ప్రపంచవ్యాప్తంగా ఓడరేవుల నిర్మాణం, నిర్వహణ, వంటనూనెల తయారీ, గ్రీన్ ఎనర్జీ, గ్యాస్ వెలికితీత..వంటి ఎన్నో రంగాల్లో వ్యాపారం సాగిస్తున్న అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ(62) తన 70వ ఏటా పదవీవిరమణ చేయబోతున్నట్లు ప్రకటించారు. 2030ల్లో వ్యాపార సామ్రాజ్య పట్టపు పగ్గాలను తన వారసులకు కట్టబెడుతానని చెప్పారు. ఈమేరకు బ్లూమ్‌బర్గ్ నివేదికలో వివరాలు వెలువడ్డాయి.
గౌతమ్ అదానీ పదవీ విరమణ చేసిన తర్వాత తన కుమారులు కరణ్ అదానీ, జీత్ అదానీ, సోదరుడి కుమారులు ప్రణవ్ అదానీ, సాగర్ అదానీ సంస్థలో సమాన లబ్ధిదారులు అవుతారని నివేదిక ద్వారా తెలిసింది. అదానీ గ్రూప్ వెబ్‌సైట్ ప్రకారం గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ..అదానీ పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. చిన్న కుమారుడు జీత్ అదానీ..అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రణవ్ అదానీ..అదానీ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్, సాగర్ అదానీ..అదానీ గ్రీన్ ఎనర్జీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
ఇదీ చదవండి: నెట్‌వర్క్‌లో అంతరాయం.. బిల్లులో రాయితీ!
ఈ సందర్భంగా గౌతమ్ అదానీ మాట్లాడుతూ..‘వ్యాపార స్థిరత్వానికి వారసత్వం చాలా ముఖ్యమైంది. నా తర్వాత కంపెనీలోకి వచ్చిన వారంతా చాలా నిబద్ధతతో పని చేస్తున్నారు. ఇప్పటికే కుమారులు, ఇతర బంధువులు కొన్ని కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారు. క్రమానుగతంగా కంపెనీ ఎదిగేందుకు తర్వాతితరం బాధ్యతలు చేపట్టాలి. దీనిపై ఉమ్మడి నిర్ణయాధికారానికే ప్రాధాన్యం ఇస్తాం’ అని చెప్పారు. ఇదిలాఉండగా, ఇటీవల అదానీ గ్రూప్ కోర్ సంస్థగా ఉన్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ మొదటి త్రైమాసికంలో రెట్టింపు కంటే ఎక్కువ లాభాన్ని పోస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment