అతడి వెయిట్‌లాస్‌ జర్నీకి నటుడు హృతిక్ రోషన్‌ ఫిదా..! | Man Who Lost 26 kg Gets Praise From Hrithik Roshan | Sakshi
Sakshi News home page

ఒక్క ఏడాదికే 26 కిలోలు తగ్గాడు..! బాగా చేశారంటూ హీరో హృతిక్‌ ప్రశంసల జల్లు..

Published Mon, Feb 24 2025 5:58 PM | Last Updated on Mon, Feb 24 2025 6:36 PM

Man Who Lost 26 kg Gets Praise From Hrithik Roshan

ఎందరో తమ వెయిట్‌ లాస్‌ జర్నీతో స్ఫూర్తిని రగులుస్తున్నారు. బరువు తగ్గడం ఏమి భారం కాదని చేతలతో నిరూపిసతున్నారు. అంతేగాదు కొందరూ అచంచలమైన దీక్షతో బరువు తగ్గి ఊహించని రీతీలో స్మార్ట్‌గా మారి సెలబ్రిటీల చేత గ్రేట్‌ చేత ప్రశంసలందుకుంటున్నారు. అలాంటి కోవకు చెందినవాడే ఫిట్‌నెస్‌ ఇన్ప్లుయెన్సర్‌ ఫుర్కాన్‌ ఖాన్‌. అతడు అంతలా ఓపికతో వ్యహరించి మరీ బరువు తగ్గిన తీరు నెటిజన్లందరినే గాక బాలీవుడ్‌ ప్రసిద్ధ నటుడుని సైతం ఇంప్రెస్‌ చేసింది.   

23 ఏళ్ల ఫుర్కాన్‌ ఖాన్‌ తన ఫిట్‌నెస్‌ జర్నీని డాక్యుమెంట్‌ రూపంలో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. ఆ వీడియోకి 'ఓపికతో కసరత్తులు చేస్తూనే ఉండండి' అనే క్యాప్షన్‌తో తన వెయిట్‌ లాస్‌ జర్నీ వీడియోలు షేర్‌ చేసేవాడు. ఆ వీడియో​లో పుర్కాన్‌ జనవరి 19 2024 జిమ్‌లో చేరిన 9 రోజుల తర్వాత అనే క్లిప్‌తో ప్రారంభమవుతుంది. ఒక ఏడాది క్రితం తాను ఎలా ఉన్నాడో చూపిస్తూ తన ఫిట్‌నెస్‌ జర్నీని గురించి వివరిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. 

అయితే అంతలా జిమ్‌లో వర్కౌట్‌లు చేసినా ఫలితం మాత్రం త్వరగా రాదు. అయినా స్కిప్‌ చేయకుండా కష్టపడుతున్న తీరు వీడియోలో కనిపిస్తుంటుంది. మొదటి మూడు నుంచి నాలుగు నెలల్లో పెద్ద మార్పు కనిపించదు. శరీరాన్ని ఫిట్‌గా నిర్మించుకోవడానికి సంవత్సరాలు పట్టినా సరే.. మనం మాత్రం మన వర్కౌట్‌లు స్కిప్‌ చేయకూడదని చెబుతుంటాడు. 

ఓపిక అనేది అత్యంత ముఖ్యమని నొక్కి చెబుతుంటాడు. అయితే అలా చేయగా చేయగా.. ఫుర్కాన్‌ శరీరంలో చక్కటి మార్పు కనిపిస్తూ ఉంటుంది. చివరగా ఏది ఒక్క రోజులో జరగదనేది బాగా గుర్తించుకోండి అంటూ ముగిస్తాడు వీడియోలో. అతడి విజయవంతమైన వెయిట్‌ లాస్‌ జర్నీకి నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన రావడమే గాక స్వయంగా హృతిక్‌ రోషన్‌ నుంచే మన్ననలను అందుకోవడం విశేషం. 

హృతిక్‌ సదరు ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఫుర్కాన్‌ని "మీరు బాగా చేశారు" అంటూ సోషల్‌ మీడియాలో ప్రశంసించారు. దీంతో నెటిజన్లు బ్రో గ్రీకు దేవుడు హృతిక్‌ నుంచే ప్రశంసలు అందుకున్నావు కదా..! నువ్వు గ్రేట్‌ అంటూ మెచ్చుకోగా, మరొకరు స్థిరత్వం, క్రమశిక్షణ ఎంత గొప్పవనేది తెల్తుస్తుందంటూ పోస్టులు పెట్టారు.  

 

(చదవండి: ఝుమైర్ నృత్యం అంటే..? ఈ వేడుకకు ప్రధాని మోదీ, జైశంకర్‌లు..)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement