Rs 100 crore
-
తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం
ప్రపంచ ధనవంతులలో ఒకరు, దిగ్గజ పారిశ్రామికవేత్త 'గౌతమ్ అదానీ' తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం అందించారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రూ.100 కోట్ల చెక్కును అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నైపుణ్యాభివృద్ధి, యువత సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు నిరంతర మా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా అదానీ హామీ ఇచ్చారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు 2024 నవంబర్ 4నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందులో లాజిస్టిక్, హెల్త్, ఫార్మా వంటి సుమారు 17 రంగాల్లో యువతకు శిక్షణ అందించనున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రాను నియమించారు.A delegation from Adani Foundation, led by Chairperson of Adani Group, Mr @gautam_adani, met with Hon’ble Chief Minister @revanth_anumula garu to handover a donation cheque of Rs 100 crore towards the establishment of Young India Skills University.Mr Adani also promised… pic.twitter.com/knd4bezz7e— Telangana CMO (@TelanganaCMO) October 18, 2024 -
లోకల్ ఆర్టిస్టులకు గుడ్‌న్యూస్: వింక్ మ్యూజిక్ రూ.100 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సంగీతంలో ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహించేందుకు ఎయిర్‌టెల్‌కు చెందిన వింక్ మ్యూజిక్ రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది. స్వతంత్య్ర కళాకారుల కోసం పంపిణీ విభాగంలోకి ప్రవేశించనున్నట్టు వెల్లడించింది. ‘ఔత్సాహిక సంగీత కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడమేగాక సంపాదించుకోవచ్చు. చదవండి: ఇన్‌స్టాలో కొత్త అవతార్, స్నాప్‌చాట్‌లో స్పెషల్ ఫీచర్లు వింక్ వేదిక ద్వారా ప్రపంచవ్యాప్తంగా 5,000 మంది ఆర్టిస్టులను ఏడాదిలో పరిచయం చేయాలని లక్ష్యంగా చేసుకున్నాం. ప్రస్తుతం 100 మంది ఉన్నారు. భారత్‌లో ప్రజాదరణ పొందిన పాటల్లో 30 శాతం స్వతంత్య్ర కళాకారులవే. పరిశ్రమను భవిష్యత్‌లో నడిపించేది వీరే. భారతీయులు వారంలో సగటున 21 గంటలు సంగీతం వింటున్నారు. ప్రపంచ సగటు 18 గంటలు ఉంది’ అని ఎయిర్టెల్ డిజిటల్ సీఈవో అదర్శ్ నాయర్ తెలిపారు. చదవండి: Maruti Suzuki Swift S-CNG వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే! -
బుగట్టి నుంచి మరో స్పోర్ట్స్ కార్, ధర రూ.100కోట్లు
పారిస్ : ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ కార్ల సంస్థ బుగట్టి తన లేటెస్ట్ కార్ (ల వొఇతురు నిర్)ను మార్కెట్ లో విడుదల చేసింది.రూ.100కోట్ల విలువైన కారును తయారు చేసేందుకు 60వేల గంటల సమయం పట్టిందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫ్రెంచ్ భాషలో ల వొఇతురు నిర్ అని పిలిచే ఈ కారును ఇంగ్లీష్ లో ద బ్లాక్ కార్ అని పిలుస్తారు. ఈ కారు ప్రత్యేకతల్ని ఒక్కసారి గమనిస్తే క్వాడ్ టర్బో ఛార్జింగ్, 1,479 గంటల హార్స్ పవర్, 8 లీటర్ల పెట్రోల్ డబ్ల్యూ-16 పిస్టన్ ఇంజిన్ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. అయితే బెస్పోక్ డిజైన్ మరియు ఎక్స్టెండెడ్ వీల్‌బేస్ దీనికి భిన్నంగా ఉంటాయి. బ్లాక్ కలర్ స్పోర్ట్స్ కారు. కారు నాలుగు చక్రాల వెనుక భాగంలో 6 బ్లేడ్ ఎక్సహౌస్ ను కలిగి ఉంది. ఈ 6బ్లేడ్ ఎక్స హౌస్ లు వేగాన్ని ఆస్వాధించేలా చేస్తోంది. కారు టాప్ కార్బన్ ఫైబర్ బ్లాక్ కలర్ కోటింగ్ ను కలిగి ఉంది. నివేదికల ప్రకారం, లా వోయిచర్ నోయిర్ ప్రతి అల్ట్రా-వైడ్లైట్ స్ట్రిప్స్లో 25 యూనిట్ల అత్యంత శక్తివంతమైన ఎల్ఇడి బల్బులను కలిగి ఉంది. కారు ముందు గ్రిల్లో 3-డి ప్రింటెడ్ సౌకర్యం కలిగి ఉంది. కారు పొడవు 17.7 కాగా, వీల్‌బేస్ 9.8 అంగుళాలు ఇప్పటివరకు కారు క్యాబిన్ ఫోటోలు విడుదల చేయకపోయినా హవానా బ్రౌన్ లెదర్ తో సీట్లను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. -
ఆయన చెప్పిందే వేదం...
రేణిగుంట: మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయభాస్కర్... రేణిగుంట చెక్‌పోస్ట్ మార్గంలో వెళ్లే ప్రతి లారీ డ్రైవర్‌కు ఈ పేరు సుపరిచితమే... చెక్‌పోస్ట్ మీదుగా వెళ్లే ప్రతి వాహనదారుడు ముడుపులు సమర్పించుకోవాల్సిందే... దారి మళ్లించి వెళ్లిన వాహనాలను వెంబడించి మరీ అక్రమ వసూళ్లు చేపట్టే ఘనుడు ఈయన... రేణిగుంట ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లో ఆయన చెప్పిందే వేదం... ఆయన మాటకు ఎదురుచెప్పిన తోటి సిబ్బందినే ఇబ్బందులకు గురిచేసిన నైజం ఆయన సొంతం. గత నాలుగేళ్లుగా ఆయన రేణిగుంట చెక్‌పోస్ట్‌లో చేపట్టిన అక్రమ వసూళ్లు అక్షరాలా రూ.100 కోట్లంటే సగటు ప్రభుత్వ ఉద్యోగి కళ్లు తేలెయ్యాల్సిందే.. అన్నీ రోజులు ఒకలా ఉండవన్న సత్యం ఆయనను పలకరించింది. శనివారం ఏకకాలంలో ఆయన ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు చేపట్టిన తనిఖీల్లో రూ.100కోట్లు ఆస్తులు ఉన్నట్లు వెల్లడైంది. ఫలితంగా ఇక్కడ పనిచేస్తున్న తోటి సిబ్బంది వెన్నులోనూ వణుకు మొదలైంది. రోజుకు అక్రమ వసూళ్లు రూ.3లక్షలు పైమాటే రేణిగుంట ఆర్టీవో చెక్‌పోస్ట్ మీదుగా ప్రతి నిత్యం వేలాది వాహనాలు కడప, చెన్నై, నెల్లూరు,చిత్తూరు మార్గల నుంచి రాకపోకలు సాగిస్తుంటా యి. ప్రధానంగా వివిధ లోడ్లతో వెళ్లే లారీలే ఇక్కడ పనిచేసే వారి అక్రమార్జనకు ప్రధాన వనరు. సీటులో ఏ అధికారి ఉన్నా లారీ డ్రైవర్లు వాహనాలను ఆపి బిల్లుల మాటున ముడుపులు సమర్పించి వెళ్లాల్సిందే. ప్రతి వాహనదారుడు రూ.500 నుంచి రూ.10వేల వరకు సమర్పించి వెళుతుంటారు. ఇక్కడ జరిపే అక్రమ వసూళ్లు రోజుకు రూ.3లక్షలు పైనే ఉంటుందని తెలుస్తోంది. కేవలం 50 నిమిషాల వ్యవధిలోనే రూ.14,950 లెక్కలో లేని నగదును గుర్తించిన ఏసీబీ అధికారులే నోరెళ్లబెట్టారు. రోజువారీ వసూళ్లు కాకుండా గూడూరు నుంచి బెంగుళూరుకు నిత్యం వందలాది లారీలలో వెళ్లే సిలికా ఇసుక వ్యాపారుల నుంచి నెలసరి మామూళ్లు రూ.లక్షల్లో వసూలు చేస్తారు. అలాగే ఈ మార్గం గుండా కబేళాలకు తరలించే మూగజీవాల అక్రమ తరలింపుదారుల నుంచి భారీస్థాయి మామూళ్లు వసూలవుతున్నాయి. ఇదంతా రేణిగుంట చెక్‌పోస్ట్ కేంద్రంగా బహిరంగంగానే ప్రతినిత్యం జరిగే తంతు. అక్రమ వసూళ్ల కోసం ఇక్కడి అధికారులు ప్రైవేటు వ్యక్తులకు కలెక్షన్ ఏజెంట్లుగా పెట్టకుని వారికి రోజుకు రూ.2వేలు ఇస్తుండటం బహిరంగ రహస్యమే. ఆయనంటే హడల్ ఎంవీఐ విజయభాస్కర్ అంటే వాహనదా రులే కాదు... తోటి సిబ్బందే హడలిపోవాల్సిందే. ఆయన గతంలో కడపలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన ఆయన 2014 జూన్‌లో ఎంవీఐగా ఉద్యోగోన్నతిపై రేణిగుంట చెక్‌పోస్ట్‌కు వచ్చారు. ఆర్టీఏ ఉన్నతాధికారులతో ఉన్న పరిచయాలకు తోడు రాజకీ య అండదండలు ఆయనకు బలంగా ఉన్నట్లు తోటి సిబ్బంది వద్ద తొలినాళ్లలో హంగామా సృష్టించి తన మాటే చెల్లుబాటు అయ్యేలా చేసుకోవడంలో సఫలీకృతులయ్యారు. అప్పటి నుంచి ఆయనకు ఎవరు అడ్డు చెప్పినా ఉన్నతాధికారుల కు ఫిర్యాదులు చేసి ఇబ్బందులకు గురిచేస్తాడు. కార్యాలయ సీనియర్ ఎంవీఐ మరొకరు ఉన్నా తా నే ఇన్చార్జి అని చెప్పుకుంటూ అన్ని వసూళ్లు ఆ యన కన్నుసన్నల్లోనే జరిగేలా చూసుకున్నాడు. వ్యవహార శైలి, అక్రమార్జనపై గతంలో అనేకమా ర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. గతంలోనూ అనేకమార్లు ఏసీబీ దాడులు రేణిగుంట చెక్‌పోస్ట్‌పై గతంలోనూ అనేకమార్లు ఏసీబీ దాడులు జరిగాయి. గతంలో ఓసారి ఏసీబీ దాడులు చేసి అతనిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నా గుండెపోటు సాకు చూపి తప్పించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఫలితంగా అప్పట్లో ఓ కిందిస్థాయి ఉద్యోగి బలైనట్లు సమాచారం. ఇక్కడ దాడులు చేసిన ప్రతిసారి పెద్దమొత్తంలో నగదును స్వాదీనం చేసుకున్నారు. ఎన్నిసార్లు దాడులు చేసినా అక్రమ వసూళ్ల పరంపర మాత్రం కొనసాగుతూనే వచ్చింది. ఈ నేపథ్యం లో ఆయన లెక్కకు మించి అక్రమాస్తులను కలిగి ఉన్నట్లు స్పష్టం చేసుకున్న ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆయనకు చెందిన ఇళ్లలో సోదాలు నిర్వహించి అక్రమాస్తుల చిట్టాను బహిర్గతం చేశారు. దీంతో ఇక్కడ పనిచేస్తున్న తోటి సిబ్బందిలోనూ భయాందోళనలు మొదలయ్యాయి. -
25 రోజుల్లో రూ.100 కోట్లు!
-
మాల్యాకు రూ.100కోట్ల షాక్
న్యూఢిల్లీ: వేల కోట్ల రూపాయలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇటీవల మాల్యాను ఇండియాకు తిరిగి రప్పించే చర్యలను వేగవంతం చేసిన కేంద్రం తాజాగా మరో కీలక చర్య తీసుకుంది. మాల్యాకు చెంఇన సుమారు రూ.100కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేంద్రానికి బదిలీచేసింది. ముఖ్యంగా యునైటెడ్ బ్రూవరీస్‌కు చెందిన ఆస్తులపై దృష్టిపెట్టిన ఈడీ తాజాగా మాల్యాకు చెందిన రూ.100 కోట్ల విలువైన వాటాలను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్) యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీల్) కు చెందిన రూ. 100 కోట్ల విలువైన ( ప్రత్యక్ష, పరోక్ష)వాటాల హక్కులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. మనీలాండర్ చట్టం సెక్షన్9 ప్రకారం ఈ ఆస్తుల బదిలీ ప్రక్రియను చేపట్టింది. మరోవైపు ఈడీ ఇప్పటికే యూబీఎల్‌కు చెందిన 4 కోట్ల వాటాలు, యూఎస్ఎల్కు చెందిన 25.1లక్షల వాటాలు, మెక్‌డోవెల్స్ హోల్డింగ్స్‌లోని 22 లక్షల వాటాలను అటాచ్ చేసింది. వీటితోపాటు మాల్యావిగా అనుమానిస్తున్న మరికొన్ని కంపెనీలపై దృష్టి సారించింది. వీటిల్లో దేవీ ఇన్వెస్ట్మెంట్స్, కింగ్‌ఫిషర్ ఫిన్వెస్ట్ ఇండియా, మాల్యా ప్రైవేటు లిమిటెడ్, ఫార్మాట్రేడింగ్ కంపెనీ, విట్టల్ ఇన్వెస్ట్మెంట్స్, యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్ లిమిటెడ్, కామ్‌స్కో ఇండస్ట్రీస్, ‘ది గెమ్’ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీలపై కూడా దృష్టిపెట్టింది. రెండునెలల క్రితం యూబీఎల్, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యుఎస్ఎల్) మాక్టోవెల్ హోల్డింగ్స్ లిమిటెడ్‌లో మాల్యా, అతని అనుబంధ సంస్థలకు చెందిన రూ. 4వేల కోట్ల వాటాలను బదిలీ చేయాల్సిందిగా ఎస్‌హెచ్‌సీఐఎల్‌కు ఈడీ లేఖరాసింది. ఈ మేరకు ఫిబ్రవరిలో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్డర్ రూ .4,200 కోట్ల ఆస్తుల ఎటాచ్మెంట్ ఆర్డర్‌ను కోర్టు సమ్మతించింది. ఈ కంపెనీల్లో మాల్యాకు రూ.4,000 కోట్ల విలువైన షేర్లు ఉంటాయని అంచనా. అలాగే గత ఏడాది సెప్టెంబర్‌లో ఈడీ రూ .6,630 కోట్ల విలువైన అటాట చేసిన సంగతి తెలిసిందే. మనీ లావాదేవీ నిరోధక చట్టం (పిఎంఎల్ఏ) నిబంధనలో 9 వ సెక్షన్ కింద, జప్తు ఆర్డర్ తర్వాత, అటువంటి ఆస్తిలో అన్ని హక్కులు కేంద్ర ప్రభుత్వానికే చెందుతాయి. -
ఐటీకి చిక్కిన రూ.100 కోట్ల నల్లధనం
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో భారీ మొత్తంలో నల్లధనం గుట్టురట్టవుతోంది. రూ.100కోట్ల విలువైన లెక్కలో చూపించని నగదును, విక్రయాలను ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. ఐటీ శాఖ సర్వే ఆపరేషన్స్ విస్తరణలో భాగంగా పన్ను ఎగవేసిన వర్తకుల నుంచి, ఇతర ఆపరేటర్ల దగ్గర్నుంచి ఈ నగదును ఐటీ శాఖ బయటికి రాబట్టింది. ఢిల్లీ, బెంగళూరు, కోల్కత్తా, ముంబాయి నగరాల్లో ట్రేడ్ కౌంటర్స్, దుకాణాల్లో ఐటీ డిపార్ట్మెంట్ ఈ సర్వే ఆపరేషన్ చేపట్టింది. అత్యధిక మొత్తంలో నగదు, సేల్స్ డాక్యుమెంట్లు ఈ ప్రాంతాల్లో బయటపడ్డట్టు ఐటీ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. నోట్ల రద్దుతో వర్తకులు అక్రమంగా విక్రయాలు జరుపుతున్నారని, ఆ విలువ రూ.100 కోట్లగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులపై విచారిస్తున్నామని, వర్తకులు నిర్ధేశించిన సమయం లోపల తమ వివరణ ఇచ్చుకోవాలని ఆదేశించింది. అదేవిధంగా కొన్ని విక్రయ రికార్డులను తాము స్వాదీనం పర్చుకున్నామని పేర్కొన్నారు. కొంతమంది వర్తకులు, జ్యువెల్లరీ, కరెన్సీ ఎక్స్చేంజ్ ఏజెంట్స్, హవాలా డీలర్స్ డిస్కౌంట్ ధరలకు రూ.500, రూ.1,000 నోట్లను మారుస్తున్నారని తెలుసుకున్న ఐటీ డిపార్ట్మెంట్ ఈ రైడ్స్ జరుపుతోంది. అదేవిధంగా ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడు రద్దు చేసిన పెద్ద నోట్లను రూ.50 లక్షల మేర తరలిస్తుండగా టాక్స్ డిపార్ట్మెంట్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ యూనిట్ గుట్టురట్టు చేసింది. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో నగదు తరలింపులపై పారామిలటరీ బలగాలు, పోలీసులు ఓ కన్నేసి ఉండాలని, ముఖ్యంగా సివిల్ ఎయిర్‌పోర్ట్స్, ఢిల్లీ మెట్రో, రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లలో రద్దుచేసిన 500, 1000 రూపాయల నోట్ల తరలింపుకు అడ్డుకట్టు వేయాలని ఆర్థికమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. సర్వే యాక్షన్‌లో భాగంగా పన్ను అధికారులు ట్రేడ్, ఆపరేటర్ల బిజినెస్ ప్రాంతాలలో రైడ్స్ నిర్వహిస్తున్నారు. -
100 కోట్ల క్లబ్ లో జనతా.. ఎన్టీఆర్ థ్రిల్
చెన్నై: టాలీవుడ్ లో వేగంగా రూ. 100 కోట్ల వసూళ్లు సాధించిన రెండో సినిమా ‘జనతా గ్యారేజ్’ ఘనత దక్కించుకోవడం పట్ల హీరో ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల స్పందన తనను థ్రిల్ కు గురిచేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ‘జనతా గ్యారేజ్ కు వస్తున్న స్పందన నాకు సంతోషాన్ని కలిగించింది. నాకు అండగా నిలిచినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సంతృప్తికరంగా ఉన్నాయి. నంబర్ గేమ్ కు ప్రాధాన్యం ఇవ్వనని ఇంతకుముందే చెప్పాను. నటుడిగా మంచి సినిమాలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తాన’ని ఎన్టీఆర్ అన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ విడుదలైన ఆరు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. టాలీవుడ్ లో బాహుబలి తర్వాత వేగంగా వంద కోట్లు వసూలు చేసిన సినిమా ఇదేనని ట్రేడ్ ఎనలిస్ట్ త్రినాథ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలోనూ రికార్డు కలెక్షన్లు సాధిస్తోందని వెల్లడించారు. -
10 రోజుల్లో రూ.100 కోట్లు దాటింది
ముంబై: ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ హృతిక్ రోషన్ తాజా సినిమా 'మొహంజోదారో' బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకుంది. ఎట్టకేలకు రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 102.82 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఆగస్టు 12న విడుదలైన ఈ సినిమా నినాదంగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇండియాలో వసూళ్లకు దీటుగా అబ్రాడ్ లోనూ కలెక్షన్లు వచ్చాయని నిర్మాతలు వెల్లడించారు. భారత్ లో రూ. 76.5 కోట్లు, విదేశాల్లో 26.32 కోట్ల గ్రాస్ సాధించినట్టు ప్రకటించారు. అసతోష్ గోవారికర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ఇది. 2008లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జోదాఅక్బర్’ మంచి విజయం సాధించింది. కాగా, 'మొహంజోదారో' కలెక్షన్లపై హృతిక్ రోషన్ అసంతృప్తిగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటు విడుదలైన అక్షయ్ కుమార్ ‘రుస్తుం’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. -
ఐపీఎల్ బెట్టింగ్ రూ.100 కోట్లు
సిద్దిపేట రూరల్: ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఫోర్లు.. సిక్సర్ల హోరుతో జోరందుకుంది. బెట్టింగ్ కూడా అదే స్థాయిలో లక్షలు దాటి కోట్ల రూపాయలకు చేరింది. ఇటీవల ముగిసిన టీ-20 వరల్డ్ కప్‌లో మెదక్ జిల్లాలో రోజూ రూ.లక్షల్లో బెట్టింగ్ జరిగితే... ఐపీఎల్లో రూ. 2 కోట్ల మేర బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ తీరిది... వరల్డ్‌కప్‌లో అయితే ఇండియా ఆడే మ్యాచ్‌లపై ఎక్కువగా బెట్టింగ్ నడుస్తుంది. కానీ, ఐపీఎల్‌లోని 8 జట్లలోనూ ఇండియా ఆటగాళ్లు ఉంటారు. దీంతో ప్రతీమ్యాచ్పైనా బెట్టింగ్ దందా ఉంటోంది. ఐపీఎల్ ప్రధానంగా నాలుగు జట్లు ఫెవరేట్‌గా ఉన్నాయి. బెట్టింగ్‌లో ప్రత్యర్థి జట్లుపై అధికంగా బెట్టింగ్ కాస్తారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్‌లో భారీ హిట్టర్లు ఉన్నారు. దీంతో ఇవి ఫెవరేట్ టీంలుగా బెట్టింగ్ రాయుళ్లు భావిస్తున్నారు. ఫేవరేట్ జట్ల మధ్య బెట్టింగ్ జోరుగా నడుస్త్తోంది. మరో నెల రోజులు ఇదే తీరు.. ఈ నెల 8న ప్రారంభమైన ఐపీఎల్ 45రోజుల పాటు జరగనుంది.మొదట్లో కాస్త నెమ్మదిగా ప్రారంభమైంది. భారీ స్కోర్లు లేవు. ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదారాబాద్ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదు కావడంతో బెట్టింగ్ జోరందుకుంది. ఈ మ్యాచ్‌లో చాలా మంది హైదరాబాద్‌పై పందేలు కాశారు. అయితే ఆర్సీబీ గెలవడంతో భారీగా బెట్టింగ్ రాయుళ్లు జేబులు ఖాళీ చేసుకున్నారు. ఇప్పటి వరకూ రోజు ఒక మ్యాచ్ మాత్రమే నేటి నుంచి రోజుకు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లలో జిల్లాలో రోజూ సుమారుగా రూ. 3కోట్లు మేర బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. జిల్లాలో బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు పోలీసు వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. లీగ్ మొత్తంపైన జిల్లాలో దాదాపు రూ. 100 కోట్ల మేర చేతులు మారే అవకాశం ఉందని అంచనా. ఈ ప్రాంతాల్లో బెట్టింగ్ అధికం... మెదక్ జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, తుప్రాన్, పటాన్చెరువు, జహీరాబాద్, రాంచంద్రానగర్, జోగిపేట ప్రాంతాల్లో బెట్టింగ్‌లు పెద్ద ఎత్తున నడుస్తున్నట్లు తెలుస్తోంది. బుకీలు ఈ ప్రాంతాల్లో మకాం వేశారు. కొంతమంది ఏజెంట్లను ఆయా ప్రాంతాల్లో నియమించుకున్నారు. మ్యాచ్‌కు రెండు గంటల ముందు బెట్టింగ్ తీరును చెప్పేస్తారు. ఈ మేరకు బెట్టింగ్ రాయుళ్లు ఏజెంట్లకు డబ్బులు ఇస్తారు. వీరు సబ్‌బుకీలకు చెల్లిస్తారు. మ్యాచ్ అనంతరం వెంటనే బెట్టింగ్ డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఈ బెట్టింగ్‌ల వల్ల చాలా మంది నష్టపోతున్నారు. రోడ్డున పడుతున్న కుటుంబాలు... ఇటీవల వరంగల్ జిల్లా చేర్యాల మండలానికి చెందిన ఓ వ్యక్తి సిద్దిపేట ప్రాంతంలో నిర్వహించే బెట్టింగ్‌లో రూ.1.50 లక్షలు ఒకే రోజు పొగొట్టుకున్నట్లు సమాచారం. ఇవే కాకుండా ఇలాంటి ఘటనలు పట్టణ ప్రాంతాల్లో చాలా ఉన్నాయి. లాడ్జీలు, దాబాలు, ఇంటర్నెట్లు, మోబైల్ షాపుల్లో ఈ దందా నడుస్తోంది. బెట్టింగ్ ఎవరు, ఎక్కడ నిర్వహిస్తున్నారనేది స్థానిక పోలీసులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. నిఘా ఉంచాం...: సిద్దిపేట పరిధిలో క్రికెట్ బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. పట్టణ పరిధిలో 10మంది బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. వారిపై ఇప్పటికే నిఘా పెట్టాం. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఆన్లైన్, సెల్ఫోన్ల ద్వారా బెట్టింగ్‌లు నడిపిస్తుండడం వల్ల పట్టుకోలేకపోతున్నాం. బాధితులెవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించాలి. వారికి పొగొట్టుకున్న డబ్బులు ఇప్పించడంతో పాటు వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. సమాచారం ఇస్తే హైదరాబాద్ నుంచి బెట్టింగ్ నడిపిస్తున్న అక్కడి పోలీసుల సాయంతో పట్టుకుంటాం. - సీహెచ్. శ్రీధర్, డీఎస్పీ సిద్దిపేట -
చైనాలో రికార్డు సృష్టించిన పీకే
బీజింగ్: ఆమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమా 'పీకే' కొత్త రికార్డు సృష్టించింది. చైనాలో విజయవంతంగా ఆడుతున్న పీకే 100 కోట్లు రూపాయల వసూళ్లు సాధించింది. భారత్ వెలుపల ఒకే దేశంలో ఇంత మొత్తం వసూలు తొలి బాలీవుడ్ సినిమాగా పీకే ఘనత సాధించింది. గల నెల 22 న చైనాలో 4600 స్క్రీన్లపై పీకే విడుదలైంది. విడుదలయిన 16 రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల రూపాయలను వసూలు చేసింది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆమీర్ ఖాన్, అనుష్క వర్మ హీరోహీరోయిన్లుగా నటించిన 'పీకే' బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 615 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. -
గుట్ట అభివృద్ధికి రూ.100 కోట్లు
భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని తిరుమల తిరుపతికి దీటుగా అభివృద్ధి చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు తగ్గట్టుగానే బడ్జెట్లో పెద్దపీట వేశారు. బుధవారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో గుట్ట దేవస్థానం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన యాదగిరిగుట్ట రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. కాగా గత నెల 17న గుట్టకు వచ్చిన ముఖ్యమంత్రి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని గుట్ట అభివృద్ధిపై హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో యాదగిరి క్షేత్రం అభివృద్ధికి తీసుకునే చర్యలు సూచించారు. బడ్జెట్లో సైతం గుట్ట అభివృద్ధికి నిధులు కేటాయించడంలో ఇక్కడి ప్రజలు, స్వామి భక్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం కేటాయించిన నిధులతో స్వామివారి గర్భగుడి ఆలయ గోపురం ఎత్తుపెంపుతో పాటు స్వర్ణతాపడం ముఖ్యమైనది. దీంతోపాటు గుట్ట పరిసర ప్రాంతాల్లో రెండు వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయిం చారు. ఇందులో 400 ఎకరాల్లో నర్సింహ అభయారణ్యం పేరిట జింకల పార్కును, మిగి లిన 16 వందల ఎకరాల్లో తిరుమల తిరుపతి తరహాలో ఉద్యానవనాలు, అధ్యాత్మిక కేంద్రా లు, కల్యాణమంటల నిర్మాణంతో పాటు వేదపాఠశాల ఏర్పాటు చేయనున్నారు. నా పూర్వ జన్మ సుకృతం నా హయంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించడం నా పూర్వ జన్మసుకృతం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గుట్ట క్షేత్రం లో అధునాతన సదుపాయలు కల్పిస్తాం. -గొంగిడి సునీత, ఎమ్మెల్యే ఆలేరు సంతోషంగా ఉంది.. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించడం సంతోషంగా ఉంది. స్థపతుల సలహా తీసుకుని వాస్తు ప్రకారం అభివృద్ధి చేయాలి. ఆలయం చుట్టూ ప్రాకారం, నాలుగు రాజగోపురాలు నిర్మిస్తే బాగుంటుంది. -కారంపూడి నరసింహాచార్యులు, గుట్ట ప్రధానార్చకులు -
నగరాభివృద్ధికి రూ. 100 కోట్లు ఇవ్వండి
సింధనూరు టౌన్, న్యూస్‌లైన్ : నగరాభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఎమ్మెల్యే బాదర్లి హంపనగౌడ కోరారు. ఆయన ఆదివారం స్థానిక బాలుర ప్రభుత్వ పీయూ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అధ్యక్షత వహించి మాట్లాడారు. నగరంలో డ్రెయినేజీ, రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పన దృష్ట్యా నిధులు మంజూరు చేయాలని మనవి చేశారు. సింధనూరు - మస్కి రహదారి అభివృద్ధికి కూడా రూ.100 కోట్లు అందించాలని కోరారు. ఈ సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని అన్నారు. మొదటి సారిగా రైతుల సముదాయానికి ప్రాధాన్యత కల్పించాలని, రాయచూరు, కొప్పళ, బళ్లారి జిల్లాలో మొత్తం 12 లక్షల ఎకరాలకు పైగా నీటిపారుదల భూములు ఉన్నాయని తెలిపారు. తుంగభద్రా జలాశయంలో 30 టీఎంసీల మేర పూడిక నిండి ఉందని, దీంతో ఎడమ కాలువకు రెండవ పంటకు నీరు లభించడం కష్టసాధ్యమని వెల్లడించారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. తుంగభద్రా వరద నీటిని ఉపయోగించుకునే విధంగా పథకాలను రూపొందించాలన్నారు. ఈ పథకానికి సుమారు 6-8 వేల కోట్లు ఖర్చు అవుతుందని, ఏటేటా సమస్యలు తగ్గుముఖం అవుతాయని వెల్లడించారు. నగరంలో నెలకొన్న సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని కోరారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సింధనూరు విధానసభ నియోజకవర్గంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అధికార పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ లేరని, అయితే మొదటి సారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో తనను ఎంపిక చేశారని, ప్రజల ఆశయాలకనుగుణంగా తగిన అభివృద్ధి పనులు చేపడతానని తెలిపారు.