ఆ చిహ్నానికి వేల ఏళ్ళు!
భారతీయులు పవిత్ర, ఆధ్యాత్మిక చిహ్నంగా విశ్వసించే స్వస్తిక్ గుర్తు ఎంతో ప్రాచీనమైనదని తాజా పరిశోధనలు వెల్లడించాయి. శాంతికి గుర్తుగా భావించే స్వస్తిక్ ఆర్యులకాలానికి ముందే ఉన్నట్లు తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది.
స్వస్తిక్ గుర్తుపై చేపట్టిన పరిశోధనలు ఎన్నో ఆశ్చర్యకర వివరాలను వెలుగులోకి తెచ్చాయి. స్వస్తిక్ చిహ్నం సుమారు 11, 12 వేల ఏళ్ళ క్రితమే ఉనికిలో ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. అయితే భారతీయ చిహ్నమైన స్వస్తిక్ ను అనంతరం హిట్లర్ తనకు అనుకూలంగా వాడుకున్నట్లు తమ పరిశోధనల్లో తేలినట్లు పేర్కొన్నారు. ఐఐటీ అహ్మదాబాద్, జాదవ్ పూర్, విశ్వవిద్యాలయాల్లోని పరిశోధకులు తమ అధ్యయనాల వివరాలను తాజాగా వెల్లడించారు.