Winter Season: Avoid Giving These Foods To Kids What To Eat What Not Telugu: పిల్లలకు ఈ సీజన్‌లో ఇవ్వాల్సిన ఆహారంపై కూడా దృష్టిపెట్టాలి. ఉప్పు, పులుపు, మసాలాలు, కారాలను గణనీయంగా తగ్గిస్తూ, పోషకవిలువలను సమృద్ధిగా ఉండే ఆహారం ఇవ్వాలి.
►ముఖ్యంగా పీచుపదార్థాలు అధికంగా ఉండే శాకాహారం, ఆకుకూరలు, తాజాఫలాలు, ఎండిన ఫలాలు ప్రతినిత్యం వారికి తినిపించాలి.
►నూనెలను మరిగించడం ద్వారా తయారు చేసే వంటకాలను దూరం చేయాలి.
►ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు, పిజ్జాల వంటి పదార్థాలకు బదులుగా ప్రకృతి సిద్ధమైన ఆహారాలను అలవాటు చేయడం మంచిది.
►ఉదాహరణకు కొబ్బరినీళ్లు, చెరకురసం, వెజిటబుల్ జ్యూసులు, ఖర్జూరం, పాలు, పెరుగు వంటివి. మొత్తంమీద రోజూ 3 లీటర్ల వరకు ద్రవపదార్థాలు తాగాలి.
►ప్రధానంగా నీరు, మజ్జిగ, బార్లీ మొదలైనవి.
►పిల్లలకు క్యాల్షియమ్ సమృద్ధిగా లభించాలంటే ప్రతిరోజూ ఉదయం అర చెంచా, సాయంత్రం అర చెంచా నువ్వులను నమిలి తినేలా అలవాటు చేయాలి. లేదంటే నువ్వుండలు తిన్నా మంచిదే.
►అలాగే మొలకెత్తే దినుసులను తినిపించడం అలవాటు చేయాలి.
చదవండి: Betel Leaves: తమలపాకులు నములుతున్నారా.. అయితే మీరు...
Comments
Please login to add a commentAdd a comment