goutam adani
-
అదానీని ఇవాళే అరెస్ట్ చేయాలి: రాహుల్ గాంధీ
ఢిల్లీ: దేశంలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ఏకంగా ముఖ్యమంత్రులను అరెస్ట్‌లను చేస్తున్నారు.. కానీ, గౌతమ్ అదానీని ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. అదానీ.. భారత చట్టాలను, అమెరికా చట్టాలను ఉల్లఘించారనని నిరూపించబడిందని చెప్పుకొచ్చారు. అదానీని వంద శాతం ప్రధాని మోదీనే కాపాడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ లంచం ఆరోపణ కేసులో గౌతమ్ అదానీ, ఇతరులపై అభియోగాలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సందర్బంగా రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు గౌతమ్ అదానీ, మరో ఏడుగురుతో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా ఎఫ్‌బీఐ చెబుతోంది. అదే సమయంలో బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్లు ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. అమెరికాలో ఇది స్పష్టంగా నిరూపించబడింది. అయినప్పటికీ అదానీ బాహ్య ప్రపంచంలో స్వేచ్చగా తిరుగుతున్నారు. చట్టాలు ఆయనకు వర్తించవా?. అదానీని అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాం. #WATCH | Delhi: When asked if he would raise the issue of US prosecutors charging Gautam Adani and others in alleged Solar Energy contract bribery case, in Parliament, Lok Sabha LoP Rahul Gandhi says, "We are raising this issue. It is my responsibility as LoP, to raise this… pic.twitter.com/UenrnN2dej— ANI (@ANI) November 21, 2024ఇదే సమయంలో అదానీ కుంభకోణాలకు పాల్పడుతున్నారని మేము పార్లమెంట్ సాక్షిగా ఎన్నో సార్లు చెప్పాము. కానీ, అదానీపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం మాత్రం ముందుకు రాదు. ఎందుకంటే ప్రధాని మోదీనే అదానీని వంద శాతం కాపాడుతున్నారు. మోదీ, అదానీ కలిసి ఉంటే.. ఆ ఇద్దరూ ఇండియాలో క్షేమంగా ఉంటారు. అదానీ అక్రమాలపై విచారణ జరిపేందుకు జేపీసీ ఏర్పాటు చేయాలన్నది ముందు నుంచి మా డిమాండ్. ఇప్పుడు కూడా ఇదే కోరుతున్నాం. అదానీ రూ.2000 కోట్ల స్కాం చేసినా స్వేచ్చగా బయటే తిరుగుతున్నారు. ఇక, రాహుల్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ కార్యాలయంలో పవర్ కట్ కావడంతో అదానీ పవర్, మోదీ పవర్ ఏది పనిచేస్తుందో అర్థం కాలేదు అంటూ సెటైర్లు వేశారు. కచ్చితంగా పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని మరోసారి లేవనెత్తుతాం. ప్రజలకు అన్ని వివరాలను వెల్లడిస్తాం. ఏ రాష్ట్రంలో అదానీ అవినీతికి పాల్పడినా కచ్చితంగా విచారణ జరపాలి. ఈ వ్యవహారంలో అదానీకి తోడుగా ఉన్న వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. కానీ, అదానీని అరెస్ట్ చేయరు.. ఎందుకంటే ఆయన అరెస్ట్ అయితే చాలా విషయాలు బయటకు వస్తాయి. ప్రభుత్వంలో ఉన్న పెద్దల పేర్లు కూడా బయటకు వస్తాయి.. కాబట్టి ఆయనపై విచారణ కూడా ఉండదు. అదానీ దేశాన్ని హైజాక్ చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే, ఈ కేసుకు సంబంధించి సెబీ చీఫ్ మదహబి పురి బుచ్‌ను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. #WATCH | Delhi: On US prosecutors charging Gautam Adani and others in alleged Solar Energy contract bribery case, Lok Sabha LoP Rahul Gandhi says, "JPC is important, it should be done but now the question is why is Adani not in jail?...American agency has said that he has… pic.twitter.com/rAzVUoquqN— ANI (@ANI) November 21, 2024 -
స్కూటర్‌పై వచ్చి కిడ్నాప్.. అదానీ జీవితంలో భయంకర ఘటన
ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతదేశంలో రెండవ అత్యంత సంపన్నుడైన 'గౌతమ్ అదానీ' గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అదానీ గ్రూప్ అధినేతగా తెలిసిన చాలా మందికి.. ఆయన మరణపు అంచులదాకా వెళ్లి వచ్చిన విషయం బహుశా తెలిసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.1962లో అహ్మదాబాద్‌లోని గుజరాతీ జైన కుటుంబంలో జన్మించిన గౌతమ్ అదానీ ప్రారంభ జీవితం నిరాడంబరంగా సాగింది. చదువుకునే రోజుల్లోనే ఏదైనా సొంత వ్యాపారం ప్రారభించాలనుకునేవారు. ఇందులో భాగంగానే గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి తప్పకున్న తరువాత అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రారంభించారు. అదే ఈ రోజు వేలకోట్ల సామ్రాజ్యంగా అవతరించింది.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం గౌతమ్ అదానీ 93.5 బిలియన్ డాలర్ల నికర విలువతో భారతదేశంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. 1988లో ప్రారంభమైన అదానీ ఎంటర్ప్రైజెస్.. నేడు ఇంధనం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రక్షణ రంగాల్లో ప్రధాన శక్తిగా నిలిచింది.ధనవంతుడిగా ఎదిగిన గౌతమ్ అదానీ జీవితంలో భయంకరమైన దురదృష్టకర సంఘటనలు కూడా జరిగాయి. ఈ విషయాలను అదానీ ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.1998లో కిడ్నాప్గౌతమ్ ఆదానీని, అతని సహచరుడు శాంతిలాల్ పటేల్‌ను 1998లో అహ్మదాబాద్‌లో ఫజ్ల్ ఉర్ రెహ్మాన్ (ఫజ్లు), భోగిలాల్ దర్జీ (మామా) స్కూటర్లపై వచ్చి కిడ్నాప్ చేసారు. కిడ్నాపర్లు వారిని విడుదల చేయాలంటే రూ.15 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదృష్టవశాత్తు అదానీ, పటేల్ ఇద్దరూ ఒకే రోజు విడుదలయ్యారు. కిడ్నాప్ జరిగిందని చెప్పడానికి సరైన ఆధారాలు లేకపోవడంతో.. కేసును రుజువు చేయలేకపోయారు.ఉగ్రవాదుల దాడి1998లో కిడ్నాపర్ల నుంచి బయటపడిన అదానీ 2008 నవంబర్ 26న తాజ్ హోటల్లో జరిగిన ఉగ్రవాదుల దాడి సమయంలో కూడా అక్కడ బందీగా ఉన్నాడు. దుబాయ్ పోర్ట్ సీఈఓ మహ్మద్ షరాఫ్‌తో సమావేశం ముగిసిన తర్వాత, దాడి ప్రారంభమైనప్పుడు అదానీ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. కానీ అప్పుడే ఉగ్రవాదుల దాడి మొదలైంది. ఆ సమయంలో నేను మరణాన్ని 15 అడుగుల దూరం నుంచి చూశానని అదానీ తన అనుభవాన్ని వెల్లడించారు.ఇదీ చదవండి: గూగుల్‌కు రూ. 26వేల కోట్ల ఫైన్.. ఎందుకంటే?జీవితంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్న గౌతమ్ అదానీ.. నేడు తిరుగులేని వ్యాపారవేత్తగా ఎదిగారు. ప్రాణాంతక సవాళ్లను సైతం ఎదుర్కొని గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి భారతీయ వ్యాపార రంగంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా అదానీ.. ఎంతోమంది యువ వ్యాపారవేత్తలకు రోల్ మోడల్. -
తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం
ప్రపంచ ధనవంతులలో ఒకరు, దిగ్గజ పారిశ్రామికవేత్త 'గౌతమ్ అదానీ' తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం అందించారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రూ.100 కోట్ల చెక్కును అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నైపుణ్యాభివృద్ధి, యువత సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు నిరంతర మా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా అదానీ హామీ ఇచ్చారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు 2024 నవంబర్ 4నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందులో లాజిస్టిక్, హెల్త్, ఫార్మా వంటి సుమారు 17 రంగాల్లో యువతకు శిక్షణ అందించనున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రాను నియమించారు.A delegation from Adani Foundation, led by Chairperson of Adani Group, Mr @gautam_adani, met with Hon’ble Chief Minister @revanth_anumula garu to handover a donation cheque of Rs 100 crore towards the establishment of Young India Skills University.Mr Adani also promised… pic.twitter.com/knd4bezz7e— Telangana CMO (@TelanganaCMO) October 18, 2024 -
రిటైర్మెంట్ ప్రకటించిన గౌతమ్ అదానీ!
ప్రపంచవ్యాప్తంగా ఓడరేవుల నిర్మాణం, నిర్వహణ, వంటనూనెల తయారీ, గ్రీన్ ఎనర్జీ, గ్యాస్ వెలికితీత..వంటి ఎన్నో రంగాల్లో వ్యాపారం సాగిస్తున్న అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ(62) తన 70వ ఏటా పదవీవిరమణ చేయబోతున్నట్లు ప్రకటించారు. 2030ల్లో వ్యాపార సామ్రాజ్య పట్టపు పగ్గాలను తన వారసులకు కట్టబెడుతానని చెప్పారు. ఈమేరకు బ్లూమ్‌బర్గ్ నివేదికలో వివరాలు వెలువడ్డాయి.గౌతమ్ అదానీ పదవీ విరమణ చేసిన తర్వాత తన కుమారులు కరణ్ అదానీ, జీత్ అదానీ, సోదరుడి కుమారులు ప్రణవ్ అదానీ, సాగర్ అదానీ సంస్థలో సమాన లబ్ధిదారులు అవుతారని నివేదిక ద్వారా తెలిసింది. అదానీ గ్రూప్ వెబ్సైట్ ప్రకారం గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ..అదానీ పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. చిన్న కుమారుడు జీత్ అదానీ..అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రణవ్ అదానీ..అదానీ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్, సాగర్ అదానీ..అదానీ గ్రీన్ ఎనర్జీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.ఇదీ చదవండి: నెట్‌వర్క్‌లో అంతరాయం.. బిల్లులో రాయితీ!ఈ సందర్భంగా గౌతమ్ అదానీ మాట్లాడుతూ..‘వ్యాపార స్థిరత్వానికి వారసత్వం చాలా ముఖ్యమైంది. నా తర్వాత కంపెనీలోకి వచ్చిన వారంతా చాలా నిబద్ధతతో పని చేస్తున్నారు. ఇప్పటికే కుమారులు, ఇతర బంధువులు కొన్ని కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారు. క్రమానుగతంగా కంపెనీ ఎదిగేందుకు తర్వాతితరం బాధ్యతలు చేపట్టాలి. దీనిపై ఉమ్మడి నిర్ణయాధికారానికే ప్రాధాన్యం ఇస్తాం’ అని చెప్పారు. ఇదిలాఉండగా, ఇటీవల అదానీ గ్రూప్ కోర్ సంస్థగా ఉన్న అదానీ ఎంటర్ప్రైజెస్ మొదటి త్రైమాసికంలో రెట్టింపు కంటే ఎక్కువ లాభాన్ని పోస్ట్ చేసింది. -
వయనాడ్ ఘటన: గౌతమ్ అదానీ భారీ విరాళం
వయనాడ్‌లో కొండచరియలు విరిగిన ఘటనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. లెక్కకు మించిన జనం నిరాశ్రయులయ్యారు. ఈ తరుణంలో వీరికి అండగా నిలబడటానికి ప్రముఖ వ్యాపార దిగ్గజం 'గౌతమ్ అదానీ' కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు.వయనాడ్ బాధితుల సహాయార్థం గౌతమ్ అదానీ కేరళ సీఎం సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళంగా ప్రకటించారు. వయనాడ్‌లో జరిగిన ప్రాణనష్టం పట్ల అదానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో అదానీ గ్రూప్ కేరళకు సంఘీభావంగా నిలుస్తోందని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.వయనాడ్ కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 200 కంటే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కాగా సుమారు ఏడువేలకంటే ఎక్కువమంది రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు. ఈ ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ప్రమాదయినా గురైనవారికి ప్రభుత్వం సాయం కూడా ప్రకటించింది. ఈ సమయంలో పలువురు ప్రముఖులు కేరళ రాష్ట్రానికి ఆర్థిక సాయం ప్రకటిస్తున్నారు.Deeply saddened by the tragic loss of life in Wayanad. My heart goes out to the affected families. The Adani Group stands in solidarity with Kerala during this difficult time. We humbly extend our support with a contribution of Rs 5 Cr to the Kerala Chief Minister's Distress…— Gautam Adani (@gautam_adani) July 31, 2024 -
గౌతమ్ అదానీ కొత్త ప్లాన్.. వియత్నాంలో పోర్ట్!
ఇజ్రాయెల్‌లోని హైఫా, శ్రీలంకలోని కొలంబో, టాంజానియా ఓడరేవు డార్ ఎస్ సలామ్ తర్వాత నాల్గవ అంతర్జాతీయ నౌకాశ్రయంగా కీర్తి గడిస్తున్న అదానీ పోర్ట్ కార్యకలాపాలు వియత్నాంలో కూడా ప్రారంభయ్యే అవకాశం ఉంది. దీనికోసం అదానీ గ్రూప్ వియత్నాంలో ఓడరేవును నిర్మించాలని యోచిస్తోంది.భారతదేశంలో ప్రముఖ ధనవంతులలో ఒకరైన గౌతమ్ అదానీ.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎప్పటికప్పుడు విస్తరించడంతో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదానీ గ్రూప్ అంతర్జాతీయ వాణిజ్యాన్ని మరింతగా ఉపయోగించుకునేందుకు అంతర్జాతీయ ఓడరేవు మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తోంది. తద్వారా లాభాలను గడిస్తోంది.భారతదేశపు అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ), వియత్నాంలోని డా నాంగ్‌లో ఓడరేవును అభివృద్ధి చేయడానికి వియత్నాం ప్రభుత్వం నుంచి కూడా ఆమోదం పొందినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉందని, పెట్టుబడులకు సంబంధించిన మొత్తం ఇంకా ఖరారు కాలేదని ఆయన అన్నారు.గౌతమ్ ఆదానీ.. తన అదానీ పోర్ట్ విస్తరణను లక్ష్యంగా చేసుకుని అధిక ఉత్పత్తి లేదా అధిక జనాభా ఉన్న దేశాలలో ఓడరేవులను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. అదానీ పోర్ట్స్ ప్రస్తుతం మొత్తం వాణిజ్య పరిమాణంలో 5 శాతం అంతర్జాతీయ కార్యకలాపాల నుంచి పొందుతోంది. ఇది 2030 నాటికి 10 శాతానికి చేరుకోవడానికి తగిన సన్నాహాలు చేస్తున్నారు.ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి 'యూ ట్యూబ్'.. ఏటా కోట్లు సంపాదిస్తూ..అదానీ గ్రూప్ కేరళలోని విజింజం ఓడరేవును ప్రారంభించనుంది. ఇప్పటికే ఇక్కడ మొదటి దశ పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని చెబుతున్నారు. ఈ పోర్ట్ 2028-29 నాటికి పూర్తిగా సిద్ధమవుతుందని కరణ్ అదానీ పేర్కొన్నారు. దీనికోసం ఏకంగా రూ. 20000 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. -
బీహెచ్ఈఎల్కు జాక్ పాట్.. అదానీ పవర్ నుంచి భారీ ఆర్డర్
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ రూ.3,500 కోట్ల భారీ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో 1,600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ (టీపీపీ) ఏర్పాటు కోసం అదానీ పవర్ నుండి రూ. 3,500 కోట్ల ఆర్డర్‌ను అందుకున్నట్లు బీహెచ్ఈఎల్ తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో 2x800 మెగావాట్ల టీపీపీని ఏర్పాటు చేసేందుకు అదానీ పవర్ లిమిటెడ్ (ఏపీఎల్) నుంచి బీహెచ్ఈఎల్ ఆర్డర్ దక్కించుకున్నట్లు బీహెచ్ఈఎల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది.ఈ సందర్భంగా బీహెచ్ఈఎల్ సంస్థ తిరుచ్చి, హరిద్వార్ ప్లాంట్లలో బాయిలర్, టర్బైన్ జనరేటర్లను తయారు చేయనున్నట్లు వెల్లడించింది. కాగా, అదానీ-బీహెచ్ఈఎల్ మధ్య కుదిరిన ఒప్పందంతో జూన్ 5న బీహెచ్ఈఎల్ షేర్లు 3 శాతం లాభంతో రూ.253.85 వద్ద ముగియగా, అదానీ పవర్ షేర్లు రూ.723 వద్ద స్థిరపడ్డాయి. -
ఎన్నికల ఫలితాలు తారుమారు.. భారీగా తగ్గిన అంబానీ, అదానీల సంపద
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అంచనాలు తారుమారయ్యాయి. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా క్రాష్ అయ్యాయి. దీంతో భారత చెందిన అదానీ ఎంటర్ ప్రైజెస్ అధినేత గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నికర సంపద భారీగా తగ్గింది.దేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. లోక్‌సభ ఫలితాలకు ముందు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగా.. బీజేపీ ఆ స్థాయిలో సీట్లులో రాణించకపోవడం.. అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడంతో స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. దీంతో అంబానీ, అదానీ నికర సంపద క్షీణించినట్లు తెలుస్తోంది. ముఖేష్ అంబానీ 8.99 బిలియన్ డాలర్ల సందప క్షీణించింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద 106 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు.గౌతమ్ అదానీ నికర విలువ ఒక్క రోజులో 24.9 బిలియన్ డాలర్లు పడిపోయింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బుధవారం నాటికి అయన సంపద 97.5 బిలియన్ డాలర్లుగా ఉంది. గౌతమ్ అదానీ ప్రస్తుతం ప్రపంచ సంపన్నుల జాబితాలో 15వ స్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ తర్వాత భారత్‌లో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. -
మరో బిజినెస్‌లోకి అదానీ గ్రూప్.. గూగుల్, అంబానీకి చెక్ పెట్టేనా?
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఊహించని విధంగా వృద్ది సాధిస్తోన్న ఈ-కామర్స్,పేమెంట్స్ విభాగంలో అడుగుపెట్టనుంది. దీంతో అదే రంగంలో మార్కెట్‌ను శాసిస్తున్న టెక్ దిగ్గజం గూగుల్, మరో దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి గట్టి పోటీ ఇవ్వనుందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.ఇప్పటికే అందుకు కావాల్సిన లైసెన్స్ కోసం అప్లయి చేసినట్లు సమాచారం. ఆ లైసెన్స్ యూపీఐ వంటి చెల్లింపులతో పాటు, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు అదానీ గ్రూప్ ప్రతినిధులు పలు బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ చర్చలు చివరి దశకు వచ్చాయని తెలుస్తోంది.జాతీయ మీడియా కథనాల ప్రకారం..తన సేవలు వినియోగదారులకు మరింత చేరువయ్యేలా అదానీ గ్రూప్ ప్రభుత్వ ఈ-కామర్స్ ఫ్లాట్ ఫాం ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) చర్చలు జరుపుతోంది.చర్చలు సఫలమైందే అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ వన్ యాప్‌లో ఓఎన్డీసీ వినియోగదారులకు సేవలు అందుతాయి. ఓఎన్డీసీలో ఏదైనా కొనుగోలు చేసిన యూజర్లు అదానీ వన్ ద్వారా పలు ఆఫర్లు పొందవచ్చు. ఇప్పటికే ఈ యాప్ యూజర్లకు హోటల్, ఫ్లైట్ రిజర్వేషన్‌తో సహా ఇతర ట్రావెల్ సంబంధిత సేవల్ని వినియోగించడం ద్వారా ప్రత్యేక డిస్కౌంట్లు పొందవచ్చు -
హిండెన్‌బర్గ్‌ను ఎదురొడ్డి.. నష్టాల నుంచి బయటపడ్డ అదానీ
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ ప్రైజెస్ అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు గతేడాది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీ మార్కెట్ విలువ రూ.లక్షల కోట్ల మేరకు ఆవిరైపోయింది.ఇప్పుడు అదానీ సంస్థ ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడింది. అప్పులు తగ్గించడం, కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టడంతో ఇది సాధ్యమైందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.హిండెన్‌బర్గ్ సృష్టించిన పెనుతుపానుకు ఎదురొడ్డి నిలిచిన అదానీ ఎంటర్ ప్రైజెస్ విభిన్నమైన వ్యూహాన్ని ఎన్నుకొంది. దానిని పక్కాగా అమలు చేసి సఫలమైంది. అదానీ స్టాక్స్ వ్యాల్యూ పెరిగింది.అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఈ రోజు (మే 24) 1.7% పెరిగి 3,445.05కి చేరుకుంది. ఫిబ్రవరి 2023లో పడిపోయినప్పటి నుండి దాదాపు మూడు రెట్లు పెరిగింది.ఈ తాజా పరిణామాలతో అదానీ గ్రూప్ తన సిమెంట్, కాపర్ వ్యాపారాలను మరింత విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం అదానీ రుణాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారని, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
బ్లూం బెర్గ్ గ్లోబల్ సూపర్ రిచ్ క్లబ్లో భారతీయ కుబేరులు
ప్రపంచ దేశాల్లోని ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా 15 మంది కుభేరులు 100 బిలియన్ డాలర్ల సందపతో వరల్డ్ సూపర్ రిచ్ క్లబ్లో చేరినట్లు తెలుస్తోంది. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం..ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితిని అధిగమించి ఈ ఏడాది 15 మంది ఉన్న నికర విలువ 13 శాతం పెరిగి 2.2 ట్రిలియన్ డాలర్లకు చేరింది. వెరసి ప్రపంచంలోనే 500 మంది వద్ద ఉన్న సంపదలో దాదాపు నాలుగింట ఒకవంతు వీరివద్దే ఉంది. 15 మంది ఇంతకు ముందు 100 బిలియన్ డాలర్లు దాటినప్పటికీ, వారందరూ ఒకే సమయంలో ఆమొత్తానికి చేరుకోవడం ఇదే మొదటి సారి. ఇక వారిలో కాస్మోటిక్స్ దిగ్గజం ‘లో రియాల్’ సామ్రాజ్య వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్, డెల్ టెక్నాలజీస్ ఫౌండర్ మైఖేల్ డెల్, మెక్సికన్ బిలియనీర్ కార్లోస్ స్లిమ్లు మొదటి ఐదునెలల్లో ఈ అరుదైన ఘనతను సాధించారు. 1998 నుంచి తమ కంపెనీ గత ఏడాది డిసెంబర్లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిందంటూ బెటెన్‌కోర్ట్ మేయర్స్ తెలిపింది. ఆ తర్వాతే 100 బిలియన్ల సంపదను దాటారు. దీంతో బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జాబితాలో 100 బిలియన్ల నికర సంపదను దాటిన 15 మందిలో ఒకరుగా నిలిచారు. 14 స్థానంలో కొనసాగుతున్నారు.ఆ తర్వాత టెక్నాలజీ,ఏఐ విభాగాల్లో అనూహ్యమైన డిమాండ్ కారణంగా డెట్ టెక్నాలజీస్ షేర్లు లాభాలతో పరుగులు తీశాయి. ఫలితంగా డెల్ సంపద 100 బిలియన్ల మార్కును ఇటీవలే దాటింది. ఇప్పుడు 113 బిలియన్ల సంపదతో బ్లూమ్‌బెర్గ్ సంపద సూచికలో 11వ స్థానంలో ఉన్నారు.లాటిన్ అమెరికాలో అత్యంత ధనవంతుడు కార్లోస్ స్లిమ్ 13వ స్థానం, ఎల్వీఎంహెచ్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌కు తొలి స్థానం, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ రెండవ స్థానం, ఎలాన్ మస్క్ 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఎలైట్ గ్రూప్‌లోకి భారత్ నుంచి ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీ సైతం చోటు దక్కించుకోవడం గమనార్హం. -
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
సాక్షి, వేములవాడ : కాంగ్రెస్ యువరాజు రాఫెల్ కుంభకోణం బయటపడిన నాటి నుంచి ఐదేండ్లుగా ఒక్కటే జపం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటన తర్వాత ఆయన నోరు మెదపరేం అంటూ ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు సంధించారు. లోక్‌సభ ఎన్నికల తరుణంలో వేములవాడలో బీజేపీ శ్రేణులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో పాల్గొన్న మోదీ.. రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు.ఎందుకు సైలెంట్ అయ్యారు ఐదేళ్లుగా ఫైవ్ ఇండస్ట్రీలిస్ట్.. ఫైవ్ ఇండస్ట్రీలిస్ట్..ఆపై అంబానీ-అదానీ అంటూ జపం చేసిన రాహుల్ గాందీ లోక్‌సభ ఎన్నికల ప్రకటనతో ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.తెలంగాణ గడ్డమీద నుంచితెలంగాణ గడ్డమీద నుంచి రాహుల్ గాంధీని ఒకటే అడుగుతున్నా అంబానీ, అదానీల నుంచి ఎంత తీసుకున్నారు? మీ మధ్య ఒప్పందం ఏమైనా జరిగిందా? లేకపోతే ఓవర్ నైట్‌లోనే అంబానీ, అదానీలను విమర్శించడం ఎందుకు మానేశారని ప్రశ్నించారు.పదునైన అస్త్రాలను రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ ప్రముఖ వ్యాపార వేత్తలకు లబ్ధి చేకూరుస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ వచ్చారు. అంతేకాదు బీజేపీ 22 మందిని బిలియనీర్లుగా మార్చిందని వ్యాఖ్యానించారు. అదే కాంగ్రెస్ ఈ సారి అధికారంలోకి వస్తే కోట్లాది మంది ప్రజల్ని లక్షాదికారుల్ని చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. అయితే తాజాగా, వేములవాడ సభలో పదే పదే రాహుల్ గాంధీ ఆరోపణలపై ప్రధాని మోదీ పదునైన అస్త్రాలను ఎక్కుపెట్టారు -
‘రాజకీయంగా దాడి చేశారు.. వారు దెబ్బతినడం బాధించింది’
అదానీ గ్రూప్ స్టాక్స్‌పై షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికతో గతేడాది ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. దాంతో పెద్దమొత్తంలో స్టాక్ ధరలు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. ఆ నివేదిక వెలువడినప్పటి నుంచి ఇన్వెస్టర్ల సంపద భారీగా పతనమైంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అదానీ గ్రూప్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని అదానీ ఇటీవల తెలిపారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో అదానీ మాట్లాడుతూ హిండెన్‌బర్గ్ వ్యవహారాన్ని ఎలా కట్టడిచేశామో తెలిపారు. ‘హిండెన్‌బర్గ్ ఆరోపణలను వచ్చాక తొలుత వాటికి ప్రాధాన్యం ఇవ్వలేదు. పూర్తిగా పాత సమాచారాన్నే ఆ సంస్థ కొత్త రూపంలో పేర్కొంది. ఆ వివాదం వెంటనే తొలగిపోతుందనుకున్నాను. ప్రపంచంలో ఓ కార్పొరేట్ కంపెనీపై జరిగిన అతిపెద్ద దాడి అది. సాధారణంగా షార్ట్‌సెల్లర్లు చేసే దాడులకు వ్యాపార కోణమే ఉంటుంది. కానీ, మాపై జరిగినది కేవలం ఫైనాన్షియల్ మార్కెట్లకే పరిమితం కాలేదు.. రాజకీయ కోణం కూడా సంతరించుకుంది. చాలా సమన్వయంతో మమ్మల్ని దెబ్బకొట్టాలనుకున్నారు. చాలా తొందరగానే హిండెన్‌బర్గ్ కుట్రను అర్థం చేసుకున్నాను. గతంలో ఈ స్థాయి సంక్షోభాన్ని ఎదుర్కొన్న అనుభవం లేదు. దాంతో మా సొంత ప్లాన్ సిద్ధం చేసుకున్నాం. ఇందులో భాగంగా రూ.20 వేల కోట్లు విలువైన ఎఫ్‌పీవోను వెనక్కి తీసుకొన్నాం. రూ.75,000 కోట్ల నగదు, రూ.17,500 కోట్ల ప్రీపెయిడ్ మార్జిన్ లింక్డ్ ఫైనాన్సింగ్‌తో నిధి ఏర్పాటు చేశాం. సీఈవోలు, ఎగ్జిక్యూటివ్‌లను వ్యాపారంపై శ్రద్ధ పెట్టాలని సూచించాం. ఖావ్డ, ధారావి వంటి కొత్త ప్రాజెక్టుల రూపంలో వ్యాపార విస్తరణను కొనసాగించాం. వార్‌రూమ్ ఏర్పాటు చేశాం. దాంతో ఇన్వెస్టర్లకు ఎదురైన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాం. ఇదీ చదవండి: మానవ మెదడుతో ఏదీ సరితూగదు.. ఏఐని తలదన్నే ఉద్యోగాలివే.. ఈ వ్యవహారం నుంచి ఓ విషయం నేర్చుకొన్నాం. మంచి పనిచేయడమే కాదు.. మన గురించి అందరికీ తెలియాలి. కమ్యూనికేషన్ మరింత పెంచుకోవాలి. హిండెన్‌బర్గ్ వ్యవహారం మొత్తంలో చిన్న వాటాదారులు దెబ్బతినడమే నన్ను బాధించింది. మా కంపెనీలు తిరిగి పుంజుకొన్నాక హిండెన్‌బర్గ్ నివేదికలో నిజం లేదని తేలింది’ అని గౌతమ్ అదానీ వివరించారు. -
అక్కడ ఉచిత ఇళ్లు దక్కేదెవరికి? కీలక సర్వే చేపట్టనున్న అదానీ..
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలలో ఒకటైన ముంబై ధారావి గురించి చాలా మంది వినే ఉంటారు. 640 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ధారవి మురికివాడ పునరాభివృద్ధి ప్రాజెక్టును మహారాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అదానీ గ్రూప్ దక్కించుకుంది. గౌతమ్ అదానీ ద్వారా నియమించిన ఒక కంపెనీ రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఫిబ్రవరి నుంచి ముంబైలోని ధారవి స్లమ్‌లోని 10 లక్షల మంది నివాసితుల డేటా, బయోమెట్రిక్‌లను సేకరించడం ప్రారంభిస్తుంది. పునరాభివృద్ధి చేసిన ప్రాంతంలో ఉచిత గృహాలను పొందేందుకు ధారావి నివాసితుల అర్హతను నిర్ణయించడంలో ఈ సర్వే కీలకం. వీరే అర్హులు ధారావిలో చివరి సారిగా 15 సంవత్సరాల క్రితం ఓ సర్వే నిర్వహించారు. ధారావిలో 2000 సంవత్సరానికి ముందు నుంచి నివసిస్తున్నవారు మాత్రమే ఉచిత గృహానికి అర్హులు. ఈ సర్వే ఆధారంగా దాదాపు 7 లక్షల మంది పునరాస ప్రయోజనానికి అర్హత కోల్పోయి రోడ్డున పడతారని ఇక్కడి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అదానీ నేతృత్వంలోని సంస్థ ధారవి నివాసితులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఇంటింటికీ వెళ్లి పక్కాగా సర్వేను నిర్వహించనుంది. సర్వే బృందాలు ప్రతి ఇంటికి వెళ్లి బయోమెట్రిక్ డేటా సేకరిస్తాయని ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తున్న ధారావి రీడెవలప్మెంట్ అథారిటీ అధిపతి ఎస్వీఆర్ శ్రీనివాస్ తెలిపారు. అర్హత ఉన్న వారందరికీ ఇళ్లు రావాలని, అదే సమయంలో అనర్హులు ఎవరూ ప్రయోజనం పొందకూడదని ఆయన పేర్కొన్నారు. 9 నెలల్లో సర్వే పూర్తి ధారావిలో నివాసితుల సర్వే రెండు దశల్లో జరగనుంది. మొదటగా మూడు నుంచి నాలుగు వారాల్లో కొన్ని వందల మంది నివాసితులతో సర్వే పైలట్ దశ ప్రారంభం కానుంది. ఆ తర్వాత పూర్తి సర్వే తొమ్మిది నెలల వ్యవధిలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఉచిత గృహాలు లేదా పునరావాసం కోసం నివాసితుల తుది అర్హతను ధారావి రీడెవలప్మెంట్ అథారిటీ నిర్ణయిస్తుంది. సర్వేతోపాటు మొత్తం ప్రాజెక్ట్ నిర్వహణకు త్వరలో అదనపు సిబ్బందిని నియమిస్తామని శ్రీనివాస్ తెలిపారు. -
హిండెన్ బర్గ్ వివాదం నుంచి తేరుకుని.. అదానీ మరో కీలక నిర్ణయం!
హిండెన్ బర్గ్ వివాదం నుంచి కోలుకున్న ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ప్రస్తుతం తన టాప్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం తన బిజినెస్ జెట్ ఫ్లైట్లను రెట్టింపు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి రవాణా సౌకర్యం కోసం ఆరు పిలాటస్ పీసీ-24 విమానాలకు ఆర్డర్ ఇచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 12కి చేరిన బిజినెస్ జెట్లు ఈ ఆరు పిలాటస్ పీసీ-24 జెట్లను కొనుగోలు చేసిన తర్వాత అదానీ గ్రూప్ మొత్తం బిజినెస్ జెట్ల సంఖ్య 12 అవుతుంది. అదానీతో పాటు కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు వ్యాపార కార్యకలాపాల కోసం చేసే జర్నీ సజావుగా, సమర్థంగా జరిగేలా చూడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రీసేల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసినందున మొత్తం ఆరు విమానాలకు రూ.300 కోట్లకు పైగా ఖర్చవుతుందని సమాచారం. సుప్రీం తీర్పుతో కోలుకున్న అదానీ 2023లో జరిగిన నష్టాల నుంచి కోలుకున్న అదానీ గ్రూప్ ప్రస్తుతం తన వ్యాపారాన్ని విస్తరిస్తూ కార్యకలాపాలను పునరుద్ధరిస్తోంది. ఈ నెల ప్రారంభంలో సుప్రీం కోర్టు తన కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. 80 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి 2023 జనవరిలో అమెరికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ గౌతమ్ అదానీ, అతని సంస్థ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసానికి పాల్పడినట్లు ఆరోపించింది. ఈ ఆరోపణల కారణంగా అదానీ తన గ్రూప్ కంపెనీల షేర్లు పడిపోవడంతో సుమారు 80 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. అత్యంత ధనవంతుడిగా అయితే, ఏడాది తర్వాత సుప్రీంకోర్టు హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలపై అదనపు దర్యాప్తు అవసరం లేదని, వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది.దీంతో అదానీ కంపెనీ నష్టాల నుంచి త్వరగా కోలుకొని, తన సంపదను తిరిగి పొంది ముకేశ్ అంబానీని అధిగమించి స్వల్పకాలం పాటు భారతదేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. -
గౌతమ్ అదానీకి షాక్.. అంతకంతకూ పెరుగుతున్న ముఖేష్ అంబానీ సంపద!
2023 వ్యాపార వేత్తలకు కలిసి వచ్చిందా? లేదంటే నష్టాల్ని మూటగట్టుకున్నారా? హిండెన్ బర్గ్ రిపోర్ట్‌తో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఎంత సంపదను కోల్పోయారు?ఆర్ఐఎల్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీస్ డీమెర్జర్ కావడం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి ఎంతమేరకు కలిసి వచ్చింది. వీళ్లిద్దరితో పాటు మిగిలిన వ్యాపార వేత్తలకు ఈ ఏడాది ఎలాంటి ఫలితాల్ని ఇచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన సంపదను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు.బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం.. ముఖేష్ అంబానీ ఈ ఏడాది అత్యధికంగా 9.98 బిలియన్ డాలర్ల సంపదను సమకూర్చుకున్నారు. దీంతో ఆయన మొత్తం ఆస్తి విలువ 97.1 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక ప్రపచం వ్యాప్తంగా సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ 13వ స్థానంలో కొనసాగుతున్నారు. అంబానీ సంపాదన పెరిగేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ఫైనాన్షియల్ సర్వీస్ షేర్లు రాణించడమే ఇందుకు కారణమని బ్లూంబర్గ్ పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఓ భాగం. అయితే జులై 20, 2023న ఆర్ఐఎల్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీస్ డీమెర్జర్ అయ్యింది. అనంతరం స్టాక్ మార్కెట్లోకి అడుగు పెట్టింది. స్టాక్ మార్కెట్లోని లిస్టింగ్‌కు ఊహించని స్పందన రావడంతో పాటు రిలయన్స్ షేర్లు సైతం 9 శాతం వృద్దిని నమోదు చేశాయి. ఫలితంగా ముఖేష్ అంబానీ ఈ అరుదైన ఘనతను సాధించారు. అదానీకి అంతగా కలిసిరాలేదు మరో అపరకుబేరుడు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి ఈ ఏడాది అంతగా కలిసి రాలేదంటూ వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా హిండెన్‌బర్గ్ వంటి నిరాధారమైన నివేదికలతో అదానీ షేర్లు కుప్పకూలాయి. దీంతో 2023లో ఆయన 37.3 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ 83.2 బిలియన్ డాలర్లతో దేశీయ రెండో సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో అత్యధికంగా 21 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. సంక్షోభంలోనూ అవకాశాల్ని వెతుకున్న హెచ్‌సీఎల్ 2023లో ఐటీ కంపెనీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. అయినప్పటికీ హెచ్‌సీఎల్ టెక్నాలజీ ఫౌండర్ శివ్ నాడార్ సంపద 9.47 బిలియన్ డాలర్లు పెరిగింది. ఆయన మొత్తం సంపద 34 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. హెచ్‌సీఎల్ షేరు ధర 41 శాతం పెరిగింది. సాహో సావిత్రి జిందాల్ జిందాల్ గ్రూపు చైర్పర్సన్ సావిత్రి జిందాల్ సంపద కూడా 8.93 బిలియన్ డాలర్లు అందుకొని 24.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంతేకాదు జిందాల్ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, జిందాల్ ఎనర్జీ షేర్లు రాణించడంతో మహిళా సంపన్నుల జాబితాలో సావిత్రి జిందాల్ 24.7 బిలియన్ డాలర్లతో కొనసాగుతున్నారు. పరుగులు తీసిన డీఎల్ఎఫ్ షేర్లు రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ షేర్లు స్టాక్ మార్కెట్లో పరుగులు తీశాయి. ప్రీసేల్స్‌తో పాటు కొత్త కొత్త ప్రాజెక్ట్‌లు లాంచ్ చేయడం డీఎల్ఎఫ్కు కలిసొచ్చింది. ఆ సంస్థ షేర్లు 91 శాతం వృద్దిని నమోదు చేశాయి. దీంతో ఆ కంపెనీ అధినేత కుషాల్ పాల్ సింగ్ సంపద 7.83 బిలియన్ డాలర్లు పెరిగింది. ఆయన మొత్తం సంపద విలువ 16.1 బిలియన్లకు చేరుకుంది. అదే దారిలో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ సైతం ఇంజినీరింగ్, నిర్మాణ రంగాల్లో 158 ఏళ్లుగా సేవలందిస్తున్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ను నియంత్రిస్తున్న షాపూర్ మిస్త్రీ ఈ ఏడాది తన సంపదకు 7.41 బిలియన్ డాలర్లు జోడించారు. ఆయన నికర విలువ ఇప్పుడు 35.2 బిలియన్ డాలర్లు. కుమార్ మంగళం బిర్లాతో పాటు మరింత మంది 2023లో తమ నికర విలువను బాగా పెంచుకున్న ఇతర బిలియనీర్లలో ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన కుమార్ మంగళం బిర్లా (7.09 బిలియన్ డాలర్లు), రవి జైపురియా (5.91 బిలియన్ డాలర్లు), సన్ ఫార్మా దిలీప్ సంఘ్వి (5.26 బిలియన్ డాలర్లు), లోధా గ్రూప్ మంగళ్ ప్రభాత్ లోధా (3.91 బిలియన్ డాలర్లు), ఎయిర్టెల్ నుంచి సునీల్ మిట్టల్ (3.62 బిలియన్) ఉన్నారు. మరోవైపు ఆదిత్యా బిర్లా గ్రూపు చైర్మన్ కుమార మంగళం బిర్లా సంపద 7.09 బిలియన్ డాలర్లు అధికం కాగా, సన్‌ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ 5.26 బిలియన్ డాలర్లు, ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ 3.62 బిలియన్ డాలర్లు పెరిగింది. -
డిజిటల్ ఎకానమీపై అదానీ గ్రూప్ దృష్టి
న్యూఢిల్లీ: దాదాపు 175 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న దేశీ డిజిటల్ ఎకానమీలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై అదానీ గ్రూప్ దృష్టి పెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్‌చెయిన్ తదితర ఉత్పత్తులు, సేవలను మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా అబుధాబీకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సీ) అనుబంధ సంస్థ సిరియస్ ఇంటర్నేషనల్ హోల్డింగ్‌తో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో (ఏఈఎల్) భాగమైన అదానీ గ్లోబల్ జట్టు కట్టింది. సిరియస్ డిజిటెక్ ఇంటర్నేషనల్ పేరుతో జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేసింది. ఇది అబుధాబీ కేంద్రంగా పని చేస్తుంది. సిరియస్ జేవీలో సిరియస్‌కు 51%, అదానీ గ్రూప్‌నకు 49% వాటాలు ఉంటాయి. అంతర్జాతీయంగా డిజిటల్ పరివర్తన విభాగంలో సిరియస్ అనుభవం, దేశీ మార్కెట్‌పై అదానీ గ్రూప్ పరిజ్ఞానంతో భారత డిజిటల్ ఎకానమీలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై సిరియస్ జేవీ దృష్టి పెట్టనుందని ఏఈఎల్ తెలిపింది. ప్రస్తుతం 175 బిలియన్ డాలర్లుగా ఉన్న డిజిటల్ ఎకానమీ 2030 నాటికి ట్రిలియన్ (లక్ష కోట్ల) డాలర్లుగా ఎదగనుందని అంచనాలు ఉన్నట్లు పేర్కొంది. ఇన్ఫ్రాతో పాటు ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, గ్రీన్‌టెక్ తదితర రంగాల్లోనూ అధునాతన కృత్రిమ మేథ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), బ్లాక్‌చెయిన్ మొదలైన వాటిని మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు సిరియస్ జేవీ కృషి చేస్తుందని తెలిపింది. -
మరో మీడియా సంస్థను కొనుగోలు చేసిన గౌతమ్ అదానీ
ప్రముఖ వ్యాపార వేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మరో మీడియా సంస్థను కొనుగోలు చేశారు. ఇప్పటికే పలు మీడియా సంస్థల కొనుగోళ్లు,పెట్టుబడులు పెట్టిన ఆయన తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్లో మెజారిటీ వాటాని చేజిక్కించుకున్నారు. ఐఏఎన్ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 50.50 శాతం మెజారిటీ వాటాను తమ సబ్సిడరీ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ (ఏఎంఎన్ఎల్) కొనుగోలు చేసినట్టు అదానీ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. గత ఏడాది మార్చిలో ఫైనాన్షియల్ న్యూస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ బీక్యూ ప్రైమ్‌ను నిర్వహించే క్వింటిల్లియన్ బిజినెస్ మీడియాను టేకోవర్ చేయడం ద్వారా మీడియా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అదే ఏడాది డిసెంబర్లో న్యూస్ టెలివిజన్ చానల్ ఎన్డీటీవీలో 65 శాతం వాటాను కొన్నది. ఇప్పుడు ఐఏఎన్ఎస్లో వాటా కొనుగోలు చేసి మీడియా రంగంలో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. -
జెట్ స్పీడ్‌తో తన సంపదను పెంచుకుంటూ పోతున్న గౌతమ్ అదానీ!
భారత బిలియనీర్ గౌతమ్ అదానీ జెట్ స్పీడ్‌తో తన సంపదను పెంచుకుంటూ పోతున్నారు. ఫలితంగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జాబితాలో ప్రపంచంలో తొలి 20 ధనవంతుల జాబితాలో 19వ స్థానాన్ని దక్కించుకున్నారు. మంగళవారం అదానీ గ్రూప్‌లోని 10 నమోదిత కంపెనీల షేర్లు భారీగా ర్యాలీ అయ్యాయి. దీంతో ఆ ఒక్కరోజే అదానీ గ్రూప్ మొత్తం కంపెనీల మార్కెట్ కేపిటల్ వ్యాల్యూ లక్ష కోట్లకు చేరింది. అదే రోజు అదానీ వ్యక్తిగత సంపద సైతం 6.5 బిలియన్ డాలర్లు పెరిగింది. ప్రపంచంలోని ఇతర బిలియనీర్లు జూలియా ఫ్లెషర్ కోచ్ అండ్ ఫ్యామిలీ (64.7 బిలియన్ డాలర్లు), చైనాకు చెందిన జాంగ్ షన్షాన్ (64.10 బిలియన్ డాలర్లు), అమెరికాకు చెందిన చార్లెస్ కోచ్ (60.70 బిలియన్ డాలర్లు)లను వెనక్కి నెట్టారు. ఒక్క రోజులో లక్ష కోట్లు నవంబర్ 28,2023 నాటికి అదానీ గ్రూప్‌లోని 10 కంపెనీల మొత్తం విలువ రూ.11,31,096కి చేరింది. గత శుక్రవారంతో పోలిస్తే ఈ మంగళవారం ఒక్కరోజే మార్కెట్ విలువ రూ.1.04లక్షల కోట్లకు పెరిగింది. అయితే, గ్రూప్ మార్కెట్ క్యాప్ జనవరి 24న గరిష్ట స్థాయి రూ.19.19 లక్షల కోట్ల నుంచి 41 శాతం తగ్గింది.ఇక స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్‌కు చెందిన కంపెనీలు భారీ ర్యాలీ చేయడానికి కారణం సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలే కారణమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. సెబీని అనుమానించలేం హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూపు పై వచ్చిన ఆరోపణలపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ దర్యాప్తును కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ‘సెబీని అనుమానించడానికి మా ముందు ఎటువంటి ఆధారాలూ లేవు. అలాగే హిండెన్‌బర్గ్ నివేదికలోని అంశాలన్నిటినీ వాస్తవాలుగా కోర్టు పరిగణించాల్సిన అవసరమూ లేదని పేర్కొంది. అదానీ-హిండెన్‌బర్గ్ అంశంలో దాఖలైన పలు కేసులపై వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అదానీ గ్రూప్ షేర్లు భారీగా ర్యాలీ అయ్యాయి. -
విల్మర్ కంపెనీ వాటా మొత్తం విక్రయించడానికి సిద్దమైన అదానీ
ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం పొందిన ప్రముఖ దిగ్గజ వ్యాపార వేత్త 'గౌతమ్ అదానీ' (Gautam Adani) విల్మర్ లిమిటెడ్‌లోని తన మొత్తం వాటాను విక్రయించాలని చూస్తున్నట్లు ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఇందులో నిజమెంత? విక్రయిచాలనుకుంటే దానికిగల కారణం ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వంట నూనెలు సహా ఇతర ఆహార, పానీయ ఉత్పత్తుల్ని విక్రయించే అదానీ విల్మర్‌లో గౌతమ్ ఆదానీ వాటా 43.97 శాతం ఉంది. ఈ వాటాలను మొత్తం విక్రయించడానికి మల్టీనేషనల్ కన్జూమర్ గూడ్స్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు ఇవన్నీ ఒక నెలలోనే పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. భారీ నష్టాలు అదానీ విల్మర్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వెల్లడించిన ఫలితాల ప్రకారం ఏకంగా రూ. 130.73 కోట్ల నష్టాన్ని చవి చూసినట్లు తెలిసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 48.76 కోట్ల లాభాలను ఆర్జించిన కంపెనీ ఈ ఏడాది ఊహకందని నష్టాలను పొందాల్సి వచ్చింది. ముఖ్యంగా కుకింగ్ ఆయిల్ బిజినెస్‌లో నష్టాలు వచ్చినట్లు సమాచారం. అదానీ విల్మర్ మొత్తం వ్యయం రూ. 12,439.45 కోట్లుగా ఉంది. ఇదీ చదవండి: ఒక్క గ్యాడ్జెట్.. కారు మరింత సేఫ్ - ధర కూడా తక్కువే! అదానీ గ్రూప్ చైర్మన్ 'గౌతమ్ అదానీ' ఇప్పటికీ కొన్ని ఆర్థిక పరమైన చిక్కులో ఉన్నట్లు.. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత ఇంకా కోలుకోలేకపోయినట్లు సమాచారం. ఈ కారణంగానే ప్రస్తుతం తన గ్రూప్‌కు చెందిన కంపెనీ వాటాల్ని మొత్తం విక్రయించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. -
విమానాల లీజింగ్ వ్యాపారంలోకి అదానీ పోర్ట్స్
ముంబై: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీ సెజ్) తాజాగా విమానాల లీజింగ్ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇందుకోసం సొంతంగా ఉడాన్‌వత్ లీజింగ్ ఐఎఫ్ఎస్సీ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసింది. రూ. 2.5 కోట్లు అదీకృత మూలధనంతో దీన్ని ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిరిండియా కూడా ఇటీవలే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ) గిఫ్ట్ సిటీలో సొంత ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. మరో విమానయాన సంస్థ ఇండిగో కూడా అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నట్లు సమాచారం. -
భారత్ కుబేరుల్లో అంబానీ టాప్
ముంబై: పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా 360 వన్ వెల్త్ హురున్ ఇండియా సంపన్నుల జాబితా 2023లో అగ్రస్థానంలో నిల్చారు. రూ. 8.08 లక్షల కోట్ల సంపదతో ఆయన టాప్ ర్యాంకు దక్కించుకున్నారు. గత ఏడాది వ్యవధిలో అంబానీ సంపద స్వల్పంగా రెండు శాతం పెరిగింది. అటు మరో దిగ్గజం గౌతమ్ అదానీ రూ. 4.74 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానం దక్కించుకున్నారు. ఆయన సంపద 57 శాతం కరిగిపోయింది. అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాలు, షేర్లలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల దెబ్బతో అదానీ సంస్థల షేర్లు కుదేలవడం ఇందుకు కారణమని హురున్ ఎండీ, చీఫ్ రీసెర్చర్ అనాస్ రెహా్మన్ జునైద్ తెలిపారు. ఆగస్టు 30 తేదీ ప్రాతిపదికగా హురున్ ఈ జాబితాను రూపొందించింది. ఈసారి లిస్టులో 138 నగరాలకు చెందిన 1,319 మంది కుబేరులకు చోటు దక్కింది. రూ. 2.78 లక్షల కోట్ల సంపదతో (36 శాతం వృద్ధి) సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ పూనావాలా మూడో స్థానంలో, రూ. 2.28 లక్షల కోట్లతో (23 శాతం వృద్ధి) హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివ్ నాడార్ ఆ తర్వాత ర్యాంకులో ఉన్నారు. గత ఏడాది వ్యవధిలో భారత్‌లో ప్రతి మూడు వారాలకు కొత్తగా ఇద్దరు బిలియనీర్లుగా ఎదిగారు. ప్రస్తుతం 259 మంది బిలియనీర్లు ఉన్నారు. గత 12 ఏళ్లలో వారి సంఖ్య 4.4 రెట్లు పెరిగింది. మరిన్ని విశేషాలు.. ►గోపిచంద్ హిందుజా (5), దిలీప్ సంఘ్వి (6), ఎల్ఎన్ మిట్టల్ (7), కుమార మంగళం బిర్లా (9), నీరజ్ బజాజ్ (10) టాప్ టెన్‌లో ఉన్నారు. ►డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ సంపద 18 శాతం క్షీణించి రూ. 1.43 లక్షల కోట్లకు పడిపోవడంతో ఆయన 8వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ►అసమానతలు పెరిగిపోతుండటంపై ఆందోళన నేపథ్యంలో ఏడాది వ్యవధిలో 51 మంది కుబేరుల సంపద రెట్టింపయ్యింది. అంతక్రితం ఏడాది వ్యవధిలో ఈ సంఖ్య 24గా నమోదైంది. ►నగరాలవారీగా చూస్తే 328 బిలియనీర్లతో ముంబై అగ్రస్థానంలో ఉంది. న్యూఢిల్లీ (199), బెంగళూరు (100), హైదరాబాద్ (87) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తొలిసారిగా టాప్ 20 నగరాల్లో తిరుప్పూర్ చోటు దక్కించుకుంది. ►ప్రైవేట్ ఈక్విటీ రంగం నుంచి తొలిసారిగా కేదార క్యాపిటల్‌కు చెందిన మనీష్ కేజ్రివాల్ చోటు దక్కించుకున్నారు. ఆయన సంపద రూ. 3,000 కోట్లు. ► ప్రెసిషన్ వైర్స్కు చెందిన మహేంద్ర రాఠిలాల్ మెహతా 94 ఏళ్ల వయస్సులో లిస్టులో నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలా... టాప్ 100లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రూ. 55,700 కోట్ల సంపదతో దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి దివి 23వ ర్యాంకులో నిల్చారు. 196% సంపద వృద్ధితో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాకు చెందిన పీవీ పిచ్చిరెడ్డి (రూ. 37,300 కోట్లు), పీవీ కృష్ణారెడ్డి (రూ. 35,800 కోట్లు) వరుసగా 37, 41వ ర్యాంకుల్లో ఉన్నారు. హెటిరో గ్రూప్ చైర్మన్ బి. పార్థసారథి రెడ్డి కుటుంబం రూ. 21,900 కోట్ల సంపదతో 93వ స్థానంలో, అరబిందో ఫార్మా నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి రూ. 21,000 కోట్ల సంపదతో 98వ స్థానంలో, అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి కుటుంబం రూ.20,900 కోట్లతో 99వ ర్యాంకులో ఉన్నాయి. -
దెబ్బ మీద దెబ్బ : అమ్మకానికి డిస్నీ.. కొనుగోలు రేసులో ఎవరెవరున్నారంటే?
అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా దిగ్గజం ది వాల్ట్ డిస్నీ కంపెనీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో వాల్ట్ డిస్నీకి సంబంధించిన ఆస్తుల్ని అమ్మేందుకు సిద్ధమైనట్లు పలునివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగా బిలియనీర్ గౌతమ్ అదానీ, మీడియా మొఘల్, సన్ నెట్ గ్రూప్ అధినేత కళా నిధి మారన్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇందులో భాగంగా భారత్‌లో నిర్వహించే కార్యకలాపాలలో కొంత భాగాన్ని విక్రయించడం లేదా, స్పోర్ట్స్ రైట్స్, లోకల్ స్ట్రీమింగ్ సర్వీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో సహా ఇతర ఆస్తుల్ని కలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తేలింది. ముఖేష్ అంబానీతో చర్చలు ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ సైతం ఆస్తుల అమ్మే అంశంపై చర్చలు ఇప్పటికే జరిగాయని బ్లూమ్‌బెర్గ్ గతంలో నివేదించింది. తద్వారా భారత్‌లో డిస్నీ తన వ్యాపారాన్ని అమ్మేడం లేదంటే జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఐపీఎల్ దెబ్బ.. ఆపై హెచ్‌బీఓ కాంట్రాక్ట్ సైతం జూలైలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ స్ట్రీమింగ్ హక్కులను వయాకామ్ 18 మీడియా దక్కించుకున్న తరువాత ఆస్తుల అమ్మకం తెరపైకి వచ్చింది. దీనికితోడు వార్నర్ బ్రదర్స్‌కు చెందిన హెచ్‌బీఓ కాంట్రాక్టును సైతం రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 దక్కించుకోవడం కూడా ప్రభావం చూపింది. అప్పటి నుంచి డిస్నీ హాట్‌స్టార్‌కు సబ్స్క్రైబర్లు తగ్గుతున్నారు. దీంతో ఆస్తుల్ని అమ్మేందుకు మొగ్గుచూపింది. అదానీ వర్సెస్ మారన్ ఆస్తులు,స్టాక్స్‌ను కొనుగోలు చేసేందుకు కళానిధి మారన్ సుమఖత వ్యక్తం చేస్తుండగా.. అదానీ సైతం తన మీడియా సంస్థ న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్‌ను (ఎన్డీటీవీ)ని విస్తరించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం, క్రయ,విక్రయ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలుగులోకి రాలేదు. త్వరలో దీనిపై స్పష్టత రానుంది. చదవండి👉 అప్పుడు ‘మెగాస్టారే’, ఇప్పుడు కరువైన పలకరింపులు.. జీవితం భారమై.. -
హిండెన్‌బర్గ్ 2.0: అదానీ గ్రూప్‌పై మరో పిడుగు.. ఓసీసీఆర్పీ సంచలన ఆరోపణలు
అదానీ గ్రూప్ స్టాక్స్‌లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి గతంలోనే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు ఇంకా చల్లారకముందే ఇలాంటి ఆరోపణలు చేస్తూ 'ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్' (OCCRP) రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇందులో అదానీ కుటుంబానికి సన్నిహితులైన కొందరు మారిషస్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. మల్టిపుల్ టాక్స్ హెవెన్ సంస్థలను వాడుకుని ఆదానీ లిస్టెడ్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్‌బర్గ్ గతంలో ఆరోపించింది. కాగా ఇప్పుడు తాజాగా ఓసీసీఆర్పీ కూడా ఇదే ఆరోపించింది. ఈ రిపోర్టులన్నీ నిరాధారమైనవని, పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నట్లు ఆదానీ హిండెన్‌బర్గ్ తర్వాత వెల్లడించాడు. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తరువాత ఆదానీ గ్రూప్ కంపెనీలు తమ మార్కెట్లో విలువలో 150 మిలియన్ డాలర్లను కోల్పోయాయి. కాగా ఇప్పుడు వెలువడిన రిపోర్ట్ కూడా హిండెన్‌బర్గ్ రిపోర్ట్ మాదిరిగానే నిరాధారంగా ఉందని ఆదానీ గ్రూప్ వెల్లడించింది. అదానీ గ్రూప్‌కి సంబంధించిన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు తమ షేర్ హోల్డింగ్‌లకు సంబంధించి కావలసిన చట్టాలకు లోబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. కాగా గతంలో వెలువడిన హిండెన్‌బర్గ్ రిపోర్ట్ మీద ఇప్పటికీ సెబీ దర్యాప్తు చేస్తూనే ఉంది. కాగా తాజా నివేదికలు మరింత కలకలం రేపుతున్నాయి. ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన ఆనంద్ మహీంద్రా! రాఖీ పండుగ వేళ.. ఇదిలా ఉండగా ఈ రోజు స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన కొంత సేపటికే అదానీ గ్రూప్ స్టాక్‌లు రెడ్ జోన్లోకి జారిపోయాయి. అదానీ పవర్ షేర్లు 3 శాతానికి పైగా నస్టపాయాయి. అదానీ ట్రాన్స్మిషన్ షేర్ ధర 3.3 శాతానికి పడిపోయింది. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ ధర 2.50 శాతం మేర నష్టపోగా, అదానీ గ్రీన్ ఎనర్జీ , అదానీ టోటల్ గ్యాస్ 2.25 శాతం మేర నష్టపోయాయి. -
అదానీ గ్రీన్ ఎనర్జీలో క్యూఐఏకి వాటాలు
న్యూఢిల్లీ: అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్)లో ఖతార్‌కు చెందిన సార్వభౌమ నిధి ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (క్యూఐఏ) 2.5 శాతం పైగా వాటాలను కొనుగోలు చేసింది. ఇందుకోసం సుమారు రూ. 3,920 కోట్లు వెచ్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ (ఏఈఎంఎల్)లో 2020లో 25.1 శాతం వాటాలు కొనుగోలు చేసిన క్యూఐఏ మళ్లీ అదానీ గ్రూప్‌లో ఇన్వెస్ట్ చేయడం ఇది రెండోసారి. స్టాక్ ఎక్ఛేంజీల డేటా ప్రకారం ప్రమోటర్ గ్రూపు సంస్థ ఇన్ఫినిట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ .. ఏజీఈఎల్‌లో సుమారు 4.49 కోట్ల షేర్లను (2.8 శాతం వాటా) షేరు ఒక్కింటికి రూ. 920 చొప్పున మొత్తం రూ. 4,131 కోట్లకు విక్రయించింది. క్యూఐఏ అనుబంధ సంస్థ అయిన ఐఎన్‌క్యూ హోల్డింగ్ 4.26 కోట్ల షేర్లను (దాదాపు 2.68 శాతం వాటా) కొనుగోలు చేసింది. సగటున రూ. 920 రేటు చొప్పున ఇందుకోసం మొత్తం రూ. 3,920 కోట్లు వెచ్చించింది.