Swastika
-
Commonwealth Games: కోర్టుకెక్కిన మరో టీటీ ప్లేయర్.. ఏం జరిగింది?
కామన్వెల్త్ క్రీడల కోసం భారత టేబుల్ టెన్నిస్ జట్టు ఎంపికకు సంబంధించి వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే దియా చిటాలే, మనుష్ షా టీమ్ ఎంపికను ప్రశ్నించారు. తాజాగా స్వస్తిక ఘోష్ కూడా తనకు అన్యాయం జరిగిందంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఎంపిక ప్రక్రియ నియమ నిబంధనల ప్రకారం చూస్తే స్వస్తిక నాలుగో స్థానంలో ఉంటుందని, ఆమెను జట్టులోకి ఎంపిక చేయాల్సిందని ఆమె తండ్రి సందీప్ ఘోష్ వ్యాఖ్యానించారు. కాగా దియా చిటాలేను తర్వాత టీటీ జట్టులో చేర్చగా మానుష్ షాకు మాత్రం నిరాశే ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్ ఎంపిక నిబంధనల ప్రకారం అతడు టాప్-4లో ఉన్నా స్క్వాడ్‌లో చేర్చకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. శుక్రవారం ఇందుకు సంబంధించి విచారణ జరుగనుంది. ఇక జాతీయ స్థాయిలో ప్రదర్శన(50 శాతం), అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శన(30 శాతం).. సెలక్టర్ల విచక్షణ అధికారం(20 శాతం) మేరకు ఆయా ప్లేయర్లకు స్క్వాడ్(టాప్-4)లో చోటు దక్కుతుంది. ఈ క్రమంలో పలువురు టీటీ ఆటగాళ్లు కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: Avesh Khan: వారెవ్వా ఏం స్పీడు భయ్యా.. బ్యాట్ రెండు ముక్కలయ్యింది -
నటితో డ్రైవర్ అసభ్య ప్రవర్తన; అరెస్ట్
కోల్‌కతా: ప్రముఖ బెంగాల్ టీవీ సీరియల్ నటి స్వస్తికా దత్త పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉబర్ డ్రైవర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. సీరియల్ షూటింగ్‌కు వెళ్లడానికి బుధవారం ఉదయం స్వస్తికాదత్త ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేశారు. కారులో షూటింగ్ స్పాట్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో డ్రైవర్ బుకింగ్‌ను క్యాన్సిల్ చేసి, ఆమెను బయటికి లాగాలని ప్రయత్నించాడు. స్వస్తికా దత్త ప్రతిఘటించడంతో కారులోనే మరో చోటికి తీసుకెళ్లడానికి యత్నించి, ఫోన్లో తన ఫ్రెండ్స్‌ని కూడా రమ్మన్నాడు. దీంతో బెదిరిపోయిన నటి కారుదిగి గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ కారుతో సహా పారిపోయాడు. ఇదంతా కేవలం అరగంట వ్యవధిలో జరిగిందని స్వస్తికా దత్త సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కారు నెంబర్, డ్రైవర్ పేరుతో సహా వివరాలను షేర్ చేశారు. దీంతో స్పందించిన పోలీసులు డ్రైవర్ని అరెస్ట్ చేశారు. -
స్వస్తిక్ కథ ఇదీ..
ఓటింగ్ అనగానే గుర్తు వచ్చేది స్వస్తిక్ గుర్తు. బ్యాలెట్ పేపర్‌పై మనకు ఇష్టం వచ్చిన అభ్యర్థి ఎన్నికల గుర్తుపై ఇదే ముద్రవేసేవాళ్లం. దీన్ని 1962 ఎన్నికల సందర్భంగా తొలిసారి ఉపయోగించారు. అంతకుముందు 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లోనూ.. 1957లో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లోనూ స్వస్తిక్ లేకుండానే ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో పోటీచేసే ప్రతి అభ్యర్థికి ఒక బ్యాలెట్ బాక్స్ (డబ్బా) ను పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసేవారు. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థి పెట్టెలో బ్యాలెట్ పేపర్‌ను వేసేవారు. ఈ విధానంలో చెల్లని ఓట్లు ఉండేవి కావు. ఈ రెండు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తక్కువగా ఉండడంతో ఆ విధానంతో సర్దుకు పోయినా రాను రాను ఎన్నికల బరిలో నిలబడే వారి సంఖ్య పెరగడంతో స్వస్తిక్ గుర్తును వాడుకలోకి తెచ్చారు. 1999 సార్వత్రిక ఎన్నికల నుంచి ఈవీఎంలు వచ్చాయి. -
ఆ చిహ్నానికి వేల ఏళ్ళు!
భారతీయులు పవిత్ర, ఆధ్యాత్మిక చిహ్నంగా విశ్వసించే స్వస్తిక్ గుర్తు ఎంతో ప్రాచీనమైనదని తాజా పరిశోధనలు వెల్లడించాయి. శాంతికి గుర్తుగా భావించే స్వస్తిక్ ఆర్యులకాలానికి ముందే ఉన్నట్లు తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. స్వస్తిక్ గుర్తుపై చేపట్టిన పరిశోధనలు ఎన్నో ఆశ్చర్యకర వివరాలను వెలుగులోకి తెచ్చాయి. స్వస్తిక్ చిహ్నం సుమారు 11, 12 వేల ఏళ్ళ క్రితమే ఉనికిలో ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. అయితే భారతీయ చిహ్నమైన స్వస్తిక్ ను అనంతరం హిట్లర్ తనకు అనుకూలంగా వాడుకున్నట్లు తమ పరిశోధనల్లో తేలినట్లు పేర్కొన్నారు. ఐఐటీ అహ్మదాబాద్, జాదవ్ పూర్, విశ్వవిద్యాలయాల్లోని పరిశోధకులు తమ అధ్యయనాల వివరాలను తాజాగా వెల్లడించారు.