Adani Group
-
ఆరోపణలపై పోరాడేందుకు న్యాయ సంస్థల నియామకం
అదానీ గ్రూప్ ఇటీవల అమెరికాలో తనపై వచ్చిన ఆరోపణలను న్యాయబద్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఈమేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC), ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ దాఖలు చేసిన సివిల్, క్రిమినల్ కేసులను నిర్వహించడానికి కిర్క్లాండ్ & ఎల్లిస్, క్విన్ ఇమ్మాన్యుయేల్ ఉర్కహర్ట్ & సుల్లివాన్ ఎల్ఎల్పీ అనే న్యాయ సంస్థలను అదానీ గ్రూప్ నియమించింది.అసలేం జరిగిందంటే..అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు భారత ప్రభుత్వ అధికారులకు 250 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు చెల్లించిందన్న ఆరోపణలున్నాయి. దాంతో అమెరికాలోని పెట్టుబడిదారులు కూడా ఏజీఈఎల్‌లో ఇన్వెస్ట్ చేయడంతో కంపెనీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి యూఎస్‌లోని ఎస్ఈసీ, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ ప్రాథమిక దర్యాప్తు జరిపి సివిల్, క్రిమినల్ కేసులు పెట్టింది. వాటిని ఎదుర్కొనేందుకు అదానీ గ్రూప్ తాజాగా రెండు సంస్థలను నియమించింది. ఇవి కంపెనీపై వచ్చిన ఆరోపణలపై న్యాయబద్ధంగా అక్కడి కోర్టుల్లో సమాధానం చెప్పనున్నాయి.కేసు నేపథ్యంసోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) నుంచి కాంట్రాక్టులు పొందడానికి ఏజీఈఎల్‌కు అనైతికంగా సాయపడటానికి భారత అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ, ఇతర ఎగ్జిక్యూటివ్‌లపై 2024 నవంబర్ 21న అమెరికా అధికారులు అభియోగాలు మోపారు. ఈ ఆరోపణలు ఉన్నప్పటికీ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వినీత్ ఎస్ జైన్‌లపై యూఎస్ ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఏఫ్సీపీఏ) ఉల్లంఘనలకు సంబంధించి అభియోగాలు మోపలేదని ఎజీఈఎల్ నొక్కి చెప్పింది.ఇదీ చదవండి: ఇళ్ల నిర్మాణ వ్యయంలో భారీ కోత..?న్యాయ సంస్థల గురించిషికాగోలో ప్రధాన కార్యాలయం ఉన్న కిర్క్టాండ్ & ఎల్లిస్ అధికంగా వాణిజ్య వివాదాలు, మేధో సంపత్తి వ్యాజ్యాలు, వైట్-కాలర్ కేసుల్లో ప్రత్యేకత కలిగి ఉంది. ఇప్పటికే జాన్సన్ & జాన్సన్, వోక్స్ వ్యాగన్ వంటి ప్రధాన సంస్థలకు ఈ సంస్థ సేవలందించింది. లాస్ ఏంజిల్స్‌కు చెందిన క్విన్ ఇమ్మాన్యుయేల్ సెక్యూరిటీస్ లిటిగేషన్, ప్రొడక్ట్ లయబిలిటీ, రెగ్యులేటరీ ఇన్వెస్టిగేషన్ల్లో ప్రసిద్ది చెందింది. ఈ కంపెనీకి గూగుల్, యాపిల్, ఉబెర్ వంటి క్లయింట్లు ఉన్నారు. -
హిండెన్‌బర్గ్ మూసివేత! బెదిరింపులు ఉన్నాయా..?
అదానీ గ్రూప్, నికోలా వంటి కంపెనీలపై తీవ్ర ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కంపెనీ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ కంపెనీ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన నోట్లో ఈమేరకు నిర్ణయాన్ని వెల్లడించారు. సంస్థ మూసివేతకు సంబంధించి ఏదైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా.. అనే దానిపై అండర్సన్ నోట్లో వివరాలు తెలియజేశారు.‘సంస్థ మూసివేత గురించి కొంతకాలంగా నా ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించాను. చాలా చర్చలు జరిగిన తర్వాతే సంస్థను మూసివేయాలని నిర్ణయించుకున్నాను. మేము తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎలాంటి బెదిరింపులు, భయాలు, వ్యక్తిగత అంశాలు లేవు. హిండెన్‌బర్గ్ నా జీవితంలో ఒక మధురమైన అధ్యాయంగా మిగిలిపోతుంది. ఈ సంస్థ వల్ల ఎంతో సాహసం చేశాను. ఎన్నో ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎదురైనా ఏ మాత్రం తొనకకుండా సంస్థను నిర్వహించాను. ఈ వ్యవహారం అంతా నాకో ప్రేమకథలా తోస్తుంది. కంపెనీ స్థాపించడానికి ముందు నన్ను నేను నిరూపించుకోవాలని ఎంతో కష్టపడేవాడిని. ప్రస్తుతం కంఫర్ట్ జోన్లో ఉన్నానని అనిపిస్తోంది. ఇకపై భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెడతాను. నా బృందం మంచి స్థాయికి చేరుకునేందుకు సాయపడతాను’ అని తెలిపారు.ఇదీ చదవండి: రష్యాపై యూఎస్ ఆంక్షలు.. చమురుపై ప్రభావంహిండెన్బర్గ్ గురించి..నాథన్ అండర్సన్ 2017లో దీన్ని స్థాపించారు. యూఎస్‌కు చెందిన ఈ కంపెనీ షార్ట్ సెల్లింగ్ సంస్థగా, ఇన్వెస్టిగేటివ్ రీసెర్చ్‌గా ప్రసిద్ధి చెందింది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. 2023లో అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంట్స్‌లో మోసం చేసిందని హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపించింది. ఈ నివేదికతో కంపెనీ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్ల(సుమారు రూ.8.3 లక్షల కోట్లు)కు పైగా తుడిచిపెట్టుకుపోయింది. 2020లో నికోలా తన సాంకేతికతను ఉపయోగించి పెట్టుబడిదారులను మోసం చేసిందని ఆరోపించింది. హిండెన్‌బర్గ్ రద్దు చేయడానికి ముందు పోంజీ పథకాల నివేదికలతో సహా తన తుది దర్యాప్తులను పూర్తి చేసినట్లు తెలిపింది. అండర్సన్ తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. -
వాటా అమ్మేసిన అదానీ గ్రూప్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ (Adani) తాజాగా ఎఫ్ఎంసీజీ సంస్థ అదానీ విల్మర్‌లో (Adani Wilmar) 13.5 శాతం వాటా విక్రయించింది. ఫార్చూర్ బ్రాండ్ వంట నూనెలు, ఫుడ్ ప్రొడక్టుల కంపెనీలో 17.54 కోట్ల షేర్లను షేరుకి రూ. 275 ఫ్లోర్(కనీస) ధరలో అమ్మివేసింది. తద్వారా విల్మర్‌తో ఏర్పాటు చేసిన భాగస్వామ్య కంపెనీ(జేవీ) నుంచి వైదొలగనుంది.వెరసి కీలకంకాని బిజినెస్‌ల నుంచి తప్పుకోవడం ద్వారా గ్రూప్‌నకు ప్రధానమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దృష్టి పెట్టనుంది. భాగస్వామి విల్మర్‌కు వాటా విక్రయించనున్నట్లు గత నెలలో అదానీ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనుబంధ సంస్థ అదానీ కమోడిటీస్ ఎల్ఎల్పీ ద్వారా 13.5 శాతం వాటాను సంస్థాగత ఇన్వెస్టర్లకు విక్రయించింది. దీనిలో అదనంగా విక్రయించే వీలున్న 6.5 శాతం వాటా(8.44 కోట్ల షేర్లు) సైతం కలసి ఉన్నట్లు వెల్లడించింది.మార్కెట్లు క్షీణతలో ఉన్నప్పటికీ ఆఫర్ ఫర్ సేల్కు దేశ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించినట్లు అదానీ గ్రూప్ తెలియజేసింది. దీంతో 1.96 కోట్ల షేర్లను అదనంగా ఆఫర్ చేయనున్నట్లు వెల్లడించింది. అంటే 17.54 కోట్ల షేర్లు(13.5 శాతం వాటా) ప్రస్తుతం విక్రయించగా.. మరో 1.96 కోట్ల(1.5 శాతం వాటా)ను సోమవారం(13న) రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ చేయనున్నట్లు వివరించింది.అంటే మొత్తం 19.5 కోట్ల షేర్ల(15.01 శాతం వాటా)ను అమ్మివేయనున్నట్లు వెల్లడించింది. ఈ లావాదేవీ తదుపరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో 3.15 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులను సమకూర్చుకున్నట్లవుతుందని అదానీ గ్రూప్ తెలియజేసింది. పబ్లిక్కు కనీస వాటా తాజా వాటా విక్రయ నేపథ్యంలో పబ్లిక్కు కనీస వాటా నిబంధనలను అమలు చేసినట్లు అదానీ విల్మర్ పేర్కొంది. ప్రస్తుతం ప్రమోటర్లకు 74.37 శాతం, పబ్లిక్కు 25.63 శాతం వాటా ఉన్నట్లు తెలియజేసింది. తదుపరి దశలో ఒప్పందం ప్రకారం మిగిలిన వాటాను విల్మర్‌కు షేరుకి రూ. 305 ధర మించకుండా విక్రయించనున్నట్లు తెలియజేసింది. లావాదేవీకి ముందు కంపెనీలో అదానీ గ్రూప్‌నకు 43.94 శాతం వాటా ఉన్న విషయం విదితమే.నిజానికి విల్మర్‌కు 31 శాతం వాటా విక్రయానికి ఒప్పందం కుదిరినప్పటికీ ఆఫర్ ఫర్ సేల్కు లభించిన స్పందన ఆధారంగా మిగిలిన వాటా ను విక్రయించనుంది. మార్చి31లోగా మొత్తం వాటా విక్రయం పూర్తికానున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అదానీ విల్మర్ షేరు బీఎస్ఈలో 10 శాతం పతనమై రూ. 292 దిగువన స్థిరపడింది. -
పెట్రోకెమికల్స్‌పై అదానీ దృష్టి
న్యూఢిల్లీ: విభిన్న వ్యాపారాలు కలిగిన అదానీ గ్రూప్ తాజాగా పెట్రోకెమికల్స్ విభాగంలోకి ప్రవేశించే సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం థాయ్‌లాండ్ సంస్థ ఇండోరమా రిసోర్సెస్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. ఇండోరమా రిసోర్సెస్‌తో కలిసి అదానీ పెట్రోకెమికల్స్ భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేసినట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ తాజాగా పేర్కొంది.పరస్పరం సమాన భాగస్వామ్యం(50:50 శాతం వాటా)తో వలోర్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్(వీపీఎల్) పేరుతో జేవీని ఏర్పాటు చేసినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. జేవీ ద్వారా రిఫైనరీ, పెట్రోకెమికల్, కెమికల్ బిజినెస్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. దశలవారీగా రిఫైనరీలు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు, స్పెషాలిటీ కెమికల్స్, హైడ్రోజన్ తదితర బిజినెస్‌ల కోసమే అదానీ పెట్రోకెమికల్స్‌ను నెలకొల్పినట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ వివరించింది. 2022లోనే గుజరాత్లో పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌పై 4 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: చాట్‌జీపీటీకి ‘గ్రోక్’ స్ట్రోక్!అదానీ పెట్రోకెమికల్స్‌తో సంబంధం ఉన్న కొన్ని కీలక ఉత్పత్తులు కింది విధంగా ఉన్నాయి.పీవీసీ ప్లాంట్: అదానీ పెట్రోకెమికల్స్ గుజరాత్‌లోని ముంద్రాలో పాలివినైల్ క్లోరైడ్ (పీవీసీ) ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ సామర్థ్యం 2 మిలియన్ టన్నులు. మొదటి దశ 2026 నాటికి 1 మిలియన్ టన్నులు, రెండో దశ 2027 ప్రారంభం నాటికి మరో 1 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ప్యూరిఫైడ్ టెరెఫ్తాలిక్ యాసిడ్ (పీటీఏ) ప్లాంట్: వలోర్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (వీపీఎల్) పేరుతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ మహారాష్ట్రలో 3.2 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన పీటీఏ ప్లాంట్‌ను అభివృద్ధి చేస్తోంది. -
విల్మర్ నుంచి అదానీ ఔట్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ(FMCG) దిగ్గజం అదానీ విల్మర్ నుంచి బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ వైదొలగనుంది. ఈ భాగస్వామ్య కంపెనీ(JV)లో అదానీ గ్రూప్, సింగపూర్ సంస్థ విల్మర్ విడిగా 43.94 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. అయితే దీనిలో 31.06 శాతం వాటాను విల్మర్‌కు విక్రయించనున్నట్లు అదానీ గ్రూప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ తాజాగా వెల్లడించింది.షేరుకి రూ.305 ధర మించకుండా విల్మర్(Wilmar)కు వాటాను అమ్మివేయనున్నట్లు పేర్కొంది. తద్వారా రూ.12,314 కోట్లు అందుకోనుంది. కంపెనీ ఫార్చూన్ బ్రాండ్‌తో వంట నూనెలుసహా పలు ఫుడ్ ప్రొడక్టులను విక్రయిస్తున్న విషయం విదితమే. మరో 13 శాతం వాటాను పబ్లిక్కు కనీస వాటా నిబంధనకు అనుగుణంగా ఓపెన్ మార్కెట్లో విక్రయించనున్నట్లు అదానీ(Adani) ఎంటర్ప్రైజెస్ తెలియజేసింది. వెరసి పూర్తి వాటాను 200 కోట్ల డాలర్లకు(సుమారు రూ.17,100 కోట్లు) విక్రయించనుంది. తద్వారా కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగనుంది. లావాదేవీలు 2025 మార్చి31కల్లా పూర్తికావచ్చని అంచనా వేసింది. ఫలితంగా అదానీ నామినీ డైరెక్టర్లు జేవీ బోర్డు నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించింది.వృద్ధి అవకాశాలపైనే..అదానీ విల్మర్‌లో వాటా విక్రయం ద్వారా సమకూరే నిధులను వృద్ధి అవకాశాలపై వెచ్చించనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్(ఏఈఎల్) పేర్కొంది. ఎనర్జీ, యుటిలిటీ, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ తదితర కీలకమైన మౌలిక సదుపాయాల బిజినెస్ పురోభివృద్ధికి వినియోగించనున్నట్లు వివరించింది. తాజా లావాదేవీ ద్వారా అదానీ గ్రూప్ లిక్విడిటీ పరిస్థితి మెరుగుపడనుంది. కాగా.. ఏఈఎల్ నుంచి అదానీ విల్మర్‌లో గరిష్టంగా 31.06 శాతం వాటా కొనుగోలుకి విల్మర్ ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండా పబ్లిక్కు కనీస వాటా నిబంధనమేరకు 13 శాతం వాటాను ఏఈఎల్ ఓపెన్ మార్కెట్లో విక్రయించనుంది. ఇందుకు రెండు కంపెనీలు చేతులు కలిపినట్లు ఒక ప్రకటనలో తెలియజేశాయి. ప్రస్తుతం అదానీ విల్మర్‌లో రెండు కంపెనీలకూ సంయుక్తంగా 87.87 శాతం వాటా ఉంది. అయితే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం లిస్టింగ్ తదుపరి పబ్లిక్కు కనీసం 25 శాతం వాటాను ఆఫర్ చేయవలసి ఉంది.ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో రైల్వేశాఖ కీలక నిర్ణయాలుకంపెనీ నేపథ్యం1999 జనవరిలో సమాన వాటాతో జేవీగా ఏర్పాటైన అదానీ విల్మర్.. ఫార్చూన్ బ్రాండుతో వంట నూనెలు, రైస్, ఆటాసహా వివిధ ఆహారోత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది. 10 రాష్ట్రాలలో 23 ప్లాంట్లను నిర్వహిస్తోంది. ఐపీవో ద్వారా రూ. 3,600 కోట్లు సమీకరించింది. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో 2022 ఫిబ్రవరిలో లిస్టయ్యింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది(2023–24) రూ.51,555 కోట్లకుపైగా ఆదాయాన్ని అందుకుంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ.42,785 కోట్లుగా నమోదైంది. నవంబర్‌లో గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ తదితరులపై యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అవినితి ఆరోపణలు చేశాక గ్రూప్ చేపట్టిన తొలి భారీ లావాదేవీ ఇది. గ్రూప్ ఈ ఆరోపణలను తోసిపుచ్చడంతోపాటు న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. -
అదానీ గ్రూప్ చేతికి ఎయిర్ వర్క్స్
న్యూఢిల్లీ: ఏవియేషన్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్ (ఎంఆర్వో) సర్విసుల దిగ్గజం ఎయిర్ వర్క్స్‌లో అదానీ గ్రూప్ 85.8 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఈ డీల్ కోసం సంస్థ విలువను రూ. 400 కోట్లుగా లెక్కించారు. ఇందుకు సంబంధించి అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ (ఏడీఎస్టీఎల్) షేర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ వర్క్స్ 35 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 1,300 మంది పైగా సిబ్బంది ఉన్నారు. మెయింటెనెన్స్, ఇంటీరియర్ రీఫర్బిష్ మెంట్, పెయింటింగ్ మొదలైన సేవలు అందిస్తోంది. భారతీయ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కి కూడా సర్విసులు అందిస్తోంది. హోసూర్, ముంబై, కొచ్చిలో యూనిట్లు ఉన్నాయి. 20 పైగా దేశాల్లో సివిల్ ఏవియేషన్ నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు ఉన్నాయి. డిఫెన్స్ ఎంఆర్వో విభాగంలో అదానీ గ్రూప్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ కొనుగోలు తోడ్పడుతుందని అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్ జీత్ అదానీ తెలిపారు. భారత ఏవియేషన్ పరిశ్రమ ప్రస్తుతం అంతర్జాతీయంగా మూడో స్థానంలో ఉందని, రాబోయే రోజుల్లో 1,500 ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకుంటోందని వివరించారు. భారత ఎంఆర్వో సామర్థ్యాలను పటిష్టం చేయాలన్న తమ లక్ష్య సాధన దిశగా ఈ కొనుగోలు కీలక మైలురాయిగా ఉండగలదని అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సీఈవో ఆశీష్ రాజవంశి తెలిపారు. -
అంబుజా సిమెంట్స్‌లో ఆ రెండు సంస్థల విలీనం
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థలు సంఘీ ఇండస్ట్రీస్ (ఎస్ఐఎల్), పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్‌ను విలీనం చేసుకోనున్నట్లు అంబుజా సిమెంట్స్ వెల్లడించింది. వచ్చే 9–12 నెలల వ్యవధిలో ఈ లావాదేవీ పూర్తి కాగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.సంస్థ స్వరూపాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు, గవర్నెన్స్‌ను మెరుగుపర్చుకునేందుకు ఈ కన్సాలిడేషన్ ఉపయోగపడగలదని ఒక ప్రకటనలో వివరించింది. అదానీ గ్రూప్‌లో అంబుజా సిమెంట్స్ భాగంగా ఉంది. 2023లో కొనుగోలు చేసిన సంఘీ ఇండస్ట్రీస్‌లో కంపెనీకి 58.08 శాతం వాటాలు ఉన్నాయి. అలాగే 2024 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ సంస్థ పెన్నా సిమెంట్‌ను కొనుగోలు చేసింది.విలీన స్కీము ప్రకారం ప్రతి 100 ఎస్ఐఎల్ షేర్లకు గాను అంబుజా సిమెంట్స్ 12 షేర్లను జారీ చేస్తుంది. అలాగే, పెన్నా సిమెంట్స్ ఈక్విటీ షేర్హోల్డర్లకు ఒక్కో షేరుపై రూ. 321.50 లభిస్తుంది. ఎస్ఐఎల్, పెన్నా సిమెంట్స్ షేర్ల ముఖ విలువ రూ. 10గా ఉండగా, అంబుజా సిమెంట్స్ షేరు ముఖవిలువ రూ. 2గా ఉంది. -
గ్రీన్ హైడ్రోజన్.. గేమ్ చేంజర్!
హైడ్రోజన్ కార్లు.. బస్సులు.. రైళ్లు.. నౌకలు.. పరిశ్రమలు... ఇలా ప్రపంచమంతా ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ నామ జపం చేస్తోంది! పునరుత్పాదక ఇంధన రంగంలో గేమ్ చేంజర్‌గా అభివరి్ణస్తున్న గ్రీన్ హైడ్రోజన్ కోసం భారత్ కూడా వేట మొదలుపెట్టింది. దేశీ కార్పొరేట్ దిగ్గజాలైన రిలయన్స్, అదానీ గ్రూపులతో పాటు అవాడా, హైజెన్కో గ్రీన్ ఎనర్జీస్, థెర్మాక్స్ వంటి సంస్థలు ఈ రంగంలో ఇప్పటికే భారీ ప్రణాళికలతో చకచకా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ నయా ఇంధనాన్ని వినియోగదారులకు చౌకగా అందించేందుకు ఉత్పాదక వ్యయాన్ని రెండింతలకు పైగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదక వ్యయం ఒక్కో కేజీకి 4–5 డాలర్లు (దాదాపు రూ.340–430)గా ఉంటోంది. అదే గ్రే హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చు 1–2 డాలర్లు (రూ.85–170) మాత్రమే. గ్రే హైడ్రోజన్ ఉత్పత్తి కాలుష్యకరమైనది కావడంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో కంపెనీలు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదక వ్యయాన్ని గణనీయంగా తగ్గించడంపై దృష్టిపెట్టాయి. సరికొత్త టెక్నాలజీలతో పాటు వినూత్న ఉత్పత్తులు, ఇతరత్రా మార్గాలను ఎంచుకుంటున్నాయి. 2030 నాటికి భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్దేశించుకున్న 50 లక్షల వార్షిక టన్నుల ఉత్పత్తి లక్ష్యం సాకారం కావాలంటే, ఉత్పాదక వ్యయాన్ని తగ్గించడం చాలా కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. టెక్నాలజీ దన్ను... గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదనలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పాటు అధునాతన ఎనలిటిక్స్‌ను అవాడా గ్రూప్ ఉపయోగిస్తోంది. ‘అత్యాధునిక ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీ వల్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం మెరుగుపడి, హైడ్రోజన్ ఉత్పత్తికి తక్కువ విద్యుత్ అవసరమవుతుంది. దీంతో వ్యయం భారీగా దిగొస్తోంది’ అని కంపెనీ చైర్మన్ వినీత్ మిట్టల్ పేర్కొన్నారు. హైజెన్కో సంస్థ అయితే, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), ఏఐతో పాటు మెషీన్ లెరి్నంగ్‌ను ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటోంది. కంపెనీ ఒడిశాలోని గోపాల్‌పూర్‌లో 1.1 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ అమోనియా ప్రాజెక్టును నెలకొల్పే ప్రణాళికల్లో ఉంది. వెల్స్పన్ న్యూ ఎనర్జీ కూడా గ్రీన్ హైడ్రోజన్‌ను చౌకగా అందించేందుకు సౌర, పవన విద్యుత్‌తో పాటు బ్యాటరీల్లో స్టోర్ చేసిన విద్యుత్‌ను కూడా ఉపయోగిస్తోంది. అంతేకాకుండా పెద్దయెత్తున జల విద్యుత్‌ను కూడా వినియోగించే సన్నాహాల్లో ఉన్నట్లు కంపెనీ సీఈఓ కపిల్ మహేశ్వరి పేర్కొన్నారు. ఇక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన మాడ్యూల్స్ తయారీ, విక్రయం, సరీ్వస్ కోసం థర్మాక్స్ బ్రిటన్‌కు చెందిన సెరెస్తో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా దాని ఆక్సైడ్ ఎల్రక్టాలిసిస్ టెక్నాలజీని ఉపయోగించుకోనుంది. తక్కువ ఉష్ణోగ్రతతో కూడిన ఎలక్ట్రాలిసిస్ సాంకేతికతతో పోలిస్తే ఇది 25% మెరుగైనదని సంస్థ సీఈఓ ఆశిష్ భండారీ వెల్లడించారు.అంబానీ, అదానీ గిగా ఫ్యాక్టరీలుదేశంలో గ్రీన్ హైడ్రోజన్ సమగ్ర వ్యవస్థ (ఎకో సిస్టమ్) నెలకొల్పేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) 10 బిలియన్ డాలర్లను వెచి్చంచనుంది. 2030 నాటికి కేజీ గ్రీన్ హైడ్రోజన్‌ను ఒక డాలరుకే ఉత్పత్తి చేయాలనేది కంపెనీ లక్ష్యం. 2026 కల్లా తొలి ఎలక్ట్రోలైజర్ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తాజా ఏజీఎంలో ప్రకటించారు కూడా. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచి, కొత్త తరం ఎలక్ట్రోలైజర్ల కోసం పెట్టుబడి వ్యయాలను తగ్గించుకోవడానికి అధునాతన ఎల్రక్టాలిసిస్ ఆధారిత టెక్నాలజీలను కూడా కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా అదానీ న్యూ ఇండస్ట్రీస్‌ను తీర్చిదిద్దే సన్నాహాల్లో అదానీ గ్రూప్ నిమగ్నమైంది. 2030 నాటికి 10 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి తోడ్పడేలా సమగ్ర ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. తదుపరి పదేళ్లలో ఈ సామర్థ్యాన్ని 30 లక్షల టన్నులకు పెంచాలనేది అదానీ లక్ష్యం. ఈ వ్యవస్థలో గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్, పర్యావరణానుకూల విమాన ఇంధనం వంటి పలు ఉత్పత్తులు ఉంటాయి. గ్రీన్ హైడ్రోజన్: ప్రకృతిలో అపారంగా దొరికే నీటిని పునరుత్పాదక ఇంధనాలైన సౌర, పవన, జల విద్యుత్‌ను ఉపయోగించి హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొడతారు. ఎలక్ట్రోలైజర్లో జరిపే ఈ ప్రక్రియను ఎల్రక్టాలిసిస్గా పేర్కొంటారు. ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ 100 శాతం పర్యావరణానుకూలమైనది కావడంతో దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. దీన్ని నిల్వ చేయడం చాలా సులభం. అంతేకాకుండా, వాహనాల నుండి పరిశ్రమల వరకు అనేక అవసరాల కోసం వాడుకోవచ్చు. గ్రే హైడ్రోజన్: హైడ్రోజన్ ఉత్పత్తిలో ఇది అత్యంత సాధారణ ప్రక్రియ. స్టీమ్ మీథేన్ రిఫారి్మంగ్ (ఎస్ఎంఆర్) అనే ప్రక్రియలో సహజవాయువును ఉపయోగిస్తారు. తయారీలో గణనీయంగా కార్బన ఉద్గారాలను విడుదల చేయడం వల్ల దీనిపై వ్యతిరేకత నెలకొంది. వినియోగంలో మాత్రం 100% పర్యావరణ హితమైనదే. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు
ఢిల్లీ, సాక్షి: తెలుగు మీడియా సంస్థలైన ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. అదానీ గ్రూప్ వ్యవహారంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా ఈ రెండు మీడియా సంస్థలు అడ్డగోలుగా కథనాలు రాశాయి. అయితే అవి నిరాధారమైన కథనాలుగా పేర్కొంటూ.. పరువు నష్టం దావా వేశారు వైఎస్ జగన్. అదానీ గ్రూప్ కేసుకు సంబంధించి అమెరికాలో దాఖలు చేసిన అభియోగ పత్రంలో తన పేరు లేకున్నా, ఉన్నట్లుగా కట్టు కథలు రాశారని వైఎస్ జగన్ మొదటి నుంచి చెబుతున్నారు. ఈ మేరకు భేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు కూడా. అయితే జగన్ ఇచ్చిన గడువు ముగిసినా.. ఆ రెండు మీడియా సంస్థల నుంచి స్పందన లేదు. దీంతో చెప్పినట్లుగానే లీగల్ నోటీసులు పంపించారు. ఇక తనకు వ్యతిరేకంగా రాసిన కథనాలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ జగన్. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు సమన్లు జారీ చేసింది. అయితే సమన్ల తర్వాత పిటిషనర్‌పై ప్రచురించే కథనాలపై పరిణామలు తుడి తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేస్తూ.. విచారణను ఢిల్లీ హైకోర్టు ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది.కాగా, రాష్ట్ర చరిత్రలో అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కేంద్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే.. టీడీపీ తోక పత్రికల్లా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అసత్య కథనాలు ప్రచురించాయని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయన తరఫు న్యాయవాదులు ఇటీవల లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం అని, థర్డ్ పార్టీకి ఎలాంటి పాత్ర లేదని ఆది నుంచి తమ క్లయింట్ స్పష్టం చేస్తున్నారని పేర్కొన్నారు. సెకీ ఐఎస్టీఎస్ (అంతర్రాష్ట్ర సరఫరా) చార్జీలు మినహాయింపు ఇచ్చిందని.. ఆ మేరకు ఒప్పంద పత్రాలు, సెకీ రాసిన లేఖ ప్రతులను చూపిస్తున్నా సరే ఆ పత్రికలు పట్టించుకోకుండా నిరాధారంగా తమ క్లయింట్ గౌరవ ప్రతిష్టలను దెబ్బ తీస్తూ, ఉద్దేశ పూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచురించాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ ఒప్పందంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, దానిని ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయినా స్పందన లేకపోవడంతో పరువు నష్టం దావాకు వెళ్లారు. -
అదానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితి గుడ్
న్యూఢిల్లీ: ప్రస్తుతం అదానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితి యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల సమయంతో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు బెర్న్‌స్టీన్ పేర్కొంది. ప్రమోటర్ల షేర్ల తనఖా తగ్గడంతోపాటు.. లెవరేజ్ కనిష్టస్థాయికి చేరినట్లు యూఎస్ రీసెర్చ్ సంస్థ తెలియజేసింది. గత రెండేళ్ల కాలంలో గ్రూప్ లెవరేజ్, షేర్ల తనఖా, రుణ చెల్లింపులు, బిజినెస్ విలువలు తదితరాల విశ్లేషణతో నివేదికను విడుదల చేసింది. కాగా.. 2023 జనవరిలో అదానీ ఖాతాలలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు హిండెన్‌బర్గ్ ఆరోపించిన కారణంగా గ్రూప్ కంపెనీలోని పలు షేర్లు అమ్మకాలతో దెబ్బతిన్నాయి. తదుపరి అదానీ గ్రూప్ వీటిని ఆధార రహితాలుగా కొట్టిపారేసింది. దీంతో తిరిగి గ్రూప్ కంపెనీలు బలపడటంతోపాటు నిధులను సైతం సమీకరించగలిగాయి.ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే రిసు్కలు తగ్గినట్లు బెర్న్‌స్టీన్ అభిప్రాయపడింది. కాగా.. గత నెల 21న యూఎస్ అధికారికవర్గాలు గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సంబంధిత ఉన్నతాఅధికారులపై లంచాల ఆరోపణలు చేసింది. వీటిని సైతం అదానీ గ్రూప్ తోసిపుచి్చంది. -
రెండో రోజూ మార్కెట్ జోరు
ముంబై: ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ2)లో జీడీపీ వృద్ధి 5.4 శాతానికి మందగించినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. గత 7 త్రైమాసికాలలోనే ఆర్థిక వ్యవస్థ కనిష్ట వృద్ధికి పరిమితమైనప్పటికీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకే ప్రాధాన్యత ఇవ్వడంతో వరుసగా రెండో రోజు లాభాలతో నిలిచాయి. ఆర్థిక వృద్ధి మందగించిన కారణంగా స్వల్ప వెనకడుగుతో ప్రారంభమైన మార్కెట్లు వెనువెంటనే కోలుకున్నాయి. మిడ్‌సెషన్ నుంచీ కొనుగోళ్లు పెరగడంతో జోరందుకున్నాయి. వెరసి సెన్సెక్స్ 445 పాయింట్లు లాభపడింది. 80,248 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 145 పాయింట్లు బలపడి 24,276 వద్ద నిలిచింది. రియల్టీ జూమ్..: ఎన్ఎస్ఈలో రియల్టీ అత్యధికంగా 3 శాతం ఎగసింది. కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, ఆటో రంగాలు 2–1 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో అ్రల్టాటెక్, అపోలో, గ్రాసిమ్, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ, అదానీ పోర్ట్స్, ఎంఅండ్ఎం, టెక్ఎం, టైటన్, డాక్టర్ రెడ్డీస్, ఆర్ఐఎల్, సన్, మారుతీ, హెచ్‌సీఎల్‌టెక్, కోల్ ఇండియా 4–1.3 శాతం మధ్య బలపడ్డాయి.అయితే హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎన్టీపీసీ, సిప్లా, ఎస్బీఐ లైఫ్, హెచ్‌యూఎల్, బ్రిటానియా, కొటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ 2.7–0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. మధ్య, చిన్నతరహా షేర్లలో 463 కౌంటర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఈ జాబితాలో రామ్‌కో సిస్టమ్స్, గోల్డియామ్ ఇంటర్నేషనల్, అతుల్ ఆటో, కొచిన్ షిప్‌యార్డ్ తదితర కంపెనీలు ఉన్నాయి.అదానీ గ్రూప్ నేలచూపు:మార్కెట్లు లాభపడినప్పటికీ అదానీ గ్రూప్‌లోని ఆరు కౌంటర్లలో అమ్మకాలు తలెత్తాయి. అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం, ఎనర్జీ సొల్యూషన్స్ 4 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇతర షేర్లలో ఎన్డీటీవీ, అదానీ విల్మర్, అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజెస్ 1–0.5 శాతం మధ్య నీరసించాయి. -
ప్రతి దాడీ బలోపేతం చేస్తుంది
జైపూర్: అదానీ గ్రూప్‌పై ఇటీవల అమెరికాలో దాఖలైన అభియోగాలపై సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీ తొలిసారి బహిరంగంగా స్పందించారు. చట్టాలు, నిబంధనల అమలుకు తమ గ్రూప్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రతి దాడీ తమను మరింత బలోపేతమే చేస్తుందన్నారు. ఆయన శనివారం ఇక్కడ 51వ జెమ్స్, జువెల్లరీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘నిబంధనల అమలుకు సంబంధించి ఇటీవలే అమెరికా నుంచి కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నాం. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడం మాకిది మొదటిసారేమీ కాదు. ప్రతి దాడీ మమ్మల్ని మరింత బలోపేతమే చేస్తుంది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ అంశానికి సంబంధించి మీడియాలో మాపై పుంఖానుపుంఖాలుగా వివక్ష, విద్వేషపూరిత కథనాలు వచ్చాయి. ఇంతా చేస్తే మా సంస్థకు సంబంధించిన వారెవరిపైనా అమెరికాలో ఎఫ్‌సీపీఏ చట్టాలను ఉల్లంఘించినట్టు గానీ, న్యాయ ప్రక్రియను అడ్డుకోజూసినట్టు గానీ ఒక్క అభియోగమూ నమోదు కాలేదు’’ అని అదానీ గుర్తు చేశారు. నియంత్రణ సంస్థల నియమ నిబంధనలన్నింటికీ కట్టుబడి ఉండటంలో తమ సంస్థ ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటిస్తుందన్నారు. ‘‘నేటి సమాజంలో వాస్తవాల కంటే పుకార్లే వేగంగా వ్యాపిస్తాయి. ఇన్నేళ్లలో అదానీ గ్రూప్ పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నో రంగాల్లో మార్గదర్శకంగా నిలిచినందుకు మేం చెల్లించిన మూల్యమది. ఆ సవాళ్లే మమ్మల్ని తీర్చిదిద్దాయి. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు అధిగమిస్తూనే వస్తున్నాం. సవాళ్లను తట్టుకుని నిలుస్తూ కొత్త దారి వెదుక్కుంటూ ధైర్యంగా సాగడమే మాకు తెలుసు’’ అని అదానీ చెప్పుకొచ్చారు. హిండెన్‌బర్గ్‌పై చట్టపరంగా చర్యలు తమ గ్రూప్‌పై గతేడాది హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను కూడా అదానీ తోసిపుచ్చారు. ఆ సంస్థపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ‘‘మాపై హిండెన్‌బర్గ్ చేసింది ఆరోపణలు నిజానికి మా ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బ తీయడంతో పాటు సంస్థను రాజకీయ వివాదంలోకి కూడా లాగేందుకు చేసిన భారీ కుట్ర. ఆ ఆరోపణలను ఒక వర్గం మీడియా తమ స్వార్థ ప్రయోజనాల కోసం విపరీతంగా ప్రచారం చేసింది. అంతటి సంక్షోభంలో కూడా మేం విలువలతో ఎక్కడా రాజీ పడలేదు. అదే ఏడాది సంస్థను ఆర్థికంగా సమున్నత శిఖరాలకు చేర్చి తలెత్తుకు నిలిచాం. మేం ఎలాంటి అవకతవకలకూ పాల్పడలేదని చివరికి సుప్రీంకోర్టే తేల్చింది’’ అని చెప్పారు. -
ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు వైఎస్ జగన్ లీగల్ నోటీసులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కేంద్రంతో విద్యుత్ కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తూ కథనాలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫు న్యాయవాదులు శనివారం లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం అని, థర్డ్ పార్టీకి ఎలాంటి పాత్ర లేదని ఆది నుంచి తమ క్లయింట్ స్పష్టం చేస్తున్నారని పేర్కొన్నారు. సెకీ ఐఎస్టీఎస్ (అంతర్రాష్ట్ర సరఫరా) చార్జీలు మినహాయింపు ఇచ్చిందని.. ఆ మేరకు ఒప్పంద పత్రాలు, సెకీ రాసిన లేఖ ప్రతులను చూపిస్తున్నా సరే ఆ పత్రికలు పట్టించుకోకుండా నిరాధారంగా తమ క్లయింట్ గౌరవ ప్రతిష్టలను దెబ్బ తీస్తూ, ఉద్దేశ పూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచురించాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ ఒప్పందంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, దానిని ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కథనాల వల్ల తమ క్లయింటు ప్రతిష్ట దెబ్బ తింటుందని ముందే తెలిసి, అందుకు అనుగుణంగా తప్పుడు ఆరోపణలతో కథనాలు ప్రచురించారని తెలిపారు. ఈ మేరకు ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్‌తో పాటు ఈనాడు ఎడిటర్ ఎం.నాగేశ్వరరావుకు, ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషర్‌తో పాటు ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఎన్.రాహుల్ కుమార్‌లకు వైఎస్ జగన్ తరఫు న్యాయవాదులు లీగల్ నోటీసు పంపారు.ఇదీ చదవండి: సెకితో ఒప్పందం.. ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పిన వైఎస్ జగన్ -
టీడీపీ తీరుతో మోదీకి మకిలి!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబుతోపాటు ఎల్లోమీడియా మొత్తానికి అక్కసు ఉందన్నది జగమెరిగిన సత్యం. అయితే ఈ అక్కసు, ద్వేషాల్లో వారు ప్రధాని మోదీని భ్రష్టుపట్టించేందుకూ వెనుకాడటం లేదు. ఎలాగంటారా? అదానీపై అమెరికా కోర్టు పెట్టిన ముడుపుల కేసే ఉదాహరణ. ఒకపక్క చంద్రబాబేమో ఈ కేసులు ఆంధ్రప్రదేశ్‌కు అప్రతిష్ట తీసకొచ్చాయని వ్యాఖ్యానిస్తే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మోదీని నిందిస్తోంది. ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన టీడీపీ కూడా కాంగ్రెస్ మాటలకు వత్తాసు పలుకుతున్నట్లుగా జగన్‌పై ఆరోపణలు గుప్పించడం మోదీని భ్రష్టుపట్టించడమే అవుతుంది. అదానీపై వచ్చిన ఆరోపణలలో నిజమని నమ్మితే చంద్రబాబు కూడా మోదీని నేరుగా తప్పు పట్టాలి కదా! ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్లు చెప్పాలి కదా! అలా కాకుండా జగన్‌పై విమర్శలు చేస్తూ మోదీకి చికాకు కలిగించారు. ఈ విషయం కేంద్రంలోని బీజేపీ పెద్దలకు అర్థమవుతోందో లేదో!ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి జగన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో (సెకి) చేసుకున్న ఒప్పందానికి సంబంధించి అవినీతి జరిగిందన్నది టీడీపీ, ఎల్లో మీడియా ఆరోపణ. తన సోలార్ పవర్‌కు ఆర్డర్లు పొందడానికి అదానీ ఆయా రాష్ట్రాలలో లంచాలు ఇచ్చారని అమెరికా పోలీసులు పెట్టిన అభియోగాల ఆధారంగా వీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు. అమెరికా పోలీసులు దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపినట్లు కనిపించలేదు.ప్రముఖ న్యాయ కోవిదులు ముకుల్ రోహ్తగి, మహేష్ జెఠ్మలానీలు ఇదే వ్యాఖ్య చేశారు. అదే టైమ్ లో ఐదు రాష్ట్రాలు సెకీతో ఒప్పందం కుదుర్చుకుని విద్యుత్ తీసుకోవడానికి సిద్ధపడితే, ఆ రాష్ట్రాలలో కూడా ముడుపులు ఇచ్చారని అంటూనే అమెరికా పోలీసులు ఒక్క ఏపీ పేరునే ప్రస్తావించడం అనుమానాస్పదంగా ఉంది. ఈ రాష్ట్రాలు అసలు అదానీతో ఒప్పందమే చేసుకోలేదు. ఏపీకి సంబంధించిన జగన్ ప్రత్యర్థులు ఎవరైనా అమెరికా పోలీసులను కూడా ప్రభావితం చేశారా అన్న సందేహం వస్తుంది. అదానీ ప్రధాని మోదీకి సన్నిహితుడు కావడంంతో అంతర్జాతీయ సంస్థలు ఏమైనా దేశాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఇలాంటి కుట్రలు చేశాయా? అన్న డౌటు కొందరు వ్యక్తం చేస్తున్నారు.జగన్‌పై విమర్శలు చేస్తే అవి మోదీకి, అదానీకి తగులుతాయన్న సంగతి చంద్రబాబు నాయుడు తెలియదా! సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఏమైనా ప్రైవేటు సంస్థా? కాదు కదా! కేంద్రానిది. వారు దానీ కంపెనీ నుంచో, మరో కంపెనీ నుంచో పవర్ కొని ఆయా రాష్ట్రాలకు సరఫరా చేస్తే వీరికి వచ్చిన కష్టం ఏమిటి? రాష్ట్రానికి విద్యుత్ యూనిట్ రూ.2.49లకే రావడం మేలా? కాదా? అన్నది చెప్పకుండా జగన్ పై బురద వేయడం వల్ల అది ఆయనపైనే పడుతుందా? ఆటోమాటిక్ గా అదానీతోపాటు, మోదీపై కూడా పడుతుంది కదా! చంద్రబాబు ఉద్దేశం అదే అయినా, లేదా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా భావన అదే అయినా, ధైర్యంగా నేరుగానే ఆ మాట చెప్పి ఉండవచ్చు. జగన్‌తోపాటు వారిద్దరిపై కూడా ధ్వజమెత్తి ఉండవచ్చు.అలా ఎందుకు చేయడం లేదు? ఈ నేపథ్యంలో జగన్ ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు క్షమాపణ డిమాండ్‌తో రూ.వంద కోట్ల పరువు నష్టం పరిహారం కోరుతూ నోటీసు పంపించారు. అయినా ఈ మీడియా అడ్డగోలు కథనాలు ఆపకపోవడం గమనార్హం. ప్రస్తుతం థేపీలో పెరుగుతున్న విద్యుత్ ఛార్జీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవి ఈ యాగీ చేస్తున్నాయి. తన ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వల్ల ఏడాదికి రూ.నాలుగు వేల కోట్ల చొప్పున పాతికేళ్లకు ఏపీకి రూ.లక్ష కోట్లు ఆదా అయిందని, అదంతా సంపదేనని జగన్ అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం రూ.ఐదు నుంచి రూ.ఆరులకు సౌర, పవన విద్యుత్తును కొనుగోలు చేస్తామని ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఏపీకి రూ.85 వేల కోట్ల భారం పడిందని జగన్ చెప్పారు.ఈ విషయాలకు ఈనాడు నేరుగా సమాధానం ఇవ్వకుండా చంద్రబాబు టైమ్ లో చేసిన ఒప్పందాలను ఈ ఒప్పందంతో పోల్చరాదనే పిచ్చి వాదన చేసింది. ఇందులోనే వారి డొల్లతనం బయటపడింది. అంత అధిక ధరలకు చంద్రబాబు ప్రభుత్వం పాతికేళ్లకు ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? భవిష్యత్తులో ధరలు తగ్గుతాయని ఈనాడు రామోజీరావుకు తెలుసు కదా! అయినా అప్పట్లో ఈనాడు ఎందుకు ఆ ఒప్పందాలను వ్యతిరేకించలేదు.రూ.2.49లకే యూనిట్ విద్యుత్ కొంటేనే రూ.1750 కోట్ల లంచం ఇచ్చే అవకాశం ఉంటే అంతకు రెట్టింపు ధరకు పాతికేళ్లపాటు చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఉంటే ఇంకెంత ముడుపులకు అవకాశం ఉండి ఉండాలి? పైగా జగన్ ప్రభుత్వం ఆ పీపీఏలను రద్దు చేయాలని తలపెడితే అప్పుడు ఇదే ఎల్లో మీడియా, చంద్రబాబు రద్దు చేయరాదని, పెట్టుబడులు రావంటూ ఎందుకు వాదించారు? దీంట్లో వారి ఇంటరెస్టు ఏమిటి? వారు ప్రచారం చేసినదాని ప్రకారం సెకీతో జగన్ ప్రభుత్వం ఒప్పందం వల్ల లక్ష కోట్ల భారం పడాలి.అది నిజమే అనుకుంటే అది ఎవరు చేస్తున్నట్లు. కేంద్ర ప్రభుత్వమే కదా! అంటే మోదీ ప్రభుత్వ చర్య వల్ల ఏపీకి లక్ష కోట్ల నష్టం వస్తోందని ఎందుకు రాయలేదు! సెకీ అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ ఛార్జీలను రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ గురించి ఎందుకు ఈనాడు మీడియా సమాధానం ఇవ్వలేకపోయింది. అది నిజమా? కాదా? దానివల్ల ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ధరకు కేంద్రం ఏపీకి విద్యుత్ సరఫరా చేయడానికి ముందుకు వచ్చిందన్న వాస్తవాన్ని ఎందుకు కప్పిపుచ్చారు. అలాగే గుజరాత్లో రూ.1.99లకే యూనిట్ విద్యుత్ వస్తోందని ఈనాడు ప్రచారం చేసింది.ఇక్కడ మాత్రం అతి తెలివిగా అక్కడ నుంచి ఏపీకి తరలించడానికి అయ్యే వీలింగ్ ఛార్జీల ఖర్చు మరో రెండు రూపాయల గురించి మాత్రం కప్పిపుచ్చింది. ఇది వీళ్ల దిక్కుమాలిన జర్నలిజం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారనో, లేక తానే కనిపెట్టినట్లో ఏడు గంటలలోనే సెకీతో ఒప్పందం చేసుకున్నారని ఈనాడు పచ్చి అబద్దం ప్రచారం చేసినట్లు జగన్ డాక్యుమెంట్ల సహితంగా వివరిస్తే, దాని మీద తేలుకట్టిన దొంగ మాదిరి వ్యవహరించింది. తమిళనాడు, ఒడిషా, చత్తీస్గడ్, జమ్ము-కశ్మీర్ రాష్ట్రాలు సెకి నుంచి రూ.2.61లకు కొనుగోలు చేస్తే, దానిని ఎందుకు ఈ మీడియా చెప్పడం లేదు! పోనీ సెకితో కాకుండా అదానితో జగన్ ప్రభుత్వం నేరుగా ఒప్పందం చేసుకుందని చంద్రబాబు కాని, ఎల్లో మీడియా కాని ఆధారాలతో చూపించాయా? తాజాగా వచ్చిన ఒక సమాచారం ప్రకారం సెకీతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే కేంద్రం నుంచి వచ్చే రూ.2800 కోట్ల ప్రోత్సహానికి గండి పడుతుందట. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి చెప్పారని ఒక ఆంగ్ల పత్రిక కథనాన్ని ఇచ్చింది. అంటే ఈ ఒప్పందం మంచిది అనే కదా!తమ చేతిలో మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు రాసేసి బురద చల్లితే సరిపోతుందని అనుకుంటే సరిపోదు. వీరు జగన్ మీద బురద చల్లామని అనుకుంటున్నారు కాని, అది పడుతోంది మోదీపైన.ఎల్లో మీడియా కాని, టీడీపీ నేతలు పార్టీ ఆపీస్లో కూర్చుని ఎలాంటి వికృత ప్రచారం చేశారు! అమెరికా కేసులో జగన్ పేరు ఉన్నట్లు, ఆ పోలీసులు ఇండియాకు వచ్చి అరెస్టు చేసేస్తున్నట్లు, చివరికి అక్కడ జైలు కూడా రెడీ చేసినట్లు ఎంత దుర్మార్గంగా ప్రచారం చేశారు. ఇలా చేసినందుకు వారు సిగ్గు పడడం లేదు.అందులో ఏమాత్రం నిజం ఉన్నా అదానీ ముందుగా జైలుకు వెళతారని కదా? అని టీడీపీ వారు చెప్పాల్సింది.విచిత్రం ఏమిటంటే ఏపీ బీజేపీ నేతలు కొందరు చంద్రబాబుకే ప్రధాన్యత ఇస్తూ, మోదీపై బురద వేస్తున్నా కనీసం ఖండించ లేదు. గతంలో జగన్ పై సీబీఐ అక్రమ కేసులు పెట్టినట్లుగానే ఇప్పుడు అమెరికాలో కూడా పోలీసులు పిచ్చి అభియోగాలు మోపారా అన్న సందేహాన్ని న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో సిమెంట్ కంపెనీకి నీరు ఇస్తే అది క్విడ్ ప్రోకో అని, పరిశ్రమకు భూమి ఇస్తే, అందులో నేరం ఉందని.. ఇలా జగన్ పై తప్పుడు కేసులు పెట్టారు.ఆ కేసుల వల్ల ఎపికి తీరని నష్టం జరిగింది. కొత్త పరిశ్రమలు రాకుండా పోయాయి.సోనియా గాంధీ, చంద్రబాబులతో పాటు అప్పటి సీబీఐ అధికారులు దీనికి కారణం అని భావిస్తారు. ఇప్పుడు కూడా సెకీ ఒప్పందంపై అనవసర వివాదం సృష్టించి దేశానికి, అందులోను ఏపీకి నష్టం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఒప్పందాన్ని రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీపై కేసు పెట్టే ధైర్యం చంద్రబాబు ప్రభుత్వం చేయవచ్చు కదా!అలా ఎందుకు చేయడం లేదు. పరోక్షంగా మోదీని గబ్బు పట్టిస్తూ, ఇంకో వైపు ఆ అగ్రిమెంట్ ను ఎందుకు కొనసాగిస్తున్నారన్న దానికి సమాధానం దొరకదు. ఈనాడు అధినేత దివంగత రామోజీకి పద్మ విభూషణ్ బిరుదు ఇప్పిస్తే, దానికి రిటర్న్ గిఫ్ట్ గా ప్రధాని మోదీకి ఆయన కుమారుడు కిరణ్ బురద రాస్తున్నట్లు అనిపిస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘ఎవరికి చెల్లింపులు చేసినా నాకు తెలుస్తుంది’
తప్పుడు పద్ధతిలో కాంట్రాక్టులు పొందేందుకు ప్రభుత్వ అధికారులకు ఎలాంటి లంచాలు ఇవ్వలేదని అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషీందర్ సింగ్ అన్నారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణల ప్రకారం అంత పెద్దమొత్తంలో ఎవరికైనా నగదు చెల్లిస్తే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హోదాలో ఉన్న తనకు కచ్చితంగా తెలుస్తుందన్నారు. ఈమేరకు విలేకరుల సమావేశంలో ఆయన కొన్ని విషయాలు వెల్లడించారు.‘అదానీ గ్రూప్‌పై ఇటీవల వచ్చిన ఆరోపణల్లో వాస్తవాలు లేవు. గ్రూప్ అధికారులు కాంట్రాక్టులు పొందేందుకు ప్రభుత్వ అధికారులకు ఎలాంటి లంచాలు ఇవ్వలేదు. ఆరోపణల ప్రకారం అంత పెద్దమొత్తంలో నగదు చెల్లిస్తే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హోదాలో ఉన్న నాకు కచ్చితంగా సమాచారం ఉంటుంది. యూఎస్‌లో చేసిన ఆరోపణలు న్యాయపరమైన అధికారాన్ని ఉపయోగించడమే తప్పా ఇది గ్రూప్‌పై దాడి కాదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు నిబంధనల ప్రకారం సరైన విధంగా స్పందిస్తారు. ఆయా ఆరోపణలను సమర్థంగా తిప్పికొడుతారు. ప్రస్తుతం 30 నెలల రుణ వాయిదాలు తిరిగి చెల్లించే సామర్థ్యం అదానీ గ్రూప్ కలిగి ఉంది. ఎంతటి క్లిష్ట పరిస్థితిలోనైనా 12 నెలల కంటే ఎక్కువగానే రుణా వాయిదాలు చెల్లించే నగదును ముందుగానే సిద్ధంగా ఉంటుంది’ అని తెలిపారు.ఇదీ చదవండి: పాన్ 2.0: అప్లై విధానం.. ఫీజు వివరాలుభారత్లో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌లు పొందేందుకు దాదాపు రూ.2,200 కోట్లు (సుమారు 265 మిలియన్ డాలర్లు) లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో ఇటీవల అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ అధినేత గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై మోసం, లంచం, అవినీతి కేసులు నమోదయ్యాయి. -
పార్లమెంట్లో ఆగని రగడ
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంపై ప్రతిపక్షాలు పట్టువీడడం లేదు. అదానీ అంశంతోపాటు మణిపూర్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పట్టణంలో జరిగిన హింసాకాండపైనా చర్చించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగించాయి. ప్రభుత్వం అంగీకరించలేదు. ఫలితంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉభయ సభలు నాలుగో రోజు శుక్రవారం సైతం స్తంభించాయి. లోక్‌సభ, రాజ్యసభలో ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. రెండు సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టల ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి బిగ్గరగా నినాదాలు చేశారు. ఇంతలో స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. విపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. నియంతృత్వం నశించాలి, అదానీని అరెస్ట్ చేయాలి అనే నినాదాలతో సభ మార్మోగిపోయింది. సభా కార్యక్రమాలు సజావుగా సాగాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, కొందరు ఎంపీలు మాత్రం సభను పదేపదే అడ్డుకొంటూ ప్రజల ఆకాంక్షలు వినిపించకుండా చేస్తున్నారని స్పీకర్ ఓంబిర్లా మండిపడ్డారు. విపక్ష సభ్యుల తీరుపట్ల ప్రజలు చింతిస్తున్నారని చెప్పారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు శాంతించలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్యం 12 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన ఆగలేదు. చేసేది లేక సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. రాజ్యçసభలోనూ ఇదే రీతిలో విపక్షాలు సభా కార్యకలాపాలకు అడ్డుతగిలాయి. అదానీ గ్రూప్‌పై వచి్చన అవినీతి ఆరోపణలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు ఇచి్చన వాయిదా తీర్మానాలను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. రూల్ నెంబర్ 267 కింద వాయిదా తీర్మానాలు ఇవ్వడాన్ని విపక్షాలు ఒక ఆయుధంగా మార్చుకుంటున్నాయని తప్పుపట్టారు. దీనిపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. నినాదాలతో హోరెత్తించాయి. పరిస్థితి ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. -
అసలు జరిగింది ఇదే.. జాతీయ మీడియాతో వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి ఎంతో డబ్బు ఆదా అవుతుందని.. తక్కువ రేటు కోసమే తాము టెండర్లు పిలిచామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్డీటీవీ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ, ‘‘మా ప్రభుత్వం ఉద్దేశం తక్కువ ధరకు విద్యుత్ సేకరించడమేనని.. సాధారణంగా విద్యుత్ సేకరణ ఛార్జీ రూ.5.10గా ఉంది. సెకీతో ఒప్పందంతో రాష్ట్రానికి ఎంతో ఖర్చు తగ్గింది’’ అని వివరించారు.‘‘మేం ముందుగా 6,400 మెగావాట్ల విద్యుత్‌కు టెండర్లు పిలిచాం. కొందరి కారణంగా అది కోర్టు వివాదాల్లో చిక్కుకుంది. దాదాపు 10 నెలల తర్వాత సెకీ నుంచి మాకు లేఖ వచ్చింది. ఆ టెండర్లలో కోట్ చేసిన అమౌంట్‌కే విద్యుత్ ఇచ్చేందుకు సెకీ ఒప్పుకుంది. రూ.2.49కే యూనిట్ విద్యుత్ సఫ్లై చేసేందుకు అంగీకరించింది. అంతేకాదు స్పెషల్ ఇంటెన్సివ్ కూడా ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేకుండా విద్యుత్ ఇచ్చేందుకు సెకీ అంగీకరించింది.’’ అని వైఎస్ జగన్ చెప్పారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఇంత తక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేయడం ఇదే ప్రథమం.. అంత మంచి మంచి అవకాశాన్ని ఏ ప్రభుత్వమైనా వదులుకుంటుందా?. కేంద్ర ఆధీనంలో సెకీ ఇచ్చిన ఆఫర్‌ను అంగీకరించాం. పెట్టుబడి పెట్టాలనుకునే ఎవరైనా సరే సీఎంను కలుస్తారు కదా.. ఇలాంటి విషయాల్లో సీఎం ముందుకు రాకపోతే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు...2019 నుంచి నా పదవీ కాలం ముగిసే వరకు నేను గౌతమ్ అదానీని ఐదారు సార్లు కలిశా. కేవలం ఆగస్టులో కలిసిన విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు. ఆగస్టు తర్వాత అంతకుముందు కూడా చాలాసార్లు కలిశా. ఆయన్నే కాదు.. చాలామంది వ్యాపారవేత్తలతో భేటీ అయ్యాను. సీఎంగా అది నా బాధ్యత.. విధుల్లో ఒక భాగం’’ అని వైఎస్ జగన్ చెప్పారు. -
అదానీ అప్పులపై బ్యాంకులు సమీక్ష
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై లంచం ఆరోపణల కేసు నమోదైనందున ఇకపై రుణదాతల ధోరని మారుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అదానీ గ్రూప్‌నకు భారీగా రుణాలు మంజూరు చేసిన బ్యాంకుల్లో ఎస్బీఐ మొదటి స్థానంలో ఉంది. అయితే ఎస్బీఐతోపాలు వివిధ బ్యాంకులు అదానీ గ్రూప్‌నకు గతంలో జారీ చేసిన రుణాలు, తాజాగా విడుదల చేసిన అప్పులకు సంబంధించి సమీక్ష ప్రారంభించించాయి. ఎస్బీఐ తర్వాత అదానీ గ్రూప్‌నకు అధిక మొత్తంలో లోన్లు ఇచ్చిన బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్‌లు అప్పుల వివరాలను సమీక్షిస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి.పాత అప్పులపై మార్పులు ఉండకపోవచ్చు..ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వివరాల ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అదానీ గ్రూప్‌నకు సుమారు రూ.33,500 కోట్ల అప్పు ఇచ్చింది. ఈ అప్పుతో ప్రారంభించిన పలు ప్రాజెక్ట్‌లు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఈ దశలో అప్పులపై రివ్యూ చేసి వాటిని నిలిపివేసే అవకాశాలు ఎస్బీఐకు లేవని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ తాజాగా బ్యాంకులు అందించిన అప్పులపై మాత్రం కొంత మార్పులు చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.కేరళ-అదానీ పోర్ట్స్ ఒప్పందంఅదానీ గ్రూప్‌పై పలు ఆరోపణలు చెలరేగుతున్న తరుణంలో కేరళ ప్రభుత్వం అదానీ పోర్స్ట్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. కేరళ ప్రభుత్వం తిరువనంతపురంలోని విజింజామ్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి కోసం అదానీ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 2028 వరకు దీని పనులు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.ఇదీ చదవండి: నకిలీ షాపింగ్ వెబ్సైట్లు.. తస్మాత్ జాగ్రత్త!అదానీకి బాసటగా..మరోవైపు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌నకు కొందరు ఇన్వెస్టర్లు బాసటగా నిలుస్తున్నారు. గౌతమ్ అదానీ తదితరులపై అమెరికాలో ఆరోపణలు వచ్చినప్పటికీ తమ పెట్టుబడుల విషయంలో పునరాలోచనేమీ లేదని అబు ధాబీకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ) వెల్లడించింది. హరిత ఇంధనం, పర్యావరణ అనుకూల రంగాల్లో అదానీ గ్రూప్ చేస్తున్న కృషిపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. ఐహెచ్సీ 2022లో అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్), అదానీ ట్రాన్స్‌మిషన్‌లో (ఏటీఎల్) 500 మిలియన్ డాలర్లు(రూ.4151 కోట్లు), అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 1 బిలియన్ డాలర్లు(రూ.83,020 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. -
మేము అదానీ వెంటే...
న్యూఢిల్లీ: క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌నకు ఇన్వెస్టర్లు బాసటగా నిలుస్తున్నారు. గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తదితరులపై అమెరికాలో ఆరోపణలు వచ్చినప్పటికీ తమ పెట్టుబడుల విషయంలో పునరాలోచనేమీ లేదని అబు ధాబీకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ) వెల్లడించింది. హరిత ఇంధనం, పర్యావరణ అనుకూల రంగాల్లో అదానీ గ్రూప్ చేస్తున్న కృషిపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. ఐహెచ్సీ 2022లో అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్), అదానీ ట్రాన్స్‌మిషన్‌లో (ఏటీఎల్) చెరి 500 మిలియన్ డాలర్లు, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏజీఈఎల్, ఏటీఎల్‌లో ఒక శాతం పైగా వాటాలు విక్రయించినప్పటికీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో మాత్రం 5 శాతం పైగా వాటాలు పెంచుకుంది. మరోవైపు, అంతర్జాతీయ భాగస్వాములు కూడా అదానీ గ్రూప్‌నకు మద్దతు తెలిపారు. అదానీ గ్రూప్‌తో భాగస్వామ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని శ్రీలంక పోర్ట్స్ అథారిటీ తెలిపింది. దేశంలో పోర్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అదానీ గ్రూప్ కీలక పాత్ర పోషిస్తోందని వివరించింది. అదానీ గ్రూప్ 1 బిలియన్ డాలర్లతో కొలంబో టెరి్మనల్‌ను గ్రూప్ అభివృద్ధి చేస్తోంది. మరోవైపు, టాంజానియా ప్రభుత్వం కూడా అదానీ పోర్ట్స్‌తో ఒప్పందాలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులపై ఎలాంటి ఆందోళన లేదని, కాంట్రాక్టులన్నీ దేశ చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయని వివరించింది. దార్–ఎ–సలామ్ పోర్టులోని 2వ కంటైనర్ టెర్మినల్ నిర్వహణకు టాంజానియాతో అదానీ పోర్ట్స్ ఇటీవలే 30 ఏళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం అధికారులకు లంచాలిచ్చారని అదానీపై అమెరికాలో ఆరోపణలు రావడంతో గ్రూప్ కంపెనీల షేర్లు కుదేలుకావడం, అభియోగాలేమీ తీవ్రమైనవి కావని సంస్థ స్పష్టతనివ్వడంతో మళ్లీ పుంజుకోవడం తెలిసిందే. -
ఈనాడు, ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తున్నాం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులో.. తన పేరు ఉందన్న ప్రచారంపైనా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ఆ ఆరోపణల్లో తన పేరు ఎక్కడా లేదని, అది ఉత్త మూర్ఖపు ప్రచారమేనని, కొంతమంది కావాలని చేస్తున్న రాద్ధాంతమని కుండబద్ధలు కొట్టారాయన. అలాగే తనపై తప్పుడు రాతలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతికి డెడ్‌లైన్ విధించారాయన.‘‘సీఎంలు పారిశ్రామిక వేత్తలను కలుస్తారు. నేను ఐదేళ్ల కాలంలో అదానీని కలిశాను. వాటికి విద్యుత్ ఒప్పందాలకు ముడిపెట్టి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో థర్డ్ పార్టీ ఎవరూ లేరు. ఇది ఏపీ ప్రభుత్వానికి, డిస్కంలకు, కేంద్ర ప్రభుత్వానికి(సెకి) మధ్య జరిగిన ఒప్పందం. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లపై పరువు నష్టం దావా వేస్తా. .. ఈనాడు, ఆంధ్రజ్యోతి.. టీడీపీ కోసం పని చేసే మీడియా సంస్థలు. వాస్తవాల్ని వకక్రీకరించి పదే పదే అబద్ధాలు రాస్తున్నాయి. ఆ కేసులో నా పేరు ఎక్కడా లేదు. కానీ, ఆ రెండు మీడియా సంస్థలు నా పరువు ప్రతిష్టలు దెబ్బ తీసేలా అబద్ధాలతో ప్రచారం చేస్తున్నాయి. వాటికి లీగల్ నోటీసులు పంపిస్తా. వాటికి 48 గంటల ఇస్తున్నా. ఆ లోపు క్షమాపణలు చెప్పకపోతే.. రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా’’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు.ఇదీ చదవండి: సంపద సృష్టించిన జగన్.. ఆవిరి చేస్తున్న చంద్రబాబు! ఎలాగంటే.. -
‘విడ్డూరంగా షర్మిల మాటలు.. ముమ్మాటికీ అది తప్పుడు ప్రచారమే’
వైఎస్సార్ జిల్లా, సాక్షి: అదానీ వ్యవహారంతో గత ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, విద్యుత్ కొనుగోళ్ల విషయంలో పత్రికల్లో వస్తున్న వార్తల్లో ఇసుమంత కూడా వాస్తవం లేదని అన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. గురువారం ఈ అంశాలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలపైనా మండిపడ్డారు.‘‘అదానీ నుంచి విద్యుత్ కొనుగోళ్లలో జగన్ కు లంచాలు ముట్టాయంటూ షర్మిల మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అదానీ కంపెనీ విద్యుత్ ను కేంద్ర ప్రభుత్వానికి అమ్మితే.. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి ద్వారా ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో అదానీ లంచం ఎందుకిస్తారు.? అదానీకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు... షర్మిల పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తుంది. రాజకీయాలను అడ్డు పెట్టుకుని వ్యక్తిగత కక్షలు తీర్చు కోవాలనుకుంటున్నారు. అధికారులకు లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు అని చార్జిషీట్ లో ఉంటే.. ఏకంగా జగన్‌కు 1,750 కోట్లు లంచం ఇచ్చారని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. జగన్ హయాంలో రాష్ట్రానికి తక్కువతో విద్యుత్ కొని ఆదా చేస్తే తప్పుడు ప్రచారాలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు, షర్మిలకు దమ్ముంటే నరేంద్ర మోదీని ప్రశ్నించాలి. .. గడచిన 6 నెలల్లో కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందన్న శివప్రసాద్‌రెడ్డి.. అబద్ధాలను అస్త్రాలుగా చేసుకుని పాలిస్తూ ఏపీ ప్రజలను గాలికి వదిలేశారన్నారు. ‘‘నాడు కేబినెట్ చర్చల అనంతరం 2.49 పైసలకే మన ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లు చేసింది. కానీ, ఇప్పుడు రామోజీరావు కొడుకు, రాధాక్రిష్ణలు, షర్మిల, టీడీపీ నేతలు పక్కనే ఉండి చూసినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు గతంలో ఇదే సెకి ద్వారా రూ 5.30 పైసలతో విద్యుత్ కొనుగోలు చేసింది’’ అని శివప్రసాద్‌రెడ్డి గుర్తు చేశారు.అమెరికా కేసులో జగన్ పేరుందని దుష్ప్రచారం చేస్తున్నారు.. అక్కడ వేసిన చార్జ్ షీట్ లో ఎక్కడా జగన్ పేరూ లేదు.. ఏపీ ప్రభుత్వం పేరూ లేదు అని స్పష్టం చేశారు.ప్రతిపక్షాన్ని పూర్తిగా మట్టుపెట్టాలని ప్రశ్నించే గొంతును నొక్కేందుకు వీళ్లు చట్టాలు తెస్తున్నారు. ప్రజల సమస్యలను మేం మాట్లాడుతున్నాం అని నల్ల చట్టాలను తీసుకొస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కూడా పీడీ యాక్ట్ పెడతారా? అని ప్రశ్నించారాయన... చెవిరెడ్డి చేసిన నేరం ఏంటి? ఓ ఆడపిల్ల కుటుంబాన్ని పరామర్శిస్తే కేసు పెడతారా?. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే వారికి అండగా నిలవవద్దని మీరు ఇలాంటి కేసులు పెడుతున్నారా?. మీరు మాత్రం ప్రతి రోజూ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడొచ్చు.. మేం పేదల పక్షాన నిలిస్తే కేసులు పెడతారా? అని శివప్రసాద్‌రెడ్డి నిలదీశారు. -
ఇవేం నేరారోపణలు?
సాక్షి, అమరావతి: సౌర విద్యుత్ ప్రాజెక్టుల సంబంధించి అదానీ గ్రూపు లంచాలు ఇచ్చేందుకు కుట్ర పన్నిందంటూ యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) కింద అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (డీఓజే) కేసు నమోదు చేయడాన్ని ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తప్పుబట్టారు. ‘డీఓజే’ చేసిన నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలు ఏవీ లేవని ఆయన స్పష్టం చేశారు. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ)ను ఉల్లంఘించారనే విషయంలో అదానీలపై ఎలాంటి నేరారోపణలు లేవన్నారు. అలాగే న్యాయాన్ని అడ్డుకున్నారన్న నేరారోపణలో కూడా అదానీల పేర్లు గానీ వారి అధికారుల పేర్లు గానీ లేవని వెల్లడించారు. ఈ రెండు కీలకమైన నేరారోపణల్లో అదానీల పేర్లు లేవన్న సంగతిని అందరూ.. ముఖ్యంగా మీడియా గుర్తించాలని సూచించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పారంటే...యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మోపిన నేరారోపణ పత్రాన్ని నేను చదివా. ఆయా వ్యక్తుల నిర్దిష్ట చర్యలపై అభియోగాలు మోపుతూ మన దేశంలో దాఖలు చేసే చార్జిషీట్ లాంటిది ఇది. నా లెక్క ప్రకారం మొత్తం ఐదు నేరారోపణలున్నాయి. ఇందులో మొదటి, ఐదో నేరారోపణలు మిగిలిన వాటికన్నా చాలా ముఖ్యమైనవి. అయితే ఒకటో నేరారోపణలోగానీ ఐదో నేరారోపణలోగానీ అదానీ, ఆయన మేనల్లుడు పేర్లు లేనే లేవు. ఆ నేరారోపణలు మన దేశంలో దాఖలు చేసే చార్జిషీట్ లాంటివి. అది లంచం కావచ్చు.. దొంగతనం కావచ్చు.. హత్య కావొచ్చు. మొదటి నేరారోపణలో ఇద్దరు అదానీల పేర్లు లేవు. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) కింద ఈ నేరారోపణలు చేశారు. ఎఫ్‌సీపీఏ అనేది మన దేశంలో అవినీతి నిరోధక చట్టం లాంటిది. మొదటి నేరారోపణ ఏమిటంటే.. ఎఫ్సీపీఏని ఉల్లంఘించేందుకు కుట్ర పన్నారన్నది. ఇందులో ఆదానీల పేర్లు లేవు. వారి అధికారుల పేర్లు ఉన్నాయి. రెండు, మూడు, నాలుగో ఆరోపణలు సెక్యూరిటీలు, బాండ్లకు సంబంధించినవి. ఈ నేరారోపణల్లో అదానీలు, వారి అధికారుల పేర్లున్నాయి. ఐదవదైన చివరి నేరారోపణ చాలా ముఖ్యమైనది. ఈ నేరారోపణ న్యాయానికి ఆటంకం కలిగించారన్నది. ఇందులో అదానీల పేర్లు లేవు. వారి అధికారుల పేర్లు కూడా లేవు. అసలు ఎవరు ఎవరికి లంచం ఇచ్చారు..? ఎంత లంచం ఇచ్చారు..? ఎలా ఇచ్చారు... లాంటి వివరాల్లేవ్..!ఓ చార్జిషీట్లో ఫలానా వ్యక్తులు ఫలానా పనులు చేశారు.. ఫలానా వ్యక్తులు ఫలానా వారికి లంచం ఇచ్చారు లాంటి వివరాలేవీ లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. అదానీలు సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిమిత్తం భారతదేశ వ్యక్తులకు, సంస్థలకు లంచం ఇవ్వజూపారన్నది ప్రధాన నేరారోపణ. అయితే ఆ నేరారోపణల్లో లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని ఉందే కానీ.. ఎవరికి లంచం ఇచ్చారు? ఎలా లంచం ఇచ్చారు? ఇందులో అదానీ గ్రూపు అధికారుల ప్రత్యక్ష ప్రమేయం ఉందా? ఎంత లంచం ఇచ్చారు? ఏ కాంట్రాక్ట్ కోసం లంచం ఇచ్చారు? అధికారులు ఏ గ్రూపునకు చెందిన వారు తదితర వివరాలేవీ కనీస స్థాయిలో కూడా ఆధారాలు లేవు. ఇందుకు సంబంధించి ఒక్కరి పేరు కూడా ఆ నేరారోపణల్లో లేదు. ఇలాంటి నేరారోపణలపై ఎవరైనా ఎలా స్పందిస్తారు? ఆ నేరారోపణల్లో ఎక్కడా కూడా ఇండియాలో లంచాలు ఇచ్చినట్లు లేదు. లంచం ఇచ్చేందుకు కుట్ర పన్నారన్నదే ప్రధాన నేరారోపణ. కానీ ఇందుకు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ వ్యవహారంలో వారు (అదానీలు) అమెరికాలోని న్యాయవాదుల సలహాలు తీసుకుంటారని భావిస్తున్నా. లంచం ఇవ్వాలని చూశారన్న ఆరోపణ మినహా అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. అందువల్ల ఆ నేరారోపణలన్నీ కూడా ఊహాజనితమైనవే. మరోసారి చెబుతున్నా.. 1, 5వ నేరారోపణల్లో అదానీల పేర్లు లేవు. -
‘అదానీపై ఆరోపణలు... విదేశీ శక్తుల కుట్ర.. ఒక్క ఆధారం చూపలేదు’
సాక్షి, అమరావతి: ‘అదానీ గ్రూప్‌పై అమెరికా న్యాయ శాఖ (డీఓజే) చేసిన ఆరోపణలు, మోపిన అభియోగాలు కేవలం ఊహాగానాలు. పూర్తిగా నిరాధారం. పైగా వాటిని కూడా పూర్తిగా వక్రీకరించి మరీ భారత ప్రజల ముందు పెట్టారు. అదికూడా సరిగ్గా పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలయ్యే ముందే వాటిని బయట పెట్టడం వెనక భారీ దురుద్దేశాలు దాగున్నాయి. ఇది భారత్‌ను ఆర్థికంగా అస్థిరపరిచేందుకు, దేశ కార్పొరేట్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నమే’ అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ పేర్కొన్నారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ భారత్‌లో అధికారులకు, నేతలకు లంచాలిచ్చినట్టు డీఓజే తన అభియోగాల్లో ఎక్కడా స్పష్టంగా పేర్కొనలేదని జఠ్మలానీ గుర్తు చేశారు. తాను కేవలం ఒక జాతీయవాదిగా వ్యక్తిగత హోదాలో మాత్రమే దీనిపై స్పందిస్తున్నట్టు చెప్పారు. అంతేగానీ అదానీలకు గానీ, వారి గ్రూప్‌నకు గానీ మద్దతుగా మాట్లాడటం లేదని స్పష్టం చేశారు. అమెరికాలో జో బైడెన్ సారథ్యంలోని డెమొక్రటిక్ ప్రభుత్వానికి చెందిన అధికార లాబీలు ఏడాదిన్నరగా మోదీ సర్కారుకు పూర్తి వ్యతిరేకంగా పని చేస్తున్నాయన్నారు. ‘అదానీ’ వివాదంపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.విశ్వసనీయత లేదని స్వయంగా ట్రంప్ చెప్పారు..“అది పూర్తిగా అమెరికాలో అదానీ గ్రీన్ కంపెనీ జారీ చేసిన బాండ్లకు సంబంధించిన అంశం. ఇన్వెస్టర్లకు సమాచారమే ఇవ్వకుండా బాండ్లు జారీ చేశారని, భారత్‌లో కాంట్రాక్టులు పొందేందుకు లంచాలు ఆశ చూపిన విషయాన్ని దాచి అమెరికాలో పెట్టుబడుల సేకరణకు ప్రయత్నం చేశారని అభియోగాలు మోపారు. కానీ అందుకు ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చూపలేదు. పైగా ఈ ఉదంతానికి సంబంధించి భారత్‌లో ఏ చట్టాలను ఉల్లంఘించారో కనీసం ఒక్క అభియోగంలో కూడా పేర్కొనలేదు. కనీసం ఉల్లంఘించినట్టు కూడా చెప్పలేదు.భారత్‌లో అధికారులకు గానీ, ప్రజాప్రతినిధులకు గానీ అదానీ గ్రూప్ లంచమిచ్చినట్టు ఎక్కడా నిర్దిష్టంగా చెప్పలేదు కూడా. ‘లంచాలిచ్చారు, లేదా ఇస్తామని వాగ్దానం చేశారు’ అంటూ చాలా పదాల కూర్పులో చాలా తెలివిగా వ్యవహరించారు. కేవలం కుట్ర జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారేగానీ దానికి ఎలాంటి సాక్ష్యాధారాలూ చూపలేదు. పైగా ఆ కుట్రను అమలు చేశారని కూడా ఎక్కడా చెప్పలేదు. లోతుగా చూస్తే ఇవన్నీ కేవలం అమెరికా న్యాయ శాఖ ఊహాగానాలేనని అడుగడుగునా స్పష్టమవుతూనే ఉంది’ అని జఠ్మలానీ స్పష్టం చేశారు. అమెరికాలో న్యాయ శాఖ అనేదే ఒక పెద్ద జోక్ అని, దానికి విశ్వసనీయతే లేదని ఆ దేశానికి కాబోయే అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంపే బాహాటంగా చెప్పారని గుర్తు చేశారు.అదానీ ఎపిసోడ్ మొత్తాన్నీ భారత్‌పై బైడెన్ సర్కారు పన్నాగంలో భాగంగా జఠ్మలానీ అభివర్ణించారు. ‘అదానీలపై ఆరోపణలు తెరపైకి వచ్చినప్పుడల్లా ఆ గ్రూపు ఆర్థికంగా భారీగా నష్టపోతూ వస్తోంది. ఈసారి ఏకంగా 2.4 బిలియన్ డాలర్లు నష్టపోయింది. హిండెన్‌బర్గ్ నివేదికైనా, డీఓజే అభియోగాలైనా పార్లమెంటు సమావేశాలకు సరిగ్గా రెండు రోజుల ముందు బయటికొచ్చాయి. ఇందులోకి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఏ సాక్ష్యం లేకుండా కేవలం ఓ అభియోగ పత్రంపై ఆధారపడి నిరాధార ఆరోపణలు చేయడం కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీకి తగని పని’ అని జఠ్మలానీ పేర్కొన్నారు. విశ్వసనీయమైన సాక్ష్యాలంటూ ఉంటే కాంగ్రెస్ ముందుగా వాటిని ప్రజల ముందు పెట్టాలని జఠ్మలానీ డిమాండ్ చేశారు. -
అదానీపై లంచం ఆరోపణల్లేవు!
న్యూఢిల్లీ: గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీ, కంపెనీ బోర్డు సీనియర్ డైరెక్టర్ వినీత్జైన్పై అమెరికా న్యాయ శాఖ లంచం అభియోగాలు మోపలేదని అదానీ గ్రూప్ సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ స్పష్టం చేసింది. ‘‘న్యూయార్క్ కోర్టులో గత వారం అమెరికా న్యాయ శాఖ (యూఎస్ డీఓజే) దాఖలు చేసిన అభియోగ పత్రంలో, యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ (ఎఫ్‌సీపీఏ/అవినీతి నిరోధక) చట్టం నిబంధనలను ఉల్లంఘించే కుట్రకు పాల్పడినట్టు వ్యవస్థాపక చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ లేదా వినీత్జైన్పై అభియోగాలు మోపలేదు’’అని స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) బుధవారం వివరణ ఇచ్చింది. సెక్యూరిటీస్ చట్టం కింద మోసం, కుట్ర, ఉద్దేశపూర్వక కుట్ర ఆరోపణలే మోపినట్టు తెలిపింది. ఈ అభియోగాలకు చట్టం పరిధిలో శిక్షలు లంచం కంటే చాలా తక్కువని పేర్కొంది. మరోవైపు సెక్యూరిటీల చట్టం నిబంధనలు ఉల్లంఘించారంటూ.. చట్ట ఉల్లంఘన దిశగా అదానీ గ్రీన్ ఎనర్జీకి సాయం అందించారంటూ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ మరో సివిల్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నట్టు ఏజీఈఎల్ వివరణ ఇచ్చింది. సెక్యూరిటీస్ చట్టం 1933, సెక్యూరిటీస్ చట్టం 1934లోని పలు సెక్షన్లను వీరు ఉల్లంఘించారని.. ఏజీఈఎల్ సైతం ఇవే చట్ట ఉల్లంఘనలకు పాల్పడేందుకు సాయం లేదా ప్రోత్సాహం అందించినట్టు సివిల్ కేసులో అభియోగాలు మోపినట్టు వెల్లడించింది. ఏజీఈఎల్ సోలార్ విద్యుత్ సరఫరా కాంట్రాక్టులను దక్కించుకునేందుకు వీలుగా భారత అధికారులకు 265 మిలియన్ డాలర్ల లంచాలు ఇచ్చారంటూ అదానీ తదితరులపై కొన్ని రోజుల క్రితం సంచలన ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ క్రమంలో ఆదానీ గ్రీన్ ఎనర్జీ ఇచ్చిన వివరణకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇవన్నీ నిరాధార ఆరోపణలు అని, ఈ విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అదానీ గ్రూప్ ఇప్పటికే వివరణ ఇచ్చింది.అదరగొట్టిన అదానీ షేర్లు...అమెరికా లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ వివరణ ఇవ్వడంతో అదానీ కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అదానీ టోటల్ గ్యాస్ 20%, అదానీ పవర్ 20%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 10%, అదానీ గ్రీన్ ఎనర్జీ 10% లాభపడ్డాయి. ఈ షేర్లన్నీ ఇంట్రాడేలో అప్పర్‌సర్క్యూట్ తాకాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 12%, ఎన్డీటీవీ 9%, అదానీ విల్మార్ 8%, అదానీ పోర్ట్స్ 6%, సంఘీ ఇండస్ట్రీస్ 5%, అంబుజా సిమెంట్స్ 4.50%, ఏసీసీ 4% పెరిగాయి. పదకొండు కంపెనీల షేర్లూ రాణించడంతో ఒక్కరోజులో అదానీ గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.1.24 లక్షల కోట్లు పెరిగింది. -
‘సోలార్’ లంచాలు.. ఊహాగానాలే
సాక్షి, అమరావతి: ‘‘అదానీ’’ వ్యవహారంపై మీడియాలో వెలువడుతున్న ఊహాజనిత కథనాలు ‘అదుగో పులి అంటే.. ఇదుగో తోక!’ అన్నట్లుగా ఉన్నాయనే అభిప్రాయం న్యాయవర్గాల్లో వ్యక్తమవుతోంది. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి అదానీ గ్రూపు లంచాలు ఇచ్చేందుకు కుట్ర పన్నిందంటూ యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) కింద అమెరికా న్యాయశాఖ (డీఓజే) నమోదు చేసిన కేసులో నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలేవీ లేవని ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ స్పష్టం చేశారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ భారత్‌లో అధికారులకు, నేతలకు లంచాలిచ్చినట్లు డీఓజే తన అభియోగాల్లో ఎక్కడా నిర్దిష్టంగా పేర్కొనలేదని వెల్లడించారు. కేవలం కుట్ర జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారేగానీ దానికి ఎలాంటి సాక్ష్యాధారాలూ చూపలేదని.. లోతుగా పరిశీలిస్తే ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని స్పష్టమవుతోందన్నారు. ఇక ఈ కేసులో అత్యంత కీలకమైన 1, 5వ నేరారోపణల్లో అదానీ గానీ ఆయన మేనల్లుడు పేర్లు గానీ లేనే లేవని చెప్పారు. ‘ఎఫ్‌సీపీఏ’ని ఉల్లంఘించారన్న నేరారోపణల్లోగానీ.. న్యాయానికి ఆటంకం కలిగించారన్న ఆరోపణల్లోగానీ అదానీల పేర్లు లేవనే విషయాన్ని వారు తెరపైకి తెచ్చారు. కీలకమైన ఈ రెండు నేరారోపణల్లో అదానీల పేర్లు లేవనే విషయాన్ని ప్రధానంగా మీడియా సంస్థలు గుర్తించాలని సూచిస్తున్నారు. అసలు లంచం ఇవ్వటానికి ప్రయత్నించారనిగానీ.. ఇచ్చారనిగానీ నిరూపించే కనీస సమాచారం కూడా లేదని పేర్కొంటున్నారు. ఆ నేరారోపణల్లో ఎక్కడా కూడా ఇండియాలో లంచాలు ఇచ్చినట్లు లేదని.. లంచం ఇచ్చేందుకు కుట్ర పన్నారన్నదే ప్రధాన నేరారోపణ అని.. అయితే అందుకు ఎలాంటి ఆధారాలు లేవనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఈ నేపథ్యంలో అమెరికా ‘డీఓజే’ నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలేవీ లేవని ఈ కేసులో న్యాయపరమైన అంశాలను విశ్లేషించిన న్యాయ కోవిదులు చెబుతున్నారు.