dry fruits
-
హెల్త్ ఫ్యాక్ట్: నాన్‌వెజ్ తిన్నాక బాదం తినండి... ఎందుకంటే..?
మాంసాహారం తిన్న తర్వాత కొన్ని బాదం పలుకులు తినడం వల్ల ఓ ప్రయోజనం ఉంది. కొవ్వుల కారణంగా జరిగే అనర్థాల్ని తగ్గించడం ద్వారా అవి కరోనరీ గుండెజబ్బులనూ నివారిస్తాయి.బాదంలోని ఒమెగా–3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. ఆ మాటకొస్తే మామూలు సమయాల్లో బాదం తినడం వల్ల కూడా చాలా మేలు కలుగుతుంది. వీటిలోని క్యాల్షియమ్ ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు... ఆహారనాళాన్నీ ఆరోగ్యంగా ఉంచడం లో బాదం తోడ్పడుతుంది. గుండెకూ మేలు చేస్తుంది.ఇవి చదవండి: ‘ఆరుద్ర’ను చూస్తే అనువైన వరుడు.. -
డ్రైఫ్రూట్స్ ఎపుడు, ఎలా తిన్నా మంచిదే.. కానీ!
మంచి ఆరోగ్యం కోసం ఆహారం అనగానే గుర్తొచ్చే ప్రధాన వాటిల్లో డ్రైఫ్రూట్స్ ఒకటి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభించే డ్రైఫ్రూట్స్ వల్ల మంచి శక్తి లభిస్తుంది. రోజూ కాసిన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే డ్రైఫ్రూట్స్ తినడానికి సరైన సమయం ఏది? ఉదయమే తినాలా? భోజనానికి ముందు తీసుకోవాలా? తర్వాత తీసుకోవాలా? రాత్రి తినడం మంచిదా? ఇలాంటి సందేహాలుంటాయి చాలామందికి. డ్రైఫ్రూట్స్‌ని ఎపుడు,ఎలా తిన్నా మంచిదే. కొంతమంది నానబెట్టుకుని కూడా తింటారు. మన ఆహారంలో డ్రైఫ్రూట్స్‌ని చేర్చుకుంటే రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, హృదయ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. డ్రై ఫ్రూట్స్ లో విటమిన్స్, మినరల్స్, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్,ఫైబర్ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. వాస్తవానికి ఎపుడు తీసుకున్నా మంచిదే. అయితే ఉదయం అల్పాహారంగానీ, మధ్యాహ్నం భోజనం తరువాత గానీ, సాయంత్నం చిరుతిండిగా కానీ తీసు కోవచ్చు. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అని అవసరాన్ని బట్టి మితంగా తీసుకోవాలి అనేది గమనించాలి.ఉదయాన్నే పరగడుపున డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వలన ఆ రోజంతా కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి అవసరమైన శక్తి అనేది లభిస్తుంది.బాదం పప్పులను రాత్రి నానబెట్టుకుని ఉదయం లేవగానే తీసుకుంటే మంచిది. పోషకాలతో పాటు, మంచి గ్లోకూడా వస్తుంది. వర్కవుట్కు ముందు డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవల్స్‌ను పెంచి, ఫిట్నెస్ లక్ష్య సాధనలో తోడ్పడుతుంది. డ్రైఫ్రూట్స్‌లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. కనుక వ్యాయామం తరువాత కూడా తీసుకోవచ్చు. జీడిపప్పు వాల్‌నట్స్‌ను మితంగా తీసుకుంటే గుండె సమస్యలను నియంత్రించవచ్చు. మధ్యాహ్న ఆకలిని అరికట్టడానిక , శరీరానికి బూస్ట్ అందించడానికి డ్రై ఫ్రూట్స్ సరైన పరిష్కారం. డైటరీ ఫైబర్ ఉంటే ఎండు ద్రాక్ష అంజిర్, ఖర్జూరం తీసుకొంటే మంచిది. రక్తహీనత రాకుండా కాపాడుతాయి. ఎండు ద్రాక్షలో పొటాషియం కంటెంట్ అధికంగా ఉంటుంది.ఈవినింగ్ సాక్స్లాగా వేయించిన జీడిపప్పు తీసుకోవచ్చు. వీటిల్లో కొలెస్ట్రాల్ అనేది అసలు ఉండదు. దీంతో గుండె పనితీరును పెంచేందుకు ఎంతో సహాయం చేస్తాయి. నిద్రవేళ స్నాక్స్‌కు అద్భుతమైన ఎంపిక డ్రైఫ్రూట్స్. ఎండిన ఆప్రికాట్లు లేదా చెర్రీస్తో పాటు బాదం లేదా వాల్నట్ లాంటి డ్రై ఫ్రూట్స్‌లో ఉండే పోషకాలు విశ్రాంతినిస్తాయి. వీటిల్లోని మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేస్తుంది. ప్రశాంతంగా నిద్ర పట్టేలా చేస్తుంది. -
నీరు వర్సెస్ పాలు: డ్రై ఫ్రూట్స్‌ని ఎందులో నానబెట్టి తీసుకుంటే మంచిది?
డ్రై ఫ్రూట్స్ మన ఆహారంలో అంతర్భాగం. ప్రతిరోజు ఒక పిడికెడు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఈ గుప్పెడు గింజలు ఎన్నో పోషకాలను విటమిన్లను, ఖనిజాలను అందిస్తాయి. సాధారణంగా డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టి తీసుకుంటాం. వీటిని కొన్ని గంటల ముందు నానబెట్టడం వల్ల సులభంగా జీర్ణమవ్వడమే గాక శరీరం కూడా ఈజీగా పోషకాలను గ్రహించగలుగుతుంది. అయితే ఈ డ్రైఫ్రూట్స్‌ని నీరు వర్సెస్ పాలు మధ్య వేటిలో నానబెడితే ఆరోగ్యకరం అనే విషయానికి వస్తే రుచి, ఆహార ప్రాధాన్యతలను ఆధారంగా చేసుకుని చెప్పాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు.డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టడం వల్ల వాటి ఆకృతిని పెరుగడమే గాక మృదువుగా ఉండి తినేందుకు వీలుగా ఉంటుంది. ముఖ్యంగా దంత సమస్యలు లేదా జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇటా నానబెట్టడం వల్ల దానిలోని సహజ చక్కెరలు, రుచులను విడుదలై తినేందుకు రుచిగా ఉంటాయి కూడా. అలాగే నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయని చెబుతున్నారు నిపుణులు. ఇది సలాడ్ల నుంచి డెజర్ట్‌ల వరకు వివిధ వంటకాలలో ఉపయోగించేందుకు వీలుగా ఉంటుంది. నీటిలో నానబెడితే..నీటిలో నానబెట్టడం వల్ల ఆకృతితోపాటు రచి కూడా పెరుగుతుంది. అదనపు కొవ్వు నివారించాలనుకునే వారికి ఇలా నీటిలో నానబెట్టినవి తీసుకోవడం మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అదీగాక నీటిలో నానబెట్టడం వల్ల అదనపు కేలరీలు లేదా కొవ్వును జోడించదు. పైగా మనకు వాటి సహజ రుచిని పరిచయం చేస్తుంది. కేలరీ కాన్షియస్ డైట్ అనుసరించాలనుకునే వారికి, బరువుని అదుపులో ఉంచాలనుకునేవారికి ఈ పద్ధతిలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఉత్తమం. పాలల్లో నానబెడితే..పాలల్లో డ్రై ఫ్రూట్స్ నానబెట్టడం వల్ల వాటికి మంచి విభిన్న ప్రయోజనాలను పొందొచ్చు. పాలు వాటికి మంచి ఆకృతి, రుచిని అందిస్తాయి. ఇక్కడ పాలు, డ్రైఫ్రూట్స్ కలయిక రుచిని మెరుగుపరచడమే గాక ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, వంటి అదనపు పోషకాలను అందిస్తుంది. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలనుకునే వారికి పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్‌లో ప్రోటీన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలు, కండరాలు పనితీరుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. వీటిని పిల్లలు, అథ్లెట్లు, నిర్దిష్ట ఆహార అవసరాలు ఉన్న వ్యక్తులు తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఏది బెస్ట్ అంటే..జీర్ణక్రియ ప్రభావాన్ని పరిగణలోనికి తీసుకుంటే..నీటిలో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. అలాగే లాక్టోస్ అసహనం లేదా పాలంటే పడనివారికి ఇలా తీసుకోవడమే మంచిది. పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ కంటే నీటిలో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ జీర్ణమవ్వడం సులభం. అసౌకర్యాన్ని కలిగించే అవకాశం తక్కువ కూడా. చెప్పాలంటే పాలల్లో నానబెట్టిన వాటిల్లో లాక్టోస్, కొవ్వుల ఉనికి కారణంగా పొట్టలో భారంగా ఉంటుంది. అలాగే ఎలాంటి జీర్ణ సమస్యలు లేనివాళ్లు సమతుల్య ఆహారంలో భాగంగా పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్‌ని మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండుద. అంతేగాదు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మధుమేహాన్ని నిర్వహించడం తదిర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆయా ఆరోగ్య లక్ష్యాలకు అనుగుణంగా డ్రైఫ్రూట్స్‌ని నీళ్లు లేదా పాల్లలో నానబెట్టి తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. (చదవండి: నటి జాస్మిన్ బాస్మిన్ ఘటన: కాంటాక్ట్ లెన్స్ వల్ల కళ్లకు ప్రమాదమా?) -
డ్రై ఫ్రూట్స్, ఇతర గింజల్ని నానబెట్టి తింటున్నారా? అయితే ..!
ఆయుర్వేదం ప్రకారం, డ్రై ఫ్రూట్స్, ఇతర కొన్ని రకాల గింజలను తినే ముందు రాత్రిపూట నీటిలో నానబెట్టడం మంచిది తద్వారా వాటిల్లోని జీవపదార్థం ద్విగుణీ కృతమవుతుందని తినడానికి సులభంగా ఉంటుందని చెబుతారు. నానబెట్టడం వల్ల నట్స్ , డ్రై ఫ్రూట్స్‌లో ఉండే పోషకాల లభ్యతను పెరుగుతుంది. రాత్రంతా నానబెట్టిన గింజలు, డ్రైఫ్రూట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు మరెన్నో లాభాలుంటాయి.నానబెట్టడం వలన కలిగే ప్రయోజనాలు నానబెట్టిన గింజల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలతో కూడిన అద్భుతమైన మూలాలు లభిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించి, వ్యాధులను నివారించడానికి, శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.నానబెట్టినపుడు గింజల రుచి, ఆకృతి రెండూ పెరుగుతాయి. అజీర్ణానికి కారణమయ్యే ఫైటిక్ యాసిడ్ తొలగి పోతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే టానిన్ లేదా (ఆమా) గణనీయంగా తగ్గిస్తుంది. గట్ దీంతో గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.మానవ శరీరాన్ని నియంత్రించే మూడు వాత, పిత్త , కఫ దోషాలు రాకుండా ఉంటాయి. వీటి వల్ల బాడీలో అసమతుల్యత, ఇతర అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.మచ్చుకు కొన్నిమెంతులు: రెండు చెంచాల మెంతుల్ని త్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఉనాలి. ఆ నీటిని తాగాలి. రోజూ ఇలా చేయడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి. వీటిలో పీచు అధికంగా ఉంటుంది. ఇది పేగులను శుభ్రపరిచి మలబద్ధకం లేకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులూ తగ్గుతాయి.అవిసె గింజలు: వీటిలో పీచు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-బి, ఇనుము, మాంసకృత్తులు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ చెంచా నాన బె ట్టిన గింజలను తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.అంజీరా: ఇది పోషకాల గని. దీంట్లో ఏ, బీ విటమిన్లు, క్యాల్షియం, ఇనుము, మాంగనీస్, సోడియం, పొటాషియం, పీచు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.ఇది మహిళల ఆరోగ్యానికి చాలామంచిది. గుమ్మడి విత్తనాలు: వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ వీటిని తినడం వల్ల స్త్రీలకు రొమ్ము క్యాన్సర్, పురుషులకు ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మలబద్దకం సమస్యకు కూడా మంచి పరిష్కారం. చెడు కొలెస్ట్రాల్ కరుగుతంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. అలాగే మెగ్నీషియం రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. పురుషులలో వీర్య కణాల నాణ్యత కూడా పెరుగుతుంది. నిద్రలేమితో బాధపడే వా ప్రశాంతమైన నిద్ర కావాలంటే వీటిని తీసుకుంటే ఫలితం ఉంటుంది.నోట్: రోజువారీ ఆహారంలో డ్రై ఫ్రూట్స్ , గింజలను చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచిది. కానీ ఏదైనా అనారోగ్య సమస్యలను ఎందుర్కొంటున్నా, ఏదైనా ఇతర సమస్యలున్నా, వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. -
బాదంతో.. ఒక మసాలా కర్రీ... ఓ సీఖా... మరో టిక్కా!
బాదం ఆరోగ్యానికి మంచిది. నిజమే... రోజూ పది బాదం పప్పులు తినాలి. అదీ నిజమే... కానీ మర్చిపోతుంటాం. బాదం ఖీర్... బాదం మిల్క్ తాగడమూ మంచిదే. రోజూ తియ్యగా తాగలేం. మరేం చేద్దాం? బాదం రుచిని కొంచెం కారంగా ఎంజాయ్ చేస్తే! చాలా బాగుంటుంది. ఒక మసాలా కర్రీ... ఓ సీఖా...మరో టిక్కా! మన వంటింట్లో ఈ వారం ఇలా ట్రై చేద్దాం. ‘బాదం ధర తెలుసా’ అని అడక్కండి. మటన్ ధర కంటే తక్కువే. పైగా మనం వీటికోసం వాడేది కిలోల్లో కాదు... గ్రాముల్లోనే.చనా మసాలా ఆల్మండ్..కావలసినవి..బాదం పప్పులు– 50 గ్రాములు (నానబెట్టి పొట్టు తీయాలి);ఉల్లిపాయ –1 (తరగాలి);అల్లం – అంగుళం ముక్క (సన్నగా తరగాలి);పచ్చిమిర్చి తరుగు – టీ స్పూన్;ఆలివ్ ఆయిల్ – టేబుల్ స్పూన్;దాల్చిన చెక్క – అర అంగుళం ముక్క;చనా మసాలా – టేబుల్ స్పూన్ ;ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి.తయారీ..బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి వేయాలి.అవి వేగేటప్పుడు దాల్చిన చెక్క, చనా మసాలా, ఉప్పు వేసి కలుపుతూ వేయించాలి.చివరగా బాదంపప్పులు వేసి కలిపి వేడెక్కి వేగుతుండగా స్టవ్ ఆపేయాలి.ఇది రోటీలోకి రుచిగా ఉంటుంది. గ్రేవీ కావాలంటే చివరగా అర కప్పు నీటిని పోసి, చిటికెడు ఉప్పు కలపాలి.కూర ఉడకడం మొదలైన తర్వాత చిక్కదనం చూసుకుని దించేయాలి.నద్రు ఔర్ బాదం కీ సీఖా, పనీర్ బాదమ్ టిక్కీనద్రు ఔర్ బాదం కీ సీఖా..కావలసినవి..బాదం పప్పులు– 80 గ్రాములు (పలుచగా తరగాలి);తామర తూడు – 300 గ్రాములు;పచ్చిమిర్చి – 4;అల్లం – 5 గ్రాములు;వెల్లుల్లి – 10 గ్రాములు;శనగపిండి – 30 గ్రాములు;ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి;బంగాళదుంప– 1 (మీడియం సైజు);చీజ్ – 50 గ్రాములు (తురమాలి);యాలకుల పొడి – పావు టీ స్పూన్;జాపత్రి – పావు టీ స్పూన్ ;ఉల్లిపాయలు – 2 (తరగాలి) ;కోవా – టేబుల్ స్పూన్ ;కుంకుమ పువ్వు – ఆరు రేకలు;నూనె – 2 టేబుల్ స్పూన్లుతయారీ..తామర తూడును శుభ్రంగా కడిగి తరిగి మరుగుతున్న నీటిలో వేసి నాలుగైదు నిమిషాల తర్వాత తీసి నీరు కారిపోయేటట్లు చిల్లుల పాత్రలో వేసి పక్కన పెట్టాలిబంగాళదుంపను ఉడికించి పొట్టు వలిచి, చిదిమి పక్కన పెట్టాలికుంకుమ పువ్వును పావు కప్పు గోరువెచ్చటి నీటిలో నానబెట్టాలిఅల్లం, వెల్లుల్లిని సన్నగా తరిగి పక్కన పెట్టాలిశనగపిండి నూనె లేని బాణలిలో పచ్చి వాసన పోయే వరకు వేయించి పక్కన పెట్టాలిఇప్పుడు బాణలిలో టేబుల్ స్పూన్ నూనె వేసి తామర తూడులను గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాలిఒక పాత్రలో చీజ్ తురుము, ఉడికించిన బంగాళదుంప, ఉప్పు, యాలకుల పొడి, జాపత్రి పొడి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, శనగపిండి, కుంకుమ పువ్వు కలిపిన నీటిని వేయాలి. బంగాళదుంప, కోవా, ఉల్లిపాయ ముక్కలు వేయాలితామర తూడు ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పై దినుసులున్న పాత్రలో వేసి అన్నీ సమంగా కలిసేటట్లు ముద్దగా కలపాలిఈ మిశ్రమాన్ని పెద్ద గోళీలుగా చేసుకుని అరచేతిలో వేసి పొడవుగా చేయాలి. మనకు కావల్సిన సైజులో కబాబ్‌లుగా కట్ చేసుకోవాలిబాదం పలుకులను ఒక ప్లేట్లో వేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక్కో కబాబ్‌ని బాదం పలుకులలో అద్ది పక్కన పెట్టాలి.ఇలా అంతటినీ చేసుకోవాలి.. పైన తామర తూడు వేయించిన బాణలిలోనే మరో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ఒక్కో కబాబ్‌ని పెట్టి మీడియం కంటే తక్కువ మంట మీద ఉంచాలి.కొంతసేపటికి కబాబ్ ఒకవైపు కాలి గోధుమరంగులోకి మారుతుంది.అప్పుడు జాగ్రత్తగా తిప్పుతూ అన్నివైపులా దోరగా కాలేవరకు ఉంచాలి. ఇలాగే అన్నింటినీ కాల్చుకోవాలి. వీటికి పుదీన చట్నీ మంచి కాంబినేషన్.పనీర్ బాదమ్ టిక్కీ..కావలసినవి..పనీర్– 2 కప్పులు;బాదం పలుకులు – అర కప్పు;ఉడికించిన బంగాళదుంప – అర కప్పు;నూనె– 2 టేబుల్ స్పూన్లు;జీలకర్ర– టీ స్పూన్;పచ్చిమిర్చి తరుగు – 2 టీ స్పూన్లు;అల్లం తరుగు – 2 టీ స్పూన్లు;పసుపు – అర టీ స్పూన్;మిరపొ్పడి– అర టీ స్పూన్;కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు;కార్న్‌ఫ్లోర్ – టేబుల్ స్పూన్;ఉప్పు – టీ స్పూన్‌తయారీ..పనీర్‌ను ఒక పాత్రలో వేసి పొడిపొడిగా చిదమాలి. ఇందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి సమంగా కలిసేటట్లు చిదమాలిబాణలిలో టీ స్పూన్ నూనె వేసి అందులో జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసి వేగిన తర్వాత పైన పనీర్, బంగాళదుంప మిశ్రమంలో వేయాలి.అదే బాణలిలో మిగిలిన నూనెలో మిరపొ్పడి, ఉప్పు వేసి వేడెక్కిన తర్వాత స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గిన తర్వాత అందులో మొక్కజొన్న పిండి, కొత్తిమీర తరుగు వేయాలి.ఇందులో పనీర్ మిశ్రమాన్ని వేసి కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని పెద్ద గోళీలుగా చేసుకుని అరచేతిలో వేసి ఫొటోలో కనిపిస్తున్నట్లు ప్యాటీలుగా వత్తాలి.వత్తిన ప్యాటీలను బాదం పలుకులున్న ప్లేట్లో అద్దాలిఅడుగు వెడల్పుగా ఉన్న బాణలిలో మిగిలిన నూనె వేడి చేసి ఒక్కో ప్యాటీని ఒకదాని పక్కన ఒకటిగా అమర్చాలి.ఒకవైపు కాలిన తర్వాత జాగ్రత్తగా తిరగేసి రెండవ వైపు కూడా కాలనివ్వాలి.లోపల చక్కగా ఉడికి పైన కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.వీటిని వేడిగా ఉండగానే కెచప్ లేదా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.ఇవి చదవండి: International Day of Yoga 2024: యోగా... మరింత సౌకర్యంగా! -
డ్రై ఫ్రూట్స్ ఎన్ని... ఎలా... తింటున్నారు?
డ్రై ఫ్రూట్స్! ఇవి ఆరోగ్యానికి మంచిదని చాలా మంది సూచిస్తారు.ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఇవన్నీ ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి కావాల్సినవి. వీటన్నింటిని ΄పోందడానికి డ్రై ఫ్రూట్స్ ఒక ఆప్షన్. అయితే ఇవి ఆరోగ్యానికి మంచిది కదా అని.. ఇష్టమొచ్చినట్టు తినకూడదు. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. అయితే ఎంత పరిమాణంలో తినాలి. ఏ డ్రై ఫ్రూట్స్ ఎన్ని తింటే ఆరోగ్యకరం? డ్రైఫ్రూట్స్‌ను తినడానికి ముందు ఎందుకు నానబెట్టాలి? లాభాలేంటి..?డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే.. షుగర్స్, క్యాలరీ లు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని 20 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. అలాగే నేరుగా తినడం కూడా మంచిది కాదు. కాబట్టి.. డ్రై ఫ్రూట్స్ తినే విధానం, ఏ నట్స్ ఎంత పరిమాణంలో తినాలో తెలుసుకుందాం.బాదం... బాదం పప్పులో మోనో శ్యాచురేటెడ్ యాసిడ్స్ ఎక్కువ గా ఉంటాయి. ఇవి గుండెకి, మెదడుకి, చర్మ ఆరోగ్యానికి మంచిది. అలాగే ఆల్మండ్స్ లో విటమిన్ ఈ, మెగ్నీషియం, ΄పోటాషియం ఉంటాయి. ఇవి రక్తప్రరణ సక్రమంగా ఉండటానికి సహాయపడతాయి. అలాగే రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహకరిస్తాయి. రోజుకి 4 నుంచి 7 బాదం పప్పులు తినడం వల్ల అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ΄పోందవచ్చు.వాల్ నట్స్... వాల్ నట్స్ పైన ఉండే పెంకు తీయగానే.. ఉండే పప్పు అంత రుచిగా ఉండదు. కానీ.. 90 శాతం యాంటీ ఆక్సిడెంట్స్, ఫెనోలిక్ యాసిడ్స్, టాన్నిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఈ స్కిన్ లోనే ఉంటాయట. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి చాలా సమర్థంగా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని రోజుకి 3 నుంచి 4 తీసుకోవచ్చు.కర్జూరం... ఇందులో ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫ్రాక్టోజ్ ఇందులో రిచ్ గా ఉంటుంది. మెటబాలిజం స్థాయి చురుగ్గా ఉండటానికి కర్జూరం ఉపయోగపడుతుంది. వీటిని రోజుకి మీడియం సైజులో ఉండే 1 లేదా రెండు తీసుకుంటే సరి΄ోతతుంది.పిస్తా... పిస్తా వెల్ నెస్ కి చిహ్నం. ఇవి బలానికి, ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇందులో మిగిలిన డ్రైఫ్రూట్స్ లో కంటే ్రపోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు.జీడిపప్పు... కమ్మటి రుచిలో ఉండే జీడిపప్పును రెగ్యులర్ గా తినడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రోజుకు నాలుగు జీడిపప్పులను తినడం ఆరోగ్యకరమని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.ఎండుద్రాక్ష... ఎండుద్రాక్షను ఎక్కువ మోతాదులో తిన్నా ఎలాంటి సమస్యా లేదు. ఇందులో విటమిన్ బి, ΄పోటాషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజుకి గుప్పెడు ఎండుద్రాక్ష తినవచ్చు. అయితే మహిళలు రోజుకి ఒకటిన్నర కప్పు, మగవాళ్లు 2 కప్పుల ఎండుద్రాక్ష తినాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఖర్జూరతో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా!
నిగనిగ మెరిసిపోతూ.. ఖర్జూరాలు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. రుచికి కూడా బాగుంటాయి. అందుకే అందరూ వీటిని అందరూ ఇష్టపడతారు. ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో వీటిని ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. రోజూ కొద్ది మొత్తంలో ఖర్జూరం పండ్లు తింటే.. ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం..ఖర్జూరాల వల్ల కలిగే ప్రయోజనాలను పొందాలంటే... కనీసం ఒక వారం లేదా పదిరోజులపాటు క్రమం తప్పకుండా నాలుగయిదు తినాలి. డయాబెటిస్ ఉన్న వారు మాత్రం వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి.గుండెకు బలం..ఖర్జూరాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ధమని కణాల నుంచి కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఖర్జూరం తినటం వల్ల చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెపోటు, హైపర్‌టెన్షన్ , స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఖర్జూలంలో ΄÷టాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది హార్ట్ బీట్, బీపీని నార్మల్‌గా ఉంచుతుంది.కండరాలు బలంగా ఉంటాయి..ఖర్జూరంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. ఖర్జూరంలో ఉండే. ΄÷టాషియం, ఫాస్ఫరస్, సెలీనియం, కాపర్, మాంగనీస్ వంటివి ఎముకలు గుల్లబారటం, కీళ్లు అరగటం వంటి ఎముకల సమస్యలు రాకుండా రక్షిస్తాయి.సంతానోత్పత్తి సామర్థ్యం..మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెంచడానికి ఖర్జూరాలు సహాయపడతాయి. ఖర్జూరం తింటే స్పెర్మ్ నాణ్యత పెరుగుతుంది.మెరుగైన జ్ఞాపకశక్తి..ఖర్జూరాల్లో ఉండే విటమిన్ ‘బి6’ వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మెదడును ఒత్తిడి, వాపు నుంచి రక్షించవచ్చు. ఖర్జూరాలను రోజూ తింటే.. నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే.. న్యూరో డీ జెనరేటివ్ వ్యాధి నుంచి దూరంగా ఉండొచ్చు. ఖర్జూరం తింటే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఖర్జూరంలో ఉండే ఫైబర్ కడుపులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకుంటాయి. పెద్దపేగు, ప్రోస్టేట్, రొమ్ము, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తులు, క్లోమ క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది.జీర్ణ సమస్యలు దూరం..ఖర్జూరంలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణకోశ వ్యవస్థ సక్రమంగా పనిచేసి, మలబద్ధకం దరి చేరదు.ఇవి చదవండి: కండరాలు పట్టేస్తున్నాయా? అయితే ఇలా చేయండి! -
Raisin Water : ఎండు ద్రాక్ష నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
ప్రస్తుత ఆహార అలవాట్లు, జీవన శైలి మార్పులు కారణంగా చాలామంది చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో అధిక బరువు. అధిక బరువు అనేక ఆరోగ్యసమస్యలకు మూలం. అందుకే బరువు తగ్గించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇవ్నీ కావు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం చేస్తున్నారు. వీటితోపాటు కొన్ని రకాల సింపుల్ చిట్కాలతో వెయిట్ లాస్ కావచ్చు అని నిపుణులు అంటున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి. ఎండు ద్రాక్ష నీరు ఎంతో మేలు చేస్తుంది. ఈ వాటర్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఎండు ద్రాక్షను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఆ నీటిని, ద్రాక్షతోకలిపి తీసుకోవడంతో వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని నమ్ముతారు. ప్రధానంగా ఎండుద్రాక్షలో ఉండే పోషకాలు , యాంటీఆక్సిడెంట్లు అందుతాయి.ఎండు ద్రాక్ష వాటర్, ప్రయోజనాలు శరీరంలోని మలినాలు బయటకు వెళ్తాయి. కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. శరీరం ఫ్రీ రాడికల్సతో పోరాడే శక్తినిస్తుంది. బరువు పెరగడం, నిద్రలేమి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.మెరుగైన జీర్ణక్రియ: ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సాధారణ ప్రేగు కదలికలను మెరుగుపర్చి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. తద్వారా జీర్ణ ప్రక్రియలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి: విటమిన్ సీ, బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఫినాలిక్ సమ్మేళనాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. రక్తపోటు,గుండెపోటు: బీపీ, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎండుద్రాక్షలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది సోడియం స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించే డైటరీ ఫైబర్ పాలీఫెనాల్స్‌ను కూడా ఇందులో లభిస్తాయి.చర్మ,నోటి సమస్యలు : ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. రక్తహీనతకు ఇది చాలామంది. ఎండుద్రాక్షలో కాల్షియం, బోరాన్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చర్మ ఆరోగ్యానికి కీలకమైన విటమమిన్ ఏ, ఈ ఇందులో లభిస్తాయి. రెగ్యులర్‌గా వీటిని తీసుకుంటే ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. వృద్ధాప్య ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్ కావిటీస్ , చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే నోటి బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయి.ఈ ఎండు ద్రాక్ష నీటిలో పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఉన్న ద్రవాల స్థాయిలను అందుపులో ఉంచుతాయి. ముఖ్యంగా ఈ వేసవిలో చెమట కారణంగా కోల్పోయిన శక్తి తిరిగి లభిస్తుంది. -
వీకెండ్ స్పెషల్: ఈ టిప్స్ ఎపుడైనా ట్రై చేశారా..?
వీకెండ్ వచ్చిందంటే లేట్‌గా నిద్ర లేవడం, లేజీగా ఉండటం, ఎక్కువ ఫుడ్ లాగించేయడంకాకుండా, రోజంతా సరదాగా సంతోషంగా గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. స్నేహితులు, సన్నిహితులతో ఉత్సాహంగా గడపాలి. దీంతో రాబోయే వారమంతా చురుగ్గా ఉండే శక్తి వస్తుంది. పచ్చని ప్రకృతిలో ఎంజాయ్ చేయాలి. కాలుష్యానికి తావులేని పార్క్‌లకు వెళితే, మంచి ఆక్సిజన్ లభిస్తుంది. మన చుట్టుపక్కల చిన్నపిల్లలతో గడిపినా, కలిసి పెయింటింగ్ వేసినా, ఆటలాడినా భలే ఉత్సాహం వస్తుంది. అలాగే రాబోయే వారమంతా యాక్టివ్‌గా ఉండేలా కొన్ని ఆరోగ్య చిట్కాలు ఇవిగో.. ♦ వేసవి కాలం వచ్చేసింది.. ఫ్రిజ్ నీరు కంటే కుండ వాటర్ బెటర్. మరీ ఎక్కువ చల్లని పదార్థాలు, డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. ♦ పిల్లలకు ఇంట్లో తయారు చేసిన ఐస్ క్రీ పెడితేమంచిది. ఎక్కువ నీళ్లు తాగేలా జాగ్రత్త పడాలి. ♦ నడక, యోగా లాంటి వ్యాయామాలు, అలాగే బ్మాడ్మింటన్ లాంటి ఔటర్ గేమ్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ♦ రోజూ నిద్రపోయే ముందు నానబెట్టిన బాదం, డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటే ఆరోగ్యకరమైన కొవ్వులు ,ఇతర పోషకాలు లభిస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ , డైటరీ ఫైబర్ కూడా అధికం. ♦ కొన్ని ఎండు ద్రాక్ష కొన్ని ధనియాలు నీరు పోసి మరిగించి చల్లార్చి ఆ కషాయాన్ని ఉదయం, సాయంకాలం తాగాలి. కీళ్ల వాపులు తగ్గి పోతాయి. ♦ రొటీన్‌కి టీ కి బదులుగా అల్లం టీ తాగితే మంచి ఉత్సాహం వస్తుంది. అలాగే దంత సమస్యలు ఉన్నవారు.. నోటి దుర్వాసనతో బాధపడుతున్న వారు.. అల్లాన్ని ఎండబెట్టి పొడి చేసి దాంట్లో కాస్త నీరు కలిపి పేస్ట్‌లా చేసి దానితో పళ్లు తోముకుంటే చిగుళ్లు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. ♦ సీజనల్ వ్యాధులను తగ్గించడంలో అల్లం బాగా పనిచేస్తుంది. కాస్త అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని పూటకు ఒక కప్పు మోతాదులో తాగుతుంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. ♦ అల్లం , కీరా, నిమ్మకాయ రసం కలిపిన మిశ్రమాన్ని ప్రతి రోజు ఉదయం పూట తాగాలి. నొప్పులు, వాపులు తగ్గి పోతాయి. -
వావ్!..వాట్ ఏ డ్రై ఫ్రూట్ జ్యువెలరీ!
ఎన్నో రకాల జ్యువెలరీలు చూసుంటారు. ఇలాంటి జ్యువెలరీని చూసే అవకాశమే లేదు. ముఖ్యంగా మహిళలు అందరికంటే విక్షణమైన డిజైన్‌తో కూడిన నగలు ధరించేందుకే ఇష్టపడతారు. చాక్లెట్లు, దీపావళి టపాసులతోటి విభిన్న అలంకరణాలు చూసుంటారు. ఇలా డ్రైఫ్రూట్స్‌తో జ్యువెలరీని మాత్రం చూసి ఉండరు. కానీ ఇది చూడటానికి అద్బుతంః అన్నంత రేంజ్లో ఉన్నాయి ఆ డ్రైఫ్రూట్ నగలు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియోలో మహిళ ధరించిన నగల్లో.. చెవికి పెట్టుకునే జుంకాల దగ్గర నుంచి వడ్డాణం వరకు అన్నింటిలో బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ కనిపిస్తాయి. జ్యువెలరీ కూడా భలే వెరైటీగా చూడముచ్చటగా ఉంది. కాకపోతే అమ్మో డ్రై ప్రూట్స్‌ని అలా వేస్ట్ అయిపోతున్నాయే! అని చివుక్కుమంటోంది మనసు. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు కూడా ఇలానే ఫీల్ అవ్వతూ.. సదరు మహిళపై మండిపడుతున్నారు. ఆహారాన్ని వృధా చేస్తోదంటూ తిట్టిపోశారు. అయినా ఈ రోజుల్లో డ్రై ఫ్రూట్స్ బంగారంతో సమానం అలాంటి వాటిని ఇలా అలంకరణకు ఉపయోగిస్తావా? అంటూ తిట్ట దండకం మొదటు పెట్టారు. ఏదీఏమైనా వెరైటీగా ఉండేందుకుక ట్రై చేయడంలో తప్పులేదు. అయితే అది సమంజసంగా ఉందా లేదా అనేది కూడా చెక్ చేయాలి లేదంటే విమర్శల పాలవ్వక తప్పదు. View this post on Instagram A post shared by Vasudhaa Makeover (@vasudhaa_makeover) (చదవండి: పెళ్లిని ఇలా పర్వెక్ట్గా ప్లాన్‌తో చేస్తే..సూపర్‌గా ఉంటుంది!) -
వెయిట్ లాస్ జర్నీలో.. ఈ డ్రైఫ్రూట్స్ పని అద్భుతం!
బరువు తగ్గడం అనే ప్రక్రియలో జీవనశైలి మార్పులు, ఆహార అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే చాలామంది వెయిట్‌లాస్ కోసం నట్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి డైట్లో చేర్చుకుంటారు. కొన్ని డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల పోషకాలు అందడంతోపాటు బరువు తగ్గే పనిని వేగవంతం చేస్తాయి. అవేంటో ఒకసారి చూద్దాం! తక్కువ క్యాలరీలు.. ఎక్కువ పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్ బెస్ట్ ఆప్షన్ వీటిలో అన్నిరకాల విటమిన్లు, మినరల్స్ , ఫైబర్, ఇతర సూక్ష్మపోషకాలుంటాయి. క్రమం తప్పకుండా నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్‌ను తినడం ద్వారా ఈజీగా బరువు తగ్గుతారు. అలాగే ఎముకల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, జుట్టు, చర్మం ఆరోగ్యంతోపాటు, కేన్సర్ నివారణకు కూడా ఉపయోగపడతాయి.క్యాన్సర్ నివారణకు కూడా ఉపయోగపడతాయి. మెదడును పనితీరును మెరుగుపరుస్తాయి. బాదం: ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రోజూ ఓ పది బాదం పప్పులను ఆరు గంటల సేపు నానబెట్టిన తరువాత తీసుకుంటే శరీరానికి కావాల్సిన హెల్దీ ఫ్యాట్స్ లభిస్తాయి. ఎండు ద్రాక్ష: ఇది తక్షణ శక్తినివ్వడంతో పాటు ఆకలి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మెదడు ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. అంజీర్: ఎండిన అంజీరలో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇది డైజెషన్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. గుండె జబ్బులకు, క్యాన్సర్‌కు, వెయిట్ లాస్‌కు ఇది బాగా పనిచేస్తుంది.ముఖ్యంగా ఆడవారికి చాలామంచిది. ఖర్జూరం(మితంగా): వీటినే డేట్స్ అంటారు. వీటి ద్వారా తక్షణ శక్తి వస్తుంది. అన్ని రకాల మినరల్స్ ఇందులో లభిస్తాయి. ఎండు ఖర్జూరంతో రక్తపోటు తగ్గుతుంది. అంతేకాదు, మలబద్దకానికి మంచి మందు. వీటిని నానబెట్టి తింటే ఇంకా మంచిది. ఆప్రికాట్లు కూడా బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆకలిని నియంత్రించి అతిగా తినడానికి చెక్ చెబుతాయి. చియాసీడ్స్: వీటినీ నానబెట్టి తినాలి. ఇవి నీళ్లో వేయగానే చక్కగా ఉబ్బి, ట్రాన్సపరెంట్గా మారిపోతాయి. ఇవి జీర్ణక్రియకు సాయపడతాయి. బరువు తగ్గించే విషయంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలం. గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తాయి. సీవీడ్ స్నాక్స్: తక్కువ కేలరీలు ,పోషకాలు అధికంగా ఉంటాయి, సీవీడ్ స్నాక్స్ అవసరమైన ఖనిజాలను అందించడంతోపాటు, బరువు నిర్వహణకు బాగా హెల్ప్ చేస్తాయి. జీడిపప్పు (మితంగా): జీడిపప్పులో ప్రొటీన్స్ ఎక్కువ. మినరల్స్, విటమిన్స్‌తో నిండిన జీడిపప్పు ఇమ్యూనిటీని పెంచుతుంది. బీపీని తగ్గిస్తుంది. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. అందుకే వెయిట్ లాస్ కోసం ఇది కూడా మంచి ఆప్షన్. నోట్: ఏదైనా మితంగా తినడం ఉత్తమం. అందులోనూ షుగర్,బీపీ ఇతర జబ్బులు ఉన్న వాళ్లు వెయిట్ తగ్గాలి అనుకున్నపుడు నిపుణుల సలహా మేరకు కేలరీలు, పోషకాలను అంచనా వేసుకుని మన డైట్లో చేర్చుకుంటే ఫలితం అద్బుతంగా ఉంటుంది. -
దీపావళికి దీన్ని గిఫ్ట్‌గా ఇస్తున్నారా? అలాంటివి కొనేటప్పుడూ..
ఇటీవల కాలంలో ఇతరులకు గిఫ్ట్ ఇవ్వడంలో ట్రెండ్ మారిందనే చెప్పాలి. చాలా విభిన్నంగా ఇవ్వాలనే చూస్తున్నారు. అందులోనూ ఆరోగ్య దృష్ట్యా మంచివి ఖరీదైన వాటిని ఇచ్చేందుకు చూస్తుంటారు కొందరూ. ఇటీవల పండుగకి స్వీట్స్ బదులు ఆరోగ్యానికి ఎంతో మంచివైన డ్రై ఫ్రూట్స్ వంటివి గిఫ్ట్‌గా ఇచ్చే ట్రెండ్ బాగా వచ్చింది. ఈసారి దీపావళి పండుగకి డ్రై ఫ్రూట్స్‌ని గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటే కచ్చితంగా ఇవి గుర్తుంచుకోండి. డ్రైఫ్రూట్స్‌ను కొనేటప్పుడు కచ్చితంగా ఇవి గమనించాలి.. నట్స్ రంగు ఎలా ఉందో చూడాలి. సహజంగా ఉండాల్సిన దానికంటే మరింత ముదురు రంగులో ఉంటే అవి పాడైనట్టు. రుచిగా కూడా ఉండవు కాబట్టి కొనకపోవడమే మంచిది. వీలైతే ఒకటి రెండు నట్స్‌ను నీటిలో వేసి, పదినిమిషాల తరువాత కొరికి చూడాలి. నానిన తరువాత కూడా గట్టిగా ఉంటే అవి చాలా పాతవి. ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి తీసుకోకూడదు. చాలా షాపులు తినడానికి శాంపిల్స్ ఇవ్వవు. ఇలాంటప్పుడు ఆ డ్రైఫ్రూట్స్‌ను తక్కువ పరిమాణంలో కొనుక్కుని పరిశీలించాలి నట్స్‌ని వాసన చూడాలి. ఘాటైన వాసన వస్తే అవి చాలా పాతవి. వీటికి కొద్దిగా తేమ తగిలితే వెంటనే బూజు పట్టి త్వరగా పాడవుతాయి. ఇవి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు నట్స్ ప్యాకెట్ మీద ఎఫ్ఎస్ఎస్ఏఐ ముద్ర, నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో చూడాలి. ఎప్పుడు ప్యాకింగ్ అయ్యింది? ఎప్పటిలోగా తినాలో సూచించే డేట్స్‌ను సరిగా చూసుకోవాలి. ఈ డేట్స్ ముద్రించని ప్యాకెట్స్‌ను కొనకూడదు ప్యాకెట్ మీద ముద్రించిన సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలి. ప్రిజర్వేటివ్‌లు కలిపిన నట్స్‌ను కొనకపోవడమే మంచిది. (చదవండి: ఆపరేషన్ బ్యూటీ! అందం కోసం తీసుకునే ఇంజక్షన్లు మంచివేనా!) -
చాక్లెట్ ట్రఫెల్స్.. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు
చాక్లెట్ ట్రఫెల్స్ తయారీకి కావల్సినవి: బాదం పప్పు – కప్పు; ఎండు కొబ్బరి తురుము – ముప్పావు కప్పు; కర్జూరాలు – పదిహేను; బాదం బటర్ – ము΄్పావు కప్పు; డార్క్ చాక్లెట్ ముక్కలు – పావు కప్పు; కొబ్బరి నూనె – అరటీస్పూను; బరకగా దంచిన పిస్తా పలుకులు – పావు కప్పు; బాదం పలుకులు – పావు కప్పు; నల్లని పొరతీసి తురిమిన ఎండు కొబ్బరి – పావు కప్పు; స్ట్రాబెరీ పొడి – పావు కప్పు. తయారీ విధానమిలా: ►కర్జూరాలను ఒకసారి కడిగి పదిహేను నిమిషాల పాటు వేడినీటిలో నానబెట్టుకోవాలి ∙బాదం పప్పు, ఎండు కొబ్బరి తురుముని దోరగా వేయించి మిక్సీజార్‌లో వేయాలి. ► నానబెట్టిన కర్జూరాలను నీరు లేకుండా తీసి మిక్సీజార్‌లో వేసి గ్రైండ్ చేయాలి ∙సగం నలిగిన మిశ్రమంలో బాదం బటర్ వేసి గ్రైండ్ చేయాలి. ► అవసరాన్ని బట్టి రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ∙ఇప్పుడు గ్రైండ్ అయిన మిశ్రమాన్ని బయటకు తీసిన నచ్చిన పరిమాణంలో లడ్డుల్లా చుట్టుకోవాలి. ► బాదం, పిస్తా పలుకులను పొడిచేసి పక్కన పెట్టుకోవాలి ∙చాక్లెట్ముక్కల్లో కొబ్బరి నూనెవేసి అవెన్‌లో 45 సెకన్లు ఉంచాలి. చాక్లెట్ కరిగిన తరువాత పక్కన పెట్టుకోవాలి. ► ఇప్పుడు ముందుగా చేసుకున్న లడ్డులాను ఒక్కోక్కటి ఎండుకొబ్బరి తురుము, పిస్తా, బాదం, స్ట్రాబెరీ పొడులు, చాక్లెట్ మిశ్రమంలో ముంచి అద్దుకుంటే ట్రఫెల్స్ రెడీ. రిఫ్రిజిరేటర్లో నిల్వచేసుకుంటే ఇవి పదిరోజుల పాటు తాజాగా ఉంటాయి. -
డ్రైఫ్రూట్స్‌తో ఎనర్జీ బాల్స్.. బోలెడు పోషకాలు
ఎనర్జీ బాల్స్ తయారీకి కావల్సినవి: రాగిపిండి – అరకప్పు మునగ ఆకు పొడి – ముప్పావు కప్పు ఎండిన అంజీర పండ్లు – ఆరు కర్జూరం – పన్నెండు కిస్మిస్ –పావు కప్పు, జీడిపప్పు – పావు కప్పు బాదం – పావు కప్పు, పిస్తా – పావు కప్పు ఎండు కొబ్బరి తురుము – పావు కప్పు,బెల్లం పొడి – పావు కప్పు యాలకుల పొడి – టీస్పూను; నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు; ఎండు కొబ్బరి పొడి – రెండు టేబుల్ స్పూన్లు (గార్నిష్‌కు సరిపడా). ఎనర్జీ బాల్స్ తయారీ విధానమిలా.. అంజీర పండ్లు, కర్జూరం విత్తనాలు తీసేసి వేడినీటిలో పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి. బాణలిలో టేబుల్ స్పూను నెయ్యి వేసి రాగిపిండి వేసి వేయించాలి. రాగిపిండి మంచి వాసన వస్తున్నప్పుడు మునగాకు పొడి వేసి ఐదు నిమిషాలు వేయించి తీసేయాలి. ఇదే బాణలిలో డ్రైఫ్రూట్స్ అన్నింటిని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. చివరగా ఎండు కొబ్బరిని కూడా వేయించుకోవాలి. వేయించిన డ్రైఫ్రూట్స్‌ను మిక్సీజార్‌లో వేసి పొడిచేసుకోవాలి. నానబెట్టిన కర్జూరం, అంజీరను పేస్టులా గ్రైండ్ చేయాలి. బాణలిలో మరో టేబుల్ స్పూను నెయ్యివేసి అంజీర పేస్టుని వేసి సన్నని మంట మీద నెయ్యి పైకి తేలేంత వరకు వేయించాలి. వేగాక డ్రైఫ్రూట్స్ పొడి, రాగి, మునగాకు, యాలక్కాయ బెల్లం పొడులు వేసి కలపాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత పిండి మిశ్రమాన్ని లడ్డులా చుట్టుకుని కొబ్బరి పొడిలో అద్దుకుంటే ఎనర్జీ బాల్స్ రెడీ. గాలిచొరబడని డబ్బాలో నిల్వచేస్తే పదిహేను రోజులపాటు తాజాగా ఉంటాయి. -
అంజీర సాగు..లాభాల బాటలో అనంతపురం రైతు
-
డ్రై ఫ్రూట్స్ తరచుగా తినే అలవాటుందా? అయితే అంతే సంగతులు!
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. దీన్ని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలా అని వాటిని అతిగా తీసుకుంటే శరీరంపై తీవ్ర దుష్ప్రభావాలు చూపించడమే గాక లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు న్యూట్రీషియన్లు. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువు, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, అతిసారం లేదా అపానవాయువుని పెంచడం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇవి ఎలాంటి దుష్ప్రభావాలు చూపిస్తాయో ఒక్కసారి చూద్దాం. అలెర్జీ: డ్రై ఫ్రూట్స్ కొన్నిసార్లు అలెర్జీకి కారణమవుతాయి. దీందో శరీరంపై దురద, ఊపిరాడకపోవడం, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలర్జీలు ఉన్నవారు డ్రైఫ్రూట్స్ తినకపోవడమే మంచిదని ఆహార నిపుణలు చెబుతున్నారు. బరువు పెరుగుట: కొన్ని డ్రై ఫ్రూట్స్‌లో మంచి కొలస్ట్రాల్ ఉంటుంది. దీంతో వీటిని ఎక్కువగా తీసుకుంటే తొందరగా బరువు పెరిగి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓ మోస్తారుగా బ్యాలెన్స్డ్గా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. కిడ్నీ స్టోన్: జీడిపప్పుడ, బాదంపప్పు, వేరశేనగలో ఆక్సలేట్లు ఉంటాయి. దీంతో కిడ్నీలో రాళ్ల సమస్య పెరగుతుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు: జీర్ణశక్తి సరిగా లేనివారు ఇవి తీసుకుంటే లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. జీడిపప్పులో ఉండే ఫ్యాట్, ఫైబరే దీనికి కారణం. (చదవండి: స్నానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు.. నీరు లేకుండా స్నానం చేయొచ్చని తెలుసా!) -
రాత్రిపూట అంజీర్ తింటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
అంజీర్.. వీటినే అత్తిపండ్లు(ఫిగ్స్)అని అంటారు. డైఫ్రూట్స్ రూపంలోనూ లభించే అంజీర్ మార్కెట్లో విరివిగా లభిస్తుంటాయి. తినడానికి రుచిగా ఉండడమే కాదు.. అద్భుతమైన పోషకాలు కూడా వీటిలో ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం,ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలను బలపరిచేందుకు సహాయపడతాయి. ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అంజీర్‌లో ఉన్న విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-కె వల్ల ఆరోగ్యంతో పాటు అందమూ మెరుగవుతుంది. అధిక రక్తపోటు, అధిక చక్కెర ఉన్నవారు అంజీర్ పండ్లను తీసుకుంటే చాలా మంచిది. ఆయుర్వేదంలో అంజీర్ పండ్లకు ప్రత్యేకమైన స్థానముంది. వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. వంద గ్రాముల అంజీర్‌లో ఉండే పోషకాలివే క్యాలరీలు – 74 ప్రొటీన్లు – 0.75 గ్రాములు కొవ్వులు – 0.30 గ్రాములు పిండి పదార్థాలు – 19.8 గ్రాములు పీచు పదార్థం (ఫైబర్) – 1 గ్రా. కాపర్ – రోజులో కావల్సిన దానిలో 3 శాతం మెగ్నిషియం – రోజులో కావల్సిన దానిలో 2 శాతం పొటాషియం – 2 శాతం విటమిన్ బి6 – 8.60 శాతం విటమిన్ సి – 2 శాతం గుండె ఆరోగ్యానికి.. అంజీర్ పండ్లు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇవి గుండె సమస్యలను అదుపులో ఉంచుతుంది. అందువల్ల కొలెస్ట్రాల్ తగ్గాలనుకునేవారు ఈ పండ్లను ప్రతిరోజూ తీసుకోవాలి. అధిక బరువు నియంత్రణలో.. బరువు తగ్గడంలో అంజీర్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇందులో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ సమయం వరకు ఆకలి వేయదు. ఫలితంగా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీని ద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. మలబద్దకం దూరం.. అంజీర్ పండ్లలో అధిక స్థాయిలో పీచు పదార్థం కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా మలబద్దకం సమస్య తగ్గుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు ప్రతిరోజూ తమ ఆహారంలో రెండు అంజీరాలను తప్పకుండా తీసుకోవాలి. షుగర్ పేషెంట్స్ తినొచ్చా? చక్కెరను అదుపులో ఉంచడంలో అంజీర్ పండ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు అంజీర్ పండ్లను రోజూ తింటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అంజీర్‌లో ఉండే ఫైబర్, విటమిన్-E, ఫ్యాటీ యాసిడ్లు వంటి పోషకాలు చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. డయాబెటిస్ ఉన్న వారు డ్రై అంజీర్ పండ్లను తినరాదు. ఇవి పండ్లతో పోలిస్తే 2-3 శాతం వరకు అధికంగా చక్కెర కలిగి ఉంటుంది. రక్తహీనత నుంచి దూరం రక్తహీనత నేడు చాలామందిని బాధిస్తుంది. అలాంటి వారు నిత్యం కనీసం రెండు అంజీర్ పండ్లను తినాలి. వీటివల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు బాగా పెరిగి రక్తం బాగా వృద్ధి చెందుతుంది. దీనిలోని పొటిషియం, ఐరన్ వల్ల రక్తహీనత దూరమవుతుంది. నిద్రలేమి నుంచి ఉపశమనం అంజీర్ పండ్లను రాత్రి పూట ఒక గ్లాసు నీటిలో మూడు- నాలుగు నానబెట్టి మరుసటి రోజు పరగడుపునే తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. లేదా రాత్రి పూట అంజీర్ పండ్లను నేరుగా తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగితే నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుందట. -
గుంటూరు కారం కథ తెలుసా అసలు.?
బంగాళాదుంప , మొక్క జొన్న , వేరుశెనగ , పైన్ ఆపిల్ , నారింజ , పొగాకు , బాదం , బెండకాయ , సపోటా , బొప్పాయి , మిరపకాయ , జీడిపప్పు, .. ఇవి లేని జీవితాన్ని ఊహించండి ! అంటే … మసాలా దోస , మిర్చి బజ్జి , వేరుశనిగ చట్నీ , బెండకాయ పులుసు , జీడీ పప్పు ఉప్మా … ఇవన్నీ ఉండవన్న మాటే కదా ! “ అహో ఆంధ్ర భోజా ! .. శ్రీకృష్ణ దేవా రాయా ! శిలలపై శిల్పాలు చెక్కించావు .. కానీ గుంటూరు కారం రుచి చూడలేదు .. ఉడిపి మసాలా దోస రుచి తెలియదు. ఏంటి ప్రభు? అని టైం మెషిన్ లో వెనక్కు వెళ్లి అడిగితే .." నేనేమి చేసేది మా కాలానికి ఈ పంటలు లేవు అంటాడు. ఎందుకంటే ఈ పంటలను , అటు పై పోర్చుగీస్ వారు, లాటినా అమెరికా దేశాలనుంచి సేకరించి మన దేశంలో ప్రవేశపెట్టారు. మరి ఆ రోజుల్లో మనాళ్ళు మసాలా దినుసులుగా ఏమి వాడేవారు? అల్లం , పసుపు , ఆవాలు , దాల్చిన చెక్క , ఏలకులు , లవంగాలు, ధనియాలు, ఇంగువ , మెంతులు ... ఇవన్నీ మన పంటలే . వీటిని మసాలా దినుసులుగా వాడేవారు ! అదండీ గుంటూరు కారం కథ ! కేవలం నాలుగు వందల సంవత్సరాల చరిత్ర . నల్ల మిరియాలు అనాదిగా ఇండియా లో పండించేవారు. దాన్ని పోర్చుగీస్ వారు ఎగుమతి చేసుకున్నారు. ఇప్పుడు రాజ్యమేలుతున్న ఎన్నో వంటకాలు మనవి కాదు, కానీ తొందరగానే మన జీవితాలను పెనవేసుకుపోయాయి. మార్పు సహజం .. కానీ కొత్తొక వింత కాదు . పాతొక రోత కాదు. ఏది మంచి ? ఏది చెడు అని- నా వక్తిగత అభిప్రాయం కాకుండా సామజిక శాస్త్రం - మానవ శాస్త్రం - జీవ శాస్త్రం కోణం నుంచి శాస్త్రీయ విశ్లేషణలు చేస్తున్నా. వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక శాస్త్ర విశ్లేషకులు, ప్రముఖ విద్యావేత్త -
ఆమె నిన్నటి మేటి హీరోయిన్.. కళ్ళతోనే నటించేది! ఇప్పుడు ఎందుకిలా?
ఆమె నిన్నటి మేటి హీరోయిన్. కళ్ళతోనే నటించేది. ఆకాశంలో ఆశల హరివిల్లు కట్టుకొంది. ఇప్పుడు మెమరీ లాస్‌తో బాధపడుతోంది. స్టెప్స్ మర్చిపోయింది. డాన్స్‌కు దూరం అయ్యింది. డాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచన కూడా విరమించుకొంది. డైలాగులు కూడా గుర్తు చేసుకోలేక సీరియల్స్‌కు కూడా దూరం అయ్యింది. తన భర్త మరణించిన తరువాత ఇలా మెమరీ లాస్ అయ్యిందని అనుకొంటోంది. ఏది.. ఏ కారణం చేత జరిగిందో తెలుసుకోలేని దౌర్భాగ్యపు సమాజంలో మనం ఉన్నాము. మీకందరికీ పరిచయం ఉన్న నలుగురు మహిళా టీవీ యాంకర్లకు ఇదే సమస్య ఎదురయ్యింది. ఏం చేయాలి? 1 . రోజుకు నాలుగైదు వాల్ నట్స్ తినాలి. అదే విధంగా పిస్తా, బాదం చెరి నాలుగైదు తినాలి . 2 . మాంసాహారులైతే సముద్రపు చేపలు అప్పుడప్పుడు తినాలి. 3 . కార్బ్స్ తగ్గించాలి. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు మూడు నాలుగు లీటర్ల మంచి నీరు తాగాలి. 4 . పనిలో ఎప్పుడు బిజీగా ఉండేలా చూసుకోవాలి. వీలైనంత ఎక్కువగా మాట్లాడాలి. ఇది అన్నిటికంటే ముఖ్యం. ఒంటరి జీవనం కూడదు. 5 . అవిశె, గుమ్మడి ... గింజెలు, ఆకుకూరలు, కాయగూరలు, తాజా పళ్ళు తరచూ తీసుకోవాలి . 6 . బాగా నిద్ర పోవాలి. లేదంటే డెమెన్షియా! ఇలా చేస్తే ఆమెకైనా, మెమరీ లాస్ అవుతున్న ఎవరికైనా తిరిగీ కొత్తగా రెక్కలు వస్తాయి. లేదంటే డెమెన్షియా. అది ఏ స్థాయిలో ఉంటుందంటే తన పేరు, ఇంటి అడ్రెస్స్ మరచిపోయి ఏదో ఆలోచనలతో ఇంటినుంచి వెళ్లి పోయి తిరిగి రాలేక ఫుట్ పాత్ ల పై అనాథలా బతికి.... తనువు చాల్సించాల్సి వస్తుంది. భయంకరం... చెబితే కొంతమంది ఏడుస్తారు కానీ అండీ ... 78 ఏళ్ళు వచ్చినా ఆరోగ్యం గా ఒక బృందావనం అంటూ జీవిస్తోన్న ఆ మధుర గాయని ఉన్నట్టుండి కళ్ళుతిరిగి డ్రెస్సింగ్ టేబుల్ పై పడి మరణించడానికి కారణం ఏంటని ఎవరైనా చెప్పారా ? రక్తంలో క్లోట్స్ ఉంటే అది మెదడు పోటుకు దారి తీయొచ్చు. ముందుగా కళ్ళు తిరుగుతాయి. మమూలుగా కళ్ళు తిరగడానికి ఇలా రక్తంలో క్లోట్స్ వల్ల వచ్చిన దానికి తేడా ఉంటుంది. అందుకే ఆమె అంత బలంగా పడిపోయింది. రక్తంలో క్లోట్స్ ఎందుకు వచ్చాయి? వయసు అయిపొయింది .. వాతావరణ మార్పులు .. చెన్నై చలి .. చెన్నై ఎండలు .. నీరు తాగడం వల్ల.. ఉపవాసం ఉండడం వల్ల .. జింకు పోవడం వల్ల .. చెన్నై పక్కనే సముద్రం ఉండడం వల్ల ..... ఇలా సోది కారణాలు ఎన్నైనా చెబుతారు జనాలు. అది అంతే ! -వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, పాఠశాల విద్య పరిశోధకులు (వ్యాసకర్త వ్యక్తిగతానుభవసారం ఇచ్చిన కథనం) - ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను మొమరీ లాస్‌తో బాధపడుతున్నట్లు సీనియర్ నటి భానుప్రియ చెప్పిన విషయం తెలిసిందే! -
Blood Count: టాబ్లెట్లు అక్కర్లేదు! రోజుకు కప్పు బూడిద గుమ్మడి రసం తాగితే
కొంతమంది కొన్ని విటమిన్ల లోపం వల్ల రక్తలేమితో బాధపడుతుంటారు. రక్తలేమి వల్ల నీరసం, శ్వాస ఆడకపోవడం, కళ్లు తిరగటం, నిస్సత్తువగా ఉండటంతోపాటు అనేకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా వృద్ధులకు, గర్భిణులకు రక్తహీనత సమస్య ఎక్కువగా ఎదురయ్యే సమస్య. సాధారణంగా రక్తలేమికి కొన్ని విటమిన్ టాబ్లెట్లు వాడమని వైద్యులు సూచిస్తుంటారు. అయితే అలా మందులు వాడటం వల్ల కొన్ని దుష్ఫలితాలు తలెత్తే అవకాశం ఉందని, అందువల్ల సహజంగానే రక్తం పట్టే ఆహారం తీసుకోమని కూడా చెబుతారు. అలాంటి వాటిలో కొన్ని చిట్కాలు మీకోసం... ►సపోటా జ్యూస్ తాగటం లేదా సపోటా పండ్లు తినడం వల్ల శరీరానికి తొందరగా రక్తం పడుతుంది. ►దానిమ్మ రసం తాగడం, దానిమ్మ పండ్లు తినడం కూడా చాలా మంచిది. బూడిద గుమ్మడి రసం తాగితే.. ►బూడిద గుమ్మడి శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు కప్పు బూడిద గుమ్మడి రసాన్ని తాగుతూ ఉంటే శరీరంలో మంచి రక్తం వృద్ధి అవుతుంది. బూడిద గుమ్మడి కాయ గుజ్జు తీసి దానిని దళసరి గుడ్డలో వేసి బాగా పిండితే వచ్చే రసాన్ని కప్పులో పోసుకుని తాగాలి. నెలలోనే రక్తం వృద్ధి! ►కిస్మిస్ లేదా ద్రాక్షపండ్లు బాగా తింటూ ఉంటే రక్తం వృద్ధి అవుతుంది. పచ్చివి దొరకనప్పుడు ఎండువి తినవచ్చు. రాత్రులు గుప్పెడు ఎండు ద్రాక్ష పళ్ళు గ్లాసెడు నీటిలో నానవేసి ఉదయం వాటిని బాగా పిసికి ఆ పిప్పిని పారవేసి ఆ నీటిని తాగాలి. అలా రోజూ తాగుతుంటే ఒక నెలలోనే రక్తం వృద్ధి అవుతుంది. లేత కొబ్బరి తింటే కూడా! ►ఎండు ఖర్జూరాలతో కూడా పైన చెప్పిన విధంగా చేసి ఆ నీటిని తాగుతుంటే రక్తం వృద్ధి అవుతుంది. ►రాత్రిపూట గుప్పెడు శనగలు నీటిలో నానవేసి ఉదయం తింటూ ఉంటే రక్తం వృద్ధి అయ్యి శరీరం పుష్టిగా అవుతుంది. వ్యాయామం చేసేవారికి ఈ విధానం చాలా మంచిది. ►అంజీర్ పండ్లు తింటున్నా రక్తం వృద్ధి అవుతుంది. ►లేత కొబ్బరి నీరు, లేత కొబ్బరి తింటూ ఉంటే శరీరంలో రక్తం బాగా వృద్ధి అవుతుంది. నోట్: వీటిలో మీ శరీర తత్త్వాన్ని, మీకున్న ఇతర ఆరోగ్య సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకుని మీకు ఏవి బాగా సరిపడతాయో, ఏది సులభమో వాటిని అనుసరిస్తే సరి. ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే. వైద్యుని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. చదవండి: తులసి ఆకులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి.. ఉదయం ఖాళీ కడుపుతో నమిలితే.. ప్లాస్టిక్ కవర్లలో వేడి వేడి ఛాయ్! పొట్ట కింద ‘టైర్లు’!.. అలారం మోగుతోంది.. వినబడుతోందా? -
Health: ప్రతి రోజూ ఓట్స్ తింటున్నారా? గుండెకు సంబంధించి ఈ విషయాలు తెలిస్తే
Heart Healthy Foods- Diet Tips In Telugu: అప్పటిదాకా నచ్చిన రుచులన్నీ కడుపునిండా తిన్న వారికి ఏ డయాబెటిస్సో, గుండెజబ్బో, కొలెస్టరాలో వచ్చిందంటే పాపం! వారి బాధ చెప్పనలవి కాదు. ఎందుకంటే అటు నోరుకట్టుకోనూలేరు, ఇటు ఇష్టం వచ్చినవన్నీ తినడానికీ లేదు. అలాగని పూర్తిగా చప్పిడి తిండే తినమంటే మరీ నీరసించి పోతారు. ఇంతకీ మీరు చెప్పేదేమిటీ అనుకుంటున్నారా? కాస్త ఓపిక పట్టండి మరి! నోటికి రుచికరంగా ఉంటూనే, గుండెకు బలం చేకూరేలా, ఆరోగ్యానికి ఏమాత్రం హాని కలగకుండా కాపాడుకునేలా కొన్ని రకాలైన ఆహార పదార్థాలను సూచిస్తున్నారు వైద్యులూ, పోషకాహారనిపుణులూ. అవేమిటో తెలుసుకుందామా? ఆకుపచ్చని కూరలు ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలన్నీ గుండెకు బలాన్నిఇస్తాయి. ముఖ్యంగా బచ్చలి కూర గుండెకు చాలా మంచిది. బచ్చలికూరతో పప్పు వండుకోవచ్చు. సెనగపప్పు వేసి పప్పు కూర చేసుకోవచ్చు. పచ్చడి కూడా చేసుకోవచ్చు. అయితే నూనె, ఉప్పు, కారం పరిమితంగానే వాడాలి. టొమాటల్లోని లైకోపిన్ వల్ల టొమాటోలలో ఉండే లైకోపిన్ అనే పోషకం గుండెకు చాలా మంచిది. టొమాటోలలో రక్తపోటును నియంత్రించే పొటాషియం కూడా ఉంటుంది. కాబట్టి పుల్లపుల్లగా, తియ తియ్యగా ఉండే టొమాటోలను విరివిగా తినచ్చు. చేపలు తింటే చేపలు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. సాల్మన్ ఫిష్ లాంటివి మరింత ఆరోగ్యకరం. గుండె కొట్టుకోవడంలో తేడానీ, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్నీ, ట్రై గ్లిజరైడ్స్‌నూ తగ్గించే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో ఎక్కువ. అందుకే వారానికి కనీసం రెండు సార్లయినా చేపలు తింటే మేలు అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేస్తోంది. స్ట్రా బెర్రీలతో స్ట్రా బెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక అధ్యయనంలో తేలింది. డ్రై ఫ్రూట్స్ కిస్మిస్, బాదం, ఎండు ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ గుప్పెడు తింటే గుండెకు చాలా మంచిది. అలాగే ద్రాక్షపండ్లు కూడా గుండెకు సత్తువనిస్తాయి. అయితే ద్రాక్షను రసం తీసి కాకుండా నేరుగా తినడం మేలు. ఎందుకంటే ద్రాక్షరసంలో చక్కెర కలుపుకోవడం అనివార్యం కదా! డార్క్ చాక్లెట్లు తింటే డార్క్ చాక్లెట్లు గుండెకు మేలు. కనీసం 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన డార్క్ చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు తగ్గడంతో పాటు రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీ బార్ల వల్ల మాత్రం గుండెకు మేలు చేకూరకపోగా ముప్పే. అలాగని డార్క్ చాక్లెట్లను కూడా మితిమీరి తినకూడదు. గుండెకు మేలు చేసే 5 ఆహార పదార్థాలు వేరుశెనగ గుండెకు వేరుశెనగ ఎంతో మంచిది. మంచి కొవ్వును కలిగి ఉన్న వేరుశెనగలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్నాయి. అవి గుండె భేషుగ్గా ఉండటానికి సహకరిస్తాయి. అలాగే వేరుశెనగలో ఉండే ఖనిజాలు గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడతాయి. నారింజ గుండె ఆరోగ్యానికి నారింజ పండు చాలా మంచిది. పొటాషియం అధికంగా ఉండే నారింజలో ఎలక్ట్రోలైట్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లు కూడా గుండె జబ్బులను నివారించడంలో తోడ్పడతాయి. అవకాడో విటమిన్–ఈతో పాటు అనేక ఇతర పోషకాలు అవకాడోలో సమృద్ధిగా లభిస్తాయి. దీనికితోడు మోనో అన్ –శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల ఈ పండు గుండెకు చాలా మంచిది. అవకాడోను రోజూ తినడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.. అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా గుండెపోటుతో సహా గుండె సంబంధిత వ్యాధులు నుంచి బయటపడవచ్చు. వాల్నట్స్ రోజూ క్రమం తప్పకుండా కాసిని వాల్‌నట్స్‌ను తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టొచ్చు. అలాగే గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే వాల్నట్స్ హృదయ సంబంధిత వ్యాధులను నివారించడంతోపాటు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఓట్స్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఓట్స్ వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఓట్స్‌లో ఒమేగా 3 ఆమ్లాలు కూడా ఉన్నాయి, ఇవి గుండెకు చాలా ప్రయోజనకరం. ప్రతీ రోజూ ఓట్స్ తినడం గుండెకు ఆరోగ్యాన్నిస్తుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! ఆరోగ్య సమస్యలను బట్టి వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సరైన పరిష్కారం పొందవచ్చు. చదవండి: Lady Finger Health Benefits: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా మెదడు.. Cinnamon Health Benefits: దాల్చిన చెక్క పొడి పాలల్లో వేసుకుని తాగుతున్నారా? అయితే Health Tips: రక్తం పీల్చే జలగలతో వైద్యం! పైల్స్, షుగర్ పేషంట్లకు ఉపశమనం.. ఇంకా.. -
Recipe: పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి
శీతాకాలం పగలు తక్కువ.. రాత్రి ఎక్కువ. రాత్రి వేళల్లో చలి ఎక్కువ. భోజనం బరువుగా ఉండకూడదు. అలాగని తక్కువ తింటే పోషకాలందవు. కొద్దిగా తిన్నా సరే... అది సమతులంగా ఉండాలి. ఆహారాన్ని దేహం వెచ్చగా ఒంటబట్టించుకోవాలి. అందుకే... ఇది ట్రై చేసి చూడండి. పాంజిరి కావలసినవి: ►సన్నగా తరిగిన బాదం – కప్పు ►యాలకుల పొడి – ఒకటిన్నర టీ స్పూన్లు ►దోస గింజలు – పావు కప్పు ►తర్బూజ గింజలు – పావు కప్పు ►పిస్తా పప్పు – పావు కప్పు (తరగాలి) ►వాము – అర టీ స్పూన్ ►ఎండు కొబ్బరి తురుము – కప్పు ►అల్లం తరుగు లేదా శొంఠి పొడి– 2 టేబుల్ స్పూన్లు ►జీడిపప్పు– కప్పు (చిన్న పలుకులు) ►తామరగింజలు – కప్పు ►వాల్నట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు ►కిస్మిస్ – 3 టేబుల్ స్పూన్లు ►నెయ్యి– 3 టేబుల్ స్పూన్లు. ప్రధానమైన పదార్థాలు: ►సూజీ రవ్వ – కప్పు ►నెయ్యి – ఒకటిన్నర కప్పు ►గోధుమ పిండి – రెండున్నర కప్పులు ►బెల్లం పొడి – ఒకటిన్నర కప్పు. తయారీ: ►మందంగా ఉన్న బాణలిలో నెయ్యి వేడి చేసి తామర గింజలు (మఖానియా) వేయించాలి. ►వాటిని తీసి పక్కన పెట్టుకుని అదే బాణలిలో జీడిపప్పు, వాల్నట్, బాదం, తర్బూజ, దోసగింజలు, పిస్తా, కొబ్బరి తురుము, కిస్మిస్ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ►ఇందులో అల్లం తరుగు లేదా శొంఠి, వాము, యాలకుల పొడి కలిపి పక్కన ఉంచాలి. ►ఇప్పుడు ప్రధాన దినుసులను వేయించాలి. ►మరొక బాణలిలో నెయ్యి వేడి చేసి గోధుమ పిండి వేసి సన్నమంట మీద వేయించాలి. ►గోధుమ పిండి వేగి మంచి వాసన వస్తున్న సమయంలో సూజీ రవ్వ వేసి కలుపుతూ వేయించాలి. ►రవ్వ కూడా దోరగా వేగిన తర్వాత బెల్లం పొడి వేసి కలపాలి. ►ఇందులో ముందుగా వేయించి సిద్ధంగా ఉంచిన గింజల మిశ్రమాన్ని వేసి కలిపితే పాంజిరి రెడీ. ►దీనిని కప్పులో వేసుకుని పొడిగా స్పూన్‌తో తినవచ్చు. పాలిచ్చే తల్లులకు ప్రయోజనకరం ►పిల్లలు కింద పోసుకోకుండా మొత్తం తినాలంటే మరికొంత నెయ్యి వేసుకుని లడ్డు చేయాలి. ►ఇది ఉత్తరభారతదేశంలో బాలింతకు తప్పనిసరిగా పెట్టే స్వీట్. ►పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం. చదవండి: Kismis Doughnuts: మైదాపిండి, పంచదార.. కిస్మిస్ డోనట్స్ తయారు చేసుకోండిలా! Amla Candy: ఆరోగ్య లాభాలెన్నో.. ఇంట్లోనే ఇలా ఆమ్ల క్యాండీ తయారీ Nuvvula Annam: చిన్నా పెద్దా లొట్టలేసుకుంటూ తినేలా నువ్వుల అన్నం తయారీ ఇలా -
Health Tips: ఇవి తరచూ తింటే ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది! అంతేకాదు..
పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, దానిమ్మ పండ్లు, డ్రై ఫ్రూట్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం.. పాలకూర, బచ్చలి కూర తింటే ►పాలకూర, బచ్చలికూర లాంటి ఆకు కూరలు మీ కంటి చూపును మెరుగుపరుస్తాయి. ►పాలకూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ►ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలపై పోరాడటంతో ప్రముఖపాత్ర పోషిస్తాయి. ►ఆకుకూరలు.. మాక్యులర్ డీజెనరేషన్, కంటిశుక్లం లాంటి సమస్యల నుంచి రక్షించి కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతాయి. దానిమ్మ ►దానిమ్మ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ►రక్తహీనతతో బాధపడేవారిని దానిమ్మ తినమని సలహా ఇస్తారు. ►ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తికి పెంచుతాయి. ►అంతేనా దానిమ్మని రెగ్యులర్‌గా తింటే ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలింది. ►కాబట్టి ప్లేట్లెట్స్ని పెంచుకునేందుకు దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది. డ్రై ఫ్రూట్స్ ►డ్రై ఫ్రూట్స్... శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. ►దీంతోపాటు కంటిచూపును మెరుగు పర్చి నేత్ర సంబంధ సమస్యలను దూరం చేస్తాయి. ►వీటి లో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. చదవండి: Antibiotic Overuse: యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా..? పొంచి ఉన్న మరో ముప్పు..! -
డ్రై ఫ్రూట్స్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నారా? జర జాగ్రత్త!
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని చాలా మంది సూచిస్తారు. ప్రొటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఇవన్నీ ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి కావాల్సినవి. వీటన్నింటిని పొందడానికి డ్రై ఫ్రూట్స్ ఒక ఆప్షన్. అయితే ఇవి రుచిగా ఉంటాయి కదా... ఆరోగ్యానికి మంచిది కదా అని.. ఇష్టమొచ్చినట్టు తినకూడదు. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. అయితే ఎంత పరిమాణంలో తినాలి. ఏ డ్రై ఫ్రూట్స్ ఎన్ని తింటే ఆరోగ్యకరం? డ్రైఫ్రూట్స్ తినడం వల్ల కలిగే లాభాలేంటి..? అనే విషయాలను తెలుసుకుందాం... డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే.. షుగర్స్, క్యాలరీ లు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని 20 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. అలాగే నేరుగా తినడం కూడా మంచిది కాదు. కాబట్టి.. డ్రై ఫ్రూట్స్ తినే విధానం, ఏ నట్స్ ఎంత పరిమాణంలో తినాలి అనేది ఇప్పుడు చూద్దాం.. బాదం బాదం పప్పులో మోనో శ్యాచురేటెడ్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకి, మెదడుకి, చర్మ ఆరోగ్యానికి మంచిది. అలాగే ఆల్మండ్స్‌లో విటమిన్ ఈ, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవి రక్తప్రసరణ సక్రమంగా ఉండటానికి సహాయపడతాయి. అలాగే రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహకరిస్తాయి. రోజుకి 4 నుంచి 7 బాదం పప్పు తినడం వల్ల వీటిని నుంచి అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వాల్ నట్స్ వాల్ నట్స్ పైన ఉండే పెంకు తీయగానే.. ఉండే పప్పు అంత రుచిగా ఉండదు. కానీ.. 90 శాతం యాంటీ ఆక్సిడెంట్స్, ఫెనోలిక్ యాసిడ్స్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఈ స్కిన్లోనే ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి చాలా సమర్థంగా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని రోజుకి 3 నుంచి 4 తీసుకోవచ్చు. కర్జూరం ఇందులో ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫ్రాక్టోజ్ ఇందులో రిచ్‌గా ఉంటుంది. మెటబాలిజం స్థాయి చురుగ్గా ఉండటానికి కర్జూరం ఉపయోగపడుతుంది. వీటిని రోజుకి మీడియం సైజులో ఉండే 1 లేదా రెండు తీసుకుంటే సరిపోతుంది. పిస్తా పిస్తా వెల్నెస్ కి చిహ్నం. ఇవి బలానికి, ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇందులో మిగిలిన డ్రైఫ్రూట్స్ లో కంటే ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. జీడిపప్పు కమ్మటి రుచిలో ఉండే జీడిపప్పును రెగ్యులర్ గా తినడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రోజుకు నాలుగు జీడిపప్పులను తినడం ఆరోగ్యకరమని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. ఎండుద్రాక్ష తియ తియ్యగా పుల్లపుల్లగా ఉండే ఎండుద్రాక్షను ఎక్కువ మోతాదులో తిన్నా ఎలాంటి సమస్యా లేదు. ఇందులో విటమిన్ బి, పొటాషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజుకి గుప్పెడు ఎండుద్రాక్ష తినవచ్చు. 50 ఎండుద్రాక్షలు తినవచ్చు. అయితే మహిళలు రోజుకి ఒకటిన్నర కప్పు, మగవాళ్లు 2 కప్పుల ఎండుద్రాక్ష తినాలని నిపుణులు సూచిస్తున్నారు. -
Fish Haleem: ఇంట్లోనే ఫిష్ హలీమ్ తయారీ ఇలా!
Recipes In Telugu- బలవర్థక ఆహారంలో హలీమ్ కూడా ఒకటి. అనేక పోషకాలతో నిండిన హలీమ్‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. మరి మసాలా ఘాటు, ఢ్రై ఫ్రూట్స్‌తో ఘుమఘులాడే ఫిష్ హలీమ్‌ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం! ఫిష్ హలీమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు: బోన్‌లెస్ చేప ముక్కలు – అరకేజీ, గోధుమ రవ్వ – కప్పు(రాత్రంతా నానబెట్టుకోవాలి), పచ్చిశనగపప్పు – పావు కప్పు (మూడుగంటలపాటు నానబెట్టుకోవాలి), పెసరపప్పు – పావు కప్పు (దోరగా వేయించి మూడు గంటలపాటు నానబెట్టుకోవాలి), మినపప్పు – పావు కప్పు (మూడు గంటపాటు నానబెట్టుకోవాలి), అల్లం పేస్టు – టేబుల్ స్పూను, వెల్లుల్లి పేస్టు – ముప్పావు టేబుల్ స్పూను, పచ్చిమిర్చి – రెండు, బిర్యానీ ఆకు – ఒకటి, ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరుక్కోవాలి) పెరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి – అరటేబుల్ స్పూను, గరం మసాలా – టేబుల్ స్పూను, మిరియాలపొడి – టేబుల్ స్పూను, వేయించిన జీలకర్ర పొడి – పావు టేబుల్ స్పూను, యాలకులు – రెండు, లవంగాలు – రెండు, దాల్చిన చెక్క – ఒకటి, ఉప్పు – రుచికి సరిపడా, నెయ్యి – అరకప్పు, నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు, సన్నని నిమ్మచెక్కలు – రెండు మూడు, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, పుదీనా తరుగు – పావు కప్పు, వేయించిన జీడిపప్పు – టేబుల్ స్పూను. తయారీ: ►చేప ముక్కలను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు, అరటేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టులు, కారం వేసి కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి ∙నానబెట్టిన చేపల్లో ముక్కలు మునిగేన్ని నీళ్లు పోసి ఉడికించి దించేయాలి ∙ఉడికిన చేపముక్కలను ఖీమాలా రుబ్బుకోవాలి. ►పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాలను పేస్టుచేసుకోవాలి. ►కుకర్‌లో పప్పులన్నింటిని వేసి మెత్తగా ఉడికించి, రుబ్బుకోవాలి. ►ఇప్పుడు కుకర్ గిన్నెలో రాత్రంతా నానబెట్టుకున్న గోధుమరవ్వ, రబ్బుకున్న పప్పు మిశ్రమం, పెరుగు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్టు, మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్టు, ►మిరియాలపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలాలో వేసి కలుపుకోవాలి. ►ఇప్పుడు మెత్తగా చేసి పెట్టుకున్న చేపమిశ్రమాన్నివేసి రెండు కప్పుల నీళ్లు పోసి అరగంటపాటు సన్నని మంటమీద ఉడికించాలి. ►మందపాటి పాత్రను స్టమీద పెట్టుకుని నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయను సన్నగా తరిగి వేయాలి. ►ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక తీసి, ఉడికిన చేప మిశ్రమంలో వేయాలి. నిమ్మరసం, కొత్తిమీర తరుగు, నెయ్యి, నిమ్మ చెక్కల, జీడిపప్పుతో గార్నిష్ చేస్తే ఫిష్ హలీమ్ రెడీ. చదవండి👉🏾Haleem Recipe In Telugu: రంజాన్ స్పెషల్.. ఎవరైనా సింపుల్‌గా చేసుకోగలిగే మటన్ హలీమ్