శాతం మాదిగలకు రిజర్వేషన్ దక్కే అవకాశం ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్లలో వర్గీకరణ వెంటనే చేయాలి. ... విద్యాసంస్థల్లో కూడా వర్గీకరణకు అనుకూలంగా రిజర్వేషన్ చేయాలి. ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగాయి. కొంతమంది వెన్నుపోటు పొడిచారు. సమాజం యావత్తు మాదిగల వైపు నిలబడింది. ఎన్నో రాజకీయ పార్టీలు, వ్యక్తులు మా వైపు నిలబడ్డారు. న్యాయాన్ని, ధర్మాన్ని బతికించడం కోసం మా వైపు నిలబడ్డ అందరికీ ధన్యవాదాలు. సమాజంలో పెద్దలు, మీడియాకు కృతజ్ఞతలు. అణగారిన వర్గాల వైపు, పేద వర్గాల వైపు న్యాయం నిలబడింది. ప్రధాన న్యాయమూర్తుల తో పాటు, ఇతర న్యాయమూర్తులకు కృతజ్ఞతలు. మాకు అండగా నిలబడ్డ ప్రధాని మోదీ, అమిత్ షా, భుజాన వేసుకుని మా వైపు ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలకు కృతజ్ఞతలు. సుప్రీంకోర్టు తాజా తీర్పును తెలుగు రాష్ట్రాల్లో విద్యా, ఉద్యోగ నియామకాల్లో అమలు చెయ్యాలి. ప్రభుత్వాల దగ్గర ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న ఉద్యోగ నియామకాల్లో కూడా అమలు చెయ్యాలి’’ అని అన్నారు.వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలో స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిఎస్సీ వర్గీకరణకు మాదిగ, మాల ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్‌ను సస్పెండ్ చేసింది.2023 డిసెంబర్ 23న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహ అడ్వకెట్ జనరల్‌ను సుప్రీంకోర్టుకు పంపించారు.వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారు.తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది.వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా.సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.ఇప్పుడు అమలులో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా మాదిగ, మాల ఉప కులాలకు రెజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది.ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకోస్తాం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: కేటీఆర్మొదటి నుంచి ఈ అంశంపై బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసింది.ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం.మా పార్టీ అధినేత కేసీఆర్ గారు సీఎం హోదా వర్గీకరణకు మద్దతుగా ప్రధాని లేఖ ఇచ్చారు ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నాం: హరీష్ రావు మాజీ మంత్రిగొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ ఉద్యమం నుంచే బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నది.ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఆనాడే ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం అందరికి విదితమే.ఎస్సీ వర్గీకరణ చేయాలని 16మే, 2016 నాడు ప్రధాని మోదీని స్వయంగా కలిసి లేఖ ఇచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిందికాబట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, తద్వారా విద్య, ఉద్యోగ అవకాశాల్లో యువతకు అవకాశం కల్పించాలని కోరుతున్నాను.ఎస్సీ వర్గీకరణ తీర్పు చారిత్రాత్మకం: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దళితుల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే పార్టీలకు ఈ తీర్పు చెంపపెట్టుప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలుఅట్టడుగునున్న వర్గాలకు కూడా ప్రభుత్వ ఫలాలు అందాలన్నదే బీజేపీ అంత్యోదయ సిద్ధాంతం1997లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా బీజేపీ తీర్మానంహైదరాబాద్ ఎన్నికల సభలోనూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ప్రధాని ఉద్ఘాటనఎన్నికల అనంతరం ఎస్సీ వర్గీకరణపై కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని నియమించాంఆ కమిటీ నివేదిక ఆధారంగానే సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలుసుప్రీం తీర్పుతో కోట్లాది మంది దళితుల చిరకాల స్వప్నం నెరవేరబోతోందిమంద కృష్ణ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం కొనసాగిన 3 దశాబ్దాల పోరాటాలు ఫలించాయిఎస్సీ వర్గీకరణతో ఎవరికైనా నష్టం జరుగుతుందని భావిస్తే వారికి కేంద్రం న్యాయం చేసేందుకు సిద్ధంకోర్టు తీర్పుపై అపార్ధాలకు తావివ్వకుండా దళితులంతా కలిసి మెలిసి ఉండాలని వేడుకుంటున్నారాజకీయ లబ్ది కోసం తీర్పును చిలువలు చేసి సమాజాన్ని చీల్చే కుట్రలు చేయొద్దని కోరుతున్నా30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం గెలిచింది: మంత్రి దామోదర రాజనర్సింహఎస్సి, వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ‘అణగారిన వర్గాలకు న్యాయం జరిగింది. ఇవాళ న్యాయం, ధర్మం గెలిచింది. మా ప్రభుత్వం ఎస్సిల అభ్యున్నతికి కట్టుబడి ఉంది. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం గెలిచింది. ఇన్ని ఏళ్ల ఉద్యమ కాలంలో ఎంతోమంది అమరులు అయ్యారు’అన్నారు.అసెంబ్లీ లాబీలో మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేలు.కడియం శ్రీహరి కామెంట్లు..అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు అందరికి అందాలనే మా కల సాకారం అయింది.సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాము.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి దామోదర రాజనర్సింహను ఢిల్లీకి పంపి అక్కడ అడ్వకేట్‌ను పెట్టారు.అనుకూలమైన తీర్పు రావడానికి మా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర పాత్ర ఉంది.ప్రతి ఒక్క దళిత సోదరీ సోదరీమణులకు శుభాకాంక్షలు. -
చంద్రబాబుకు అమ్ముడుపోయిన మంద కృష్ణకు బుద్ధి చెబుతాం
సాక్షి, అమరావతి: వర్గీకరణ పేరుతో ముప్పై ఏళ్లుగా మాదిగలకు వెన్నుపోటు పొడుస్తున్న మంద కృష్ణ ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబుకు తమ జాతిని తాకట్టు పెట్టడానికి సిద్ధమవుతాడని మాదిగ సంఘాలు మండిపడ్డాయి. చంద్రబాబుకు ప్యాకేజీకి అమ్ముడుపోయిన మంద కృష్ణ ఈ నెల 30న గుంటూరులో జరిగే సభకు ఎలా వస్తాడో చూస్తామని హెచ్చరించాయి. విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్ హాలులో ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం గురువారం జరిగింది. రాష్ట్రంలోని 25 మాదిగ సంఘాల నాయకులు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మనువాద బీజేపీ, మోసకారి చంద్రబాబు కూటమికి ఎందుకు ఓటెయ్యాలని పలువురు మాదిగ సంఘాల నేతలు ప్రశ్నించారు. మనువాద విష కౌగిలికి మాదిగలను చేర్చేందుకు మంద కృష్ణ ప్రయత్నిస్తున్నాడని, చంద్రబాబుతో అక్రమ సంబంధం నెరపుతున్నాడని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదిస్తానని హామీ ఇచ్చిన బీజేపీ పదేళ్లు అయినా పట్టించుకోలేదని, వర్గీకరణను అడ్డుపెట్టుకుని చంద్రబాబు మాదిగల ఓట్లతో రాజకీయ లబ్ధి పొందుతున్నాడని మండిపడ్డారు. ఇకపై మంద కృష్ణ ఆటలు సాగనివ్వబోమని, అతని ఎత్తులను కచ్చితంగా తిప్పి కొడతామని మాదిగ నేతలు హెచ్చరించారు. మాదిగల ద్రోహులు బాబు, మంద కృష్ణలకు గుణపాఠం చెబుతామన్నారు. రౌండ్‌టేబుల్ సమావేశం నిర్ణయాలను సంఘాల నేతలు మీడియాకు వెల్లడించారు. బాబు దగా చేస్తే.. జగన్ మేలు చేశారు నవ్యాంధ్ర ఎమ్మార్పిఎస్ సమాఖ్య అధ్యక్షులు పరిశపోగు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ద్వారా చంద్రబాబు హయాంలో మాదిగలకు 22 వేల ఉద్యోగాలొచ్చాయని మంద కృష్ణ పచ్చి అబద్ధాలు చెబుతున్నాడన్నారు. ముప్పై ఏళ్లుగా టీడీపీ చంకలో దూరిన మంద కృష్ణ రాష్ట్రంలోని మిగిలిన పార్టీలకు మాదిగలను దూరం చేసి జాతికి తీరని ద్రోహం చేశాడన్నారు. చంద్రబాబు పాలనలో మాదిగలకు జరిగిన మేలు ఏమిటో ఒక్కటి కూడా మంద కృష్ణ చెప్పలేడన్నారు. ఓట్లు పొందుతున్న చంద్రబాబు తగినన్ని సీట్లు కేటాయించలేదన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలకు పది సీట్లు కేటాయించడం సంతోషకరమన్నారు. చంద్రబాబు హయాంలో పది శాతం మాదిగ కుటుంబాలకు మేలు జరిగితే గొప్పలు చెప్పుకునేవారని, అదే సీఎం వైఎస్ జగన్ పాలనలో 90 నుంచి 96 శాతం మాదిగ కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. ఊరి చివర ఉండే వెలివాడల్లోని తమ ఇళ్ల వద్దకే వచ్చి సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఎస్సీ శ్మశాన వాటికల సమస్యను అర్థం చేసుకుని ప్రతి ఊరిలో ఒక ఎకరం చొప్పున కేటాయించేలా ప్రభుత్వం చర్య తీసుకుందన్నారు. మాదిగలకు నిజమైన మేలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు మద్దతు ఇవ్వడం తమ ధర్మం అన్నారు. ఏ హక్కుతో ఏపీకి వస్తావ్ ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాట్లాడుతూ.. మాదిగలకు ద్రోహం చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మంద కృష్ణ మద్దతివ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆధార్ కార్డు, ఓటు హక్కు కూడా లేని మంద కృష్ణకు ఏ హక్కు ఉందని ఎన్నికలు వచ్చే సరికి మాదిగ జాతి మొత్తాన్ని చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నాడని ప్రశ్నించారు. ప్యాకేజీకి అమ్ముడుపోయిన మంద కృష్ణ తన తీరు మార్చుకోకపోతే ఈ నెల 30న నిర్వహిస్తున్న సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. గుంటూరులో ఎలా అడుగుపెడతాడో చూస్తామని, నీ సంగతి తేలుస్తామని అల్టిమేటం ఇచ్చారు. మాదిగలను అంబేడ్కర్ వాదం నుంచి మనువాదం వైపు నడిపే మంద కృష్ణ ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. మాట్లాడిన వారిలో సువర్ణరాజు(ఏపీ ఎమ్మార్పీఎస్), చెరుకూరి కిరణ్(మాదిగ కార్పొరేషన్ సాధన సమితి), కొరిటిపాటి ప్రేమ్‌కుమార్(మాదిగ మహాసేన), మంద క్రిష్ణయ్య(ఆర్ఎంఆర్పీఎస్), గడ్డం బాపిరాజు(ఐఎన్ఎఫ్ఓఆర్ఎం), పొన్నెకంటి రమే‹Ù(మాదిగ దండోర), జానయ్య (జైభీమ్ ఎమ్మార్పిస్), ఈపూరి ఆదాం(బహుజన పరిరక్షణ సమితి), జుజ్జవరపు రవిప్రకా‹Ù(దళితసేన), మల్లవరపు నాగయ్య(అమరావతి ఎమ్మార్పిఎస్), వరదరాజులు(నేషనల్ ఎమ్మార్పీఎస్), పులిదాసు(ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ సమితి), బి.మేరీ కుమారి ఉన్నారు. మాదిగలకు మేలు చేసిన జగన్ మాదిగలను చంద్రబాబు దగా చేస్తే సీఎం వైఎస్ జగన్ మేలు చేశారని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, లిడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు స్పష్టం చేశారు. మాదిగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి సంఘీభావంగా హాజరైన వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదిగలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రూ.వేల కోట్లతో సంక్షేమాన్ని అందించారన్నారు. మాదిగలను అడ్డుపెట్టుకుని అన్ని రకాలుగా లబి్ధపొందిన మంద కృష్ణ మోసాలు ఇక సాగవన్నారు. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ మాదిగ జాతిని చంద్రబాబుకు తాకట్టు పెడితే సహించేదిలేదన్నారు. తమకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే మాదిగలు ఉన్నారని స్పష్టం చేశారు. -
మాల, మాదిగల మధ్య చిచ్చుకు చంద్రబాబు కుట్రలు
సాక్షి, అమరావతి/భీమవరం/తాడేపల్లిరూరల్/నెహ్రూనగర్/కడప కార్పొరేషన్: ఎన్నికలు వచ్చాయంటే చాలు అన్నదమ్ముల్లా ఉన్న మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టేలా చంద్రబాబు కుట్రలు చేస్తారని మాల మహానాడు(పీవీ రావు) జాతీయ అధ్యక్షుడు నత్తా యోనారాజు మండిపడ్డారు. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేందుకు మంద కృష్ణ మాదిగతో వివాదాస్పద వ్యాఖ్యలు చేయిస్తారని తెలిపారు. తాడేపల్లిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మాదిగల ఆత్మగౌరవాన్ని కొన్నేళ్లపాటు మంద కృష్ణ చంద్రబాబు పాదాల వద్ద పెట్టారని చెప్పారు. మళ్లీ ఈ మధ్య ప్రధాని మోదీ పాదాల చెంతపెట్టారని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చాయంటే మంద కృష్ణ మాదిగకు పండుగేనని, చంద్రబాబు రాజకీయాల్లో ప్యాకేజీ అనేది మొదట మంద కృష్ణతోనే ప్రారంభించారని తెలిపారు. ఏపీ రాజకీయాలతో మంద కృష్ణకు ఏం పనని, ఇన్నేళ్ల పాటు ఎమ్మార్పీఎస్ పేరుతో మంద కృష్ణ వెలగబెట్టిన రాజకీయాలు తెలియని వారు ఎవరూ లేరన్నారు. 30న మంద కృష్ణమాదిగ నిర్వహించాలని చూస్తోంది.. మాదిగల సదస్సు కాదనీ, అది టీడీపీ మాయ సభ అని చెప్పారు. ‘దళితులను హేళనచేసిన బాబుకు మద్దతా’ దళితులకు చంద్రబాబు బద్ధ శత్రువని, మంద కృష్ణమాదిగకు డబ్బులిచ్చి మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు దుయ్యబట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మీడియాతో మాట్లాడారు. మంద కృష్ణమాదిగ పెద్ద మొత్తంలో ప్యాకేజీ తీసుకుని మాదిగ సోదరులను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి తాకట్టుపెడుతున్నారని మండిపడ్డారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ దళితులను హేళన చేసిన చంద్రబాబుకు మద్దతివ్వడం దారుణమన్నారు. మాదిగ సామాజిక వర్గానికి సీఎం వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చి నందిగం సురేష్‌కు బాపట్ల ఎంపీగా సీటు ఇవ్వడంతో పాటు హోం మంత్రిగా తానేటి వనిత, మున్సిపల్ శాఖ మంత్రిగా ఆదిమూలం సురేష్‌లకు ఉన్నత పదవులు కట్టబెట్టారని గుర్తుచేశారు. తెలంగాణకు చెందిన మంద కృష్ణకు ఏపీతో సంబంధమేంటని ప్రశ్నించారు. ‘సదస్సును అడ్డుకుని తీరతాం’ మంద కృష్ణ ఈ నెల 30న నిర్వహించే సదస్సును అడ్డుకుని తీరతామని నవ్యాంధ్ర ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు హెచ్చరించారు. అసలు ఏపీలో మాదిగ సదస్సు పెట్టడానికి నీకు ఏ అర్హత ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ కృష్ణమాదిగ నిర్వహించాలనుకున్నది మాదిగల సభ కాదని టీడీపీ ప్రాయోజిత సదస్సుగా అభివర్ణించారు. మాదిగలను ప్రతిసారీ నమ్మించి చంద్రబాబుకు తెగనమ్మడం ఆయనకు పరిపాటిగా మారిందన్నారు. కనీసం బడిలోకి కూడా రానీయకుండా దళితులను దశాబ్దాల తరబడి చదువులకు దూరం చేశారో.. అలాంటి విద్యాశాఖకు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆదిమూలపు సురేష్‌ను మంత్రిగా చేసిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. ప్రత్యేక శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడం ద్వారా తరతరాల దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడారని, సంక్షేమ పథకాలతో వారి బతుకుల్లో వెలుగులు నింపిన వైఎస్ జగన్‌ను అణగారిన వర్గాల ఆత్మ బంధువుగా అభివర్ణించారు. ‘మాదిగలను చంద్రబాబుకు తాకట్టు పెడుతున్న మందకృష్ణ’ మంద కృష్ణమాదిగ మాదిగలను చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నాడని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకారావు అన్నారు. తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. కృష్ణమాదిగ తన వ్యక్తిగత స్వార్థం కోసం మాదిగలను చంద్రబాబుకు తాకట్టు పెట్టాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్.. 2019 ఎన్నికల్లో ఎంపీ సీటును నందిగం సురేష్‌కు కేటాయిస్తే కనీసం మద్దతు కూడా ఇవ్వలేదని, ఓ మాదిగను పార్లమెంట్‌కు పంపిస్తుంటే మద్దతివ్వలేదంటే మంద కృష్ణ స్వార్థాన్ని అర్థం చేసుకోవచ్చని అన్నారు. చంద్రబాబు తప్ప మందకృష్ణ మాదిగను ఏ రాజకీయ పార్టీ నమ్మదన్నారు. మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మంద కృష్ణమాదిగ 10 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని చంద్రబాబును ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. సీట్ల కోసం కాకుండా కాసుల కోసమే వర్గీకరణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని తన ప్రయోజనాలు కాపాడుకుంటున్నారని మండిపడ్డారు. వర్గీకరణ అంశం కేంద్రం చేతిలో ఉందని, కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చారని, ఎన్నికల అనంతరం మాదిగలను పోలీసులతో కొట్టించిన ఘనత చంద్రబాబుదని అలాంటి వ్యక్తికి మందకృష్ణ మాదిగలను తాకట్టు పెట్టడం దారుణమన్నారు. సీఎం వైఎస్ జగన్ వచ్చాకే మాదిగల జీవితాల్లో మార్పు వచి్చందన్నారు. ‘మాదిగలంతా సీఎం జగన్ వెంటే’ రాష్ట్రంలో మాదిగలంతా జగనన్నకు తోడుగా, నీడగా ఉంటారని నవ్యాంధ్ర ఎమ్మార్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి గరుడాద్రి అన్నారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మాదిగలు, మాదిగ ఉప కులాలను గంపగుత్తగా ఒక పార్టీకి తాకట్టు పెట్టే అధికారం మంద కృష్ణకు ఎక్కడిదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటు వేయాలని చెప్పడానికి ఆయనెవరని నిలదీశారు. మంద కృష్ణమాదిగకు మాదిగ జాతి ఇంకా గులాంగిరి చేసేందుకు సిద్ధంగా లేదన్నారు. సీఎం జగనన్న ప్రభుత్వం దళితులకు, అణగారిన ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటోందని, మాదిగలు ఈ విషయాలన్ని గుర్తించి సీఎం జగన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. -
మాదిగలను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాదిగలకు రిజర్వేషన్ల విషయంలో కుట్ర జరుగుతోందని, రాజ్యాంగ బద్ధమైన మాదిగల హ క్కులను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ అన్నారు. మాదిగల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ముందడుగు పడిందని, ఈ విషయాన్ని మందకృష్ణ మాదిగనే చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీలు పదేళ్ల పాటు తెలంగాణ మాదిగలకు అన్యాయం చేశాయని, అప్పుడు తనతో పాటు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మాదిగల పక్షాన గొంతు వినిపించామని పేర్కొన్నా రు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చారగొండ వెంకటేశ్, అధికార ప్రతినిధి జ్ఞానసుందర్లతో కలసి మీడి యాతో మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ కోసం వేసిన అన్ని కమిషన్లు కాంగ్రెస్ హయాంలోనివేనని చెప్పారు. కానీ, మంద కృష్ణ మాదిగ మాత్రం ద్రోహులతో కలసి మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారని, ఆయన బీజేపీ ముసుగులో ఉండి మాట్లాడుతున్నారని ఆరోపించారు. మాదిగల ప్రయోజనాలను మోదీ కాళ్లముందు తాకట్టు పెట్టారని విమర్శించారు. బీజేపీ అగ్రకుల పార్టీ అయితే కాంగ్రెస్ బడుగు, బలహీన వర్గాల పార్టీల అని సంపత్ అన్నారు. నాకు టికెట్ ఇవ్వకపోయినా బాధ లేదు నాగర్‌కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోయినా బాధ లేదని సంపత్ చెప్పారు. తనకు కాంగ్రెస్ పార్టీయే గాడ్‌ఫా దర్ అని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా సామాజిక స్పృహతో పనిచేస్తున్నారని అన్నారు. కానీ, మాదిగ జాతికి అన్యాయం జరిగితే జాతి ప్రయోజనాల కోసం ఎప్పుడైనా అధిష్టానానికి లేఖ రాస్తానని ఆయన స్పష్టం చేశారు. -
ప్రేమోన్మాదికి బెయిల్ రాకుండా చూడాలి..
ఆదిలాబాద్: అలేఖ్య అనే యువతిని పట్టపగలు నడిరోడ్డుపై హత్య చేసిన ప్రేమోన్మాది శ్రీకాంత్‌తో పాటు మిగతా నిందితులకు బెయిల్ రాకుండా చూడాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్‌నగర్ కాలనీలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇదివరకే యువతి వివాహాన్ని చెడగొట్టిన నిందితుడు పోలీసుల సమక్షంలో మరోసారి తప్పుచేయనని ఒప్పుకొన్నప్పటికీ తిరిగి యువతిని అతి దారుణంగా హత్య చేశాడని తెలిపారు. అలాంటి వ్యక్తి బెయిల్‌తో బయటకు వస్తే బాధిత కుటుంబానికి రక్షణ లేకుండా పోతుందని పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో న్యాయవాదులతో పాటు ప్రభుత్వం నిందితుడికి బెయిల్ రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో బాధిత కుటుంబానికి పరోక్షంగా మరోసారి నష్టం జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. సమత కేసు తరహాలో నిందితుడు జైలులో ఉన్నప్పుడే ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టి కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. అలేఖ్య ఘటనలో ప్రభుత్వం పూర్తిస్థాయి బాధ్యత వహించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు తీవ్రంగా గాయపడ్డ మరో యువతిని ఆదుకునేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి రూ.50లక్షల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. ఆయన వెంట నాయకులు నంది రామయ్య, కట్ట శ్రీనివాస్, కావలి సంతోష్, జన్నారపు శంకర్, గొర్రె గంగాధర్, నిట్ట రవి, మురళీకృష్ణ, రాజ్‌కుమార్ తదితరులున్నారు. ఇవి చదవండి: Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి భార్యాభర్తల మోసాలు.. -
ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. శుక్రవారం కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో అయిదు మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. హోం, న్యాయ, గిరిజన సంక్షేమ, సామాజిక న్యాయం, సిబ్బంది, శిక్షణ శాఖల కార్యదర్శులకు ఇందులో చోటు కలి్పంచారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలను పరిశీలించి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు, వీలైనంత త్వరగా తమ నివేదికను అందించేందుకు వీలుగా ఈ కమిటీ ఈనెల 23న తొలిసారి భేటీ కానుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో హైదరాబాద్‌లో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరిగిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు త్వరలో కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని గత నవంబర్ 24న ఆదేశించారు. గౌబా కమిటీ ఏర్పాటుకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. -
బీజేపీకి ఎమ్మార్పిఎస్ మద్దతు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగలు భారతీయ జనతా పార్టీకి మద్దతునివ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి మోదీ, హోం మంత్రి అమిత్ షాలు ఎస్సీల వర్గీకరణకు పూర్తి మద్దతు ప్రకటించడమేకాక దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్నారని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మాటిచ్చి తప్పిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గంలో మాదిగలు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. మాదిగలను మో సం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దని మందకృష్ణ కోరారు. ఎమ్మార్పిఎస్‌కు అనుబంధంగా ఉన్న ఎంఎస్పీ ఇతర విభాగాలు సైతం బీజేపీ గెలుపు కోసం పనిచేస్తాయని తెలిపారు. సోమవారం ఆయ న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. దశాబ్దాల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మాదిగలను ఓటుబ్యాంకు మాదిరి వాడుకుందన్నారు. ఎస్సీల వర్గీకరణ చేయాలని, లేకుంటే మాదిగలు నష్టపోతారని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిషన్లు స్పష్టం చేసినప్పటికీ ఆ ప్రక్రియ పూర్తి చేయలేదన్నారు. ఇంతకాలం ఓట్లు వేసి మోసపోయిన దళితులు, ఇప్పుడు ఆలోచించాలని సూచించారు. బీఆర్ఎస్ సర్కార్ అణచివేసింది.. అదేవిధంగా రాష్ట్రంలో దశాబ్ద కాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులపై దాడులు చేయించిందని, ఎన్నో విధాలుగా అణిచివేసిందని మంద కృష్ణ గుర్తు చేశారు. బీఆర్ఎస్ సర్కార్ దళితులకు భూపంపిణీ చేయకపోగా, గత ప్రభుత్వాలు పంచిన భూమిని లాక్కుందని ఆగ్రహంవ్యక్తం చేశారు. అలాంటి పార్టీకి ఓటు వేస్తే మరింత నష్టపోతామని, మాదిగలు తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశం ఉండటంతో కొంత ఆలస్యం జరగవచ్చని, జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు మందకృష్ణ వివరించారు. గతవారం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం వర్గీకరణపై స్పష్టత ఇచ్చారన్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని, కాంగ్రెస్‌కు ఓటేస్తే రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి సీఎం అవుతారని, బీజేపీకి ఓటేస్తే బీసీ సీఎంతో పాటు ఎస్సీ వర్గీకరణ జరుగుతుందన్నారు. ఈ అంశాన్ని ప్రతిఒక దళిత ఓటరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఎమ్మార్పిఎస్‌కు ప్రధాన శత్రువులు బీఆర్ఎస్, కేసీఆర్ అని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాటలు చెప్పడం తప్ప చేతలుండవని విమర్శించారు. వర్గీకరణ కోసం కేంద్రానికి లేఖ రాయలంటూ గాందీభవన్‌లో వినతిపత్రం ఇస్తే తీసుకుని కనీసం మాట్లాడని వ్యక్తి రేవంత్ అన్నారు. గాం«దీభవన్ సాక్షిగా మాదిగలను రేవంత్ అవమానించారని, అలాంటి పార్టీకి ఓటు ఎందుకేయాలని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్ల తర్వాత జాతీయ పార్టీ నుంచి బీసీ సీఎం హామీ వచ్చిందని, రాష్ట్రంలోని బీసీ కుల సంఘాలన్నీ బీజేపీకి మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలని ఆయన అన్నారు. బీసీ రాజకీయ రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఆర్.కృష్ణయ్య తక్షణమే బీజేపీకి మద్దతు ప్రకటించాలని మందకృష్ణ కోరారు. -
మందకృష్ణ మాదిగ 25 కోట్లు అడిగారు: కేఏ పాల్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేద్దామంటే తమ పార్టీకి సింబల్ ఇవ్వలేదని, దీని పై హైకోర్టుకు వెళ్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబపాలనకు చరమగీతం పా డాలన్నారు. ‘మా పార్టీలో చేరాలని మందకృష్ణ మాదిగను కోరితే, రూ. 25 కోట్లు అడిగారని, ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీకి ఆయన అమ్ముడుపోయారు’అని ఆరోపించారు. మరోవైపు సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన మాదిగల బహిరంగసభ నిమిత్తం మందకృష్ణకు రూ.72 కోట్లు ముట్టాయని, ఎంపీ పదవి ఇస్తారని ఆశతోనే ఆయన అమ్ముడుపోయారని విమర్శించారు. మాదిగలకు మోదీ ఇన్నిరోజుల్లో చేయని న్యాయం ఇప్పుడు చేస్తారా అని కేఏ పాల్ నిలదీశారు. చదవండి: కేసీఆర్‌కు కోటి అప్పు ఇచ్చిన వివేక్ -
మోదీ మాస్టర్ మైండ్.. తెలంగాణలో బీజేపీ ప్లాన్ సక్సెస్!
తెలంగాణ శాసనసభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగానే ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో మాదిగ సామాజికవర్గాన్ని ఉద్దేశించి విశ్వరూప సభలో చేసిన ప్రసంగం, ఆ వర్గం నేత మంద కృష్ణను పొగిడిన తీరు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కొన్ని రోజుల క్రితం ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ కాస్త నిస్సారంగా జరిగితే , పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సభ మాంచి జోష్‌గా జరిగింది. తొలి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నప్పటికీ, ఆయన చాలా డల్‌గా మాట్లాడటం, మోదీ సైతం మొక్కుబడిగా పవన్ పేరు ప్రస్తావించడం జరిగింది. అదే శనివారం జరిగిన భారీ సభలో మంద కృష్ణను ఉద్దేశించి ఆయన పలుమార్లు మాట్లాడిన విషయాలు, అన్నిటికి మించి తాను కూడా కృష్ణ నాయకత్వంలో పనిచేస్తానని, వర్గీకరణ పోరాటానికి అండగా ఉంటానని, సమస్య పరిష్కారానికి కమిటీని నియమిస్తామని చెప్పిన తీరు మాదిగ సామాజికవర్గాన్ని ఆనందంలో ముంచెత్తిందని చెప్పాలి. వినడానికి కొంచెం అతిగా ఉన్నా, ఆయన స్పీచ్‌తో సభికులంతా హర్షద్వానాలతో మోత మోగించారు. మోదీ, మంద కృష్ణ మద్య జరిగిన ఉద్వేగ భరిత సన్నివేశాలు కూడా అందరిని ఆకట్టుకున్నాయి. కృష్ణ ప్రధానిని కౌగించుకుని, కంట తడిపెట్టడం, దానికి ఆయన ఓదార్చడం తదితర సన్నివేశాలు ఉత్కంఠభరితంగా సాగాయి. అలాగే కృష్ణ కూడా తన ప్రసంగంలో మోదీని ఆకాశానికి ఎత్తుతూ ఉపన్యాసం చేశారు. మరో విశేషం ఏమిటంటే ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించకపోవడం. తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఇది ఒక కీలక ఘట్టమే అనిపిస్తుంది. ప్రత్యేకించి తెలంగాణలో మాదిగ వర్గం అత్యధికంగా ఉంటారు. మంద కృష్ణ మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో పలుమార్లు భారీ సభలు జరిగాయి. దాదాపు అన్ని పార్టీలు వర్గీకరణకు మద్దతు ఇచ్చినా కేంద్రంలో ఉషా మెహ్రా కమిటీ సిఫారస్ చేయకపోవడంతో అది ఆగిపోయింది. సుప్రీంకోర్టులో కూడా ఈ విషయం పెండింగ్‌లో ఉంది. మాల సామాజికవర్గం వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో రాజకీయ పార్టీలు కూడా గందరగోళంలో పడ్డాయి. అయితే, బీజేపీ తొలి నుంచి ఈ డిమాండ్‌కు మద్దతు ఇస్తోంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఇందుకోసం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడమే కాకుండా, అధిష్టానంతో దీనిపై సంప్రదింపులు కూడా చేశారు. అయినా అది ఒక కొలిక్కి రాలేదు. విశేషం ఏమిటంటే మోదీ అధికారంలోకి వచ్చి కూడా తొమ్మిదిన్నరేళ్లు అయింది. బీజేపీ ఆధ్వర్యంలోని ఆయన ప్రభుత్వం కూడా మరి ఎందుకు ఇన్నాళ్లు పరిష్కరించలేదన్న ప్రశ్న వస్తుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే మాదిగ వర్గాన్ని ఆకట్టుకోవడానికి వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేసినట్లు అర్ధం అవుతుంది. ఈ సందర్భంగా మోదీ చేసిన ప్రసంగంలో దళిత ప్రముఖ నేతలు అంబేద్కర్, జగ్జీవన్ రామ్ వంటి వారికి కాంగ్రెస్ నుంచి అవమానాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. అంతేకాక రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్‌ను ఎంపిక చేసినా, తదుపరి గిరిజన నేత మర్మును ఎంపిక చేసినా, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని ఆయన విమర్శించారు. రామ్ విలాస్ పాశ్వాన్ , బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంజీలకు బీహార్ సీఎం నితీష్ కుమార్ నుంచి అవమానాలు వచ్చాయని ఆయన అన్నారు. ప్రఖ్యాత దళిత కవి గుర్రం జాషువా రాసిన గబ్బిలం కవిత్వంలోని కాశీ అంశాన్ని ప్రస్తావించి, తాను అదే కాశీ నుంచి ఎంపీ అయ్యాయని ఆయన సెంటిమెంట్ ప్రయోగించారు. గుర్రం జాషువా ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందినవారు. తెలంగాణలో మాదిగ వర్గానికి చెందిన మాజీ మంత్రి టి.ఎన్. సదాలక్ష్మి, టివి నారాయణల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇదంతా తెలంగాణలోని దళితులు, ముఖ్యంగా మాదిగలను తిప్పుకోవడానికి మోదీ చేసిన ప్రయత్నమే అన్న సంగతి తెలుసుకోవడం కష్టం కాదు. ఈ విషయంలో కొంతమేర మోదీ సఫలీకృతం అయినట్లు అనుకోవచ్చు. ఎందుకంటే గత సభ కంటే భారీ ఎత్తున జనం రావడం, తమ డిమాండ్ కు అనుకూలంగా ప్రధాని ఉండటం, తమ నేత మంద కృష్ణను పదేపదే ఆయన ప్రస్తావించడంతో కేరింతలు కొట్టిన తీరు సహజంగానే బీజేపీకి కొంత ఊపు ఇస్తుంది. అదే సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను విమర్శించడం ఆయన మానలేదు. బీఆర్ఎస్ గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామన్న హామీని విస్మరించిందని, మూడు ఎకరాల భూమి చొప్పున ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, దళిత బంధులో వివక్ష చూపుతున్నారని మోదీ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ మాదిరే కాంగ్రెస్ కూడా దళితులకు అన్యాయం చేసే పార్టీగా ఆయన అభివర్ణించారు. ఈసారి ఇరిగేషన్ స్కామ్ అంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణ చేశారు. లిక్కర్ స్కామ్ గురించి కూడా ప్రస్తావించి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ సహకరిస్తోందని, ఆప్ స్కామ్‌లో బీఆర్ఎస్ భాగస్వామి అయిందని ఆయన అంటూ, తెలంగాణ ఎన్నికలలో బీఆర్ఎస్ , కాంగ్రెస్‌లు డ్రామా ఆడుతున్నాయని ఆయన అన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం దళిత వర్గాలకు, రైతులకు చేపట్టిన వివిధ స్కీముల గురించి కూడా మోదీ వివరించారు. ఈ సంగతులు చెబుతున్నప్పుడు పెద్దగా స్పందన లేదు కానీ, వర్గీకరణ అంశాన్ని మోదీ ప్రస్తావించినప్పుడల్లా పెద్ద ఎత్తున హర్షద్వానాలు వచ్చాయి. మోదీ మొత్తం ఆ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే యత్నం చేశారు. వర్గీకరణ అంశం న్యాయ వ్యవస్థ పరిధిలో ఉందని చెబుతూనే, కమిటీ ద్వారా పరిష్కారం చేసే యత్నం జరుగుతుందని, మాదిగల ఉద్యమంలో తాను కూడా ఉంటానని చెప్పడం విశేషం. ఇక, సమస్యను పరిష్కరించవలసిన ప్రధాని తాను కూడా పోరాడతానని అనడం వినడానికి కొంత ఆశ్చర్యంగానే ఉన్నా, ఎన్నికల నేపథ్యంలో వారిని ఆకట్టుకోవడానికి ఈ డైలాగు వాడినట్లు అనిపిస్తుంది. ఈ నెలాఖరులో ఎన్నికల ప్రచారం ముగియడానికి ముందు మూడురోజులు మోదీ సభలు తెలంగాణలో పెట్టబోతున్నారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందనుకున్న సమయంలో మోదీ వచ్చి దానిని పైకి లేపడానికి చేస్తున్న కృషి ఎంతవరకు సఫలం అవుతుందన్నది చూడాలి. మాదిగ వర్గం ఓట్లను ఆకర్షించడం వరకు కొంత సఫలం అయినట్లే లెక్క. కాకపోతే పూర్తి స్థాయి విజయానికి ఇది సరిపోతుందా అన్నది డౌటు!. :కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ కోరిక అత్యంత న్యాయమైనదని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మూడు దశాబ్దాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) చేస్తున్న ఉద్యమం సరైనదని, త్వరలో మాదిగల ఆకాంక్షను తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాదిగ ఉప కులాల ఉద్యమానికి బీజేపీతోపాటు కేంద్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీం కోర్టులో విచారణలో ఉందని, ఈ క్రమంలో న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటానని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్లలో మాదిగలు, మాదిగ ఉపకులాలకు తీరని అన్యాయం జరుగుతోందని, ఎస్సీ జాబితాలో ఉన్న కులాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభ జరిగింది. ఈ సభలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వం సామాజిక న్యాయానికే కట్టుబడి ఉందని చెప్పారు. దళితులు, గిరిజనులు, ఇతర అణగారిన వర్గాల అభ్యున్నతే తమ లక్ష్యమన్నారు. గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని మరో ఐదేళ్లు కొనసాగించనున్నట్లు తెలిపారు. తెలుగు కవి గుర్రం జాషువా కవితల ప్రేరణతో పాలన సాగిస్తున్నామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నారని, వన్ లైఫ్.. వన్ మిషన్లా చేస్తున్న ఈ ఉద్యమం స్పూర్తినిచ్చిందని తెలిపారు. తెలంగాణలో దళితులకు బీఆర్ఎస్ తీరని అన్యాయం చేసిందని అన్నారు. అధికారం చేపట్టిన మొదటిరోజే దళిత ముఖ్యమంత్రి హామీని తొక్కేశారని, సీఎం కుర్చీని కేసీఆర్ కబ్జా చేశారని అన్నారు. దళితబంధు అంటూ వేలకోట్ల రూపాయలను వారి పార్టీ నేతల విధేయులు, కార్యకర్తలకు పంచిపెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దళితులను ఎన్నోరకాలుగా అవమానపర్చిందని, అంబేడ్కర్‌ను రెండుసార్లు ఎన్నికల్లో ఓడించిందని తెలిపారు. ఆయనకు భారతరత్న ఇవ్వలేదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చామని చెప్పారు. బాబూ జగ్జీవన్‌రామ్‌ను కాంగ్రెస్ వేధించిందన్నారు. మా ఆకాంక్షలు నెరవేర్చేది మోదీయే: మంద కృష్ణ దళితుల ఆకాంక్షలు నెరవేర్చేది ప్రధాని మోదీ మాత్రమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చెప్పారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మాదిగ వ్యక్తి లేరని మండిపడ్డారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని, ఎస్సీ వర్గీకరణ జరిగితేనే ఫలాలు అందుతాయని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ సమస్యను కూడా పరిష్కరించాలని మోదీని కోరుతున్నానంటూ మంద కృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. మోదీ మంద కృష్ణను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. -
మోదీ దళిత వర్గాలకు అండగా నిలిచారు: మందకృష్ణ మాదిగ
-
మాదిగ విశ్వరూప మహాసభ..మోడీ బహిరంగ సభ
-
మోదీ ఆలింగనం.. మందకృష్ణ కంటతడి
సాక్షి, హైదరాబాద్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మా) జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కంటతడి పెట్టారు. శనివారం పరేడ్ గ్రౌండ్లో మాదిగల విశ్వరూప సభకు హాజరైన ప్రధాని మోదీ ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు. దీంతో మందకృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని మోదీ పక్కనే కూర్చున్న మందకృష్ణ.. కంటతడి పెట్టారు. అది గమనించిన ప్రధాని మోదీ.. ఆయన భుజంపై తడుతూ ఓదార్చారు. ఈ క్రమంలో ఆయన్ని మరోసారి హత్తుకుని ఓదార్చారాయన. పరేడ్‌గ్రౌండ్‌లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలోనే మాదిగ విశ్వరూప సభ జరిగింది. ‘‘దశాబ్దాలుగా మమ్మల్ని మనుషులుగా చూడలేదు. మేం ఊహించని కల ఇది. బలహీన వర్గాల నుంచి దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన వ్యక్తి మోదీ. మా సామాజిక వర్గానికి ధైర్యం చెప్పడానికి వచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. మన సమస్యలు పరిష్కరించడానికి ప్రధానే స్వయంగా వచ్చారు. అత్యంత వెనుకబడిన మాదిగలకు తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దళితుడ్ని రాష్ట్రపతి చేసిన ఘనత మోదీది. రెండోసారి అధికారం చేపట్టాక ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేశారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం’’ అని మందకృష్ణ ఈ వేదికపై భావోద్వేగంగా ప్రసంగించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ తన కుర్చీలోంచి లేచి సభకు హాజరైన జనసందోహంను చూస్తూ వంగి నమస్కరించారు. -
ఎస్సీ వర్గీకరణకు త్వరలోనే కమిటీ: ప్రధాని మోదీ
ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. మాదిగలకు న్యాయం చేస్తాం. ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలోనే కమిటీ వేస్తాం. ఎస్సీ వర్గీకరణం కోసం జరుగుతున్న పోరాటానికి మా మద్దతు ఉంటుంది. మీ మాదిగ సామాజిక సామాజిక వర్గానికి న్యాయం జరగాలన్నదే మా ఆకాంక్ష. ఈ పోరాటంలో మందకృష్ణ నా నాయకుడు.. నేను ఆయన అసిస్టెంట్‌ను. అన్ని వర్గాలకు న్యాయం.. బీజేపీ లక్ష్యం. :::సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మాదిగ విశ్వరూప సభ వేదిక దేశ ప్రధాని మోదీ హామీ ప్రధాని మోదీ ప్రసంగం హైలైట్స్ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ.. సమ్మక్క-సారలమ్మ, యాదాద్రి నరసింహుడికి నమస్కారం మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చిన నా బంధువులకు అభినందనలు పండుగ సమయంలో మనకు కావాల్సిన వాళ్ల మధ్య ఉంటే ఆనందం రెట్టింపు అవుతుంది ఈ సభకు హాజరు కావడం.. నా కుటుంబ సభ్యులతో గడిపినంత ఆనందంగా ఉంది మందకృష్ణ నా చిన్నతమ్ముడిలాంటివాడు మా ప్రభుత్వ తొలి లక్ష్యం పేదరిక నిర్మూలన అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం చేసేందుకు బీజేపీ కట్టుబడి ఉంది స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నో ప్రభుత్వాలను చూశారు ఆ ప్రభుత్వాలు.. మా ప్రభుత్వానికి ప్రజలు తేడా గమనించాలి సబ్కా సాథ్.. సబ్కా వికాస్.. అనేది మా విధానం పేదరిక నిర్మూలనే మా ప్రథమ ప్రాధాన్యం. న్యాయం చేస్తామని అనేక పార్టీలు మిమ్మల్ని వాడుకున్నాయి మీరంతా వన్ లైఫ్.. వన్ మిషన్లా పోరాటం చేస్తున్నారు మీ బాధలు పంచుకునేందుకే నేను వచ్చాను కాశీ నాథుడి దీవెనలతో నేను మీ ముందు ప్రధానిగా ఉన్నాను గుర్రం జాషువా తన కష్టాల్ని కాశీ విశ్వేశరుడికి విన్నవించుకున్నారు బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు అండగా నిలిచింది స్వాతంత్రం వచ్చాక అనేక ప్రభుత్వాలు వచ్చాయి.. సామాజిక న్యాయం అమలు చేసింది బీజేపీ మాత్రమే అన్ని ప్రభుత్వాలు మాదిగలను మోసం చేశాయి గత ప్రభుత్వాలు చేసిన పాపాల్ని ప్రక్షాళన చేసేందుకే నేను వచ్చా ఇన్నాళ్లూ రాజకీయ పార్టీలు చేసిన వాగ్దానాలు చేసి మాట తప్పినందుకు క్షమించమని కోరుతున్నా మందకృష్ణ 30 ఏళ్లుగా ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నారు మందకృష్ణ పోరాటానికి మేం అండగా ఉంటాం మాదిగల పోరాటానికి నా సంపూర్ణ మద్దతు పదేళ్లుగా ఇక్కడి ప్రభుత్వం మాదిగల్ని మోసం చేసింది దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారు పదేళ్ల కిందట ఇక్కడ ఏర్పడిన ప్రభుత్వం.. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు దళిత బంధు వల్ల ఎంత మందికి లాభం జరిగింది? బీఆర్ఎస్ నేతల బంధువుల స్కీమ్‌గానే దళిత బంధు మారింది బీఆర్ఎస్ నేతలకే దళితబంధు ఇచ్చి చేతులు దులుపుకుంది బలిదానాలు కాదని.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు దళితులకు మూడెకరాలు ఇస్తామని ఈ ప్రభుత్వం మోసం చేసింది రైతులకు రుణమాఫీ ఇస్తామని మోసం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ పేరుతో స్కాం చేసింది ఢిల్లీలో ఆప్‌తో కలిసి బీఆర్ఎస్ వేల కోట్ల అవినీతి చేసింది అభివృద్ధి కోసం పార్టీలు కలిసి పని చేయాలి కానీ అవినీతి కోసం కాదు అంబేద్కర్ విధానాలకు బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు తూట్లు పొడిచాయి కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి జాగ్రత్తగా ఉండాలి రాష్ట్రపతిగా దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను ఓడించే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది ఆదివాసీ అయిన ముర్ము కూడా కాంగ్రెస్ ఓడించాలనుకుంది బీజేపీ హయాంలోనే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబేద్కర్ చిత్రపటం పెట్టాం అంబేద్కర్‌కు కాంగ్రెస్ భారత రత్న ఇవ్వలేదు.. ఆ ఘనత బీజేపీదే రాజస్థాన్‌లోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన దళితుడిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌ను చేశాం అంబేద్కర్‌ను రెండుసార్లు గెలవకుండా చేసింది కూడా కాంగ్రెస్సే బీఆర్ఎస్లాగే.. కాంగ్రెస్ చరిత్ర కూడా అణగారిన వర్గాలకు, బీసీలకు వ్యతిరేకం బీఆర్ఎస్తో ఎంత జాగ్రత్తగా ఉంటారో.. కాంగ్రెస్‌తోనూ అంతే జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్, బీఆర్ఎస్లు తెర వెనుక రాజకీయం నడుపుతున్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకవైపు.. బీజేపీ ఒకవైపు ఉంది పేదవారికి గ్యాస్ కనెక్షన్లు, బ్యాంక్ రుణాలు అందిస్తున్నాం నాలుగు కోట్ల మందికి పీఎం ఆవాస్ యోజన ద్వారా ఇళ్లు కట్టించాం బడుగు బలహీన వర్గాలకు కావాల్సిన సంక్షేమ పథకాలను బీజేపీ అందిస్తోంది మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభలో మందకృష్ణ ప్రసంగం.. దశాబ్దాలుగా మమ్మల్ని హీనంగా చూశారు 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నాం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూశారు మేం ఊహించని కల ఇది మా సభకు ప్రధాని మోదీ వస్తారని ఊహించలేదు మా సామాజిక వర్గానికి ధైర్యం చెప్పేందుకు వచ్చిన మోదీకి కృతజ్ఞతలు మాదిగల్ని కేసీఆర్ అణచివేస్తే.. మోదీ పదవులిచ్చారు బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన దమ్మున్న నాయకుడు మోదీ అత్యంత వెనుకబడిన మాదిగలకు తెలంగాణ మంత్రి వర్గంలో చోటు లేదు ఒక్క శాతం కూడా లేని వెలమకు నాలుగు మంత్రి పదువులు ఇచ్చారు అంబేద్కర్ ఆశయాల్ని అమలు చేసింది మోదీ మాత్రమే దళితుడ్ని రాష్ట్రపతి చేసిన ఘనత మోదీది రెండోసారి నెగ్గాక ప్రధాని మోదీ ఓ గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేశారు మోదీ దళిత వర్గాలకు అండగా నిలుస్తున్నారు సామాజిక న్యాయంపై కాంగ్రెస్, బీఆర్ఎస్లు మాటలు మాత్రమే చెప్తున్నాయి సామాజిక న్యాయం అమలు చేస్తున్న మోదీకి ధన్యవాదాలు కేసీఆర్ మాదిగలను అణిచివేశారు దళితున్ని సీఎం చేస్తానని హామీ ఇచ్చి కేసీఆర్ మోసం చేశారు దేశాన్ని ఆదుకునే విషయంలో దేశాన్ని కాపాడే విషయంలో మిమ్మల్ని(మోదీని ఉద్దేశించి..) మించిన నాయకుడు లేడు పెద్దన్నగా మా కోసం వచ్చిన మోదీ వర్గీకరణపై మాకు హామి ఇవ్వాలని రెండు చేతులెత్తి దండం పెడుతున్నా ►మందకృష్ణ మాదిగ భావోద్వేగం.. ఓదార్చిన ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్ మాదిగ విశ్వరూప సభ వేదికగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమార్పీఎస్) జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సభ ప్రారంభానికి ముందు వేదికనెక్కిన ప్రధాని మోదీ, మందకృష్ణను ఆలింగనం చేసుకున్నారు. దీంతో.. భావోద్వేగానికి లోనై మందకృష్ణ కంటతడి పెట్టారు. దీంతో.. తన పక్కనే కూర్చున్న మందకృష్ణను ప్రధాని మోదీ వీపుతట్టి ఓదార్చారు. ఇక సభ ముగిసే ముందర మందకృష్ణ పోరాటానికి మొబైల్ ఫోన్ టార్చ్‌లు ఆన్ చేసి మద్దతు తెలపాలని ప్రధాని మోదీ కోరగా.. సభకు హాజరైన జనం సెల్‌ఫోన్ టార్చ్‌లతో సంఘీభావం తెలిపారు. ఆఖర్లోనూ వెళ్లిపోయే ముందర మందకృష్ణ కంటతడి పెట్టగా.. మోదీ ఓదార్చి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. బండి సంజయ్, లక్ష్మణ్‌లు మందకృష్ణను ఓదార్చడం గమనార్హం. ►మాదిగల విశ్వరూప సభకు హాజరైన ప్రధాని మోదీ ►సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న ప్రధాని ►బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ ► ఎస్సీ వర్గీకరణపై ప్రకటన? పరేడ్ గ్రౌండ్లో అణగారిన వర్గాల(మాదిగల) విశ్వరూప మహాసభ ఈ వేదిక నుంచి ఎస్సీ వర్గీకరణ ప్రకటన? మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి – MRPS నిర్వహిస్తున్న మాదిగ విశ్వరూప మహాసభ స్వయంగా ప్రకటన చేయనున్న ప్రధాని మోదీ! ►కాస్త ఆలస్యంగా రానున్న మోదీ 20 నిమిషాలు ఆలస్యంగా హైదరాబాద్‌కు నరేంద్రమోదీ సాయంత్రం 5.05 గంటలకు బేగంపేట విమానాశ్రయనికి చేరుకోనున్న నరేంద్రమోదీ ముందుగా 4.45 గంటలకు షెడ్యూల్ చేసిన PMO పీఎంవో షెడ్యూల్ చేసిన సమయం 20 నిమిషాల ఆలస్యంగా షెడ్యూల్ 5.25 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు నరేంద్రమోదీ 40 నిమిషాల పాటు పరేడ్ గ్రౌండ్స్‌లో నరేంద్రమోదీ సభ తర్వాత నేరుగా ఢిల్లీకి పయనం ►హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ప్రధాని మోదీ నగర పర్యటన సందర్భంగా.. సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు శనివారం రాత్రి 8 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలు పంజాగుట్ట-గ్రీన్‌ల్యాండ్, బేగంపేట నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు, టివోలి ఎక్స్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్ల మధ్య రోడ్లను మూసివేత బేగంపేట నుంచి సంగీత్ ఎక్స్ రోడ్స్ వైపు వెళ్లే వాహనదారులు సీటీవో ఎక్స్ రోడ్స్ వద్ద బాలమ్ రాయ్, బ్రూక్‌బాండ్, తివోలి, స్వీకార్ ఉపకార్, వైఎంసీఏ, సెయింట్ జాన్సన్ రోటరీ మీదుగా వెళ్లాలని సూచన సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో బీజేపీ తరఫున ప్రచారం కోసం వారం వ్యవధిలోనే రాజధాని హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రానున్నారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ‘అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ’ జరగనుంది. బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. -
బీఆర్ఎస్కు రోజులు దగ్గరపడ్డాయి
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గరపడ్డాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. సూర్యాపేట వేదికగా ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యపై మంత్రి జగదీశ్‌రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వట్టె జానయ్యపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పలు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జానయ్య సతీమణి రేణుక యాదవ్‌తో కలసి హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ..బీసీ వర్గానికి చెందిన వట్టె జానయ్య సూర్యాపేటలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించిన మరుసటి రోజు నుంచి వారం రోజుల వ్యవధిలో ఆ వ్యక్తిపై 90 కేసులు పెట్టడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వట్టె జానయ్యపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం ఎత్తివేయకుంటే సూర్యాపేటలో రెండు లక్షల మందితో బహిరంగ సభను నిర్వహించి బీఆర్ఎస్కు వణుకుపుట్టిస్తామని మందకృష్ణ హెచ్చరించారు. ప్రతి సందర్భంలో తమను కాళ్లకు మొక్కేలా జగదీశ్‌రెడ్డి ప్రవర్తించారంటూ రేణుక యాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం అంతరించిపోయిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు ఆరోపించారు. జానయ్య సోదరుడు కృష్ణయాదవ్, పలు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
పంజగుట్ట: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణకు చట్ట బద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ శనివారమిక్కడ డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆదివారం నుంచి సమావేశాలు పూర్తయ్యే 22 వరకు ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. 3న జాతీయ స్థాయిలో అన్ని జిల్లా కేంద్రాల్లో ముఖ్య నేతల సమావేశాలు, 4, 5 తేదీల్లో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు సమర్పించడం, 6న జాతీయస్థాయిలో అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు, 7న అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన, 8న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహారదీక్షలు, 9న అన్ని మండలాల కేంద్రాల్లో నిరాహారదీక్షలు, 18న ఢిల్లీలో మాదిగ ఉద్యోగుల నిరాహార దీక్ష, 19న ఢిల్లీలో మాదిగ మేధావులు, విద్యావంతుల దీక్ష, 20న మాదిగ జర్నలిస్టుల దీక్ష, 21న మాదిగ కళామండలి దీక్ష, 22న మాదిగ లాయర్ల దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
నేనంటే కేసీఆర్‌కు భయం
సాక్షి, హైదరాబాద్: తనను చూసి కేసీఆర్ భయపడుతున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గంలో దళిత బంధు అక్రమాలపై నిరసన తెలపడానికి బయలుదేరిన ఆమెను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయంటూ జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామస్తులు ఇటీవల ఆందోళన చేశారు.ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకున్న షర్మిలను, అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల పోలీసులకు హారతి ఇచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. గజ్వేల్‌లో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. పోలీసులు సీఎం కేసీఆర్ తొత్తుల్లా పని చేయడం మానుకోవాలన్నారు. తనను అడ్డుకున్నందుకు నిరసనగా లోటస్‌పాండ్‌లోని తన నివాసం వద్ద షర్మిల దీక్షకు దిగారు. సాయంత్రం వరకు కొనసాగిన ఆమె దీక్షను తీగుల్ గ్రామస్తులు వచ్చి నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. షర్మిల నిరాహార దీక్షకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మద్దతు తెలిపారు తొమ్మిదేళ్లుగా గుడిసెల్లోనే.. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తాను వెళ్లాలనుకున్న తీగుల్ గ్రామంలో దళితులు తమ ఇళ్ల ఫొటోలు పంపి, వారి కోసం కొట్లాడాలని వినతి పత్రం పంపించారన్నారు. రెండు సార్లు కేసీఆర్‌కు ఓట్లేసి గెలిపించినా.. తొమ్మిదేళ్లుగా ఈ ప్రజలు ఇంకా గుడిసెల్లోనే ఉంటున్నారన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్‌లోనే దళిత బంధు ఇంత దరిద్రంగా అమలవుతుంటే ఇతర నియోజకవర్గాల్లో ఎలా అమలవుతుందో ఊహించుకోవచ్చన్నా రు. రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలుంటే.. ఇప్పటి వరకు 38 వేల కుటుంబాలకే దళిత బంధు అమలైందన్నారు. ప్రతి ఒక్కరికీ దళితబంధు పథకం అమలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. -
మందకృష్ణ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోసమే రైతు రుణమాఫీ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నాలుగేళ్లలో రైతులపై పడ్డ వడ్డీని ఎవరు కడతారని ప్రశ్నించారు. ఇప్పుడు చేస్తున్న రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోవని విమర్శించారు. చేస్తుంది రుణమాఫీనా? వడ్డీ మాఫినా అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. మంగళవారం రేవంత్ మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే కేసీఆర్ రుణమాఫీ, నోటిఫికేషన్లు, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానంటున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ ఏది చేసినా ప్రజలు నమ్మరని, బీఆఆర్ఎస్ ప్రభుత్వం హడావుడిగా అమ్మిన భూములపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సమీక్షిస్తామని తెలిపారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఎస్సీ వర్గీకరణ ఎవరి పేటెంట్ కాదని వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌కు స్పష్టమైన విధానం ఉందని, తమ కమిట్మెంట్కి ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. ధామాషా పద్దతి ప్రకారం వర్గీకరణ ఎలా చేయాలో తమకు తెలుసన్నారు. ఎవరి వకాల్తాలు తమకు అవసరం లేదని, ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. చదవండి: తెలంగాణలో మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శం: కేటీఆర్ బెదిరించే వారు ఎవరికి మద్దతు ఇచ్చారో వారినే అడిగితే మంచిదని హితవు పలికారు. ఒకరికి మద్దతు ఇచ్చి.. మరొకరిని డిమాండ్ చేయడం కరెక్ట్ కాదన్నారు. వర్గీకరణ పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ ఏంటో తెలుసని, రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్ అని తెలిపారు. మాట ఇచ్చిన వాళ్ళని ప్రశ్నించి మీ చిత్తశుద్ది నిరూపించుకోండని మందకృష్ణకి పరోక్షంగా చురకలు అంటించారు బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి దేవుడు ఇచ్చిన అన్న కదా.. అయన్ని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి ఎందుకు పార్లమెంట్లో మాట్లాడం లేదని ప్రశ్నించారు. వాళ్ళ ప్రభుత్వంపై ఎందుకు ఓత్తిడి తేవడం లేదన్నారు. మాట ఇచ్చి అమలు చేయని వారిని నిలదీసి మీ చిత్తశుద్ధి నిరూపిస్తే కొంతైనా మీకు గౌరవం ఉంటుందని రేవంత్ హితవు పలికారు. -
గాంధీభవన్‌లో కాంగ్రెస్‌పైనే మందకృష్ణ విమర్శలు!
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌కు వచ్చి కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు సంధించారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ బిల్లు పెట్టమంటే పెట్టలేదు. ప్రతిపక్ష పాత్రలో లేఖ రాయండని అడిగినా.. రాయలేదు. ఎస్సీ వర్గీకరణకు అండగా ఉంటేనే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తాం అని తెలిపారాయన. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్‌పై అభిప్రాయాలు తీసుకోవడానికి గాంధీభవన్‌కు ఆయన నేతృత్వంలోని బృందం వెళ్లింది. ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్‌రావు థాక్రే సమక్షంలో కాంగ్రెస్ నేతలకు ఎస్సీల్లో ఏ, బీ, సీ, డీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్‌కు ఆయన వినతిప్రతాలు సమర్పించారు. వర్గీకరణ అంశం సామాజిక అంశంగా గుర్తించిందే కాంగ్రెస్. ఎస్సీ వర్గీకరణ చీలీకల సమస్య కాదు. ‘‘మా ఆకాంక్ష వర్గీకరణ అంశంపై పీసీసీ రేవంత్, ఇంచార్జ్ ఠాక్రే ,భట్టికి తెలియజేసాం. ఎస్సీ వర్గీకరణ పోరాటం దళితుల మధ్య చీలిక అంశం కాదు. సామాజికాంశం. అసమానతలను పరిష్కరించడం కోసమే వర్గీకరణ అంశం. అన్ని కులాలను సమానంగా చూడడమే వర్గీకరణ. ► ఎస్సీ రిజర్వేషన్స్ ఫలాలు అన్ని కులాలకు అందడం లేదని అప్పటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి 1965లో లోకూర్ కమిటి ని నియమించింది. పంజాబ్ లో 1974 నుండి ఇప్పటి వరకు ఎస్సి వర్గీకరణ అమలు కావడం లేదు. ఎస్సి రిజర్వేషన్స్ వర్గీకరణ ను కాంగ్రెస్ సమర్థించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ కోసం వైఎస్సార్ చంద్రబాబు పై ఒత్తిడి తెచ్చారు. వైఎస్సార్ హయాంలో పార్లమెంట్ లో వర్గీకరణ అంశంపై తీర్మానం చేశారు. కేంద్రం ద్వారా వర్గీకరణ చేసే అంశం రాష్ట్రాలకు ఇస్తామని 2009 లో కాంగ్రెస్ మేనిఫెస్టో లో పెట్టింది. 2018లో రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ కట్టబెట్టాలంటూ కేంద్రం పై ఓత్తిడి తెస్తామంటూ మేనిఫెస్టో లో పెట్టారు. ► తమిళనాడులో జనార్దన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ తో dmk వర్గీకరణ అమలు చేస్తుంది. పార్లమెంట్ లో బిల్లు పెడితే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని లేఖలు రాశారు. 10 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న వర్గీకరణ బిల్లు పెట్టలేదు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని 9 ఏళ్లుగా కోరుతున్నా.2018 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతు తెలిపాం. ఇక్కడ ముగ్గురు ఎంపి లు గెలిచిన ఏనాడూ ప్రశ్నించలేదు. పార్లమెంట్ లో రేవంత్ మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు ఎస్సీ వర్గీకరణ పై మాట్లాడాల్సి ఉంటే బాగుండేది. ఆరు సంవత్సరాలు అవుతున్న అసెంబ్లీ లో వర్గీకరణ పై సిఏల్పి నేత బట్టి విక్రమార్క మాట్లాడలేదు. ► రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో జరిగిన సమావేశం లో ఎస్సి వర్గీకరణ కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు. గద్వాల్ సభలో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేస్తామని తెలిపారు.అయితే జనాభా ప్రతిపాదికాన మాదిగలకు టికెట్లు కేటాయించలేదు. వర్గీకరణ మీద అనుకూలమని మీరు చెబితే ప్రధాని కి లేఖ రాయాలి. పార్లమెంట్ లో వర్గీకరణ పై ప్రైవేట్ బిల్లు పెట్టాలి అని కోరాను. రేవంత్, ఠాక్రే మాకు అనుకూలంగా వస్తుంది అన్నారు. వారు మాకు అనుకూలంగా లెటర్ ఇస్తే మా నిర్ణయం చెబుతాం అని చెప్పాం. వర్గీకరణ పై కాంగ్రెస్ స్టాండ్ నిజాయితీగా ఉండాలి. లేదంటే రాజకీయంగా సీరియస్‌గా ఉంటాం అని మందకృష్ణ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించేవారి నుంచి దరఖాస్తులకు ఫీజులు! మరోవైపు టీకాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కొనసాగుతోంది. టికెట్ ఆశించేవారి నుంచి దరఖాస్తు తీసుకోవాలని, దరఖాస్తుదారుల నుంచి ఫీజులు వసూలు చేయాలని, ఓసీలకు రూ.10వేలు, ఎస్సీ-ఎస్టీలకు అభ్యర్థులకు రూ.2,500 తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: గజ్వేల్‌లో దళిత బంధుకోసం రోడ్డెక్కారు! -
అనాథ పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే
సాక్షి, హైదరాబాద్: అనాథ పిల్లల సంరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఇందుకు ప్రత్యేక విధానాన్ని ప్రకటించాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ డిమాండ్ చేశారు. పలు వేదికలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రత్యేక విధానంపై పలు వాగ్ధానాలు చేసినా కార్యాచరణ లేదని ఆయన మండిపడ్డారు. అనాథ పిల్లల సంరక్షణ చర్యలపై ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించి ప్రత్యేక గుర్తింపు కార్డులు, కేజీ టు పీజీ ఉచిత విద్య తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఈనెల 30న ఇందిరాపార్క్ వద్ద దీక్ష నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. -
30న ‘అనాథల అరిగోస’ పేరుతో దీక్ష
పంజగుట్ట: అనాథలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలు గుర్తు చేసేందుకు 30వ తేదీన ఇందిరాపార్క్ వద్ద ‘అనాథల అరిగోస’ పేరుతో దీక్ష నిర్వహిస్తున్నట్లు అనాథల హక్కుల పోరాట వేదిక వ్యవ స్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. పోరాట వేదిక ఆధ్వర్యంలో సోమవా రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అనాథ హక్కుల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలు గుర్తుచేస్తూ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. వేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ప్రొఫెసర్ హరగోపాల్, కాంగ్రెస్ నేతలు మల్లు రవి, అద్దంకి దయాకర్, రాములు నాయక్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆప్ నేత ఇందిరా శోభన్, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు రాములుతోపాటు పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. మందకృష్ణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనాథలకు ఎన్నో హామీలు ఇచ్చి నేటికి ఏడు సంవత్సరాల ఏడు నెలలు అయ్యిందని ఇప్పటికీ అవి నెరవేర్చకుండా మోసం చేశారని విమర్శించారు. -
వర్గీకరణపై పార్లమెంటులో నిలదీయండి
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి పార్లమెంటులో నిలదీయాలని మహాజన్ సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంద కృష్ణ రాసిన లేఖను ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు శనివారం రేవంత్‌కు అందజేశారు. ఎస్సీ వర్గీకరణపై 28 ఏళ్లుగా ఉద్యమం సాగుతోందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలతో పాటు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపించినా, వర్గీకరణకు సానుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం లేదని విమర్శించారు. వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంటులో ప్రశ్నిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. -
జర్నలిస్టులకు పెన్షన్ స్కీం ప్రవేశపెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే 16 రాష్ట్రాల్లో అమలు చేస్తున్న జర్నలిస్టు పెన్షన్ స్కీంను తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలని మహాజన సొషలిస్టు పార్టీ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖరాశారు. సమాజం కోసం పని చేస్తున్న జర్నలిస్టులకు ఆసరాగా ఉండేందుకు పెన్షన్ స్కీం ఇచ్చి ఆదుకోవాలన్నారు. రైతుబంధు, దళితబంధు తరహాలో కులాలు, మతాల తారతమ్యం లేకుండా జర్నలిస్టుందరికీ జర్నలిస్టు బంధును ప్రవేశపెట్టాలని విన్నవించారు. జీవో 239ను సవరించాలని, నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న చిన్న పత్రికల అప్‌గ్రేడ్ ప్రక్రియను వెంటనే చేపట్టి ఆయా పత్రికల మనుగడను ఆదుకోవాలని మందకృష్ణ విన్నవించారు. అలాగే జర్నలిస్టులందరికీ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలతో పాటు సొసైటీల్లో లేని జర్నలిస్టులకు కూడా ఇళ్లు కేటాయించాలన్నారు. -
12, 13న నిరుద్యోగుల నిరాహార దీక్ష
ఉస్మానియా యూనివర్సిటీ: రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుకోసం సీఎం కేసీఆర్ మెడలు వంచేందుకు ఎస్సీ, బీసీ నిరుద్యోగులు ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కు లు తగ్గించి రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యపై 11న ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తామని, ఈ నెల 12, 13 తేదీల్లో ఇందిరాపార్కు వద్ద సామూహిక నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు. ఓయూలోని ఐసీఎస్ఎస్ఆర్ సెమినార్ హాల్లో శనివారం జరిగిన విద్యార్థి సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశంలో మంద కృష్ణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ అభ్యర్థులకు ద్రోహం చేయాలనే ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని, టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ శ్రీనివాసరావును తొలగించాలని డిమాండ్ చేశారు. -
కేసీఆర్, కడియం దళితద్రోహులు: మందకృష్ణ
స్టేషన్‌ఘన్‌పూర్: దళిత ద్రోహులైన సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి రాజకీయ సమాధి తప్పదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. రాజ్యాంగానికి కేసీఆర్ రూపంలో వచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కోవాలన్న నినాదంతో ఏప్రిల్ 4న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి బహిరంగ సభకు సన్నాహకంగా జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్ దురహంకారంతో రాజ్యాంగంపై వ్యాఖ్య లు చేశారన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు శ్రీహరి వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగబద్ధంగా ఉద్యమాలు చేసి కేసీఆర్ సీఎం అయ్యారని, ఇప్పుడు ఆ రాజ్యాంగాన్నే మార్చాలనడం సమంజసం కాదని ప్రొ. హరగోపాల్ అన్నారు. రైతులు, నిరుద్యోగులు, కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్‌కు పట్టదని ప్రొ.కోదండరాం అన్నారు. కార్యక్రమంలో ప్రొ.ఖాసీం, బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్, దళిత హక్కుల నేత జేబీ రాజు, ఎల్‌హెచ్‌పీఎస్ నేత బెల్లయ్యనాయక్ పాల్గొన్నారు. -
రాజ్యాంగ ద్రోహి కేసీఆర్
ఖైరతాబాద్: దేశ రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని రాయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ తన మాటల ద్వారా రాజ్యాంగ ద్రోహిగా మారారని దుయ్యబట్టారు. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ మాదిగ స్టూడెంట్ ఫోరం, ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్, ఎంఎస్పీల ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఇందిరాశోభన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో మంత్రిగా కూడా పనిచేయలేని కేసీఆర్... రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్లే ముఖ్యమంత్రి కాగలిగిన విషయాన్ని తెలుసుకోవాలన్నారు. తెలంగాణ రాకపోయుంటే ఆయనకు సీఎం అయ్యే అవకాశమే ఉండేది కాదన్నారు. అంబేడ్కర్‌పట్ల కృతజ్ఞత లేని వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. ఉద్యమ చరిత్రను కనుమరుగు చేసే కుట్ర: బండి సంజయ్ తెలంగాణ ఉద్యమ చరిత్రను కనుమరుగు చేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం కావాలో లేక అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం కావాలో ప్రజలు నిర్ణయించుకోవాల న్నారు. కల్వకుంట్ల రాజ్యాన్ని అంతం చేసి రాజ్యాంగానికి లోబడి బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. కేసీఆర్‌ది అహంకారం: వైఎస్ షర్మిల అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చా లనుకోవడం కేసీఆర్ అవిధేయతే కాదు.. అహంకారం కూడా అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల విమర్శించారు. కేసీఆర్‌కు రా జ్యాంగంపట్ల, దాన్ని రాసిన అంబేడ్క ర్పట్ల గౌరవం ఉందా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబే డ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానంటూ గతంలో ప్రకటించిన కేసీఆర్ ఇప్పటివర కు ఆ విషయాన్ని పట్టించు కోలేదని మం డిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే మరో అంబేడ్కర్ పుట్టాలన్నారు. -
కేసీఆర్, చినజీయర్ దళిత వ్యతిరేకులు
జడ్చర్ల/ నాగర్‌కర్నూల్ రూరల్: సీఎం కేసీఆర్, చినజీయర్‌స్వామి దళిత వ్యతిరేకులని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో చేపట్టిన కార్యక్రమాల్లో బుధవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ సాధ్యమైందని ఒకప్పుడు పొగిడిన కేసీఆర్ ఇప్పుడు ఊసరవెల్లిలా రంగులు మార్చి కొత్త రాజ్యాంగం రాయాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మొదటి నుంచి అంబేడ్కర్‌పై వివక్ష చూపిస్తూ ఏకంగా రాజ్యాంగాన్నే మార్చాలని కుట్ర చేస్తున్నారన్నారు. రామానుజాచార్యుల విగ్రహం ప్రారంభ కార్యక్రమానికి దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి కోవింద్‌ను ఆహ్వానించకపోవడం అవమానకరమన్నారు. రామానుజాచార్యుల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా చినజీయర్‌స్వామి వ్యవహరిస్తున్నారని, ఆధ్యాత్మికత ముసుగులో ‘రియల్’వ్యాపారవేత్తగా మారారని విమర్శించారు. -
కేసీఆర్‌ను ఓడిస్తేనే రాజ్యాంగానికి రక్షణ
హన్మకొండ: కేసీఆర్‌ను ఓడిస్తేనే రాజ్యాంగానికి రక్షణ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. రాజ్యాంగాన్ని అవమానిస్తూ సీఎం కేసీఆర్ మాట్లాడటాన్ని నిరసిస్తూ గురువారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ధర్నానుద్దేశించి మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన సీఎం కేసీఆర్ 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
మందకృష్ణ మాదిగను పరామర్శించిన కేంద్రమంత్రులు
-
అణగారిన వర్గాలకు అండగా ఉంటాం
అంబర్‌పేట: అణగారిన వర్గాల కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎంతో కృషి చేశారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చించడానికి ఢిల్లీకి వచ్చిన మందకృష్ణ ప్రమాదానికి గురయ్యారని, అది దురదృష్టకరమన్నారు. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన ప్రతిసారి ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వర్గీకరణ అంశాన్నే ప్రస్తావించే వారని చెప్పారు. అణగారిన వర్గాలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. మందకృష్ణ త్వరగా కోలుకొని ప్రజా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఢిల్లీలో ప్రమాదానికి గురైన మందకృష్ణ మాదిగను కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు స్వయంగా వెంటపెట్టుకొని తీసుకొచ్చారు. విమానాశ్రయం నుంచి వందలాది మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తల మధ్య డీడీ కాలనీలో ఉన్న నివాసానికి ర్యాలీగా వచ్చారు. ఉద్యమాలకు అండగా కిషన్‌రెడ్డి కొన్నేళ్లుగా అనేక ప్రజా ఉద్యమాలకు కిషన్‌రెడ్డి అండగా ఉంటూ వస్తున్నారని, ఇది ఆయన అణగారిన వర్గాల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనమని మందకృష్ణ మాదిగ చెప్పారు. తాను ప్రజల పక్షాన పోరాడితే అవే అంశాలను కిషన్‌రెడ్డి అసెంబ్లీలో లేవనెత్తుతూ పరిష్కారానికి చొరవ తీసుకున్నారన్నారు. దళితులను మోసం చేసినందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని వ్యాఖ్యానించారు. పథకం కింద దళితులకు డబ్బులు ఇచ్చి వాటిపై కలెక్టర్ పెత్తనం చేయడమే పెద్ద కుట్ర అని అన్నారు. ఒక్క హుజురాబాద్‌కే దళితబంధు పథకం కింద రూ.2 వేల కోట్లు అవసరమవుతాయని ప్రకటించిన కేసీఆర్, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి ఎన్ని వేల కోట్లు అవుతాయి, ఎలా తెస్తారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధనలో మోదీకి అండగా నిలవాలి దేశాన్ని ‘ఆత్మనిర్భర్ భారత్’గా రూపొందించేందుకు ప్రతిఒక్కరూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరచాలని పర్యాటక, సాంస్కృతిక, శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి కోరారు. గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ నీతివంతమైన పాలనను అందించి ప్రపంచదేశాల్లో భారత్‌కు గౌరవప్రదమైన స్థానాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు. మోదీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టి అక్టోబర్ 7వ తేదీతో 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకోనున్న సందర్భంగా నరేంద్రమోదీ–‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ఇంగ్లిష్ పుస్తకం తెలుగు అనువాదాన్ని ఆదివారం కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. మోదీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలను గురించి ఈ పుస్తకంలో వివరించారని, దీన్ని ఇతర భాషల్లోకి తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపినట్లు ఆయన చెప్పారు. -
మంద కృష్ణకు గాయాలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమంత్రుల్ని కలవడానికి ఢిల్లీకి వచ్చిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగకు గాయాలయ్యాయి. ఎంపీల అతిథిగృహం వెస్ట్రన్ కోర్టులో బస చేసి న ఆయన ఆదివారం ఉదయం స్నానాలగదిలో పడిపోయారు. కుడికాలుకు తీవ్ర గాయం కావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మంద కృష్ణను కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. -
కోకాపేట ప్రభుత్వ భూముల వేలాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
బౌద్ధనగర్ (హైదరాబాద్): కోకాపేట ప్రభుత్వ భూముల వేలాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఈ వేలంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అక్రమ సంపాదన పెరిగిందని ఆరోపించారు. శనివారం పార్శిగుట్టలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. విపక్షాలను పక్కదోవ పట్టించడానికి వేలంలో వచ్చిన డబ్బులను దళిత సాధికారిత కోసం ఉపయోగిస్తామని సీఎం ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. వెలమ, కమ్మ అగ్రకులాల ఆత్మగౌరవ భవనాలకు హైటెక్ సిటీలో కోట్లు విలువైన భూములు కేటాయించి బీసీ, మైనార్టీలకు కొండగుట్టల్లో ఎలా కేటాయిస్తారని సీఎం కేసీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. దీంతో ప్రజల్లో అసమానతలు పెరుగుతాయన్నారు. దళితుల్లో ఉన్న 59 ఉప కులాల వారికి ఒక సెంటు భూమి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించలేదని పేర్కొన్నారు. నగర శివార్లలోని 200 ఎకరాల్లో అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాల కోసం భూమిని కేటాయించాలని కోరారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో దళితుల సాధికారిత ముందుకు సాగిందా, వెనక్కి వెళ్లిందా? అనే అంశంపై ఈ నెల 22న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. -
కత్తి మహేశ్‌కు జరిగిన ప్రమాదం తీరు అనుమానాస్పదంగా ఉంది: మందకృష్ణ
సాక్షి, నెల్లూరు: సినీ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కత్తి మహేశ్ జరిగిన ప్రమాదం తీరు చూస్తుంటే అనుమానంగా ఉందన్నారు. ఈ ప్రమాదంలో కత్తి మహేశ్ కారు కుడి భాగం నుజ్జునుజ్జు అయినప్పటికీ డ్రైవర్ సురేశ్ స్వల్ప గాయాలతో బయటపడటం ఏంటని, ఎడమ వైపు కూర్చున్న మహేశకు తీవ్ర గాయాలవడం ఏంటని ప్రశ్నించారు. మహేశ్‌కు ఎంతో మంది శత్రువులు ఉన్నారన్నారని, గతంలోని దాడులు, కొన్ని సంఘటనలు దీనికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయన్నారు. తొలుత కత్తి మహేశ్‌కు గాయాలే కాలేదని చెప్పారన్నారు. ఆసుపత్రిలో మహేశ్ ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు పెట్టారని చెప్పారు. కత్తి మహేశ్ మరణంపై విచారణ జరిపించాలని ఏపీ సర్కారును ఆయన కోరారు. అంతేగాక ఎమ్మార్పీఎస్ నాయకులు ఈ రోజు నెల్లూరు జిల్లా రూరల్ డీఎప్సీని కలిసి కత్తి మహేశ్ మృతిపై విచారణ జరపాల్సిందిగా కోరుతూ వినతి పత్రం అందజేశారు. దీంతో సీఐ రామకృష్ణా రెడ్డి డ్రైవర్ సూరేశ్‌ను విచారణకు పిలిచి దర్యాప్తు జరుపుతున్నారు. దీనితో పాటు కత్తి మహేశ్ తండ్రి సైతం తన కొడుకు మృతిపై అనుమానం ఉందని తెలిపారు. కాగా, గత జూన్ 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద కత్తి మహేశ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. -
కత్తి మహేశ్ మృతిపై అనుమానాలు ఉన్నాయి: తండ్రి ఓబులేసు
ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం కత్తి మహేశ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలంలోని యలమందలో జరిగాయి. అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ మహేశ్ మరణం పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. కత్తి మహేశ్ మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాజాగా ఆయన తండ్రి ఓబులేసు కూడా మహేశ్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ మరణించిన విషయం తమ కంటే ముందే బయటకు చెప్పారని ఆయన తెలిపారు. కత్తి మహేశ్ మృతిపై న్యాయ విచారణ జరిపించి నిజానిజాలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వయసు రీత్యా తన శరీరం సహకరించడం లేదని, ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని ఓబులేసు విజ్ఞప్తి చేశారు. -
సీఎం కేసీఆర్‌కు దళిత సాధికారతపై చిత్తశుద్ధి ఉందా?
బౌద్ధనగర్ (హైదరాబాద్): దళిత ముఖ్యమంత్రిపై బహిరంగ హామీ ఇచ్చి మోసం చేసిన కేసీఆర్ దళిత సాధికారతపై మాట్లాడటం పచ్చి మోసమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. దళిత సాధికారతపై ఆదివారం అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తుండటంతో ఆయన కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. సమావేశం నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే సమావేశాలు జరపడం, తీర్మానాలు చేయడం కాకుండా వాటిని అమలు చేసే చిత్తశుద్ధి కేసీఆర్‌కు లేదన్నారు. దళిత ముఖ్యమంత్రిపై బహిరంగ హామీ ఇచ్చి మోసం చేసిన కేసీఆర్ ఇప్పుడు సాధికారత గురించి మాట్లాడటం పచ్చిమోసం, నిలువెత్తు నయ వంచనకు ప్రతీక అని పేర్కొన్నారు. చదవండి : Covid-19: ప్రభుత్వ పనితీరు అభినందనీయం, గవర్నర్ ప్రశంసలు -
139 మంది అత్యాచారం కేసులో ట్విస్టు
సాక్షి, హైదరాబాద్: 139 మంది అత్యాచారం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తనపై ప్రముఖులు అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు తాజాగా వాటి వెనుక డాలర్ బాయ్ ఒత్తిడి ఉందని మీడియాకు తెలిపారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో బాధితురాలు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘డాలర్ బాయ్ ఒత్తిడి మేరకే కొందరి పేర్లు పెట్టాల్సి వచ్చింది. కొంత మందితో నాకు ఎలాంటి సంబంధం లేదని నేను ఎంత చెప్పినా వినకుండా అనవసరంగా పేర్లు పెట్టించాడు. నన్ను నా ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించాడు. చిత్ర హింసలకు గురి చేశాడు. యాంకర్ ప్రదీప్, కృష్ణుడికి ఈ కేసుతో సంబంధంలేదు. నాపై లైంగికదాడి జరిగింది వాస్తవమే. కానీ, సెలబ్రిటీలు లేరు. నేను బయట 50 శాతం వేధింపులకు గురైతే, 50 శాతం డాలర్ బాయ్ వేధించాడు. అనవసరంగా నా వల్ల ఇబ్బంది పడ్డవారికి క్షమాపణలు చెబుతున్నా. నాలా మరో అమ్మాయికి అన్యాయం జరగొద్దు. డాలర్ బాయ్ నాలా మరో ఇద్దరిని కూడా ట్రాప్ చేశాడు’అని బాధితురాలు పేర్కొన్నారు. కాగా, కొన్ని కుల సంఘాలు, మహిళా సంఘాలు బాధితురాలికి మద్దతు ప్రకటించాయి. ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశాయి. మంద కృష్ణ మాదిగ, పీవోడబ్ల్యూ సంధ్య తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. (చదవండి: ‘యాంకర్ ప్రదీప్‌కు ఈ కేసుతో సంబంధం లేదు’) -
‘యాంకర్ ప్రదీప్‌కు ఈ కేసుతో సంబంధం లేదు’
సాక్షి, హైదరాబాద్: 139 మంది అత్యాచారం కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాధితురాలికి అండగా నిలిచిన వివిధ కుల సంఘాలు, మహిళా సంఘాలు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ అన్నారు. డాలర్ బాబు ఒత్తిడి వల్లే ప్రదీప్‌పై బాధితురాలు కేసు పెట్టిందని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇటువంటి ఘటన చూస్తే పూలన్ దేవి గుర్తొచ్చింది. ఫూలన్ దేవి ఎన్నోసార్లు అఘాయిత్యానికి గురయ్యారు. పీడిత కులానికి చెందిన యువతిపై 139 దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారని తెలిసి షాక్‌కి గురయ్యాను. ఈ కేసుకు సంబంధించి సీసీఎస్ పోలీసులను మా బృందం సంప్రదించింది. ఒక మహిళా ఏసీపీ కేసును విచారిస్తున్నరని తెలిపారు. కేసును సీఐడీకి బదిలీ చేయాలని కోరుతున్నాం. నిన్న సుమారు రెండు గంటల పాటు బాధితురాలితో మాట్లాడాను. 139 మందిపై రేప్ కేసుతో పాటు ఎస్సీఎస్టీ కేసులు పెట్టారు. మా జోలికి అనవసరంగా వస్తే వదిలి పెట్టం. ఈ కేసులో నిజాలు తెలుసుకునేందుకు బాధితురాలికి పోలీసుల కంటే ఎక్కువ ప్రశ్నలు అడిగాను. పెళ్లైన తరువాత అమ్మాయి జీవితంలో జరిగిన నాలుగు ఘటనలు వివరించింది. 139 మందిలో 30 శాతం మంది అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేశారు. ఇంకో 30 శాతం అమ్మాయిని మానసికంగా వేధించి బ్లాక్ మెయిల్ చేశారు. (చదవండి: ఎవరీ డాలర్ బాయ్?) దాదాపు 40 శాతం మందికి ఈ కేసుతో సంబంధం లేని వాళ్లు ఉన్నారు. అమ్మాయి చిన్న వయసులోనే బ్లాక్ మెయిల్ కు గురై అత్యాచారానికి గురైంది. ఎస్ఎఫ్ఐ మీసాల సుమన్ ఈ అమ్మాయి జీవితంలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పుడే అమ్మాయి బ్లాక్ మెయిల్‌కు గురైంది. డాలర్ బాయ్ అమ్మాయితో కేసులు పెట్టించి వారిని బ్లాక్మెయిల్ చేశాడు. డాలర్ బాబు కూడా అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మీసాల సుమన్, డాలర్ బాయ్‌ను అదుపులోకి తీసుకుంటే అన్ని నిజాలు బయట పడుతాయి. బాధితురాలికి ప్రాణహాని ఉంది రక్షణ కల్పించాలి’ అని మందకృష్ణ పేర్కొన్నారు. (చదవండి: 143 మంది అత్యాచారం కేసు: స్పందించిన ప్రదీప్) -
‘2023 నాటికి కేసీఆర్ దొరల పాలన అంతం’
సాక్షి, వరంగల్ అర్బన్: సీఎం కేసీఆర్ రూపంలో ఉన్న దొరల పాలన 2023 నాటికి అంతం కాబోతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మట్లాడుతూ.. తల్లి తెలంగాణా పుస్తకంలో 2003లోనే కేసీఆర్ దళితులను మోసం చేసి ముఖ్యమంత్రి అవుతాడని రాశానని గుర్తు చేశారు. నిండు అసెంబ్లీలో తాను దొరనే అని బాహాటంగా కేసీఆర్ ప్రకటించుకున్నాడని మండిపడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదని దుయ్యబట్టారు. లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చిందని తెలిపారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ మాటను ధిక్కరించి కరోనా సోకిన ఎమ్మెల్యేలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాజకీయంగా కేసీఆర్ భారీ మూల్యం చెల్లించే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. ఆరు సంవత్సరాల కేసీఆర్ పాలనలో దళిత, గిరిజన వర్గాలకు భూపంపిణీ ఎందుకు జరగలేదని మండిపడ్డారు. (కేంద్రం ఏ విషయంలో కితాబిచ్చిందో చెప్పాలి?) -
రిజర్వేషన్ల వ్యతిరేకులకు అడ్డాగా మారింది: మందకృష్ణ మాదిగ
సాక్షి, పంజగుట్ట: ఎస్సీ, ఎస్టీల ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల అంశం రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు అభి వర్ణించడం దుర్మార్గమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. రిజర్వేషన్ల వ్యతిరేకులకు న్యాయవ్యవస్థ అడ్డాగా మారిందని విమర్శించారు. గతంలో ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని కూడా రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు రూపం లో ప్రయత్నం చేశారని, తీవ్రమైన ఉద్యమాలు చేస్తే వెనక్కి తగ్గారని గుర్తు చేశారు. రిజర్వేషన్ల అంశంపై హైదరాబాద్ కేంద్రంగా జాతీయ స్థాయి ఉద్యమం తీసుకువస్తా మన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంద కృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తీసేస్తే మిగిలినవి కూడా సులువుగా తీసేయవచ్చనే ఈ పథకం పన్నారని ఆరోపించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉంటే ఈ తీర్పు వచ్చేది కాదన్నారు. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లకు పోరాటం చేస్తామన్నారు. మార్చి 8న నిర్వహించనున్న ‘సింహగర్జన’ను వాయిదా వేసినట్లు మందకృష్ణ తెలిపారు. ఈ సమావేశంలో రాములు నాయక్, మాల మహానాడు అధ్యక్షుడు జి.చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మందకృష్ణ
సాక్షి, సూర్యాపేట: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తాజాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆర్టీసీ పరిరక్షణ యాత్రను చేపట్టిన ఆయన హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నష్టాల్లో ఉన్న ఆర్టీసీ బతకాలంటే ప్రతి ఒక్కరు సొంత వాహనాలను వదిలి ఆర్టీసీలో ప్రయాణించాలి. ఆర్టీసీ సమ్మె కాలంలో కార్మికులకు మద్దతు ఇచ్చినట్లుగానే ఆర్టీసీని బతికించేందుకు ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నా. లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రాలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు.. ఇక్కడ ఎందుకు సాధ్యంకాదు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి’ అని కోరారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడంలో భాగంగానే సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మంత్రులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలన్న కేసీఆర్ మాటలు ఎక్కడా కార్యరూపం దాల్చలేదని తప్పుబట్టారు. -
సుమోటోగా తీసుకోవాలి
చిలకలగూడ: అణగారిన వర్గాలపై తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షకు నిరసనగా ఈ నెల 8న కొంగర కలాన్‌లో ఎస్సీ, ఎస్టీ యుద్ధభేరీ సభను నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. సికింద్రాబాద్ పార్శిగుట్టలోని ఎమ్మార్పీఎస్ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. మాజీ డీజీపీ హెచ్‌జే దొర ఆత్మకథ పుస్కకావిష్కరణ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలు సరికాదన్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను సమర్థించినట్లు చేసిన వ్యాఖ్యలను సుప్రీం, హైకోర్టు, మానవ హక్కుల కమిషన్లు సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసి విచారణ జరిపించాలన్నారు. ఎన్కౌంటర్ వెనుక మా నేత నిర్ణయం ఉందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారని, ప్రభుత్వ నిర్ణయంతోనే ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోందని, కఠిన నిర్ణయాలు చట్టానిక లోబడే చేయాలని లేకుంటే హత్యల కిందకే వస్తాయన్నారు. ఈ విషయమై మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదు చేయనున్నట్లు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. కొంగర కలాన్ యుద్ధభేరీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
అత్యాచారాల్ని కులంతో ముడిపెట్టొద్దు
కవాడిగూడ: మహిళలపై జరిగే అత్యాచారాలు, హత్యలను కులంకోణంతో చూడొద్దని, కేవలం మానవతా దృక్పథంతోనే చూడాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు కులమతాలతో సంబంధం లేకుండా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని గొంతెత్తుతున్న చరిత్ర తమదని ఆయన స్పష్టం చేశారు. దిశ ఘటనకు మూడ్రోజుల ముందు మూడు ఘటనలు జరిగినప్పటికీ వాటిపై చర్యలు చేపట్టకుండా దిశ ఘటనపై మాత్రమే ఓ సామాజికవర్గం ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందని, అందుకే పోలీసులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన నిందితులను ఎన్కౌంటర్ చేశారని ఆయన ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన ఛలో ఇందిరాపార్క్ మహాదీక్షకు వివిధ కుల, ప్రజా, విద్యార్థి సంఘాలు హాజరయ్యాయి. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ..దేశాన్ని కుదిపేసిన గాంధీ, ఇందిరా, రాజీవ్‌గాంధీలను హత్యచేసిన నిందితులను చట్టపరంగానే శిక్షించారేతప్ప ఎన్కౌంటర్ చేయలేదని గుర్తుచేశారు. ఉగ్రవాది కసబ్ సజీవంగా దొరికినా కాల్చి చంపలేదెందుకని ప్రశ్నించారు. దేశంలో 15 ఏళ్లలో 3 లక్షల 41 వేలమంది మహిళలపై అత్యాచారాలు జరిగితే అప్పుడు లేని ఎన్కౌంటర్లు దిశా నిందితుల విషయంలో మాత్రమే ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఒకే సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులైన ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిశ ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు కానీ అంతకుముందు జరిగిన టేకు లక్ష్మీ, మానస కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. నెలరోజుల పాటు 119 నియోజకవర్గాల్లో అత్యాచార ఘటనలపై జరుగుతున్న వివక్ష న్యాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్య పరచాలన్నారు. దీనిపై త్వరలోనే ‘చలో హైదరాబాద్’కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జేబీ రాజు అధ్యక్షతన జరిగిన మహాదీక్షలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, దాసు సురేశ్, ప్రొఫెసర్ గాలి వినోద్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
అడిగేవారు లేరనే ఎన్కౌంటర్: మందకృష్ణ
షాద్‌నగర్ రూరల్: అడిగేవాళ్లు లేరనే ఉద్దేశంతోనే ‘దిశ’ఘటనలో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ పేరుతో హతమార్చారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘అగ్రకుల మహిళలకు ఒక న్యాయం.. దళిళ బహుజనులకు ఒక న్యాయం’అనే అంశంపై సమావేశంలో చర్చించారు. దిశ అగ్రకులానికి చెందిన యువతి కావడంతోనే పోలీసులు నిందితులను ఎన్కౌంటర్ చేశారని మందకృష్ణ ఆరోపించారు. నిందితులు బడుగు, బలహీన వర్గాల వారు కావడంతోనే ఎన్కౌంటర్ పేరుతో అంతమొందించారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో ఎమ్మారీ్పఎస్ నాయకులు బుర్ర రాంచం ద్రయ్య, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. -
బడగులు కావడంతోనే ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్
సాక్షి, అలంపూర్: అత్యాచారాలు, హత్యలు చేసిన నిందితులకు శిక్షల్లో వివక్ష ఎందుకు చూపుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మంగళవారం సాయంత్రం అలంపూర్ చౌరస్తా చేరుకున్నా రు. ఈ సందర్భంగా ఆయన అలంపూర్ చౌరస్తా లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘దిశ’ నిందితులది బూటకపు ఎన్కౌంటర్ అన్నారు. రాజ్యాంగబద్ధంగా వారికి కోర్టు ద్వారా శిక్ష వేయాల్సిన పోలీసులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. దిశ నిందితుల తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనప్పటికీ తమ పిల్లలు తప్పు చేసి ఉంటే కోర్టు ద్వారా శిక్ష పడాలని కోరుకున్నారన్నారు.కోర్టు కంటే ముందే శిక్ష వేశారన్నారు. నిందితులు బలహీన వర్గాలకు చెందిన వారు కావడంతోనే పోలీసులు ఎన్కౌంటర్ చేశారన్నారు. కులం, మతం తేడా చూడొద్దు గత 15 ఏళ్లలో 3.41 లక్షల అత్యాచారాలు, హత్యల కేసులు నమోదైనా.. ఎక్కడా ఇలాంటి సంఘటన జరగలేదని మంద కృష్ణ అన్నారు. హాజీపూర్ ఘటనలో నలుగురు అమ్మాయిలను అత్యాచారం చేసి హత్య చేసిన శ్రీనివాస్‌రెడ్డిని, జడ్చర్లలో బాలికను హత్య చేసిన నిందితుడిని ఎందుకు శిక్షించలేదన్నారు. కులం, మతం అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన శిక్ష పడాలన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఈ నెల 24న బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
మందకృష్ణ క్షమాపణలు చెప్పాలి: ఆకుమర్తి చిన్న
సాక్షి, తూర్పుగోదావరి: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి వెంటనే క్షమాపణలు చెప్పాలని మాదిగ రాజకీయ పోరాట సమితి అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న డిమాండ్ చేశారు. శనివారం కాకినాడలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే ఏపీలో మందకృష్ణను తిరుగనివ్వబోమని ఈ సందర్భంగా హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మాదిగలకు సీఎం జగన్ సముచిత స్ధానం కల్పించారని పేర్కొన్నారు. వర్గీకరణ ముసుగులో మాదిగలను అడ్డుపెట్టుకుని ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగిన ఘనత మందకృష్ణదే అని హేళన చేశారు. మందకృష్ణ కుట్రలను గ్రామగ్రామాలకు తీసుకువెళ్తామని తెలిపారు. -
‘మందకృష్ణ ఏపీలో అడుగుపెడితే తరిమికొడతాం’
సాక్షి, అమరావతి: మాదిగలు జగన్మోహన్రెడ్డి పాలనలో ఆనందంగా ఉన్నారని.. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే గుణపాఠం చెబుతామని మందకృష్ణ మాదిగను బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. మంద కృష్ణ మాదిగ ఏపీలో తిరిగితే తరిమికొట్టే పరిస్ధితి ఉందని.. అందుకే ఏపీలో తిరగడం లేదని అన్నారు. సీఎం జగన్‌పై మందకృష్ణ వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. జాతిని అడ్డుపెట్టుకుని ఉద్యమాల ద్వారా మందకృష్ణ ఆర్థికంగా బలపడ్డారు.. కానీ ఉద్యమంలో పాల్గొన్న వారు పేదవారిలానే ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మాటలకు బినామీగా మంద కృష్ణ వ్యవహరిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ఆర్థిక నేరస్ధుడని దళితుల భూములను ఆయన లాక్కుంటే అప్పుడు ఎక్కడికి వెళ్లారని మందకృష్ణను ఎంపీ ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు దిక్కుతోచని స్ధితిలో ఉంటే ఆయన చెంత చేరి దిక్కుమాలిన వాడిలా మారావని హేళన చేశారు. చంద్రబాబు జేబులో పెన్నులా.. ఆయన మాటలకు బినామిగా మందకృష్ణ మారారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు చేసిన పాపాల్లో మందకృష్ణకు భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆశయసాధనలో జగన్మోహన్రెడ్డి పాలన అందిస్తున్నారని మెచ్చుకున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి మాల, మాదిగ, రెల్లి అనే మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఈ విషయంపై జగన్‌ను ఎందుకు ప్రశంసించరని ప్రశ్నించారు. టీడీపీ నాయకుల నోటి నుంచి వచ్చే మాటలే.. మీ నోటి నుంచి వస్తున్నాయని అన్నారు. పచ్చమీడియా ప్రోత్సాహకాలు తీసుకుని మంద కృష్ణ విమర్శలు చేస్తున్నారని.. ఏపీలో మంద కృష్ణ తిరిగితే ప్రజలు చెప్పుతో కొడతారని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకరావు అన్నారు.మందకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మందకృష్ణకు ఏపీలో ప్రజలు మానసికంగా ఎప్పుడో ఉరి వేశారని ఎద్దేవా చేశారు. జాతిని అడ్డు పెట్టుకుని ఆర్థికంగా బలపడిన మందకృష్ణ, చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. 1994 ముందు మంద ఆర్థిక పరిస్థితి ఇప్పటి ఆర్థిక పరిస్థితికి పొంతన లేదన్నారు. మాదిగలకు పెద్ద పీట వేసి.. వెనుకబడ్డ ప్రతి కులాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని ప్రశంసించారు. చంద్రబాబు రాజకీయ అస్థిత్వం కోల్పోయినప్పుడల్లా మందకృష్ణ చంద్రబాబు చెప్పినట్లు ఆడుతున్నారని దుయ్యబట్టారు. సూర్యుని మీద ఉమ్మేస్తే.. తిరిగి మనకే చేరుతుందన్నారు. -
మాయావతి ప్రకటనపై మందకృష్ణ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ దుర్గటనలో నలుగురిని ఎన్‌కౌంట్ చేయడాన్ని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సమర్థించడం దురదృష్టకరమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించడానికి జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఓయూ క్యాంపస్ దూరవిద్యాకేంద్రంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. మాదిగ విద్యార్థి సమాఖ్య (ఎంఎస్ఎఫ్) జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి మాదిగ అధ్యక్షతన సభలో మంద కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా మౌనం వహించిన మాయావతి కేవలం ‘దిశ’ నిందితులను ఎన్కౌంటర్ చేయడాన్ని సమర్థించడం దురదృష్టకరమన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. కేవలం అగ్రకుల మహిళలపై దుర్గటనలు జరిగితేనే అగ్రకుల నేతలు ఆందోళన చేసి, పార్లమెంట్ వరకు చర్చించడం పాలక వర్గాలలో పక్షపాత ధోరణులకు నిదర్శనమని వివరించారు. ‘దిశ’ ఘటనకు ముందు టేకు లక్ష్మి, సుద్దాల శైలజ, కల్పన, ఇంకా అనేక మంది దళిత, బహుజన మహిళలు, బాలికలు అత్యాచారానికి గురై హత్య చేసినా ఇంత వరకు వారి కుటుంబాలను ఏ ఒక్క నేతా పలకరించలేదని, సత్వర న్యాయం కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి నిందితులను శిక్షించలేదన్నారు. తప్పు ఎవరు చేసినా చట్టబద్ధమైన కఠిన శిక్షలు విధించాలని, జీవించే హక్కును వ్యక్తులు, సంస్థలు, రాజకీయ పార్టీలు హరించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ చనగాని దయాకర్‌గౌడ్, తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజియాదవ్, డీబీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నలిగంటి శరత్, వీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ ముదిరాజ్, రాష్ట్ర నాయకులు సలీంపాషా, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి రంజిత్, నాగరాజు, ఏఐఎస్ఎఫ్ నాయకులు లక్ష్మణ్, టీడీవీఎస్ రాష్ట్ర నాయకులు భూపెల్లి నారాయణ తదితరులు ప్రసంగించారు. -
దళిత మహిళను అత్యాచారం, గొంతుకోస్తే స్పందించరా?
సాక్షి, లింగాపూర్: ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో నవంబర్ 25న దళిత బుడగజంగం సామాజిక వర్గానికి చెందిన మహిళపై ఎల్లాపటార్ గ్రామానికి చెందిన ముగ్గురు సాముహికంగా అత్యాచారం చేసి.. గొంతుకోసి చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. దళిత మహిళ టేకు లక్ష్మి హత్య జరిగిన ప్రదేశాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. శంషాబాద్‌లో జరిగిన దిశ సంఘటనను పార్లమెంట్లో ప్రస్తావించారని, అదే లక్ష్మి ఘటనను ఎందుకు మర్చిపోయారని ప్రశ్నించారు. ఉన్నత వర్గాలకు ఒక న్యాయం.. దళితులకు మరో న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. దిశ నిందితులను శిక్షించే ముందు లింగాపూర్ నిందితులనూ శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దళితుల ఓట్లు కావాలిగానీ.. వారిపై హత్యాచారాలు జరిగితే మాత్రం స్పందించకపోవడం దారుణమన్నారు. -
కెనడా ఫార్ములా అమలుకు సీఎం కుట్ర
సాక్షి, షాద్‌నగర్: కెనడాలో హక్కుల సాధనకు కార్మికులు ఆందోళనకు దిగితే అక్కడి ప్రభుత్వం వారిపై కాల్పులు జరిపిందని, మన ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆర్టీసీ కార్మికులపై అదే ఫార్ములాను ప్రయోగించేందుకు కుట్రలు పన్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం 50వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన షాద్‌నగర్‌లో వారికి మద్దతు తెలిపారు. అనంతరం మందకృష్ణ మాట్లాడుతూ.. 1919 సంవత్సరంలో కెనడా దేశంలో కార్మికులు హక్కుల సాధనకు అక్కడి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారని తెలిపారు. ఈక్రమంలో నిరసన చేపట్టిన వేలమంది కార్మికులపై సర్కారు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతిచెందగా మిగతా వారు భయంతో స్వచ్ఛందంగా విధుల్లో చేరానని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలోనూ అవసరమనుకుంటే కెనడా ఫార్ములాను ప్రయోగించేందుకు సీఎం కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యంతో ప్రభుత్వంపై ఆందోళనకు దిగడంతో సమ్మె ముందుకు సాగుతోందని, లేదంటే కెనడా తరహాలోనే ఆందోళన మధ్యలోనే ముగిసిపోయేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఇక్కడి ఉద్యోగులను, కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అనలేదని, కానీ తెలంగాణ సీఎం కార్మికులను భయభ్రాంత్రులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఉద్యమంలో ఆయనతో కలిసి పనిచేసిన ఆర్టీసీ కార్మికుల కష్టాలను నేడు సీఎం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులను ప్రజలనుంచి దూరం చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. కార్మికుల సమ్మెకు ప్రారంభంలో ఏ పార్టీ మద్దతు ఇవ్వలేదని, ఒక్క ఎమ్మార్పీఎస్ మాత్రమే అండగా ఉందన్నారు. హక్కుల సాధనలో భాగంగా అమరులైన కుటుంబాల్లో మనోధైర్యాన్ని నింపేందుకు కృషిచేస్తామని మంద కృష్ణ పేర్కొన్నారు. పేదలకు ఆర్టీసీ ఎంతో అవసరమని, అలాంటి సంస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింహ్మ, నాయకులు దర్శన్, బుర్ర రాంచంద్రయ్య, ఇటికాల రాజు, శ్రవణ్‌కుమార్, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ మ్యాకం నర్సింలు, నాయకులు ఎస్పీ రెడ్డి, అర్జున్‌కుమార్, తిరుపతయ్య, రిషికుమారి, సౌభాగ్య, రాధిక తదతరులు ఉన్నారు. -
నక్సలైట్లమా.. దేశద్రోహులమా?
సాక్షి, పూడూరు: ‘గుండెపోటుతో మరణించిన ఆర్టీసీ కార్మికుడు వీరభద్రప్ప కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లడం తప్పా.. మేమేమైనా నక్సలైట్లమా.. దేశద్రోహులమా..? ఇలా రోడ్లపై అరెస్టులు చేయడం ఏమిటి’ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిందుకు హైదరాబాద్ నుంచి పరిగి వెళ్తున్న వీరిని చన్గోముల్ పీఎస్ ఎదుట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్లో నిర్బంధించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. కేసీఆర్ నియంతృత్వ పోకడవల్లే ఆర్టీసీ కార్మికుల బలిదానాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. భేషరతుగా కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దేవుళ్లుగా కనిపించిన ఆర్టీసీ కార్మికులు.. ఇప్పుడు దెయ్యాలయ్యారా అని ప్రశ్నించారు. సంస్థ ఆస్తులను కొల్లగొట్టేందుకు పెద్దఎత్తున కుట్ర సాగుతోందని ఆరోపించారు. ఆర్టీసీ కారణంగా 82 ఏళ్ల చరిత్రలో పడని భారం ఇప్పుడే పడుతోందా అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు సతీష్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురేందర్, ఆర్టీఐ మండల కన్వీనర్ వెంకటయ్య, యువజన నాయకులు సల్మాన్‌ఖాన్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, హమ్మద్, శ్రీనివాస్, అజీంపటేల్, నరేష్, తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులు గెలవడం పక్కా కానీ..
సాక్షి, హైదరాబాద్ : ‘తెలంగాణ హైకోర్టు చెరో మెట్టు దిగమని ప్రభుత్వానికి, కార్మికులకు చెప్పింది. కానీ కార్మికులు మెట్టు దిగాల్సిన అవసరం లేదు. వారు మెట్టు మీద అసలే లేరు’ అని ఎమ్మార్మీస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అడ్డుకునేవారు ఉన్నంతసేపు కార్మికులు అనుకున్న ఫలితాలు రావు కానీ, చివరకు ధర్మమే గెలుస్తుందన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం దీక్ష చేసి విరమించిన రోజు కూడా అదే జరిగిందన్నారు. దీక్ష విరమించగానే తెలంగాణ రాలేదని, తర్వాత వచ్చిందని, అలాగే కార్మికుల లక్ష్యాలు కూడా తర్వాతి రోజుల్లో నెరవేరుతాయని అశాభావం వ్యక్తంచేశారు. ఎప్పుడు గెలుస్తారో చెప్పలేం కానీ కార్మికులు మాత్రం గెలవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులకు ఎళ్లవేళలా ఎమ్మార్మీస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టిన చరిత్ర ఆర్టీసీకి ఉందని, కార్మికులు ఎవరూ ఆందోళన చెందొద్దని కోరారు. ఆర్టీసీ ఆస్తులు దోచుకోవడానికి సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌తో పోలిస్తే సమైక్యాంధ్ర నాయకులు వందశాతం నయమని చెప్పారు. ఉద్యోగాల పట్ల కార్మికులు ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
‘సబ్బండ వర్గాల మహాదీక్ష’ను భగ్నం చేసిన పోలీసులు
హైదరాబాద్ : తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు మద్దతుగా, ఆదివారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తలపెట్టిన సబ్బండ వర్గాల మహాదీక్షకు పోలీసులు అను మతి నిరాకరించారు. అయినప్పటికీ మహాదీక్షను విజయవంతం చేయాలని మందకృష్ణ పిలుపునిచ్చారు. దీంతో మహాదీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు, గృహ నిర్భంధానికి పూనుకున్నారు. మహాదీక్షకు కేంద్రంగా ఉన్న ఇందిరాపార్కు చౌరస్తాకు నాలుగుదిక్కులా మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఒకరిద్దరు అశోక్‌నగర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపే ప్రయత్నం చేసినా పోలీసులు ఎత్తుకెళ్లి వ్యాన్‌లో పడేశారు. ఆశోక్‌నగర్ చౌరస్తాకు వచ్చిన ఆందోళనకారులను ముందుగానే అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. సాయంత్రం 6గంటల వరకు ఇందిరాపార్కు రహదారిలో ప్రయాణించడానికి అనుమతి నిరాకరించడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం పడిపోతుందా..? ఒకరోజు మహాదీక్షతో ప్రభుత్వం పడిపోతుందా? అని మందకృష్ణ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. హబ్సిగూడలో మందకృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2009లో కేసీఆర్ 10 రోజుల దీక్ష ముగింపు సమయంలో పోలీసులు, అప్పటి సీఎం రోశయ్య ఎంతో గౌరవించారన్నారు. నేడు శాంతియుతంగా చేస్తున్న దీక్షను పోలీసులు అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. మిలియన్ మార్చ్, సడక్ బంద్, సకలజనుల సమ్మె, చలో ట్యాంక్‌బండ్‌లో పలు విగ్రహలు, వాహనాలను ధ్వంసం చేసినా ఆనాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగినీ సస్పెండ్ చేయలేదని చెప్పారు. కోర్టుకు వెళ్లి మహాదీక్షను చేపడతామని, ఆర్టీసీ సమ్మె ముగిసే వరకు ఎమ్మార్పీఎస్ కార్మికుల వెన్నంటే ఉంటుందని చెప్పారు. మందకృష్ణను పీఎస్‌కు తరలిస్తున్న పోలీసులు -
రాజిరెడ్డి దీక్ష భగ్నం.. అశ్వత్థామరెడ్డికి వైద్య పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె 44వ రోజు కొనసాగుతోంది. ఎల్బీనగర్లోని రెడ్డి కాలనీలో ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి కొనసాగిస్తున్న నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇంటి డోర్ పగలగొట్టి మరి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వచ్చే క్రమంలో రాజిరెడ్డి.. ఇంటి డోర్ వేసుకుని దీక్ష కొనసాగించారు. ఇంటి తలుపు పగలగొట్టి రాజిరెడ్డిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ సమయంలో రెడ్డి కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి రెండో రోజు దీక్ష కొనసాగిస్తున్నారు. శనివారం నుంచి హస్తినాపూర్‌లో తన నివాసంలో అశ్వత్థామరెడ్డి దీక్ష కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గృహ నిర్బంధంలో ఉండి దీక్ష చేస్తున్న ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం, ఆయన ఆరోగ్యం బాగోలేకపోతే పోలీసులు దీక్ష భగ్నం చేసి అరెస్ట్ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అశ్వత్థామరెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మందకృష్ణ అరెస్టు.. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా మహాదీక్షకు ఎమ్మార్పీఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందిరాపార్క్ దగ్గర ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ఇందిరా పార్క్‌కు వస్తున్న నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ హబ్సిగూడలోని కృష్ణ లాడ్జ్‌లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మందకృష్ణను అరెస్ట్ చేశారు. ఆయనను నాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని మందకృష్ణ విమర్శించారు. ఎట్టిపరిస్థిలోనూ భవిష్యత్తులో దీక్ష చేసి తీరుతామని అన్నారు. ఎమ్మార్పీఎస్ చేపట్టిన మహాదీక్షలో అసాంఘిక శక్తులు చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు బలగాలు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. కొనసాగుతున్న అశ్వత్థామరెడ్డి దీక్ష చదవండి: ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఆర్టీసీ డిపోల వద్ద కార్మికుల ఆందోళన సమ్మెలో భాగంగా కార్మికులు ఆర్టీసీ డిపోల దగ్గర ఆందోళనకు దిగారు. ఖమ్మం డిపో దగ్గర బైఠాయించిన కార్మికులు... బస్సును అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లాలోనూ డిపోల దగ్గర ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక టీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు ఇంటి దగ్గర చీపురులతో ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు ఆర్టీసీ కార్మికులు. మరోవైపు -
ఆశ్వత్థామ ఇంటి వద్ద నిరసనకు దిగిన న్యూడెమోక్రసీ నేతలు
-
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తథ్యం
సాక్షి, వనపర్తి టౌన్: ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కంటే సీఎం కేసీఆర్ తెలంగాణకు అత్యంత ప్రమాదకారిగా మారారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు, ప్రజాఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపేందుకు బుధవారం వనపర్తికి వచ్చిన ఆయన మాట్లా డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఏనాడూ ప్రభుత్వ అత్యున్నత అధికారి, మరో ముగ్గురు ఐఏఎస్‌లను హైకోర్టు పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసిందంటే అన్యాయం ప్రభుత్వం వైపు ఉందని తెలుస్తోందన్నారు. తెలంగాణ ఇస్తే చాలా రాష్ట్రాల డిమాండ్లు వస్తాయని కేంద్రం అంటే.. ఉన్న తెలంగాణ ఇవ్వాలని అడిగినం. అలాగే ఆర్టీసీ విలీనం చేస్తే 91 కార్పొరేషన్ల డిమాండ్ చేస్తాయని చెబుతున్న సీఎం కేసీఆర్.. పూర్వం ప్రభుత్వంలో ఉన్న ఆర్టీసీనే విలీనం చేయమని కోరుతున్నామని తెలుసుకోవాలని హితవు పలికారు. హైకోర్టులో తీర్పు రాకముందే సుప్రీం కోర్టు వెళ్తామని చెప్పడం కార్మికుల అంతిమ విజయానికి నిదర్శనమన్నారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్ సంగతి చూస్తాం... అంతు తేలుస్తాం అంటారే తప్పితే చేసిందేమీ లేదని, న్యాయస్థానంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని హైకోర్టు బోనులో దోషిగా నిలబెట్టిన చరిత్ర ఆర్టీసీ కార్మికులదని అన్నారు. ఆర్టీసీ కార్మికులు కేసీఆర్‌కు శాపనార్థాలు పెట్టవద్దని, దేవుడా కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని ప్రతి కార్మికుడు కోరుకోవాలని అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంకావడం తథ్యమని అన్నారు. యుద్ధంలో శత్రువు బతికి ఉన్నప్పుడే గెలవాలని చెప్పారు. ఆర్టీసీ ఆస్తులు కేసీఆర్ జాగీరుకాదని, ఏవడబ్బ సొమ్మని అమ్ముకుంటావు అంటూ నిప్పులు చెరిగారు. కార్మికులు విధుల్లో చేరకపోతే 100 శాతం ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం చూస్తే కేసీఆర్ ముందే కుట్రపన్నాడని తెలుస్తోందన్నా రు. హైకోర్టులో విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వానికి అక్షింతలు తప్పడంలేదని, ఒక దశలో ఇదేమి రాజరికంకాదని వ్యా ఖ్యానించిందంటే ప్రభుత్వంపై రాజ్యాంగ సంస్థ ఎంతమేర అసహనంతో ఉందో ఇట్టే అర్థమైతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు ఆర్.గోపిగౌడ్, జేవీ స్వామి, ఖయ్యాం, విశ్వనాథ్, యాదయ్య, డీబీకే రెడ్డి, వీవీమూర్తి, చలపతిరెడ్డి, బాలస్వామి ఉన్నారు. 40వ రోజుకు చేరిన సమ్మె ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 40వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమ్మె శిబిరంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యా్యమూర్తులతో కమిటీ వేస్తామంటే విముఖత చూపడం ప్రభుత్వ దివాళాకోరు తానికి నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, బీసీ సంఘం నేత యుగంధర్‌గౌడ్, బీజేపీ కృష్ణ, పరశురాం, వెంకటేశ్వర్‌రెడ్డి. ఎమ్మార్పీఎస్ గద్వాల కృష్ణ, కోళ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మెతో కేసీఆర్‌కు భయం: మందకృష్ణ
సాక్షి, హైదరాబాద్ : వందేళ్ల క్రితం అమలైన కెనడా ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని కేసీఆర్ కుట్ర పన్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కొంత మంది కార్మికులపై కాల్పులు జరిపించి ఉద్యమాన్ని పక్కదోవ పట్టించాలని చూశారని ఆరోపించారు. కానీ భయంతో ఆ ప్రణాళికలను అమలు చేయలేకపోయాడని విమర్శించారు. ‘కేసీఆర్, ఆయన భజనపరులకు నిన్నటి వరకు కాళేశ్వరం అక్రమ సంపాదనకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది. ఇప్పుడు కాళేశ్వరంపై కేంద్రం కన్ను పడడంతో కేసీఆర్ దృష్టి ఆర్టీసీపై పడింది. ఆర్టీసీ కార్మికుల నుంచి రాజకీయ పార్టీలను, ప్రజలను దూరం చేయాలని కేసీఆర్ కుట్ర చేశారు. ఆర్టీసీని నామరూపాలు లేకుండా చేయాలని కలలు కన్నార’ని విమర్శించారు. ఇంకా మాట్లాడుతూ.. ‘సమాజం మద్దతును ఆర్టీసీ కూడగట్టుకుంది. సమస్య పరిష్కారమయ్యే వరకు వెనక్కి తగ్గొద్దు. ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోవద్దు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టిన ఘనత కార్మికులదే. టీఎన్జీవో నాయకులు ఆర్టీసీ జేఏసీకి అండగా నిలవాలి. అంతేకానీ, కేసీఆర్‌కు వంత పాడి ఆర్టీసీ కార్మికులకు వెన్నుపోటు పొడవద్దు. సమ్మె మొదలైన నాటి నుంచి కోర్టు కార్మికుల పక్షానే నిలిచింది. కోర్టు హెచ్చరికల చివరి రూపమే సీఎస్‌ను, ఆర్టీసీ ఎండీని, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శిని బోనులో నిలబెట్టింది. ఆర్టీసీ సమ్మె కేసీఆర్‌లో భయాన్ని పుట్టించింది. అందుకే కేవలం తొమ్మిది నిమిషాల్లో పరిష్కారమయ్యే సమస్యకు తొమ్మిది గంటలు కేటాయించి చర్చలు జరిపాడ’ని ఎద్దేవా చేశారు. -
మిలియన్ మార్చ్‌కు మద్దతు ఇవ్వండి: అశ్వత్థామరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9న తలపెట్టిన మిలియన్ మార్చ్‌కు మద్దతు కోరడంతోపాటు సమ్మె భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు బుధవారం బీజేపీ, టీజేఎస్ నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగతో జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే మిలియన్ మార్చ్‌కు మద్దతు ఇవ్వాలని బీజేపీ, టీజేఎస్ నేతలను కోరామన్నారు. ఉద్యోగులను కూడా కలుస్తున్నామని, పెన్‌డౌన్ చేయాలని కోరుతామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత ఒత్తిడి తెచ్చినా ఒక్క శాతం మంది కూడా జాయిన్ కాలేదన్నారు. జాయిన్ అయిన వారు 300 మంది కూడా లేరని, చేరిన వారిలో డ్రైవర్లు, కండక్టర్లు 20 మంది కూడా లేరన్నారు. కార్మికులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనుకుంటే కేంద్రం ఆమోదం అవసరమన్నారు. తమ డిమాండ్లలో విలీనం ఒక్కటే కాదని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలనే తదితర 26 రకాల డి మాండ్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా డిమాండ్లపై చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. జేఏసీ కోకన్వీనర్ రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని రకాలుగా బెదిరించినా కార్మికులు వెనక్కి తగ్గలేదన్నారు. కోకన్వీనర్లు వీఎస్‌రావు, సుధ మాట్లాడుతూ.. సీఎం గడువు పెట్టి డకౌట్ అయ్యారన్నారు. భయాందోళనకు గురికావద్దు మేడ్చల్ రూరల్: కార్మికులెవ్వరూ భయాందోళనకు గురికావద్దని, గట్టిగా నిలబడాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి సూ చించారు. బుధవారం మేడ్చల్‌లో ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమంలో అశ్వత్థామరెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు రాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయ డం ఎవరి తరం కాదన్నారు. సీఎం కేసీఆర్ వాస్తవా లు గ్రహించి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోదండరాం కోరారు. కాగా, మాజీ మంత్రి గీతా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్ తదితరులు మేడ్చల్ డిపోలో ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. -
‘కేసీఆర్‌పై యుద్ధం చేసేవారిని అభినందిస్తా’
-
‘కేసీఆర్‌ను ఓడించి.. వాళ్లను గెలిపిద్దాం’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే అన్ని సమస్యలకు పరిష్కారమని, ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రతికి ఉండగానే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అవుతుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. కేసీఆర్‌పై యుద్ధం చేసే ప్రతి ఒక్కరినీ తాను అభినందిస్తానని చెప్పారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సకల జనుల సమరభేరిలో ఆయన మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌కు మొట్టమొదటి సారిగా సవాల్ విసిరిన ఆర్టీసీ కార్మికులకు అభినందనలు. సమ్మె చేస్తే డిస్మిస్ చేస్తానని కేసీఆర్ అంటే.. ఎంతమందిని డిస్మిస్ చేసినా తాము సమ్మెలో పాల్గొంటామని కార్మికులు ధిక్కరించారు. ఆర్టీసీని అమ్ముతామని కేసీఆర్ అంటే... ఆర్టీసీని కాపాడుకుంటామని కార్మికులు ఉద్యమిస్తున్నారు. ఆర్టీసీని ఖతం చేయాలనుకుంటే కేసీఆర్ ఖతం అవుతాడు. కేసీఆర్ ఒంటరై ఓటమికి దగ్గరగా ఉన్నాడు. కేసీఆర్ వర్సెస్ ఆర్టీసీ కార్మికుల ఉద్యమం... కేసీఆర్ వర్సెస్ సమస్త తెలంగాణ సమాజంగా మారింది. హిట్లర్ లాగా కేసీఆర్ ఆత్మహత్య చేసుకోవాలి గానీ మనం చేసుకోవద్దు. కేసీఆర్ తప్పా అన్ని పార్టీలు మనకు మద్దతుగా ఉన్నాయి కాబట్టి కేసీఆర్‌ను ఓడగొట్టి వేరేవాళ్ళని గెలిపిద్దామ’ని మందకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను సాగనంపుదాం సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందని బీజేపీ నాయకుడు జితేందర్‌రెడ్డి అన్నారు. స్వప్రయోజనాల కోసం ఆర్టీసీని వాడుకుని ఇప్పుడు ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన కోదండరాంను కూడా కేసీఆర్ పక్కనపెట్టేశారని గుర్తు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో రక్షణ ఉంటుందని.. ఆర్టీసీ కార్మికులు స్టీరింగ్ కాదు సుదర్శన చక్రం తిప్పుతారని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికలు అయిపోయాక వీధి లైట్స్ కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకుడు జి. వివేక్ ఆరోపించారు. కేసీఆర్ తుగ్లక్‌లా వ్యవహరిస్తూ రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారని, వారి ఉద్యమానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. -
ఒకరోజు దీక్షకు పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఎసి
-
‘కేసీఆర్‌కు స్వార్థం తలకెక్కింది’
సాక్షి, సంగారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలను విఫలం చేశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికులకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..కేసీఆర్‌కు స్వార్థం తలకెక్కి.. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని నామరూపాలు లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. హుజూర్నగర్ గెలుపుతో అహంకారం పెంచుకొని ఆర్టీసీ కార్మికులపై నోరుపారేసుకోవడం తగదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో లేని ఫామ్ హౌస్..తెలంగాణ వచ్చాక ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఒక పక్క అప్పుల రాష్ట్రం అంటూనే.. మరోపక్క కుటుంబ ఆస్తులను పెంచుకున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ అక్రమ ఆస్తులకు బలమైన వనరులు ప్రాజెక్టులే అని.. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు మొదటిదని మందకృష్ణ ఆరోపించారు. కేసీఆర్ అక్రమ సంపాదనకు వేరేదారి లేక ఇప్పుడు ఆర్టీసీని అమ్ముకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ సమాజం పూర్తి మద్దతు ఆర్టీసీ కార్మికులకు ఉందని, కార్మికులు అధైర్యపడొద్దని పిలుపునిచ్చారు. -
ఆర్టీసీని ఖతం చేస్తే ఊరుకోం: మందకృష్ణ
సాక్షి, మంచిర్యాల: తెలంగాణలో ఆర్టీసీనే కాదు.. ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఎమ్మార్పీఎస్, ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మందకృష్ణ...ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుంతుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం రాబోయే రోజుల్లో పరిరక్షణ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఆర్టీసీని ఖతం చేస్తే ప్రజలు ఊరుకోరు అని హెచ్చరించారు. నిజాంను తరిమికొట్టిన తెలంగాణ గడ్డ ఇదని.. కేసీఆర్‌కు అదే గతి పడుతుందని పేర్కొన్నారు. ప్రజల హక్కులను హరించే వారిని ఈ గడ్డమీదే భూస్థాపితం చేయాలని కాళోజీ అన్నాడు. ఇప్పుడు ప్రజలు అదే చేయబోతున్నారని తెలిపారు. (చదవండి: ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు: కేసీఆర్) అధికారం ఉందని అహంకారం.. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు డిపోల ముందే ఆందోళనలు చేశారు. కానీ ఇప్పుడు కనీసం డిపోల దగ్గరికి కూడా వెళ్లనివ్వట్లేదు అని మందకృష్ణ మండిపడ్డారు. కార్మికులు న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తుంటే పోలీసులు వారిపై అక్రమ కేసులు పెట్టడం, బెదిరింపులకు పాల్పడటం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. జిల్లాలో కార్మికులపై పోలీసుల వేధింపులకు నిరసనగా త్వరలోనే అఖిలపక్షం ఆధ్వర్యంలో ‘చలో మంచిర్యాల’ను నిర్వహిస్తామని వెల్లడించారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపుపై మందకృష్ణ స్పందిస్తూ.. టీఆర్ఎస్ వందల కోట్లు ఖర్చు చేసి గెలిచిందని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన సాధారణ ఎన్నికల్లోనూ గెలుస్తామనుకోవటం పొరపాటు అని వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని మందకృష్ణ విమర్శించారు. -
కేసీఆర్ ఫాం హౌస్‌లో ఏం జరుగుతోంది?
సాక్షి, హన్మకొండ: సీఎం కేసీఆర్ ఫాం హౌస్‌లో ఏం జరుగుతోందనే విషయాన్ని తెలుసుకునేందుకు హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్యపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హన్మకొండలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఫాం హౌస్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడని ఏసీపీ ఎలా ప్రకటిస్తారన్నారు. ఫాం హౌస్‌లోకి మద్యం సే వించి ఒక కానిస్టేబుల్ ఎలా వెళ్లగలడని ప్రశ్నించారు. పోలీసు అధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నా ఎందుకు విచారణ చేయించడం లేదని అన్నారు. కాగా, ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఈనెల 19న తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చా రు. హంటర్ రోడ్డులోని ఆర్టీసీ స్థలం లీజ్ రద్దు చేసుకోవాలని, దొరలకు బినామీగా కాకుండా ప్రజల మనిషిగా ఉండాలని వరంగల్ ఎంపీ దయాకర్‌కు సూచించారు. లీజును వదులుకోకపోతే ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ ఉద్యమం వరంగల్ నుంచే మొదలు పెడుతానని స్పష్టం చేశారు. ఎమ్మెస్పీ జాతీయ అ«ధికార ప్రతినిధి తీగల ప్రదీప్‌గౌడ్, ఎమ్మార్పీఎస్ నాయకుడు బొడ్డు దయాకర్, ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు కుమ్మరి రాజయ్య, వేణు పాల్గొన్నారు. -
'మాదిగ ఉపకులాలను రాజకీయ హత్య చేశారు'
సాక్షి, వరంగల్: తెలంగాణ ప్రభుత్వం మాదిగలకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించకుండా ఘోరంగా అవమానంనించి, మాదిగ ఉపకులాలను రాజకీయ హత్య చేశారని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. అయితే దీనిని తాము రాజకీయంగానే ఎదుర్కొంటామని ఆయన పేర్కొన్నారు. హన్మకొండ కేడీసీ గ్రౌండ్లో ఆదివారం (సెప్టెంబరు 22) మాదిగ మహా దీక్షను చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో సమావేశ ఏర్పాట్లను మందకృష్ణ మాదిగ శనివారం స్వయంగా వచ్చి పర్యవేక్షించారు. ఈ సందర్బంగా.. మాదిగ మహా దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారు హాజరుకావాలని పిలుపనిచ్చారు. సభకు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. రేపు జరిగే సభలో ఒకవేళ భారీ వర్షం కురిసినా కూడా యథాతథంగా నిర్వహిస్తామని మందకృష్ణ స్పష్టం చేశారు. ఉద్యామాన్నిఎంత అణచి వేయాలని ప్రయత్నిస్తే.. అంతా ఉవ్వెత్తున ఉద్యమం లేస్తుందని ఆయన హెచ్చరించారు. ఓసీ కులంలో వెలమ, రెడ్లు మాత్రమే ఉన్నారా? వైశ్య, బ్రహ్మణ కులాలలో లేరా? వారిని ఓసీ కులాల నుంచి తొలగించే ప్రయత్నం ఏమైనా చేశారా?అని ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. -
సీఎం కేసీఆర్ అంతు చూస్తాం..
పరకాల: మాదిగల అంతు చూడాలని చూస్తే సీఎం కేసీఆర్ అంతు చూస్తామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. పరకాల పట్టణంలోని అమరధామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంద కృష్ణమాదిగ మాట్లాడారు. సీఎం కేసీఆర్ మొదటి దఫాలోనే కాకుండా రెండో దఫా మంత్రి వర్గ విస్తరణలో మాదిగలకు చోటు ఇవ్వకపోవడం చూస్తేంటే మాదిగల అణిచివేత కుట్ర స్పష్టం అవుతుందన్నారు. 1 శాతం వెలమలకు 4 మంత్రి పదవులు, 4 శాతం ఉన్న రెడ్డిలకు 6 మంత్రి పదవులు, 12 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్క మంత్రి పదవి ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. హన్మకొండలోని కేడీసీ మైదానంలో ఈ నెల 22న చేపట్టబోయే మహా దీక్షతో యావత్తు ప్రపంచానికి మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని చూపిస్తామన్నారు. కార్యక్రమంలో మాదిగ యువసేన రాష్ట్ర కన్వీనర్ పుట్ట భిక్షపతి మాదిగ, పరకాల అధికార ప్రతినిధి దుప్పటి మొగిళి, ఎంఎస్ఎఫ్ పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ముక్కెర ముఖేష్ మాదిగ పాల్గొన్నారు. -
మంత్రివర్గంలో సామాజిక న్యాయమేది?
సాక్షి, కాజీపేట : కేసీఆర్ మంత్రి వర్గంలో వెలమ, రెడ్డి వర్గాలకే తప్ప మిగతా వర్గాలకు చోటు ఇవ్వకుండా సామాజిక న్యాయాన్ని విస్మరించారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. హన్మకొండ వడ్డేపల్లిలోని విద్యుత్ భవన్లో శుక్రవారం ఏర్పాటు సమావేశంలో మంద కృష్ణ మాట్లాడా రు. కేసీఆర్ తన మంత్రి వర్గంలో మాల, గౌడ, యాదవ, ముదిరాజ్, కాపు, ముస్లిం వర్గాలకు ఒక్కో సీటు కేటాయించడం ద్వారా ద్వంద్వనీతి అవలంబించారన్నారు. మాదిగ, ఉపకులాలతో పాటు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేని బీసీ, ఎస్టీ, అగ్రకుల వర్గాలకు స్థానం కల్పించేలా పోరాడుతామని తెలిపారు. సెప్టెంబర్ 22న హన్మకొండలోని కేడీసీ గ్రౌండ్లో నిర్వహించే మహాదీక్షకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలకాలని కోరా రు. అనంతరం వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు రాగటి సత్యం, ఎమ్మెస్పీ జాతీయ అధికార ప్రతినిధి తీగల ప్రదీప్‌గౌడ్‌తో బీఎన్.రమేష్, తిప్పారపు లక్ష్మణ్, బొడ్డు దయాకర్, మంద రాజు, ఈర్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోరాటాలతోనే సమస్యల పరిష్కారం కేయూ క్యాంపస్: ఉన్నతవిద్యపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. మాదిగల అస్తిత్వం కోసం, సామాజిక సమస్యలపై పోరాటాలకు ఎమ్మార్పీఎస్ కేంద్ర బిందువుగా నిలుస్తోందని చెప్పారు. కేయూకామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్‌హాల్‌లో శుక్రవారం మాదిగ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన మాదిగ అధ్యాపకుల రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మంద కృష్ణ మాట్లాడుతూ యూనివర్సిటీల్లో రెగ్యులర్ అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయడంతో పాటు కాంట్రాక్టు, పార్ట్‌టైం లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఎంటీఎఫ్ బాధ్యు డు డాక్టర్ పి.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సదస్సులో కేయూ అడ్మిషన్ల డైరెక్టర్ టి.మనోహర్, డెవలప్మెంట్ ఆఫీసర్ వీ.రాంచంద్రం, ఎంటీఎఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకట్‌మాదిగ, డాక్టర్ సమ్మయ్య, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. -
21న హన్మకొండలో ‘ఆవేదన దీక్ష’: మందకృష్ణ
సాక్షి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో 12శాతం ఉన్న మాదిగలకు స్థానం కల్పిచకపోవడం.. మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బతియ్యడమేనని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ...ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన మొదలైనప్పటి నుంచి మాదిగ, ఉప కులాలపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగ ఉప కులాలపై నియంతలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి గతంలో పని చేసిన సీనియర్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపడం మాదిగలపై వివక్ష చూపడం కదా? అని నిలదీశారు. కాగా 12 శాతం ఉన్న మాదిగ, ఉప కులాలకు ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదని.. కేవలం ఐదు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఆరు మంత్రి పదవులు కేటాయించడంపై కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. బుధవారం నుంచి ఈ నెల15 వరకు తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయితీల ముందు, 16న తహశీల్దార్ కార్యాలయల ముందు నిరసన దీక్షలు చేపడతామన్నారు. 18న అన్ని మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో పెద్దఎత్తున రాస్తారోకోలు నిర్వహిస్తామన్నారు. దీంతోపాటు 21న వరంగల్ జిల్లాలోని హన్మకొండ కేడీసీ మైదానంలో మాదిగలు, ఉప కులాలపై ప్రభుత్వం చూపించే వివక్షపై ఆవేదన వ్యక్తం చేసేందుకు ‘ఆవేదన దీక్ష’ చేస్తామన్నారు. ఈ కార్యకమం కోసం ‘చలో వరంగల్’కి పిలుపునిస్తున్నామని తెలిపారు. ఈ దీక్షలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని మద్దతు తెలుపాలి మందకృష్ణ కోరారు.