‘అదానీ’పై రగడ.. పార్లమెంట్‌ రేపటికి వాయిదా | Parliament Winter Session On 27th November 2024 Updates | Sakshi
Sakshi News home page

‘అదానీ’పై రగడ.. పార్లమెంట్‌ రేపటికి వాయిదా

Published Wed, Nov 27 2024 11:16 AM | Last Updated on Wed, Nov 27 2024 1:48 PM

Parliament Winter Session On 27th November 2024 Updates

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల రెండోరోజు బుధవారం(నవంబర్‌ 27) ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి.

  • పార్లమెంట్‌ ప్రారంభమవగానే విపక్షాల ఆందోళన కారణంగా తొలుత లోక్‌సభ గంటపాటు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత విపక్షాలు శాంతించకపోవడంతో స్పీకర్‌ లోక్‌సభను గురువారానికి వాయిదా వేశారు.

  •  రాజ్యసభలోనూ విపక్షాలు అదానీ వ్యవహారంపై ఆందోళన చేశాయి.

  • ఎంపీల నినాదాల మధ్యలో చైర్మన్‌ కొద్దిసేపు ప్రశ్నోత్తరాలను నిర్వహించినప్పటికీ తర్వాత సభను గురువారానికి వాయిదా వేశారు.

    అదానీ వ్యవహారంపై కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం..

  • అదానీ లంచాల వ్యవహారంపై చర్చించాలని కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభలో మళ్లీ వాయిదా తీర్మానం. 

  • అదానీ వ్యవహారంపై జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీ వేయాలని ఇండియా కూటమి ఎంపీలు ఆందోళకు దిగారు.

  • విపక్షాల ఆందోళనతో స్పీకర్‌ లోక్‌సభను గంట పాటు వాయిదా వేశారు.

  • ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

  •  ఇందులో అత్యంత ముఖ్యమైన వక్ఫ్‌ సవరణ బిల్లును జాబితాలో చేర్చారు. 

  • జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును మాత్రం పక్కనపెట్టారు. 

     

    సోషల్‌ మీడియాను నియంత్రించేందుకు కఠిన చట్టాలు అవసరం: లోక్‌సభలో అశ్విని వైష్ణవ్‌

  • సోషల్‌మీడియాను నియంత్రించాలంటే ఉన్న చట్టాలనే కఠిన తరం చేయాల్సిన అవసరం ఉంది

  • ఈ అంశంపై ఏకాభిప్రాయం సాధించే అంశం పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ పరిధిలో ఉంది.

  • సోషల్‌మీడియాలో వాక్‌స్వాతంత్రం పేరిట ఏదిపడితే అది పోస్టు చేస్తున్నారు

  • దీనిని నియంత్రించాల్సిన అవసరం ఉంది.

  • ఎంపీ అరుణ్‌గోవిల్‌ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో సమాధానం ఇచ్చిన కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌

  • విపక్షాల ఆందోళన మధ్యే సమాధానం చెప్పిన ఐటీ మంత్రి

     

     

     

     

  •  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement