dates
-
హనుమజ్జయంతి ఏటా రెండుసార్లు.. ఎందుకంటే..
నేడు(శనివారం) హనుమజ్జయంతి. దేశవ్యాప్తంగా వివిధ హనుమాన్ ఆలయాల్లో ఉత్సవశోభ నెలకొంది. భక్తులు హనుమంతుని దర్శనం కోసం బారులు తీరారు. బుద్ధిబలానికి ప్రతీకగా నిలిచిన హనుమంతునికి ఈరోజున భక్తులు విశేషంగా పూజలు చేస్తారు. హనుమజ్జయంతి(Hanuman Jayanti)ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో రెండు భిన్న తేదీలలో జరుపుకుంటారు. ఈ రెండు తేదీల వెనుక వివిధ ప్రాంతీయ సంప్రదాయాలు, పురాణ గ్రంథాలలో భిన్నమైన వివరణలు ఉన్నాయి.చైత్రంలో హనుమజ్జయంతి (మార్చి-ఏప్రిల్)హిందూ పంచాంగం ప్రకారం చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజు) హనుమజ్జయంతి జరుపుకుంటారు. ఇది సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఉత్తర భారతదేశంలో (ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాలు) ఈ తేదీన హనుమజ్జయంతి చేసుకుంటారు. ఈ రోజున భక్తులు హనుమాన్ ఆలయాలను సందర్శిస్తారు. హనుమాన్ చాలీసా(Hanuman Chalisa) పఠిస్తారు. ఉపవాసం ఉండి, వాయునందనుకి ప్రసాదాలు సమర్పిస్తారు.మార్గశిరంలో హనుమజ్జయంతి (డిసెంబర్-జనవరి)మార్గశిర మాసంలో కొందరు హనుమజ్జయంతిని చేసుకుంటారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ తేదీన జరుపుకుంటారు. దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం హనుమంతుడు మార్గశిర మాసంలో జన్మించాడని కొన్ని గ్రంథాలు పేర్కొన్నాయి. దక్షిణ భారతదేశంలో హనుమజ్జయంతి సందర్భంగా కొందరు 41 రోజుల పాటు దీక్ష చేపడతారు. ఈ దీక్ష చైత్ర పౌర్ణమి నుంచి మొదలై, మార్గశిర మాసంలోని అంజనేయ జయంతి రోజున ముగుస్తుంది. దీక్ష తీసుకున్న భక్తులు(Devotees) హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని పురాణ గ్రంథాలలో చైత్ర మాసంలో హనుమంతుని జననం జరిగిందని పేర్కొన్నారు. మరికొన్ని గ్రంథాలలో మార్గశిర మాసంతో అనుసంధానిస్తారు. ఈ భిన్నమైన వివరణల కారణంగానే హనుమజ్జయంతి ఏటా రెండు తేదీలలో జరుగుతుంది. వాల్మీకి రామాయణం తదితర గ్రంథాలలో హనుమంతుని జన్మ సమయం గురించి స్పష్టమైన ఏకీకృత వివరణ లేకపోవడంతో ప్రాంతీయంగా భిన్న విశ్వాసాలు ఏర్పడ్డాయి. హనుమజ్జయంతి జరుపుకునే తేదీలు భిన్నంగా ఉన్నప్పటికీ భక్తులు ఆరోజున హనుమంతుడిని భక్తి పూర్వకంగా ఆరాధిస్తారు.ఇది కూడా చదవండి: ‘సందీప్ 26/11 బాధితుడు కాదు.. కర్తవ్యాన్ని నెరవేర్చాడు’ -
ఖర్జూర పండులో బంగారం
-
2025లో ముఖ్యమైన పండుగలు, ఏ రోజున వచ్చాయో తెలుసా?
2024 ఏడాదికి వీడ్కోలు పలికి, కొత్త ఏడాది 2025 (New Year 2025)లోకి అడుగుపెట్టబోతున్నాము. కొత్త ఆశలు, ఆశయాలతో నూతన ఏడాదికి స్వాగతం చెప్పబోతున్నాము. మి కొత్త సంవత్సరం వస్తుందంటే ఏ పండుగలు ఏ రోజు వచ్చాయో అన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. అంతేకాదు న్యూ ఇయర్ అనగానే పిల్లలంతా తమ బర్త్‌డే ఎపుడు (వారం) వచ్చిందా అని ఆసక్తిగా వెదుక్కుంటారు. ఉద్యోగులైతే ఏ ఏ పండుగలు ఆదివారం వచ్చాయబ్బా అని తెలుసుకునేందుకు తెగ ఉవ్విళ్లూరుతారు. ఇక మహిళలు (మిగిలినవారు కూడా) పెద్ద పండుగలు, శుభఘడియలు ఎపుడు వచ్చాయో తెలుసు కునేందుకు ఉత్సాహంగా చూపుతారు. మరి 2025లో సంక్రాంతి (Sankranti, ఉగాది (Ugadi), హోలీ (holy) వినాయక చవితి, శ్రీరామ నవమి, వరలక్ష్మి వ్రతం, కృష్ణాష్టమి, దసరా (Dussera) దీపావళి (Diwali) ఎపుడు వచ్చాయో చూద్దామా?2025లో పెద్ద పండుగలు, వారం తేదీభోగి : సోమవారం (13/01/25)మకర సంక్రాంతి : మంగళవారం (14/01/25)కనుమ : బుధవారం(15/01/25)మహాశివరాత్రి: 26/02/25 (బుధవారం)హోలీ: శుక్రవారం (14/3/25)ఉగాది : ఆదివారం (30/3/25)శ్రీరామ నవమి : ఆదివారం( 6/04/25)వరలక్ష్మి వ్రతం : శుక్రవారం(8/08/25)శ్రీ కృష్ణాష్టమి : శనివారం (16/08/25)వినాయక చవితి: బుధవారం(27/08/25)దుర్గాష్టమి : మంగళవారం (30/09/25)విజయ దశమి లేదా దసరా : గురువారం(02/10/25) ఇదీ చదవండి: 2025లో ముఖ్యమైన పండుగలు, ఏ రోజున వచ్చాయో తెలుసా? దీపావళి:సోమవారం (20/10/25)క్రిస్మస్ : గురువారం (25/12/25)అలాగే 2025లో రిపబ్లిక్ డే (జనవరి 26), ఉగాది రోజులు ఆదివారం వచ్చాయి. -
Christmas 2024 : మైదాలేకుండానే మీ కిష్టమైన కేక్, రెసిపీలు
క్యాలెండర్ చివరికి వచ్చేశాం. హాయ్ చెప్పడానికి క్రిస్మస్ వస్తోంది. కేక్ మీదకు మనసుపోతుంది. బేకరీ కేక్లన్నీ మైదా కేక్‌లే. ఆరోగ్యంగా ఏమీ తినలేమా? పండగ కోసం కొంచెం కష్టపడదాం. మన వంటిల్లు క్రిస్మస్కి సిద్ధమైంది . మీరూ రెడీనా.సెమోలినా కోకోనట్ కేక్ కావలసినవి: బొంబాయి రవ్వ పావు కేజీ; కొబ్బరి తురుము – 125 గ్రాములు; చక్కెర పొడి– 150 గ్రాములు; బటర్– 125 గ్రాములు; పెరుగు– 125 గ్రాములు; పాలు – 125 ఎం.ఎల్; వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్; బేకింగ్ సౌడర్– టీ స్పూన్; బేకింగ్ సోడా– అర టీ స్పూన్; ఉప్పు – చిటికెడు; బటర్– టీ స్పూన్; బాదం పప్పు – గుప్పెడు (సన్నగా తరగాలి).షుగర్ సిరప్ కోసం: చక్కెర – 125 గ్రాములు; నీరు – 200 ఎంఎల్; దాల్చిన చెక్క – అంగుళం ముక్క; రోజ్ ఎసెన్స్ – 2 చుక్కలు.తయారీ: మొదట షుగర్ సిరప్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందుకోసం నాన్‌స్టిక్ పెనంలో చక్కెర, నీరు, దాల్చిన చెక్క, రోజ్ ఎసెన్స్ వేసి కలిపి గరిటెతో కలుపుతూ సన్న మంట మీద వేడి చేయాలి. 8 నుంచి పది నిమిషాలకు మిశ్రమం తీగపాకం వస్తుంది. అప్పుడు స్టవ్ మీద నుంచి దించేయాలి ∙కేక్ ట్రేకి టీ స్పూన్ బటర్ రాయాలి. తర్వాత దళసరి కాగితాన్ని పరిచి సిద్ధంగా ఉంచుకోవాలి ∙ఒవెన్‌ని హీట్ చేయాలి ∙కేక్ తయారీ కోసం తీసుకున్న పదార్థాలలో బాదం పలుకులు మినహా మిలిగిన అన్నింటినీ ఒక పాత్రలో వేసి బీటర్‌తో బాగా చిలకాలి. నురగ వచ్చే వరకు చిలికిన తరవాత మిశ్రమాన్ని ట్రేలో పోసి ఒవెన్‌లో పెట్టి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో 40 నిమిషాల సేపు ఉంచాలి.∙ఒవెన్‌లో నుంచి కేక్‌ను బయటకు తీసిన తరవాత ముందుగా కలిపి పెట్టిన షుగర్ సిరప్‌ని కేక్ అంతటికీ సమంగా పట్టేలాగ పోసి (దాల్చిన చెక్కను తీసేయాలి), బాదం పలుకులను కూడా చల్లి ట్రేని కదిలించకుండా పక్కన ఉంచాలి. కేక్ చల్లారేటప్పటికి షుగర్ సిరప్ చక్కగా పడుతుంది. చల్లారిన తర్వాత చాకు సహాయంతో కేక్‌ను ఒక ప్లేట్లోకి తీసుకుని ముక్కలుగా కట్ చేయాలి.కావలసినవి: మెత్తటి ఖర్జూరాలు– 300 గ్రాములు; వాల్నట్ –30 గ్రాములు; పిస్తా– 40 గ్రాములు (రోస్టెడ్, సాల్టెడ్ పిస్తా); నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పు– 30 గ్రాములు (సన్నగా తరగాలి); యాలకుల ΄ పొడి– పావు టీ స్పూన్; గసగసాలు – టేబుల్ స్పూన్.ఖజూర్ బర్ఫీ తయారీ: ∙ఖర్జూరాల నుంచి గింజలు తొలగించాలి. వాల్నట్స్ని సన్నగా తరగాలి. పిస్తాను కూడా తరగాలి ∙ఖర్జూరాలను మిక్సీ బ్లెండర్లో వేసి గుజ్జుగా చేయాలి ∙పెనం వేడి చేసి అందులో నెయ్యి, బాదం, వాల్నట్, పిస్తా పలుకులు వేసి సన్న మంట మీద గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించాలి. వేగిన గింజలను ఒక ప్లేట్లోకి తీసుకుని అదే పెనంలో మిగిలిన నెయ్యిలో యాలకుల పొడి, ఖర్జూరం పేస్ట్ వేసి కలుపుతూ వేయించాలి. ఖర్జూరం పేస్ట్ మృదువుగా మారిన తరవాత అందులో ముందుగా వేయించి పక్కన పెట్టిన గింజలను వేసి కలిపి దించేయాలి ఒక దళసరి పేపర్ మీద ఖర్జూర మిశ్రమాన్ని వేసి సమంగా పరిచి పైన గసగసాలను పలుచగా చల్లి పేపర్‌ను రోల్ చేసి మనకు కావల్సిన సైజ్‌లో కట్ చేసుకుంటే ఖజూర్ బర్ఫీ రెడీ. ఇవి మూడు వారాల వరకు నిల్వ ఉంటాయి. వీటిని వేడి తగ్గిన తర్వాత తినవచ్చు, చల్లగా తినాలంటే అరగంట సేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. -
Diwali 2024 దివాలీకి ఈ స్వీట్లు చేసిపెడితే : దిల్ ఖుష్!
దీపాల పండుగ దీపావళి (Diwali 2024) కోసం ఉత్సాహంగా జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా పిల్లా పాపా అంతా ఎదురు చూస్తున్నారు. దీపావళి దీప కాంతులు, బాణాసంచా వెలుగులతో పాటు, స్వీట్ల సందడి కూడా ఉంటుంది.మరి ఈ క్రమంలో టేస్టీగా, ఈజీగా, హెల్దీగా చేసుకునే రెండు హల్వాల గురించి తెలుసుకుందాం. ఒకటి మూంగ్ హల్వా, రెండు క్యారెట్–ఖర్జూరం హల్వా. మరి వీటికి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇదిగో..ఇలా..!మూంగ్ హల్వాకావల్సిన పదార్థాలునెయ్యి – రెండు టేబుల్ స్పూన్లుచాయ పెసరపప్పు – అరకప్పు (కడిగిపెట్టుకోవాలి)నీళ్లు – రెండు కప్పులునెయ్యి – అరకప్పుగోధుమ పిండి – రెండు టేబుల్ స్పూన్లుపంచదార – ముప్పావు కప్పుఫుడ్ కలర్ – చిటికెడుయాలకుల పొడి – పావు టీస్పూనుజీడిపలుకులు – రెండు టేబుల్ స్పూన్లుకిస్మిస్లు – రెండు టేబుల్ స్పూన్లుతయారీ స్టవ్ మీద ప్రెజర్ కుకర్ పెట్టి వేడెక్కిన తరువాత టీస్పూను నెయ్యి వేసి పెసరపప్పును దోరగా వేయించాలి.తరువాత రెండు కప్పుల నీళ్లుపోయాలి, కుకర్ మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.పప్పు చల్లారాక మిక్సీజార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ∙స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని పావుకప్పు నెయ్యి, గోధుమ పిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ వేయించాలి.పిండి వేగిన తరువాత పప్పు మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉడికించాలి.ఐదు నిమిషాల తరువాత ముప్పావు కప్పు పంచదార వేసి సన్నని మంట మీద పదిహేను నిమిషాల పాటు తిప్పుతూ ఉడికించాలి.ఇప్పుడు పప్పు మిశ్రమం బాగా ఉడికి బాణలికి అంటుకోకుండా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో ఫుడ్ కలర్ వేసి మరో ఇరవై నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. స్టవ్‌మీద మరో పాన్ పెట్టి టేబుల్ స్పూను నెయ్యి, జీడిపలుకులు, కిస్మిస్లు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంతవరకు వేయించి హల్వాలో వేయాలి. యాలకులపొడి వేసి రెండు నిమిషాలు తిప్పితే మూంగ్ హల్వా రెడీ. క్యారెట్–ఖర్జూరం హల్వా కావల్సిన పదార్థాలు ఖర్జూరం – పావు కప్పు (గింజలు తీసి, కడిగి, కొన్ని మంచి నీళ్లలో కొంత సేపు నానబెట్టి తీసి, ఉడికించి, మిక్సీ పట్టుకోవాలి)క్యారెట్ తురుము– 1 కప్పు, కొబ్బరి పాలు– 2 కప్పులుకొబ్బరి కోరు, కస్టర్డ్ మిల్క్– పావు కప్పు చొప్పున, నెయ్యి,పంచదార– పావు కప్పు చొప్పున (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు), కుంకుమ పువ్వు – చిటికెడు, వెనీలా ఎసెన్స్– 1 టీ స్పూన్కిస్మిస్ గుజ్జు– 1 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు– కొన్ని (నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి)తయారీముందుగా ఖర్జూరం గుజ్జు, కొబ్బరి పాలు, పంచదార, ఏలకుల పొడి వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ బౌల్లో నెయ్యి వేడి చేసుకుని.. అందులో ఖర్జూరం మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద, గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి.కాస్త దగ్గర పడుతున్నప్పుడు క్యారెట్ తురుము, కస్టర్డ్ మిల్క్, ఫుడ్ కలర్ వేసుకుని తిప్పుతూ ఉండాలి.ఆ తర్వాత కిస్మిస్ గుజ్జు, కొబ్బరి కోరు, వెనీలా ఎసెన్స్ ఒకదాని తరవాత ఒకటి వేసుకోవాలి.ఆ మిశ్రమం మరింత దగ్గర పడగానే, డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపి, సర్వ్ చేసుకోవాలి. -
దీపావళి.. ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవు?
న్యూఢిల్లీ: ప్రతి సంవత్సరం దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ చీకటి నుండి వెలుగులోకి మారే పయనాన్ని సూచిస్తుంది. దీపావళి సందర్భంగా, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవులు ప్రకటించారు. అయితే ఈసారి దీపావళిని అక్టోబర్ 31న లేక నవంబర్ 1 న జరుపుకోవాలా అనే గందరగోళం చాలామందిలో నెలకొంది. మరి.. ఈసారి దీపావళికి ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవు ప్రకటించారో తెలుసుకుందాం.యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో దీపావళికి అక్టోబర్ 31 న సెలవు ఇచ్చారు. నవంబర్ 2 న గోవర్ధన పూజకు సెలవు ఉంటుంది. నవంబర్ 3 న భాయ్ దూజ్ పండుగను జరుపుకుంటారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో ఈ రోజుల్లో మాత్రమే సెలవు దినంగా ప్రకటించారు. అయితే నవంబర్ ఒకటి గురించి స్పష్టంగా తెలియజేయలేదు. మహారాష్ట్రలో సాధారణంగా దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, 2 తేదీలలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు దీపావళి సెలవు ప్రకటించారు. దీపావళికి ముందు, తరువాత పాఠశాలలకు ఏడు నుండి 10 రోజుల వరకూ సెలవులు ఉండవచ్చు. నవంబర్ 1న ఢిల్లీలో దీపావళి సెలవు ఉంటుంది. అయితే కుటుంబ సమేతంగా ఈ పండుగను జరుపుకునేందుకు వీలుగా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకు పాఠశాలకు సెలవు ప్రకటించారు.తమిళనాడులో ఈసారి దీపావళి అక్టోబర్ 31, నవంబర్ ఒకటి తేదీల్లో రెండు రోజుల సెలవు ప్రకటించారు. గుజరాత్లో దీపావళితో పాటు నూతన సంవత్సరాన్ని కూడా జరుపుకుంటారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు దీపావళి సందర్భంగా ఇక్కడ మూడు రోజుల సెలవు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో కాళీ పూజ, దీపావళిని కలిసి జరుపుకుంటారు. నవంబర్ 1, 2 తేదీలలో ఇక్కడ దీపావళి సెలవు ఉంటుంది. కాళీ పూజ సందర్భంగా అక్టోబర్ 31న కూడా సెలవు ప్రకటించారు.దీపావళి సందర్భంగా మధ్యప్రదేశ్‌లో రెండు రోజులు సెలవులు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు నవంబర్ 1, 2 తేదీలలో మూసివేయనున్నారు. బీహార్‌లో ఈసారి దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, నవంబర్ 2 న ఇక్కడ సెలవు ఉంటుంది. దీనితో పాటు ఛత్ పూజకు సెలవులను కూడా పొడిగించవచ్చు. రాజస్థాన్‌లో ఈ ఏడాది దీపావళికి మూడు రోజుల సెలవులు ఉంటాయి. అక్టోబర్ 31 నుండి నవంబర్ 2 వరకు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయనున్నారు.కర్ణాటకలో దీపావళికి రెండు రోజులు సెలవులు ఉంటాయి. నవంబర్ 1, 2 తేదీలలో ప్రజలు ఈ పండుగను సాంప్రదాయ రీతిలో జరుపుకుంటారు. కేరళలో దీపావళికి నవంబర్ 1న సెలవు ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, ఒడిశా తదితర రాష్ట్రాల్లో దీపావళి సందర్భంగా రెండు రోజులు సెలవులు ప్రకటించారు.ఇది కూడా చదవండి: బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కిషన్‌రెడ్డి? -
ఖర్జూరం తింటే మలబద్దకం వస్తుందా..?
ఖర్జూరం ఆరోగ్యానికి మంచిదని అందరికి తెలుసు. దీనిలో అనేక విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అలాంటి ఖర్జూరం తీసుకుంటే మలబద్దకం వస్తుందా?. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదించే అవకాశం ఉందా?. అంటే ఔననే చెబుతున్నారు నిపుణులు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలందించే ఖర్జూరంతో కూడా సమస్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. రీజన్ ఏంటో సవివరంగా చూద్దామా..!.మలబద్ధకం అనేది సాధారణ సమ్య. దీనిని సరైన ఆహారం, జీవనశైలితో సర్దుబాటు చేయవచ్చు. సహజ చక్కెరలకు, ఖనిజాలకు అద్భుతమైన ఈ ఖర్జూరం మలబద్ధకాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. దీనిలో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. అందువల్ల దీన్ని అతిగా తీసుకుంటే జీవక్రియ నెమ్మదించి..మలబద్దకం ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువగా తీసుకోవడం మొదలుపెడితే జీర్ణం కావడం కష్టమవుతుంది. శరీరం లోపల అగ్నిని తగ్గిస్తుంది. ఖర్జూరాల్లో తీపి కారణంగా శరీరానికి చలువ చేస్తాయి. అందువల్ల ఎక్కువ తీసుకుంటే జీర్ణం కావడం కష్టమవుతుంది. సరైన మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అలాకాకుండా వాటిమీద మక్కువకొద్ది లాగిస్తే సమస్యలు తప్పవని చెబుతున్నారు నిఫుణలు.ఎలా తీసుకుంటే బెటర్..నానాబెట్టిన ఖర్జూరాలు బరువు తగ్గించేందుకు, జీర్ణక్రియకు మంచిది. ఖర్జూరాలు తినే ముందు ఎండు అల్లం పొడిన జోడించండి. పొడి అల్లం లేదా సాంత్ ఆహారాన్ని వేడి చేయడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహిస్తుంది. అంతేగాదు ఖర్జూరం, ఎండుద్రాక్ష, అత్తిపండ్లతో కూడిన 'ఖజురాధి మంథా'ని తయారు చేయడానికి ఒక కూలింగ్ డ్రింక్ సిద్ధం చేయండి. ఈ రిఫ్రెష్ డ్రింక్ జీర్ణ సమస్యలను నివారించి, హైడ్రేట్‌గా ఉంటుంది. మంచి ప్రయోజనాలను పొందాలంటే రోజుకు మూడు ఖర్జూరాలను స్నాక్‌గా తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు, ఆరోగ్యానికి కూడా మంచిందని చెబుతున్నారు. (చదవండి: నాజూగ్గా ఉండాలనుకుంటే..మొరింగనీటిని ట్రై చేయండి..!) -
ఒకసారి నాటితే 80 ఏళ్ల వరకు దిగుబడి..
-
ఖర్జూరతో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా!
నిగనిగ మెరిసిపోతూ.. ఖర్జూరాలు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. రుచికి కూడా బాగుంటాయి. అందుకే అందరూ వీటిని అందరూ ఇష్టపడతారు. ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో వీటిని ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. రోజూ కొద్ది మొత్తంలో ఖర్జూరం పండ్లు తింటే.. ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం..ఖర్జూరాల వల్ల కలిగే ప్రయోజనాలను పొందాలంటే... కనీసం ఒక వారం లేదా పదిరోజులపాటు క్రమం తప్పకుండా నాలుగయిదు తినాలి. డయాబెటిస్ ఉన్న వారు మాత్రం వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి.గుండెకు బలం..ఖర్జూరాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ధమని కణాల నుంచి కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఖర్జూరం తినటం వల్ల చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెపోటు, హైపర్‌టెన్షన్ , స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఖర్జూలంలో ΄÷టాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది హార్ట్ బీట్, బీపీని నార్మల్‌గా ఉంచుతుంది.కండరాలు బలంగా ఉంటాయి..ఖర్జూరంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. ఖర్జూరంలో ఉండే. ΄÷టాషియం, ఫాస్ఫరస్, సెలీనియం, కాపర్, మాంగనీస్ వంటివి ఎముకలు గుల్లబారటం, కీళ్లు అరగటం వంటి ఎముకల సమస్యలు రాకుండా రక్షిస్తాయి.సంతానోత్పత్తి సామర్థ్యం..మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెంచడానికి ఖర్జూరాలు సహాయపడతాయి. ఖర్జూరం తింటే స్పెర్మ్ నాణ్యత పెరుగుతుంది.మెరుగైన జ్ఞాపకశక్తి..ఖర్జూరాల్లో ఉండే విటమిన్ ‘బి6’ వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మెదడును ఒత్తిడి, వాపు నుంచి రక్షించవచ్చు. ఖర్జూరాలను రోజూ తింటే.. నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే.. న్యూరో డీ జెనరేటివ్ వ్యాధి నుంచి దూరంగా ఉండొచ్చు. ఖర్జూరం తింటే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఖర్జూరంలో ఉండే ఫైబర్ కడుపులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకుంటాయి. పెద్దపేగు, ప్రోస్టేట్, రొమ్ము, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తులు, క్లోమ క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది.జీర్ణ సమస్యలు దూరం..ఖర్జూరంలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణకోశ వ్యవస్థ సక్రమంగా పనిచేసి, మలబద్ధకం దరి చేరదు.ఇవి చదవండి: కండరాలు పట్టేస్తున్నాయా? అయితే ఇలా చేయండి! -
‘ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు మార్చాలి’
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (ECI) 18వ లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. అయితే కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల తేదీలను మార్చాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) డిమాండ్ చేస్తోంది. ఈమేరకు ఎలక్షన్ కమిషన్‌ను ఆశ్రయించనున్నట్లు తెలిపింది. కారణం ఇదే.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. తమిళనాడులో ఏప్రిల్ 19న, కేరళలో ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు తేదీలు శుక్రవారం వస్తాయి. దీంతో ఎన్నికల తేదీలను మార్చాలని ఐయూఎంఎల్ డిమాండ్ చేస్తోంది. శుక్రవారం ముస్లింలకు ముఖ్యమైన రోజు కాబట్టి ఓటర్లు, అధికారులు, అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను మార్చాలని ఈసీఐని ఆశ్రయించనున్నట్లు యూడీఎఫ్‌లోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మిత్రపక్షమైన ఐయూఎంఎల్ తెలిపింది. ఐయూఎంఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీఎంఏ సలామ్ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ప్రార్థనల కోసం మసీదులలో గుమిగూడే ముస్లింలకు శుక్రవారం ముఖ్యమైన రోజు అన్నారు. “శుక్రవారం పోలింగ్ నిర్వహణ ఓటర్లు, అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు, ఎన్నికల విధులు కేటాయించిన అధికారులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అందుకే ఈసీఐని ఆశ్రయిస్తాం” అని సలామ్ పేర్కొన్నారు. ఐయూఎంఎల్‌తోపాటు ఇతర ముస్లిం సంస్థలు కూడా ఎన్నికల తేదీల మార్పు కోసం ఎలక్షన్ కమిషన్‌ను ఆశ్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
రంజాన్ నెలలో ఖర్జూరం ఎందుకు తింటారు? ఏ దేశంలో ఉత్పత్తి అధికం?
ప్రపంచవ్యాప్తంగా ఖర్జూరాన్ని ఇష్టంగా తినేవారి సంఖ్య అధికంగానే ఉంది. రంజాన్ మాసంలో ఖర్జూరానికి డిమాండ్ మరింత పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. ఇది మన శరీరానికి శక్తిని అందిస్తుంది. ఉపవాసం ఉండేవారికి తగిన బలాన్ని అందిస్తుంది. ఖర్జూరం తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండేవారు ఖర్జూరంతో ఉపవాసాన్ని విరమించడానికి ఇదే ప్రధాన కారణం. అయితే మన తినే ఖర్జూరాలు ఏ దేశం నుండి వచ్చాయనేది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అలాగే ఏ దేశం అత్యధికంగా ఖర్జూరాన్ని ఉత్పత్తి చేస్తుందనేది కూడా చాలామందికి తెలియదు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముస్లిం దేశాలు అత్యధికంగా ఖర్జూరాన్ని ఉత్పత్తి చేస్తాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ఖర్జూరాన్ని ఉత్పత్తి చేసే దేశం ఈజిప్ట్. ఈ దేశంలో ఏడాదికి దాదాపు 1,733,432 టన్నుల ఖర్జూరాన్ని ఉత్పత్తి చేస్తారు. ఖర్జూరం ఉత్పత్తిలో సౌదీ అరేబియా రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏడాదికి 1,610,731 టన్నుల ఖర్జూరం ఉత్పత్తి అవుతుంది. ఏడాదిలో 1,247,403 టన్నుల ఖర్జూరాలు పండే అల్జీరియా ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. నాల్గవ స్థానంలో ఇరాన్ ఉండగా, ఇక్కడ ఒక సంవత్సరానికి 1,030,459 టన్నుల ఖర్జూరం ఉత్పత్తి అవుతుంది. ఈ జాబితాలో పాకిస్తాన్ ఐదవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏడాదికి 7,32,935 టన్నుల ఖర్జూరం పండుతుంది. ఈ దేశాల నుంచి విదేశాలకు ఖర్జూరాలు ఎగుమతి అవుతాయి. -
బీట్రూట్ ఖర్జూరం హల్వా మీకోసమే..
కావలసినవి: బీట్రూట్ రసం – 1 కప్పు, ఖర్జూరం – 10 (వేడి నీళ్లల్లో కడిగి.. కాసేపు నానబెట్టి, గుజ్జులా చేసుకోవాలి) పంచదార – పావు కప్పుపైనే (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు) నెయ్యి – పావు కప్పు, ఏలకులు – 2 జీడిపప్పు – 15 పైనే ఫుడ్ కలర్ – కొద్దిగా (బీట్రూట్ కలర్) తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. మంట చిన్నగా పెట్టుకోవాలి. కళాయి వేడికాగానే.. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని.. అందులో జీడిపప్పు దోరగా వేయించుకుని, పక్కన పెట్టుకోవాలి. అనంతరం కళాయిలో ఇంకాస్త నెయ్యి వేసి.. ఖర్జూరం గుజ్జు వేసుకుని తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ బాగా కలపాలి. తర్వాత సరిపడా పంచదార, బీట్రూట్ రసం, ఫుడ్ కలర్ వేసుకుని చిన్నగా గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి. మళ్లీ కొద్దిగా నెయ్యి వేసుకుని.. తిప్పాలి. ఏలకులు, జీడిపప్పు వేసుకుని కలపాలి. మిగిలిన నెయ్యి మొత్తం వేసుకుని.. తిప్పుతూ దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లోపలంతా నెయ్యి రాసి.. ఆ మొత్తం మిశ్రమాన్ని.. దానిలోకి తీసుకోవాలి. కాస్త చల్లారాక నచ్చిన షేప్‌లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి చదవండి: మీరెప్పుడైనా బొప్పాయి బన్స్ ట్రై చేసారా..! -
తెలంగాణసహా 5 రాష్ట్రాల ఎన్నికల తేదీలు ఇవే
ఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల సంఘం మీడియా సమావేశమైంది. ఏ రాష్ట్రంలో ఎప్పుడంటే..? తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్, రాజస్థాన్‌లో నవంబర్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 7న మొదటి విడత, నవంబర్ 17న రెండో విడతలో పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న పోలింగ్ జరగగా.. మిజోరాంలో నవంబర్ 7న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఐదు రాష్ట్రాలకు డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది. రాష్ట్రం పోలింగ్ కౌంటింగ్ సీట్లు తెలంగాణ నవంబర్ 30 డిసెంబర్ 3 119 రాజస్థాన్ నవంబర్ 23 డిసెంబర్ 3 200 మధ్యప్రదేశ్ నవంబర్ 17 డిసెంబర్ 3 230 మిజోరం నవంబర్ 7 డిసెంబర్ 3 40 ఛత్తీస్‌గఢ్ నవంబర్ 7, నవంబర్ 17 డిసెంబర్ 3 90 ఐదు రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 5 States Assembly polls | Chhattisgarh to vote on 7th Nov & 17th Nov; Madhya Pradesh on 17th Nov; Mizoram on 7th Nov, Rajasthan on 23rd Nov and Telangana on 30th Nov; Results on 3rd December pic.twitter.com/jV7TJJ9W4A — ANI (@ANI) October 9, 2023 5 రాష్ట్రాల్లో 679 నియాజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 40 రోజుల పాటు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి వివిధ రాజకీయ పార్టీలతో చర్చించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 5 రాష్ట్రాల్లో 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కొత్తగా 60 లక్షల మంది ఓటర్లు చేరారు. 1.77 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తెలంగాణలో 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎలక్షన్ కమిషనర్ స్పష్టం చేశారు. ప్రతీ 879 మందికి ఒక పోలీంగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. Total voters in Mizoram are 8.52 lakh, 2.03 crore in Chhattisgarh, 5.6 cr in Madhya Pradesh, 5.25 crore in Rajasthan and 3.17 crore in Telangana: Chief Election Commissioner Rajiv Kumar pic.twitter.com/Q1ChyPQudf — ANI (@ANI) October 9, 2023 తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ్, మిజోరాంలో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలైన విషయం తెలిసిందే. మిజోరాంలో 8.52 లక్షల మంది ఓటర్లు, ఛత్తీస్‌గఢ్‌లో 2.03 కోట్ల మంది ఓటర్లు, మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్ల ఓటర్లు, రాజస్థాన్‌లో 5.25 కోట్లు, తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. There are 679 ACs in 5 states which is around 1/6th of total LACs in the country and have 16 cr electors which is almost 1/6th of total electors in the country#ECI #AssemblyElections2023 pic.twitter.com/uxN95tUs9u — Election Commission of India #SVEEP (@ECISVEEP) October 9, 2023 ఇదీ చదవండి: నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ ప్రెస్‌మీట్.. షెడ్యూల్ విడుదల.. ‘సాక్షి’ తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్ ఫాలో అవ్వండి -
వ్యవసాయం కొందరికి బతుకుదెరువైతే కొందరికి ప్యాషన్
-
ఉదయాన్నే పరగడుపున ఖర్జూరాలు తింటున్నారా?దీనిలోని బి6..
తియ్యగా తగ్గించుకోండి పంచదారకు బదులు అనేక స్వీట్ల తయారీలో కర్జూరాలను వాడుతుంటాము. స్వీట్‌గా ఉండే ఈ ఖర్జూరాల్లో అనేక ఆరోగ్య సుగుణాలు ఉన్నాయి. డేట్స్ తింటూ పొట్ట తగ్గించుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం... ►బరువు తగ్గాలంటే ఉదయాన్నే పరగడుపున ఖర్జూరాలు తినాలి. ఉదయాన్నే క్యాలరీలు ఎక్కువగా ఉండే ఖర్జూరాలు తింటే రోజంతా ఆకలి లేకుండా యాక్టివ్‌గా ఉంటారు. రాత్రి సమయాల్లో ఖర్జూరాలు తినకూడదు. ఇవి అంత సులభంగా అరగవు. పరగడుపున ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి పోషకాలు చక్కగా అందుతాయి. దీనిలోని ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయులను పెంచుతాయి. ►ఉదయాన్నే డేట్స్ తినడం వల్ల జీవక్రియలు సక్రమంగా జరిగి అధిక మొత్తంలో క్యాలరీలు ఖర్చవుతాయి. డేట్స్‌ను ఓట్స్‌తో కలిపి స్మూతీ, షేక్స్ చేసుకుని తాగితే కడుపు నిండుగా ఉండి ఆకలి వేయదు. ఫలితంగా ఇతర పదార్థాలు ఏమి తినలేం. ఫలితంగా తక్కువ క్యాలరీలతో శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. ► ఖర్జూరాలలో విటమిన్ బి6 ఉంటుంది. ఇది శరీరంలో సెరొటోనిన్, నోర్పైన్ఫ్రైన్ అనే హ్యాపీ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. దీంతో డిప్రెషన్, ఒత్తిడి, ఇతర మానసిక సమస్యలు తగ్గుతాయి. నిత్యం ఖర్జూరాలను తినడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. ఖర్జూరాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఖర్జూరాలు అంటే చాలా మంది ఇష్టమే ఉంటుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఖర్జూరాలను రోజుకు 3 చొప్పున తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి ►ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. కెరోటినాయిడ్స్ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. ►అదే విధంగా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ► ఫ్లావనాయిడ్స్ లోని యాంటి ఇన్‌ఫ్లామేటరీ గుణాలు మధుమేహం, కాన్సర్ ముప్పును తగ్గిస్తాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ► ఇందులోని ఫినోలిక్ ఆసిడ్ సైతం గుండె సంబంధిత వ్యాధులను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ► ఖర్జూరాల్లో కాపర్, సెలీనియం, మెగ్నీషియం ఎక్కువ. ఎముకలను బలంగా ఉంచడంలో తోడ్పడతాయి. ► ఖర్జూరాల్లోని కోలిన్, విటమిన్ బి జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో తోడ్పడతాయి. అల్జీమర్స్ తగ్గిస్తాయి. కాబట్టి వీటిని తరచుగా తినడం మేలు. ►ఖర్జూరాలు నిద్రలేమిని దూరం చేస్తాయి. ► మహిళల్లో హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉన్నవాళ్లు ఖర్జూరాలు తింటే మంచిది. ►గర్భిణీలకు ఖర్జూరం తినిపిస్తే మంచిదని చెబుతుంటారు పెద్దలు. గర్భిణులు వీటిని తినడం వల్ల ఇందులోని ఫైబర్ కారణంగా పైల్స్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. బ్యూటీ టిప్స్ టేబుల్ స్పూను పటిక పొడిలో తగినంత రోజ్ వాటర్‌ను వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి, మెడకు రాసుకుని మర్దన చేయాలి. పదిహేను నిమిషాలపాటు మర్దన చేసిన తరువాత నీటితో కడిగేయాలి. ముఖాన్ని తడిలేకుండా శుభ్రంగా తుడిచి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. -
'గ్లోబల్ ఇండియాఏఐ' తొలి సదస్సు ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ)కి ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా తొలిసారి ’గ్లోబల్ ఇండియాఏఐ 2023’ సదస్సును నిర్వహించడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మెయిటీ) కసరత్తు చేస్తోంది. అక్టోబర్ 14, 15 తేదీల్లో దీన్ని నిర్వహించాలని ప్రాథమికంగా ప్రణాళికలు ఉన్నట్లు మెయిటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ పరిశ్రమ వర్గాలు, పరిశోధకులు, అంకుర సంస్థలు, ఇన్వెస్టర్లు ఇందులో పాల్గొంటారని వివరించారు. ఏటా తప్పనిసరిగా పాల్గొనాల్సిన ముఖ్యమైన కార్యక్రమంగా అంతర్జాతీయ ఏఐ పరిశ్రమ భావించేలా .. దీన్ని తీర్చిదిద్దే యోచనలో ఉన్నట్లు మంత్రి వివరించారు. కేంద్రం నిర్వహించిన సెమీకాన్ ఇండియా రెండు ఎడిషన్లతో భారత్‌కు అంతర్జాతీయ సెమీకాన్ మ్యాప్‌లో పటిష్టమైన చోటు దక్కిందని ఆయన చెప్పారు. సెమీకండక్టర్ల రంగంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇవి ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. అదే విధంగా, గ్లోబల్ ఇండియాఏఐ కూడా భారత ఏఐ వ్యవస్థకు గణనీయమైన తోడ్పాటు అందించగలదని చంద్రశేఖర్ తెలిపారు. -
కీలక పరీక్షలకు ఖరారు కాని తేదీలు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ అర్హత పరీక్షలపై అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఒకవైపు ఎన్నికల సమయం ముంచుకొస్తున్నప్పటికీ పలు రకాల కొలువులకు అర్హత పరీక్షల తేదీలను ఖరారు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ద్వారా విడుదలైన నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ పూర్తయి నెలలు గడుస్తున్నా పరీక్ష తేదీలు ఖరారు చేయకపోవడంతో ఆశావహులంతా అయోమయంలో ఉన్నారు. టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో పలు పరీక్షలు రద్దయ్యాయి. దీంతో రద్దయిన పరీక్షల నిర్వహణ వాయిదాపడుతూ వస్తోంది. ఈ క్రమంలో ప్రకటించిన తేదీల్లో మార్పులు అనివార్యం కావడంతో... మరిన్ని పరీక్షల తేదీలు ఇప్పటికీ ఖరారు కాలేదు. ఫలితంగా ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న 10 లక్షలకుపైగా అభ్యర్థులు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారా అని ఎదురుచూస్తున్నారు. రద్దు, వాయిదాలతో గందరగోళం ప్రశ్నపత్రాల లీకేజీతో టీఎస్పీఎస్సీ నాలుగు పరీక్షలను రద్దు చేసింది. మరో రెండు పరీక్షలను చివరి నిమిషంలో వాయిదా వేసి, కొన్నింటిని రీషెడ్యూల్ చేసింది. దీంతో అభ్యర్థులంతా తీవ్ర అయోమయంలో ఉండిపోయారు. ఈ క్రమంలో ముందుగా రద్దయిన పరీక్షలను నిర్వహిస్తూ... ఆ తర్వాత రీషెడ్యూల్ చేసిన పరీక్షలను టీఎస్పీఎస్సీ క్రమంగా నిర్వహిస్తూ వచ్చింది. అయినా రద్దయిన డీఏఓ (డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్) పరీక్ష రీషెడ్యూల్ తేదీని ఖరారు చేయలేదు. దీంతోపాటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (హెచ్‌డబ్ల్యూఓ), గ్రూప్–3 పరీక్షల తేదీలనూ కమిషన్ ప్రకటించలేదు. ఎన్నికల షెడ్యూల్‌లోపు నిర్వహిస్తేనే... సాధారణంగా పరీక్ష తేదీ ప్రకటనకు కనీసం నెలన్నర సమయం తీసుకుంటున్న కమిషన్... డీఏఓ, గ్రూప్–3, హెచ్‌డబ్ల్యూఓ ఉద్యోగ అర్హత పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తుందోనని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పరీక్షలకు సన్నద్ధమైన అభ్యర్థులు ఏ క్షణంలో అయినా హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. గత ఎన్నికలు జరిగిన తీరును పరిశీలిస్తే ఈసారి డిసెంబర్ మొదటివారం నాటికి ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ లెక్కన నవంబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆలోపు పరీక్షలు నిర్వహించాలని, ఎన్నికల సమయంలో అధికారులంతా ఎలక్షన్ డ్యూటీలతో బిజీగా ఉంటే పరీక్షల నిర్వహణ కష్టమనే అభిప్రాయం వస్తోంది. దీంతో ఎన్నికల షెడ్యూల్‌లోపే పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నారు. -
ఇలా చేస్తే క్యారట్స్ను పిల్లలు ఇష్టంగా తింటారు..
క్యారట్ డేట్స్ స్వీట్ తయారికి కావల్సినవి: క్యారట్ తురుము – పావు కప్పు ; విత్తనాలు తీసేసిన డేట్స్ – పావు కప్పు; బెల్లం – పావు కప్పు; శనగపిండి – అరకప్పు; బ్రౌన్‌సుగర్ – కప్పు; నెయ్యి – అరకప్పు; నూనె- పావు కప్పు. తయారీ విధానమిలా.. శనగపిండిని జల్లెడ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ∙టేబుల్ స్పూను నెయ్యి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి మందపాటి బాణలిలో మిగిలిన నెయ్యి, నూనె వేసి ఐదు నిమిషాలు వేడి చేసి పక్కనపెట్టుకోవాలి. బెల్లంలో పావు కప్పు నీళ్లుపోసి మరిగించాలి. బెల్లం కరిగిన తరువాత వడగట్టి పక్కన పెట్టాలి ∙ క్యారట్,డేట్స్, బెల్లం నీళ్లుపోసి మెత్తగా గ్రైండ్ చేయాలి .గ్రైండ్ చేసి ప్యూరీని ముక్కలు లేకుండా వడగట్టి తీసుకోవాలి. బాణలిలో బ్రౌన్ సుగర్, అరకప్పు నీళ్లుపోసి మరిగించాలి ∙షుగర్ కరిగిన తరువాత క్యారట్ డేట్స్ ప్యూరిని వేసి సన్ననని మంట మీద తిప్పుతూ ఉండాలి . తీగ పాకం వచ్చాక శనగపిండి వేసి ఉండలు లేకుండా కలపాలి.ఇప్పుడు కాచి పెట్టుకున్న నెయ్యి /నూనెను కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి నెయ్యి మొత్తాన్ని మిశ్రమం పీల్చుకుని దగ్గరపడిన తరువాత దించి నెయ్యిరాసిన ప్లేటులో పోసుకోవాలి మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు ముక్కలు కట్ చేసుకుంటే క్యారట్, డేట్స్ పాక్ రెడీ. ఇలా చేస్తే పిల్లలు క్యారట్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. -
ప్రయోగాత్మకంగా ఖర్జూర సాగు
-
అద్దంకి పొలం-ఖర్జూర ‘ఫలం’.. 40 ఏళ్లు దిగుబడి, ఎకరాకు 4 లక్షల ఖర్చు
పోషకాలు మెండుగా ఉండి చూడగానే నోరూరించే ఖర్జూరం అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. ఎడారి పంట అయిన ఈ ఖర్జూరాన్ని మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. మనదేశంలో రాజస్థాన్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఖర్జూరం సాగుచేస్తున్నప్పటికీ మనం వినియోగించే ఖర్జూరంలో మెజారిటీ వాటా దిగుమతులే. దుబాయ్, సౌదీ, ఒమన్, ఖతర్, బహ్రెయిన్ వంటి దేశాలనుంచి భారత్ ఖర్జూరం దిగుమతి చేసుకుంటుంది. అయితే ఖర్జూరం పంటలో లాభ దాయకతను గుర్తించిన దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు ఇప్పుడిప్పుడే దీని సాగుపై మక్కువ చూపిస్తుండటంతో సాగు విస్తీర్ణం క్రమేపీ పెరుగుతోంది. మన రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో వాణిజ్య ప్రాతిపదికన ప్రారంభమైన ఖర్జూరం సాగు ప్రస్తుతం బాపట్ల జిల్లాకు విస్తరించింది. అద్దంకి: బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి, బల్లికురవ, కొరిశపాడు మండలాల్లో సుమారు 6.8 ఎకరాల్లో రైతులు ఖర్జూరం పంట సాగు చేస్తున్నారు. అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలో ఉప్పుటూరి చిరంజీవి అనే రైతు 2.5 ఎకరాల్లో నాణ్యమైన బర్హీరకం సాగుచేస్తున్నాడు. దుబాయ్ నుంచి మొక్కలు తెచ్చి విక్రయించే తమిళనాడు వ్యాపారి నిజాముద్దీన్ దగ్గర మొక్కలు కొనుగోలుచేసినట్లు చిరంజీవి చెప్పారు. వ్యవసాయంలో వినూత్న ప్రయోగాలు చేస్తేనే లాభం ఉంటుందని భావించి ఖర్జూరం సాగువైపు మొగ్గు చూపినట్లు తెలిపారు. చిరంజీవి తోట తోట ప్రస్తుతం నాలుగేళ్ల వయసులో ఉంది. అనుకూలమైన నేలలివే.. సారవంతమైన తువ్వ (తెల్ల) నేల, గరప, నల్ల నేల, బంక నేలలతోపాటు, పీహెచ్ విలువ 8 నుంచి 10 వరకు ఉన్న చౌడు భూముల్లోనూ ఖర్జూరం సాగు చేసుకోవచ్చు. నీరు నిల్వ ఉండే నేలలు ఈ పంటకి అనుకూలంకాదు. ఖర్జూరం వేసవిలో కాపుకి వస్తుంది. ఉషో్టగ్రత 25 నుంచి 40 డిగ్రీల వరకు ఉంటే మంచి దిగుబడి వస్తుంది. అధిక వర్షాలు, చలిగాలులు ఖర్జూరం పంటకు ఇబ్బందికరం. దీనివల్ల మొక్కలు తెగుళ్ల బారిన పడే అవకాశం ఉంటుంది. నాటిన మూడేళ్లకు కాపు ఈత జాతికి చెందిన ఖర్జూరం మొక్క నాటిన మూడేళ్లకు కాపుకి వస్తుంది. ఇందులో ఆడ, మగ మొక్కలు ఉంటాయి. 10 ఆడ మొక్కలకు ఒక మగ మొక్క అవసరం. సాలుకు సాలుకు మధ్య మొక్కకు మొక్కకు మధ్య 24 అడుగుల ఎడంతో ఎకరాకు 78 మొక్కలు నాటుకోవచ్చు. మగ మొక్కలు తోటకు చుట్టూ అంచు వరుసలో నాటుతారు. మగ మొక్కలు కండెకు వచ్చిన తరువాత ఆ పుప్పొడిని భద్రపరుస్తారు. ఖర్జూరం మొక్క డిసెంబర్లో పూతకు వస్తుంది. ఆడ మొక్కలు పూతకు రాగానే ఆ పూతపై మొగ మొక్కల నుంచి సేకరించిన పుప్పొడిని చల్లుతారు. పూసిన మూడు నుంచి నాలుగు నెలలకు కాయలు పక్వానికి వస్తాయి. ఐదు నెలలకు గెలలను కోసి విక్రయించుకోవచ్చు. ఖర్జూరం సాగుకు ఎకరాకు రూ.4 లక్షల వరకు వ్యయం అవుతుంది. మూడో ఏడాది నుంచి 40 ఏళ్లపాటు దిగుబడి వస్తుంది. తొలి నాలుగేళ్లు దిగుబడి తక్కువగా ఉంటుంది. ఖర్జూరం మొక్కలు నాటిన నుంచి ఏడేళ్ల వరకు అంతరపంటలుగా పప్పు ధాన్యాలు, పశువుల మేత వంటివి సాగుచేసుకోవచ్చు. గుంటూరుకు చెందిన వ్యాపారి బర్హీ రకం కాయలను కిలో రూ.250 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు రైతు చిరంజీవి చెప్పారు. ఈ రకం ఖర్జూరాన్ని ప్రాసెస్ చేయకుండానే తినవచ్చని తెలిపారు. ఒక్కో మొక్క రూ.4,500 అద్దంకి ప్రాంతానికి బాగా అనుకూలమైన రకం బర్హీ. ఇందులో పసుపు, ఎరుపు రకాలు బాగా తియ్యగా ఉంటాయి. వీటిని తమిళనాడుకు చెందిన నిజాముద్దీన్ దుబాయ్ నుంచి తెప్పిస్తాడు. నెల పాటు తన వద్ద మొక్కలను పెంచి ఒక్కో మొక్క రూ.4.500 చొప్పున విక్రయిస్తాడు. అదే విధంగా రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి కూడా మొక్కలు తెప్పించుకోవచ్చు. మొక్కల సంఖ్య, నాటే విధానం వివరాలు నర్సరీ నిర్వాహకులనుంచి తెలుసుకోవచ్చు. అనంతపురం రైతును స్ఫూర్తిగా తీసుకున్నా.. సంప్రదాయ వ్యవసాయ సాగులో ఏటా నష్టాలు వస్తున్నాయి. ఖర్జూరం సాగులో ఒక్కసారి పెట్టుబడి పెడితే నాలుగో సంవత్సరం నుంచి నలభై సంవత్సరాల వరకు ఎటువంటి దిగులు ఉండదు. అయితే ఖర్జూరం మొక్కలను మన దేశంలో టిష్యూ కల్చర్ చేయకపోవడంతో ఇతర దేశాల నుంచి తెప్పించుకోవాల్సి వస్తోంది. దీంతో మొక్కల కొనుగోలుకు అధిక ఖర్చు అవుతోంది. ఉపాధి హామీ ద్వారా ఉద్యాన శాఖ పరిధిలో మొక్కలు ఇస్తే ఖర్జూరం సాగు మరింత పెరిగే అవకాశం ఉంది. – చిరంజీవి, రైతు, తిమ్మాయిపాలెం అధిక ఉష్ణోగ్రతలు అనుకూలం ఉషో్టగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఖర్జూరం సాగు చేసుకోవచ్చు. వేసవిలో వర్షాలు పడితే కాపు రాదు. బాపట్ల జిల్లాలో ఇప్పుడిప్పుడే కొంతమంది రైతులు ఖర్జూరం సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే మగ మొక్కల నుంచి పుప్పొడి సేకరించి, ఆడ మొక్కల పూతపై వేసే సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్లు అవసరం. లేకపోతే రైతే ఆ పని నేర్చుకోవాల్సి ఉంటుంది. వాతావరణం అనుకూలిస్తే ఖర్జూరం సాగులో మంచి లాభాలు వస్తాయి. – దీప్తి, అద్దంకి డివిజన్, ఉద్యానశాఖ అధికారి, బాపట్ల జిల్లా -
తెలంగాణ గ్రూప్-2 పరీక్షల తేదీలు ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-2 పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 29,30న గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు వారం ముందు నుంచే హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెల్లడించింది. ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పరీక్షా తేదీని నిర్ణయించామని అధికారులు పేర్కొన్నారు. కాగా, తెలంగాణలో గ్రూప్-2 పోస్టులకు సంబంధించి 783 పోస్టులకు గానూ 5,51,943 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. జనవరి 18 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించగా.. చివరి మూడు రోజుల్లోనే 1.10లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్-2 పరీక్షకు ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు. చదవండి: నవీన్ హత్య కేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన హసన్ -
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు
-
డేట్స్ ప్యాకెట్లో పురుగులు.. కుషాయిగూడ డీ మార్ట్‌లో ఘటన
సాక్షి, హైదరాబాద్: డేట్స్ (కర్జూర) ప్యాకెట్లో పురుగులు రావడంతో అవాక్కైన వినియోగదారుడు అధికారులకు ఫిర్యాదు చేయడంతో తనిఖీలు చేపట్టిన అధికారులు నిర్వాహకులకు జరిమాన విధించిన సంఘటన శుక్రవారం కుషాయిగూడ డీ మార్ట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలితే.. న్యూ వాసవి శివనగర్ కాలనీకి చెందిన చంద్రశేఖర్ శుక్రవారం డీ మార్ట్‌లో డేట్స్ ప్యాకెట్‌ను కొనుగోలు చేశారు. సరుకుల కొనుగోలు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా అతడి కుమారుడు డీ మార్ట్ ఆవరణలోనే తినేందుకు డేట్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి నోట్లో పెట్టుకోగా మూతిపై పురుగులు పారడాన్ని తండ్రి గమనించాడు. వెంటనే అప్రమత్తమైన అతను ప్యాకెట్‌ను చూడగా కుళ్లిపోయి ఉంది. దీంతో అవాకైన చంద్రశేఖర్ డీ మార్ట్ సిబ్బందిని నిలదీయడమేగాక అధికారులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏఎంహెచ్ఓ డాక్టర్ స్వప్నారెడ్డి తన సిబ్బందితో కలిసి సరుకులను తనిఖీ చేశారు. పూర్తిగా కుల్లిపోయి, దుర్వాసన వెదజల్లుతున్న డేట్స్ ఫ్యాకెట్‌ను గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో హెచ్చరికలు జారీ చేసినా తీరు మార్చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఏఎంహెచ్ఓ డీ మార్ట్ నిర్వాహకులకు రూ.30 వేలు జరిమానా విధించారు. చదవండి: ఎంసెట్ స్టేట్ ర్యాంకర్ ప్రాణం తీసిన లోన్ యాప్ వేధింపులు -
Dragon Fruit: ఎకరాకు 8 లక్షల పెట్టుబడి! రెండో ఏడాదే అధికాదాయం.. 50 లక్షలకు పైగా!
ఆరోగ్యదాయినిగా పేరుగాంచిన డ్రాగన్ ఫ్రూట్ రైతులకు కాసుల పంట పండిస్తోంది. ఉద్యాన పంటలకు నెలవైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులు లాభదాయకంగా సాగు చేస్తున్న పండ్ల రకాల జాబితాలో తాజాగా డ్రాగన్ ఫ్రూట్ చేరింది. సేంద్రియ పద్ధతుల్లో డ్రాగన్ సాగు చేస్తూ నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులు మంచి లాభాలు కళ్లజూస్తున్నారు. ఈ కోవకు చెందిన వారే కేవీ రమణారెడ్డి. అనంతపురం శివారు సిండికేట్‌నగర్‌కు చెందిన రమణారెడ్డి గార్లదిన్నె మండలం మర్తాడులో 3 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్‌తో పాటు మరో 6 ఎకరాల్లో ఖర్జూరం సాగు చేస్తున్నారు. పదో తరగతి వరకు చదువుకున్న రమణారెడ్డి రెండేళ్ల క్రితం డ్రాగన్ ఫ్రూట్ సాగుకు శ్రీకారం చుట్టి, రెండో ఏడాదే మంచి దిగుబడులు సాధించారు. 2 వేల మొక్కలు.. రెండేళ్ల క్రితం డ్రాగన్ ఫ్రూట్ రెడ్ రకం 6 వేల మొక్కలను తెప్పించిన రమణారెడ్డి మూడు ఎకరాల్లో నాటారు. చెట్ల మధ్య 8 అడుగులు, సాళ్ల మధ్య 10 అడుగులు దూరంలో సిమెంటు స్థంభాలు నాటి... స్థంభానికి నాలుగు మొక్కలు నాటారు. గుంత తీసి అందులో వేపపిండి, వర్మీకంపోస్టు, పశువుల ఎరువు వేసి.. ఎకరాకు 500 సిమెంటు స్థంభాల చుట్టూ 2 వేల మొక్కలు నాటారు. స్తంభం పైభాగంలోకి మొక్కలకు ఆలంబనగా పాత టైరును అమర్చారు. ఎకరాకు రూ.8 లక్షల వరకు పెట్టుబడి మొత్తమ్మీద పంటకు తొలి ఏడాది మొక్కల ఖర్చు, సిమెంటు పోలు, రింగు తదితర వాటిని పరిగణలోకి తీసుకుంటే ఎకరాకు రూ.8 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. తర్వాత నుంచి ప్రతి ఏటా రూ.50 వేలకు కాస్త అటుఇటుగా ఖర్చవుతుంది. నీళ్లు పెద్దగా అవసరం లేదు. డ్రిప్ ద్వారా 15 రోజులకో తడి ఇస్తున్నాను. వర్షాకాలంలో అవసరం లేదు. ఎకరాకు ఏటా 10 నుంచి 12 టన్నుల వరకు డ్రాగన్ పండ్ల దిగుబడి వస్తుందని అంటున్నారు రమణారెడ్డి. వేపనూనె పిచికారీ చేస్తే ఎర్రచీమల సమస్య అదుపులోకి వచ్చిందని రమణారెడ్డి వివరించారు. ఏడాదికి రెండు సార్లు ఐదు ట్రాక్టర్లు పశువులు ఎరువు వేశారు. కొంత కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు వాడాను. పండ్ల కోతకు కూలీల అవసరం తక్కువే. తాను, తన భార్య లక్ష్మీదేవితో పాటు ఇద్దరు ముగ్గురు కూలీలతో సరిపోతోందన్నారు. మొక్కల ద్వారా ఆదాయం అంట్లు కట్టి, మొక్కల అమ్మకం మొదలు పెట్టారు. ఒక కటింగ్‌ను రూ.70కి, రెండు నెలలు పెంచిన మొక్కను రూ.100కి అమ్ముతున్నానని రమణారెడ్డి చెబుతున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో డ్రాగన్ మించిన ఆదాయాన్నిచ్చే పంట మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. రెడ్ వెరైటీ.. ఎండను తట్టుకుంటుంది.. డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అనంతపురం జిల్లా నేలలు, వాతావరణం అనుకూలమే. ఇప్పటికి 20 మందికి పైగా రైతులు 70–80 ఎకరాల్లో డ్రాగన్ సాగు చేపట్టారు. మొదటి ఏడాది పెట్టుబడి ఎక్కువ అయినా మున్ముందు లాభదాయకంగా ఉంటుంది. ఒక్కసారి నాటుకుంటే గరిష్టంగా 25–30 ఏళ్ల వరకు పంట దిగుబడి వస్తుంది. డిసెంబర్–మే మధ్య కాలంలో ప్రూనింగ్, పోషకాల యాజమాన్యం, కలుపు నివారణ చర్యలు చేపడితే ఇబ్బంది ఉండదు. మొక్కల ఎంపికలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. మర్తాడు రైతు రమణారెడ్డి సాగు చేసిన రెడ్ వెరైటీ డ్రాగన్ పండ్లు సైజు పరంగా, దిగుబడి పరంగా మంచిదే. ఎండకు తట్టుకుంటుంది. – డా. బి.విమల (94938 31009), ఉద్యాన శాస్త్రవేత్త, ఉద్యాన పరిశోధనా స్థానం, రేకులకుంట, అనంతపురం జిల్లా రెండో ఏడాదే అధికాదాయం డ్రాగన్ ఫ్రూట్ పంట ద్వారా రెండో ఏడాది ఊహించిన దానికన్నా అధిక దిగుబడి వచ్చింది. మూడు ఎకరాల్లో ఇప్పటికే 18 టన్నుల పండ్లు అమ్మాను. చెన్నై, బెంగళూరు వ్యాపారులతోపాటు స్థానిక వ్యాపారులు కూడా తీసుకెళుతున్నారు. కేవీ రమణారెడ్డి పండు సైజును బట్టి టన్ను రూ.1.35 లక్షల నుంచి రూ.1.65 లక్షల వరకు పలికింది. కాపు బాగున్నందున ఇంకా రూ.15 టన్నులకు పైగా దిగుబడి రావచ్చు. ఈ లెక్కన రూ.50 లక్షలకు పైగా రావచ్చనుకుంటున్నా. నాటిన రెండో ఏడాది నుంచే రెమ్మలు కత్తిరించి అమ్ముతున్నా. ఇప్పటికి రూ.24 లక్షల విలువ చేసే మొక్కలు అమ్మాను. – కేవీ రమణారెడ్డి, డ్రాగన్ ఫ్రూట్ రైతు , (93469 25502, 94908 56363), మార్తాడు, గార్లదిన్నె మం., అనంతపురం జిల్లా – గంగుల రామలింగారెడ్డి, సాక్షి, అనంతపురం అగ్రికల్చర్ ఫొటోలు: బి.మహబూబ్‌బాషా చదవండి: నేచర్ అర్బైన్.. అతిపెద్ద రూఫ్‌టాప్ పొలం! -
Health Tips: పిల్లలు, వృద్ధులు ఖర్జూరాలు తరచుగా తింటే!
పిల్లలు, వృద్ధుల ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఈ ఆహార పదార్థాలను వారి డైట్లో చేరిస్తే మంచిది. ►పిల్లలకు ఎదిగే వయసులోనూ, వృద్ధులకూ ఎముకలు దృఢంగా మారాలంటే ప్రతిరోజు కొన్ని ఖర్జూరాలను ఇవ్వాలి. ►ముఖ్యంగా ఎండు ఖర్జూరాలను ప్రతిరోజు రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే గింజలు తీసేయాలి. ►వాటిని మిక్సీ పట్టి పిల్లలతో తాగించడం వల్ల ఎముకలు దృఢంగా మారడమే కాకుండా వారి శరీరానికి పోషకాలు లభిస్తాయి. ఇవి కూడా... ►అదే విధంగా.. రాగులు.. తృణధాన్యాలలో రాగులు కూడా ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ►వీటిలో క్యాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఎదిగే పిల్లలకు రాగి పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలను ఇవ్వడం వల్ల వారు మరింత ఆరోగ్యంగా తయారవుతారు. ►ఇక వీటితోపాటు మఖానాలు, పాలు, పెరుగు , బాదం, జున్ను, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, చియా సీడ్స్ వంటివి డైట్లో చేర్చుకోవాలి. ►ఇలా చేస్తే వారు మరింత ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. వారి ఎముకల దృఢత్వాన్ని కూడా పెంపొందించుకోవచ్చన్నది ఆరోగ్య నిపుణుల మాట. చదవండి: Health Tips: బీపీ పెరగడానికి కారణాలేంటి? ఎలా కంట్రోల్ చేసుకోవాలి? Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల.. -
పెళ్లికి తొందరపడాల్సిందే.. ఉరుకులు.. పరుగులు.. ఆలస్యం చేశారంటే!
పెళ్లి.. ప్రతివారి జీవితంలోనూ మధురానుభూతి. వధూవరులకు అతిపెద్ద పండుగ. ఇక బిడ్డల వివాహాలను వైభవంగా అందరూ మెచ్చుకునేలా చేయాలని తల్లిదండ్రుల ఆరాటం. అందుకే కాస్త ఆలస్యమైనా ఆన్నీ సవ్యంగా కుదిరాకే పెళ్లిళ్లు చేస్తుంటారు. కానీ ఈ ఏడాది ట్రెండ్ మారింది. సుముహూర్తాలు తక్కువగా ఉండటంతో... ఆలస్యం అమృతం విషం అన్నట్లుగా... నిశ్చయం అయ్యింది మొదలు... ఉరుకులు, పరుగులతో పెళ్లి కానిచ్చేస్తున్నారు. ఈ ఐదు నెలల్లో జిల్లాలో వేలాది వివాహాలు జరగ్గా...జూన్ వరకు మాత్రమే సుముహుర్తాలు ఉండటంతో అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. చదవండి: వివాహ ‘వేడుకంబు’.. జూన్ వరకు పెళ్లి ముహూర్తాలు ఇవే పుట్టపర్తి అర్బన్: కళ్యాణ వైభోగం, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటున్నారు పురోహితులు. జూన్ నెల దాటితే. తిరిగి డిసెంబర్ వరకూ ముహూర్తాల కోసం వేచి చూడాల్సి రావడంతో తల్లిదండ్రులు బిడ్డల పెళ్లికి హడావుడి పడుతున్నారు. ఇప్పుడు కాకపోతే మళ్లీ వచ్చే సంవత్సరం వరకూ ఆగాల్సి ఉంటుందని భావించి ఉన్నంతలో ఈ ముహూర్తాలకే లగ్గం కానిచ్చేస్తున్నారు. రెండేళ్లుగా మోగని భాజా కరోనా దెబ్బతో చాలా మంది రెండేళ్ల పాటు వివాహాల మాటే ఎత్తలేదు. కొందరు ధైర్యం చేసి పిల్లల పెళ్లి చేద్దామన్నా నిబంధనల కారణంగా వాయిదా వేశారు. ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గడం, వివాహ ముహూర్తాలు జూన్ వరకే ఉండటంతో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ముఖ్యంగా మార్చి నుంచి సెలవులు ఎక్కువగా ఉండటంతో ఈ రెండు నెలలు వేలాది వివాహాలు జరిగాయి. ప్రస్తుతానికి జూన్ 26వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆగస్టులో నాలుగైదు ముహూర్తాలు ఉన్నా...ఆషాడం, శుక్ర మూఢం కారణంగా డిసెంబర్ వరకూ మంచి ముహూర్తాలు లేవు. చదవండి: ఏమ్మా.. నాకూ కాస్త అన్నం పెట్టండి : కలెక్టర్ నాగలక్ష్మి డిసెంబర్ 1వ తేదీతో శుక్ర మూఢం ముగుస్తుంది. అనంతరం శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఈక్రమంలో నిశ్చయ తాంబూలాలు తీసుకున్న వారు... ఆరు నెలల పాటు ఎదురు చూడడం మంచిది కాదన్న ఉద్దేశంతో ఉన్నారు. అందుకే పెళ్లికి తొందరపడుతున్నారు. మరోవైపు ఇతర దేశాల్లో విజృంభిస్తున్న కరోనా మళ్లీ మన వైపు వస్తుందేమోనన్న భయం కూడా తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతోంది. అయితే నిదానమే ప్రధానం అనే వారూ ఉన్నారు. అయితే నానాటికీ పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని చాలా మంది జూన్‌లోని ముహూర్తాలకే పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కల్యాణ మంటపాలు రిజర్వ్ చేసేశారు. డెకరేషన్, క్యాటరింగ్‌కు కూడా టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. కాస్త కోలుకుని... జనవరి నుంచి ఇప్పటి వరకూ వివాహాలు జోరుగా సాగాయి. కూరగాయల నుంచి కిరాణా సరుకుల దాకా ధరలు రోజురోజుకూ పెరుగుతున్నా... పెళ్లిళ్ల కారణంగా డిమాండు తగ్గడం లేదు. కరోనాతో వరుసగా రెండేళ్ల పాటు దెబ్బతిన్న వ్యాపారాలు వివాహాల వల్ల కాస్త కోలుకున్నాయి. ఇక పెళ్లిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న బంగారం కొనుగోళ్లు పెరిగాయి. ఫలితంగా జ్యువెలరీ షాపులు కళకళలాడుతున్నాయి. సాయి ఆరామమే పెద్ద దిక్కు పుట్టపర్తిలో వివాహ వేడుకలు, బర్త్‌డే ఫంక్షన్లకు సాయి ఆరామమే పెద్ద దిక్కుగా మారింది. కరోనా దెబ్బకు సందర్శకులు రాక ప్రభుత్వ నిర్మించిన టూరిజం హోటల్ వెలవెలబోయింది. దీంతో ప్రభుత్వం దాన్ని 30 ఏళ్ల లీజుకిచ్చింది. దీన్ని ఫంక్షన్ హాల్ చేయడంతో అందులోనే ఏసీ రూములు, విశాలమైన పార్కింగ్ స్థలం ఉండటంతో ఇక్కడ వివాహాలు జరిపించేందుకు తల్లిదండ్రులు ఉత్సాహం చూపుతున్నారు. ఇక్కడ నిత్యం ఏదో ఒక వేడుక జరుగుతోంది. రికార్డు స్థాయిలో గత ఐదేళ్లలో ఏ సంవత్సరం జరగనన్ని వివాహాలు ఈ యేడు జరుగుతున్నాయి.. ముహూర్తాలు కూడా ఈ ఐదు నెలలు వరుసగా ఉండటంతో వివాహాలకు సంబంధించిన వ్యాపారాలూ జోరందుకున్నాయి. ఈ సంవత్సరం మే నెల 22వ తేదీ వరకూ 41 ముహూర్తాలు ఉండగా.. జిల్లా వ్యాప్తంగా వేలాదిగా వివాహాలు జరిగాయి. జూలై నుంచి ముహూర్తాలు లేవు ఆషాడం, శుక్ర మూఢం కారణంగా జూలై నుంచి వివాహ ముహూర్తాలు లేవు. అందుకే అందరూ మే, జూన్ నెలల్లోని ముహూర్తాలకే పిల్లల పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఇప్పటికే నిశ్చయ తాంబూలాలు తీసుకున్న వారు మంచి ముహూర్తం చూసుకుంటున్నారు. – గురుస్వామి, కొత్తచెరువు తక్కువ ముహూర్తాలతో ఇబ్బందే ముహూర్తాలు తక్కువగా ఉంటే అందరికీ ఇబ్బందే. ఫంక్షన్‌హాళ్లు అందరికీ దొరకవు. ఇక ఫంక్షన్ హాళ్ల వారికీ తర్వాత గిరాకీ ఉండదు. ఈ సారి ఎన్నడూ జరగనన్ని వివాహాలు జరిగాయి. సప్లయర్స్ సామగ్రి దొరకడం కూడా కష్టంగా మారింది. ఈ రెండు నెలల నుంచి పెళ్లిళ్లతో పాటు మరికొన్ని ఫంక్షన్లు పెద్ద ఎత్తున జరిగాయి. జూన్ తర్వాత అందరూ ఖాళీగా ఉండాల్సిందే. – తోట్ల గంగాధర్, ఫంక్షన్‌హాల్ నిర్వాహకుడు -
జూలై అంతా ‘సెట్’
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం (2022–23)లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ప్రకటించారు. లాసెట్, ఐసెట్, ఎడ్‌సెట్ తదితర పరీక్షలను జూలైలోనే నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే ఇతర పరీక్షలు రాయాల్సి వస్తే ఆయా సెట్ల తేదీల్లో మార్పులు ఉంటాయని చెప్పారు. మండలి కార్యాలయంలో మంగళవారం వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి.వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ ఎస్.శ్రీనివాస్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కోవిడ్‌తో చోటుచేసుకున్న ఆర్థిక నష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఏ ప్రవేశ పరీక్షకూ ఫీజులు పెంచడం లేదని స్పష్టం చేశారు. గతంలో ఉన్న ఫీజులే వర్తిస్తాయని చెప్పారు. ఎంసెట్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైందని, లాసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీజీఈ సెట్ల నోటిఫికేషన్లు వీలైనంత త్వరగా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. సెట్లకు దరఖాస్తు చేసుకోవడానికి కావల్సిన విద్యార్హతలు, ఇతర వివరాలు నోటిఫికేషన్లో వెల్లడిస్తామన్నారు. అన్ని పరీక్షలను ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహిస్తామని తెలిపారు. ఐసెట్ నిర్వహణ బాధ్యతను కాకతీయ వర్సిటీకి, ఇతర సెట్ల బాధ్యతను ఉస్మానియా వర్సిటీకి అప్పగించామని చెప్పారు. కాగా జూలై 13న ఈసెట్, జూలై 14 నుంచి 20 మధ్య ఎంసెట్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
తియ్యని ఖర్జూరం.. చేసే మేలెంతో!
-
Health Tips: తీపిగా ఉండే ఖర్జూరాలు తరచుగా తింటున్నారా? ఈ విషయాలు తెలిస్తే!
మేలైన ఖర్జూరాలు(డేట్స్) రెండు తిన్నా చాలు... తక్షణ శక్తి లభిస్తుంది అంటారు పెద్దలు. ఎడారుల్లోని ఒయాస్సిసుల దగ్గర పండుతాయి ఖర్జూరాలు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఖర్జూర చెట్లలో ఆడా, మగా రకాలు ఉంటాయి. అయితే, ఆడ చెట్టు నుంచే మనం తినే ఖర్జూర పండ్లు లభిస్తాయి. పండ్లలోని తేమను బట్టి మెత్తటివి, ఎండినవి అంటూ రకాలు ఉంటాయి. సహజంగానే రుచికి తీపిగా ఉండే ఖర్జూరాల్లో ఉండే పోషకాలు, ఈ పండ్లు కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువేనండోయ్! ఖర్జూరాల్లో లభించే పోషకాలు ►ఖర్జూరాలు ముఖ్యంగా ఎండు ఖర్జూరాల్లో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. ►వీటిలో పీచు పదార్థాలు ఎక్కువ. ►ఖర్జూరాల్లో కార్బోహైడ్రేట్స్, చక్కెర పదార్థాలు కూడా అధికం. ►ఇక విటమిన్లలో విటమిన్ సీ మెండుగా లభిస్తుంది. ►యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ►కాల్షియం, పాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు కూడా అధికమే. ఖర్జూరాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ►ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. కెరోటినాయిడ్స్ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. ►అదే విధంగా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ►ఫ్లావనాయిడ్స్ లోని యాంటి ఇన్‌ఫ్లామేటరీ గుణాలు మధుమేహం, కాన్సర్ ముప్పును తగ్గిస్తాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ►ఇందులోని ఫినోలిక్ ఆసిడ్ సైతం గుండె సంబంధిత వ్యాధులను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ►ఖర్జూరాల్లో కాపర్, సెలీనియం, మెగ్నీషియం ఎక్కువ. ఎముకలను బలంగా ఉంచడంలో తోడ్పడతాయి. ►ఖర్జూరాల్లోని కోలిన్, విటమిన్ బి జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో తోడ్పడతాయి. అల్జీమర్స్ తగ్గిస్తాయి. కాబట్టి వీటిని తరచుగా తినడం మేలు. ►ఖర్జూరాలు నిద్రలేమిని దూరం చేస్తాయి. ►పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుదలకు ఉపకరిస్తాయి. వీర్యవ`ద్ధికి తోడ్పడతాయి. ►మహిళల్లో హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉన్నవాళ్లు ఖర్జూరాలు తింటే మంచిది. ►గర్భిణీలకు ఖర్జూరం తినిపిస్తే మంచిదని చెబుతుంటారు పెద్దలు. గర్భిణులు వీటిని తినడం వల్ల ఇందులోని ఫైబర్ కారణంగా పైల్స్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ►డయేరియా, రక్తపోటుతో బాధపడేవారికి కూడా ఖర్జూరం చక్కగా ఉపయోగపడుతుంది. ►బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్లో ఖర్జూరం చేర్చుకుంటే ఫలితాలు ఉంటాయి. చదవండి: Groundnuts Health Benefits: ఉడకబెట్టిన పల్లీలు తినడం ఇష్టమా? ఇవి విడుదల చేసే సెరోటోనిన్ వల్ల.. -
Health Tips: రోజూ నిమ్మకాయ పులిహోర తింటున్నారా! అయితే..
These Amazing Foods In Your Diet Help Fight Deficiency Of Anemia: భారతీయ మహిళను వేధిస్తున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య ఎనీమియా. రక్తహీనతను అనారోగ్యంగా పరిగణించకుండా అజాగ్రత్తగా రోజులు గడిపేస్తుంటారు కూడా. నిజానికి ఇది అనేక రకాలుగా ప్రాణాపాయానికి కారణమవుతుందని గమనించాలి. ఎప్పుడూ అలసటగా అనిపించడం, చర్మం నిర్జీవంగా, తెల్లగా పాలిపోవడం, జుట్టు విపరీతంగా రాలిపోవడం, నిస్సత్తువ, గుండె వేగం ఉన్నట్లుండి పెరిగిపోవడం, శ్వాస దీర్ఘంగా తీసుకోలేకపోవడం, దేని మీదా ఆసక్తి లేకుండా నిరాసక్తంగా ఉండడం... ఇవన్నీ రక్తహీనత కారణంగా కనిపించే ప్రధాన లక్షణాలు. రక్తహీనత ఉన్నప్పుడు దేహంలో వ్యాధి నిరోధక శక్తి క్షీణించి తరచుగా అంటువ్యాధులు దాడి చేస్తుంటాయి. రక్తహీనత అంటే రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడం. ఐరన్‌లోపం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఐరన్ సమృద్ధిగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. ►‘సి’ విటమిన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ►నిమ్మ, నారింజ, బత్తాయి రసాలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ►రోజూ ఒక గ్లాసు నిమ్మరసం తాగాలి. నిమ్మకాయ పులిహోర వంటి వంటకాలను డైలీ మెనూలో చేర్చుకోవాలి. ►సీ విటమిన్ తగినంత లేకపోతే ఆహారంలో తీసుకున్న ఐరన్‌ను దేహం గ్రహించలేదు. కాబట్టి ఆకు కూరల్లో నిమ్మరసం కలుపుకుని తినడం మంచిది. ►రక్తహీనతతోపాటు కఫం తో కూడిన దగ్గు కూడా ఉంటే రోజూ ఉదయం సాయంత్రం కప్పు పెరుగును టీ స్పూన్ స్వచ్ఛమైన పసుపుతో కలిపి తీసుకోవాలి. ►దానిమ్మ, బీట్రూట్లు రక్తవృద్ధితోపాటు రక్తశుద్ధిని కూడా చేస్తాయి. వీటిని అలాగే తినడం లేదా రసం తాగడం వల్ల ఓ వారంలోనే మంచి ఫలితాలు కలుగుతాయి. ►నువ్వులను ఏదో ఒక రూపంలో రోజూ తీసుకోవాలి. ►నువ్వులను రెండు–మూడు గంటల సేపు నానబెట్టి మెత్తగా పేస్ట్ చేసుకుని అందులో తేనె కలుపుకుని తినవచ్చు. ►నువ్వులు– బెల్లంతో చేసిన లడ్డు తినవచ్చు. నువ్వుల పొడి చేసుకుని కూరల్లో, అన్నంలో కలుపుకోవచ్చు. ►రోజూ గుప్పెడు ఎండుద్రాక్ష, రెండు ఎండు ఖర్జూరాలు తింటే చాలు. రక్తహీనత నుంచి సులువుగా బయటపడవచ్చు. -
Winter: నువ్వుండలు, ఎండిన ఫలాలు.. పిల్లలకు ఇవి తినిపిస్తే
Winter Season: Avoid Giving These Foods To Kids What To Eat What Not Telugu: పిల్లలకు ఈ సీజన్లో ఇవ్వాల్సిన ఆహారంపై కూడా దృష్టిపెట్టాలి. ఉప్పు, పులుపు, మసాలాలు, కారాలను గణనీయంగా తగ్గిస్తూ, పోషకవిలువలను సమృద్ధిగా ఉండే ఆహారం ఇవ్వాలి. ►ముఖ్యంగా పీచుపదార్థాలు అధికంగా ఉండే శాకాహారం, ఆకుకూరలు, తాజాఫలాలు, ఎండిన ఫలాలు ప్రతినిత్యం వారికి తినిపించాలి. ►నూనెలను మరిగించడం ద్వారా తయారు చేసే వంటకాలను దూరం చేయాలి. ►ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు, పిజ్జాల వంటి పదార్థాలకు బదులుగా ప్రకృతి సిద్ధమైన ఆహారాలను అలవాటు చేయడం మంచిది. ►ఉదాహరణకు కొబ్బరినీళ్లు, చెరకురసం, వెజిటబుల్ జ్యూసులు, ఖర్జూరం, పాలు, పెరుగు వంటివి. మొత్తంమీద రోజూ 3 లీటర్ల వరకు ద్రవపదార్థాలు తాగాలి. ►ప్రధానంగా నీరు, మజ్జిగ, బార్లీ మొదలైనవి. ►పిల్లలకు క్యాల్షియమ్ సమృద్ధిగా లభించాలంటే ప్రతిరోజూ ఉదయం అర చెంచా, సాయంత్రం అర చెంచా నువ్వులను నమిలి తినేలా అలవాటు చేయాలి. లేదంటే నువ్వుండలు తిన్నా మంచిదే. ►అలాగే మొలకెత్తే దినుసులను తినిపించడం అలవాటు చేయాలి. చదవండి: Betel Leaves: తమలపాకులు నములుతున్నారా.. అయితే మీరు... -
వేరు శెనగలు, ఖర్జూరాలు, కిస్మిస్లు తరచుగా తింటే...
మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లోపిస్తే వివిధ రకాల అనారోగ్యాల బారినపడడమేగాక, ఏ పనిచేయక పోయినా అలసిపోతాము. ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలు ప్రయత్నించండి. ఉత్సాహంగా ఉంటారు. ►ఉడకపెట్టిన వేరుశనగ విత్తనాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఉడికించిన వాటిని తినడం వల్ల పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వుకరిగి, హృదయ సంబంధ సమస్య ల ముప్పు తగ్గుతుంది. బరువు కూడా నియంత్రణ లో ఉంటుంది. ►ఖర్జూరాలను పాలల్లో ఉడక బెట్టి తినాలి. దీనివల్ల రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. ►దీనిలో ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్స్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ►ఎప్పుడూ నీరసంగా అనిపించేవారు.. రాత్రంతా కిస్మిస్లను నీళ్లలో నానబెట్టుకుని ఉదయం ఆ నీటిని తాగాలి. ►క్రమం తప్పకుండా కొద్దికాలం పాటు ఇలా చేస్తే శరీరంలో నీరసం, నిస్సత్తువ తగ్గుతాయి. ►మధుమేహం ఉన్నవారు కివి, చెర్రీ, పియర్, యాపిల్, ఆవకాడోలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల నీరసం దరిచేరదు. చదవండి: Skin Care Tips: డ్రైఫ్రూట్స్, గుడ్లు, చేపలు తిన్నారంటే.. -
పవిత్రమాసం.. నగరానికి పోటేత్తిన ఖర్జూరాలు!
సాక్షి, సిటీబ్యూరో: రంజాన్ అనగానే గుర్తుకుచ్చేది ఖర్జూరం. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో ప్రతిరోజూ ఈ పండు తిననివారు ఉండరంటే అతిశయోక్తికాదు. ఉపవాస దీక్షలు పాటించే ముస్లింలు.. ఖర్జూరం పండుతోనే దీక్ష విరమణ చేస్తారు. అలాంటి ఈ పండ్లకు నగరం కేరాఫ్‌గా నిలుస్తోంది. మరో వారం రోజుల్లో రంజాన్ సీజన్ మొదలు కానుండటంతో ఖర్జూరం పండ్ల స్టాక్ నగరానికి పోటెత్తింది. విదేశాల నుంచి దిగుమతి అయిన ఈ పండ్ల వ్యాపారం కేవలం వారం రోజుల్లో నగరంలోనే సుమారు రూ.500 కోట్ల మేర సాగిందంటే ఈ పండ్లకు ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. గతేడాది కరోనా, లాక్‌డౌన్‌తో ఖర్జూరం విక్రయాలు అంతగా సాగలేదు. ఈ ఏడాది పండ్ల వ్యాపారం ఊపందుకుంటుందని భావిస్తున్న తరుణంలో మరోసారి కరోనా పంజా విసురుతుండటం ఒకింత ఆందోళన కలిగిస్తున్నా.. మునుపటిలా వ్యాపారం పడిపోదనే ధీమా వ్యాపార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. వివిధ దేశాల నుంచి దిగుమతి అరబ్బు దేశాలైన ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, తూనిషీయా, అల్‌జిరీయా తదితర దేశాల ఖర్జూరాలకు డిమాండ్ ఉంటుంది. ఇరానీ కప్‌కప్, ఇరానీ ఫనాకజర్, బాందా ఖర్జూర్ ప్రసుత్తం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఖర్జూరం కిలో రూ.150 నుంచి రూ.650 వరకు విలువ చేసే రకాలు మార్కెట్లో ఉన్నాయి. ధరలు అందుబాటులో.. కరోనా కాలంలో దాదాపు అన్ని రకాల వస్తువుల ధరలు భారీగా పెరిగినా పదేళ్ల నుంచి ఖర్జూరం ధరలు పెరగలేదు. ఇతర ఆహార, ఎండు పండ్ల రేట్లను పరిశీస్తే వాటి ధరలు పదేళ్లలో 50–70 శాతం పెరిగాయి. – రాజ్‌కుమార్ టండన్, కశ్మీర్ హౌస్ నిర్వాహకుడు, బేగంబజార్ -
జనవరిలో ఆరంభం
ఈ మధ్యకాలంలో ప్రభాస్ గురించి ఏ ప్రస్తావన వచ్చినా అందులో ‘ఆదిపురుష్’ సినిమా గురించి కచ్చితంగా ఏదో ఒక టాపిక్ ఉంటుంది. ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న త్రీడీ మూవీ కాబట్టి ఈ సినిమాకి ప్రభాస్ ఎన్ని రోజులు కేటాయించి ఉంటారు? షూటింగ్ ఎప్పుడు ఆరంభమవుతుంది? వంటి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానులకు ఎక్కువగా ఉంటుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి ప్రభాస్ ఇచ్చిన డేట్స్ 90 రోజులు మాత్రమే అని తెలిసింది. ఇది భారీ సినిమా కదా.. మరి ప్రభాస్ 90 రోజులే డేట్స్ ఇవ్వడమేంటీ? అనుకోవచ్చు. ఎక్కువ శాతం షూటింగ్ గ్రీన్ మ్యాట్ సెట్స్‌లో ప్లాన్ చేయడం వల్ల తక్కువ డేట్స్ సరిపోతుందని సమాచారం. అలాగే జనవరి నుంచి ఈ చిత్రం షూటింగ్లో పాల్గొంటారు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నారు. డిసెంబర్లో ఈ సినిమా షూటింగ్‌ని పూర్తి చేయాలనుకుంటున్నారు. ఆ తర్వాత ‘ఆదిపురుష్’ ఆరంభమవుతుంది. టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో భూషణ్ కుమార్, ఓం రౌత్, కిషన్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని 2022 ఆగస్ట్ 11న విడుదల చేయనున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. -
హీరోయిన్ల తారుమారు
కొంతగ్యాప్ తర్వాత ‘ఆచార్య’ వంటి ఓ స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్‌తో తెలుగు తెరపై త్రిష కనిపించబోతున్నారన్న వార్త ఆమె అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. కానీ ఆ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. కారణం‘ఆచార్య’ చిత్రం నుంచి త్రిష తప్పుకోవడమే. ‘క్రియేటివ్ డిఫరేన్సెస్ కారణంగా ‘ఆచార్య’ చిత్రం నుంచి తప్పుకుంటున్నా’ అని వెల్లడించారు త్రిష. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఒకవేళ త్రిష ఈ సినిమా నుంచి తప్పుకుని ఉండకపోయి ఉంటే.. చిరంజీవి–త్రిషల కాంబినేషన్‌ని రెండోసారి చూసేవాళ్లం. 2006లో వచ్చిన ‘స్టాలిన్’ చిత్రంలో ఈ ఇద్దరూ జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘ఆచార్య’ చిత్రంలో త్రిష చేయాల్సిన హీరోయిన్ పాత్రను ఇప్పుడు కాజల్ అగర్వాల్ చేస్తున్నారు. చిరంజీవి కమ్‌బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’లో కాజల్ హీరోయిన్గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్). ఎన్టీఆర్ సరసన ఇంగ్లిష్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్, రామ్‌చరణ్ సరసన ఆలియా భట్ నటించబోతున్నట్లు చిత్రబృందం పేర్కొంది. కానీ షూటింగ్లో పాల్గొనకముందే వ్యక్తిగత కారణాల వల్ల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో తాను నటించడం లేదని చెప్పేశారు డైసీ. దీంతో ఎన్టీఆర్‌కు జోడీగా బ్రిటిష్ నటి ఒలివియా మోరిస్‌ను ఎంపిక చేసుకున్నారు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం. కరోనా వల్ల షూటింగ్స్ ఆగిపోవడంతో కాల్షీట్స్ను సర్దుబాటు చేయలేక ‘పుష్ప’కు బై బై చెప్పాల్సి వచ్చిందని కాస్త నిరుత్సాహపడ్డారు విజయ్ సేతుపతి. ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకు చిత్రబృందం విజయ్ సేతుపతిని ఎంపిక చేసింది. కానీ కాల్షీట్స్ కుదరక ‘పుష్ప’ చిత్రంలో నటించడం లేదని ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూలో చెప్పారు విజయ్ సేతుపతి. ఇక ఈ పాత్ర కోసం తమిళ నటుడు బాబీ సింహా, కన్నడ నటుడు దర్శన్లను చిత్రబృందం సంప్రదించిందని టాక్. మరి.. ఎవరు నటిస్తారో చూడాలి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాలో నటించాలని చాలామంది కథానాయికలు ఆశపడుతుంటారు. కానీ వచ్చిన అవకాశాన్ని వద్దనుకున్నారు నటి అమలా పాల్. ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తోన్న భారీ పీరియాడికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’. ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రను ఆఫర్ వస్తే అమలా పాల్ నో చెప్పారు. ‘‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో నన్ను అడిగిన పాత్రకు నేను న్యాయం చేయలేనేమోనని అనిపించింది. నాకు సూట్ కాని పాత్రను చేసి, ఆ తర్వాత విమర్శలను ఎదుర్కోవడం కన్నా ముందే తప్పుకోవడం ఉత్తమం అనుకున్నాను’’ అని ఓ సందర్భంలో పేర్కొన్నారు అమలా పాల్. సౌత్‌లో హీరోయిన్గా ఫుల్ ఫామ్‌లో ఉన్నారు కథానాయిక కీర్తీ సురేష్. కానీ బాలీవుడ్లో కెరీర్ ఖాతాను కీర్తి ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు. ఫుట్‌బాల్ కోచ్ కమ్ మేనేజర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా హిందీలో తెరకెక్కుతోన్న ‘మైదాన్’ చిత్రంతో కీర్తి బీటౌన్‌కు హీరోయిన్గా పరిచయం కావాల్సింది. కానీ అనుకోని పరిణామాల వల్ల ఆమె ‘మైదాన్’ నుంచి బయటకు వచ్చేశారు. అందుకు తగ్గ కారణం బయటకు రాలేదు. ఇప్పుడు ఆ పాత్రను ప్రియమణి చేస్తున్నారు. అజయ్ దేవగన్ హీరోగా ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ ‘మైదాన్’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 13న విడుదల కానుంది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన మరో చిత్రం ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’. ఈ చిత్రంలో కీలక పాత్రలు చేయాల్సిన పరిణీతీ చోప్రా, రానా కొన్ని కారణాల వల్ల నటించలేదు. ఈ సినిమా త్వరలో ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కానుంది. హీరోయిన్ శ్రద్ధా కపూర్ వదిలిన బ్యాడ్మింటన్ రాకెట్‌ను పట్టుకున్నారు హీరోయిన్ పరిణీతీ చోప్రా. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా అమోల్ గుప్తే డైరెక్షన్లో ‘సైనా’ అనే చిత్రం వెండితెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. ‘సైనా’ చిత్రంలో సైనా నెహ్వాల్ పాత్రకు సైన్ చేశారు శ్రద్ధా కపూర్. కానీ ఆమె తప్పుకోవడంతో సైనాగా నటించేందుకు సై అన్నారు పరిణీతీ చోప్రా. ఇంకా ఇటు సౌత్ అటు నార్త్‌లో ఇలా సినిమా ఒప్పుకుని తప్పుకున్న తారలు కొందరు ఉన్నారు. ఇలా తారలు మారడం అనేది సహజంగా జరుగుతుంటుంది. -
‘ప్రపంచ చాంపియన్‌షిప్’ తేదీల్లో మార్పు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆగస్టులో స్పెయిన్ వేదికగా జరగాల్సిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలను నాలుగు నెలలపాటు వాయిదా వేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ వచ్చే ఏడాది నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5 వరకు జరుగుతుందని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తెలిపింది. ఈ ఏడాది జూలై–ఆగస్టులలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే సంవత్సరం జూలై–ఆగస్టుకు వాయిదా పడటంతో బీడబ్ల్యూఎఫ్ తమ మెగా టోర్నీ షెడ్యూల్లో మార్పులు చేసింది. -
సైఫ్ కూతురు మోసం చేసింది
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తనయ సారా అలీ ఖాన్ కోర్టు మెట్లేక్కనున్నారు. ‘కేదర్నాథ్’ సినిమా డేట్స్ విషయంలో గొడవలు రావడంతో సదరు చిత్ర యూనిట్ సారా మీద కోర్టులో దావా వేసింది. ముంబై హైకోర్టు నేడు(శుక్రవారం) ఈ విషయాన్ని విచారించనుండటంతో సారా, తండ్రి సైఫ్ అలీఖాన్‌తో కలిసి కోర్టుకు హజరవ్వనున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే... సారా అలీఖాన్ కేదార్నాథ్ సినిమా ద్వారా బాలీవుడ్‌కు పరిచయమవ్వాల్సిందన్న విషయం తెలిసిందే. అభిషేక్ కపూర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కోసం 2018 జూన్ వరకూ సారా డేట్స్ ఇచ్చారు. అయితే నిర్మాతకు, దర్శకుడికి మధ్య వివాదాలు రావడంతో ఈ సినిమా నిర్మాణం ఆగిపోయింది. దాంతో సారా, రోహిత్ శెట్టి తెరెక్కిస్తున్న ‘సింబా’(టెంపర్ రీమేక్) సినిమా కోసం డేట్లు అడ్జస్ట్ చేశారు. అదే సమయంలో మరో నిర్మాత దొరకటంతో అటకెక్కిందనుకున్న కేదార్నాథ్ షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. దీంతో తిరిగి షూటింగ్‌కు హజరవ్వాల్సిందిగా సారాను చిత్ర యూనిట్ కోరింది. కానీ ఆమె మేనేజర్ మాత్రం సింబా షూటింగ్ పూర్తయ్యాకే కేదర్నాథ్ చిత్రీకరణలో పాల్గొంటారని తేల్చి చెప్పారు. దీంతో కేదర్నాథ్ మేకర్లు సారా మీద కోర్టులో దావా వేసాడు. కోర్టు బయటే వివాదం పరిష్కరించుకునేందుకు సైఫ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. ఈ పిటిషన్ విచారణకు ముంబై హై కోర్టు ఎస్ జే కథ్వాలా నేతృత్వంలో బెంచ్‌ను ఏర్పాటు చేసింది. -
రీఎగ్జామ్ తేదీలను ప్రకటించిన సీబీఎస్ఈ
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఎస్ఈ పరీక్ష పేపర్ల లీకేజీ నేపథ్యంలో రీఎగ్జామ్ తేదీలను బోర్డు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 25వ తేదీన పన్నెండో తరగతి ఎకనామిక్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే టెన్త్ మ్యాథ్స్ ఎగ్జామ్ పై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. పదో తరగతి గణిత పరీక్షలను కేవలం ఢిల్లీ, హరియాణాలో మాత్రమే నిర్వహించే అవకాశం ఉండొచ్చని స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి అనిల్ స్వరూప్ పేర్కొన్నారు. ఒకవేళ దేశమంతా నిర్వహించాలని నిర్ణయిస్తే మాత్రం జూలైలో పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఏ విషయం అన్నది 15 రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. అయితే విద్యార్థులకు నష్టం కలగకుండా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఇక పేపర్ల లీకేజీ వ్యవహారంలో విచారణ అనంతరం దోషులెవరైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని.. వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. -
రక్తహీనతను తగ్గించే ఖర్జూరాలు
గుడ్‌ఫుడ్ ఖర్జూరాల్లో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలోని స్వాభావికమైన చక్కెరలైన గ్లూకోజ్, ఫ్రక్టోజ్లకు తక్షణం శక్తిని అందజేసే గుణం ఉంది. ఖర్జూరాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని... ఖర్జూరాలు కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గిస్తాయి. అందువల్ల గుండెకు మేలు చేస్తాయి, స్థూలకాయాన్ని నివారిస్తాయి. పొటాషియమ్ పుష్కలంగా ఉన్నందున పక్షవాతం వంటి జబ్బులను నివారిస్తాయి. వీటిల్లో విటమిన్ బి1, బి2, బి3, బి5, విటమిన్– ఏ, విటమిన్–సి పుష్కలంగా లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తింటే విటమిన్ సప్లిమెంట్స్ అవసరం రాదనడం అతిశయోక్తి కాదు. సెలేనియమ్, మ్యాంగనీస్, కాపర్, మెగ్నీషియమ్ పుష్కలంగా ఉన్నందున ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. దంతాలను సంరక్షిస్తాయి. ఖర్జూరాల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత తగ్గుతుంది. ఇవి జీర్ణశక్తితో పాటు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. అంతే కాదు... మలబద్దకాన్ని కూడా నివారిస్తాయి. -
ఏపీ సెట్ల తేదీలు ప్రకటన
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించబోయే వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన ఎడ్‌సెట్‌తో పాటు లాసెట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎంసెట్(ఇంజినీరింగ్)ను ఏప్రిల్ 24వ తేదీ నుంచి 27 వరకు.. ఎంసెట్(అగ్రి అండ్ మెడికల్)ను ఏప్రిల్ 28న జరుపుతామని వెల్లడించారు. ఐసెట్‌ను మే 2వ తేదీన, ఈ-సెట్‌ను మే నెల 3వ తేదీన జరగుతాయని చెప్పారు. పీజీఈసెట్‌ను మే 10,11వ తేదీల్లో నిర్వహించనున్నారు. -
ఆ చిహ్నానికి వేల ఏళ్ళు!
భారతీయులు పవిత్ర, ఆధ్యాత్మిక చిహ్నంగా విశ్వసించే స్వస్తిక్ గుర్తు ఎంతో ప్రాచీనమైనదని తాజా పరిశోధనలు వెల్లడించాయి. శాంతికి గుర్తుగా భావించే స్వస్తిక్ ఆర్యులకాలానికి ముందే ఉన్నట్లు తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. స్వస్తిక్ గుర్తుపై చేపట్టిన పరిశోధనలు ఎన్నో ఆశ్చర్యకర వివరాలను వెలుగులోకి తెచ్చాయి. స్వస్తిక్ చిహ్నం సుమారు 11, 12 వేల ఏళ్ళ క్రితమే ఉనికిలో ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. అయితే భారతీయ చిహ్నమైన స్వస్తిక్ ను అనంతరం హిట్లర్ తనకు అనుకూలంగా వాడుకున్నట్లు తమ పరిశోధనల్లో తేలినట్లు పేర్కొన్నారు. ఐఐటీ అహ్మదాబాద్, జాదవ్ పూర్, విశ్వవిద్యాలయాల్లోని పరిశోధకులు తమ అధ్యయనాల వివరాలను తాజాగా వెల్లడించారు. -
గర్ల్‌ఫ్రెండ్ మీద పెట్టిన ఖర్చుల కోసం..
మాస్కో: రష్యాలో ఓ యువతికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఓ లాయర్‌ను ప్రేమించిన పాపానికి కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఏ అమ్మాయికీ ఇలాంటి పరిస్థితి ఎదురుకావద్దని కోరుకుంటున్న సదరు యువతి వివరాల్లోకి వెళ్తే.. రష్యాలోని క్రాస్నోయార్క్ప్కు ప్రాంతానికి చెందిన జుర్స్కోయా.. ఓ యువ లాయర్‌తో సన్నిహితంగా ఉండేది. ఈ క్రమంలో అతనిపై మనసు పారేసుకున్న జుర్స్కోయా.. లాయర్‌తో కలిసి విహారయాత్రకు క్రిమియాకు వెళ్లింది. అయితే ఆ విహారయాత్రలో యువ లాయర్ తనకు ప్రపోజ్ చేస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె.. చివరికి అతను ప్రపోజ్ చేయకపోవటంతో నిరాశతో ఇంటికి చేరింది. ఆ తరువాతే మొదలైంది అసలు కథ. ప్రేమ విఫలమైందన్న బాధలో ఉన్న ఆమెకు కోర్టు నుంచి సమన్లు వచ్చాయి. అవి ఏంటా అని చూస్తే.. విహారయాత్రలో బొకేలకు.. రెస్టారెంట్లకు చేసిన ఖర్చులు సుమారు రూ. 40 వేలు తనకు చెల్లించాలంటూ సమన్లు పంపాడు ఆ బాయ్‌ఫ్రెండ్ లాయర్. రెస్టారెంట్ బిల్లులు, కాఫీ షాప్ బిల్లులతో పాటు అన్ని బిల్లులను పక్కాగా కోర్టులో సమర్పించి మరీ తనకు రావాల్సిన మొత్తాన్ని వసూలు చేసుకోవాలని చూస్తున్నాడు లాయర్ బాయ్‌ఫ్రెండ్. ఈ విషయంపై పేరు వెల్లడించని ఆ లాయర్ స్థానిక మీడియాతో మాట్టాడుతూ.. 'మా ఇద్దరి మధ్య ఎలాంటి రొమాంటిక్ రిలేషన్ లేదు. మేం సరదా గా విహార యాత్రకు వెళ్లాం. ఖర్చులు మొత్తం నేనే భరిస్తానని నేను ఆమెతో చెప్పలేదు. అందుకే నాకు రావాల్సిన మొత్తం కోసం కోర్టును ఆశ్రయించాను' అని చెబుతున్నాడు. ఎంతగానో ప్రేమించిన బాయ్‌ఫ్రెండ్.. ఖర్చులు చెల్లించమంటూ కోర్టుకెక్కడంతో ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతోంది జుర్స్కోయా. -
మెడికల్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారు
-
ఎడారి పండు.. పోషకాలు మెండు
సాక్షి, సిటీబ్యూరో: అలసిన దేహమనే యంత్రానికి ‘ఖర్జూరం’ ఓ శక్తి వనరు.. తక్షణ శక్తి ప్రదాయని. ఎన్నో పోషకాలతో నిగనిగలాడే ఈ పండు ఆరోగ్యాన్ని పరిపుష్టం చేస్తోంది. నిగనిగలాడే రంగు, మంచి రుచితో ప్రతి ఒక్కరినీ తనవైపు తిప్పుకుంటుంది. రంజాన్ మాసంలో దీనికో ప్రత్యేకత ఉంది. ‘రోజా’ దీక్షలను పాటించేవారు ఈ పండునే బాగా ఇష్టపడతారు. ఉపవాసం పూర్తయిన తర్వాత దేహానికి కావాల్సిన తక్షణ శక్తి కోసం దీన్ని తీసుకోవడం అనవాయితీ. ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం కావడంతో ఈ పండుకు మరింత డిమాండ్ పెరిగింది. ఎడారి దేశాల్లో పండే ఈ ఫలం వివిధ అరబ్ దేశాల నుంచి 15 నుంచి 20 రకాల ఖర్జూరాలు నగర మార్కెట్లను ముంచెత్తాయి. ఇరానీ (నలుపు, ఎరుపు), కిమియా ఖజూర్, కల్మీ ఖజూర్, తైబా ఖజూర్, మగ్ధీ ఖజూర్, ఆల్ మదీనా.. తదితర రకాలు లభిస్తున్నాయి. వీటి విక్రయాలకు నిలయమైన బేగంబజార్, గుల్జార్ హౌస్ తదితర ప్రాంతాల్లో హోల్‌సేల్ దుకాణాలు కొనుగోలు దారులతో కళకళలాడుతున్నాయి. ఇరాక్, ఇరాన్, సౌదీ, ఒమన్ దేశాల నుంచి ఈ పండ్లను దిగుమతి చేసుకుంటున్నట్లు బేగం బజార్‌లోని కాశ్మీర్ హౌస్ అధినేత ధీరజ్ కుమార్ తెలిపారు. కిలో ఇరాకీ ఖజూర్ రూ.50 నుంచి రూ.60, నలుపు రకం ఇరానీవి రూ.80 నుంచి రూ.100, ఎరుపు రూ.60, కీమియా ఖజూర్కు రూ.120-130 (బాక్స్), తైబా మగ్ధీ రకాలు రూ.130-140, ఆల్ మదీనా ఖజూర్ రూ.160-180 ధర పలుకుతోంది. క్యాలరీస్ అధికం - ఖర్జూరాల్లో క్యాలరీస్ అధికమని, మన దగ్గర డ్రై డేట్స్ వినియోగం ఎక్కువని గాంధీ ప్రకృతి వైద్యశాల వైద్యులు డా. శ్యామల తెలిపారు. ఈ పండులో పోషకాలు అధికమని వివరించారు. - 100 గ్రాముల ఖర్జూరంతో 400-600 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఫ్రెష్ డేట్స్‌లో క్యాలరీలు కాస్త తక్కువ. - ఖర్జూరాల్లో ఐరన్, ఫైబర్ ఎక్కువ. క్యాల్షియం, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్స్, కాపర్ పాళ్లు కూడా పుష్కలంగా ఉంటాయి. - 100 గ్రాముల డేట్స్‌లో 8-10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. - డేట్స్‌ను పాలతో కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే పిల్లల్లో, వృద్ధుల్లో, ఏదైనా జబ్బు నుంచి కోలుకునే వారికి ఇది మంచి ఆహారం. ఖర్జూరం తినడం వల్ల ఎల్డీఎల్ కొలస్ట్రాల్ బాగా తగ్గి గుండె పనితీరు బాగుంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. -
ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు గడువు పెంపు
-
తప్పక తినండి
ఆరోగ్యం ఏ ఆహార పదార్థంతోనైనా ఒకటో రెండో ఉపయోగాలు ఉంటాయి. కానీ ఖర్జూరంతో మాత్రం చెప్పలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే వెంటనే మీ ఆహారంలో ఖర్జూరాన్ని చేర్చేస్తారు.ఖర్జూరాలు మలబద్దకాన్ని నివారిస్తాయి. వీటిలో ఉండే ప్రత్యేక రసాయనం జీర్ణశక్తిని మెరుగుపర్చడమే కాక, పేగు సంబంధిత సమస్యలను నివారిస్తుంది. కడుపులో ఉండే హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఖర్జూరంలో ఉండే సోలబుల్, ఇన్సోలబుల్ ఫైబర్స్ పొట్ట నిండుగా ఉన్న భావనను కలిగిస్తాయి. ఆకలిని తగ్గించి, ఎక్కువ ఆహారాన్ని తినకుండా అడ్డుకుంటాయి. అలాగే వీటిలో ఉండే ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి నేచురల్ షుగర్స్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఖర్జూరంలో ఉంటే పొటాషియం, సల్ఫర్ శరీరంలోని కొవ్వును విచ్ఛిన్నం చేస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే కచ్చితంగా ఖర్జూరాలు తినమంటున్నారు డాక్టర్లు. -
నో డేట్ ఫర్ డేట్స్
గంగి గోవు పాలు గరిటెడైన ను చాలు... అన్నాడు వేమన! మంచి ఖర్జూరాలు రెండు తిన్న చాలు... అంటోంది వైద్యం! ఖర్జూరం... ఎడారులలోని ఒయాసిస్సుల దగ్గర పండి... ఒంటెల మీద ప్రయాణించి... మానవ సమాజంలోకి ప్రవే శించి... మన నాలుకల మీద కూర్చుని... తియ్య తియ్యగా... రంజు రంజుగా నడయాడుతూ... మనకి శక్తి నిచ్చి... మన చేత తైతక్కలాడిస్తూ... తన రాజసాన్ని నిలుపుకుంటోంది... ఖజురహో శిల్పంలా ఎడారిలో ఠీవిగా నిలబడుతోంది! ఎన ర్జీ సలాడ్, బొబ్బట్లు, ఖీర్, పికిల్, షేక్... ఎలా కావాలంటే అలా మలుచుకుని... తయారుచేసుకుని... ఆస్వాదించండి... 365 డేస్ దొరికే డేట్స్‌కి ప్రత్యేకమైన డేట్ లేదు... 24x7 దొరుకుతూనే ఉంటాయి..! ఖర్జూరం షేక్ కావలసినవి: ఖర్జూరాలు - 100 గ్రా. (సన్నగా తరగాలి); పాలు - 2 కప్పులు; వెనిలా ఐస్‌క్రీమ్ - 4 స్కూపులు; మీగడ - 8 టీ స్పూన్లు (చిక్కగా చిలకాలి); చెర్రీలు - 4 (ముక్కలుగా తరగాలి) తయారీ: మిక్సీలో కప్పు పాలు, ఖర్జూరం ముక్కలు వేసి మెత్తగా పేస్ట్‌లా చేయాలి మిగిలిన ఒక కప్పు పాలు, వెనిలా ఐస్‌క్రీమ్ జత చేసి మరో మారు మిక్సీ తిప్పాలి తయారైన మిశ్రమాన్ని పొడవుగా ఉండే గ్లాసులలో పోసి, పావు గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి రెండు టీ స్పూన్ల మీగడ, చెర్రీ ముక్కలతో అలంకరించి, వెంటనే అందించాలి. ఖర్జూరాల ఊరగాయ కావలసినవి: సన్నగా తరిగిన ఖర్జూరాలు - కప్పు; ఆవాలు - అర టీ స్పూను; అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను; మిరప్పొడి - 2 టీ స్పూన్లు; ఇంగువ - పావు టీ స్పూను; చింతపండు గుజ్జు - టేబుల్ స్పూను; కరివేపాకు - 3 రెమ్మలు; నూనె - టీ స్పూను; ఉప్పు - తగినంత తయారీ: బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి అర కప్పు నీళ్లు, ఖర్జూరం ముక్కలు వేయాలి నీళ్లు మరుగుతుండగా మంట తగ్గించి మూత పెట్టి ఉడికించాలి ఖర్జూరాలు బాగా ఉడికిన తర్వాత ఉప్పు, మిరప్పొడి, చింతపండు గుజ్జు వేసి బాగా కలపాలి చివరగా ఇంగువ వేసి బాగా కలిపి దించేయాలి బాగా చల్లారిన తర్వాత గాలి చొరని డబ్బాలోకి తీసుకుని, ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి ఆపిల్ - డేట్స్ ఖీర్ కావలసినవి: ఆపిల్ - 1 (సన్నగా తరగాలి); పంచదార - టీ స్పూను; పాలు - రెండున్నర కప్పులు (ఫ్యాట్ తక్కువ ఉన్నవి); సన్నగా తరిగిన ఖర్జూరాలు - కప్పు; గార్నిషింగ్ కోసం: వాల్నట్స్ - టేబుల్ స్పూను (సన్నగా తరగాలి); ఆపిల్ - చిన్న ముక్క (సన్నగా తరగాలి) తయారీ: నాన్‌స్టిక్ పాత్రలో... ఆపిల్ ముక్కలు, పంచదార, మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి సన్న మంట మీద ఆపకుండా కలుపుతూ, కొద్దిసేపు ఉడికించి దించేయాలి చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచాలి ఒక పాత్రలో పాలు, ఖర్జూరం తరుగు వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి సన్నని మంట మీద పది నిముషాలు ఆపకుండా కలుపుతూ ఉడికించి దించేయాలి చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచి తీయాలి సర్వ్ చేసే ముందు ఉడికించిన ఆపిల్ మిశ్రమాన్ని, ఖర్జూరం మిశ్రమానికి జత చేసి నెమ్మదిగా కలపాలి వాల్నట్స్ తరుగు, ఆపిల్ ముక్కలతో అలంకరించి చల్లచల్లగా అందించాలి. డేట్స్ ఎనర్జీ సలాడ్ కావలసినవి: క్యాలీఫ్లవర్ తరుగు - అర కప్పు; సన్నగా తరిగిన ఖర్జూరాలు - అర కప్పు; అరటిపండు - 1 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి); కమలాపండు - 1 (తొనలు తీయాలి); ఆపిల్స్ - 2 (తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి); నిమ్మరసం - అర టేబుల్ స్పూను; సన్నగా ముక్కలు చేసిన నిమ్మ తొనలు - అర టీ స్పూను; నూనె - అర టేబుల్ స్పూను; వెనిగర్ - అర టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; మిరియాల పొడి - తగినంత కమలాపండ్ల డ్రెసింగ్ కోసం... గట్టి పెరుగు - ముప్పావు కప్పు; కమలాపండ్ల రసం - 4 టీ స్పూన్లు; ఆవ పొడి - అర టీ స్పూను; పంచదార పొడి - అర టీ స్పూను; ఉప్పు - తగినంత తయారీ: ఒక పాత్రలో గట్టి పెరుగు, కమలాపండ్ల రసం, ఆవ పొడి, పంచదార పొడి, ఉప్పు అన్నీ వేసి బాగా కలిపి సుమారు అరగంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి ఒక పాత్రలో సన్నగా తరిగిన క్యాలీఫ్లవర్కి కొద్దిగా నీళ్లు జత చేసి, ఆవిరి మీద ఐదు నిమిషాలు ఉడికించి, చల్లార్చాలి నూనె, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి ఊరనివ్వాలి ఒక పాత్రలో ఉడికించిన క్యాలీ ఫ్లవర్, సన్నగా తరిగిన ఖర్జూరాలు, అరటిపండు ముక్కలు, కమలాపండు తొనలు, ఆపిల్ ముక్కలు, నిమ్మరసం, సన్నగా తరిగిన నిమ్మ తొనలు, నూనె, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి తయారుచేసి ఉంచుకున్న కమలాపండ్ల డ్రెసింగ్ వేసి చల్లగా అందించాలి ఖర్జూరం బొబ్బట్లు కావలసినవి: గోధుమపిండి - కప్పు పాలు - 4 టేబుల్ స్పూన్లు గింజలు తీసి సన్నగా తరిగిన ఖర్జూరాలు - ముప్పావు కప్పు నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు (వేయించి మెత్తగా పొడి చేయాలి) బ్రౌన్ సుగర్ - పావు కప్పు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది) పాలు - 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి - కొద్దిగా (చపాతీలకు అద్దడానికి) నెయ్యి - టీ స్పూను (కరిగించాలి) తయారీ: ఒక పాత్రలో గోధుమపిండి, పాలు వేసి, తగినన్ని నీళ్లు జత చేస్తూ చపాతీ పిండిలా కలిపి పైన మూత ఉంచి సుమారు గంట సేపు నాననివ్వాలి పిండిని ఉండలుగా చేసుకుని ఒక్కోదానిని చపాతీలా వత్తాలి ఒక పాత్రలో ఖర్జూరం తరుగు, నువ్వుల పొడి, బ్రౌన్ సుగర్, పాలు వేసి కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ముందుగా ఒత్తి ఉంచుకున్న చపాతీలో ఖర్జూరం మిశ్రమాన్ని తగినంత పరిమాణంలో ఉంచాలి నాలుగు వైపులా మూసేసి, పిండి అద్ది, చపాతీలా ఒత్తాలి అంచులను చేతితో జాగ్రత్తగా పల్చగా వచ్చేలా ఒత్తాలి స్టౌ మీద పెనం ఉంచి, ఒక్కో బొబ్బట్టు వేసి చుట్టూ నెయ్యి వేసి బాగా కాల్చి, రెండవ వైపు తిప్పాలి రెండో వైపు కూడా నెయ్యి వేసి కాల్చి తీసేయాలి వేడివేడిగా అందించాలి ఇందులో క్యాల్షియమ్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఎండు ఖర్జూరంలో ప్రతి 100 గ్రాములకు ఖర్జూరం చెట్లు సుమారు 10 - 20 మీటర్ల ఎత్తువరకూ పెరుగుతాయి. తాటి చెట్ల మాదిరిగానే వీటిలోనూ ఆడ చెట్లు, మగ చెట్లు వేర్వేరుగా ఉంటాయి. ఆడ చెట్లు మాత్రమే ఫలాలనిస్తాయి. ఈ చె ట్లను పండ్ల కోసమే కాకుండా నీడ, పశువుల మేత, కలప, ఆయుధాలు, తాళ్లు... కోసం సుమేరియన్లు పెంచినట్లుగా చరిత్ర చెబుతోంది. 5 - 8 ఏళ్ల వయసు వచ్చేసరికి ఖర్జూరపు చెట్లు కాపుకొస్తాయి. శక్తి - 280 కిలో క్యాలరీలు పిండి పదార్థాలు - 75 గ్రా. చక్కెర - 60 గ్రా. పీచుపదార్థాలు - 8 గ్రా. కొవ్వు పదార్థాలు - 0.4 గ్రా. మాంసకృత్తులు - 2.5 గ్రా. నీళ్లు - 21 గ్రా. విటమిన్‘సి’ - 0.4 గ్రా. ఒక పండుఖర్జూరంలో శక్తి - 23 కిలో క్యాలరీలు కొవ్వు పదార్థాలు - 0.03 గ్రా. పిండి పదార్థాలు - 6.23 గ్రా. మాంసకృత్తులు - 0.2 గ్రా. ఖర్జూరాలను ఒకప్పుడు అత్యధికంగా సాగు చేసిన దేశం ఇరాక్. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం ఖర్జూరం పంట ఇక్కడే పండేది. ఇక్కడి నాణేల మీద, స్టాంపుల మీద ఖర్జూరపు చెట్ల బొమ్మలు కనిపిస్తాయి. ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఏటా 11 లక్షల టన్నుల ఖర్జూరాల్ని ఉత్పత్తి చేస్తూ ఈజిప్టు ప్రథమ స్థానంలో వుంది. సహారా వాసులు మూడింట రెండొంతుల ఆదాయాన్ని ఈ పంట నుంచే పొందుతున్నారు. ఏ పండైనా పండుగా ఉన్నప్పుడే రుచిగా ఉంటుంది. కాని ఖర్జూరం ఎండినా రుచిగానే ఉంటుంది. ఎండు ఖర్జూరాలను వేసవిలో వడ దెబ్బ నుండి కాపాడుకోవడానికి ఉపయోగిస్తారు. రంజాన్ మాసంలో ఈ పండ్లతోనే ఉపవాస దీక్ష విరమిస్తారు. మహమ్మద్ ప్రవక్తకు ఇది ఎంతో ఇష్టమైన ఆహార ంగా పవిత్ర ఖురాన్ చెబుతోంది. ఆయన ఇంటికి కలపనిచ్చింది కూడా ఖర్జూరం చెట్లేనని చెబుతారు. లేత ఆకుల్ని కూరగా వండుతారు, ఖర్జూరపు మొగ్గల్ని సలాడ్లలో వాడతారు. కరవు సమయాల్లో వీటి విత్తనాల్ని పొడి చేసి గోధుమపిండిలో కలిపి రొట్టె చేసుకుని తింటారు. -
ఫ్రమ్ ఇరాక్ విత్ లవ్ ....!
ఎక్కడో ఇరాక్ నుంచి బయలుదేరుతుంది. ఆ తరువాత ముంబాయి తీరానికి చేరుకుంటుంది. అక్కడ నుంచి గుజరాత్ వ్యాపారుల గోడౌన్లలోకి వెళ్తుంది. అక్కడ నుంచి మన హైదరాబాద్ లోకి బేగం బజార్ లోకి, అక్కడినుంచి పాత బస్తీ వీధులు, సందుల్లోని మసీదుల్లోకి, దుకాణాల్లోకి, ఇళ్లలోకి వస్తాయి. రంజాన్ నెల వచ్చిందంటే చాలు దానికి భలే డిమాండ్! జహేదీ, అజ్వా, మేడ్ జోల్, కలిమీ, రుక్సానా ఇలా వేర్వేరు వెరైటీల రూపంలో అవి దొరుకుతాయి. అవి లేకపోతే రంజాన్ ఉపవాస దీక్ష (రోజా) ను సాయంత్రం నమాజుకు ముందు విడిచిపెట్టలేరు. ఇంతకీ అవేమిటని అనుకుంటున్నారు కదూ. అవే ... ఖర్జూరాలు. గుండె నిండా భక్తిపూర్వక నమాజు, నోటి నిండా గుప్పెడు తియ్యతియ్యని ఖర్జూరాలు.... రంజాన్ నెలంతా కనిపించే దృశ్యాలు ఇవే. ఇరాక్ లో ప్రస్తుతం భయంకరమైన అంతర్యుద్ధం నడుస్తున్నా మన దేశానికి ఖర్జూరం దిగుమతులు ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఖర్జూరాలను గత నవంబర్ లోనే సేకరించి, కోల్డ్ స్టోరేజ్ లో భద్రపరిచారు. అంతర్యుద్ధ ప్రారంభానికి ముందే ఖర్జూరాలు గుజరాత్ చేరుకున్నాయి. అందుకే ఈ సారి పెద్దగా ఖర్జూరాల ధరలు పెరగలేదు. అయితే ఖర్జూరం వ్యాపారులు మాత్రం ఖర్జూరాలను డ్రైఫ్రూట్స్ కేటగరీ నుంచి ఫ్రూట్స్ కేటగరీలో చేరిస్తే బాగుంటుందని అంటున్నారు. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ పై 12 శాతం వ్యాట్ పన్ను ఉంటుంది. పండ్ల పైన అంత పన్ను ఉండదు. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్ లలో ఖర్జూరాలను డ్రైఫ్రూట్స్ శ్రేణి నుంచి తొలగించారు. మన రాష్ట్రంలోనూ అలా చేస్తే బాగుంటుందని వ్యాపారులు అంటున్నారు. -
అనుష్క పై ఫైరైన గౌతమ్....