
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి పార్లమెంటులో నిలదీయాలని మహాజన్ సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు, ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంద కృష్ణ రాసిన లేఖను ఎంఆర్‌పీఎస్, ఎంఎస్‌పీ నాయకులు శనివారం రేవంత్‌కు అందజేశారు.
ఎస్సీ వర్గీకరణపై 28 ఏళ్లుగా ఉద్యమం సాగుతోందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలతో పాటు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపించినా, వర్గీకరణకు సానుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం లేదని విమర్శించారు. వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంటులో ప్రశ్నిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment