
బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 90లలో ఎన్నోబ్లాక్‌బస్టర్ హిట్ మూవీలతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటి. ఇక ఆమె డాక్టర్ శ్రీరామ్‌ని పెళ్లాడి..సినీ రంగానికి దూరంగా ఉన్నారు. ఇటీవలే అడపదడపా బుల్లితెరపై కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ తళుక్కుమంటున్నారు. ఆమె ఈ వయసులో కూడా అంతే స్లిమ్‌గా అందంగా ఉంటారామె. అందులోనూ ఆమె భర్తే ఆరోగ్య నిపుణుడు కాబట్టి..ఫిట్‌నెస్‌పై మంచి శ్రద్ధ తప్పకుండా ఉంటుంది. అంతేగాదు ఈ ముద్దుగుమ్మ భర్త శ్రీరామ్ బరువు ఏవిధంగా తగ్గించుకోవచ్చో తనపైనే ప్రయోగాలను చేసుకుని మరీ వివరిస్తున్నారు. ఆయన చిన్న చిన్న మార్పులతో బరువు తోపాటు శరీరంలోని కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గించుకున్నట్లు తెలిపారు. అదెలాగో చూద్దామా..!.
ఇంక్‌టాక్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్డియాక్ థొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ అయిన శ్రీరామ్ నేనే ఆరోగ్యంగా ఉండటంలో కీలకపాత్ర పోషించేది జీవనశైలేనని నొక్కి చెప్పారు. చక్కటి ఆరోగ్యం కోసం జీవశైలిలో మంచి మార్పులు అనే పెట్టుబడి పెట్టాలన్నారు. లేదంటే అనారోగ్యం బారిన పడక తప్పదన్నారు.
వివిధ సంక్రమిత వ్యాధులకు ప్రధాన కారణం మానవులు అనుసరించే లైఫ్‌స్టైలేనని అన్నారు. ఆయన తన పేషెంట్లకు వచ్చే వ్యాధులను చక్కటి జీవశైలితో బయటపడేలా చేశాడు. ఆయన తండ్రి 55 ఏళ్ల వయసులో డయాబెటిస్‌తో బాధపడుతున్నప్పుడూ.. అతని జీవనశైలి మార్చి..మందులపై ఆధారపడకుండా నిర్వహించగలిగేలా చేశానని అన్నారు. ప్రస్తుతం ఆయనకు 86 సంవత్సరాలని అన్నారు.
తన తండ్రిలో వచ్చిన మంచి పరివర్తన చూశాక.. ఓ డాక్టర్‌గా తాను కూడా మంచి జీవనశైలిని పాటించాలని గ్రహించానన్నారు శ్రీరామ్. అప్పుడే మంచిగా ప్రజలకు సేవల చేయగలనని విశ్వసించి..మార్పుకు శ్రీకారం చుట్టారట. ఎప్పుడైతే శ్రీరామ్ జీవనశైలిలో మంచి మార్పులు తీసుకురావడం ప్రారంభించారో..త్వరితగతిన సత్ఫలితాలను అందుకున్నారు. దాదాపు 18 కిలోల బరువు తగ్గారు, అలాగే 16శాతం శరీర కొవ్వు కూడా తగ్గిందని చెప్పారు.
దీన్ని అలాగే కొనసాగించి..తదుపరి పుట్టిన రోజుకల్లా..12 నుంచి 15 శాతం కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలనేది తన లక్ష్యమని అన్నారు. ఇంతలా ఎందుకంటే..తాను ఓ మ్యాగ్జైన్ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉందని చెప్పుకొచ్చారు. అంటే మంచి జీవనశైలి, చక్కటి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంగా ఉండొచ్చాని ప్రయోగపూర్వకంగా చెప్పడమే ఎందరికో స్ఫూర్తిని కలిగించారు డాక్టర్ శ్రీరామ్.
(చదవండి: ChatGPT: చాట్‌జీపీటీ లేకపోతే ప్రాణమే పోయేది..! వైద్యులే ఆ సమస్య ఏంటో చెప్పలేకపోయారు..)