పరుగుకు ముందు ప్రత్యేక జాగ్రత్తలివి... | Before running the Food Reserve | Sakshi
Sakshi News home page

పరుగుకు ముందు ప్రత్యేక జాగ్రత్తలివి...

Published Thu, May 7 2015 11:47 PM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM

పరుగుకు ముందు  ప్రత్యేక జాగ్రత్తలివి...

పరుగుకు ముందు ప్రత్యేక జాగ్రత్తలివి...

రిజర్వ్ ఫుడ్ బిఫోర్ రన్నింగ్

జాగింగ్ చేసేవారు  ముందుగా కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే జాగింగ్ చేయడంలో క్యాలరీలు ఖర్చవుతాయి. అవి శరీరంలో అసలే లేకుండా ఉంటే అది మనలోని కొవ్వులను కాల్చే బదులుగా ప్రోటీన్లకు నష్టం జరుగుతుంది. అందుకే జాగింగ్‌కు అరగంట ముందు చాలా తేలికపాటి ఆహారంగా కొద్దిగా పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్లు) తీసుకోవడం మేలు. ఇందులోసం ఒక చిలగడదుంప, ఆలూ, కార్న్‌ఫ్యాక్స్ తీసుకొని కొవ్వు తక్కువగా ఉండే ఒక గ్లాసు పాలు తాగడం మంచిది.

ఒక కప్పు పండ్ల ముక్కలూ తీసుకోవచ్చుగానీ... అందులో అరటి, పుచ్చకాయ, సపోటా, డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిది కాదు. ఇక జాగింగ్ సమయంలో ముందుగానే నీళ్లు నింపిపెట్టు కున్న బాటిల్ గానీ లేదా ఓఆర్‌ఎస్ సొల్యూషన్ గానీ వెంట ఉంచుకోవాలి. అయితే జాగింగ్ చేసిన వెంటనే నీళ్లు/ఓఆర్‌ఎస్ ద్రావణం తాగకూడదు. కాస్తంత వ్యవధి తర్వాత తెరిపిన పడ్డాకే తాగాలంటున్నారు నిపుణులు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement