తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం | Adani Foundation Donates Rs 100 Crore to Telangana Skills University | Sakshi
Sakshi News home page

తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం

Published Fri, Oct 18 2024 7:07 PM | Last Updated on Fri, Oct 18 2024 7:17 PM

Adani Foundation Donates Rs 100 Crore to Telangana Skills University

ప్రపంచ ధనవంతులలో ఒకరు, దిగ్గజ పారిశ్రామికవేత్త 'గౌతమ్ అదానీ' తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం అందించారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రూ.100 కోట్ల చెక్కును అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నైపుణ్యాభివృద్ధి, యువత సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు నిరంతర మా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా అదానీ హామీ ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు 2024 నవంబర్ 4నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందులో లాజిస్టిక్, హెల్త్, ఫార్మా వంటి సుమారు 17 రంగాల్లో యువతకు శిక్షణ అందించనున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రాను నియమించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement