కామన్వెల్త్ క్రీడల కోసం భారత టేబుల్ టెన్నిస్ జట్టు ఎంపికకు సంబంధించి వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే దియా చిటాలే, మనుష్ షా టీమ్ ఎంపికను ప్రశ్నించారు. తాజాగా స్వస్తిక ఘోష్ కూడా తనకు అన్యాయం జరిగిందంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ఎంపిక ప్రక్రియ నియమ నిబంధనల ప్రకారం చూస్తే స్వస్తిక నాలుగో స్థానంలో ఉంటుందని, ఆమెను జట్టులోకి ఎంపిక చేయాల్సిందని ఆమె తండ్రి సందీప్ ఘోష్ వ్యాఖ్యానించారు.
కాగా దియా చిటాలేను తర్వాత టీటీ జట్టులో చేర్చగా మానుష్ షాకు మాత్రం నిరాశే ఎదురైంది. కామన్‌వెల్త్ గేమ్స్ ఎంపిక నిబంధనల ప్రకారం అతడు టాప్-4లో ఉన్నా స్క్వాడ్‌లో చేర్చకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. శుక్రవారం ఇందుకు సంబంధించి విచారణ జరుగనుంది.
ఇక జాతీయ స్థాయిలో ప్రదర్శన(50 శాతం), అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శన(30 శాతం).. సెలక్టర్ల విచక్షణ అధికారం(20 శాతం) మేరకు ఆయా ప్లేయర్లకు స్క్వాడ్(టాప్-4)లో చోటు దక్కుతుంది. ఈ క్రమంలో పలువురు టీటీ ఆటగాళ్లు కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.
చదవండి: Avesh Khan: వారెవ్వా ఏం స్పీడు భయ్యా.. బ్యాట్ రెండు ముక్కలయ్యింది
Comments
Please login to add a commentAdd a comment