ముంబై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్‌లో పాల్గొనే ఆయా జట్ల ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. జూన్‌లో జరిగే ఈ లీగ్‌లో హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ యోధాస్ జట్టులో చోటు దక్కించుకుంది. ఇదే జట్టులో ఎనిమిదిసార్లు జాతీయ చాంపియన్, కామన్వెల్త్ గేమ్స్‌లో మూడు స్వర్ణాలు నెగ్గిన భారత స్టార్ ఆచంట శరత్ కమల్ కూడా ఉన్నాడు. యూటీటీ రెండో సీజన్ జూన్ 14న పుణేలో మొదలవుతుంది. దబంగ్ స్మాషర్స్, ఫాల్క న్స్, మహారాష్ట్ర యునైటెడ్, ఆర్‌పీ–ఎస్‌జీ మావెరిర్స్, యోధాస్ జట్లు ఈ లీగ్ బరిలో ఉన్నాయి. 19న పుణేలో తొలి అంచె ముగిశాక... జూన్ 20 నుంచి 25 వరకు ఢిల్లీ్లలో రెండో అంచె పోటీలు జరుగుతాయి. చివరిదైన మూడో అంచె మ్యాచ్‌లకు జూన్ 26 నుంచి జూలై 1 వరకు కోల్‌కతా ఆతిథ్యం ఇస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment