Parliament
-
అమెరికా పార్లమెంట్లో బాత్రూమ్ గొడవ
వాషింగ్టన్ : అమెరికా పార్లమెంట్ చరిత్రలో తొలిసారిగా ప్రతినిధుల సభకు ఎన్నికై చరిత్ర సృష్టించిన డెమొక్రటిక్ నేత, ట్రాన్స్‌జెండర్ సారా మెక్బ్రైడ్పై అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు కారాలుమిరియాలు నూరుతున్నారు. ఇన్నాళ్లూ పబ్లిక్ టాయిలెట్లు, పాఠశాలల్లో ట్రాన్స్జెండర్లు ఏ బాత్రూమ్ వాడాలన్న దానిపై మొదలైన చర్చ ఇప్పుడు పార్లమెంట్‌లోనూ జరగబోతోంది. అయితే పార్లమెంట్ ఇరుసభలైన ప్రతినిధుల సభ, సెనేట్‌లో రిపబ్లికన్లదే ఆధిపత్యంకావడంతో వారు ప్రతిపాదించే బిల్లు ఆమోదం పొందే అవకాశాలే ఎక్కువ. అయితే వ్యక్తి గౌరవాన్ని భంగపరుస్తూ ఏకైక ట్రాన్స్‌జెండర్ చట్టసభ మెంబర్‌పై రిపబ్లికన్ సభ్యులంతా ఏకమై విరుచుకుపడతారా? అని డెమొక్రాట్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలతోపాటు సెనేట్, ప్రతినిధుల సభకూ ఎన్నికలు జరిగాయి. ప్రతినిధుల సభ ఎన్నికల్లో భాగంగా డెలావర్‌లోని ఎట్ లార్జ్ హౌస్ డి్రస్టిక్ట్ నుంచి రిపబ్లికన్ అభ్యరి్థపై 72వేలకుపైగా మెజారిటీతో గెలిచి అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా 34 ఏళ్ల సారా రికార్డుసృష్టించడం తెల్సిందే. అయితే పురుషునిగా జన్మించి ట్రాన్స్‌జెండర్‌గా మారినంతమాత్రాన సారాను మహిళల బాత్రూమ్లోకి అనుమతించబోమని రిపబ్లికన్ నాయకురాలు, సౌత్ కరోలినా ఫస్ట్ కాంగ్రెషనల్ డిస్టిక్ట్ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన నాన్సీ మేస్ కరాఖండీగా చెప్పారు. ఈ మేరకు సారాను అడ్డుకోవాలంటూ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో ఆమె బిల్లు ప్రవేశపెట్టారు. ‘‘సారాకు వ్యతిరేకంగా మేం ఇంత మాట్లాడుతున్నా సారా నుంచి స్పందన లేదు. అంటే తను పురుషుడు అని ఒప్పుకున్నట్లే. మేం సారాను మహిళల బాత్రూమ్, స్పేస్, లాక్ రూమ్, చేంజింగ్ రూమ్‌లకు అనుమతించబోం. ఈ మేరకు పార్లమెంట్ ప్రోటోకాల్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలి’’అని నాన్సీ మేస్ డిమాండ్‌చేశారు. ఈ ఉదంతంపై సారా స్పందించారు. అమెరికా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే రిపబ్లికన్లు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతి ఒక్క అమెరికన్‌కు తనకు నచ్చినట్లు జీవించే హక్కుంది. ఈ హక్కును గౌరవిస్తూ, పార్లమెంట్ సభ్యులు సభలో నాకు మద్దతు పలుకుతారని ఆశిస్తున్నా’అని సారా ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌చేశారు. జన్మతః పురుషుడైన సారా తన 21 ఏళ్ల వయసులో అమ్మాయిగా మారాడు. -
నిరసన డ్యాన్సులు..
-
న్యూజిలాండ్ - పార్లమెంట్ దద్దరిల్లింది
-
జపాన్‌లో పాలక పక్షానికి ఎదురుదెబ్బ
టోక్యో: జపాన్ పార్లమెంట్‌లోని శక్తిమంతమైన దిగువ సభకు ఆదివారం జరిగిన ఎన్నికల ఫలితాల్లో అధికార పక్షం మెజారిటీకి గండిపడింది. 465 సీట్లకు గాను మెజారిటీకి 233 సీట్లు అవసరం. చివరి ఫలితాలు అందేటప్పటికీ అధికార లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ, మిత్రపక్షం కొమెయిటో కలిపి 211 సీట్లు గెలుచుకున్నాయి. ఈ సంఖ్య కొంత పెరిగేలా ఉన్నా అధికార పక్షానికి మెజారిటీ కష్టమేనని భావిస్తున్నారు. ప్రతిపక్షం, ఇతరులు కలిసి 224 వరకు స్థానాలను దక్కించుకున్నారు. స్వతంత్రులుగా పోటీ చేసి, విజయం సాధించిన తమ వారిని కూడా కలుపుకుంటే అధికార పక్షం బలం పెరగొచ్చు. అయితే, అవినీతి ఆరోపణల నేపథ్యంలో వారిని చేర్చుకునేందుకు ఎల్డీపీ సిద్ధంగా లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలోని మరో పార్టీ సాయంతో ప్రధానమంత్రి షిగెరు ఇషిబా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. -
ప్రజాపద్దుల కమిటీ భేటీకి మాధవీ పురి డుమ్మా
న్యూఢిల్లీ: సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చైర్పర్సన్ హోదాలో ఉంటూ గౌతమ్ అదానీ గ్రూప్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధవీ పురీ బచ్ గురువారం పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) సమావేశానికి గైర్హాజరయ్యారు. సెబీ పనితీరును మాధవీ పురి మసకబార్చారంటూ అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గతంలో ఆరోపణలు చేయడంతో సెబీ పనితీరును ఆమె సమక్షంలోనే సమీక్షించేందుకు పీఏసీ సిద్ధమైన విషయంతెల్సిందే. ఈ క్రమంలో గురువారం ఢిల్లీలో పీఏసీ చైర్మన్, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన సమావేశం ఉదయం 11 గంటల ప్రాంతంలో మొదలైంది. అయితే చివరి నిమిషంలో అత్యవసర పనుల కారణంగా తాను ఢిల్లీలో సమావే శానికి రాలేకపోతున్నానని రెండు గంటలముందు మాధవీ సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె లేకుండా సమీక్ష అనవసరమని భావించి వేణుగోపాల్ సమావేశాన్ని మధ్యాహా్ననికి వాయిదావేశారు. -
‘నా ఛాంబర్లో చొరబాటు’.. రాజ్యసభ ఛైర్మన్‌కు ఖర్గే లేఖ
ఢిల్లీ: సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్( సీపీడబ్ల్యూడీ ), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), టాటా ప్రాజెక్ట్‌ల అధికారులు సమాచారం ఇవ్వకుండా పార్లమెంట్‌లోని తన గదిలోకి ప్రవేశించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన గురువారం రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు లేఖ రాశారు.‘‘ఇది చాలా అసాధారణ విషయం. నా ఛాంబర్లోకి అనుమతి లేకుండా ప్రవేశించి.. ఎంపీగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా నాకున్న అధికారాలు, నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఇలా నా ఛాంబర్లోకి చొరబాడటం... అగౌరవపర్చటంతో పాటు ఆమోదయోగ్యం కాదు. ఎవరి అదేశాలు, సూచనల ప్రకారం వారు అనుమతి లేకుండా నా ఛాంబర్లోకి ప్రవేశించారో తెలియజేయాని డిమాండ్ చేస్తున్నా. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి' అని ఖర్గే లేఖలో పేర్కొన్నారు.అయితే.. ఈ విషయంపై ఇంకా ఎటువంటి అప్డేట్ లేదని రాజ్యసభ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఖర్గే లేఖపై.. సీఐఎస్ఎఫ్ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఛాంబర్లతో ఏవైనా నిర్మాణ మరమత్తు పనులు జరుగుతున్న సమయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది పార్లమెంట్‌లోని ప్రోటోకాల్‌లో భాగంగా ఇతర ఏజెన్సీలతో కలిసి ఉంటారని ఓ అధికారి తెలిపారు.‘‘పలు కార్యాలయాల్లో మరమత్తు పనులు జరిగాయి. కార్యాలయాల తాళాలు సీఐఎస్ఎఫ్ వద్ద లేవు. పార్లమెంటు అంతటా భద్రత కోసం మాత్రమే సీఐఎస్ఎఫ్ ఉంది. నిర్వహణ పనుల జరగుతున్న సమయంలో వారు.. అధికారులతో పాటు పలు కార్యాలయాలకు వెళ్లి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూశారు’ అని చెప్పారు. -
గట్టెక్కిన కెనడా ప్రధాని ట్రూడో
టొరంటో: అవిశ్వాస తీర్మానంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం నెగ్గింది. దీంతో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ పార్లమెంటులో బుధవారం ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 211 మంది సభ్యులు ఓటేయడంతో తీర్మానం వీగిపోయింది. తీర్మానానికి మద్దతుగా కేవలం 120 మంది సభ్యులు ఓటేశారు. దీంతో విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ట్రూడో గెలుపు సులువైంది. పెరుగుతున్న ధరలు, గృహ సంక్షోభంపై అసంతృప్తితో ప్రజాదరణ తగ్గిపోయింది. దీనికి తోడు మాంట్రియల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ ఓటమి పాలైంది. న్యూ డెమొక్రటిక్ పార్టీ 2022లో చేసుకున్న ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ట్రూడో ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో ట్రూడో ప్రభుత్వం మైనారిటీలో పడింది. 2025 అక్టోబర్ చివరిదాకా ప్రభుత్వానికి కాలపరిమితి ఉన్నా మైనారిటీ సర్కార్ కావడంతో అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ పట్టుబట్టడం తెల్సిందే. ‘‘ఈ రోజు దేశానికి మంచి రోజు. కెనడా ప్రజలు ఎన్నికలను కోరుకుంటున్నారని నేను అనుకోవడం లేదు’’ అని ప్రభుత్వ వ్యవహారాల ఇంచార్జ్, సీనియర్ లిబరల్ పార్టీ నేత కరీనా గౌల్డ్ అన్నారు. వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతూ, సమస్య వారీగా చట్టం చేయబోతున్నామని ఆయన తెలిపారు. ముందున్న సవాళ్లు.. అవిశ్వాసం నుంచి గట్టెక్కినా ట్రూడోకు ఇతర సవాళ్లు ఎదురవుతున్నాయి. తమ డిమాండ్లకు అంగీకరించకపోతే ప్రభుత్వాన్ని కూలదోస్తామని బ్లాక్ నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు లిబరల్స్ త్వరలో బడ్జెట్‌పై రెండో ఓటింగ్‌ను ఎదుర్కోనున్నారు. 2025 అక్టోబర్ నెలాఖరులో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో రైట్ ఆఫ్ సెంటర్ కన్జర్వేటివ్ పారీ్టకి భారీ ఆధిక్యం లభించింది. దీంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని తాము కోరుకుంటున్నామని కన్జర్వేటివ్‌లు చెబుతున్నారు. లిబరల్స్ పాలనలో ఫెడరల్ ఖర్చులు, నేరాలు పెరిగాయని విమర్శిస్తున్నారు. మరోవైపు సీనియర్లకు ఎక్కువ నిధులు ఇస్తే కనీసం డిసెంబర్ నెలాఖరు వరకు ట్రూడోను అధికారంలో ఉంచుతామని, లేదంటే గద్దె దించుతామని బ్లాక్ నాయకులు హెచ్చరిస్తున్నారు. క్యూబెక్‌లో నివసిస్తున్న పాడి రైతులను రక్షించే సుంకాలు, కోటాల వ్యవస్థను పరిరక్షిస్తామని బ్లాక్ నాయకుడు వైవ్స్ ఫ్రాంకోయిస్ బ్లాంచెట్ అన్నారు. అక్టోబర్ 29లోగా ప్రభుత్వం అధికారికంగా ఈ పని చేయకపోతే ట్రూడోను గద్దె దించేందుకు విపక్షాలతో చర్చిస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇందులోనూ ఆయన విజయం సాధించాలంటే అవిశ్వాస తీర్మానం సందర్భంగా ట్రూడోకు మద్దతిచ్చిన న్యూ డెమొక్రటిక్ పార్టీ మద్దతు అవసరం. -
పాక్ పార్లమెంటులో ఎలుకల వేట!
మనకు రామాయణంలో పిడకల వేట తెలుసు. ఇప్పుడు పాక్ పార్లమెంట్ ఎలుకల వేట సాగుతోంది! పార్లమెంటు భవనంలో ఎలుకలు విపరీతంగా పెరిగిపోయాయట. 2008 నుంచి జరిగిన సమావేశాల రికార్డులను పరిశీలించాలని అధికారిక కమిటీ ఒకటి కోరడంతో సమస్య తీవ్రత వెలుగులోకి వచ్చింది. రికార్డులన్నీ కాగితం ముక్కలై కనిపించడంతో ఇదెవరి పనా అని ఆరా తీస్తే ఎలుకల నిర్వాకమని తేలింది.వాటి ఆకారాలు కూడా అలా ఇలా లేవట. ‘‘ఎలుకలు ఎంత పెద్దగా ఎన్నాయంటే, బహుశా పిల్లులు కూడా వాటికి భయపడిపోతాయేమో! మా సిబ్బందికంటే వాటిని చూసీ చూసీ అలవాటైపోయింది. కానీ తొలిసారి వచ్చేవాళ్లంతా ఈ ఎలుకల విరాట్ స్వరూపాలను చూసి వణికిపోతున్నారంటే అతిశయోక్తి కాదు’’ అని నేషనల్ అసెంబ్లీ అధికార ప్రతినిధి జాఫర్ సుల్తాన్ వాపోయారు. రికార్డులు మొదలుకుని దొరికిన దాన్నల్లా ఈ ఎలుకలు హాం ఫట్ అనిపిస్తున్నాయట. దాంతో వాటి వేటకు పిల్లుల కొనుగోలు తదితరాలకు వార్షిక బడ్జెట్లో 12 లక్షలు కేటాయించాల్సి వచి్చంది! ఎలుకలను ట్రాప్ చేయడానికి ప్రత్యేక నెట్ కిటికీలు ఏర్పాటు చేస్తున్నారు. ‘పార్లమెంటులో మనుషుల అలికిడి ఉన్నప్పుడు చడీచప్పుడూ లేకుండా ఎక్కడో నక్కుతాయి. అంతా నిర్మానుష్యం కాగానే పార్లమెంట్ ఆవరణను మారథాన్ ట్రాకుగా మార్చేసుకుంటున్నాయి. ఇంత తెలివైన ఎలుకలను నేనెప్పుడూ చూడలేదు’’ అని జాఫర్ చెప్పుకొ చ్చారు. విపక్ష నాయకుని కార్యాలయం, స్టాండింగ్ కమిటీల భేటీలు జరిగే తొలి అంతస్తులోనే ఎలుకలు విపరీతంగా ఉన్నట్టు గుర్తించారు. చివరికి వీటి కట్టడికి పెస్ట్ కంట్రోల్ కంపెనీల కోసం పేపర్ ప్రకటనలు కూడా ఇవ్వాల్సి వచి్చందట! -
వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ సంఘం
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ) బిల్లు–2024ను క్షుణ్నంగా పరిశీలించి, మార్పుచేర్పులపై సిఫార్సులు చేయడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటుకు పార్లమెంటు శుక్రవారం ఆమోదం తెలిపింది. లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది కలిపి 31 మందిని కమిటీ సభ్యులుగా నియమించారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి వి.విజయసాయిరెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్ట), డి.కె.అరుణ (బీజేపీ), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), లావు శ్రీకృష్ణదేవరాయలు (టీడీపీ) ఉన్నారు. కమిటీ తన నివేదికను పార్లమెంట్ తదుపరి సమావేశాల తొలి వారంలో సమరి్పంచనుంది. పార్లమెంట్ నిరవధిక వాయిదా పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాలు 12వ తేదీ దాకా జరగాల్సి ఉండగా ముందే వాయిదా వేశారు. -
Iraq: బాలికల కనీస వివాహ వయసు 9 ఏళ్లకు కుదిస్తూ బిల్లు ప్రతిపాదన
అమ్మాయిలకు కనీస వివాహ వయసును 9 ఏళ్లకు కుదిస్తూ ఇరాక్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదిత బిల్లుపై తీవ్ర ఆగ్రహం, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. పర్సనల్ స్టేటస్ లాను సవరించే ఉద్దేశంతో రూపొందించిన ఈ వివాదాస్పద బిల్లును ఇరాక్ న్యాయశాఖ మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.. అయితే ఇది ఆమోదం పొంది చట్టంగా మారితే వివాహానికి కనీస అమ్మాయి వయస్సు 9 ఏళ్లు ఉండగా.. అబ్బాయి వయస్సు 15 ఏళ్లుకు కుదించనున్నారు.కుటుంబ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునేందుకు, మతపరమైన అధికారులు లేదా సివిల్ న్యాయవ్యవస్థలో దేనినైనా ఎంచుకోవడానికి ఈ బిల్లు అనుమతిస్తుంది. అయితే, వారసత్వం, విడాకులు, పిల్లల సంరక్షణ విషయాలలో మహిళ హక్కులను ఇది హరిస్తుందని విమర్శకులు భయపడుతున్నారు. బిల్లు కానీ పార్లమెంటులో ఆమోదం పొందితే బాల్య వివాహాలు భారీగా పెరిగిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. లింగ సమానత్వంతోపాటు మహిళా హక్కుల విషయంలో ఇప్పటి వరకు సాధించిన పురోగతిని ఈ బిల్లు నట్టేట్లో కలిపేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ బిల్లు ఆమోదం పొందితే, 9 ఏళ్లలోపు బాలికలు మరియు 15 ఏళ్లలోపు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి అనుమతిస్తారు, ఇది పెరిగిన బాల్య వివాహాలు మరియు దోపిడీల భయాలను రేకెత్తిస్తుంది. ఈ తిరోగమన చర్య మహిళల హక్కులు మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో దశాబ్దాల పురోగతిని అణగదొక్కుతుందని విమర్శకులు వాదించారు.మానవహక్కుల సంఘాలు, మహిళా సంఘాలు సైతం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బాలికల విద్యను ఇది అడ్డుకుంటుందని, వారి ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. చిన్న వయసులోనే గర్భం దాల్చడం, గృహ హింస వంటి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ ప్రకారం, ఇఆరక్లో 28శౠతం మంది బాలికలకు 18 ఏళ్ల లోపు వివాహాలుజరుగుతున్నట్లు వెల్లడైంది. అయితే ఇరాక్ గతంలోనూ ఇలాంటి ప్రయత్నమే చేసినప్పటికీ అప్పట్లో చట్ట సభ్యుల వ్యతిరేకతతో వెనక్కి తగ్గింది. -
మద్దతు ధర టీడీపీ, జేడీ(యూ)కేనా?
సాక్షి, న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర కల్పించి, రైతన్నలకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు గురువారం పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శన చేపట్టారు. తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్) తదితర పార్టీల సభ్యులు పార్లమెంట్ మకర ద్వారం మెట్లపై గుమికూడారు. ఉల్లిపాయలు, కూరగాయల దండలను మెడపై ధరించి కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. ‘పంటలకు కనీస మద్దతు ధర కల్పించండి’, ‘రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోండి’ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. శివసేన(ఉద్ధవ్) ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ... ‘‘తెలుగుదేశం పార్టీ, జేడీ(యూ)లకు బీజేపీ ప్రభుత్వం కనీస మద్దతు ధర(స్పెషల్ ప్యాకేజీ) అందించింది. అదే తరహాలో రైతులకు కూడా కనీస మద్దతు ధర అందించాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ సమానమేనని గుర్తించుకోవాలి. రైతులు దేశంలో ప్రధాన వాటాదార్లు. అందుకే వారికి మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి విదేశాలకు ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగేలా చూడడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. -
రాజ్యసభలో వినేశ్ ఫొగట్ అంశం .. విపక్షాలపై ధన్‌ఖడ్ ఆగ్రహం
న్యూఢిల్లీ: రాజ్యసభ్య నుంచి ఇండియా కూటమి సభ్యులు వాకౌట్ చేశారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేయడంపై చర్చకు అనుమతించకపోవడంతో ఇండియా కూటమి సభ్యులు రాజ్యసభ్య నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో పతకం ఖాయమైన తర్వాత బుధవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 50 కేజీల కేటగిరీ ఫైనల్లో తలపడాల్సిన మన రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. పోరుకు కొన్ని గంటల ముందు నిర్వహించే వెయింగ్‌లో ఆమె బరువు 50 కేజీల 100 గ్రాములుగా వచ్చింది. ఉండాల్సిన బరువు కన్నా 100 గ్రాములు ఎక్కువుంది. దాంతో నిబంధనల ప్రకారం ఆమెను డిస్క్వాలిఫై చేస్తు న్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో గురువారం రాజ్యసభలో వినేశ్ ఫొగాట్ డిస్క్వాలిఫై అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పట్టుబట్టారు. దీనిపై రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఒక్కరికే (ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ) హృదయం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. దేశం మొత్తం ఆమె పరిస్థితి చూసి బాధపడుతోంది. మీరిలా ప్రతీ (ఒలింపిక్స్‌లో డిస్క్వాలిఫై) అంశాన్ని రాజకీయం చేస్తే ఆమెను అవమానించినట్లు కాదా అని వ్యాఖ్యానించారు. ప్రతి స్పందనగా విపక్షనేతలు నినాదాలు చేయడంతో.. ఆగ్రహించిన ధన్కర్ కుర్చీలోంచి లేచి వెళ్లిపోయారు. అనంతరం, సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఇండియా కూటమి నేతలు ప్రకటించారు. #WATCH | Congress MP Deepender Hooda says, "Vinesh has not lost but she has won the hearts of crores of people. The sports system has lost. The government should give her all the facilities that are given to a gold medallist... Today a Rajya Sabha seat is vacant (in Haryana), we… pic.twitter.com/456mQEYea5— ANI (@ANI) August 8, 2024వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్ అనర్హతకు సంబంధించిన అంశంపై చర్చించాలని మేము కోరాం. కానీ ప్రభుత్వం సిద్ధంగా లేదు అని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ మీడియాతో మాట్లాడారు. ఒలింపిక్స్‌లో డిస్క్వాలిఫై కావడంతో వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఆమె రిటైర్మెంట్పై స్పందించిన తివారీ.. ఆశ కోల్పోవద్దని, దేశం మొత్తం ఆమెకు అండగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. -
వయనాడ్ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి: రాహుల్
ఢిల్లీ: కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విపత్తు కారణంగా వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. అర్ధరాత్రి వరదల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటన దేశ ప్రజలను దిగ్బ్రాంతికి గురిచేసింది. కాగా, ఆకస్మిక ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు.ఇక, రాహుల్ గాంధీ బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో రాహుల్ మాట్లాడుతూ..‘వయనాడ్‌లో విషాదకర ఘటన జరిగింది. వరదల కారణంగా వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని నేను సందర్శించాను. ఈ ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. చాలా మంది ఆచూకీ తెలియలేదు. వారి మృతదేహాలు కూడా దొరకలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. బాధితుల్లో కుటుంబంలోని సభ్యులందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలినవారు సైతం ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో కేంద్రం బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి. Wayanad is facing a terrible tragedy, and I urge the Union government to take the following actions:1. Support a comprehensive rehabilitation package for the affected communities2. Enhance the compensation for bereaved families3. Declare the Wayanad landslides a 'National… pic.twitter.com/TFy0IF0ZIU— Rahul Gandhi (@RahulGandhi) August 7, 2024 వరదల కారణంగా వయనాడ్‌లో కీలక రహదారులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలి. వారికి ఇచ్చే పరిహారాన్ని పెంచి, బాధితులకు పునరావాసాన్ని కల్పించాలి. ప్రకృతి విపత్తు సంక్షోభ సమయంలో బాధితులకు సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో వయనాడ్‌లో సహాయక చర్యల్లో సహకరించిన కేంద్ర బలగాలు, సైనికులను ప్రశంసించారు. ఆపదలో అండగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రత్యేకంగా అభినందించారు. -
ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీని ఎత్తివేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై 18 శాతం జీఎస్టీ రద్దు డిమాండ్‌తో విపక్ష ఇండియా కూటమి నేతలు మంగళవారం పార్లమెంట్ మకర ద్వారం నిరసన చేపట్టారు. ‘పన్ను ఉగ్రవాదం’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాందీతో పాటు ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన(ఉద్ధవ్), తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, జేఎంఎం ఎంపీలు పాల్గొన్నారు. ఆరోగ్య రంగంపై జీఎస్టీ ప్రజలపై పెనుభారమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు నష్టపోతున్నారన్నారు.జీఎస్టీతో బాధితుల కష్టాలు రెట్టింపవుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ చెప్పారు. ఇండియా కూటమి ఎంపీల నిరసనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్ హౌస్ ప్రవేశ ద్వారం వద్ద నిరసనలు, నినాదాలు నిబంధనలకు వ్యతిరేకమన్నారు. ప్రవేశ ద్వారం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదన్న నిర్ణయానికి కట్టుబడతామని సభ్యులంతా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇదిలా ఉండగా, 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ కింద రూ.8,263 కోట్లు వసూలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో వెల్లడించింది. -
బంగ్లా సంక్షోభం: పార్లమెంట్ రద్దు
ఢాకా: బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దేశ పార్లమెంట్ రద్దు అయింది. ఈ మేరకు అధ్యక్షుడు మహ్మద్ షాహబుద్దీన్ ఓ ప్రకటన విడుదల చేశారు. రిజర్వేషన్ల కోటా నిరసనల నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ చేరుకున్నారు. అనంతరం ఆర్మీ నియంత్రణలోకి వెళ్లిన బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడిగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా చర్చలు జరుపుతున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. చదవండి: బంగ్లాదేశ్ పరిస్థితులను గమనిస్తున్నాం: కేంద్ర మంత్రి జైశంకర్నూతన ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడిగా మహ్మమద్ యూనస్‌ను నియమించాలంటూ నిరసనలు చేస్తున్న విద్యార్థి సంఘాల ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిపై ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ నిరసన విద్యార్థి నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్ ప్రధాని పదవికి నిన్న రాజీనామా చేసిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఉన్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన వెంటనే నిన్న భారత్‌కు చేరుకున్నారు షేక్ హసీనా. ఘజియాబాద్ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు సైనిక విమానంలో వచ్చిన షేక్ హసీనా లండన్ వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. హసీనా వెంట ఆమె సోదరి హసీనా కూడా ఉన్నారు. ప్రస్తుతానికి రహస్య ప్రదేశంలో ఉన్న హసీనా బ్రిటన్ సర్కార్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అయితే బ్రిటన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆదేశం నుంచి అనుమతి రాగానే లండన్ బయలు దేరి వెళ్లే అవకాశం ఉంది. -
బడ్జెట్లో 26 రాష్ట్రాల పేర్లులేవు: నిర్మలాసీతామరామన్ క్లారిటీ
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రసంగంలో 26 రాష్ట్రాల ఊసే లేదని, అంత మాత్రాన ఆ రాష్ట్రాలకు కేటాయింపులు జరపనట్లు కాదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2024 బడ్జెట్‌పై జరిగిన చర్చకు లోక్‌సభలో మంగళవారం(జులై 30) ఆమె సమాధానమిచ్చారు. రెండు రాష్ట్రాలకే అధిక కేటాయింపులు చేశామనడం సరికాదన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థికవ్యవస్థ అని చెప్పారు. గతంలో యూపీఏ పాలనలో రాష్ట్రాలకు కేటాయింపుల లెక్కలు వెల్లడించారు. వరుసగా మూడోసారి ఎన్డీయేకు అధికారం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలని, ప్రధాని మోదీపై ప్రజలు మరోసారి విశ్వాసం ఉంచి అధికారం ఇచ్చారన్నారు. -
ఢిల్లీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఎంపీ భాన్సూరి
-
స్పీకర్‌కు లేఖ.. ప్రతిపక్ష ఎంపీలపై బెదిరింపు వ్యాఖ్యలు: గౌరవ్ గోగొయ్
ఢిల్లీ: ప్రతిపక్షనేతలపై మంత్రులు అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ విసయంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ లోక్‌సభ ఉపనేత గౌరవ్ గొగోయ్ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. మంత్రుల పార్లమెంటరీ ప్రవర్తన ప్రమాణాలు దిగజారాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీపై కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, రవ్నీత్ సింగ్ బిట్టు అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తూ, బెదిరింపు దోరణితో వ్యహరించారని ఆరోపణలు చేశారు. ఈవిషయంలో లోక్‌సభ స్పీకర్ వెంటనే జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. పార్లమెంట్ సభ్యులపై చేస్తున్న పలు అభ్యంతరకమైన సేట్మెట్లు చేసస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.‘ ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లోని ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తరచుగా అధికార మంత్రులే ప్రతిపక్ష పార్టీల సభ్యులపై అన్‌పార్లమెంటరీ, అభ్యంతరకర, బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్లమెంటు సభ్యుడు కాని హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడాపై జూలై 26న కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అభ్యంతరకర పదజాలం ఉపయోగించారు. జూలై 25న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీని ఉద్దేశించి కేంద్ర సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు అన్ పార్లమెంటరీ భాషలో వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపి నిషికాంత్ దూబే సభలో మతపరమైన భాష ఉపయోగిస్తూవ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఈ సంఘటనలు జరిగినప్పుడు తన సభ్యులను అదుపు చేయలేదు అని లేఖలో పేర్కొన్నారు. -
35 ఏళ్లలోపు యువతకు 10 శాతం సీట్లు రిజర్వ్ చేయాలి
ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్‌సభలో కొందరు చట్టసభ్యులు ప్రైవెట్ మెంబర్ బిల్లును ప్రవేశపెడుతున్నారు. దీనిలో భాగంగా లోక్‌సభలో 10 శాతం స్థానాలను 35 ఏళ్లలోపు వారికి రిజర్వ్ చేయాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఓ ప్రైవేట్ మెంబర్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటులో యువత స్పష్టంగా మైనారిటీగా ఉందని, ఇది ప్రజాస్వామిక లోటుకు దారి తీస్తుందని ఆ బిల్లులో పేర్కొన్నారు. మన దేశ జనాభాలో 35 ఏళ్లలోపు వయస్సు గలవారు 65 శాతానికిపైగా ఉన్నారని తెలిపారు. మన దేశంలో యువ ఎంపీలు తగిన సంఖ్యలో లేరని పేర్కొన్నారు. లోక్‌సభలో యువత కోసం కొన్ని స్థానాలను కేటాయించడం వల్ల యువతకు కూడా రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పిస్తున్నామనే సందేశాన్ని పంపవచ్చని చెప్పారు.అసలు ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటే ఏమిటి? శాసన ప్రక్రియలో భాగంగా పార్లమెంట్లో రెండు రకాల బిల్లులను చట్ట సభ్యులు ప్రవేశపెడతారు. అవి ఒకటి పబ్లిక్ బిల్లు, మరోకటి ప్రైవేట్ బిల్లు. పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లును మంత్రి కాకుండా అధికార, ప్రతిపక్ష ఎంపీలు ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు. ఇక.. పబ్లిక్ బిల్లులను ప్రభుత్వంలో ఉన్న మంత్రులు మాత్రమే ప్రవేశపెడతారు. అందుకే ఈ బిల్లును ప్రభుత్వ బిల్లు అని కూడా పిలుస్తారు. ప్రైవేట బిల్లు ప్రవేశపెట్టడానికి నోటీసు పీరియడ్ నెల రోజులు ఉంటుంది. చట్ట సభ్యలు ఈ బిల్లును ముసాయిదా రూపంలో మాత్రమే ప్రవేశపెడతారు. ఈ ప్రైవేట్ బిల్లును శుక్రవారం రోజు మాత్రమే ప్రవేశపెట్టి చర్చ జరుపుతారు. పార్లమెంట్ సమావేశాల్లో కేవలం మూడు ప్రైవేట్ బిల్లులను మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో శుక్రవారం ముగ్గురు ఎంపీలు మూడు ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు. ప్రైవేటు సెక్టార్లో రిజర్వేషన్లు కోరుతూ ప్రైవేట్ బిల్లుబీమ్ ఆర్మీ చీఫ్, ఎంపీ చంద్ర శేఖర్ ఆజాద్ ప్రైవేట్ సెక్టార్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ శుక్రవారం ప్రైవెట్ మెంబర్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.ప్రైవేట్ రంగంలోని విద్యాసంస్థలు, కనీసం 20 మందితో కూడిన పలు సంస్థల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలో రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లులో కోరారు. ఇప్పటివరకు ప్రభుత్వం కల్పించే రిజర్వేషన్లు.. పబ్లిక్ సెక్టార్లోనే అమలు అవుతున్న విషయం తెలిసిందే.విమాన ఛార్జీల నియంత్రణపై ప్రైవేట్ బిల్లుకాంగ్రెస్ ఎంపీ షఫీ పరంబిల్ ప్రైవేట్ విమాన ఛార్జీల నియంత్రణపై ప్రైవేట్ మెంబర్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. విమాన ఛార్జీల పర్యవేక్షణ , నియంత్రణ కోసం ఓ రెగ్యూలేటరీ బోర్డును ఏర్పాటుచేయాలని బిల్లులో పేర్కొన్నారు. కొన్ని విమానయాన సంస్థలు అధిక ఛార్జీల పేరుతో ప్రజలను దోచుకోవటం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ప్రయాణించే అవకాశాలను తగ్గిస్తాయని తెలిపారు. -
Budget 2024: బడ్జెట్, క్యూ1 ఫలితాలపై దృష్టి
ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు సమగ్ర బడ్జెట్– 2024కు అనుగుణంగానే ఈ వారం స్టాక్ మార్కెట్ కదలాడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే కార్పొరేట్ కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలపైనా మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు. జూలై డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు (గురువారం), ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చంటున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, రూపాయి ట్రేడింగ్, క్రూడ్ కదలికలు తదితర సాధారణ అంశాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావమెంత..? ఎన్డీఏ 3.0 ప్రభుత్వం ఈ జూలై 23న (మంగళవారం) ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ కోసం మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆర్థిక లోటు, మూలధన వ్యయాలు, సామాజిక వ్యయాల కేటాయింపుల మధ్య సమతుల్యత చేకూర్చే దిశగా ప్రభుత్వం ప్రయతి్నస్తుండటంతో ఈసారి ‘పారిశ్రామిక అనుకూల బడ్జెట్’ను నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగ కల్పన, మేక్ ఇన్ ఇండియా, గ్రీన్ ఎనర్జీ, పట్టణ, గ్రామీణాభివృద్ధి అంశాలపై దృష్టి సారించే వీలుంది. అలాగే ‘దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను’పై ప్రకటన కోసం దేశీయ విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘‘బడ్జెట్ అంచనాలను అందుకుంటే, మార్కెట్‌కు మరింత స్థిరత్వం లభిస్తుంది. రక్షణ, రైల్వే, మౌలిక రంగ షేర్లలో కదలికలు అధికంగా ఉండొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌పై దృష్టి మార్కెట్ ముందుగా గత వారాంతాన వెల్లడైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యస్ బ్యాంక్ క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో బీఎస్ఈ ఎక్సే్చంజీలో లిస్టయిన 298 కంపెనీలు జూన్ క్వార్టర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్అండ్టీ, ఎస్బీఐ ఇన్సూరెన్స్, నెస్లే, సిప్లా, ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంకులున్నాయి. వీటితో పాటు ఇండిగో, ఐసీఐసీఐ ప్రుడెన్సియల్ లైఫ్ ఇన్సూరెన్స్, అలైడ్ బ్లెండర్స్, ఐడీబీఐ బ్యాంక్, సుజ్లాన్ ఎనర్జీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎంఅండ్ఎం ఫైనాన్స్ సరీ్వసెస్, టొరెంట్ ఫార్మా, యూనిటెడ్ స్పిర్పిట్స్ కంపెనీలు తమ తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు యూరోజోన్ జూలై వినియోగదారుల విశ్వాస గణాంకాలు, అమెరికా జూన్ గృహ అమ్మకాలు మంగళవారం విడుదల కానున్నాయి. అమెరికా, జపాన్ యూరోజోన్లు బుధవారం జూలై నెలకు సంబంధించి తయారీ, సేవారంగ గణాంకాలను ప్రకటించనున్నాయి. అదే రోజున దేశీయ జూలై హెచ్ఎస్బీసీ తయారీ, సేవారంగ పీఎంఐ గణాంకాలు విడుదల కానున్నాయి. అమెరికా క్యూ2 జీడీపీ డేటా, కోర్ పీసీఈ ధరల గణాంకాలు, వాస్తవ వినియోగదారుల వ్యయ డేటా గురువారం వెల్ల డి కానుంది. ఇక వారాంతపు రోజైన శుక్రవారం ఆర్బీఐ జూలై 19తో ముగిసిన వారపు ఫారెక్స్ నిల్వ లు ప్రకటించనుంది. ఆయా దేశాలకు సంబంధించిన కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.గురువారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపుఈ గురువారం(జూలై 25న) నిఫ్టీకి చెందిన జూలై సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘సాంకేతికంగా నిఫ్టీ 24,700 వద్ద కీలక నిరోదాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని చేధించగలిగితే 25,000 స్థాయిని శ్రేణిని పరీక్షిస్తుంది. దిగువ స్థాయిలో 24,000 వద్ద తొలి మద్దతు, 23,500 వద్ద మరో కీలక మద్దతు స్థాయిలు ఉన్నాయి’’ అని ఆప్షన్ డేటా సూచిస్తోంది. -
వాడివేడిగా అఖిలపక్ష భేటీ.. ‘నీట్’పై నిలదీసిన విపక్షాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఆదివారం(జులై 21) అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఈ భేటీ కొనసాగుతోంది. జులై 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పలు అంశాలపై ప్రభుత్వం విపక్షాలతో చర్చిస్తోంది. బడ్జెట్‌తో పాటు సభ ముందుకు రానున్న పలు బిల్లుల జాబితాను వారికి వివరిస్తోంది. నీట్ పేపర్ లీకేజీ, రైల్వే భద్రత అంశాలపై అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నిలదీసింది. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ ఈ సమావేశాల్లో కోరినట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి జైరామ్ రమేశ్, కె.సురేశ్, జేడీయూ, ఆప్, సమాజ్‌వాదీ, ఎన్సీపీ పార్టీల ప్రతినిధులు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. కేంద్ర ప్రభుత్వం జులై 23న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ఆరు బిల్లులను తీసుకురానుంది. -
రాహుల్‌కు ఎందుకింత అహంకారం?: అమిత్ షా ధ్వజం
రాంచీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అమిత్‌షా తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడినప్పటికీ పార్లమెంటులో రాహుల్ అహాంకారాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు జార్ఖండ్‌లోని రాంచీలోజరిగిన బీజేపీ సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్ధేశిస్తూ అమిత్‌షా ప్రసంగించారు.ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత అహంకారం పెరిగిన కొందరు నాయకులను చాలాసార్లు చూస్తుంటాం. జార్ఖండ్‌లో అలాంటి వారే అధికారంలో ఉన్నారు. కానీ ఓడిపోయిన తర్వాత కకూడా అహంకారం కలిగిన వ్యక్తిని నేను తొలిసారి చూస్తున్నాను.లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల్లో ఎవరు గెలిచారో, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో అందరికీ తెలుసు. ఎవరూ ఓడిపోయారో కూడా తెలుసు.అయినా రాహుల్ అనేకసార్లు పార్లమెంట్లో అహంకారంగా ప్రవర్తించారు. రాహుల్ ఓటమిని అంగీకరించలేపోతున్నారు. అందుకే పార్లమెంట్లో ఆ విధంగా ప్రవర్దిస్తున్నారు. మూడింట రెండు వంతుల సీట్లు గెలిచిన(బీజేపీ) పార్టీ నుంచి ప్రజలు ఇంత అహంకారాన్ని ఎదుర్కోవడం లేదు’ అని అమిత్‌షా పేర్కొన్నారు.ఈ సభ వేదికగా కాంగ్రెస్ నేతలకు చెప్పాలనుకుంటున్నాను. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ దక్కింది. కేవలం బీజేపీకే 240 సీట్లు దక్కాయి. ఇవి ఇండియా కూటమి మొత్తానికి దక్కిన స్థానాల కంటే ఎక్కువ. అలాంటప్పుడు వారికి ఎందుకింత అహంకారం?. 2014, 2019, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లభించిన స్థానాల కంటే ఈసారి బీజేపీ ఎక్కవ గెలుచుకుంది. మేము వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాం. కానీ, ఈ వాస్తవాన్ని ప్రతిపక్ష నేతలు అంగీకరించలేకపోతున్నారు’’ అని మండిపడ్డారు..అదే విధంగా మనీలాండరింగ్ కేసులో అరెస్టై ఇటీవల బెయిల్‌పై విడుదలై మళ్లీ సీఎం బాధ్యతలు స్వీకరించిన హేమంత్ సోరెన్‌పై అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిపరమైందని దుయ్యబట్టారు. భూకుంభకోణం, మద్యం, మైనింగ్ పాల్పడి రూ. కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
బడ్జెట్ పై మెగా కవరేజ్
-
సభాపతులే పక్షపాతం ప్రదర్శిస్తే..!
స్వరాజ్ పార్టీతో తన సంబంధాలను తెంచుకోవడం ద్వారా స్పీకర్ స్థానానికి విఠల్‌భాయ్ పటేల్ ఆరోగ్యకరమైన ప్రారంభాన్ని ఇచ్చారు. 1946లో సెంట్రల్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైనప్పుడు, జి.వి. మావలంకర్ ‘కాంగ్రెస్‌వాడిని అయినప్పటికీ... నిష్పక్షపాతంగా వ్యవహరించడం, పార్టీకి చెందిన అన్ని అంశాలకు అతీతంగా ఉండటం నా కర్తవ్యం’ అన్నారు. 1956లో స్పీకర్ పదవిని చేపట్టడం కోసం, ఎం.ఏ. అయ్యంగార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 1970ల నాటికి లోక్‌సభ స్పీకర్ నిష్పాక్షికత బలహీనపడటం మొదలైంది. ఇక ప్రస్తుత లోక్‌సభ, రాజ్యసభల్లోని ప్రిసైడింగ్ అధికారులిద్దరూ తమ పార్టీ ఆదేశాల మేరకు భారత పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కడం ద్వారా, వెస్ట్ మినిస్టర్ సంప్రదాయాలకు కళంకం తెస్తున్నారు.స్పీకర్ అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం నిష్పక్షపాతంగా ఉంటారు. అన్ని అంశా లను నిర్ణయించే ముఖ్యమైన న్యాయపరమైన విధులను స్పీకర్‌కు సభ వదిలివేయవచ్చు.– సర్ ఐవర్ జెన్నింగ్స్,పార్లమెంట్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, 195718వ లోక్‌సభ మొదటి సెషన్ జూన్ 24న సమావేశమైనప్పుడు, బీజేపీ మెజారిటీని కలిగి ఉన్న 16వ, 17వ లోక్‌సభలలో రాజకీయ పార్టీలు విడిచిపెట్టిన చోట నుండే పక్షపాతం తిరిగి ప్రారంభమైంది. సహజంగానే, లోక్‌సభ స్పీకర్‌కు పోటీ, ‘ఎన్నిక’, సభ తదుపరి కార్యకలాపాల నిర్వహణ వంటివి ‘నిష్పక్షపాతానికి’ చాలా దూరంగా ఉన్నాయి. బ్రిటిష్ పార్లమెంట్ గురించిన తన విశిష్ట అధ్యయనంలో సర్ జెన్నింగ్స్ ఇలాంటి స్థితి గురించి వివరంగా నమోదు చేశారు.వాస్తవానికి, రాజ్యాంగానికి తగిన గౌరవం ఇవ్వకపోగా, దాని సంప్రదాయాన్ని కూడా పక్కనపెట్టి, పార్లమెంటును తన కట్టడిలోనే పనిచేసేలా చూస్తామని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ నొక్కి చెప్పింది. లోక్‌సభ, శాసనసభలలో రాజ్యాంగం అమలైనప్పటినుండి కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి, సభలోని అత్యంత సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించే వెస్ట్‌మినిస్టర్ నమూనాకి చెందిన పురాతన సంప్రదాయానికి ఈసారి తిలోదకాలు ఇచ్చేశారు. సంప్రదాయం ప్రకారమైతే ఆ పదవిని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎంపీకి కేటాయించాల్సి ఉండింది. కానీ ఈసారి పార్లమెంటులో బీజేపీకి చెందిన రెండో సీనియర్ సభ్యునికి ప్రొటెం స్పీకర్ పీఠం దక్కింది. సహజంగానే, ‘మా ఎంపికను అంగీకరించడమే ఏకాభిప్రాయం’ అనే రాజకీయ ప్రకటనలో, ఏకాభిప్రాయం కోసం ఏదైనా ప్రతిపక్ష సూచనను ఆశించే, ఆమోదించే అవకాశమే లేదు. ఈ ఏడాది లోక్‌సభలో మోదీ నేతృత్వంలోని బీజేపీ సంపూర్ణ మెజారిటీని ప్రజలు లాక్కుని ఆ పార్టీ బలాన్ని 303 సీట్ల నుంచి 240కి తగ్గించారు. ఎన్నికలకు ముందు ఎన్ డీఏ ఏర్పర్చుకున్న కొత్త మిత్రుల దన్నుతో 293 మంది ఎంపీలతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ 99 సీట్లతోనూ, విస్తృత ప్రాతిపదికన ‘ఇండియా’ కూటమి 234 సీట్లతోనూ తిరిగి రావడం వల్ల, తమను తాము నొక్కి చెప్పు కోగల ప్రతిపక్షంతో, ట్రెజరీ బెంచ్‌లను సర్దుబాటు చేసే కథను పూర్తి చేశాయి. ప్రతిపక్ష నేత కార్యాలయం రాహుల్ గాంధీని ముందుకు నడిపింది.ఏది ఏమైనప్పటికీ, స్పీకర్ పదవికి పోటీని మొదట ప్రతిపాదించినప్పటికీ, భారతదేశం ఎక్కువగా అనుసరించే వెస్ట్‌మిన్ స్టర్ సంప్ర దాయం ప్రకారం ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయి స్తారని ఆశించిన ఇండియా కూటమి... ఎన్డీఏ ఎంపిక మేరకు (మోదీ ఎంపిక అని భావించాలి) మునుపటి స్పీకర్ ఓం బిర్లాకు మద్దతు ఇచ్చింది. కానీ ప్రతిపక్షాలకు ఈ ప్రత్యేక పదవిని నిరాకరించడానికి, పదేళ్లపాటు ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచారు. దీనిపై ఇప్పటికీ మౌనం కొనసాగించడం అరిష్టదాయకం అనే చెప్పాలి.హౌస్ ఎక్స్–అఫీషియో ఛైర్మన్ అయిన భారత ఉపరాష్ట్రపతిని ఒక వ్యవస్థ ఎన్నుకున్నప్పుడు రాజ్యసభ ప్రిసైడింగ్ అధికారి ఎవరనే ప్రశ్న పరిష్కరించబడుతుంది. దీనిని తప్పనిసరి చేసే ఆర్టికల్ 89, సభ్యుల నుండి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికను కూడా తప్పనిసరి చేస్తుంది. ప్రతిపక్షా లకు ఈ పదవిని కల్పించేందుకు రాజ్యాంగపరమైన నిబంధన కానీ, సంప్రదాయం కానీ లేవు. అయితే, 1952 నుండి అనేక సందర్భాల్లో ప్రతిపక్ష ఎంపీ ఈ పదవిని అలంకరించారు.‘ఒకసారి స్పీకర్‌ను నియమించిన తర్వాత, ఆయన తన పార్టీ స్వభావానికి దూరంగా ఉంటాడనీ, అలాగే తనను నియమించిన వారిని సమర్థించకుండా ఉంటాడనీ’ బ్రిటన్ సంప్రదాయాలు స్పష్టంగా సూచిస్తున్నాయి.స్వరాజ్ పార్టీతో తన సంబంధాలను విఠల్‌భాయ్ పటేల్ తెంచుకున్నప్పుడు, 1926లో తన పార్టీ శాసనసభ్యులతోపాటు వాకవుట్ చేయడానికి నిరాకరించినప్పుడు వెస్ట్ మినిస్టర్ వ్యవస్థ సంప్రదాయా లకు కట్టుబడి భారతదేశం ఆరోగ్యకరమైన అభ్యాసాన్ని ప్రారంభించింది. విఠల్‌భాయ్ పటేల్ 1927లో కూడా ఈ సంప్రదాయాన్ని అనుసరించారు. 1946లో సెంట్రల్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైనప్పుడు, జి.వి.మావలంకర్ ఇలా అన్నారు: ‘‘కాంగ్రెస్‌వాడిని అయినప్పటికీ, నిష్పక్షపాతంగా వ్యవహరించడం, పార్టీకి చెందిన అన్ని అంశాలకు అతీతంగా ఉండటం నా కర్తవ్యం’’. 1956 మార్చిలో స్పీకర్ పదవిని చేపట్టడం కోసం, ఎంఏ అయ్యంగార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సర్దార్ హుకుమ్ సింగ్ (1962 నుండి 1967 వరకు లోక్‌సభ స్పీకర్) కూడా తనకు తానుగా ఆరోపణలకు దూరంగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ స్పీకర్ పదవికి ఎన్నిక కావడానికి, అధికారంలో ఉన్న లేదా మెజారిటీ పార్టీపై ఆధారపడటం వల్ల పాలక పార్టీల ఆజ్ఞలకు అతడు/ఆమె కట్టుబడాల్సి ఉంటుందనే విషయాన్ని ఆయన గమనించారు. అందుకే 1970ల నాటికి లోక్‌సభ స్పీకర్ నిష్పాక్షికత కాస్త బలహీనపడటంలో ఆశ్చర్యం లేదు. సోమనాథ్ ఛటర్జీ (2004–09) తన నిష్పాక్షికతతో స్పీకర్ కార్యాలయాన్ని ఉన్నతీకరించగా, బలి రామ్ భగత్, బలరామ్ జాఖడ్ వంటి కొందరు స్పీకర్ బాధ్యతలు ముగిసిన తర్వాత తిరిగి కేంద్ర మంత్రివర్గంలో చేరి పనిచేశారు.ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరూ స్పీకర్ కుర్చీ వద్దకు ఓం బిర్లాను తీసుకువెళ్లినప్పుడు, ఆయన మోదీ ముందు వంగి కరచాలనం చేయడం, తరువాతి ప్రతిపక్ష నేత వద్ద నిటారుగా నిలబడటం ద్వారా తన విధేయత ఎవరి పట్ల ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. జూన్ 27న శశి థరూర్ ‘జై సంవిధాన్’ అని చెప్పడం ద్వారా ఎంపీగా తన ప్రమాణ స్వీకారం ముగించినప్పుడు ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కీర్తిస్తూ ప్రమాణం చేయ డానికి అభ్యంతరం ఎందుకు అని దీపేందర్ హుడా అడిగినప్పుడు, బిర్లా ఆయన్ని ఆక్షేపించి కూర్చోవాల్సిందిగా కోరారు. ఇది స్పష్టంగానే నిశ్చితమైన పక్షపాతానికి సంకేతం.స్పష్టంగా ప్రధానమంత్రి సూచనల మేరకు, 1975 నాటి ఎమర్జెన్సీని ఖండిస్తూ బిర్లా చేసిన తీర్మానం, ఆయన పార్టీ విధేయతకు తిరుగులేని సంకేతం. లోక్‌సభకు సంబంధించిన రూల్స్ అండ్ ప్రొసీజర్‌లోని రూల్ 380 కింద ప్రధాని, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై రాహుల్ గాంధీ చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలను కూడా ఆయన తొలగించారు. కొన్ని వివాదాస్పద బిల్లులను అడ్డంకులు లేకుండా ఆమోదించడం కోసం 17వ లోక్‌సభలో 100 మంది ప్రతిపక్ష ఎంపీలను బహిష్కరించిన ఈ వ్యక్తి, అధికార పక్షానికి తన విధేయ తను ప్రదర్శించారు.ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ కూడా ద్వంద్వ పాత్రను పోషిస్తూ, గత పార్లమెంటులో బిల్లులను ఆమోదించడం కోసం 46 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ప్రతిపక్ష ఎంపీలకు మాట్లాడటానికి సమ యం నిరాకరించడం, వారు ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని అడ్డు కోవడం ద్వారా ధన్‌ఖడ్ రాజ్యసభ కార్యకలాపాలను నిర్వహించడంలో పక్షపాత వైఖరిని కొనసాగిస్తున్నారు. పార్లమెంటులోని ప్రిసైడింగ్ అధికారులిద్దరూ తమ పార్టీ ఆదేశాల మేరకు భారత పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కడం ద్వారా, వెస్ట్ మినిస్టర్ సంప్రదాయాలకు కళంకం తెస్తున్నారు.అజయ్ కె మెహ్రా వ్యాసకర్త రాజకీయ శాస్త్రవేత్త(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, విప్ నియామకం.. ఎవరంటే?
న్యూఢిల్లీ: లోక్‌సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపీ గౌరవ్ గొగొయ్‌ను తిరిగి నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఎక్స్(ట్విటర్)లో ఆదివారం(జులై14) వెల్లడించారు.గతంలోనూ గౌరవ్ గొగొయ్ పార్టీ లోక్‌సభపక్ష ఉపనేతగా బాధ్యతలు నిర్వహించారు. లోక్‌సభలో పార్టీ చీఫ్‌విప్‌గా 8సార్లు ఎంపీగా గెలిచిన సీనియర్ మెంబర్ కొడికున్నిల్ సురేశ్‌ను నియమించారు. వీరికి తోడు సీనియర్‌నేతలు మాణిక్యం ఠాగూర్, ఎండీ జావెద్‌లకు లోక్‌సభలో విప్ బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాలకు సంబంధించి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ లోక్‌సభ స్పీకర్‌కు ఒక లేఖ రాశారు. లోక్‌సభలో పార్టీ కొత్తగా నియమించిన ఉపనేత, చీఫ్‌విప్, విప్ల పేర్లను లేఖలో తెలిపారు. ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ మార్గదర్శకత్వంలో లోక్‌సభలో ప్రజావాణిని బలంగా వినిపిస్తామని కేసీవేణుగోపాల్ ట్వీట్లో పేర్కొన్నారు.