
Rashi Khanna హీరోయిన్ రాశీఖన్నా ముంబైలో చేజింగ్ చేస్తున్నారు. అయితే ఈ చేజింగ్ ఎందుకు? అనేది తెలియాలంటే మాత్రం కాస్త సమయం పడుతుంది. సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీఖన్నా, దిశాపటానీ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న యాక్షన్ ఫిల్మ్ ‘యోధ’. సాగర్, పుష్కర్ ద్వయం తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీ ఖన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
చదవండి: 'ఆర్ఆర్ఆర్' బ్యూటీ అలియాపై సమంత కామెంట్స్..
రాశి ఎవర్నో చేజ్ చేసే సన్నివేశాల షూటింగ్ జరుగుతోందట. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ మూవీ నవంబరులో విడుదల కానుంది. కాగా హిందీలో ‘రుద్ర’, సన్నీ(ప్రచారంలో ఉన్న టైటిల్) వెబ్ సిరీస్‌లను కూడా పూర్తి చేశారు రాశీఖన్నా. సౌత్‌లో ఆమె నటించిన ‘థ్యాంక్యూ’, ‘పక్కా కమర్షియల్’, సర్దార్’ చిత్రాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment