Achanta Sharath Kamal
-
శరత్ కమల్ గెలిచినా... గోవా చేతిలో చెన్నై ఓటమి
చెన్నై: అల్ట్మేట్లో టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్‌లో గోవా చాలెంజర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో గోవా 9–6తో చెన్నై లయన్స్‌పై గెలుపొందింది. సొంతగడ్డపై శరత్ కమల్ 2–1 (11–6, 11–10, 6–11)తో మిహయి బొబోసికాపై గెలుపొందినప్పటికీ సహచరుల వైఫల్యంతో చెన్నైకి నిరాశ తప్పలేదు.మహిళల సింగిల్స్‌లో సకుర మొరి 2–1 (11–9, 11–9, 9–11)తో యాంగ్జీ లియూ (గోవా)పై గెలిచి చెన్నై ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. కానీ తర్వాతి మ్యాచ్‌ల్లో చెన్నై ప్లేయర్లు వరుసగా ఓడిపోయారు. రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో హరి్మత్ దేశాయ్ (గోవా) 2–1 (6–11, 11–7, 11–5)తో జులెస్ రోలండ్పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్‌లో శరత్–సకుర జోడీ 0–3 (9–11, 10–11, 7–11)తో హరి్మత్ దేశాయ్–యాంగ్లీ లియూ (గోవా) జంట చేతిలో ఓడిపోయింది. రెండో మహిళల సింగిల్స్‌లో యశస్విని ఘోర్పడే (గోవా) 2–1 (11–5, 11–8, 3–11)తో మౌమ దాస్‌పై గెలుపొందడంతో చెన్నై ఓటమిపాలైంది. మరో పోరులో బెంగళూరు స్మాషర్స్ 9–6తో అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్‌పై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో ఆంథోని అమల్‌రాజ్ (బెంగళూరు) 1–2 (9–11, 10–11, 11–10)తో లిలియన్ బార్డెట్ చేతిలో, మహిళల సింగిల్స్‌లో మనిక బత్రా (బెంగళూరు) 1–2 (11–7, 9–11, 7–11)తో బెర్నడెట్ సాక్స్ చేతిలో కంగుతిన్నారు. తర్వాత మిక్స్డ్ డబుల్స్‌లోనూ అల్వరొ రొబెల్స్–మనిక జోడీ 1–2 (3–11, 11–7, 8–11)తో మనుశ్ షా–బెర్నాడెట్ సాక్స్ జంట చేతిలో ఓడిపోయింది. ఈ దశలో పురుషుల సింగిల్స్‌లో అల్వరో రొబెల్స్ (బెంగళూరు) 3–0 (11–8, 11–7, 11–8)తో మనుశ్ షాపై, మహిళల సింగిల్స్‌లో లిలి జాంగ్ (బెంగళూరు) 3–0 (11–5, 11–8, 11–10)తో క్రిత్విక సిన్హా రాయ్‌లపై ఒక్క గేమ్ కూడా ఓడిపోకుండా గెలుపొందడంతో బెంగళూరు విజయం సాధించింది. -
Paris 2024 Olympics: పతాకధారిగా సింధు
న్యూఢిల్లీ: వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ పతకంపై గురి పెట్టిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు గొప్ప గౌరవం లభించింది. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సింధు నేతృత్వం వహించనుంది. విశ్వ క్రీడల్లో పతాకధారిగా వ్యవహరించనున్న సింధు భారత బృందాన్ని ముందుండి నడిపించనుంది. మరో ఫ్లాగ్ బేరర్‌గా తమిళనాడుకు చెందిన దిగ్గజ టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ ఆచంట శరత్ కమల్ వ్యవహరిస్తాడు. ఐదోసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న 41 ఏళ్ల శరత్‌ను పతాకధారిగా గత మార్చి నెలలోనే భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. విశ్వ క్రీడా వేదికపై లింగ సమానత్వం ఉండాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2020 టోక్యో ఒలింపిక్స్ నుంచి ప్రారం¿ోత్సవ వేడుకల్లో ఆయా దేశాలు పురుష ఫ్లాగ్ బేరర్‌తోపాటు ఒక మహిళా ఫ్లాగ్ బేరర్‌కు కూడా అవకాశం ఇవ్వాలనే నిబంధనను అమల్లోకి తెచి్చంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి హాకీ ప్లేయర్ మన్‌ప్రీత్ సింగ్, మహిళా బాక్సర్ మేరీకోమ్ పతాకధారులుగా వ్యవహరించారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన ఏకైక భారత మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన 29 ఏళ్ల సింధు 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో ఫ్లాగ్ బేరర్‌గా గౌరవం పొందింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన సింధు, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. పారిస్ క్రీడల్లోనూ సింధు పతకం సాధిస్తే ఒలింపిక్స్ చరిత్రలో మూడు వ్యక్తిగత పతకాలు నెగ్గిన ఏకైక భారతీయ ప్లేయర్‌గా సింధు రికార్డు సృష్టిస్తుంది. సింధు కంటే ముందు రెజ్లర్ సుశీల్ కుమార్ మాత్రమే ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత పతకాలుసాధించాడు. చెఫ్ డి మిషన్‌గా గగన్ నారంగ్ మరోవైపు పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి చెఫ్ డి మిషన్‌గా తెలంగాణ షూటర్ గగన్ నారంగ్ వ్యవహరిస్తాడు. ముందుగా మేరీకోమ్‌ను చెఫ్ డి మిషన్‌గా ప్రకటించినా వ్యక్తిగత కారణాలరీత్యా ఈ బాధ్యతలు తీసుకోలేనని ఆమె ప్రకటించింది. దాంతో గగన్ నారంగ్‌కు చెఫ్ డి మిషన్ బాధ్యతలు అప్పగిస్తున్నామని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపింది. చెఫ్ డి మిషన్ హోదాలో గగన్ ఒలింపిక్స్‌లో పాల్గొనే మొత్తం భారత క్రీడాకారుల వ్యవహారాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. 41 ఏళ్ల గగన్ నారంగ్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో పురుషుల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించాడు. 4: భారత్ తరఫున ఒలింపిక్స్ క్రీడల్లో ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనున్న నాలుగో మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు గుర్తింపు పొందనుంది. గతంలో ఈ ఘనత షైనీ విల్సన్, అంజూ బాబీ జార్జి, మేరీకోమ్లకు మాత్రమే దక్కింది. అథ్లెట్ షైనీ విల్సన్ 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో... లాంగ్‌జంపర్ అంజూ బాబీ జార్జి 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో... బాక్సర్ మేరీకోమ్ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఫ్లాగ్ బేరర్స్‌గా ఉన్నారు. -
రాష్ట్రపతి భవన్లో ఘనంగా క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం బుధవారం(నవంబర్ 30న) కన్నుల పండువగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా క్రీడాకారులు పురస్కారాలు అందుకున్నారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్ అందుకోగా.. 25 మంది క్రీడాకారులు అర్జున అవార్డు అందుకున్నారు. వీరిలో బాక్సర్ నిఖత్ జరీన్, బ్యాడ్మింట్న్ స్టార్ హెచ్ ప్రణయ్, చెస్ సంచలనం ఆర్ ప్రజ్ఞానంద, ఆకుల శ్రీజ తదితరులు ఉన్నారు. ఇక 8 మంది కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులను అందజేశారు.భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఈ ఏడాది క్రీడా అవార్డులను నవంబర్ 14న ఈ అవార్డులను ప్రకటించింది. విజేతల జాబితా: మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు: ఆచంట శరత్ కమల్ అర్జున అవార్డులు: సీమా పూనియా (అథ్లెటిక్స్), ఆల్డస్ పాల్ (అథ్లెటిక్స్), అవినాష్ సాబుల్ (అథ్లెటిక్స్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), హెచ్ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్), అమిత్ (బాక్సింగ్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), భక్తి కులకర్ణి (చెస్) , ఆర్ ప్రజ్ఞానంద (చెస్), దీప్ గ్రేస్ ఇక్కా (హాకీ), సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లోన్‌బాల్), సాగర్ ఓవల్కర్ (మల్కాంబ్), ఎలవెనిల్ వలరివన్ (షూటింగ్), ఓంప్రకాష్ మిథర్వాల్ (షూటింగ్) శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్), అన్షు (రెజ్లింగ్), సరిత (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), మాన్సీ జోషి (పారా బ్యాడ్మింటన్), తరుణ్ ధిల్లాన్ (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్), జెర్లిన్ అనికా జె (చెవిటి బ్యాడ్మింటన్) ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్ విభాగంలో కోచ్‌లకు): జీవన్‌జోత్ సింగ్ తేజ (ఆర్చరీ), మహ్మద్ అలీ కమర్ (బాక్సింగ్), సుమా షిరూర్ (పారా-షూటింగ్) మరియు సుజిత్ మాన్ (రెజ్లింగ్) జీవితకాల పురస్కారం: దినేష్ లాడ్ (క్రికెట్), బిమల్ ఘోష్ (ఫుట్‌బాల్), రాజ్ సింగ్ (రెజ్లింగ్) ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు: అశ్విని అక్కుంజీ (అథ్లెటిక్స్), ధరమ్వీర్ సింగ్ (హాకీ), బిసి సురేష్ (కబడ్డీ), నీర్ బహదూర్ గురుంగ్ (పారా అథ్లెటిక్స్) President Droupadi Murmu presents the Arjuna award to Badminton players Lakshya Sen and Prannoy HS at the National Sports and Adventure Awards 2022 ceremony at Rashtrapati Bhavan. pic.twitter.com/Tv4QLAPbtj — ANI (@ANI) November 30, 2022 President Droupadi Murmu presents the Arjuna award to Chess player R Praggnanandhaa at the National Sports and Adventure Awards 2022 ceremony at Rashtrapati Bhavan. pic.twitter.com/1OPxS7DaoW — ANI (@ANI) November 30, 2022 చదవండి: FIFA WC: దేశాల మధ్య మాత్రమే యుద్ధం.. ఆటగాళ్లకు కాదు -
శరత్ కమల్‌కు అరుదైన గౌరవం.. భారత్ తరఫున తొలి ఆటగాడిగా..!
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ (టీటీ) ఆటగాడు, ఖేల్‌రత్న అవార్డీ ఆచంట శరత్ కమల్‌ను అంతర్జాతీయ టీటీ సమాఖ్య (ఐటీటీఎఫ్) సముచిత రీతిలో గౌరవించింది. ప్రతిష్టాత్మక ఐటీటీఎఫ్ అథ్లెట్స్ కమిషన్‌లో శరత్ కమల్‌కు చోటు దక్కింది. ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడు శరత్ కావడం విశేషం. 2022–2026 మధ్య నాలుగేళ్ల కాలానికిగాను వేర్వేరు ఖండాల నుంచి ఎనిమిది మందిని (నలుగురు పురుషులు, నలుగురు మహిళలు) ఇందులోకి ఎంపిక చేశారు. మొత్తం 283 మంది అథ్లెట్లు ఓటింగ్‌లో పాల్గొనగా, ఆసియా ఖండం ప్రతినిధిగా శరత్‌కు 187 ఓట్లు లభించాయి. మహిళల కేటగిరీలో ఎంపికైన చైనా ప్యాడ్లర్ ల్యూ షీవెన్‌కు 153 ఓట్లు మాత్రమే వచ్చాయి. తనకు లభించిన ఈ అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేసిన శరత్ కమల్...ఆసియా ఖండం నుంచి తనకు ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో శరత్ 3 స్వర్ణాలు నెగ్గాడు. నేటి నుంచి ఏషియన్ కప్... బ్యాంకాక్ వేదికగా నేటినుంచి ఐటీటీఎఫ్–ఏటీటీయూ ఏషియన్ కప్ టోర్నీలో శరత్ కమల్‌తో పాటు మరో భారత టాప్ ఆటగాడు సత్యన్ పాల్గొంటున్నారు. అయితే వీరిద్దరికీ కఠిన ‘డ్రా’ ఎదురైంది. తొలి పోరులో తమకంటే మెరుగైన ర్యాంక్‌ల్లో ఉన్న చువాంగ్ చి యువానా (చైనీస్ తైపీ)తో శరత్ తలపడనుండగా, యుకియా ఉడా (జపాన్)ను సత్యన్ ఎదుర్కొంటాడు. -
ఖేల్‌రత్నకు శరత్ కమల్.. అర్జున బరిలో నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ
2022 ఏడాదికి గానూ భారత్ టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్‌ను సెలక్షన్ కమిటీ ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుకు సిఫార్సు చేసింది. ప్రతిష్టాత్మక పురస్కారానికి ఈ ఏడాది శరత్ కమల్ మినహా మరెవరిని ఎంపిక చేయకపోవడం విశేషం. దీంతో శరత్ కమల్‌కు ఖేల్‌రత్న అవార్డు రావడం గ్యారంటీ. ఇక 40 ఏళ్ల ఆచంట శరత్ కమల్ ఈ ఏడాది టేబుల్ టెన్నిస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో నాలుగు పతకాలు సాధించగా.. ఇందులో మూడు స్వర్ణాలు, ఒక రజతం ఉంది. అలాగే శరత్ కమల్ ఏషియన్ గేమ్స్‌లో రెండుసార్లు పతకాలు సాధించిన తొలి టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు. ఇక అర్జున అవార్డుకు 25 మంది పేర్లను సిఫార్సు చేసినట్లు సెలక్షన్ కమిటీ ప్రకటించింది. వీరిలో తెలంగాణకు చెందిన మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ కూడా ఉంది. జరీన్‌తో పాటు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యసేన్, చెస్ సంచలనం ఆర్ ప్రజ్ఞానంద, రెజ్లర్ అన్షు మాలిక్ తదితరులు ఉన్నారు. అయితే ఈసారి అర్జున అవార్డుకు సిఫార్సు చేసిన జాబితాల ఒక్క క్రికెటర్ కూడా లేకపోవడం గమనార్హం. ఇక తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించింది. అంతకముందు టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి దేశ ఖ్యాతిని పెంపొందించింది. ఇక తెలంగాణకే చెందిన టేబుల్ టెన్నిస్ సంచనలం ఆకుల శ్రీజ కూడా అర్జున అవార్డు బరిలో ఉంది. ఖేల్ రత్న అవార్డు సిఫార్సు: ఆచంట శరత్ కమల్ అర్జున అవార్డు సిఫార్సులు: సీమా పునియా (అథ్లెటిక్స్), ఎల్దోస్ పాల్ (అథ్లెటిక్స్), అవినాష్ సేబుల్ (అథ్లెటిక్స్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), హెచ్ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్), అమిత్ పంఘల్ (బాక్సింగ్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), భక్తి కులకర్ణి (చెస్), ఆర్ ప్రజ్ఞానంద (చెస్), దీప్ గ్రేస్ ఎక్కా (హాకీ), శుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లాన్ బౌల్స్), సాగర్ ఓవల్కర్ (మల్లాఖాంబ్), ఎలవేనిల్ వలరివన్ (షూటింగ్), ఓం ప్రకాష్ మిథర్వాల్ (షూటింగ్), శ్రీజ అకుల (టేబుల్ టెన్నిస్), వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్), అన్షు మాలిక్ (రెజ్లింగ్), సరితా మోర్ (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), మనాషి జోషి (పారా బ్యాడ్మింటన్), తరుణ్ ధిల్లాన్ (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్), జెర్లిన్ అనికా (డెఫ్ బ్యాడ్మింటన్) చదవండి: 144లో ఒక్కటి కూడా ఒరిజినల్ కాదు.. అందుకే సీజ్ ఐపీఎస్ ఆఫీసర్‌పై పిటిషన్ దాఖలు చేసిన ధోని -
కామన్వెల్త్ గేమ్స్ హీరో శరత్ కమల్‌కు రాజమహేంద్రవరంతో ఉన్న అనుబంధం ఏంటి..?
ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ టేబుల్ టెన్సిస్ (టీటీ) సింగిల్స్‌లో ఆచంట శరత్ కమల్ బంగారు పతకం సాధించాడు. అంతకుముందు మిక్స్డ్ డబుల్స్ విభాగంలోనూ ఆకుల శ్రీజతో కలిసి స్వర్ణం నెగ్గాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో మొత్తం 13 పతకాలు గెలిచిన శరత్ కమల్‌కు మన రాజమహేంద్రవరంతో ప్రత్యేక అనుబంధం ఉందన్న విషయం చాలామందికి తెలీదు. కమల్ ప్రస్తుతం నివాసముంటున్నది చెన్నైలోనే అయినా టీటీలో అతన్ని తీర్చిదిద్దిన తండ్రి ఆచంట శ్రీనివాసరావు క్రీడా ప్రస్తానానికి బీజం పడింది ఇక్కడే. శ్రీనివాసరావు టేబుల్ టెన్నిస్ నేర్చుకుందీ.. అనంతరం కోచ్‌గా ఎదగడానికి ఇక్కడే నాంది పడింది. – సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) అది 1970వ సంవత్సరం. రాజమహేంద్రవరం కందుకూరి వీరేశలింగం పురమందిరం(టౌన్‌హాల్)లో కొంత మంది యువకులు టేబుల్ టెన్నిస్ (టీటీ) ఆడుతున్నారు. వారి ఆటను 17 ఏళ్ల యువకుడు తదేకంగా చూస్తున్నాడు. రోజూ అక్కడకు వచ్చి, ఆటను చూడటం ఆతడికి అలవాటుగా మారింది. తరువాత తానూ ఆ ఆట ఆడాలని నిర్ణయించుకున్నాడు. అంతే.. కొద్ది రోజుల్లోనే టేబుల్ టెన్నిస్‌లో చిచ్చర పిడుగులా మారాడు. రోజంతా టీటీ ఆడినా అలసట అనేదే తెలిసేది కాదు. ఆయనే ఆచంట శ్రీనివాసరావు.. ఫాదర్ ఆఫ్ ఆచంట శరత్ కమల్. మచిలీపట్నంలో జననం తన తల్లి పుట్టిల్లు మచిలీపట్నంలో 1953 నవంబర్ 1న శ్రీనివాసరావు జన్మించారు. తండ్రిది రాజమహేంద్రవరం కావడంతో ఇక్కడే పెరిగారు. తమ్ముడు మురళీధర్‌తో కలిసి రోజూ టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్ చేసేవారు. 1973, 74 సంవత్సరాల్లో చైన్నె, ఇండోర్లలో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. మెరికల్లాంటి శిష్యులు శ్రీనివాసరావు వద్ద శిష్యరికం చేస్తే చాలు.. గోల్డ్ మెడల్ సాధించడం ఖాయమనే పేరు వచ్చింది. ఆయన వద్ద శిక్షణ పొందిన చేతన్ పి. బాబున్, ఎస్.రామన్, ఎంఎస్ మైథిలి, ఎన్ఆర్ నాయుడు, కె.షామిని, భువనేశ్వరి, ఆచంట రజత్ కమల్, ఆచంట శరత్ కమల్ తదితరులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. శిష్యుల ద్వారా సాధించిన అపూర్వ విజయాలతో కేంద్ర ప్రభుత్వం శ్రీనివాసరావును గుర్తించింది. 2018లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ద్రోణాచార్య అవార్డు ఇచ్చి సత్కరించింది. ప్రస్తుతం కామన్వెల్త్ గేమ్స్‌లో రాణిస్తున్న తన కొడుకు శరత్ కమల్‌ను కూడా స్వయంగా శ్రీనివాసరావే తీర్చిదిద్దారు. అతడు సాధించిన విజయాల్లో ఆయన పాత్ర చాలా ఉంది. మిక్స్డ్ డబుల్స్‌లో శ్రీజ – శరత్ కమల్ జోడీ, సింగిల్స్‌లో శరత్ కమల్ ఆట తీరును ఆసాంతం తిలకించిన శ్రీనివాసరావు.. వారు స్వర్ణ పతకాలు సాధించడంతో సగర్వంగా తలెత్తుకున్నారు. మలుపు తిప్పిన చైన్నె శ్రీనివాసరావుకు చైన్నె ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. దీంతో భార్య అన్నపూర్ణతో కలిసి చైన్నె చేరుకున్నారు. అక్కడ అర్జున అవార్డు గ్రహీత జి.జగన్నాథ్‌తో కలిగిన పరిచయం శ్రీనివాసరావు జీవితాన్ని మలుపు తిప్పింది. ‘ఇంతటి సామర్థ్యం ఉన్న ఆటగాడివి ఇలా ఉండిపోవడం బాగోలేదు. ఆటగాడిగా కాకపోయినా కోచ్‌గా అయినా మారు’ అని జగన్నాథ్ సలహా ఇచ్చారు. దీంతో పాటియాలాలోని ఎన్ఐఎస్లో కోచ్‌గా శ్రీనివాసరావు శిక్షణ పొందారు. 1983లోనే కోచింగ్ రంగంలో డిప్లొమా సాధించారు. -
Commonwealth Games 2022: 16 వసంతాలుగా ‘శరత్’ కాలం
2006 – మెల్బోర్న్ కామన్వెల్త్ క్రీడలు – టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా ఆటగాడు విలియం హెన్జెల్పై విజయంతో స్వర్ణం... 2022 – బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలు– సింగిల్స్ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ పిచ్‌ఫోర్డ్‌పై విజయంతో స్వర్ణం... ఈ రెండు సందర్భాల్లోనూ విజేత ఒక్కడే... నాడు 24 ఏళ్ల వయసులో తొలి పతకం సాధించి ఇప్పుడు 40 ఏళ్ల వయసులో 13వ పతకం సాధించిన ఆ స్టార్ ఆటగాడే ఆచంట శరత్ కమల్. ఇన్నేళ్ల సుదీర్ఘ కాలంలో ఎంతో మంది ప్రత్యర్థులు మారారు... వేదికలు, పరిస్థితులు మారాయి. కానీ అతని ఆట మాత్రం మారలేదు. ఆ విజయకాంక్ష ఎక్కడా తగ్గలేదు. సింగిల్స్‌లో తొలి స్వర్ణం నెగ్గిన 16 సంవత్సరాల తర్వాత కూడా స్వర్ణంపై గురి పెట్టగలిగిన అతని సత్తాను ఎంత ప్రశంసించినా తక్కువే... వరుసగా ఐదు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొని శరత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 13 కాగా, ఇందులో 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. భారత్ తరఫున ఈ క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన శరత్ కమల్ సీజన్లతో సంబంధం లేకుండా అన్ని కాలాలు, రుతువుల్లోనూ తనలో వాడి ఉందని నిరూపించాడు. కొత్త కుర్రాడిలాగే... సుదీర్ఘ కాలంగా భారత టేబుల్ టెన్నిస్‌ను శాసిస్తూ రికార్డు స్థాయిలో 10 సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచి శరత్ కమల్ ఆటకు పర్యాయపదంగా నిలిచాడు. అయితే 40 ఏళ్ల వయసులో ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటాడా, ఒకవేళ ఆడినా గత స్థాయి ప్రదర్శనను ఇవ్వగలడా అనే సందేహాలు వినిపించాయి. కానీ అతను అన్నింటినీ పటాపంచలు చేసేశాడు. గత నాలుగు కామన్వెల్త్ క్రీడలతో పోలిస్తే ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. నాలుగు విభాగాల్లోనూ అతను పతకాలు (3 స్వర్ణాలు, 1 రజతం) సాధించడం విశేషం. షెడ్యూల్ ప్రకారం చాలా తక్కువ వ్యవధిలో వరుసగా మ్యాచ్‌లు ఆడాల్సి రావడం, ఒకే రోజు వేర్వేరు ఈవెంట్లలో పాల్గొనాల్సి వచ్చినా శరత్ లయ కోల్పోలేదు. ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ విజయాలు సాధించి అతను సత్తా చాటాడు. -
టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు మరో స్వర్ణం
కామన్వెల్త్ గేమ్స్-2022 అఖరి రోజు భారత్ ఖాతాలో నాలుగో గోల్డ్ మెడల్ వచ్చి చేరింది. టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో ఆచంట శరత్ కమల్ స్వర్ణ పతకం సాధించాడు. సోమవారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ పిచ్‌ఫోర్డ్‌పై 4-1తో కమల్ విజయం సాధించాడు. ఇక ఓవరాల్‌గా అఖరి రోజు భారత్‌కు ఇది ఐదో పతకం. అంతకుముందు పీవీ సింధు.. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించగా, పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. అదే విధంగా బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్‌లో రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ గోల్డ్ మెడల్ సాధించింది. మరో వైపు టేబుల్ టెన్నిస్ కాంస్య పతక పోరులో జ్ఞానశేఖరన్ సాతియన్ విజయం సాధించాడు. భారత్ ఇప్పటి వరకు 22 పసిడి, 15 రజత, 23 కాంస్య పతకాలు సాధించి మొత్తంగా 60 మెడల్స్‌తో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. చదవండి: CWG 2022:: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. ఫైనల్లో అదరగొట్టిన రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి -
ఆఖరి రోజు 5 స్వర్ణాలు, ఓ కాంస్యంపై భారత్ గురి.. సింధు సహా పురుషుల హాకీపై గంపెడాశలు
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడలు చివరిదశకు చేరుకున్నాయి. ఇవాల్టితో (ఆగస్ట్ 8) ఈ మహా సంగ్రామం ముగియనుంది. క్రీడల ఆఖరి రోజు భారత్ మరో ఆరు పతకాలపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు (10వ రోజు) భారత్ ఖాతాలో 55 పతకాలు (18 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలు) ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ ఐదో స్థానంలో కొనసాగుతుంది. 11వ రోజు మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో లక్ష్యసేన్, పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ, పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్‌లో ఆచంట శరత్ కమల్, పురుషుల హాకీ టీమ్ స్వర్ణం కోసం పోరడనుండగా.. పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్‌లో సాథియాన్ జ్ఞానశేఖరన్ కాంస్యం కోసం ఇంగ్లండ్‌కు చెందిన పాల్ డ్రింక్‌హాల్‌తో తలపడనున్నాడు. 11వ రోజు భారత షెడ్యూల్ ఇదే.. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 1.20) పీవీ సింధు వర్సెస్ మిచెల్ లీ (కెనడా) పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 2.10 ) లక్ష్య సేన్ వర్సెస్ జే యోంగ్ ఎన్జీ (మలేషియా) పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 3 గంటలకు) సాత్విక్ సాయి రాజ్-చిరాగ్ శెట్టి వర్సెస్ బెన్ లేన్-సీన్ వెండీ (ఇంగ్లండ్) పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 3.35) సాథియాన్ జ్ఞానశేఖరన్ వర్సెస్ పాల్ డ్రింక్‌హాల్ (ఇంగ్లండ్) పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (సాయంత్రం 4.25) ఆచంట శరత్ కమల్ వర్సెస్ లియామ్ పిచ్‌ఫోర్డ్ (ఇంగ్లండ్) పురుషుల హాకీ గోల్డ్ మెడల్ మ్యాచ్ సాయంత్రం (5 గంటల నుంచి ప్రారంభం) ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఇదిలా ఉంటే, ప్రస్తుత కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఇవాళ ఆరు పతకాలు (5 స్వర్ణాలు , కాంస్యం) సాధించినా (55+6=61) 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్ రికార్డును (66 పతకాలు (26 గోల్డ్, 20 సిల్వర్, 20 బ్రాంజ్)) బద్దలు కొట్టే అవకాశం లేదు. వీటిలో రెండు స్వర్ణాలు గెలిచినా పతకాల పట్టికలో న్యూజిలాండ్‌ను (48 పతకాలు (19 స్వర్ణాలు, 12 రజతాలు, 17 కాంస్యాలు)) వెనక్కునెట్టి నాలుగో స్థానానికి ఎగబాకుతుంది. పతకాల పట్టికలో ఆస్ట్రేలియా (170), ఇంగ్లండ్ (165), కెనడా (87) తొలి మూడు స్థానాల్లో ఉంటాయి. 2010 న్యూఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ రికార్డు స్థాయిలో 101 మెడల్స్ సాధించింది. ఇప్పటికీ భారత్‌కు అదే అత్యుత్తమ ప్రదర్శన. చదవండి: బాక్సింగ్‌లో మరో పతకం.. సాగర్ అహ్లావత్‌కు రజతం -
రజతంతో సరిపెట్టుకున్న శరత్ కమల్-జ్ఞానశేఖరన్ జోడీ
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ టేబుల్ టెన్నిస్ డబుల్స్ జోడీ రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో అచంట శరత్ కమల్-జ్ఞానశేఖరన్ సతియాన్ ద్వయం.. ఇంగ్లండ్ జోడీ లియామ్ పిచ్‌ఫోర్డ్-పాల్ డ్రింక్‌హాల్ చేతిలో ఓటమిపాలైంది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఇంగ్లీష్ జోడీ 8-11, 11-8, 11-3, 7-11, 11-4తేడాతో భారత ద్వయంపై విజయం సాధించి స్వర్ణ పతకం ఎగరేసుకుపోయింది. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ ఇంగ్లండ్ జోడీ.. భారత జోడీపై దాదాపు ఇదే తరహాలో విజయం సాధించింది. నాడు డిసైడింగ్ గేమ్‌లో ఇంగ్లండ్ 11-8 తేడాతో నెగ్గగా.. ఇప్పుడు 11-4 తేడాతో విజయం సాధించింది. టీటీలో శరత్ కమల్-జ్ఞానశేఖరన్ జోడీ సాధించిన పతకంతో భారత పతకాల సంఖ్య 49కి (17 స్వర్ణాలు, 13 రజతాలు, 19 కాంస్యాలు) చేరింది. ఇవాళ ఒక్క రోజే భారత్ ఖాతాలో 9 పతకాలు చేరాయి. చదవండి: పసిడి పంచ్ విసిరిన తెలంగాణ బిడ్డ.. అభినందనలతో ముంచెత్తిన కేసీఆర్ -
Commonwealth Games 2022: సూపర్ శ్రీజ, శరత్
తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్ కమల్ జోడీ... పురుషుల డబుల్స్‌లో శరత్ కమల్–సత్యన్ జ్ఞానశేఖరన్ జంట ఫైనల్లోకి దూసుకెళ్లాయి. సెమీఫైనల్స్‌లో శ్రీజ–శరత్ కమల్ ద్వయం 11–9, 11–8, 9–11, 12–14, 11–7తో నికోలస్ లమ్–మిన్హైంగ్ జీ (ఆస్ట్రేలియా) జంటపై... శరత్ కమల్–సత్యన్ జోడీ 8–11, 11–9, 10–12, 11–1, 11–8తో నికోలస్ లమ్–ఫిన్ లు (ఆస్ట్రేలియా) ద్వయంపై గెలిచాయి. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీజ 6–11, 11–8, 11–6, 9–11, 8–11, 11–8, 10–12తో తియాన్వె ఫెంగ్ (సింగపూర్) చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే కాంస్య పతక పోరులో యాంగ్జీ లియు (ఆస్ట్రేలియా)తో శ్రీజ ఆడుతుంది. పురుషుల సింగిల్స్‌లో సత్యన్, శరత్ కమల్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల డబుల్స్‌లో శ్రీజ–రీత్... మనిక బత్రా–దియా చిటాలె (భారత్) జోడీలకు క్వార్టర్ ఫైనల్లో ఓటమి ఎదురైంది. -
శరత్ కమల్ @ 31
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) సమాఖ్య (ఐటీటీఎఫ్) తాజాగా విడుదల చేసిన పురుషుల టీటీ ర్యాంకింగ్స్‌లో భారత వెటరన్ ఆచంట శరత్ కమల్ ఏడు స్థానాలు ఎగబాకి 31వ స్థానంలో నిలిచాడు. దాంతో భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంకు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 10 సంవత్సరాల తన ఐటీటీఎఫ్ టైటిల్ నిరీక్షణకు గత నెలలో తెరదించుతూ ఒమన్ ఓపెన్‌లో శరత్ విజేతగా నిలిచాడు. దాంతో అతని ర్యాంకింగ్ మెరుగుపడింది. భారత్‌కే చెందిన సత్యన్ 32వ ర్యాంకులో ఉన్నాడు. హర్మీత్ దేశాయ్ (72), ఆంటోని అమల్‌రాజ్ (100), మానవ్ ఠక్కర్ (139) స్థానాల్లో నిలిచారు. ఇక మహిళల విభాగంలో మనికా బాత్రా 63వ స్థానంలో ఉండగా... సుతీర్థ ముఖర్జీ 95వ స్థానంలో నిలిచింది. -
యోధాస్ జట్టులో శ్రీజ
ముంబై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్‌లో పాల్గొనే ఆయా జట్ల ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. జూన్‌లో జరిగే ఈ లీగ్‌లో హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ యోధాస్ జట్టులో చోటు దక్కించుకుంది. ఇదే జట్టులో ఎనిమిదిసార్లు జాతీయ చాంపియన్, కామన్వెల్త్ గేమ్స్‌లో మూడు స్వర్ణాలు నెగ్గిన భారత స్టార్ ఆచంట శరత్ కమల్ కూడా ఉన్నాడు. యూటీటీ రెండో సీజన్ జూన్ 14న పుణేలో మొదలవుతుంది. దబంగ్ స్మాషర్స్, ఫాల్క న్స్, మహారాష్ట్ర యునైటెడ్, ఆర్పీ–ఎస్జీ మావెరిర్స్, యోధాస్ జట్లు ఈ లీగ్ బరిలో ఉన్నాయి. 19న పుణేలో తొలి అంచె ముగిశాక... జూన్ 20 నుంచి 25 వరకు ఢిల్లీ్లలో రెండో అంచె పోటీలు జరుగుతాయి. చివరిదైన మూడో అంచె మ్యాచ్‌లకు జూన్ 26 నుంచి జూలై 1 వరకు కోల్‌కతా ఆతిథ్యం ఇస్తుంది. -
సెమీస్‌లో శరత్ కమల్‌కు షాక్
14 ఏళ్ల జపాన్ కుర్రాడి చేతిలో పరాజయం న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) వరల్డ్ టూర్ ఇండియా ఓపెన్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 34 ఏళ్ల శరత్ కమల్ 7–11, 11–5, 7–11, 13–11, 9–11, 9–11తో 14 ఏళ్ల తొమొకాజు హరిమోటో (జపాన్ ) చేతిలో ఓడిపోయాడు. జూనియర్ బాలుర సింగిల్స్ విభాగంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ గా ఉన్న హరిమోటో అద్వితీయ ప్రదర్శనకు ‘ట్రిపుల్ ఒలింపియన్ ’ శరత్ కమల్ చేతులెత్తేశాడు. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో శరత్ 11–4, 10–12, 9–11, 11–6, 11–9, 9–11, 13–11తో పాల్ డ్రింకాల్ (ఇంగ్లండ్)పై గెలుపొందాడు. ఆదివారం జరిగే ఫైనల్లో దిమిత్రిజ్ (జర్మనీ)తో హరిమోటో తలపడతాడు. తొలి సెమీఫైనల్లో దిమిత్రిజ్ 8–11, 11–2, 9–11, 12–10, 14–16, 11–2, 11–8తో నివి కోకి (జపా¯ŒS)పై విజయం సాధించాడు. -
శరత్, మౌమదాస్ లకు రియో బెర్త్‌లు
హాంకాంగ్: భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు ఆచంట శరత్ కమల్, మౌమదాస్లు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. శనివారం జరిగిన ఆసియా ఒలింపిక్ గేమ్స్ క్వాలిఫికేషన్ స్టేజ్-2లో పోటీల్లో శరత్ 4-3 (12-14, 11-6, 3-11, 7-11, 11-4, 11-6)తో నోషాద్ అల్మియాన్ (ఇరాన్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్ ఫైనల్ రౌండ్లో మౌమదాస్ 0-4 (3-11, 9-11, 10-12, 5-11)తో రి మైయోంగ్ సన్ (ఉత్తర కొరియా) చేతిలో పరాజయం చవిచూసింది. అయితే లూజర్స్ ఫైనల్స్‌లో (ఓడిపోయిన వారి మధ్య జరిగే ఫైనల్స్) మౌమ 4-1 (11-13, 11-9, 13-11, 11-7, 12-10)తో గుఫ్రనోవా (ఉజ్బెకిస్తాన్)పై గెలిచి బెర్త్‌ను ఖాయం చేసుకుంది. -
భారత జట్ల శుభారంభం
టీటీ ప్రపంచ చాంపియన్‌షిప్ కౌలాలంపూర్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. గ్రూప్-ఎఫ్ రెండో డివిజన్ తొలి రౌండ్లో భారత పురుషుల జట్టు 3-0తో వియత్నాంపై విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో ఆడిన ఆచంట శరత్ కమల్ 11-8, 11-6, 5-11, 11-6తో టు నగుయెన్‌పై నెగ్గాడు. రెండో సింగిల్స్‌లో ఆంథోని అమల్‌రాజ్ 12-10, 11-5, 11-6తో టియాన్ డాట్ లీని ఓడించడంతో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో సింగిల్స్‌లో హర్మిత్ దేశాయ్ 11-5, 13-11, 12-10తో బా యువాన్ అన్ డొయాన్‌పై గెలవడంతో భారత్ 3-0తో నెగ్గింది. సోమవారం జరిగే మ్యాచ్‌ల్లో తొలుత టర్కీతో, అనంతరం నైజీరియాతో భారత్ ఆడుతుంది. రెండో డివిజన్లో మొత్తం 24 జట్లు నాలుగు గ్రూప్‌లుగా బరిలోకి దిగుతున్నాయి. ప్రతి గ్రూప్‌లో జట్టు.. మిగతా టీమ్‌లతో రౌండ్ రాబిన్ పద్ధతిలో మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్ టాపర్లు రెండో దశకు అర్హత సాధిస్తారు. గ్రూప్ ‘జి’లో భారత మహిళల జట్టు తొలి రౌండ్లో 3-0తో కొలంబియాను ఓడించింది. తొలి సింగిల్స్‌లో మౌమా దాస్ 11-2, 12-10, 11-2తో పౌలా మెదీనాపై, రెండో సింగిల్స్‌లో మణికా బాత్రా 11-5, 11-5, 11-4తో లేడీ రువానోపై, మూడో సింగిల్స్‌లో 11-4, 11-8, 11-3తో లుసా జులుఆగాపై గెలిచారు. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లను నిర్వహించలేదు. సోమవారం జరిగే మ్యాచ్‌ల్లో తొలుత ప్యుర్టోరికో, ఆ తర్వాత పోర్చుగల్‌తో భారత్ ఆడుతుంది. -
నేటి నుంచి జాతీయ టీటీ
సాక్షి, హైదరాబాద్: ఒలింపియన్ ఆచంట శరత్ కమల్‌తోపాటు భారత్‌కు చెందిన పలువురు అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారులు తమ విన్యాసాలను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. స్థానిక కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో మంగళవారం జాతీయ సీనియర్, అంతర్ రాష్ట్ర టీటీ చాంపియన్‌షిప్ పోటీలకు తెరలేవనుంది. ఆరు రోజులపాటు జరిగే ఈ మెగా ఈవెంట్లో టీమ్, వ్యక్తిగత విభాగాల్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) ఆటగాళ్లు ఫేవరెట్‌గా ఉన్నారు. -
మూడో రౌండ్లో శరత్
సుజౌ (చైనా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ దూసుకెళుతున్నాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 44వ ర్యాంకర్ శరత్ కమల్ 11-4, 11-5, 11-7, 6-11, 11-8 తేడాతో 35వ ర్యాంకర్ సైమన్ గాజీ (ఫ్రాన్స్)ని మట్టికరిపించాడు. గతంలోనూ తను ఈ మెగా టోర్నీలో మూడో రౌండ్ వరకు చేరాడు. అలాగే జి.సత్యన్ సంచలన ప్రదర్శన రెండో రౌండ్లో ముగిసింది. అతను 1-4తో చైనాకు చెందిన ఫాంగ్ బో చేతిలో ఓడిపోయాడు. అటు సౌమ్యజిత్ ఘోష్ కూడా రెండో రౌండ్లో 1-4తో అలెగ్జాండర్ (రష్యా) చేతిలో ఓడాడు. -
శరత్‌కు ఆరో స్థానం
ఆసియా కప్ టీటీ జైపూర్: ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ (టీటీ)లో భారత ఆటగాడు ఆచంట శరత్ కమల్ ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. శనివారం ఐదు-ఆరు స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో శరత్ 11-8, 2-11, 17-15, 7-11, 11-9, 9-11, 10-12 తేడాతో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్సియోక్ చేతిలో ఓడిపోయాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 32వ ర్యాంకర్ కిమ్‌పై తను పైచేయి సాధించలేకపోయాడు. గతేడాది కూడా ఈ ఆటగాడి చేతిలోనే ఓడిన శరత్ ఆరో స్థానంలోనే నిలిచాడు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో శరత్ తన చిరకాల ప్రత్యర్థి గావో నింగ్ (సింగపూర్)ను 11-7, 4-11, 11-8, 12-10, 11-5 తేడాతో తొలిసారి ఓడించాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో శరత్ కమల్ టాప్-20లోని ముగ్గురి ఆటగాళ్లను ఓడించి సత్తా చాటుకున్నాడు. అలాగే ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచకప్‌లో క్వాలిఫై అయ్యే అవకాశాలను మెరుగుపరుచుకున్నాడు.