10 రోజుల్లో రూ.100 కోట్లు దాటింది | Mohenjo Daro crosses Rs 100 crore-mark worldwide | Sakshi
Sakshi News home page

10 రోజుల్లో రూ.100 కోట్లు దాటింది

Published Wed, Aug 24 2016 1:57 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

10 రోజుల్లో రూ.100 కోట్లు దాటింది

10 రోజుల్లో రూ.100 కోట్లు దాటింది

ముంబై: ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ హృతిక్ రోషన్ తాజా సినిమా 'మొహంజోదారో' బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకుంది. ఎట్టకేలకు రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 102.82 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఆగస్టు 12న విడుదలైన ఈ సినిమా నినాదంగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇండియాలో వసూళ్లకు దీటుగా అబ్రాడ్ లోనూ కలెక్షన్లు వచ్చాయని నిర్మాతలు వెల్లడించారు. భారత్ లో రూ. 76.5 కోట్లు, విదేశాల్లో 26.32 కోట్ల గ్రాస్ సాధించినట్టు ప్రకటించారు.

అసతోష్ గోవారికర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ఇది. 2008లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జోదాఅక్బర్’ మంచి విజయం సాధించింది. కాగా, 'మొహంజోదారో' కలెక్షన్లపై హృతిక్ రోషన్ అసంతృప్తిగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటు విడుదలైన అక్షయ్ కుమార్ ‘రుస్తుం’  బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement