బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘వెంకీ మామ’ | Venky Mama Pulls In Rs 72 Crore Globally Over 3rd Week | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘వెంకీ మామ’

Published Thu, Dec 26 2019 10:00 PM | Last Updated on Thu, Dec 26 2019 10:05 PM

Venky Mama Pulls In Rs 72 Crore Globally Over 3rd Week - Sakshi

రియల్‌ లైఫ్‌లో మామా అల్లుళ్లు అయిన హీరోలు వెంకటేశ్, నాగచైతన్య రీల్‌ లైఫ్‌లో మామా అల్లుళ్లుగా నటిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. డిసెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వెంకీ మామ’  తొలి రోజు నుంచే రికార్డ్ స్థాయిలోవసూళ్లు సాధిస్తోంది. వెంకటేష్‌, నాగచైతన్యల కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఈ సినిమా, మూడో వారంలోనూ​మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది. రూలర్‌, ప్రతి రోజూ పండగే లాంటి సినిమాలు విడుదలైన కూడా వెంకీ మామ జోరు తగ్గలేదు.

మూడు వారల్లో రూ.72 కోట్లు వసూళ్లు చేసి మామ అల్లుళ్ల సత్తాను చూపించారు. మరొ కొద్ది రోజుల పాటు కలెక్షన్లు ఇలాగే కొనసాగితే 100 కోట్ల క్లబ్‌లో ఈజీగా చేరుతుందని సీనీవర్గాల టాక్‌. కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. సురేశ్‌ ప్రొడక్షన్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జాతకాల నేపథ్యంలో సాగుతుంది. మేనల్లుడి కోసం జీవితాన్ని త్యాగం చేసే మామగా వెంకటేశ్‌, మావయ్య కోసం అన్నింటినీ వదులుకున్న అల్లుడిగా నాగచైతన్య వారి వారి పాత్రల్లో జీవించారు. అనుకోని పరిస్థితుల్లో ఒకరి ఒకరు దూరమైన ఈ మామాఅల్లుళ్లు ఎలా ఒక్కటయ్యారనే ఆసక్తికర కథా, కథనాలతో రూపొందిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement