బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్‌వెల్త్ క్రీడలు చివరిదశకు చేరుకున్నాయి. ఇవాల్టితో (ఆగస్ట్ 8) ఈ మహా సంగ్రామం ముగియనుంది. క్రీడల ఆఖరి రోజు భారత్ మరో ఆరు పతకాలపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు (10వ రోజు) భారత్ ఖాతాలో 55 పతకాలు (18 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలు) ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ ఐదో స్థానంలో కొనసాగుతుంది.
11వ రోజు మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో లక్ష్యసేన్, పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ, పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్‌లో ఆచంట శరత్ కమల్, పురుషుల హాకీ టీమ్ స్వర్ణం కోసం పోరడనుండగా.. పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్‌లో సాథియాన్ జ్ఞానశేఖరన్ కాంస్యం కోసం ఇంగ్లండ్‌కు చెందిన పాల్ డ్రింక్‌హాల్‌తో తలపడనున్నాడు.
11వ రోజు భారత షెడ్యూల్ ఇదే..
మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 1.20)
పీవీ సింధు వర్సెస్ మిచెల్ లీ (కెనడా)
పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 2.10 )
లక్ష్య సేన్ వర్సెస్ జే యోంగ్ ఎన్‌జీ (మలేషియా)
పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 3 గంటలకు)
సాత్విక్ సాయి రాజ్-చిరాగ్ శెట్టి వర్సెస్ బెన్ లేన్-సీన్ వెండీ (ఇంగ్లండ్)
పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 3.35)
సాథియాన్ జ్ఞానశేఖరన్ వర్సెస్ పాల్ డ్రింక్‌హాల్ (ఇంగ్లండ్)
పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (సాయంత్రం 4.25)
ఆచంట శరత్ కమల్ వర్సెస్ లియామ్ పిచ్‌ఫోర్డ్ (ఇంగ్లండ్)
పురుషుల హాకీ గోల్డ్ మెడల్ మ్యాచ్ సాయంత్రం (5 గంటల నుంచి ప్రారంభం)
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా
ఇదిలా ఉంటే, ప్రస్తుత కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ ఇవాళ ఆరు పతకాలు (5 స్వర్ణాలు , కాంస్యం) సాధించినా (55+6=61) 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్ రికార్డును (66 పతకాలు (26 గోల్డ్, 20 సిల్వర్, 20 బ్రాంజ్)) బద్దలు కొట్టే అవకాశం లేదు.
వీటిలో రెండు స్వర్ణాలు గెలిచినా పతకాల పట్టికలో న్యూజిలాండ్‌ను (48 పతకాలు (19 స్వర్ణాలు, 12 రజతాలు, 17 కాంస్యాలు)) వెనక్కునెట్టి నాలుగో స్థానానికి ఎగబాకుతుంది. పతకాల పట్టికలో ఆస్ట్రేలియా (170), ఇంగ్లండ్ (165), కెనడా (87) తొలి మూడు స్థానాల్లో ఉంటాయి. 2010 న్యూఢిల్లీ కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ రికార్డు స్థాయిలో 101 మెడల్స్ సాధించింది. ఇప్పటికీ భారత్‌కు అదే అత్యుత్తమ ప్రదర్శన.
చదవండి: బాక్సింగ్‌లో మరో పతకం.. సాగర్ అహ్లావత్‌కు రజతం
Comments
Please login to add a commentAdd a comment