పారిస్ : ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ కార్ల సంస్థ బుగట్టి తన లేటెస్ట్ కార్ (ల వొఇతురు నిర్)ను మార్కెట్ లో విడుదల చేసింది.రూ.100కోట్ల విలువైన కారును తయారు చేసేందుకు 60వేల గంటల సమయం పట్టిందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫ్రెంచ్ భాషలో ల వొఇతురు నిర్ అని పిలిచే ఈ కారును ఇంగ్లీష్ లో ద బ్లాక్ కార్ అని పిలుస్తారు.
ఈ కారు ప్రత్యేకతల్ని ఒక్కసారి గమనిస్తే క్వాడ్ టర్బో ఛార్జింగ్, 1,479 గంటల హార్స్ పవర్, 8 లీటర్ల పెట్రోల్ డబ్ల్యూ-16 పిస్టన్ ఇంజిన్ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. అయితే బెస్పోక్ డిజైన్ మరియు ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్ దీనికి భిన్నంగా ఉంటాయి. బ్లాక్ కలర్ స్పోర్ట్స్ కారు. కారు నాలుగు చక్రాల వెనుక భాగంలో 6 బ్లేడ్ ఎక్సహౌస్ ను కలిగి ఉంది. ఈ 6బ్లేడ్ ఎక్స హౌస్ లు వేగాన్ని ఆస్వాధించేలా చేస్తోంది. కారు టాప్ కార్బన్ ఫైబర్ బ్లాక్ కలర్ కోటింగ్ ను కలిగి ఉంది.
నివేదికల ప్రకారం, లా వోయిచర్ నోయిర్ ప్రతి అల్ట్రా-వైడ్లైట్ స్ట్రిప్స్‌లో 25 యూనిట్ల అత్యంత శక్తివంతమైన ఎల్‌ఇడి బల్బులను కలిగి ఉంది. కారు ముందు గ్రిల్‌లో 3-డి ప్రింటెడ్ సౌకర్యం కలిగి ఉంది. కారు పొడవు 17.7 కాగా, వీల్‌బేస్ 9.8 అంగుళాలు ఇప్పటివరకు కారు క్యాబిన్ ఫోటోలు విడుదల చేయకపోయినా హవానా బ్రౌన్ లెదర్ తో సీట్లను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment