Yodha
-
మనాలీలో.. యాక్షన్
‘యోధ’ కోసం మనాలీ వెళ్లారు హీరోయిన్ రాశీఖన్నా. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజా ద్వయం తెరకెక్కిస్తున్న సినిమా ‘యోధ’. ఈ యాక్షన్ ఫిల్మ్‌లో దిశా పటానీ, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. అయితే కొంత ప్యాచ్‌వర్క్ కోసం మనాలీ వెళ్లింది ‘యోధ’ చిత్రబృందం. షూట్లో పాల్గొంటున్న విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్ స్టా ద్వారా తెలిపారు రాశీ ఖన్నా. ఇందులో రాశీ ఖన్నా కొన్ని యాక్షన్ సీన్ కూడా చేశారన్నది బాలీవుడ్ సమాచారం. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం కాకుండా తమిళంలో కార్తీ ‘సర్దార్’, తెలుగులో శర్వానంద్‌తో ఓ సినిమా చేస్తున్నారు రాశీ ఖన్నా. -
Ultimate Kho Kho: క్వాలిఫయర్–2కు తెలుగు యోధాస్
పుణే: అల్టిమేట్ ఖో–ఖో లీగ్‌లో తెలుగు యోధాస్ జట్టు క్వాలిఫయర్–2 మ్యాచ్‌కు అర్హత పొందింది. చెన్నై క్విక్గన్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో తెలుగు యోధాస్ 61–43తో గెలిచింది. తెలుగు యోధాస్ కెప్టెన్ ప్రతీక్, ఆదర్శ్ రాణించారు. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఒడిశా జగర్‌నాట్స్, గుజరాత్ జెయింట్స్ క్వాలిఫయర్–1లో తలపడగా ... ఒడిశా జగర్‌నాట్స్ 57–43తో నెగ్గి ఫైనల్ చేరింది. నేడు జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్‌తో తెలుగు యోధాస్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఒడిశాతో ఆడుతుంది. -
Ultimate Kho Kho: తెలుగు యోధాస్ శుభారంభం
పుణే: అల్టిమేట్ ఖో–ఖో లీగ్‌లో తెలుగు యోధాస్ జట్టు విజయంతో బోణీ చేసింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు యోధాస్ 48–38తో చెన్నై క్విక్ గన్స్ జట్టుపై విజయం సాధించింది. డిఫెండర్ దీపక్ మాధవ్, అటాకర్ అరుణ్ గున్కీ రాణించి తెలుగు యోధాస్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఆరంభంలో తెలుగు యోధాస్ వరుసగా 25 పాయింట్లు స్కోరు చేయగా చెన్నై ఖాతా తెరువలేకపోయింది. తెలుగు యోధాస్ స్కోరు చేసిన మొత్తం పాయింట్లలో 24 టచ్ పాయింట్లు, 17 డైవ్ పాయింట్లు ఉండటం విశేషం. అంతకుముందు తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 69–44తో ముంబై ఖిలాడీస్ జట్టుపై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో రాజస్తాన్ వారియర్స్‌తో ముంబై ఖిలాడీస్; ఒడిషా జగర్‌నాట్స్‌తో చెన్నై క్విక్ గన్స్ తలపడతాయి. -
అది కాస్త కష్టంగా అనిపించినా నాకు ఇష్టమే: రాశిఖన్నా
నిద్రపోవడానికి కూడా సమయం లేనంత బిజీగా ఉంటున్నారు రాశీ ఖన్నా. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ‘యోధ’ సినిమా షూటింగ్ షెడ్యూల్లో రాశీ పాల్గొంటున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. దర్శక ద్వయం సాగర్, పుష్కర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాశీతో పాటు దిశా పటానీ హీరోయిన్గా నటిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది నవంబరులో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వడానికి ముందు తమిళ చిత్రం ‘సర్దార్’ షూట్లో పాల్గొన్నారు రాశీ. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తీ హీరో. ఈ సినిమా నైట్ షూట్‌ను ముగించుకుని ‘యోధ’ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు రాశీ ఖన్నా. ‘‘సర్దార్’ నైట్ షూట్స్‌ను కంప్లీట్ చేసిన వెంటనే ఢిల్లీలో జరుగుతోన్న ‘యోధ’ డే షూట్స్‌లో జాయిన్ అయ్యాను. సరిగ్గా నిద్రపోయేంత సమయం కూడా ఉండటం లేదు. ఆర్టిస్ట్ లైఫ్ కాస్త కష్టంగా అనిపించినా నాకు ఇష్టమే’’ అని పేర్కొన్నారు రాశీ ఖన్నా. ఇక తెలుగులో రాశీ ఖన్నా హీరోయిన్గా చేసిన గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’ చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. -
రాశీ ఖన్నా జోరు, యోధ షూటింగ్ హీరోయిన్ చేజింగ్
Rashi Khanna హీరోయిన్ రాశీఖన్నా ముంబైలో చేజింగ్ చేస్తున్నారు. అయితే ఈ చేజింగ్ ఎందుకు? అనేది తెలియాలంటే మాత్రం కాస్త సమయం పడుతుంది. సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీఖన్నా, దిశాపటానీ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న యాక్షన్ ఫిల్మ్ ‘యోధ’. సాగర్, పుష్కర్ ద్వయం తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీ ఖన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చదవండి: 'ఆర్ఆర్ఆర్' బ్యూటీ అలియాపై సమంత కామెంట్స్.. రాశి ఎవర్నో చేజ్ చేసే సన్నివేశాల షూటింగ్ జరుగుతోందట. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ మూవీ నవంబరులో విడుదల కానుంది. కాగా హిందీలో ‘రుద్ర’, సన్నీ(ప్రచారంలో ఉన్న టైటిల్) వెబ్ సిరీస్‌లను కూడా పూర్తి చేశారు రాశీఖన్నా. సౌత్‌లో ఆమె నటించిన ‘థ్యాంక్యూ’, ‘పక్కా కమర్షియల్’, సర్దార్’ చిత్రాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
డయాగ్నోస్టిక్స్ సేవల్లోకి యోధ లైఫ్‌లైన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ డయాగ్నోస్టిక్స్ సేవల్లోకి యోధ లైఫ్‌లైన్ ప్రవేశించింది. ఆధునిక వైద్య పరికరాలతో అమీర్‌పేటలో 24,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఏర్పాటైంది. బయోకెమిస్ట్రీ, బయోకెమికల్ జెనెటిక్స్, సైటోజెనెటిక్స్, కోవిడ్–19, జీనోమిక్స్, మాలిక్యులార్ డయాగ్నోస్టిక్స్, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకోజినోమిక్స్, రేడియాలజీ సేవలను పరిచయం చేసింది. టెస్ట్‌ల కోసం ఆన్లైన్లో బుక్ చేస్తే నమూనాలను ఇంటి వద్ద నుంచే సేకరిస్తారు. తక్కువ సమయంలో పరీక్ష ఫలితాలను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. నిపుణుల నుంచి సలహాలూ పొందవచ్చని వివరించింది. యోధ లైఫ్‌లైన్‌ను అత్యాధునిక కంప్యూటింగ్, మాలిక్యులార్ డయాగ్నోస్టిక్స్ రంగంలో విశేష అనుభం ఉన్న సుధాకర్ కంచర్ల స్థాపించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటు ధరలో డయాగ్నోస్టిక్స్ సేవలను అందించనున్నట్టు తెలిపారు. యూఎస్ఏలో మూడు ఐటీ కంపెనీలతోపాటు సీఎల్ఐఏ ఆమోదం పొందిన ప్రపంచ స్థాయి డయాగ్నోస్టిక్స్ సెంటర్స్‌ను ఆయన ఏర్పాటు చేశారు. -
మనం ఏ స్థాయిలో ఉన్నా డ్రెస్సు, అడ్రెస్సు మారకూడదు: ఉప రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: అమీర్‌పేట్‌లోని లాల్ బంగ్లాలో యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రులు, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీనటుడు చిరంజీవి కలిసి ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాఘవేంద్రరావు, మాజీ క్రికెటర్ అజారుద్దీన్, పుల్లెల గోపిచంద్, క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ వ్యవస్థాపకులు కంచర్ల సుధాకర్, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్‌ను ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్ హెల్త్ హబ్ సిటీగా మారుతోందని కొనియాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ఒక టీచర్ అని, అది మనకు ఎన్నో పాఠాలను నేర్పుతోందన్నారు. జీవితంలో ఎప్పుడూ నెగెటివిటీ ఉండొద్దు కానీ కరోనా విషయంలో నెగెటివ్ ఉండాల్సిందేనన్నారు. పట్టణాల్లో కరోనా బాగా విజృంభించిందని, గ్రామాల్లో కరోనా ప్రభావం అంతగా లేదన్నారు. పట్టణాల్లో జీవనం, జీవన విధానం దగ్గరదగ్గరగా ఉందని, రాబోయే రోజుల్లో గాలి వెలుతురు వచ్చేలా ఇంటి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ‘గాలి వెలుతురు రాకపోతే అది ఇల్లే కాదు. ఇంటికి సౌందర్యమా, సౌకర్యమా ఏది ముఖ్యమో ఆలోచించుకోవాలి. సౌకర్యం ఉంటేనే ఇల్లు సౌందర్యంగా ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. శారీరక శ్రమ చేయాలి. పిజ్జా బర్గర్ విదేశాల్లో అవసరం. విదేశాల్లో పనికొస్తాయి. మనకు ఆ తిండి పనికి రాదు. మన సంస్కృతి, మన బాషా, మన కట్టుబాట్లు అన్ని పాటించాలి. మనం ఏ స్థాయిలో ఉన్న మన డ్రెస్సు, అడ్రెస్సు మారకూడదు’. అని వ్యాఖ్యానించారు. నగరంలో ఇన్ని డైయాగ్నోస్టిక్స్ ఉన్నప్పటికీ అత్యాధునికమైన, అడ్వాన్స్ టెక్నాలజీ యోధ లైఫ్ లైన్లో ఉన్నాయని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. తెలంగాణలో ఆరోగ్యానికి పెద్దపీట వేసేందుకు మల్టీ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేద వారికి వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రభుత్వం తరపున తమకు అన్ని సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాల్లో కూడా యోధ లైఫ్ లైన్ విస్తరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు కంచర్ల సుధాకర్ 25 లక్షల విరాళం ప్రకటించారు. -
యోధాస్ జట్టులో శ్రీజ
ముంబై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్‌లో పాల్గొనే ఆయా జట్ల ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. జూన్‌లో జరిగే ఈ లీగ్‌లో హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ యోధాస్ జట్టులో చోటు దక్కించుకుంది. ఇదే జట్టులో ఎనిమిదిసార్లు జాతీయ చాంపియన్, కామన్వెల్త్ గేమ్స్‌లో మూడు స్వర్ణాలు నెగ్గిన భారత స్టార్ ఆచంట శరత్ కమల్ కూడా ఉన్నాడు. యూటీటీ రెండో సీజన్ జూన్ 14న పుణేలో మొదలవుతుంది. దబంగ్ స్మాషర్స్, ఫాల్క న్స్, మహారాష్ట్ర యునైటెడ్, ఆర్పీ–ఎస్జీ మావెరిర్స్, యోధాస్ జట్లు ఈ లీగ్ బరిలో ఉన్నాయి. 19న పుణేలో తొలి అంచె ముగిశాక... జూన్ 20 నుంచి 25 వరకు ఢిల్లీ్లలో రెండో అంచె పోటీలు జరుగుతాయి. చివరిదైన మూడో అంచె మ్యాచ్‌లకు జూన్ 26 నుంచి జూలై 1 వరకు కోల్‌కతా ఆతిథ్యం ఇస్తుంది. -
కొత్తవాళ్లను ప్రోత్సహించాలి
– రమణాచారి పావని, కిరణ్, యోధ, సాంబ ముఖ్య తారలుగా వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లావణ్య విత్ లవ్‌బాయ్స్’. నర్సింలు పటేల్‌చెట్టి, సి. రాజ్యలక్ష్మీ నిర్మించారు. యశోకృష్ణ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ఆడియో సీడీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. రమణాచారి ఆవిష్కరించి, రచయిత పరుచూరి గోపాలకృష్ణకు అందజేశారు. ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. రమణాచారి మాట్లాడుతూ– ‘‘తేనె మనసులు’తో ఆదుర్తిగారు పరిచయం చేయకపోతే కృష్ణగారు, కొత్త నటీనటులు వద్దని దాసరిగారు అనుకుని ఉంటే మోహన్‌బాబుగారి లాంటి ప్రతిభావంతులు వచ్చి ఉండేవారు కాదు. తేజ, శేఖర్ కమ్ముల వంటి దర్శకులు కొత్తవాళ్లకు ఛాన్స్ ఇస్తున్నారు. వడ్డేపల్లి కృష్ణ చక్కని కథాంశంతో కొత్త నటీనటులతో చేసిన చిత్రమిది. కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చేవాళ్లు మరింతమంది రావాలి’’ అన్నారు. ‘‘ముగ్గురు యువకులు లావణ్య అనే అమ్మాయితో ప్రేమలో పడతారు. ఆ ముగ్గురిలో ఆమె ఎవర్ని పెళ్లి చేసుకుందనేదే కథ’’ అన్నారు వడ్డేపల్లి కృష్ణ. -
లావణ్య ప్రేమ
ప్రేమకు సరికొత్త నిర్వచనం ఇచ్చేలా ‘లావణ్య విత్ లవ్ బాయ్స్’ చిత్రాన్ని రూపొందిస్తున్నామన్నారు దర్శకుడు వడ్డేపల్లి కృష్ణ. పరుచూరి గోపాలకృష్ణ, కాశీ విశ్వనాథ్, హేమసుందర్, పావని, స్వరూప, యోధా, సాంబ, కిరణ్ ముఖ్య తారలు. రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రాజ్యలక్ష్మి.సి, నర్సింలు పటేల్ చెట్టి నిర్మిస్తున్న ఈ సినిమా క్లైమ్యాక్స్ చిత్రీకరణ ఇటీవల పూర్తయింది. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘యువతరం మెచ్చే చక్కటి కథ, కథనాలతో పాటు మంచి మాటలు, పాటలు కుదిరాయి. నల్గొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం’’ అన్నారు. ‘‘లావణ్య అనే అమ్మాయి కథే ఈ సినిమా. లవ్ బాయ్స్‌లో ఆమె మనసు సొంతం చేసుకున్నది ఎవరనేది ఆసక్తికరం. అన్ని వర్గాలవారూ చూడ్డదగ్గ విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి కెమేరా: తోట.వి.రమణ, సంగీతం: యశోకృష్ణ. -
ఆటే.. హిట్టయింది
అత్తాకోడళ్ల మధ్య సంప్రదాయంగా మారిపోయినట్టు అనిపించిన నాటి గొడవలు దాదాపు అంతరించినట్టే. ఈ నేపథ్యంలో ఒకప్పటి అత్తా కోడళ్ల గిల్లికజ్జాలకు యూట్యూబ్‌లో యోధ వీడియోస్ కేరాఫ్ అయింది. ఈ వీడియోస్‌లో అత్తగారి అసలు పేరు రమ్య. కోడలి పేరు యోధ. తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి చుట్టాలైపోయారీ సిటీ కిడ్స్. వయసును మించిన పరిణతితో అత్తాకోడళ్ల పాత్రలను పండిస్తున్న ఈ చిన్నారులు తమ సక్సెస్ అనుభూతులు పంచుకున్నారిలా. ..- చల్లపల్లి శిరీష ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను. ఫ్రెండ్ రమ్యతో అత్త కోడలు ఆట ఆడుకుంటుంటే మా నాన్న వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టారు. మంచి రెస్పాన్స్ రావడంతో అలాగే వరుసగా వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాం. టైలర్ అయిన రమ్య వాళ్ల నాన్న మాకు కాస్ట్యుమ్స్ డిజైన్ చేస్తే, డ్యాన్సరైన మా నాన్న మేకప్ చేస్తారు. ఒక లైలా కోసం, సూర్యా వర్సెస్ సూర్యా, గోవిందుడు అందరివాడేలే, సుబ్రమణ్యం ఫర్ సేల్, బెంగాల్ టైగర్, గబ్బర్ సింగ్-2.. ఇలా 48 సినిమాల్లో నటించాను. ఈ వీడియోలతో చాలా పేరొచ్చింది. - యోధ నాలుగో తరగతి చదువుతున్నాను. సరదాగ ఆడుకున్న ఆటలే ఈ రోజు మాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. మా టాలెంట్‌కు గుర్తింపుగా యూసుఫ్‌గూడలోని ఎస్జీబీ హైస్కూల్ ఉచితంగా చదువు చెబుతూ మాకు బాగా సపోర్ట్ చేస్తోంది. రాములమ్మ, సీతాకోక చిలుక, శశిరేఖ పరిణయం సీరియల్స్‌లో నటించాను. ఒక మంచి నటిగా సెటిలై మా తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలనేది కోరిక. - రమ్య