బరువు తగ్గాలనుకుంటున్నారా..? హెల్ప్‌ అయ్యే టిప్స్‌ ఇవిగో.. | Woman Who Lost 15 Kg Weight Shares Diet And Workout Tips | Sakshi
Sakshi News home page

బరువు తగ్గాలనుకుంటున్నారా..? హెల్ప్‌ అయ్యే టిప్స్‌ ఇవిగో..

Published Thu, Jan 23 2025 11:55 AM | Last Updated on Thu, Jan 23 2025 1:43 PM

Woman Who Lost 15 Kg Weight Shares Diet And Workout Tips

బరువు తగ్గాలని(Losing weight) చాలామంది అనుకుంటారు. అయితే కొత్తగా ప్రారంభించేవారికి ఏది మంచిది, ఎలాంటి డైట్‌ బెటర్‌ అనే గందరగోళానికి గురవ్వతుంటారు. అందుకు తగ్గట్టుగానే విభిన్నమైన డైట్‌లు సోషల్‌ మీడియాల్లో ఊదరగొట్టేలా వైరల్‌ అవుతున్నాయి. దీంతో సవ్యంగా సరైనది ఎంచుకోలేక తంటాలు పడుతున్నారు. అలాంటి వాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ భవ్య చెప్పే డైట్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ హెల్ప్‌ అవుతాయి. అందుకు ఆమె అనుభవమే ఓ ఉదాహరణ. ముఖ్యంగా కొత్తగా వెయిట్‌ లాస్‌ జర్నీ(Weight loss journey)కి ఉపక్రమించేవాళ్లకు మరింత ఉపయోగపడతాయని నమ్మకంగా చెబుతోంది భవ్య. అవేంటో చూద్దామా..!.

భవ్య కూడా దగ్గర దగ్గర 75 కేజీల బరువు ఉండేదట. తాను ఎలాగైన బరువు తగ్గాలని శ్రద్ధగా తీసుకున్న బేసిక్‌ డైట్‌, వర్క్‌ట్లు ప్రభావవంతంగా పనిచేశాయట. దీంతో ఆమె ప్రస్తుతం 60 కేజీల బరువుతో ఫిట్‌గా కనిపిస్తోంది. తాను ఎలాంటి డైట్‌, ఫిట్‌నెస్‌ వర్కౌట్లు ఫాలో అయ్యిందో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసుకుంది. 

వెయిట్‌ లాస్‌ జర్నీకి ఉపకరించే బేసిక్స్‌..
డైట్‌ ఎలా ఉండాలంటే..

  • కలర్‌ఫుల్‌ ఫ్రూట్స్‌, కూరగాయాలను తప్పనిసరిగా ప్రతీ భోజనంలో ఉండేలా చూసుకోవడం. 

  • లీన్‌ ప్రోటీన్‌ కోసం చికెన్‌, చేప, టోఫు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ ప్రోటీన్లు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.

  • బియ్యం, క్విననో, ఓట్స్‌ వంటి వాటిని తీసుకోవాలి. 

వర్కౌట్లు..

  • వామ్‌ అప్‌ వ్యాయామాలతో ప్రారంభించి, ఐదు నుంచి పదినిమిషాలు కార్డియో ఎక్సర్‌సైజులు చేయాలి. 

  • ముప్పై నుంచి నలభై నిమిషాలుపుష్‌అప్‌, స్క్వాట్స్‌, లేదా శక్తిమంతమైన వ్యాయామాలు చేయాలి. 

  • ఈ వర్కౌట్లు పూర్తి అవ్వగానే బాడీ ఫ్లెక్సిబిలిటీ, మానసిక ప్రశాంతత కోసం యోగా వంటివి చేస్తే బెటర్‌ అని చెబుతోంది భవ్య.

వీటన్నింటి తోపాటు బాడీ హైడ్రేటెడ్‌గా ఉండేలా రెండు నుంచి మూడు లీటర్లు నీళ్లు తీసుకోవాలి. అలాగే తక్కువ క్వాండిటీలో ఎక్కువ సార్లు తీసుకుంటే అలసటకు గురవ్వమని చెబుతోంది భవ్య. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవతోంది.

 

(చదవండి: ఆ డాక్టర్‌ డేరింగ్‌కి మతిపోవాల్సిందే..! వామ్మో మరీ ఇలానా..)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement