Rashi Khanna
-
ఓటీటీలో హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్
జీవా(jeeva), అర్జున్ సర్జా(arjun sarja) హీరోలుగా నటించిన 'అగత్యా' (Aghathiyaa) చిత్రం ఓటీటీలోకి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఫాంటసీ హారర్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. రాశీ ఖన్నా హీరోయిన్గా నటించిన పాన్ ఇండియా మూవీని ప్రముఖ గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహించారు. డా.ఇషారి కె.గణేశ్, అనీశ్ అర్జున్దేవ్ నిర్మాతలు. ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఫిబ్రవరి 28న విడుదల అయింది. ట్రైలర్‌కు అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు.గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం.. సన్ నెక్స్ట్ వేదికగా మార్చి 28 నుంచి స్ట్రీమింగ్కు రానుందని ప్రకటన వచ్చేసింది. పాన్ ఇండియా రేంజ్లో తమిళ్,హిందీ,తెలుగు,మలయాళం, కన్నడలో విడుదలైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం ఎన్ని భాషలలో విడుదల అవుతుంది అనేది మాత్రం ఆ సంస్థ చెప్పలేదు. కానీ, అన్ని లాంగ్వేజెస్‌లో అగత్యా స్ట్రీమింగ్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో కూడా ఈ మూవీ అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.కథేంటంటే..అగత్య(జీవా) ఓ ఆర్ట్ డైరెక్టర్. ఓ పెద్ద సినిమా చేసే చాన్స్ వస్తుంది. ఓ భారీ సెట్ వేసిన తర్వాత నిర్మాత షూటింగ్ నిలిపివేస్తాడు. దీంతో ప్రియురాలు వీణా(రాశీ ఖన్నా) ఇచ్చిన సలహాతో ఆ సెట్‌ని స్కేరీ హౌస్లా మార్చుతాడు. అయితే నిజంగానే ఆ బంగ్లాలో దెయ్యాలు ఉంటాయి. అసలు ఆ బంగ్లాలో ఉన్న దెయ్యాలు ఎవరు? ఓ ఆడ దెయ్యం అగత్యను ఎందుకు బయటకు పంపించాలనుకుంటుంది? అసలు 1940లో ఆ బంగ్లాలో ఏం జరిగింది? సిద్ద వైద్యం కోసం డాక్టర్ సిద్ధార్థ్(అర్జున్) ఎలాంటి కృషి చేశాడు? బ్రిటిష్ గవర్నర్ ఎడ్విన్ డూప్లెక్స్ చేసిన అరాచకం ఏంటి? అతని చెల్లెలు జాక్వెలిన్ పూవిలేకి సిద్ధార్థ్ చేసిన సహాయం ఏంటి? ఫ్రీడం ఫైటర్ నాన్సీకి అగత్యకు ఉన్న సంబంధం ఏంటి? కాన్సర్‌తో బాధపడుతున్న తల్లిని రక్షించుకునేందుకు అగత్యా ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. View this post on Instagram A post shared by SUN NXT (@sunnxt) -
భర్తతో సాక్షి అగర్వాల్ హోలీ సెలబ్రేషన్స్.. అనన్య నాగళ్ల బోల్డ్ లుక్స్!
మూవీ సెట్లో ప్రియాంక చోప్రా హోలీ సెలబ్రేషన్స్..రవీనా టాండన్ కూతురు రషా తడానీ హోలీ లుక్స్..కుటుంబంతో కలిసి హోలీ వేడుకల్లో రాశీ ఖన్నా..భర్తతో కలిసి తొలిసారి హోలీ జరుపుకున్న సాక్షి అగర్వాల్..శారీలో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల బోల్డ్ లుక్స్... View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
Aghathiyaa Review: జీవా ‘అగత్యా’ రివ్యూ
టైటిల్: అగత్యానటీనటులు: జీవా, అర్జున్ సర్జా, రాశీ ఖన్నా, ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్, యోగి బాబు తదితరులునిర్మాణ సంస్థ: వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, వామిండియానిర్మాతలు: డాక్టర్ ఇషారి కే గణేశ్, అనీష్ అర్జున్దేవ్దర్శకత్వం: పా.విజయ్సంగీతం: యువన్ శంకర్ రాజావిడుదల తేది: ఫిబ్రవరి 28, 2025రంగం, యాత్ర2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు జీవా. తాజాగా ఈ తమిళ హీరో నటించిన చిత్రం అగత్యా. పా. విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు(ఫిబ్రవరి 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..అగత్య(జీవా) ఓ ఆర్ట్ డైరెక్టర్. ఓ పెద్ద సినిమా చేసే చాన్స్ వస్తుంది. ఓ భారీ సెట్ వేసిన తర్వాత నిర్మాత షూటింగ్ నిలిపివేస్తాడు. దీంతో ప్రియురాలు వీణా(రాశీ ఖన్నా) ఇచ్చిన సలహాతో ఆ సెట్‌ని స్కేరీ హౌస్లా మార్చుతాడు. అయితే నిజంగానే ఆ బంగ్లాలో దెయ్యాలు ఉంటాయి. అసలు ఆ బంగ్లాలో ఉన్న దెయ్యాలు ఎవరు? ఓ ఆడ దెయ్యం అగత్యను ఎందుకు బయటకు పంపించాలనుకుంటుంది? అసలు 1940లో ఆ బంగ్లాలో ఏం జరిగింది? సిద్ద వైద్యం కోసం డాక్టర్ సిద్ధార్థ్(అర్జున్) ఎలాంటి కృషి చేశాడు? బ్రిటిష్ గవర్నర్ ఎడ్విన్ డూప్లెక్స్ చేసిన అరాచకం ఏంటి? అతని చెల్లెలు జాక్వెలిన్ పూవిలేకి సిద్ధార్థ్ చేసిన సహాయం ఏంటి? ఫ్రీడం ఫైటర్ నాన్సీకి అగత్యకు ఉన్న సంబంధం ఏంటి? కాన్సర్‌తో బాధపడుతున్న తల్లిని రక్షించుకునేందుకు అగత్యా ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇదొక డిఫరెంట్ హారర్ మూవీ. హారర్ ఎలిమెంట్స్‌కి దేశభక్తి, మదర్ సెంటిమెంట్‌ని యాడ్ చేసిన డిఫరెంట్‌గా కథ చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు పా.విజయ్. అయితే ఆ కథను తెరపై చూసినప్పుడు రొటీన్ హారర్ చిత్రంగానే అనిపిస్తుంది. కొన్ని చోట్ల భయపెట్టే సన్నివేశాలు ఉన్నప్పటికీ.. చాలా వరకు కథనం సాదాసీదాగానే సాగుతుంది. కథలో ఎక్కువ లేయర్స్ ఉండడంతో దర్శకుడు ఎం చెప్పాలనుకున్నాడనేది సరిగ్గా అర్థంకాదు. ఫస్టాఫ్‌లో వచ్చే హారర్ సన్నివేశాలు కొన్ని చోట్ల భయపడితే.. మరికొన్ని చోట్ల నవ్విస్తాయి.కథ 1940లోకి వెళ్లిన తర్వాత సాగదీసినట్లుగా అనిపిస్తుంది. సిద్దవైద్యం గొప్పదనం గురించి చెప్పేందుకు అనవసరపు సన్నివేశాలను జోడించారు. మధ్యలో కాసేపు స్వాతంత్ర పోరాటం.. మదర్ సెంటిమెంట్.. దైవ భక్తి అంటూ అసలు కథను పక్కన పెట్టేసినట్లుగా అనిపిస్తుంది. ఇక దెయ్యాల ప్లాష్‌బ్యాక్ ప్రారంభం అయిన కాసేపటికే క్లైమాక్స్ ఊహించొచ్చు. అయితే ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సీన్లు, యానిమేషన్ ఫైట్ ఆకట్టుకుంటాయి. మదర్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ బాగుంటుంది. ఎవరెలా చేశారంటే.. అగత్యా పాత్రకు జీవా న్యాయం చేశాడు. ఈ తరహా పాత్రలు ఆయనకు కొత్తేమి కాదు. గతంలో చాలానే చేశాడు. అర్జున్ సర్జా ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించాడు. డాక్టర్ సిద్ధార్థ్గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. రాశీఖన్నా పాత్ర నిడివి ఎక్కువే ఉంటుంది కానీ అంతగా ప్రాధాన్యత ఉండదు. యోగిబాబు, టీవీ గణేష్ కనిపించేది ఒక్క సీన్లోనే అయినా.. నవ్వించే ప్రయత్నం చేశారు. హీరో తల్లిగా రోహిణి రొటీన్ పాత్రే చేసింది. అయితే ఆమె ప్రాస్థెటిక్ మేకప్‌తో కనిపించడం కొత్తగా అనిపిస్తుంది. విలన్‌గా ఫారిన్ యాక్టర్ ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్ చక్కగా నటించాడు. మిలిగిన నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా బాగుంది. యువన్ శంకర్ రాజాగా నేపథ్య సంగీతం పర్వాలేదు. అమ్మ పాట ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరుని బాగుంది. 1940 కాలం నాటి బంగ్లాతో పాటు అప్పటి వాతావరణాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
అలాంటి సినిమాలు చేయడమంటే చాలా ఇష్టం: రాశీ ఖన్నా
హీరోయిన్ రాశి ఖన్నా సినిమాల ఎంపికపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తేనే కెరీర్ ఎదుగుదలకు ఊపయోగపడతుందని తెలిపింది. కేవలం కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా కంటెంట్ ఓరియంటెడ్ ప్రాజెక్టుల్లో నటించడంపై రాశీ ఖన్నా మాట్లాడింది.రాశీ ఖన్నా మాట్లాడుతూ.. 'నాకు కమర్షియల్ సినిమాలంటే చాలా ఇష్టం. కానీ అలాంటి చిత్రాలు చేయడానికి ఇంకా సమయం ఉంది. నేను నటిగా ఎదగాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నా. మంచి కంటెంట్‌తో నడిచే చిత్రాలే మన ఎదుగుదలకు కారణం. అలాంటి సినిమాలు ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నా. చాలా కాలంగా సౌత్‌లో సినిమాలు చేస్తున్నా. కానీ అలాంటి చిత్రాలే హిందీలో చేస్తే ఎలాంటి ఎగ్జైయిట్‌మెంట్ ఉండదు.' అని పంచుకున్నారు.కాగా.. రాశీ ఖన్నా దాదాపు ఒక దశాబ్దం పాటు అనేక తెలుగు, తమిళ స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. 2013లో హిందీ చిత్రం మద్రాస్ కేఫ్‌తో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సౌత్ సినిమాల్లోకి ప్రవేశించింది. ఎందుకంటే ఆమెకు హిందీలో కలిసి రాకపోవడంతో సౌత్‌వైపు అడుగులేసింది. అయితే 2022లో రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్ అనే సైకలాజికల్ క్రైమ్ సిరీస్‌తో హిందీ పరిశ్రమలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్‌తో కలిసి నటించింది. ప్రస్తుతం తెలుగులో తెలుసు కదా అనే చిత్రంలో కనిపించనుంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ సరసన నటిస్తోంది. ఇందులో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి కూడా హీరోయిన్గా చేయనుంది. కాగా.. రాశి ఖన్నా చివరిసారిగా ది సబర్మతి రిపోర్ట్‌లో కనిపించింది. -
ట్రెడిషనల్ లుక్‌లో కాకరేపుతున్న రాశి ఖన్నా (ఫొటోలు)
-
రాశీ ఖన్నా స్టన్నింగ్ ఫోటో షూట్.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి శారీ లుక్..!
రాశీ ఖన్నా స్టన్నింగ్ ఫోటో షూట్..దుబాయ్‌లో బేబీ జాన్ హీరోయిన్ చిల్..మెగా కోడలు లావణ్య త్రిపాఠి శారీ లుక్..పూనమ్ బజ్వా అలాంటి పోజులు..విదేశాల్లో నభా నటేశ్ హోయలు..జ్యోతి పూర్వాజ్ బ్యూటిఫుల్ లుక్.. View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya) View this post on Instagram A post shared by N I T H I I N (@actor_nithiin) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
‘ఎల్లే గ్రాడ్యుయేట్స్ అవార్డ్స్–2024’ లో మెరిసిన బాలీవుడ్ తారలు, సెలబ్రిటీలు
-
అనుకోకుండా సినిమాల్లోకి.. హీరోయిన్గా స్టార్డమ్.. యంగ్ హీరోతో బ్రేకప్! (ఫొటోలు)
-
బ్లూ కోట్లో మెరిసిన బొమ్మరిల్లు బ్యూటీ.. గ్రీన్ డ్రెస్‌లో గ్లామర్ బ్యూటీ ఆదితి!
వైట్ డ్రెస్‌లో మరింత గ్లామర్‌గా రాశీ ఖన్నా..క్రిస్మస్ మూడ్‌లో బాలీవుడ్ భామ అమీ జాక్సన్..బ్లూ కోట్లో మెరిసిన బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియా..బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ గ్లామర్ ట్రీట్..గ్రీన్ డ్రెస్‌లో గ్లామర్ బ్యూటీ ఆదితిరావు హైదరీ.. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Amy Jackson Westwick (@iamamyjackson) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
బొమ్మరిల్లు హీరోయిన్ స్టన్నింగ్ లుక్స్.. చిల్ అవుతోన్న రాశీ ఖన్నా!
బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా దేశ్‌ముఖ్ స్టన్నింగ్ లుక్స్..బిస్కెట్స్ తింటూ చిల్ అవుతోన్న రాశీ ఖన్నా...భర్తతో కలిసి టూర్ ఎంజాయ్ చేస్తోన్న సోనాక్షి సిన్హా.. దో పట్టి సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఆదిపురుష్ భామ..బ్లాక్ బ్యూటీలా పుష్ప భామ రష్మిక మందన్నా View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Genelia Deshmukh - जेनेलिया रितेश देशमुख (@genelia.deshmukh) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
ఫ్రెండ్సిప్ డే రోజు సినీ తారలు పంచుకున్న ఫోటోలు
గ్రీన్ కలర్ చీరలో తలుక్కుమంటున్న మీనాక్షీ చౌదరిసింబా సినిమా ప్రమోషన్లో ట్రెండీగా మెరిసిన సీనియర్ నటి కస్తూరిగ్లామర్ ఫోటోలతో హీట్ పెంచుతున్న షాలిని పాండే View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Kasthuri Rasigan (@kasthurirasigan) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) View this post on Instagram A post shared by Shobhashetty (@shobhashettyofficial) -
కార్తీతో.. ముగ్గురు భామలు?
దక్షిణాది స్టార్స్‌లో నటుడు కార్తీ ఒకరు. ఇప్పటికి 25 చిత్రాలను పూర్తి చేసిన ఈయన ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. వాటిలో మెయ్యళగన్ చిత్రం, వా వాద్ధియార్ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయి. కాగా ప్రస్తుతం సర్ధార్– 2 చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఈయన ఇంతకు ముందు నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన సర్ధార్ చిత్రానికి సీక్వెల్. సర్ధార్ చిత్రం 2022లో విడుదలై సూపర్‌హిట్ అయ్యింది. కాగా కార్తీ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఆ చిత్రంలో నటి రాశీఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగానూ నటి లైలా ముఖ్య పాత్రలోనూ నటించారు.ఆ చిత్ర దర్శకుడు పీఎస్.మిత్రన్‌నే సర్ధార్– 2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సర్ధార్ చిత్రాన్ని నిర్మించిన ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ అధినేత ఎస్.లక్ష్మణన్‌నే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా పోతే ఇందులో సర్ధార్ చిత్రంలో నటించిన రాశీఖన్నా, గానీ, రజీషా విజయన్ గానీ,లైలా గానీ నటించడం లేదు. ఇందులో ముగ్గురు కథానాయికలు నటించనున్నట్లు సమాచారం. ఈ పాత్రల కోసం నటి ప్రియాంక మోహన్, మాళవిక మోహన్, ఆషికా రఘునాథ్‌ను నటింపజేయడానికి వారితో చర్చలు జరుపుతున్నట్లు తాజా సమాచారం. ఇకపోతే ఇందులో నటుడు ఎస్జే సూర్య ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని, జార్జ్ సీ.విలియమ్స్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. దీంతో సర్ధార్ చిత్రం కంటే మరింత భారీగా సర్ధార్– 2 రూపొందుతోందన్నమాట. కాగా నటుడు కార్తీ ఈ మూడు చిత్రాల్లోనూ ఒకదానికొకటి సంబంధం లేని వైవిధ్యభరిత కథా పాత్రల్లో కనిపిస్తుండడం గమనార్హం. -
HYD: జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్‌లో రాశీఖన్నా సందడి (ఫొటోలు)
-
ఆ డ్రెస్ నీదేనా.. రాశీ ఖన్నా ఫోటోలపై ట్రోలింగ్!
-
ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎక్కడో తెలుసా?
బహు భాషా నటిగా, హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రాశీఖన్నా. ఈ ఢిల్లీ భామ గ్లామరస్ పాత్రల్లో మెప్పించింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. టాలీవుడ్‌తో పాటు తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల బాలీవుడ్ యోధ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం సబర్మతి రిపోర్ట్, అరణ్మై-4 చిత్రాల్లో కనిపించనుంది. తెలుగులో చివరిసారిగా నాగ చైతన్య సరసన థ్యాంక్ యూ చిత్రంలో నటించింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఇంటిలో పూజలు నిర్వహిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే గతంలోనే హైదరాబాద్‌లో రెండు ఇళ్లు కొన్న రాశి.. ప్రస్తుతం మూడో ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాశి ఖన్నా నూతన గృహా ప్రవేశానికి సంబంధించిన పిక్స్ ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వేడుకలో సన్నిహితులు, స్నేహితులను మాత్రమే పాల్గొన్నారు. కాగా.. రాశి నటించిన'యోధ' మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. Raashii Khanna has recently purchased a new house in Hyderabad 🤩 House warming #RaashiiKhanna pic.twitter.com/e5BLW8OmrP — Raashi khanna Lovers (@Raashi_lovers) April 5, 2024 -
నటి రాశీఖన్నా సింపుల్ లుక్స్
-
సమంత వయస్సు 23.. హనీరోజ్ ఫోటోలు వైరల్
► సమంత వర్కౌట్స్ ఫోటోలు వైరల్.. బీఎంఆర్ (బేసల్ మెటబాలిక్ రేట్) ప్రకారం సమంత వయసు 23, బరువు 50 కేజీలుగా ఉంది. ► తన కజిన్ పెళ్లి సంబరాల్లో రాశిఖన్నా ► మిలానోలో రష్మిక మందన్నా సందడి ► బ్లాక్ డ్రెస్సులో మృణాల్ ఠాకూర్ View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Pranati Rai Prakash (@pranati_rai_prakash) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by ravuri sravana bhargavi (@ravurisravana.bhargavi) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
హల్దీ వేడుకల్లో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్లి కొడుకుతో అలా!
రాశి ఖన్నా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మనం సినిమాలో చిన్న పాత్రతో అడుగుపెట్టిన దిల్లీ భామ.. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన సూపర్ హిట్ సినిమాల్లో చేసింది. జోరు, సుప్రీమ్, బెంగాల్ టైగర్, హైపర్, రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, శ్రీనివాస కల్యాణం, ప్రతి రోజు పండగే లాంటి హిట్ చిత్రాల్లో కనిపిచింది. ప్రస్తుతం టాలీవుడ్ తెలుసు కదా అనే సినిమాలో నటించనుంది. అంతే కాకుండా బాలీవుడ్లో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటించిన యోధ విడుదలకు సిద్ధమవుతోంది. షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చిన ముద్దుగుమ్మ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. తన కజిన్ పెళ్లి వేడుకలో పాల్గొని ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకుంది. తాజాగా హల్దీ వేడుకలో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రెండు రోజుల క్రితమే కజిన్ పెళ్లికి సంబంధించిన విషయాన్ని వెల్లడించింది. గత రెండు రోజులు ఎంతో ఆనందంగా గడిచాయని తెలిపింది. చాలా ఏళ్ల తర్వాత తెలిసిన వారిని చూడటం, వాళ్లతో జీవించిన క్షణాలను గుర్తు చేసుకోవడం అద్భుతంగా అనిపించిందని పేర్కొంది. నేను బాగా ఇష్టపడే చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నట్లు అనిపించిందంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తన కుటుంబసభ్యులతో దిగిన ఫోటోలు కూడా షేర్ చేసింది. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
ఇకపై అన్నీ ఆనంద క్షణాలే..: రాశీ ఖన్నా
తమిళ సినిమా: మంచి ఫిజిక్. అంతకు మించిన యాక్టివ్. యువతను గిలిగింతలు పెట్టగల యాక్టింగ్ ఇవన్నీ నటి రాశి ఖన్నాలోని లక్షణాలు. అంతేకాకుండా తనదైన అందాలతో కనువిందు చేస్తుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ పాపులర్ అయిన రాశీ ఖన్నాకు కథానాయకిగా ఇంకా తాను ఆశించిన స్థాయి రాలేదనే చెప్పాలి. అలాంటి స్థాయికి చేరుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. ఇటీవల నటిగా కాస్త వెనుకపడిందనే చెప్పాలి. తమిళంలో ఈమె నటించిన చివరి చిత్రం సర్దార్. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం హిందీలో యోధా అనే ఒక చిత్రం, తమిళంలో అరణ్మణై 4, మేథావి చిత్రాల్లో నటిస్తోంది. కాగా తరచూ తన గ్రామ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ నెటిజన్లను కవ్విస్తున్న రాశీఖన్నా ఇకపై రానున్నవన్నీ ఆనంద క్షణాలే అని పేర్కొంది. దీని గురించి ఆమె ఒక భేటీలో పేర్కొంటూ తాను ఇప్పుడు పండగల ఖుషిలో ఉన్నట్లు పేర్కొంది. నవరాత్రి వేడుకలు మొదలయ్యాయని.. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తానని చెప్పింది. నవరాత్రి వేడుకలు పూర్తికాగానే దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటానని, తనకు దీపావళి చాలా పెద్ద పండుగ అని పేర్కొంది. ఆ సమయంలో పటాసులు కాల్చడం చాలా సరదా చెప్పింది. అదేవిధంగా నూతన దుస్తులు ధరించి తీపి పదార్థాలను తింటానని తెలిపింది. ఆ తర్వాత నవంబర్ 30వ తేదీ తన పుట్టినరోజు అని ఆ వేడుకను ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటానని చెప్పింది. ఆ తర్వాత క్రిస్మస్, ఆంగ్ల ఉగాది పర్వదినాలు వస్తాయని అలా ఈ మూడు నెలలు తనకు ఆనంద క్షణాలే అని నటి రాశి ఖన్నా సంతోషం వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
బెస్ట్ టీమ్‌తో కొత్త చిత్రాన్ని ప్రకటించిన 'సిద్ధు జొన్నలగడ్డ'
'గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీలా' సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ ‘డి.జె టిల్లు’ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దీంతో డీజే టిల్లు సీక్వెల్ 'టిల్లు స్క్వేర్'తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇలా ఉండగా తాజాగా ఆయన నుంచి మరొక కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాకు తెలుసు కదా అనే సరికొత్త టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. సిద్దు జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నాతో పాటు కెజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తుండగా.. యువరాజ్ కెమెరామెన్ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీమ్ చాలా బలంగా కనిపిస్తోంది. సినిమా టైటిల్ వీడియో చాలా రిచ్‌గా చిత్రీకరించారు. ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో తమన్ అందించిన మ్యూజిక్ మనసును తాకేలా కూల్‌గా ఉంది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నిషియన్ శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించనుండటం విశేషం. (ఇదీ చదవండి: శ్రీలీల ఎవరి అమ్మాయో తెలిస్తే అంటూ షాకిచ్చిన అనిల్ రావిపూడి) టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ ఫ్యామిలీ నుంచి బాద్షా చిత్రంతో కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఇండస్ట్రీకి పరిచమైన నీరజ కోన ఈ చిత్రానికి మొదటిసారి దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నారు. టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా గుర్తింపు పొందిన నీరజ దర్శకురాలిగా తొలిసారి మెగాఫోన్ పట్టారు. తెలుసు కదా సినిమా టీమ్ చూస్తే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని చెప్పవచ్చు. -
Rashi Khanna Latest HD Images: ఓరుగల్లులో సినీనటి రాశీఖన్నా సందడి (ఫోటోలు)
-
దేశభక్తి మోడ్ ఆన్.. జెండాలతో స్టార్ హీరోయిన్స్
జెండా పట్టుకుని స్మైల్ ఇస్తున్న శ్రీలీల దేశభక్తి మోడ్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ పూజాహెగ్డే స్పెషల్ విషెస్.. జెండా పట్టుకుని జెండా పండగరోజు హ్యాపీగా రాశీఖన్నా ప్రగ్యా జైస్వాల్.. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఫ్యామిలీ కలిసి సెలబ్రేట్ చేసుకున్న బన్నీ View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) Happy Independence Day pic.twitter.com/hgOk4SOTgf — Allu Arjun (@alluarjun) August 15, 2023 View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సెలబ్రిటీలు షేర్ చేసిన ఫోటోలు
► 100 జాతీయ జెండాలను పంచిన హీరోయిన నమిత ► జాతీయ జెండాతో రాశీ ఖన్నా ► స్వాతంత్య్ర దినోత్సవం రోజున బేబి సినిమా నుంచి మరో న్యూస్ ► వైట్ డ్రెస్‌లో జాతీయ జెండాతో హీరోయిన్ శ్రీలీల ► సైంధవ్ టీజర్‌ను పోస్ట్ చేసిన వెంకటశ్ View this post on Instagram A post shared by Namitha Vankawala (@namita.official) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Anand Deverakonda (@ananddeverakonda) View this post on Instagram A post shared by Shilpa Reddy (@shilpareddy.official) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Venkatesh Daggubati (@venkateshdaggubati) View this post on Instagram A post shared by Sunny Deol (@iamsunnydeol) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
స్విమ్ సూట్లో మాళవిక.. మిర్చిలా హాట్‌గా శ్రియ!
స్విమ్ సూట్లో హీరోయిన్ మాళవిక రెడ్ డ్రస్ లో మిర్చి కంటే హాట్‌గా శ్రియ సీతాకోక చిలుకలా మెరిసిపోతున్న కేతిక చీకటిలో లైటింగ్ ఇచ్చే పోజుల్లో కృతిశెట్టి పింక్ కలర్ బార్బీ డాల్ లా పూజాహెగ్డే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేశ్ డాగ్ తో కలిసి 'తీన్మార్' హీరోయిన్ ఫన్నీ స్టిల్స్ క్యారవ్యాన్‌లో క్యూట్‌గా బ్యూటీ రాశీఖన్నా View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
రాశీఖన్నా రచ్చ.. వేసవిలో హీటెక్కించే పోజులు!
-
ఎవరీ అండ లేకుండానే ఇండస్ట్రీలో ఎదిగా: హీరోయిన్
హీరోయిన్ రాశిఖన్నా పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్లో బిజీగా మారిపోయింది. తెలుగు, తమిళంలోనూ పలలు చిత్రాల్లో నటించింది. హిందీ సినిమాలతో బిజీగా ఉన్న రాశిఖన్నా మెడికల్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత అడంగామరు, అయోగ్య, సంఘ తమిళన్, తుగ్లక్ దర్భార్, తిరు చిట్రం ఫలం తదితర చిత్రాలలో నటించింది. (ఇది చదవండి: రైలు ప్రమాద ఘటనతో నా గుండె పగిలింది: అల్లు అర్జున్) ప్రస్తుతం సుందర్ సీ దర్శకత్వంలో రూపొందుతున్న అరణ్మణై –4 చిత్రంలో నటిస్తోంది. కాగా హిందీలోనూ నటిస్తూ బిజీగా ఉన్న రాశిఖన్నా తన అందాలను తెరపై విచ్చలవిడిగా ఆరబోయడానికి ఏ మాత్రం వెనుకాడదు. కాగా ఇటీవల ఈ అమ్మడు తన సినీ అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. తాను ఎలాంటి సినీ నేపథ్యం, ఎవరీ అండ లేకుండానే ఈ రంగంలోకి ప్రవేశించానని చెప్పింది. అయినప్పటికీ నటిగా మంచి పేరు సంపాదించుకున్నానని తెలిపింది. ఇప్పటి వరకు నిలబెట్టుకుంటున్నానని పేర్కొంది. విజయాలు వచ్చినప్పుడు తన అదృష్టాన్ని నమ్మలేకపోయానని అయితే ఒకక నటిగా ఊహించిన విధంగానే అభిమానులను పొందానని చెప్పింది. నాలోని ప్రతిభను మనం ఎప్పుడు తక్కువ చేసుకోరాదన్నది తన భావన అని తెలిపింది. సినిమారంగం నిరంతరం కానిదని పేర్కొంది. ఇక్కడ కథానాయకిగా భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించలేమని.. ఇప్పుడు అవకాశాలు రావచ్చు.. ఆ తర్వాత దారెటు తెలియకపోవచ్చు అని రాశిఖన్నా పేర్కొంది. (ఇది చదవండి: బెడ్రూమ్లో కెమెరా.. నన్ను టార్చర్ పెట్టాడు: మాజీ భర్తపై నటి ఆరోపణలు) -
రాశీఖన్నా కాలేజీ టాపర్ అన్న విషయం తెలుసా?
‘మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి’ అన్న మాటను తు.చ. తప్పకుండా పాటిస్తున్న హీరోయిన్స్‌లో రాశీ ఖన్నా ఒకరు. వెండితెరకే పరిమితం కాకుండా.. వెబ్‌తెర మీదా దూసుకుపోతున్న ఆమె గురించి కొన్ని వివరాలు.. రాశీ ఖన్నా సొంతూరు ఢిల్లీ. సెయింట్ మార్క్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్లో స్కూలింగ్, లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువులో మెరుగైన విద్యార్థి. కాలేజ్ టాపర్ కూడా. సింగర్ కావాలన్నది ఆమె కల. కొంతకాలం సంగీతంలోనూ శిక్షణ తీసుకుంది. అయితే, అనుకోకుండా ఓ షాపింగ్ మాల్లో ఫ్రీగా వచ్చే ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ కోసం దిగిన సెల్ఫీ.. ఆమెను సినిమాల్లోకి తీసుకొచ్చింది. తొలి చిత్రం ‘మద్రాస్ కేఫ్’. అందులో ఆమెది చిన్న పాత్రే అయినా, మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత తెలుగులో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ విజయంతో బిజీ అయిపోయింది. ‘సుప్రీమ్’, ‘జై లవకుశ’, ‘తొలిప్రేమ’, ‘వెంకీ మామ’, ‘పక్కా కమర్షియల్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి తెలుగు సినిమాలతో పాటు, ‘సర్దార్’, ‘మేధావి’, ‘సైతాన్ కీ బచ్చా’ వంటి పలు తమిళ సినిమాల్లోనూ నటించి, మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం రాశీ.. బాలీవుడ్‌తో పాటు వెబ్దునియా పట్లా దృష్టి సారించింది. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన హిందీలో ‘యోధ’ అనే చిత్రంలో నటిస్తోంది. డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లోని ‘రుద్ర’ సిరీస్‌తో వెబ్ వరల్డ్‌లోకి ఎంటర్ అయి.. అక్కడా ఖాళీ లేని కాల్షీట్స్తో బిజీగా మారింది. రాశీ నటించిన ‘ఫర్జీ’ అనే మరో వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్‌లో ఉంది ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో! -
ఆ ప్రాజెక్ట్ నుంచి నయన్ అవుట్.. ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్ !
నయనతార పాత్రలో నటి రాశీఖన్నా నటించనున్నారా? కోలీవుడ్‌లో జరుగుతున్న తాజా ప్రచారం ఇదే. నయనతార పెళ్లి, సరోగసీ ద్వారా తల్లి కావడం వంటి కారణాల కారణంగా నటనకు చిన్న గ్యాప్ ఇచ్చారు. అయినప్పుటికీ షారూఖ్‌ఖాన్ సరసన నటిస్తున్న జవాన్ చిత్ర షూటింగ్లో పాల్గొంటూనే ఉన్నారు. కాగా మళ్లీ నటిగా బిజీ అయ్యారు. ఇప్పుడు 9 చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. అందులో వైనాట్ శశికాంత్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఒకటి. హీరోయిన్ ఓరియెంటెండ్ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఇందులో నటుడు మాధవ్, సిద్ధార్ధ్ ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లు చిత్ర వర్గాలు ఇటీవలే ప్రకటించాయి. కాగా ఇప్పుడా చిత్రంలో అనివార్య కారణాల వల్ల నయనతార నటించడం లేదని, ఆమెకు బదులుగా రాశీఖన్నాను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. క్రికెట్ క్రీడ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ది టెస్ట్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. త్వరలోనే ఈ చిత్రం సెట్ పైకి వెళ్లనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా రాశీఖన్నా ఇటీవల నటుడు కార్తీ సరసన నటించిన సర్ధార్ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా హిందీ వెబ్‌సీరీస్ ఫర్జీ చిత్రంలోనూ నటించింది. తరచూ గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న రాశీ ఖన్నా ప్రస్తుతం తమిళంలో గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కథానాయకిగా నటిస్తున్నారు. ఇందులో జీవా కథానాయకుడిగా నటిస్తుండగా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా వైనాట్ శశికాంత్ దర్శకత్వంలో నటించే లక్కీచాన్స్ వరించిందన్నది నిజంగా ఈ బ్యూటీకి లక్కే. -
ఓటీటీలో దూసుకెళ్తున్న 'ఫర్జీ'.. ఆల్ టైమ్ రికార్డ్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, హీరోయిన్ రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'ఫర్జీ'. ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో సంచలన విజయం సాధించిన డైరెక్టర్స్ రాజ్-డీకేలు తెరకెక్కించారు. ఈ సిరీస్ ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై ఓటీటీలో దూసుకెళ్తోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఇండియన్ ఓటీటీలోనే ఆల్ టైమ్ వ్యూయర్షిప్ను సాధించింది. ఇప్పటివరకు 37 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు ఓర్‌మ్యాక్స్ మీడియా అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని నటుడు షాహిద్ కపూర్ కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అజయ్ దేవగణ్ నటించిన రుద్ర 35.2 మిలియన్ల వ్యూస్‌తో రెండోస్థానంలో నిలిచింది. Thanks for all the love!! 🫶🏼#Farzi #FarziOnPrime pic.twitter.com/zcjqkQyW6x — Raj & DK (@rajndk) March 25, 2023 -
Rashi Khanna Latest Photos: లెదర్ డ్రెస్‌లో రాశీఖన్నా సొగసులు (ఫోటోలు)
-
బ్లాక్ బాస్టర్ సినిమాలను వదులుకున్న హీరోయిన్లు వీళ్లే!
ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. మూవీ ఆఫర్స్ టాలెంట్ తోనే కాదు...అదృష్టం వల్ల కూడా వరిస్తాయి. అలా అదృష్టం కారణాంగా గోల్డెన్ ఛాన్స్ అందుకుని సూపర్ హిట్స్ అందుకున్న హీరోయన్స్ చాలా మందే ఉన్నారు. అలాగే కాల్షీట్స్ సర్ధుబాటు చేయలేక గోల్డెన్ ఆఫర్స్ మిస్ చేసుకున్న హీరోయిన్స్ లిస్ట్ కూడా పెద్దదే.. ఇండస్ట్రీ హిట్స్ సాధించిన సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ ముందుగా మరోకరిని పలకరించింది. ఆ భామలు నో చెప్పటంతో...ఈ హీరోయిన్స్ కి ఆఫర్ కాదు..ఏకంగా బంపరాఫర్ తగిలింది. 2018 లో విడుదలై బాక్సాపీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ సృష్టించిన సినిమా గీత గోవిందం..ఈ సినిమాలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో, హీరోయిన్స్ గా నటించారు. రూ.5 కోట్ల తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 130 కోట్లు వసూళ్లు చేసింది. ఇక గీత గోవిందం సక్సెస్ తో హీరోయిన్ గా రష్మిక ఇమేజ్ టోటల్ గా మారిపోయింది. ఈ ఒక సినిమాతో టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ దక్కించుకుంది. అసలు గీతగోవిందం సినిమాకి ముందుగా మూవీ మేకర్స్ రష్మిక మందన్న అనుకోలేదట. విజయ్ దేవర కొండకి జోడిగా రాశీ ఖన్నా అనుకున్నారు. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాకపోవటంతో రాశీ ఖన్నా గీత గోవిందం వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ ఆఫర్ రష్మిక మందన్న దగ్గరకి వెళ్లింది. రాశీఖన్నా గీత గోవిందం సినిమా ఒక్కటే కాదు...2019లో విడుదలైన సూపర్ హిట్ మూవీ ఎఫ్2 లో హీరోయిన్ ఛాన్స్ కూడా వదులుకుంది. ఎఫ్2 సినిమాలో తమన్నా రోల్ కి ముందుగా రాశీ ఖన్నా అనుకున్నారు. అయితే ఆ రోల్ రాశీ ఖన్నా చేయటానికి ఇంట్రెస్ట్ చూపించక మిస్ చేసుకుంది. ఇక లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన చిత్రం రంగస్థలం..ఈ సినిమాలో సమంత కంటే ముందు అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్గా తీసుకోవాలనుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. అనుపమ ఇంకా అమ్మ కూచి అని ఫీలైన సుకుమార్ సమంతను ఫైనల్ చేశాడు. అలా అనుపమ రంగస్థలం లో హీరోయిన్ ఛాన్స్ మిస్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ పల్లెటూరి అమ్మాయి అయినా కాస్త గ్లామర్ గా కనిపిస్తది. అలాగే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన జానపద చిత్రం బాహుబలి...ఈ సినిమాలో తమన్నా క్యారెక్టర్ కి ముందుగా సోనం కపూర్ అనుకున్నారట. సోనమ్ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటంతో ఆ ఛాన్స్ తమన్నా అందుకుంది. ఇలాగే హీరో నాని జెర్సీ, సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్ మేన్ సినిమాల్లో హీరోయిన్ ఆఫర్ శృతిహాసన్ డేట్స్ అడ్జెస్ట్ చేయలేక మిస్ చేసుకుంది. ఇక అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి పాత్ర కోసం శాలిని పాండే కంటే ముందు మలయాళనటి పార్వతీ నాయర్ అనుకున్నారు. ఆ పాత్ర కాస్త బోల్డ్ ఉండటంతో ఆ బ్యూటీ వెనకడుగు వేసింది. అలాగే కుమారి 21ఎఫ్ మూవీ లో హీరోయిన్ గా హెబ్బా పటేల్ కంటే ముందు చాందిని చౌదరి అనుకున్నారు. ఆ బోల్డ్ క్యారెక్టర్ చేయటం ఇష్టం లేక చాందిని ఆ మూవీ ఆఫర్ వదలుకుంది. . కానీ కుమారి 21 ఎఫ్ తో హెబ్బా పటేల్ కు మంచి గుర్తింపు లభించింది., ఇక డేట్స్ అడ్జెస్ట్ చేయలేక...క్యారెక్టర్స్ నచ్చక చాలా మంది హీరోయిన్స్ సూపర్ హిట్ మూవీస్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. -
రెడ్ కలర్ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న రాశీ ఖన్నా (ఫోటోలు)
-
పెళ్లి కోసమే సినిమాలకు దూరంగా రాశీ ఖన్నా!
దక్షిణాదిలో పదేళ్లుగా సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణిస్తున్నారు రాశీ ఖన్నా. అలాగే ‘రుద్ర’ సిరీస్‌తో వెబ్ వరల్డ్‌లోకి ఎంటర్ అయిన రాశీ తాజాగా ‘ఫర్జీ’ వెబ్ సిరీస్‌లో ఓ లీడ్ రోల్ చేశారు. రాజ్ అండ్ డీకేలు తెరకెక్కించిన ఈ సిరీస్‌లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, రెజీనా ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఈ నెల 10 నుంచి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లా ట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా చెప్పిన విశేషాలు. ‘ఫర్జీ’లో మీ పా త్రకు వచ్చిన అభినందనల గురించి... ఈ సిరీస్‌లో నేను చేసిన మేఘా వ్యాస్ పాత్రకు వ్యూయర్స్ నుంచి మంచి స్పందన లభిస్తున్నందుకు హ్యాపీ. సామ్ (సమంత), కీర్తీ సురేష్ బాగుందంటూ మెసేజ్‌లు పెట్టారు. వీరితోపా టు కొందరు దర్శక–నిర్మాతలు కూడా కంగ్రాట్స్ చెప్పారు. తెలుగు, తమిళ ఆడియన్స్ నుంచి కూడా పా జిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం మీ చేతిలో ఎక్కువ సినిమాలు లేవు. అయితే మీరు కొత్త సినిమాలు ఒప్పుకోనిది పెళ్లి చేసుకోవడం కోసమే అని కొందరు అనుకుంటున్నారు... సినిమాలకు నేను బ్రేక్ ఇవ్వలేదు. తెలుగులో మూడు, తమిళంలో మూడు కథలు విన్నాను. అవి చర్చల దశలో ఉన్నాయి. ‘ఫర్జీ’ రిలీజ్ తర్వాత ఓ నిర్ణయం తీసుకుందామని వెయిట్ చేశాను.. అంతే. త్వరలో నా కొత్త సినిమా ప్రకటనలు వస్తాయి. హిందీ చిత్రం ‘మద్రాస్ కేఫ్’ (2013)తో కెరీర్ ప్రారంభించిన మీరు ఆ తర్వాత మరో హిందీ సినిమా చేయడానికి పదేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణం? తెలుగు ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమ చూపించారు. అందువల్ల నేను దక్షిణాది సినిమాలకే స్టక్ అయిపోయాను. నిజానికి కెరీర్లో ఏం చేయాలి అని నేను ప్లాన్ చేసుకోలేదు. ఓ ఫ్లో ప్రకారం వెళ్లిపోయాను. ఇప్పుడు ఏదో హిందీ సినిమా చేయాలని ‘యోధ’ ఒప్పుకోలేదు. కథ నచ్చడంతో ‘యస్’ చెప్పా. ఓటీటీ ప్రభావంతో భాషపరమైన హద్దులు కూడా లేవు. తెలుగు, హిందీ అని కాదు.. ప్రతిదీ ఇండియన్ సినిమానే. ప్రస్తుతం ‘యోధ’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇటీవల కొందరు హీరోయిన్లు అనారోగ్యం బారిన పడటానికి వృత్తిపరమైన ఒత్తిడి ఓ కారణం అనుకోవచ్చా? ఒకవేళ మీకు ఒత్తిడి ఉంటే దాన్ని ఎలా అధిగమిస్తారు? నిజం చెప్పాలంటే నా కెరీర్‌ను నేనెప్పుడూ ప్రెజర్‌గా ఫీల్ కాలేదు. సాధారణ పాత్ర చేసినప్పుడు మాత్రమే కాదు.. చాలెంజింగ్ రోల్ చేసినప్పుడూ కూల్‌గానే ఉంటాను. ఎందుకంటే యాక్టింగ్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇక హెల్త్ విషయానికొస్తే.. నేను ఆరోగ్యంగా, హ్యాపీగా ఉన్నాను. దీన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. మీకు డ్రీమ్ రోల్స్ ఏమైనా? తెలుగులో నేను లవ్‌స్టోరీ సినిమాలు చేశాను. కామెడీ రోల్స్ చేశాను. ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్ చేయాలని ఉంది. ‘బాహుబలి’లో అనుష్కగారు చేసిన యువరాణిలాంటి పాత్ర చేయాలని ఉంది. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసే ఏ పా త్రనైనా నేను డ్రీమ్ రోల్లానే భావిస్తాను. ఓ సక్సెస్ఫుల్ హీరోయిన్గా కొత్తగా సినిమాల్లోకి వచ్చే అమ్మాయిలకు మీరు ఇచ్చే సలహా? నా లైఫ్‌లో నేను టైమ్‌కి చాలా ప్రా ధాన్యం ఇస్తాను. ఇండస్ట్రీలో రాణించాలంటే కష్టపడే తత్త్వం, క్రమశిక్షణ చాలా ముఖ్యం. అలాగే ఏ ఇండస్ట్రీకి వెళ్లినా అక్కడి భాషను నేర్చుకోవాలి. -
విశాఖలో సందడి చేసిన హీరోయిన్ రాశీఖన్నా (ఫొటోలు)
-
కార్తీ నిరూపించుకున్నాడు: నాగార్జున
‘‘ఓ సూపర్‌స్టార్ అన్నగా(సూర్య) ఉన్నప్పుడు.. ఆ షాడో నుంచి బయటకు వచ్చి... సొంత ప్రతిభను నిరూపించుకోవడం అనేది చాలా తక్కువ. అటువంటి వారిని అరుదుగా నేను ఇద్దర్నే చూశాను. తెలుగులో చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్, కన్నడలో శివరాజ్‌కుమార్ సోదరుడు పునీత్ రాజ్‌కుమార్. ఇప్పుడు తమిళ్లో సూర్య బ్రదర్ కార్తీ. ఇలా నిరూపించుకోవడం కష్టమైన పని. విభిన్నమైన, ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ అన్నలా సూపర్‌స్టార్ అయ్యాడు కార్తీ’’ అని నాగార్జున అన్నారు. కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మించిన తమిళ చిత్రం ‘సర్దార్’. రాశీఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంలో లైలా ఓ కీ రోల్ చేశారు. ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘సర్దార్’ ప్రీ రిలీజ్‌కి ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఊపిరి’ సినిమా నుంచి కార్తీతో నా అనుబంధం ప్రారంభమైంది. తను తెలుగులో మాట్లాడతాడు.. పాటలు పాడతాడు. తెలుగులో మాట్లాడినవారిని మనం హృదయాల్లో పెట్టుకుంటాం.. అందుకే కార్తీని తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరిస్తారు. అన్నపూర్ణ స్టూడియోస్ ‘సర్దార్’ సినిమాను సమర్పిస్తున్నందుకు చాలా గర్వంగా, హ్యాపీగా ఉంది’’అన్నారు. కార్తీ మాట్లాడుతూ– ‘‘నాగార్జునగారు నాకు రియల్ బ్రదర్.. పెద్ద స్ఫూర్తి. సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి ఆయన్ని ఎఫెక్ట్ చేయలేవు. సినిమాలంటే ఆయనకు ఎంతో ప్యాషన్. మంచి మనవతావాదిగా ఉంటేనే మంచి యాక్టర్‌గా ఉండగలమని నాగార్జునగారు ఓ సందర్భంలో చెప్పారు. నేనూ ఎప్పట్నుంచో ఫాలో అవుతున్నాను. నాగార్జునగారు యాక్ట్ చేస్తున్నారనే నేను ‘ఊపిరి’ సినిమా చేశాను. నా కెరీర్లో ‘సర్దార్’ చాలా ముఖ్యమైన సినిమా. ‘సర్దార్’ ఇండియన్ స్పై థ్రిల్లర్’’ అన్నారు. ‘‘నేను నటించిన ‘శివపుత్రుడు’ దీపావళికి రిలీజై హిట్ సాధించింది. ‘సర్దార్’ కూడా దీపావళికి విడుదలవుతోంది. నా బర్త్ డే కూడా ఈ దీపావళి రోజునే (అక్టోబరు 24). చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ప్రతి ఒక్కరూ ‘సర్దార్’ సినిమాను ఎంజాయ్ చేస్తారు’’అన్నారు. గేయ రచయిత రాకేందు మౌళి. అన్నపూర్ణ స్టూడియోస్ సాయిబాబా, కాస్ట్యూమ్ డిజైనర్ ప్రవీణ్ రాజా పాల్గొన్నారు. -
పొలిటికల్ డ్రామా షురూ
వెండితెరపై పొలిటికల్ టర్న్ తీసుకున్నారు శర్వానంద్. కృష్ణ చైతన్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తుండగా, ప్రియమణి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా పూజా కార్యక్రమంలో దర్శకులు చందూ మొండేటి, హను రాఘవపూడి, సుధీర్ వర్మ, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్‌లు స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందించారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇవ్వగా, కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబరులో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
అప్పుడే ఓటీటీకి ‘థ్యాంక్యూ’?, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే!
అక్కినేని హీరో నాగచైతన్య ‘లెటేస్ట్’ మూవీ థ్యాంక్యూ. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 22న ప్రేక్షకుల ముందుకు. లవ్ అండ్ ఎమోషనల్ జానర్లో రూపొందిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించగా.. అవికా గోర్లో ముఖ్య పాత్ర పోషించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం థియేటర్లో నడుస్తున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. చదవండి: ‘కార్తీకేయ 2’ ప్రమోషన్స్‌కి అనుపమ డుమ్మా.. నిఖిల్ కామెంట్స్ వైరల్ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోందట. ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను డిజిటల్ దిగ్గజం అమెజాన్ ప్రైం సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే సన్ నెక్ట్ కూడా మంచి రేటుకే స్ట్రీమింగ్ రైట్స్ పొందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్ట్ రెండో వారం లేదా మూడో వారంలో ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి రానుందని వినికిడి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ‘థ్యాంక్యూ’ ఓటీటీ రిలీజ్‌పై మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట. కాగా దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. -
నాగచైతన్య, రాశీ ఖన్నా స్పెషల్ ఇంటర్వ్యూ
-
జీవితంలో వారు మనకు స్పెషల్: నాగ చైతన్య
Naga Chaitanya About Thank You Movie: అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చై విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగానే ఇటీవల ఈ మూవీ ట్రైలర్ లాంచ్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో నాగ చైతన్య పలు ఆసక్తిర విషయాలు పంచుకున్నాడు. ''థ్యాంక్యూ కథ అభిరామ్ అనే వ్యక్తి ప్రయాణం. ఈ పాత్రలో శారీరకంగా, మానసికంగా పలు భిన్నమైన షేడ్స్ ఉన్నాయి. యాక్షన్ సీన్స్ ఆడియెన్స్‌ను ఎలా కట్టిపడేస్తాయో ఈ అభిరామ్ ప్రయాణం అలానే కట్టిపడేస్తుంది. ఇలాంటి మంచి పాత్రలు ఏ యాక్టర్‌కైనా చాలా అరుదుగా వస్తాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ విక్రమ్, నిర్మాత దిల్ రాజుకు కృతజ్ఞతలు. ఈ స్క్రిప్ట్ వినగానే 'జీవితంలో ఫలానా వారు మనకు స్పెషల్. వారికి ఫోన్ చేసి థ్యాంక్యూ చెప్పాలి' అనే ఫీలింగ్ మా అందరికీ కలిగింది. సినిమా చూసిన ప్రేక్షకులకు కూడా అదే అనుభూతి కలుగుతుందనే నమ్మకం ఉంది. రాశీఖన్నా రోల్‌తో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఆమె లేకపోతే ఈ చిత్రమే లేదు'' అని నాగ చైతన్య తెలిపాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా.. ఒక్క ఎపిసోడ్‌కు రూ. 5 కోట్లు.. హీరోయిన్ పారితోషికంపై చర్చ ! ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్ -
అలా మరిచిపోతే విలువ ఉండదు: నాగ చైతన్య
అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చై విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు. ఇదివరకు ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. మనం ఎక్కడ మొదలయ్యామో మరిచిపోతే.. మనం చేరిన గమ్యానికి విలువ ఉండదని నా ఫ్రెండ్ చెప్పాడు అంటూ నాగ చైతన్య చెప్పిన డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ను 'ఇట్స్ ఏ లాంగ్ జర్నీ మై ఫ్రెండ్' అంటూ నాగ చైతన్య చెప్పే డైలాగ్స్‌తో ముగించారు. లవ్ ఫీల్‌తో ఎమోషనల్‌గా ఆకట్టుకునేలా ఉంది ట్రైలర్. క్లాస్, మాస్ గెటప్‌లో నాగ చైతన్య కనిపించి ఆకట్టుకునేలా ఉన్నాడు. డైలాగ్స్, తమన్ సంగీతం బాగుంది. లవ్, కెరీర్ వంటి తదితర అంశాలను సినిమాలో ప్రస్తావించనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. 'మనం' తర్వాత విక్రమ్ కె. కుమార్, నాగ చైతన్య కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం వల్ల 'థ్యాంక్యూ'పై అంచనాలు నెలకొన్నాయి. చదవండి: ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్ 'ఆర్ఆర్ఆర్'పై పోర్న్ స్టార్ ట్వీట్.. నెట్టింట జోరుగా చర్చ -
'పక్కా కమర్షియల్'గా హిట్టు.. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ మార్కు !
Gopichand Pakka Commercial 1St Week Collections: మ్యాచో హీరో గోపీచంద్, విలక్షణ దర్శకుడు మారుతి కాంబినేషన్లో వచ్చిన 'పక్కా కమర్షియల్' సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు కలెక్షన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇందులో గోపీచంద్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. రాశీ ఖన్నా క్యారెక్టర్ అద్భుతంగా డిజైన్ చేసాడు మారుతి. ఈ సినిమా కోసం పబ్లిసిటీతో కలుపుకొని దాదాపు రూ. 35 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు నిర్మాతలు. అందులో 32 కోట్లు కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ (డిజిటల్, శాటిలైట్, హిందీ రీమేక్, డబ్బింగ్ అన్ని) రూపంలోనే వచ్చాయి. ఇక సినిమాను చాలా చోట్ల ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అందుకే ఇంత త్వరగా బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకుంది 'పక్కా కమర్షియల్' సినిమా. ఇంత ప్లానింగ్ ఉంటుంది కాబట్టే మారుతి మోస్ట్ బ్యాంకబుల్ డైరెక్టర్ అయ్యాడు. మొదటి రోజు రూ. 6.3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. ఆ తర్వాత రెండు రోజులు బాగానే క్యాష్ చేసుకుంది. ఓవరాల్‌గా 'పక్కా కమర్షియల్' మూడు రోజుల్లోనే సేఫ్ అయిపోయింది. చదవండి: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం హీరో విశాల్‌కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత.. #PakkaCommercial collects over 𝟏𝟓.𝟐 𝐂𝐑 Worldwide in 3 Days! 🔥💥 This Week, catch the ACTION - FUN Family Entertainer at cinemas near you! 🤩 🎟️: https://t.co/BcOUguIiyK @YoursGopichand @DirectorMaruthi @RaashiiKhanna_ #BunnyVas @SKNonline @UV_Creations @adityamusic pic.twitter.com/vQpCrMOUQd — GA2 Pictures (@GA2Official) July 4, 2022 -
శ్రీవారిని దర్శించుకున్న స్టార్ హీరోయిన్
స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆమె వీఐపీ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆమెను ఆశీర్వదించి ప్రసాదాలను అందజేశారు. చదవండి: నాకు అలాంటి సీన్స్‌లో నటించడమే ఈజీ: రాశీ ఖన్నా కాగా తాను తాజాగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్ సినిమా విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు రాశీ ఖన్నా పేర్కొన్నారు. మారుతి దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 1న విడుదల కాబోతుంది. -
నాకు అలాంటి సీన్స్‌లో నటించడమే ఈజీ: రాశీ ఖన్నా
తనకు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడమే ఈజీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా. తాజాగా ఆమె నటించిన చిత్రం పక్కా కమర్షియల్. మారుతి దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 1న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషనల్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న రాశీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా ఆమెకు ఎలాంటి సన్నివేశాల్లో చేయడం మీకు ఇష్టమని, తొలిసారి ఈ సినిమాలో కామెడీ చేశారు కదా ఎలా అనిపించిందని అడిగిన ప్రశ్నకు రాశీ నిర్మొహమాటం రొమాంటిక్ సీన్స్ అంటే ఇష్టమని చెప్పింది. చదవండి: సమంతకు మరో స్పెషల్ సాంగ్ ఆఫర్? ఈసారి తెలుగులో కాదు! ఈ మేరకు ఆమె ‘నాకు తెలిసి కామెడీ చేయడం చాలా కష్టం. కానీ రొమాన్స్ అలా కాదు. కామెడీతో పోలిస్తే హీరోలతో రొమాన్స్ సీన్స్ చేయడం సులభం. ఇప్పటి వరకు సినిమాల్లో నేను రొమాంటిక్ సన్నివేశాల్లోనే చేశాను. ఆ సీన్స్‌లో నటించి బోర్ కొట్టింది. ప్రస్తుతం కామెడీని ఎంజాయ్ చేస్తున్నా. పక్కా కమర్షియల్‌లో నా కామెడీ బాగుటుంది. బాగా నవ్వుకోవచ్చు’ అని చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమాలో రాశీ ఖన్నా తొలిసారి నల్లకోటు ధరించింది. ఇందులో ఆమె లేడీ లాయర్‌గా తన కామెడీతో అందరిని నవ్వించనుంది. చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న విలక్షణ నటుడు!, కారణం ఇదేనా? -
ఆ బాధ్యత డైరెక్టర్‌దే.. లేకపోతే నిర్మాతలు, ప్రేక్షకులు నష్టపోతారు
‘‘నిర్మాతను, థియేటర్ వ్యవస్థను కాపాడుకోకపోతే చాలా ప్రమాదం. ప్రస్తుతం డైరెక్టర్ ఎంత బాధ్యతగా ఉన్నాడంటే నిర్మాతను ఒప్పించాలి, థియేటర్‌ను కాపాడుకోవాలి, ఆడియన్స్‌ను సినిమాకు రప్పించాలి. ఒకవేళ ఓటీటీలో రిలీజ్ అయితే అక్కడి ఆడియన్స్ కూడా కళ్లను పక్కకు తిప్పుకోకుండా చూపించగలగాలి.. అప్పుడే ఒక డైరెక్టర్ సక్సెస్ అయినట్టు’’ అన్నారు డైరెక్టర్ మారుతి. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్– యూవీ క్రియేషన్స్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు మారుతి చెప్పిన విశేషాలు. ► ప్రతి ఒక్కరూ స్క్రిప్ట్ బాగా రాసుకోవాలి. అవసరమైతే రెండు నెలలు ఎక్కువ కష్టపడి అయినా స్క్రిప్ట్‌ను మన టేబుల్ మీదే ఎడిట్ చేసు కుంటే వృథా తగ్గిపోయి నిర్మాతకు చాలా డబ్బులు మిగులుతాయి. దీనికి తోడు మంచి మంచి సబ్జెక్టులు వస్తాయి. ఇండస్ట్రీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్‌తో పాటు షూటింగ్ రోజులు తగ్గించాలి.. మంచి కథలను సెలెక్ట్ చేసుకుని ఆడియన్స్‌కు నచ్చేలా తీయాలి. మనకు ఇష్టమొచ్చినట్లుగా తీస్తే చూడరు. ► ఒక వ్యక్తి డైరెక్టర్ కావాలంటే ప్రతిభ కంటే ముందు తను ఒక ప్రేక్షకుడు అయ్యుంటే బెస్ట్ సినిమా తీస్తాడు. నాకు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన అనుభవం ఉండటం వల్ల కమర్షియల్ యాంగిల్లో సినిమాలు చేస్తున్నాను. ఆడియన్స్‌కు ఏం కావాలో ఇచ్చి, వారి దగ్గర డబ్బులు తీసుకొని నిర్మాతలకు ఇవ్వా ల్సిన మీడియేషన్ బాధ్యత డైరెక్టర్‌దే.. ఈ మీడియేషన్ కరెక్ట్‌గా చేయకపోతే ఇటు నిర్మాతలు, అటు ప్రేక్షకులు నష్టపోతారు. ► ‘పక్కా కమర్షియల్’ మంచి కథతో అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులు సంతోషంగా కాలర్ ఎగరేసుకుని చూసే సినిమా ఇది. దివంగత రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన ఈ సినిమా టైటిల్ పాటకు మంచి స్పందన వచ్చింది. ► జీఏ2 పిక్చర్స్– యూవీ క్రియేషన్స్‌పై నా దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే’ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. దానికి కారణం మంచి కథ, నటీనటులు, సాంకేతిక నిపుణులు సెట్ అవ్వడం. మనకు చాలామంది మంచి ఆర్టిస్టులు ఉన్నా రు. వాళ్లకు తగిన క్యారెక్టర్స్ రాస్తే మిగతా భాషల నటీనటులను తెచ్చుకోవాల్సిన పని ఉండదు. ► సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రేక్షకులు పెద్ద సినిమాలకు ఎక్కువగా థియేటర్స్‌కు రావడం లేదు.. అందుకే మేము తక్కువ రేట్‌కే మా ‘పక్కా కమర్షియల్’ని చూపించనున్నాం. ఓటీటీలో చూసేయొచ్చు అనుకుంటారేమో.. ఇప్పుడప్పుడే ఓటీటీకి రాదు (నవ్వుతూ). -
ఆయన నాకెప్పటికీ హీరోలా కనిపిస్తారు
‘‘పక్కా కమర్షియల్’ ట్రైలర్ చూస్తుంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని, అందర్నీ అలరిస్తుందని అనుకుంటున్నాను. ఇది ఫుల్ మీల్స్‌లాంటి సినిమా.. ఎంజాయ్ చేయండి. మళ్లీ థియేటర్లు కళకళలాడాలి’’ అన్నారు చిరంజీవి. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెర కెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్– యూవీ క్రియేషన్స్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘గోపీచంద్ నాన్నగారు టి. కృష్ణ అద్భుతమైన దర్శకుడు. కళాశాలలో నా సీనియర్ అయిన ఆయన నాలోని భయాన్ని పోగొట్టి ప్రోత్సహించారు.. అందుకే నాకెప్పుడూ ఒక హీరోలాగా కనిపిస్తుంటారాయన. ఆయన లేకున్నా ఇండస్ట్రీపై తన ప్రేమను గోపీచంద్ ద్వారా కురుపిస్తున్నారాయన. గోపీచంద్ సినిమాల్లో నాకు ‘సాహసం’ బాగా నచ్చింది. ‘ఒక్కడున్నాడు, చాణక్య’ వంటి వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ కమర్షియల్ హీరోగా ఎదిగాడు. మారుతి సినిమాల్లో ‘ప్రేమకథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే’ సినిమాలు నాకు బాగా నచ్చాయి. అన్ని హంగులున్న ‘పక్కా కమర్షియల్’ సినిమా తన గత సినిమాలను మించి ఆడాలని కోరుకుంటున్నాను. మారుతి దర్శకత్వంలో నేను హీరోగా యూవీ క్రియేషన్స్‌లో వంశీ, విక్కీలతో సినిమా ఉంటుంది’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్ నాన్నగారు టి. కృష్ణ తీసిన ‘ప్రతిఘటన’ చూసి చిరంజీవిగారితో మా బ్యానర్లో ఓ సినిమా చేయమని అడిగాను.. దురదృష్టవశాత్తు ఆయన మనతో లేరు. ఆ తర్వాత ఇన్నేళ్లకు గోపీచంద్‌తో మా బ్యానర్లో ఓ మంచి సినిమా చేయడం హ్యాపీ. ప్రేక్షకులను నవ్వించే శక్తి ఈవీవీ సత్యనారాయణగారికి ఉండేది.. ఇప్పుడు మారుతికి ఉంది’’ అన్నారు. గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకొచ్చి మహావృక్షంలా నిలబడ్డారంటే ఆయన పట్టుదల వల్లే. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది ఇప్పటికీ ఇండస్ట్రీకి వస్తుండటం గ్రేట్. మారుతికి మంచి ప్రతిభ ఉంది. ‘పక్కా కమర్షియల్’ సినిమా తర్వాత తను మరింత మంచి స్థాయికి ఎదుగుతాడు’’ అన్నారు. ఈ వేడుకలో చిత్ర సహనిర్మాత ఎస్కేఎన్, యూవీ క్రియేషన్స్ వంశీ, విక్కీ, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
అలా చేస్తే చేటు తప్పదు
‘‘ఈ మధ్య నిర్మాతలు త్వరగానే సినిమాలను ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు. ఇలా చేస్తే చేటు తప్పదేమో. మా ‘పక్కా కమర్షియల్’ చిత్రం మాత్రం ఆలస్యంగానే ఓటీటీకి వస్తుంది’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. గోపీచంద్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘టి. కృష్ణ (హీరో గోపీచంద్ తండ్రి) గొప్ప దర్శకులు. ఆయనతో మా బ్యానర్లో ఓ సినిమా తీయాలనుకున్నాను. కుదర్లేదు. ఇప్పుడు వారి అబ్బాయి గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్’ సినిమా తీసినందుకు సంతోషంగా ఉంది. గోపీచంద్‌లో ఉన్న కామెడీని దర్శకుడు మారుతి బాగా బయటకు తీశారు. ఈ సినిమాను బాగా ఖర్చు పెట్టి తీశాం’’ అన్నారు. ‘‘రణం’, ‘లౌక్యం’ తర్వాత మళ్లీ అంత ఫన్ ఉన్న సినిమా చేశాను. ‘పక్కా కమర్షియల్’ కథలో హ్యూమర్‌కు మంచి స్కోప్ ఉంది. మారుతి రాసిన కథకు న్యాయం చేశాననే అనుకుంటున్నాను’’ అన్నారు గోపీచంద్. ‘‘నా నుంచి ప్రేక్షకులు ఆశించే కామెడీకి ఇతర అంశాలు జోడించి తీసిన చిత్రం ‘పక్కా కమర్షియల్’’ అన్నారు మారుతి. ‘‘ఎంటర్ టైన్మెంట్కు మంచి యాక్షన్ కుదిరిన చిత్రం ఇది’’ అన్నారు బన్నీ వాసు. ‘‘ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. ‘ప్రతిరోజూ పండగ’ చిత్రంలో నేను చేసిన ఏంజెల్ ఆర్నా పాత్రకు రెండు రెట్ల వినోదం ఈ సినిమాలో ఉంటుంది’’ అన్నారు రాశీ ఖన్నా. సహనిర్మాత ఎస్కేఎన్ పాల్గొన్నారు. -
లైఫ్‌లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు: నాగచైతన్య
‘అన్నీ వదులుకుని ఇక్కడిదాకా వచ్చాను.. ఇక లైఫ్‌లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు’, ‘నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే..’ అంటూ నాగచైతన్య చెప్పే డైలాగులతో ‘థ్యాంక్యూ’ చిత్రం టీజర్ విడుదలైంది. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘థ్యాంక్యూ’. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 8న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ని బుధవారం విడుదల చేశారు.‘నువ్వు సెల్ఫ్ సెంట్రిక్ అయ్యావు, నీ లైఫ్‌లో నీకు తప్ప మరో వ్యక్తికి చోటు లేదు’ అంటూ హీరోయిన్ చెప్పే మాటలు కూడా టీజర్లో వినిపిస్తాయి. ‘‘ఈ చిత్రంలో వ్యాపారవేత్త అభిరామ్ పాత్రలో నాగచైతన్య నటిస్తున్నారు. ఓ సక్సెస్ఫుల్ పర్సన్ జీవితంలోని ఫీల్ గుడ్ లవ్ స్టోరీని మా సినిమాలో చూపించబోతున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. బీవీఎస్ రవి కథను అందించిన ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: పీసీ శ్రీరామ్. -
తల్లికి ఖరీదైన కారు గిఫ్టిచ్చిన రాశీ ఖన్నా, ధర ఎంతో తెలుసా?
అమ్మ లేకపోతే గమనం లేదు.. అమ్మ లేకపోతే ఈ సృష్టిలో జీవం లేదు.. అసలు అమ్మ లేకపోతే ఈ సృష్టే లేదు అంటుంటారు. అలాంటి అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ఆమె చూపించే ప్రేమకు దాసోహమవడం తప్ప! ఈరోజు మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా తన తల్లికి లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చింది. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ ఆదివారం నాడు అమ్మ దగ్గరికి వెళ్లిన ఆమె బీఎమ్‌డబ్ల్యూ కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. దీని ధర దాదాపు రూ.1.40 కోట్లని తెలుస్తోంది. ఎప్పటికైనా ఓ లగ్జరీ కారు సొంతం చేసుకోవాలన్న తల్లి కలను రాశీ ఎట్టకేలకు నెరవేర్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా రాశీ ఖన్నా యోధ సినిమాతో త్వరలో బాలీవుడ్లో అడుగుపెట్టనుంది. సిద్దార్థ్ మల్హోత్రా, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించిన యోధ ఈ ఏడాది నవంబర్ 11న రిలీజ్ కానుంది. ఫర్జి అనే ప్రాజెక్ట్‌తో త్వరలోనే ఓటీటీలోనూ ఎంట్రీ ఇవ్వనుందీ బ్యూటీ. చదవండి: హీరోయిన్‌తో టాలీవుడ్ హీరో పెళ్లికి ముహూర్తం ఫిక్స్! నా కూతురితో కారులో ఉన్నాను.. అత్యాచారం చేస్తానని బెదిరించాడు -
'పక్కా కమర్షియల్'గా ఆ ఓటీటీకి డిజిటల్ రైట్స్..
Gopichand Pakka Commercial Movie Digital Rights Acquires Aha OTT: హీరో గోపీచంద్, బొద్దుగుమ్మ రాశీ ఖన్నా ముచ్చటగా మూడోసారి జంటగా నటిస్తున్న చిత్రం 'పక్కా కమర్షియల్'. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌లో నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇంతకుముందు ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్లు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీ జులై 1న ప్రేక్షకుల మందుకు వస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: సిరివెన్నెల చివరి అక్షరమాల.. డైరెక్టర్ మారుతి ఎమోషనల్ తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ విడుదలకు ముందే పోస్ట్ థియేట్రికల్ హక్కులను మంచి మొత్తానికి ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ సినిమా థియేటర్లలో విడుదల కొన్ని వారాల తర్వాత డిజిటల్ రైట్స్‌ను 'పక్కా కమర్షియల్'గా సొంతం చేసుకున్న ఆహా ప్లాట్ఫామ్లో ప్రసారం కానుంది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రానికి దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి చివరిసారిగా పాటలు రాశారు. ఈ సినిమాలో సత్యరాజ్, రావు రమేష్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చదవండి: జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. ఫిబ్రవరి 2 సిరివెన్నెల చివరి పాట -
ప్లీజ్ నా గురించి తప్పుడు ప్రచారం చేయకండి: రాశీ ఖన్నా
Rashi Khanna Clarity On Her Comments Over South Industry: ప్రస్తుతం రాశీ ఖన్నా దక్షిణాది ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. దీనికి కారణంగా ఇటీవల సౌత్ ఇండస్ట్రీపై ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలే. సౌత్ సినిమాలు రొటిన్‌గా ఉంటాయని, అక్కడ హీరోయిన్ల పాత్రలకు పెద్దగా గుర్తింపు ఉండదంటూ ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రాశీ ఖన్నాపై దక్షిణాది ప్రేక్షకులు తీవ్రంగా మండిపడుతున్నారు. నీ కెరీర్లో ఎన్నో సక్సెస్‌లు, స్టార్డమ్ ఇచ్చిన దక్షిణాది పరిశ్రమపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ నెటిజన్లు ఆమెకు క్లాస్ పీకుతున్నారు. చదవండి: యాక్షన్ ఫిల్మ్స్ చేద్దామని వచ్చా.. కానీ రొమాంటిక్ సినిమాలే..: వరుణ్ తేజ్ ఇక తనపై వస్తున్న వ్యతిరేకతను చూసి రశీ దిగొచ్చింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. దక్షిణాది పరిశ్రమపై తాను విమర్శ వ్యాఖ్యలు చేశానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. ‘నేను సౌత్ ఇండస్ట్రీని దూషించలేదు. ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. నాకు అన్ని భాషలు, అన్ని పరిశ్రమలు సమానమే. దక్షిణాది పరిశ్రమ అంటే నాకు చాలా గౌరవం. నేనంటే గిట్టని వాళ్లు ఎవరో నాపై అసత్య ప్రచారం చేయిస్తున్నారు. ప్లీజ్ ఇప్పటికైనా ఇది ఆపండి. దయ చేసి నాపై వస్తున్న ఈ వార్తలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరుతున్నా’ అంటూ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. చదవండి: ప్రభాస్ పెళ్లి చేసుకునేంత వరకు నేనూ పెళ్లి చేసుకోను: బిగ్‌బాస్ బ్యూటీ కాగా ఇటీవల హిందీలో ఆమె నటించిన రుద్ర వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా రాశీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ‘దక్షిణాది సినిమాలు రొటిన్‌గా ఉంటాయి. అది నాకు నచ్చకపోయిన చెయాల్సి వచ్చింది. అలా రొటిన్‌కు అలవాటు పడిపోయాను. అక్కడ హీరోయిన్‌కు గుర్తింపు కలిగిన పాత్రలు ఉండవు. రొమాంటిక్ సన్నివేశాల్లో అలా కనిపించి ఇలా కనుమరుగైపోతుంది. అంతేకాదు అక్కడ హీరోయిన్లకు మిల్కీ బ్యూటీ అంటూ ట్యాగ్లు కూడా ఇస్తారు. ఇది నాకు అసలు నచ్చని విషయం. ఇక ప్రస్తుతం బాలీవుడ్లో నాకు మంచి పాత్రలు వస్తున్నాయి. ఇకపై మీరు ఓ కొత్త రాశీని చూస్తారు’ అంటూ ఆమె వ్యాఖ్యానించినట్లు వార్తలు వినిపించాయి. 🙏🏻😊 pic.twitter.com/yQa1nOacEY — Raashii Khanna (@RaashiiKhanna_) April 6, 2022 -
హిందీలో వరుస అవకాశాలు, సౌత్ ఇండస్ట్రీపై రాశీ షాకింగ్ కామెంట్స్
Rashi Khanna Shocking Comments On South Industry: ‘మద్రాస్ కేఫ్’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ రాశీ ఖన్నా. తర్వాత ఊహలు గుసగుసలాడే మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అది హిట్ కావడంతో వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ ఇక్కడే సెటిలైపోయింది. సుమారు 9 ఏళ్ల తర్వాత రుద్ర వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులను పలకరించింది రాశి. ఇటీవల ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తన ఈ వెబ్ సిరీస్ రుద్ర సక్సెస్ నేపథ్యంలో రాశి ఓ జాతీయ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా కెరీర్ ప్రారంభంలో దక్షిణాది పరిశ్రమవాళ్లు గ్యాస్ ట్యాంకర్ అంటూ తనని వెంకిరించారని గుర్తు చేసుకుంది. చదవండి: ఇన్స్టాగ్రామ్ ఒక్కో పోస్ట్‌కి సమంత ఎంత తీసుకుంటుందో తెలుసా? అంతేగాక సౌత్ ఇండస్ట్రీపై ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా రాశీ మాట్లాడుతూ.. తనకు రోటీన్‌గా ఉండటం నచ్చదని, కానీ దక్షిణాదిలో అడుగు పట్టాక దానికి అలవాటు పడిపోయానంది. ‘రోటీన్‌కు అలవాటు పడిపోయాను. తెలుగులో పలు కమర్షియల్ సినిమాల్లో నటించినప్పటికీ రోటిన్ ఫార్యులాతోనే ఉండిపోయాను. ఇలా సౌత్ ఇండస్ట్రీ క్రియేట్ చేసిన రోటీన్ ఫార్ములాలన్నింటిని దాటుకుంటూ వచ్చాను. ఇకపై నా కథల ఎంపికలో మార్పు ను. ఇప్పటి నుంచి నేను చేసే ప్రతీ సినిమాలో ఓ కొత్త రాశి ఖన్నాను చూస్తారు’ అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: రాధేశ్యామ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ అలాగే దక్షిణాదిన హీరోయిన్లను వారి ప్రతిభతో కాకుండా లుక్స్ పరంగా గుర్తింపు ఇస్తారంది. అభిమానులు హీరోయిన్లకు రకారకాల ట్యాగ్ ఇస్తుంటారని, అది తనకు అసలు నచ్చదని చెప్పింది. అక్కడ హీరోయిన్లను మిల్కీ బ్యూటీ అని పిలుస్తుంటారు.. కానీ అంతకు మించిన టాలెంట్ హీరోయిన్స్‌లో ఉంటుందని సౌత్ ప్రేక్షకులు, అభిమానులు గుర్తించాలని ఆమె పేర్కొంది. కాగా రుద్ర వెబ్ సిరీస్‌తో 9 ఏళ్ల తర్వాత బాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చిన రాశీకి దీనితో పాటు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా, షాహిద్ కపూర్ వంటి స్టార్ హీరోలతో జతకట్టనుంది. ఇక తెలుగులో రాశీ నాగచైతన్య సరసన థ్యాంక్యూ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
గ్యాస్ టాంకర్ అనేవారు: బాడీ షేమింగ్‌పై స్పందించిన రాశీ ఖన్నా
మద్రాస్ కేఫ్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ రాశీ ఖన్నా. తర్వాత ఊహలు గుసగుసలాడే మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అది హిట్ కావడంతో వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ ఇక్కడే సెటిలైపోయింది. సుమారు 9 ఏళ్ల తర్వాత రుద్ర వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులను పలకరించిందీ ముద్దుగుమ్మ. అయితే కెరీర్ తొలినాళ్లలో బొద్దుగుమ్మగా ఉండే రాశీని దక్షిణాది చిత్రపరిశ్రమవాళ్లు వెక్కిరించేవారట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఎంటర్టైన్మెంట్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది హీరోయిన్. 'సౌత్‌లో హీరోయిన్గా అడుగులు వేస్తున్న సమయంలో నన్ను గ్యాస్ టాంకర్ అంటూ రకరకాల పదాలతో వెక్కిరించేవారు. నేను కొద్దిగా లావుగా ఉండేదాన్ని కాబట్టి నేనేమీ అనకపోయేదాన్ని. కథానాయికగా నేను సన్నగా ఉండాలని తెలుసుకున్నాక బరువు తగ్గాను. అంతేతప్ప ఎవరో అన్నారని నేను సన్నబడలేదు. సోషల్ మీడియాలో కూడా నామీద వ్యతిరేక కామెంట్లు చేసినా నేను పెద్దగా పట్టించుకోకపోయేదాన్ని కాదు. నాకు పీసీఓడీ సమస్య ఉందన్న విషయం తెలియకుండా ఏదేదో అనేవాళ్లు. మొదట్లో బాధగా అనిపించేది కానీ ఇప్పుడు లైట్ తీసుకుంటున్నానని' చెప్పుకొచ్చింది రాశీ ఖన్నా. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) చదవండి: ఆ హీరోయిన్లతో వన్స్‌మోర్ అంటున్న దర్శకులు! -
రాశీ ఖన్నా జోరు, యోధ షూటింగ్ హీరోయిన్ చేజింగ్
Rashi Khanna హీరోయిన్ రాశీఖన్నా ముంబైలో చేజింగ్ చేస్తున్నారు. అయితే ఈ చేజింగ్ ఎందుకు? అనేది తెలియాలంటే మాత్రం కాస్త సమయం పడుతుంది. సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీఖన్నా, దిశాపటానీ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న యాక్షన్ ఫిల్మ్ ‘యోధ’. సాగర్, పుష్కర్ ద్వయం తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీ ఖన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చదవండి: 'ఆర్ఆర్ఆర్' బ్యూటీ అలియాపై సమంత కామెంట్స్.. రాశి ఎవర్నో చేజ్ చేసే సన్నివేశాల షూటింగ్ జరుగుతోందట. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ మూవీ నవంబరులో విడుదల కానుంది. కాగా హిందీలో ‘రుద్ర’, సన్నీ(ప్రచారంలో ఉన్న టైటిల్) వెబ్ సిరీస్‌లను కూడా పూర్తి చేశారు రాశీఖన్నా. సౌత్‌లో ఆమె నటించిన ‘థ్యాంక్యూ’, ‘పక్కా కమర్షియల్’, సర్దార్’ చిత్రాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
లాయర్ అవతారం ఎత్తిన హీరోయిన్లు, ఎవరెవరంటే?
నల్ల కోటు ధరించారు.. ఒత్తయిన కురులను ముడిలా బిగించారు.. న్యాయం కోసం నడుం బిగించారు. యువరానర్ అంటూ వాదన వినిపించడానికి రెడీ అయ్యారు. అందాల తారలు ఇలా పవర్‌ఫుల్‌గా కనబడితే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. లాయర్లుగా కనిపించనున్న ఆ తారలు చేస్తున్న సినిమాల్లోకి ఓ లుక్కేద్దాం. ఎప్పటికప్పుడు క్యారెక్టర్స్ మధ్య వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటారు హీరోయిన్ కీర్తీ సురేష్. ‘మహానటి’ వంటి బయోపిక్ కావొచ్చు, ‘గుడ్‌లక్ సఖి’ వంటి స్పోర్ట్స్ డ్రామా కావొచ్చు, ప్రస్తుతం మహేశ్‌బాబు సరసన చేస్తున్న కమర్షియల్ ఫిల్మ్ ‘సర్కారువారి పాట’ చిత్రంలోని కళావతి పాత్ర కావొచ్చు... క్యారెక్టర్ ఏదైనా అందులో పూర్తిగా ఒదిగిపోతారు. తాజాగా కీర్తి లాయర్‌గా మారారు. కోర్టులో ప్రత్యర్థి లాయర్‌ను ఆమె ఎలా ముప్పుతిప్పలు పెడతారో ‘వాషి’ చిత్రంలో చూసి తెలుసుకోవాల్సిందే. కీర్తి లాయర్‌గా నటిస్తున్న మలయాళ చిత్రం ఇది. త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం కీర్తి లుక్‌ని విడుదల చేశారు. ఇక కీర్తీ సురేష్ అన్నయ్యకు ఓ లాయర్‌గా హెల్ప్ చేయాలనుకుంటున్నారు తమన్నా. కీర్తి అన్నయ్యకు తమన్నా సహాయం చేయడమేంటీ అనుకుంటున్నారా? కీర్తి ఆన్ స్క్రీన్ అన్నయ్య చిరంజీవి తరఫున లాయర్‌గా తమన్నా వాదించనున్నారట. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘బోళా శంకర్’ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. లాయర్ పాత్రలో తమన్నా నటించనున్నారని తెలిసింది. ‘బోళాశంకర్’ చిత్రం తమిళంలో అజిత్ చేసిన ‘వేదాళం’కు తెలుగు రీమేక్ అనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘వేదాళం’లో హీరోయిన్గా నటించిన శ్రుతీహాసన్ లాయర్ పాత్రలో కనిపించారు. సో.. ‘బోళా శంకర్’లో తమన్నా లాయర్‌గా కనిపిస్తారని ఊహించుకోవచ్చు. మరో బ్యూటీ రాశీ ఖన్నా కూడా లా సెక్షన్స్‌ను గుర్తుపెట్టుకునే పనిలో ఉన్నారు. ఎందుకంటే ‘పక్కా కమర్షియల్’ కోసం. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో రాశీ ఖన్నా లాయర్‌గా కనిపిస్తారని తెలిసింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 20న విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు 2009లో వచ్చిన ‘ఎవరైనా ఎపుడైనా’ చిత్రంతో టాలీవుడ్ గడప తొక్కారు హీరోయిన్ విమలా రామన్. ఆ తర్వాత ‘గాయం 2’, ‘రాజ్’, ‘చట్టం’ వంటి సినిమాల్లో నటించారు. కానీ తెలుగులో విమలా రామన్ కెరీర్ ఆశించినట్లుగా సాగలేదు. కానీ మలయాళంలో హిట్. తాజాగా ఆమె ఓ మలయాళం చిత్రంలో లాయర్‌గా నటిస్తున్నారు. తన లాయర్ లుక్‌ను విమలా షేర్ చేశారు. అటు హిందీకి వెళితే... అక్కడ కూడా ఓ లాయరమ్మ రెడీ అవుతున్నారు. తమిళ బంపర్ హిట్ మూవీ ‘విక్రమ్‌వేదా’ హిందీ రీమేక్‌లో రాధికా ఆప్టే లాయర్ పాత్ర చేయనున్నారని టాక్. తమిళంలో ఇన్స్పెక్టర్ విక్రమ్‌గా మాధవన్, గ్యాంగ్‌స్టర్ వేదగా విజయ్ సేతుపతి నటించగా, ప్రియ అనే లాయర్ పాత్రను పోషించారు శ్రద్ధా శ్రీనాథ్. తమిళంలో తీసిన పుష్కర్ గాయత్రి దర్శక ద్వయమే హిందీ రీమేక్‌ని తెరకెక్కిస్తున్నారు. రీమేక్‌లో విక్రమ్ పాత్రలో సైఫ్ అలీఖాన్, వేద పాత్రలో హృతిక్ రోషన్ కనిపిస్తారు. అలాగే ఈ చిత్రంలో సైఫ్ భార్య అంటే లాయర్‌గా హీరోయిన్ రాధికా ఆప్టే కనిపించనున్నారట. వీరితో పాటు మరికొందరు నాయికలు న్యాయం కోసం కోర్టులో వాదించేందుకు లాయర్లుగా రెడీ అవుతున్నారు. -
నేను చాలా రొమాంటిక్ పర్సన్.. డిన్నర్ డేట్స్ ఇష్టం: హీరోయిన్
ఇప్పుడంతా యూట్యూబ్ ట్రెండ్ నడుస్తుంది. కామన్ పీపుల్ దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు ఇప్పుడు చాలామంది యూట్యూబ్‌లోకి వచ్చేస్తున్నారు. ఇప్పటికే మంచు లక్ష్మీ, కీర్తి సురేష్ వంటి స్టార్స్ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ రాశీ ఖన్నా సైతం యూట్యూబ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రాశీ ఓవైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా తాను యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరిన్ని విషయాలు పంచుకుంటానని వివరించింది. ఈ సందర్భంగా రాశీ మాట్లాడుతూ.. తాను చాలా రొమాంటిక్ పర్సన్ అని, తనకు డిన్నర్ డేటింగ్స్, లవ్ లెటర్స్ అంటే చాలా ఇష్టమని పేర్కొంది. ఇక తన జీవితంలో వారానికి 20ఫ్లయిట్ జర్నీలు చేస్తానని, త్వరలోనే షూటింగ్లో బిహైండ్ ది సీన్స్‌ని కూడా చూపిస్తానంది. స్కిన్ కేర్, జిమ్ సహా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంటానని అందుకోసం తన ఛానెల్‌ను లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దని వివరించింది. -
పాతికేళ్ల తర్వాత వెంకీ.. 20 ఏళ్ల తర్వాత నాగార్జున!
బాలీవుడ్ తెరపై ఎన్నేళ్లయింది నాగ్ నిన్ను చూసి.. ఎన్నేళ్లయింది వెంకీ నిన్ను చూసి.. ఎన్నేళ్లయింది రాశీ నువ్వు కనబడి.. ఎన్నేళ్లయింది నిధీ నువ్వు కనబడి.. ఎన్నేళ్లకెన్నేళ్లకు అంటోంది బాలీవుడ్. మరి.. హిందీలో వెంకటేశ్ కనిపించి పాతికేళ్లయింది. నాగార్జున దాదాపు 20 ఏళ్లు. రాశీ ఖన్నా, నిధీ అగర్వాల్ చిన్న బ్రేక్ తర్వాత హిందీ సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్లో ఈ నలుగురూ చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం. కెరీర్లో దాదాపు 75 సినిమాలు చేశారు వెంకటేశ్. వాటిలో దాదాపు పాతిక రీమేక్సే ఉంటాయి. అసలు బాలీవుడ్లో వెంకటేశ్ వేసిన తొలి అడుగు కూడా రీమేక్‌తోనే పడింది. 1991లో వచ్చిన తమిళ చిత్రం ‘చిన్న తంబి’ (ఇదే సినిమాను తెలుగులో వెంకటేశ్ హీరోగా ‘చంటి’గా రీమేక్ చేశారు) హిందీ రీమేక్ ‘అనాడీ’తో వెంకటేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 1993లో ఈ చిత్రం బీ టౌన్లో మంచి హిట్ సాధించింది. వెంకీకి హిందీలోనూ పాపులారిటీ పెరిగింది. ఇక హిందీలో వెంకీ చేసిన రెండో సినిమా కూడా రీమేకే కావడం విశేషం. 1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో అలీ హీరోగా పరిచయమైన ‘యమలీల’ చిత్రం అప్పట్లో ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఈ సినిమా హిందీ రీమేక్ ‘తక్దీర్వాలా’లో వెంకటేశ్ హీరోగా చేశారు. ఆ తర్వాత బాలీవుడ్లో మరో మూవీ చేయడానికి వెంకీ ఆసక్తి చూపించలేదు. కానీ ఆ సమయం ఇప్పుడు వచ్చింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఓ హిందీ సినిమా చేసేందుకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సల్మాన్ ఖాన్, వెంకటేశ్ హీరోలుగా ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో ఓ యాక్షన్ కామెడీ ఫిల్మ్ రూపొందనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే తెలుగులో హిట్ సాధించిన ‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో వెంకటేశ్, అర్జున్ కపూర్ నటిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. మరోవైపు ‘శివ, ద్రోహి, క్రిమినల్, అగ్ని వర్ష్’... ఇలా హిందీలో దాదాపు పది సినిమాలు చేశారు నాగార్జున. 2003లో వచ్చిన హిందీ చిత్రం ‘ఎల్ఓసీ: కార్గిల్’లో ఓ లీడ్ రోల్ చేసిన నాగార్జున ఆ తర్వాత హిందీ సినిమా చేయలేదు. అయితే ఇప్పుడు ఏకంగా మూడు భాగాలుగా విడుదల కానున్న హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో నాగార్జున ఓ లీడ్ రోల్ చేశారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ ట్రయాలజీ ఫిల్మ్‌లో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరోహీరోయిన్లు కాగా, అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా ఇతర ప్రధాన తారాగణంగా కనిపిస్తారు.‘బ్రహ్మాస్త్ర’ తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ ఈ ఏడాది సెప్టెంబరు 9న విడుదల కానుంది. ఇక అందాల తార రాశీ ఖన్నా దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ బీ టౌన్ వైపు వెళ్లారు. 2013లో వచ్చిన హిందీ చిత్రం ‘మద్రాస్ కేఫ్’తో నటిగా రాశీ ఖన్నా కెరీర్ ఆరంభమైంది. కానీ ఈ సినిమా విడుదల తర్వాత రాశీకి హిందీలో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే తెలుగులో మాత్రం ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలో హీరోయిన్గా చాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత తెలుగులో ఒక్కసారిగా రాశీకి అవకాశాలు క్యూ కట్టాయి. దాంతో ఎనిమిది సంత్సరాల వరకు రాశీ డైరీ సౌత్ సినిమాలతో ఖాళీ లేకుండా పోయింది. అయితే తాజాగా తన డైరీలో ‘యోధ’ అనే హిందీ సినిమాకు రాశీ ఖన్నా చోటు కల్పించారు. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సాగర్ అమ్రే, పుష్కర్ ఓజా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో దిశా పటానీ మరో హీరోయిన్. యాక్షన్ మూవీ ‘యోధ’ ఈ ఏడాది నవంబరు 11న విడుదల కానుంది. అయితే రాశీ కేవలం హిందీలో సినిమా మాత్రమే కాదు.. వెబ్ సిరీస్‌లూ చేస్తున్నారు. అజయ్ దేవగన్ ‘రుద్ర’, షాహిద్ కపూర్ ‘సన్నీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) వెబ్ సిరీస్‌ను ఆమె ఆల్రెడీ పూర్తి చేసేశారు. ఈ ఏడాదే ఈ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. సేమ్ టు సేమ్ రాశీ ఖన్నాలానే నిధి ముందు హిందీ సినిమా ద్వారానే కథానాయిక అయ్యారు. ‘మున్నా మైఖేల్’ (2017) అనే సినిమాతో హిందీ తెరపై తొలిసారి కనిపించారు. తాజాగా హిందీలో ఓ పెద్ద సినిమా అంగీకరించి నట్లుగా నిధీ అగర్వాల్ తెలిపారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.ఈ నలుగురే కాదు.. మరికొందరు తారలు ‘బ్యాక్ టు బాలీవుడ్’ అంటూ హిందీ ప్రాజెక్ట్స్ అంగీకరించే పనిలో ఉన్నారు -
ఎనిమిదేళ్ల తర్వాత బాలీవుడ్లో కమ్‌బ్యాక్!
కొత్త సంవత్సరంలో కొత్త చిత్రం షూటింగ్‌లోకి అడుగుపెట్టారు రాశీఖన్నా. అది కూడా హిందీ సినిమా. ఇప్పటికే హిందీలో రెండు వెబ్ సిరీస్‌లు (అజయ్ దేవగన్, షాహిద్ కపూర్లతో..) పూర్తి చేసిన రాశీఖన్నా ఇటీవల హిందీ చిత్రం ‘యోధ’లో హీరోయిన్గా నటించే చాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. దర్శక ద్వయం సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారు రాశీఖన్నా. దిశా పటానీ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది నవంబరు 11న విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... రాశీఖన్నా కెరీర్‌ను స్టార్ట్ చేసింది 2013లో వచ్చిన హిందీ చిత్రం ‘మద్రాస్ కేఫ్’తోనే. ఆ తర్వాత హిందీలో ఆమె సినిమాలు చేయలేదు. సౌత్ సినిమాలతో బిజీ అయిపోయారు. ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ హిందీ సినిమా చేస్తున్నారామె. -
ఆ పదాలు ఇక జీవితంలో వినిపించొద్దు
2022 గురించి ఏం చెబుతారు? అని అందాల తారలను అడిగితే అందరూ కామన్‌గా చెప్పిన పాయింట్ ‘పాజిటివ్‌గా ఉందాం’ అని. ఇంకా ఎవరేమన్నారో చదివేద్దాం. వ్యక్తిగా, నటిగా ఈ ఏడాది ఇంకా బెటర్‌గా ఉండాలని నిర్ణయించుకున్నాను. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా 2021 సంతృప్తికరంగా అనిపించింది. అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. 2022లో ఆ సినిమాలను ప్రేక్షకులకు చూపించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ ఏడాది వీలైనంత ఉన్నతంగా జీవించాలని అనుకుంటున్నాను. మనకు దక్కినవాటికి కృతజ్ఞతాభావంతో ఉండాలనుకుందాం. అలాగే ప్రపంచం పట్ల మరింత పాజిటివ్‌గా, బాధ్యతగా ఉండటానికి ప్రయత్నిద్దాం. – రాశీ ఖన్నా కొత్త సంవత్సరానికి ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోను. కానీ 2022లో కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాను. 2022పై నాకు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ముందుగా ఈ నెల 14న ‘రాధేశ్యామ్’ విడుదల కానుంది. ఈ ఇయర్లో ప్రేక్షకులు కొత్త పూజను చూస్తారు. ‘పూజ 2.0’ అనుకోవచ్చు. నా నుంచి 2022లో సినిమాల పరంగానే కాక, కొన్ని కొత్త అనౌన్స్మెంట్స్ వస్తాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా నెగిటివిటీ కనిపిస్తోంది. అందుకే మైండ్‌ను పాజిటివ్‌గా ఉంచుకోవాలి. – పూజా హెగ్డే నేను హ్యాపీగా ఉంటూ, నా చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉండేలా చేయాలనుకుంటున్నాను. మనం సంతోషంగా ఉండటానికి సక్సెస్ కూడా కొంత కారణం. సో.. కష్టపడి మరింత సక్సెస్ కావాలనుకుంటున్నాను. తోటివారితో పోలికలు పెట్టుకోకూడదు. పోలికలు మన సంతోషాన్ని మనకు దూరం చేస్తాయి. 2021లో నేను డిఫరెంట్ సినిమాలు చేశాను. నటిగా 2022లోనూ మరింత కొత్తగా ఎంటర్టైన్ చేయడానికి కష్టపడతాను. – లావణ్యా త్రిపాఠి 2020తో పోల్చితే 2021 నాకు బాగానే గడిచింది. నేను హీరోయిన్గా చేసిన రెండు సినిమాలు 2021లో విడుదలయ్యాయి. 2022లో ఇంకా ఉత్సాహంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గతం, భవిష్యత్‌ల గురించి అతిగా ఆలోచించడం కన్నా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం ముఖ్యం. మనకున్న వాటితోనే మనం సంతోషంగా, పాజిటివ్‌గా ఉండాలన్నది నా అభిప్రాయం. – నభా నటేశ్ జీవితంలో ఓ ఫ్లోతో పాజిటివ్‌గా వెళ్లిపోవడమే నా న్యూ ఇయర్ రిజల్యూషన్. 2021లో నేను నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇంకా విడుదల కావాల్సిన చిత్రాలు ఉన్నాయి. 2022లో విడుదలయ్యే ఆ చిత్రాల్లో నా పెర్ఫార్మెన్స్ను ప్రేక్షకులు అభినందిస్తారనే నమ్ముతున్నాను. 2022లో కరోనా, డెల్టా, ఒమిక్రాన్ వంటి పదాలు మన జీవితాల్లో ఇకపై వినిపించకూడదనే కోరుకుంటున్నాను. కరోనాతో ఇబ్బంది పడ్డ అందరి జీవితాలు మళ్లీ గాడిలో పడాలని ఆశిస్తున్నాను. – నిధి అగర్వాల్ సమయాన్ని అస్సలు వృథా చేయకూడదని నిర్ణయించుకున్నాను. 2021 నాకు ఉగాది పచ్చడిలా సాగింది. 2021లో మా తాతగారు మాకు దూరమయ్యారు. అందుకే 2021 నాకు అంతగా ఇష్టం లేదు. కానీ నేను హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘అద్భుతం’, మలి చిత్రం ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’లు విడుదలయ్యాయి. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. జీవితం అనేది ఊహించలేనిది. మనం ఎన్ని అనుకున్నా జరగాల్సిందే జరుగుతుంది. అందుకే 2022పై నేనంతగా అంచనాలు పెట్టుకోవడం లేదు. పాజిటివ్‌గా ఆలోచిస్తూ నా పనిలో నేను వంద శాతం కష్టపడతాను. – శివానీ రాజశేఖర్ కోవిడ్ కారణంగా 2019 నుంచి మనం చాలా బాధలు, ఇబ్బందులు పడుతున్నాం. అందుకే మానసికంగా, ఆర్థికంగా ఇలా ప్రతి విషయంలోనూ 2022లో అందరూ ఓ స్థిరత్వాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. 2022లో మంచి సినిమాలు చేసి, ఇంకా బాగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాలన్నది నా ఆశయం. కులం, మతం, ధనిక, పేద అనే తేడాలు లేవని కోవిడ్ మనకు మరోసారి గుర్తు చేసింది. సో.. ఒకరికొకరం సహాయం చేసుకుంటూ అందరం హ్యాపీగా ఉందాం. – శివాత్మిక రాజశేఖర్ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది నా నూతన సంవత్సరం నిర్ణయం. వృత్తి, వ్యక్తిగత జీవితం.. రెండూ ముఖ్యం కాబట్టి రెంటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలనుకుంటున్నాను. కళ్ల ముందు కరోనా సవాల్ ఉన్నప్పటికీ 2021లో చిత్రపరిశ్రమ నిలదొక్కుకుంది. అందులో నేనూ భాగమైనందుకు హ్యాపీగా ఉంది. ఈ 2022లో మనందరం పాజిటివిటీతో ముందుకు సాగుదాం. – నేహా శెట్టి వృత్తిని, ఆరోగ్యాన్ని బ్యాలెన్డ్స్‌గా చూసుకోవాలనుకోవడమే నా 2022 రిజల్యూషన్. ఏ విషయంలో అయినా అతి అనేది అనర్థమే. జీవితంలో ఏదైనా సమతూకంగా ఉండాలి. అందుకే జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నాను. కోవిడ్ పరిస్థితులు, అనారోగ్యానికి గురి కావడం, వర్క్ పరంగా కొన్ని బ్యాక్లాక్స్ ఉండిపోవడం.. ఇలా 2021 నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. అయితే జీవితంలో ఏ విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి, నిజమైన స్నేహితులు ఎవరు, మనతో నిజాయితీగా ఉండేవారు ఎవరు అని తెలిసొచ్చింది. – మీనాక్షీ చౌదరి -
Raashi Khanna బర్త్‌డే స్పెషల్: దూకుడు మామూలుగా లేదుగా!
సాక్షి, హైదరాబాద్: ఊహలు గుసగుసలాడే అంటూ కుర్రకారు గుండెల్లో సందడి చేసిన అందాల తార రాశీ ఖన్నా. జిల్ మంటూ తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుని స్టార్ హీరోయిన్లకు తానేమీ తక్కువ కాదంటూ దూసుకు పోతోంది. ఈ మధ్య కాలంలో ఫిట్నెస్ పై దృష్టిపెట్టడమే కాదు స్లిమ్ అండ్ క్యూట్ లుక్స్‌తో ‘వావ్’ అనిపిస్తోంది. ఈ రోజు రాశీ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్‌డే అంటోంది సాక్షి. -
రాశీ ఖన్నా లేటెస్ట్ స్టిల్స్
-
హ్యాపీ మూడ్‌లో చై, ఆకట్టుకుంటున్న లుక్
హీరో నాగచైతన్య-రాశి ఖన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమా తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ రూపొందింది. దిల్ రాజు - శిరీష్‌లు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో మాళవిక నాయర్, అవికా గోర్లు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. దాదాపు షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి చై లుక్ విడుదల చేశారు మేకర్స్. నవంబర్ 23 నాగ చైతన్య బర్త్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే చై తిరునాళ్లలో కొయ్య గుర్రంపై ఎక్కి కేరింతలు కొడుతూ చాలా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. విక్రమ్ కుమార్ తయారు చేసుకున్న ఈ కథ .. విదేశాల్లోను షూటింగును జరుపుకుంది. అయితే ఇంతవరకూ ఆయన తన సినిమా నుంచి పెద్దగా అప్ డేట్స్ ఇచ్చింది లేదు. చాలా సైలెంట్ గా ఆయన తనపని చేసుకుంటూ వెళుతున్నారు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు? ఎప్పటి నుంచి ప్రమోషన్స్ మొదలుపెడతారు? అనే విషయాలు అధికారికంగా వెలువడవలసి ఉంది. కాగా ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. Here’s a glimpse wishing @chay_akkineni, a Very Happy Birthday!https://t.co/LgLgMN4fI8#HBDYuvasamratNagaChaitanya#ThankYouMovie@chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi #MalavikaNair @avika_n_joy @SaiSushanthR @SVC_official @adityamusic pic.twitter.com/OiNuIG6X17 — Sri Venkateswara Creations (@SVC_official) November 23, 2021 -
రాశీ ఖన్నాకు బంపర్ ఆఫర్.. కరణ్ జోహార్ సినిమాలో ఛాన్స్..!
సౌత్ క్రేజీ హీరోయిన్ రాశీ ఖన్నా కెరీర్ మెల్లిగా బాలీవుడ్‌లోనూ స్పీడందుకుంటోంది. ఇప్పటికే హిందీలో రెండు వెబ్ సిరీస్‌లను (షాహిద్ హీరోగా ‘సన్నీ’ (వర్కింగ్ టైటిల్), అజయ్ దేవగన్ ‘రుద్ర’) పూర్తి చేసిన రాశీ ఖన్నా ఇప్పుడు ఓ సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ సమాచారం. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో యాక్షన్ ఫ్రాంచైజీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోనే ఓ లీడ్ క్యారెక్టర్‌కి రాశీ ఖన్నా అవకాశం దక్కించుకున్నారని టాక్. ఫ్రాంచైజీ అంటే కొన్ని భాగాలుగా సినిమాని తీస్తారని తెలిసిందే. ఒకవేళ ఈ సినిమాలో రాశీ కమిట్ అయిన వార్త నిజమే అయితే బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లే. సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ ఇతర ప్రధాన తారాగణంగా కనిపించే ఈ యాక్షన్ ఫ్రాంచైజీకి ‘యోధ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని, పుష్కర్ ఓజా అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తారని బీ టౌన్ ఖబర్. ఇక సౌత్‌లో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’, కార్తీ ‘సర్దార్’ చిత్రాల్లో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. -
రాశి ఖన్నా అదిరిపోయే అందాలు..
-
యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న ‘పక్కా కమర్షియల్’ ఫస్ట్ గ్లింప్స్
గోపిచంద్, రాశీఖన్నా జంట మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీవాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్లో గోపిచంద్ సినిమా అనగానే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో దీపావళి సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను వదిలారు మేకర్స్. ఈ సందర్భంగా నవంబర్ 8న టీజర్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం విడుదల పక్కా కమర్షియల్ ఫస్ట్ గ్లీంప్స్కు యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. 2 మిలియన్ల వ్యూస్‌ను ఈ ఫస్ట్ గ్లింప్స్ దూసుకుపోతోంది. కాగా ఈ సినిమాకు జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తుండగా.. కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీని సెట్స్‌పై తీసుకెళ్లనున్నట్లు ఇటీవల చిత్ర బృందం పేర్కొంది. -
మైసూర్లో సందడి చేయబోతోన్న ‘థ్యాంక్యూ’ టీం!
ప్రస్తుతం ‘లవ్‌స్టోరీ’ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న అక్కినేని హీరో నాగచైతన్య అదే జోష్‌తో థ్యాంక్యూ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నాడు. మనం(2014) తర్వాత దర్శకుడు విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో చైతూ చేస్తున్న రెండో సినిమా ఇది. ఇందులో రాశి ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్లు హీరోయిన్లు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్‌ను ముగించుకుంది. చదవండి: సినిమాల్లోకి సుమ రీఎంట్రీ, క్లారిటీ ఇచ్చిన యాంకర్ ఈ నేపథ్యంలో తదుపరి షెడ్యూల్‌కు కోసం చిత్ర బృందం రాజమండ్రి వెళుతుందని, అక్కడ మూడు రోజుల షెడ్యూల్ అనంతరం థ్యాంక్యూ టీం మైసూర్ వెళ్లనుందని సమాచారం. ఈ మైసూర్లో పలు సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. మైసూర్ షెడ్యూల్‌తో ప్యాచ్‌వర్క్ సహా సినిమా పూర్తవుతుందని తెలుస్తోంది. విక్రమ్ కే కుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. చదవండి: పైసా సంపాదన లేదు.. నా భార్య సంపాదనతో బ్రతికాను -
‘సిరివెన్నెల’ బరువు మోయటం అంత సులువు కాదు: త్రివిక్రమ్
కరోనా వేళ సినీ వేడుకలు లేవు. అది కూడా ఒకే వేదిక మీద రెండు వేడుకలు జరిగితే ఆ ఆనందం అంబరమే. ఆ ఆనందానికి వేదిక అయింది ‘సాక్షి’ మీడియా గ్రూప్. ప్రతిభను గుర్తించింది... తారలను అవార్డులతో సత్కరించింది. 2019, 2020 సంవత్సరాలకు గాను స‘కళ’ జనుల ‘సాక్షి’గా ‘ఎక్స్‌లెన్స్ అవార్డు’ల వేడుక కనువిందుగా జరిగింది. ఎంతో అంగరంగా వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌తో పాటు పలువురు హీరో, హీరోయిన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డులు పొందిన నటులు తమ ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. థ్యాంక్యూ భారతీగారు.. థ్యాంక్స్ సాగరికాగారు.. ఈ అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా నిర్మాత అల్లు అరవింద్‌గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం అద్భుతమైన అనుభూతి. ఈ అవార్డు మీది, మారుతిగార్లదే. నా కెరీర్ బిగినింగ్ నుంచి నాపై మీరు ఎంతో నమ్మకం పెట్టారు. ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలో నాకోసం మంచి క్యారెక్టర్ రాసిన మారుతి సార్‌కి థ్యాంక్స్. ప్రేక్షకుల ఆదరణ వల్లే నాకు ఈ అవార్డు వచ్చింది. అలాగే ‘వెంకీ మామ’ సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ బాబీ, నిర్మాత సురేశ్‌బాబులకు థ్యాంక్స్. ‘సాక్షి’ వారు నాకు ఈ అవార్డు ఇవ్వడం గౌరవంగా ఉంది. ‘సాక్షి’ చానల్ నా కెరీర్ ప్రారంభం నుంచి నాకు చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్యూ సో మచ్. – రాశీ ఖన్నా, మోస్ట్ పాపులర్ యాక్ట్రస్ (వెంకీ మామ, ప్రతిరోజూ పండగే) ‘జెర్సీ’ మూవీ నా ఒక్కడికే కాదు, మా ఎంటైర్ టీమ్‌కి కూడా చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమాకు ఏ అవార్డు వచ్చినా అది మా మొత్తం టీమ్‌కి చెందుతుంది. మాకు ఈ అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. – గౌతమ్ తిన్ననూరి, క్రిటికల్లీ అక్లైమ్డ్ డైరెక్టర్ (జెర్సీ) యాభై వేలకు పైగా పాటలు పాడారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు. ఈ బరువు (బాలు తరఫున అవార్డు అందుకున్నారు) నేను మాత్రమే మోయలేను. మీరు కూడా వచ్చి సాయం పట్టండి.. తమన్ నువ్వు కూడా రా.. థ్యాంక్యూ. – మణిశర్మ (మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ (ఇస్మార్ట్ శంకర్)గా కూడా మణిశర్మ అవార్డు అందుకున్నారు). ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు అందుకుంటుంటే సాయిమాధవ్ చేతులు వణుకుతున్నాయి.. ఇస్తుంటే నాకు కూడా వణుకుతున్నాయి. ఎందుకంటే శాస్త్రిగారి బరువు మోయటం అంత సులువు కాదు. కొన్ని వేల పాటల్ని మనందరి జీవితాల్లోకి వదిలేసిన మహా వృక్షం అది. – త్రివిక్రమ్ ‘సిరివెన్నెల’గారి గొప్పదనం గురించి చెప్పాలంటే ప్రపంచంలోని భాషలన్నీ వాడేసినా ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. ఆయన అవార్డును ఆయన బదులుగా నేను తీసుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను. – సాయిమాధవ్ బుర్రా ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. 2020కి ఉత్తమ గీచ రచయితగా ఒక పాట కాకుండా మూడు పాటలకు (అల వైకుంఠపురములో, జాను, డిస్కోరాజా) ఎంపిక చేశారు. ‘డిస్కోరాజా’ చిత్రంలో నా పాటకి మా అన్నయ్య బాలూగారు పాడిన చివరి పాటల్లో ఒకటి కావడం కొంత విషాదాన్ని కలిగిస్తుంది.. కొంత ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. ఈ అవార్డు తీసుకోవడానికి ఆ రోజు నేను వేదికపైకి రాలేకపోయాను. నా తరఫున అవార్డు అందుకున్న బుర్రా సాయిమాధవ్ అత్యద్భుతమైన ప్రతిభ కలిగిన రచయిత, నా ఆత్మీయ సోదరుడు. పాటల గురించి, మూవీ గురించి సంక్షిప్తంగా నాలుగు మంచి మాటలు చెప్పిన ప్రఖ్యాత దర్శకులు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి థ్యాంక్స్. – పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్–‘సామజ వరగమన’ (అల వైకుంఠపురములో)..., ‘లైఫ్ ఆఫ్ రామ్...’ (జాను) ‘నువ్వు నాతో ఏమన్నావో...’ (డిస్కో రాజా). -
పెళ్లిపై స్పందించిన రాశి ఖన్నా, కాబోయేవాడు అచ్చం తనలాగే..
Rashi Khanna About Her Marriage: టాలీవుడ్ హీరోహీరోయిన్లు ఒక్కొక్కరుగా పెళ్లి బాట పడుతున్నారు. ఇప్పటికే హీరో రానా, నిఖిల్.. హీరోయిన్లు కాజల్, నిహారికలు పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇక ఇటీవల మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా కూడా నిశ్చితార్థం చేసుకుని బ్రేక్ చేసుకుంది. ఇదిలా ఉండగా రాశి ఖన్నా కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం రాశి ఖన్నా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పెళ్లిపై స్పందించింది. చదవండి: అలా ఏడిస్తే హౌజ్ నుంచి ముందుగా వచ్చేది నువ్వే: కౌశల్ త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. ఈ సందర్భంగా కాబోయేవాడు ఎలా ఉండాలనే ప్రశ్న ఎదురవగా ఈ భామ ఇలా చెప్పుకొచ్చింది. ‘నాకు కాబోయేవాడు పెద్దగా అందంగా లేకపోయినా పర్వాలేదు. కానీ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. నా లాగే దేవుడిపై నమ్మకంతో పాటు భక్తిభావం ఉండాలి. అలాంటి లక్షణాలు ఉన్నావాడు నాకు భర్త రావాలని కోరుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ప్రస్తుత కాలంలో అలాంటి వాడు దొరకడం కష్టమే అయినప్ప్పటికి వేతికి పట్టుకుని మరీ పెళ్లి చేసుకుంటానంటూ నవ్వుతూ చమత్కిరించింది. చదవండి: మాలీవుడ్ స్టార్ హీరోలలో అల్లు అర్జున్ ఎవరో తెలుసా? కాగా రాశి ఖన్నా చేతిలో అరడజన్కు పైగా సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే తమిళంలో ‘అరణ్మణై 3’, విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కార్తీ ‘సర్దార్’, ధనుష్ హీరోగా మిత్రన్ జవహర్ దర్శకత్వంలో తెరకెక్కే ఓ సినిమాలో నటించే చాన్స్ కొట్టెసినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఇలా తమిళంలో ఈ భామ తన సత్తా చాటుతోంది. ఇక తెలుగులో నాగచైతన్యతో ‘థ్యాంక్యూ’, గోపీచంద్ పక్కా కమర్షియల్ చిత్రాలు చేస్తోంది. హిందీలో షాహిద్ కపూర్ ‘సన్నీ’వర్కింగ్ టైటిల్, అజయ్ దేవగణ్‌తో ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్ షూటింగ్‌లతో ప్రస్తుతం ఆమె బిజీగా ఉంది. -
సమంత వర్కవుట్స్, ఎందుకో అర్థం కాదన్న ఊర్వశి
♦ అదంటే తనకు ప్యార్ అంటోన్న సిమ్రత్ కౌర్ ♦ బుర్జ్ ఖలీఫా మీద సిద్ధార్థ్ ఫొటో ♦ సాయంత్రాలను ఎంజాయ్ చేస్తున్న సింగర్ సునీత ♦ దీన్ని చూసినట్లుగా ఇంకెవర్నీ చూడలేదంటోన్న రాశీ ఖన్నా ♦ నైట్ షూటింగ్ అయినా రెడీనే అంటోన్న నిఖిల్ ♦ జిమ్‌లో వర్కవుట్స్ చేసిన సమంత ♦ స్పైడర్‌మ్యాన్ ఒకటే డ్రెస్ ఎందుకు వేసుకుంటాడో అర్థం కాదంటున్న ఊర్వశి రౌతేలా ♦ స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న అమీ జాక్సన్ ♦ టైటిల్ పోస్టర రిలీజ్ చేసిన రష్మికకు థ్యాంక్స్ చెప్పిన అవికా గోర్ View this post on Instagram A post shared by Simrat Kaur (@simratkaur_16) View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Naina Ganguly ❤ (@nainaganguly) View this post on Instagram A post shared by Naina Ganguly ❤ (@nainaganguly) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
పెళ్లికూతురిగా ఈషా, ఒకటే జిందగీ అన్న హిమజ
♦ ప్రేమమ్ స్టిల్‌ను షేర్ చేసిన అనుపమ పరమేశ్వరన్ ♦ పూజా రామచంద్రన్‌తో నేహా చౌదరి ♦ నవ్వులు చిందిస్తోన్న అనుష్క శర్మ ♦ ఎన్నిసార్లు కన్ను గీటానో చెప్పండన్న ధనశ్రీ ♦ తనలోని కోతి నిద్ర లేచిందంటున్న రుహానీ శర్మ ♦ పెళ్లికొడుకు లేకుండానే పెళ్లికూతురుగా ముస్తాబైన ఈషా అగర్వాల్ ♦ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న అనన్య నాగళ్ల ♦ ధనుష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రాశీఖన్నా ♦ ఉన్నది ఒకటే జిందగీ అంటోన్న హిమజ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Dhanashree Verma Chahal (@dhanashree9) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Eesha Agarwal 👑 (@eesha_agarwal.official) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
Rashi Khanna: ఆడా ఉంటా... ఈడా ఉంటా!
కోలీవుడ్‌లో రాశీఖన్నా హవా కనిపిస్తోంది. ఇప్పటికే ‘అరణ్మణై 3’, విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’ సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేసి, తాజాగా కార్తీ ‘సర్దార్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారామె. ఇప్పుడు కోలీవుడ్ నుంచి రాశీ మరో కబురు అందుకున్నారట. ధనుష్ హీరోగా మిత్రన్ జవహర్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకి హీరోయిన్గా రాశీఖన్నాని సంప్రదించారని సమాచారం. మరోవైపు తెలుగులో నాగచైతన్య ‘థ్యాంక్యూ’, గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ చిత్రాలు చేస్తున్నారీ బ్యూటీ. ప్రస్తుతం హిందీలో షాహిద్ కపూర్ ‘సన్నీ’ (వర్కింగ్ టైటిల్), అజయ్ దేవగణ్ ‘రుద్ర’ వెబ్ సిరీస్‌ల షూటింగ్‌లతో రాశీఖన్నా బిజీగా ఉంటున్నారు. ఇలా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటిస్తూ ఆడా ఉంటా... ఈడా ఉంటా అంటూ సౌత్, నార్త్‌లలో దూసుకెళుతున్నారు. -
దిక్కులు చూస్తున్న రాశీ, హొయలు పోతున్న అనసూయ
♦ బ్యాక్ టూ బిజినెస్ అంటోన్న తాప్సీ పన్ను ♦ చిన్ననాటి ఫొటో షేర్ చేసిన అప్సర రాణి ♦ వ్యాక్సిన్ తీసుకోండంటున్న శ్రీముఖి ♦ చీరకట్టులో హొయలు పోతున్న అనసూయ ♦ నీ పాట వింటూ సిగ్గుపడుతున్నా అంటోన్న దివి వాద్యా View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Divi Vadthya (@divi.vadthya) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) -
అనుష్క, సమంత ప్రేక్షకుల అభిప్రాయాన్ని మార్చేశారు!
‘‘ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్త పురు షాధిక్యం ఉన్నప్పటికీ ఇప్పటి హీరోయిన్లు కొత్త పాత్రలు, సినిమాలు చేస్తూ తమదైన ముద్ర వేస్తున్నారు. మంచి అవకాశాలను చేజిక్కించుకుని తమ ప్రతిభను చాటుకుంటున్నారు’’ అంటున్నారు హీరోయిన్ రాశీ ఖన్నా. ఇంకా తన కెరీర్ గురించి మాట్లాడుతూ – ‘‘ఊహలు గుసగుసలాడే’ (2014) సినిమాతో హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలో నా కెరీర్ ప్రారంభమైంది. ఈ చిత్రంతో నన్నొక మంచి నటిగా ప్రేక్షకులు గుర్తించారు. కానీ ఆ తర్వాత నేను దాదాపు కమర్షియల్ సినిమాలే చేశాను" "మళ్లీ ‘తొలిప్రేమ’ (2017) సినిమా నా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాతో నన్ను మంచి నటిగా ప్రేక్షకులు మరోసారి చెప్పుకున్నారు. నాకు యాక్టింగ్ వచ్చని నమ్మారు. పరిశ్రమలో ఎక్కువ కాలం హీరోయిన్గా ఉండాలంటే అనుష్కా శెట్టి, సమంతల మాదిరి రాణించాల్సిందే. హీరోయిన్లంటే పాటలకే పరిమితం అనే కొందరి ప్రేక్షకుల అభిప్రాయాన్ని మార్చింది వీరే’’ అని అన్నారు రాశీ ఖన్నా. చదవండి: Rashi Khanna: హీరోయిన్ చేతిలో రెండు వెబ్ సిరీస్‌లు! -
అంజలి కేక్ కటింగ్, నో ఫీలింగ్ అంటున్న హెబ్బా
♦ ర్యాండమ్ ఫొటో షేర్ చేసిన అనుష్క శర్మ ♦ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో అంజలి ♦ వకీల్‌సాబ్ ప్రమోషన్స్ టైమ్‌లో అలా.. అంటోన్న అనన్య నాగల్ల ♦ అందాలతో కవ్విస్తోన్న అనసూయ ♦ ఫ్రెండ్స్‌తో పూల్‌లో ఎంజాయ్ చేసిన సారా అలీఖాన్ ♦ సూర్యకాంతి అవసరమంటోన్న రాశీ ఖన్నా ♦ స్నేహగీతం పాడుతున్న మధుప్రియ ♦ మహర్షి సినిమా స్టిల్ షేర్ చేసిన పూజా హెగ్డే ♦ ఫ్రేమ్స్‌తోపాటు తన ఫీలింగ్స్ కూడా నిల్ అంటోన్న హెబ్బా పటేల్ ♦ రోడ్డు పక్కన కాఫీ తాగడం మిస్ అవుతున్నానంటోన్న తాప్సీ పన్ను ♦ ఇన్‌స్టాగ్రామ్‌లో 38 మిలియన్ల అభిమానులను సొంతం చేసుకున్న ఊర్వశి రౌతేలా ♦ పొట్టి డ్రెస్సులో అషు డ్యాన్సులు ♦ ఆ ప్రైజ్‌మనీ మొత్తం ఇచ్చేశానంటోన్న అవికా గోర్ ♦ దోస్త్‌తో ఫస్ట్ రీల్ చేశానంటోన్న అరియానా గ్లోరీ View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Kalpika Ganesh (@iamkalpika) View this post on Instagram A post shared by Kirti Kulhari (@iamkirtikulhari) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Kritika Kamra (@kkamra) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Richa Chadha (@therichachadha) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
హల్చల్: అందచందాలతో అల్లాడిస్తున్న అప్సరసలు
♦ స్విమ్మింగ్ పూల్ దగ్గర అరియానా అందాలు ♦ ఈజీగా వచ్చేది ఏదీ ఎక్కువ కాలం ఉండదంటోన్న పూజా రామచంద్రన్ ♦ ఈ విస్కీ(కుక్కపిల్ల) తనదేనంటోన్న అనుపమ పరమేశ్వరన్ ♦ ఈ మూడింటిలో ఏ ఫొటో నచ్చిందంటోన్న వింధ్యా తివారి ♦ పూల మధ్య పరవశించిపోతున్న అమైరా దస్తూర్ ♦ ఎవరికైనా జాకెట్ పొటాటో కావాలా? అని అడుగుతోన్న అదా శర్మ ♦ శేఖర్ మాస్టర్‌తో శ్రీముఖి స్టెప్పులు ♦ మనం కాకపోతే ఇంకెవరు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సాయం చేస్తామంటోన్న రాశీ ఖన్నా View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Vindya Tiwary (@vindhyatiwary) View this post on Instagram A post shared by Vindya Tiwary (@vindhyatiwary) View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur93) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur93) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) View this post on Instagram A post shared by SHILPA REDDY (@shilpareddy.official) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
Rashi Khanna: హీరోయిన్ చేతిలో రెండు వెబ్ సిరీస్‌లు!
డిజిటల్ ఎంటర్టైన్మెంట్పై మరింత ఫోకస్ పెట్టినట్లున్నారు హీరోయిన్ రాశీ ఖన్నా. ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్’ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకద్వయం రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతితో పాటు ఓ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు రాశీ ఖన్నా. తాజాగా అజయ్ దేవగణ్ నటించనున్న ‘రుద్ర’ (ప్రచారంలో ఉన్న టైటిల్) వెబ్ సిరీస్‌లో ఓ మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసేందుకు ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ‘వెంటిలేటర్’ ఫేమ్ ఎమ్. రాజేష్ ‘రుద్ర’ సిరీస్‌ను డైరెక్ట్ చేయనున్నారు. ఇంగ్లిష్ సైకలాజికల్ క్రైమ్ డ్రామా ‘లూథర్’ ఆధారంగా ఈ హిందీ వెబ్ సిరీస్ రూపొందనుంది. ‘లూథర్’ సిరీస్‌లో రూథ్ విల్సన్ పోషించిన పాత్రలో రాశీ కనిపిస్తారట. ‘రుద్ర’ షూటింగ్ ఈ నెల 21న ప్రారంభం అవుతుందని బాలీవుడ్ సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో రాశీ ఓ లీడ్ క్యారెక్టర్ చేసే చాన్స్ దక్కించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక తెలుగులో నాగచైతన్య ‘థ్యాంక్యూ’, గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే తమిళంలో మూడు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇలా కెరీర్లో టాప్ గేర్‌తో దూసుకెళ్తున్నారు రాశీ ఖన్నా. -
హల్చల్: చార్మీ విందు, రాశీ అందాల కనువిందు
♦ ఎలాంటి బట్టలు వేసుకున్నా మహిళను గౌరవించాల్సిందే అంటున్న టీనా దత్తా ♦ ఆడవారికి చీరకట్టే అందమంటోన్న బిగ్‌బాస్ బ్యూటీ దివి ♦ ప్రకృతిని కాపాడుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందంటున్న కల్పికా గణేశ్ ♦ ఫన్నీ వీడియోను షేర్ చేసిన సుమ కనకాల ♦ కోవిడ్ తర్వాత తన పరిస్థితి గురించి చెప్పిన కంగనా రనౌత్ ♦ ఇంటి భోజనం ఆరగించిన చార్మీ కౌర్ ♦ రాజ్ పాత్ర ఎప్పటికీ ప్రత్యేకమే అంటోన్న సమంత ♦ ఈ బుజ్జి కుక్కపిల్ల అంటే ఎంతో ఇష్టమంటున్న రష్మిక మందన్నా ♦ పూల మధ్యలో రాశీ ఖన్నా సోయగాలు View this post on Instagram A post shared by ✨Tinzi In TinzelTown✨🧚♀️ (@tinadatta) View this post on Instagram A post shared by ✨Tinzi In TinzelTown✨🧚♀️ (@tinadatta) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Kalpika Ganesh (@iamkalpika) View this post on Instagram A post shared by Neha Dhupia (@nehadhupia) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Yami Gautam (@yamigautam) View this post on Instagram A post shared by Saiyami Kher (@saiyami) View this post on Instagram A post shared by Namita Vankawala Chowdhary (@namita.official) View this post on Instagram A post shared by Hamsa Nandini | Actress (@ihamsanandini) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) -
Rashi Khanna: రిస్క్ అయినా.. 18 గంటలు కష్టపడ్డాం
‘మనం’తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘థ్యాంక్యూ’.ఇందులో రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోవిడ్ పరిస్థితులు భయపెడుతున్నప్పటికీ ‘థ్యాంక్యూ’టీమ్ ఇటలీలో వెళ్లి షూటింగ్ కంప్లీట్ చేసుకొచ్చింది. ఇలాంటి రిస్క్ టైంలో కూడా థాంక్యూ టీమ్ షూటింగ్ పూర్తి చేసుకొని రావడం ఆశ్చర్యం కలిగించింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో పడిన కష్టాలను బయట పెట్టింది రాశిఖన్నా. కరోనా భయానికి ఇండియా నుంచి ఇటలీకి వెళ్లాలంటే భయమేసింది కానీ, సినిమా కంప్లీట్ చేయాలి కాబట్టి భయంతోనే ఇటలీకి వెళ్లాలని చెప్పింది. భయం భయంగానే షూటింగ్ పూర్తి చేశామని తెలిపింది. షూటింగ్ త్వరగా ముగించేందుకు రోజుకు 18 గంటలు కష్టపడిన సందర్భాలు ఉన్నాయని రాశి చెప్పు కొచ్చింది. కొంచెం కష్టమైనా.. మొత్తనాకి షూటింగ్ పూర్తి చేసుకొని రావడం సంతోషంగా ఉందని రాశి పేర్కొంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో మహేశ్‌బాబు అభిమాని పాత్రలో నాగచైతన్య కనిపిస్తారని తెలుస్తోంది. ఓ కీలక పాత్రలో అవికా గోర్ కనిపిస్తారని సమాచారం. చదవండి : ప్రీ లుక్‌తోనే షాకిస్తున్న అల్లు శిరీష్.. అస్సలు తగ్గట్లేదుగా ఇతిహాసాల నేపథ్యంలో ప్రశాంత్ వర్మ కొత్త మూవీ, టైటిల్ ఖరారు -
అనసూయ ముద్దులు, రాశీ ఖన్నా హగ్గులు
► కోవిడ్ బాధిత కుటుంబాలకు నిధి అగర్వాల్ సాయం ► పక్షికి అనసూయ ముద్దులు ► ఇది చాలా అద్భుతంగా ఉందన్న నోయల్ సేన్ ► అక్కాబావకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన మధుప్రియ ► జీవితం ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండదు అంటోన్న సాక్షి అగర్వాల్ ► 1 నుంచి 100 నంబర్ల మధ్య ఎన్నిసార్లు 9 వస్తుందని ప్రశ్నిస్తోన్న అదా శర్మ ► విష్ణుప్రియతో కలిసి గెంతులేసిన శ్రీముఖి ► మా అమ్మ ప్రపంచంలోనే బెస్ట్ మామ్ అంటున్న అఖిల్ సార్థక్ ► తను నిద్రపోలేదంటోన్న రకుల్ ప్రీత్ సింగ్ ► ఫేవరెట్ ప్లేస్‌ను మిస్ అవుతున్నానన్న శివాత్మిక ► వర్చువల్ హగ్గులు ఇస్తోన్న రాశీ ఖన్నా ► కష్టకాలంలో ఉన్నవారికి బిగ్‌బాస్ బ్యూటీ దివి సాయం View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Noel (@mr.noelsean) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Swetha Naidu 🇮🇳 (@swethaa_naidu) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Bhanu shree (@iam_bhanusri) View this post on Instagram A post shared by Bhanu shree (@iam_bhanusri) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
బెడ్ సీన్.. వెక్కి వెక్కి ఏడ్చిన రాశీ ఖన్నా
చాలామంది నటించడం ఈజీ అనుకుంటారు. ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందు హావభావాలు ఒలికించడాన్నే నటన అని భావిస్తారు. కానీ కొన్ని సమయాల్లో, మరికొన్ని సీన్లలో నటించడం అనుకున్నంత ఈజీ కానే కాదు. ముఖ్యంగా బెడ్రూమ్ సీన్లలో హీరోయిన్లు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి ఇబ్బందే రాశీ ఖన్నా కూడా ఎదుర్కొంది. అంతేకాదు ఆమెను అలాంటి పరిస్థితిలో చూసి రాశీ తల్లి కూడా ఎంతో భయపడిపోయింది. రాశీ ఖన్నా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో జరిగిన విషయమిది... హిందీలో ఆమె తొలి చిత్రం 'మద్రాస్ కెఫె'లో ఓ అభ్యంతరకర సీన్లో నటించాల్సి వచ్చింది. అది కేవలం నటనే అయినప్పటికీ మరో వ్యక్తితో ఒకే బెడ్‌పై ఉండటం అన్న ఆలోచననే రాశీ ఖన్నా జీర్ణించుకోలేకపోయింది. తన భయాన్ని పోగొట్టుకునేందుకు ఆ సన్నివేశం గురించి తన తల్లికి చెప్పింది. దీంతో ఆమె తల్లికి ఆ రోజంతా నిద్ర పట్టలేదు. ఇక సెట్స్‌కు వచ్చిన తర్వాత ఎలాగోలా ఆ సీన్ షూటింగ్ పూర్తి చేసిన రాశీ ఆ వెంటనే వ్యాన్‌లోకి వెళ్లిపోయి వెక్కి వెక్కి ఏడ్చిందట. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలోనూ ఇలాంటి ఓ అభ్యంతరకరమైన సీన్లో నటించాల్సి వచ్చింది. కానీ అప్పుడు విజయ్ ఆమెకు ధైర్యం చెప్పి ఎలాంటి ఇబ్బంది లేకుండా సీన్ పూర్తి చేశారట. ఇక అప్పటి నుంచి ఇలాంటి అభ్యంతరకర సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు పాత్ర నుంచి తనను తాను వేరు చేసుకోవడం ఎలాగో నేర్చేసుకున్నానంటోంది రాశీ ఖన్నా. చదవండి: Kangana Ranaut: ఫైర్‌బ్రాండ్‌కు షాకిచ్చిన ట్విటర్ -
కలలు బాగున్నాయ్ అన్న రాశీ.. చెత్తగా ఉందన్న అషూ
♦ డైరెక్టర్ వేణు శ్రీరామ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపిన అంజలి ♦ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ థ్యాంక్స్ చెప్పిన అనుష్క శర్మ ♦ వాస్తవం కన్నా కలలే ఎంతో బాగున్నాయ్.. అంటోన్న రాశీ ఖన్నా ♦ నీకు నువ్వే పోటీ అంటోన్న లావణ్య త్రిపాఠి ♦ లాక్‌డౌన్‌కు ముందు అక్కడున్నానంటోన్న నిత్యామీనన్ ♦ వీడియో చెత్తగా ఉంది కదూ అంటోన్న అషూ రెడ్డి View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
రాశీ ఖన్నా జోరు మామూలుగా లేదు..
హీరోయిన్ రాశీ ఖన్నా జోరు మాములుగా లేదు. తెలుగులో ‘పక్కా కమర్షియల్’, ‘థ్యాంక్యూ’ చిత్రాలతో పాటు హిందీలో షాహిద్ కపూర్ నటిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో హీరోయిన్గా చేస్తున్నారు. తాజాగా తమిళంలో కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్దార్’ చిత్రానికి సై అన్నారు. ఈ సినిమాలో ఒక హీరోయిన్గా నటించే చాన్స్‌ను రాశీ దక్కించుకున్నారు. మరో హీరోయిన్గా మలయాళ నటి రజిషా విజయన్ నటిస్తున్నారు. కార్తీ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్ ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు సమాచారం. చదవండి: బాలీవుడ్ హీరోతో రాశీ ఖన్నా రొమాంటిక్ పాటలు! -
మాస్క్ లేకపోతే రిస్క్
ముసుగు వేయొద్దు మనసు మీద అంటారు.. అంటే.. మనసులో ఏం ఉంటే అది మాట్లాడాలని. ఇప్పుడు సీన్ రివర్స్... ముసుగు వేయాలి ముఖం మీద. అదేనండీ మాస్క్. అది లేకపోతే రిస్క్.. ఇక.. బ్యాగ్‌లో ఏం ఉన్నా లేకపోయినా.. శానిటైజర్ బాటిల్ ఉండాల్సిందే. పదే పదే చేతులు శుభ్రం చేసుకోవాలి. లేకపోతే రిస్క్. అంతా కరోనా తెచ్చిన తంటా. ఈ కరోనా కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో కొందరు కథానాయికలు చెప్పారు. ఆ విశేషాలు. ఇప్పుడు దూరమే మంచిది -పూజా హెగ్డే ► కరోనాకి సంబంధించి ముందు బేసిక్ పాయింట్స్‌ని ఒకసారి చెప్పుకుందాం ► తరచూ చేతులు కడుక్కోవాలి ► ఫేస్ మాస్క్‌ని మరచిపోకుండా వాడాలి ► ఏదైనా వస్తువు ముట్టుకున్నాక శానిటైజర్ వాడాలి ► ఇప్పుడు ఆవిరి పట్టడం చాలా ముఖ్యం. రోజుకి రెండుసార్లు ఆవిరి పడితే మంచిది. నేను తప్పనిసరిగా రోజుకి రెండుసార్లు ఆవిరి పడుతుంటాను ► వేడినీళ్లు ఎన్ని తాగితే అంత మంచిది. మనం ఎక్కువ నీళ్లు తాగడంవల్ల మన శరీరంలో ఇన్ఫెక్షన్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. నేను రోజుకి కనీసం మూడు లీటర్లు నీళ్లు తాగుతాను ► యోగా చాలా మంచిది... శరీరానికి, మనసుకి కూడా. నేను రోజూ చేస్తాను ► బత్తాయి, ఆరెంజ్ లాంటి సిట్రస్ ఫ్రూట్స్ మేలు చేస్తాయి. లేకపోతే విటమిన్ సి ట్యాబ్లెట్లు వాడాలి. డాక్టర్ సలహా మేరకు ట్యాబ్లెట్లు తీసుకోవాలండోయ్. నేను రోజూ ఎక్కువగా పండ్లు తింటాను ► షూటింగ్‌కి వెళ్లేటప్పుడు తప్పకుండా శానిటైజర్ తీసుకెళతాను. అలాగే అందరికీ దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. అది నాకూ మంచిది. లొకేషన్లో ఉండేవాళ్లకీ మంచిది షూటింగ్ లొకేషన్లో ఉన్నప్పుడు కాటన్ రుమాలుని మాస్క్‌లా వాడతాను ► నేను ఉండే వ్యానిటీ వ్యాన్ బయట శానిటైజర్ ఉండేలా చూసుకుంటాను. వ్యాన్‌లోకి వచ్చేవాళ్లు చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకున్నాకే వస్తారు ► షూటింగ్ ముగించుకుని ఇంటికి రాగానే ఆవిరి తీసుకుంటాను. వేడి నీళ్లతో స్నానం చేస్తాను ∙ఒక నటిగా అన్ని సమయాల్లో మాస్క్ ధరించడం చాలా కష్టం. కెమెరా ముందుకు వెళ్లినప్పుడు మాస్క్ తీసేస్తాం. ► కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి అన్ని జాగ్రత్తలూ తీసుకునే, షూటింగ్స్ చేస్తున్నాం. ఆరోగ్యమే గొప్ప సంపద -రాశీ ఖన్నా ► ప్రస్తుతం నాగచైతన్యతో నటిస్తున్న ‘థ్యాంక్యూ’ సినిమా షూటింగ్ చేస్తూ ఇటలీలో ఉన్నాను ∙కోవిడ్ నిబంధనలను చాలా స్ట్రిక్ట్‌గా పాటిస్తున్నాం. మాస్కులు ధరించి షూటింగ్‌కి రావాలనే నిబంధనను అందరం ఫాలో అవుతున్నాం ► లొకేషన్లో వీలున్న చోటల్లా శానిటైజర్లు ఏర్పాటు చేశారు. అలాగే లొకేషన్ని తరచూ శానిటైజ్ చేయిస్తున్నారు ► ఎన్ని చేసినా కెమెరా ముందుకి వెళ్లగానే మేం ఆర్టిస్టులు మాస్కులు తీయాల్సిందే ► నా వ్యక్తిగత విషయానికొస్తే.. మొదట్నుంచీ నాకు ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ. అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా ఏమీ చేయడంలేదు ఇప్పుడనే కాదు.. ఎప్పట్నుంచో వేడి నీళ్లు తాగడం నా అలవాటు ► నేను శాకాహారిగా మారి, ఏడాదిన్నర అయింది. దానివల్ల చాలా హాయిగా ఉంది ► ఇప్పుడు అందరూ చేయాల్సిన పనేంటంటే.. ఫిట్‌గా ఉండటం. వైరస్ మనల్ని ఎటాక్ చేస్తే తట్టుకునేంత శక్తి మన దగ్గర ఉండాలి. మంచి ఆహారపుటలవాట్లు మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ► పెద్ద పెద్ద వ్యాయామాలు చేయడానికి కుదరకపోతే రోజుకి కనీసం 20 నిమిషాలైనా నడవాలి ∙తప్పించలేని పనులుంటే బయటకు వెళ్లక తప్పదు. పని లేకపోతే వెళ్లొద్దు ► ఈ కరోనా వల్ల మనషుల మనుగడ ప్రశ్నార్థకం అయింది. ఈ పోటీ ప్రపంచంలో ఇన్నాళ్లూ పరుగులు పెట్టాం. ఇప్పుడు ఆగి, ఆలోచించాల్సిన అవసరం ఉంది. సంపాదనలోనే ఆనందం ఉందనే భ్రమను తొలగించుకుందాం. ఆరోగ్యమే గొప్ప సంపద అనే విషయాన్ని గ్రహిద్దాం ► ఇప్పటివరకూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించినవాళ్లు ఓకే. లేనివాళ్లు మాత్రం లైఫ్‌స్టయిల్‌ని మార్చుకోవాలి ► ఫైనల్‌గా ఒక మాట చెబుతాను. తప్పనిసరిగా మాస్క్ ధరించండి. మీరు క్షేమంగా ఉండండి. ఇతరులకూ అదే క్షేమం! ఆ ధోరణి మారాలి -నభా నటేష్ ► ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది ► కచ్చితంగా మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటి ప్రాథమిక నియమాలను అలవాటు చేసుకోవాలి ► కరోనా మహమ్మారి మనల్ని ఏడాదికి పైగా బాధపెడుతున్నా మనలోని కొందరు ఇంకా కరోనా జాగ్రత్తలను పాటించే విషయంలో నిర్లక్ష్యంగానే ఉన్నారు. ఆ ధోరణిని మార్చుకోవాలి ► ఈ కరోనా సమయంలోనూ నేను షూటింగ్లో పాల్గొంటున్నాను. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను ► నేనే కాదు.. నా వ్యక్తిగత సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ► షూటింగ్ లొకేషన్లో అందరూ మాస్కులు ధరిస్తున్నారు. భౌతిక దూరం పాటించే మాట్లాడుకుంటున్నాం ► షూటింగ్లో భాగంగా కొన్ని వస్తువులను తాకాల్సి వస్తుంది. సో.. ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్‌తో క్లీన్ చేసుకుంటున్నాను ► అందరూ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి ► రోజులో కాస్త సమయం వ్యాయామానికి కేటాయించాలి ► నేను తప్పకుండా వ్యాయామం చేస్తాను, మంచి ఆహారం తీసుకుంటాను. మంచి అలవాట్ల వల్ల శక్తి అధికంగా ఉండే రోగాల నుంచి కాస్త దూరంగా ఉండొచ్చనేది నా భావన ► కరోనా వల్ల అన్ని రంగాలూ చాలా నష్టపోయాయి. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు వస్తున్నాయనుకుంటే సెకండ్ వేవ్ రూపంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. వైరస్‌తో ప్రయాణం చేస్తున్నామని మరచిపోకండి. జాగ్రత్తగా ఉండండి. -
ఇటలీలో ల్యాండ్ అయిన నాగచైతన్య
కోవిడ్ పరిస్థితులు భయపెడుతున్నప్పటికీ ‘థ్యాంక్యూ’ చిత్రబృందం ఇటలీలో ల్యాండ్ అయింది. పదిహేను రోజుల షూటింగ్‌ను అక్కడ ప్లాన్ చేశారు. ఇటీవల వైజాగ్‌లో ఒక షెడ్యూల్ జరిగింది. ఇప్పుడు ఇటలీలో జరుగుతున్న షెడ్యూల్ తర్వాత హైదరాబాద్‌లోనూ ప్లాన్ చేశారు. ఇటలీలో జోరుగా షూటింగ్ చేస్తున్నారు. మరి.. యూనిట్ ఇటలీ నుంచి వచ్చాక ఇక్కడి పరిస్థితులను బట్టి హైదరాబాద్ షెడ్యూల్ ఉంటుంది. ‘మనం’ తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో హీరోయిన్ అవికా గోర్ ఇందులో కీలక పాత్రధారి. ఈ సినిమాలో హీరో మహేశ్‌బాబు అభిమాని పాత్రలో నాగచైతన్య కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. చదవండి: -
బాలీవుడ్ హీరోతో రాశీ ఖన్నా రొమాంటిక్ పాటలు!
సెట్లో పాటలు పాడుకుంటున్నారు హీరోయిన్ రాశీ ఖన్నా, షాహిద్‌కపూర్. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఓ వెబ్ సిరీస్‌లో షాహిద్ కపూర్, రాశీ ఖన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం షాహిద్, రాశీ కాంబినేషన్లోని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఇద్దరిపై రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా తెలిసింది. సన్నివేశాలతో పాటు పాటలు కూడా చిత్రీకరిస్తున్నారట. వచ్చే ఏడాది ఈ వెబ్‌సిరీస్ ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... రాశీ ఖన్నా నటిస్తున్న తొలి వెబ్‌సిరీస్ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు రాశీఖన్నా. లొకేషన్లో షాహిద్ కపూర్‌తో... -
లంగా ఓణీలో అనసూయ, లెహంగాలో నభా.. కవ్విస్తున్న భామలు
ఎలా ఉన్నానో చెప్పడంటూ కళ్ల జోడు పెట్టుకుని ఉన్న ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది నిధి అగర్వాల్ లంగా ఓణీలో కవ్విస్తున్న అనసూయ చూపులతో కుర్రకారుకు మత్తెక్కిస్తున్న దిశాపటాని సమ్మర్లో ఉపశమనం కోసం స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాట ఆడుతున్న యంగ్ హీరో ఆది సాయికుమార్ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు ఏం చేయాలో వివరిస్తున్న బాలీవుడ్ భామ మలైకా అరోరా View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by disha patani (paatni) (@dishapatani) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by ActorAadi (@aadipudipeddi) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Divi Vadthya (@divi.vadthya) View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) -
హాట్ పిక్స్‌తో హీటెక్కిస్తున్న రాశి ఖన్నా..కవ్విస్తున్న శ్రద్దా
►ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న కీర్తిసురేశ్ ► ‘ఖిలాడి’సినిమా షూటింగ్ కోసం ఇటలీ వెళ్లిన అనసూయ.. అక్కడ రవితేజతో దిగిన ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ►చీరకట్టులో కవ్విస్తూ కుర్రకారు మతులు పోగొడుతన్న శ్రద్దాదాస్ ►ఇన్‌స్ట్రాగ్రామ్‌లో హాట్ ఫోటోలను షేర్ చేసి కుర్రకారును రెచ్చగొడుతున్న రాఖి ఖన్నా View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) View this post on Instagram A post shared by renu (@renuudesai) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
స్విమ్ సూట్లో రాశీ, సాగర తీరాన హంసా
► రాధేశ్యామ్ కొత్త పోస్టర్‌ను షేర్ చేసిన పూజా హెగ్డే ► ఆటాడుకుందాం రా అని పిలుస్తోన్న ప్రియాంక చోప్రా ► కనులు మూసినా కలల్లోకి వస్తున్న అనుపమ పరమేశ్వరన్ ► చోటా గ్యాంగ్‌తో హిందీ బిగ్‌బాస్ 14 విన్నర్ రుబీనా దిలైక్ సెల్ఫీ ► భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన రీమా సేన్ ► క్యూట్ పిక్ షేర్ చేసిన రితికా సింగ్ ► అమ్మవారిని దర్శించుకున్న 'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా ► ఆలోచనల్లో మునిగిపోయిన ప్రియాంక మోహన్ ► స్విమ్ సూట్లో ఓరకన్నుతో చూస్తోన్న రాశి ఖన్నా ► సముద్ర తీరాన హంసానందిని సెల్ఫీలు View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rubina Dilaik (@rubinadilaik) View this post on Instagram A post shared by Reema Sen (@senreema29) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by RASHI KHANNA (@raashi_official) View this post on Instagram A post shared by RASHI KHANNA (@raashi_official) -
బాక్సింగ్ నేర్చుకుంటున్న రాశీ ఖన్నా
రాశీ ఖన్నా బాక్సింగ్ నేర్చుకుంటున్నారు. ఏదైనా క్యారెక్టర్ కోసం నేర్చుకుంటున్నారా? అంటే.. ఆ విషయాన్ని స్పష్టం చేయడంలేదు. మరింత ఫిట్‌గా కనబడటం కోసమే ఈ ట్రైనింగ్ అంటున్నారు. హిందీలో ‘సన్నీ’ అనే సినిమా అంగీకరించారీ బ్యూటీ. ఈ శిక్షణకు ఒక కారణం ఈ సినిమా అని తెలుస్తోంది. ఇక బాక్సింగ్ గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ – ‘‘శరీర శక్తిని పెంచుకోవడానికి ఒక మంచి మార్గం బాక్సింగ్. పైగా నేను తీసుకుంటున్నది ‘హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్’ (హెచ్ఐఐటి). రోజూ గంటసేపు నేర్చుకుంటున్నా. కొవ్వు, పిండి పదార్థాల సమాహారంతో నా డైట్ ఉంటుంది. బాక్సింగ్ అనేది శారీరక బలం మాత్రమే కాదు.. మానసిక బలాన్నీ పెంపొందిస్తుంది. ఎంత పెద్ద సవాల్‌ని అయినా ఎదుర్కోగలననే ఆత్మవిశ్వాసం నాలో పెరిగింది. అందరికీ మానసిక బలం అవసరం. బలహీనత అనేది మనల్ని హరించివేస్తుంది’’ అన్నారు. -
గుర్తుండిపోయే జ్ఞాపకం
‘‘ప్రతి సినిమా చిత్రీకరణ కోసం చేసే ప్రయాణం ఓ జ్ఞాపకం అవుతుంది. ‘తుగ్లక్ దర్బార్’ చిత్రానికి చేసిన ప్రయాణం నాకెప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం’’ అంటున్నారు రాశీ ఖన్నా. తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా ఢిల్లీ ప్రసాద్ దీనదయాల్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ ‘తుగ్లక్ దర్బార్’. రాశీ ఖన్నా, మంజిమా మోహన్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ గురువారం పూర్తయింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు రాశీ ఖన్నా. ‘‘మరో అద్భుతమైన ప్రయాణం పూర్తయింది. విజయ్ సేతుపతిలాంటి ప్రతిభ ఉన్న నటుడితో యాక్ట్ చేయడం మంచి అనుభవం. ఈ అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా మీ అందరికీ త్వరగా చూపించేయాలని ఉంది’’ అని పేర్కొన్నారు రాశీ. అలానే చిత్రీకరణ చివరి రోజు టీమ్‌తో దిగిన కొన్ని సెల్ఫీలను షేర్ చేశారు కూడా. -
సిరీస్ కోసం సీరియస్
వచ్చే ఏడాదిని చాలా సీరియస్‌గా స్టార్ట్ చేయనున్నారట బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్. జనవరి నెల ప్రారంభంలో ఆయన తాజా వెబ్ సిరీస్ చిత్రీకరణ ఆరంభం కానుంది. రాజ్, డీకే దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సిరీస్ ఫుల్ యాక్షన్‌తో నిండి ఉంటుందట. ఇందులో షాహిద్ పాత్ర చాలా సీరియస్‌గా ఉంటుందని సమాచారం. ఈ సిరీస్‌లో రాశీ ఖన్నా కథానాయికగా కనిపిస్తారు. అలానే తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ చిత్రీకరణను ముంబై, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరుపుతారు. ఏప్రిల్ కల్లా షూటింగ్ పూర్తవుతుందట. ప్రస్తుతం ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో నటిస్తున్నారు షాహిద్. దీని తర్వాత కరణ్ జోహార్ నిర్మాణంలో ‘యోధ’ అనే యాక్షన్ సినిమా కూడా కమిట్ అయ్యారు. -
నెల్లూరులో రాశీ ఖన్నా సందడి
-
రాజకీయాల్లోకి రావాలనుంది
‘‘రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉంది. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తాను’’ అన్నారు రాశీ ఖన్నా. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు ఐఏయస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. అనుకోకుండా నటిని అయ్యాను. నటిగా చాలా విషయాలు తెలుసుకోగలిగాను. ఇప్పుడు ఎలాగూ ఐఏయస్ ఆఫీసర్ అవ్వలేను. కానీ భవిష్యత్తులో పక్కాగా రాజకీయాల్లోకి వెళ్తాను. అంతకంటే ముందు ఓ ఎన్జీవో ప్రారంభిస్తాను. ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకుంటాను. వాళ్ల సమస్యలు అర్థం చేసుకుని సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. నాకు రాజకీయాలు ఎలా చేయాలో తెలియదు. కానీ సహాయం ఎలా చేయాలో తెలుసు’’ అన్నారు రాశీ. ప్రస్తుతం తమిళంలో ‘అరన్ మణై, తుగ్లక్ దర్బార్’ చిత్రాలు చేస్తున్నారు రాశీ ఖన్నా. -
పొల్లాచ్చిలో పాట
రాశీ ఖన్నా ఫుల్Š ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే డ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి. డ్యాన్స్ చేస్తే ఆనందపడటం ఏంటీ అనుకుంటున్నారా? మరేం లేదు. లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగులకు ఆరేడు నెలలు బ్రేక్ పడింది కదా. దుకని రాశీ డ్యాన్స్ ని మిస్సయ్యారు. ప్రస్తుతం తమిళ చిత్రం ’అరణ్ మణై’ సీక్వెల్ లో నటిస్తున్నారామె. తమిళనాడులోని పొల్లాచ్చిలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. డ్యాన్స్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ’’డ్యాన్స్ చేసి చాలా రోజులయింది. అందుకే చాలా చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు రాశీ ఖన్నా. సుందర్. సి. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆర్య, ఆండ్రియా తదితరులు నటిస్తున్నారు. -
సెలవు లేదు
కోవిడ్ వల్ల వర్క్ లేకపోవడంతో స్టార్స్ అందరికీ హాలిడే వచ్చింది. ఇటీవలే సినిమా చిత్రీకరణలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. కోవిడ్ బ్రేక్ పెద్దదే కావడంతో ఇక బ్రేక్స్ లేకుండా షూటింగ్స్ చేయాలనుకుంటున్నారు కొందరు స్టార్స్. అందులో రాశీ ఖన్నా ఒకరు. ‘తుగ్లక్ దర్బార్, అరన్మణై’ సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు రాశీ. ‘తుగ్లక్ దర్బార్’ కోసం దసరా రోజూ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆదివారాలు కూడా సెలవు తీసుకోకుండా వర్క్ చేస్తున్నారామె. ‘ఆదివారం కూడా మండే (సోమవారం)లానే ఉంది’ అంటూ ఓ ఫోటోను షేర్ చేశారు రాశీ ఖన్నా. -
దర్బార్ నుంచి మహల్‌కు...
దర్బార్‌లో షూటింగ్ పూర్తి చేసి నేరుగా మహల్లోకి వెళ్లిపోయారు రాశీ ఖన్నా. లాక్డౌన్ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారామె. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ‘తుగ్లక్ దర్బార్’ సినిమాలో హీరోయిన్గా చేస్తున్నారు రాశీ. ఈ సినిమా చిత్రీకరణలో దసరా హాలీడే కూడా తీసుకోకుండా పాల్గొన్నారామె. ఇది పూర్తవ్వగానే తమిళ చిత్రం ‘అరన్ మణై’ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. దర్శకులు సుందర్ .సి తెరకెక్కించిన హిట్ సిరీస్ ‘అరన్ మణై’ (మహల్) సిరీస్‌లో మూడో చిత్రం ‘అరన్ మణై 3’. ఆర్య, ఆండ్రియా, రాశీ ఖన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయింది. లాక్డౌన్ వల్ల ఆగిపోయింది. తాజాగా మళ్లీ షూటింగ్ షూరూ అయింది. ప్రస్తుతం ఈ సినిమా సెట్లో బిజీగా ఉన్నారు రాశీ. ఈ రెండు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ పూర్తి చేయనున్నారట. అప్పటివరకూ దర్బార్ నుంచి మహాల్ సెట్స్‌కి అటూ ఇటూ తిరుగుతూ రాశీ ఖన్నా బిజీ బిజీ. -
మన యుద్ధం మనమే చేయాలి..
‘‘ఆడవాళ్లందర్లోనూ అన్యాయాన్ని ఎదిరించగల దుర్గాదేవి అవతారముంది. అది తెలుసుకుని, ఆ శక్తిని బయటకు తీస్తేనే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఎదుర్కోగలం’’ అంటున్నారు రాశీ ఖన్నా, లావణ్యా త్రిపాఠి, అదా శర్మా, మెహరీన్, నభా నటేశ్. సమాజంలో స్త్రీ నెగ్గుకురావాలంటే దుర్గాదేవిలా మారాల్సి ఉంటుందా? ఆడవాళ్లకు పలు సమస్యలు ఉంటాయి. అవకాశం వస్తే మీరు పూర్తిగా నిర్మూలించాలనుకునే సమస్య ఏంటి? చెడును ఎదుర్కోవడానికి మీరు దుర్గాదేవిలా మారిన సందర్భాలేమైనా? దసరా పండగ సెలబ్రేషన్ గురించి? వంటి ప్రశ్నలకు రాశీ, అదా, లావణ్య, మెహరీన్, నభా చెప్పిన అభిప్రాయాలు దసరా ప్రత్యేకం. హద్దు దాటితే సహించను – మెహరీన్ ► తన క్యారెక్టర్ని తక్కువ చేసినా, తన ఆత్మస్థైర్యాన్ని తగ్గించేలా ఉన్నా, అనవసరమైన నిందలకు గురైనా తప్పకుండా దుర్గాదేవిలా మారాల్సిందే. ఏం జరిగినా సరే ఒకరి క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. ఆడవాళ్లను అగౌరవపర్చకూడదు. ► అసమానతను నిర్మూలించాలనుకుంటున్నాను. ఆడవాళ్లను బలహీనమైనవాళ్లలా చూస్తారెందుకో అర్థం కాదు. శారీరకంగా మగవాళ్ల అంత బలంగా ఆడవాళ్లు ఉండకపోవచ్చు. కానీ మానసికంగా ఆడవాళ్లు ఎంత బలవంతులో అందరికీ తెలుసు. శారీరకంగానూ మాకు వీలైనంతగా చేస్తూనే ఉంటాం. ఎంతో సమర్థవంతంగా ఇంటి పనిని, ప్రొఫెషనల్ పనిని బ్యాలెన్స్ చేయగలం. మల్టీటాస్క్ చేయగలం. స్త్రీ, పురుషులందరూ సమానమే అనే భావన పెంపొందించాలి అందరిలో. ► నేను చాలా సైలెంట్‌గా ఉంటాను. ఓపిక ఎక్కువ. నా పనేదో నేను చూసుకునే మనస్తత్వం. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. ఆ లిమిట్ వరకూ నేను కామ్‌గా ఉంటాను. అన్యాయంగా ప్రవర్తించినా, అగౌరవపరిచినా అస్సలు సహించలేను. ఆ పరిస్థితిని చక్కబెట్టేందుకు నిలబడతాను. ► పండగ వస్తుందంటే నాకు భలే సంతోషమేస్తుంది. స్నేహితులు, బంధువులను కలవచ్చు. ప్రస్తుతం అందరం ఎప్పుడూ చూడని పరిస్థితుల్లో ఉన్నాం. ఎక్కువమందితో కలిసి పండగలు జరుపుకునే పరిస్థితిలో లేము. ఇలాంటి సమయాల్లో ఒకరికోసం ఒకరు నిలబడదాం. మన కళ్లు కూడా ఆయుధమే – అదా శర్మ ► ప్రతీ ఒక్కరిలోనూ దుర్గాదేవి ఉంటుంది. కానీ కొందరు తెలుసుకోగలుగుతారు. కొందరికి తెలియదు.. అంతే. మన లోపల శక్తి దాగి ఉంటుంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు అదే బయటకు వస్తుంది. రావాలి కూడా. ► ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులు కావడం చూస్తుంటాం. ఒకరిని ఒకరు తక్కువ చేయడం తీసేయాలనుకుంటున్నాను. ఒక స్త్రీ మరో స్త్రీ కోసం నిలబడాలి. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ కలసి పైకి ఎదగాలి. ► చాలాసార్లు మారాను. కర్రను కూడా ఆయుధంగా చేసుకున్న సందర్భాలున్నాయి. కొన్నిసార్లు కళ్లను కూడా ఆయుధాలుగా మార్చుకోవచ్చు. ► దసరా పండగకి ఇంట్లోనే ఉంటున్నాను. ఇంటి ముందు రంగోలీ వేస్తాను. ఇంటిని పూలతో అలంకరిస్తాను. ఇష్టమైన వంటకాలు చేసుకుని తింటాము. అందుకే తొమ్మిది అవతారాలు – నభా నటేశ్ ► ప్రతి ఒక్కరికి తనలో ఉన్న ప్లస్, మైనస్ కచ్చితంగా తెలియాలి. వాళ్ల బలమేంటో తెలుసుకుని బలహీనతలను తొలగించుకోవటం కోసం ఫైట్ చెయ్యాలి. దుర్గాదేవి ప్రపంచంలోని అందరికీ సమానమే, అందరికీ అమ్మే. దుర్గాదేవి అంటే ప్రపంచానికే శక్తి. ఆమె తెచ్చిన విజయంతోనే ప్రపంచానికి వెలుగొచ్చింది. అందుకే ప్రతి ఒక్కరూ.. ముఖ్యంగా ఆడవాళ్లు ఏం చేయాలనుకుంటున్నారో, ఏం సాధించాలనుకుంటున్నారో తెలుసుకుని దానికోసం జీవితంలో కష్టపడాలి. దుర్గాదేవి చేసింది అదే. నాకు కావాల్సిందేంటో నాకు కచ్చితంగా తెలుసు, దానికోసం నేను అమ్మవారిలా ఫైట్ చేస్తాను. అదే నా బలం ఆనుకుంటాను. ► అమ్మవారు ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది రూపాల్లో తను సాధించాలనుకున్నది సాధించింది. అందుకే ఈ తొమ్మిది రోజులూ అమ్మవారిని తొమ్మిది రకాలుగా తయారుచేసి ఎంతో భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో ఉంచి పూజ చేస్తారు. నేను పుట్టి పెరిగింది శృంగేరిలో. దేశంలోని శారదా శక్తి పీఠాల్లో అది కూడా ఒకటి. నవరాత్రి సమయంలో గుళ్లో అమ్మవారిని రోజుకో రూపంలో ప్రత్యేకంగా అలంకరిస్తారు. నేను ప్రతిరోజూ గుడికి వెళ్లి ఆ అలంకారాలను చూసి భక్తితో మొక్కుతాను. ఆ అమ్మవారి అలంకారాలు ఎంత అందంగా ఉంటాయో మాటల్లో చెప్పలేను. చిన్నప్పుడు అలా గుడికి వెళ్లి ఆడుకుంటూ సెలబ్రేషన్స్‌లో పిల్లలందరం పాల్గొనేవాళ్లం. ఇప్పుడు అవన్నీ గుర్తుకు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇప్పటికీ పండగలంటే నాకు చాలా శ్రద్ధ. వీలు కుదిరినంతవరకూ పూజలు చేస్తుంటాను. మన యుద్ధం మనమే చేయాలి – రాశీ ఖన్నా ► మనందరిలోనూ దుర్గాదేవి అవతారం ఉంటుంది. ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితుల్ని చూస్తుంటే ఒక్కోసారి ఆ అవతారాన్ని బయటకు తీస్తేనే బతకగలం అనిపిస్తుంది. ఎప్పుడూ అమాయకంగా కూర్చోలేం కదా. కలియుగంలో మన యుద్ధం మనమే చేయాలి. ► మానభంగం, లింగ వివక్ష అనేది సమాజంలో లేకుండా చేయాలన్నది నా కోరిక. మన ఇష్టమొచ్చినప్పుడు, ఇష్టమొచ్చిన బట్టలు వేసుకొని బయటకు వెళ్లడానికి ఎందుకు భయపడాలి? అబ్బాయిలకు చిన్నప్పటి నుంచే అమ్మాయిల్ని ఎలా గౌరవించాలో నేర్పుదాం. రేప్ కేసుల్లో దోషుల మీద ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలి. ఇప్పటికీ సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నాం. లింగ బేధాలు లేకుండా సమాన అవకాశాలు ఇవ్వగలగాలి? ► నా కోసం నేను నిలబడాల్సిన పరిస్థితులు కొన్ని వచ్చాయి. నిలబడ్డాను. మా ఇంట్లో నాకు చిన్నప్పటినుంచీ ‘నీకు కావాల్సిన దానికోసం నువ్వు ఫైట్ చేయ్’ అని చెబుతూ వచ్చారు. ఏదైనా ఇష్యూ వస్తే నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడటానికే ఇష్టపడతాను. ముసుగులో మాట్లాడటానికి ఇష్టపడను. నాకోసం నేను నిలబడాల్సి వస్తే కచ్చితంగా ధైర్యంగా నిలబడతాను. ► చిన్నప్పటి నుంచి ఫ్యామిలీతోనే జరుపుకునేదాన్ని. కానీ సినిమాల్లోకి వచ్చాక పండగలకు ఇంట్లో ఉండటం తక్కువైంది. షూటింగ్స్ హడావిడిలో ఉంటాం. చిన్నప్పుడు అమ్మానాన్నలతో కలసి రామ్‌లీలా చూడటానికి మా ఇంటి (ఢిల్లీ) దగ్గర ఉన్న గ్రౌండ్‌కి వెళ్లేదాన్ని. మాది చాలా పెద్ద కుటుంబం. పండగ వస్తే చాలు అందరం కలిసే వాళ్లం. పని వల్ల హైదరబాద్‌లోనే ఉండిపోతే ఇవన్నీ గుర్తొస్తుంటాయి. అదే నా సూపర్ పవర్ – లావణ్యా త్రిపాఠి ► ఈ భూమ్మీద పుట్టిన ప్రతి స్త్రీలో దుర్గా మాత ఉంటుంది. అందుకే ప్రతి స్త్రీలో శక్తి దాగుందని నేను నమ్ముతాను. మగపిల్లలు సూపర్‌హీరోస్ అయినట్లే అమ్మాయిలు అవసరమొచ్చినప్పుడు ధైర్యంగా ఉండగలరు. అలాగే తమ గొంతును ప్రపంచానికి గట్టిగా వినిపించగలరు. తన అనుకున్నవారి కోసం నిలబడి ఫైట్ చేయగలరు. మనం చేయాల్సిందల్లా ఆడపిల్లలపై నమ్మకాన్ని ఉంచటం అంతే. నేను వ్యక్తిగతంగా దుర్గామాతను నమ్ముతాను, నన్ను నేను దుర్గగా అనుకుంటాను. దుర్గ అంటే కోపం, భయం, ప్రేమ మాత్రమే కాదు ఆలోచనాపరమైన శక్తిని ఇస్తుంది. ప్రతి ఒక్కరి గురించి ఆమె ఆలోచిస్తుందని నాకు అనిపిస్తుంది. ► మనకొచ్చే ప్రతి సమస్యకు కోపం పరిష్కారం కాదు. స్త్రీ అనే కాదు ప్రతి ఒక్కరూ యాంగర్ మేనేజ్మెంట్ చేయాలి. నేను చాలా కామ్‌గా, కూల్‌గా ఉంటాను. ఎంత కష్టమైన పరిస్థితులు వచ్చినా కూడా నెమ్మదిగా ఉంటాను. పరిష్కరించుకుంటాను కూడా. అదే నా సూపర్‌పవర్. నా కోపాన్ని ఎప్పుడూ నేను కంట్రోల్లో పెట్టుకుంటాను. ► మా ఇంట్లో చిన్నపిల్లలకు పండగ విశేషాలు చెప్పడం నా అలవాటు. నేను నా మేనకోడలికి కొంచెం క్రియేటివ్‌గా స్కెచ్‌తో బొమ్మలేసి, రాక్షస సంహారం ఎందుకు జరిగింది? దసరా పండగ ఎందుకు చేసుకుంటాం? అనే విషయాలు చెప్పాను. రాక్షసునిపై సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి చేసుకుంటాం అని చెప్పాను. అలా చెప్తేనే కదా మన సంస్కృతి సంప్రదాయాలు వృద్ధి చెందుతాయి. -
అవును... తప్పుకున్నాను
‘విజయ్ సేతుపతి నటిస్తున్న ‘తుగ్లక్ దర్బార్’ సినిమాలో నేను నటించడం లేదు’ అని హీరోయిన్ అదితీ రావ్ హైదరీ తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘కరోనా వల్ల భారతీయ చలన చిత్రపరిశ్రమతో సహా ప్రపంచ సినీ లోకమే గత ఎనిమిది నెలలుగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దశలవారీగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్స్‌ను మొదలుపెట్టారు. షూటింగ్ ప్రారంభించిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇంకా ప్రారంభించని ప్రాజెక్ట్‌లు కూడా నా వల్ల ఆలస్యం కాకూడదనుకుంటున్నాను. ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల నిర్మాత, సెవెన్ స్క్రీన్ స్టూడియోకు చెందిన లలిత్ కుమార్ నిర్మాణంలో విజయ్ సేతుపతి హీరోగా డిల్లీ ప్రసాద్ దర్శకత్వంలో రానున్న ‘తుగ్లక్ దర్బార్’ నుండి తప్పకుంటున్నాను. ఈ చిత్రబృందానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. నేను చేయాల్సిన పాత్రను చేయబోతున్న రాశీ ఖన్నాకు ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు అదితీ రావ్ హైదరీ. -
రిమ్ జిమ్.. జిమ్..
హీరోయిన్లు మెరుపుతీగలు. ఎప్పుడూ నాజూకుగానే ఉండాలి. స్క్రీన్ మీద స్లిమ్‌గా కనిపించాలి. జీరో సైజ్‌తో సందడి చేయాలి. హీరోయిన్లు అంటే ఇలానే ఉండాలని ప్రేక్షకులు ఏర్పరుచుకున్న అభిప్రాయాలు. వాటిని నిలబెట్టుకోవడానికి హీరోయిన్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఇష్టమైన వాటికి నో చెప్పాల్సి ఉంటుంది. నోరు కట్టేసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గడానికి జిమ్‌లో బరువులు ఎత్తాల్సి ఉంటుంది. అయితే ఇవేం కష్టం కాదంటున్నారు కొందరు హీరోయిన్లు. ఫిట్నెస్ మీద శ్రద్ధ చూపిస్తున్నారు. రిమ్ జిమ్ అంటూ ఉల్లాసంగా జిమ్‌లో కసరత్తులలో మునిగిపోయిన హీరోయిన్ల వివరాలు చూద్దాం. ‘మన శరీరాన్ని సరైన షేప్‌లో ఉంచేది మన కష్టం కాదు.. మన మెదడు. దాన్ని శ్రద్ధగా, ఫోకస్‌గా ఉంచితే ఏదైనా చేయొచ్చు. ఫోకస్ ఎక్కడుంటుందో ఎనర్జీ కూడా అక్కడే ఉంటుంది’ అంటారు రాశీ ఖన్నా. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను, ఫోటోలను కూడా షేర్ చేశారామె. ప్రస్తుతం వెయిట్‌ను కంట్రోల్లో పెట్టే పనిలో పడ్డారు పాయల్ రాజ్‌పుత్. 63 కేజీల నుంచి 58 కేజీల వరకూ వచ్చారట ఆమె. ‘ఈ ప్రయాణం ఎంత వరకూ సాగుతుందో చూద్దాం. మెల్లిగా అయినా నేను అనుకున్న గోల్ చేరతాను’ అంటూ కొత్త లుక్ ఫోటోలను షేర్ చేశారు పాయల్ రాజ్‌పుత్. ‘మన బలం, బలహీనత రెండూ మన మెదడే. దాన్ని సరిగ్గా ట్రైన్ చేస్తే చాలు. ఫిజికల్ ట్రైనింగ్ ఈజీగా చేసేయొచ్చు’ అంటారు సమంత. ఆమె ఇన్స్టాగ్రామ్ చూస్తే చాలు సమంత వర్కౌట్స్ అస్సలు మిస్ కారని అర్థం చేసుకోవచ్చు. ‘మనకు 24 గంటలున్నాయి. అందులో ఒక్క గంట అయినా శరీరం మీద దృష్టి పెట్టడానికి ఉపయోగించాలి’ అంటారు రష్మికా మందన్నా. ‘శరీరాన్ని తరచూ కదిలిస్తే మనం చెప్పిన మాట వింటుంది’ అంటారు రకుల్ ప్రీత్ సింగ్. ‘ఫిట్‌నెస్‌లో కావాల్సింది స్పీడ్ కాదు.. శ్రద్ధ. రోజూ ఎంత శ్రద్ధగా చేస్తున్నాం అనేది ముఖ్యం’ అంటారు లావణ్యా త్రిపాఠి. వీళ్లందరూ షేర్ చేసిన ఫోటోలను పక్కన చూడొచ్చు. -
వెబ్ సిరీస్‌లో...
సమంత, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ వంటి కథానాయికలు ఇప్పటికే డిజిటల్ రంగంవైపు అడుగులు వేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి రాశీ ఖన్నా కూడా చేరనున్నారని టాక్. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రెండు మూడు సినిమాలు అంగీకరించారామె. తాజాగా ఓ వెబ్ సిరీస్ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. ఆ వెబ్ సిరీస్ లైన్ బాగా నచ్చిందని, చిత్రీకరణలో పాల్గొనడానికి రాశీ ఖన్నా ఆసక్తిగా ఉన్నారని తెలిసింది. -
నాన్న చెప్పినవి ఫాలో అవుతున్నా
‘‘ఏ అమ్మాయికైనా తండ్రిలో ఫ్రెండ్ కనబడితే ఆ అమ్మాయి చాలా లక్కీ అని నా ఫీలింగ్. మా నాన్న అలాంటివారే’’ అంటున్నారు రాశీ ఖన్నా. తన తండ్రి ‘రాజ్ ఖన్నా’ గురించి ఆమె ఈ విధంగా చెప్పుకొచ్చారు. ► నా జీవితం మీద మా నాన్నగారి ప్రభావం చాలా ఉంది. ఎదుటి వ్యక్తులతో ఎలా మాట్లాడాలి? అనేది ఆయన్నుంచే నేర్చుకున్నాను. ఓపిక, మంచితనం, ఎదుటి వ్యక్తులకు గౌరవం ఇవ్వడం... అన్ని విషయాల గురించి నాన్న నా చిన్నప్పుడే చెప్పారు. ఇవాళ నేను నలుగురిలో మంచి పేరు తెచ్చుకోగలుగుతున్నానంటే ఆయనే కారణం. ► నా చిన్నప్పుడు నాన్న చాలా స్ట్రిక్ట్. అందుకని భయంగా ఉండేది. కానీ నేను పెరిగేకొద్దీ నాన్న ఫ్రెండ్లీ అయ్యారు. ఇప్పుడు నేను దేని గురించైనా నాన్నతో మాట్లాడగలిగేంత చనువు ఉంది. మనం అమ్మానాన్నలతో చెప్పుకోలేనివి ఫ్రెండ్స్‌తో చెప్పుకోవచ్చంటారు. నాకు అలాంటి మంచి ఫ్రెండ్ మా నాన్న. కొన్ని నిర్ణయాలు తీసుకోలేనప్పుడు నేను ఆయన సలహా అడుగుతాను. ► యాక్చువల్లీ మా నాన్న మంచి ఫ్యామిలీమేన్. తన భార్యను బాగా చూసుకుంటారు. కూతురంటే చాలా ప్రేమ. మొత్తం ఫ్యామిలీకి ఓ పిల్లర్ ఆయన. ఇలాంటి తండ్రికి కూతురిని కావడం ఆ దేవుడి ఆశీర్వాదమే అనుకుంటున్నాను. ► ఫాదర్స్ డే అంటే మా డిన్నర్ బయటే. తీరికగా కబుర్లు చెప్పుకుంటూ, నచ్చిన ఫుడ్ తింటూ బాగా ఎంజాయ్ చేస్తాం. లాక్డౌన్ వల్ల బయటి ఫుడ్ నో. అందుకే మా నాన్న కోసం నేను స్పెషల్‌గా కేక్ తయారు చేస్తున్నాను. ► మనం ఎవరినైనా సంతోషపెట్టాలంటే పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వనవసరంలేదు. వాళ్ల కోసం మనం చేసే చిన్న చిన్న పనులు కూడా వాళ్లను సంతోషపరుస్తాయని నాన్న అంటుంటారు. ఆయన చెప్పినవి ఫాలో అవుతున్నాను. నాన్నకు నేను కేక్ చేయడం అనేది చాలా చిన్న విషయం. కానీ కూతురు చేసిన కేక్ కాబట్టి నాన్న చాలా ఆనందపడతారు. మా నాన్న ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఈ ‘ఫాదర్స్ డే’ సందర్భంగా కోరుకుంటున్నాను. -
నిర్మాతలకు సహకరిద్దాం
‘‘నిర్మాతలు బావుంటేనే సినిమా ఇండస్ట్రీ బావుంటుంది. కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోయి సినిమాలు ప్రారంభమయ్యాక నిర్మాతలకు సహకరిద్దాం’’ అని కోరుతున్నారు తమిళ దర్శకుడు హరి. సూర్యతో ఆరు, ‘సింగం’ సిరీస్, విక్రమ్‌తో సామి, సామి స్క్వేర్ వంటి చిత్రాలను తెరకెక్కించారు హరి. ప్రస్తుతం మరోసారి సూర్యతో ఓ సినిమా చేయనున్నారు. గ్రీన్ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘అరువా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రాశీ ఖన్నా హీరోయిన్. నిర్మాతలకు సహాయపడటం కోసం ఈ సినిమాకు హరి పారితోషికానీ 25 శాతం తగ్గించుకోనున్నారట. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారాయన. ఇలా చేస్తే నిర్మాతలకు సహాయపడినట్టు ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే తమిళ హీరో హరీష్ కల్యాణ్ (‘జెర్సీ’లో నాని కుమారుడిగా నటించారు) కూడా తన పారితోషికాన్ని తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితమే తమిళ నటుడు విజయ్ ఆంటోనీ కూడా తన రెమ్యూనరేషన్లో 25 శాతం తగ్గించుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
లాక్డౌన్
ఉన్నవాటిని గౌరవిద్దాం - రాశీఖన్నా ‘‘మన దగ్గర ఉన్నవాటితో సంతృప్తి చెందాలనే విషయాన్ని ఈ లాక్ డౌన్ నేర్పింది’’ అంటున్నారు రాశీఖన్నా. లాక్ డౌన్‌ని ఎలా గడుపుతున్నారో రాశీ చెప్పారు. ♦ మన దగ్గర ఉన్నవాటిని గౌరవిద్దాం. మరీ ముఖ్యంగా ప్లేట్లో ఉన్న ఫుడ్‌ని గౌరవించాలి. అన్ని వసతులు ఉన్నవాళ్లు చాలా అదృష్టవంతులు. కానీ అదృష్టాన్ని ఇష్టానుసారంగా తీసుకుంటాం. గౌరవించడంలేదు. గౌరవించాలనే విషయాన్ని ఈ లాక్ డౌన్ నేర్పింది. ♦ ఇప్పుడు నా ఆలోచనలు చాలా ఆధ్యాత్మికంగా మారాయి. ఇంట్లో టీవీలు చూస్తూ, పేపర్లు చదువుతూ ఉండిపోవడంలేదు. వంట చేస్తున్నాను. గార్డెనింగ్‌కి టైమ్ కేటాయిస్తున్నాను. ఇల్లు శుభ్రం చేస్తున్నాను. తమిళం నేర్చుకుంటున్నాను. ధ్యానం చేస్తున్నాను. ♦ లాక్ డౌన్ పూర్తయ్యేలోగా గిటార్ పూర్తిగా నేర్చుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే రోజూ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆన్లైన్లో అల్లికలు నేర్చుకుంటున్నాను – నమ్రతా మహేష్ ‘‘లాక్డౌన్ వల్ల ఆలోచించుకోవడానికి నాకు చాలా సమయం దొరికినట్లయింది. రోజులో కొంత సమయాన్ని ఆత్మపరిశీలన కోసం కేటాయిస్తున్నాను. మన కుటుంబం మనందరికీ చాలా ముఖ్యమైనది. కుటుంబంతో మనం సరదాగా గడిపే చిన్న చిన్న విషయాలు, సంఘటనలు చాలా సంతోషాన్నిస్తాయి. జ్ఞాపకాలుగా మిగిలి పోతాయి’’ అన్నారు నమ్రతా మహేష్. ఇంకా లాక్డౌన్ సమయాన్ని ఎలా గడుపుతున్నారో ఈ విధంగా చెప్పారు. ♦ పిల్లల్ని (కుమారుడు గౌతమ్, కుమార్తె సితార) చదివించడం, వారితో సరదా సమయాన్ని గడపడం, నేను పుస్తకాలు చదవడం, టీవీ చూడటం, వ్యాయామం చేయడం, సమయానికి భోజనం చేస్తూ వీలైనంత తొందరగా రాత్రివేళ నిద్రపోవడం.. ఇప్పుడు మా డైలీ లైఫ్ ఉంది. ♦ కొత్త విషయాలను నేర్చుకోవడానికి నేనెప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాను. ప్రస్తుతం ఈ లాక్డౌన్ సమయంలో ఓ ఫ్రెండ్ సాయంతో ఆన్లైన్లో అల్లికలు నేర్చుకుంటున్నాను. లాక్ డౌన్లో ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ గడుపుతున్నారు మహేష్ బాబు. పిల్లలతో సరదాగా ఆటలు ఆడుతున్నారు. మహేష్‌కి ఆయన కూతురు సితార హెడ్ మసాజ్ చేస్తున్న ఫొటోను నమ్రత షేర్ చేశారు. ‘‘నాన్నకు హెడ్ మసాజ్ చేశాను. తనకు చాలా నచ్చింది’’ అని మురిసిపోతూ తన ఇన్‌స్టా గ్రామ్‌లో రాసుకొచ్చింది సితార. మహేష్, సితార -
రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటోస్
-
నీకిది తగునా... ఇకపై హద్దుమీరను..
సాక్షి, చెన్నై: ‘అందాల ఆరబోతలో హద్దు మీరను’ అంటోంది హీరోయిన్ రాశీఖన్నా. ‘ఇమైకా నొడిగళ్’ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ తరువాత జయం రవికి జంటగా ‘అడంగమరు’, విజయ్‌సేతుపతితో ‘సంఘతమిళన్’ వంటి సక్సెఫుల్ చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం సుందర్.సి దర్శకత్వంలో అరణ్మణ్నై-3 చిత్రంలో నటిస్తోంది. త్వరలో దళపతి విజయ్‌తో నటించే అవకాశం తనకు రానుందనే ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఈ అమ్మడు తెలుగులో విజయ్‌దేవరకొండకు జంటగా నటించిన వరల్ట్ ఫేమస్ లవర్ చిత్రంలో అందాలను విచ్చలవిడిగా ఆరబోసిందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు స్పందించిన రాశీఖన్నా తానిప్పుడు కథానాయకిగా మంచి స్థాయికి చేరుకున్నానంది. ఇకపై తన చిత్రాల కలెక్షన్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో అందాల ఆరబోతలో హద్దులు దాటినట్లు, ఇది మీకు అవసరమా అని అందరూ ప్రశ్నిస్తున్నారని.. ప్రస్తుతం తాను హీరోయిన్గా మంచి స్థాయికి చేరుకున్న కారణంగా ఇకపై నటిగా మరో మెట్టు ఎక్కేందుకు ఉపయోగపడే పాత్రలనే ఎంచుకుంటానని తెలిపింది. అందుకే ఇకపై గ్లామర్ విషయంలో హద్దులు మీరనని చెప్పుకొచ్చింది. (‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ రివ్యూ) అదే విధంగా మహిళల పాత్రలను కించపరచేవిధంగా తన చిత్రాల్లో చూపించినా సహించనని ఈ అమ్మడు స్పష్టం చేసింది. అలాంటి సన్నివేశాలు తాను నటించే సినిమాలో ఉన్నట్లయితే.. అవి నిజంగా అవసరమా అని దర్శకులను నేరుగానే ప్రశ్నిస్తానని చెప్పింది. కొన్ని సమయాల్లో తాను చెప్పిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటారని, కొన్ని సమయాల్లో కథకు అవసరం అని వాదిస్తారని అంది. ఏదేమైనా తన అభిప్రాయాన్ని మాత్రం కచ్చితంగా చెబుతానని రాశీ స్పష్టం చేసింది. అయితే ఆమె.. ఈ మాటలు చెబుతున్నది ప్రచారం కోసమేనా.. లేదా నిజంగానే మహిళల గౌరవం కోసమేనా అన్నది వేచి చూడాలి. అయినా ఇలా ఇంతకు ముందు చాలా మంది హీరోయిన్లు... గ్లామర్ పాత్రల విషయంలో ఇలాగే మాట్లాడారు. అయితే వాటిని పాటించడంలోనే నిజాయితీ కనిపించలేదు. ఒకటి మాత్రం నిజం... ఎవరు ఏం చెప్పినా, ఏం చేసినా అవకాశాలు చేతిలో ఉన్నంత వరకే. ప్రస్తుతం రాశీఖన్నాకు తెలుగు, తమిళ భాషల్లో బాగానే డిమాండ్ ఉంది కాబట్టి తాను ఏం చెప్పినా అభిమానులు నమ్ముతారని అనుకుంటోందని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. (రాశీ ఖన్నా బెదిరించేది) -
‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ రివ్యూ
-
‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ రివ్యూ
టైటిల్: వరల్డ్ ఫేమస్ లవర్ జానర్: లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా నటీనటులు: విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా, క్యాథరిన్, ఇజబెల్లా, ఐశ్వర్య రాజేశ్ దర్శకత్వం: క్రాంతి మాధవ్ సంగీతం: గోపీ సుందర్ నిర్మాతలు: కేఏ వల్లభ, కేఎస్ రామారావు నిడివి: 155.37 నిమిషాలు టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఫీల్‌గుడ్ చిత్రాల డైరెక్టర్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. టైటిల్ ప్రకటించినప్పట్నుంచి ఈ చిత్రంపై అందరిలోనూ పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ చిత్రంలో రాశీ ఖన్నా, క్యాథరిన్, ఇజబెల్లా, ఐశ్వర్య రాజేశ్ వంటి నలుగురు హీరోయిన్లు నటించడంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇక మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇదే తన చివరి లవ్ స్టోరీ అని విజయ్ దేవరకొండ ప్రకటించడంతో ‘వరల్డ్ ఫేమస్ లవర్’పై అందరి చూపు పడింది. ఇన్ని అంచనాల నడుమ ప్రేమికుల రోజు కానుకగా శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. మరి అందరి అంచనాలను ఈ చిత్రం నిలబెట్టిందా? ఈ సినిమాతో విజయ్ సిక్సర్ కొట్టాడా? లేక క్లీన్‌బౌల్డ్ అయ్యాడా? అనేది మన సినిమా రివ్యూలో చూద్దాం. కథ: ఒంటి నిండా గాయాలతో చెదిరిన జట్టు మాసిన గడ్డంతో హీరో జైల్లో ఉన్న సీన్‌తో ఈ సినిమా కథ ప్రారంభమవుతుంది. ప్రతీ ఒక్క మనిషికి ఒక కథ ఉంటుంది.. తనకూ ఓ కథ ఉంటుంది అంటూ హీరో తన కథ చెప్పడం, రాయడం ప్రారంభిస్తాడు. హైదరాబాద్, ఇల్లందు, ప్యారిస్‌ల చుట్టు హీరో కథ తిరుగుతుంది. ఈ కథలో ఎన్నో మార్పులు, ఊహించని ఎన్నో మలుపులు చివరికి అందరూ కోరుకునే ముగింపుతోనే సినిమాకు ఎండ్ కార్డు పడుతుంది. అసలు కథ ఏంటో, ట్విస్టులు ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. గూగుల్ మ్యాప్ కూడా చూపెట్టని ఓ అడ్రస్ కోసం హైదరాబాద్ గల్లీల్లో తిరుగుతూ అవస్త పడుతున్న యామిని (రాశీ ఖన్నా)కి గౌతమ్ (విజయ్ దేవరకొండ) తారసపడతాడు. అడ్రస్ చూపించడంతో పాటు తన మనుసును కూడా యామినికి గౌతమ్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత యామిని కూడా గౌతమ్ ప్రేమలో పడిపోతుంది. చిన్నప్పట్నుంచి రచయిత కావాలనేది గౌతమ్ డ్రీమ్. అయితే యామిని చెప్పిన ఒకే ఒక్క మాట కోసం గౌతమ్ ఉద్యోగం చేస్తాడు. అలా నాలుగేళ్ల ప్రేమ.. ఏడాదిన్నర సహజీనంతో వారిద్దరి జీవితం సాఫీ సాగిపోతున్న తరుణంలో గౌతమ్‌కు యామిని బ్రేకప్ చెబుతుంది. ఎందుకు బ్రేకప్ చెబుతుంది? అసలు ఈ కథలోకి సువర్ణ(ఐశ్వర్య రాజేశ్), స్మిత(క్యాథరీన్), ఈజ(ఇజాబెల్లే)లు ఎందుకు ఎంటర్ అయ్యారు? గౌతమ్ సీనయ్యగా ఎందుకు మారాడు? అసలు గౌతమ్ ఎందుకు ప్యారిస్ వెళ్లాడు? గౌతమ్ చివరికి రైటర్ అయ్యాడా? గౌతమ్ యామినిలు చివరికి కలుసుకున్నారా అనేదే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా కథ. నటీనటులు: వన్ మ్యాన్ షో, అతడే ఒక సైన్యం, ఒకే ఒక్కడు ఇలా ఎన్ని చెప్పినా విజయ్ దేవరకొండ గురించి తక్కువే అవుతుంది. సినిమాకు ప్రాణం పోశాడు. గౌతమ్, శ్రీను పాత్రలలో విజయ్ తప్ప మరో హీరోను కలలో కూడా ఊహించని విధంగా మెస్మరైజ్ చేశాడు. అక్కడక్కడా అర్జున్‌రెడ్డి ఫ్లేవర్ కనిపించినా ఆకట్టుకుంటుంది. కామెడీ, ఎమోషన్, కోపం, ప్రేమ, బాధ ఇలా అన్ని కోణాలను విజయ్ తన నటనలో చూపించాడు. హీరో తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది రాశీ ఖన్నా గురించి. కొన్ని సన్ని వేశాలలో అందంతో ఆకట్టుకోగా.. మరికొన్ని చోట్ల ఏడిపించేసింది. కథా ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంపిక చేసుకుంటున్న మరో నటి ఐశ్వర్యా రాజేశ్. సువర్ణ అనే డీ గ్లామర్, మధ్య తరగతి గృహిణి పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. క్యాథరీన్, ఇజాలకు నటనపరంగా కంటే తమ అందాలతో కుర్రకారును కట్టిపడేశారు. కొన్ని చోట్ల సైదులు(మై విలేజ్ షో అనిల్) తనదైన రీతిలో నవ్వించగా.. గౌతమ్ స్నేహితుడిగా ప్రియదర్శి ఆకట్టుకున్నాడు. విశ్లేషణ: ‘ప్రేమ అంటే ఓ సాక్రిఫైస్, కాంప్రమైజ్.. ప్రేమలో దైవత్వం ఉంటుంది’అనే ఓ చిన్న లైన్ పట్టుకొని పూర్తి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు క్రాంతి మాధవ్. జైలు సీన్.. ఆ తర్వాత రాశీ ఖన్నా, విజయ్ దేవరకొండల మధ్య సీన్లతో సినిమా కథను మెల్లగా ఆరంభించాడు దర్శకుడు. సినిమా మొదలైన కాసేపటికి అసలు కథేంటో సగటు ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. హీరో సాధారణ ఎంట్రీ, హీరోయిన్స్‌తో రొమాన్స్, లవ్ సీన్స్, ఇల్లందు ఎపిసోడ్‌తో ఫస్టాఫ్ అంతా అలా సాదా సీదాగా సాగిపోయింది. అయితే విజయ్, ఐశ్యర్యల మధ్య వచ్చే కొన్ని సీన్లు రియాలిస్టిక్‌గా ఉంటాయి. మన ఇంట్లో, మన ఊళ్లో జరిగిన, చూసిన విధంగా ఉంటాయి. ఇక సెకండాఫ్‌లో డైరెక్టర్ పూర్తిగా తేలిపోయాడు. కథను ఏ కోణంలో రక్తికట్టించలేకపోయాడు. బోరింగ్, సాగదీత సీన్లు థియేటర్లో ఉన్న ప్రేక్షకుడి ఓపికకు పరీక్ష పెట్టేలా ఉంటాయి. కొన్ని ఎమోషన్ సీన్లు కట్టిపడేసేల ఉంటాయి. అంతేకాకుండా ప్రీ క్లైమాక్స్‌కు ముందు విజయ్ ఇచ్చే స్పీచ్ సినిమాను నిలబెట్టే విధంగా ఉంటుందనుకున్న తరుణంలో.. అర్జున్‌రెడ్డి క్లైమాక్స్‌తో దర్శకుడు సినిమాను ముగిస్తాడు. అయితే కథ కొత్తగా, వినూత్నంగా ఉంది. సీన్లు కూడా బాగున్నాయి. విజయ్ దేవరకొండ నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది. అయినా ఎక్కడా కూడా ప్రేక్షకుడికి ఈ సినిమా కనెక్ట్ కాలేదు. దర్శకుడు తన ప్రతిభను, మ్యాజిక్‌ను తెరపై పర్ఫెక్ట్గా చూపించడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. ఇక సాంకేతిక విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హీరో, హీరోయిన్లను చాలా అందంగా చూపించారు. స్క్రీన్ ప్లే గజిబిజీగా కాకుండా సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఎడిటింగ్‌పై కాస్త దృష్టి పెట్టి కొన్ని సీన్లకు కత్తెర వేయాల్సింది. పాటలు ఓ మోస్తారుగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల మెస్మరైజ్ చేసేలా ఉంటుంది. క్రాంతి మాధవ్ అందించిన మాటలు ఆకట్టుకుంటాయి. ‘కలం కాగితం లేకుండా ప్రపంచ చచ్చిపోతుంది, రాయడం అంటే రచయిత తన ఆత్మను పంచడం, ప్రపంచ బాధలను తన బాధలుగా భావించి రచయిత రాయడం ప్రారంభిస్తాడు’ అంటూ చెప్పే డైలాగ్‌లు ఆలోచించే విధంగా ఉంటాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదని సినిమాను తెరపై చూస్తే అర్థమవుతుంది. చివరగా సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ప్రేక్షకుడికి కనెక్ట్ కాకపోయినా విజయ్ దేవరకొండ కనెక్ట్ అయ్యాడు. ప్లస్ పాయింట్స్: విజయ్ దేవరకొండ నటన ఇల్లందు ఎపిసోడ్ కాన్సెప్ట్ మైనస్ పాయింట్స్ సాగదీత, బోరింగ్ సీన్లు సినిమా నిడివి దర్శకత్వ లోపం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
రాశీ ఖన్నా బెదిరించేది
‘‘నా సినిమాలకి బజ్ ఉండేది మీవల్లే (అభిమానులు) అని నాకు అర్థమైంది. మీ రౌడీస్ వల్ల, తెలుగు సినిమా ప్రేక్షకుల వల్ల ఈ బజ్ క్రియేట్ అవుతోంది. నేను నటించిన ఏ సినిమాకి వెళ్లినా మీకు ఒక కొత్త అనుభూతి ఉంటుందని గ్యారంటీ ఇస్తున్నా. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కూడా మీకొక కొత్త అనుభూతి ఇస్తుంది’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్, ఇజాబెల్లే లెయితే హీరోయిన్లుగా నటించారు. కె.ఎస్. రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. వైజాగ్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘నేను ముంబైలో షూటింగులో ఉండటం వల్ల ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాకి ఎక్కువగా ప్రమోట్ చెయ్యలేదు. రాశీఖన్నా అయితే ‘నువ్వు రావాలి, బజ్ క్రియేట్ చెయ్యాలి, హైప్ క్రియేట్ చెయ్యాలి’ అని రోజూ ఫోన్ చేస్తూ నన్ను బెదిరిస్తూ వచ్చింది. ఈ సినిమా ఏమవుతుందో నాకు తెలియదు. మీరే చెప్పాలి’’ అన్నారు. ‘‘మా నాన్నగారు ‘అభిలాష’, ‘ఛాలెంజ్’ లాంటి సినిమాలు వైజాగ్‌లో తీశారు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వేడుకకి ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు కె.ఎ. వల్లభ. ‘‘మిమ్మల్ని ఎంటర్టైన్ చెయ్యడానికి విజయ్ దేవరకొండ నలుగురు అమ్మాయిలతో ఈ సినిమా చేశాడు. థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చెయ్యండి’’ అన్నారు క్రాంతి మాధవ్. ‘‘ఈ సినిమా వాస్తవానికి దగ్గరగా ఉంటుంది’’ అన్నారు రాశీ ఖన్నా. -
మీ లవ్.. నా లక్!
‘అవధుల్లేని మీ అభిమానం నేను జీవితంలో పొందిన పెద్ద అదృష్టం. ఇంతమంది అభిమానులు ఉండడం నాకు లభించిన చాలా పెద్ద బహుమతి’ అని ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలను బుధవారం గురజాడ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు) : ‘అవధుల్లేని మీ అభిమానం నేను జీవితంలో పొందిన పెద్ద అదృష్టం. ఇంతమంది అభిమానులు ఉండడం నాకు లభించిన చాలా పెద్ద బహుమతి’ అని ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలను బుధవారం గురజాడ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో హాజరైన అభిమానులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తన కోసం వెల్లువలా వస్తున్న అభిమానులను చూస్తే మనసు ఉప్పొంగిపోతుందని తెలిపారు. ‘నాకోసం వస్తున్నారు. నాకోసం థియేటర్స్ నింపుతున్నారు. ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్న అభిమానులు ఉండడం ఎంత అదృష్టం. అందుకే వారిని చూసినప్పుడు కౌగిలించుకోవాలని అనిపిస్తుంది.’ అని చెప్పారు. తన సినిమాపై క్రేజ్ ఉండటానికి కారణం రౌడీస్ అభిమానులని తెలిపారు. తన ప్రతి సినిమాలో కొత్తదనం కనిపిస్తుందన్నారు. అభిమానులతో రాశీఖన్నా సెల్ఫీ కొత్తదనం కోసమే తాను ఆరాటపడతానని తెలిపారు. నాలుగు ప్రేమ కథలు కలిపి తీర్చిదిద్దిన ఈ సినిమా మీ ముందుకు వస్తోంది. ఆదరించండి.’ అని కొరారు. ఈ సందర్భంగా అభిమానులకు రౌడీ హగ్‌లు, ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చారు. హీరోయిన్ రాశీ ఖన్నా మాట్లాడుతూ ఈ చిత్రంలో విజయ్ చాలా బాగా నటించారని కితాబిచ్చారు. నిజ జీవితంలో ప్రేమ ఎలా ఉంటుందో ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులు తెలుసుకోవచ్చని తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను చూడడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. డైరెక్టర్ క్రాంతి మాధవ్ మాట్లాడుతూ ‘మళ్లీమళ్లీ ఇది రాని రోజు’ షూటింగ్ వైజాగ్‌లోనే చేశామని గుర్తు చేసుకున్నారు. వైజాగ్ ప్రజలు చాలా మంచి మనసున్నవారని కొనియాడారు.. ‘వైజాగ్ వండర్ఫుల్ సిటీ, చాలా అందమైన జ్ఞాపకాలను అందించిన నగర.’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు వల్లభ, కిందు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ లుక్‌లో విజయ్.. హీరో విజయదేవరకొండ లుంగీ కట్టుకుని, టవల్ తలకు చుట్టుకొని ఈ వేడుకల్లో పాల్గొని ప్రేక్షకులను మైమరపించారు. లుంగీతో స్టేజ్ పైకి వచ్చిన విజయ్ దేవరకొండను చూసి అభిమానుల కేకలు, అరుపులతో గురజాడ కళాక్షేత్రం దద్దరిల్లింది. వేడుకలో భాగంగా ప్రదర్శించిన నాట్యాలు అందరినీ ఆహ్లాదంలో ముంచెత్తాయి. -
'రాశి'బాగుంది..
సినిమా : నటి రాశీఖన్నా రాశి బాగుంది. ఆమె రాశి బాగుండబట్టే కదా తెలుగు, తమిళ భాషల్లో నాయకిగా రాణిస్తోంది అని అంటారా? అదీ కరెక్టే కానీ కోలీవుడ్‌లో ఇప్పుడు ఆమె టైమ్ ఇంకా బాగుంది. కారణం ఇళయదళపతితో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఇంతకు ముందు జయంరవికి జంటగా అడంగమరు, అధర్య సరసన ఇమైకా నొడిగళ్, విజయ్‌సేతుపతితో సంఘతమిళన్ వంటి చిత్రాల్లో రాశీఖన్నా నటించింది. ఆ చిత్రాలు మంచి సక్సెస్‌నే అందుకున్నాయి. ప్రస్తుతం సిద్ధార్థ్‌కు జంటగా సైతాన్ కా బచ్చా, సుందర్.సీ దర్శకత్వంలో అరణ్మణై 3 చిత్రాల్లో నటిస్తోంది. ఇక తెలుగులో విజయ్‌దేవరకొండతో జత కట్టిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఈ నెల 14న తెరపైకి రానుంది. అయితే కోలీవుడ్‌లో ప్రముఖ స్టార్‌తో నటించే అవకాశం రాలేదు. కాగా విజయ్ వంటి స్టార్‌తో నటించే అవకాశం వస్తే ఆ స్టార్డమ్నే వేరు. అలాంటి క్రేజీ ఆఫర్‌ను రాశీఖన్నా కొట్టేసిందన్నది తాజా సమాచారం. విజయ్ ప్రస్తుతం మాస్టర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మలయాళ నటి మాళవికామోహన్ నటిస్తోంది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం ఫైట్ సన్నివేశాలను చెన్నైలో చిత్రీకరిస్తున్నారు. చిత్రాన్ని సమ్మర్లో విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా విజయ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుందని సమాచారం. అదే విధంగా అరుణ్‌రాజ్ కామరాజ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఇందులో విజయ్‌కు జంటగా నటి రాశీఖన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం. మరో ముఖ్య పాత్రలో ఐశ్వర్యరాజేశ్ నటించనున్నట్లు తెలిసింది. ఇందులో ఆమె విజయ్‌కి చెల్లెలుగా నటించనున్నట్లు సమాచారం. అయితే ఇటీవలే ఈ అమ్మడు ఎవరికి చెల్లెలిగానైనా నటిస్తాను కానీ విజయ్‌కు చెల్లెలిగా నటించనని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పుడు అలాంటి పాత్రనే విజయ్‌తో నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి దీనికి ఏం చెప్పి సమర్ధించుకుంటుందో ఐశ్వర్యరాజేశ్. కాగా ఇంతకు ముందు కూడా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఎంగవీట్టు పిళ్లై చిత్రంలో ఈ అమ్మడు శివకార్తీకేయన్‌కు చెల్లెలిగా నటించింది. మాస్టర్ చిత్ర షూటింగ్ పూర్తి కాగానే తాజా చిత్రానికి విజయ్ రెడీ అవుతారని తెలిసింది. దీనికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా విజయ్ నటించనున్న 65వ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
నేను సిక్స్ కొట్టాలనే దిగుతా
‘‘చాలామంది దగ్గర తెలివితేటలు, ప్రతిభ ఉంటాయి. కానీ స్వచ్ఛమైన ప్రతిభ, మంచితనం, తెలివితేటలు కలిపి ఉన్న మనిషి విజయ్. అతని ప్రయాణం ప్రారంభ దశలోనే ఉంది. భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని ఆశిస్తున్నా’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లు. కె.ఎస్. రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఒకనాడు నేను ఈర్ష్య పడేంత ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు. సినిమాని ఆయన ప్రేమించినంతగా నేను ప్రేమిస్తానా? అని నాకే ఒక్కోసారి సందేహం వస్తుంటుంది’’ అన్నారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘అప్పట్లో చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్స్ సినిమాలని తీశారు రామారావుగారు. మళ్లీ అంతకు మించిన హిట్ ఈ సినిమా ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘నేను, కేఎస్ రామారావు విజయవాడ నుంచి ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. ఒక నిర్మాతగా ఆయనతో పోటీపడేవాణ్ని. మా సంస్థ నుంచి వచ్చిన ఒక ఆణిముత్యం విజయ్’’ అన్నారు నిర్మాత సి. అశ్వినీదత్. ‘‘ఈ సినిమాతో విజయ్ మరోసారి అందర్నీ అలరిస్తాడని ఆశిస్తున్నా’’ అన్నారు నిర్మాత డి. సురేష్ బాబు. ‘‘అర్జున్ రెడ్డి’కి ముందు, ‘అర్జున్ రెడ్డి’కి తర్వాత అనేలా విజయ్ కెరీర్ నడుస్తోంది. తన ఫ్యాన్స్, ప్రేక్షకులకు వినోదం కావాలని కోరుకుంటాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కథ రాశా’’ అన్నారు క్రాంతిమాధవ్. ‘‘విజయ్ ఎనర్జీ ప్రతి ఫ్రేములో కనిపిస్తుంది. విజయ్, రాశీ ఖన్నా పోటాపోటీగా నటించారు’’ అన్నారు కేఎస్ రామారావు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘2016లో ‘పెళ్ళిచూపులు’ సినిమాతో ఒక లీడ్ యాక్టర్‌గా మీ ముందుకు వచ్చా. ఈ నాలుగేళ్లలో హిట్లు కొట్టినం.. చేతి నుంచి జారిపోయిన సినిమాలూ ఉన్నాయి. ఈ జర్నీలో స్థిరమైన వాటిలో మీరు (ఫ్యాన్స్) ఉన్నారు. నేను సిక్స్ కొట్టాలనే దిగుతా. ఈ సింగిల్, డబుల్ నాకు ఓపిక లేదు. ఇక నుంచి సిక్సులు కొట్టడానికే చూస్తా’’ అన్నారు. అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా, ఇజాబెల్లా, కేథరిన్, రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్ మాట్లాడారు. -
ఈ సినిమాతో నా ఇమేజ్ మారిపోతుంది
‘‘వరల్డ్ ఫేమస్ లవర్’ టీజర్ రిలీజ్ అయినప్పుడు టీజర్ బావుంది అన్నారు. కానీ నా పాత్రకి కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇలాంటి పాత్ర రాశీఖన్నా ఎందుకు చేసింది? అన్నారు. యాక్టర్ అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి. ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు చేస్తూ ఉండలేం కదా. ఎప్పుడో ఓసారి దాన్ని బ్రేక్ చేయాలి. ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో అలాంటి ప్రయత్నం చేశాను. ఈ సినిమాతో నా ఇమేజ్ మారిపోతుంది అనుకుంటున్నాను’’ అన్నారు రాశీఖన్నా. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్, ఇజబెల్లా కథానాయికలుగా నటించిన ఈ సినిమాను కేయస్ రామారావు నిర్మించారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా చెప్పిన విశేషాలు. ► ఈ సినిమాలో నేను చేసిన యామినీ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. స్ట్రాంగ్ రోల్. చాలెంజింగ్‌గా అనిపించింది. ► యామినీ పాత్రకు బాగా కనెక్ట్ అయ్యాను. నా పాత్ర నేనే చేసినట్టుంది. నిజ జీవితంలో నేను చాలా ఎమోషనల్ పర్సన్‌ని. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేను. స్ట్రాంగ్ ఉమెన్ ఎమోషనల్ సైడ్‌ని బయటకు చూపించకూడదనుకుంటాను. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ► సాధారణంగా నాకు లవ్ స్టోరీలంటే చాలా ఇష్టం. దర్శకుడు క్రాంతి మాధవ్‌గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ► సినిమాలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నేనే ఉండాలి అనుకోను. మనం చేసే పాత్రకు ప్రాముఖ్యత ఉండాలి. నలుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ నాకేం ప్రాబ్లమ్ లేదు. యాక్టర్‌గా నేను చాలా సెక్యూర్‌గా ఉంటాను.ఒకవేళ ఈ సినిమాలో నా పాత్ర కాకుండా వేరే పాత్రను ఎంచుకోమంటే ఐశ్వర్యా రాజేశ్ చేసిన పాత్ర చేస్తాను. ► వేలంటైన్స్ డే అంటే నాకు ఇష్టం. ప్రేమను చెప్పడానికి ధైర్యం తెచ్చుకుని చెబుతుంటారు. వేలంటైన్స్ డేకి ఇది పర్పెక్ట్ సినిమా. ప్రస్తుతం రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలో ప్రకటిస్తాను. ► ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు ‘అర్జున్ రెడ్డి 2’ అన్నారు. కానీ ట్రైలర్‌తో ఆ అభిప్రాయం మారిపోయింది. విజయ్ గడ్డంతో ఉంటే అర్జున్ రెడ్డిలానే ఉంటారు. కానీ ఆ సినిమాకు ఈ సినిమాకు సంబంధం ఉండదు. -
ఆ పేరొస్తే చాలు
‘‘బాక్సాఫీస్ వసూళ్ల గురించి నేను పట్టించుకోను. నా పాత్రకి న్యాయం చేయడానికి 100శాతం కష్టపడతా. నా నటన బాగుందనే పేరు వస్తే చాలనుకునే మనస్తత్వం నాది’’ అని కేథరిన్ అన్నారు. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లే లెయితే కథానాయికలుగా నటించారు. కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేథరిన్ మాట్లాడుతూ– ‘‘ప్రేమ, పెళ్లి, అనుబంధాలు వంటి అంశాలను ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో చక్కగా చెప్పారు. ఆధునిక ఆలోచనలతో స్వంతంత్ర భావాలున్న స్మిత అనే అమ్మాయి పాత్రలో నటించాను. ఈ పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. నేనొక బొగ్గు గనిలో పని చేస్తుంటాను. ఆ ప్రాంతంలో పని చేసే హీరోతో నాకున్న అనుబంధం ఏంటి? అతని జీవితంపై నా ప్రభావం ఎంత? అనేది ఆసక్తిగా ఉంటుంది. ఈ చిత్రంలో నలుగురు కథానాయికలు ఉన్నా అందరికీ ప్రాధాన్యత ఉంటుంది. ఇద్దరు ముగ్గురు కథానాయికలు ఉన్న చిత్రాల్లో నటించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. విజయ్ దేవరకొండతో పని చేయడం మంచి అనుభూతినిచ్చింది. సెట్స్‌లో ప్రశాంతంగా ఉంటూ పనిలో మాత్రం పర్ఫెక్షన్ కనబరచాలని తపిస్తాడు. ఇది నా కెరీర్లో విభిన్న చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. సవాల్‌తో కూడిన పాత్రలు చేసి, ప్రేక్షకుల అభిమానం పొందాలనుకుంటున్నా’’ అన్నారు. -
నా చివరి ప్రేమ కథ ఇదే
‘‘నా గత చిత్రాలన్నింటిలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా కోసమే ఎక్కువ కష్టపడ్డా. ఈ సినిమాకి నేనేం హడావిడి చెయ్యలేదు. ఈ ట్రైలర్‌తో బయట హడావిడి స్టార్ట్ అవుతుంది. నా చివరి ప్రేమ కథా చిత్రమిది’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లే లెయితే కథానాయికలుగా నటించారు. కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘మనిషిగా కొంచెం మారుతున్నా.. టేస్టులు కొంచెం మారుతున్నాయి. లైఫ్‌లో కొత్త దశలోకి వెళ్తున్నా. ఈ సినిమా చేస్తున్నప్పుడే ఇదే నా చివరి ప్రేమకథా చిత్రం అని తెలిసిపోయింది. అందుకే ఈ సినిమాని పూర్తిగా ప్రేమతో నింపేశాం. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. క్రాంతి మాధవ్‌కు పెద్ద సక్సెస్ రావాలి’’ అన్నారు. ‘‘వరల్డ్ ఫేమస్ లవర్’ తెలుగు ప్రేక్షకుల సినిమాలా ఉండదు.. హాలీవుడ్, హిందీ సినిమాలా ఉంటుంది. ప్రతి సినిమా లవర్‌కి మా చిత్రం నచ్చుతుంది’’ అన్నారు కె.ఎస్. రామారావు. ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ తర్వాత ఈ బ్యానర్లో ఇది నా రెండో సినిమా. ఈ సినిమాలో అందరూ తమ పాత్రల్లో జీవించారు’’ అన్నారు క్రాంతి మాధవ్. ‘‘ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాల్లో, చేసిన పాత్రల్లో ఈ సినిమాలోని యామిని పాత్ర బెస్ట్’’ అన్నారు రాశీఖన్నా. ‘‘ఈ సినిమాలో స్మిత అనే భిన్నమైన పాత్ర చేశా’’ అన్నారు కేథరిన్. ‘‘ఈ చిత్రంలో నటించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు ఇజా బెల్లా. -
వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ రిలీజ్
-
ట్రైలర్ రెడీ
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కేయస్ రామారావు నిర్మించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్యారాజేష్, కేథరీన్, ఇజబెల్లా నటించారు. ఈ సినిమాలో నాలుగు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారు విజయ్. ఈ లుక్స్ ఉన్న మిస్టరీకి ఈ గురువారం క్లూ దొరుకుతుంది. ఈ చిత్రం ట్రైలర్ గురువారం విడుదల కానుంది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతోంది. -
కథ డిమాండ్ చేస్తే లిప్‌లాక్ తప్పదు
‘‘నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎక్కువగా చేయాలనుకుంటున్నాను. కమర్షియల్ సినిమాలు తక్కువగా చేయడం నా కెరీర్ ఎదుగుదలకు మైనస్ అవుతుందని అనుకోవడం లేదు. నాకు మంచి అవకాశాలే వస్తున్నాయి. బాగానే సంపాదిస్తున్నా’’ అన్నారు ఐశ్వర్యా రాజేష్. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా కేయస్ రామారావు నిర్మించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. కథానాయికలుగా రాశీఖన్నా, కేథరీన్ , ఐశ్వర్యా రాజేష్, ఇజబెల్లా నటించారు. ఈ నెల 14న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఐశ్వర్యా రాజేష్ చెప్పిన విశేషాలు. ► 2018లో ఓ అవార్డు ఫంక్షన్ కోసం నేను హైదరాబాద్ వచ్చినప్పుడు క్రాంతిమాధవ్‌గారు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కథ చెప్పారు. బాగా నచ్చింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర. నాకు తెలిసి గత పదేళ్లలో సువర్ణలాంటి పాత్రను ప్రేక్షకులు చూసి ఉండరు. ఈ సినిమాలో నాతో పాటు ముగ్గురు హీరోయిన్లు నటించారు. కానీ కథ రీత్యా ఎవరి ప్రాముఖ్యత వారికి ఉంటుంది. ► విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి, గీతగోవిందం’ సినిమాలు చూశాను. ఆ సినిమాల్లో హీరోయిన్స్‌కు మంచి పాత్రలు దక్కాయనిపించింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో నా పాత్ర బాగానే ఉంటుంది. క్రాంతిమాధవ్‌గారు చాలా సెన్సిబుల్ డైరెక్టర్. సహజత్వానికి చాలా దగ్గరగా సినిమాలు తీస్తుంటారు. కేయస్ రామారావుగారు మంచి నిర్మాత. ► కథ డిమాండ్ చేస్తే లిప్‌లాక్ సన్నివేశాలు తప్పవు. అనవసరంగా లిప్ లాక్ సన్నివేశాలు ఉండకూడదు. నేను నటించిన ‘వడచెన్నై’ చిత్రంలో నాలుగు లిప్‌లాక్ సీన్స్ ఉన్నాయి. ఈ తరంలో దాదాపు అందరూ ఓపెన్ గానే ఉంటున్నారు. ఒక పెద్ద కమర్షియల్ సినిమా ఫ్లా్లప్ అయితే హీరోయిన్ అన్‌లక్కీ అని కొందరు అంటుంటారు. ఆ లాజిక్ నాకు అర్ధం కాదు. ► ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. జయలలితగారి బయోపిక్‌లో నటించాలనుకున్నాను. ఇప్పుడు జయలలితగారి బయోపిక్స్ వస్తున్నాయి. నా ఫేవరెట్ యాక్ట్రస్ సౌందర్యగారి బయోపిక్‌లో నటించాలని ఉంది. కాకపోతే కాస్త నా కలర్ తక్కువగా ఉంటుందేమో (నవ్వుతూ). తమిళంలో నేను నటించిన ‘వానమ్ కొట్టటుమ్’ సినిమా ఈ నెల 7న విడుదలవుతుంది. విజయ్ సేతుపతిగారితో ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో నాని ‘టక్ జగదీష్’లో కీలక పాత్ర చేస్తున్నాను. ► నా చిన్నప్పుడే మా నాన్నగారు (రాజేష్) మరణించారు. ‘కాక్కముట్టై’ (2014) సినిమాకు ముందు నా పేరు స్క్రీన్ పై ఐశ్వర్య అని ఉండేది. ఆ తర్వాత ఐశ్వర్యా అయ్యర్, ఐశ్వర్యా లక్ష్మీ ఇలా కొంతమంది ఐశ్వర్య పేరుతో ఇండస్ట్రీకి వచ్చారు. అప్పుడు నా పేరు మార్చుకోవాలనుకున్నాను. ‘కాకముట్టై’తో నా పేరును ఐశ్వర్యా రాజేష్‌గా మార్చుకున్నాను. ఆ సినిమాతో నాకు పెద్ద బ్రేక్ వచ్చింది. మా నాన్నగారి పేరు నాకు కలిసొచ్చింది. అలాగే మా నాన్న నాతోనే ఉన్నారనే ఫీలింగ్ కలిగింది. -
నిర్మాత లేకపోతే ఏమీ లేదు
‘‘సుమారు 51 ఏళ్లుగా మూడు తరాల వాళ్లతో సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాను. వాళ్లు ఎలా ఆలోచిస్తున్నారు? అని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్లతో పోటీపడి పని చేయడానికి ప్రయత్నిస్తుంటాను’’ అన్నారు ప్రముఖ నిర్మాత కేయస్ రామారావు. ఆయన నిర్మించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా, కేథరీన్, ఐశ్వర్యా రాజేశ్, ఇజబెల్లా హీరో హీరోయిన్లుగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఫిబ్రవరి 14న ఈ సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా కేయస్ రామారావు చెప్పిన విశేషాలు. ► ‘పెళ్లి చూపులు’ సినిమా చూసినప్పుడు నాకు విజయ్ దేవరకొండ ఒక రవితేజ, ఉపేంద్రలా అనిపించాడు. అప్పుడే అతనితో సినిమా చేయాలనుకున్నాను. అతని స్టయిల్లోనే ఉండే ప్రేమకథా చిత్రమిది. ► క్రాంతి మాధవ్‌తో ఇదివరకు ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ సినిమా నిర్మించాను. తను చాలా భిన్నంగా ఆలోచిస్తాడు. ప్రేక్షకులకు కొత్త అనుభవం ఇవ్వాలనుకునే దర్శకుడు. ఈ సినిమా కథానుసారమే నలుగురు హీరోయిన్స్‌ని తీసుకున్నాం. రాశీ ఖన్నా పాత్ర బోల్డ్‌గా, ఐశ్వర్యారాజేశ్ పాత్ర న్యాచురల్‌గా ఉంటాయి. కేథరీన్ సపోర్టింగ్ రోల్లో కనిపిస్తుంది. ఇజబెల్లాది కూడా మంచి పాత్రే. ► ఈ సినిమాను 2018 అక్టోబర్‌లో ప్రారంభించాం. అనుకున్నదానికంటే కొంచెం ఎక్కువే ఆలస్యం అయింది. అయినా కరెక్ట్ సమయానికే వస్తున్నాం. ప్రేమ అనే ఫీలింగ్‌ను ఆస్వాదించేవారందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ► ప్రస్తుతం అమేజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ అంటూ ప్రేక్షకుడి చేతిలోకి వినోదం వచ్చేసింది. అందులో బోల్డ్ కంటెంట్ వస్తోంది. అయినా బిగ్ స్క్రీన్ మీద సినిమా ఆనందించాలనే ఆడియన్స్ సంఖ్య ఎక్కువగానే ఉంది. వాళ్లు బోల్డ్ కంటెంట్‌ను బిగ్ స్క్రీన్ మీద చూడడానికి హర్షించరు. అందాన్ని సభ్యతతో చూపించేదే సినిమా. ► సినిమాల ఖర్చులు పెరిగాయి. దాంతో ఎక్కువ థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. దీని వల్ల వేరే సినిమాకు థియేటర్స్ కొరత ఏర్పడుతోంది. ఆ సినిమా నిలదొక్కుకొని టాక్ తెచ్చుకునేసరికి మరో పెద్ద సినిమా వస్తుంది. ఈ పరిస్థితిని నివారించడానికి ఓ ప్రణాళికను తీసుకురావాలి. కంటెంట్‌ను తయారుచేసే నిర్మాత కన్నా కంటెంట్‌ను ప్రేక్షకుల్లో తీసుకెళ్లే వాళ్లే ఎక్కువ డబ్బు చేసుకుంటున్నారు. నిర్మాత లేకపోతే ఏమీలేదు. ► సినిమాను పంపిణీ చేసే విధానంలో మార్పులు వచ్చాయి. మెల్లిగా మోనోపోలీ వ్యవస్థకు వెళ్లిపోయేలా ఉంది. థియేటర్స్ అన్నీ కొందరి దగ్గరే ఉండటం వల్ల కొందరి నిర్మాతలకు మంచి జరుగుతుంది.. ఇంకొందరికి మంచి జరగదు. థియేటర్స్ ఉన్నవాళ్లు వాళ్ల సినిమా ఉంటే థియేటర్స్ అన్నీ వాళ్ల సినిమాకే ఉంచుకుంటున్నారు. దీని వల్ల ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. -
హాయ్ హారర్
‘ఇలాంటి సినిమాలో నటించాలి’ అని ప్రతి ఆర్టిస్ట్ కి ఒక ‘విష్ లిస్ట్’ ఉంటుంది. అది నెరవేరే టైమ్ వచ్చినపుడు ఆనందపడిపోతారు. ఇప్పుడు రాశీ ఖన్నా ఆ ఆనందంలోనే ఉన్నారు. ఈ బ్యూటీ విష్ లిస్ట్‌లో హారర్ సినిమా చేయాలని ఉంది. ‘అరణ్మణై 3’తో హారర్ జానర్‌కి హాయ్ చెప్పే అవకాశం ఆమెకు వచ్చింది. సుందర్. సి కీలక పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన ‘అరణ్మౖణె’, ‘అరణ్మణై 2’ పెద్ద హిట్. ఇప్పుడు మూడో భాగం తీయడానికి సుందర్ సిద్ధమయ్యారు. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటించబోతున్నారు. ఆండ్రియా మరో కథానాయిక. ఆర్య హీరో. తొలి, మలి భాగాల్లో నటించిన సుందర్ ఇందులోనూ కీలక పాత్ర చేయబోతున్నారు. ‘‘హారర్ జానర్ మూవీ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ‘అరణ్మణై’ సిరీస్‌తో ఆ కోరిక నెరవేరబోతోంది. ఫస్ట్, సెకండ్ పార్ట్స్ చూశాను. చాలా బాగుంటాయి. మూడో భాగం షూటింగ్లో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని తన ఆనందాన్ని వ్యక్తపరిచారు రాశీ ఖన్నా. ఫిబ్రవరి నెలాఖరున లేక మార్చిలో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. -
ప్రేమికుడు వచ్చేశాడు
‘‘ప్రేమంటే సర్దుకుపోవడం గౌతమ్. ప్రేమంటే త్యాగం. ప్రేమలో ఒక దైవత్వం ఉంటుంది. ఇవేవీ నీలో కనపడట్లేదు’ అని ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం టీజర్లో విజయ్ దేవరకొండతో రాశీ ఖన్నా అంటున్నారు. ఈ టీజర్ శుక్రవారం విడుదలైంది. ఎమోషనల్ లవ్‌స్టోరీగా ఈ సినిమా ఉంటుందని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరో. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్, ఇజబెల్లా హీరోయిన్లు. కేయస్ రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మించారు. టీజర్లో నలుగురు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తూ కనిపించారు విజయ్. మరి సినిమాలో నాలుగు షేడ్స్‌లో కనిపిస్తారా? ద్విపాత్రాభినయం చేశారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రేమికుల దినోత్సవానికి ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. -
అదంతా సహజం
సినిమా: అదంతా సహజం అంటోంది నటి రాశీఖన్నా. అనుభవాలు చాలా పాఠాలు నేర్పుతాయంటారు. తాద్వారా మార్పులు వస్తాయి. నటి రాశీఖన్నా ఇందుకు మినహాయింపు కాదట. ఈ హైదరాబాదీ బ్యూటీ బాలీవుడ్లో నటిగా ఎంట్రీ ఇచ్చినా, ఇప్పుడు తెలుగు, తమిళం అంటూ దక్షిణాది చిత్రాలతో బిజీగా ఉంది. ఇమైకా నొడిగళ్ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ అమ్మడికి ఇక్కడ వెంట వెంటనే నాలుగైదు అవకాశాలు వచ్చేశాయి. అలా అడంగమరు. సంఘ తమిళన్ వంటి చిత్రాల్లో నటించిన ఈ జాణ ఇక్కడ రాశి గల నటిగానే పేరు తెచ్చుకుంది. అయినా చేతిలో ఇప్పుడు ఒక్క తమిళ చిత్రం కూడా లేదు. బహుశా తెలుగులో అవకాశాలు వరుస కట్టడంతో తమిళ చిత్రాలకు గ్యాప్ ఇచ్చిందేమో. తెలుగులో తను నటించిన ప్రతిరోజూ పండగే మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మంచి జోరు మీదున్న రాశీఖన్నా నూతన సంవత్సరం సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఒక్కో రోజూ ఇంకా మంచి మనిషిగా మారడానికి ప్రయత్నించాలి. నిన్న కంటే నేడు ఇంకా కొంచెం ఎక్కువగా శ్రమించాలి. అందుకోసం మనం మనతోనే పోటీ పడాలి. ఇప్పుడు నేనదే చేస్తున్నాను. నటిగా పరిచయమై 7 ఏళ్లు అయ్యింది. ఈ ఏడేళ్లలో వివిధ కథా పాత్రల్లో నటించాను. ఆ విధంగా తన జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నా నిర్ణయాలను కూడా చాలా మార్చుకున్నాను. అంతాగా నేను పోషించిన పాత్రలు నాపై ప్రభావం చూపాయి. నా ఆలోచనా పరిధి పెరిగింది. సినిమాల్లో జయాపజయాలు సహజం. ఇంతకు ముందు విమర్శనలపై ఎంటనే రియాక్ట్ అయ్యేదాన్ని. నా చిత్రాల అపజయాల గురించి ఎవరైనా విమర్వించినా, గాసిప్స్ రాసినా కోపం వచ్చేది. ఇప్పుడు అది పూర్తిగా తగ్గిపోయ్యింది. చాలా శాంతస్వభావిగా మారిపోయాను. నిన్నటి కంటే నేడు బాగుండాలని ప్రయత్నిస్తున్నాను.ఈ కొత్త సంవత్సరంలో నా ఈ ప్రయత్నం కొనసాగుతుంది. అని నటి రాశీఖన్నా పేర్కొంది. మొత్తం మీద తాను మారిన విషయాన్ని పక్కన పెడితే మాటల్లో మాత్రం బాగా పరిణితి చెందిందీ భామ అని అనిపిస్తోంది కదూ! -
మనతో మనమే ఫైట్ చేయాలి
‘‘ప్రతిరోజూ ఇంకాస్త మంచి మనిషిగా మారడానికి ప్రయత్నిస్తుండాలి. నిన్నటి కంటే మెరుగ్గా ఉండటానికి కష్టపడుతుండాలి. దానికోసం మనతో మనమే ఫైట్ చేస్తుండాలి. ప్రస్తుతం నేను అదే చేస్తున్నాను’’ అన్నారు రాశీఖన్నా. నటి అయ్యాక ఈ ఏడేళ్లలో నటిగా, వ్యక్తిగా మీలో గమనించిన మార్పేంటి? అని రాశీని అడగ్గా– ‘‘ఈ ప్రయాణంలో చాలా మార్పు గమనించాను. రకరకాల పాత్రలు పోషించడం నా ఆలోచనా విధానంపై చాలా ప్రభావం చూపింది. నా ఆలోచనా పరిధి విస్తృతం అయింది. ఏ విషయాన్నీ ముందే జడ్జ్ చేయడం లేదు. గతంలో వెంటనే రియాక్ట్ అవ్వడం, టక్కున కోపం రావడం జరిగేవి. ఇప్పుడు తగ్గింది. చాలా శాంతమయ్యాను. ప్రస్తుతం నేను పాటించేది నిన్నటికంటే బెటర్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను’’ అన్నారు. -
ఈ విజయం ఆ ఇద్దరిదే
‘‘ప్రతిరోజూ పండగే’ సినిమా విజయం మారుతి, సాయి తేజ్‌లదే. ఈ ఇద్దరూ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరూ సంతోషంగా ఉన్నారు. మంచి సినిమా తీసిన యూనిట్‌ని అభినందిస్తున్నాను’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాస్ నిర్మించిన ఈ సినిమా విజయోత్సవం రాజమండ్రిలో నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి తేజ్ మాట్లాడుతూ–‘‘ప్రతిరోజూ పండగే’ నా కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా. ఇలాంటి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన మారుతిగారికి థ్యాంక్స్. సత్యరాజ్‌గారి పాత్రను మర్చిపోలేను. రావు రమేశ్‌గారితో నేను చేసిన సినిమాలన్నీ సక్సెస్. ఈ సక్సెస్‌ను మెగా అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు అంకితం ఇస్తున్నా’’ అన్నారు. ‘‘ఈ కథ రాసుకున్నప్పుడు రాజమండ్రిలో చిత్రీకరించాలనుకున్నాను. సక్సెస్‌మీట్‌ను రాజమండ్రిలోనే నిర్వహించాలని షూటింగ్ అప్పుడే అనుకున్నాను.. ఇప్పుడు చేశాం’’ అన్నారు మారుతి. ‘‘తేజూ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి వ్యక్తికి ఇంత మంచి విజయం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’ వాస్. -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘వెంకీ మామ’
రియల్ లైఫ్‌లో మామా అల్లుళ్లు అయిన హీరోలు వెంకటేశ్, నాగచైతన్య రీల్ లైఫ్‌లో మామా అల్లుళ్లుగా నటిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వెంకీ మామ’ తొలి రోజు నుంచే రికార్డ్ స్థాయిలోవసూళ్లు సాధిస్తోంది. వెంకటేష్, నాగచైతన్యల కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఈ సినిమా, మూడో వారంలోనూమంచి వసూళ్లతో దూసుకెళ్తుంది. రూలర్, ప్రతి రోజూ పండగే లాంటి సినిమాలు విడుదలైన కూడా వెంకీ మామ జోరు తగ్గలేదు. మూడు వారల్లో రూ.72 కోట్లు వసూళ్లు చేసి మామ అల్లుళ్ల సత్తాను చూపించారు. మరొ కొద్ది రోజుల పాటు కలెక్షన్లు ఇలాగే కొనసాగితే 100 కోట్ల క్లబ్లో ఈజీగా చేరుతుందని సీనీవర్గాల టాక్. కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా జాతకాల నేపథ్యంలో సాగుతుంది. మేనల్లుడి కోసం జీవితాన్ని త్యాగం చేసే మామగా వెంకటేశ్, మావయ్య కోసం అన్నింటినీ వదులుకున్న అల్లుడిగా నాగచైతన్య వారి వారి పాత్రల్లో జీవించారు. అనుకోని పరిస్థితుల్లో ఒకరి ఒకరు దూరమైన ఈ మామాఅల్లుళ్లు ఎలా ఒక్కటయ్యారనే ఆసక్తికర కథా, కథనాలతో రూపొందిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటోంది. -
నవ్విస్తూనే హృదయాలను హత్తుకుంది
‘‘యంగ్∙ఆడియన్స్‌ను ఆకట్టుకునే సినిమాలను రూపొందించే మారుతి, ‘ప్రతిరోజూ పండగే’ లాంటి భావోద్వేగాలకు సంబంధించిన కథను అద్భుతంగా తీశారు’’ అని సుకుమార్ అన్నారు. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాస్ నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సుకుమార్ మాట్లాడుతూ – ‘‘సినిమా మొత్తం బాధ అనే ఎమోషన్ ఉన్నా ప్రేక్షకులు నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారని నాతో ‘బన్నీ’ వాస్ అన్నాడు. సినిమా చూశాక అతను చెప్పింది కరెక్టే కదా అనిపించింది. ఆద్యంతం నవ్విస్తూనే హృదయాలను హత్తుకుంది ఈ సినిమా. సాయితేజ్‌కి మేనమామ పోలికలు ఎక్కువగా కనిపిస్తాయి’’ అన్నారు. ‘‘కొన్ని ఫ్లాప్స్ ఎదురవగానే నా కెరీర్ అయిపోయిందని చాలామంది జోక్స్ వేసుకున్నారు. ఈ సినిమా రూపంలో మంచి హిట్ దక్కింది. నా కెరీర్లో నిలిచిపోయే సినిమా ఇచ్చారు మారుతి’’ అన్నారు సాయితేజ్. ‘‘నిర్మాతగా నేను ఈస్థాయిలో ఉండటానికి ‘దిల్’రాజుగారు, అల్లు అరవింద్‌గారితోపాటు సుకుమార్‌గారు కూడా ఓ కారణం. నన్ను నిర్మాతను చేయడానికి ‘100% లవ్’ తీశారు’’ అన్నారు ‘బన్నీ’ వాస్. ‘‘థియేటర్లో ప్రేక్షకుల స్పందన చూస్తుంటే వాళ్లను ఇంకా నవ్వించాలనే కసి పెరిగింది. సుకుమార్‌గారు మా సినిమాని అభినందించడం హ్యాపీ’’ అన్నారు మారుతి. ఈ కార్యక్రమంలో తమన్, రాశీఖన్నా, రావు రమేశ్, పరుచూరి గోపాలకృష్ణ పాల్గొన్నారు. -
ఆ ముద్ర పడకుండా చూసుకుంటున్నా
‘‘సీరియస్ విషయాన్ని కూడా ఎక్కువ సీరియస్‌గా తీసుకోను నేను. అది నా మనస్తత్వం. ఏదైనా విషయం చెప్పాలన్నా ఎంటర్టైనింగ్గానే చెబుతాను. నా సినిమాలో కథలను కూడా అలానే చెప్పాలనుకుంటాను’’ అన్నారు దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వంలో సాయితేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాస్ నిర్మించారు. గత శుక్రవారం ఈ చిత్రం విడుదలయింది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి పంచుకున్న విశేషాలు. ► ‘ప్రతిరోజూ పండగే’ కథను ఎవరికి చెప్పినా బావుంది అన్నారు. 65 రోజుల్లో సినిమాను పూర్తి చేశాం. సినిమా రిలీజ్ ముందు కూడా పెద్ద టెన్షన్ పడలేదు. ఎందుకంటే.. ఎమోషన్స్‌తో ఓ కథను సరిగ్గా చెప్పగలిగితే ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. మా సినిమాతో అది మళ్లీ నిరూపితం అయింది. ► థియేటర్స్‌లో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎమోషన్ కంటే కామెడీ టైమింగ్ ఏమైనా డామినేట్ అయిందా? అనే డౌట్ వచ్చింది. ‘భలే భలే మగాడివోయి’ సినిమా తర్వాత ఇన్ని ఫోన్ కాల్స్ రావడం ఇదే. ‘చాలా హెల్దీగా చేశావు’ అని చిరంజీవిగారు అభినందించారు. ‘చాలా బాగా డీల్ చేశావు’ అని రాఘవేంద్రరావుగారు అన్నారు. ఇండస్ట్రీ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. ► రావు రమేశ్‌గారు పాత్ర బాగా వచ్చింది అని అందరూ అంటున్నారు. ఆయన యాక్ట్ చేస్తుంటే మేమందరం ఎగ్జయిట్ అయ్యాం. ► మారుతి ఒక జానర్ సినిమాలే తీయగలడు అని ముద్ర వేయించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే సినిమా సినిమాకు జానర్ మారుస్తుంటాను. ఒకేలాంటి సినిమాలు తీస్తే నాకు నేనే బోర్ కొట్టేస్తాను. ► ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. బెస్ట్ కథలే ఇవ్వాలి. వెబ్ సిరీస్‌లు కూడా వస్తున్నాయి. అవే ఫ్యూచర్. నేనూ వెబ్ సిరీస్ చేస్తాను. నెట్‌ఫ్లిక్స్ ‘లస్ట్ స్టోరీస్’కి అడిగారు. కానీ కుదర్లేదు. -
ఇది చాలదని చరణ్ అన్నారు
‘‘మనకు నచ్చిన పని చేస్తూ, మనవారితో సంతోషంగా ఉంటే ‘ప్రతిరోజూ పండగే’. అందుకు తల్లిదండ్రులు, గురువుల ఆశీస్సులు కావాలి’’ అన్నారు సాయితేజ్. మారుతి దర్శకత్వంలో సాయితేజ్, రాశీఖన్నా జంటగా అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాస్ నిర్మించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఎస్కేఎన్ ఈ చిత్రానికి సహ–నిర్మాత. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయి తేజ్ చెప్పిన సంగతులు. ► ఇది తాత–మనవడి కథ. ఐదు వారాల్లో తాత చనిపోతాడని తెలిసి, ఆయన బతికి ఉన్నంత కాలం సంతోషంగా ఉంచాలనుకుంటాడు మనవడు. తాత కోసం ఆ మనవడు ఏం చేశాడు? తాత తన జీవితంలో చేయాలనుకుని చేయలేని పనులను మనవడి సాయంతో చివరి రోజుల్లో ఎలా చేశారు? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇందులో తాత పాత్రలో సత్యరాజ్‌గారు, మనవడి పాత్రలో నేను నటించాను. నా తండ్రి పాత్రలో రావు రమేష్‌గారు నటించారు. ఉగాది పచ్చడిలా ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇందులో ఉన్న డైనింగ్ టేబుల్ సన్నివేశం తీసేటప్పుడు నా నిజ జీవితంలోని కొన్ని సంఘటనలకు కనెక్ట్ అయ్యాను. ► దాదాపు పదేళ్ల క్రితం మారుతి అన్నను ఓ సంద ర్భంలో కలిశాను. అప్పుడు ఓ కథ చెప్పారు. నిజానికి నాకు అప్పటికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. కానీ, కథ విన్నా. మారుతి అన్న డైరెక్షన్లో సినిమా చేయడం ఇప్పటికి కుదిరింది. అయితే అప్పుడు ఆయన చెప్పిన కథ ఇది కాదు. మా సినిమా విడుదలవుతున్న రోజునే మరో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. మా సినిమాతో పాటు అవికూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ► ‘చిత్రలహరి’ సినిమా కోసం బరువు పెరిగాను. ‘ప్రతిరోజూ పండగే’ కోసం దాదాపు 20 కేజీలు తగ్గాను. ఈ సినిమాలో ‘హోమం’ చేస్తున్న ఓ సన్నివేశంలో ఫైట్ సీన్ కోసం షర్ట్ విప్పాల్సి ఉంటుంది. ్ఞఅలా ఆ సీన్లో సిక్స్‌ప్యాక్‌తో కనిపించాను. ► ఓసారి నేను వర్కౌట్స్ చేస్తున్నప్పుడు చరణ్ (రామ్‌చరణ్) చూశారు. ‘ఇది చాలదు’ అని ‘ధృవ’ సమయంలో తనకు జిమ్ ట్రైనర్‌గా ఉన్న రాకేష్ ఉదయార్ను సూచించారు. సరైన వర్కౌట్స్ చేసి బరువు తగ్గాను. మరోసారి బరువు పెరిగి తగ్గాలనుకోవడం లేదు. అంత ఓపిక లేదు (నవ్వుతూ). ► చిరంజీవిగారు ‘ప్రతిరోజూ పండగే’ కథ విన్నారు. బాగా చేయాలన్నారు. చిరంజీవిగారి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. అది నాకు ప్లస్సో, మైనస్సో అనుకోవడం లేదు. ఒక బాధ్యతగా భావిస్తున్నాను. -
అదే మా బ్యానర్ విజయ రహస్యం
‘‘శైలజా రెడ్డి అల్లుడు’ తర్వాత కొన్ని నెలలు ఓ కథ మీద వర్క్ చేశాడు మారుతి. ఆ తర్వాత మరో ఆలోచనను పంచుకున్నాడు. అది నచ్చింది. కానీ ఎక్కడో చిన్న సందేహం. అయితే మా అమ్మగారి వల్ల ఈ సినిమా చేయాలనుకున్నాను’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’’ వాస్. సాయితేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ప్రతి రోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పిక్చర్స్‌పై ‘బన్నీ’ వాస్ నిరి్మంచారు. సత్యరాజ్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా ‘బన్నీ’ వాస్ చెప్పిన విశేషాలు. ►దర్శకుడు మారుతి, నేను, యూవీ క్రియేషన్స్ వంశీ, యస్కేయన్ (ఈ చిత్ర సహనిర్మాత) మంచి ఫ్రెండ్స్. ఏ ఐడియా వచి్చనా నలుగురం పంచుకుంటాం. డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లా ఎప్పుడూ ఉండం. మారుతి క్రియేటర్ కాబట్టి అతని ఆలోచనల్ని నేను గౌరవిస్తాను. ►‘ప్రతి రోజూ పండగే’ కథ బాగానే అనిపించింది కానీ అమ్మానాన్నలను అశ్రద్ధ చేసేవాళ్లు ఎవరుంటారు? కనెక్ట్ అవుతారా? అనే డౌట్‌ని కొందరు వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే మా అమ్మగారు నాకు ఫోన్ చేశారు. ‘ఐదు రోజులుగా నీతో మాట్లాడటానికి ప్రయతి్నస్తున్నాను రా’ అన్నారు. నాకు వెంటనే తల్లిదండ్రులను అశ్రద్ధ చేసేవాళ్లలో నేను కూడా ఉన్నానా? అని భయం వేసింది. మేం పట్టించుకోనప్పుడు మీకెలా ఉంటుంది అమ్మా? అని అడిగాను. ‘పెద్దయిపోయారు. మీకు బాధ్యతలు ఉంటాయని సర్ది చెప్పుకుంటాం రా’ అని చెప్పింది. అందరం ఏదో ఒకసారి మన పేరెంట్స్‌ను అశ్రద్ధ చేస్తున్నవాళ్లమే. అలాంటి కథ కాబట్టి మారుతిని గోఎహెడ్ అన్నాను. ►ఈ చిత్రంలో తేజ్ ఫిట్బాడీతో కనిపిస్తాడు. ‘బాడీ మీద క్రమశిక్షణ తప్పింది. వర్కౌట్ చేస్తాను’ అని ఈ సినిమా కోసం బాడీని రెడీ చేశాడు. యాక్టర్‌గా తనను తాను చాలా మెరుగుపరుచుకుంటున్నాడు. ►చావు అనివార్యం. పెళ్లి, పుట్టినరోజుని ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో చావుని కూడా అలానే సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ విషయాన్ని సీరియస్‌గా, ఫన్నీగా చెప్పాం. ►అల్లు అరవింద్‌గారి సలహాలు బావుంటాయి. మనం చెప్పినదాంట్లో పాయింట్ ఉందంటే తీసుకుంటారు. మూడు జనరేషన్స్ (అరవింద్‌గారు , నేను, నూతన దర్శకులు) కలసి పని చేయడమే మా బేనర్ విజయ రహస్యం. ►ప్రస్తుతం ‘జెర్సీ’ హిందీ రీమేక్, అఖిల్– ‘బొమ్మరిల్లు’ భాస్కర్ చిత్రం, కార్తికేయ ‘చావు కబురు చల్లగా’, నిఖిల్– సూర్యప్రతాప్ సినిమాలు చేస్తున్నాం. ►సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించను. కానీ ఎప్పుడైనా బాధ కలిగినా, నా అభిప్రాయాలను పంచుకోవాలన్నా ఫేస్బుక్లో స్పందిస్తా. ►మేం అడ్వాన్స్ ఇచ్చినా ఆ దర్శకుడికి వేరే ఆఫర్ ఉంటే చేసుకోమంటాం. దర్శకులను మా దగ్గరే ఉండాలని నిబంధన పెట్టం. ప్రాజెక్ట్ ఓకే అయ్యాక మాత్రం వదలం (నవ్వుతూ). -
ఈ విజయానికి కారణం మా యూనిట్ – వెంకటేశ్
‘‘మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో యూనిట్ అంతా ఎంతో కష్టపడటంతోనే ఇంత పెద్ద సక్సెస్‌ను అందుకున్నాం. ‘వెంకీమామ’ సినిమాను బాగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. చిరంజీవిగాకి, మహేశ్‌బాబుకి కూడా మా సినిమా నచ్చడంతో అభినందించారు.. ఇందుకు వారిద్దరికీ ధన్యవాదాలు’’ అని వెంకటేశ్ అన్నారు. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా, పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. డి.సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ నిరి్మంచిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని టెన్షన్ గా ఉండేది. విడుదల తర్వాత చాలా సంతోషంగా ఉంది. అందరూ సినిమాను తమదిగా భావించి ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరు మామలు కలిసి కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో నాకు చూపించారు. మాకే కాదు.. ఇది తాతగారి (రామానాయుడు) కల.. తాతగారి సక్సెస్. అందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘నా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూశాను. అంతా బాగా ఎంజాయ్ చేశారు’’ అన్నారు రాశీఖన్నా. ‘‘మనం రేపు మాట్లాడుకునే సినిమాల్లో ‘వెంకీమామ’ ఒకటిగా నిలుస్తుందని కచి్చతంగా చెప్పగలను’’ అన్నారు పాయల్ రాజ్‌పుత్. ‘‘ఈ సక్సెస్ రెండేళ్ల కష్టం. హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. నా జీవితంలో ఈ సినిమా చాలా ప్రత్యేకం. వెంకటేశ్‌గారు, చైతన్యగారి పాజిటివిటీ వల్లే ఈ సినిమా తీయగలిగాను’’ అన్నారు కె.ఎస్.రవీంద్ర. ‘‘మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ‘‘వెంకటేశ్‌గారు, చైతన్యగారితో సినిమా అనగానే ఎగ్జయిట్ అయ్యి ‘వెంకీమామ’ చేశాను’’ అన్నారు సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్. ‘‘ఇంటి భోజనం తింటే ఎలా ఉంటుందో ‘వెంకీమామ’ చూస్తుంటే అలా అనిపించింది’’ అన్నారు డైరెక్టర్ నందినీ రెడ్డి. డైరెక్టర్ వంశీ పైడిపల్లి, చందూ మొండేటి, నిర్మాత వివేక్ కూచిభొట్ల, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిరోజూ పండగే హిట్ అవుతుంది
‘‘సందేశాన్ని కూడా ఆహ్లాదకరంగా చెప్పే ప్రతిభ ఉన్న వ్యక్తి మారుతి. ఆడియ¯Œ ్స పల్స్ తెలిసిన డైరెక్టర్ తను. ‘ప్రతిరోజూ పండగే’ సినిమా పెద్ద హిట్ అవుతుందని మా యూనిట్ అంతా నమ్మకంగా ఉన్నాం. సాయితేజ్‌తో పాటు ఈ సినిమాలో నటించిన అందరూ బాగా చేశారు. యు.వి. క్రియేషన్స్ వంశీ, నేను కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. బన్నీ వాసు కష్టపడి నిర్మించాడు’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్ని’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘ వాసు, మారుతి, యూవీ వంశీ కలిసి చేస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఈ చిత్ర కథను మారుతి మొదటిసారి నాకే చెప్పాడు.. బాగా నచ్చింది. ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం ‘శతమానం భవతి’ సినిమా అంత పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. సాయి తేజ్ మాట్లాడుతూ– ‘‘ఫ్యా¯Œ ్స ఉంటే మాకు ప్రతిరోజూ పండగే. నాకు ఎప్పుడూ అండగా నిలబడింది మెగా ఫ్యా¯Œ ్స. చిరంజీవిగారితో పాటు అభిమానుల ఆశీర్వాదాలు మా యూనిట్‌కి ఉండాలని కోరుకుంటున్నా. సినిమా చూశాక ప్రేక్షకులు నిరుత్సాహ పడరనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘మా సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన నా టీమ్‌కి థ్యాంక్స్. తమన్ మంచి పాటలిచ్చాడు. ‘బన్ని’వాసు, ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను సహకారం మరువలేనిది. చిరంజీవిగారికి కథ చెప్పినప్పుడు నచ్చింది.. ఈ చిత్రం ట్రైలర్ చూసిన ఆయన మెచ్చుకున్నారు’’ అన్నారు మారుతి. ‘‘గీతా ఆర్ట్స్‌లో చేయాలనే కోరిక ఈ సినిమాతో తీరింది’’ అన్నారు రాశీఖన్నా. ‘‘నా సెకండ్ ఇన్నింగ్స్‌లో వచ్చిన ఒక బెస్ట్ రోల్ ఈ సినిమాలో చేశాను’’ అన్నారు నటుడు నరేష్. ‘‘సాయి తేజ్ చాలా హార్డ్ వర్కర్. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లో ఉన్న లక్షణాలు అతనిలో ఉన్నాయి’’ అన్నారు నటుడు సత్యరాజ్. ఈ వేడుకలో ‘బన్ని’ వాసు, సహ నిర్మాత ఎస్.కె.ఎన్, నటుడు రావు రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అందాల రాశీతో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ
-
సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారు : రాశి ఖన్నా
సాక్షి, అమరావతి : మహిళల భద్రత కోసం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ‘ ఏపీ దిశ యాక్ట్’కు హట్సాఫ్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశా చట్టం చాలా మంచిదని కొనియాడుతున్నారు. ఇలాంటి చట్టాన్ని ఒక ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశం మొత్తం తీసుకురావాలని కోరుతున్నారు. (చదవండి : హ్యాట్సాఫ్ టు దిశ యాక్ట్) తాజాగా హీరోయిన్ రాశీ ఖన్నా దిశ యాక్ట్‌పై స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాల మంచిందని, ఈ చట్టం వల్ల తప్పు చేస్తే చనిపోతాం అనే భయం ఉంటుందన్నారు. ఈ చట్టంతో తప్పు చెయ్యాలనుకునే వారు భయపడతారని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఈ చట్టాన్ని మిగిలిన రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని కోరారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలని రాశీ ఖన్నా పేర్కొన్నారు. కాగా, మహిళలు, చిన్నారులపై నేరాలను అరికట్టేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఏపీ దిశ చట్టం-2019’ కు గత శుక్రవారం శాసస సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరుం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు. నేరాన్ని నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెల్లడిస్తారు. వారంరోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి.. మరో 14 రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు. మొత్తం 21 రోజుల్లో రేప్ కేసుపై జడ్జిమెంట్ వస్తుంది. -
సీఎం వైఎస్ జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారు
-
అందరూ కనెక్ట్ అవుతారు
సాయి తేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతి రోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించారు. ఎస్కేయన్ సహ–నిర్మాత. ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా చెప్పిన విశేషాలు... ► ఈ చిత్రంలో రాజమండ్రికి చెందిన టిక్ టాక్ సెలబ్రిటీ ఏంజిల్ అర్ణా పాత్ర చేశాను. మొదట్లో నాకు టిక్ టాక్ అంటే తెలియదు. ఈ కథ వింటున్నప్పుడు భయం వేసింది. ఏంజిల్ అర్ణా ఏంటి? టిక్ టాక్ సెలబ్రిటీ ఏంటి? అని అనుకున్నాను. ఆ తర్వాత నేను టిక్ టాక్ యాప్‌ను నా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. ఆ తర్వాత టిక్ టాక్ ఫన్ తెలిసింది. టిక్ టాక్‌పై సెటైరికల్‌గా నా పాత్ర ఉండదు. నా క్యారెక్టర్‌కు అందరూ బాగా కనెక్ట్ అవుతారు. ► రియల్‌లైఫ్‌లో నాకు చాలా సిగ్గు. సెల్ఫీలు తీసుకోవడానికి కూడా ఆలోచించేదాన్ని. ఇప్పుడు అలా కాదు. కొంతమంది నా ఫ్రెండ్స్‌లో టిక్ టాక్ చేసేవారు ఉన్నారు. క్యారెక్టర్ కోసం కొంతమంది టిక్ టాక్ సెలబ్రీటీలను కూడ కలిశాను. ‘జిల్’ సినిమా తర్వాత నేను బబ్లీ క్యారెకర్ట్ చేసింది ఈ సినిమాలోనే. ► సాయితేజ్ మంచి కో స్టార్. పాత్రకు నేను న్యాయం చేయగలనని దర్శకులు మారుతిగారు నన్ను నమ్మారు. సెట్లో ఆయన చాలా క్లారిటీగా ఉంటారు. ఆర్టిస్టుల నుంచి తనకు కావాల్సింది రాబట్టుకుంటారు. చాలా హ్యూమరస్‌గా ఉంటారు. ► ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారు. ఈ సినిమాను కూడా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ► నేను హీరోయిన్గా నటించిన ‘వెంకీమామ, ప్రతిరోజూ పండగే’ చిత్రాలు వారం గ్యాప్‌లో విడుదల అవుతున్నాయి. వీటిని నేను ప్లాన్ చేయలేదు. విడుదలైన ‘వెంకీమామ’ చిత్రంలో నేను పోషించిన హారిక పాత్రకు మంచి స్పందన లభిస్తోంది. హారిక లాంటి పాత్ర నేను ఇంతవరకు చేయలేదు. ► ఈ చిత్రానికి నేను డబ్బింగ్ చెప్పలేదు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రానికి నా పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. కథా చర్చలు జరుగుతున్నాయి. నా తర్వాతి చిత్రాల గురించి త్వరలో వెల్లడిస్తాను. -
మా అల్లుడు వెరీ కూల్!
వెంకటేశ్, నాగచైతన్య వరుసకి మేనమామ, మేనల్లుడు. ఇప్పుడు ఆన్‌స్క్రీన్ మీద కూడా మామా అల్లుళుగా ‘వెంకీ మామ’ చేశారు. ‘మా మామ కూల్’ అంటున్నారు చైతన్య. ‘మా అల్లుడు వెరీ కూల్’ అంటున్నారు వెంకటేశ్. ఈ ఇద్దరూ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు? ఫిట్నెస్ సీక్రెట్స్ ఏంటి? ప్లస్‌లు మైనస్‌లు ‘సాక్షి’తో పంచుకున్నారు. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా కథానాయికలు. గత శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా చెప్పిన విశేషాలు. ► రామానాయుడుగారు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. మీ ఇద్దర్నీ స్క్రీన్ మీద చూసి బాగా సంబరపడేవారేమో. వెంకటేశ్: తప్పకుండా. అందరికంటే నాన్నగారు చాలా సంతోషపడేవారు. చైతూ సినిమాల్లోకి రాగానే ఆయన చాలా ఎగ్జయిట్ అయ్యారు. నాన్నకు చైతూ అంటే బాగా ఇష్టం. ‘మీ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయండి’ అంటుండేవారు. అప్పట్లో చాలా కథలు విన్నాం కానీ కుదర్లేదు. ఇంతకాలానికి ఇలాంటి కథ రావడం దాన్ని మేం చేయడం, ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించడం హ్యాపీగా ఉంది. ఫ్యామిలీలు థియేటర్స్‌కి వస్తున్నారు. ► తాతయ్య (రామానాయుడు) మిమ్మల్ని బాగా ముద్దు చేసేవారా? నాగచైతన్య: అవును. చిన్నప్పుడు చాలా బొద్దుగా ఉండేవాణ్ణి. బాగా ముద్దు చేసేవారు. ‘ఏం చేస్తావు రా’ అని అడిగేవారు. ‘ఇంజనీరింగో ఏదో ఒకటి చేస్తా తాతా’ అనేవాణ్ణి. విని నవ్వేవారు. ‘ఇప్పుడు ఇలానే అంటావు లే తర్వాత చూద్దాం’ అనేవారు. నేను హీరో అయ్యాక మనం సినిమా చేద్దాం, నువ్వే కథ తీసుకొని రా అంటుండేవారు. నన్ను, వెంకి మామను పెట్టి సినిమా తీయాలన్నది ఆయన కోరిక. ఒకవేళ తాతగారు ఉండి ఉంటే ఈ సక్సెస్‌ను ఆయనే ఎక్కువ ఎంజాయ్ చేసేవారు. ► ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నాం అని తెలిసినప్పుడు ఏమైనా ఒత్తిడిగా అనిపించిందా? వెంకీ: ఇద్దరి పాత్రలు మంచిగా ఉన్నాయి. అన్ని ఎమోషన్స్ తగినన్ని ఉన్నాయి. ఫస్ట్ హాఫ్‌లో వినోదం సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ సీన్స్, ఫైట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. ఈ సినిమా చేయడాన్ని కూడా బాగా ఎంజాయ్ చేశాం. ► కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. చైతూ కాకుండా వేరే హీరో ఉన్నా ఇలానే ఉండేదా? వెంకీ: చైతూ లేకుండా ఎలా కుదురుతుంది? ప్రేక్షకులు కూడా మా ఇద్దర్నీ స్క్రీన్ మీద చూడాలనుకున్నారు. పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది. పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ► పెద్ద మావయ్య బెస్టా? చిన్న మావయ్య బెస్టా? చైతూ: ఎవరి క్వాలిటీస్లో వాళ్లే బెస్ట్. ఇద్దరి మావయ్యల దగ్గర విభిన్నమైన లక్షణాలు ఉన్నాయి. చిన్నవాళ్లంటే కొంచెం చనువు ఉంటుంది కదా. అలా నేను, రానా వెంకీమామతో సరదాగా ఉంటాం. సురేశ్ మామ దగ్గర ఆ సీనియారిటీ ఉంటుంది. ► ఇద్దరు తాతలు (రామానాయుడు, నాగేశ్వరరావు), నాన్న (నాగార్జున), మావయ్యలు (సురేశ్‌బాబు, వెంకటేశ్) వీళ్లందరి పేరు నిలబెట్టాలనే భయం ఉంటుందా? చైతూ: భయం కంటే బాధ్యతగా ఉంటుంది. 4–5 సినిమాలు చేశాక మన మీద అంచనాలు, బాధ్యతలు చాలా ఉన్నాయి అని అర్థం అయింది. ► వెంకీగారు చేసిన సినిమాల్లో మీకు నచ్చినవి? చైతూ: చాలా సినిమాలున్నాయి. మామ ఒకరకమైన సినిమాలకే అతుక్కుపోలేదు. అన్ని జానర్లను టచ్ చేశారు. ఎలాంటి సినిమా చేసినా కన్విన్స్ చేస్తారు. ► మామూలుగా వెంకటేశ్‌గారి కామెడీ టైమింగ్ బావుంటుంది కదా... మీకు ఆయనతో ఈ సినిమా చేయడం ఇబ్బంది ఏమైనా అనిపించిందా? చైతూ: చాలా ఇబ్బంది అనిపించింది. యాక్ట్ చేసేప్పుడు ఇబ్బంది పడ్డాను. కానీ మామ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. వెంకీ మామ ముందే కామెడీ చేసే అవకాశం రావడం వల్ల చాలా నేర్చుకున్నాను. ► ఈ సినిమా చేస్తున్నప్పుడు నిజజీవితంలో మీ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా గుర్తొచ్చాయా? వెంకీ: అలా ఏం లేదు. మేమిద్దరం ఎలాంటి వాళ్లం అంటే.. దేనికీ ఎగ్జయిట్ అయిపోం. కూల్ గా ఉంటాం. ఈ సినిమా ప్రయాణం అద్భుతంగా ఉంది. మా ఫ్యామిలీ చాలా ఆనందంగా ఉన్నారు. ► అన్నయ్య, అబ్బాయి కలిసి సినిమా చేయడం మీ అమ్మగారికి ఎలా ఉంది. చైతూ: చాలా సంతోషంగా ఉన్నారు. మా ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, మా కామెడీ బాగా నచ్చింది. బాగా కనెక్ట్ అయ్యారు. నన్ను మిలటరీ పాత్రలో చూడటం సంతోషంగా ఉంది అన్నారు. ► ఎవరైనా ప్లస్సుల గురించే మాట్లాడతారు. మీ మావయ్య గురించి ఓ మైనస్ చెప్పండి. చైతూ: అస్సలు ఏం లేదు. ► కోప్పడతారా? చైతూ: ఈ సినిమా షూటింగ్ చేసే ముందు వరకూ ఎక్కువ నవ్వుతూనే చూశాను. కానీ షూటింగ్ అప్పుడే కోప్పడటం చూశాను. అది పని కోసమే. వెంకటేశ్: ఎక్కడో వస్తుంది. కానీ ముందుకన్నా బాగా తగ్గించాను. అప్పుడు టెంపర్ ఫుల్‌గా ఉండేది. ఇద్దరం చాలా కామ్‌గా ఉంటాం. ► మీరు చైతన్య వయసులో ఉన్నప్పటితో పోలిస్తే చైతన్య మీ కంటే కూల్ అనుకుంటా? వెంకీ: అందులో డౌటే లేదు. నా కెరీర్ ప్రారంభంలో నాకు కొంచెం టెంపర్ ఎక్కువ ఉందేది. ఇరిటేషన్ ఎక్కువగా ఉండేది. అంత కంఫర్ట్‌బుల్‌గా ఉండేది కాదు. ఈ సీన్ ఇంకా బెటర్‌గా చేసుండొచ్చు అనుకుండేవాణ్ణి. మెల్లిగా కూల్ అయ్యాను. చాలా హ్యాపీ. తన మైనస్ అంటే నాకంటే సెలెంట్. అది బయటవాళ్లకు మైనస్‌లా కనిపించవచ్చు. కానీ మాకు అలా ఉండటం చాలా సౌకర్యంగా ఉంటుంది. ► చైతూ చిన్నప్పుడు చేసిన చిలిపి పనులేమైనా..? వెంకీ: అస్సలు లేవు. చాలా బుద్ధిగా ఉండేవాడు. బొద్దుగా కూడా (నవ్వుతూ). ఇప్పుడు ఫుల్ ఫిట్‌గా ఉంటున్నాడు. హెల్దీఫుడ్ తీసుకుంటాడు. తన లైఫ్ స్టయిల్ కూడా డీసెంట్. ► ఫిట్నెస్ గురించి టిప్స్ పంచుకుంటారా? వెంకీ: నేను అడిగేవాణ్ణి. తను యంగ్. అద్భుతంగా పర్ఫెక్ట్ బాడీ మెయింటెయిన్ చేస్తున్నాడు. మనం వాళ్ల నుంచి నేర్చుకోవాలి. చైతన్యే అని కాదు యంగ్‌స్టర్స్ నుంచి నేర్చుకోవాలి. రానా దగ్గర నుంచి కూడా. వాడి ఫిట్నెస్ కంటే కూడా బిజినెస్ సైడ్. వాడు మా నాన్నలానే. సినిమాలంటే వాడికి చాలా ప్యాషన్. ► చైతూని పెళ్లికొడుకు గా చూసినప్పుడు ఎలా అనిపించింది? వెంకీ: కొత్త లైఫ్ ప్రారంభించబోతున్నాడు. మంచి పార్ట్నర్ని ఎంచుకున్నాడు. వాళ్లు ఒకరినొకరు గౌరవించుకునే విధానం బాగుంటుంది. ► నేను కావాలా? మీ మామయ్యా? అని సినిమాలో మీ హీరోయిన్ అంటుంది. నిజ జీవితంలో అలాంటి సందర్భం ఎదురైతే? వెంకీ: అవన్నీ సినిమాలో. బయట వాడు చాలా క్లియర్‌గా ఉంటాడు. (నవ్వుతూ). ► వెంకీ ఆసనం నేర్పిస్తున్నారా? వెంకీ: వాడికి అవసరమే లేదు. నో ఫ్రస్ట్రేషన్. ఓన్లీ కూల్. ఫ్రస్ట్రేషన్ ఉన్నా కూల్‌గా డీల్ చేస్తాడు. ► మామ నుంచి నేర్చుకున్న విషయం. చైతూ: కామ్‌గా ఉండటం. పాజిటివ్‌గా ఉండటం. ఏ ప్రాబ్లమ్ వచ్చినా అరిచి గోల చేయకుండా స్మూత్‌గా డీల్ చేయడం. ► వెంకిమామ ఆధ్యాత్మిక పాఠాలేమైనా చెబుతారా? చైతూ: అప్పుడప్పుడు సంభాషణల మధ్యలో వస్తుంటాయి. అర్థం అయినవి తీసుకుంటుంటాను. అన్నీ అర్థం చేసుకునే అవగాహన నాకు లేదు. -
సిక్స్ ప్యాక్ తేజ్
ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్.. రీసెంట్గా రామ్ సిక్స్ ప్యాక్ బాడీతో విలన్ల బెండు తీశారు. ఇంకా ఆరు పలకల దేహంతో కనిపించిన హీరోలు చాలామందే ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సాయితేజ్ పేరు కూడా చేరబోతోంది. మారుతి దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ప్రతి రోజూ పండగే’. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటించారు. సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రధారులు. ఈ సినిమాలోని రెండు యాక్షన్ సీక్వెన్సెస్‌లో సాయి తేజ్ సిక్స్‌ప్యాక్ బాడీతో కనిపిస్తారు. ఆ రెండు ఫైట్స్‌లో హోమం నేపథ్యంలో వచ్చే ఫైట్ సీన్ ఒకటి. ఈ రెండు ఫైట్లు హైలైట్‌గా నిలుస్తాయట. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. -
మా ఆయన గొప్ప ప్రేమికుడు
‘‘మా ఆయన పేరు శీనయ్య. ఆయన ప్రపంచంలోనే గొప్ప ప్రేమికుడు’’ అంటోంది సువర్ణ. ఈ భార్యాభర్తల కథేంటి? అసలు వాళ్ల ప్రేమకథేంటి? తెలియాలంటే వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం వరకూ వెయిట్ చేయాలి. విజయ్ దేవరకొండ హీరోగా రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్ థెరీసా, ఇజబెల్లా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేయస్ రామారావు సమర్పణలో కేఎ వల్లభ నిర్మించారు. ఈ సినిమాలోని హీరోయిన్ల పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్లు రిలీజ్ చేస్తోంది చిత్రబృందం. గురువారం ఐశ్వర్యా రాజేశ్, విజయ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సువర్ణ అనే గృహిణి పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ కానుంది. -
నా జీవితంలో ఆ రెండూ ప్లాన్ చేయకుండా జరిగినవే!
‘‘జీవితంలో మనకు ఎదురయ్యే వైఫల్యాలే మనకు ఎక్కువ పాఠాలు నేర్పుతాయి. నేనూ చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొన్నిసార్లు తప్పులు జరుగుతుంటాయి. అప్పుడు నా నిర్ణయ లోపం ఎక్కడ ఉందో పరిశీలించుకుంటాను. నటుడిగా నన్ను మరింత మెరుగుపరచుకునేందుకు ప్రయత్నిస్తాను. సినిమా విడుదల సమయంలో సోషల్ మీడియా కామెంట్స్‌ని పట్టించుకుంటాను. కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు చూస్తుంటాను. కానీ ఆ విమర్శలను కూడా సానుకూలంగా తీసుకుని ముందుకు వెళ్లినప్పుడే లైఫ్ బాగుంటుంది’’ అన్నారు నాగచతైన్య. కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటించిన చిత్రం ‘వెంకీమామ’. ఇందులో పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా కథానాయికలుగా నటించారు. డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నాగచైతన్య చెప్పిన విశేషాలు. ► భీమవరంలో మొదలైన ఈ కథ కశ్మీర్లో ముగుస్తుంది. కాలేజ్ సెలవుల్లో నేను భీమవరం వెళ్లినప్పుడు వెంకీమామతో నా సందడి మొదలవుతుంది. ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ పాత్ర చేశాను. ► ఈ సినిమాలో కెమెరా వెనకాల సురేష్ మావయ్య, కెమెరా ముందు వెంకటేష్ మావయ్య నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. వెంకటేష్ మావయ్యకు ‘నో హేటర్స్, నో నెగటివ్స్’ అని అందరూ అంటుంటారు. అలా ఎందుకు అంటారో నాకు సెట్లో అర్థమైంది. వెంకటేష్ మావయ్య ఆయన కామెడీ టైమింగ్‌ను మ్యాచ్ చేయడం కష్టం. సురేష్మావయ్య, వెంకటేష్ మావయ్య ప్రణాళిక ప్రకారం అన్నీ జరగాలనుకుంటారు. లేకపోతే కోపం వస్తుంది. ఆ కోపం అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ► సురేష్మావయ్య కథలు వినమని అప్పుడప్పుడు స్క్రిప్ట్స్ పంపిస్తుంటారు. నేను వింటుంటాను. కానీ సురేష్ ప్రొడక్షన్స్‌లో సినిమా చేసే అవకాశం ఎందుకో ఇప్పటివరకు కుదర్లేదు. ఇప్పుడు ‘వెంకీమామ’తో కుదరింది. ఇందులో వెంకటేష్ మావయ్యతో కూడా కలిసి చేశాను. ఇలా ఒకేసారి, ఒకే ఏడాది ఈ రెండూ జరిగాయి. కానీ ఇది ప్లాన్ చేసింది కాదు. అలా జరిగిపోయిందంతే. నా జీవితంలో పెళ్లి, ‘వెంకీమామ’ ప్లాన్ చేసినవి కాదు. ► ‘వెంకీమామ’ మల్టీస్టారర్ కాదనే నా అభిప్రాయం. వెంకటేష్‌గారితో కలిసి నేను ఓ క్యారెక్టర్ చేశానంతే. ఈ కథకు నేను ప్లస్ కాదు. ఈ కథే నాకు ప్ల్లస్ అనుకంటున్నాను. ఈ సినిమాలో విలన్స్ లేరు. పరిస్థితులు, జాతకాల ప్రభావం సినిమాలో పాత్రలపై ప్రతికూలతలను చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. ► సినిమా నేను రఫ్‌గా మొత్తం చూశాను. బాగుంది. సమంత (నాగచైతన్య భార్య) కూడా చూసింది. బాగుందని చెప్పింది. ఈ సినిమానే కాదు నా ప్రతి సినిమా గురించి తన అభిప్రాయం నిర్మొహమాటంగా చెబుతుంది. నేనూ తన సినిమాలకు అంతే చెబుతాను. ► ఈ సినిమా కథను నాన్నగారు (నాగార్జున) వినలేదు. సురేష్మామ పంపిన కథ విని నేనే ఓకే చేశాను. నాన్నగారితో (సొగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ గురించి ప్రస్తావిస్తూ) చేయాల్సిన ప్రాజెక్ట్‌కు ఇంకా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నాన్నగారు, వెంకటేష్ మామలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఇద్దరూ కామ్ పర్సనాలిటీస్. కానీ నిర్ణయాలు మాత్రం చాలా వేగంగా తీసుకుంటారు. ► నేను డైరెక్టర్స్ యాక్టర్‌ని. ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత డైరెక్టర్ చెప్పింది చేసుకుని వెళ్తుంటాను. అనుభవం ఉన్న దర్శకులు అయితే నా నుంచి మరింత నటనను రాబట్టుకోగలరని నా అభిప్రాయం. కొత్త దర్శకులు అయితే నన్ను మరో టేక్ చేయమని చెప్పడానికి మోహమాట పడొచ్చు. అలా యాక్టింగ్ పరంగా నాకు తెలియకుండానే నేను రాజీపడాల్సి వస్తుందేమో. అందుకే కెరీర్లో రెండుమూడు మంచి హిట్స్ సాధించిన తర్వాత కొత్త దర్శకులతో సినిమాలు చేస్తాను. కొత్త దర్శకులు డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కొంతకాలం అనుభవం ఉన్న దర్శకులతోనే సినిమాలు చేయాలనుకునే నా ఆలోచన నాకొక బలహీనత కూడా కావొచ్చు. ► శేఖర్‌కమ్ములగారి దర్శకత్వంలో చేస్తున్న ‘లవ్‌స్టోరీ’ (వర్కింగ్ టైటిల్) చిత్రీకరణ 40 శాతం పూర్తయింది. -
వెంకీ మామ ఫ్యామిలీ ప్యాక్
-
చిరంజీవిగారి సంస్కారం తేజ్‌కి ఉంది
‘‘సాయితేజ్ సినిమా చేస్తున్న ప్పుడు ఇతర పాత్రలకు ప్రాధా న్యం ఉండేలా చూస్తాడు. తన పాత్రతో పాటు ఇతర పాత్రలకు ప్రాముఖ్యత ఇస్తే ఎంత మంచి సినిమా వస్తుందో చిరంజీవిగారికి బాగా తెలుసు. ఆయన లక్షణం తేజ్‌లో ఉంది’’ అన్నారు అల్లు అరవింద్. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడులవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను చిరంజీవి తల్లి అంజనాదేవి విడుదల చేశారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను థియేటర్లో కుటుంబంతో కలిసి చూస్తే వచ్చే ఆనందం వేరు. చెప్పిన టైమ్‌కి మారుతి ఈ సినిమాను చాలా ఎంటర్టైనర్గా తీర్చిదిద్దాడు. ఈ కథకు ఆడియ¯Œ ్స కనెక్ట్ అవుతారు’’ అన్నారు. మారుతి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఇంత వేగంగా పూర్తి కావడానికి సహకరించిన నా టీమ్‌కి, గీతా, యూవీ బ్యానర్స్‌కు థ్యాంక్స్. కథ వినగానే చేద్దామని తేజ్ చెప్పాడు. సత్యరాజ్‌గారు ముందు తాత పాత్ర చేయనన్నారు. కథ విన్నాక ఒప్పుకున్నారు’’ అన్నారు. ‘‘మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘చిత్రలహరి’ సినిమాతో నా సెకండ్ కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటి నుండి మీరు (మెగా అభిమానులు) తలెత్తుకునే సినిమాలే చేస్తాను. ‘ప్రతిరోజూ పండగే’ మీ అంచనాలకు మించి ఉంటుంది. ఇందుకు నాది, మారుతిది గ్యారెంటీ’’ అన్నారు సాయితేజ్. ‘‘అందరికీ నచ్చే సినిమా ఇది. తేజ్‌తో మళ్లీ మళ్లీ పనిచేయాలనుకుంటున్నా. ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు రాశీఖన్నా. సంగీత దర్శకుడు తమన్, నటుడు రావు రమేశ్‌తో పాటు చిత్రబృందం పాల్గొంది. -
అమ్మాయిలూ.. బ్యాగులో పెప్పర్ స్ప్రే పెట్టుకోండి
‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నేను చాలా బిజీగా ఉన్నా. అందుకే బాలీవుడ్ వెళ్లాలనే ఆలోచన లేదు. తెలుగు, తమిళ్, హిందీ.. ఏ భాష అయినా మనం చేసే పాత్రలు బాగుండాలి. ఎక్కడ మంచి పాత్రలొస్తే అక్కడే చేయాలి. అంతేకానీ, బాలీవుడ్లో చేయాలని ప్రాధాన్యత లేని పాత్రలొస్తే చేయను. కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ, నాకు నచ్చక చేయలేదు’’ అన్నారు రాశీఖన్నా. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా, రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీ మామ’. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఈ నెల 13న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాశీఖన్నా చెప్పిన విశేషాలు. ► పాండిచ్చేరిలో ఓ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు సురేష్‌బాబు సార్ నా మేనేజర్‌కి కాల్ చేసి, నాతో మాట్లాడాలన్నారు. హైదరాబాద్ వచ్చేశా. ‘వెంకీ మామ’ గురించి చెప్పగానే కథ కూడా వినకుండా సురేష్ సార్‌పై ఉన్న నమ్మకంతో చేస్తానని చెప్పా. ఆ తర్వాత కథ విన్నాననుకోండి. పాత్ర ఏదైనా నా బెస్ట్ ఇవ్వాలనుకుంటాను. ► చిరంజీవి, వెంకటేశ్సార్ల సినిమాలు హిందీలో డబ్ అయినప్పుడు చూస్తుండేదాన్ని. వెంకటేశ్ సార్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఆయన హావభావాలు భిన్నంగా ఉంటాయి. చైతన్యతో నటించడం సంతోషంగా ఉంది. నేను చేసే సినిమాలో హీరోలు, హీరోయిన్లు ఎంతమంది ఉన్నారు? అని ఆలోచించను. కేవలం సోలో హీరోయిన్‌గానే చేయాలనుకోను. నా పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుందంటే చేస్తానంతే. ఏ రంగంలో అయినా పోటీ అనేది అవసరం.. అప్పుడే మరింత కష్టపడతాం. ► ‘వెంకీ మామ’ చిత్రంలో హారికా అనే ఫిల్మ్ మేకర్ పాత్ర చేశా.. చాలా సరదాగా ఉంటుంది. ప్రస్తుతం నేను నటించిన ‘వెంకీ మామ, ప్రతిరోజూ పండగే’ సినిమాలు వారం గ్యాప్‌లో విడుదలవుతున్నాయి.. దీన్ని నేను ఒత్తిడిగా అనుకోవడం లేదు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలోనూ మంచి పాత్ర చేస్తున్నా. నేను సినిమాలు ఆలస్యంగా సైన్ చేయడం లేదు. వాటి విడుదలలో ఆలస్యం అవుతోందంతే. విడుదల అనేది నా చేతుల్లో ఉండదు కదా? ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా చేసినందుకు నేనిప్పటికీ హ్యాపీ. ఆ సినిమా ఎందుకో ప్రేక్షకులకు నచ్చలేదు. హిట్టు, ఫ్లాపు మన చేతుల్లో ఉండవు. ► మంచి పాత్రలు కుదిరితే వెబ్ సిరీస్, లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తాను. గతంతో పోలిస్తే ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత పెరిగింది.. మంచి పాత్రలొస్తున్నాయి. గతంలో పెళ్లయితే కెరీర్ ముగిసినట్టే. ఇప్పుడు అలాంటిదేం లేదు. సమంతగారు పెళ్లయినా సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉండటం సంతోషం. ► ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన దిశా ఘటన విని చాలా కోపం వచ్చింది.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం తప్ప ఇంకేమీ చేయలేం. ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. అమ్మాయిలు తమను తాము రక్షించుకునేందుకు పెప్పర్ స్ప్రే తప్పకుండా వెంట బెట్టుకోవాలి. మహిళలతోనే కాదు.. తోటి వారితో ఎలా ప్రవర్తించాలో చిన్నతనం నుంచే తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి. -
నాన్నా... ఈ సినిమా మీ కోసమే
‘‘వెంకీమామ’ పక్కా తెలుగు చిత్రం. వల్గారిటీ తప్ప సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయి’’ అన్నారు డి. సురేష్‌బాబు. వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. పాయల్‌రాజ్‌పుత్, రాశీఖన్నా కథానాయికలుగా నటించారు. డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాత. ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాను. కానీ ‘వెంకీమామ’ ప్రత్యేకమైనది. రానా, నాగచైతన్యలతో కలిసి పని చేయాలనుకుంటాను. ఆ కల నేరవేరిందని చెప్పొచ్చు. నాన్నగారు (డి.రామానాయుడు) మా అందరితో సినిమా చేయాలనుకునేవారు. నాన్నగారు ఉండి ఉంటే ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసేవారు. ‘నాన్నా.. ఈ సినిమా మీ కోసమే’. ఇందులో నాగచైతన్య ఆల్‌రౌండర్ పెర్ఫార్మెన్స్ చేశాడు. మామా అల్లుళ్ల కథను చాలా సెన్సిబుల్‌గా తెరకెక్కించాడు బాబీ. తమన్ మంచి సంగీతం ఇచ్చాడు’’ అన్నారు. ‘‘నేను ఎన్ని సినిమాలు చేసినా ‘మనం, వెంకీమామ’ నాకు మంచి జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి. కాస్త ఆలస్యమైనా సురేష్ ప్రొడక్షన్స్‌లో సినిమా చేయాలనే నా ఆశ నేరవేరింది. ‘ప్రేమమ్’ సినిమాలో ఓ చిన్న సన్నివేశంలో మామయ్య వెంకటేష్‌గారితో కలిసి నటించినప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇప్పుడు ‘వెంకీమామ’లో మామయ్యతో కలిసి చేయడం చాలా సంతోషంగా ఉంది. రాశీతో కలిసి ఇంకా సినిమాలు చేయాలని ఉంది’’ అన్నారు నాగచైతన్య. ‘‘వెంకీమామ’ సినిమా షూటింగ్ టైమ్‌లో నా మామయ్య సురేంద్ర నాకు గుర్తుకు వచ్చారు. అలా ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరికీ వాళ్ల జీవితాల్లోని వారి మామయ్యలు గుర్తుకు వస్తారు. బాబీ సినిమాను బాగా తీశాడు. నాకు సినిమా అంటే చాలా భయం. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూశాను. నాకంటూ ఓ అభిప్రాయం ఉన్నప్పటికీ ఇతరుల అభిప్రాయల కోసం కంగారుగా ఎదురుచూస్తుంటాను. ఈ సినిమాను తొలిసారి తమన్ చూశాడు. చాలా ఎమోషనల్‌గా ఉందన్నాడు. వెంకటేశ్, నాగచైతన్యలు కూడా చూసి బాగుందన్నారు. మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమా నచ్చిందన్నారు. చివర్లో వచ్చి సినిమాలో చాలా కీలకమైన పాత్ర చేసిన ప్రకాశ్‌రాజ్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు డి. సురేష్‌బాబు. ‘‘సురేష్‌బాబుగారికి కథ చెప్పబోతున్నాను అన్నప్పుడు కొందరు భయపెట్టారు. ఆయన బుక్ లాంటి వారు అన్నారు. నేను కథ చెప్పిన తర్వాత ‘సూపర్బ్ సూపర్బ్’ అన్నారు. ఈ సినిమా చూసేప్పుడు ప్రతి ఇంట్లో ఉన్న మేనమామకి తన అల్లుడు, అల్లుడికి తన మామ గుర్తుకు వస్తారు. వెంకటేష్‌గారికి కథ చెప్పినప్పుడు.. చైతూ పాత్రను ఇంకొంచెం బాగా చేయమన్నారు. అప్పడు నాకు మరింత తెలిసింది.. నిజమైన మామాఅల్లుళ్ల బంధం గురించి. ఇద్దరూ బాగా నటించారు’’ అన్నారు బాబీ. ‘‘భావోద్వేగ సన్నివేశాల్లో వెంకటేష్‌గారు మాస్టర్. ఇక ఈ సినిమాలో నాగచైతన్య కూడా ఎమోషనల్ సీన్స్‌లో బాగా నటించారు’’ అన్నారు వివేక్ కూచిభొట్ల. ‘‘ఎమోషన్స్‌తో కూడిన ఎంటర్టైనింగ్ చిత్రం ఇది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ‘‘వెంకటేష్‌గారితో నాకు కొన్ని కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. చైతూ మంచి కో–స్టార్’’ అన్నారు రాశీఖన్నా. -
బర్త్‌డేకి మామాఅల్లుళ్లు
వెంకటేశ్, నాగచైతన్యల మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’ విడుదల తేదీపై ఓ స్పష్టత వచ్చేసింది. మామా అల్లుళ్లను స్కీన్ర్ మీద ఎప్పుడెప్పుడు చూడాలా? అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి రిలీజ్ డేట్ కన్ఫర్మేషన్ ఇచ్చేసింది చిత్రబృందం. కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వెంకీ మామ’. పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా కథానాయికలు. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. డిసెంబర్ 13 వెంకటేశ్ బర్త్‌డే. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను దర్శకుడు బాబీ, హీరో రానా ఓ సరదా వీడియో రూపంలో ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్. తమన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల. -
సంక్రాంతికి ముందే వస్తున్న‘వెంకీమామ’
రియల్ లైఫ్‌లో మామా అల్లుళ్లు అయిన హీరోలు వెంకటేశ్, నాగచైతన్య రీల్ లైఫ్‌లో మామా అల్లుళ్లుగా నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. . కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ ఈ చిత్రంలో కథానాయికలు. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమా కోసం దగ్గుపాటి, అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13న సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా,అక్కినేని నాగచైతన్య, రాశీఖన్నా పుట్టినరోజుల సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి వారి టీజర్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నిజానికి ‘వెంకీమామ’ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఆ సమయంలో మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలు వస్తుండటంతో విడుదల వాయిదా పడుతుందని అన్నారు. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13న సినిమాను విడుదల చేస్తుంది చిత్ర బృందం. రానా చెవిలో విడుదల తేది.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘వెంకీ మామ’ విడుదల తేది గురించి తెగ చర్చ జరిగింది. దీన్నే చిత్ర బృందం సినిమా విడుదల తేది కోసం ఉపయోగించుకుంది. సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ హీరో రానా దగ్గుబాటి, డైరెక్టర్ బాబీ ఓ ఫన్నీ వీడియో విడుదల చేశారు. ‘వెంకీ మామ’పై సోషల్ మీడియాలో వస్తున్న ప్రశ్నలను చూసిన రానా.. నేరుగా దర్శకుడు బాబీ దగ్గరకు వెళ్లి అడుగుతాడు. సినిమా విడుదల తేది ఎప్పుడో కనీసం తనకైనా చెవిలో చెప్పమంటాడు. రానా చెవిలో బాబీ విడుదల తేది డిసెంబర్ 13 అని చెబుతాడు. -
సందేశాన్ని కూడా సరదాగా చెబుతాడు
‘‘జీఏ2 యూవీ పిక్చర్స్ పతాకంపై మారుతి దర్శకత్వంలో మేం తీసిన ‘భలే భలే మగాడివోయ్’ మంచి హిట్ అయింది. ఆ సినిమా తర్వాత మారుతితో మరో మంచి చిత్రం తీయాలని ‘ప్రతిరోజూ పండగే’ తీశాం. మారుతిది ప్రత్యేక శైలి. సందేశాన్ని కూడా సరదాగా చెబుతాడు’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సాయితేజ్, రాశీఖన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 యూవీ పిక్చర్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మించారు. ఈ సినిమా పాట చిత్రీకరణ చివరి రోజు భాగంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఎన్ఆర్ఐల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. చాలా రోజుల తర్వాత మావాడు (సాయితేజ్) గీతా ఆర్ట్స్ బ్యానర్లో నటిస్తున్నాడు. ఇందులో రాశీఖన్నా అదిరిపోయే పాత్ర చేసింది’’ అన్నారు. మారుతి మాట్లాడుతూ– ‘‘అరవింద్‌గారికి కథ చెప్పేటప్పుడు ఎంత సౌకర్యంగా ఉంటుందో సినిమా తీసేటప్పుడు మాపై అంత బాధ్యత ఉంటుంది. కాబట్టి ఒళ్లు దగ్గర పెట్టుకుని ఈ సినిమా తీశా. ఇది ఫుల్ మీల్స్‌లాంటి సినిమా. డిసెంబర్ 20న సినిమాని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. సాయితేజ్ మాట్లాడుతూ– ‘‘గీతా ఆర్ట్స్‌లో, యూవీ క్రియేషన్స్‌లో చేయాలని చాలా రోజులుగా అనుకుంటుంటే ఇప్పటికి కుదిరింది. మారుతిగారు కథ చెప్పగానే ఎగై్జట్ అయ్యాను. సినిమా చూస్తున్నంత సేపు నిజ జీవితాలను చూసినట్లు ఉంటుంది. అందరూ కనెక్ట్ అవుతారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ఏంజెలా అనే టిక్‌టాక్ సెలబ్రిటీగా చేశా’’ అన్నారు రాశీఖన్నా. ‘‘తేజుకి, నాకు ఈ సినిమాతో మారుతిగారు మంచి సక్సెస్ ఇస్తున్నారు’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. నిర్మాతలు ‘బన్నీ’ వాసు, వంశీ, సహ నిర్మాత ఎస్కేఎన్, కెమెరామేన్ జై, డ్యాన్స్‌మాస్టర్ శేఖర్ పాల్గొన్నారు. -
‘వెంకీమామ’ విడుదల ఎప్పుడమ్మా
వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా కథానాయికలుగా నటించారు. డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. మరి.. ‘వెంకీ మామ’ విడుదల ఎప్పుడమ్మా? అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. తాజా సమాచారం ఏంటంటే.. ఈ చిత్రాన్ని డిసెంబరు 25న విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోందట. జనవరి 14వ తేదీని కూడా పరిశీలిస్తున్నారని టాక్. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాత. -
ప్రేమికుల రోజున..
ప్రేమికుల దినోత్సవం రోజు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు విజయ్ దేవరకొండ. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇజబెల్లా, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కేయస్ రామారావు సమర్పణలో కేయస్ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక్క షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేస్తోంది చిత్రబృందం. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14) రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ ఒకటికి మించి లుక్స్‌తో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్. -
‘16వ ఏటనే ఒక అబ్బాయితో డేటింగ్ చేశా’
కోలీవుడ్‌లో కథానాయకిగా ఎదిగిన నటి రాశీఖన్నా. తెలుగు, హిందీ, కన్నడం, తమిళం భాషా చిత్రాల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోందీ బ్యూటీ. ఇలా ఏదో ఒక భాషలో నటిస్తూ బిజీగానే ఉంది. కాగా ఈ బ్యూటీ కోలీవుడ్‌కు ఇమైకా నొడిగళ్ చిత్రంతో దిగుమతి అయిన విషయం తెలిసిందే. అందులో ప్రధాన పాత్రలో నయనతార నటించినా ఈ అమ్మడుమంచి గుర్తింపునే తెచ్చుకుంది. తరువాత వరుసగా జయంరవితో అడంగమరు, విశాల్ సరసన అయోగ్య వంటి చిత్రాల్లో నటించి సక్సెస్ఫుల్ నాయకిగా ముద్రవేసుకుంది. విజయ్‌సేతుపతితో రొమాన్స్ చేసిన సంఘతమిళన్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి మంచి టాక్‌తో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా రాశీఖన్నా ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం కమర్శియల్ కథా పాత్రల్లో నటిస్తున్నా, మంచి సామాజిక బాధ్యత కలిగిన పాత్రల్లో నటించాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చింది. గ్లామర్ విషయంలోనూ తనకంటూ హద్దులు ఉన్నాయని చెప్పింది. అందుకే గ్లామరస్ పాత్రల్లో నటించమని కొందరు దర్శకులు ఒత్తిడి చేసినా ఆ పాత్రల్లో నటించడానికి నిరాకరించినట్లు తెలిపింది. ప్రస్తుతం కమర్శియల్ కథా పాత్రల్లో నటిస్తున్నా, భవిష్యత్‌లో మంచి సందేశాత్మక కథా పాత్రల్లో నటిస్తానని చెప్పింది. అలా హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాల నాయకిగా ఎదగాలని ఆశిస్తున్నట్లుందీ భామ. అందరూ డేటింగ్ గురించి అడుగుతున్నారని, తాను 16వ ఏటలోనే ఒక అబ్బాయితో డేటింగ్ చేశానని చెప్పింది. ఆ కుర్రాడి వయసు అప్పుడు 16 ఏళ్లేనని తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి కోలీవుడ్‌లో సైతాన్ కా బచ్చా అనే చిత్రం మాత్రమే చేతిలో ఉంది. అయితే తెలుగులో మాత్రం మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగానే ఉంది. -
డిసెంబరులో సందడి?
వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వెంకీమామ’. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా కథానాయికలుగా నటించారు. డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాత. ఈ చిత్రాన్ని డిసెంబరు 13న విడుదల చేయాలనుకుంటున్నారని తాజా సమాచారం. రియల్‌లైఫ్‌లో మేనమామ, మేనల్లుడు అయిన వెంకటేశ్, నాగచైతన్య రీల్ లైఫ్‌లో మామ, అల్లుడిగా డిసెంబరులో వెండితెరపై సందడి చేయబోతున్నారన్నమాట. రిలీజ్ డేట్‌పై అతి త్వరలో అధికారిక ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉంది. -
రెట్రో స్టెప్పులు
ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లి ‘ఎన్నాళ్లకో..’ అంటూ స్టెప్పులేశారు వెంకటేష్. ఈ రెట్రో స్టెప్పులు ‘వెంకీమామ’ చిత్రం కోసమే. వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కె.ఎస్. రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వెంకీమామ’. పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. డి.సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాత. ‘వెంకీమామ’ టైటిల్ సాంగ్‌ను ఇటీవల విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ‘ఎన్నాళ్లకో..’ అనే మరో పాటను నేడు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. శ్రీమణి లిరిక్స్ అందించిన ఈ పాటని పృథ్వీచంద్ర పాడారు. వెంకటేష్, పాయల్ రాజ్‌పుత్‌లపై తెరకెక్కించిన పాట ఇది. ‘‘1980 నేపథ్యంలో సాగే రెట్రో సాంగ్ ఇది. తమన్ మంచి సంగీతం ఇచ్చారు. ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ∙వెంకటేశ్, పాయల్ రాజ్‌పుత్ -
విజయ్ సేతుపతితో స్టార్డమ్ వస్తుంది
‘‘విజయ్ సేతుపతిలో ఎనర్జీ లెవల్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. ‘విజయ్ సేతుపతి’ సినిమాతో తెలుగులో తనకు స్టార్డమ్ వస్తుందని నమ్ముతున్నాను’’ అని దర్శకుడు వి. సముద్ర అన్నారు. విజయ్ సేతుపతి, రాశీఖన్నా జంటగా విజయ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘సంగ తమిళ్’. విజయా ప్రొడక్షన్స్‌పై భారతీరెడ్డి నిర్మించిన ఈ సినిమాని హర్షిత మూవీస్ పతాకంపై రావూరి వి. శ్రీనివాస్ ‘విజయ్ సేతుపతి’గా తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రావూరి వి. శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ఒక మంచి సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ఏయమ్ రత్నంగారు పవన్ కళ్యాణ్‌గారి కాంబినేషన్లో సినిమా అనే వార్తలు వస్తున్నప్పుడు పవన్‌గారి కోసం ఈ కథ రాశా. ఆయన రాజకీయాల్లో ఉండటంతో కుదరలేదు. విజయ్ సేతుపతి కథ వినగానే మెచ్చుకున్నారు’’ అన్నారు విజయ్ చందర్ .