Sports Cars
-
మేడిన్ ఇండియా రేంజ్ రోవర్
ముంబై: మేడిన్ ఇండియా రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లు కొద్ది రోజుల్లో భారత రోడ్లపై పరుగు తీయనున్నాయి. దేశీయంగా వీటి తయారీ చేపట్టాలని టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ నిర్ణయించింది. 54 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ మోడళ్లు యూకే వెలుపల ఒక దేశంలో తయారు కానుండడం ఇదే తొలిసారి. ప్రస్తుతం యూకేలోని సోలహల్ వద్ద ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్లాంటులో తయారైన రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లు భారత్‌సహా ప్రపంచవ్యాప్తంగా 121 మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. దేశీయంగా తయారైతే ఈ రెండు మోడళ్ల ధర 18–22 శాతం తగ్గనుందని కంపెనీ వెల్లడించింది. రానున్న రోజుల్లో రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడళ్ల అమ్మకాలు పెరుగుతాయని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. టాటా మోటార్స్‌కు చెందిన పుణే ప్లాంటులో ఇప్పటికే రేంజ్ రోవర్ వెలార్, రేంజ్ రోవర్ ఇవోక్, జాగ్వార్ ఎఫ్–పేస్, డిస్కవరీ స్పోర్ట్ అసెంబుల్ అవుతున్నాయి. 2023–24లో దేశవ్యాప్తంగా జేఎల్ఆర్ ఇండియా 4,436 యూనిట్లను విక్రయించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది ఏకంగా 81 శాతం అధికం. -
మార్కెట్ లో లంబోర్గిని కొత్త లగ్జరీ కారు, ఇండియాలో విడుదల
ముంబై: ఇటాలియన్ సూపర్ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని భారత మార్కెట్లో మంగళవారం సరికొత్త లగ్జరీ కారును విడుదల చేసింది. ‘హురాకన్ ఈవీఓ రేర్–వీల్ డ్రైవ్ స్పైడర్’ పేరుతో ఆవిష్కరించిన ఈ కారు ధర రూ.3.54 కోట్లుగా ఉంది. ఇందులో అమర్చిన వీ10 ఇంజిన్‌కు గరిష్టంగా 610 హెచ్‌పీ సామర్థ్యం ఉంది. ఈ కొత్త కారు కేవలం 3.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు 324 వేగంతో ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది. -
బుగట్టి నుంచి మరో స్పోర్ట్స్ కార్, ధర రూ.100కోట్లు
పారిస్ : ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ కార్ల సంస్థ బుగట్టి తన లేటెస్ట్ కార్ (ల వొఇతురు నిర్)ను మార్కెట్ లో విడుదల చేసింది.రూ.100కోట్ల విలువైన కారును తయారు చేసేందుకు 60వేల గంటల సమయం పట్టిందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫ్రెంచ్ భాషలో ల వొఇతురు నిర్ అని పిలిచే ఈ కారును ఇంగ్లీష్ లో ద బ్లాక్ కార్ అని పిలుస్తారు. ఈ కారు ప్రత్యేకతల్ని ఒక్కసారి గమనిస్తే క్వాడ్ టర్బో ఛార్జింగ్, 1,479 గంటల హార్స్ పవర్, 8 లీటర్ల పెట్రోల్ డబ్ల్యూ-16 పిస్టన్ ఇంజిన్ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. అయితే బెస్పోక్ డిజైన్ మరియు ఎక్స్టెండెడ్ వీల్‌బేస్ దీనికి భిన్నంగా ఉంటాయి. బ్లాక్ కలర్ స్పోర్ట్స్ కారు. కారు నాలుగు చక్రాల వెనుక భాగంలో 6 బ్లేడ్ ఎక్సహౌస్ ను కలిగి ఉంది. ఈ 6బ్లేడ్ ఎక్స హౌస్ లు వేగాన్ని ఆస్వాధించేలా చేస్తోంది. కారు టాప్ కార్బన్ ఫైబర్ బ్లాక్ కలర్ కోటింగ్ ను కలిగి ఉంది. నివేదికల ప్రకారం, లా వోయిచర్ నోయిర్ ప్రతి అల్ట్రా-వైడ్లైట్ స్ట్రిప్స్లో 25 యూనిట్ల అత్యంత శక్తివంతమైన ఎల్ఇడి బల్బులను కలిగి ఉంది. కారు ముందు గ్రిల్లో 3-డి ప్రింటెడ్ సౌకర్యం కలిగి ఉంది. కారు పొడవు 17.7 కాగా, వీల్‌బేస్ 9.8 అంగుళాలు ఇప్పటివరకు కారు క్యాబిన్ ఫోటోలు విడుదల చేయకపోయినా హవానా బ్రౌన్ లెదర్ తో సీట్లను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. -
కారు రేసింగ్ మధ్యలోకి బైక్.. దాంతో
బర్మర్ (రాజస్థాన్): జాతీయ ర్యాలీ చాంపియన్‌షిప్‌లో అనూహ్య దుర్ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే ‘అర్జున అవార్డు’ అందుకున్న ప్రముఖ రేసింగ్ డ్రైవర్ గౌరవ్ గిల్ నడుపుతున్న కారు... ట్రాక్‌పైకి వచ్చిన బైక్‌ను ఢీకొట్టింది. దాంతో బైక్‌పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలతో పాటు వారి కుమారుడు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో రేసింగ్ కారు దాదాపు 145 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది! దాంతో కారును అదుపు చేసే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన గిల్, అతని సహచరుడు షరీఫ్‌లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇండియన్ నేషనల్ ర్యాలీ చాంపియన్‌షిప్‌లో భాగంగా మూడో రౌండ్ పోటీలను బర్మర్ వద్ద నిర్వహించారు. సాధారణంగా ఇలాంటి రేసింగ్‌లను నిర్వహించినప్పుడు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తాము తీసుకున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ‘మా రేసింగ్‌కు పోలీసులతో పాటు సదరు గ్రామ పంచాయతీ అధికారుల అనుమతి ఉంది. సమీపంలోని గ్రామాల ప్రజలందరికీ 15 రోజుల ముందుగానే సమాచారం అందించాం. రోడ్లు మూసేస్తారని, రేసు రోజు తమ పెంపుడు జంతువులను కూడా అటు వైపు రానివ్వద్దని చెప్పాం. నిజానికి బైక్‌పై వచ్చిన వ్యక్తిని మా ఫీల్డ్ మార్షల్ అడ్డుకున్నాడు. అయితే అతడితో వాదనకు దిగి వద్దంటున్నా వినకుండా బ్యారికేడ్‌ను ఛేదించి ట్రాక్‌పై వెళ్లాడు. కొన్ని క్షణాల వ్యవధిలోనే ఈ దారుణం చోటు చేసుకుంది’ అని రేసింగ్ ప్రమోటర్లు వెల్లడించారు. ఘటనపై పోలీసు విచారణ ప్రారంభమైంది. -
మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ‘ఎక్స్4’
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ‘ఎక్స్4’ పేరుతో నూతన మోడల్ కారును సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఒక పెట్రోల్, రెండు డీజిల్ వేరియంట్లలో ఈ మోడల్ కార్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ కారు ధర రూ.63.5 లక్షలు.. డీజిల్ వేరియంట్ల ధరల శ్రేణి రూ.60.6 లక్షలు – రూ.65.9 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. చెన్నై ప్లాంట్‌లో వీటి ఉత్పత్తి జరుగుతున్నట్లు తెలియజేసింది. ఎక్స్4 విడుదల ద్వారా స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ సెగ్మెంట్‌ను భారత్ మార్కెట్లో పరిచయం చేశామని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ హాన్స్ క్రిస్టియన్ బార్ట్‌లెస్ పేర్కొన్నారు. -
లగ్జరీ కార్లలో పోలీసు పెట్రోలింగ్!
దుబాయ్: పోలీసులు అనగానే జీపులు గుర్తుకు వస్తాయి. నిన్న మొన్నటి దాకా సినిమాల్లో కూడ పోలీసులు జీపుల్లో రావడమే చూపించారు. అలాంటిది ఇటీవల కొన్ని ప్రభుత్వాలు నగరాల్లో పోలీస్ పెట్రోలింగ్ పెంచడమే కాక, వారికి ప్రత్యేకంగా కార్లను సమకూర్చాయి. ప్రస్తుతం దుబాయ్ ప్రభుత్వం కూడా పోలీసులు గస్తీ తిరిగేందుకు ప్రత్యేక స్పోర్ట్స్ లగ్జరీ కార్లను, ఎస్ యూవీలను అందించింది. దీంతో ఇప్పుడు పోలీసులు ఆ ఖరీదైన కార్లలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అత్యంత హార్స్ పవర్ కలిగిన లగ్జరీ కార్లను దుబాయ్ ప్రభుత్వం మెట్రో పోలీసులు గస్తీ తిరిగేందుకు ఇవ్వడంతో ఇప్పుడు గ్యారేజీలన్నీ అత్యాధునిక లగ్జరీ కార్లతో ఆకట్టుకుంటున్నాయి. ఆడి ఆర్8, బెంట్లీ కాంటినెంటల్ జీటీ, ఆస్టాన్ మార్టిన్ వన్ 77, బీఎం డబ్ల్యూ ఐ8, బీఎం డబ్ల్యూ ఎం6, బ్రాబస్ మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ, బుగట్టి వేరాన్, చెవ్రోలెట్ కేమెరో, ఫెరారీ ఎఫ్ ఎఫ్, ఫోర్డ్ ముస్టాంగ్ కస్టమైజ్డ్ బై రష్ పెర్భార్మెన్స్, లంబోర్గిని ఎవెంటేడర్, లెక్సస్ ఆర్సీ ఎఫ్, మెక్ లారెన్ ఎంపీ4 12సీ, మెర్సిడెస్ బెంజ్ ఎస్ ఎల్ ఎస్ ఏఎంజీ, నిస్సాన్ జీటీఆర్, పోర్స్ ఖె పనామెరా ఎస్ ఈ హైబ్రిడ్ వంటి అన్ని మోడల్స్ లోనూ ఖరీదైన కార్టు.. ఇప్పుడు దుబాయ్ పోలీసుల పెట్రోలింగ్ లో భాగం పంచుకుంటున్నాయి. -
ఉప్పునీటితో రయ్ రయ్...
ఈ స్పోర్ట్స్ కారు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది కదూ? కారే కాదు.. దీని ప్రత్యేకతలు మరింతగా మన మదిని దోచుకుంటాయి. సాధారణంగా స్పోర్ట్స్ కార్లు ఎక్కువ పెట్రోలు తాగుతాయి.. తక్కువ మైలేజీ ఇస్తాయి.. వెరసి నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతుంది. పైగా పర్యావరణానికి ఏమాత్రం అనుకూలంగా ఉండవు. కానీ ఈ కారు వాటన్నింటికీ భిన్నమైంది. దీని పేరు క్వాంట్-ఎ-స్పోర్ట్లైమోసిన్. పూర్తిగా పర్యావరణ అనుకూలమైనది. అంతేకాదు.. దీనికి పెట్రోలు, డీజిల్ లేదా గ్యాస్ ఏదీ అవసరం లేదు. మరి ఎలా నడుస్తుందా అని అనుకుంటున్నారా? ఉప్పునీటితో..! ఔను.. పెట్రోల్ బదులు ఉప్పునీరు పోస్తే చాలు.. రయ్ రయ్ మంటూ పరుగులు పెడుతుంది. దీని గరిష్టవేగం ఎంతో తెలుసా? గంటకు ఏకంగా 350 కిలోమీటర్లు. దాదాపు 2,300 కిలోల బరువున్న ఈ కారు.. సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.8 సెకన్లలోనే అందుకుంటుంది. 200 లీటర్ల సామర్థ్యమున్న రెండు ట్యాంకులను పూర్తిగా ఉప్పునీటితో నింపితే.. దాదాపు 600 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. త్వరలోనే ఐరోపా రోడ్లపై ఇది పరుగులు పెట్టనుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ కారు ధర కాస్త ఎక్కువే. ప్రస్తుతానికి దీని ధర ప్రకటించకపోయినా, దాదాపు రూ.10 కోట్లపైనే ఉంటుందని అంచనా.