
సాక్షి, హైదరాబాద్: అనాథ పిల్లల సంరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఇందుకు ప్రత్యేక విధానాన్ని ప్రకటించాలని ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ డిమాండ్ చేశారు. పలు వేదికలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రత్యేక విధానంపై పలు వాగ్ధానాలు చేసినా కార్యాచరణ లేదని ఆయన మండిపడ్డారు.
అనాథ పిల్లల సంరక్షణ చర్యలపై ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించి ప్రత్యేక గుర్తింపు కార్డులు, కేజీ టు పీజీ ఉచిత విద్య తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఈనెల 30న ఇందిరాపార్క్ వద్ద దీక్ష నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.