Fat
-
బరువు తగ్గాలనుకుంటున్నారా..? హెల్ప్ అయ్యే టిప్స్ ఇవిగో..
బరువు తగ్గాలని(Losing weight) చాలామంది అనుకుంటారు. అయితే కొత్తగా ప్రారంభించేవారికి ఏది మంచిది, ఎలాంటి డైట్ బెటర్ అనే గందరగోళానికి గురవ్వతుంటారు. అందుకు తగ్గట్టుగానే విభిన్నమైన డైట్లు సోషల్ మీడియాల్లో ఊదరగొట్టేలా వైరల్ అవుతున్నాయి. దీంతో సవ్యంగా సరైనది ఎంచుకోలేక తంటాలు పడుతున్నారు. అలాంటి వాళ్లు ఇన్స్టాగ్రామ్ యూజర్ భవ్య చెప్పే డైట్ అండ్ ఫిట్నెస్ హెల్ప్ అవుతాయి. అందుకు ఆమె అనుభవమే ఓ ఉదాహరణ. ముఖ్యంగా కొత్తగా వెయిట్ లాస్ జర్నీ(Weight loss journey)కి ఉపక్రమించేవాళ్లకు మరింత ఉపయోగపడతాయని నమ్మకంగా చెబుతోంది భవ్య. అవేంటో చూద్దామా..!.భవ్య కూడా దగ్గర దగ్గర 75 కేజీల బరువు ఉండేదట. తాను ఎలాగైన బరువు తగ్గాలని శ్రద్ధగా తీసుకున్న బేసిక్ డైట్, వర్క్ట్లు ప్రభావవంతంగా పనిచేశాయట. దీంతో ఆమె ప్రస్తుతం 60 కేజీల బరువుతో ఫిట్‌గా కనిపిస్తోంది. తాను ఎలాంటి డైట్, ఫిట్నెస్ వర్కౌట్లు ఫాలో అయ్యిందో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. వెయిట్ లాస్ జర్నీకి ఉపకరించే బేసిక్స్..డైట్ ఎలా ఉండాలంటే..కలర్‌ఫుల్ ఫ్రూట్స్, కూరగాయాలను తప్పనిసరిగా ప్రతీ భోజనంలో ఉండేలా చూసుకోవడం. లీన్ ప్రోటీన్ కోసం చికెన్, చేప, టోఫు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ ప్రోటీన్లు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.బియ్యం, క్విననో, ఓట్స్ వంటి వాటిని తీసుకోవాలి. వర్కౌట్లు..వామ్ అప్ వ్యాయామాలతో ప్రారంభించి, ఐదు నుంచి పదినిమిషాలు కార్డియో ఎక్సర్సైజులు చేయాలి. ముప్పై నుంచి నలభై నిమిషాలుపుష్అప్, స్క్వాట్స్, లేదా శక్తిమంతమైన వ్యాయామాలు చేయాలి. ఈ వర్కౌట్లు పూర్తి అవ్వగానే బాడీ ఫ్లెక్సిబిలిటీ, మానసిక ప్రశాంతత కోసం యోగా వంటివి చేస్తే బెటర్ అని చెబుతోంది భవ్య.వీటన్నింటి తోపాటు బాడీ హైడ్రేటెడ్‌గా ఉండేలా రెండు నుంచి మూడు లీటర్లు నీళ్లు తీసుకోవాలి. అలాగే తక్కువ క్వాండిటీలో ఎక్కువ సార్లు తీసుకుంటే అలసటకు గురవ్వమని చెబుతోంది భవ్య. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవతోంది. View this post on Instagram A post shared by Bhavya .ೃ࿔ ✈︎ *:・ (@avgeek.bhavya) (చదవండి: ఆ డాక్టర్ డేరింగ్‌కి మతిపోవాల్సిందే..! వామ్మో మరీ ఇలానా..) -
‘ఫాస్ట్’గా స్లిమ్ కాకండి!
చాలామంది టీనేజర్లు స్లిమ్‌గా ఉండాలని అనుకుంటారు. అయితే అందుకోసం తమలోని కొవ్వులను దహింపజేసుకోకుండా... కడుపు మాడ్చుకుని తమ కండరాలను (మజిల్ మాస్‌ను) కోల్పోతారు. ఇలా ఫ్యాట్‌ను కోల్పోకుండా మజిల్ మాస్‌ను కోల్పోవడం వల్ల చూడ్డానికి సన్నగా, స్లిమ్‌గా అనిపించినప్పటికీ, ఆరోగ్యపరంగా చేస్తే అది మంచి పరిణామం కాదు. అలా జరగకుండా ఉండాలంటే ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. స్లిమ్‌గా మారి ఆరోగ్యకరమైన సన్నటి దేహాకృతిని పొందాలనుకునేవారు తాము రోజూ తీసుకునే క్యాలరీలను బాగా తగ్గించుకుంటారు. ఇందుకోసం వాటర్థెరపీ, ఫ్రూట్థెరపీ, క్యారట్ థెరపీ, జీఎమ్ డైట్ వంటి అనేక ప్రక్రియలను ఫాలో అవుతుంటారు. ఈ డైట్ రెజీమ్‌లతో తమ ఆహారంలో తీసుకోవాల్సిన పిండిపదార్థాలను బాగా తగ్గించుకుంటారు. దీనివల్ల తాము బాగా బరువు తగ్గుతున్నామని అనుకుంటుంటారుగానీ... తాము తమ కండరాల పరిమాణాన్నీ (మజిల్ మాస్)ను / కండరాల శక్తినీ కూడా కోల్పోతున్నామని గుర్తించరు. కండరాలను కోల్పోతుంటే, దాంతోపాటు ఎముక సాంద్రత (బోన్ డెన్సిటీ) ని కూడా కోల్పోతున్నారని కూడా అర్థం. ఇదెంతో ప్రమాదం. ఆరోగ్యంగా సన్నబడాలంటే... మంచి సౌష్ఠవంతో కూడిన శరీరాకృతిని పొందాలంటే దహించాల్సినది కొవ్వులను మాత్రమే. మన దేహపు అవసరాలకు పనికి వచ్చాక మన పొట్ట చుట్టూ పేరుకుపోయి ‘సెంట్రల్ ఒబేసిటీ’ని కలిగించే కొవ్వులను మాత్రమే. తక్కువ పోషకాలతోనే మెటబాలిజమ్ జరిగేలా దేహానికి అలవాటు చేయడమూ సరికాదు... కొన్నిసార్లు సన్నబడాలనే తీవ్రమైన కోరికతో చాలా తక్కువ క్యాలరీలతోనే జీవక్రియలు కొనసాగేలా దేహానికి అలవాటు చేస్తే... అప్పుడు ఆ కొద్దిపాటి ఆహారంతోనే మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ నిర్వహించుకునే సామర్థ్యాన్ని దేహం పొందుతుంది. ఏళ్ల తరబడి అలా చేశాక కొద్దిపాటి అదనపు ఆహారం తీసుకున్నా అది శరీర బరువును విపరీతంగా పెంచేస్తుంటుంది. దీన్నే ‘రెసిస్టెంట్ ఒబేసిటీ’ అని అంటారు. ఈ రెసిస్టెంట్ ఒబేసిటీ వల్ల దీర్ఘకాలం పాటు చాలా చాలా అందంగా కనిపించిన హీరో, హీరోయిన్లు... కెరియర్‌కు దూరంగా ఉన్నప్పుడు కొద్ది వ్యవధిలోనే ఒకేసారి లావెక్కిపోయినట్లుగా కనిపించడం చాలామంది సెలబ్రిటీల్లో కనిపిస్తుంటుంది. కండరాలను కోల్పోకుండానే కొవ్వులను దహించడం ఎలా? సన్నబడి మంచి శరీరాకృతి (స్లిమ్ బాడీ) పొందాలంటే ప్రణాళికాబద్ధంగా కండరాలను (మజిల్ మాస్‌ను) కోల్పోకుండా, అదనపు కొవ్వులను మాత్రమే దహించే విధంగా, ఆరోగ్యకరంగా సన్నబడాలి. స్లిమ్‌గా ఉండాలంటూ భోజనాన్ని మానేస్తే ఒక్కోసారి అనొరెక్సియా నర్వోజా, బులీమియా లాంటి మానసిక సమస్యలూ రావచ్చు. అందుకే బాగా తింటూనే మంచి ఆరోగ్యం కోసం దేహానికి కాస్త కష్టం కలిగించే వ్యాయామాలు చేస్తుండాలి. అయితే అంతగా మంచి ఫిట్నెస్ లేనివారు మాత్రం దేహానికి విపరీతమైన శ్రమ కలిగించని విధంగా తేలికపాటి వ్యాయామం చేస్తూ... క్రమంగా ఫిట్నెస్ను సాధించాలి. ఆ తర్వాత స్టామినాను క్రమంగా పెంచుకుంటూపోవాలి. (చదవండి: పిల్లోలు.. పరుపు ఎలా ఉండాలంటే...) -
లావాటి చిరుతపులి..! బరువు తగ్గించడానికి నానా ప్రయత్నాలు!! చివరికీ..
చిరుతపులులు సాధారణంగా సన్నగా ఉంటాయి. పెద్దపులులు, సింహాలతో పోల్చుకుంటే, వీటి బరువు చాలా తక్కువగా ఉంటుంది. అందుకే అవి శరవేగంగా దూకి వేటాడగలవు. చిరుతపులుల సహజమైన తీరుకు భిన్నంగా చైనాలోని ఒక జూలో ఉన్న పదహారేళ్ల చిరుతపులి బాగా లావెక్కిపోయి, ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.ఈ చిరుత ఫొటోలు చూసి, ఇది చిరుతలా కనిపించడం లేదని, సముద్ర జంతువు సీల్లా ఉందని కొందరు వ్యాఖ్యలు చేశారు. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ పాంఝిహువా పార్క్ జూలో ఉన్న ఈ లావాటి చిరుత మిగిలిన చిరుతల్లా చురుగ్గా కాకుండా, మందకొడిగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఈ ఏడాది మార్చిలో వైరల్‌గా మారాయి.ఇది డిస్నీ కామిక్ సిరీస్‌లోని లావాటి పోలీసు పాత్ర ‘క్లాహాసర్’ను తలపిస్తోందంటూ కొందరు వెటకారం చేశారు. జంతుప్రేమికులు మాత్రం అడ్డగోలుగా లావెక్కిన ఈ చిరుత ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వెలిబుచ్చారు. సాధారణంగా చిరుతపులుల బరువు దాదాపు పాతిక నుంచి ముప్పయి కిలోల వరకు ఉంటుంది. ఈ చిరుత మాత్రం రెట్టింపు బరువు పెరిగింది.దీని గురించి ఆన్లైన్లో అలజడి మొదలవడంతో చైనా జూ అధికారులు వెంటనే రంగంలోకి దిగి, దీని బరువు తగ్గించడానికి నానా ప్రయత్నాలు ప్రారంభించారు. మేత తగ్గించడం, వ్యాయామాలు చేయించడానికి ప్రయత్నించడం సహా రెండు నెలలకుపైగా ఎన్ని తంటాలు పడినా ఈ చిరుత ఏమాత్రం బరువు తగ్గకపోవడంతో అధికారులు తమ ప్రయత్నాలను విరమించుకున్నారు.ఇవి చదవండి: కీకారణ్యంలో.. మాయన్ నగర శిథిలాలు! అక్కడేం జరిగిందంటే? -
నో ఫ్యాట్, నో షుగర్.. మార్కెట్లోకి ‘నీలకంఠ’ ఆలూ!
మనం పలు రకాల బంగాళ దుంపలను(ఆలూ) చూసేవుంటాం. అయితే ఇప్పుడు తాజాగా నీలకంఠ ఆలూను మార్కెట్లోకి విడుదల చేశారు. పేరుకు తగినట్టుగానే ఇది నీలి రంగు బంగాళాదుంప. షుగర్ పేషెంట్లు కూడా నిరభ్యంతరంగా దీనిని తినొచ్చని చెబుతున్నారు. ఈ నీలకంఠ బంగాళాదుంప రకాన్ని బీహార్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన రోహ్తాస్ అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్ అభివృద్ధి చేసింది. సాధారణ బంగాళదుంపతో పోలిస్తే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ బంగాళదుంపలో అనేక సుగుణాలు ఉన్నాయని రోహ్తాస్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రతన్ కుమార్ తెలిపారు. దీనిలో అతి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పైగా ఈ నీలకంఠ ఆలూలో చక్కెర చాలా తక్కువ శాతంలో ఉంటుంది. ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. తెల్ల బంగాళదుంపల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీంతో షుగర్ పేషెంట్లు తెల్ల బంగాళాదుంపలను తినవద్దని వైద్యులు సూచిస్తుంటారు. ఎవరైనా నీలకంఠ బంగాళాదుంపలను సాగు చేయాలనుకుంటే రోహ్తాస్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రం నుంచి విత్తనాలను ఆర్డర్ చేయవచ్చు. ఇతర విత్తనాలతో పోలిస్తే దీని విత్తనాలు కొంచెం ఖరీదైనవి. ఈ బంగాళదుంప వైరస్ రహితమని, ఈ బంగాళాదుంప మార్కెట్ విలువ అధికంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు తినడం మానేశారా? ఈ విషయాలు తెలిస్తే..
లావవుతామనే భయంతో చాలామంది కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాలను తినడం మానేస్తున్నారు. కొందరైతే నెయ్యి తినడం ఎప్పుడో మానేశారు. అయితే శరీరంలోని ఎ, డి, ఇ, కె విటమిన్లు కొవ్వులో మాత్రమే కరుగుతాయి. కాబట్టి తగిన పరిమాణంలో మంచి కొలెస్ట్రాల్ ఎంతో అవసరం. అలాగని అన్నిరకాల కొవ్వులూ ఆరోగ్యం కాదు. ఇంతకూ ఆరోగ్యకరమైన కొవ్వు లభించాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందామా? అవకాడో: మీరు ఆరోగ్యం పట్ల చాలా కాన్షియస్గా ఉండి..అధిక పరిమాణంలో కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉంటే తప్పకుండా ఈ అవకాడోను ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆలివ్ ఆయిల్: వేపుళ్లకు దూరంగా ఉండేవారు తప్పకుండా ఆహారాల్లో ఆలివ్ ఆయిల్‌ను తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు, మోనోశాచురేటెడ్ కొవ్వులు గుండెను ఆరోగ్యంగా చేసేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా శరీర బరువును నియంత్రించేందుకు కూడా సహాయపడతాయి. పెరుగు: బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకుంటే శరీరంలోని కొవ్వును సమతుల్యంగా చేస్తుంది. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా కొవ్వు పాలతో చేసిన పెరుగు తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ప్రేగును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. కొబ్బరి: కొబ్బరి లేదా కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో జీర్ణక్రియను మెరుగుపరిచే చాలా రకాల పోషకాలు దొరుకుతాయి. దీనివల్ల ట్రైగ్లిజరైడ్ ఫుడ్ సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా మలబద్ధకం, ఇతర పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. చేపలు: చేపలలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంపొందించే లక్షణాలున్నాయి. అందుకే ఇతర విధాలైన మాంసాహారాలకు దూరంగా ఉండమని హెచ్చరించే వైద్యులు సైతం పరిమితంగా అయినా చేపలు తీసుకోవచ్చునని చెబుతారు. బాదం పప్పు, జీడిపప్పు: వీటిని తీసుకోవడం వల్ల కొవ్వు పెరుగుతుందని అనుకుంటాం. అయితే వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు మాత్రమే ఉంటాయి. అందువల్ల బాదం, జీడిపప్పు తీసుకోవడం మంచిది. బాదం పప్పును నీటిలో నానబెట్టి, పైన పొట్టు తీసి తినడం మంచిది. జీడిపప్పును అయితే వేయించకుండా నేరుగా తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెంపొందుతుంది. నెయ్యి: ఇదివరకటిలో ఆహారంలో నేతిని బాగా ఉపయోగించేవారు. అరిసెలు, గారెలు వంటి వాటిని నేతితోనే చేసేవారు. అయితే రానురానూ నెయ్యి తినడం ఆరోగ్యానికి మంచిది కాదనే అభిప్రాయం స్థిరపడిపోయింది. నిజానికి నేతిలో శరీరానికి అవసరమైన పోషకాలెన్నో ఉన్నాయి. అలాగని ముద్ద ముద్దకీ నెయ్యి వేసుకోవడం, నేతితోనే చేసిన డీప్ ఫ్రైలు విపరీతంగా తీసుకోవడం మాత్రం అంత మంచిది కాదు. గేదె నెయ్యి కన్నా ఆవు నెయ్యి మంచిది. -
కొవ్వు ఇంజక్షన్లు: శరీరం కుళ్లిపోయి..వికృతంగా.. చావే మేలు అనుకున్నా.!
శరీరంలో కొవ్వును కరిగించుకునే ప్రక్రియలో అనేకమంది చాలా చేదు అనుభవాలున్నాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా కొవ్వును కరిగించే ఇంజెక్షన్లు తీసుకొని ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలన్న ఒక మహిళ కల పీడకలగా మిగిలిపోయింది. స్వయంగా శరీరాన్ని తినేసే అరుదైన బాక్టీరియాతో జీవన్మరణ పోరాటం చేస్తున్న మాజీ స్విమ్‌సూట్ మోడల్, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ గాథ ఒకటి వైరల్ అవుతోంది. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ బీట్రిజ్ అమ్మ ఫాట్‌ను కరిగించుకునే క్రమంలో లాస్ ఏంజెల్స్ లోని ఒక లగ్జరీ స్పాను సంప్రదించింది. విటమిన్ ఇంజెక్షన్లు భారీ తీసుకునేది. విటమిన్ బీ1, సీ మిశ్రమంగా "వేగంగా కరిగిపోయే" డియోక్సికోలిక్ యాసిడ్‌తో కలిపి 60 ఇంజక్షన్లు తీసుకుంది. చేతులు, పిరుదులు, కడుపులోకి వీటిని తీసుకుంది. దాదాపు 66వేల కంటే ఎక్కువే ఖర్చుపెట్టింది. కొవ్వు కరగడం సంగతి ఏమోగానీ ఇపుడు అరుదైన మైకోబాక్టీరియం అబ్సెసస్ అనే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకి నరక యాతన అనుభవిస్తోంది. ఇంజెక్షన్ తీసుకున్న ప్రతీ చోట భయంకరమైన పుండ్లతో భరించలేని భాధ పడుతోంది. దాదాపు మంకీ పాక్స్ లాంటి గాయాలతో ఆ బాక్టీరియా శరీరం మొత్తాన్ని తినేస్తోంది. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) డియోక్సికోలిక్ యాసిడ్ సరిగ్గా ఇంజెక్ట్ చేయకపోవడం వల్లే ఇది జరిగిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో బాక్టీరియా బారిన పడి కుళ్ళిపోయిన చర్మాన్ని తొలగించేందుకు పలు శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ప్రతీ రోజూ ఆరు గంటల ఇంట్రావీనస్ యాంటీ బయాటిక్స్‌ను భరిస్తోంది. (హెలికాప్టర్ నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ జనం) మంచానికే పరిమితమై ప్రాణం నిలుపుకునేందుకు ఆరాటపడుతోంది. ఒకరి సాయం లేకుండా రెస్ట్‌రూమ్‌కి వెళ్లలేక..కనీసం లేచి నిలబలేక ఇలా అన్నింటికి మరొకరి మీద ఆధారపడి బతుకేదాన్ని..శరీరం మంచం మీదే కుళ్ళిపోతోంది అంటూ తన అనుభవాన్ని పంచుకుంది బీట్రిజ్. అద్దంలో చూసుకున్న ప్రతిసారీ, జీవితంలో సాధించాలని కలగన్నదో, ఇపుడు ఏమి కోల్పోయిందో గుర్తు చేసుకుని బోరున విలపించింది. అటు వైద్యులు కూడా ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలనే కలను వదులుకోండి ఇది జీవితాంతం మిమ్మల్ని వదలదని తెగేసి చెప్పారు. అంతేకాదు ఇతరులను భయపెట్టకుండా బహిరంగ ప్రదేశాల్లో బికినీలు ధరించ వద్దని కూడా సలహా ఇచ్చారు. కానీ ఇక్కడే బీట్రీజ్ మాత్రం భిన్నంగా ఆలోచించింది. ఇక నా శరీరం పోరాడలేదు ఓడిపోయింది..ఇక చనిపోతాను అనుకున్న క్షణంలో ధైర్యాన్ని కూడ దీసుకుంది. మాంసాన్ని తినేసే వికృతమైన, భయంకరమైన ఈ బాక్టీరియా గురించి అవగాహన పెంచేందుకు తన శాయశక్తులా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే బాడీ పాజిటివిటీ మూవ్‌మెంట్‌ను మొదలు పెట్టింది. మన శరీరంలో ఎన్ని వైరుధ్యాలు, ప్రతికూలతలు, మచ్చలున్నా భయపడకుండా, ఆత్మన్యూనతతో దాచు కోకుండా శరీర ఆకృతితో సంబంధం లేకుండా అంతర్గతంగా, బాహ్యంగా అందంగా ఉండాలని పిలుపు నిస్తోంది. -
మడత పెట్టుకునేలా.. ఎలక్ట్రిక్ బైక్‌లు వచ్చేస్తున్నాయ్
-
గుండెకు చేటు తెచ్చే ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించుకోండి! లేదంటే..
ట్రైగ్లిజరైడ్స్ అన్నవి కొలెస్ట్రాల్‌లాగానే రక్తంలోని ఒక రకం కొవ్వులని చెప్పవచ్చు. ఇవి ఉండాల్సిన మోతాదు పెరిగితే ఆ కండిషన్‌ను ‘హైపర్ట్రైగ్లిజరైడెమియా’ అంటారు. వీటి మోతాదులు పెరగడం గుండె జబ్బులకు దారితీయవచ్చు. ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు రక్తంలో ట్రైగ్లిజరైడ్ మోతాదులు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఉన్నప్పుడు జీవనశైలిలో మార్పులు తప్పనిసరిగా పాటించాలి. బరువు ఎక్కువగా ఉన్నవారు దాన్ని అదుపు చేసుకునేలా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అంటే తీసుకునే క్యాలరీల (క్యాలరీ ఇన్‌టేక్)ను తగ్గించుకోవాలి. ఆహారంలో కొవ్వుల్ని... అంటే శాచ్యురేటెడ్ ఫ్యాట్‌ను, కొలెస్ట్రాల్ మోతాదులను బాగా తగ్గించాలి. ఉదాహరణకు... నెయ్యి, వెన్న, వూంసాహారం (రొయ్యలు, చికెన్ స్కిన్), వేపుళ్లను బాగా తగ్గించాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్‌లో పీచు ఎక్కువగా ఉంటుంది. అవి ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించడంలో బాగా తోడ్పడతాయి. వాటితో పాటు వెజిటబుల్ సలాడ్స్, తేలిగ్గా ఉడికించిన కాయగూరలు తీసుకోవడమూ మంచిదే. స్వీట్స్, బేకరీ ఐటమ్స్ బాగా తగ్గించాలి. పొట్టు తీయని ధాన్యాలు (అంటే... దంపుడు బియ్యం, మెుక్కజొన్న, పొట్టుతీయని రాగులు, గోధువులు, ఓట్స్), పొట్టుతీయని పప్పుధాన్యాలు, మొలకెత్తిన గింజలు (స్ప్రోట్స్) తీసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రవు / వాకింగ్ వంటి వ్యాయావూలు చేయాలి. కొవ్వులు ఎక్కువగా ఉండే రెడ్మీట్ను పూర్తిగా మానేయాలి. అయితే మాంసాహారాన్ని ఇష్టపడే వారు వారంలో వుూడుసార్లు చేపలు తీసుకోవచ్చు. అది కూడా కేవలం ఉడికించి వండినవీ, గ్రిల్డ్ ఫిష్ వూత్రమే తీసుకోవాలి. డీప్ ఫ్రై చేసినవి తీసుకోకూడదు∙ పొగతాగే అలవాటునూ, ఆల్కహాల్‌ను పూర్తిగా వూనేయాలి. (చదవండి: రక్తంలో ట్రైగ్జిజరైడ్స్‌ను తగ్గించుకోవాలంటే..ఇలా చేయండి!) -
పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్!
సాక్షి, హైదరాబాద్: ఫ్యాటీ లివర్..చిన్నారుల్లో సైతం ప్రబలుతున్న ఓ వ్యాధి. పిల్లల కాలేయాలను కమ్ముకుంటున్న ఫ్యాటీ లివర్ వ్యాధిపై నిర్లక్ష్యం వహిస్తే వారి భవిష్యత్తును చేజేతులా రోగాలకు అప్పగించినట్లు అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బొద్దుగా ముద్దుగా మెరిసిపోతూ మడత నలగని దుస్తుల్లో పాఠశాలలకెళ్లొచ్చే చిన్నారుల్ని చూసి మురిసిపోవడం మాత్రమే కాదు వారి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండటం ముఖ్యమని అంటున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన ఓ అధ్యయనం చిన్నారుల్లో ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతోందని వెల్లడించడం ఆందోళన కలిగించే అంశం. పెద్దల్లోనే కాదు.. హైదరాబాద్‌కు చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ల బృందం నగరంలోని ఐదు ఉన్నత పాఠశాలల్లో అధ్యయనం నిర్వహించింది. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్ఎఎఫ్ఎల్డీ)తో బాధపడుతున్న పిల్లల సంఖ్య గణనీయంగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో బయటపడింది. సాధారణంగా పెద్దలే ఈ వ్యాధి బాధితులుగా ఉంటారని ఇప్పటిదాకా ఉన్న అభిప్రాయం తప్పని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. ఏమిటీ ఫ్యాటీ లివర్? కాలేయం (లివర్)లో అధిక మొత్తంలో కొవ్వు (ఫ్యాట్) పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ఈ వ్యాధి (స్టీటోసిస్) చాలావరకు పెద్దల్లో ఉంటుంది. అయితే ఆరోగ్యవంతమైన లివర్‌లోనూ స్వల్పంగా కొవ్వు ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన లివర్ బరువులో 5 నుంచి 10 శాతం మధ్యకు కొవ్వుపెరుగుతుందో అప్పుడది సమస్యగా మారుతుంది. ఆహారం.. వ్యాధుల భారం సోడా, చాక్లెట్లు నూడుల్స్, బిస్కెట్లు వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు వీరు ఎక్కువగా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ‘గతంలో ఈ పరిస్థితి ఎక్కువగా యూరప్‌లో కనిపించేది. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా ఏర్పడింది. పిల్లలు తినే జంక్ ఫుడ్ చాలావరకు దీనికి కారణమవుతోంది..‘అని వైద్యులు అంటున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ అధ్యయనం కూడా చిన్నారులతో సహా 30 శాతం మందిలో ఈ వ్యాధి విస్తృతి ఉన్నట్లు తాజాగా గుర్తించింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఇది తక్కువగా ఉన్నట్లు తేల్చింది. ‘ఆట స్థలాలు లేక పాఠశాలల పిల్లల్లో ఊబకాయం, ఫ్యాటీ లివర్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.రవాణా సౌకర్యాలు కూడా నడకను తగ్గించి వారిలో ఊబకాయానికి ఊతమిస్తున్నాయి..‘అని ఉస్మానియా ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ సీహెచ్ మధుసూదన్ అంటున్నారు. ‘సంపన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారని అధ్యయనాల్లో కనుగొన్నాం. అయితే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఇది తక్కువ..‘అని ఏఐజీ బృందంలోని ఓ వైద్యుడు చెప్పారు. జంక్ ఫుడ్‌పై అవగాహన పెంచాలి చిన్నపిల్లల ఆహారంలో చిప్స్, బర్గర్స్, పేస్ట్రీలు, కూల్ డ్రింక్స్ వంటివి భాగం కాకుండా చూడాలి. వీటివల్ల శరీరంలోని బాక్టీరియా మారిపోయి ఫ్యాటీ లివర్‌కు కారణమవుతుంది. అందువల్ల జంక్ ఫుడ్ చేసే చేటుపై కూడా చిన్నారుల్లో అవగాహన పెంచాలి. కూరగాయలు, పెరుగు మంచివనే చిన్న చిన్న విషయాలు తరచు చెబుతుండాలి. సన్నగా ఉండే చిన్నారుల్లోనూ ఫ్యాటీ లివర్ ఉండొచ్చు. కాబట్టి సన్నగా ఉన్నంత మాత్రాన జంక్ ఫుడ్ తినమని చెప్పకూడదు. – డా.నాగేశ్వర్‌రెడ్డి, చైర్మన్, ఏఐజీ ఆసుపత్రి -
ఇలా చేస్తే శరీరంలో ఉన్న కొవ్వును ఈజీగా తగ్గించుకోవచ్చు!
ఇటీవల కాలంలో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని చేసే ఉద్యోగాలే ఎక్కువయ్యాయి. దీంతో అధిక బరువు పెరగడమే గాక ఒంట్లో కొవ్వు పేరుకుపోతుంది. సరైన వ్యాయామం, పౌష్టికాహారం లేకపోవడంతో శరీరంలో తొడలు,పిరుదులు, చేతులు భాగంలో కొవ్వు పెరిగిపోయి చూసేందుకు కూడా అసహ్యంగా ఉంటాయి. దీన్ని తగ్గించుకోవాలంటే మంచి డైట్ ఫాలో అవ్వుతూ..శరీరానికి తగినంత వ్యాయామం చేయాలి. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఇవన్నీ పాటించాలంటే అసాధ్యం. అందుకని ఈ ఆహార పదార్థాలను రోజువారి ఆహరంలో భాగం చేసుకుంటే సులభంగా కొవ్వు తగ్గించుకోవడమే కాదు బరువు కూడా తగ్గిపోతారు. కొవ్వుని కరిగించుకోవాలనుకుంటే తీసుకోవాలసినవి.. సెనగలు ఇవి స్నాక్స్ రూపంలో తీసుకుంటే ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, పోటాషియం, మాంగనీస్, ఫైబర్ వంటవి శరీరాని అందడమే గాక కొవ్వుని ఈజీగా బర్న్ చేస్తుంది. క్వినోవా డైట్ ప్లాన్‌లో భాగంగా దీన్ని తీసుకుంటే రోజంతా నిండుగా ఉన్న ఫీలింగ్ ఉండి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోరు. ఇక ఇందులో గ్లూటెన్ ఉండదు.. గ్లూటెన్ పడని వారికి క్వినోవా బెస్ట్ ఆప్షన్. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, సీలియాక్ డిసీజ్ లాంటి సమస్యలు ఉన్నవారికి క్వినోవా తీసుకోవచ్చు. క్వినోవా తీసుకుంటే.. శరీరానికి కావలసిన ప్రోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం పుష్కలంగా అందుతుంది. బాదం పప్పులు వ్యాయామానికి ముందు బాదంపప్పు తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్లు పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి ఈ గింజల్లో అధిక మొత్తంలో అమినో యాసిడ్ ఎల్-అర్జినైన్ ఉండటం వల్ల కొవ్వు కరుగుతుంది. బాదం పప్పులు వ్యాయామానికి ముందు బాదంపప్పు తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్లు పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి ఈ గింజల్లో అధిక మొత్తంలో అమినో యాసిడ్ ఎల్-అర్జినైన్ ఉండటం వల్ల కొవ్వు కరుగుతుంది. టోఫు: ఇది తక్కువ క్యాలరీలు, అధిక ప్రోటీన్ కలిగిన శాఖాహారం. దీనిలో కొలెస్ట్రాల్ కూడా ఉండదు. తద్వారా బరువు ఈజీగా తగ్గొచ్చు. అలాగే ఆడవారి ఆరోగ్యానికి ఇది పలు విధాల మేలు కలుగుతుంది. టోఫులోని ఐసోఫ్లేవోన్లు అనే పోషకాలను ఫైటో ఈస్ట్రోజెన్లుగా చెప్తారు. అంటే ఇవి ఈస్ట్రోజెన్ హార్మోన్లా పని చేస్తాయి. కాబట్టి నెలసరి క్రమాన్ని సరిచేసే, పీరియడ్స్ మంటను తగ్గించే గుణాలు ఇందులో ఉంటాయి. బ్రకోలీ: దీనిలో మాంసకృత్తులు, ఫైబర్, విటమిన్లు కే, సీ సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ బరువు తగ్గడంలో సహాయపడతాయి. మొలకలు వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. రెగ్యులర్ వ్యాయామం తోపాటు మొలకలు తీసుకోవడం వల్ల పొత్తికడుపులో ఉండే కొవ్వు తగ్గుతుంది. (చదవండి: ఖననం చేసే సమయంలో..శవపేటిక నుంచి శబ్దం అంతే..) -
కొవ్వు ఎందుకు పెరుగుతుంది? తగ్గించాలంటే ఏమి చేయాలి?
మానవ శరీరంలో కొవ్వు కణాలను ఆడిపోసైట్స్ అంటారు. కొవ్వు కణాల సంఖ్య, బాల్యం , టీనేజ్ లో నిర్ధారణ అయిపోతుంది . అటుపై ఆ కణాల సంఖ్య పెరగదు .. తగ్గదు. కొవ్వు కణాలు తమ ఒరిజినల్ సైజు కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ పెరుగగలవు. అంటే ఊబకాయం ఉన్నవారిలో కొవ్వుకణాలు ఎక్కువగా వుండవు ; పెద్దవిగా ఉంటాయి . ఒక వ్యక్తి వ్యాయామం చేసి కండలు పెంచాడు . మరో వ్యక్తి బాగా తిని కొవ్వు పెంచాడు . అప్పుడు సైజు లో తేడా ఎలా ఉంటుంది ? ఒక కిలో కండ కన్నా, ఒక కిలో కొవ్వు అయిదు రెట్లు భారీగా ఉంటుంది. కండలు పెంచిన వారెవరూ భారీగా వుండరు . కొంత మంది కండలు, కొవ్వు రెండూ పెంచుతారు. అంటే.. విపరీతంగా తినడం అలాగే వీపరీతంగా వర్కవుట్ చేయడం. ఇలాంటి వారు కనిపించడానికి భారీగా వుంటారు. కేవలం కొవ్వు పెంచిన వారు మాత్రం దూది కొండలా వుంటారు. పురుషుల్లో కొవ్వు ఎక్కువగా కడుపు భాగంలో, స్త్రీలలో తుంటి, తొడలపై నిలువ ఉంటుంది. పశ్చిమ దేశాలలో ఎక్కువగా శ్వేత జాతి ప్రజలుంటారు, వారిలో అధిక తిండి తినే వారికి ఒళ్ళంతా కొవ్వే. అంటే అధిక కొవ్వు చర్మం కింద ఉంటుంది. దాంతో పాటు ఒళ్ళంతా కొవ్వు నిల్వ ఉంటుంది. అందుకే అమెరికన్లలో ఊబకాయం ఎక్కువ. ఊబ కాయస్థుల సంఖ్య కూడా ఎక్కువ. అదే భారతీయుల్లో కొవ్వు ఎక్కువగా ఉదరభాగంలో అంతకు మించి గుండె లాంటి అవయవాల చుట్టూరా పేరుకొని పోతుంది. దీన్ని విసెరల్ ఫాట్ అంటారు . ఇది ప్రమాదకరం. గుండెపోట్లకు దారి తీస్తుంది. వ్యాయామం లేకుండా కేవలం క్రాష్ డైట్ తో బరువు తగ్గించాలనుకొనే వారి కండరాలు బలహీనం అవుతాయి. ఇది మెటబాలిజం (జీవన చర్యలు) వేగాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందువల్లే అలాంటి వారు కొన్నాళ్ల పాటు డైట్ నియమాలు పాటించి, అవి మానేసాక సులభంగా బరువు పెరిగిపోతారు. అనేక మంది హీరోయిన్ ల విషయం లో ఇదే జరుగుతోంది. బరువు తగ్గాలంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ చేయడం అవసరం. ఇలాంటి శిక్షణ వల్ల గుండె కూడా దృఢం అవుతుంది. శరీరం లో ఒక భాగం లో కొవ్వు ఎక్కువ ఉందనుకొందాము. ఉదాహరణకు పొట్ట భాగంలో. నూటికి తొంబై మంది ఏమనుకొంటారంటే "పొట్ట కు సంబదించిన వర్కౌట్స్ చేస్తే ఆ భాగం లోని కొవ్వు కరిగి పోతుంది". కానీ ఇలా ఒక భాగానికి సంబంధించిన వర్కౌట్ చేస్తే ఆ భాగం లోని కొవ్వు కరగడం అంటూ ఉండదు. ఎప్పుడయితే వ్యాయామం ప్రారంభించామో ఒక పద్దతిలో శరీరం మొత్తం లోని కొవ్వు కరిగిస్తూ వస్తుంది. ఏ విధంగానయితే కొవ్వు కొద్దికొద్దిగా పెరుగుతుందో.. అదే విధంగా వ్యాయామం చేస్తున్న కొద్ది రివర్స్‌లో తగ్గుతూ వస్తుంది. కేవలం ఒక భాగంలోనే కొవ్వు హఠాత్తుగా తగ్గడం అంటూ ఉండదు. శరీరానికి తక్షణ శక్తి ఇవ్వడానికి కార్బోహైడ్రేట్స్ కావాలి . శక్తి అవసరంలో యాబై శాతం మాత్రం కార్బ్స్ ద్వారా తీర్చాలి. కానీ మన సమాజం లో నూటికి తొంబై మంది ... 90 శాతం దాక శక్తి అవసరాలను కార్బ్స్ ద్వారా తీరుస్తున్నారు. ఇలా అధిక పిండి పదార్థాలు తినడం ఒక రకమైన అడిక్షన్ (వ్యసనం). కార్బ్స్ అంటే జంక్ ఫుడ్. మైదా పిండితో చేసే వస్తువులు, పిజ్జాలు, బర్గర్లు, సాఫ్ట్ డ్రింక్స్, చాకోలేట్స్, కుకీలు, బ్రెడ్ ఇలా నోటికి రుచికరంగా ఉండే ఏవైనా వీటికిందకే వస్తాయి. తాగుబోతును మద్యం మానమంటే ఆ వ్యక్తికి కోపం వచ్చినట్టే ఈ అధిక పిండిపదార్థాలు తీసుకునే వ్యసన పరులకు అవి తినొద్దని చెబితే నచ్చదు. పైగా కోపం కూడా వస్తుంది. తాగుబోతు కనీసం తాను చేస్తున్నది తప్పు అని ఒప్పుకొంటాడు. కానీ అధిక కార్బ్స్ పోతులు తాము వ్యసనపరులు అని కూడా గ్రహించరు. పాపం. వాసిరెడ్డి అమర్నాథ్, విద్యావేత్త, మానసిక పరిశోధకులు -
నీరసంగా అనిపిస్తోందా..? ఇవి లాగించండి, తక్షణమే శక్తి వస్తుంది..!
కొన్ని సార్లు వీపరీతంగా ఆకలి అనిపిస్తుంది. తక్షణం శక్తి కావాలనిపిస్తుంది. తినగానే వెంటనే శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు ఏవి? ఆహారంలో ఏ ఏ రకాలు ఉంటాయి? ఏవి తింటే మంచిది? వాటి గురించి తెలుసుకోండి. కార్బోహైడ్రేట్లు: కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తి రావడానికి ప్రాథమిక మూలం. పండ్లు, కూరగాయలు, రొట్టె, పాస్తా మరియు అన్నం వంటి ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల వీలైనంత త్వరగా శక్తిని పొందవచ్చు. ప్రోటీన్లు: శరీర కణజాలాల పెరుగుదల మరియు మరమ్మత్తులకు ప్రోటీన్లు చాలా అవసరం. గుడ్లు, గింజలు, చీజ్ మరియు లీన్ మీట్ వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తినడం వల్ల స్థిరమైన శక్తిని శరీరానికి లభించవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు: గింజలు, అవకాడోలు మరియు చేపలలో లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు దీర్ఘకాల శక్తిని అందిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది కూడా. కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలు: కాఫీ, టీ మరియు చాక్లెట్ వంటి కెఫీన్ కలిగిన ఆహారాలు మరియు పానీయాలు కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా తాత్కాలిక శక్తిని అందిస్తాయి. అయితే ఇవి ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తాయన్న ఆలోచనను బట్టి అవసరమైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు: కణాలకు ఆక్సిజన్‌ను చేరవేసే హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయడానికి శరీరానికి ఐరన్ అవసరం. బచ్చలికూర, కాయధాన్యాలు, రెడ్ మీట్ మరియు టోఫు వంటి ఇనుము అధికంగా ఉండే ఆహారాలు అలసటను నివారించడంలో మరియు శక్తిని అందించడంలో సహాయపడతాయి. ఈ ఆహారాలు తక్షణ శక్తిని అందించగలవని గమనించడం ముఖ్యం. శక్తి స్థాయిలను నిర్వహించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం వివిధ రకాల పోషకాలను కలిగి ఉన్న సమతుల్య ఆహారాన్ని తినడం మాత్రమే. అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, జంక్ ఫుడ్ లాంటివి వీలైనంత వరకు తినకూడదు. దీని వల్ల చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. -డా.నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
ఒంట్లో కొవ్వెక్కడున్నా కనిపెట్టే సూపర్ గాడ్జెట్!
ఒంట్లోని కొవ్వు చాలా నిశ్శబ్దంగా పెరుగుతూ పోతుంది. బరువు పెరిగి, దుస్తులు బిగుతైనప్పుడు గాని ఒంట్లోని కొవ్వు కథ అర్థం కాదు. ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల తలెత్తే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. కాబట్టి ఒంట్లోని కొవ్వు పేరుకుపోతున్న సంగతిని ముందుగానే గుర్తించి, కరిగించుకునే చర్యలు త్వరగా మొదలుపెడితే తప్ప ఫలితం ఉండదు. మరి ఒంట్లో పేరుకుపోతున్న కొవ్వును ముందుగానే గుర్తించడం ఎలా అనుకుంటున్నారా? ఈ ఫొటోలో కనిపిస్తున్న బుల్లి పరికరాన్ని చూశారుగా! ఇది చేతిలో ఉంటే చాలు, ఒంట్లో కొవ్వు ఎక్కడ పేరుకున్నా, ఇట్టే కనిపెట్టేస్తుంది. ఈ పరికరం పేరు ‘బెల్లో’. ఇది ‘డిస్క్రీట్ మల్టీ వేవ్‌లెంగ్త్ నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ’ సాంకేతికతతో పనిచేస్తుంది. దీన్ని స్విచాన్ చేసుకుని, ఒంట్లో కొవ్వు పెరిగిందనుకునే భాగాల వద్ద ఉంచి, స్కాన్ బటన్ నొక్కితే చాలు, మూడు నిమిషాల్లోనే యాప్ ద్వారా మొబైల్ ఫోన్‌కు సమాచారాన్ని చేరవేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘ఆలివ్ హెల్త్‌కేర్’ దీనిని రూపొందించింది. దీని ధర 189 డాలర్లు (రూ.15,427) మాత్రమే! -
ఇదెక్కడి చోద్యం: భార్య లావైపోయిందని విడాకులు కోరిన భర్త!
లక్నో: పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సన్నగా, నాజూగ్గా ఉండాలని కోరుకుంటారు యువకులు. కొందరు అనుకున్నట్లుగానే సన్నగా, అందంగా ఉండే అమ్మాయినే వివాహం చేసుకుంటారు. కానీ, పెళ్లయ్యాక లావెక్కితే ఏంటి పరిస్థితి అనే ఆలోచన చేయరు. ఈ కోవకే చెందిన ఓ వ్యక్తి.. పెళ్లయ్యాక తన భార్య లావైపోయిందని ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. తనకు విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ ప్రాంతంలో వెలుగు చూసింది. తాను లావైపోయాననే కారణంగా తన భర్త సల్మాన్ ఇంట్లోంచి వెళ్లగొట్టాడని తెలిపింది బాధితురాలు నజ్మా. మీరట్‌లోని జకిర్ కాలనీకి చెందిన నజ్మాకు ఎనిమిదేళ్ల క్రితం ఫతేపుర్‌కు చెందిన సల్మాన్‌తో వివాహం జరిగింది. వారికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే, పెళ్లి తర్వాత నజ్మా బరువు పెరిగింది. దీంతో ఆమెను రోజు లావైపోయావని, నీలా ఎవరు బతకరంటూ భర్త వేధిస్తుండేవాడు. ‘నేను బరువు పెరిగిన కారణంగా నాతో జీవించాలని అనుకోవట్లేదని నా భర్త చెప్పాడు. విడాకుల పత్రాలు పంపించాడు. కానీ, నాకు అతనితోనే జీవించాలని ఉంది. విడాకులు వద్దు.’ అని వాపోయింది నజ్మా. డైవర్స్ పేపర్స్ పంపించిన తర్వాత తనకు న్యాయం చేయాలని లిసారి గేట్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది బాధితురాలు నజ్మా. అయితే, ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు తెలపటం గమనార్హం. తమకు సమాచారం అందితే.. దర్యాప్తు చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామన్నారు కొత్వాలి మీరట్ సీఐ అరవింద్ చౌరాసియా. ఇదీ చదవండి: వైఫ్ అంటే వాడుకుని వదిలేసే వస్తువు కాదు.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు -
Health Tips: పచ్చళ్లు అతిగా తింటే అనర్థమే! ముఖ్యంగా పురుషులకు..!
What Happens If We Eat Pickles Everyday: వేడి వేడి అన్నంలో ఎర్రెర్రగా ఇంత ఆవకాయో, మాగాయో, ఇతర ఊరగాయ పచ్చళ్లో రోటిపచ్చళ్లో వేసుకుని తింటే వచ్చే రుచే వేరు. అందుకే అందరూ పచ్చళ్లకోసం నాలుక తెంపుకుంటూ ఉంటారు. అయితే రుచిగా ఉందని పచ్చడే పరమాన్నంలా రోజూ తింటూ ఉంటే ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులోనూ మహిళల కంటే మగవాళ్లకు ఈ ముప్పు మరికాస్త ఎక్కువ ఉంటుందంటున్నారు. ఇంతకూ ఆ ముప్పు ఎందుకో, ఏమిటో చూద్దాం... తక్కువగా తినండి! నవకాయ పిండి వంటలు చేసి నిండుగా విస్తరిలో వడ్డించినా పచ్చడికోసం వెతుక్కోవడం తెలుగు వారి స్వభావం. అన్నంలోనే కాదు, వేడివేడి ఉప్మా, దోసె, వడ, ఇడ్లీ.. ఇలా ఒకటేమిటి ప్రతిదానినీ పచ్చడితో లాగిస్తుంటారు. పచ్చళ్లు అతిగా తింటే అనర్థాలూ ఎక్కువేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేమిటో తెలుసుకుందాం... పచ్చళ్లను తక్కువగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. బీపీ అమాంతం పెరిగితే! పచ్చళ్లు ఎక్కువగా తినడం వల్ల అవి నిల్వ ఉండటం కోసం వేసే ఉప్పు వల్ల ముప్పు పొంచి ఉంటుంది. బీపి ఉన్న వారికి అమాంతం పెరిగిపోతే, ఇంతవరకూ ఆ సమస్యే లేని వారికి అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. ప్రిజర్వేటివ్స్ వల్ల హైపర్ టెన్షన్ రోగులకు కూడా ప్రమాదకరమే. ముఖ్యంగా మార్కెట్లో కొనుగోలు చేసే పచ్చళ్లలో ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అదేవిధంగా పచ్చళ్లు ఎక్కువగా తింటే కడుపులో పుళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. పొట్టలో, పేగుల్లో పొంచి ఉండే కొవ్వు.. గుండెజబ్బులు మార్కెట్లో విక్రయించే పచ్చళ్లకు రుచి కోసం నూనె, మసాలా ఎక్కువగా వాడుతారు. ఇవి ఆరోగ్యానికి హాని చేకూరుస్తాయి. ఎక్కువ ఆయిల్ తీసుకోవడం వల్ల.. మసాలాల కారణంగా.. పైల్స్ వచ్చే ప్రమాదం ఉంది. వాటితోపాటు కొలెస్ట్రాల్ వంటి ఇతర అనారోగ్య సమస్యలూ తలెత్తుతాయి. తద్వారా గుండెజబ్బులు కాచుకుని ఉంటాయి. అందువల్ల పచ్చడి అంటే ఎంత ఇష్టం ఉన్నా, పరిమితంగానే పుచ్చుకోవడం మంచిది. మరీ తినాలనిపిస్తే సాధ్యమైనంతవరకూ ఇంట్లో చేసిన పచ్చళ్లను.. అది కూడా నూనె, ఉప్పు, కారం తక్కువ పాళ్లలో కలిపిన వాటిని... అదీ కొద్ది కొద్దిగానే తీసుకోవడం మంచిది. చదవండి: Pachi Batani Health Benefits: పురుషులు పచ్చి బఠానీలు ఎక్కువగా తిన్నారంటే.. Potassium Deficiency Symptoms: పొటాషియం లోపిస్తే జరిగేది ఇదే! వీటిని తింటే మేలు.. -
పొటాటోతో ఫ్యాటీ బాడీకి చెక్ చెప్పొచ్చా?
ఆలూ ఫ్రై, ఆలూ సమోసా, ఆలూ పరాటా, ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్, ఆలూ టిక్కీ.. వింటూ ఉంటేనే నోరు ఊరుతోంది కదా. కానీ వెయిట్ లాస్ అవ్వాలి అనగానే మనం ముందుగా ఎవాయిడ్ చేసే దుంపకూర బంగాళా దుంప. ఆలూ అంటే చాలు అమ్మో ఫ్యాట్ అని భయపడిపోతాం. మరి బంగాళాదుంప తింటే నిజంగా బరువు పెరుగుతామా? పొటాటో లేదా బంగాళా దుంపల్లో ఉండే కార్బోహైడ్రేట్స్, ఫైబర్ మన బాడీకి శక్తినిస్తాయా? అసలు బరువు తగ్గించడంలో ఆలూ ఎలా సహాయపడుతుంతో తెలుసా? ఆలు గడ్డ అని లేదా ఉర్ల గడ్డ.. ఏ పేరుతో పిలిచినా దీనికి పెద్ద చరిత్రే ఉంది. బంగాళా దుంపలు అధిక కొవ్వు పదార్ధాలుంటాయని అవి తింటే ఊబయానికి దారితీస్తుందనే అపోహలు చాలా ఉన్నాయి. కానీ, ఇందులో ఉండే కొవ్వు పదార్ధాలు వాస్తవానికి ఆరోగ్యకరమైనవి, మన బాడీకి చాలా అవసరం కూడా. కొవ్వు పదార్దాలే కాకుండా, విటమిన్ సి, విటమిన్ బీ6, పొటాషియం నిల్వలుఇతర ఖనిజ లవణాలు కూడా అధికంగా ఉంటాయి. అంతేకాదు థయామిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ కూడా లభిస్తాయి. కార్టినాయిడ్స్, పాలీఫినాల్స్ వంటి ఫైటో రసాయనాలు కూడా ఉన్నాయి. అయితే ఆలూలోని పోషక పదార్ధాల వినియోగం దానిని ఎలా తిన్నాం అనేదానిపై ఆధారపడి ఉంటుంది. నిజం ఏమిటంటే బంగాళాదుంపను సరైన పద్ధతిలో తింటే అంత చెడ్డది కాదని డైటీషియన్స్ చెబుతున్నారు. బంగాళాదుంపలు కొవ్వు పెరుగుదలకు కారణం కాకపోగా బరువు తగ్గడానికి సాయపడుతుంది. ముఖ్యంగా ఒబెసిటీతో బాధపడుతున్న పిల్లలకిచ్చే ఆహారంలో ఆలూ ఉండేలా చూసుకోవడం మంచిది. దీంతో వారు రోజంతా చురుకుగా ఉంటారు. వీటిల్లో ఉండే మంచి కార్బొహైడ్రేట్లు శరీరానికి సరిపడా శక్తిని సమకూర్చడంలో సహాయం చేస్తాయి. వీటిని ముక్కలుగా కోసి, బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు అవెన్‌లో బేక్ చేసుకొని తినాలి. ఎటువంటి మసాలాలు లేకుండా ఆలివ్ నూనె, చిటికెడు ఉప్పు యాడ్ చేసిన వేడిగా తీసుకోవచ్చు. దీంతోపాటు వాటర్ ఎక్కువగా తీసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. ఽ అలాగే ఉడికించిన బంగాళాదుంపలకు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి మాష్ చేసి బేక్ చేసుకొని, లేదా పచ్చి వాసన పోయేదాకా కొద్దిగా వేయించి తీసుకుంటేమంచి ఫలితం ఉంటుంది. అల్లం, వెల్లుల్లుకి ఉన్న అధిక కొవ్వును కరిగించే లక్షణం శరీర అధిక బరువును నియంత్రిస్తుంది. పద్ధతి ప్రకారం తీసుకుంటే నడుము, తొడలు, చేతుల చుట్టూ చేరిన అధిక కొవ్వు తగ్గుతుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పాలీఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు షుగర్‌ను అదుపులో ఉంచుతాయట. బంగాళా దుంపల్లో ఉండే డైల్యూటెడ్ ఫైబర్, మంచి కార్బోహైడ్రేట్లు ఆకలిని అదుపుచేస్తాయి. దీంతోపాటు పొటాటోలో ప్రోటీజ్ ఇన్హిబిటర్స్-2లో సమృద్ధిగా లభిస్తాయని, ఇవి కొలిసిస్టోకినిన్ అనే హార్మోన్లు కడుపునిండిన అనుభూతినిస్తుందని పోషకాహార నిపుణులు చెపుతున్నారు. తద్వారా శరీరానికి ఎక్కువ కేలరీలు అందడాన్ని నిరోధించి, అదనపు కొవ్వు రాకుండా ఉంటుందన్న మాట. అలాగే బంగాళాదుంపలలో నీటి నిల్వలు మన బాడీ డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడతాయి. సో..బరువు తగ్గాలని భావించేవారు, ఫైబర్ నిల్వలు ఉన్న ఆలూ లాంటి వాటిని ఎంచుకోవడం మంచిది. ఆహార నియమాలతోపాటు, ఆరోగ్యకర జీవన శైలి, క్రమం తప్పని వ్యాయామం, ధూమపానం మద్యపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండటం బరువును తగ్గించుకోవడంలో కీలక పాత్ర వహిస్తాయనేది మర్చిపోకూడదు. -
Pista Pappu: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల..
పిస్తా పప్పు.. చూడగానే నోరూరిపోతుంది! చటుక్కున రెండు పప్పులు తీసుకుని నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. చాలా మంది రోజూవారీ డైట్లో తప్పక దర్శనమిస్తుంది ఈ పిస్తా. ఈ అలవాటు మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి.. పిస్తా కేవలం రుచికి మాత్రమే కాదు... మంచి బలవర్ధకమైన ఆహారం కూడా. కొంచెం తిన్నా చాలు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. అదే సమయంలో మనకు కావాల్సిన శక్తి లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సాగవుతోన్న ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌లో పిస్తా కూడా ఒకటి. మరో విషయం.. పిస్తా, కాజూ ఒకే జాతికి చెందినవి. పిస్తా పప్పులో ఉండే పోషకాలు: ►పిస్తా పప్పులో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు ఉంటాయి. ►పిస్తాలో పీచు పదార్థాలు, మాంసకృత్తులు కూడా ఎక్కువే. ►ఇక పిస్తాలో లభించే విటమిన్లు.... విటమిన్ బి6, సి, ఇ. ►పిస్తాలో పొటాషియం చాలా ఎక్కువ. ►ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాపర్ క్యాల్షియం లాంటి ఖనిజ లవణాలు కూడా మెండుగా ఉంటాయి. ►ఇతర డ్రై ఫ్రూట్స్‌తో పోలిస్తే... పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఒక ఔన్సు అంటే (28 గ్రాములు) సుమారు 49 పిస్తా పప్పుల్లో ఉంటే పోషకాలు.. కాలరీలు: 159 కార్బోహైడ్రేట్లు: 8 గ్రా. ఫైబర్: 3 గ్రా. ప్రొటిన్: 6 గ్రా. ఫ్యాట్: 13 గ్రా.(90 శాతం అనుశాటురేటెడ్ ఫ్యాట్స్) పొటాషియం: 6 శాతం ఫాస్పరస్: 11 శాతం విటమిన్ బీ6: 28 శాతం థయామిన్: 21 శాతం మెగ్నీషియం: 15 శాతం. చదవండి: Goru Chikkudu Kaya Benefits: షుగర్ పేషెంట్లు గోరు చిక్కుడు కూర తింటే... ఇందులోని ఆ గుణాల వల్ల... పిస్తా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: ►డ్రై ఫ్రూట్స్ అన్నింట్లోకెల్లా పిస్తాలో క్యాలరీలు ఎక్కువ. ►ఇందులోని విటమిన్ బి6 ప్రొటీన్లను జీర్ణం చేసుకోవడంలో బాగా ఉపయోగపడుతుంది. ►రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ పిస్తా బాగా పనిచేస్తుంది. ►రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ►ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్ ముప్పును తగ్గిస్తాయి. ►పిస్తాలోని అధిక ఫైబర్, ప్రొటిన్ కారణంగా కొంచెం తినగానే కడుపు నిండిన భావన కలుగడంతో పాటు తక్షణ శక్తి లభిస్తుంది. దీంతో తక్కువగా తినడం.. తద్వారా బరువు తగ్గడంలోనూ ఇది ఉపయోగపడుతుంది. ►ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్ బి6 అధికంగా లభించే ఆహారపదార్థాల్లో పిస్తా ముందు వరుసలో ఉంటుంది. కాబట్టి పిస్తా తినడం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చు. ►ఆరోగ్యానికి మేలు చేసే బాక్టీరియాను పెంపొందిస్తుంది. ►ఇందులో ఉండేది ఎక్కువగా ఆరోగ్యకరమైన కొవ్వే కాబట్టి డైట్లో పిస్తాను చేర్చుకోవచ్చు. చదవండి: Health Benefits Of Ivy Gourd: దొండకాయ కూర తింటున్నారా.. అందులో ఉండే బీటా కెరోటిన్ వల్ల.. -
జీలకర్రను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగుతున్నారా.. అయితే
Weight Loss Tips: ఈ డిజిటల్ యుగంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు.. పొట్ట, కొవ్వు. జీవనశైలితో పాటు ఆహారపుటలవాట్లు ఇందుకు కారణం. బరువు తగ్గి, నాజూకుగా అదే సమయంలో ఆరోగ్యంగా ఉండాలని ఎంతో మంది కోరుకుంటారు. ఎన్నెన్నో నియమ నిబంధనలు పెట్టుకుంటారు. కానీ ఆచరణ విషయం వచ్చేసరికి.. ఈ బిజీ లైఫ్‌లో మళ్లీ షరా మామూలే. అలాంటి వారు వ్యాయామాలతో పాటు ఈ చిన్న చిట్కాలు పాటించి చూడండి. పాలు, తేనె: ప్రతి రాత్రి పడుకునే ముందు గ్లాసు వెచ్చని పాలలో 2 టీస్పూన్ల తేనె కలిపి తాగితే హాయిగా నిద్ర పట్టడంతోపాటు, శరీర జీవక్రియను పెంచుతుంది. అధిక కొవ్వును కరిగిస్తుంది. వెల్లుల్లి: 2–3 వెల్లుల్లి గర్భాలను చితక్కొట్టాలి. దీనికి 2 టేబుల్ స్పూన్ల తేనె, గ్లాసు వెచ్చని నీరు కలిపి తాగాలి. ఇలా కొన్ని వారాలపాటు ఉదయాన్నే నిద్రలేచి ఖాళీ కడుపుతో తీసుకోవాలి. పుదీనా: పుదీనా తీసుకోవడం జీర్ణవ్యవస్థ పనితీరును, జీవక్రియల వేగాన్నీ పెంచుతుంది. టీస్పూన్ పుదీనా రసంతో 2 టీస్పూన్ల తేనె కలిపి, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. తులసి: తులసిని క్రమం తప్పకుండా తీసుకుంటే, జీర్ణవ్యవస్థకు మంచిది. టీస్పూన్ తేనెతో 2 టీస్పూన్ల తులసి రసం కలిపి, పొద్దున్నే తాగాలి. ఈ సహజ మార్గం స్థౌల్యాన్ని తగ్గిస్తుంది. వ్యాధి నిరోధకతను పెంచుతుంది. నిమ్మ: ఒక గ్లాసు నీటిలో స్పూను నిమ్మరసం, దానికి రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి ఉదయం నిద్ర లేచిన వెంటనే తాగాలి. అలా క్రమం తప్పకుండా కొన్ని రోజులపాటు చేయాలి. జీలకర్ర: టీస్పూన్ జీలకర్రను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రిపూట నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం, నీరు మరిగించి, స్పూన్ తేనెతో కలిపి ఖాళీ కడుపుతో తాగాలి. మంచి ఫలితం కనిపిస్తుంది. వీటన్నింటితోపాటు జంక్ ఫుడ్స్‌కు వీడ్కోలు చెప్పడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం అవసరం. అన్నింటికన్నా ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది ఏమిటంటే, బరువు లేదా పొట్ట తగ్గడం అనేది కొద్ది రోజుల్లోనే జరిగిపోయే అద్భుతం కాదు. ఓపిగ్గా ప్రయత్నం చేస్తుండాలి. చదవండి: How To Lose Belly Fat: బరువు, కొవ్వు రెండూ తగ్గుతాయి.. క్యారెట్, మెంతులు, జామ, బెర్రీస్, ఇంకా.. Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే.. -
ఆ ట్రీట్మెంట్ నా జీవితాన్నే నాశనం చేసింది: ప్రఖ్యాత మోడల్
లిండా ఎవాంజెలిస్టా దశాబ్దాలుగా ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు సంపాదించిన సూపర్ మోడల్. 80, 90లలో లిండా నవోమి కాంప్‌బెల్, కేట్ మోస్ వంటి ప్రఖ్యాత మోడల్‌లతో పాటు ర్యాంప్ వ్యాక్లో పాల్గొంది. దీంతో పాటు పలు ప్రఖ్యాత మ్యాగజైన్ కవర్లలో తన ఫోటోలు ప్రచురితమయ్యాయి. అంతటి పాపులర్ మోడల్ అయినప్పటికీ ఓ మోసపూరిత కాస్మెటిక్ ట్రీట్మెంట్ ఆమె జీవనోపాధిని నాశనం చేసిందని తాజాగా లిండా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్ట్‌లో.. ఐదు సంవత్సరాల క్రితం తాను చేసుకున్న కాస్మెటిక్ ట్రీట్మెంట్ వల్ల తాను శాశ్వతంగా వైకల్యం చెందినట్లు లిండా తెలిపింది. 56 ఏళ్ల ఈ మోడల్ ఓ సంస్థ సర్జరీ లేకండా ఫ్యాట్ కంటెంట్ తొలగిస్తామని నమ్మబలికి చివరికి ఆ వైద్యం దానికి విరుద్ధంగా జరిగిందని ఆరోపించింది. ఆ ట్రీట్మెంట్ సైడ్-ఎఫెక్ట్ తన జీవనాధారాన్ని పూర్తిగా నాశనం చేసిందని వివరిస్తూ.. ఇది నన్ను తీవ్ర నిరాశ, విచారం, నిరాశలోకి పంపిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియలో ఒంటరిగా మారిపోయానంటూ తన అవేదనను తెలిపింది. అయితే లిండా తనకు జరిగిన అన్యాయం పై చట్టపరంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఫ్యాషన్, వినోద ప్రపంచంలోని సభ్యుల నుంచి లిండాకు మద్దతు లభిస్తోంది. ఇప్పటికి ఈ విషయమై పలువురు ఫ్యాషన్ రంగంలో పలువురు ప్రముఖులు ఆమెకు మద్దతు తెలుపుతూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. లిండా ఎవాంజెలిస్టా మోడలింగ్ కెరీర్ 1984లో ప్రారంభమైంది. చదవండి: నటి పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి... కొంచెమైతే ఏమయ్యేదో.. -
కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా..? జర జాగ్రత్త
కూల్‌డ్రింక్స్ తాగితే లావెక్కుతారని చాలా కాలంగా తెలుసు. అందుకే వాటిని జంక్‌ఫుడ్ జాబితాలో చేర్చారు. అయితే ఎందుకు అలా జరుగుతుందన్నది మాత్రం స్పష్టంగా తెలియదు. అమెరికాకు చెందిన వీల్ కార్నెల్ మెడిసన్ శాస్త్రవేత్తలు ఈ లోపాన్ని పూరించారు. కూల్‌డ్రింక్స్‌తోపాటు అనేక ఇతర ఆహార పదార్థాల్లో వాడే హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ (హెచ్‌ఎఫ్‌సీఎస్) వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా నిల్వ అవుతోందని, ఇదే అనారోగ్య హేతువు అవుతోందని వారు నిర్వహించిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. హెచ్ఎఫ్సీఎస్లు చిన్నపేగుల్లోని కణాల్లో కొన్ని మార్పులు జరిగేందుకు కారణమవుతోందని, ఫలితంగా పోషకాలు ఎక్కువ మొత్తంలో శరీరానికి చేరి లావెక్కుతున్నారని వారు చెబుతున్నారు. చదవండి: సూపర్ కెపాసిటర్! చిన్నగా ఉందని చిన్నచూపు చూస్తే దెబ్బతింటారు ఈ రకమైన చక్కెరలను అధికంగా తీసుకుంటే ఆహారంలోని కొవ్వును ఎక్కువగా శోషించుకునే పరిస్థితి వస్తుందని వివరించారు. 2019లో పేగు కేన్సర్‌పై జరిగిన ఒక పరిశోధన ఫ్రక్టోస్ కాస్తా కేన్సర్ కణితి పెరుగుదలకు దోహదపడుతుందని తేలడంతో దాని వెనుక ఉన్న కణస్థాయి వ్యవస్థలను తెలుసుకునేందుకు తాజా పరిశోధన చేపట్టారు. ఇందులో భాగంగానే చిన్నపేగుల్లోని ఇతర కణాలపై ఫ్రక్టోస్ ప్రభావాన్ని పరిశీలించారు. చిన్నపేగుల్లో వెంట్రుకలను పోలినట్లు ఉండే కోట్లాది నిర్మాణాలైన ‘విల్లీ‘లు పోషకాలను శోషించుకునేందుకు ఉపయోగపడుతుంటాయి. ఎలుకలకు హెచ్ఎఫ్సీఎస్లు ఎక్కువగా ఇచ్చినప్పుడు ఈ విల్లీల పొడవు 40 శాతం వరకూ పెరగడమే కాకుండా.. బరువు కూడా ఎక్కువైనట్లు తేలింది. కణాల్లో ఫ్రక్టోస్–1–ఫాస్పేట్ ఎక్కువగా పేరుకుపోతుండటం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త శామ్యూల్ టేలర్ తెలిపారు. -
ఈ డివైజ్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా స్లిమ్‌గా మారుస్తుందట!
ఎంత ఆహారనియమాలు మార్చుకున్నా.. ఎన్ని చిట్కాలు పాటించినా శారీరక శ్రమ లేకపోతే.. వయసుతో పాటు బరువు పెరగడం సర్వసాధారణం. తొడలు, నడుము.. ఒక్కటేమిటీ శరీరంలోని ప్రతి భాగంలోనూ కొవ్వు పేరుకుపోతుంది. శరీరం షేప్ అవుట్ అయిపోయి వేసుకున్న డ్రెస్‌కి, కట్టుకున్న చీరకు అందం రాకుండాపోతుంది. అలా అని ఉదయాన్నే లేచి వ్యాయామం చేసేంత తీరిక, ఓపిక లేని బిజీ లైఫ్ మనది. మరి దీనికి పరిష్కారం ఏమిటీ? ఇదిగో.. ఈ చిత్రంలోని బాడీ షేపింగ్ మసాజర్ (రెడ్ లైట్ సోనిక్ రీచార్జబుల్ వైబ్రేషన్ బ్యూటీ డివైజ్).. ఫ్యాట్‌ని ఇట్టే మాయం చేస్తుంది. ఇందులోని అల్ట్రాసోనిక్ హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ టెక్నాలజీ.. సెకనులో 3 లక్షల సార్లు వైబ్రేట్ అవుతూ బాడీని రిపేర్ చేస్తుంది. చేతులు, కాళ్లు, పొత్తికడుపు భాగాల్లో పేరుకున్న కొవ్వుని కరిగించేస్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్ కలిగిన ఈ డివైజ్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే స్లిమ్‌గా మారుస్తుంది. దీని రెడ్ లైట్ వేవ్‌లెంగ్త్ ఫంక్షనల్ ప్రక్రియ.. చర్మ కణాలను ఉత్తేజితంచేసి స్కిన్‌టోన్‌ను మెరుగుపరుస్తుంది. ఈ మల్టీఫంక్షనల్ బ్యూటీ డివైజ్‌లో స్కిన్ మోడ్, ఫ్యాట్ బర్నింగ్ మోడ్ 1, ఫ్యాట్ బర్నింగ్ మోడ్ 2, షేపింగ్ మోడ్ ఇలా నాలుగు రకాల మోడ్స్ ఉంటాయి. వాటితో పాటు ఆన్ / ఆఫ్ బటన్ కూడా ఉంటుంది. దాంతో దీని వినియోగం చాలా సులభం. పైగా దీన్ని చేత్తో చాలా ఈజీగా పట్టుకుని కొవ్వు ఉన్న భాగంలో మూవ్ చేసుకోవచ్చు. తేలికగా ఉండటంతో ప్రయాణించేటప్పుడు వెంట తీసుకుని వెళ్లొచ్చు. దీని ధర 68 డాలర్లు. అంటే సుమారు రూ. 5 వేలు. -
ఇవి పాటిస్తే కీళ్ళనొప్పులుండవు!
కేవలం ఆహార నియమాలతోనే మనం ఆర్థరైటిస్‌ను తగ్గించలేము. తీసుకునే ఆహారంతోనే అరిగిపోయిన కార్టిలేజ్‌ను పునరుద్ధరించలేము. అయితే శరీరం బరువు పెరగకుండా ఉండటానికి స్థూలకాయాన్ని తగ్గించుకునేందుకు ఆహారనియమాలు ఉపయోగపడతాయి. అలాగే ఆర్థరైటిస్ రాకముందే పాలు, తగినంత క్యాల్షియమ్ ఉండే ఆహారం వల్ల దీర్ఘకాలం పాటు దాని నివారణ సాధ్యం కావచ్చు. ఆహార నియమాలు పాటించడం ద్వారా ఆర్థరైటిస్‌ను చాలావరకు నివారించవచ్చు. అలాగే రోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా కూడా ఆర్థరైటిస్ దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. మన జీవనశైలి వల్ల మన కీళ్లపై చాలా ప్రభావం పడుతుంది. ఉదాహరణకు మన శరీరంలో తగినన్ని కదలికలు ఉండటం వల్ల మన కార్టిలేజ్, కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే అవి మరీ ఎక్కువగా అరిగిపోయేలా మన కదలికలు ఉండదకూడదు. అంటే... కదలికలు మరీ తక్కువగా ఉండటం, మరీ ఎక్కువగా ఉండటం... ఇవి రెండూ ప్రమాదకరమే అని గుర్తించాలి. చదవండి: ఆహ్లాదానికి... ఆరోగ్యానికి మల్లె -
ఈ సీజన్లో ఇవి తినండి.. బరువు తగ్గండి
ఖర్జూరాలు పోషకాలన్నిటినీ కలిపి ఒక క్యాప్సూల్ లో వేస్తే వచ్చే ఫలితాన్నిస్తాయి ఖర్జూరాలు. ఇందులో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి బరువును అదుపులో ఉంచుతాయి. వీటిని ప్రతిరోజూ మితంగా తీసుకోవటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆకుకూరలు (ముదురు ఆకుపచ్చవి) పుదీనా, ఆవ ఆకు, పాలకూర, చుక్కకూర వంటి వాటిలో విటమిన్ ఏ, సి, కె పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలు తీసుకోవటం వల్ల ఎముకలు దృఢంగా ఉండటమే కాకుండా, శీతాకాలంలో ఎదురయ్యే... శరీరం పొడిబారి పోవటం, జుట్టు రాలిపోవటం వంటి సమస్యల నుండి కూడా కాపాడతాయి. బాదం పప్పులు, వాల్నట్స్ వీటిని తీసుకోవటం వల్ల, శరీర ఉష్టోగ్రత సమతుల్యంగా ఉండటమే కాకుండా, నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. గుండె సక్రమంగా పనిచేస్తుంది. శీతాకాలంలో ఇవి తినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. సిట్రస్ జాతి పండ్లు సిట్రస్ జాతి పండ్లయిన నిమ్మ, కమలా, బత్తాయి, నారింజ వంటి వాటిలో రసం అధికంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన సి విటమిన్ అధికంగా లభ్యమవుతుంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. అటుకులు శీతాకాలంలో అటుకులతో చేసిన ఆహారం తీసుకోవటం వలన ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఇందులో నుంచి శక్తి నెమ్మదినెమ్మదిగా విడుదల అవుతుండటం వల్ల మధ్యాహ్నం భోజనం సమయం వరకు ఆకలి వేయదు. వీటికి డ్రైఫ్రూట్స్, నట్స్ జత చేసి తీసుకుంటే మరింత రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యంగా ఉంటారు. చిలగడ దుంప చిలగడ దుంపలలో ఫైబర్, విటమిన్ ఏ, పొటాషియం అధికంగా ఉంటాయి. పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. చిలగడ దుంప తినటం వల్ల జీర్ణశక్తి బలపడి, మలబద్దక సమస్య దూరమవుతుంది. -
లావుగా ఉన్నావంటూ భార్యను..
అహ్మాదాబాద్ : భార్య లావుగా ఉందన్న కారణంగా ఆమెను ఇంటినుంచి బయటకు గెంటేశాడో భర్త. ఈ సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అహ్మదాబాద్, మహిళా వెస్ట్ పోలీస్ స్టేషన్లో పరిధిలోని వస్న రెసిడెంట్‌కు చెందిన ఓ మహిళకు 2017లో వివాహం అయింది. ఆరు నెలలు భార్యభర్తలిద్దరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత లావుగా ఉన్నావంటూ భర్త ఆమెను వేధించటం మొదలుపెట్టాడు. (భర్తకు గండం ఉందని వివాహిత మెడలో తాళి కట్టి..) తన తల్లిదండ్రుల బలవంతం కారణంగానే ఆమెను పెళ్లి చేసుకున్నానని చెప్పి ఎగతాళి చేసేవాడు. ఓ నెల క్రితం ఇళ్లు కొనడానికి ఆమె వద్దనుంచి దాదాపు 3 లక్షల రూపాయలు ఇప్పించుకున్నాడు. ఆ వెంటనే ఆమెను ఇంటినుంచి బయటకు గెంటేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి, భర్త, అతడి సోదరులపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
బరువు తగ్గడం: ఇవన్నీ అపోహలే
ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరం ఏదో ఒక సందర్భంలో ప్రాచూర్యం పొందిన చిట్కాలనో, డైట్ ప్లాన్లనో పాటించే ఉంటాము. యూట్యూబ్‌లో చూసిన దాన్నో.. ఇంటర్నెట్లో చదివిన దాన్నో.. స్నేహితుడు చెప్పినదాన్నో అచరించే ఉంటాము. ముఖ్యంగా అధిక బరువు ఉన్న వారు బరువు తగ్గటం కోసం ప్రాచూర్యం పొందిన ప్రతీ చిట్కాను, డైట్ ప్లాన్‌ను ఫాలో అయిపోతుంటారు. నీళ్లు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారు, రాత్రి పూట తిండి తినడం మానేస్తే బరువు తగ్గుతారు ఇలా ఏదో ఒక దాన్ని ఆచరణలో పెట్టి ఫలితం రాక ఢీలా పడిపోతుంటారు. అయితే ఇప్పటికి చాలా మంది కొన్ని డైటింగ్ విధానాలపై అపోహలతో ఉన్నారు. ఆ డైటింగ్ విధానాల ద్వారా బరువు తగ్గే అవకాశం ఉందనే భ్రమలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం ప్రాచూర్యం పొందిన డైట్ ప్లాన్లలో 90శాతానికిపైగా అపోహలే. డైట్ ప్లాన్ అపోహల్లో కొన్ని.. 1) గ్రీన్ టీ గ్రీన్ టీ ఒక జీరో క్యాలరీ డ్రింక్. ఇందులో ఫ్లేవనాయిడ్స్ తగిన మోతాదులో ఉంటాయి. అయితే గ్రీన్ టీ తాగటం వల్ల బరువు తగ్గుతారన్నది అపోహ మాత్రమే. 2) తేనె, నిమ్మరసం తేనె, నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని, పరగడపున తాగితే బరువు తగ్గుతారన్నది కూడా అపోహే. ఈ పానీయాన్ని ఉదయం లేవగానే తాగటం వల్ల కొవ్వు కణాలను కరిగిస్తుందన్నది అబద్ధం. 3) చెమట ఎంత ఎక్కువగా పడితే అంత కొవ్వు కరుగుతుంది? చెమట ఎంత ఎక్కువగా పడితే అంత కొవ్వు కరుగుతుందన్నది కూడా శుద్ధ అబద్ధం. జిమ్ ట్రైనర్స్ చెప్పే కొన్ని విషయాల్లో వాస్తవాలు ఉండవు. మీరు జిమ్‌లో బరువు తగ్గాలనుకుంటే కార్డియోను, వెయిట్ ట్రైనింగ్, కోర్ స్ట్రెన్తనింగ్తో బ్యాలన్స్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. 4) కార్డియో కార్డియో ద్వారా బరువు తగ్గుతారన్నది కూడా అపోహే. మీరు కార్డియో చేస్తున్నపుడు క్యాలరీలు ఖర్చవుతాయి. కానీ, కార్డియో తర్వాత మీరు ఖర్చుచేసే క్యాలరీల సంఖ్య జీరో. అందువల్ల మనం ఏం తింటున్నాం.. ఎంత తింటున్నాం అన్న దానిపై శ్రద్ధ వహించాలి. కొత్తగా కొవ్వు ఒంట్లో చేరకుండా చూసుకోవాలి. -
కొవ్వుపై మెట్రోవాసుల్లో లవ్వు
న్యూఢిల్లీ: అధికశాతం కొవ్వును ఆహార రూపంలో తీసుకుంటున్న దేశంలోని ఏడు మెట్రోనగరాల్లో ఢిల్లీ, అహ్మదాబాద్‌లు టాప్‌లో నిలిచాయి. హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. ఈ ఏడు నగరాల్లో అధిక కొవ్వు లభించే దాల్ ఫ్రై, స్టఫ్డ్ పరోటా, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చుడువా, బిసి బిళే బాత్, చింతపండు పులిహోర అధికంగా తిం టున్నట్లు ఈ సర్వే నిర్వహించిన భారత మెడికల్ పరిశోధనా మండలి (ఐసీఎమ్ఆర్) తెలిపింది. అధికంగా వేయించిన ఆహారం ద్వారా ఎక్కువ కొవ్వు ఒంట్లో చేరినట్లు గుర్తించారు. నగరాల్లో దొరికే అన్ని మాంసాహారాల్లోనూ అధిక కొవ్వు ఉన్నట్లు పరిశోధనలో తేలిందన్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్‌లోని ప్రజలు దేశంలోని అందరికంటే అధికంగా రోజుకు 44.4, 43.9 గ్రాముల చొప్పున కొవ్వును తీసుకుంటున్నట్లు పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ సేథ్ తెలిపారు. 36–59 వయసు ఉన్నవారు 36.1%, 18–35 వయసువారు 34.8% కొవ్వు తీసుకుంటున్నట్లు వెల్లడైంది. మెట్రో నగరాల్లో అత్యంత తక్కువగా హైదరాబాద్‌లో ఒక్కో వ్యక్తి రోజుకు 25.1 గ్రాముల కొవ్వును తీసుకుంటున్నారు. మెట్రోల మొత్తం మీద సగటున ఒక్కో వ్యక్తి తీసుకుంటున్న కొవ్వు రోజుకు 32.6 గ్రాములుగా ఉంది. ఇది ఐసీఎమ్ఆర్ సూచించిన 20 గ్రాముల (రోజుకు) కంటే ఎక్కువ. సాధారణంగా మనిషికి రోజుకు 20 గ్రాములు చాలు. మాంసాహారుల కంటే శాకాహారులు పప్పు ధాన్యాల ద్వారా తీసుకుంటున్న కొవ్వుశాతం ఎక్కువగా ఉంది. సాధారణంగా ఇంట్లో చేసే ఆహారం, ప్యాక్ చేసిన ఆహారం, స్వీట్లు, బేకరీ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు వంటి వాటి నుంచి ఈ కొవ్వు ఒంట్లో చేరుతున్నట్లు తేలింది. -
సిక్స్‌ప్యాక్ ట్రై చేస్తున్నారా?
తీవ్రమైన యాబ్స్ వ్యాయామాల వల్ల పొట్ట దగ్గర దహించడానికి కొవ్వు దొరకనప్పుడు... ముఖంపైనా, భుజాల్లోనా ఉన్న కొవ్వును ఈ వ్యాయామాలు దహించి వేస్తాయి. అందుకే సిక్స్ ప్యాక్ కోసం శ్రమించే వారి ముఖం, బుగ్గలలోని కొవ్వు పూర్తిగా దహనమైపోయి వారి బుగ్గలు లోపలికి పీక్కుపోయినట్లు అవుతుంది. సిక్స్ ప్యాక్స్ అంటూ కడుపుపైన ఉండే ఆరు కండరాలు స్పష్టంగా కనిపించేలా వ్యాయామాలు చేయడం చాలామందికి ఇష్టం. ఇందుకోసం కడుపు కండరాలకు చాలా ఎక్కువ శ్రమ కలిగేట్లుగా ‘యాబ్స్ ఎక్సర్సైజ్’లు చేస్తుంటారు. మనిషుల్లో ప్రతి ఒక్కరికీ కడుపుపైనా యాబ్స్ కండరాలు ఉంటాయి. అవి ప్రస్ఫుటంగా పైకితేలేందుకు చేసే వ్యాయామాల్లో ఒక జాగ్రత్త పాటించడం మంచిది. అదేమిటో తెలుసుకునే ముందర అసలు మన దేశవాసు ల్లో పొట్ట ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. పొట్ట ఎందుకొస్తుంది అప్పట్లో మన దేశంలో తరచూ కరువులు వస్తుండేవి. ఆహారం దొరకని సమయాల్లో.... తనకు తిండి దొరికినప్పుడే ఆ అదనపు ఆహారాన్నికొవ్వు రూపంలో నిల్వ ఉంచుకునేలా శరీరం తనను తాను సంసిద్ధం చేసుకుంటుంది. జీవులు తమ మనుగడ కోసం అనుసరించే ‘అడాప్టేషన్’ ప్రక్రియలో భాగంగా ఇది జరుగుతుండేది. 17, 18వ శతాబ్దాల్లో తరచూ కరవులు వచ్చే సమయంలో వాటిని అధిగమించి మనుగడ సాధించేందుకు వీలుగా మన దేశవాసుల్లో... (మరీ ముఖ్యంగా దక్షిణభారతదేశ వాసుల్లో) ఇలా ఒక జన్యుపరివర్తన జరిగింది. ఆ జన్యువు ప్రాబల్యంతో ఒక వయసు తర్వాత పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం మొదలైంది. ఆహారం దొరకని సమయాల్లో ఆ కొవ్వును వినియోగించుకోడానికి వీలుగా ఈ జన్యుపరివర్తన సంభవించిందని దక్షిణ భారత దేశ జన్యుపటలంపై అధ్యయనం చేసిన కొందరి సిద్ధాంతమిది. అయితే ఇప్పుడు హరిత విప్లవం తర్వాత ఆహార ధాన్యాల లభ్యత బాగా పెరిగింది. పైగా స్వాతంత్య్రానంతరం దేశంలోని ఒక చోటి నుంచి మరొక చోటికి రవాణా సౌకర్యాలు విస్తరించాయి. ఆ కారణంగా ఆ ధాన్యాలను ఎక్కడికైనా తరలించడం సులభం కావడంతో మొదట్లోలా కరువుకాటకాలు తగ్గిపోయాయి. కానీ మన దేహంలో పొట్ట వచ్చేందుకు దోహదపడే జన్యువు కారణంగా పొట్ట రావడం మాత్రం ఒక వయసు తర్వాత అలాగే కొనసాగుతూ ఉంది. సిక్స్ ప్యాక్ ఎలా ప్రమాదం? మనం పొట్టపైన కండరాలను పైకి తేలించేందుక తీవ్రమైన యాబ్స్ ఎక్సర్సైజ్లు చేస్తున్నప్పుడు... అవి కేవలం పొట్టపైన ఉన్న కొవ్వును మాత్రమే గాక... శరీరంలోని ఇతర ప్రాంతాల్లోని కొవ్వునూ దహనం చేస్తాయి. మన శరీరంలోని కొవ్వు చాలా ప్రాంతాల్లో నిల్వ ఉంటుంది. ఉదాహరణకు ముఖంలోని చెంపల భాగంలో, భుజాల్లో కొవ్వు పేరుకుంటుంది. అందుకే కొందరిలో మరీ ఎక్కువగా కొవ్వు చేరి ఉండటం వల్ల బుగ్గలు బూరెల్లా, భుజాలూ గుండ్రంగా కనిపిస్తుంటాయి. తీవ్రమైన యాబ్స్ వ్యాయామాల వల్ల పొట్ట దగ్గర దహించడానికి కొవ్వు దొరకనప్పుడు... ముఖంపైనా, భుజాల్లోనా లేదా కీలక అవయవాల రక్షణ కోసం ఉన్న కొవ్వును ఈ వ్యాయామాలు దహిస్తాయి. అందుకే సిక్స్ ప్యాక్ కోసం చాలా తీవ్రంగా శ్రమించే వారి ముఖం, బుగ్గలు లోపలికి పీక్కుపోయినట్లు కనిపిస్తాయి. సిక్స్‌ప్యాక్ కోసం వ్యాయామం చేసేవారు ఒక జాగ్రత్త పాటించాలి. తమ ముఖం పూర్తిగా పీక్కుపోయినట్లుగా అయిపోయి... ముఖం ఆకృతి మారిపోయేలా ఉన్న దశలో ఆ వ్యాయామాల్ని ఆపేయాలి. ముఖం అందం తగ్గేంత వ్యాయామం చేయకూడదని గుర్తుంచుకోవాలి. ఒకసారి సిక్స్‌ప్యాక్ సాధించాక అది ఎప్పటికీ అలాగే ఉండిపోదు. అదలా ఉండిపోవడం కోసం ఎప్పుడూ యాబ్స్ వ్యాయామాల్ని కొనసాగిస్తూనే ఉండాలి. లేదంటే మన జన్యువుల వల్ల మళ్లీ పొట్ట చుట్టూ కొవ్వు చేరుతూ ఉంటుంది. మీకు మీ ముఖ ఆకర్షణ కూడా ముఖ్యమేనా లేక యాబ్స్ పట్లనే అబ్సెస్ అయి ఉన్నారా అన్నది మీరే తేల్చుకుని, మీ వ్యాయామ తీవ్రతను ఎంచుకోవాలి. -
కాకులు కొవ్వు కొవ్వు అంటున్నాయి!
న్యూయార్క్.... తెలవారుతున్న సమయం.. కోయిలల కజిన్స్ కాకులు తమదైన గోల చేస్తున్నాయి! ఆ కావ్.. కావ్లు.. అందరికీ వినిపిస్తున్నాయిగానీ... కొందరు శాస్త్రవేత్తలకు మాత్రం కాకులు... ‘‘కొవ్వు.. కొవ్వు’’ అంటున్నట్లుగా ఉన్నాయి! కాకులకు కొవ్వుకు సంబంధం ఏంటనేగా మీ ఆలోచన? చాన్నాళ్లుగా నగరాల్లో ఉండటంతో అవి తమ సహజమైన ఆహారం తినడం మానేశాయి. మనిషి తిని పారేసిన చీజ్బర్గర్లు, హాట్‌డాగ్‌లు తినే బతుకు వెళ్లదీస్తున్నాయి. ఫలితం అచ్చం మన మాదిరిగానే అవి కొవ్కెక్కిపోతున్నాయి! ఆండ్రియా టౌన్సెండ్ అనే శాస్త్రవేత్త తన బృందంతో కలిసి చేసిన ఓ పరిశోధన ఈ విషయాన్ని తేల్చింది. నగర జీవనం మనుషులనే కాదు.. కాకుల్లాంటి చిన్న జీవులను ప్రభావితం చేస్తోందనేందుకు ఇదే తార్కాణమని ఆండ్రియా చెప్పారు. పిచ్చుకలు, కాకుల్లాంటి జీవులంటే ఆండ్రియాకూ మక్కువే. హామిల్టన్ కాలేజ్‌లో ఆర్నిథాలజిస్ట్గా పనిచేస్తున్న ఆండ్రియాకు ఓ ఆలోచన వచ్చింది. మనలాగే కాకులు కూడా చీజ్బర్గర్లు తింటే ఏమవుతుంది? అన్న ప్రశ్నకు సమాధానం వెతికేందుకు ఒక పరిశోధన మొదలుపెట్టింది. కాలిఫోర్నియాలోని డేవిస్ ప్రాంతంలో సుమారు 140 కాకిగూళ్లను ఎంచుకుని అక్కడి వాటికి మెక్‌డొనాల్డ్ చీజ్బర్గర్లు అందించడం మొదలుపెట్టింది. గూళ్లు ఉన్న చెట్టు కింద ఉంచిన బర్గర్లను కాకులు ఇష్టంగా తిన్నాయని.. ఒక్కో కాకి మూడు బర్గర్లు లాగించేసిందని ఆండ్రియా తెలిపారు. కొన్ని కాకులు బర్గర్ ముక్కలను గూళ్లకు మోసుకెళ్లడమూ చూశామని తెలిపారు. ఆ తరువాత ఇదే ప్రయోగాన్ని గ్రామీణ ప్రాంతమైన క్లింటన్లోనూ చేపట్టారు. మూడేళ్లపాటు జరిగిన ఈ పరిశోధనలో గ్రామీణ ప్రాంతాల్లోని కాకులతో నగరాల్లోని కాకులను పోల్చి చూశారు కూడా. తేలిందేమిటంటే.. కాంక్రీట్ జనారణ్యంలో ఉన్న కాకుల్లో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉందీ అని! అంతేకాదు.. గ్రామీణ ప్రాంత కాకులతో పోలిస్తే నగర ప్రాంత కాకులు తొందరగా మరణిస్తున్నట్లు గుర్తించారు. కొలెస్ట్రాల్ ఎక్కువవడం వల్లనే మరణించాయా? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్నది తేలాల్సి ఉంది. శుద్ధి చేసిన ఆహారంతో సమస్య ఆండ్రియా పరిశోధన వివరాలు ‘ద కాండోర్’ అనే జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. నగరజీవనం కాకులను ఎలా ప్రభావితం చేస్తోందో చెబుతుంది ఈ పరిశోధన. మనుషులు తినగా మిగిలిన ఆహారం.. ముఖ్యంగా బ్రెడ్, పిజ్జా, చీజ్ వంటి శుద్ధి చేసిన ఆహారం ఎక్కువగా తినడం వల్లనే కాకులకు కొలెస్ట్రాల్ సమస్య వస్తోందని ఆండ్రియా అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కాకులు.. సహజంగా దొరికే ఇతర ఆహారంపై ఆధారపడతాయన్నది తెలిసిందే. గతంలో ఇదే అంశంపై జరిగిన ఒక పరిశోధన కూడా నగరాల్లోని చిన్న చిన్న జంతువుల్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్లు తేల్చింది. చిన్న చిన్న మోతాదుల్లో కొలెస్ట్రాల్ శరీరానికి మేలు చేసేదికాగా.. ఎక్కువైతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. -
‘జంకు’.. గొంకూ వద్దు!
సాక్షి, విజయనగరం: ప్రస్తుతం జీవనం యాంత్రికమైపోయింది. ఉద్యోగ బాధ్యతలతో వాయువేగంతో సాగిపోతోంది. ఆరోగ్యం గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా శారీరక శ్రమకు దూరమవుతున్నారు. తినేది జంక్ ఫుడ్ అని.. ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిసినా.. ఆకలి తీర్చుకోవడానికి ఏదో ఒకటి తిని సరిపెడుతున్నారు. ఫలితంగా అనారోగ్యానికి గురవుతున్నారు. వివిధ రుగ్మతలకు శారీరక శ్రమ లేమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. కొందరు వ్యాయామశాలలకు వెళ్లే సమయం లేక, మరికొందరు ఇంకోరోజు చేద్దాంలే అని వాయిదాలు వేస్తున్నారు. మారిన ఆహారపుటలవాట్లు, జీవనశైలి, పని విధానాలతో కేలరీలు కరగకపోగా, కొత్తగా వచ్చి చేరుతున్నాయి. ఇందుకోసం బరువులు ఎత్తడం, జిమ్‌లకు వెళ్లడం, కిలోమీటర్ల నడక లాంటివే కాకుండా కేవలం చిన్న చిన్న పనులతో కూడా తగ్గించుకునే ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇంటి పనులు చేయడం.. వ్యాయామంతో సమానమని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో మానసిక ప్రశాంతత లభించడంతోపాటు.. తెలియకుండానే శారీరక శ్రమ పెరిగి రెండు రకాలుగా ఉపయోగాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. కాసేపు తోట పని చేస్తూ.. ఎవరి పనులే వారే చేసుకోవడం ఉత్తమం. ఇంటి తోటలో మొక్కలను నాటడం, నాటిన మొక్కలకు నీరు పోయడం, పరిసరాలు శుభ్రం చేయడం, బాగా పెరిగిన ఆకులు, కొమ్మలను కత్తిరించడం లాంటి పనులు శరీరానికి శ్రమను కలిగిస్తాయి. రోజు 40 నిమిషాలపాటు ఈ తరహా పనులు చేస్తే సుమారు 200 పైగా కేలొరీలు తగ్గించుకోవచ్చు. చెట్లు, పచ్చదనం మనస్సుకు ఆహ్లాదాన్ని ఇస్తుంటాయి. లిఫ్ట్‌కు దూరంగా.. భవనాల్లో వారి ఇంటికో, కార్యాలయానికో వెళ్లాల్సి వచ్చినప్పుడు లిఫ్ట్ ఆశ్రయిస్తుంటారు. ఈ విధానానికి చెక్ పెట్టాలి. సాధ్యమైనంత వరకు మెట్లు ఎక్కే ప్రయత్నం చేయాలి. కనీసం ఒకటి రెండు అంతస్తులనైనా ఎక్కేందుకు ప్రయత్నం చేస్తే సుమారు 200 కేలొరీల వరకు కొవ్వు కరుగుతుంది. సైకిల్ని వినియోగించడం సైకిల్ తొక్కడం ఎక్కువ మందికి ఇష్టం. వారంలో ఒక్క రోజైనా రోడ్లపై సైకిల్ తొక్కేందుకు ఆసక్తి చూపాలి. ఇంటికి కాస్త దూరంలో ఉండే పనులు చేసేందుకు ఎక్కువ మంది ద్విచక్ర వాహనాలను వినియోగిస్తుంటారు. దానికి ప్రత్యామ్నాయంగా సైకిల్‌పై వెళ్తే మంచిది. రోజూ అర్ధగంటపాటు సైకిల్ తొక్కితే దాదాపు 210 కేలొరీలు తగ్గించుకున్నట్టే. నలభై నిమిషాలపాటు కూర్చోకుండా నిలబడితే సుమారు 100 కేలొరీలు కరుగుతాయట. రోజంతా ఒకే చోట కూర్చొని పనిచేసే వారు కొద్దిసేపు లేచి నిలబడి తిరగడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటిని శుభ్రం చేయడంతో.. ఖాళీ సమయాల్లో బయటికెళ్లే పని లేకపోతే ఇంట్లోనే ఉండి దుమ్ము దులపడమే పనిగా పెట్టుకోండి. రోజులో కాసేపు గదుల్లో పట్టిన బూజును శుభ్రం చేస్తే ప్రయోజనం ఉంటుంది. రోజూ 40 నిమిషాల పాటు ఈ తరహా పనులు చేస్తే 128 కేలొరీల కొవ్వును కరిగించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటి పనులు చేస్తే, ఇల్లు శుభ్రపడటంతో పాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. స్కిప్పింగ్‌తో.. ఇంటిలో ఉదయం పూట, వాకింగ్ చేసే మైదానంలో రోజూ కాసేపు స్కిప్పింగ్ చేయండి. పది నుంచి 15 నిమిషాలు ఎగురుతూ గెంతుతూ స్కిప్పింగ్ చేస్తే వందకుపైగా కేలొరీలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. నృత్యంతో.. సంగీతం వినిపిస్తే కాళ్లు, చేతులు వాటంతట అవే కదులుతుంటాయి. ఇష్టమైన పాటలను వింటూ వాటికి అనుగుణంగా కాసేపు నృత్యం చేస్తే మేలు. చెమట చిందించడంతో పాటు కొవ్వు కరిగే అవకాశం ఉంది. ఇరవై నిమిషాలపాటు నృత్యం చేస్తే 100 నుంచి 120 వరకు కేలొరీలు తగ్గించుకోవచ్చు. నాట్యం చేశామనే తృప్తి, ఆనందం మిగులుతుంది. -
గ్రామీణుల్లో పెరుగుతున్న ఊబకాయం
గ్రామీణ ప్రాంతాల్లో ఊబకాయం,అధిక బరువు పెరగడానికి 80 శాతం ఆహారపుఅలవాట్లు, సంప్రదాయ ఆహారాన్ని విస్మరించడమేనని ఎన్‌ఐన్ శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మయ్య, లండన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యాపకులు ప్రొఫెసర్ మజీద్ ఇజ్జతి తమ పరిశోధనల్లో వెల్లడించారు. తార్నాక: అధిక బరువు.. ఊబకాయం.. స్థూలకాయం.. పేరేదైనా మనిషిని ఇబ్బంది పెట్టే తీవ్రమైన సమస్య. అత్యధిక మంది నగర వాసులను పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య. సమయానికి నిద్ర లేకపోవడం సరైన తిండి తినకపోవడం.. అధిక పని ఒత్తిడి.. జంక్‌ఫుడ్ తదితర సమస్యలతో ఇప్పటి వరకు ఊబకాయం నగర వాసులను పట్టిపీడిస్తూ వచ్చింది. అయితే, ప్రస్తుతం ఈ సమస్య భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర రూపం దాలుస్తున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది. ‘ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్’ అభివృద్ధి చెందుతున్న, మధ్య ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లోని గ్రామీణప్రాంత ప్రజల్లో ఊబకాయంపై పరిశోధనలు చేసింది. ఈ మేరకు భారతదేశంలో గ్రామాల్లో సేకరించిన డేటాను తార్నాకలోని ఐసీఎంఆర్–నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌నూట్రీషన్(ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలు ఇటీవల లండన్ కళాశాలకు అందజేశారు.అందులో మన గ్రామీణ ప్రాంతాల్లో ఆందోళన కరమైన నిజాలు వెలుగు చూశాయి. 112 మిలియన్ల మందిపై అధ్యయనం మనిషి శరీరాన్ని అతడి బరువు, ఎత్తు, ఆకృతి, ఇతర అంశాలను ఆధారంగా కొలుస్తారు. దాన్ని ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎంఐ) అంటారు. ఊబకాయం, అధిక బరువుపై ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాల్లో వేయి మంది పరిశోధనా విద్యార్థులు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 112 మిలియన్ల యువతపై అధ్యయనం చేశారు. 1985 నుంచి 2017 వరకు దాదాపు 30 ఏళ్ల పాటు కొనసాగిన ఈ అధ్యయనంలో పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంత ప్రజల్లోనే ఊబకాయం, అధిక బరువు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. బీఎంఐ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ, పురుషుల్లో ఉండాల్సి కనీస బరువుకంటే 5 నుంచి 6 కేజీలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో పట్టణ ప్రాంత ప్రజల్లో గ్రామీణుల్లో కంటే ఊబకాయం తక్కువగా ఉన్నట్లు నమోదైంది. భారతదేశంలోనూ పరిశోధనలు మనదేశంలో ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు పలు రాష్ట్రాల్లో 1.2 లక్షల మందిపై అధ్యయనం చేశారు. భారతదేశంలో 1975–79 మధ్య జరిగిన అధ్యయనంలో 16.5 కేజీల (మీటర్ స్వేర్–ఎం 2) బరువు నమోదు కాగా, అది 2012 నాటికి 18.5 కేజీ (మీటర్ స్వేర్–ఎం 2)లకు పెరిగింది. అత్యధికంగా బరువు పెరిగిన రాష్ట్రాల్లో కేరళ (3.8 కేజీ), పశ్చిమ బెంగాల్(2.6 కేజీ), ఆంధ్రప్రదేశ్ (2.6 కేజీ) ఉంగా, అత్యల్పంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో నమోదైనట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 32 ఏళ్ల అధ్యయనంలో గ్రామీణ ప్రాంతంలోని పురుషుల్లో ఊబకాయం, అధిక బరువు 2 శాతం నుంచి 12 శాతానికి పెరగ్గా, మహిళల్లో 4 నుంచి 16 శాతానికి పెరిగినట్లు అధ్యయనంలో గుర్తించారు. అంటే పురుషులు కంటే మహిళలు దాదాపు 2 కేజీల బరువు అధికంగా పెరిగారు. పోషకాహారలోపమే కారణం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఊబకాయం, అధిక బరువు పెరడగానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, పోషకాçహారలోపాలే కారణమని ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తీసుకునే ఆహారంలో తక్కువ మోతాదులో పోషకాలు ఉండటం, పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్, నట్స్ తినకపోవడం, అన్నిరకాల పోషకాలు కలిగిన పాలు, పాల పదార్థాలు తినకపోవడం వల్లనే ఊబకాయం, అధిక బరువు, ఎనీమియా వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత పేర్కొన్నారు. ప్రజలకు పోషకాహారం అవగాహన కల్పించాలని, తద్వారా ఇలాంటి ఆరోగ్య సమస్యలకు కళ్లెం వేయవచ్చన్నారు. -
కీటోతో గుండెజబ్బుల ప్రమాదం...!
ఈమధ్య కాలంలో పిండిపదార్థాలు తక్కువగా.. కొవ్వులెక్కువగా ఉండే ఆహారం తినడం ప్రాచుర్యం పొందుతున్న విషయం మనకు తెలుసు. అయితే ఈ కీటో డైట్‌తో గుండెజబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయని హెచ్చరిస్తున్నారు చైనా శాస్త్రవేత్తలు. ఆహారం ద్వారా అందే శక్తిలో 45 శాతం కంటే తక్కువ పిండి పదార్థాల నుంచి వస్తూంటే ఆర్టియల్ ఫైబ్రేషన్ గుండెజబ్బు వచ్చే అవకాశాలు 18 శాతం ఎక్కువని తాము అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నట్లు వీరు చెబుతున్నారు. ఆర్టియల్ ఫైబ్రేషన్ ఉన్న వారిలో గుండెపై కవాటాలు సంకోచ, వ్యాకోచాలు ఏకరీతిగా ఉండవు. ఫలితంగా అక్కడి నరాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. కార్బోహైడ్రేట్ల స్థానంలో ఏ రకమైన కొవ్వులను చేర్చినా ఫలితాలు ఇలాగే ఉంటాయని సున్ యట్ సేన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త షియడాంగ్ ఝాంగ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. మరోవైపు అమెరికాకు చెందిన నార్త్‌వెల్ హెల్త్ శాస్త్రవేత్తలు కూడా కీటో ఆహారంపై జరిగిన అధ్యయనంలోనూ ఇదేరకమైన ఫలితాలు వచ్చాయి. దాదాపు 14 వేల మంది వివరాలను సేకరించి ఈ అధ్యయనం చేశారు. ఆర్టియల్ ఫైబ్రేషన్ వ్యాధి లక్షణాలు లేని వీరందరినీ 22 ఏళ్లపాటు పరిశీలించగా 1900 మంది వ్యాధిబారిన పడ్డారు. వాళ్లు తినే ఆహారాన్ని పరిశీలించినప్పుడు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి.. కొవ్వులు ఎక్కువగా ఉన్న వారికి ఈ గుండెజబ్బు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. -
జొన్న ప్రొటీన్లు మిన్న
జొన్నరొట్టెకు పెరిగిన డిమాండ్ కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు అధికంగా ఉండే జొన్నరొట్టెలను తింటేనే ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు సూచిస్తున్నారు. అలాగే కొవ్వును తగ్గించడానికి జొన్నరొట్టెలు ఎంతో ఉపయోగపడతాయని చెబుతుండటంతో వాటిని తినేందుకు పట్టణ ప్రజలు, ఉద్యోగస్తులు ఆసక్తి చూపుతున్నారు. కొత్తకోట పట్టణంలోని కర్నూల్ రోడ్డులో పదుల సంఖ్యలో జొన్నరొట్టె సెంటర్లు వెలిశాయి. చాలామంది మహిళలు వీటినే ఉపాధిగా మలుచుకుని రెండుచేతులా సంపాదిస్తున్నారు. ఆహారపు అలవాట్లలో మార్పులు ప్రస్తుతం ప్రజలు ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెడుతున్నారు. రుచిని కాకుండా ఆహార ఉపయోగాల విషయాలపై దృష్టి పెడుతున్నారు. వైద్యుల సూచనలతో దురలవాట్లను మార్చుకుని జంక్‌ఫుడ్‌తో కలిగే అనర్థాలను తెలుసుకుని జొన్నరొట్టె వైపు ఆసక్తి పెంచుకుంటున్నారు. ఈ ఆహారంలో మంచి పోషక విలువలు కలిగి ఉండటంతో జొన్నరొట్టెలకు డిమాండ్ పెరిగింది. ఒక్కరొట్టె రూ.10 నుంచి 15 వరకు పలుకుతోంది.చాలామంది ఇష్టంగా తింటున్నారు నేను ఇంట్లోనే జొన్న రొట్టెలు చేసి అమ్ముతాను. కాలనీలోని వారు, ఉద్యోగస్తులు ఎంతో ఇష్టంగా ఆర్డర్ ఇచ్చి రొట్టెలు చేయించుకుంటారు. ప్రజలకు జొన్నరొట్టెలు తినడం అలవాటు కావడంతో నాకు గిరాకీ బాగా పెరిగింది. ఒక్కోసారి 50 నుంచి 60 రొట్టెలు అమ్ముతాను. – జ్యోతి, కొత్తకోట -
ఢ్రై ఫ్రూట్స్ తింటే లావెక్కుతారా?
కొవ్వులెక్కువగా ఉన్నాయి కాబట్టి డ్రైఫ్రూట్స్ తింటే లావెక్కుతారని అనుకోవడం అపోహ మాత్రమేనని అంటున్నారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. కాకపోతే వీటిని మరీ ఎక్కువ మోతాదులో తినడం సరికాదని సూచిస్తున్నారు. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే కొవ్వులు శరీరానికి మేలు చేసేవేనని... శరీరం శోషించుకోగల కొవ్వులు కూడా వీటిలో ఉండటం వల్ల వీటితో మేలేగానీ కీడు లేదని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. సాధారణంగా ప్రతిరోజూ 30గ్రాముల వరకూ డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మేలన్నది అంచనా. కానీ.. వీటిల్లోని కొవ్వుల మోతాదు వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు జీడిపప్పు, పిస్తాల్లో కొవ్వుల శాతం దాదాపు 50 గ్రాముల వరకూ ఉంటే కొన్ని ఇతర డ్రైఫ్రూట్స్‌లో 70 శాతం వరకూ ఉంటుంది. అయితే ఈ కొవ్వులు మోనోశాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు. కొలెస్ట్రాల్ మోతాదులను తగ్గించడం ద్వారా ఇవి శరీరానికి మేలు చేస్తాయి. కేలరీలు, కొవ్వులు ఎక్కువగా ఉన్నప్పటికీ డ్రైఫ్రూట్స్‌ను తినడం ఆపాల్సిన అవసరం లేదని ఇప్పటికే పలు అధ్యయనాలు రుజువు చేశాయని, రోజూ వీటిని తిన్నవారు దీర్ఘకాలంలో బరువు పెరగడం చాలా తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. తాము మొత్త 30 అధ్యయనాలను సమీక్షించామని అన్నింటిలోనూ డ్రైఫ్రూట్స్ తినడానికి బరువు పెరగడానికి మధ్య సంబంధం లేదని స్పష్టం చేశాయని.. ఒక అధ్యయనంలో ఒక పద్ధతి ప్రకారం డ్రైఫ్రూట్స్ తిన్న వారు బరువు తగ్గినట్లు తెలిసిందని ఒక శాస్త్రవేత్త వివరించారు. -
ఉబ్బసానికి విరుగుడు మితాహారమా?
ఉబ్బసంతో బాధపడేవారు వీలైనన్ని తక్కువ కేలరీలను తీసుకోవడం ద్వారా వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చునని అంటున్నారు హాప్కిన్స్ మెడిసిన్ శాస్త్రవేత్తలు. అంతేకాకుండా శరీరానికి అందే కేలరీలు కొవ్వుల నుంచి వచ్చినా.. చక్కెరల నుంచి వచ్చినా ఈ ఫలితాల్లో తేడాలేవీ ఉండవని వారు ఎలుకలపై జరిపిన పరిశోధనల ఆధారంగా చెబుతున్నారు. అధికాహారం కారణంగా ఊబకాయులైన వారి ఊపిరితిత్తులు మంట/వాపులకు గురవుతాయని.. ఫలితంగా ఉబ్బస లక్షణాలు కనిపిస్తాయని.. మంట/వాపు నివారణకు మందులు వేసుకుంటే పరిస్థితి సాధారణమవుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వసెవోలోడ్ పొలోట్స్‌కీ అంటున్నారు. ఎలుకలకు తాము నాలుగు రకాల ఆహారాన్ని అందించి వాటిపై పరిశీలనలు జరిపామని, ఎనిమిది వారాల తరువాత తక్కువ కేలరీలు తీసుకున్న ఎలుకల ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉన్నట్లు తెలిసిందని, కొవ్వు ఎక్కువగా తీసుకున్న ఎలుకల ఊపిరితిత్తుల్లోని వాయుమార్గాలు సాధారణం కంటే చాలా రెట్లు కుంచించుకుపోయినట్లు తెలిసిదని వివరించారు. దీన్నిబట్టి మితాహారానికీ ఊబ్బస లక్షణాలకూ మధ్య సంబంధం ఉన్నట్లు తాము అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఉబ్బసం వ్యాధికి మరింత మెరుగైన చికిత్స కల్పించేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని అన్నార -
మంచి కొవ్వును పెంచే మందులొస్తున్నాయి
శరీరానికి మేలు చేసే హెచ్‌డీఎల కొవ్వు మోతాదును ఎక్కువ చేసేందుకు సిడ్నీలోని యూనివర్శిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన మార్గాన్ని ఆవిష్కరించారు. కొవ్వు తగ్గించేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మందులన్నీ ఎల్డీఎల్ కొవ్వుపై మాత్రమే పనిచేస్తూండగా... హెచ్‌డీఎల్‌ను పెంచే మందులేవీ మార్కెట్లో లేవు. అయితే ఓఆర్పీ2 అనే ప్రొటీన్ కొవ్వును ఒక కణం నుంచి ఇంకోదానికి సరఫరా చేస్తున్నట్లు సిడ్నీ శాస్త్రవేత్తలు గుర్తించడంతో ఈ పరిస్థితిలో మార్పు రానుంది. కణం లోపలి భాగాల్లో ఉండే కొవ్వును ఈ ప్రొటీన్ ఉపరితలం పైకి తీసుకొస్తుందని.. కణం స్థిరంగా ఉండేందుకు ఈ కొవ్వు ఉపయోగపడుతుందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త రాబ్ యాంగ్ అంటున్నారు. ఈ కారణంగానే శరీరంలోని 90 శాతం కొవ్వు కణాల ఉపరితలం పైనే కనిపిస్తుందని వివరించారు. శరీరానికి మంచి చేసే హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను కణ త్వచం తయారుచేస్తూంటుందని కణంలో కొవ్వు ఎక్కువగా ఉన్నప్పుడు అందులో కొంత ఇలా హెచ్డీఎల్గా మారుతుందని తెలిపారు. ఓఆర్పీ ప్రొటీన్‌ను నియంత్రించడం ద్వారా ఎక్కువ మోతాదులో కొవ్వు త్వచాన్ని చేరేట్టు చేయవచ్చునని... తద్వారా హెచ్‌డీఎల్ ఉత్పత్తి ఎక్కువవుతుందని తెలిపారు. -
ఉబ్బసానికి చేప విరుగుడు!
ఏడాదికి ఒకసారి ఉబ్బసం రోగులకు హైదరాబాద్‌లో ఇచ్చే చేపమందుపై ఎన్నో వివాదాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. వీటి మాటెలా ఉన్నా ఉబ్బసంతో బాధపడుతున్న వారు మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకు చేపలు ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు లా ట్రోబ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ అధ్యయనంలో భాగంగా కొవ్వులు ఎక్కువగా ఉన్న చేప రకాలను ఆహారంగా తీసుకున్న ఉబ్బసం రోగుల ఊపిరితిత్తుల పనితీరు ఆరునెలల్లో మెరుగైనట్లు గుర్తించారు. చిన్నతనంలో వచ్చే ఉబ్బసానికి చేపలతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం మెరుగైన చికిత్స అనేందుకు ఇదో తార్కాణమని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మారియా పాపామైకేల్ అంటున్నారు. ఉప్పు, చక్కెర, సాధారణ కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారంతో ఉబ్బసం లక్షణాలు తీవ్రమవుతాయని ఇప్పటికే గుర్తించగా చేపల్లో ఉండే ఒమేగా –2 ఫ్యాటీ యాసిడ్లు దీనికి మినహాయింపు అని తమ అధ్యయనం చెబుతోందని అన్నారు వారానికి కేవలం రెండు సార్లు మాత్రమే చేపలు ఆహారంగా తీసుకున్నా ఊపిరితిత్తుల్లోని మంట/వాపు తగ్గే అవకాశముందని చెప్పారు. గ్రీస్, ఆస్ట్రేలియాల్లోని 5 – 12 మధ్య వయసు పిల్లలపై తాము ఈ అధ్యయనం చేసినట్లు చెప్పారు. కొంతమందికి సాధారణ ఆహారం, ఇంకొంతమందికి దాదాపు 150 గ్రాముల కొవ్వులున్న చేపలు ఆహారంగా ఇచ్చామని, ఆరు నెలల తరువాత పరిశీలించగా ఊపిరితిత్తుల మంట/వాపు 14 యూనిట్ల వరకూ తగ్గిందని వివరించారు. -
కండ కలిగితే కొవ్వు ఉండదోయ్
బరువుకు కరువు ఏర్పడాలంటే ఒళ్లు వొంచక తప్పదు. తినే ఆహారం, చేసే శ్రమ... ఇవే మన శరీరాన్ని అదుపులోనూ ఆరోగ్యంగానూ ఉంచుతాయి. అంతేకాదు మన మెటబాలిజం (జీవక్రియలు) కూడా చురుగ్గా ఉండాలి. వయసు పెరిగే కొద్ది మెటబాలిజం మందకొడిగా మారుతుంది. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం వస్తుంది. వ్యాయామం ద్వారా జీవక్రియలను కూడా చురుగ్గా ఉంచి బరువు పెరగకుండా కాపాడుకోవచ్చు. రెస్టింగ్ మెటబాలిజమ్ అంటే... జీవక్రియలు జరగాలంటే ఆహారంతో అందే శక్తి కావాలి. రెస్టింగ్ మెటబాలిజమ్ అంటే... మనం ఏ పనీ చేయకుండా విశ్రాంతిగా కూర్చున్నప్పుడు కూడా శరీరంలో జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. అందుకోసం ఒంట్లోని కొవ్వులు దహించుకుపోతుంటాయి. దాన్నే రెస్టింగ్ మెటబాలిజమ్ అంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ విశ్రాంతిగా ఉన్నప్పుడు దహించుకుపోయే కొవ్వులు తగ్గుతుంటాయి. అందుకే ఓ వయసు తర్వాత బరువు పెరగడం మొదలవుతుంది. వ్యాయామంతో రెస్టింగ్ మెటబాలిజమ్‌లో చురుకుదనం పెరుగుతుంది. వయసుతో పాటు తగ్గాల్సిన రెస్టింగ్ మెటబాలిజమ్‌ను వ్యాయామం అలా స్థిరంగా ఉండేలా చూస్తుంది. ఫలితంగా కొవ్వుల దహనమూ కొనసాగుతుంది. ఫలితంగా ఒంట్లో కొవ్వు పేరుకోవడం, కొవ్వులు పెరగడం జరగదు. దాంతో బరువు పెరగకపోవడంతో పాటు ఆరోగ్యమూ సమకూరుతుంది.ఇలా వ్యాయామాలు బరువును తగ్గించడానికి, అదుపులో ఉంచడానికి దోహదపడతాయన్నమాట. ఇన్ని రకాల వ్యాయామాలు ఎందుకు? ఇష్టం కదా అంటూ ఆహారంలో వరుసగా మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు లేదా ఏ పిండిపదార్థాలు తీసుకుంటూ ఉంటే బరువు పెరగడం ఖాయం. ఆహారాన్ని ఎలాగైతే భిన్నంగా ఎంచుకుంటూ ఉంటే ప్రయోజనమో వ్యాయామాన్ని కూడా భిన్నంగా ఎంచుకుంటూ ఉంటే మరింత ప్రయోజనం కలుగుతుంది. ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకున్నట్టే వ్యాయామాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. కలిగించే ప్రధాన ప్రయోజనాల ఆధారంగా వ్యాయామాలను రకరకాలుగా వర్గీకరించవచ్చు. ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు, ఏరోబిక్ వ్యాయామాలు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలు, కోర్ ఎక్సర్సైజెస్... ఇవన్నీ ఉన్నాయి. వీటిని మార్చి మార్చి చేస్తూ ఉంటే వ్యాయామాల్లోనూ సమతౌల్యత సాధించవచ్చు. ఎప్పటికీ బరువు పెరగకుండా ఒకేలా ఆరోగ్యంగా, ఫిట్‌గా, చురుగ్గా, ఆకర్షణీయంగా ఉండవచ్చు. ఇన్ని రీతులూ... ఎలా చేయాలి? వ్యాయామాలను గరిష్ట ప్రయోజనం కోసం మార్చి మార్చి చేయడాన్ని ‘ట్రైనింగ్ రెజీమ్’గా చెప్పవచ్చు. మొదట ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలను కనీసం 10, 15 నిమిషాల పాటు చేయాలి. ఆ తర్వాత డైనమిక్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్, స్టాటిక్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ చేయాలి. స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్లోనే మధ్య మధ్య ఏరోబిక్ ప్రక్రియల్లో ముఖ్యమైన జాగింగ్‌ను కొనసాగించాలి. ఇలా చేయడం ద్వారా మీ వ్యాయామం సెషన్లో మీ గుండె వేగాన్ని పెంచడం సాధ్యమవుతుంది. సాధారణంగా 72 సార్లు స్పందించే గుండె వేగాన్ని కనీసం 150 సార్లకు పెంచడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. గుండె సామర్థ్యం, ఆరోగ్యం పెరుగుతాయి. (అయితే ఇందుకోసం క్రమంగా వ్యాయామ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోవాలి. గుండెకు కూడా ఇది మంచిది). కాస్త స్ట్రెచింగ్, ఆ తర్వాత ఏరోబిక్ చేసి, స్ట్రెంగ్త్ వ్యాయామాలు చేస్తూనే మధ్య మధ్య ఏరోబిక్ వ్యాయామంగా జాగింగ్ లేదా ఇతర వ్యాయామాలను కొద్ది నిమిషాలు కొనసాగిస్తూ... దాన్నే విశ్రాంతిగా పరిగణిస్తూ మీ మొత్తం అవిశ్రాంత వ్యాయామాన్ని కనీసం 30 నిమిషాల నుంచి 60 నిమిషాలు చేయాలి. తొలుత 30 నిమిషాలు చేస్తూ ఆ సమయాన్ని క్రమంగా 60 నిమిషాలకు పెంచవచ్చు. ఇలా అన్ని రకాల వ్యాయామాలను పూర్తిచేసేలా ఒంటికి వ్యాయామాన్ని అందించడాన్ని సర్క్యూట్ ట్రైనింగ్ అంటారు. మీరు జిమ్‌లోనే చేస్తున్నప్పుడు స్థలాభావం వంటివి ఉంటే స్ట్రెంగ్త్ వ్యాయామ రీతుల మధ్యన ప్రతిసారీ ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు ఉన్నచోటే పరుగు పెట్టవచ్చు. సర్క్యూట్ ట్రైనింగ్‌కు డబ్బు ఖర్చవుతుందా? ఖర్చు : జిమ్‌లో చేరడం లేదా ఉపకరణాలు కొనుక్కోవడానికి డబ్బు ఖర్చు అవుతుంది. అంతగా ఖర్చు చేయలేమని అనుకున్నప్పుడు మీ సొంత శరీర బరువును ఉపయోగించి చేసే పుష్–అప్స్, సిటప్స్, పుల్–అప్స్తోనూ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్లు చేయవచ్చు. పరుగెత్తడానికి ఎలాంటి ఖర్చూ అవసరం లేదు కదా. సర్క్యుట్ ట్రైనింగ్ ఎలా మీకు అనువైన, సంతృప్తికరమైన రీతిలో ఉండే సర్క్యూట్‌ను మీరే రూపొందించుకోవచ్చు. కాస్త అనుభవం తర్వాత దేని తర్వాత ఏది చేస్తే మీకు సంతృప్తి కలుగుతుందో మీరే నిర్ణయించుకొని దాన్ని కొనసాగించుకోవచ్చు. ఔట్డోర్స్లోమీకు జిమ్‌కు వెళ్లే అవకాశం లేదా స్తోమత లేకపోతే ఏదైనా స్కూల్ గ్రౌండ్ లేదా కాలేజీ గ్రౌండ్ లేదా స్థలం ఉంటే మీ ఇంటి పెరట్లోనూ మీరు వ్యాయామాలు చేయవచ్చు.వ్యాయామం చేయాలనే మనసుండాలేగానీ మార్గం ఉంటుంది. బరువూ తగ్గుతుంది. మెడికల్ ఖర్చులకు, మందులకు అయ్యే ఖర్చూ తగ్గుతుంది. కావాల్సిందల్లా కొంచెం సమయాన్ని మాత్రం ఖర్చు చేయడం. (మరికొన్ని వ్యాయామాలు వచ్చే వారం) ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు వీటినే స్ట్రెచింగ్ వ్యాయామాలు అని కూడా అంటారు. యోగాలోని ప్రాథమిక ఆసనాలన్నీ శరీరాన్ని స్ట్రెచ్ చేసే వ్యాయామంగా ఉపయోగపడతాయి. కాళ్లు చేతులు వేగంగా కదలడానికి, చేతులు చురుగ్గా ఉండటానికి స్ట్రెచింగ్ వ్యాయామాలు దోహదపడతాయి. కీళ్లను ఆరోగ్యంగా ఉంచి అవి వేగంగా ప్రతిస్పందించేలా చేస్తాయి. శరీరాన్ని స్ట్రెచ్ చేయకుండా అంటే సాగదీయకుండా అదేపనిగా బరువులెత్తే వ్యాయామాలు చేస్తే శరీరాకృతి కొంత ఆకర్షణీయం అవుతుందేమో కాని చురుకుదనం కలగకపోవచ్చు. తగినంత చురుకుదనంతో ఏ పనినైనా తేలిగ్గా, సులువుగా చేయగలిగితేనే కదా మనం చేసే ఆ పనికి విలువ. అందుకే ఫ్లెక్సిబిలిటీ పెంచే ఈ వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయి. అందుకే ప్రధాన వ్యాయామాలకు ముందు కనీసం 10 నిమిషాల పాటు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం తప్పనిసరి. వ్యాయామం సెషన్ పూర్తయ్యాక కూడా ఇవే వ్యాయామాలు కామ్డౌట్ వ్యాయామాలుగా చేయడం మరింత మంచిది. యోగా ప్రక్రియలు ఈ స్ట్రెచింగ్ వ్యాయామాలుగా ఎంతగానో ఉపకరిస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే స్ట్రెచింగ్ వ్యాయామాలు ఒంట్లో ఒత్తిడినీ, ఉద్విగ్నతనూ (స్ట్రెస్ అండ్ టెన్షన్‌ను) దూరం చేస్తాయి. అయితే కొంతమంది వీటిపై అంతగా దృష్టి పెట్టరు. పైగా చిన్నచూపు చూస్తారు. బ్యాలెన్స్ ట్రైనింగ్ వ్యాయామాలు సరిగ్గా సాగాలంటే శరీరం బ్యాలెన్స్‌లో ఉండాలి. కనుక శరీరాన్ని బ్యాలెన్స్ చేసే వ్యాయామాలు కూడా ముఖ్యం. ఒక కాలు ముడిచి ఒకే కాలిపై నిలబడటం, ఒంటి కాలిపై చేసే యోగాభ్యాసాలు, ఆసనాలు ఇందుకు ఉపకరిస్తాయి. ఇక ఒంటిని నియమబద్ధంగా ఒంచుతూ చేసే ‘టాయ్ చీ’ కూడా శరీరం బ్యాలెన్స్ తప్పకుండా చేస్తుంది. ఏరోబిక్ ఫిట్నెస్ వీటినే కార్డియో వ్యాయామాలు అనీ, ఎండ్యూరెన్స్ వ్యాయామాలు అని అంటారు. వీటిలో మనం శ్వాస తీసుకోవడం ఎక్కువగా జరుగుతుంది. ఊపిరితిత్తుల్లో నిండే గాలి పెరుగుతుంది. శరీరం తీసుకునే ఆక్సిజన్ పెరుగుతుంది. గుండె వేగం పెరిగి కణకణానికీ ఆక్సిజన్ అంది మనిషి స్టామినా పెరుగుతుంది. కాబట్టి చాలాసేపు పనిచేసినా అలసట రాని తత్వం అలవడుతుంది. సామర్థ్యం ఉంటేనే కదా ఏదైనా సాధించగలిగేది. సాధారణ వ్యాయామంతో మీరు 50 కిలోల బరువును ఎత్తగలరు. కానీ ఆ బరువును అలా ఎత్తి, ఇలా వదిలేస్తే లాభం ఏముంది? దానిని అరగంట పాటైనా మోసుకుంటూ రాగల సామర్థ్యాలు ఈ వ్యాయామాలతోనే సమకూరతాయి. కాళ్లూ చేతులు వేగంగా కదిలిస్తూ డ్యాన్స్లాగా, డ్రిల్ తరహాలో చేయదగిన ఉత్సాహవంతమైన వ్యాయామాలు ఇవి. వేగంగా నడక, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్, వాటర్ ఏరోబిక్స్ అన్నీ ఏరోబిక్ ప్రక్రియలే. కోర్ ఎక్సర్సైజెస్ నడుము ప్రాంతంలో అంటే పొట్ట, వీపు కింది భాగం (లోయర్బ్యాక్)లో ఉండే కండరాలకు వ్యాయామాన్ని ఇచ్చే రీతులను కోర్ ఎక్సర్సైజెస్ అంటారు. శరీరం పై భాగానికీ, కింది భాగానికీ మధ్య అనుసంధానంగా ఉండే భాగాలలోని ఉండే కండరాలను బలంగా చేసే వ్యాయామాలు ఇవి. ఈ కోర్ వ్యాయామాలను బ్రిడ్జెస్, ప్లాంక్స్, ఫిట్నెస్బాల్ వంటి ఉపకరణాలతో మరింత తేలిగ్గా చేయవచ్చు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ రెజీమ్‌లో అందరికీ ఆసక్తి ఉండి, అందరూ చేయాలనుకునే ప్రధాన వ్యాయామ రీతులు ఇవే అని చెప్పవచ్చు. వీటి వల్ల మన ప్రధాన కండరాలు అయిన వీపు భాగంలోని ట్రెపీజ్, లాటిసిమస్ డార్సీ, ఛాతీ భాగంలో బలానికి సూచనగా కనిపించే పెక్టోరాలిస్ మేజర్, చేతుల కండలను చూపించే బైసెప్స్, సిక్స్‌ప్యాక్‌లో కనిపించే రెక్టస్ అబ్డామినిస్, తొడల్లో బలంగా కనిపించే క్వాడ్రసెప్స్, హ్యామ్‌స్ట్రింగ్స్, కాఫ్ మజిల్స్... ఇవన్నీ శక్తిమంతం అయ్యి మంచి షేప్‌లో కనిపిస్తాయి. దాంతో మనిషి ఆకర్షణీయంగా ఆరోగ్యంగా అనిపిస్తాడు. బరువు తగ్గించడంతో పాటు మనిషిని అందమైన సౌష్టవానికి తెచ్చే వ్యాయామలు ఇవి. ఈ వ్యాయామాల్లో బరువులు, ఉపకరణాలు ఉపయోగిస్తారు. నియమబద్ధంగా, నిర్ణీతంగా చేస్తుంటారు. మరికొందరు జిమ్‌లో చేరి చేస్తారు. ఇంకొందరు పిచ్చిగా ఆకర్షితమై వీటికే కట్టుబడతారు. ఒంటి బరువునే ఆధారంగా చేసుకొని పుషప్స్, పులప్స్, అబ్డామినల్ క్రంచెస్, లెగ్ స్క్వాట్స్ వంటి వ్యాయామ రీతులతోనూ వీటిని చేయవచ్చు. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ మీ సందేహాలను ఈ కింది ఈమెయిల్‌కి పంపి, నిపుణులచే సరైన సమాధానాలు తెలుసుకోవచ్చు.oobacolumn@gmail.com -
ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది?
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 46 ఏళ్లు. ఇటీవల నా బరువు అధికంగా పెరిగింది. దాంతో డాక్టర్ దగ్గరికి వెళ్లి కొన్ని పరీక్షలు చేయించుకున్నాను. వీటిల్లో ఫ్యాటీలివర్ అని తేలింది. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? దీని గురించి వివరించండి. – ఆర్. శ్రీధర్ రావు, వరంగల్ కాలేయం కొవ్వుకు కోశాగారం లాంటివి. ఇది కొవ్వు పదార్థాలను గ్రహించి, వాటిని శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంది. ఇది ఒక సంక్లిష్టమైన చర్య. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా... కాలేయంలోని కొవ్వు వినియోగం కాకుండా, అందులోనే చేరుతూ ఉంటుంది. ఇదే క్రమంగా ఫ్యాటీలివర్‌కు దారితీస్తుంది. ఇది రెండు కారణాల వల్ల వస్తుంది. మొదటిది మద్యం ఎక్కువగా తీసుకోవడం, రెండోది మద్యం అలవాటుకు సంబంధించని కారణాలు. ఇందులో స్థూలకాయం, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, హైపోథైరాయిడిజమ్ వంటివీ వస్తాయి. సాధారణంగా ఫ్యాటీలివర్ సమస్య ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించవు. కేవలం అల్ట్రాసౌండ్ స్కానింగ్ (కడుపు భాగం) , కాలేయ సంబంధ పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ సమస్య బయటపడుతుంది. ఇలా ఆ పరీక్షల ద్వారా కాలేయ కణాల్లో కొవ్వు చేరిందని తెలుసుకున్నప్పుడు దాన్ని ఫ్యాటీలివర్‌గా గుర్తిస్తారు. సాధారణంగా ఫ్యాటీలివర్ సమస్యవల్ల 80 శాతం మందిలో ఎలాంటి ప్రమాదమూ ఉండదు. అయితే 20 శాతం మందిలో అది రెండో దశకు చేరుకోవచ్చు. ప్రధానంగా ఇది మెటబాలిక్ సిండ్రోమ్ అనే సమస్యకు కారణమై... గుండెకు, మెదడుకు సంబంధించిన ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉంది. మీకు ఫ్యాటీలివర్ ఉందని నిర్ధారణ అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకొని, దానికి కారణాలను కనుగొని, తగిన మందులు వాడాల్సి ఉంటుంది. కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలి. మామూలుగా మధ్యవయసులో ఉన్నవారికి చాలా పరిమితమైన కొవ్వులు సరిపోతాయి. ఇక జంతు సంబంధమైన కొవ్వులను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. మీరు ఒకసారి మీకు దగ్గరలోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలవండి. కడుపులోకి నీరు వస్తోంది.. కారణం ఏమిటి? నా వయసు 48 ఏళ్లు. నేను రోజూ ఆల్కహాల్ తీసుకుంటాను. నాకు ఈ మధ్య కడుపులో నీరు రావడం, కాళ్ల వాపు రావడం జరిగింది. మా దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. కొన్ని రోజులు వాడాక తగ్గింది. కానీ సమస్య మళ్లీ వచ్చింది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – డి. శ్రీనివాసరావు, కొత్తగూడెం మీకు లివర్ / కిడ్నీ / గుండె సమస్యలు ఉన్నప్పుడు కడుపులో నీరు రావడం, కాళ్ల వాపు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. మీరు ఆల్కహాల్ తీసుకుంటారని చెప్పారు కాబట్టి మీకు లివర్ సమస్య వచ్చి ఉండవచ్చు. అయితే మీకు ఏయే పరీక్షలు చేశారో మీ లేఖలో రాయలేదు. మీకు ఒకసారి కడుపు స్కానింగ్, లివర్ ఫంక్షన్ పరీక్ష, కిడ్నీ ఫంక్షన్ పరీక్ష, కడుపులో నీటి పరీక్ష చేయించుకోవాలి. దాని రిపోర్టులతో మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదిస్తే మీకు తగిన చికిత్స అందిస్తారు. కళ్లు పచ్చగా మారుతున్నాయి... నా వయసు 47 ఏళ్లు. పదేళ్ల క్రితం నాకు ఆపరేషన్ చేసి ఎడమవైపు రొమ్ము తొలగించారు. ఇంతకాలంగా నాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ నెల రోజుల నుంచి కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. ఆకలి కూడా తగ్గింది. నీరసంగా ఉంటోంది. అప్పుడప్పుడూ కడుపులో నొప్పి వస్తోంది. గతంలో రొమ్ముకు వచ్చిన వ్యాధి ఇప్పుడు కడుపులోకి పాకిందంటారా? నాకు తగిన సలహా ఇవ్వండి. – ఒక సోదరి, హైదరాబాద్ మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే క్యాన్సర్ కారణంగా మీకు రొమ్ము తొలగించారని అర్థమవుతోంది. ప్రస్తుతం మీరు కామెర్లతో బాధపడుతున్నారు. గతంలో ఉన్న రొమ్ముక్యాన్సర్ ప్రభావం కాలేయంపైన కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్, కాలేయానికి సంబంధించిన రక్తపరీక్షలు చేయించుకోండి. ఈ పరీక్షల్లో మీ సమస్య బయటపడుతుంది. ఒకవేళ క్యాన్సర్ వల్ల మీ లివర్ ప్రభావితమైతే, దీన్ని వీలైనంత త్వరగా గుర్తించి, వెంటనే చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే మీకు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించి, అవసరమైన చికిత్స తీసుకోగలరు. మలవిసర్జన తర్వాత కడుపునొప్పి... నా వయసు 32 ఏళ్లు. సుమారు ఏడాదిగా నాకు తరచూ కడుపునొప్పి వస్తోంది. విసర్జన తర్వాత కడుపునొప్పి తగ్గుతోంది. మలబద్ధకం, విరేచనాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ, దాంతో చాలా ఇబ్బందిగా ఉంది. డాక్టర్‌ను కలిస్తే మందులు ఇచ్చారు. వాడినప్పుడు కాస్త మామూలుగా అనిపిస్తోంది. మానేయగానే మళ్లీ సమస్య మొదటికి వస్తోంది. నా సమస్య ఏమిటి? దానికి పరిష్కారం సూచించండి. – ఆర్. సాయి ప్రసాద్, కోదాడ మీరు రాసిన లక్షణాలను బట్టి మీరు ఐబీఎస్ (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్)తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మానసికంగా ఆందోళన ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. మీరు ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష చేయించుకుంటే మంచిది. ఆ తర్వాత స్కానింగ్ పరీక్ష కూడా అవసరం కావచ్చు. పరీక్షలు అన్నీ నార్మల్ అని వస్తే మీకు ఐబీఎస్ అని నిర్ధారణ అవుతుంది. ఈ సమస్యకు మొదటి పరిష్కారం మీరు మానసికమైన ఒత్తిళ్లను, ఆందోళనలను తగ్గించుకోవాలి. ఆ తర్వాత కొంతకాలం యాంటీ స్పాస్మోడిక్, అనాల్జిక్ మందులు వాడితే మీ వ్యాధి లక్షణాలు తగ్గుతాయి. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మీ సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
అతి ‘కీటో’ అనర్థమే..!
ఆకుకూరలు, కూరగాయలు, చిక్కుళ్లు... బోలెడన్ని ధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వు... పిడికెడు మాంసం.. కొన్ని పాలు... దీర్ఘాయుష్షు, ఆరోగ్యకర జీవనానికి మేలైన మార్గాలివే! ప్రపంచం మొత్తమ్మీద లక్షల మంది ఆహారపు అలవాట్లను విశ్లేషించి పరిశోధకులు చెబుతున్న విషయమిది! మరి బరువు తగ్గేందుకు, మధుమేహాన్ని దూరం పెట్టేందుకు చాలా మంది అనుసరిస్తున్న కీటోడైట్ మాటేమిటి? ‘‘అతి సర్వత్ర వర్జయేత్’’అని ఓ సామెత ఉంది. ఏ విషయంలోనైనా అవసరానికి మించి వ్యవహరించడం సరికాదన్నది దీని అర్థం. ఆహారం కూడా దీనికి మినహాయింపు కాదంటున్నారు సారా సైడల్‌మ్యాన్. బ్రిగమ్ అండ్ బోస్టన్ విమన్స్ హాస్పిటల్ (అమెరికా)లో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్న ఆమె ఇటీవల ఓ భారీ అధ్యయనాన్ని పూర్తి చేశారు. ప్రపంచం నలుమూలల్లోని దాదాపు 4.5 లక్షల మంది ఆహారపు అలవాట్లు, వారి ఆరోగ్య వివరాలను విశ్లేషించి సారా చెప్పేదేమిటంటే ‘‘మన ఆరోగ్యానికి రోజూ తీసుకునే ఆహారం కంటే ముఖ్యమైనది ఇంకోటి లేనే లేదు’’అని! అంతేకాదు పిండి పదార్థాలను దాదాపుగా మానేసి కొవ్వు, ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న కీటోడైట్‌తో స్వల్పకాలంలో ప్రయోజనం చేకూరవచ్చునేమోగానీ దీర్ఘకాలంలో మాత్రం ఇది మనల్ని తొందరగా కాటికి పంపేస్తుందని అంటారు ఆమె. ప్రపంచంలో ఏ చోట ఉన్న వారికైనా ఈ నియమం వర్తిస్తుందని స్పష్టం చేస్తున్నారు. – సాక్షి, నాలెడ్జ్ సెంటర్ ఇదీ తర్కం... కీటోడైట్‌లో పిండి పదార్థాలు చాలా తక్కువగా.. వీలైతే అస్సలు తీసుకోరాదన్నది ప్రాథమిక నియమం. శరీరానికి కావాల్సిన శక్తి మొత్తం కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లతోనే అందేలా చేయాల్సి ఉంటుంది. వంద శాతం కార్బోహైడ్రేట్ అయిన చక్కెరకూ దూరంగా ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా కీటోడైట్ పాటించే వారు వీలైనంత వరకూ మరపట్టిన అంటే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారన్నదీ మనకు తెలుసు. చక్కెర తగ్గించడం, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకపోవడం అనే రెండు అలవాట్లూ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇందులో వివాదం ఏమీ లేదు. కాకపోతే కీటోడైట్ పేరుతో మనకు మేలు చేసే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కూడా దూరంగా పెట్టడంతోనే వస్తుంది చిక్కంతా! పైగా కార్బోహైడ్రేట్లను తగ్గించడం వల్ల మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి సూక్ష్మపోషకాలు శరీరానికి అందకుండా పోతాయి. తాజా చిక్కుళ్లు, అరటిపండ్లు, ఓట్స్ వంటి వాటిల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. కీటోడైట్ పేరెలా వచ్చిందంటే... కార్బోహైడ్రేట్ల స్థానంలో కొవ్వు నుంచి శక్తి పొందే జీవ క్రియను కీటోసిస్ అంటారు. తక్షణ శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్లు లేకుండా కొవ్వు మాత్రమే అందుబాటులో ఉన్నప్పుడు శరీరం కొవ్వునే దహనం చేసి అవసరమైన శక్తిని పొందుతుంది. ఇలా కొవ్వును శక్తిగా మార్చే ప్రక్రియలో కాలేయంలో కొవ్వు నుంచి కీటోన్స్ అనే రసాయనాలు వెలువడతాయి. కొవ్వును శక్తిగా మార్చే ప్రక్రియలో కీటోన్స్ వెలువడటం, కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్నే ఈ డైట్లో ప్రధానంగా పాటించాల్సి ఉండటంతో దీనికి కీటోడైట్ అనే పేరు వచ్చింది. మరో రెండు అధ్యయనాలు ఏం చెప్పాయంటే... సారా సైడల్‌మ్యాన్ కీటోడైట్ దీర్ఘకాలిక దుష్ప్రభావాల గురించి ఇటీవల యూరప్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రకటించారు. ఇదే సదస్సులో మరో రెండు అధ్యయనాలు కూడా కీటోడైట్ ప్రభావశీలతపై అనుమానాలు వ్యక్తం చేశాయి. పిండి పదార్థాలను పూర్తిగా పరిహరించడం కాకుండా మోస్తరుగా వాటిని ఆహారంగా తీసుకోవడం మేలని ఇవి చెబుతున్నాయి. దీర్ఘకాలపు కీటోడైట్‌తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత సమస్యలు, కేన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని తమ అధ్యయనాల ద్వారా తెలిసిందని పోలండ్‌లోని మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్త మాసెచ్ బనాచ్ అంటున్నారు. యూరప్‌లోని దాదాపు 5 లక్షల మందిపై జరిగిన మరో అధ్యయనం ప్రకారం కూడా తినే తిండిలో పోషకాలు తక్కువగా ఉంటే కొన్ని రకాల కేన్సర్లు వచ్చే అవకాశం ఉందని తేలింది. పిండి పదార్థాలను తక్కువ తీసుకొని వెన్న, మాంసాలను ఎక్కువ తీసుకుంటే రక్తపోటు, కేన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంచనా. పాల ఉత్పత్తులు, మాంసం శరీరంలో మంట/వాపులకు కారణమని, ఇది దీర్ఘకాలంలో కేన్సర్ కణతులు ఏర్పడేందుకు/పెరిగేందుకూ దారితీస్తుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. కీటోడైట్ అస్సలు పనికిరాదా...? కొన్ని అంశాల్లో కీటోడైట్ అద్భుతంగా పనిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొవ్వు ఎక్కువగా, పిండిపదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వేగంగా బరువు తగ్గాలనుకునే వారికి ఉపయోగపడే అంశమే. రక్తంలో చక్కెర మోతాదులను తగ్గించుకోవాలనుకునే వారు కూడా దీన్ని వాడవచ్చు. అంతేకాదు అదుపు చేసేందుకు కూడా సాధ్యం కాని మూర్ఛ లక్షణాలున్న పిల్లలకూ కీటోడైట్‌తో ఎంతో మేలు జరుగుతుందని ఇప్పటికే కొన్ని పరిశోధనలు రుజువు చేశాయి. నిపుణుల మార్గదర్శకత్వంలో పాటించే కీటోడైట్‌తో ఈ రకమైన ఫలితాలు సాధించడం సాధ్యమే. అదే సమయంలో ఇది అందరికీ సమానంగా వర్తించే విషయం కాదన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. పిండి పదార్థాలు తక్కువగా తీసుకునే వారిలో కొందరికి మధుమేహం వచ్చే అవకాశముందని కొన్ని పరిశోధనలు సూచిస్తుండటం ఇక్కడ ప్రస్తావనార్హం. పీచు పదార్థాలతోనే దీర్ఘాయువు... కీటోడైట్ కానీ మరో కొత్త ఆహారపు అలవాటుగానీ చక్కటి ఆరోగ్యానికి దగ్గరి దారి ఏదీ లేదు. కడుపు మాడ్చుకున్న పరిస్థితుల్లో మినహా సాధారణ పరిస్థితుల్లో కొవ్వులుతోనే శక్తిని పొందడం మన శరీరానికి అలవాటు లేని పని. కీటోడైట్‌ను విస్తృత ప్రచారంలోకి తెచ్చిన వారూ చెప్పేది ఇదే. మీ ఆరోగ్య సమస్యకు అనుగుణంగా ఈ ఆహార అలవాటును కొన్ని నెలలే పాటించండి అని! కీటోడైట్‌ను పాటించకపోయినా పాల ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఫుడ్స్, మాంసాలను పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలని ఇప్పటికే బోలెడన్ని అధ్యయనాలు చెబుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే కాయగూరలు, ధాన్యాలు, నట్స్, పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నా సరే చిక్కుళ్లను తరచుగా తీసుకోవడం మేలని సారా సైడల్‌మ్యాన్ వంటి వారు సూచిస్తున్నారు. ఈ రకమైన ఆహారం తీసుకునే వారు మిగిలిన వారి కంటే ఎక్కువ కాలం జీవిస్తారని తమ అధ్యయనంలో తేలిందని సారా చెబుతున్నారు. తెల్లగా తళతళలాడే బియ్యం బదులు ముతక బియ్యం వాడటం, పండ్లు, కాయగూరలను పానీయాల రూపంలో కాకుండా వీలైనంత వరకూ తాజాగా తినడం వల్ల వాటిల్లోని పీచు శరీరానికి చేరుతుందని సారా వివరించారు. -
బరువు తగ్గడానికి ఫుల్లుగా లాగించండి
జీఎమ్ డైట్ ఒక విలక్షణమైన డైట్. తమ సంస్థలోని ఉద్యోగులు బరువు పెరగకుండా ఆరోగ్యకరంగా ఉండాలని ‘జనరల్ మోటార్స్’ సంస్థ అనేక పరిశోధనల తర్వాత ఒక డైట్‌ను రూపొందించింది. ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారాన్ని కడుపునిండా తిన్నప్పటికీ బరువు పెరగరన్నది ఈ డైట్ ప్రక్రియ సిద్ధాంతం. ప్రయత్నించండి... బరువు తగ్గండి. ‘జీఎమ్ డైట్’ అంటే ‘జనరల్ మోటార్స్ డైట్’కు సంక్షిప్తరూపం. ఈ డైట్‌తో కేవలం ఒక వారంలో దాదాపు ఆరేడు కిలోల వరకు తగ్గవచ్చు. వారంలోని ఒక్కో రోజు ఒక్కో విధమైన ఆహారం (ఫుడ్) లేదా ఆహార సముదాయాన్ని (ఫుడ్ గ్రూపును) తీసుకోవడం ఈ డైట్ ప్రత్యేకత. జీఎమ్ డైట్ విధానం కొవ్వులను వేగంగా మండించేలా చేస్తూ బరువు తగ్గిస్తుంది. ఈ విధానంలో ఎప్పుడూ ఒంటికి క్యాలరీలు అవసరమవుతూ ఉంటాయి. అవి దొరక్క ఒంట్లోని క్యాలరీలు దహించుకుపోతూ ఉండటం వల్ల బరువు తగ్గుతుంది. జీఎమ్ డైట్ ఎలా ఉపయోగపడుతుందంటే... జీఎమ్ డైట్లో తీసుకునే ఆహారాలు జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. కొవ్వులను మరింతగా దహనం చేసే సామర్థ్యాన్ని పెంచుతాయి. ఈ ప్రక్రియలో తీసుకునే ఆహారాలు పుష్కలమైన నీటిపాళ్లను కలిగి ఉంటాయి. అందువల్ల ఇవన్నీ ఒంట్లోని కొన్ని వ్యర్థాలు, విషాలు బయటకు వెళ్లేలా చేయడంలో సమర్థంగా పని చేస్తాయి. ఈ డైట్ విధానం వల్ల ప్రయోజనం పొంది, దీన్ని ఆమోదించేవారు చెప్పే మాట ఏమిటంటే... ఐదు రోజుల నుంచి ఏడు రోజుల గడువు ఇస్తూ మాటిమాటికీ ఈ ఆహార ప్రక్రియను రిపీట్ చేస్తూ కొనసాగించడం వల్ల చాలా బరువు తగ్గొచ్చని, మళ్లీ బరువు పెరగకుండా ఉండొచ్చని. ఇంకా ఏమేమి తీసుకోవాలి... దాంతో ప్రయోజనం ఏమిటి? ►ఈ ఆహార ప్రక్రియలో రోజూ 8 – 12 గ్లాసుల నీళ్లు తీసుకుంటూ ఉండటం వల్ల హైడ్రేటెడ్‌గా ఉండటంతో పాటు ఒంట్లోంచి అనవసర పదార్థాలు బయటకు విసర్జితమవుతాయి. ►ఈ ప్రక్రియ సమయంలో వ్యాయామం చేయడం తప్పనిసరి కాదుగానీ అభిరుచి ఉంటే చేయవచ్చు. అలా చేయదలచినప్పుడు మొదటి మూడు రోజులు మాత్రమే చేయాలి. ► ఈ ప్రక్రియను అనుసరించేవారు ప్రతిరోజూ రెండు నుంచి మూడు గిన్నెల (బౌల్స్‌లో) ‘జీఎమ్ వండర్ సూప్’ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సూప్‌ను క్యాబేజ్, సెలెరీ, టొమాటోలు, ఉల్లిగడ్డలు, బెల్పెప్పర్స్తో తయారుచేస్తారు. ఇది మనమూ చేసుకోవచ్చు. పై పదార్థాలతో మనం చారు కాచుకున్నట్లుగానే దీన్ని తయారు చేసుకోవచ్చు. జీఎమ్ డైట్ పాటించే సమయంలో కొన్ని సూచనలు ► జీఎమ్ డైట్ పాటించేవారు కాఫీలు తాగవచ్చా అనే సందేహం వస్తుంది. కాఫీలను నిపుణులు సిఫార్సు చేయరు. అయితే హెర్బల్ టీ మాత్రం పరిమితంగా కొన్నిసార్లు తీసుకోవచ్చు. ►జీఎమ్ వండర్సూప్కు ఏవైనా ప్రతిబంధకాలు ఉన్నాయా అని కొందరు అడుగుతుంటారు. అది ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా రోజులో రెండు మూడు సార్లైనా దీన్ని తీసుకోవచ్చు. డైట్ పాటించే సమయంలో ఆకలిగా అనిపించినప్పుడు దీన్ని తీసుకోవచ్చు. ► డైట్ ప్లాన్‌లో ఉండగా ఆల్కహాల్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. ఆల్కహాల్‌తో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలు ఏవీ లేవు. ► డైట్ ప్లాన్‌లో ఉన్నప్పుడు బయట తినాల్సిన పరిస్థితి ఏర్పడితే బయటి ఆహారం తీసుకోవచ్చా అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. అయితే డైట్‌ప్లాన్‌లో ఉన్నప్పుడు బయటి ఆహారం ఎలాంటి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. మీరు పూర్తిగా పాటించగలిగే సమయంలోనే డైట్‌ను ప్లాన్ చేసుకోవాలి. బయటి ఆహారాల్లో ప్రాసెస్ చేసినవి ఉండవచ్చు. హానికారక రసాయనాలు కలిసిన ఆహారపదార్థాలూ ఉండవచ్చు. ఉదాహరణకు బ్రెడ్ తయారీకి ఉపయోగించే పిండిలోనూ, ఇతర మాంసాహారాల్లోనూ కొన్ని కండిషనర్లు, సల్ఫేట్స్, మోనోసోడియమ్ గ్లుటామేట్ వంటి రుచిని ఇచ్చే చైనా ఉప్పు వంటివి, నైట్రేట్లు, ఫాస్ఫేట్లు ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే తీపిని ఇచ్చే అనేక పదార్థాలతో పాటు ఎక్కువ మోతాదులో ఉప్పు కూడా ఉండవచ్చు. అసలు జీఎమ్ డైట్ పాటించేదే వీటన్నింటి నుంచి దూరంగా ఉండటం కోసమే. అలాంటప్పుడు అవి తినాల్సి వస్తే జీఎమ్ డైట్ పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలేమీ ఒనగూరవు. ►నాలుగోరోజున పాలు తీసుకోవాలని జీఎమ్ డైట్ నిబంధన కదా... ఒకవేళ పాలు అంత ఇష్టంగా లేకపోతే మజ్జిగ లేదా పెరుగు తినవచ్చా అని చాలామందిలో సందేహాలు వస్తుంటాయి. అయితే పాలు తీసుకోవడం అంతగా ఇష్టపడకపోతే పెరుగు లేదా మజ్జిగ తీసుకోవచ్చు. అయితే పెరుగు లేదా మజ్జిగలో ఎట్టిపరిస్థితుల్లోనూ చక్కెర కలుపుకోకూడదు. ► జీఎమ్ డైట్‌ను అనుసరించడంలో భాగంగా చపాతీలు, గోధుమలు, తృణధాన్యాలు, బ్రెడ్ వంటివి ఏమాత్రం తీసుకోకూడదు. ►రోజూ పొద్దున్నే నిమ్మనీళ్లలో తేనె కలుపుకొని తాగడం మంచిదంటారు కదా... మరి జీఎమ్ డైట్ సమయంలో ఈ పని చేయవచ్చా అని కొంతమందిలో ఒక సందేహం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ అనుసరించేవారు తేనె తీసుకోకూడదు. దానికి బదులు నిమ్మకాయనీరు (చక్కెర లేకుండా) ఎంతైనా తీసుకోవచ్చు. ►శాకాహారులు మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా తీసుకోదగినవి... కొబ్బరినూనె, ఆలివ్‌నూనె, వెన్న లేదా నెయ్యి. కొందరు మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా పెరుగు కూడా తీసుకుంటారు. అది కూడా మంచిదే. ► జీఎమ్ డైట్లో భాగంగా ఉప్పు, మిరియాలు లేదా ఇతర సుగంధద్రవ్యాలు (స్పైసెస్) తీసుకోవచ్చా అంటే... ఉప్పు చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ డైట్లో ఉన్నవారు చాలా ఎక్కువగా నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మూత్రం రూపంలో మనలోంచి వెళ్లిపోయే లవణాల కోసం ఉప్పు తీసుకోవడం అవసరమే అయినా దాన్ని చాలా పరిమితంగానే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. సముద్రపు ఉప్పు అయితే ఇంకాస్త మంచిది. మిరియాల వంటి చెట్ల నుంచి వచ్చే (హెర్బల్) సుగంధద్రవ్యాలన్నీ తీసుకోవచ్చు. మీ ఆహారానికి మంచి ఫ్లేవర్ తెచ్చుకొని, తినేందుకు అనువైనవిగా చేసుకునేందుకు ఈ డైట్లో స్పైసెస్ ఒక మంచి మార్గం. ►జీఎమ్ డైట్లో భాగంగా ఎండుఫలాలను (నట్స్) తీసుకోవడం ఏమాత్రం సరికాదు. అయితే మొదటిరోజున, మూడోరోజున... ఇలా జీఎమ్ డైట్ అనుమతించిన రోజుల్లో సాధారణ తాజా ఫలాలను మాత్రం తీసుకోవచ్చు. నట్స్ లేదా డ్రైఫ్రూట్స్‌లో పోషకాలన్నీ చాలా గాఢతతో చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొద్ది ఆహారంతోనే ఎక్కువ పోషకాలు ఒంట్లోకి వెళ్తాయి. అందుకే జీఎమ్ డైట్ పాటిస్తున్న కాలంలో వాటిని తీసుకోడానికి వీల్లేదు. అయితే డైట్ ప్లాన్ ముగిశాక మాత్రం... చాలా కొద్ది కొద్ది పరిమితుల్లో అప్పుడప్పుడు మాత్రం వాటిని తీసుకోవచ్చు. ► జీఎమ్ డైట్ ప్లాన్ వ్యవధి ముగిశాక ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నది చాలామందిలో ఉండే ఒక సందేహం. ఎవరికి వారు తమ సాధారణ ఆహారాన్ని తీసుకోవచ్చు. అయితే మునపటిలా ఏది పడితే అది... ఎంత పడితే అంత, ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా... మంచి ఆరోగ్యకరమైన సమతుల ఆహారం, నిర్ణీతమైన వేళలకు తింటూ మంచి జీవనశైలిని పాటించాలి. మంచి సమతుల ఆహారం అంటే... మీ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు అన్నీ సమపాళ్లలో అందేలాంటి భోజనం. అందులో ఆకుకూరలు, కాయగూరల వంటివి చాలా ఎక్కువగా ఉండాలి. తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి. పొట్టు తీయని హోల్ గ్రెయిన్స్ తినడం చాలా మంచిది. అప్పుడు మాత్రమే జీఎమ్ డైట్‌తో ఒనగూరిన ఫలితాలు కాస్తంత ఎక్కువ రోజులు ఉంటాయి. ► జీఎమ్ డైట్ ప్లాన్ వ్యవధి ముగిశాక... యథాతథంగా తింటున్నప్పుడు మళ్లీ బరువు పెరుగుతామా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అవును... ముందుగా పేర్కొన్నట్లు మంచి సమతులాహారం తీసుకోకుండా... ఇష్టం వచ్చినట్లుగా తింటూ సక్రమమైన జీవనశైలి పాటించకపోతే... చాలా కొద్దికాలంలోనే మళ్లీ బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ. అయితే తగ్గిన బరువు అలాగే ఉండాలంటే మాత్రం తప్పనిసరిగా మంచి ఆహారపు అలవాట్లు, మంచి జీవనశైలిని అనుసరించాలి. అయితే కొందరిలో థైరాయిడ్ వంటి ఆరోగ్యకారణాల వల్ల బరువు పెరుగుతుంటే మాత్రం వారిలో ఈ డైట్ వల్ల ప్రయోజనం ఉండదు. వారు తమకు ఉన్న అసలు సమస్య (అండర్లైయింగ్ ప్రాబ్లమ్)కు చికిత్స తీసుకోవాలి. ► జీఎమ్ డైట్‌ను మొదలు పెట్టాక అదేపనిగా దీన్ని కొనసాగించవచ్చా... అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే నిర్ణీత వ్యవధి కోసం దీన్ని పాటించాక... మళ్లీ మొదలు పెట్టడానికి తప్పకుండా గ్యాప్ ఇవ్వాలి. జీఎమ్ డైట్ప్లాన్నే ఒక జీవనశైలి అలవాటుగా మార్చుకోకూడదు. ఏదైనా డైట్‌ప్లాన్ మళ్లీ ప్రారంభించాలని అనుకుంటే మాత్రం... కనీసం రెండు వారాల వ్యవధి తర్వాత మళ్లీ ఆ డైట్‌ప్లాన్ మొదలుపెట్టాలి. ► జీఎమ్ డైట్ పాటిస్తున్నప్పుడు యోగా చేయవచ్చా లేదా అన్నది చాలామందిలో ఉండే సందేహం. అయితే జీఎమ్ డైట్ పాటిస్తూ యోగా చేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. వ్యాయామం చేయాలన్న నియమేమీ లేదుగానీ... ఒకవేళ ఇష్టమై చేస్తుంటే మాత్రం మంచిదే. అయితే చాలా శ్రమతో కూడుకున్న వ్యాయామాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. యోగాలాంటివీ, శారీరక శ్రమ లేనివి మాత్రం మామూలుగానే చేసుకోవచ్చు. గమనిక : జీఎమ్ డైట్‌ను పాటించే సమయంలో మొదటి రెండు రోజులు తగిన ప్రోటీన్, మిగతా రోజుల్లో అన్ని పోషకాలు అందక కొందరిలో సమస్యలు రావచ్చు. అందుకే దీన్ని ప్రారంభించాలనుకున్న వారు ఒకసారి డాక్టర్ లేదా డైట్ నిపుణులను సంప్రదించి, తమ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా డైట్‌ప్లాన్ పొంది అప్పుడు మొదలుపెట్టడం మంచిది. జీఎమ్ డైట్ ప్రతికూలతలు ఈ ఆహార ప్రక్రియలో కొన్ని రకాల ప్రతికూలతలు ఉన్నాయి. అవి... ►ఇది బరువు తగ్గిస్తుంది. కానీ ఈ ఆహారం బరువును ఎలా తగ్గిస్తుందన్న విషయంలో ఎలాంటి నిరూపిత అధ్యయనమూ లేదు. ►ఈ ఆహారం సమతులాహారం కాదు. దీన్ని తీసుకున్నప్పుడు కొన్ని రకాల అసంతృప్తులు, ఆకలి ఉంటాయి. రకరకాల ఆహారాలు తీసుకుంటున్నప్పుడు మనకు అవసరమైన కొన్ని సూక్ష్మపోషకాలు ఒంటికి అందకపోవచ్చు. ►వారంలోని చాలా రోజుల్లో ఒంటికి అవసరమైన ప్రోటీన్ అందదు. అందినది చాలా తక్కువ. అది సరిపోదు. ► ముందుగా చెప్పినట్లే చాలా సందర్భాల్లో ఒంటికి అవసరమైన అన్ని పోషకాలు అందవు. ముఖ్యంగా మొదటి మూడు రోజులూ ఒంటికి అవసరమైన కొవ్వులు, విటమిన్ బి12, ఐరన్, క్యాల్షియమ్ వంటివి లోపించే ప్రమాదం ఉంది. ►జీఎమ్ డైట్‌తో ఒనగూరే ప్రయోజనం కేవలం తాత్కాలికం. అందుకే కొంత వ్యవధి ఇస్తూ మాటిమాటికీ చేయాలంటూ దీనితో ప్రయోజనం పొంది, దీన్ని ఆమోదించిన వారు చెబుతుంటారు. జీఎమ్ డైట్ పాటించే పద్ధతి డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
కొవ్వుతోనే కొవ్వుకు కోత
వజ్రాన్ని కోయాలంటే వజ్రమే కావాలట. ఉష్ణాన్ని చల్లబరచడం ఉష్ణానికే సాధ్యమట. తెలుగులో తరచూ వాడే రెండు సామెతలివి. కీటో డైట్ కూడా పై సామెతల్లాగే పనిచేస్తుందేమో!?బరువు పెరగడం అంటే కొవ్వు పెరగడమే కదా. కొవ్వు పేరుకుంటేనే కదా ఊబకాయం వచ్చేది! కీటోజెనిక్ ఫుడ్‌ను తీసుకుంటే...కొవ్వును కొవ్వే కోసేస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ట్రై చేసి చూడండి.బరువు తగ్గడానికి ఉన్న ఆహార ప్రక్రియల్లో అత్యంత ప్రాచుర్యం ఉన్న వాటిల్లో కీటోజెనిక్ డైట్ చాలా ప్రధానమైనది. దీన్నే సంక్షిప్తంగా ‘కీటో’ డైట్ అని కూడా అంటుంటారు. ఒక్క బరువు తగ్గడం మాత్రమే గాక... బరువుతో వచ్చే అనర్థాలకు అంటే... డయాబెటిస్, క్యాన్సర్ వంటివాటికీ ఇది సమర్థంగా పనిచేస్తుందని కొందరి నమ్మిక. అదేంకాదు... ఎపిలెప్సీ, అల్జిమర్స్ వ్యాధుల నివారణకూ ఇది తోడ్పడుతుందని కొందరు నిపుణులు చెబుతుంటారు. కీటోజెనిక్ డైట్ అంటే... ఇందులో పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్) చాలా తక్కువ. కొవ్వులు చాలా ఎక్కువ. మనకు కార్బోహైడ్రేట్ల నుంచి తక్షణ శక్తి సమకూరుతుందన్న విషయం తెలిసిందే కదా. అయితే కీటో డైట్లో ఈ శక్తిని కొవ్వుల నుంచి పొందుతాం అన్నమాట. ఇలా కార్బోహైడ్రేట్ల స్థానంలో కొవ్వుల నుంచి శక్తి పొందే జీవక్రియను ‘కీటోసిస్’ అంటారు. ఇలా తక్షణ శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్లు అందుబాటులో లేక కేవలం కొవ్వు మాత్రమే అందుబాటులో ఉన్నప్పుడు శరీరం కొవ్వునే దహనం చేసి తమకు అవసరమైన శక్తిని పొందుతుంది. (ప్రోటీన్, కార్బోహైడ్రేట్... ఈ రెండు పోషకాల్లో 1 గ్రాము నుంచి 4 క్యాలరీల శక్తి పుడుతుంది. అదే 1 గ్రాము కొవ్వునుంచి 9 క్యాలరీల శక్తి ఆవిర్భవిస్తుంది). ఇలా కొవ్వును శక్తిగా మార్చే ప్రక్రియలో కాలేయంలో కొవ్వు నుంచి కీటోను అనే రసాయనాలు వెలువడుతాయి. కొవ్వును శక్తిగా మార్చే ప్రక్రియలో కీటోన్లు పుడుతుంటాయి కాబట్టి దీన్ని కీటోజెనిక్ డైట్ అంటారు. ఈ ఆహారంలో రక్తంలో చక్కెర పాళ్లు గణనీయంగా తగ్గిపోతాయి. ఇలా చక్కెర తగ్గడం, కీటోన్లు పెరగడం అనేది చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది కాబట్టి ఈ డైట్ చాలా ప్రాచుర్యం పొందింది. కీటోజెనిక్ డైట్స్లోని రకాలు : కీటోజెనిక్ డైట్‌లోనే ఇంకా చాలా రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని... స్టాండర్డ్ కీటోజెనిక్ డైట్ (ఎస్కేడీ) : ఇందులో కార్బోహైడ్రేట్లు చాలా చాలా తక్కువ. ప్రోటీన్లు ఒక మోస్తరు. ఇక కొవ్వుల విషయానికి వస్తే వాటి మోతాదు చాలా ఎక్కువ. ఒక్కమాటలో చెప్పాలంటే... ఇందులో కొవ్వులు 75శాతం, ప్రోటీన్లు 20శాతం, కార్బోహైడ్రేట్లు 5 శాతం మాత్రమే ఉంటాయి. సైక్లికల్ కీటోజెనిక్ డైట్ (సీకేడీ) ఇందులో ఒక పీరియాడిసిటీ ఉంటుంది. అంటే... వారంలోని ఐదు రోజులు పైన పేర్కొన్న ఎస్కేడీ డైట్ ఇస్తూ... మిగతా రెండు రోజులు మాత్రం కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోవచ్చు. టార్గెటెడ్ కీటోజెనిక్ డైట్ (టీకేడీ) ఈ తరహా కీటోజెనిక్ డైట్లో సాధారణంగా స్టాండర్డ్ కీటోజెనిక్ డైట్ తీసుకుంటూ... బాగా వ్యాయామం చేస్తున్నప్పుడు మాత్రం కార్బోహైడ్రేట్లు తీసుకోవచ్చు. హై–ప్రోటీన్ కీటోజెనిక్ డైట్ ఇది కూడా మామూలుగా స్టాండర్డ్ కీటో–డైట్‌ను పోలి ఉన్నప్పటికీ ఇందులో ప్రోటీన్ల మోతాదు ఎక్కువగా ఉంటుంది. అంటే కొవ్వులు 60 శాతం, ప్రోటీన్లు 35 శాతం, కార్బోహైడ్రేట్లు కేవలం 5 శాతం మాత్రమే ఉండేలా ఆహారం తీసుకోవాలి. ఏమైనప్పటికీ కీటో డైట్‌లోని ఒకే ఒక సాధారణ అంశం ఏమిటంటే... అది ఏ తరహా కీటో–డైట్ అయినప్పటికీ కార్బోహైడ్రేట్లు 5శాతం కంటే ఎక్కువగా ఉండబోవని గుర్తుంచుకుంటే చాలు. కీటోజెనిక్ డైట్లో తీసుకోకూడని ఆహారాలు ముందుగా చెప్పినట్లు కీటో–డైట్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండాలి కదా. అందుకే ఈ కింద పేర్కొన్న పిండిపదార్థాలను కలిగి ఉన్న ఆహారాలను కీటో–డైట్లో భాగంగా తీసుకోరు. చక్కెరలు ఎక్కువగా ఉండేవి సోడాలు, పండ్ల రసాలు, స్మూదీస్, కేక్‌లు, ఐస్‌క్రీమ్, క్యాండీలు. ధాన్యాలు వరి, గోధుమ, తృణధాన్యాలు (సిరియల్స్) వంటివి. పండ్లు అన్ని రకాల పండ్లూ తినకూడదు. అయితే నేరేడు జాతికి చెందిన బెర్రీలు, స్ట్రాబెర్రీలకు మాత్రం మినహాయింపు ఉంది. బీన్స్ జాతి గింజలు వేరుశెనగలు, కిడ్నీబీన్స్, బీన్స్, శెనగలు (చిక్పీస్) వంటివి. దుంపజాతికి చెందినవి బంగాళదుంప (ఆలూ), చిలగడదుంప (మోరంగడ్డ/గెణుసుగడ్డ), క్యారట్ వంటివి. తక్కువ కొవ్వులు ఉండేవి కొన్ని బాగా పొట్టుతీసిన పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ లో–ఫ్యాట్ పదార్థాలను తీసుకోకూడదు. అనారోగ్యకరమైన కొవ్వులు కీటో–డైట్లో కొవ్వులు ఎక్కువగా తీసుకుంటున్నప్పటికీ ఆ కొవ్వుల్లోనూ ఆరోగ్యకరమైన కొవ్వులనే తీసుకోవాలి. కొన్ని కొవ్వులు ఉదాహరణకు ప్రాసెస్ చేసిన వంటనూనెలు, మయోన్నెయిజ్ వంటివి తీసుకోకూడదు. ఆల్కహాల్ : చాలా ఆల్కహాల్స్‌లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. అవి కీటోసిస్ ప్రక్రియను అడ్డుకుంటాయి. కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండాలి. తీసుకోవాల్సిన ఆహారాలు కీటో–డైట్లో భాగంగా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవి... వేటమాంసం, చికెన్, టర్కీ కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు (ఫ్యాటీ ఫిష్) సాల్మన్ (దీన్ని తెలుగులో కొన్నిచోట్ల మాగా/బుడతమాగ అంటారు) ట్యూనా (టూనా చేప) మాకెరల్ (దీన్ని తెలుగులో కొన్ని చోట్ల కన్నగడతలు అంటారు), సార్డిన్ (దీన్ని తెలుగులో కొన్నిచోట్ల కవలు/నూనా కవలు అంటారు) వంటి చేపలు తీసుకోవచ్చు. మనకు అందరికీ తెలిసిన కొర్రమీను ఈ డైట్లో చాలా మంచిది. గుడ్లు పాçశ్చరైజ్ చేసి ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే గుడ్లు. వెన్న, క్రీమ్ గడ్డి మేసే జంతువుల పాల నుంచి తీసిన వెన్న, మీగడలు. నట్స్, గింజలు బాదాం, వాల్నట్, అవిశె గింజలు, గుమ్మడి గింజలు, చియా సీడ్స్. ఆరోగ్యకరమైన నూనెలు వర్జిన్ ఆలివ్ ఆయిల్, అవకాడో నూనె, కెనోలా నూనె, పల్లీల నూనె, నువ్వుల నూనె, కొబ్బరినూనె. (ఇటీవల హార్వర్డ్‌కు చెందిన ఒక ప్రొఫెసర్ కొబ్బరి నూనె అంత శ్రేష్టమైనది కాదని చెబుతున్నారు. నిపుణులను సంప్రదించాకే నూనెలు వాడాలి).కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉండే వెజిటబుల్స్: ఆకుపచ్చరంగులో ఉండే అన్ని రకాల ఆకుకూరలు, టొమాటో, ఉల్లి వంటివి. వీటితో పాటు కాప్సికమ్ అని పిలిచే బెల్పెప్పర్ను వాడుకోవచ్చు. ఇవి పసుపుపచ్చ, ఆకుపచ్చ, ఎర్రరంగులో దొరుకుతుంటాయి. పరిమితులు ఒంట్లోని జీవక్రియల వేగం పెంచడం అంటే మెటబాలిక్ హెల్త్‌ను మెరుగుపరడం ద్వారా కీటో–డైట్ అన్నది వ్యక్తుల బరువు తగ్గించడంలో, డయాబెటిస్‌ను అదుపు చేయడంలో చాలా అద్భుతాలే చేస్తుంది. అయితే దీనికీ కొన్ని పరిమితులు ఉన్నాయి. చాలా తీవ్రమైన వ్యాయామం అవసరమైన అథ్లెట్లు వంటి వారికీ, కండరాల పెరుగుదలను కోరుకునే వారికి కేవలం ఈ డైట్ మాత్రమే సరిపోదు. ఇక మీరు ఏ ఆహార ప్రక్రియను అవలంబిస్తున్నప్పటికీ... సుదీర్ఘకాలం దాన్నే అనుసరిస్తూ ఉంటే తప్ప అది పెద్దగా సత్ఫలితాలు ఇవ్వదు. ఇదే అంశం కీటో–డైట్కూ వర్తిస్తుంది. ఇవి మినహా కీటో–డైట్ మిగతా అన్ని సందర్భాల్లోనూ మంచి ఫలితాలే ఇస్తుందన్నది నిపుణుల మాట. కీటోజెనిక్ ఆహారం తీసుకుంటున్నప్పుడు ఒంట్లోని నీరు, ఖనిజలవణాల బ్యాలెన్స్ కూడా మారుతుంది. అందుకే కీటో–డైట్లో ఉన్నప్పుడు కాస్త ఉప్పు ఎక్కువగా తీసుకోవడం కూడా అవసరం. లవణాల్లో భాగంగా రోజుకు 3,000 – 4,000 ఎంజీ సోడియమ్, 1,000 ఎంజీ పొటాషియమ్, 300 ఎంజీ మెగ్నీషియమ్ తీసుకోవడం మంచిది. కీటో డైట్ తీసుకునే మొదటిరోజుల్లో... మిగతా ఆహారాలవైపునకు (అదనపు క్యాలరీల వైపునకు) మనసు పోకుండా ఉండేందుకు కడుపునిండా తింటూ ఉండటం మంచిది. కీటో–ఫ్లూ ఉన్నప్పుడు ఒంటికి అంతగా శక్తి సమకూరినట్లుగా అనిపించదు. మెదడుకు అవసరమైన శక్తి అందదు. దాంతో ఎప్పుడూ ఆకలిగా ఉన్నట్లు అనిపించడం, నీరసం, నిద్రవస్తున్నట్లుగా ఉండటం, వికారం, జీర్ణవ్యవస్థలో (కడుపులో) ఇబ్బంది (స్టమక్ డిస్కంఫర్ట్), మునుపటిలా వ్యాయామం చేయలేకపోవడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఇవి తగ్గేవరకు మొదట్లో ఒకటి రెండు వారాలు చాలా తక్కువ మోతాదుల్లో కార్బోహైడ్రేట్లు తీసుకుంటూ ఉంటే మంచిది. అలా వాటిని తగ్గిస్తూ క్రమంగా ఒంట్లోని కార్బోహైడ్రేట్లకు బదులు కొవ్వులను ఖర్చు చేసేలా ఒంటిని అలవాటు చేయాలి. కీటో–డైట్‌తో ఏర్పడే సైడ్ఎఫెక్ట్స్, వాటిని తగ్గించడం ఎలా: చాలావరకు కీటో–డైట్ అనేది మంచి ఆరోగ్యకరమైనదే. అయితే శరీరం దానికి అలవాటు పడే ముందు కొన్ని దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. డైట్ ప్రారంభదశల్లో కనిపించే ఈ దుష్ప్రభావాలూ, వాటి వల్ల కలిగే అనారోగ్యాలను ‘కీటో–ఫ్లూ’ అంటారు. అయితే కొన్నాళ్లలోనే ఈ కీటో–ఫ్లూ తగ్గిపోతుంది. డైట్ ప్లాన్ ఇలా... (కీటోజెనిక్ డైట్ తీసుకోవాలనుకున్నవారికి ఉజ్జాయింపుగా ఒక డైట్–ప్లాన్) పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌గా... వెన్నలో గార్నిష్ చేసిన చేపలనో లేదా వేటమాంసాన్నో పకోడాగా వేయించిన శ్నాక్. (దీన్ని పల్లీనూనెతో లేదా కొబ్బరినూనెతో తయారు చేసుకోవచ్చు). (లేదా) గుడ్డును ఆమ్లెట్‌గా వేసి తినవచ్చు (అయితే ఈ ఆమ్లెట్నూ మంచి వెన్నతో లేదా ఆలివ్‌నూనెతో వేసుకోవచ్చు) లేదా వివిధ రంగుల్లో ఉండే కాప్సికమ్‌ను పుష్కలంగా వేసి, గుడ్డు పొరటును చేసుకొని తినవచ్చు. (దీన్ని తయారు చేయడానికి ఆలివ్‌నూనె లేదా ఎక్కువ వెన్నను ఉపయోగించాలి). మధ్యాహ్న భోజనం (లంచ్)గా : లంచ్‌లో భాగంగా సలాడ్స్‌గా పాలకూర, పసుపుపచ్చ, ఆకుపచ్చ, ఎర్రరంగులో దొరికే కాప్సికమ్, పుట్టగొడుగులు (మష్రూమ్స్)ను ఆలివ్‌నూనె లేదా వెన్నలో కాస్తంత దోరగా వేపి తినవచ్చు. అలాగే కొన్నిసార్లు ఈ సలాడ్‌తో పాటు వెన్నలో వేయించిన చికెన్ ముక్కలు, వెన్నలో కాస్తంత దోరగా కాల్చిన ఉడకబెట్టిన గుడ్లు కూడా తీసుకోవచ్చు. వెన్న టాపింగ్‌తో ఈ సలాడ్‌ను తీసుకోవాలి. చేపలు, మాంసాహారం, చికెన్ లేదా పనీర్‌ను పకోడాలా వేయించి తీసుకోవచ్చు. ఆలివ్‌నూనె, పల్లీనూనె లేదా కొబ్బరినూనె పోసి వండిని కాలీఫ్లవర్ కూరను పైన పేర్కొన్న చేప, మటన్, చికెన్ పకోడాతో పాటు తీసుకోవచ్చు. రాత్రి భోజనంగా (డిన్నర్లో) : మీగడతో గార్నిష్ చేసిన పాలకూరను వెన్నలో వేయించి తీసుకోవచ్చు. లెమన్ చికెన్ సూప్ చేపలు, మాంసాహారం, చికెన్ లేదా పనీర్‌ను పకోడాలా వేయించి తీసుకోవచ్చు. (ఫ్రైడ్ పనీర్ పకోడా) కైమా లాగా కొట్టిన మటన్‌ను పైన పేర్కొన్న నూనెలతో వండి తీసుకోవచ్చు. కొబ్బరినూనె / ఆలివ్‌నూనె / పల్లీనూనెలో దోరగా వేయించి క్యాబేజీ సలాడ్.వారమంతా పైన పేర్కొన్న బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్లలో మీకు అందుబాటులో ఉన్న పదార్థాలను, మీ ఛాయిస్‌ను బట్టి మార్చి మార్చి వాడుకోవచ్చు. గమనిక : బరువు తగ్గడానికి కీటో డైట్‌ను ఫాలో అవ్వాలనుకున్నవారు తప్పనిసరిగా ముందుగా నిపుణుల సలహా తీసుకోవాలి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ప్లీజ్ వెయిట్
కొందరు ‘భోజనం మానేయ్’ అంటారు. ఇంకొందరు ‘ఇది కాదు, అది తిను’ అంటారు. మరికొందరు ‘నేను చెప్పిందే రైటు’ అంటారు.ఇంకెవరో ‘ఊహు.. వాళ్లందరూ రాంగ్’ అంటారు. వెయిట్ కంట్రోల్లో ఉంచుకోడానికీ..వెయిట్ తగ్గడానికీ 3 ‘డబ్ల్యూ’లను అర్థం చేసుకోవడం అవసరం. వై.. వెన్.. వాట్.అందుకే తొందర పడొద్దు. ఇన్ని సమాచారాలతో కన్ఫ్యూజ్ అవ్వొద్దు.మీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. మీరు తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ప్లీజ్ వెయిట్! ఆహారం ఎందుకు తీసుకోవాలంటే? అది యంత్రమైనా, వస్తువైనా, మరేదైనా... దాని నిర్వహణ బాగుంటేనే అది బాగుంటుంది, దీర్ఘకాలం పని చేస్తుంది. దేహమూ అంతే. ఓ యంత్రంలాగే పని చేస్తుంది కాబట్టి దాన్ని కూడా దేహయంత్రం అని అంటుంటారు. ఒక వాహనానికి ఇంధనం లాగే... శక్తిని పుట్టించే ఒక టర్బైన్‌కు కూడా శక్తి అవసరమైనట్లే... మనకూ శక్తి కావాలి. ఆ శక్తి కోసమే మనం భోజనం తీసుకుంటుంటాం. కేవలం శక్తి కోసమేనా అంటే... అవును మౌలికంగా అంతే. అయితే దానితో పాటు మన కణాలూ, కండరాలు రోజువారీ పనుల్లో దెబ్బతింటూ ఉంటాయి. ఆ కణాలూ, కండరాల రిపేర్లకు ప్రోటీన్లు కావాలి. దాంతోపాటు కండరాల నిర్మాణం, కండరాల రిపేర్లతో పాటు, రక్తం, చర్మం, ఎముకల వంటి కణజాలం రిపేర్ల కోసం కూడా ప్రోటీన్ కావాల్సిందే. ఇక తక్షణ శక్తి సమకూర్చడానికి పిండిపదార్థాలు కావాలి. దాంతోపాటు దీర్ఘకాలం నిల్వ ఉంచుకోడానికి, కొన్ని కీలక శరీర అవయవాల రక్షణకు కొవ్వులూ కావాలి. ఆహారం అందనప్పటి అవసరాల కోసం కూడా... కొన్ని సందర్భాల్లో శరీరానికి అవసరమైన ఆహారం అందకపోవచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా శరీరం కొవ్వుల రూపంలో కొంత ఆహారాన్ని నిల్వ ఉంచుకుంటుంది. అలాగే శీతల ప్రాంతాల్లో శక్తి కోసం వాడే పిండిపదార్థాల కంటే కొవ్వుల నుంచి ఎక్కువ శక్తి, వేడిమి పొందడం అవసరమవుతుంది. ఒక గ్రాము కొవ్వు ద్వారా 9 క్యాలరీల శక్తి పుడుతుంది. అదే ఒక గ్రాము పిండిపదార్థం నుంచి కేవలం 4 క్యాలరీల శక్తి మాత్రమే వస్తుంది. ప్రోటీన్ నుంచి కూడా అంతే శక్తి ఆవిర్భవిస్తుంది. కేవలం ఇందుకోసం మాత్రమే కాదు... కొన్ని విటమిన్లు మనలోకి ఇంకిపోవడం కోసం కూడా కొవ్వులు అవసరమే. ఇలా మనకు ప్రోటీన్లూ, పిండిపదార్థాలు, కొవ్వులూ కావాలి. కాబట్టి వీటిని ప్రధాన పోషకాలు అంటాం. ఇవి మాత్రమే గాక అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు, లవణాలు వంటివి కూడా ఒంటికి కావాలి. తక్కువ మోతాదులో అవసరమైన వీటిని మైక్రో న్యూట్రియెంట్స్ అంటాం. ఇవన్నీ కలిసి కేవలం ఇంధనంగా శక్తిగా మాత్రమే గాక మనం శ్వాసించడానికీ, ఆహారాన్ని జీర్ణం చేయడానికి, మనలోని నిర్దిష్ట ఉష్ణోగ్రత నిర్వాహణ కావడానికి ఉపయోగపడతాయి. అంతేకాదు... మన రోగనిరోధక శక్తి పదిలంగా ఉండటానికి... ఇలా అనేక రకాల ప్రయోజనాల కోసం ఆహారం కావాలి. అయితే ఆ ఆహారాన్ని ఎందుకు తీసుకోవాలో (వై), ఎప్పుడెప్పుడు తీసుకోవాలో (వెన్), అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందో (వాట్) అన్న విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఆహారానికి... బరువుకు లింకు ఉందా? తప్పక ఉంది. ఆహారానికి, బరువు పెరగడానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. కొవ్వులు, పిండిపదార్థాలు ఎక్కువ మోతాదులో తినేవారి బరువు వెంటనే పెరుగుతుంది. వాటిని పరిమితంగా తీసుకుంటూ, అన్ని పోషకాలు పుష్కలంగా, సమగ్రంగా ఉండే ఆకుకూరలు వంటివి తీసుకునే వారి బరువు (మంచి పరిమాణంలో ఆహారం తీసుకుంటున్నా) ఎప్పుడూ అదుపులోనే ఉంటుంది. తీసుకునే ఆహారానికి, పెరిగే బరువుకు మధ్య ఉన్న సంబంధాన్ని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. అలాగని ఇవన్నీ ప్రతివారికీ ఒకేలా వర్తించాలని నియమమేమీ లేదు. వారి వారి వ్యక్తిగత జన్యుచిత్రపటం, వంశపారంపర్యత, కుటుంబ చరిత్రను అనుసరించి కొంత విభిన్నంగా ఉండవచ్చు. అందుకే ఇక్కడ పేర్కొన్న అంశాలు అందరికీ స్థూలంగా వర్తించేవి మాత్రమే. అంతే తప్ప నిర్దిష్టంగా వర్తించేవి కావని గుర్తించాలి. ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి లేదా... బరువు పెరగకుండా ఉండటానికి ఆహారపరంగా చేయాల్సినవి... కావాల్సినవి ఇవి. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవడం ఎందుకంటే ఒక పూట భోజనంలో తక్షణ శక్తిని ఇచ్చే పిండిపదార్థాలు, శక్తిని నిల్వ చేసుకునేందుకు అవసరమైన కొవ్వులు, కణాల రిపేర్లకు అవసరమైన ప్రోటీన్లు; పోషకాలను సమకూర్చే ఆకుకూరలు, కూరగాయలు; విటమిన్లను ఇచ్చే తాజాపండ్లు, లవణాలను ఇచ్చే ఇతర ఆహార పదార్థాలు... ఇవన్నీ ఏదీ ఎక్కువా, ఏదీ తక్కువా కాకుండా సమపాళ్లలో ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దాన్నే సమతులాహారం అంటారు. ఇలా తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇది మన రోగనిరోధక వ్యవస్థను బలంగా చేసి, మనల్ని అనారోగ్యం పాలు కాకుండా చేసి సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. సమతుల ఆహారం తీసుకోవడమే బరువును అదుపులో ఉంచుతుంది. అదే కొవ్వులు ఎక్కువగానో, పిండిపదార్థాలను అధికంగానో తీసుకుంటే మళ్లీ అది బరువు పెరగడానికి దారితీస్తుంది. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం ఎందుకంటే: బరువు పెరగకుండా ఉన్నవారిపై ఒక అధ్యయనం నిర్వహించినప్పుడు వారిలో 78 శాతం రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే వారు ఉన్నారు. కేవలం 4 శాతం మాత్రమే అలా తీసుకోని వారున్నారు. ఇక మరో అధ్యయనాన్ని బట్టి చూస్తే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోని వారిలో బరువు పెరిగే అవకాశాలు 4.5 రెట్లు ఎక్కువ అని నిశ్చయంగా తేలింది. బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే ఏం జరుగుతుంది? దీనికి ఒక కారణమూ ఉంది. పొద్దున్నే సంతృప్తికరంగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే వారు ఇక రోజంతా తక్కువ క్యాలరీలు తీసుకుంటారు. ఈ అంశమే బరువును పెరగనివ్వదు. పొద్దున్నే సంతృప్తికరమైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోతే, కాలే కడుపు వారిని ఖాళీగా ఉండనివ్వకుండా అదో ఇదో నమిలేలా చేస్తుంది. దాంతో వారు ఉదయం తీసుకునేదానికంటే చాలా ఎక్కువ క్యాలరీను అడపాదడపా నములుతూ బరువును పెంచుకుంటారని ఆ అధ్యయనం తేల్చింది. అలాగే ఉదయం సంతృప్తికరంగా భారీగా బ్రేక్‌ఫాస్ట్ చేసేవారు, మధ్యాహ్నం అంతకంటే తక్కువగా ఎలాగూ తింటారు. ఇక రాత్రి చాలా పరిమితంగానూ తినడం వల్ల వారు బరువు పెరగకుండా ఉంటారు. ఎప్పుడెప్పుడు తినాలంటే... మనం తినే ఆహారాన్ని చాలా చిన్న మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి. మనం రోజుల్లో భోజనం చేసే ఆహారాన్ని ఏ రెండు పూటలకో పరిమితం చేయకుండా... తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి. అంటే ఉదయం ఉపాహారం (బ్రేక్‌ఫాస్ట్), మధ్యాహ్నం భోజనం (లంచ్), సాయంత్రపు పలహారం (ఈవినింగ్ స్నాక్స్), రాత్రి భోజనం (సప్పర్/డిన్నర్) గా విభజించుకొని కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి. ఇలా తింటే ఏం జరుగుతుందంటే అలా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై భారం పడదు. ఇలా తినడం వల్ల బరువు పెరగకపోవడానికి మరో కారణం కూడా ఉంది. మనకు భోజనం లభ్యత తక్కువగా ఉన్నప్పుడు మన మెదడు దొరికిన ఆహారాన్ని నిల్వ ఉంచాలంటూ మన జీవక్రియల వ్యవస్థను ఆదేశిస్తుంది. దాంతో తక్కువ సార్లు ఎక్కువ మోతాదుల్లో భోజనం తినే సందర్భాల్లో ఆకలితో మాడే సమయం ఎక్కువగా ఉన్నందున ఆ సమయంలోని జీవక్రియల అవసరాల కోసం ఆహారాన్ని నిల్వ చేయాల్సిందిగా అందే ఆదేశాల మేరకు కొవ్వు పేరుకుంటుంటుంది. దాంతో బరువు పెరిగేందుకు అవకాశం ఉంది. అదే తక్కువ మోతాదుల్లో అయినా ఎక్కువసార్లు భోజనం లభ్యత జరుగుతున్నందున భోజనాన్ని నిల్వ చేసే అవసరం లేదని మెదడు నిర్ణయిస్తుంది. దాంతో కొవ్వు పేరుకోదు. పైగా తక్కువ మోతాదుల్లోనే తింటున్నందున అవసరమైన మేరకే క్యాలరీలు అందుతాయి. అంతేతప్ప కొవ్వుల పేరుకునేందుకు అవసరమైనంత ఆహార లభ్యత ఉండదు. దాంతో బరువు పెరిగేందుకు అవకాశమే ఉండదు. ఈ విషయంలోనూ ఒక అధ్యయనం జరిగింది. దాదాపు 4,000 కంటే ఎక్కువ మందిపై నిర్వహించిన ఒక అధ్యయనంలో పుష్కలంగా భోజనం అందేవారిని ఒక గ్రూపుగానూ, అడపాదడపా మాత్రమే భోజనం ఇస్తూ ఎప్పుడూ స్నాక్స్‌పై ఉండేవారుగానూ మరో గ్రూపుగానూ... ఇలా రెండు గ్రూపులుగా విభజించారు. ఈ అధ్యయనాన్ని మూడేళ్ల పాటు కొనసాగించి చూడగా క్రమం తప్పకుండా తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు భోజనం చేసేవారి బరువు దాదాపుగా స్థిరంగా ఉండగా నిత్యం స్నాక్స్ మీద ఉండేవారి బరువు ఎక్కువగా పెరిగింది. అంతేకాదు ఇక్కడ మరో అంశాన్ని కూడా అధ్యయనవేత్తలు గమనించారు. నిత్యం స్నాక్స్ తినేవారు తమ ఆకలి (రియల్ ఫిజియలాజికల్ హంగర్) కోసం కంటే... ఏదైనా ఒత్తిడి ఉన్నప్పుడు దాన్ని అదిగమించడం కోసం (ఎమోషనల్ హంగర్) ఎక్కువగా తింటున్నారని దాంతో బరువు పెరుగుతున్నారని ఆ అధ్యయనంలో తేలింది. ఇలా ఆకలిగా లేనప్పుడు కూడా స్నాక్స్ తినడం వల్ల ఏమవుతుందో తెలుసా? అవసరమైన దానికంటే ఒక రోజున 100 క్యాలరీలు ఎక్కువగా తింటూ అలా ఏడాది పాటు అదే అలవాటును కొనసాగిస్తే ఏడాది తర్వాత 6 కిలోల బరువు పెరుగుతారు. అంటే ఏదైనా ఆఫీసులో ఇలాంటి అలవాటును కేవలం ఐదేళ్ల పాటు కొనసాగించినా బరువు స్థిరంగా ఉండాల్సిన చోట దాదాపు 30 కిలోలు అదనంగా పెరుగుతారు. ఇలా స్నాకింగ్ మీదే ఉండేవారిని ఈ అలవాటు తప్పక ఇబ్బందుల్లోకి, ఆరోగ్య సమస్యల్లోకి నెడుతుందనేందుకు ఈ అధ్యయనమే ఒక ఉదాహరణ. అంటే దీన్ని బట్టి మీకు తెలుస్తున్నదేమిటి? తక్కువ క్యాలరీలతో ఉండే ఆకుకూరలు, కాయగూరలతో కూడిన భోజనాన్ని ఎక్కువసార్లు తినాలి. స్నాక్స్ అన్నవి ఎప్పుడో ఒకసారి అరుదుగా సరదాగా నమలడానికే తప్ప రోజూ తినడానికి కాదు. అసలు ఇలా తక్కువ క్యాలరీలతో ఎప్పుడూ మంచి భోజనం చేస్తుండటం వల్ల చిరుతిండ్లూ, స్నాక్స్, ఎక్కువ క్యాలరీలు ఉండే జంక్‌ఫుడ్ తినాలన్న ధ్యాస కూడా ఉండదు. ఇదే బరువును స్థిరంగా, నియంత్రణలో ఉంచే అంశం. రకరకాల ఆహారాలను ఎందుకు తీసుకోవాలంటే: మనలో ఆలూ తినేవారు ఎప్పుడూ బంగాళదుంపలనే ఇష్టపడుతుంటారు. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకునేవారు ఎప్పుడూ అది ఉంటేనే తినగలుగుతారు. అప్పుడేం జరుగుతుందంటే... : ఎక్కువ వెరైటీలు అన్నది కేవలం ఆరోగ్యకరమైన ఆకుకూరలకు మాత్రమే పరిమితం కావాలి. మిఠాయిలకు, స్నాక్స్‌కూ, చాకొలెట్ క్యాండీలకు, చక్కెర ఎక్కువగా ఉండే కార్బోహైడ్రేట్లకు వర్తిస్తే బరువు పెరిగే ముప్పు తప్పదు. భోజనంలో ఎప్పుడూ దుంపలు తినడానికి బదులు రకరకాల కూరగాయలు, ఆకుకూరలు తింటే ఆయా రకాల కూరల్లో ఉండే అన్ని పోషకాలూ శరీరానికి సమకూరతాయి. దాంతో అటు ప్రధాన పోషకాలైన మ్యాక్రోన్యూట్రియెంట్స్... ఇటు సూక్ష్మపోషకాలైన మైక్రోన్యూట్రియెంట్స్, విటమిన్లు, ఖనిజాలు, లవణాలు... ఇలా అన్ని రకాల పోషకాలు సమకూరి ఆరోగ్యంగా ఉంటారు. మార్చిమార్చి తింటుండటం వల్ల ఒక్కోసారి రుచిగా ఉన్నవీ, ఒక్కోసారి రుచిగా లేనివి అన్ని రకాలూ అందుతూ సగటును ఎంతగా అందాలో అన్ని పోషకాలే ఒంటికి అందుతుంటాయి. అయితే ఇదే సూత్రం మిఠాయిలకూ, స్నాక్స్‌కూ వర్తింపజేస్తే మాత్రం... మిఠాయిల్లో అనేక వెరైటీలు, క్యాండీలు, చాకొలెట్స్, జంక్‌ఫుడ్, బేకరీ ఐటమ్స్, చక్కెర ఎక్కువగా ఉండే కార్బోహైడ్రేట్లు, రిఫైన్డ్ పిండిపదార్థాలతో కూడిన శ్నాక్ వెరైటీలన్నీ చాలా రుచిగా ఉండటం వల్ల అవసరమైన దాని కంటే ఎక్కువ క్యాలరీలు ఒంటికి అందుతూనే ఉంటాయి. అందుకే ఈ వెరైటీలు అనేది కేవలం ఆరోగ్యకరమైన ఆకుకూరలు, కాయగూరలు, తృణధాన్యాలకు మాత్రమే. కానీ స్వీట్స్, క్యాండీల విషయంలో మాత్రం వెరైటీలు అరుదుగానే అందాలి. బరువు పెరగకుండా ఉండటానికి వెరైటీలు అనే మంచి సూత్రాన్ని విచక్షణతో వాడాలి. ఇలా ఆహారాన్ని ఎందుకు తినాలో ... ఎప్పుడెప్పుడు ఎన్ని పూటలుగా తినాలో .. అప్పుడు ఏమవుతుందో అనే ఈ మూడు డబ్ల్యూల గురించి తెలుసుకుంటే... వెయిట్ అనే మరో డబ్ల్యూ కూడా మన అదుపులో ఉంటుంది. అధికం కాకుండా ఉంటుంది.ప్రపంచవ్యాప్తంగా బరువు తగ్గడానికి అందుబాటులో ఉన్న రకరకాల పాపులర్ డైట్ ప్లాన్స్‌ని రాబోయే వారాల్లో మీకు పరిచయం చేస్తాం..! వ్యాయామం ముందు బ్రేక్‌ఫాస్ట్ మంచిదే వ్యాయామానికి ముందు బ్రేక్‌ఫాస్ట్ చేయడం మంచిదా, కాదా? మనలో చాలామందికి వచ్చే అనుమానం ఇది. ఇప్పటివరకూ ఏమీ తినకుండానే వ్యాయామం చేయడం అలవాటు కూడా. అయితే బాత్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధన ఒకటి భిన్నమైన విషయాన్ని చెబుతోంది. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తరువాత కొంత సమయానికి వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని పిండిపదార్థాలు మెరుగ్గా జీర్ణమవుతాయని వీరు అంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్ చేసిన రెండు గంటలకు వ్యాయామం చేసిన వాళ్లను.. బ్రేక్‌ఫాస్ట్ తరువాత మూడు గంటలపాటు విశ్రాంతి తీసుకున్న వారిని పోల్చి చూసినప్పుడు మొదటి వర్గంలో వ్యాయామం చేసేటప్పుడు పిండిపదార్థాలు బాగా ఖర్చయినట్లు తెలిసింది. ఆ తరువాత కూడా ఆహారం బాగా జీర్ణమైనట్లు, వీరు రక్తంలోని చక్కెర మోతాదులు, కండరాల్లోని గ్లైకోజెన్ పరిమాణాలను బట్టి నిర్ణయించారు. అప్పుడే తీసుకున్న ఆహారంలోని పిండిపదార్థాలతోపాటు కండరాల్లో గ్లైకోజెన్ రూపంలో నిల్వ ఉన్నవి కూడా ఖర్చు కావడం గమనించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జేవియర్ గోంజాలెజ్ తెలిపారు. పరిశోధన వివరాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ: ఎండోక్రై నాలజీ అండ్ మెటబాలిజమ్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.నీళ్లు తాగడం భోజనానికి అరగంట ముందు దాదాపు అరలీటరు నీళ్లు తాగాలి. ఇలా తాగడం వల్ల ఏం జరుగుతుందంటే... జీవక్రియల వేగాన్ని పెంచడంతో పాటు, తీసుకునే ఆహారపు పరిమాణాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. దీని వల్ల క్యాలరీలను దహనం జరుగుతుంది, అదనపు క్యాలరీలను తీసుకోకుండా నివారణ జరుగుతుంది. అంటే భోజనానికి ముందు తీసుకున్న నీరు బరువు పెరగకుండా స్థిరంగా ఉండడానికి దోహదపడుతుంది. అందుకే బరువు తగ్గడానికి నీళ్లనూ విచక్షణతో స్మార్ట్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇదీ వాస్తవం... నిజానికి ఒళ్లంతా కొవ్వు పేరుకుపోవడం ద్వారా వచ్చే స్థూలకాయం కంటే పొట్టచుట్టూ కొవ్వు పేరుకునిపోవడం అత్యంత ప్రమాదకరం. పొట్టచుట్టూ కొవ్వు పేరుకుని పోవడాన్ని సెంట్రల్ ఒబేసిటీ అంటారు. మన పొట్ట చుట్టూ అనేక పొరలు ఉంటాయి. సెంట్రల్ ఒబేసిటీలో చర్మం కిందనే కాకుండా, కండరాల లోపలివైపు, జీర్ణాశయం, పేగుల చుట్టు కూడా కొవ్వు పేరుకొనిపోతుంది. డయాబెటిస్, హైబీపీ, రక్తలో కొవ్వు శాతం పెరగడం (హైపర్‌లిపిడిమియా) వంటి సమస్యలు వచ్చే అవకాశం... సాధారణ స్థూలకాయం కంటే సెంట్రల్ ఒబేసిటీలో చాలా ఎక్కువ. ఇక పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం అన్నది నేరుగా గుండెకు ముప్పు తెచ్చే అంశం. అందుకే కాస్త ఎక్కువగాఒళ్లు రావడం కంటే... కాస్త తక్కువగా పొట్టరావడమే ఎక్కువ ప్రమాదకరం. ఉప్పు తక్కువగా ఉండే ఆహారం ఆహారంలో ఉప్పు చాలా పరిమితంగా ఉండాలి. ఉప్పు తక్కువగా తినడం వల్ల ఏం జరుగుతుందంటే...ఉప్పు ఆహారానికి రుచిని పెంచుతుంది. రుచిగా ఉన్న ఆహారం ఆకలిని పెంచుతుంది. దాంతో ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీనే సందర్భాల్లో మన జిహ్వ, మన మెదడు అంత తేలిగ్గా సంతృప్త భావనకు (సేసియేషన్కు) లోను కాదు. దాంతో అపరిమితంగా తింటూ ఉంటారు. ఇది తీసుకునే క్యాలరీలను పెంచుతుంది. ఆ అదనపు క్యాలరీలన్నీ కొవ్వు రూపంలో ఒంట్లో పేరుకుపోతాయి. దాంతో బరువు అపరిమితంగా పెరుగుతూ పోతుంది. అందుకే ఉప్పు తక్కువగా ఉన్న ఆహారంతో భోజనం చేసేవారు పరిమితంగా తింటారు. పైగా ఆరోగ్యకరంగా ఉంటారు. ఇదే సూత్రం ఆహారాల్లో వాడే రకరకాల ఫ్లేవర్లకు, కలర్లకు వర్తిస్తుంది. ఫ్లేవర్లతోనూ రుచి పెరిగి ఎక్కువగా తినేస్తాం. అలాగే కంటికి ఇంపుగా ఆకర్షణీయంగా కనిపించే ఆహారాల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఆ ఫ్లేవర్లూ, కలర్లూ స్వాభావికం కాకుండా, కృత్రిమ రసాయనాలై ఉంటే ఆరోగ్యానికి అదో ముప్పు. పైగా అలాంటి కృత్రిమ ఫ్లేవర్లూ, కలర్లూ చాలావరకు క్యాన్సర్ కారకాలై ఉంటాయి. అందుకే అటు బరువు పెంచే విషయంలోనూ, ఇటు క్యాన్సర్ కలిగించేందుకు దోహదపడేవీ అయిన ఆ కృత్రిమ రంగులనూ, ఫ్లేవర్లనూ ఆహారంలో వాడకపోవడమే అన్ని రకాలా మేలు. - డాక్టర్ సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
కొవ్వును మార్చేస్తారు.. ఒళ్లు కరిగిస్తారు?
శరీరంలో రెండు రకాల కొవ్వులుంటాయి. ఆరోగ్యకరమైన బ్రౌన్‌ఫ్యాట్ ఒకటైతే.. హాని కలిగించే తెల్లటి కొవ్వు ఇంకోటి. తెల్ల కొవ్వుతో సమస్యలెక్కువ. బోలెడంత శక్తిని ఠక్కున కరిగించేయగల శక్తి బ్రౌన్‌ఫ్యాట్ సొంతం. అంటే.. బ్రౌన్‌ఫ్యాట్ ఎక్కువ ఉంటే.. ఎంత తిన్నా ఒళ్లు మాత్రం చేయం అన్నమాట! దీనిర్థం.. ఊబకాయం రాదు.. మధుమేహం, గుండెజబ్బులు వంటివీ దూరంగా ఉంటాయి! అంతా బాగానే ఉంది కానీ.. ఈ బ్రౌన్‌ఫ్యాట్‌ను పెంచుకోవడం ఎలా? చాలా సింపుల్ అంటున్నారు కొలంబియా ఇంజినీరింగ్ శాస్త్రవేత్త సామ్ సియా! శరీరంలోంచి తెల్లకొవ్వు కొంత సేకరించి.. పరిశోధన శాలలో దాన్ని బ్రౌన్‌ఫ్యాట్‌గా మార్చేసి.. మళ్లీ శరీరంలోకి జొప్పిస్తే సరి అంటున్నారు సామ్. ఒక భాగంలోని కొవ్వును తీసి ఇంకోభాగంలోకి ఎక్కించడమనే ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ప్రక్రియను ఇప్పటికే చాలామంది నిరపాయకరంగా చేస్తున్నారని, కొవ్వును మార్చి మళ్లీ చేర్చడం మాత్రమే తాము కొత్తగా ప్రతిపాదిస్తున్నామని వివరించారు. తెల్లకొవ్వును బ్రౌన్‌ఫ్యాట్‌గా మార్చే విషయంలో తాము ఇప్పటికే విజయం సాధించామని, వైద్యులు క్లినిక్‌లో చాలా సులువుగా చేయగల పద్ధతి ఇదని సామ్ తెలిపారు. బ్రౌన్‌ఫ్యాట్‌ను పెంచేందుకు శరీర భాగాలను విపరీతమైన చల్లదనానికి గురి చేయడం ఇంకో పద్ధతి కూడా అందుబాటులో ఉన్నప్పటికీ దీనివల్ల అసౌకర్యం ఎక్కువగా ఉంటుంది. పరిశోధన శాలలో ఎలుకల తెల్ల కొవ్వును బ్రౌన్‌ఫ్యాట్‌గా మార్చేక్రమంలో సామ్ బృందం దశలవారీగా పరిశీలనలు జరిపింది. మారుతున్న కొవ్వు ఆరోగ్యానికి మేలు చేసేదిగానే ఉందని నిర్ధారించుకున్న తరువాతగానీ దాన్ని మళ్లీ శరీరంలోకి ప్రవేశపెట్టలేదు. బ్రౌన్‌ఫ్యాట్‌ను సూచించే రసాయనాలు, మైటోకాండ్రియా ప్రక్రియలను నిర్ధారించుకున్న తరువాత మళ్లీ దాన్ని ఎలుకల్లోకి ప్రవేశపెట్టారు. రెండు నెలల తరువాత కూడా ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించలేదు. ఎలుకల్లో జరిపిన ప్రయోగాలను తాము మనుషుల్లోనూ చేశామని, చర్మం అడుగున ఉండే తెల్లకొవ్వును సేకరించి పరిశోధన శాలలో బ్రౌన్‌ఫ్యాట్‌గా మార్చామని సామ్ వివరిస్తున్నారు. శరీరం బరువు తగ్గించేందుకు భవిష్యత్తులో ఇదో మెరుగైన పద్ధతి కావచ్చునని సామ్ అంచనా. రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రించేందుకు, బరువు పెరక్కుండా చూసేందుకూ ఉపయోగపడవచ్చునని అంచనా. కొవ్వుతో కూడిన ఆహారం తీసుకుంటున్న ఎలుకలపై తమ పద్ధతి అంతగా పనిచేయలేదని సామ్ స్పష్టం చేశారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ పద్ధతి లాభనష్టాలను బేరీజు వేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. -
ఒమేగా– 3 కొవ్వులతో కేన్సర్‌కు చెక్!
ఆరోగ్యానికి పలు విధాలుగా మేలు చేస్తాయన్న నమ్మకమున్న ఒమేగా–3 ఫ్యాటీ ఆసిడ్లు పనిలో పనిగా కేన్సర్‌కూ చెక్ పెట్టగలవని అంటున్నారు ఇల్లినాయీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఎలుకలపై తాము జరిపిన పరిశోధనల్లో ఒమేగా –3 కొవ్వులు జీర్ణమయ్యే క్రమంలో ఎండోకానబినాయిడ్స్ అనే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయని గుర్తించినట్లు అదితిదాస్ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఈ రసాయనం గంజాయిలో ఉండే కానబినాయిడ్స్ మాదిరిగానే ఉండే ఈ రసాయనం కేన్సర్ కణితి పెరుగుదలను అడ్డుకోవడంతోపాటు, ఇతర భాగాలకు వ్యాపించడాన్ని కూడా తగ్గిస్తుందని చెప్పారు. గంజాయి కేన్సర్ నిరోధకంగా పనిచేస్తుందని ఇప్పటికే కొన్ని పరిశోధనలు రుజువు చేసిన నేపథ్యంలో తాము ఎముకల కేన్సర్ ఉన్న ఎలుకలపై పరిశోధనలు చేశామని అన్నారు. జీర్ణమైన ఒమేగా –3 కొవ్వుల కారణంగా వచ్చే రసాయనాలు తగుమోతాదులో ఉంటే, కేన్సర్ కణాలు మరణిస్తున్నట్లు తాము గుర్తించామని చెప్పారు. అంతేకాకుండా ఈ పదార్థాలు కేన్సర్ కణితికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు పెరగకుండా అడ్డుకున్నాయని అన్నారు. ఒమేగా–3 కొవ్వులు తరచూ తీసుకోవడం ద్వారా ఈ రసాయనాలు శరీరంలో ఉత్పత్తి అయ్యేలా చేసుకోవచ్చునని సూచించారు. ఎండోకానబినాయిడ్ రసాయనాలను కృత్రిమ పద్ధతిలో అందించడం ద్వారా కూడా కేన్సర్‌కు చెక్ పెట్టవచ్చునని వివరించారు. -
పాల ఉత్పత్తుల్లోని కొవ్వు మంచిదే!
కొవ్వు పదార్థాలు తింటే లావెక్కిపోతామనే భయంతో చాలామంది అన్నంలో కాస్త నెయ్యి కలుపుకోవడానికి కూడా భయపడుతుంటారు. కొవ్వు పదార్థాలను మితిమీరి తీసుకోవడం వల్ల స్థూలకాయం మొదలుకొని గుండెజబ్బుల వరకు నానా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయనేది వాస్తవమే కాని, అన్ని రకాల కొవ్వు పదర్థాలూ ఆరోగ్యానికి చేటు తెచ్చిపెట్టేవి కాదు. సమతుల ఆహారంలో కొవ్వులు కూడా అవసరమైన పదార్థాలే. వీటిలో కొన్ని కొవ్వులు ఒంటికి మేలు చేస్తాయి కూడా. పాల ఉత్పత్తుల్లో లభించే కొవ్వులను మేలు చేసే కొవ్వులుగానే పరిగణించాలని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. వెన్న, నెయ్యి, చీజ్, పెరుగు, మీగడ వంటి పాల ఉత్పత్తుల్లోని కొవ్వుల వల్ల గుండెజబ్బులు తలెత్తే ప్రమాదమేమీ ఉండదని అమెరికాలోని టెక్సాస్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి పాల ఉత్పత్తుల్లోని కొవ్వులు శరీరానికి చాలా మేలు చేస్తాయని, కొవ్వులతో కూడిన పాల ఉత్పత్తులను తరచు తీసుకుంటున్నట్లయితే పక్షవాతం సోకే ముప్పు 42 శాతం మేరకు తగ్గుతుందని తమ పరిశోధనలో తేలిందని టెక్సాస్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ మార్షియా ఓట్టో వెల్లడించారు. పాల ఉత్పత్తుల్లో లభించే కొవ్వుల్లో వాపులను తగ్గించే లక్షణం ఉంటుందని, ఇవి అధిక రక్తపోటును నిరోధిస్తాయని ఆయన వివరించారు. పాల ఉత్పత్తులు, వాటి ప్రత్యామ్నాయాలపై రెండు దశాబ్దాల పాటు నిర్వహించిన సుదీర్ఘ పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి రావడం విశేషం. -
జారిపోని సోపు...
ఇదో వింత ఆకారం. పేరు టెట్రాపాడ్. సముద్ర తీరాల్లో అక్కడక్కడా ఈ ఆకారంలో ఉండే దిమ్మెలు కనిపిస్తూంటాయిగానీ.. పొటోలో ఉన్నది మాత్రం ఓ సోపు. అవునా? అని నోరెళ్లబెట్టకండి. చేతిలోంచి జారిపోకుండా ఉండేందుకు, ఎక్కువ కాలం మన్నే లక్ష్యంతో తాము దీన్ని తయారు చేశామని చెప్పుకుంటోంది టెట్రాసోప్ అనే స్టార్టప్. దీని ఆకారం చూడగానే తెలిసిపోతుంది... ఇది అస్సలు జారిపోదని. సిలికాన్ అచ్చు ద్వారా ఈ ప్రత్యేకమైన ఆకారంలో సోపులు తయారు చేస్తున్నారు. ఆముదం మొదలుకొని పలు రకాల నూనెలు, కొవ్వులతో దీన్ని తయారు చేశారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో.. వాటివల్ల పర్యావరణానికి ఏమైనా నష్టం జరిగిందా? లేదా? అన్న వివరాలు కూడా ముద్రించి మరీ ఈ సోపును అమ్ముతున్నారు. ఈ రకమై సోపును తయారు చేసేందుకు డబ్బులు కావాలని టెట్రాసోపు కిక్‌స్టార్టర్‌లో అడిగిందే తడవు.. దాదాపు 30 వేల హాంకాంగ్ డాలర్లు వచ్చిపడ్డాయి. గత ఏడాది చివరలో ఈ డబ్బులతో ఉత్పత్తి ప్రారంభించిన టెట్రాసోపు ప్రస్తుతం తమ వెబ్సైట్ ద్వారా వాటిని అమ్ముతోంది. అంతాబాగానే ఉందిగానీ.. ఈ టెట్రాసోపుతో ఒంటికి సోపు రాసుకోవడం ఎలా? అన్న డౌట్ వస్తోందా? నిజమే. దీన్ని తాము చేతులు కడుక్కునేందుకు మాత్రమే తయారు చేశామని... కాకపోతే వందగ్రాముల సోపు 30 రోజులపాటు మన్నుతుంది కాబట్టి... ఇతర అవసరాలకూ వాడుకోవచ్చునని కంపెనీ అంటోంది. -
కోడిగుడ్లు ఎక్కువైనా.. గుండెకు ఇబ్బంది లేదు!
వారానికి 12 చొప్పున ఏడాది పొడవునా కోడిగుడ్లు తిన్నా ఎలాంటి ఇబ్బంది లేదని సిడ్నీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. గుండెతోపాటు మధుమేహం వంటి వ్యాధుల విషయంలోనూ కోడిగుడ్ల ప్రభావం పెద్దగా లేదని వీరు అంటున్నారు. మూడు నెలలపాటు కోడిగుడ్లు ఎక్కువగా తిన్నా ఆరోగ్యంపై ప్రభావం ఉండదని గతంలోనే నిరూపణ అయినప్పటికీ తాజా పరిశోధనలు ఈ కాలాన్ని ఏడాదికి పెంచడం గమనార్హం. వారానికి రెండు గుడ్లు మాత్రమే తినేవారితోపాటు 12 గుడ్లు తినే వారిని కొంత కాలంపాటు పరిశీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చామని గుండెజబ్బుల విషయంలో రెండు గుంపుల్లోని వారి స్థాయి ఒకేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని నిక్ ఫుల్లర్ అనే శాస్త్రవేత్త చెప్పారు. ముందుగా తాము మూడు నెలలు ఆ తరువాత ఇంకో మూడు నెలలు ఈ తరహా ఆహారం ఇచ్చి పరిశీలనలు జరిపామని, ప్రతి దశలోనూ భాగస్వాముల్లో గుండె జబ్బులకు సంబంధించిన ఏ వ్యతిరేక లక్షణమూ కనిపించలేదని వివరించారు. సంతృప్త కొవ్వుల స్థానంలో మోనోశ్యాచురేటెడ్, పాలీ అన్శ్యాచురేటెడ్ కొవ్వులు ఆరోగ్యానికి మేలన్నది గుర్తుంచుకుంటే చాలని కోడిగుడ్లు ఎక్కువ తిన్నా గుండెజబ్బుల ప్రమాదం తక్కువని తమ ప్రయోగం స్పష్టం చేస్తోందని ఆయన వివరించారు. -
కొవ్వు కరిగించే హార్మోన్లు గుర్తించారు
ఊబకాయం పాటు మధుమేహ సమస్యను పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలకు సరికొత్త ఆయుధం లభించింది. కొవ్వును వేగంగా కరిగించగల, మధుమేహాన్ని తగ్గించగల రెండు హార్మోన్లను కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. నోటమ్, లిపోకాలిన్–5 అనే పేరున్న ఈ రెండు హార్మోన్లతో ఇతర ఉపయోగాలు ఉన్నట్లు వీరు అంటున్నారు. అవయవాలు, కండరాల మధ్య సమాచార ప్రసారం ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు జరిగిన ప్రయత్నంలో భాగంగా తాము ఈ హార్మోన్లను గుర్తించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో ముందుగా తాము హార్మోన్ల వ్యవస్థ ఎలా పనిచేస్తోందో గుర్తించామని, ఆ తరువాత మనుషుల్లో, ఎలుకల్లోని హార్మోన్ల మధ్య సారూప్యతను తెలుసుకున్నామని చెబుతున్నారు. చాలా హార్మోన్లు మనుషుల్లో, ఎలుకల్లో ఒకే తీరున పని చేస్తున్నట్లు తెలిసిందని, దీనిని బట్టి ఎలుకలలో నోటమ్, లిపోకాలిన్–5లు చేస్తున్న పని మానవులలోనూ సాధ్యమన్నది స్పష్టమైనట్లు వివరించారు. శరీరానికి పోషకాలు ఒంటబట్టేందుకు కూడా ఈ రెండు హార్మోన్లు ఉపయోగపడుతున్నట్లు తమకు తెలిసిందని, గుండె జబ్బులు, మధుమేహం ఉన్న వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని తెలిపారు. -
వారానికి రెండు రోజులు అలా చేస్తే..
లండన్ : మారుతున్న జీవన శైలితో చిరుప్రాయంలోనే వ్యాధులు దాడిచేస్తున్న క్రమంలో మెరుగైన మార్పుల ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వారంలో రెండు రోజుల పాటు తక్కువ క్యాలరీలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా గుండె జబ్బుల ముప్పును తప్పించుకోవచ్చని యూనవర్సిటీ ఆఫ్ సర్రేకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 5:2 డైట్‌గా పేరొందిన ఈ ఆహారాన్ని వైద్య నిపుణులు పెద్ద ఎత్తున సిఫార్సు చేస్తున్నారు. సాధారణ క్యాలరీల కంటే తక్కువ క్యాలరీలతో కూడిన ఆహారాన్ని వారంలో రెండు రోజులు తీసుకుంటే జీవక్రియల వేగం పుంజుకుంటుందని వారు చెబుతున్నారు. 5:2 డైట్ ద్వారా శరీరంలో హానికారక కొవ్వులను సులబంగా తొలగించుకోవచ్చని పరిశోధకులు తేల్చారు. ఈ ఆహారం తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో కార్డియోవాస్క్యులర్ జబ్బుతో పాటు ఇతర హృదయ సంబంధ వ్యాధులకు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు. ఒబెసిటీతో బాధపడుతున్నవారితో పాటు ఇతరులపై పరిశోధకులు జరిపిన క్యాలరీ లెక్కింపులో ఈ ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. అథ్యయన వివరాలు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమయ్యాయి. -
పౌష్టికాహారానికి కొత్త రూపు..
పౌష్టికాహార లోపం తీవ్రమైన సమస్య. చాలామంది పసిపిల్లలు వయసుకు తగ్గట్టుగా ఎదగలేకపోతున్నారు కూడా. ఈ నేపథ్యంలో సముద్రంలోనే అత్యంత పుష్టికరమైన ఆహారాన్ని పండించి అందించేందుకు సిద్ధమవుతోంది అమెరికాలోని ఓ స్టార్టప్ కంపెనీ. సముద్రంలో పెరిగే అనేకానేక మొక్కల్లో ‘కెల్ప్’ ఒకటి. అన్ని రకాల విటమిన్లు, ప్రొటీన్లు, ఒమేగా –3 కొవ్వులు కలిగి ఉండే ఈ మొక్కలతో రుచికరమైన వంటకాలు తయారుచేసి అమ్మేందుకు అకువా అనే సంస్థ కిక్‌స్టార్టర్‌లో నిధులు సమీకరించే ప్రయత్నం చేస్తోంది. కెల్ప్ ఎంత పుష్టికరమైందంటే... పాలలో ఉండే కాల్షియం కంటే పది రెట్లు ఇందులో ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు విటమిన్ ఏ, బి1, బి2, సి, డి, ఈ లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అకువా జెర్కీ పేరుతో రానున్న కెల్ప్ వంటకాలలో కొంతవరకూ చక్కెర కూడా ఉంటుంది. ఈ కెల్ప్ మొక్కలు చాలా వేగంగా పెరుగుతాయి. రోజుకు అడుగు కంటే ఎక్కువ పొడవు పెరుగుతాయి. ప్రస్తుతం అకువా జెర్కీ మూడు రకాల రుచుల్లో లభిస్తోంది. ఒకటి సముద్రపు ఉప్పు రుచిలో ఉంటే.. రెండోది నువ్వుల రుచి.. మూడోది నిప్పులపై కాల్చిన రుచిలోను ఉన్నాయి. -
పేరెంట్స్‌కు డయాబెటిస్ ఉంటే మనకూ వస్తుందా?
డయాబెటిస్ కౌన్సెలింగ్ నా వయసు 32 ఏళ్లు. మా నాన్నగారికి డయాబెటిస్ ఉంది. నాకు కూడా ఉందేమోనని అనుమానం వచ్చి, ఇటీవల ఎఫ్బీఎస్ (ఫాస్టింగ్ బ్లడ్ షుగర్) పరీక్ష చేయించుకున్నాను. ఆ పరీక్షలో ఫలితం 114 ఎంజీ/డీఎల్ అని వచ్చింది. నాకు డయాబెటిస్ లేదని చెప్పారు. అయితే మా నాన్నగారికి మధుమేహం ఉంది కాబట్టి నాకు కూడా కచ్చితంగా డయాబెటిస్ వస్తుందా? ఒకవేళ వస్తే ఏ వయసులో వస్తుంది? దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. – సుధాకర్‌రావు, గుడివాడ మీకు ఎఫ్బీఎస్ పరీక్షల్లో వచ్చిన ఫలితాన్ని బట్టి చూస్తే మీరు ప్రీ–డయాబెటిక్ దశలో ఉన్నారని తెలుస్తోంది. అంటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న దశ అని అర్థం. మీ నాన్నగారికి డయాబెటిస్ ఉందని తెలిపారు కాబట్టి మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డయాబెటిస్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ దశలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్‌ను దరిచేరకుండా జాగ్రత్తపడవచ్చు. మీరు ముందుగా పరీక్షలు చేయించుకోవడం మంచి విషయం. ఎందుకంటే డయాబెటిస్ వచ్చిన తర్వాత నియంత్రించుకోవడం మినహా చేయగలిగినదేమీ లేదు. అయితే ఇప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను నివారించుకోవచ్చు. మీరు ఇకపై డాక్టర్లు సూచించిన ప్రకారం క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోండి. ఇకపై మీ జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి. ప్రధానంగా మీ బరువును అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. అధిక క్యాలరీలు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండండి. మద్యపానం, పొగాకు వంటి అలవాట్లు ఏమైనా ఉంటే వెంటనే వాటిని మానేయండి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. అలా వీలుకాకపోతే కనీసం వారంలో ఐదురోజులైనా... రోజుకు అరగంట పాటు కచ్చితంగా వ్యాయామం చేయండి. తాజా ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోండి. పెసర్లు, మొలకెత్తి గింజలు శ్నాక్స్‌గా తీసుకుంటే చాలా మంచిది. ఆహారం విషయంలో కచ్చితంగా సమయపాలనను పాటించండి. సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. డయాబెటిస్ ఉన్నవారు బరువు తగ్గితే ప్రమాదమా? నా స్నేహితుడి వయసు 45 ఏళ్లు. అతడికి డయాబెటిస్ వ్యాధి ఉంది. తాను బాగా లావుగా ఉండటంతో తన బరువు తగ్గించుకోడానికి రోజూ వ్యాయామం చేస్తున్నాడు. ఇటీవల అతడి బరువు అకస్మాత్తుగా తగ్గడం మొదలయ్యింది. ఈమధ్య బాగా బరువు తగ్గి, చాలా సన్నగా కనిపిస్తున్నాడు. అతడిని చూస్తేనే ఆందోళనగా ఉంది. డయాబెటిస్ వ్యాధి ఉన్నవారు ఇలా అకస్మాత్తుగా బరువు తగ్గితే ఏదైనా ప్రమాదమా? – దామోదర్‌రావు, విజయవాడ సాధారణంగా ఏమాత్రం ఊబకాయం ఉన్నా బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిదనే అందరమూ అనుకుంటాం. శారీరక వ్యాయామం చేస్తూ, క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ, క్రమంగా ఉండాల్సినంత బరువుకు చేరడం మంచిదే. ఇలా బరువు తగ్గడం కొలెస్ట్రాల్, బీపీని అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనికితోడు బరువు తగ్గడం ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించడమే కాకుండా కండరాలు, కణజాలం, రక్తంలోని కొవ్వులు ఇన్సులిన్‌కు స్పందించేలా చేస్తుంది కూడా. శరీర కణజాలం, కండరాలు గ్లూకోజ్‌ను ఉపయోగించుకొని శక్తి పొందడానికి ఇన్సులిన్ అవసరమవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కండరాలు, కణజాలం గ్లూకోజ్‌ను వాడుకోవాలంటే మామూలు కంటే అధిక స్థాయిలో ఇన్సులిన్ అందుబాటులోకి రావాలి. టైప్–2 డయాబెటిస్‌లో ఇదే పరిస్థితి ఉంటుంది. ఫలితంగా ఒక విషవలయం ఏర్పడుతుంది. ఇన్సులిన్ లెవల్ ఎక్కువ అవుతున్న కొద్దీ శరీరం బరువు తగ్గడం కష్టమవుతుంది. మరోవైపు శరీరం బరువు అధికమవుతున్నకొద్దీ ఇన్సులిన్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఈ చక్రవలయాన్ని ఛేదించడం కష్టం. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఉద్దేశపూర్వకంగా బరువు తగ్గించుకోవడం మంచిదే. కానీ తమ ప్రయత్నమే లేకుండా అకస్మాత్తుగా బరువు తగ్గడం మాత్రం మంచి సూచన కాదు. రక్తంలో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉన్నవారు వారు తరచూ మాత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. ఇది డీ–హైడ్రేషన్‌కు దారితీస్తుంది. దాంతో శరీరం బరువు తగ్గిపోతుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు చాలామంది మొదటిసారి డాక్టర్‌ను కలిసినప్పుడు చేసే ఫిర్యాదు తమ బరువు తగ్గిందనే. డయాబెటిస్తో పాటు థైరాయిడ్, క్యాన్సర్ వంటి వ్యాధుల వల్ల కూడా శరీరం బరువు తగ్గిపోతుంది. అందువల్ల వ్యాయామం, డైటింగ్ వంటి తమ ప్రయత్నాలు ఏమీ లేకుండా బరువు తగ్గడం ఒక ప్రమాద సూచిక. రక్తంలోని చక్కెర పరిమాణంలో మార్పులకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమో అని కచ్చితంగా తేల్చుకోవడం అవసరం. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా మీ స్నేహితుడికి పూర్తిస్థాయి వైద్యపరీక్షలు చేయించండి. డయాబెటిస్ రోగులు... పాదాల జాగ్రత్తలు డయాబెటిస్ రోగులు పాదాల విషయంలో జాగ్రత్తలు పాటించాలంటారు. ఎందుకలా? ఆ జాగ్రత్తలను సూచించండి. – ధనరాజ్, నూతలపాడు డయాబెటిస్ రోగుల్లో సాధారణంగా పాదాలకు గాయం అయినప్పుడు ఉండే నొప్పి తెలియదు. దాంతో ఆ గాయం పెద్దదైపోయి మాననివిధంగా మారి, కుళ్లడం ప్రారంభమయ్యే వరకు (గ్యాంగ్రీన్‌లా మారేవరకు) తెలియదు. ఒక్కోసారి ఈ పరిస్థితి పాదాన్ని తొలగించే పరిస్థితి వరకు తేవచ్చు. అందుకే డయాబెటిస్ రోగులు క్రమం తప్పక రోజూ పాదాలను పరిశీలించుకోవాలంటూ డాక్టర్లు హెచ్చరిస్తుంటారు. షుగర్ ఉన్న ప్రతివారూ, అందునా ఐదు నుంచి పదేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తమ కాళ్లనూ ప్రత్యేకంగా పాదాలను చాలా జాగ్రత్తగానూ, నిశితంగానూ పరిశీలించుకుంటూ ఉండాలి. ఆ క్రమంలో పాటించాల్సిన మార్గదర్శకాలివి... తరచూ కాలి పరీక్ష స్వయంగా చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రక్రియంలో భాగంగా పాదాల కింద అద్దం పెట్టుకుని, పాదం ఏవిధంగా ఉందో చూసుకోవాలి. కాలి పైభాగాన్నీ నిశితంగా పరీక్షించుకోవాలి. అలాగే కాలి వేళ్ల మధ్య భాగాలనూ పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ పరిశీలనలో చిన్న పొక్కులాంటిది ఉన్నా దాన్ని విస్మరించకూడదు. భవిష్యత్తులో అది పుండుగా మారే ప్రమాదం కూడా ఉండవచ్చు. ∙నిత్యం పాదాలను పొడిగా ఉంచుకోవాలి. కాళ్లు కడుక్కున్న వెంటనే పొడిగా అయ్యేలా తుడుచుకోవాలి. కాలి వేళ్ల మధ్య కూడా పొడిగా ఉండటం కోసం పౌడర్ రాసుకోవాలి. ∙కాలికి చెప్పులు, బూట్లు లేకుండా నడవకూడదు. అయితే ఈ చెప్పులు, బూట్లూ కాలికి చాలా సౌకర్యంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యం ఉన్నా ఆ పాదరక్షలు వాడకండి. సౌకర్యంగా ఉండేవి మాత్రమే ఎంచుకోవాలి. ∙వేడి వస్తువులనుంచి మీ కాళ్లను దూరంగా ఉంచుకోండి. డయాబెటిస్ ఉన్నవారు హాట్ వాటర్ బ్యాగ్‌తో కాళ్లకు కాపడం పెట్టుకోకపోవడమే మంచిది. ∙పాదాలను మృదువుగా ఉంచుకోవాలి. ఇందుకోసం కాళ్లు కడుకున్న తర్వాత పొడిగా తుడుచుకొని, ఆ తర్వాత వాజిలైన్‌తో కాళ్లను రుద్దుకొని, మళ్లీ ఆ తర్వాత పొడిగానూ మారేలా శుభ్రం చేసుకోవాలి. కాళ్ల మీద పులిపిరి కాయల్లాంటివి ఏవైనా ఏర్పడితే డాక్టర్‌ను సంప్రదించి, ఆయన పర్యవేక్షణలోనే వాటిని తొలగించుకోవడం చాలా ముఖ్యం. కాలిగోళ్లను ప్రతివారమూ తొలగించుకోవాలి. ఈ సమయంలో గోళ్లను మరీ లోపలికి కట్ చేసుకోకూడదు. అలాంటప్పుడు ఒక్కోసారి గోరు మూలల్లో రక్తం వచ్చేంతగా గోరు కట్ కావచ్చు. ఇది జరిగినప్పుడు కొందరిలో గోరు లోపలి వైపునకు పెరగవచ్చు. ఇది డయాబెటిస్ రోగుల్లో మరింత ప్రమాదం. ఇంట్లో కూడా పాదరక్షలు లేకుండా నడవకండి. ప్రత్యేకంగా తడి, తేమలో పనిచేసే మహిళలు స్లిప్పర్స్ వంటివి తొడుక్కునే పనిచేసుకోవాలి. ∙ఏడాదికోసారి కాలి వైద్య నిపుణులకు చూపించుకుంటూ ఉండాలి. ఇవన్నీ కాలి సంరక్షణకు ఉపయోగపడే మార్గాలు. డాక్టర్ అశోక్ వెంకట నరసు సీనియర్ ఎండోక్రై నాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
మధుమేహులకు శాకాహారంతో ఎక్కువ ప్రయోజనం?
ఆరోగ్యంగా ఉండేందుకు ఏది మేలన్న విషయంలో ఇప్పటికే చాలా చర్చలు ఉన్నాయిగానీ.. ఊబకాయంతోపాటు మధుమేహమున్న వారికి శాకాహారం మేలని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసి విడుదల చేసే బీటా కణాలపై ఒక అధ్యయనం చేసి మరీ తాము ఈ విషయాన్ని తెలుసుకున్నామని హనా కాహ్లెలోవ్ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఊబకాయం ఉండి.. మధుమేహ లక్షణాలు లేని కొంతమందిని రెండు గుంపులుగా విడగొట్టి ఒకరికి పండ్లు, కాయగూరలు, గింజధాన్యాలతో అతితక్కువ కొవ్వు గల ఆహారం అందించారు. రెండో గుంపులోని వారి ఆహారంలో ఎలాంటి మార్పు చేయలేదు. రెండు గుంపుల్లోని కార్యకర్తలు వ్యాయామం, తీసుకునే మందుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా చూశారు. పదహారు వారాల తరువాత జరిపిన పరిశీలనలో శాకాహార ఆధారిత గుంపులోని వారి రక్తంలోని చక్కెరల మోతాదు గణనీయంగా తగ్గినట్లు తెలిసింది. మధుమేహ నివారణకు ఈ అధ్యయనం ఎంతో ఉపయోగపడుతుందని హానా తెలిపారు. శాకాహారం మధుమేహాన్ని నివారించడంతోపాటు వ్యాధి ఉన్నవారికీ మేలైన చికిత్సగా పనిచేస్తుందని గతంలోనూ ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేశాయి. అంతేకాకుండా బరువు, కొవ్వుల మోతాదు, రక్తపోటులను తగ్గించుకునేందుకు కూడా శాకాహారం మంచిదని ఈ అధ్యయనాల ద్వారా తెలిసింది. -
మాంసాహారం ఎక్కువగా తింటే... గుండెజబ్బులు వస్తాయా?
నా వయసు 38 ఏళ్లు. నేను మాంసాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. కొవ్వులతో కూడిన ఆహారం ఇంత ఎక్కువగా తీసుకోకూడదనీ, దీనివల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ పేరుకుంటుందనీ, అది ఈ వయసులో గుండె జబ్బులకు దారితీస్తుందని ఫ్రెండ్స్ అంటున్నారు. మాంసం మానేయాల్సిందేనా? నాకు తగిన సలహా ఇవ్వండి. – మహ్మద్ సుబానీ, గుంటూరు కొలెస్ట్రాల్ అనే కొవ్వులలో రెండు రకాలు ఉంటాయి. మొదటిది ఒంటికి మేలు చేసే కొవ్వులు. వీటిని హైడెన్సిటీ లైపో ప్రొటీన్ (హెచ్‌డీఎల్)అంటారు. ఇవి గుడ్డు తెల్లసొనలో ఉంటాయి. శరీరానికి హానికారకమైన కొవ్వులను ఎల్డీఎల్ (లోడెన్సిటీ లైపో ప్రొటీన్స్) అంటారు. చెడు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులు గుండెజబ్బులకు ఒక రిస్క్ ఫాక్టర్. చెడు కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారం తినేవారిలో, ఫాస్ట్ ఫుడ్ తీసుకునే వారిలో గుండెజబ్బుల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అయితే రక్తంలో ఈ రెండు రకాల కొవ్వులు కలుపుకొని 200 లోపు ఉండాలి. ఎల్డీఎల్ 100 లోపు, హెచ్‌డీఎల్ 40పైన ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనే మరోరకం కొవ్వులు కూడా గుండెకు హాని చేస్తాయి. ఇవి 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్ మన శరీరంలోకి రెండు రకాలుగా చేరుతుంది. ఒకటి ఆహారం ద్వారా, మరొకటి లివర్ పనితీరు వల్ల. శిశువు పుట్టినప్పుడు 70 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. మెదడు నరాల వ్యవస్థ కోసం, శిశువు రెండేళ్లపాటు ఎదగడానికి ఈ కొలñ స్ట్రాల్ కొవ్వులు ఉపయోగపడతాయి. ఆ తర్వాత దీని అవసరం అంతగా ఉండదు. అయితే జన్యుతత్వాన్ని బట్టి ఈ కొవ్వులు (మంచి, చెడు ఈ రెండు రకాల కొలెస్ట్రాల్స్) ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. వేపుళ్లు, బేకరీ పదార్థాలు, కృత్రిమ నెయ్యి వంటి పదార్థాలను ఎక్కువగా తినేవాళ్లలో ఈ కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇక రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉన్నవారికి... డాక్టర్లు వాటిని అదుపు చేసే మందులు ఇస్తుంటారు. ఈ తరహా మందులు వాడుతున్న వారు వాటిని మధ్యలోనే ఆపకూడదు. మీరు మాంసాహారం పూర్తిగా మానేయలేకపోతే... కొవ్వులు తక్కువగా ఉండే చేపలు, చికెన్ వంటి వైట్‌మీట్ తీసుకోండి. వీటిలోనూ చికెన్ కంటే చేపలు చాలా మంచిది. కాబట్టి మాంసాహారం తీసుకోవాలనిపిస్తే చేపలు తినడం మేలు. అది కూడా ఉడికించినవే. వేపుడు వద్దు. – డాక్టర్ అనుజ్ కపాడియా, సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
కొవ్వు కాదమ్మా.. ఇది కడుపు ఉబ్బరం!
‘ఏం తిన్నా పొట్ట రాయిలా టైట్‌గా అయిపోతోంది’... ‘ఏమిటో... ఈమధ్య ఏదైనా తినగానే కడుపు ఉబ్బరం. ఛాతీ నుంచి కింద పొట్ట వరకూ ఒకటే మంట’... ‘తిన్నదేమీ లేదు గాని పొద్దస్తమానం ఇలా తేన్పులు’... ఇవీ నలుగురు కూడి కలిసిన చోట్ల మాట్లాడే మాటల్లో కనీసం ముగ్గురు చెప్పుకునే మాటలు, చేసుకునే ఫిర్యాదులు. మామూలు వాళ్లకి ఇదో ఇబ్బందా అనిపిస్తుందేమో! కానీ... మనకు తెలియకుండానే జీవనశైలిని ప్రభావితం చేసే ఎంతో పెద్ద సమస్య ఇది. తిన్న ఆహారం అరుగుదల విషయంలో మనం రోజూ ఎదుర్కొనే సాధారణ సమస్యలూ, వాటి పరిష్కారాల వంటి అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. కడుపులో గ్యాస్ చేరడంతో ఉబ్బరం ఎవరిలోనంటే... కడుపు ఉబ్బరం చాలామంది నిశ్శబ్దంగా అనుభవిస్తూ బాధపడే సమస్య. చెప్పుకోడానికి ఒకింత ఇబ్బంది పడే విషయం కూడా. మనం మింగుతుండే సమయంలో గాలి మన జీర్ణవ్యవస్థ పొడవునా ఎప్పుడూ పెరిస్టాలిటిక్ చలనం రూపంలో వెళ్తూనే ఉంటుంది. ఇది పైనే ఉంటే తేన్పు రూపంలో వెళ్తుంది. పైకి రాలేని విధంగా కాస్త కింద ఉంటే చిన్నపేగుల్లోంచి పెద్ద పేగుల్లోకి వెళ్లి మలద్వారం గుండా బయటకు పోతుంటుంది. కానీ చాలా మందిలో గాలి కడుపులో చిక్కుకుపోయి పొట్ట రాయిలాగా, కడుపు ఉబ్బరంగా పరిణమిస్తుంది. ఈ సమస్యను పట్టించుకోకపోతే అది దీర్ఘకాలంలో మలబద్దకం, పొట్టనొప్పి, హైపర్ అసిడిటీలకు దారితీయవచ్చు. ఈ సమస్యకు వివిధ కారణాలు... అది బాధించేవారెవరంటే... ∙బాగా వేగంగా తినేవారు, బాగా వేగంగా తాగేవారు పొగతాగే అలవాటు ఉన్నవారు ∙చ్యూయింగ్‌గమ్ నమిలేవారు ∙హార్డ్ క్యాండీల వంటివాటిని ఎప్పుడూ చప్పరిస్తూ ఉండేవారు ∙కార్బొనేటెడ్ డ్రింక్స్ / కూల్‌డ్రింక్స్ (గ్యాస్ ఉన్నవి) ఎక్కువగా తాగేవారు ∙వదులుగా ఉండే కట్టుడుపళ్లు ఉన్నవారు... వీరు తినేటప్పుడు గ్యాస్ ఎక్కువగా మింగుతుంటారు. అలాగే కొన్ని రకాల ఆహారాలు తీసుకునేవారిలోనూ గ్యాస్ ఎక్కువగా ఉత్పన్నమవుతుంది. గ్యాస్ తగ్గడానికి పరిష్కారం ఏమిటి? మీరు ఆహారం తీసుకునే సమయంలో గాలి ఎక్కువగా నోట్లో పోకుండా చేయడం వల్ల చాలావరకు గ్యాస్ సమస్య అధిగమించవచ్చు. దీనికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ∙తినే సమయంలో మెల్లగా, నింపాదిగా తినాలి. పెదవులు మూసి తినడం మంచిది. ∙పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయాలి. ∙కట్టుడు పళ్లు ఉన్నవారు డెంటిస్ట్ సహాయంతో అవి సరిగా అమరేలా చూసుకోవాలి. ∙ సోడాలు, కూల్‌డ్రింక్స్, బీర్ వంటి వాటికి దూరంగా ఉండాలి ∙జ్యూస్ రూపంలో కాకుండా పండ్లను కొరికి, నమిలి తినాలి ∙గ్యాస్ ఉండే ఆహారాలను పరిమితంగా తీసుకోవడం ∙కొవ్వులు ఉండే పదార్థాలను చాలా పరిమితంగా తీసుకోవడం ∙వేళకు తినడం (చాలా మంది వేళకు తినకుండా చాలా ఆలస్యంగా తింటుంటారు. వారిలో గ్యాస్‌తో కడుపు ఉబ్బరం రావడం చాలా ఎక్కువ) ∙మనం ఏం తింటున్నామో గమనిస్తూ, వాటిలో దేనివల్ల కడుపు ఉబ్బరం సమస్య ఎక్కువవుతోందో గుర్తించి, ఆ ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో చాలావరకు ఈ సమస్యను అధిగమించవచ్చు. గమనిక: పాలు, పాల ఉత్పాదనలు తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బరంగా మారిపోయి, గ్యాస్ సమస్య పెరుగుతుంటే... మార్కెట్లో ఇటీవల ల్యాక్టోజ్ రహిత పాలు, పాల ఉత్పాదనలు దొరుకుతున్నాయి. వీటితో గ్యాస్, పొట్ట ఉబ్బరం సమస్యను దూరం చేసుకోవచ్చు. ఈ సమస్యకు దోహదపడే అంశాలు రోజూ తీసుకునే మోతాదుకంటే ఎక్కువగా ఆహారం తినడం ∙ఎక్కువగా నమలకుండానే గబగబా ఆహారాన్ని మింగేయడం ∙కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం. ∙అసిడిక్ నేచర్ ఎక్కువగా ఉండే ఆహారాలైన టమాటా, నిమ్మ జాతి పండ్లు, పుల్లగా ఉండే పండ్లు, కూల్‌డ్రింక్స్‌లో కార్బొనేటెడ్ కోలా డ్రింక్స్ ఎక్కువగా తాగడం, కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, కొన్ని సందర్భాల్లో టీ ఎక్కువగా తాగడం వంటి అంశాలన్నీ ఛాతీలో మంట, గుండెల్లో మంటకు దోహదపడతాయి. పైన పేర్నొన్న వాటిని చాలా పరిమితంగా తీసుకోవడం లేదా వీలైతే తీసుకోకుండా ఉండటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. కడుపు ఉబ్బరం– పరిష్కారాలు తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినండి. ∙పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి. పొట్టుతో ఉండే ధాన్యాలతో చేసిన ఆహారం, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తినండి ∙చేపలను వారంలో కనీసం రెండు–మూడు సార్లు తీసుకోవచ్చు ∙కొవ్వుతో కూడిన వాటిని పరిమితంగా తీసుకోండి ∙తినకముందే పాక్షికంగా పులిసే ఇడ్లీ, దోసెల వంటివాటిని ఎక్కువగా తీసుకోండి. ఇలాంటి ఆహారాన్ని పూర్తిగా పులియకముందే తినడం మంచిది ∙మాంసాహారంలో కొవ్వు తక్కువగా ఉండే చికెన్ మేలు రోజూ చురుగ్గా ఉండండి. వ్యాయామం చేయండి. పొగతాగే అలవాటుకు దూరంగా ఉండండి ∙ బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. కడుపు ఉబ్బరం తగ్గించడానికి ఆహారపరమైన మార్గదర్శకాలివి... పొటాషియమ్ పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గిస్తాయి. పొటాషియమ్ ఎక్కువగా ఉండే ఆహారాలు... అరటిపండ్లు, పుచ్చకాయ, టొమాటోలు, బాదాం వంటి నట్స్ ∙కొబ్బరినీళ్లలో పొటాషియమ్ పాళ్లు చాలా ఎక్కువ. ఒంట్లోని సోడియమ్‌ను బయటకు పంపిస్తాయి, దాంతో కడుపులోని గ్యాస్, కడుపుఉబ్బరం తగ్గుతాయి. భోజనం తర్వాత సోంఫ్ తింటే కొంతవరకు పొట్టఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది. ఒక టీ–స్పూన్ సోంఫ్ గింజలను ఒక గ్లాసెడు నీళ్లు లేదా మజ్జిగలో కలుపుకొని తాగవచ్చు. ∙గ్లాసెడు వేడి నీటిలో నిమ్మరసం కలిపి తాగితే కడుపుబ్బరం తగ్గి కడుపు తేలిగ్గా అవుతుంది. ఇక వేణ్ణీళ్లలో నిమ్మరసం కలిపినప్పుడు... ఆ మిశ్రమానికి విరేచనాన్ని మృదువుగా చేసి సాఫీగా బయటకు వెళ్లేలా చేసే గుణం ఉంటుంది. మృదువిరేచనం అయినప్పుడు గ్యాస్ కూడా సాఫీగా బయటకు వెళ్లి పొట్ట తేలిగ్గా ఉంటుంది. రోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి దాల్చినచెక్క కడుపుబ్బరాన్ని సమర్థంగా తగ్గిస్తుంది. ఒక గ్లాసెడు వేడి నీళ్లలో ఒక కాస్తంత దాల్చిన చెక్క పొడితో పాటు ఒక చెంచా తేనె కలుపుకొని తాగితే పొట్ట ఉబ్బరం తగ్గి కడుపు తేలిగ్గా అనిపిస్తుంది.∙బ్రిస్క్‌వాకింగ్ గానీ, జాగింగ్ లేదా రన్నింగ్ వల్ల కడుపులోని గ్యాస్ కదిలి బయటకు వెళ్తుంది. ఇదే అలవాటును కొనసాగిస్తే కడుపు ఉబ్బరం ఉండదు. వెల్లుల్లి : మొత్తం జీర్ణవ్యవస్థనే శుభ్రం చేసి, కడుపు ఉబ్బరాన్ని పూర్తిగా తగ్గించే శక్తి వెల్లుల్లికి ఉంది. భోజనానికి ముందు రెండు వెల్లుల్లి రెబ్బలను మింగండి. ఆ తర్వాత భోజనం చేయండి. కింది నుంచి గ్యాస్ వెళ్లిపోయి కడుపు తేలిక అవుతుంది. ఇది కాస్త ప్రయత్నించి చూడాల్సిన అంశం. ఎందుకంటే... సాధారణంగా ఉల్లి, వెల్లుల్లి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. కొందరిలో... విచిత్రంగా అవే కడుపు ఉబ్బరానికి కారణమయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రక్రియను వ్యక్తిగతంగా పరిశీలించుకోవాలి. అలాగే మీకు ఏ ఆహారం తిన్న తర్వాత కడుపు ఉబ్బరం ఎక్కువగా ఉంటుందో కూడా గమనించుకొని, వాటి నుంచి కూడా దూరంగా ఉండాలి. ప్రోబయాటిక్ డ్రింక్స్ కడుపుబ్బరాన్ని తగ్గిస్తాయి. అది కుదరకపోతే తాజా మజ్జిగ తీసుకోవచ్చు. అయితే కొందరికి పెరుగు కూడా కడుపుబ్బరం, గ్యాస్ తగ్గిస్తుంది. పెరుగులోని లాక్టోబాసిల్లస్,బైఫిడోబ్యాక్టీరియమ్ అనే మేలు చేసే బ్యాక్టీరియా (ప్రోబయాటిక్స్) కడుపులోని ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. కానీ ఇటీవల ‘యోగర్ట్’ పేరిట పెరుగులోనే అనేక ఫ్లేవర్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. వాటి వల్ల మాత్రం కడుపు ఉబ్బరం, గ్యాస్ తగ్గడానికి పెద్దగా ఆస్కారం ఉండకపోవచ్చు. ఇంట్లో చేసే పెరుగు మంచిది.∙ఆర్టిచోక్ అనే మొక్కలో సినారిన్ అనే పదార్థం ఉంటుంది. కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు ఆర్టిచోక్ తీసుకోవడం వల్ల అందులోని ‘సినారిన్’ అనే పదార్థం కడుపులోని గ్యాస్‌ను తొలగించి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది ∙అవకాడోలో ఉండే లైపేజ్ కూడా కొవ్వులను త్వరగా జీర్ణం చేసి కడుపు ఉబ్బరం సమస్యను దూరం చేస్తుంది. అల్లం టీ: అప్పుడప్పుడూ తాజాగా అల్లం టీ తయారు చేసుకొని తాగితే కడుపు తేలిగ్గా ఉంటుంది. పుదీనా టీ : పుదీనా ఆకులను టీలాగా కాచుకొని తాగితే కడుపు ఉబ్బరంతో పాటు అనేక జీర్ణవ్యవస్థలకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. అల్లం తురుము కాస్తంత కలుపుకొని మజ్జిగ తాగడం కూడా కడుపును తేలిక చేస్తుంది. పప్పు తింటే గ్యాస్ పెరుగుతుందా: ఒక్కొక్కరి జీర్ణవ్యవస్థ పనితీరు ఒక్కోలా ఉంటుంది. ఒక్కో పదార్థాన్ని జీర్ణం చేసుకునే తీరు కూడా ఒక్కోలా ఉంటుంది. అందుకే పప్పులు ప్రతి ఒక్కరిలో అదే తరహాలో గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయనేమీ లేదు. చిక్కుళ్లు, ఇతరత్రా పప్పు ధాన్యాల్లో నీటిలో కరగని పీచు (ఇన్సాల్యుబుల్ ఫైబర్) చాలా ఎక్కువ. ఆ పీచును అరగదీయడంలో జీర్ణవ్యవస్థ చాలా కష్టపడుతుందని ‘మయో క్లినిక్’ పరిశోధకుల అధ్యయనాల్లో తేలింది. పప్పులు, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉన్న చిక్కుళ్లు, బీన్స్ వంటి వాటిని ఎక్కువ సేపు నానబెట్టి ఉడికించడం వల్ల, వాటిలో కడుపు ఉబ్బరం, గ్యాస్‌కు కారణమయ్యే ఫైలేట్స్ పాళ్లు తగ్గి పొట్ట హాయిగా ఉంటుంది. గ్యాస్‌ను ఉత్పన్నం చేసే ఆహారాలు.... ∙బీన్స్ ∙బ్రాకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఉల్లిగడ్డలు ∙పియర్స్, ఆపిల్స్ ∙పొట్టు ఉన్న గోధుమలు ∙సోడాలు, కూల్‌డ్రింక్స్ ∙పాలు, పాల ఉత్పాదనల్లో చీజ్, ఐస్‌క్రీమ్స్ ∙ప్యాకేజ్‌ఫుడ్స్‌లో బ్రెడ్స్ వంటివి తినేవారిలో కడుపు ఉబ్బరం, గ్యాస్ పోవడం ఎక్కువ. అయితే వీటిలో సోడా, కూల్‌డ్రింక్స్ మినహాయిస్తే మిగతావి చాలా ఆరోగ్యకరం. కాబట్టి వాటిని సమస్య రానంత మేరకు పరిమితంగా తీసుకోవాలి. కడుపు ఉబ్బరం సమస్య తగ్గడానికి ఆహారమే మంచి ఔషధం. అలాగే అరటి వంటి కొన్ని పండ్లు కూడా. అయితే పండ్లు తినే సమయంలో కొన్ని రకాల పండ్లలో (ముఖ్యంగా ఆపిల్, పియర్ వంటి వాటిల్లో) సార్బిటాల్ అనే చక్కెరలాంటి పదార్థం ఉంటుంది. ఇది కడుపుబ్బరాన్ని కలిగించవచ్చు. అలాగే పెరుగు వంటివి కూడా. అందుకే ఇందులో ఏ ప్రక్రియ మీకు సరిపడుతుందో, దేన్ని అవలంబిస్తే కడుపు తేలిక అవుతుందో గమనించి దాన్ని అనుసరించవచ్చు. పైగా ఇక్కడ పేర్కొన్న చిట్కాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. రోగనిరోధక శక్తిని పెంచేవే. కాబట్టి మీరు ఇబ్బంది కలిగించకుండా ఉండేదాన్ని ఎంచుకోండి. కడుపును తేలిగ్గా ఉంచుకోండి. ఇన్పుట్స్: డాక్టర్ రామకృష్ణ, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ – రాధిక, చీఫ్ డైటీషియన్ కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
కొవ్వు పదార్థాలు తింటే లావెక్కరు!!!
వేడివేడి అన్నంలో అంత ముద్దపప్పు కలుపుకుని చారడంత నెయ్యి పోసుకుని తింటే భలే మజా అని ఒకప్పుడు అనేవారుగానీ.. ఇప్పుడంతా కొలెస్ట్రాల్ భయం. నెయ్యి ఎక్కువ తింటే లావెక్కుతామని.. తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని బెరకు! ఇది నిజమేనా? ఒకప్పటి మాటేమోగానీ.. ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారిపోతోంది. లావెక్కువయ్యేందుకు కారణం కొవ్వు పదార్థాలు కాదని.. బాగా రిఫైన్ చేసిన కార్బోహైడ్రేట్లు అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ అంశంపై ఇప్పటికే బోలెడన్ని అధ్యయనాలు వెలువడగా.. తాజాగా దాదాపు 1.35 లక్షల మందిపై జరిపిన పరిశోధన ఒకటి ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ‘ద లాన్సెట్’లో ప్రచురితమైన పరిశోధనలో దాదాపు 18 దేశాలకు చెందిన వ్యక్తులను పరిశీలించారు. వీళ్లలో కొందరు తక్కువ కొవ్వులు మాత్రమే తీసుకుంటూండగా.. మిగిలిన వారు కార్బోహైడ్రేట్ల మోతాదుపై పరిమితులు పాటిస్తున్నవారు. కొవ్వులపై ఆంక్షలు పెట్టుకున్న వారిలోనే గుండెజబ్బులు, గుండెపోటు వంటి సమస్యలు కనిపించగా.. మిగిలిన వారిలో ఈ ప్రమాదం తక్కువగా నమోదైంది. శరీరం సక్రమంగా పనిచేసేందుకు, అవసరమైనప్పుడు రక్తం తొందరగా గడ్డకట్టేందుకు, కండరాల కదలికలకూ కొవ్వులు అత్యవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాకుండా విటమిన్లు, ఖనిజాలు శరీరానికి ఒంటబట్టాలన్నా కొవ్వులు కావాల్సిందే. వీటి మోతాదు తగ్గించి.. కార్బోహైడ్రేట్లు, చక్కెరలను ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడం మొదలవుతుందని శాస్త్రవేత్తల అంచనా. దాదాపు 50 పరిశోధనలు ఈ విషయాన్ని ఇప్పటికే నిర్ధారించాయి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా అందినప్పుడు శరీరం వాటిని సులువుగా చక్కెరలుగా మార్చేసుకుంటుందని న్యూయార్క్‌లోని మెమోరియల్ స్లోర్ కేటరింగ్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్త కారా అన్సెల్మో అంటున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిర్వహించే బ్లాగ్ ప్రకారం.. చేపలు, ఆలివ్ ఆయిల్, గింజల నుంచి తీసిన నూనెల్లోని మోనో, పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదే సమయంలో బాగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో ఉండే ట్రాన్స్‌ఫ్యాట్స్ చేటు చేస్తాయి. మొత్తమ్మీద చూస్తే.. ఆహారంలో జంతు సంబంధిత కొవ్వుల స్థానంలో. చేపలు, అవకాడో వంటివాటి ద్వారా లభించే సంతృప్త కొవ్వులను తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చునన్నది శాస్త్రవేత్తల తాజా అంచనా! -
గింజలతో నాజూకు నడుము!
మీరు ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారా? నడుం చుట్టూ ఉన్న కొవ్వు ముడతలను తొలగించుకుని నాజూకుగా తయారవ్వాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఆహారంలో గింజల వాడకాన్ని పెంచేయండి. అతిగా ప్రాసెస్ చేసిన వాటి కంటే గింజలన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలగడమే కాకుండా నడుం చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుందని అంటోంది డెన్మార్క్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం. అంతేకాకుండా ఈ రకమైన ఆహారం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ (వాపు/మంట) తగ్గడమే కాకుండా మధుమేహాన్ని కూడా నిరోధించవచ్చు అంటున్నారు వీరు. గుండెజబ్బులు, అధిక చెడు కొలెస్ట్రాల్, రక్తపోటు, పొట్టవద్ద కొవ్వు పేరుకుపోవడం వంటి లక్షణాలున్న కొందరిపై వీరు ప్రయోగాలు చేశారు. వీరిని రెండు వర్గాలుగా విభజించి వారికి అందించే ఆహారాన్ని రెండుసార్లు మార్చారు. ఒక వర్గం ముందుగా ఎనిమిది వారాలు గింజధాన్యాలను ఆహారంగా తీసుకుంది. ఆ తరువాత ఆరు వారాల పాటు సాధారణ ఆహారం.. మళ్లీ ఎనిమిది వారాలు బాగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకున్నారు. ఇంకో వర్గం ముందుగా ప్రాసెస్ చేసిన ఆహారం, ఆ తరువాత ఆరువారాలు సాధారణ ఆహారం... మళ్లీ ఎనిమిది వారాలు కేవలం గింజధాన్యాలు తిన్నారు. వీరి రక్తం, మలాన్ని పరిశీలించారు. మరి కొన్ని పరీక్షల ద్వారా వారు ఆరోగ్యంగా ఉంటూనే బరువు తగ్గినట్లు తెలిసింది. మనం తినే ఆహారంలో కనీసం నాలుగోవంతు గింజలు ఉండేలా చేసుకుంటే అది బరువు తగ్గేందుకు, నాజూకు నడుముకూ ఉపకరిస్తుందన్నది ఈ పరిశోధనల సారాంశం. -
ఇట్స్ గాన్.. పోయిందే!
ఇట్స్‌గాన్.. పోయ్పొచే.. పోయిందే.. అమృతాంజన్ కు సంబంధించిన పాత యాడ్ గుర్తుందా? ఇలా రాయగానే.. అలా నొప్పి మాయం అన్నమాట. అదే తీరులో గుండె జబ్బులన్నీ ఒక్క మాత్రతో మటుమాయమైతే ఎలా ఉంటుంది..? అద్భుతంగా ఉంటుంది కదూ. ఇది జరిగేందుకు ఇంకెంతో కాలం లేదంటున్నారు బ్రిటన్‌లోని అబర్డీన్ వర్సిటీ శాస్త్రవేత్తలు. ట్రొడుస్క్వమైన్ అనే మాత్రను ఒక్కసారి తీసుకుంటే చాలు.. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుందని చెబుతున్నారు. కొవ్వు గుండె పోటుకు కారణమవుతుందన్న విషయం తెలిసిందే. ఊబకాయంతోనే సమస్యలు.. ఊబకాయం ద్వారా మధుమేహం, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయన్నది తెలిసిన విషయమే. ఆహారంలోని కొన్ని రకాల కొవ్వు పదార్థాలు రక్తనాళాల్లోకి చేరి గట్టిపడటం వల్ల గుండెకు రక్త ప్రసరణ తగ్గి తద్వారా ఆక్సిజన్ మోతాదు తగ్గిపోయి గుండెజబ్బులు వస్తాయి. ధూమపానం వంటి అలవాట్లు అథెరోస్కేలెరోసిస్ (రక్త నాళాలు మందం కావడం) ప్రక్రియను వేగవంతం చేస్తాయని స్పష్టమైన అంచనాలున్నాయి. జీవనశైలిలో మార్పుల ద్వారా అంటే.. తగిన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం.. ఒత్తిడిని వీలైనంత మేర తగ్గించుకోవడం వంటి పనుల ద్వారా గుండె జబ్బులను పూర్తిగా నివారించొచ్చని ఇప్పటికే రుజువైంది. అయినా ఏటా కొన్ని కోట్ల మంది గుండెజబ్బుల బారిన పడి మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో అబర్డీన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ట్రొడుస్క్వమైన్ మందుపై పరిశోధనలు జరిపారు. టైప్– 2 డయాబెటిస్ లక్షణాలను తగ్గించగలిగే ఈ మందు.. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వులపై ప్రభావమేంటో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. జన్యుమార్పుల ద్వారా కొన్ని ఎలుకల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయేలా చేసి ఈ మందును ప్రయోగించారు. ఒకే ఒక్క డోసు మందు తీసుకున్న ఎలుకలతో పాటు కొంత కాలం పాటు అప్పుడప్పుడూ మందు తీసుకున్న ఎలుకల్లోనూ కొవ్వు గణనీయంగా తగ్గిపోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. వ్యాయామం చేసినట్లుగా.. వ్యాయామం చేస్తే కొవ్వు తగ్గుతుందని తెలుసు. ట్రొడుస్క్వమైన్ అచ్చంగా ఇదే పని చేస్తుంది. వ్యాయామం చేసినట్లు శరీర వ్యవస్థకు భ్రమ కల్పించి తద్వారా ప్రత్యేకమైన ప్రొటీన్ విడుదలయ్యేలా చేసి, ఓ ఎంజైమ్ ఉత్పత్తి ఆగిపోయేలా చేస్తుందని శాస్త్రవేత్త డెలిబీగోవిక్ వివరించారు. ఈ రెండు చర్యల ఫలితంగా కొవ్వు కరిగిపోవడంతో పాటు వాపు వంటి లక్షణాలు తగ్గిపోతాయి. ట్రొడుస్క్వమైన్ మధుమేహంతో పాటు రొమ్ము కేన్సర్ చికిత్సలోనూ ఉపయోగపడుతున్నట్లు ఇప్పటికే జరిగిన పరీక్షలు చెబుతున్నాయి. ఈ మందు గుండెజబ్బులకూ ఉపయోగపడుతుందన్న విషయం వైద్య రంగంలో ఆసక్తి రేకెత్తిస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే మానవులపై ప్రయోగించనున్నారు. కొవ్వు పేరుకుపోవడం అసలు సమస్య.. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల అథెరోస్కేలెరోసిస్ (రక్త నాళాలు మందం కావడం) వస్తుందని అందరికీ తెలిసిందే. అయితే ఇది ఎందుకు జరుగుతుందో స్పష్టంగా తెలియదు. కాకపోతే ధూమపానం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో ఇది అధికంగా కన్పిస్తుంది. పసిపిల్లల రక్తనాళాల్లోనూ కొద్దిమేర కొవ్వు పేరుకుని ఉంటుంది. వారిలో వయసు పెరిగే కొద్దీ మోతాదు ఎక్కువ అవడంతో పాటు రక్తనాళాలు పెళుసు బారిపోవడం వల్ల సమస్యలు ఎక్కువవుతాయని అంచనా. శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, రోజూ అతిగా మద్యపానం, అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆసియా, ఆఫ్రికా, కరేబియన్ దీవుల్లోని ఆఫ్రికన్ సంతతి ప్రజలు జన్యుపరమైన సమస్యల కారణంగా గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఉంది. నోటిలోని బ్యాక్టీరియా వల్ల కూడా..! రక్తనాళాల్లోకి చేరే కొవ్వు ఆహారం నుంచే కాదు.. నోటిలో ఉండే బ్యాక్టీరియా నుంచి కూడా రావొచ్చని కనెక్టికట్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హార్ట్ఫర్డ్ ఆసుపత్రిలోని కొందరు రోగుల రక్తనాళాల్లోని కొవ్వును రసాయనికంగా పరిశీలించగా.. అవి ఏ జంతువుకు సంబంధించింది కాదని గుర్తించారు. ఈ కొవ్వు కణాలు ఒకే రకమైన బ్యాక్టీరియా కుటుంబానికి చెందినవిగా గుర్తించినట్లు పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఫ్రాంక్ నికోలస్ తెలిపారు. బాక్టరోడిటీస్ అనే బ్యాక్టీరియా భిన్న రకాల కొవ్వు పదార్థాలను ఉత్పత్తి చేయగలదని, వీటికి, మన శరీరంలోని కొవ్వులకు మధ్య స్పష్టమైన తేడా ఉండటం వల్ల గుర్తించామని ఫ్రాంక్ వివరించారు. పంటి సమస్యలు, చిగుళ్ల సమస్యలు తీవ్రంగా ఉన్నవారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండేందుకు కారణం కూడా ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే కొవ్వులే కావొచ్చని ఫ్రాంక్ భావిస్తున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నడుము కొవ్వును కరిగించే ప్యాచ్
న్యూయార్క్ : నడుము భాగం వద్ద కొవ్వు బాగా పెరిగి ఇబ్బంది పడుతున్నారా? మీ కోసం శాస్త్రవేత్తలు చిన్న చిన్న సూదులున్న ప్యాచ్‌ను రూపొందించారు. కొవ్వును కరిగించే ఈ ప్యాచ్ ఊబకాయం, మధుమేహం లాంటి జీవక్రియ సంబంధ రుగ్మతలకు చికిత్స అందించేందుకు కూడా ఉపకరిస్తుందట. తెల్లని కొవ్వు (మోతాదుకు మించి ఉండేది) ను ఇది గోధుమ రంగులోకి మార్చుతుందని అమెరికాకు చెందిన కొలంబియా యూనివర్శిటీ మెడికల్ సెంటర్, యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధకులు తెలిపారు. -
కొండలా కొవ్వు ఉంది ఎంతకూ తగ్గనంది
ఊబకాయం తగ్గించుకోవడానికి సర్జరీలను ఆశ్రయిస్తున్న సిటీజనం - హైదరాబాద్‌లో ఏటా 800లకు పైగా సర్జరీలు - ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువ - నగర పిల్లల్లో 13%.. పెద్దల్లో 12% మందికి ఊబకాయం పిజ్జాలు, పాస్తాలు... అర్ధరాత్రి ‘కిక్కు’నిస్తున్న విందులు, వినోదాలు... ఆహారపు అలవాట్లు మారి... శారీరక వ్యాయామం తగ్గి... సిటీజనులకు కొండలా కొవ్వు పేరుకుపోతోంది. క్షణం తీరికలేని జీవనశైలితో అధిక బరువు పెద్ద సమస్యగా మారింది. ఇందుకు పెద్దలే కాదు... పిల్లలూ మినహాయింపు కాదు! 13% మంది బడికి వెళ్లే పిల్లలు... 12% మంది పెద్దలు ఊబ కాయంతో తంటాలు పడుతున్నారు. ఫలి తంగా.. చిటికెలో కొవ్వు కరిగించుకొనేందుకు సర్జరీలను ఆశ్రయిస్తున్నారు. ఈ సర్జరీలకూ నగరమే ప్రధాన కేంద్రంగా మారడం విశేషం. సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఏటా ఆరు వేలకు పైగా కొవ్వు కరిగించే సర్జరీలు చేస్తుంటే.. వీటిల్లో అత్యధికంగా హైదరాబాద్‌లోనే 800కు పైగా జరుగు తున్నాయి. దేశంలోనే మరెక్కడా లేని వైద్య నిపుణులు, సూపర్ స్పెషా లిటీ ఆస్పత్రులు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండ టం.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై తదితర మెట్రో నగరాలతో పోలిస్తే వైద్య ఖర్చులు తక్కువగా ఉండటం వల్ల దేశీయులే కాకుండా విదేశీయులూ ఇక్కడికి వస్తున్నారు. ఢిల్లీలో నెలకు 50, ముంబైలో 40 కొవ్వు కరిగించే సర్జరీలు జరుగుతుంటే.. గ్రేటర్లో 70 జరుగుతున్నాయి. రోజుకు 1400 కేలరీలు చాలు.. శరీరానికి అవసరమైన దానికంటే అధిక ఆహారం తీసుకోవడం, దాని ద్వారా లభించిన కేలరీలు ఖర్చు అయ్యే స్థాయిలో శారీరక శ్రమ చేయక పోవడం, పాశ్చాత్య దేశాల అలవాట్లను అందిపుచ్చుకోవడం... కారణమేదైనా సంపదతో పాటే సౌకర్యాలు, ఆహార లభ్యత పెరిగి ఊబకాయానికి దారితీస్తోంది. ప్రాసెస్డ్ ఫుడ్డు, పిజ్జాలు, బర్గర్లు ఒకసారి తింటే చాలు... రోజుకు సరిపడే కేలరీలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఖర్చుకాకపోతే లోపల నిల్వ ఉండి బరువు పెరుగుదలకు కారణం అవుతాయి. రోజంతా కష్టించే రైతులు, భవన నిర్మాణ, ఇతర కార్మికులకు రోజుకు సగటున 2,300–2,500 కేలరీల శక్తి అవసరం. శారీరక శ్రమ అంతగా లేని వారికి 1,400 కేలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకుంటే సరిపోతుంది. కానీ టిఫిన్లు, భోజనంతో పాటు ఫాస్ట్ఫుడ్స్ కూడా తీసుకోవడం వల్ల అదనపు కేలరీలు పేరుకుపోతున్నాయి. ఏటా అదనంగా 90 వేల కేలరీలు తీసుకుంటే 5 కేజీల చొప్పున, నాలుగైదేళ్లలో 20 కేజీలకు పైగా బరువు పెరుగుతారు. పరోక్షంగా ఇది మధుమేహం, గుండె పోటు, మోకాలి నొప్పులు, హైపర్‌టెన్షన్, మహిళల్లో సంతానలేమి, రొమ్ము కేన్సర్‌కు కారణం అవుతుంది. లైపోసక్షన్‌తో సత్వర ఫలితాలు ఇంజక్షన్ సహాయంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించే పద్ధతిని లైపోసక్షన్ సర్జరీ అంటారు. ఫలితం చాలా త్వరగా ఉంటుంది. సినీ తారలు ఎక్కువగా దీన్ని ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల చికిత్స తర్వాత.. కొవ్వును తీసేసిన ఖాళీ ప్రదేశంలోకి నీరు చేరి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇక జీర్ణకోశం సైజును తగ్గించి క్రమంగా బరువును తగ్గించే ప్రక్రియను బేరియాట్రిక్ సర్జరీ అంటారు. ఇది 2007లో హైదరాబాద్‌లో తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. రోజువారీ వ్యాయామం, ఆహార నియంత్రణతో నెమ్మదిగా బరువును తగ్గిస్తారు. తొమ్మిది మాసాల్లో 60–70 శాతం కొవ్వు దానంతట అదే శరీరంలో కరిగిపోతుంది. సాధ్యమైనంత వరకు బరువు పెరగకుండా చూసుకోవాలి. రోజూ అరగంటైనా వ్యాయామం చేయాలి. పరిమితికి మించి ఆహారం తీసుకోకూడదు. ఈ సర్జరీలు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే. – డాక్టర్ జి.సురేష్‌చంద్రహరి, బేరియాట్రిక్ సర్జన్, సిటిజన్స్ హాస్పిటల్ 1 నెలలో 30 కేజీలు తగ్గా నేను 128 కేజీల బరువుండేవాడిని. అధిక బరువు వల్ల కనీసం నాలుగు అడుగుల దూరం కూడా నడవలేక పోయాను. కూర్చోలేక... నిలుచోలేక బాధపడ్డాను. శ్వాస కూడా కష్టమైంది. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత 30 రోజుల్లోనే 30 కేజీలు తగ్గాను. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవు. – సందీప్, బోయినపల్లి 27 రోజుల్లో 25 కేజీలు... సర్జరీకి ముందు నా బరువు 177 కేజీలు. ప్రస్తుతం 152 కేజీలకు తగ్గింది. 27 రోజుల్లో 25 కేజీలు తగ్గాను. ఇప్పుడు చాలా రిలాక్స్‌గా ఉంది. – ఆదిల్, చందానగర్ అధిక బరువు ఇలా నిర్ధారిస్తారు... ► బాడీమాస్ ఇండెక్స్ (బరువు కిలోలు/ఎత్తు మీటర్లలో) ► 18–23 వరకు ఉండటం ఉత్తమం ► 20 లోపు ఉంటే తక్కువ బరువు ఉన్నట్లు ► 20–25 మధ్య ఉంటే సరైన బరువు ఉన్నట్లు లెక్క ► 25–30 మధ్య ఉంటే అధిక బరువు ► 30–40 మధ్య ఉంటే ఊబకాయం ► 40 కన్నా ఎక్కువ ఉంటే ‘మార్పిడ్ ఒబేసీ’ అంటారు. -
పొట్ట చెక్కలు...
అసలు పొట్ట దగ్గర కొవ్వు ఎందుకు పెరుగుతుంది? యోగాసనాలతో దానిని తగ్గించవచ్చా? అయితే ఎలాంటి ఆసనాలు వేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలివి... ఫ్యాట్‌కు కారణాలివే... తీసుకునే క్యాలరీల కంటే ఖర్చుపెట్టే క్యాలరీలు తక్కువగా ఉండడం ఊబకాయానికి మొదటి కారణం. తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల క్యాలరీలు ఖర్చుకావు. ఒకవేళ జీవక్రియ తక్కువగా ఉన్నా కూడా క్యాలరీలు ఖర్చుకావు. అంటే కణంలో ఉండే మైట్రోకాండ్రియా ప్రతి గ్లూకోజు మాలిక్యూర్ని 38 (34+2+2) ఎటిపి మాలిక్యూల్స్‌గా మార్చగలిగినపుడు తీసుకున్న క్యాలరీలన్నీ పూర్తిగా ఖర్చవుతాయి. ఒకవేళ కన్వర్షన్ రేట్ తక్కువగా ఉన్నట్లయితే అది కొవ్వు కింద మారుతుంది. పురుషులలో పొట్ట చుట్టూ, స్త్రీలలో తొడలు భుజాలలోకి చేరుతుంది. పొట్ట చుట్టుకొలత 36 అంగుళాలు అంతకన్నా మించినట్లయితే దానిని ఒబేసిటీ కింద పరిగణించవలసి వస్తుంది.జన్యుపరమైన కారణాలతో ఆకలి, జీవక్రియలోనూ మార్పులు సంభవించి ఊబకాయానికి కారణమవుతుంది. కొన్ని అనారోగ్య పరిస్థితులు అంటే థైరాయిడ్, పిసిఒడి సమస్యల వల్ల కూడా బరువు పెరగవచ్చు. ఈ సమస్యలు అదనం... ఈ ఊబకాయం మరికొన్ని సమస్యలకు దారితీస్తుంది. వాటిలో నిద్రలేమి, సిఒపిడి, ఊపిరితిత్తుల పనితీరు సమస్యలకు, కరోనరీ ఆర్టరీ వ్యాధికి, మధుమేహం, డిప్రెషన్, జిఇఆర్డి, అధిక రక్తపోటు, హై కొలస్ట్రాల్, ఆర్ధరైటిస్, స్ట్రోక్..లకు దారితీస్తుంది. ఆహారంలో మార్పులు చేయడం చాలా ముఖ్యం. రాత్రి పూట తీసుకునే ఆహారమే ఈ రోజులలో ఊబకాయానికి ముఖ్యకారణం. రాత్రి భోజనం మీద నియంత్రణ ఉంటే అంటే కేవలం పండ్లు, కాయగూరల సలాడ్స్ తీసుకున్నట్లయితే లేదా రాత్రి సమయం 8 గంటల తరువాత పిండిపదార్థాలను పూర్తిగా మానడం ఒక మార్గం. దీనితో పాటు యోగాసనాలను రెగ్యులర్‌గా సాధన చేయడం వలన కూడా ఊబకాయం తగ్గించవచ్చు. అలాంటి ఆసనాలలో కొన్ని....ఇవి 1. చాలన అర్ధధనురాసన ముందు మకరాసనంలో విశ్రాంతిగా బోర్లాపడుకుని శ్వాసతీసుకుంటూ కాళ్లు రెండు దగ్గరకు తీసుకువచ్చి, చేతులు ముందుకు తీసుకురావాలి. తిరిగి శ్వాస వదుల్తూ చేతులు రెండు పక్కల నుండి (ఈత కొట్టేటప్పుడు నీటి అలలను ఎలాగైతే పక్కకు రెండు చేతులతో నెడతామో అలాగ) వెనుకకు తీసుకువెళ్ళి శ్వాసతీసుకుంటూ కాళ్లు రెండూ తొడలు పైకి లేపి ఛాతీని పైకి లేపుతూ వీలైతే రెండు చేతులను వెనుక లాక్ చేయవచ్చు. ఈ సెట్ కనీసం పది సార్లు చేయాలి. స్టెప్ –ఎ (మకరాసన); స్టెప్–బి (అధోముఖ సానాసన); స్టెప్–సి (శలభాసన) 2 ఎల్బో ప్లాంక్ ఫొటోలో చూపిన విధంగా మోచేతులు కాలివేళ్ళ సపోర్ట్‌తో శరీరాన్ని శ్వాసతీసుకుంటూ పైకి లేపి 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ తిరిగి కిందకు మకరాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. ఇది 5 సార్లు చేయాలి. 3. చాలన కపోతాసనం చేతుల సపోర్ట్‌తో కాళ్లు మడచి శ్వాస తీసుకుంటూ ఛాతీ భాగం వీలైనంత పైకి, మోచేతులు పూర్తిగా ఓపెన్ చేసి శ్వాస వదులుతూ తిరిగి కిందకు వచ్చి మకరాసనంలో విశ్రాంతి పొందాలి. ఈ విధంగా 10 సార్లు చేయాలి. 4. చాలన ఉత్కటాసన సమస్థితిలో నిలబడి చేతులు రెండూ ఇంటర్‌లాక్ చేసి పాదాలను వీలైనంత అనువైన దూరంలో ఉంచి శ్వాస వదులుతూ మోకాళ్లను పక్కకు ఓపెన్ చేస్తూ కిందకు కూర్చుని శ్వాస తీసుకుంటూ మళ్ళీ పైకి లేపాలి. ఈ విధంగా 5 నుండి 10 సార్లు చేయాలి. మోకాలు సమస్య ఉన్నవాళ్లు జాగ్రత్తగా చేయాలి. సమస్య మరీ ఎక్కువగా ఉన్నటయితే ఈ ఆసనాన్ని చేయకుండా ఉండటం మంచిది. వీటితో పాటు చక్రాసన, పశ్చిమోత్తానాసన, చక్కీచాలనాసన, నావబాలనాసన.. వంటి ఆసనాలు కపాలభాతి, భస్త్రిక వంటి ప్రాణాయామాలు చేయడం వలన కూడా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
హెల్త్ టిప్స్
వారంలో ఒక రోజు లేదా కనీసం ఒక్కపూట పొట్టకు హాలిడే ఇవ్వడం ఆరోగ్యకరమే. అయితే ఆ రోజు తేనె నిమ్మరసం తీసుకుంటూ ఉంటే ఒంట్లో ఉన్న కొవ్వు త్వరగా కరగడం ప్రారంభమవుతుంది. తేనె, నిమ్మరసం వల్ల దేహానికి రోజువారీ పనులకు అవసరమైన శక్తి అందుతుంది. ఒక టీ స్పూన్ తేనె, ఒక నిమ్మ చెక్కరసాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా రోజులో ఎన్నిసార్లయినా తాగొచ్చు. -
ఐటి రంగంలో కోటి ఉద్యోగాలు ఫట్
-
శక్తిని తగ్గనివ్వదు... ఏజ్‌ని పెరగనివ్వదు!
కొబ్బరిలో కొవ్వు ఎక్కువే. నెయ్యిలో ఉన్నట్లుగా దీనిలోనూ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. కానీ సాధారణంగా శాచ్యురేటెడ్ చేసినంత హానిని కొబ్బరిలోని కొవ్వులు చెయ్యవు. కొబ్బరిలో 61 శాతం డైటరీ ఫైబర్ ఉంటుంది. అది ఒంట్లోకి చక్కెరను చాలా నెమ్మదిగా విడుదల చేస్తుంది. కాబట్టి కొబ్బరి డయాబెటిస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని కొందరు న్యూట్రిషన్ నిపుణులు చెబుతుంటారు. పైగా చక్కెరనూ, తియ్యదనాన్ని ఆస్వాదించాలనే భావనను (గ్లైసిమిక్ క్రేవింగ్‌ను) కొబ్బరి తగ్గిస్తుంది. కొబ్బరి తినడం వల్ల మరింత తీపి తినాలనే భావన తగ్గుతుంది కాబట్టి కొబ్బరి డయాబెటిస్ ముప్పును తప్పిస్తుందన్నది న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ. కొబ్బరిలోని సైటోకైనిన్స్, కైనెటిన్, ట్రాన్స్ జీటిన్ అనే అంశాలు వయసును తగ్గిస్తాయి. దీర్ఘకాలం యౌవనంగా ఉండాలంటే కొబ్బరి తినడం మేలు. కొబ్బరిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలు పుష్కలం. కొబ్బరి తినేవారిలో వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి బాగా పెరుగుతుంది. కొబ్బరిని ఎక్కువగా వాడేవారికి గొంతు ఇన్ఫెక్షన్లు, బ్రాంకైటిస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు ఒక పట్టాన రావు. కొబ్బరి తిన్నప్పుడు ఆ కొవ్వుల వల్ల ఆకలి అంతగా అనిపించదు. అందుకే కొబ్బరి తినే వారిలో ఆకలి తగ్గడంతోపాటు తినే కోరిక కూడా తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఆరోగ్యవంతమైన మార్గం. -
నువ్వూ...నేనూ...నూనె...!
పురుషులందు పుణ్యపురుషుల్లాగే నూనెల్లో మంచినూనెలు వేరు. ఉప్పు కప్పురమ్ము లాగే అమాయకంగా కనిపించే కొవ్వులూ ఉన్నాయి. టేస్టు కోసమే చూసుకుంటే... ఫ్రయ్ లోంచి పొయ్యిలోకి దూకేసినట్లు అనుకుంటారు చాలా వుంది. రోస్ట్లతో ఎందుకీ రొష్టు అనుకొని హేస్టీ నిర్ణయంతో నూనె వస్తువులనే ముట్టరు కొందరు. అసలు నూనె వాడకపోవడం మంచిదేనా? కానే కాదు. శరీరానికి నూనె అవసరం. అవసరమైనంత నూనెను తీసుకుంటూనే ఆరోగ్యం కాపాడుకునే వూర్గాలు ఉన్నాయా? ఉన్నాయి. కాకపోతే మోతాదు మించనివ్వకూడదంతే. ఆ మోతాదేమిటో, నూనె వాడినా కొవ్వు చేరకుండా జాగ్రత్తలెలాగో తెలుసుకునేందుకే ఈ కథనం... నారు పెరగడానికి నీరు ఎలాగో, కూరా, నారా, చారూలో రుచి పెరగడానికి నూనె అలాగ. తాలింపు నుంచి వేయింపు వరకు తన ప్రాధాన్యం చూపుతుంది. కిచిడీ నుంచి పచ్చడి వరకూ మటన్ నుంచి చికెన్ వరకు కిచెన్‌ను శాసిస్తుంది. అయితేనేం... నూనెకు నిత్యం నీలాపనిందలు. కమ్మదనాన్ని పెంచినా కోప్పడేవారే ఎక్కువ... జబ్బులన్నింటికీ కారణం అదేనంటూ. మనిషి బతకడానికి ఆహారంలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఖనిజాలూ, విటమిన్లతో పాటూ కొవ్వులూ కావాల్సిందే. మిగతావాటన్నింటికీ బోల్డ్డంత గౌరవం ఒక్క నూనెలకు తప్ప. వుహా అదొక్కటే ఆరోగ్యాన్ని పాడుచేసేట్లు అవవూనాలూ, ఆడిపోసుకోవడాలు. అది నిజమేనా? నూనెను నిరసించాల్సిందేనా? ఆరోగ్యం చెడిపోనివిధంగా నూనెల్ని ఉపయోగించుకోలేవూ?... తప్పక ఉపయోగించుకోవచ్చు. శరీరంలో కొవ్వులు పెరక్కుండా కాపాడుకోవచ్చు. అవసరం కూడా... శరీర నిర్వహణకు అన్ని పోషకాలూ అవసరమైన పాళ్లలో కావాలి. అదే సమతులాహారం. ఓ ఆరోగ్యకరమైన వ్యక్తి తన ఆహారంలో 55% కార్బోహైడ్రేట్లు, 25%ప్రోటీన్లు, 20% కొవ్వులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమతౌల్యంలో ఏది లోపించినా అది మనిషి శారీరక, మానసిక ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుంది. అందుకే శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలు సవుకూరేందుకు నూనెలు తీసుకొని తీరాల్సిందే. కాకపోతే అవసరమైన మోతాదుకు మించనివ్వకూడదు. పైగా అవి 20% కావాలంటే వాటి ప్రాధాన్యం ఎంతో గుర్తించి తీరాల్సిందే. నూనెల రకాలివి... శరీరానికి కొవ్వులను సవుకూర్చే నూనెలు 3 రకాలు. శాచురేటెడ్: సాధారణంగా ఇవి గది ఉష్ణోగ్రత వద్ద ఘనరూపంలో ఉంటాయి. తెల్లగా అవూయికంగా కనిపిస్తుంటాయి. అయితే కనిపించేంత అవూయికం కావవి. టేస్టీగా ఉన్నా కాస్తంత ఖతర్నాకే. అవే... నెయ్యి, వెన్న, జున్ను, మీగడ, పామోలిన్ ఆయిల్. (వాటితోపాటు పత్తిగింజల నుంచి తీసే నూనె కూడా శాచురేటెడ్ ఆయిలే. ఇది చాలా చవక కాబట్టి ఎక్కువ వుంది వాడుతుంటారు.) హైడ్రోజనేటెడ్: నెయ్యిలాంటి స్వాభావిక పదార్థాలను కృత్రివుంగా తయారు చేయడం కోసం ఈ ప్రక్రియ ద్వారా నూనెలు చేస్తారు. ఉదాహరణకు డాల్డా, వూర్జరిన్ వంటివి. (చిప్స్ వంటివి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే హైడ్రోజనేటెడ్ ఆయిల్స్‌లో వేయిస్తారు. పదార్థాలకు ఎక్కువ షెల్ఫ్‌లైఫ్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి). అన్‌శాచురేటెడ్: ఇందులో వుళ్లీ రెండు రకాలు ఉన్నాయి. మెుదటివి పాలీ అన్‌శాచురేటెడ్ నూనెలు. సంక్షిప్తంగా ‘ప్యూఫా’ అంటారు. ఇవి పొద్దుతిరుగుడు నూనె, కుసువు నూనె (సాఫ్ ఫ్లవర్ ఆయిల్) వంటివి. రెండో రకం నూనెలు మోనో అన్‌శాచురేటెడ్ ఆయిల్స్. సంక్షిప్తంగా ‘వు్యూఫా’ అంటారు. నువ#్వల నూనె, సోయాబీన్ నూనె, ఆలివ్ ఆయిల్... (వీటన్నింటిలోనూ ఆలివ్ ఆయిల్ వుంచిదంటారు నిపుణులు) ఇవన్నీ వు్యూఫా ఆయిల్స్. నిజంగానే ప్రమాదమా..?: కానే కాదు. పైగా వుుందుగా చెప్పినట్లు శరీరంలోని కీలక అవయవాల పరిరక్షణకు అవసరం కూడా. వునలోని కాలేయం కొన్ని కొవ్వులను తయారుచేస్తుంది. అందులో కొలెస్ట్రాల్ ఒకటి. కానీ ఈ ప్యూఫా, మన శరీరంలో తయారుకావలి. కాబట్టి శరీరానికి అవసరమైనవాటిగా ఈ నూనెల్ని ఆహారంలో తీసుకోక తప్పదు. ఇవి తీసుకోక తప్పదు కాబట్టే వీటిని ‘ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్’ అని కూడా అంటారు. పైగా విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ... వంటి కొన్ని విటమిన్లు శరీరంలోకి అబ్జార్బ్ కావాలంటే నూనెలు తీసుకోక తప్పదు. వాటిని ‘ఎసెన్షియల్’ అంటున్నావుంటే అవెంత అవసరమైనవో తెలియడం లేదూ! ఇక చేపల నుంచి అందే నూనెల్లో, అవిసె గింజల నూనెలో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాటితో సుదీర్ఘకాలం ఆరోగ్యంతో పాటు వయసు కనపడకపోవడం వంటి సుగుణాలు ఉంటాయి. అందుకే వూంసాహారం తినేవారైతే వారానికి కనీసం వుూడు, నాలుగు రోజులు చేపలను సిఫార్సు చేస్తుంటారు ఆహారనిపుణులు. ఆరోగ్యాన్ని కాపాడుకోండి... ఇలా! నూనెలు ఎక్కువగా తీసుకుంటే అవి కొవ్గా వూరి రక్తనాళాల్లో పేరుకుపోతాయన్న విషయం తెలిసిందే. గుండెకు వెళ్లే రక్తనాళాల్లో ఈ కవ్వు పేరుకుని గుండె కండరానికి రక్తం సరఫరా కాకపోతే గుండెపోటు వచ్చే ప్రవూదం ఉంటుంది. రక్తపోటూ పెరుగుతుంది. ఇలాంటి ప్రవూదాలెన్నో ఉన్నాయి. అయితే మరోపక్క అవి అత్యవసరం కూడా. మరెలా? అందుకే ప్యూఫా, లను ఒకదానిపై ఒకటి నిఘా ఉంచేలా చేస్తే సరి అంటున్నారు నిపుణులు. శరీర అవయవాలన్నింట్లోనూ వీవీఐపీ గుండె. అంతటి వీఐపీకి ఇద్దరు సెక్యూరిటీ గార్డులను ఉంచితే సరి. ‘ప్యూఫా, మ్యూఫా’ నూనెలు రెంటినీ తీసుకుంటే వీవీఐపీ లాంటి గుండెకు రక్షణగా ఉంటాయవి. ప్యూఫా (పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్) నూనెలైన పొద్దుతిరుగుడు లేదా కుసుమ నూనెలను ఓ పూట తీసుకోవాలి. వురో పూట వు్యూఫా (మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్) నూనెలైన ఆలివ్ లేదా వేరుసెనగ నూనెలను తీసుకోవాలి. షిఫ్ట్ డ్యూటీల్లో ప్యూఫా, మ్యూఫా: ఈ ప్యూఫా, మ్యూఫాలను ఉదయం ఒక వెరైటీ నూనె ఉపయోగిస్తే, సాయంత్రం మరోటి ఉపయోగించాలి. అలా కాకపోతే ఒక నెలంతా ప్యూఫా ఉపయోగిస్తే, వురో నెలలో వు్యూఫా వాడాలన్నవూట. అంటే... ఒకనెల పొద్దుతిరుగుడు నూనె తీసుకుంటే మరో నెల వేరుశెనగ నూనె వాడాలి. దాంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. ఇలా ఉదయం, సాయంత్రం, ఓ నెల అదీ, వురో నెల ఇదీ అంటూ పూట షిఫ్టుల్లోగానీ, నెల, నెలా షిఫ్టుల్లోగానీ ఈ ప్యూఫా, మ్యూఫాలను ఉపయోగిస్తే వీవీఐపీ అయిన గుండె థిలాసా అన్న భరోసా మీ సొంతం. రౌడీ బాబాయిలతో రవ్వంత జాగ్రత్త... ఎలాగూ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు కదా అని హృదయాన్ని రఫ్ ఆడించే రౌడీలను లోనికి పంపడం సరికాదు కదా. అలాగే ఆరోగ్యం కోసం ప్యూఫా, మ్యూఫా తీసుకుంటున్న ధీమాతో నెయ్యీ, వెన్న, మీగడలను తీసుకోవద్దు. గుండెకు హాని చేసే రౌడీబాబాయిలివి. బంధం విషయంలో బాబాయిల్లా – రుచి విషయంలో శాచురేటెడ్ ఆయిల్స్ అయిన నెయ్యి, వెన్న, మీగడలు కమ్మగా ఉంటాయి. మెత్తగా ఉంటూనే గుండెలు కోసే టైపు అవి. నిజానికి ప్యూఫా నూనెలు శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను బ్యారికేడ్లా అడ్డుకుంటాయి. రక్తనాళాలనుంచి కొలెస్ట్రా్టల్ కవ్వును శుభ్రం అయ్యేలా చేస్తుంటాయి. అయితే ప్యూఫా ఎలాగూ కొలెస్ట్రాల్‌ను బయటకు పంపేస్తుంది కదా అని నెయ్యి, వెన్న, మీగడలు తీసుకుంటుంటే... ప్యూఫా నూనెలు కొలెస్ట్రాల్ శుభ్రపరిచే వేగం కంటే శాచురేటెడ్ కొవ్వుల వల్ల శరీరంలో పేరుకుపోయే కొవ్వు ఎక్కువ. పరిమితి ఎంత...? నూనెలు ఎక్కువైనా ప్రమాదం. అందుకే మోతాదు మించనివ్వకూడదు. మీ ఇంట్లో ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి మీరు ఉపయోగించే నూనె ఎక్కువా? తక్కువా అన్న విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. తల ఒక్కంటికి నెలకు 500 ఎంఎల్ నూనె వాడితే మంచిది. అంటే... ఐదుగురు సభ్యులున్న ఇంట్లో నెలకు రెండున్నర లీటర్ల నూనె సరైన వినియోగం అన్నమాట. ఇవీ ప్రమాదాలు...: ఆహార పదార్థాలను బాగా ఫ్రై చేసి ఉపయోగించేందుకు నూనెలు వాడుతుంటారు. నిజానికి బాగా ఫ్రై చేయడం వల్ల ఆహారంలోని పోషకాలు వెళ్లిపోతాయి. దాంతో ప్రయోజనం లేదు. పైగా ఆలివ్ ఆయిల్ వంటి నూనెల్లోని రసాయన బంధాలు వేడి చేయడం వల్ల త్వరగా విడిపోతుంటాయి. అందుకే ఆలివ్ ఆయిల్‌తో డీప్ ఫ్రైస్ చేసుకోవద్దు. మరోవూట... ప్యూఫా, వు్యూఫాలను విడివిడిగానూ వాడుకోవాలి. రెండూ ఉపయోగిస్తే మంచిది కదాని రెండూ కలిపి ఉపయోగించవద్దు. ఎందుకంటే... వేడిచేసే సవుయంలో వాటి వాటి స్మోకింగ్ పాయింట్స్ వేర్వేరుగా ఉంటాయి. అందుకే దేనికదే వాడాలి. ఓసారి ఫ్రై చేయడం కోసం కాచిన నూనెను వురోవూరు ఉపయోగించకూడదు. మెుదటిసారి కాచిన నూనె వురోవూరు ఉపయోగిస్తే అది క్యాన్సర్ కారకం (కార్సినోజెనిక్) అవ#తుంది. కాబట్టి వాటిని పారేయడమే వుంచిది. కత్తికి రెండువైపులా పదునులాగే నూనెల విషయంలోనూ అంతే. కత్తిలాగే నూనె కూడా నిత్యావసరమే. అందుకే విచక్షణతో, జాగ్రత్తతో వాడుకుంటే అదెంతో రుచే కాదు... ఆరోగ్యం కూడా. ఎలాగూ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు కదా అని గుండెను రఫ్ ఆడించే రౌడీలను లోనికి పంపడం సరికాదు కదా. అలాగే ఆరోగ్యం కోసం ప్యూఫా, మ్యూఫా తీసుకుంటున్న ధీమాతో నెయ్యి, వెన్న, మీగడలను తీసుకోవద్దు. గుండెకు హాని చేసే రౌడీబాబాయిలివి. – యాసీన్, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఫ్యాట్ టు ఫిట్
యోగా అధోముఖ సావాసన వేరియంట్–1 ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ధనురాసనానికి, శలభాసనానికి రెసిపిరేటరీగా చేసే ఆసనాల క్రమంలో చేయడం జరుగుతుంది. చేసే విధానం: కుర్చీ సీటు ఆర్మ్స్ మధ్యలో నుంచి కుడి కాలును, ఎడమ కాలుని పోనించి కుర్చీ చివరి భాగానికి సీటును తీసుకువెళ్ళి సౌకర్యవంతంగా ముందుకు వంగాలి. రెండు అరిచేతులను నేల మీద ఉంచి ఆ సపోర్ట్‌తో సీటుని ఇంకా లోపలికు నెట్టి, పొట్ట భాగం కుర్చీ అంచుకి ప్రెస్ చేస్తూ శ్వాస తీసుకోవాలి. చేతులు రెండూ శరీరం పక్కన ఉంచి 3 లేదా 5 శ్వాసల తరువాత శ్వాస వదులుతూ అరిచేతులు నేల మీద ఉంచాలి. వేరియంట్ –2 శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ పక్కలకు 180 డిగ్రీల కోణంలో ఉంచాలి. 3 లేదా 5 శ్వాసల తరువాత శ్వాస వదులుతూ తిరిగి అరిచేతులు నేలమీద ఉంచాలి. విశ్రాంతస్థితిలో 5 శ్వాసలు. వేరియంట్ –3 శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ ముందుకు స్ట్రెచ్ చేసి కాళ్ళకు సమాంతరంగా రెండు చేతులూ ఉంచి 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ తిరిగి అరిచేతులు నేలమీద ఉంచాలి. తిరిగి విశ్రాంతస్థితిలో 5 శ్వాసలు తీసుకోవాలి. పై విధంగా మూడు వేరియేషన్స్ ఒకదాని తరువాత ఒకటి క్రమ పద్ధతిలో 5 లేదా 10 సార్లు రిపీట్ చేయవచ్చు. చేతులు శరీరానికి దగ్గరగా ఉంచినప్పుడు కిందపొట్టలో ఉన్న కొవ్వు కరగడానికి, శరీరానికి 180 డిగ్రీల కోణంలో పక్కలకు స్ట్రెచ్ చేసి ఉంచినప్పుడు మధ్య పొట్టలో ఉన్న కొవ్వు కరగడానికి ముందుకు వంచినప్పుడు పై పొట్ట భాగంలో ఉన్న కొవ్వు కరగడానికి ఉపయోగపడుతుంది. ఫలితం బాగా ఉండడానికి ఈ ఆసనాలను ఉదయం సాయంత్రం కనీసం 15 నిమిషాల పాటు చేయడం చాలా ముఖ్యం. కాళ్లు రెండు కూడా బాగా స్ట్రెచ్ చేసి ఉంచినందువల్ల కాళ్ళలో కొవ్వు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని నేలమీద పడుకుని చేసేదానికన్నా కుర్చీలో బోర్లా పడుకుని చేసినప్పుడు పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా కరిగే అవకాశం ఉంటుంది. స్ట్రెచ్ అయ్యే కండరాలు: లాటిస్సిమస్ డోర్సి, పెక్టరాలిస్ మేజర్, మైనర్, ఎక్సటర్నల్ ఆబ్లిక్, ఇంటర్నల్ ఆబ్లిక్, రెక్టస్, ట్రాన్స్వర్సిస్ అబ్డామినస్ కండరాలకు మంచి టోనింగ్ జరుగుతుంది. ఉపయోగాలు: జీర్ణవ్యవస్థను మెరుగుపరిచేందుకు, లివర్, పాంక్రియాస్ గ్రంధులు ఉత్తేజిపంబడటానికీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగం. జాగ్రత్తలు: హై బిపి, బ్యాక్ పెయిన్, మైగ్రెయిన్, పెప్టిక్ అల్సర్లు ఉన్నవారు జాగ్రత్తగా చేయాలి. పొట్టకు గుండెకు సంబంధించిన శస్త్రచకిత్స జరిగినవారు 6 నెలల వరకూ ఈ ఆసనాలు చేయరాదు. గర్భిణీస్త్రీలు అస్సలు చేయకూడదు. - ఎ.ఎల్.వి కుమార్ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ మోడల్: రీనా సమన్వయం: సత్యబాబు -
వినియోగదారులకు పరిహారం చెల్లించండి
యునైటెడ్ స్పిరిట్స్‌ను ఆదేశించిన వినియోగదారుల ఫోరం వరంగల్ లీగల్: శరీరంలో ఉన్న కొవ్వు తగ్గి లావుగా ఉన్న వారు సన్నబడుతారని ప్రచారం చేసి వినియోగదారులను తప్పుదోవ పట్టించిన మద్యం కంపెనీలు నష్టపరిహారం చెల్లించాలని, వినియోగదారుల సంక్షేమ నిధికి అదనంగా డబ్బులు జమ చేయాలని ఆదేశిస్తూ సోమవారం జిల్లా వినియోగదారుల ఫోరం ఇన్చార్జి ప్రెసిడెంట్ పటేల్ ప్రవీణ్‌కుమార్, మెంబర్ ఎస్బీ భార్గవి ఆదేశాలు జారీ చేశారు. శరీరంలో ఉన్న కొవ్వు తగ్గించి, లావుగా ఉన్న వారు సన్నబడుతారని బెంగళూరు కేంద్రంగా ఉన్న యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ వివిధ మార్గాల ద్వారా విస్తృత ప్రచారం చేసింది. దీనిని విశ్వసించిన జనగామ జిల్లా కేంద్రానికి చెందిన జి.వెంకటరమణ, కె.వి.రమణకుమార్ మేక్డాల్ డైట్మేట్ మద్యం సేవించసాగారు. 2014 మే నెల నుంచి కొనుగోలు చేస్తూ ఇంట్లో వారికి లావు తగ్గడానికి సేవిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో ఇరువురు అనారోగ్యానికి గురైనారు. వైద్య పరీక్షలు చేయగా, గతం కంటే ఎక్కువ కొవ్వు పెరిగింది. దీనితో తమను మద్యం కంపెనీ తప్పుదోవ పట్టించిందని, మాకు జరిగిన నష్టానికి పరిహారంగా రూ.20 లక్షల చొప్పున చెల్లించాలని విడివిడిగా 2014 డిసెంబర్ 30న లీగల్ నోటీసు జారీ చేశారు. కంపెనీ నుంచి ఎలాంటి స్పందన లేదు. చివరకు 2015 జనవరి 17న జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. దీనిపై విచారించిన ఫోరమ్ వినియోగదారులను ప్రచార సాధనాల ద్వారా తప్పుడు మార్గంలో ప్రయాణించడానికి కారకులైనందున ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం, రూ.5వేల చొప్పున ఖర్చులు చెల్లించాలని ఫోరం ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేసుకు రూ. లక్ష చొప్పున రూ. 2 లక్షలను రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధిలో జమ చేయాలని కంపెనీలను ఆదేశించారు. -
కొవ్వెక్కువై బతికిపోయింది!
బీజింగ్: అదేంటి? అలాగంటారేంటి? చచ్చిపొమ్మని ఎవరైనా చెబుతారా? ....అని అడగాలనుకుంటున్నారు కదూ. అయితే ఈ శీర్షికను మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టే. నిజంగానే ఓ అమ్మాయి కొవ్వెక్కువై బతికింది. ఎలాగంటారా.. కారణమేంటో తెలియదు కానీ ఓ మహిళ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నిజానికి ఎవరైనా అలా దూకితే మునిగిపోతారు. కానీ ఇక్కడ దూకిన మహిళ మాత్రం మరణించలేదు. పైగా లైఫ్ జాకెట్ వంటివి కూడా వేసుకోలేదు. మరెందుకు మునిగిపోలేదంటే.. ఇంతకుముందే చదివారు కదా.. కొవ్వెక్కువై! వివరాల్లోకెళ్తే... చైనాలోని గువాంగ్‌డంగ్ ప్రావిన్స్‌లో ఓ మహిళ జోంగషాన్ నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే.. ఆమె శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగిపోకుండా తేలింది. చాలాసేపు ఆమె నీటిపైనే తేలియాడడంతో అటుగా వచ్చిన జాలర్లు ఆమెను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొంత భారీకాయంతో ఉన్న ఆమెను పైకి లేపడానికి పోలీసులు చాలాసేపు ఇబ్బంది పడినా.. పైకి తీసుకురాగలిగారు. వైద్యులు ఆమెను పరిశీలించి.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు పదార్థాలే నీటిలో మునిగిపోకుండా తేలియాడేలా చేశాయని.. ఇందుకు ఆమె ధరించిన దుస్తులు కూడా ఒకింత సాయపడ్డాయని చెప్పారు. -
పొట్ట చెక్కలయ్యేలా...
యోగా అధిక బరువు ఉన్నవారికి మాత్రమే కాదు సరిపడా బరువు ఉన్నవారికి కూడా ఇబ్బందికరమైన సమస్య పొట్ట. శరీరంలో మరే ప్రాంతంలో ఉన్నా పర్లేదు కాని ఉదర భాగంలో పేరుకుపోయిన కొవ్వు మాత్రం మనిషి ఆకారాన్ని వికారంగా మార్చే అవకాశం ఉంది. అలా దర్జాగా పెరిగే పొట్ట... పొట్ట కొట్టే ఆసనాలు యోగాలో ఉన్నాయి. అవే ఈ వారం... ధనురాసనం స్టెప్–1 కుర్చీ పై నుంచి లేచి నిలబడి కుడికాలుని కుర్చీ కుడి హ్యాండిల్ కింద ఉన్న గ్యాప్‌లో నుంచి తీసుకెళ్లి, కుడి పాదం భూమి మీద ఉంచాలి. అలాగే ఎడమ పాదం కూడా భూమి మీద ఉంచి సీటును కుర్చీలో వీలైనంత వెనుకకు ఉంచి ఉదర భాగాన్ని కుర్చీ ముందువైపునకు అంచునకు గట్టిగా నొక్కుతూ చేతులు భూమి మీద సమాంతరంగా ఉంచాలి. వెనుక కాళ్లను స్ట్రెయిట్‌గా లేదా మడచి ఉంచవచ్చు. సరిగా బ్యాలెన్స్ చేయగలిగితే కేవలం పొట్ట భాగాన్ని కుర్చీలో, చేతులు పక్కలకి గాలిలో ఉంచి కాళ్ల వెనుక బాగా స్ట్రెచ్ చేస్తూ 3 లేదా 5 సాధారణ శ్వాసల వరకూ ఉండవచ్చు. శ్వాస వదులుతూ కాళ్లు రిలాక్స్ చేసి చేతులు భూమి మీద ఉంచి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్లీ ఇదే విధంగా రిపీట్ చేయవచ్చు. ధనురాసనం స్టెప్–2 సీటును కుర్చీలో బాగా వెనుకకు నెట్టి (తొడ జాయింట్లు కుర్చీ అంచుకు దగ్గరగా ఉండేటట్టు) శ్వాస తీసుకుంటూ కాళ్లు రెండూ పైకి లేపి రెండు చేతులతో చీల మండలం పట్టుకునే ప్రయత్నం చేయాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ చీల మండలంను వదిలిపెట్టి కాళ్లు రిలాక్స్ చేసి చేతులు రెండూ ఇంతకు ముందు ఫొటోలో చూపిన విధంగా భూమి మీద ఉంచి రిలాక్స్ కావాలి. ఉపయోగాలు: పొట్ట చుట్టూ ఎడిపోస్ టిస్యూలో ఉన్న కొవ్వు కరగడానికి, తొడ ప్రాంతంలో ఉన్న కొవ్వు తగ్గడానికి ఉపకరిస్తుంది. రుతు సమస్యలకు కిడ్నీలు సమర్ధవంతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అర్ధ ఉష్ట్రాసన కుర్చీలో వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత మోకాళ్ల మీద పైకి లేచి శరీరాన్ని వెనుకకు వాలుస్తూ కుడిచేత్తో వెనుక ఉన్న కుర్చీ హ్యాండిల్‌ని పట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని పైకి స్ట్రెచ్ చేస్తూ పొట్ట భాగాన్ని వీలైనంత ముందుకు నెట్టాలి. తల పైకి ఎత్తి 3 లేదా 5 సాధారణ శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ ఎడమ చేతిని పక్క నుంచి కిందకు సీటు భాగాన్ని తిరిగి మడమల మీదకు వజ్రాసన స్థితిలోకి రావాలి. అదే విధంగా మళ్లీ రెండో వైపు కూడా చేయాలి. జాగ్రత్తలు: స్పాండిలైటిస్, షోల్డర్ జాయింట్ లేదా ఫ్రోజెన్ షోల్డర్ వంటి సమస్యలు ఉన్నట్లయితే తలను పైకి ఎత్తకుండా స్ట్రయిట్‌గా ముందుకు చూస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా గిడ్డీనెస్, తలతిరుగుతోంది అనిపించినట్టయితే అది లో బిపి వల్ల గాని లేదా లో షుగర్ లెవల్స్ వల్ల గాని జరగవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కూడా తలను వెనుకకు వాల్చకొని ఉంచాలి. లేదా వెంటనే వెనక్కు వచ్చేయాలి. ఉష్ట్రాసన వజ్రాసనంలో నుంచి మోకాళ్ల మీదకి పైకి లేచి కొంచెం కొంచెం వెనుకకు వాలుతూ కుడిచేత్తో కుర్చీ కుడి హ్యాండిల్‌ని, ఎడమ చేత్తో ఎడమ హ్యాండిల్‌ని పట్టుకోవాలి. పొట్టను ముందుకు నెడుతూ, తలను వెనకకు వాల్చి, 3 లేదా 4 సాధారణ శ్వాసలు తీసుకున్న తర్వాత శ్వాస వదులుతూ వెనకకు రావాలి. జాగ్రత్తలు: ఒకవేళ సయాటికా సమస్య గాని లోయర్ బ్యాక్ ప్రాబ్లెం గాని ఉన్నట్లతతే మోకాళ్లు రెండూ వీలైనంత వరకూ దూరం ఉంచి చేయడం మంచిది. ఎన్లార్జ్డ్ థైరాయిడ్ ఉన్నవాళ్లు మరింత జాగ్రత్తగా చేయాలి. ఉపయోగాలు: పొట్టను బలంగా ముందుకు నెడుతూ ఉండడం వలన జీర్ణవ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేయడానికి దోహదం చేస్తుంది. అన్ని రకాలైన వెన్నెముక సమస్యల నివారణకు చేయదగ్గ ఆసనం. మలబద్ధకాన్ని నివారిస్తుంది. భుజాల ప్రాంతం, ఛాతీ బాగా వ్యాచోచింపబడతాయి కాబట్టి శ్వాసకోస వ్యవస్థకు రక్త ప్రసరణ వ్యవస్థకు కార్డియో వాస్క్యులర్ వ్యవస్థకు, లింఫు గ్రంధులు బాగా పనిచేయడానికి ఉత్తమమైన ఆసనం. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ సమన్వయం: సత్యబాబు -
ఆరోగ్యానికి ఆసరా
యోగా ఆరోగ్యానికి చేయూత నిచ్చేది యోగా. అలాంటి యోగా చేస్తున్నప్పపుడు తొలి దశలో కఠినంగా అనిపించని ఆసనాలు వేస్తాం. అలాంటి ఆసనాలు వేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటే కుర్చీని ఆసరాగా తీసుకోవచ్చు. నటరాజాసన తీరుగా నిలుచుని చేతుల్ని శరీరానికి పక్కగా ఉంచాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కుడికాలిని వంచి, కుడికాలి చీలమండను లేదా కుడికాలి బొటనవేలిని కుడి చేత్తో పట్టుకోవాలి. వీలైనంత వరకూ కుడికాలిని పైకి ఎత్తాలి. తర్వాత ఎడమచేతిని ముందుకు చాచాలి. ఇలా 3 నుంచి 5 సాధారణ శ్వాసల పాటు ఉండి, నిదానంగా పూర్వ స్థితికి రావాలి. అదే విధంగా తర్వాత ఎడమకాలితో కూడా చేయాలి. దీని వల్ల కాళ్లు, చీల మండలు, తుంటి భాగం శక్తిమంతమవుతాయి. తొడల్లో కొవ్వు తగ్గడానికి, ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగు పడడానికి, మూత్ర విసర్జన వ్యవస్థ పనితీరు మెరుగుదలకు, ఉదర కండరాలు పటిష్ఠం కావడానికి సహకరిస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది నిజానికి కఠినమైన ఆసనం. యోగాసనాల సాధనలో పరిణతి సాధించిన వారు వేయతగినది. అయితే కొన్ని చికిత్సా సందర్భాల్లో ఇది చేయవలసి వచ్చినప్పుడు ఇదే ఆసనాన్ని కుర్చీ ఆసరాగా చేయించవచ్చు. ఉత్కటాసన 1: కాళ్లు రెండూ కలిపి ఉంచి సమస్థితిలో నిలుచోవాలి. చేతులు రెండూ ముందుకు చాపి శ్వాస వదులుతూ (మోకాళ్లపై ఎక్కువ భారం పడకుండా) నడుం కింది భాగాన్ని వెనుకకు కొంచెం కొంచెంగా కిందకు తీసుకురావాలి. ఒకట్రెండు సాధారణ శ్వాసలు తీసుకుంటూ పైకి లేచి తిరిగి సమస్థితిలో నిలబడాలి. శరీరం బరువు మోకాళ్లు, తొడల మీద కాకుండా నడుం మీద పడేలా చూసుకోవాలి. ఈ ఆసనంతో తొడల్లో కొవ్వు కరుగుతుంది. ఉత్కటాసన 2: (కుర్చీ సాయంతో) సమస్థితిలో నిలబడి చేతులు ముందుకు చాపి శ్వాస వదులుతూ సీటును కిందకు తీసుకువచ్చి, మళ్లీ శ్వాస తీసుకుంటూ పైకిలేచి నిలుచోవాలి. ఈ విధంగా ఈ ఆసనాన్ని 5 లేక 6 సార్లు చేయవచ్చు. దీనివల్ల మోకాళ్లు, తొడలకు రక్తప్రసరణ బాగా జరిగి బలంగా తయారవుతాయి. పై రెండు ఆసనాలు అనంతరం వేయాల్సిన మరో ఆసనం ఉంది. అదే... ఉత్కటాసన 3: సమస్థితిలో నిలబడి కాలి మడమలు కలిపి పాదా లను వై ఆకారంలో ఉంచి రెండు చేతులను కిందకి ఉంచి ఇంటర్‌లాక్ చేసి మోకాళ్లు బయటకు మడుస్తూ వీలైనంత కిందకు కూర్చోవాలి. ఒకటి లేదా రెండు సాధారణ శ్వాసల తర్వాత శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి నిలబడాలి. ఈ విధంగా కిందకు కూర్చుంటూ పైకి లేస్తూ 5 నుంచి 10 సార్లు చేయవచ్చు. సయాటికా సమస్య ఉన్న వారికి నొప్పిని తగ్గిస్తుంది. వెన్నముకను బలంగా తయారు చేస్తుంది. పాదాలకు రక్తప్రసరణ సజావుగా జరిగేలా సహకరిస్తుంది. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
లివర్ పెరిగింది... పరిష్కారం..?
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 37 ఏళ్లు. నేను నిద్రపోయే సమయంలో ఛాతీ కింద ఎడమవైపున గత వారం నుంచి నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే లివర్ సైజు పెరిగిందని చెప్పారు. లివర్ సైజు ఎందుకు పెరుగుతుంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - సందీప్, నరసన్నపేట మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే మీ కాలేయ పరిమాణం పెరిగిందనే తెలుస్తోంది. దీనికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకునేవారిలో, స్థూలకాయం ఉన్నవారిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి లివర్ సైజ్ పెరిగే అవకాశం ఉంది. మీ లేఖలో మీరు స్థూలకాయులా లేదా మీకు ఆల్కహాల్ అలవాటు ఉందా లేదా తెలియజేయలేదు. కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు, హైపటైటిస్-బి, హెపటైటిస్-సి వంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లివర్ పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు రాసిన కాలేయం పరీక్షలో అన్నీ నార్మల్‌గా ఉన్నాయి కాబట్టి అలాంటివి ఉండే అవకాశం తక్కువ. - ముందుగా మీలో లివర్ పరిమాణం ఎంత పెరిగిందో తెలుసుకోడానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించండి. మీకు వస్తున్న కడుపులో నొప్పి ఎడమవైపు ఛాతీ కింది భాగంలో వస్తోంది కాబట్టి ఒకసారి ఎండోస్కోపీ కూడా చేయించండి. ఈ రెండు పరీక్షల వల్ల మీలో కాలేయం పరిమాణం పెరగడానికి కారణంతో పాటు నొప్పి ఎందుకు వస్తోంది అన్న విషయం కూడా తెలిసే అవకాశం ఉంది. మీకు మద్యం తాగడం, పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానేయండి. నా వయసు 41 ఏళ్లు. నేను చాలా ఏశ్ల నుంచి అసిడిటీతో బాధపడుతున్నాను. మూడు నెలల క్రితం పాంటసిడ్-హెచ్‌పి ఒక వారం పాటు వాడాను ప్రస్తుతం ఒమేజ్ అనే మందు వాడుతున్నాను. అయినా కడుపునొప్పి, మలబద్దకం, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నాను. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - సంపత్, కొత్తగూడెం మీరు ఒకవేళ ఇప్పటివరకూ ఎండోస్కోపీ చేయించుకోకపోతే ఒకసారి గాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి ఎండోస్కోపీ చేయించుకోగలరు. ఇక మలబద్దకం, కడుపులో నొప్పి అనే లక్షణాలను బట్టి మీకు ఇరిటబుల బవెల్ సిండ్రోమ్ అనే వ్యాధి కూడా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఇది యాంగ్జైటీతో పాటు ఒత్తిడితో కూడిన జీవనశైలి ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి, ఐబీఎస్ కాంపొనెంట్ ఉందా అని చూపించుకొని, దాన్ని బట్టి చికిత్స పొందండి. డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ వెన్నునొప్పి తగ్గేదెలా? హోమియో కౌన్సెలింగ్ నాకు విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. దీనికి హోమియో ప్రక్రియలో చికిత్స ఉందా? దయచేసి వివరించగలరు. - నజీర్ అహ్మద్, నల్లగొండ ఇటీవల వెన్నునొప్పి చాలామందిలో కనిపిస్తున్న సాధారణమైన సమస్య. వెన్నుపూసలు అరగడం అన్నది ఒకప్పుడు ఒక వయసు పైబడిన వారిలోనే కనిపించేది. కానీ ఇటీవల మారుతున్న జీవనశైలితో పాటు తాము నిర్వహించే వృత్తుల్లో భాగంగా వెన్నుపై భారం పడేలా పనిచేయడం, ఇతర కారణాల వల్లా ఇది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. వెన్నుభాగంలో లిగమెంట్లు, కండరాలు, ఫేసెట్ జాయింట్లు ఒకదానితో ఒకటి అనుసంధానితమై శరీరానికి స్థిరత్వాన్ని ఇస్తాయి. మన రోజువారీ జీవితంలో శారీరకంగా ఎదురయ్యే ఎన్నో సమస్యలను తట్టుకొని నరాల మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా కాపాడుకోవడం మన వెన్నెముక ప్రధాన లక్షణం. అధికంగా బరువు ఎత్తడం, దించడం, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, క్యాల్షియమ్ లోపం, విటమిన్ బి12, డీ3 లోపాలు, ఎముకల సాంద్రత తగ్గడం వంటివి వెన్నునొప్పికి కొన్ని కారణాలు. మనం ఏ పని చేయాలన్నా ప్రతిక్షణం మెడ, నడుములోని వెన్నుపూసలు పనిచేయాలి. అందుకే ప్రతి పదిమందిలో ఆరు నుంచి ఎనిమిది మంది వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. వెన్నుపూసలు అరిగినందువల్ల వెన్నునొప్పి వస్తుంది కాబట్టి మందులతో దాన్ని పరిష్కరించలేమనీ, ఆపరేషన్ అవసరమని చాలామందిలో ఒక అపోహ ఉంది. పైగా ఇది జీవితాంతం వేధిస్తూ ఉంటుందని నిస్పృహ కూడా కొందరు పేషెంట్లలో ఉంటుంది. వెన్నునొప్పికి కారణమైన డిస్క్ బల్జ్, డిస్క్ కంప్రెషన్, నరాలమీద ఒత్తిడి పెరగడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. అయితే హోమియోలో ఇలాంటి వెన్ను సంబంధమైన నొప్పులు వచ్చినప్పుడు... ఉదాహరణకు డిస్క్ బల్జ్ వల్ల నరాలమీద ఒత్తిడి పెరిగినప్పుడు తగ్గించడానికి కోబాల్ట్ లాంటి ప్రభావపూర్వకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఇక మెడభాగంలో ఉండే వెన్నుపూసలు అరిగినప్పుడు వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెడ భాగంలో సి1 నుంచి సి7 వరకు ఉండే వెన్ను పూసలను సర్వైకల్ పూసలు అంటారు. ఇవి అరిగినప్పుడు వెన్నుపూసల కీళ్ల మధ్య భాగం తగ్గిపోవడం వల్ల డిస్క్‌బల్జ్ ఏర్పడటం, వెన్నుపూసల మధ్య రాపిడి పెరగడం వంటి కారణాల వల్ల మెడ భాగం నుంచి నొప్పి మొదలై చేతి వేళ్ల వరకు నొప్పి పాకుతూ ఉంటుంది. దాంతో పాటు తిమ్మిర్లు, చేయి మొద్దుబారడం, మెడ ఫ్రీగా తిరగలేకపోవడం, మెడ పట్టివేసినట్లుగా ఉండటం వంటివి చూస్తుంటాం. ఇలాంటి వారికి కూడా యాసిడ్‌ఫాస్ అనే మందు బాగా పనిచేస్తుంది. ఇక మెడ, నడుము, వెన్నెముక నొప్పులకు ఆస్కులస్ హిప్, రస్టాక్స్, బ్రయోనియా ఆల్బ్, కాల్కేరియా ఫ్లోర్, హైపరికం, మహిళల్లో వచ్చే ఇలాంటి సమస్యలకే సిమిసిఫ్యూగా వంటివి చాలా బాగా పనిచేస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ -
చేప నూనెల కాప్స్యూల్స్ మంచివే..
చేప నూనెలతో కూడిన కాప్స్యూల్స్ తీసుకోవడం ద్వారా శరీరంలో కొవ్వులు కలిగించే దుష్ర్పభావాలను తగ్గించుకోవచ్చునని బ్రెజిల్‌లోని సాపాలో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిరూపించారు. ఊబకాయాన్ని నివారించేందుకు, మధుమేహాన్ని అడ్డుకునేందుకు ఇవి ఎంతో మేలు చేస్తాయని పేర్కొంటున్నారు. కొవ్వు పదార్థాలపై చేప నూనెలోని ఒమేగా 3 ఫాటీఆమ్లాల ప్రభావంపై శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు జరిపారు. నాలుగు వారాల పాటు వాటికి అధికంగా కొవ్వులున్న ఆహారపదార్థాలను అందించారు. ఆ తర్వాత వీటికి చేపనూనెలను ఇచ్చారు. వీటి కొవ్వులను చేపనూనె తీసుకోని ఎలుకల కొవ్వుతో పోల్చిచూశారు. చేపనూనెలు తీసుకున్న ఎలుకల్లో ఇన్సులిన్ నిరోధకత తక్కువగా ఉందని, జీవక్రియలు మరింత మెరుగ్గా ఉన్నాయని మారియా ఇసబెల్ అలోన్సో అనే పరిశోధకుడు పేర్కొన్నారు. ఊబకాయాన్ని, ఇన్సులిన్ నిరోధకతను ఎదుర్కొనేందుకు చేపనూనెలను తీసుకోవడం ఎంతో మేలని తమ పరిశోధన స్పష్టం చేస్తోందని ఆమె తెలిపారు. -
పొట్ట కండరాలకు గట్టి వ్యాయామం
మనిషి లావయ్యాడనికి మొదట చెప్పేది పొట్టే. వేగంగా కొవ్వు పేరుకుపోయి, శరీరాకృతిని మార్చివేసేదీ పొట్టే. ఆ సమస్య రాకుండా ఉండాలంటే పొట్ట కండరాలకు కాస్త పని పెట్టాలి. ఈ ఆసనాలు ప్రయత్నించాలి. చాలన ఉత్కటాసన ఆసనంలో నిలబడి కాళ్లు రెండింటి మధ్య వీలైనంత (నిడివి) దూరం ఉంచాలి. రెండు చేతులను ముందుకు స్ట్రెచ్ చేసి, చేతి వేళ్లను ఇంటర్‌లాక్ చేసి ఎడమచేతి బొటన వేలును పైకి నిలబెట్టి, శక్తి ముద్ర (ఎనర్జింగ్ ముద్ర లేదా లింగముద్ర అని కూడా అంటారు)లో ఉంచి శ్వాస వదులుతూ ఫొటోలో చూపిన విధంగా ఎడమ మోకాలు పూర్తిగా వంచి ఎడమవైపుకి క్రిందకి కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ పైకి లేచి మళ్ళీ శ్వాస వదులుతూ రెండోవైపుకి కూర్చోవాలి. పైకి లేవడం క్రిందకు కూర్చోవడం కష్టంగా అనిపిస్తే చేతులు కిందపెట్టి సపోర్ట్ తీసుకోవచ్చు. మోకాలి సమస్య ఉన్నవాళ్లకు ఈ ఆసనం సరియైనది కాదు. దీని వల్ల సీటు, కాళ్లలోని కండరాలు గ్లూటియస్ మెడియస్, గ్లూటియస్ మాక్సిమస్, బెసైప్స్ ఫెమొరిస్, కాఫ్ మజిల్స్... మొదలైన కండరాలు బాగా బలపడతాయి. గ్రోయిన్ రిజియన్ తెరుచుకోవడానికి దోహదపడుతుంది. ఏకపాద అధోముఖ శ్వాసాసన శ్వాస తీసుకుంటూ కుడికాలిని పైకి లేపి బాగా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. పైకి లేపిన కాలును మడచి పాదాన్ని ఎడమ పక్కకు కూడా పడవేయవచ్చు. శ్వాస వదులుతూ కుడికాలుని కిందకు, మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడమకాలిని పైకి తీసుకువెళ్ళి సాధన చేయవచ్చు. ఈ ఆసనంలో చేసే వైవిధ్యమైన భంగిమలు అన్ని కూడా పెల్విక్ రీజియన్, నడుము, కాళ్లు బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. తలనొప్పి, పార్శ్వనొప్పి (మైగ్రెయిన్) ఇన్సోమియా, ఫాటిగ్యూ నుండి ఉపశమనం కలిగిస్తుంది. వెనుకకు రావాలంటే రెండు మోకాళ్లు శ్వాస వదులుతూ నేల మీద ఆనించి మార్జాలాసనంలో నడుమును రిలాక్స్ చేయాలి. ఈ ఆసనంలో నడుము భాగం మీద బాగా పనిచేస్తాం కనుక ఆసనం తరువాత నడుముకు, ఊపిరితిత్తులకు తగినంత విశ్రాంతి అవసరం. ఎ.ఎల్.వి.కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
బాటిల్లో భోజనం!
టెక్ టాక్ ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు రెండు వేల కేలరీల ఆహారం అవసరమని.. ఇందులో అన్ని రకాల విటమిన్లు, ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండాలని శాస్త్రం చెబుతోంది. మరి... ఇలాంటి ఆహారం ఎక్కడ దొరుకుతుందీ అంటే మా సూపర్ డ్రింక్ ట్రై చేయండి అంటోంది శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆంపుల్ మీల్స్’ సంస్థ. ఆహారం పేరు చెప్పి డ్రింక్ గురించి చెబుతున్నారేమిటని ఆశ్చర్యపోకండి. ఇక్కడ అవి రెండూ ఒక్కటే. ఎందుకంటే ఆంపుల్మీల్స్ ఒకపూట భోజనంలో ఉండాల్సినన్ని ఆరోగ్యకరమైన అంశాలన్నింటినీ బాటిల్లోకి చేర్చేసింది మరి! మనం చేయాల్సిందల్లా ఈ బాటిల్లోకి కొన్ని నీళ్లు/పాలు చేర్చుకోవడం... బాగా కదిలించి గొంతులోకి దింపేసుకోవడమే! చిలగడదుంపల నుంచి గుమ్మడి విత్తనాల వరకూ పాలకూర నుంచి అరటిపండు వరకూ అన్ని రకాల ఆహార పదార్థాల్లోని పోషకాలను దీంట్లో మేళవించారు. కొవ్వుల కోసం ఏమేం కలిపారో, ప్రొటీన్ల కోసం వాడినవి ఏమిటో... ఈ బాటిల్‌పైన ఉంటాయి. మీ శారీరక అవసరాలను బట్టి 400, 600 కిలో కేలరీల విభాగాల్లో దొరుకుతోంది ఈ సూపర్ డ్రింక్. వంట తంటా లేకుండా ఆరోగ్యకరమైన ఆహారమన్నమాట! -
వెల్కమ్ ట్యాక్స్
`రేపు వరల్డ్ జంక్‌ఫుడ్ డే ఉన్న పన్నులకే కొవ్వు కరుగుతుంటే... వెల్కమ్ చెప్పాల్సిన ఈ కొత్త పన్నేంట్రా నాయనా! ఇన్కమ్ ట్యాక్స్ విన్నాం. వెల్త్ ట్యాక్స్ విన్నాం. సేల్స్ ట్యాక్ విన్నాం. సర్వీస్ ట్యాక్స్ విన్నాం. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ విన్నాం. ఇప్పుడీ వెల్కమ్ ట్యాక్స్ ఏంటండీ! అయినా ఎవరైనా... ఏదీ... మైండ్ సరిగా ఉన్నవాళ్లెవరైనా.. ట్యాక్స్‌ని వెల్కమ్ చేస్తారా? కొత్త పన్ను వేస్తామంటే ఒప్పుకుంటారా? పర్సు వీక్ అవుతుందంటే ఓకే అంటారా? ఏమిటో! కేరళలో ఓకే అంటున్నారట! ‘ఫ్యాట్ ట్యాక్స్’ వేయబోతున్నారట! కొన్ని దేశాల్లో కూడా ఈ ట్యాక్స్ ఉందట! మనమూ దీనికి ఓకే అంటామా లేదా అన్నది... యు ఆర్ వెల్కమ్ టు డిసైడ్. ఈ వర్షాకాలంలో... మీరు కేరళ వెళుతున్నారా? సన్నటి చిరుజల్లుల మధ్య ఏ కోచ్చిలోనో, త్రివేండ్రంలోనో, ఖరీదైన రెస్టారెంట్లలో కూర్చొని, పిజ్జాలు, బర్గర్లు, డోనట్లు.. శాండ్ విచ్లు.. పాస్తాలు... ఫ్రెంచ్ ఫ్రైస్... తింటే వెచ్చగా, హాయిగా ఉంటుందని భావిస్తున్నారా? అయితే, మీ జేబులు ఖాళీ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే, ఒంట్లో కొవ్వు పెంచి, లావుకు కారణమయ్యే ఇలాంటి ఆహార పదార్థాల మీద కేరళలో ఇప్పుడు పన్ను వేయనున్నారు. కేరళలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నేతృత్వంలోని ‘వామపక్ష ప్రజాస్వామ్య కూటమి’ (ఎల్.డి.ఎఫ్) ఇలా కొవ్వుపై పోరాటాన్ని పై స్థాయికి తీసుకువెళ్ళింది. పిజ్జాలు, బర్గర్లు, డోనట్స్ లాంటి వాటిపై ‘‘కొవ్వు పన్ను’’ పేరిట 14.5 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది. వినియోగదారుల జేబుకు ఇది బరువైనా, వాళ్ళు బరువు పెరగకుండా ఉండడానికీ, ఆరోగ్యంగా జీవించడానికీ ఇది ఉపయోగపడుతుందని కేరళ సర్కారు భావిస్తోంది. మన దేశంలో ఈ తరహా ట్యాక్స్ విధించబోవడం ఇదే తొలిసారి. స్థూలకాయాన్ని తగ్గించడానికి ఉపయోగపడే ఈ పన్ను మన దగ్గర కూడా ఉంటే బాగుంటుందేమో అన్న చర్చ మొదలైంది. ప్రపంచంలో తొలిసారిగా... ఇంతకీ, ‘ఫ్యాట్ ట్యాక్స్’ అంటూ కొవ్వు పెంచే పదార్థాలపై ప్రత్యేకంగా పన్ను విధించడం ప్రపంచంలో తొలిసారిగా ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలుసా? 2011లో డెన్మార్క్‌లో! జున్ను, వెన్న, నూనె, పాలు, మాంసం - ఇలా 2.3 శాతానికి మించి శ్యాచురేటెడ్ కొవ్వులున్న ఆహార పదార్థాలన్నిటి మీదా ఆ దేశంలో ‘కొవ్వు పన్ను’ వేశారు. దేశంలో స్థూలకాయ సమస్యను తగ్గించడానికి అది దోహదం చేస్తుందని భావించారు. ఇప్పటికీ, ప్రపంచ దేశాల్లో కొవ్వు పెంచే ఫుడ్ మీద రకరకాల పేర్లతో పన్నులు వేస్తున్నారు. అది తగ్గాలంటే... ఇది తప్పదు! ఇక ఇప్పుడు కేరళ సర్కార్ పన్ను పోటు పొడవడం వెనుక ఓ కారణం ఉంది. ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ ప్రకారం దేశం మొత్తం మీద చిన్నతనంలోనే స్థూలకాయ సమస్య అతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో రెండోది కేరళ. ఆ రాష్ట్రంలో పెద్దవాళ్ళలో కూడా ఈ సమస్య తీవ్రంగానే ఉంది. అందుకే, ఇలా ‘ఫ్యాట్ ట్యాక్స్’ ద్వారా జంక్‌ఫుడ్ ప్రియత్వానికి కళ్ళెం వేయాలని చూస్తోంది. నిజానికి, తెలుగునాట కూడా ఇప్పుడు అంతకంతకూ పెరుగుతున్న సమస్య - స్థూలకాయం. హైదరాబాద్ సంగతే తీసుకుంటే, నగర జనాభాలో నూటికి 19 నుంచి 20 మంది ఇటు ఒబేసిటీ (స్థూలకాయం), అటు దానివల్ల వచ్చే డయాబెటిస్ (మధుమేహం) - రెండూ కలగలిసి ‘డయాబెసిటీ’తో బాధపడుతున్నారు. జంక్ ఫుడ్ అమ్మే బహుళ జాతి సంస్థలు వచ్చే వరకు మన దేశంలో స్థూలకాయ సమస్య ఇంత ఉండేది కాదు. అవి వచ్చాకే, చిన్న వయసులోనే స్థూలకాయమనే సమస్య రెట్టింపు అయినట్లు ఆహార నిపుణుల మాట. క్రమపద్ధతి అంటూ లేని జీవనశైలి, ఆహారవేళలు మర్చిపోయి ప్రతి క్షణం పనిలో మునిగిపోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగుల లాంటి వారు తీరా ఆకలేసినప్పుడు ఒక బర్గర్, సాఫ్ట్ డ్రింక్ ఆర్డర్ చేయడం లాంటివి కూడా ఈ సమస్యను తీవ్రం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒంట్లో కొవ్వును పెంచి, మనిషిని మందకొడిగా మార్చే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచడానికి ‘ఫ్యాట్ ట్యాక్స్’ వేయడం స్వాగతించాల్సిందే అన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ దెబ్బతో మానేస్తారా? ఒకప్పుడు వంద రూపాయలుండే బర్గర్ ఖరీదు కేరళలో ఈ ‘ఫ్యాట్ ట్యాక్స్’ వల్ల రూ. 114.5 అవుతుంది. అంతమాత్రాన అందరూ వీటిని తినడం మానేస్తారా? చెప్పలేం! మెక్సికోలో కూడా సరిగ్గా అదే జరిగింది. పన్ను పోటు దెబ్బకు ఆర్థికంగా, సామాజికంగా దిగువ, మధ్యశ్రేణి కి చెందిన కుటుంబాల వారు కొవ్వు పెంచే ఇలాంటి ఆహారం తగ్గించారు. అయితే, సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చెందిన కుటుంబాలు మాత్రం తమ ఆహారపుటలవాట్లు మానలేదు! ఈ ‘ఫ్యాట్ ట్యాక్స్’ వల్ల ఈ ఫుడ్ ఐటమ్స్ అమ్మకాలేవో ఇప్పటికిప్పుడు తగ్గుతాయన్న అత్యాశ వైద్య నిపుణులకు కూడా లేదు. అయితే, ఫలానా ఆహారపదార్థం వల్ల కొవ్వు పెరిగి, లావయ్యే ప్రమాదం ఉందనే చైతన్యం పెరుగుతుంది. తల్లితండ్రులు కూడా తమ పిల్లల్ని వాటికి దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడిక ఈ జంక్‌ఫుడ్ ఉత్పత్తి సంస్థలు కూడా కొవ్వు తక్కువుండే ఉత్పత్తుల తయారీకి సిద్ధమయ్యే అవకాశం ఉంది. మైదాతో కాకుండా, ఆరోగ్యకరమైన పదార్థంతో, తక్కువ కేలరీలుండే జున్నుతో పిజ్జాలు, పోషకపదార్థాలు కూరిన బర్గర్ల లాంటివి తయారు చేస్తాయని ఒక ఆశ. ఇప్పటికైతే, కొవ్వు పెంచే జంక్‌ఫుడ్ కొన్నప్పుడు వేసే బిల్లు మీద ప్రత్యేకంగా పెద్ద పెద్ద అక్షరాల్లో ‘ఫ్యాట్ ట్యాక్స్ ఇంత...’ అని ముద్రించడం వల్ల కూడా మరింత ఉపయోగం ఉంటుందని కొందరు సూచిస్తున్నారు. అలా పదే పదే ఆ అక్షరాల్ని చూడడం వల్ల తెలియకుండానే అది మనసు మీద ముద్ర పడుతుంది. దీర్ఘకాలంలో ఆ జంక్ ఫుడ్‌కు దూరమవుతారు. ఆదాయ మార్గమా? ఆరోగ్య దానమా? ఇంతకీ ఈ పన్ను పోటు వల్ల ప్రభుత్వ ఖజానాకు వచ్చే లాభమెంత? ఈ ‘ఫ్యాట్ ట్యాక్స్’ వల్ల కేరళ సర్కారుకు ఏటా దాదాపు రూ. 10 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని ఒక అంచనా. అదేమంత పెద్ద మొత్తం కాదు. కానీ, ‘మీరు తింటున్నది అనారోగ్యకరమైన జంక్ ఫుడ్’ అని ప్రజలకు పదే పదే గుర్తు చేయడం వరకు ఈ పన్ను పోటు కచ్చితంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. స్థూలకాయం వల్ల మనుషుల్లో హుషారు తగ్గి, పని గంటలు, ఉత్పాదకత తీవ్రంగా దెబ్బతింటూ, సర్జరీలకే లక్షల లక్షలు ఖర్చవుతున్న సమయంలో ఇది వెల్కమ్ ట్యాక్స్ అంటున్నారు. ‘మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అంటూ ప్రభుత్వం ప్రచారం చేయడానికి కోట్లు ఖర్చుపెట్టాల్సొస్తున్న సమయంలో, ఆదాయం కేవలం 10 కోట్లయినా, ఈ ‘కొవ్వు పన్ను’ వల్ల జనంలో వచ్చే చైతన్యం వేల కోట్లతో సమానమని సర్కారు వాదన. పనిలో పనిగా చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలపై కేరళ ప్రభుత్వం కొరడా జళిపించలేదేమిటన్న ప్రశ్నా వచ్చింది. గొలుసుకట్టు బహుళ జాతి సంస్థల మీద, వాటి ఉత్పత్తుల మీదే తప్ప స్థూలకాయానికి కారణమయ్యే మన దేశవాళీ ఆహార పదార్థాలపై పన్ను వేయలేదేమిటని నోళ్ళు నొక్కుకుంటున్నవాళ్ళూ లేకపోలేదు. ఆ మాటకొస్తే, వీధి కూడళ్ళలో, స్కూళ్ళ దగ్గర, ఆకర్షణీయమైన ఆహారశాలల్లో ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు సులభంగా అందుబాటులో ఉంటే అసలు ఈ గొడవే లేదుగా అంటున్నవాళ్ళూ ఉన్నారు. ఏమైనా ‘ఫ్యాట్ ట్యాక్స్’ వల్ల జంక్ ఫుడ్ తినడం మానుతారా లేదా అన్న మాట అటుంచితే, ఈ ప్రతిపాదనతో అందరిలో ఇంత చర్చ రేగడం కొత్త చైతన్యానికి కారణమైనట్లే! ఆ మేరకు ఈ ‘ఫ్యాట్ ట్యాక్స్’ ప్రయోజనం నెరవేరినట్టే . - రెంటాల ఒంటికి పనికొచ్చేవేనా? పిజ్జాలు, బర్గర్లు లాంటివి ‘జంక్ ఫుడ్’ అనీ, ఒంటికి ఉపయోగం లేకపోగా, కొవ్వుకు కారణమనీ అంటూ ఉంటాం. కానీ, మన దేశవాళీ చిరుతిండ్లలోనూ చాలాభాగం కడుపు నిండడానికే తప్ప, కేలరీల పరంగా ఉపయోగమైనవి కావు.బజ్జీలు, వడా పావ్ దగ్గర నుంచి బట్టర్ చికెన్, దాల్ మఖానీ, పన్నీర్ మఖానీ దాకా ఆహారపదార్థాలు, రస మలాయ్ నుంచి బర్ఫీ దాకా చాలాభాగం స్వీట్లు విగ్రహపుష్టికే తప్ప, నిజంగా ఒంటికి పనికొచ్చేవి కావని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇంటి తయారీ ఆహారమైనప్పటికీ, ఉప్పు, చక్కెర, నూనె ఎక్కువగా ఉండే తిండి వల్ల ఆరోగ్యానికి హాని. ఆరోగ్యకరమైన ఆహారమే తినడం, వ్యాయామం చేయడం కీలకం. బరువు తగ్గించడానికి... భలే భలే! దేశపౌరులు విపరీతంగా బరువు పెరగడం చూసి, గుండె బరువెక్కిన వివిధ దేశాలు వినూత్న మార్గాల్ని అనుసరిస్తున్నాయి. టర్కీలో ప్రభుత్వ భవనాల్లో మొదటి మూడు అంతస్థులకూ ఎవరైనా మెట్లెక్కి వెళ్ళాల్సిందే! లిఫ్ట్ వాడకం నిషిద్ధం. టర్కీ గవర్నర్ గత ఏడాది ఈ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. రంజాన్ మాసంలో ‘ఈద్’ పండుగ నాటి కల్లా రెండు కిలోలు, అంతకు మించి బరువు తగ్గితే, తగ్గిన ప్రతి కిలోకీ ఒక గ్రాము వంతున గతంలో బంగారం ఇచ్చింది దుబాయ్ ప్రభుత్వం. జపాన్‌లో లావెక్కడం చట్టవిరుద్ధమట! దేశప్రజల్లో స్థూలకాయం రేటును తగ్గించడానికి అక్కడ చట్టపరమైన చర్యలు చేపట్టారు. నడుము కొలత ఎంత ఉండాలో కూడా నిర్దేశించారు. 40 నుంచి 74 ఏళ్ళ లోపు మహిళలకైతే 35.4 అంగుళాలు, పురుషులకైతే 33.5 అంగుళాల లోపలే నడుము చుట్టుకొలత ఉండాలి {బిటన్లో స్థూలకాయాన్ని తగ్గించడానికి 2014 అక్టోబర్‌లో ఒక పద్ధతి ఆలోచించినట్లు వార్తలు వచ్చాయి. లావాటివాళ్ళు గనక ఒంట్లో కొవ్వు కరిగించుకుంటే, అందుకు ప్రతిఫలంగా డబ్బు చెల్లిస్తారు. నగదు రూపంలో కానీ, షాపింగ్ ఓచర్ల రూపంలో కానీ ఆ ప్రోత్సాహకాలు ఇవ్వాలని యోచన. విదేశాలు... అపరాధ పన్నులు! ‘ఫ్యాట్ ట్యాక్స్’ అనేది డెన్మార్క్, హంగరీ లాంటి యూరోపియన్ దేశాల్లో గతంలో విధించినదే! చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే శీతల పానీయాలపైన, చాక్లెట్ బార్స్, చిప్‌ల మీద హంగరీలో పన్ను వేశారు. ‘ప్రపంచంలోకెల్లా అత్యంత లావాటి దేశం’ అనే అపకీర్తి కిరీటం ఒకప్పుడు మెక్సికోకు దక్కింది. మెక్సికోలో కూడా తీపి ఎక్కువగా ఉండే పానీయాలు, అల్పాహారంగా తినే తృణధాన్యాలు, మిఠాయిలపై పన్ను వేశారు. అవన్నీ తినడం, తాగడం పాపం (సిన్) అని గుర్తు చేస్తూ, తప్పు చేసినందుకు విధించిన పన్ను అని చెప్పేలా ‘‘సిన్ ట్యాక్స్’’ అని దానికి పేరు పెట్టారు. ఆ దేశంలో చక్కెర పానీయాలపై 10 శాతం పన్ను వేశారు. {ఫాన్స్లోనూ చక్కెర ఎక్కువుండే కార్బొనేటెడ్ పానీయాలపై ‘సిన్ ట్యాక్స్’ విధించారు. ‘భూమండలంపై అత్యంత లావాటి దేశాల్లో ఒకటి’గా సామోవా దేశానికి పేరు. పసిఫిక్ మహాసముద్రంలోని ఈ ద్వీపసమూహ దేశంలో 1984నుంచి ఇప్పటికి 32 ఏళ్ళుగా చక్కెర పానీయాలపై పన్ను ఉంది. ఆస్ట్రేలియాలో ఒకప్పుడు సోడా, పటికబెల్లం మీద, అలాగే అతిగా పాలిష్ చేసిన గోదుమల పిండితో చేసిన బేకరీ ఉత్పత్తుల మీద 10 శాతం పన్ను వేశారు. {బిటన్లో చిన్నతనంలో స్థూలకాయ సమస్యను అరికట్టేందుకు చర్యలు మొదలెట్టారు. ప్రతి 100 మిల్లీలీటర్ల పానీయంలో 5 మిల్లీ గ్రాముల కన్నా ఎక్కువ చక్కెర ఉండే శీతల పానీయాలపై వచ్చే ఏడాది నుంచి పన్ను విధించాలని యోచిస్తున్నారు. -
రక్తనాళాల్లో కొవ్వును కరిగించే ప్రొటీన్
గుండె జబ్బులను నివారించేందుకు మన శరీరంలోనే సహజ సిద్ధమైన వ్యవస్థ ఉందా? అంటే అవునంటున్నారు మిస్సోరీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ‘ఇన్సులిన్ లైక్ గ్రోత్ఫ్యాక్టర్-1’ అని పిలిచే ఓ ప్రోటీన్ రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధిస్తుందని వీరు తొలిసారి గుర్తించారు. టీనేజ్‌లో అత్యధిక మోతాదులో ఉండే ఈ ప్రొటీన్.. వయసు మీదపడిన కొద్దీ తగ్గుతూ వస్తుందని, ఫలితంగా రక్తనాళాల్లోని కొవ్వును తొలగించే సామర్థ్యం తగ్గుతుందని వీరు అంటున్నారు. మానవ శరీరంలో ఉండే మాక్రోఫేగస్ అనే రకం తెల్లరక్తకణాలు రక్తనాళాల్లోని కొవ్వును తొలగించేందుకు నిత్యం ప్రయత్నం చేస్తుంటాయని, అయితే వయసుతోపాటు వీటి సామర్థ్యం తగ్గిపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త యుసుకీ హిగాషీ తెలిపారు. మాక్రోఫేగస్లలో ఐజీఎఫ్-1 ప్రొటీన్‌ను పెంచగలిగితే తద్వారా గుండె జబ్బులను కొంతమేర నివారించే అవకాశముంటుందని పేర్కొన్నారు. ఎలుకల్లో ఈ ప్రొటీన్‌ను తగ్గించినప్పుడు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం ఎక్కువైందని వివరించారు. మరిన్ని పరిశోధనలు చేపట్టి ఫలితాలను నిర్ధారించుకున్న తర్వాత దీన్ని మానవ వినియోగానికి తీసుకురావచ్చని, ఇందుకు దశాబ్ద కాలం పట్టవచ్చని అంచనా. -
కొవ్వును గుర్తించే కొత్త సాధనం!
ప్రస్తుత కాలంలో ఫిట్నెస్ పై ధ్యాస పెరుగుతోంది. మరోవైపు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో శరీరంలో కొవ్వును తగ్గించుకొని, ఆరోగ్యంగా మార్చుకొనేందుకు ఉపయోగపడే అనేక రకాల యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. నాజూకైన శరీరాకృతికి తోడు.. ఆరోగ్యాన్ని సమకూర్చుకునేందుకు అన్నిరకాలుగానూ సహకరిస్తామంటూ అనేక రకాల పరికరాలు హామీలు కూడ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొలెస్టరాల్ తో బాధడుతున్న వారికోసం కొత్తగా స్కల్స్ట్ చిసెల్ గాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. ఇది శరీరంలోని కొవ్వును ఇట్టే పసిగట్టేస్తుంది. ఎంతటి వ్యాయామం చేసినా శరీరంలో కొవ్వు తగ్గడం లేదని బాధపడేవారికి మార్కెట్లో ఓ కొత్త గాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్యాన్ని మెరుగు పరచుకునేందుకు ఇంతకు ముందే మార్కెట్లో ఉన్న ఎన్నో గాడ్జెట్లకు భిన్నంగా కొత్తగా అభివృద్ధి పరచిన ఈ గాడ్జెట్ పనిచేస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది. మన శరీరంలో ఉన్న కొవ్వును ఇట్టే పసిగట్టే ఈ సాధనం వెంటనే మొబైల్ కు మెసేజ్ పంపిస్తుంది. చిన్న చిన్న ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ సహాయంతో శరీరంలోని కొవ్వును అంచనా వేసి, కండరాల సామర్థ్యాన్ని కూడ తెలుపుతుంది. ఈ గాడ్జెట్ ఉపయోగించి, దీని ఫలితాలకు అనుగుణంగా ప్రతిరోజూ నిర్వహించే వ్యాయామంలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సాధారణ మొబైల్ ఫోన్లు, గాడ్జెట్ల వలె కాక ఒక్కసారి రీ ఛార్జ్ చేస్తే చాలు స్కల్స్ట్ చిసెల్ గాడ్జెట్ రెండు వారాల వరకూ పనిచేస్తుంది. అంతేకాక ప్రతిరోజూ వ్యాయామం కోసం జిమ్ లకు, ఫిట్నెస్ ట్రైనర్లకు చెల్లించే ఫీజుతో పోలిస్తే దీని ఖరీదు కూడ చాలా తక్కువగానే ఉంటుంది. సుమారు 89 యూరోల వరకూ ఖరీదు ఉండే ఈ ఎలక్ట్రిక్ పరికరం, ఒరిజినల్ ఐపాడ్ సైజులో ఉంటుంది. -
రాత్రి భోజనానికీ... మర్నాడు బ్రేక్‌ఫాస్ట్‌కీ మధ్య ఎంత టైమ్ ఉండాలి?
పరిశోధన ఉదయం వేళ తినే ఆహారాన్ని ఇంగ్లిష్‌లో బ్రేక్ ఫాస్ట్ అంటారన్నది విషయం తెలిసిందే. అంటే రాత్రి భోజనానికీ, ఉదయం టిఫిన్‌కు మధ్య వ్యవధి ఎక్కువ కాబట్టి... ఆ సమయాన్ని ఫాస్టింగ్ (ఉపవాసం)గా పరిగణించి, అది బ్రేక్ కావడన్నా బ్రేక్‌ఫాస్ట్ అంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మహిళలు రాత్రిపూట కాస్త కొవ్వులతో కూడిన ఆహారం తిన్నప్పుడు ఈ రాత్రి భోజనానికీ, ఉదయపు ఆహారానికీ మధ్య సమయం (ఫాస్టింగ్ పీరియడ్) కనీసం 13 గంటలు ఉంటే అది రక్తంలో చక్కెరను తగ్గించి సమర్థంగా తగ్గిస్తుందనీ, దానివల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టే ముప్పు గణనీయంగా తగ్గుతుందని పరిశోధకులు తేల్చారు. రాత్రి భోజనానికీ, ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మధ్య 13 గంటల వ్యవధి ఉండటం వల్ల మహిళల్లో బరువు కూడా తగ్గుతుందని అధ్యయనవేత్తలు తెలిపారు. వాళ్లంతా 27 నుంచి 70 ఏళ్ల వయసున్న 2,413 మంది మహిళలపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వీళ్లందరూ రొమ్ముక్యాన్సర్‌కు చికిత్స పొంది దాని నుంచి విముక్తమైన వారే. వీళ్లకు దాదాపు ఏడేళ్ల కాలంలో నిర్వహించిన ఫాలో అప్ పరీక్షలలో ఒక కీలకమైన అంశాన్ని గుర్తించారు. డిన్నర్‌కూ, బ్రేక్‌ఫాస్ట్‌కు మధ్య వ్యవధిని 13 గంటల కంటే తగ్గించిన మహిళల్లో కనీసం 36 శాతం మందిలో క్యాన్సర్ తిరగబెట్టే లక్షణాలు కనిపించాయట. అయితే ఇలా వ్యవధి తగ్గించడం వాళ్లలో ప్రాణాంతకమైన ముప్పుగా మాత్రం పరిణమించలేదనీ, ఇది ఒక శుభవార్త అని అన్నారు. ఇక రాత్రి వేళ కంటి నిండా మంచి నిద్రతో ఈ వ్యవధి ఉండటం వల్ల గుండెజబ్బుల ముప్పు, టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని పేర్కొంటున్నారు పరిశోధకులు. ‘‘ఆహారంలో పెరిగే చక్కెల పాళ్లు కణుతుల పెరుగుదలకు మరింత దోహదం చేస్తుంటాయి. ఫాస్టింగ్ వల్ల చక్కెర అంతా దహించుకుపోతుంది కాబట్టి కణుతుల పెరుగుదల ముప్పు కూడా నివారితమౌతుంది’’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు ఒకరు తెలిపారు. అధ్యయన ఫలితాలన్నీ ‘జామా ఆంకాలజీ’ అనే జర్నల్‌లో ప్రచురతమయ్యాయి. -
యోగాతో ఆస్తమాకు కు చెక్
యోగాతో తీరైన శరీరాకృతి లభిస్తుందని, ఒంట్లో కొవ్వు కరిగి గుండెజబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి ఇబ్బందులు దరిచేరవని తెలిసిందే. యోగా వల్ల మరో లాభం కూడా ఉంది. యోగా చేస్తే ఆస్త్మా కూడా తగ్గుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. హాంకాంగ్‌లోని చైనీస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దాదాపు వెయ్యిమందిపై పదిహేను విడతలుగా జరిపిన విస్తృత పరిశోధనలో ఈ విషయాన్ని నిగ్గు తేల్చారు. వారానికి కనీసం రెండుసార్లు యోగా చేసిన వారిలో ఆస్త్మా లక్షణాలు గణనీయంగా తగ్గినట్లు తేలిందని హాంకాంగ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. -
ఫ్యాట్ జీరో
తీరైన తీగలాంటి శరీరాకృతినిస్తాయి ఈ యోగాసనాలు. శరీరంలో పేరుకుపోయిన అనవసరపు కొవ్వును ఇవి ఇట్టే కరిగిస్తాయి. ఛాతీకి, ఉదర భాగానికీ చక్కని టోనింగ్ ఇస్తాయి. భుజాలు. తొడలు, పొట్ట దృఢంగా మారడానికి ఉపయోగపడతాయి. ఏకపాద రాజకపోతాసన అధోముఖ శ్వాసాసనం లేదా పర్వతాసనంలో ఉండి (సూర్య నమస్కారంలో 8వ భంగిమ. రెండు అరచేతులు రెండు అరిపాదాలు భూమి మీద ఉంచి నడుమును పైకి లేపి, భూమికి త్రికోణంలా ఉండాలి) శ్వాస తీసుకుంటూ ఎడమకాలిని మడిచి మోకాలిని ముందుకు, ఎడమ మడమను జననేంద్రియాలకు దగ్గరగా, కుడికాలిని వెనుకకు స్ట్రెయిట్‌గా బాగా స్ట్రెచ్ చేయాలి. రెండు అరచేతులు నడుము భాగాలకు పక్కన నేల మీద ఉంచి సపోర్ట్ తీసుకుంటూ ఛాతిని ముందుకు ప్రొజెక్ట్ చేస్తూ మెడని తలను వీలైనంత వెనుకకు వ ంచి నెమ్మదిగా కుడికాలిని మడిచి కుడిచేత్తో కుడికాలి మడమను పట్టుకుని, శరీరానికి వెనుక వీపునకు వీలైనంత దగ్గరగా కుడిపాదాన్ని లాగుతూ ఎడమ చేతిని పైనుంచి తీసుకుని రెండు చేతులతో కుడి కాలివేళ్లను లేదా పాదం ముందు భాగాన్ని పట్టుకుని వీలైతే తల మూడు భాగాలను కుడి అరిపాదానికి ఆనించే ప్రయత్నం చేయవచ్చు. ఇదే విధంగా శ్వాస వదులుతూ మళ్లీ వెనుకకు పర్వతాసనంలోకి వచ్చి తిరిగి రెండోవైపు కూడా చేయాలి. ఇది చేయడానికి ముందు భుజంగాసనాన్ని బాగా సాధన చేస్తే శరీరం కొంచెం తేలికగా వెనుకకు వంగుతుంది. ఒక వేళ ఫొటోలో చూపిన విధంగా చేయలేకపోతే ఏదైనా ఒక టవల్ లేదా తాడును కుడి కాలి మడమ చుట్టూ పోనిచ్చి తాడు ఆధారంగా చేయవచ్చు. జాగ్రత్తలు మోకాళ్లు బలహీనంగా ఉన్నా, మోకాలు, మడమ, కాలి ఎముకలకు గతంలో ప్రాక్చర్స్ అయి ఉన్నా ఈ ఆసనం చేయకపోవడం మంచిది. మోకాళ్ల కింద సపోర్ట్‌గా ఏదైనా టర్కిష్ టవల్ కానీ పలచని దిండు కానీ ఉపయోగించండి. ఉపయోగాలు గజ్జలు, తొడలు, పొట్టలో అవయవాలు, ఛాతీ, భుజాలు సాగదీయబడతాయి. వెన్నెముకకు, థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంథులకు మంచిది. మూత్రనాళ సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తుంది. ధనురాసన నేల మీద పూర్తిగా బోర్లాపడుకుని శ్వాస వదులుతూ మోకాళ్లను వంచాలి. పాదాలను పైకి లేపి కుడిచేత్తో కుడికాలి మడమను, ఎడమచేత్తో ఎడమకాలి మడమను పట్టుకుని శ్వాస తీసుకుంటూ.. ముందు తలను, ఆ తరువాత ఛాతీ భాగాన్నీ పైకి లేపుతూ తలను వెనుక కాళ్లను సమాంతరంగా పొట్టను నేల మీదకు గట్టిగా నొక్కుతూ పైకి లేపే ప్రయత్నం చేయాలి. ఈ ఆసనంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేగంగా ఉంటాయి. మోకాలు భాగాలు తొడ భాగాలు కూడా పైకి లేపి ఉంచాలి. కేవలం కటిభాగం ఉదరభాగం (కిందిపొట్ట) ఆధారంగా ఈ ఆసనం చేయాలి. ఆసనంలో ముందుకు వెనుకకు రోల్ అవ్వడం చాలా ముఖ్యం. శ్వాస వదిలినప్పుడు తల ఛాతీ నేలకు దగ్గరగా వెనుక కాళ్లు పైకి, శ్వాస తీసుకునేటప్పుడు తల ఛాతీ నేలకు దూరంగా పైకి వెనుక తొడలు మోకాళ్లు భూమికి దగ్గరగా తీసుకురావాలి. అదేవిధంగా పొట్టను నేల మీదకు గట్టిగా నొక్కుతూ ధనురాసనంలో ఉండి పక్కలకు కూడా రోల్ అవ్వడం ముఖ్యం. ఈ ఆసనం ప్రతి ఒక్కరూ తేలికగా చేయగలరు. ఆసనంలో తల ఛాతీ భాగాలు, మోకాళ్లు తొడల భాగాలు ఎంత పైకి ఎత్తగలుగుతారు అనేది మాత్రం వాళ్లు నిత్యం చేసే సాధన మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక స్థూలకాయులు రెండు చేతులతో రెండు మడమలు ఒకేసారి పట్టుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు టవల్ కానీ, తాడు కానీ ఉపయోగించి చేయవచ్చు. ఉపయోగాలు: తొడలు, గజ్జల భాగం బాగా ఓపెన్ అవుతాయి. ఛాతీ ఉదర భాగాలకు చక్కటి టోనింగ్ జరుగుతుంది. జీర్ణశక్తికి చాలా మంచిది. నడుము చుట్టూ, తొడలలో, పొట్ట భాగాలలో ఉన్న కొవ్వు కరగడానికి ఇది చాలా చక్కటి ఆసనం. -
జిమ్‌కు సిద్ధంచేసే హైటెక్ అద్దం
అమ్మో బరువు పెరుగుతున్నానే.. ఎలాగైనా తగ్గాలని ఉదయమే లేచి కసరత్తులు చేస్తుంటారు. కొద్ది రోజులు కాగానే ఆ కోరికను పక్కన పెడుతుంటారు. మళ్లీ ఎవరైనా బరువు గురించి మాట్లాడితే కానీ గుర్తురాదు. ఎవరో ఒకరు బరువు గురించి గుర్తు చేస్తే స్లిమ్ అండ్ ఫిట్‌గా ఉండొచ్చు. ఫొటోలో ఉన్న అద్దం బరువు గురించి మనకు గుర్తు చేస్తుంది. బరువు మాత్రమే కాదు శరీరంలో ఎక్కడెక్కడ కొవ్వు పెరిగింది లేదా తగ్గింది అనే విషయాలను చెబుతుంది. అద్దం ముందున్న చిన్న టేబుల్ వంటి నిర్మాణంపై నిల్చొని ఉంటే చాలు. బల్ల గుండ్రంగా తిరుగుతుంటే అద్దంలోని రియల్ సెన్స్ డీప్ సెన్సార్లు శరీరం మొత్తం స్కాన్ చేసేస్తాయి. చిన్న బల్లతో పాటు అద్దం లోపల ఏర్పాటు చేసిన మరికొన్ని సెన్సార్లు శరీర ఉష్ణోగ్రతను గుర్తించి, కొవ్వు పెరుగుతున్నదెక్కడ, తరుగుతున్నదెక్కడ అనే విషయాలను స్పష్టంగా చెబు తాయి. శరీర సౌష్టవం, భుజం, కండరాల చుట్టుకొలత, తొడలు, నడుం కొలత వంటి వివరాలను అందిస్తుంది. ఇదంతా ఇంటెల్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ల సాయంతో కేవలం 20 సెకన్లలోనే జరిగిపోవడం విశేషం. వివరాలను స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా త్రీడీ మోడల్ రూపంలో మన మొబైల్లో ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. కొన్ని నెలల కాలంలో మన శరీరం ఎలాంటి మార్పులకు గురైందో కూడా యానిమేషన్ రూపంలో చూడవచ్చు. కచ్చితమైన లెక్కలు.. కొవ్వును గుర్తించేందుకు ఉపయోగించే ‘వాటర్ డిస్ప్లేస్మెంట్ టెస్ట్’ స్థాయిలో ఇది కేవలం 1.5 శాతం హెచ్చుతగ్గులతో కచ్చితమైన ఫలితాలిస్తుందని దీని రూపకర్త నేకెడ్ల్యాబ్స్ సీఈవో ఫర్హాద్ ఫరాబక్షియాన్ చెప్పారు. ఏడాది కాలంగా తాము వేర్వేరు వర్గాల ప్రజలతో ఈ యంత్రాన్ని సమూలంగా పరీక్షించామని, గర్భధారణ సమయంలో జరిగే శరీర మార్పులను కూడా కచ్చితంగా గుర్తించగలిగినట్లు తెలిపారు. శరీరంలో కొవ్వు ఎక్కడెక్కడ పేరుకు పోయిందో తెలిస్తే శరీర భాగానికి తగ్గ వ్యాయామాలు చేయడం.. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం సులువు అవుతుందని పేర్కొన్నారు. ఈ యంత్రం ఆరుగురి వివరాలను నిక్షిప్తం చేసుకునేలా రూపొందించామని వివరించారు. వేరే ఎవరైనా దీన్ని వాడుకోవాల్సి వస్తే స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న ఈ యంత్రం ఖరీదు దాదాపు రూ.35 వేలని చెప్పారు.