Commonwealth Games
-
భారత్‌కు పెద్ద దెబ్బ
ఒలింపిక్స్, ఆసియా క్రీడల తర్వాత మూడో మెగా ఈవెంట్ కామన్వెల్త్ క్రీడలు. ఇందులో భారత క్రీడాకారులు ప్రతీసారి పెద్ద సంఖ్యలో పతకాలు పట్టుకొస్తున్నారు. పతకాల పట్టికలోనూ క్రమంగా పుంజుకుంటూ టాప్–10, టాప్–5 స్థానాల్లో పదిలంగా నిలుస్తున్నారు. అలాంటి మెగా ఈవెంట్లో ఇకపై పతకాల వేట, పోడియం వద్ద మువ్వన్నెల పతాకం రెపరెపలాడటం కష్టంగా మారనుంది. భారత్ అత్యధికంగా గెలిచే అవకాశాలున్న క్రీడాంశాలను ఆతిథ్య దేశం పెద్ద సంఖ్యలో తొలగించడం మన క్రీడాకారులకు నిజంగా గుండెకోతనే మిగల్చనుంది. ఓవరాల్‌గా పతకాల వేటకు పెద్ద దెబ్బ తగలనుంది. లండన్: మరో రెండేళ్లలో జరగబోయే కామన్వెల్త్ క్రీడలు భారత శిబిరాన్ని ఇప్పటి నుంచే నిరాశలో ముంచేశాయి. భారత క్రీడాకారులు పతకాలు కచ్చితంగా గెలిచే క్రీడాంశాలను ఆతిథ్య దేశం స్కాట్లాండ్ తొలగించింది. గ్లాస్గోలో 2026లో జరిగే ప్రసిద్ధ కామన్వెల్త్ పోటీలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత పరిమితంగా పదే పది క్రీడాంశాలతో మమ అనిపించేందుకు ఆర్గనైజింగ్ కమిటీ సిద్ధమైంది. గత బర్మింగ్‌హామ్ 2022 కామన్వెల్త్ గేమ్స్‌ను 19 క్రీడాంశాలతో నిర్వహించారు. ఇప్పుడు ఇందులో 9 క్రీడాంశాలకు కోత పెట్టారు. హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, రిథమిక్ జిమ్నాస్టిక్స్, డైవింగ్, బీచ్ వాలీబాల్ క్రీడలను తప్పించారు. షూటింగ్‌ను బర్మింగ్‌హామ్‌లోనే పక్కన బెట్టారు. తాజా తొలగింపుతో హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారులకు నిరాశే మిగిలింది. ఎందుకంటే భారత్ కచ్చితంగా ఈ ఐదు ఈవెంట్లలో పతకాలు గెలిచే అవకాశాలున్నాయి. బర్మింగ్‌హామ్‌లో భారత్ 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 30 పతకాలు ఆ ఈవెంట్లలోనే గెలుపొందడం విశేషం. అంటే దాదాపు సగం పతకాలను ఇకపై భారత్ కోల్పోనుండటం ఎదురుదెబ్బగా భావించవచ్చు. బడ్జెటే ప్రతిబంధకమా? నిజానికి 2026 క్రీడలు ఆ్రస్టేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో జరగాలి. అయితే అంచనాలను మించిపోతున్న బడ్జెట్ కారణంతో విక్టోరియా వైదొలగింది. దీంతో నిర్వహణకు గ్లాస్గో (స్కాట్లాండ్) ముందుకొచ్చిం ది. అయితే ఈ దేశం కూడా వేల సంఖ్యలో వచ్చే అథ్లెట్లు, అధికారులు వారికి కల్పించాల్సిన వసతులు, సదుపాయాల గురించి పెద్ద కసరత్తే చేసింది.అధిక సంఖ్యలో క్రీడాంశాల్ని నిర్వహించాలంటే వేదికల సంఖ్య కూడా పెంచాలి. అంటే అక్కడికి అథ్లెట్లు, అధికారిక గణాన్ని తరలించేందుకు రవాణా (లాజిస్టిక్స్) తదితర అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని భారీ ఖర్చుల్ని తగ్గించుకోవాలనే నిర్ణయానికి వచ్చిం ది. ఓ పరిమిత బడ్జెట్‌తో నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అందుకే 11 మందితో బరిలోకి దిగే పలు టీమ్ ఈవెంట్లతో పాటు మొత్తం 9 క్రీడాంశాలను తొలగించేసింది. కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య నియమావళి ప్రకారం ఆతిథ్య వేదికకు ఆ వెసులుబాటు ఎప్పటి నుంచో ఉంది. దీన్ని అనుసరించి కేవలం నాలుగే వేదికల్లో పది క్రీడాంశాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. తద్వారా స్కాట్లాండ్ ప్రభుత్వం మోపెడు ఖర్చును తగ్గించి అనుకున్న బడ్జెట్‌లోపే ఈవెంట్ ను నిర్వహించాలనుకుంటుంది. ఆడించే 10 క్రీడాంశాలు ఇవే... అథ్లెటిక్స్, స్విమ్మింగ్, ఆరి్టస్టిక్ జిమ్నాస్టిక్స్, ట్రాక్ సైక్లింగ్, నెట్‌బాల్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, జూడో, లాన్ బౌల్స్, 3్ఠ3 బాస్కెట్‌బాల్ క్రీడాంశాలతోనే గ్లాస్గో ఈవెంట్ జరుగుతుంది. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, లాన్ బౌల్స్ క్రీడాంశాల్లో దివ్యాంగ అథ్లెట్ల కోసం కూడా పోటీలు ఉంటాయి. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు జరుగుతాయి. తొలగించిన క్రీడాంశాలు... హాకీ, క్రికెట్ టీమ్ ఈవెంట్లతో పాటు బ్యాడ్మింటన్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్ (టీటీ), స్క్వాష్, రిథమిక్ జిమ్నాస్టిక్స్, డైవింగ్, బీచ్ వాలీబాల్ క్రీడలను గ్లాస్గో నిర్వాహక కమిటీ పక్కన బెట్టింది.2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ గెలిచిన పతకాలు రెజ్లింగ్ (12), వెయిట్‌లిఫ్టింగ్ (10), అథ్లెటిక్స్ (8), టేబుల్ టెన్నిస్ (7), బ్యాడ్మింటన్ (6), జూడో (3), బాక్సింగ్ (7), హాకీ (2), లాన్ బౌల్స్ (2), స్క్వాష్ (2), క్రికెట్ (1), పారా పవర్‌లిఫ్టింగ్ (1).బ్యాడ్మింటన్‌ను తొలగించాలనే గ్లాస్గో నిర్ణయం నన్ను కలవరపాటుకు గురిచేసింది. తీవ్ర నిరాశలో ముంచింది. క్రీడల్లో ప్రగతి సాధించే భారత్‌లాంటి దేశాలకు ఇది గొడ్డలిపెట్టు. మన షట్లర్లు ఈ క్రీడాంశంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. అంతర్జాతీయ వేదికలో సత్తా చాటుకునే అవకాశాన్ని ఇలా కాలరాయడం నిజంగా దురదృష్టకరం. –పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ ఇంకెందుకు కామన్వెల్త్ గేమ్స్? పూర్తిగా ఈవెంట్‌నే పక్కన బెట్టేయండి. కేవలం ఒలింపిక్స్, ఆసియా క్రీడలతోనే సరిపెట్టుకుందాం. ఎందుకంటే కీలకమైన ఆటల్ని తొలగించడం వల్ల కామన్వెల్త్ ప్రభ కోల్పోతుంది. వారి నిర్ణయం నన్ను నిర్ఘాంత పరిచింది. ఇక మనం మన జట్టును కామన్వెల్త్ గేమ్స్‌కు పంపించాల్సిన అవసరమే లేదు. –విమల్ కుమార్, భారత బ్యాడ్మింటన్ కోచ్ గ్లాస్గో నిర్వహించే పది క్రీడల్లో టేబుల్ టెన్నిస్ లేకపోవడం బాధాకరం. ఇదొక్కటే కాదు, తొలగించిన అన్ని క్రీడాంశాల ఆటగాళ్లకు ఎదురుదెబ్బ. ముఖ్యంగా టీటీలో మనం ఎన్నో స్వర్ణాలు గెలిచాం. –శరత్ కమల్, భారత టీటీ దిగ్గజం -
CWG 2026: మనకే దెబ్బ!.. ఎందుకిలా చేశారు?
ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ నుంచి కీలక క్రీడాంశాలను ఎత్తివేసింది నిర్వాహక బృందం. 2026లో గ్లాస్గో వేదికగా జరుగనున్న ఈ మెగా ఈవెంట్ నుంచి క్రికెట్, హాకీ, షూటింగ్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, రోడ్ రేసింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల్ని తొలగించారు. ఈ నేపథ్యంలో పతకాల పట్టికలో భారత్ వెనుకబడే అవకాశం ఉంది.మనకే దెబ్బ! తీవ్ర ప్రభావంఎందుకంటే.. హాకీ, క్రికెట్(మహిళలు), బ్యాడ్మింటన్, రెజ్లింగ్, షూటింగ్లలోనే మనకు ఎక్కువ పతకాలు వస్తున్నాయి. ముఖ్యంగా షూటింగ్లో అత్యధికంగా ఇప్పటి వరకు 135 కామన్వెల్త్ మెడల్స్ గెలిచింది భారత్. ఇందులో 63 పసిడి పతకాలు ఉండటం విశేషం. మరోవైపు.. రెజ్లింగ్‌లోనూ వివిధ విభాగాల్లో 114 మెడల్స్ దక్కాయి.బడ్జెట్‌ను తగ్గించుకోవడం కోసమే!వచ్చే కామన్వెల్త్ గేమ్స్ నుంచి ఈ రెండింటిని తొలగించారు గనుక భారత్‌కు ఎదురుదెబ్బ తప్పకపోవచ్చు. అయితే, గ్లాస్గో ఆర్గనైజింగ్ కమిటీ ఈ మేర క్రీడల్ని తొలగించడానికి ప్రధాన కారణం బడ్జెట్‌ను తగ్గించుకోవడం కోసమే అని తెలుస్తోంది. గతంలో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో అత్యధికంగా 10 క్రీడలు మాత్రమే నిర్వహించేవారు. అయితే, 1998 తర్వాత 15- 20 క్రీడలను అదనంగా చేర్చారు.నాలుగు వేదికల్లోనే ఈవెంట్స్అయితే, గ్లాస్గోలో పాత పద్ధతినే ఫాలో అయ్యేందుకు నిర్వాహకులు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. తక్కువ క్రీడలు ఉంటే తక్కువ వేదికలు మాత్రమే అవసరమవుతాయి.. ఫలితంగా తక్కువ ఖర్చుతో మెగా ఈవెంట్‌ను పూర్తి చేయవచ్చని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి కేవలం నాలుగు వేదికల్లోనే ఈవెంట్స్ నిర్వహించనున్నారు.స్కాట్స్టౌన్ స్టేడియం, టోల్క్రాస్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ సెంటర్, కామన్వెల్త్ ఎరీనా/సర్ క్రిస్ హోయ్ వెలడ్రోమ్, స్కాటిష్ ఈవెంట్స్ క్యాంపస్‌లను వేదికలుగా ఎంపిక చేశారు. అయితే, గ్లాస్గో ఆర్గనైజింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ కాదు. భవిష్యత్తులో మరిన్ని క్రీడలను చేర్చే, తొలగించే వెసలుబాటు ఆతిథ్య దేశాల కమిటీలకు ఉంటుంది. తమ దేశ పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వీలుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్-2026లో ఉండబోయే క్రీడలు👉అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్👉స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్👉ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్👉ట్రాక్ సైక్లింగ్, పారా ట్రాక్ సైక్లింగ్👉నెట్‌బాల్👉వెయిట్‌లిఫ్టింగ్, పారా వెయిట్‌లిఫ్టింగ్👉బాక్సింగ్👉జూడో👉బౌల్స్, పారా బౌల్స్👉3*3 బాస్కెట్‌బాల్, 3*3 వీల్‌చైర్ బాస్కెట్‌బాల్.చదవండి: Sarfaraz vs KL Rahul: గిల్ రాక.. ఎవరిపై వేటు? కోచ్ ఆన్సర్ ఇదే -
‘కామన్వెల్త్’ నుంచి హాకీ, రెజ్లింగ్ అవుట్!
వచ్చే కామన్వెల్త్ క్రీడల్లో హాకీతోపాటు షూటింగ్, రెజ్లింగ్, క్రికెట్ తదితర పదమూడు క్రీడాంశాలను పక్కన బెట్టాలని నిర్వాహకులు చూస్తున్నారు. ఈ అంశంపై కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ బయటికి మాత్రం వెల్లడించడం లేదని మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) కూడా దీనిపై స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. కాగా 1998 కామన్వెల్త్ గేమ్స్‌లో హాకీని చేర్చాక ఇప్పటివరకు ఆ క్రీడను కొనసాగించారు.అయితే 2026లో మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చే గ్లాస్గో (స్కాట్లాండ్) బడ్జెట్‌ను తగ్గించుకునే పనిలో భాగంగా హాకీకి మంగళం పాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో 19 క్రీడాంశాలను నిర్వహించగా, వీటిని కుదించాలని గ్లాస్గో ఆర్గనైజింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది. కేవలం నాలుగు వేదికల్లో కుదించిన క్రీడాంశాలను నిర్వహించడం ద్వారా బడ్జెట్‌ను చాలా వరకు తగ్గించుకోవచ్చని భావిస్తోంది.ఇక 2026 ఏడాదిలో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు ఈ కామన్వెల్త్ గేమ్స్ ఉండగా, రెండు వారాల్లోపే ప్రపంచకప్ హాకీ కూడా ఉండటం కూడా సాకుగా చూపే అవకాశముంది. బెల్జియం, నెదర్లాండ్స్‌లు సంయుక్తంగా నిర్వహించే ప్రపంచకప్ హాకీ టోర్నీ ఆగస్టు 15 నుంచి 30 వరకు జరుగుతుంది. హాకీ ఆటను తొలగించాలనుకుంటున్న వార్తలపై స్పందించిన ఎఫ్ఐహెచ్ త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పింది. మంగళవారం క్రీడాంశాల విషయమై ప్రకటన వెలువడుతుందని చెప్పింది. 2022 బరి్మంగ్‌హామ్ గేమ్స్‌లో పురుషుల విభాగం ఆస్ట్రేలియా జట్టుకు స్వర్ణం లభించగా... భారత జట్టుకు రజతం దక్కింది. కాగా తొలగించేక్రీడల జాబితాలో హాకీ, క్రికెట్, రగ్బీ సెవన్స్, డైవింగ్, బ్యాడ్మింటన్, బీచ్ వాలీబాల్, రోడ్ సైక్లింగ్, మౌంటేన్బైకింగ్, రిథమిక్, జిమ్నాస్టిక్స్, స్క్వాష్ , టేబుల్ టెన్నిస్/పారా టేబుల్ టెన్నిస్, ట్రైయథ్లాన్/పారాట్రైయథ్లాన్, రెజ్లింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: IND vs AUS: ఆసీస్ టూర్‌కు భారత జట్టు ప్రకటన -
బాబోయ్... భరించలేం!
గోల్డ్‌కోస్ట్ (ఆ్రస్టేలియా): బ్రిటిష్ రాజ్యమేలిన దేశాల మధ్య ప్రతి నాలుగేళ్లకోసారి అంగరంగ వైభవంగా జరిగే కామన్వెల్త్ క్రీడలు ఆతిథ్య నగరాలకు గుదిబండగా మారాయి. ఆ్రస్టేలియాలాంటి అభివృద్ధి చెందిన దేశాలే నిర్వహణ పెనుభారంగా భావిస్తున్నాయి. మాకొద్దంటే మాకొద్దని ఘనమైన ఆతిథ్యానికి దూరం జరుగుతున్నాయి. తాజాగా 2026 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించలేమని ఆ్రస్టేలియాకు చెందిన మరో నగరం గోల్డ్‌కోస్ట్ కూడా వైదొలిగింది. రెండేళ్లలో జరిగే ఈ క్రీడల హక్కుల్ని తొలుత ఆ్రస్టేలియాలోని విక్టోరియా రాష్ట్రం దక్కించుకుంది. అయితే క్రీడాగ్రామం నిర్మాణం, మౌలిక వసతుల ఏర్పాటు, రవాణా, ఇతరత్రా ఆధునిక సదుపాయాల కల్పన తదితర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని నిర్ధారించుకున్నాక విక్టోరియా ఆతిథ్యం నుంచి తప్పుకుంటున్నట్లు ఈ జూలైలోనే వెల్లడించింది. దీంతో 2018లో ఈ క్రీడల్ని విజయవంతంగా నిర్వహించిన గోల్డ్‌కోస్ట్ మరోసారి ఆతిథ్యమిచ్చేందుకు ముందుకొచి్చంది. అయితే 700 కోట్ల డాలర్లకు పైగా వ్యయమయ్యే ఈ క్రీడల ఆతిథ్యాన్ని మరోసారి భరించడం కష్టమని వివరిస్తూ గోల్డ్‌కోస్ట్ కూడా ఈ క్రీడల నిర్వహణ బాధ్యతల నుంచి వైదొలిగింది. ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిందిగా కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్)కు గోల్డ్‌కోస్ట్ నగర మేయర్ టామ్ టేట్ సూచించారు. ఆస్ట్రేలియా కాకుండా మరో మూడు దేశాలు కామన్వెల్త్ క్రీడల కోసం ఆసక్తి చూపిస్తున్నాయని చెబుతున్నప్పటికీ అనుకున్నట్లుగా 2026లో కామన్వెల్త్ గేమ్స్ జరిగే అవకాశాలు లేవు. ఒకవేళ జరిగితే మాత్రం మరుసటి ఏడాది (2027) జరగొచ్చు. -
'అంత బడ్జెట్ మావల్ల కాదు'.. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేం
ఒలింపిక్స్ తర్వాత అత్యంత ప్రాధాన్యమున్న టోర్నీ కామన్వెల్త్ గేమ్స్. కాగా నాలుగేళ్లకోసారి నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్‌ను 2026లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్(Victoria State) వేదిక కానుంది. కానీ తాజాగా తాము కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించలేమని విక్టోరియా స్టేట్ తేల్చి చెప్పింది. అనుకున్నదాని కంటే బడ్జెట్ ఎక్కువైతుందని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత బడ్జెట్‌తో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడం తమకు సాధ్యం కాదని పేర్కొంది. గేమ్స్ నిర్వహణ నుంచి తాము తప్పుకుంటున్నట్లు ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్ అథారిటీకి సమాచారమిచ్చామని.. మా కాంట్రాక్ట్‌ను రద్దు చేసి వేరే వాళ్లకు ఇవ్వడం మంచిదని కోరినట్లు విక్టోరియా స్టేట్ ప్రతినిధులు తెలిపారు. విక్టోరియా స్టేట్ ప్రీమియర్ డానియెల్ ఆండ్రూస్ మెల్బోర్న్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ''మొదట కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బడ్జెట్లో రెండు ఆస్ట్రేలియన్ బిలియన్ డాలర్స్($2Aus Billion Dollars) కేటాయించాం. కానీ ఇప్పుడు చూస్తే అది ఏడు ఆస్ట్రేలియ బిలియన్ డాలర్లు($7Aus Billion Dollars) అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిలో మాకు ఇది కష్టంగా అనిపిస్తోంది. అసలే లోటు బడ్జెట్‌తో కొట్టుమిట్టాడుతున్న మాకు కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ భారంగా మారే అవకాశం ఉంది. ఒక ఆసుపత్రి లేదా స్కూల్స్ నిర్వహణకు ఖర్చు చేయాల్సిన దానిని ఇలా కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు వినియోగించలేం.. ఇది మాకు మూడింతల బడ్జెట్'' అని తెలిపారు. విక్టోరియా స్టేట్ ప్రతినిధి డానియెల్ ఆండ్రూస్ ► ఇక 2022లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌కు ఇంగ్లండ్‌లోని బర్మింగ్హమ్ పట్టణం ఆతిథ్యమిచ్చింది. ఈ గేమ్స్‌లో ఆస్ట్రేలియా 179 పతకాలతో టాప్‌లో ఉండగా.. రెండో స్థానంలో ఇంగ్లండ్ 176 పతకాలతో ఉంది. ఇక భారత్ ఈ గేమ్స్‌లో 61 పతకాలు(22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో) నాలుగో స్థానంలో నిలిచింది. When the Commonwealth Games needed a host city to step in at the last minute, we were willing to help – but not at any price. And not without a big lasting benefit for regional Victoria. — Dan Andrews (@DanielAndrewsMP) July 17, 2023 చదవండి: Asian Games 2023: ఇదేం క్రికెట్ స్టేడియం.. చైనాపై పెదవి విరుస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ -
స్వర్ణపతకం సాధించిన కొన్ని క్షణాల్లోనే తండ్రి మృతి.. విలవిల్లాడిన లోకప్రియ
సాక్షి, చెన్నై(కొరుక్కుపేట): న్యూజిలాండ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పట్టుకోట్టైకి చెందిన క్రీడాకారిణి స్వర్ణం సాధించిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు. తన తండ్రి చనిపోయాడన్న విషయం తెలుసుకున్న క్రీడాకారిణి శోకసంద్రం అయింది. తంజావూరు జిల్లా పట్టుకోట్టై అన్నానగర్‌కు చెందిన పెయింటర్ సెల్వముత్తు (50) భార్య రీటా మేరీ (42)కి ముగ్గురు కుమార్తెలు లోకప్రియ (22), ప్రియదర్శిని (19), ప్రియాంక (14). ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన లోకప్రియ చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తితో ఆసియా, రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకాలు సాధించింది. న్యూజిలాండ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన లోకప్రియ 52 కిలోల జూనియర్ విభాగంలో 350 కిలోలు ఎత్తి బంగారు పతకాన్ని గెలుచుకుంది. న్యూజిలాండ్‌లో నిన్న తెల్లవారుజామున 2 గంటలకు ఈ మ్యాచ్ జరిగింది. చదవండి: (కటకటాల్లోకి నిత్య పెళ్లికూతురు.. నాలుగు పెళ్లి చేసుకొని..) ఈ క్రమంలో లోకప్రియ తండ్రి సెల్వముత్తు నిన్న రాత్రి 8 గంటల సమయంలో పుదుక్కోట జిల్లా కందర్వ కోట తాలూకా రన్‌పట్టి వద్ద గుండెపోటుతో మరణించారు. లోకప్రియకు పోటీ ముగిసేవరకు చెప్పలేదు. పోటీ ముగిసిన అనంతరం స్వర్ణపతకం సాధించిన లోకప్రియకు తన తండ్రి మరణవార్తను వీడియో కాల్లో తెలిపారు. దీంతో లోకప్రియ వీడియో కాల్‌లోనే తండ్రి మృతదేహాన్ని చూసి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ గోల్డ్‌మెడల్ గెలిచిన ఆనందం ఐదు నిమిషాలు కూడా నిలవలేదన్నారు. తాను న్యూజిలాండ్‌కు వెళ్తున్న విషయం తన తండ్రికి చెప్పలేదని, పతకం సాధించాక వీడియో కాల్లో చూపించి తన ఆశీస్సులు పొందాలనుకున్నానని వాపోయింది. తనకు తండ్రి దూరం కావడం తీరని లోటని, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు క్రీడాకోటాలో ఉపాధి కల్పిస్తే తన కుటుంబాన్ని కాపాడుకుంటానని చెప్పింది. -
ఆట మారుతుందా?
బరిలో ఆట కన్నా బాసు హోదాలో సీటు ముఖ్యమని పేరుబడ్డ మన క్రీడాసంస్థల్లో మార్పు వస్తోందంటే అంతకన్నా ఇంకేం కావాలి! ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడోత్సవాల లాంటి అంతర్జాతీయ వేదికలపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించే అథ్లెట్లను ఎంపిక చేసే ప్రతిష్ఠా త్మక క్రీడాసంఘానికి క్రీడా నిపుణులే సారథ్యం వహిస్తున్నారంటే సంతోషమేగా! ఎప్పుడో 95 ఏళ్ళ క్రితం ఏర్పాటైన పేరున్న క్రీడాసంఘం ‘ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్’ (ఐఓఏ)కు తొలి సారిగా ఓ మహిళా క్రీడాకారిణి పగ్గాలు చేపట్టనుండడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. గతంలో పలు వివాదాలకు గురైన ఐఓఏకు డిసెంబర్ 10న ఎన్నికలు. నామినేషన్ల తుది గడువు ఆదివారం ముగిసేసరికి, ప్రసిద్ధ మాజీ అథ్లెట్ పీటీ ఉష ఒక్కరే అధ్యక్ష పదవికి బరిలో ఉండడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈసారి ఐఓఏ కార్యవర్గంలో ఈ పరుగుల రాణితో పాటు ప్రసిద్ధ ఆటగాళ్ళ ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. భారత క్రీడాంగణంలో ఇది నూతన ఉషోదయం అనిపిస్తోంది. అవినీతి, ఆశ్రితపక్షపాతం, రాజకీయ పార్టీలకు ఆలవాలంగా మన దేశంలోని క్రీడాసమాఖ్యలు అపకీర్తిని సంపాదించుకున్నాయి. ఆ కుళ్ళు కంపుతో, అందరూ ప్రక్షాళనకు ఎదురుచూస్తున్న వేళ ఐఓఏకు తొలిసారిగా ఒక మహిళ, ఒక ఒలింపిక్ ప్లేయర్, ఒక అంతర్జాతీయ పతక విజేత పగ్గాలు చేపట్టడం నిజంగానే చరిత్ర. వాస్తవానికి, పాలనాపరమైన అంశాలను తక్షణం పరిష్కరించుకోవా లనీ, లేదంటే సస్పెన్షన్ వేటు తప్పదనీ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) సెప్టెంబర్‌లోనే ఐఓఏకు తుది హెచ్చరిక చేసింది. డిసెంబర్ లోగా ఎన్నికలు జరపాలని గడువు పెట్టింది. గతంలో పదేళ్ళ క్రితం ఐఓసీ ఇలాగే సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం. తాజా హెచ్చరికల పర్యవసానమే ఈ ఎన్నికలు. కొత్తగా కనిపిస్తున్న మార్పులు. ఆసియా క్రీడోత్సవాల్లో నాలుగుసార్లు ఛాంపియన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలైన 58 ఏళ్ళ ఉషకు ఇప్పుడు ఈ కిరీటం దక్కడం ముదావహం. ఈసారి ఐఓఏ కార్యవర్గ (ఈసీ) ఎన్నికల నామినేషన్లలో ఆసక్తికరమైన అంశాలేమిటంటే – గడచిన ఈసీలో ఉన్నవారెవరూ ఈసారి నామినేషన్ వేయలేదు. అలాగే, ఈసీలో సగం మందికి పైగా క్రీడాకారులున్నారు. మొత్తం 15 మంది సభ్యుల ప్యానెల్లో పీటీ ఉష కాక లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణపతక విజేత – షూటర్ గగన్ నారంగ్ (ఉపాధ్యక్షుడు) సహా మరో అరడజను మంది ఆటగాళ్ళకు చోటు దక్కింది. మల్లయోధుడు యోగేశ్వర్ దత్, విలువిద్యా నిపుణురాలు డోలా బెనర్జీ, అథ్లెట్ల నుంచి బాక్సింగ్ రాణి మేరీ కోమ్, అంతర్జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ తాజా ప్యానెల్లో ఉండడం విశేషం. డిసెంబర్ 10న ఎన్నికలతో కార్యవర్గం తుదిరూపు తేలనుంది. స్వయంగా క్రీడాకారులూ, ఆటల్లో నిపుణులూ ఈసారి ఐఓఏ కార్యవర్గానికి అభ్యర్థులు కావడం ఆహ్వానించదగ్గ పరిణామమే. రేపు ఎన్నికైన తర్వాత వారి ఆటలో నైపుణ్యం, అనుభవం భారత క్రీడా రంగ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి పనికొస్తాయి. అనేక దశాబ్దాలుగా ఏదో ఒక పదవిలో కూర్చొని సంస్థను ఆడిస్తున్న బడాబాబులకూ, 70 ఏళ్ళు దాటిన వృద్ధ జంబూకాలకూ ఐఓఏ రాజ్యాంగంలో సవరణల పుణ్యమా అని ఈసారి కార్యవర్గంలో చోటు లేకుండా పోయింది. చివరకు సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా అండగా నిలిచిన వర్గానికి సైతం బరిలో నిలిచిన కొత్త ఈసీ ప్యానెల్లో స్థానం దక్కకపోవడం విశేషమే. నిజానికి, ఆటల విషయంలో నిర్ణయాత్మకమైన క్రీడా సంఘాల్లో అథ్లెట్లకు ప్రధానంగా స్థానం కల్పించాలని కోర్టులు చిరకాలంగా చెబుతున్నాయి. జాతీయ క్రీడా నియమావళి, ఐఓసీ నియమా వళి సైతం సంఘాల నిర్వహణలో ఆటగాళ్ళకే పెద్దపీట వేయాలని చెబుతున్నాయి. దేశంలోని క్రీడా సంఘాలకు పెద్ద తలకాయ లాంటి ఐఓసీలో ఇప్పటి దాకా అలాంటి ప్రయత్నాలు జరిగిన దాఖలాలు లేవు. సుప్రీమ్ కోర్ట్ మాజీ జడ్జి ఎల్. నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈసారి ఐఓసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక సంఘానికి ఆయన కొత్త రాజ్యాంగం సిద్ధం చేశారు. ఇక, ఈ సంఘంలోని మొత్తం 77 మంది సభ్యుల ఎలక్టోరల్ కాలేజ్‌లో దాదాపు 25 శాతం మాజీ అథ్లెట్లే. వారిలోనూ పురుషుల (38) సంఖ్య కన్నా స్త్రీల (39) సంఖ్య ఎక్కువ కావడం విశేషం. అందివచ్చిన అవకాశాన్ని పరుగుల రాణి ఉష, బృందం ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారో? రానున్న రోజుల్లో ఐఓఏ రోజువారీ నిర్వహణలో వీరందరి మాటా మరింతగా చెల్లుబాటు కానుంది. అయితే, అధికారంతో పాటు అపారమైన బాధ్యతా వీరి మీద ఉంది. అథ్లెట్లకు అండగా నిలుస్తూ, దేశంలో క్రీడాసంస్కృతిని పెంచి పోషించాల్సిందీ వారే. అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో తలమునకలైన దేశ అత్యున్నత క్రీడాసంఘంలో అది అనుకున్నంత సులభం కాదు. విభిన్న వర్గాలుగా చీలి, వివాదాల్లో చిక్కుకొన్న వారసత్వం ఐఓఏది. అలాగే దేశంలో ఇతర జాతీయ క్రీడా సమాఖ్యలు, పాత ఐఓఏ సభ్యులు, కొత్త రాజ్యాంగంలో ఓటింగ్ హక్కులు కోల్పోయిన రాష్ట్ర శాఖలతో తలనొప్పి సరేసరి. వీటన్నిటినీ దాటుకొని రావాలి. అనేక ఆటలతో కూడిన ప్రధాన క్రీడోత్సవాలకు ఎంట్రీలు పంపే పోస్టాఫీస్‌లా తయారైన సంఘాన్ని గాడినపెట్టాలి. మరో ఏణ్ణర్ధంలో జరగనున్న 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌కు భారత ఆటగాళ్ళను సిద్ధం చేయాలి. ఉష అండ్ టీమ్ ముందున్న పెను సవాలు. కేంద్రం, క్రీడాశాఖ అండదండలతో ఈ మాజీ ఆటగాళ్ళు తమ క్రీడా జీవితంలో లాగానే ఇక్కడా అవరోధాలను అధిగమించి, అద్భుతాలు చేస్తారా? -
మ్యాచ్‌కు డుమ్మా కొట్టి బంధువుల ఇళ్లకు వెళ్లిన ఇద్దరు బంగ్లాదేశ్ ప్లేయర్స్‌పై నిషేధం
కామన్వెల్త్ గేమ్స్ లాంటి కీలకమైన ఈవెంట్లో మ్యాచ్‌కు డుమ్మా కొట్టి బంధువుల ఇళ్ల సందర్శనకు వెళ్లిన ఇద్దరు బంగ్లాదేశీ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణులపై ఆ దేశ క్రీడల సమాఖ్య నిషేధం విధించింది. సోనమ్ సుల్తానా సోమా, సాదియా అక్తర్ మౌ అనే ఇద్దరు బంగ్లాదేశ్ టీటీ ప్లేయర్లు.. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఆగస్ట్ 5న షెడ్యూలైన మహిళల మ్యాచ్‌ల్లో (సింగిల్స్, డబుల్స్, మిక్సడ్ డబుల్స్) పాల్గొనాల్సి ఉండింది. అయితే ఈ జోడీ క్యాంప్ అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, మ్యాచ్ సమయానికి కనిపించకుండా పోయారు (బంధువుల ఇళ్లకు వెళ్లినట్లు విచారణలో పేర్కొన్నారు). దీంతో ప్రత్యర్ధులకు బై లభించింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బంగ్లాదేశ్ క్రీడల సమాఖ్య.. దేశ ప్రతిష్టకు భంగం కలిగించారన్న కారణంగా ఇద్దరు మహిళా టీటీ ప్లేయర్లపై రెండేళ్ల నిషేధం విధించింది. ఈ నిషేధం అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు డొమెస్టిక్ సర్క్యూట్‌కు కూడా వర్తిస్తుందని బంగ్లాదేశ్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రకటించింది. చదవండి: G.O.A.T అని ఇలా కూడా పిలవొచ్చా.. వారెవ్వా! -
డోపింగ్‌లో దొరికిన భారత డిస్కస్ త్రోయర్ నవ్‌జీత్ కౌర్
ఇటీవల బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పోటీపడ్డ భారత మహిళా డిస్కస్ త్రోయర్ నవ్‌జీత్ కౌర్ ధిల్లాన్ డోపింగ్ పరీక్షలో విఫలమైంది. గత నెలలో ప్రపంచ చాంపియన్‌షిప్ కంటే ముందు ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్‌లో నిషేధిత ఉత్ప్రేరకాల ఆనవాళ్లు ఉన్నాయని అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్ (ఏఐయూ) శనివారం ప్రకటించింది. పంజాబ్‌కు చెందిన 27 ఏళ్ల నవ్‌జీత్ 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం నెగ్గింది. బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో మాత్రం ఆమె ఎనిమిదో స్థానంలో నిలిచింది. గత జూన్‌లో చెన్నైలో జరిగిన ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో, కజకిస్తాన్‌లో జరిగిన కొసనోవ్ స్మారక మీట్లో నవ్‌జీత్ స్వర్ణ పతకాలు సాధించింది. నవ్‌జీత్‌పై నాలుగేళ్ల నిషేధం విధించే అవకాశముంది. -
అథ్లెట్ స్వయంగా కూలీకి వెళితే తప్ప ఇల్లు గడవని స్థితి... అయినా అద్భుత విజయాలు!
సాక్షి, హైదరాబాద్: ‘ఒక అథ్లెట్ స్వయంగా కూలీకి వెళితే తప్ప ఇల్లు గడవని స్థితి. మరొకరి తల్లిదండ్రులు రోజూవారీ కార్మికులు. ఇంకొకరిది కూడా కడు పేదరికం. కానీ ఇలాంటి స్థితినుంచి వచ్చి కూడా వారు అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ప్రదర్శన కనబరుస్తున్నారు. అందుకే మన అథ్లెట్లను చూస్తే నాకు గౌరవం, గర్వం కలుగుతాయి. వారి శ్రమను ప్రత్యేకంగా అభినందించాలని అనిపిస్తుంది’ అని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యాఖ్యానించారు. బ్యాడ్మింటన్ సహా కొన్ని ఇతర క్రీడల్లో కనీస స్థాయినుంచి మొదలు పెట్టి మరింతగా పైకి ఎదుగుతారని... కానీ కనీస సౌకర్యాలు లేని నేపథ్యంనుంచి వచ్చి అథ్లెట్లు సాధించే సాధారణ విజయాలను కూడా చాలా గొప్పగా భావించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘గోపీచంద్–మైత్రా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఇటీవల భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్లను సన్మానించారు. దాదాపు ఏడేళ్ల క్రితం.. యువ క్రీడాకారులకు అండగా నిలవాలనే సంకల్పంతో ‘మైత్రా ఫౌండేషన్’తో జత కట్టానని, అది మంచి ఫలితాలు ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేసిన గోపీచంద్... ప్రభుత్వ సంస్థలు ‘సాయ్’, ‘శాట్స్’ అధికారికంగా ఇచ్చే సౌకర్యాలతో పాటు కీలక సమయాల్లో ఆటగాళ్లకు డైట్, ఫిట్నెస్, ఫిజియో తదితర అంశాల్లో ‘మైత్రా’ సహకారం అందిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కామన్వెల్త్ క్రీడల్లో ఫైనల్స్‌కు అర్హత సాధించిన యెర్రా జ్యోతి, ద్యుతీచంద్లతో పాటు అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరిన ఎ.నందిని, కె.రజితలకు కూడా నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. ఇతర అథ్లెట్లు జ్యోతికశ్రీ, ఎన్.ఎస్. శ్రీనివాస్, ప్రణయ్, అనూష, దిల్ఖుష్ యాదవ్, భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్‌లతో పాటు ‘మైత్రా’ గ్రూప్ చైర్మన్ రవి కైలాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: PAK Vs NED: రెండో వన్డేలో ఘన విజయం..'ఈసారి మాత్రం తేలిగ్గా తీసుకోలేదు' KL Rahul: ఒక్క విజయంతో దిగ్గజాల సరసన చోటు.. -
ఒలింపిక్ పతకమే మిగిలుంది
న్యూఢిల్లీ: నాలుగు పదుల వయసున్నా... ఏళ్ల తరబడి టేబుల్ టెన్నిస్ ఆడుతున్నా... తనలో వన్నె తగ్గలేదని మాటల్లో కాదు... చేతల్లో నిరూపించాడు వెటరన్ స్టార్ శరత్ కమల్. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుతమైన ప్రదర్శనతో సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణాలు సహా నాలుగు పతకాలు సాధించాడు. అయితే తన కెరీర్లో 2006 నుంచి ఎన్నో కామన్వెల్త్ పతకాలున్నప్పటికీ ఒలింపిక్స్ పతకం మాత్రం లోటుగా ఉందని, అదే తన లక్ష్యమని శరత్ తెలిపాడు. 20 ఏళ్లుగా ఆడుతున్నప్పటికీ రిటైర్మెంట్ ఆలోచనే రావడం లేదని, ఆటపై తన ఉత్సాహాన్ని వెలిబుచ్చాడు. ‘ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం చాలా ఆనందంగా ఉంది. గతంలో ‘మూడు’గా ఉన్న అత్యధిక పతకాల సంఖ్య తాజా ఈవెంట్లో ‘నాలుగు’కు చేరింది. పూర్తి ఫిట్నెస్ ఉండటంతో ఇకమీదట ఆడాలనే తపనే నన్ను నడిపిస్తోంది. నేనెప్పుడు శారీరకంగానే కాదు మానసికంగాను దృఢంగా ఉండేందుకే ప్రయత్నిస్తా. కుర్రాళ్లతో సహ పోటీపడాలంటే వాళ్లంత చురుగ్గా ఉండాలి కదా! ఓవరాల్‌గా ఇన్నేళ్లలో కామన్వెల్త్ గేమ్స్‌లో 13 సాధించిన నా విజయవంతమైన కెరీర్లో ఒలింపిక్స్ పతకమే బాకీ ఉంది. దాని కోసం మరింత మెరుగయ్యేందుకు శ్రమిస్తున్నాను’ అని శరత్ కమల్ వివరించాడు. పారిస్ ఒలింపిక్స్‌కు రెండేళ్ల సమయం వుండటంతో ముందుగా టీమ్ ఈవెంట్లో అర్హత సాధించడంపై దృష్టి సారిస్తాననని చెప్పాడు. తన తొలి కామన్వెల్త్ (2006)లో సాధించిన స్వర్ణంతో బర్మింగ్‌హామ్ స్వర్ణాన్ని పోల్చకూడదని అన్నాడు. యువ రక్తంతో ఉన్న తనపై అప్పుడు ఎలాంటి అంచనాల్లేవని, కానీ ఇప్పుడు సీనియర్‌గా తనపై గురుతర బాధ్యత ఉండిందని శరత్ వివరించాడు. అప్పటికీ ఇప్పటికీ ఎంతో మారిందని, పోటీతత్వం అంతకంతకు పెరిగిందని అవన్నీ దాటుకొని ఈ వయసులో బంగారం గెలవడం ఎనలేని సంతోషాన్నిస్తోందని చెప్పాడు. -
Commonwealth Games 2022: విజేతలకు ఐఓఏ నజరానా
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఘనంగా సత్కరించింది. నగదు పురస్కారాలతో వారిని గౌరవించింది. స్వర్ణం గెలిచిన వారికి రూ. 20 లక్షలు, రజతానికి రూ. 10 లక్షలు, కాంస్యానికి రూ. 7.5 లక్షల చొప్పున ఐఓఏ అందించింది. ఈ కార్యక్రమంలో ఐఓఏ అధ్యక్ష, కార్యదర్శులు అనిల్ ఖన్నా, రాజీవ్ మెహతా, కోశాధికారి ఆనందీశ్వర్ పాండే తదితరులు పాల్గొన్నారు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన పోటీల్లో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు (మొత్తం 61 పతకాలు) సాధించింది. -
CWG 2022: స్వర్ణ యుగం మొదలైంది.. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: ప్రధాని మోదీ
Commonwealth Games 2022- న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భేటీ అయ్యారు. ప్రధాని అధికారిక నివాసంలో జరిగే ఈ కార్యక్రమంలో కొందరు మినహా దాదాపు విజేతలంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మీ అపూర్వ విజయాలు చూసి జాతి మొత్తం గర్విస్తోందని ప్రశంసించారు. స్వర్ణ యుగం మొదలైంది! ‘‘మీ షెడ్యూల్లో కొంత సమయాన్ని నాకు కేటాయించి నా నివాసానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరు భారతీయుల్లాగే.. మీ గురించి మాట్లాడటం నాకూ గర్వంగా ఉంది. భారత క్రీడల్లో స్వర్ణ యుగం ఆరంభమైంది. ఇది కేవలం యువ శక్తి వల్లే సాధ్యమైంది. గడిచిన రెండు వారాల్లో అటు కామన్వెల్త్.. ఇటు చెస్ ఒలింపియాడ్ రూపంలో రెండు మెగా ఈవెంట్లు. కామన్వెల్త్ క్రీడల్లో చారిత్రాత్మక ప్రదర్శనతో పాటు చెస్ ఒలింపియాడ్‌కు మనం తొలిసారి ఆతిథ్యం ఇచ్చాము. ఈ మెగా ఈవెంట్లో విజయం సాధించిన వాళ్లందరికీ కూడా నా శుభాభినందనలు’’ అని ప్రధాని మోదీ విజేతలను కొనియాడారు. ఇక కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తిన ఆయన.. స్వర్ణ పతక విజేత బాక్సర్ నీతూ ఘంఘస్, బ్మాడ్మింటన్ స్టార్, గోల్డ్ మెడలిస్ట్ పీవీ సింధు, క్రికెటర్ రేణుకా సింగ్‌తో పాటు రెజ్లర్ పూజా గెహ్లోత్ పేరును ప్రస్తావించారు. భేటీలు భేష్! అమ్మాయిలంతా శెభాష్ అనిపించుకున్నారని, దేశమంతా గర్వించేలా చేశారని కొనియాడారు. అయితే, పూజా కాంస్యానికే పరిమితమైనందుకు కన్నీరు పెట్టుకున్నపుడు తాను వెంటనే స్పందించానన్న ప్రధాని మోదీ.. పతకం సాధించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసినందుకు ఆనందించాలే తప్ప బాధపడవద్దంటూ క్రీడాకారులకు సూచించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో సీనియర్ అథ్లెట్లు ముందుండి నడిస్తే.. యువ ఆటగాళ్లు వారి స్ఫూర్తితో పతకాలు సాధించారని కొనియాడారు. ప్రతిష్టాత్మక క్రీడా వేదికపై త్రివర్ణ పతాకం రెపరెపలాడినపుడు గర్వంతో గుండె ఉప్పొంగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా యూకేకు బయల్దేరే ముందు కూడా క్రీడాకారులతో ప్రధాని మోదీ భేటీ అయిన విషయం తెలిసిందే. దేశాన్ని గర్వపడేలా చేస్తామని అప్పుడు తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు (మొత్తం 61 పతకాలు) సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. రెజ్లింగ్‌లోనే మనకు 6 స్వర్ణాలు సహా మొత్తం 12 పతకాలు వచ్చాయి. చదవండి: Ind Vs Zim ODI Series: జింబాబ్వేకు పయనమైన టీమిండియా ఆటగాళ్లు.. The Great Khali: 'ది గ్రేట్ ఖలీ' కన్నీటి పర్యంతం.. అంతుచిక్కని ప్రశ్నలా! Elated to interact with our CWG 2022 contingent. Entire nation is proud of their outstanding achievements. https://t.co/eraViqKcnl — Narendra Modi (@narendramodi) August 13, 2022 -
కామన్ వెల్త్ గేమ్స్ టీటీలో స్వర్ణం గెలిచిన ఆకుల శ్రీజ
-
కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న ఇద్దరు పాకిస్థానీ బాక్సర్ల అదృశ్యం
బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన 22వ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న ఇద్దరు పాకిస్థానీ బాక్సర్లు అదృశ్యమైన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. క్రీడలు ముగిసాక స్వదేశానికి తిరుగు పయనం అయ్యేందుకు బర్మింగ్‌హామ్ ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆ ఇద్దరు, అక్కడి నుంచి కనిపించకుండా పోయారంటూ పాకిస్థాన్ బాక్సింగ్ ఫెడరేషన్ (పీబీఎఫ్) వెల్లడించింది. ప్రస్తుతం పీబీఎఫ్.. బర్మింగ్‌హామ్ పోలీసుల సహకారంతో ఆ ఇద్దరి ఆచూకీ కనిపెట్టే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న శ్రీలంకకు చెందిన 10 మంది అథ్లెట్లు కూడా ఇదే తరహాలో అదృశ్యమైన నేపథ్యంలో ఈ మిస్సింగ్ కేస్ చర్చనీయాంశంగా మారింది. కనిపించకుండా పోయిన బాక్సర్లు సులేమాన్ బలోచ్, నజీరుల్లా ఖాన్‌లుగా పీబీఎఫ్ పేర్కొంది. వీరిలో నజీర్ 86-92 కేజీల హెవీవెయిట్ విభాగం రౌండ్ ఆఫ్ 16లో వెనుదిరగగా.. 60-63.5 కేజీల విభాగంలో సులేమాన్ రౌండ్ ఆఫ్ 32లో ఓటమిపాలైనట్లు పీబీఎఫ్ పేర్కొంది. బాక్సర్ల అదృశ్యంపై విచారణ నిమిత్తం పాకిస్థాన్ ఒలింపిక్ అసోసియేషన్ నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు పీబీఎఫ్ ప్రకటించింది. కాగా, ఇదే ఏడాది బుడాపెస్ట్ వేదికగా జరిగిన 19వ స్విమ్మింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ సందర్భంగా ఫైజాన్ అక్బర్ అనే ఓ పాకిస్థానీ స్విమ్మర్ కూడా ఇలానే అదృశ్యమయ్యాడు. అతని ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. చదవండి: కామన్వెల్త్లో భారత ఫెన్సర్‌కు స్వర్ణం -
CWG 2022: జీతం లేని సెలవు పెట్టి తండ్రి త్యాగం! కూతురు ‘పసిడి’ పంచ్‌తో..
CWG 2022- Boxer Nitu Ghanghas: బాక్సింగ్‌లో మన అమ్మాయిల పంచ్ కామన్వెల్త్ క్రీడల్లో గట్టిగా పడింది. తెలంగాణ నిఖత్ జరీన్‌తో పాటు హర్యాణ నీతు ఘణఘస్ కూడా స్వర్ణం సాధించింది. నిఖత్ వెనుక ఆమె తండ్రి ఎలా మద్దతుగా నిలిచాడో నీతు ఘంఘస్ వెనుక ఆమె తండ్రి జై భగవాన్ నిలిచాడు. హర్యాణ విధాన సభలో బిల్ మెసెంజర్‌గా పని చేసే జై భగవాన్ ఉద్యోగానికి జీతం లేని సెలవు పెట్టి నీతు బాక్సింగ్‌కు వెన్నుదన్నుగా నిలిచాడు. అతని త్యాగం ఫలించింది. నీతు బంగారు పతకం సాధించింది. ఆదివారం కామన్వెల్త్ క్రీడలలో బంగారు పతకం సాధించిన నీతు ఘణఘస్ అక్కడి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో అభిమానులు ‘భారత మాతాకీ జై’ అని ఉత్సాహంగా నినాదాలు ఇస్తుంటే తన మెడలోని బంగారు పతకాన్ని చూపుతూ ‘ఈ పతకం ఈ దేశ ప్రజలందరితో పాటు మా నాన్నకు అంకితం’ అని చెప్పింది. కామన్వెల్త్ క్రీడలలో 45– 48 కేజీల విభాగంలో నీతు ఘణఘస్ ఇంగ్లండ్ బాక్సర్ డెమీ జేడ్‌ను ఘోరంగా ఓడించింది. ఎంత గట్టిగా అంటే రెఫరీలందరూ ఆమెకు ఏకగ్రీవంగా 5–0తో గెలుపునిచ్చారు. ‘మా కోచ్ భాస్కర్ చంద్ర భట్ నాతో నీ ప్రత్యర్థి ఎత్తు తక్కువ ఉంది. ఎక్కువగా దాడి చేసే వీలు ఉంది. కాచుకోవడానికి పక్కకు జరుగుతూ దాడి చెయ్ అన్నారు. అదే పాటించాను’ అంది నీతు. ఇలాంటి ఎన్నో సవాళ్లను సమర్థంగా, సమయస్ఫూర్తితో ఎదుర్కొంది కాబట్టే ఇవాళ ఆమె విజేత అయ్యింది. తండ్రికీ, దేశానికీ గర్వకారణంగా నిలిచింది. అతని గెలుపుతో స్ఫూర్తి 2008లో బీజింగ్ ఒలిపింగ్స్లో బాక్సర్ విజేందర్ సింగ్ స్వర్ణం సాధించడంతో నీతు కల మొదలైంది. అప్పటికి ఆ అమ్మాయికి 8 ఏళ్లు. ఆమె ఊరు ధనానాకు విజేందర్ సింగ్ ఊరు సమీపంలోనే ఉంటుంది. ఆ తర్వాత మూడు నాలుగేళ్ల వరకూ విజేందర్ విజయాలు సాధిస్తూనే ఉన్నాడు. 12 ఏళ్ల వయసులో నీతు తాను కూడా బాక్సర్ కావాలని నిశ్చయించుకుంది. ముగ్గురు తోబుట్టువులలో ఒకరైన నీతు ఇంట్లోగాని స్కూల్లోగాని ఫైటింగుల్లో ముందు ఉంటుంది. ఆ దూకుడు గమనించిన తండ్రి జై భగవాన్ ఆమెను బాక్సర్‌ను చేయడానికి నిశ్చయించుకుని చండీగఢ్‌లోని కుటుంబాన్ని ధనానాకు మార్చాడు. తను ఉద్యోగం చేస్తూ కూతురిని అక్కడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘భివాని బాక్సింగ్ క్లబ్’కు శిక్షణ కోసం వెళ్లి వచ్చే ఏర్పాటు చేశాడు. భివానిలోనే విజేందర్ సింగ్ బాక్సింగ్ శిక్షణ తీసుకున్నాడు. రెండేళ్లు గడిచిపోయాయి. కాని నీతు బాక్సింగ్‌లో చెప్పుకోదగ్గ పురోగతి సాధించలేదు. ‘నేను బాక్సింగ్ మానేస్తాను నాన్నా’ అని తండ్రికి చెప్పింది. కాని కూతురు అలా నిరాశలో కూరుకుపోవడం తండ్రికి నచ్చలేదు. ఉద్యోగానికి సెలవు పెట్టి చండీఘడ్‌లో విధాన సభలో బిల్ మెసెంజర్‌గా పని చేసేవాడు. చిన్న ఉద్యోగం. మూడేళ్లు లీవ్ అడిగాడు కూతురి కోసం. అన్నేళ్లు ఎవరు ఇస్తారు. పైగా కూతురి బాక్సింగ్ కోసం అంటే నవ్వుతారు. కాని జై భగవాన్ లాస్ ఆఫ్ పే మీద వెళ్లిపోయాడు. సొంత ఊరు ధనానాకు చేరుకుని ఉదయం సాయంత్రం కూతురిని ట్రైనింగ్‌కు తీసుకెళ్లసాగాడు. జరుగుబాటుకు డబ్బులు లేవు. తండ్రి నుంచి వచ్చిన పొలంలో కొంత అమ్మేశాడు. ఎప్పుడో కొనుక్కున్న కారు అమ్మేశాడు. ఒక్కోసారి ట్రైనింగ్ కోసం ధనానా నుంచి భివానికి నీతు వెళ్లకపోయేది. ఇంట్లోనే సాధన చేయడానికి ఊక బస్తాను వేళ్లాడగట్టి ఉత్సాహపరిచేవాడు. ‘నువ్వు గొప్ప బాక్సర్వి కావాలి’ అనేవాడు. ‘నాన్నా... నేను మంచి బాక్సర్‌ని కాకపోతే నువ్వు ఉద్యోగంలో చేరిపో’ అని నీతు అనేది. ‘దాని గురించి ఆలోచించకు’ అని లక్ష్యంవైపు గురి నిలపమనేవాడు. విజయం వరించింది జై భగవాన్ అతని భార్య ముకేశ్ కుమారి కలిసి నీతు మీద పెట్టుకున్న ఆశలు ఫలించాయి. 2017, 2018 రెండు సంవత్సరాలు వరుసగా యూత్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో నీతు ఛాంపియన్‌గా నిలిచింది. 21 ఏళ్ల వయసులో మొదటిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో దిగి గోల్డ్‌మెడల్ సాధించడంతో ఆమె ఘనత ఉన్నత స్థితికి చేరింది. గొప్ప విషయమేమంటే ఏ విధాన సభలో తండ్రి పని చేస్తాడో అదే విధాన సభ చైర్మన్ జ్ఞాన్‌చంద్ నీతు విజయం గురించి విని సంబరాలు జరపడం. నీతు తండ్రి జై భగవాన్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపాడు. ‘మనమ్మాయి గొప్ప విజయం సాధించింది’ అన్నాడాయన జై భగవాన్‌తో నిజమే. ఇప్పుడు నీతు ‘మన అమ్మాయి’. మన భారతదేశ గర్వకారణం. చదవండి: CWG 2022: నిఖత్ జరీన్‌కు అరుదైన గౌరవం Sourav Ganguly: మహిళా క్రికెట్ జట్టుపై గంగూలీ అభ్యంతరకర ట్వీట్.. ఆటాడుకుంటున్న నెటిజన్లు -
మహిళా క్రికెట్ జట్టుపై గంగూలీ అభ్యంతరకర ట్వీట్.. ఆటాడుకుంటున్న నెటిజన్లు
కామన్వెల్త్ క్రీడల్లో రజతం నెగ్గిన భారత మహిళా క్రికెట్ జట్టుపై అభ్యంతరకర ట్వీట్ చేసినందుకు గాను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. ఈ విషయంలో నెటిజన్లు దాదాను ఓ ఆటాడుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన 22వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడి సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో భారత్ 9 పరుగుల తేడాతో ఓడి కనకం గెలిచే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ఫైనల్లో ఓడినప్పటికీ హర్మన్ సేన స్పూర్తివంతమైన ప్రదర్శనకు గాను ప్రపంచం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బీసీసీఐ బాస్ గంగూలీ కూడా హర్మన్ సేనను అభినందిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఇందులో దాదా టీమిండియాను అభినందిస్తూనే, చురకలంటించే వ్యాఖ్యలు కూడా చేశాడు. Congratulations to the Indian women's team for winning silver ..But they will go home disappointed as it was their game tonite ..@BCCIWomen — Sourav Ganguly (@SGanguly99) August 7, 2022 "సిల్వర్ గెలిచినందుకు భారత మహిళా క్రికెటజట్టుకు అభినందనలు.. అయితే వాళ్లు మాత్రం ఇంటికి అసంతృప్తిగానే వస్తారు.. ఎందుకంటే మ్యాచ్ వాళ్ల చేతుల్లోనే ఉండింది అంటూ గంగూలీ ఆమోదయోగ్యంకాని ట్వీట్ చేశాడు. గంగూలీ చేసిన ఈ అభ్యంతరకర ట్వీట్‌పై ప్రస్తుతం నెట్టింట రచ్చ జరుగుతుంది. అభిమానులు దాదాపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. they shouldn't be disappointed, they should be proud of that silver medal they should be disappointed for still not having a proper system in place for them and it's a bit ironic when he talks about a final game lol#CWG2022 https://t.co/ydsrD7ow7o — Nikhil Mane 🏏🇦🇺 (@nikhiltait) August 8, 2022 తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి, దాదాపు స్వర్ణం గెలిచినంత పని చేసినందుకుగాను టీమిండియాను మనస్పూర్తిగా అభినందించాల్సింది పోయి, హేళన చేసేలా వ్యాఖ్యలు చేస్తావా అంటూ సీరియస్ అవుతున్నారు. అసలు మీ ట్వీటే అతిపెద్ద అసంతృప్తి కలిగిస్తోందంటూ ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి వ్యక్తి బోర్డు ప్రెసిడెంట్‌గా ఉండటం దురదృష్టకరమని కామెంట్లు చేస్తున్నారు. కాగా, కామన్వెల్త్ క్రీడల్లో రజతం నెగ్గిన భారత మహిళా క్రికెట్ జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. The biggest disappointment is you. https://t.co/gBj47PO0HD — ಸುಶ್ರುತ । Sushrutha (@3eyeview) August 8, 2022 This guy is an absolute 🤡 Shame that he is the president of World's most powerful board https://t.co/slQz1drjPI — Harsh Deshwal🇮🇳 (@IamHarshDeshwal) August 8, 2022 చదవండి: నాలుగో ర్యాంక్‌లో టీమిండియా ఓపెనర్ -
నిఖత్ జరీన్‌కు అరుదైన గౌరవం
బర్మింగ్‌హామ్: ఆటలు ముగిశాయి. వేడుకలు అంబరాన్నంటాయి. మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు స్టేడియంపై విరజిమ్మాయి. అంగరంగ వైభవంగా మొదలైన బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ ఆట్టహాసంగా ముగిశాయి. భయపెట్టే కోవిడ్ కేసులు లేకుండా ముచ్చటపరిచే రికార్డులతో అలరించిన ఆటల షోకు భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున తెరపడింది. 72 దేశాలకు చెందిన 4500 పైచిలుకు అథ్లెట్లు తమ ప్రదర్శనతో కామన్వెల్త్కు కొత్త శోభ తెచ్చారు. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఎడ్వర్డ్ మాట్లాడుతూ బర్మింగ్‌హామ్ ఆటలకు తెరపడిందని లాంఛనంగా ప్రకటించారు. 2026 ఆతిథ్య వేదిక విక్టోరియా (ఆస్ట్రేలియా)లో కలుద్దామని అన్నారు. భారతీయ భాంగ్రా స్టేడియాన్ని ఊపేసింది. భారత సంతతికి చెందిన సుప్రసిద్ధ గేయరచయిత, గాయకుడు ‘అపాచి ఇండియన్’గా ఖ్యాతి పొందిన స్టీవెన్ కపూర్ ‘భాంగ్రా’ పాటలను హుషారెత్తించే గళంతో పాడాడు. ముగింపు వేడుకల్లో భారత బృందానికి తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ , టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించారు. -
కామన్వెల్త్ గేమ్స్‌లో ఓటమి.. ఇంగ్లండ్ హెడ్ కోచ్ సంచలన నిర్ణయం!
ఇంగ్లండ్ మహిళల జట్టు ప్రధాన కోచ్ లీసా కీట్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఇంగ్లండ్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన హెడ్‌కోచ్ పదవికి కీట్లీ రాజీనామా చేయాలని నిర్ణయించుకుంది. కామన్వెల్త్ గేమ్స్ లీగ్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ అద్భుతంగా ఆడినప్పటికీ.. సెమీఫైనల్లో భారత్ చేతిలో అనూహ్యంగా ఓటమి చెందింది. అదే విధంగా న్యూజిలాండ్‌తో జరిగిన కాంస్య పతక పోరులోనూ ఇంగ్లండ్ ఘోర పరాజయం పాలైంది. దీంతో స్వదేశంలో కామన్వెల్త్ గేమ్స్ జరిగినప్పటికీ క్రికెట్ విభాగంలో పతకం సాధించకుండానే ఇంగ్లండ్ తమ ప్రయాణాన్ని ముగించింది. కాగా కీట్లీ రెండున్నరేళ్ల పాటు ఇంగ్లండ్ జట్టుకు కోచ్‌గా పనిచేసింది. ఆమె నేతృత్వంలో ఇంగ్లండ్ జట్టు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా మహిళల ప్రపంచ కప్-2022లో ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరడంలో ఆమె కీలక పాత్ర పోషిచింది. ఇక కీట్లీకు కోచ్‌గా సెప్టెంబర్‌లో జరగనున్న ఇంగ్లండ్- భారత్ సిరీస్ అఖరిది కానుంది. ఈ సిరీస్ తర్వాత ఆమె తన బాధ్యతలనుంచి తప్పుకోనుంది. చదవండి: భారత్‌పై చెత్త రికార్డుకు కారణం మా జట్టు అత్యుత్సాహమే: పాక్ క్రికెటర్ -
CWG 2022: మిమ్మల్ని చూసి దేశమంతా గర్విస్తోంది.. కంగ్రాట్స్: కోహ్లి
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్-2022లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి శుభాకాంక్షలు తెలిపాడు. ప్రతిష్టాత్మక క్రీడల్లో సత్తా చాటి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారని కొనియాడాడు. మిమ్మల్ని చూసి భారతీయులంతా గర్వపడుతున్నారంటూ ప్రశంసించాడు. కాగా జూలై 29 నుంచి ఆగష్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారత్ ఈసారి 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలు సాధించింది. రెజ్లింగ్‌లో 12, వెయిట్‌లిఫ్టింగ్‌లో 10, అథ్లెటిక్స్‌లో 8, బాక్సింగ్‌లో 7, టేబుల్ టెన్నిస్‌లో 7, బ్యాడ్మింటన్‌లో 6, జూడోలో 3, హాకీలో 2, లాన్ బౌల్స్‌లో 2, స్వ్కాష్‌లో 2, టీ20 క్రికెట్లో 1, పారా పవర్‌లిఫ్టింగ్‌లో 1 మెడల్స్ వచ్చాయి. ఇలా మొత్తంగా 61 పతకాలు గెలిచిన భారత్.. పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో భారత క్రీడా బృందానికి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా కోహ్లి.. మంగళవారం ట్విటర్ వేదికగా స్పందించాడు. గొప్ప పురస్కారాలు అందించారు! ఈ మేరకు.. ‘‘మన దేశానికి గొప్ప పురస్కారాలు అందించారు. కామన్వెల్త్ గేమ్స్-2022లో పాల్గొన్న, గెలిచిన వాళ్లందరికీ శుభాకాంక్షలు. మిమ్మల్ని చూసి మేము గర్విస్తున్నాం. జై హింద్’’ అంటూ కోహ్లి పతకధారుల ఫొటోను షేర్ చేశాడు. ఇక ఆసియా కప్-2022 టోర్నీ నేపథ్యంలో విరాట్ కోహ్లి తిరిగి భారత జట్టులో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు విశ్రాంతి పేరిట జట్టుకు దూరంగా ఉన్న ఈ స్టార్ బ్యాటర్.. ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్‌కు ఎంపికైన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. సుదీర్ఘకాలంగా సెంచరీ చేయలేకపోయిన కోహ్లి.. ఈ టోర్నీలోనైనా విజృంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. You have brought great laurels for our country. Congratulations to all our winners and the participants of CWG 2022. We are so proud of you. Jai Hind 🇮🇳👏 pic.twitter.com/phKMn7MMdY — Virat Kohli (@imVkohli) August 9, 2022 చదవండి: Ravindra Jadeja: మంచి మనసు చాటుకున్న జడేజా భార్య.. ఏకంగా 101 ఖాతాలు.. ప్రధాని మోదీ ప్రశంసలు -
CWG 2022: పతకాల పట్టికలో 56 దేశాలు ఆమె వెనకే..!
బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన 22వ కామన్వెల్త్ క్రీడల్లో ఆస్ట్రేలియా మహిళా స్విమ్మర్ ఎమ్మా మెక్కియోన్ ఓ ప్రత్యేకమైన రికార్డు నెలకొల్పింది. ఈ క్రీడల్లో 6 స్వర్ణాలు గెలిచిన ఎమ్మా.. పతకాల పట్టికలో 56 దేశాల కంటే ఎక్కువ పసిడి పతకాలు సాధించిన అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది. ఈ క్రీడల్లో మొత్తం 72 దేశాలు పాల్గొనగా.. కేవలం 13 దేశాలు మాత్రమే ఎమ్మాతో సమానంగా, అంత కంటే ఎక్కువ పసిడి పతకాలు సాధించాయి. ఎమ్మా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా 67 స్వర్ణాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలువగా.. ఇంగ్లండ్ (57), కెనడా (26), భారత్ (22), న్యూజిలాండ్ (20), స్కాట్లాండ్ (13), నైజీరియా (12), వేల్స్ (8), సౌతాఫ్రికా (7), మలేషియా (7), నార్త్రన్ ఐర్లాండ్ (7), జమైకా (6), కెన్యా (6) దేశాలు వరుసగా 2 నుంచి 13 స్థానాల్లో నిలిచాయి. ఎమ్మా (6 స్వర్ణాలు సహా 8 పతాకలు) ఈ 13 దేశాల తర్వాత 14వ స్థానంలో నిలిచింది. కాగా, ఎమ్మా గత మూడు కామన్వెల్త్ క్రీడల్లో ఏకంగా 14 స్వర్ణాలు సాధించి, ఈ క్రీడల చరిత్రలో అత్యధిక స్వర్ణాలు సాధించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 4 పసిడి పతకాలు సాధించిన ఈ బంగారు చేప.. 2024 పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా దూసుకుపోతుంది. చదవండి: CWG 2022: ఈ స్వర్ణం కోసం ఎంతో నిరీక్షించాను.. ఎట్టకేలకు: సింధు -
తెలుగు తేజాలకు సీఎం వైఎస్ జగన్, కేసీఆర్ అభినందనలు
కామన్వెల్త్ గేమ్స్-2022లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ సీఎం కె. చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో తొలిసారిగా స్వర్ణం సాధించిన తెలుగు తేజం, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును ప్రత్యేకంగా అభినందించారు. కాగా బర్మింగ్‌హామ్‌లో 12 రోజులపాటు కొనసాగిన కామన్వెల్త్ క్రీడోత్సవంలో భారత్‌కు మొత్తంగా 61 పతకాలు లభించాయి. 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. బంగారు రోజిది.. భారత బ్యాడ్మింటన్‌కు బంగారు రోజిది. కామన్వెల్త్లో అద్భుత విజయాలు సాధించిన సింధు, శ్రీకాంత్, లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు శుభాకాంక్షలు. దేశం గర్వపడేలా పతకాలు సాధించిన వారందరికీ నా అభినందనలు. – వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం Golden day for Indian Badminton! Congratulations to champions @pvsindhu1, @lakshya_sen and @srikidambi for their phenomenal victories at #CWG2022. My heartiest wishes to all the medal winners for making India proud. Keep shining 🇮🇳#Cheer4India — YS Jagan Mohan Reddy (@ysjagan) August 8, 2022 స్వర్ణం సాధించిన పీవీ సింధుకు అభినందనలు. భవిష్యత్‌లోనూ ఆమె ఇదే విజయపరంపర కొనసాగించాలి. – కె.చంద్రశేఖర రావు, తెలంగాణ సీఎం CM Sri K. Chandrashekar Rao has expressed happiness over Badminton player @Pvsindhu1 winning Gold in Women's Singles category at the @birminghamcg22. Hon'ble CM congratulated Ms. Sindhu and lauded her effort.#PVSindhu #CommonwealthGames2022 (File Photo) pic.twitter.com/IzyoGjPBQD — Telangana CMO (@TelanganaCMO) August 8, 2022 కాగా, కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు పసిడి పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రీడల చివరిరోజు సోమవారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 21–15, 21–13తో 13వ ర్యాంకర్, 2014 గేమ్స్ స్వర్ణ పతక విజేత మిషెల్లి లీ (కెనడా)పై గెలుపొందారు. (చదవండి: ఈ స్వర్ణం కోసం ఎంతో నిరీక్షించాను.. ఎట్టకేలకు: సింధు) -
CWG 2022: ఈ స్వర్ణం కోసం ఎంతో నిరీక్షించాను.. ఎట్టకేలకు: సింధు
Commonwealth Games 2022- బర్మింగ్‌హామ్: గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి పునరావృతం కాకుండా ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ ఆడిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్‌గా నిలిచింది. ఈ క్రీడల చివరిరోజు సోమవారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 21–15, 21–13తో 13వ ర్యాంకర్, 2014 గేమ్స్ స్వర్ణ పతక విజేత మిషెల్లి లీ (కెనడా)పై గెలిచింది. 2014 గేమ్స్ సెమీఫైనల్లో మిషెల్లి లీ చేతిలో ఓడిన సింధు, 2018 గేమ్స్ సెమీఫైనల్లో మిషెల్లి లీని ఓడించి ఫైనల్ చేరి తుది పోరులో సైనా నెహ్వాల్ చేతిలో పరాజయం పాలైంది. మూడోసారి మిషెల్లి లీపై గెలుపుతో సింధు విజేతగా నిలిచింది. చివరిసారి ఎనిమిదేళ్ల క్రితం సింధును ఓడించిన మిషెల్లి ఈసారి తన ప్రత్యర్థికి అంతగా పోటీనివ్వలేకపోయింది. అవకాశం ఇవ్వకుండా.. అనుభవజ్ఞురాలైన మిషెల్లిని ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా పక్కా ప్రణాళికతో దూకుడుగా ఆడిన సింధు అనుకున్న ఫలితం సంపాదించింది. తొలి గేమ్‌లో 14–8తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి అదే జోరులో గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు విజృంభణ కొనసాగడంతో మిషెల్లికి తేరుకునే అవకాశం లేకుండాపోయింది. లక్ష్యసేన్ సైతం.. అంచనాలకు అనుగుణంగా మెరిసిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ముచ్చటగా మూడో ప్రయత్నంలో కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్‌గా అవతరించింది. 2014 గ్లాస్గో గేమ్స్‌లో కాంస్యం... 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో రజతం నెగ్గిన ఈ తెలుగుతేజం సోమవారం ముగిసిన బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ కూడా అదరగొట్టి పసిడి పతకం దక్కించుకోగా... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం బంగారు పతకాన్ని తమ మెడలో వేసుకుంది. శరత్ కమల్ 16 ఏళ్ల తర్వాత టేబుల్ టెన్నిస్‌లో ఆచంట శరత్ కమల్ 16 ఏళ్ల తర్వాత రెండోసారి పురుషుల సింగిల్స్‌లో పసిడి పతకం నెగ్గగా... సత్యన్ కాంస్యం కైవసం చేసుకున్నాడు. పురుషుల హాకీలో టీమిండియా మరోసారి రజత పతకంతో సంతృప్తి పడింది. మొత్తానికి ఈ గేమ్స్ చివరిరోజు భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించి చిరస్మరణీయ ప్రదర్శనతో ముగించింది. ఓవరాల్‌గా ఈ క్రీడల్లో భారత్ 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. 2026 కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో జరుగుతాయి. అభిమానులకు ధన్యవాదాలు: సింధు సుదీర్ఘ కాలంగా కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం కోసం నిరీక్షించాను. ఎట్టకేలకు పసిడి పతకాన్ని సాధించడంతో చాలా ఆనందంగా ఉన్నాను. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చిన వేలాది మంది ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు. –పీవీ సింధు PC: PV Sindhu Twitter సింధు ఘనతలు: ►కామన్వెల్త్ గేమ్స్ మహిళల సింగిల్స్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారతీయ క్రీడాకారిణి సింధు. గతంలో సైనా నెహ్వాల్ (2010, 2018) రెండుసార్లు పసిడి పతకాలు సాధించింది. ►కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగంలో అత్యధిక పతకాలు నెగ్గిన భారతీయ ప్లేయర్‌గా సింధు (3 పతకాలు) నిలిచింది. గతంలో అపర్ణా పోపట్ (1998లో రజతం; 2002లో కాంస్యం), సైనా రెండు పతకాల చొప్పున సాధించారు. చదవండి: Asia Cup 2022: ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. కోహ్లి వచ్చేశాడు -
షాకింగ్: కోవిడ్ నిర్ధారణ అయినప్పటికీ ఫైనల్ మ్యాచ్ ఆడిన ఆసీస్ క్రికెటర్
22వ కామన్వెల్త్ క్రీడలు ముగిసాక మహిళల క్రికెట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ణారణ అయిన ఓ క్రికెటర్ బరిలోకి దిగడమే కాకుండా అందరితో కలియతిరిగుతూ సంబురాలు చేసుకుంది. భారత్‌తో ఫైనల్ మ్యాచ్‌కు ముందు స్టార్ ఆల్‌రౌండర్ తహ్లియా మెక్‌గ్రాత్‌కు కోవిడ్ పాజిటివ్ అని తెలిసినా ఆసీస్ మేనేజ్మెంట్ అమెను తుది జట్టుకు ఎంపిక చేసి, బరిలోకి దించింది. ఈ మ్యాచ్‌లో మెక్‌గ్రాత్ బ్యాటింగ్‌లో 2 పరుగులు, బౌలింగ్‌లో 2 ఓవర్లలో 24 పరుగులిచ్చి ఏమంత ఆశాజనకమైన ప్రదర్శన చేయనప్పటికీ.. టీమిండియా స్వయంకృతాపరాధాల కారణంగా ఆస్ట్రేలియా 9 పరుగుల తేడాతో విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. అయితే, తమ ప్లేయర్‌కు కోవిడ్ అని తెలిసినా ఆసీస్ యాజమాన్యం ఆమెను తుది జట్టుకు ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వార్త తెలిసి యావత్ క్రీడాలోకం షాక్‌కు గురైంది. ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఆసీస్ యాజమాన్యం వ్యవహరించిన తీరును అందరూ దుయ్యబడుతున్నారు. నిబంధనల ప్రకారం పాజిటివ్ వచ్చిన ప్లేయర్‌ని ఐసోలేషన్‌కి తరలించాల్సి ఉంటుంది. ఈ నిబంధన కారణంగా టీమిండియా క్రికెటర్లు సబ్బినేని మేఘన, పూజా వస్త్రాకర్ (కోవిడ్ సోకడంతో) ఆసీస్‌తో తొలి మ్యాచ్ ఆడలేదు. అయితే ఆస్ట్రేలియా మాత్రం ఫైనల్ మ్యాచ్‌లో మెక్‌గ్రాత్‌ని పక్కనబెట్టే సాహసం చేయడానికి ఇష్టపడలేదు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె 51 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 78 పరుగులు, అలాగే బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టి సూపర్ ఫామ్‌లో ఉండటమే ఇందుకు కారణం. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో మెక్‌గ్రాత్ రాణించింది (2 వికెట్లు, 23 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు). ఇదిలా ఉంటే, కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా టెన్నిస్ స్టార్ జకోవిచ్ పట్ల ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలు ఉల్లంఘించాడని ఆస్ట్రేలియా ఓపెన్ కోసం ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన జకోను ఘోరంగా అవమానించి, కేసులు కూడా పెట్టారు. చదవండి: ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. కోహ్లి వచ్చేశాడు -
కామన్వెల్త్ గేమ్స్ హీరో శరత్ కమల్‌కు రాజమహేంద్రవరంతో ఉన్న అనుబంధం ఏంటి..?
ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ టేబుల్ టెన్సిస్ (టీటీ) సింగిల్స్‌లో ఆచంట శరత్ కమల్ బంగారు పతకం సాధించాడు. అంతకుముందు మిక్స్డ్ డబుల్స్ విభాగంలోనూ ఆకుల శ్రీజతో కలిసి స్వర్ణం నెగ్గాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో మొత్తం 13 పతకాలు గెలిచిన శరత్ కమల్‌కు మన రాజమహేంద్రవరంతో ప్రత్యేక అనుబంధం ఉందన్న విషయం చాలామందికి తెలీదు. కమల్ ప్రస్తుతం నివాసముంటున్నది చెన్నైలోనే అయినా టీటీలో అతన్ని తీర్చిదిద్దిన తండ్రి ఆచంట శ్రీనివాసరావు క్రీడా ప్రస్తానానికి బీజం పడింది ఇక్కడే. శ్రీనివాసరావు టేబుల్ టెన్నిస్ నేర్చుకుందీ.. అనంతరం కోచ్‌గా ఎదగడానికి ఇక్కడే నాంది పడింది. – సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) అది 1970వ సంవత్సరం. రాజమహేంద్రవరం కందుకూరి వీరేశలింగం పురమందిరం(టౌన్‌హాల్)లో కొంత మంది యువకులు టేబుల్ టెన్నిస్ (టీటీ) ఆడుతున్నారు. వారి ఆటను 17 ఏళ్ల యువకుడు తదేకంగా చూస్తున్నాడు. రోజూ అక్కడకు వచ్చి, ఆటను చూడటం ఆతడికి అలవాటుగా మారింది. తరువాత తానూ ఆ ఆట ఆడాలని నిర్ణయించుకున్నాడు. అంతే.. కొద్ది రోజుల్లోనే టేబుల్ టెన్నిస్‌లో చిచ్చర పిడుగులా మారాడు. రోజంతా టీటీ ఆడినా అలసట అనేదే తెలిసేది కాదు. ఆయనే ఆచంట శ్రీనివాసరావు.. ఫాదర్ ఆఫ్ ఆచంట శరత్ కమల్. మచిలీపట్నంలో జననం తన తల్లి పుట్టిల్లు మచిలీపట్నంలో 1953 నవంబర్ 1న శ్రీనివాసరావు జన్మించారు. తండ్రిది రాజమహేంద్రవరం కావడంతో ఇక్కడే పెరిగారు. తమ్ముడు మురళీధర్‌తో కలిసి రోజూ టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్ చేసేవారు. 1973, 74 సంవత్సరాల్లో చైన్నె, ఇండోర్లలో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. మెరికల్లాంటి శిష్యులు శ్రీనివాసరావు వద్ద శిష్యరికం చేస్తే చాలు.. గోల్డ్ మెడల్ సాధించడం ఖాయమనే పేరు వచ్చింది. ఆయన వద్ద శిక్షణ పొందిన చేతన్ పి. బాబున్, ఎస్.రామన్, ఎంఎస్ మైథిలి, ఎన్ఆర్ నాయుడు, కె.షామిని, భువనేశ్వరి, ఆచంట రజత్ కమల్, ఆచంట శరత్ కమల్ తదితరులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. శిష్యుల ద్వారా సాధించిన అపూర్వ విజయాలతో కేంద్ర ప్రభుత్వం శ్రీనివాసరావును గుర్తించింది. 2018లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ద్రోణాచార్య అవార్డు ఇచ్చి సత్కరించింది. ప్రస్తుతం కామన్వెల్త్ గేమ్స్‌లో రాణిస్తున్న తన కొడుకు శరత్ కమల్‌ను కూడా స్వయంగా శ్రీనివాసరావే తీర్చిదిద్దారు. అతడు సాధించిన విజయాల్లో ఆయన పాత్ర చాలా ఉంది. మిక్స్డ్ డబుల్స్‌లో శ్రీజ – శరత్ కమల్ జోడీ, సింగిల్స్‌లో శరత్ కమల్ ఆట తీరును ఆసాంతం తిలకించిన శ్రీనివాసరావు.. వారు స్వర్ణ పతకాలు సాధించడంతో సగర్వంగా తలెత్తుకున్నారు. మలుపు తిప్పిన చైన్నె శ్రీనివాసరావుకు చైన్నె ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. దీంతో భార్య అన్నపూర్ణతో కలిసి చైన్నె చేరుకున్నారు. అక్కడ అర్జున అవార్డు గ్రహీత జి.జగన్నాథ్‌తో కలిగిన పరిచయం శ్రీనివాసరావు జీవితాన్ని మలుపు తిప్పింది. ‘ఇంతటి సామర్థ్యం ఉన్న ఆటగాడివి ఇలా ఉండిపోవడం బాగోలేదు. ఆటగాడిగా కాకపోయినా కోచ్‌గా అయినా మారు’ అని జగన్నాథ్ సలహా ఇచ్చారు. దీంతో పాటియాలాలోని ఎన్ఐఎస్లో కోచ్‌గా శ్రీనివాసరావు శిక్షణ పొందారు. 1983లోనే కోచింగ్ రంగంలో డిప్లొమా సాధించారు.