Venky Mama
-
ప్రౌడ్ ఆఫ్ యూ బావ : హారిక
దర్శకుడు కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహించిన ‘వెంకీ మామ’ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్, నాగచైనత్య హీరోలుగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం 2019 డిసెంబర్లో విడుదలైన తెలుగు సినిమాలన్నింటిల్లో కెల్లా అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిందని చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది. దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక.. సో ప్రౌడ్ ఆఫ్ యూ బావ అని బాబీకి ట్వీట్ చేశారు. హారిక ట్వీట్‌కు బాబీ ధన్యవాదాలు తెలిపారు. కాగా, హారిక సోదరిని బాబీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి ఓ పాప కూడా ఉంది. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్న హారిక.. గతేడాది పద్మశ్రీ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. Thank you @HarikaDronavali 😊 https://t.co/WWycESE1S0 — Bobby (@dirbobby) January 3, 2020 -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘వెంకీ మామ’
రియల్ లైఫ్‌లో మామా అల్లుళ్లు అయిన హీరోలు వెంకటేశ్, నాగచైతన్య రీల్ లైఫ్‌లో మామా అల్లుళ్లుగా నటిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వెంకీ మామ’ తొలి రోజు నుంచే రికార్డ్ స్థాయిలోవసూళ్లు సాధిస్తోంది. వెంకటేష్, నాగచైతన్యల కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఈ సినిమా, మూడో వారంలోనూమంచి వసూళ్లతో దూసుకెళ్తుంది. రూలర్, ప్రతి రోజూ పండగే లాంటి సినిమాలు విడుదలైన కూడా వెంకీ మామ జోరు తగ్గలేదు. మూడు వారల్లో రూ.72 కోట్లు వసూళ్లు చేసి మామ అల్లుళ్ల సత్తాను చూపించారు. మరొ కొద్ది రోజుల పాటు కలెక్షన్లు ఇలాగే కొనసాగితే 100 కోట్ల క్లబ్లో ఈజీగా చేరుతుందని సీనీవర్గాల టాక్. కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా జాతకాల నేపథ్యంలో సాగుతుంది. మేనల్లుడి కోసం జీవితాన్ని త్యాగం చేసే మామగా వెంకటేశ్, మావయ్య కోసం అన్నింటినీ వదులుకున్న అల్లుడిగా నాగచైతన్య వారి వారి పాత్రల్లో జీవించారు. అనుకోని పరిస్థితుల్లో ఒకరి ఒకరు దూరమైన ఈ మామాఅల్లుళ్లు ఎలా ఒక్కటయ్యారనే ఆసక్తికర కథా, కథనాలతో రూపొందిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటోంది. -
అనాథ పిల్లలకు ‘వెంకీ’మామ గిఫ్ట్
రియల్ లైఫ్ మామ అల్లుడు విక్టరీ వెంకటేష్, నాగచైతన్య రీల్ లైఫ్‌లో కలిసి నటించిన ‘వెంకీమామ’ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. కడుపుబ్బా నవ్విస్తున్న ఈ చిత్రం సినిమా యూనిట్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా వెంకీ అనాథ పిల్లలను కలిసి వారితో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఆ పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు వెంకీతో సెల్ఫీలు తీసుకుని ఆనందపడ్డారు. అనాథ పిల్లల ప్రేమను చూసిన వెంకీ వారిని దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా హత్తుకున్నారు. అనంతరం వాళ్లందరి కోసం ‘వెంకీమామ’ ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. వారికి క్రిస్మస్ కానుకలను కూడా అందించాడు. దీంతో ఊహించని సర్ప్రైజ్కు అనాథ పిల్లలు ఎంతగానో సంతోషించారు. ప్రస్తుతం వెంకీ వారితో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా డిసెంబరు 13న విడుదలైన వెంకీమామ జోరు ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ చిత్రంలో మామ వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్, అల్లుడు నాగచైతన్యకు జోడీగా రాశి ఖన్నా నటించారు. (చదవండి: మామాఅల్లుళ్ల జోష్) -
మామాఅల్లుళ్ల జోష్
గుంటూరు ఈస్ట్: బ్రాడీపేట ఏఈఎల్‌ఎం పాఠశాల గ్రౌండ్లో శుక్రవారం జరిగిన వెంకీ మామ చిత్ర విజయోత్సవ సభకు హాజరైన చిత్రయూనిట్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. విశేష సంఖ్యలో తరలి వచ్చిన అభిమానుల కేరింతలు, వెంకీ మామా అంటూ చిత్రంలోని పాటలు పాడుతూ ప్రాంగణం హోరెత్తింది. దర్శకుడు కె.ఎస్.రవీంద్ర (బాబి) మాట్లాడుతూ ఆకాశమంత ప్రేక్షకుల ప్రేమ ఈ చిత్రాన్ని ఘన విజయం వైపు నడిపించిందన్నారు. చిత్రంలోని కొన్ని సన్నివేశాలు స్క్రీన్‌పై ప్రదర్శిస్తూ యాంకర్ శ్రీముఖి, కథానాయకి పాయల్‌రాజ్‌పుత్ చేసిన వ్యాఖ్యానం, పాటలు, నృత్యాలు, శ్రీముఖి యాంకరింగ్‌తో విజయోత్సవ సభ ధూమ్ ధామ్‌గా సాగింది. కథానాయకుడు విక్టరీ వెంకటేష్ తనదైన మేనరిజంతో, డైలాగులతో అభిమానులను ఆకట్టుకున్నారు. అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ వేదిక ముందు ఉన్నవారి ఎనర్జీకి తాను వారికి ఫ్యాన్స్ అయ్యానంటూ కితాబిచ్చారు. చక్కటి చిత్రాన్ని మేము మీముందుంచాం. అది బ్లాక్‌బస్టర్ అవ్వాలంటే అభిమానుల వల్లే సాధ్యమవుతుందన్నారు.తొలుత అభిమానులు భారీ ర్యాలీతో చిత్ర యూనిట్‌ను ప్రాంగణానికి తీసుకొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయ కర్త చంద్రగిరి ఏసురత్నం, సురేష్ మూవీస్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ గుంటూరు బ్రాంచ్ మేనేజర్ మాదాల రత్తయ్య చౌదరి, ఈవీవీ యువ కళావాహిని వ్యవస్థాపకులు వెచ్చా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
వెంకీమామ విజయోత్సవ వేడుక
-
‘వెంకీ మామ’పై చిరంజీవి ప్రశంసలు
రియల్ లైఫ్ మామ-అల్లుడు వెంకటేశ్, నాగచైతన్య రీల్ లైఫ్‌లో కూడా అదే పాత్రల్లో నటించిన చిత్రం ‘వెంకీ మామ’. డిసెంబర్ 13న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకెళుతూ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా వెంకీ మామ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వెంకటేశ్, నాగచైతన్య నటనపై ప్రశంసలు కురిపించారు. అలాగే డైరక్టర్ బాబీ(కేఎస్ రవీంద్ర) అభినందనలు తెలిపారు. ‘వెంకటేశ్ తనదైన స్టైల్లో కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్స్ సీన్స్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. చాలా కాలం తర్వాత వెంకటేశ్ యాక్షన్ సీన్స్‌లో వావ్ అనిపించాడు. మామకు తగ్గ అల్లుడిగా నాగచైతన్య కూడా చాలా చక్కగా నటించాడు. దర్శకుడు బాబీ తనదైన టేకింగ్, ట్రీట్మెంట్, స్ర్కీన్‌ప్లేతో సినిమాను చక్కగా రూపొందించి శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు ప్రతి ఒక్కరికి నా అభినందనలు’ అని చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా బాబీ, నాగచైతన్యలు ట్విటర్ వేదికగా చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. ‘వెంకీ మామ గురించి ఇంత అద్భుతమైన మాటలు చెప్పిన చిరంజీవి గారికి కృతజ్ఞతలు. ఒక అభిమానిగా ఆయన నోటి వెంట ఈ మాటల వినడం.. నా జీవితంలో మరచిపోలేని రోజు’ అని బాబీ ట్వీట్ చేశారు. మహేష్ బాబు కూడా వెంకీ మామ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. వెంకటేశ్, నాగచైతన్యల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని చెప్పారు. తాను ఈ చిత్రంలో ప్రతి సీన్ ఎంజాయ్ చేశానని పేర్కొన్నారు. కాగా, సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రంలో రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. Here's what MEGASTAR Chiranjeevi garu had to say after watching #VenkyMama https://t.co/CAIA3wlzMI#MegastarAboutVenkyMama #BlockbusterVenkyMama #VictoryVenkatesh | @chay_akkineni | @dirbobby | @RaashiKhanna | @starlingpayal | @MusicThaman | @SureshProdns | @peoplemediafcy — Venky Mama (@VenkyMama) December 18, 2019 -
‘వెంకీమామ’ థ్యాంక్స్ మీట్
-
మేకింగ్ ఆఫ్ వెంకీమామ
-
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వెంకీమామ
రియల్ లైఫ్ మామ- మేనల్లుడు అయిన హీరోలు వెంకటేశ్- నాగచైతన్య రీల్ లైఫ్‌లోనూ అదే పాత్రలు పోషించిన చిత్రం ‘వెంకీమామ’కు అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. వెంకటేశ్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 13న విడుదలైన ఈ సినిమా వసూళ్లలో దూసుకుపోతుంది. కేవలం మూడురోజుల్లోనే 45 కోట్ల రూపాయలు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఈ క్రేజీ మల్లీస్టారర్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ దగ్గుబాటి, అక్కినేని అభిమానులను ఖుషీ చేస్తోంది. కాగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా జాతకాల నేపథ్యంలో సాగుతుంది. మేనల్లుడి కోసం జీవితాన్ని త్యాగం చేసే మామగా వెంకటేశ్, మావయ్య కోసం అన్నింటినీ వదులుకున్న అల్లుడిగా నాగచైతన్య వారి వారి పాత్రల్లో జీవించారు. అనుకోని పరిస్థితుల్లో ఒకరి ఒకరు దూరమైన ఈ మామాఅల్లుళ్లు ఎలా ఒక్కటయ్యారనే ఆసక్తికర కథా, కథనాలతో రూపొందిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటోంది.(వెంకీమామ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Venky Mama gives oxygen to TFI box office, which was dry in last 2 months! #VenkyMama #VictoryVenkatesh, @chay_akkineni, @dirbobby, @SureshProdns @peoplemediafcy @SBDaggubati @vivekkuchibotla @RanaDaggubati pic.twitter.com/FXIl8SeAJD — Madhura Sreedhar Reddy (@madhurasreedhar) December 16, 2019 -
మేకింగ్ ఆఫ్ మూవీ - వెంకీ మామ
-
అందాల రాశీతో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ
-
మా అల్లుడు వెరీ కూల్!
వెంకటేశ్, నాగచైతన్య వరుసకి మేనమామ, మేనల్లుడు. ఇప్పుడు ఆన్‌స్క్రీన్ మీద కూడా మామా అల్లుళుగా ‘వెంకీ మామ’ చేశారు. ‘మా మామ కూల్’ అంటున్నారు చైతన్య. ‘మా అల్లుడు వెరీ కూల్’ అంటున్నారు వెంకటేశ్. ఈ ఇద్దరూ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు? ఫిట్నెస్ సీక్రెట్స్ ఏంటి? ప్లస్‌లు మైనస్‌లు ‘సాక్షి’తో పంచుకున్నారు. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా కథానాయికలు. గత శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా చెప్పిన విశేషాలు. ► రామానాయుడుగారు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. మీ ఇద్దర్నీ స్క్రీన్ మీద చూసి బాగా సంబరపడేవారేమో. వెంకటేశ్: తప్పకుండా. అందరికంటే నాన్నగారు చాలా సంతోషపడేవారు. చైతూ సినిమాల్లోకి రాగానే ఆయన చాలా ఎగ్జయిట్ అయ్యారు. నాన్నకు చైతూ అంటే బాగా ఇష్టం. ‘మీ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయండి’ అంటుండేవారు. అప్పట్లో చాలా కథలు విన్నాం కానీ కుదర్లేదు. ఇంతకాలానికి ఇలాంటి కథ రావడం దాన్ని మేం చేయడం, ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించడం హ్యాపీగా ఉంది. ఫ్యామిలీలు థియేటర్స్‌కి వస్తున్నారు. ► తాతయ్య (రామానాయుడు) మిమ్మల్ని బాగా ముద్దు చేసేవారా? నాగచైతన్య: అవును. చిన్నప్పుడు చాలా బొద్దుగా ఉండేవాణ్ణి. బాగా ముద్దు చేసేవారు. ‘ఏం చేస్తావు రా’ అని అడిగేవారు. ‘ఇంజనీరింగో ఏదో ఒకటి చేస్తా తాతా’ అనేవాణ్ణి. విని నవ్వేవారు. ‘ఇప్పుడు ఇలానే అంటావు లే తర్వాత చూద్దాం’ అనేవారు. నేను హీరో అయ్యాక మనం సినిమా చేద్దాం, నువ్వే కథ తీసుకొని రా అంటుండేవారు. నన్ను, వెంకి మామను పెట్టి సినిమా తీయాలన్నది ఆయన కోరిక. ఒకవేళ తాతగారు ఉండి ఉంటే ఈ సక్సెస్‌ను ఆయనే ఎక్కువ ఎంజాయ్ చేసేవారు. ► ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నాం అని తెలిసినప్పుడు ఏమైనా ఒత్తిడిగా అనిపించిందా? వెంకీ: ఇద్దరి పాత్రలు మంచిగా ఉన్నాయి. అన్ని ఎమోషన్స్ తగినన్ని ఉన్నాయి. ఫస్ట్ హాఫ్‌లో వినోదం సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ సీన్స్, ఫైట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. ఈ సినిమా చేయడాన్ని కూడా బాగా ఎంజాయ్ చేశాం. ► కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. చైతూ కాకుండా వేరే హీరో ఉన్నా ఇలానే ఉండేదా? వెంకీ: చైతూ లేకుండా ఎలా కుదురుతుంది? ప్రేక్షకులు కూడా మా ఇద్దర్నీ స్క్రీన్ మీద చూడాలనుకున్నారు. పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది. పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ► పెద్ద మావయ్య బెస్టా? చిన్న మావయ్య బెస్టా? చైతూ: ఎవరి క్వాలిటీస్లో వాళ్లే బెస్ట్. ఇద్దరి మావయ్యల దగ్గర విభిన్నమైన లక్షణాలు ఉన్నాయి. చిన్నవాళ్లంటే కొంచెం చనువు ఉంటుంది కదా. అలా నేను, రానా వెంకీమామతో సరదాగా ఉంటాం. సురేశ్ మామ దగ్గర ఆ సీనియారిటీ ఉంటుంది. ► ఇద్దరు తాతలు (రామానాయుడు, నాగేశ్వరరావు), నాన్న (నాగార్జున), మావయ్యలు (సురేశ్‌బాబు, వెంకటేశ్) వీళ్లందరి పేరు నిలబెట్టాలనే భయం ఉంటుందా? చైతూ: భయం కంటే బాధ్యతగా ఉంటుంది. 4–5 సినిమాలు చేశాక మన మీద అంచనాలు, బాధ్యతలు చాలా ఉన్నాయి అని అర్థం అయింది. ► వెంకీగారు చేసిన సినిమాల్లో మీకు నచ్చినవి? చైతూ: చాలా సినిమాలున్నాయి. మామ ఒకరకమైన సినిమాలకే అతుక్కుపోలేదు. అన్ని జానర్లను టచ్ చేశారు. ఎలాంటి సినిమా చేసినా కన్విన్స్ చేస్తారు. ► మామూలుగా వెంకటేశ్‌గారి కామెడీ టైమింగ్ బావుంటుంది కదా... మీకు ఆయనతో ఈ సినిమా చేయడం ఇబ్బంది ఏమైనా అనిపించిందా? చైతూ: చాలా ఇబ్బంది అనిపించింది. యాక్ట్ చేసేప్పుడు ఇబ్బంది పడ్డాను. కానీ మామ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. వెంకీ మామ ముందే కామెడీ చేసే అవకాశం రావడం వల్ల చాలా నేర్చుకున్నాను. ► ఈ సినిమా చేస్తున్నప్పుడు నిజజీవితంలో మీ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా గుర్తొచ్చాయా? వెంకీ: అలా ఏం లేదు. మేమిద్దరం ఎలాంటి వాళ్లం అంటే.. దేనికీ ఎగ్జయిట్ అయిపోం. కూల్ గా ఉంటాం. ఈ సినిమా ప్రయాణం అద్భుతంగా ఉంది. మా ఫ్యామిలీ చాలా ఆనందంగా ఉన్నారు. ► అన్నయ్య, అబ్బాయి కలిసి సినిమా చేయడం మీ అమ్మగారికి ఎలా ఉంది. చైతూ: చాలా సంతోషంగా ఉన్నారు. మా ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, మా కామెడీ బాగా నచ్చింది. బాగా కనెక్ట్ అయ్యారు. నన్ను మిలటరీ పాత్రలో చూడటం సంతోషంగా ఉంది అన్నారు. ► ఎవరైనా ప్లస్సుల గురించే మాట్లాడతారు. మీ మావయ్య గురించి ఓ మైనస్ చెప్పండి. చైతూ: అస్సలు ఏం లేదు. ► కోప్పడతారా? చైతూ: ఈ సినిమా షూటింగ్ చేసే ముందు వరకూ ఎక్కువ నవ్వుతూనే చూశాను. కానీ షూటింగ్ అప్పుడే కోప్పడటం చూశాను. అది పని కోసమే. వెంకటేశ్: ఎక్కడో వస్తుంది. కానీ ముందుకన్నా బాగా తగ్గించాను. అప్పుడు టెంపర్ ఫుల్‌గా ఉండేది. ఇద్దరం చాలా కామ్‌గా ఉంటాం. ► మీరు చైతన్య వయసులో ఉన్నప్పటితో పోలిస్తే చైతన్య మీ కంటే కూల్ అనుకుంటా? వెంకీ: అందులో డౌటే లేదు. నా కెరీర్ ప్రారంభంలో నాకు కొంచెం టెంపర్ ఎక్కువ ఉందేది. ఇరిటేషన్ ఎక్కువగా ఉండేది. అంత కంఫర్ట్‌బుల్‌గా ఉండేది కాదు. ఈ సీన్ ఇంకా బెటర్‌గా చేసుండొచ్చు అనుకుండేవాణ్ణి. మెల్లిగా కూల్ అయ్యాను. చాలా హ్యాపీ. తన మైనస్ అంటే నాకంటే సెలెంట్. అది బయటవాళ్లకు మైనస్‌లా కనిపించవచ్చు. కానీ మాకు అలా ఉండటం చాలా సౌకర్యంగా ఉంటుంది. ► చైతూ చిన్నప్పుడు చేసిన చిలిపి పనులేమైనా..? వెంకీ: అస్సలు లేవు. చాలా బుద్ధిగా ఉండేవాడు. బొద్దుగా కూడా (నవ్వుతూ). ఇప్పుడు ఫుల్ ఫిట్‌గా ఉంటున్నాడు. హెల్దీఫుడ్ తీసుకుంటాడు. తన లైఫ్ స్టయిల్ కూడా డీసెంట్. ► ఫిట్నెస్ గురించి టిప్స్ పంచుకుంటారా? వెంకీ: నేను అడిగేవాణ్ణి. తను యంగ్. అద్భుతంగా పర్ఫెక్ట్ బాడీ మెయింటెయిన్ చేస్తున్నాడు. మనం వాళ్ల నుంచి నేర్చుకోవాలి. చైతన్యే అని కాదు యంగ్‌స్టర్స్ నుంచి నేర్చుకోవాలి. రానా దగ్గర నుంచి కూడా. వాడి ఫిట్నెస్ కంటే కూడా బిజినెస్ సైడ్. వాడు మా నాన్నలానే. సినిమాలంటే వాడికి చాలా ప్యాషన్. ► చైతూని పెళ్లికొడుకు గా చూసినప్పుడు ఎలా అనిపించింది? వెంకీ: కొత్త లైఫ్ ప్రారంభించబోతున్నాడు. మంచి పార్ట్నర్ని ఎంచుకున్నాడు. వాళ్లు ఒకరినొకరు గౌరవించుకునే విధానం బాగుంటుంది. ► నేను కావాలా? మీ మామయ్యా? అని సినిమాలో మీ హీరోయిన్ అంటుంది. నిజ జీవితంలో అలాంటి సందర్భం ఎదురైతే? వెంకీ: అవన్నీ సినిమాలో. బయట వాడు చాలా క్లియర్‌గా ఉంటాడు. (నవ్వుతూ). ► వెంకీ ఆసనం నేర్పిస్తున్నారా? వెంకీ: వాడికి అవసరమే లేదు. నో ఫ్రస్ట్రేషన్. ఓన్లీ కూల్. ఫ్రస్ట్రేషన్ ఉన్నా కూల్‌గా డీల్ చేస్తాడు. ► మామ నుంచి నేర్చుకున్న విషయం. చైతూ: కామ్‌గా ఉండటం. పాజిటివ్‌గా ఉండటం. ఏ ప్రాబ్లమ్ వచ్చినా అరిచి గోల చేయకుండా స్మూత్‌గా డీల్ చేయడం. ► వెంకిమామ ఆధ్యాత్మిక పాఠాలేమైనా చెబుతారా? చైతూ: అప్పుడప్పుడు సంభాషణల మధ్యలో వస్తుంటాయి. అర్థం అయినవి తీసుకుంటుంటాను. అన్నీ అర్థం చేసుకునే అవగాహన నాకు లేదు. -
‘వెంకీమామ’ సక్సెస్ మీట్
-
నువ్వూ నేనూ సేమ్ రా అనుకున్నాను
మల్టీస్టారర్ సినిమాలు సౌకర్యంగా ఉంటున్నాయి కాబట్టే చేస్తున్నాను. కంఫర్ట్ లేకపోతే ఎందుకు చేస్తాను? ఇద్దరి యాక్టర్స్‌కి మధ్య వాతావరణం సరిగ్గా లేకపోతే అది సెట్లోనూ బావుండదు. స్క్రీన్ మీద అస్సలు బావుండదు. షూటింగ్ లొకేషన్‌కి వెళ్లినప్పుడు హ్యాపీగా వెళ్లాలి కానీ ఈ హీరో ఉన్నాడా? మన స్క్రీన్ టైమ్ ఎంత అనే ఆలోచనలతో కాదు. నటుడిగా 33 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు కూడా ఎంజాయ్ చేయకపోతే ఉపయోగం ఏంటి?’’ అన్నారు వెంకటేశ్. నేడు ఆయన పుట్టిన రోజు. నాగచైతన్యతో కలసి వెంకటేశ్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా వెంకటేశ్ చెప్పిన విశేషాలు. ►నేను, నాగచైతన్య.. ఆ తర్వాత నేను, రానా కలసి నటించాలన్నది నాన్న గారి కోరిక. అలాగే మేమందరం కలసి ఓ సినిమా చేయాలనుకున్నారు ఆయన. అప్పుడు మాకు తగ్గ కథలు కుదర్లేదు. చైతన్య, నేను కలిసి యాక్ట్ చేయడం ఇప్పటికి కుదిరింది. చైతూతో నటించడం హ్యాపీగా, థ్రిల్లింగ్‌గా అనిపించింది. ►‘వెంకీ మామ’ కేవలం ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రమే కాదు. కథలో, పాత్రల్లో చాలా లోతు ఉంటుంది. యాక్షన్, ఎమోషన్ అన్నీ సమపాళల్లో పక్కా కమర్షియల్ సినిమాలా ప్యాక్ చేశాం. ►చిన్నప్పుడు పిల్లలందరిలో మాకు ఫేవరెట్ చైతన్యే. చాలా బొద్దుగా ఉండేవాడు. అందరం వాణ్ణి బాగా ముద్దు చేసేవాళ్లం. యాక్టర్‌గా చైతన్య చాలా నేర్చుకుంటున్నాడు. తను ఇంకా మంచి సినిమాలు చేయాలి. వేరే వాళ్లతో పోల్చుకోకుండా తనతో తను పోటీపడి, ప్రొఫెషన్‌తో నిజాయతీగా ఉంటూ పని చేసుకుంటూ వెళ్లాలి. ►చైతూ, నేను ఇంట్లో కలవడం వేరు.. సెట్లో యాక్ట్ చేయడం వేరు. మామా అల్లుళ్లుగా ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలి. ఈ సినిమా షూటింగ్ మొదటివారంలో నేను చైతూని గమనిస్తూ ఉండేవాణ్ని. కామ్‌గా ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ‘ఏమనుకుంటున్నావు రా నువ్వు? ఏం ఆలోచిస్తున్నావు?’ అనుకునేవాణ్ణి (నవ్వుతూ). కానీ వాడు నాలానే కామ్‌గా ఉండటం గమనించాను. ‘నువ్వూ నేనూ సేమ్ రా’ అనుకున్నాను. మామ లొకేషన్‌కి 9కి వస్తున్నాడని 8.45కే వచ్చేవాడు. నడక, ఆ స్టయిల్‌తో పాటు ఏదో ఆలోచించడం కూడా మేనమామ (చైతూకి వెంకీ మేనమామ) పోలికే వచి్చ నట్టుంది (నవ్వుతూ). ►చైతన్యకి చిన్నప్పుడు యాక్టింగ్ మీద ఆసక్తి లేకపోయినా యాక్టర్ అయ్యాడు. నేను, రానా కూడా అనుకోకుండా నటనలోకి వచ్చాం. అయినప్పటికీ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు. తెలుగు సినిమా అభిమానులు చాలా స్పెషల్. నచి్చతే ఏ సినిమా అయినా చూస్తారు. యాక్టర్స్‌ను విపరీతంగా ప్రేమిస్తారు. మధ్యలో ఫ్లాప్స్ వచ్చినా, ఆ హీరో నుంచి హిట్ సినిమా వస్తే మళ్లీ తప్పకుండా చూస్తారు. నేను జీవితంలో ప్రతిరోజూ బోనసే అనుకుంటాను. దేవుడు నా పట్ల చాలా దయగా ఉన్నాడనుకుంటాను. దానికి తగ్గట్టు కష్టపడుతుంటాను. అప్పుడే అందరూ ‘యాక్టర్‌గా ఇంకా వీడిలో ఏదో ఉంది’ అనుకుంటారు. లేకపోతే ఇండస్ట్రీ ►33 ఏళ్లల్లో ఫస్ట్ టైమ్ నా బర్త్‌డేకు రిలీజవుతున్న సినిమా ఇదే. సినిమా రిలీజ్ ఉండటంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాను. బర్త్‌డే సెలబ్రేషన్స్ ఏం ప్లాన్ చేయలేదు. ►మలీ్టస్టారర్ చిత్రాలు ఆడుతున్నాయి కాబట్టి చేస్తున్నాను. వరుసగా రెండు సినిమాలు పోయాయనుకోండి, మలీ్టస్టారర్స్ ఎక్కువ అయిపోయాయి అంటారు. కొన్ని సినిమాలు సోలోగా చేయండి అంటారు. యంగ్ యాక్టర్స్‌లో ఎనీ్టఆర్తో చేయాలనుంది. నానీతో చేయాల్సింది, కానీ కుదర్లేదు. ►నాన్నగారు ప్యాషనేట్. సినిమాలే జీవితం అన్నట్లు జీవించారు. ఆయనతో పోలిస్తే మాకు ఉన్న ప్యాషన్ చాలా తక్కువ అనిపిస్తుంది. తెలియకుండానే సినిమా గురించి నాకు చాలా నేరి్పంచారు. ఆయన్ని మించిన గొప్ప టీచర్ లేరు. ►‘అసురన్’ రీమేక్ జనవరిలో స్టార్ట్ అవుతుంది. 3–4 నెలల్లో పూర్తవుతుంది. సమ్మర్లో రిలీజ్ చేస్తాం. శ్రీకాంత్ అడ్డాల మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని కసి మీద ఉన్నాడు. నాక్కూడా ఆ పాత్ర చాలెంజింగ్‌గా ఉంటుంది. వరుసగా కామెడీ ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేస్తున్నాను కదా ఈ సినిమా మార్పులా కూడా ఉంటుంది. ►ప్రస్తుతం ప్రపంచంలో కొంచెం నెగటివిటీ ఉంది. మనం ఎన్ని మంచి పనులు చేసినా, పెద్దగా పట్టించుకోక పోయినా ఒక్క తప్పు చేస్తే దాన్నే ఎత్తి చూపుతారు. అది మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. సంతోషంగా ఉండండి. ప్రతిదీ సీరియస్‌గా తీసుకోవద్దు. అందరం పాజిటివ్‌గా ఉందాం. అందరూ బావుండాలి అని కోరుకుందాం. ఆనందమైన ప్రపంచాన్ని కోరుకుంటుంటాను. ఇంకేం కావాలి? ►ఎప్పటినుంచో యాక్టింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నాను. అన్నయ్యవాళ్లు వదలడం లేదు. ఏదో రోజు జంప్ అయిపోతాను. ►నేను వెబ్ సిరీస్‌లోకి కూడా వచ్చేస్తున్నాను. ‘వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేయండి’ అని ఎవరో ఒకరు వచ్చి అడగడం ఎందుకు? నేనే దర్శకులను అడుగుతాను. నాకోసం ఏదో ఒకటి రాయండి. వెబ్ సిరీస్ కథలు తీసుకు రండి చేద్దాం అని. ►స్క్రీన్ టైమ్ ఎంత అని ఆలోచించకుండా కథకు తగ్గట్టు నటించాలి. నా స్క్రీన్ టైమ్ ఎంత? అని ఆలోచిస్తే సినిమాలు చేయలేం. గతంలో సూపర్‌స్టార్స్‌ని గమనిస్తే నాగేశ్వరావుగారు, కృష్ణగారు, శోభనబాబుగారు స్క్రీన్ టైమ్ పట్టించుకోకుండా పాత్రలు చేశారు. చాలెంజింగ్ యాక్టర్స్‌లా ఉండాలి. ప్రస్తుతం యంగ్ హీరోలతో చేస్తున్నాను. వాళ్ల బాడీ లాంగ్వేజ్ గమనిస్తుంటాను. -
నా జీవితంలో ఆ రెండూ ప్లాన్ చేయకుండా జరిగినవే!
‘‘జీవితంలో మనకు ఎదురయ్యే వైఫల్యాలే మనకు ఎక్కువ పాఠాలు నేర్పుతాయి. నేనూ చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొన్నిసార్లు తప్పులు జరుగుతుంటాయి. అప్పుడు నా నిర్ణయ లోపం ఎక్కడ ఉందో పరిశీలించుకుంటాను. నటుడిగా నన్ను మరింత మెరుగుపరచుకునేందుకు ప్రయత్నిస్తాను. సినిమా విడుదల సమయంలో సోషల్ మీడియా కామెంట్స్‌ని పట్టించుకుంటాను. కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు చూస్తుంటాను. కానీ ఆ విమర్శలను కూడా సానుకూలంగా తీసుకుని ముందుకు వెళ్లినప్పుడే లైఫ్ బాగుంటుంది’’ అన్నారు నాగచతైన్య. కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా నటించిన చిత్రం ‘వెంకీమామ’. ఇందులో పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా కథానాయికలుగా నటించారు. డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నాగచైతన్య చెప్పిన విశేషాలు. ► భీమవరంలో మొదలైన ఈ కథ కశ్మీర్లో ముగుస్తుంది. కాలేజ్ సెలవుల్లో నేను భీమవరం వెళ్లినప్పుడు వెంకీమామతో నా సందడి మొదలవుతుంది. ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ పాత్ర చేశాను. ► ఈ సినిమాలో కెమెరా వెనకాల సురేష్ మావయ్య, కెమెరా ముందు వెంకటేష్ మావయ్య నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. వెంకటేష్ మావయ్యకు ‘నో హేటర్స్, నో నెగటివ్స్’ అని అందరూ అంటుంటారు. అలా ఎందుకు అంటారో నాకు సెట్లో అర్థమైంది. వెంకటేష్ మావయ్య ఆయన కామెడీ టైమింగ్‌ను మ్యాచ్ చేయడం కష్టం. సురేష్మావయ్య, వెంకటేష్ మావయ్య ప్రణాళిక ప్రకారం అన్నీ జరగాలనుకుంటారు. లేకపోతే కోపం వస్తుంది. ఆ కోపం అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ► సురేష్మావయ్య కథలు వినమని అప్పుడప్పుడు స్క్రిప్ట్స్ పంపిస్తుంటారు. నేను వింటుంటాను. కానీ సురేష్ ప్రొడక్షన్స్‌లో సినిమా చేసే అవకాశం ఎందుకో ఇప్పటివరకు కుదర్లేదు. ఇప్పుడు ‘వెంకీమామ’తో కుదరింది. ఇందులో వెంకటేష్ మావయ్యతో కూడా కలిసి చేశాను. ఇలా ఒకేసారి, ఒకే ఏడాది ఈ రెండూ జరిగాయి. కానీ ఇది ప్లాన్ చేసింది కాదు. అలా జరిగిపోయిందంతే. నా జీవితంలో పెళ్లి, ‘వెంకీమామ’ ప్లాన్ చేసినవి కాదు. ► ‘వెంకీమామ’ మల్టీస్టారర్ కాదనే నా అభిప్రాయం. వెంకటేష్‌గారితో కలిసి నేను ఓ క్యారెక్టర్ చేశానంతే. ఈ కథకు నేను ప్లస్ కాదు. ఈ కథే నాకు ప్ల్లస్ అనుకంటున్నాను. ఈ సినిమాలో విలన్స్ లేరు. పరిస్థితులు, జాతకాల ప్రభావం సినిమాలో పాత్రలపై ప్రతికూలతలను చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. ► సినిమా నేను రఫ్‌గా మొత్తం చూశాను. బాగుంది. సమంత (నాగచైతన్య భార్య) కూడా చూసింది. బాగుందని చెప్పింది. ఈ సినిమానే కాదు నా ప్రతి సినిమా గురించి తన అభిప్రాయం నిర్మొహమాటంగా చెబుతుంది. నేనూ తన సినిమాలకు అంతే చెబుతాను. ► ఈ సినిమా కథను నాన్నగారు (నాగార్జున) వినలేదు. సురేష్మామ పంపిన కథ విని నేనే ఓకే చేశాను. నాన్నగారితో (సొగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ గురించి ప్రస్తావిస్తూ) చేయాల్సిన ప్రాజెక్ట్‌కు ఇంకా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నాన్నగారు, వెంకటేష్ మామలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఇద్దరూ కామ్ పర్సనాలిటీస్. కానీ నిర్ణయాలు మాత్రం చాలా వేగంగా తీసుకుంటారు. ► నేను డైరెక్టర్స్ యాక్టర్‌ని. ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత డైరెక్టర్ చెప్పింది చేసుకుని వెళ్తుంటాను. అనుభవం ఉన్న దర్శకులు అయితే నా నుంచి మరింత నటనను రాబట్టుకోగలరని నా అభిప్రాయం. కొత్త దర్శకులు అయితే నన్ను మరో టేక్ చేయమని చెప్పడానికి మోహమాట పడొచ్చు. అలా యాక్టింగ్ పరంగా నాకు తెలియకుండానే నేను రాజీపడాల్సి వస్తుందేమో. అందుకే కెరీర్లో రెండుమూడు మంచి హిట్స్ సాధించిన తర్వాత కొత్త దర్శకులతో సినిమాలు చేస్తాను. కొత్త దర్శకులు డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కొంతకాలం అనుభవం ఉన్న దర్శకులతోనే సినిమాలు చేయాలనుకునే నా ఆలోచన నాకొక బలహీనత కూడా కావొచ్చు. ► శేఖర్‌కమ్ములగారి దర్శకత్వంలో చేస్తున్న ‘లవ్‌స్టోరీ’ (వర్కింగ్ టైటిల్) చిత్రీకరణ 40 శాతం పూర్తయింది. -
‘వెంకీమామ’ మ్యూజికల్ నైట్
-
‘వెంకీమామ’ మూవీ వర్కింగ్ స్టిల్స్
-
తప్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి
‘‘37 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్నాను. మన పాత హిట్ సినిమాలతో పోలిస్తే ఇప్పుడు సినిమాలు సంతృప్తిగా అనిపించవు. హిట్ అవుతాయి. కానీ ఏదో వెలితిగా ఉంటుంది. సొంత యాక్టర్స్‌ని పెట్టి సరైన సినిమాలు తీయకపోతే ప్రేక్షకులు నవ్వుతారనే భయం ఉంటుంది. అందుకే కథలను సులువుగా అంగీకరించలేను’’ అన్నారు సురేశ్‌బాబు. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ‘వెంకీ మామ’. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఈ శుక్రవారం చిత్రం రిలీజ్ సందర్భంగా సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ మాట్లాడారు. సురేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘వెంకీ మామ’ కథను జనార్థన మహర్షి రాశారు. ఐడియా బావుంది. కానీ ట్రీట్మెంట్లో చాలా మార్పులు చేయాల్సి ఉంది. ఈ ఐడియాను కోన వెంకట్‌కు చెప్పాను. వర్క్ చేయొచ్చు అన్నారు. బాబీ పేరుని కోన వెంకట్ సూచించారు. బాబీ తన టీమ్‌తో తన స్టయిల్లో వర్క్ చేసి నాకు చెప్పాడు. మామాఅల్లుడి బంధాన్ని చూపించే ఓ సన్నివేశాన్ని నాకు వివరించగానే నా కళ్లలో నీళ్లు ఆగకుండా వచ్చాయి. ఈ సినిమా చేస్తున్నాం అన్నాను. ‘వెంకీ మామ’ సినిమా సూపర్, బంపర్ అలాంటివి చెప్పలేను. పూర్తి స్థాయి తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. వెంకటేశ్, నాగచైతన్య కెమిస్ట్రీ హైలైట్‌గా ఉంటుంది. వెంకీ, చైతన్య ఇద్దరి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యే సినిమా. ఇంతకుముందు కథ విన్న తర్వాత ‘కానీ... ఏదో మిస్ అయింది’ అనేవాణ్ణి. ఇప్పుడు ఏం మిస్ అయిందో చెప్పగలుగుతున్నాను. సినిమా గురించి ఎక్కువ తెలుసుకుంటున్న కొద్దీ అందులో తప్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కథ చెప్పే దశలోనే ఉన్న సందేహాలు ఎక్కువగా అడిగేస్తుంటాను. కథలు అంత సులువుగా ఓకే చేయనని కూడా అనుకోవచ్చు(నవ్వుతూ). ఇంతకుముందు షూటింగ్‌కి వెళ్లాక కూడా డౌట్స్ అడిగేవాణ్ణి. ఇప్పుడు వేలు పెట్టడం తగ్గించేశాను(నవ్వుతూ). గుణశేఖర్ దర్శకత్వంలో రానా చేసే ‘హిర ణ్య’కు రెండేళ్లుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాం. ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్‌ను సక్రమంగా అనుసరించి ఆ సినిమాను తక్కువ టైమ్‌లో వరల్డ్ క్లాస్ మూవీగా రూపొందించనున్నాం. ‘అసురన్’ రీమేక్‌తో పాటు, తరుణ్ భాస్కర్‌తో, త్రినాథరావు నక్కినలతో సినిమాలు చేస్తారు వెంకటేశ్. టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘సురేశ్ ప్రొడక్షన్స్‌తో కలిసి పని చేయడంతో నమ్మకం ఏర్పడింది. ఈ కథను మొదట వివేక్ కూచిభొట్ల విన్నారు. ఆ తర్వాత సురేశ్‌బాబుగారి దగ్గరకు తీసుకెళ్లాం. దేనికైనా ప్లానింగ్ ముఖ్యం. మా బేనర్లో 20 సినిమాల వరకూ సిద్ధం కాబోతున్నాయి’’ అన్నారు. ► ‘వెంకీ మామ’ను దసరాకు రిలీజ్ చేయాలనుకున్నాం. వెంకటేశ్ కాలికి గాయం కావడంతో ఆలస్యం అయింది. నవంబర్ అనుకున్నాం. ఆ తర్వాత డిసెంబర్ 13కి ఫిక్స్ చేశాం. రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యాం. సంక్రాంతి పండక్కి రిలీజ్ చేయాలనే ఆలోచన మాత్రం ఎప్పుడూ లేదు. ► డిజిటల్ మాద్యమాలు అమేజాన్, నెట్‌ఫ్లిక్స్ రావడంతో థియేటర్‌కి వెళ్లే ప్రేక్షకులు తగ్గుతున్నారు అంటున్నారు. వాళ్లను థియేటర్‌కి రప్పించే సినిమాలు చేయడం మీద దృష్టిపెట్టాలి. హీరోలందరూ ఏడాదికి రెండు సినిమాలు చేస్తే బావుంటుంది. సినిమా మేకింగ్‌లో చాలా శాతం అసమర్థత కనిపిసోంది. దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. ► గతంలో దాసరి గురువు పాత్రను పోషించారు. ఇప్పుడు ఎవరూ ఆ బాధ్యతను తీసుకోవడంలేదనే ప్రశ్నకు స్పందిస్తూ – ‘‘దాసరిగారిని గురువులా అందరూ అంగీకరించారు. ఆ స్థానంలో ఇప్పుడు ఎవర్నీ అంగీకరించలేకపోతున్నారు’’ అని అన్నారు. -
ఈ మామకు ఇంకేం కావాలి : వెంకటేష్
‘‘వెంకీ మామ’ సినిమాలోని ‘అమ్మయినా నాన్నయినా నువ్వేలే వెంకీ మామ...’ పాటలా నాకంతా నా అభిమానులే. నా 30 ఏళ్ల కెరీర్లో మీరే నా బలం. ఈ నెల 13న కలుద్దాం’’ అని వెంకటేష్ అన్నారు. కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా, రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘వెంకీ మామ’. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలవుతోంది. ఖమ్మంలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో చైతూకు మాత్రమే మామ.. కానీ, సినిమా విడుదల తర్వాత అందరికీ వెంకీ మామనే. ఎక్కడికి వెళ్లినా వెంకీ మామ అంటున్నారు. ఈ సినిమాలో చైతూ చించేశాడు.. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ మామకు ఇంకేం కావాలి చెప్పండి. మామ– అల్లుడు సెంటిమెంట్‌ని బాబీ చాలా బాగా తీశాడు. తమన్ మంచి పాటలిచ్చాడు’’ అన్నారు. నాగ చైతన్య మాట్లాడుతూ– ‘‘నా లైఫ్‌లో రెండే రెండు సినిమాలు.. ఒకటి ‘మనం’.. రెండోది ‘వెంకీ మామ’. కెమెరా వెనుక ఓ మామ(సురేష్‌బాబు).. ముందు మరో మామ(వెంకటేష్).. నన్ను చాలా బాగా చూసుకున్నారు. బాబీ కూల్ డైరెక్టర్. ఈ మూవీలో మామా అల్లుళ్ల అల్లరి మామూలుగా ఉండదు’’ అన్నారు. బాబీ మాట్లాడుతూ– ‘‘ఇక్కడికి వచ్చిన వెంకటేష్, నాగచైతన్య, మెగా, నందమూరి, ఘట్టమనేని అభిమానులందరికీ నమస్కారం. ఏ హీరో అభిమానులు కూడా నెగిటివ్ మాట్లాడని హీరో వెంకటేష్‌గారు. చిన్నప్పుడు వీసీఆర్ కోసం వెళ్తే వెంకీగారి సీడీలు దొరికేవి కావు.. మహిళలు తీసుకుని వెళ్లేవాళ్లు. బ్లాక్‌లో తీసుకుని రావాల్సి వచ్చేది. ‘ఎఫ్ 2’లో వెంకటేష్‌గారి ఫన్ చూశారు.. ‘వెంకీ మామ’ లో ఆయన మాస్ యాంగిల్ చూపించాను. ఎంతో కుటుంబ నేపథ్యం ఉన్నా చైతూ కొత్త హీరోగానే ఆలోచిస్తాడు. సురేష్ బాబుగారు పెద్ద పుస్తకం’’ అని తెలిపారు. ‘‘వెంకీ మామ’ నాకు చాలా ప్రత్యేకం’’ అన్నారు రాశీఖన్నా. ‘‘వెంకటేష్‌గారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో ఇంత త్వరగా పని చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు పాయల్ రాజ్‌పుత్. ‘‘అన్ని రకాల భావోద్వేగాలున్న మంచి సినిమా ‘వెంకీ మామ’’ అన్నారు సురేష్ బాబు. ‘‘వెంకటేష్, నాగ చైతన్యలతో గ్రేట్ మల్టీస్టారర్ నిర్మించడం ఆనందంగా ఉంది’’ అన్నారు విశ్వప్రసాద్. ‘‘వెంకీ, చైతూల నటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల. -
ఖమ్మంలో ‘వెంకీ మామ’
సాక్షి, ఖమ్మం: ఖమ్మం పట్టణంలో వెంకీమామ చిత్రబృందం తళుక్కుమంది. హీరోహీరోయిన్లు విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్‌రాజ్‌పుత్‌లు అభిమానులను హోరెత్తించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక శనివారం రాత్రి ఖమ్మంలోని లేక్‌వ్యూ క్లబ్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బృందంలోని సింగర్స్ పాడిన పాటలు.. సత్యమాస్టర్ బృందం నృత్యాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్, లేక్‌వ్యూ క్లబ్ అధినేత దొడ్డ రవి పర్యవేక్షణలో జరిగిన ఈ ఉత్సవం హైలెట్‌గా నిలిచింది. ఖమ్మానికి తొలిసారిగా వచ్చిన తమ అభిమాన నటుడు వెంకటేశ్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రైలర్‌ను హీరోలు వెంకటేశ్, నాగచైతన్య విడుదల చేశారు. వేదికపై హీరోయిన్లు పాయల్‌రాజ్‌పుత్, రాశీఖన్నాలతో కలిసి హీరోలు, డైరెక్టర్ బాబీ, యాంకర్ శ్రీముఖి చిత్రంలోని కొకొకోలా పెప్సీ.. వెంకీమామ సెక్సీ పాటకు స్టెప్లు వేయడంతో ప్రాంగణం కేరింతలతో హోరెత్తిపోయింది. యాంకర్ శ్రీముఖి, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర చేసిన స్కిట్లు నవ్వుల్లో ముంచెత్తాయి. ఈ సందర్భంగా హీరో వెంకటేశ్ మాట్లాడుతూ వెంకీమామ సినిమా మంచి కథతో ప్రారంభమైందని, దర్శకుడు బాబీ బాగా తీశాడని, పెద్ద హిట్ అవుతుందన్నారు. ఇప్పటివరకు తాను నాగచైతన్యకు మాత్రమే మామనని, వెంకీమామ సినిమా తర్వాత అందరికీ మామనవుతానని పేర్కొన్నారు. అనంతరం నాగచైతన్య మాట్లాడుతూ మనం, వెంకీమామ సినిమాలు జీవితంలో గుర్తుండిపోయేవని తెలి పారు. థమన్ మ్యూజిక్, బాబీ దర్శకత్వం, సు రేశ్బాబు, టీజీ విశ్వప్రసాద్ల నిర్మాణం ఈ సి నిమాకు అదనపు బలమన్నారు. ప్రొడ్యూసర్లు సురేశ్‌బాబు, విశ్వప్రసాద్, డైరెక్టర్ బాబి మాట్లాడుతూ ఈ నెల 13న విడుదలవుతోందన్నారు. -
‘వెంకీ మామ’ ప్రీ రిలీజ్ వేడుక
-
‘వీలైనంత త్వరగా వాళ్లిద్దరినీ విడదీయాలి’
విక్టరీ హీరో వెంకటేష్, అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ ‘వెంకీ మామ’. పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జైలవకుశ సినిమాల దర్శకుడు కే ఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకటేశ్, నాగచైతన్య రీల్ లైఫ్‌లో కూడా మామా అల్లుళ్లుగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలు అన్ని వర్గాల ప్రజలకు కనెక్ట్ అయ్యాయి. విడుదలకు మరో వారం రోజుల ఉండటంతో మూవీ ప్రమోషన్స్ వేగం పెంచాయి చిత్ర యూనిట్. దీనిలో భాగంగా ఖమ్మంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించారు. ఇదే ఈవెంట్లో ‘వెంకీ మామ’ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్, లవ్, రొమాన్స్, రిలేషన్షిప్, మాస్ ఇలా అన్నింటిని మేళవించిన ఈ ట్రైలర్ అందరినీ కట్టిపడేసింది. ‘మనిషి తలరాతను రాసే శక్తి దేవుడికి ఉందని నీ నమ్మకం.. ఆ రాతను తిరిగి రాసే శక్తి మనిషి ప్రేమకు ఉందని నా నమ్మకం’అని విక్టరీ వెంకటేశ్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమవుతుంది. ‘నీ నుంచి నన్ను ఎవరూ దూరం చేయలేరు మామయ్యా.. అది నీ వల్ల కూడా కాదు’అని నాగచైతన్య చెప్పే ఎమోషనల్ డైలాగ్, ‘నీ లవ్ స్టోరీ చాలా అందంగా ఉందిరా’ అంటూ చెప్పే ఫీలున్న డైలాగ్, ‘ఈ సారి జాతరను రంగులతో కాదు.. మీ రక్తంతో ఎరుపెక్కిస్తా రండ్రా నా..’అంటూ వెంకీ చెప్పే ఊర మాస్ డైలాగ్, ‘దయచేసి వాడికొక అత్తనివ్వండి అన్నయ్య’అంటూ హైపర్ ఆది చెప్పే కామెడీ డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ను నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఇక మామా అల్లుళ్ల ఖాతాలో భారీ విజయం ఖాయమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ‘వెంకీ మామ’ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నాగచైతన్య, వెంకీ సరసన రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాజర్, రావు రమేశ్ చమ్మక్ చంద్ర, హైపర్ ఆది తదితరులు నటిస్తున్నారు. డిసెంబర్ 13న విడుదల కానున్న ఈ చిత్రానికి థమన్ సంగీతమందిస్తున్నాడు. -
ఖమ్మం వెళ్ళుతున్న ‘వెంకీమామ’ టీమ్
-
సెట్లో ఆయన హెడ్ మాస్టర్
‘‘మేనమామ, మేనల్లుడి కథతో తెరకెక్కిన చిత్రం ‘వెంకీ మామ’. ఈ సినిమాలో వినోదం, యాక్షన్, మాస్ అంశాలతో పాటు భావోద్వేగాలు ఉంటాయి. సినిమా చూసిన ప్రేక్షకులకు వారి మేనమామ, మేనల్లుళ్లు, మేనకోడళ్లు గుర్తుకు వస్తారు’’ అన్నారు కేఎస్ రవీంద్ర (బాబీ). వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీ మామ’. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా బాబీ చెప్పిన విశేషాలు. ► సురేష్‌బాబుగారు హెడ్మాస్టర్లాంటి వారు.. చాలా సందేహాలు వస్తుంటాయి.. ఇది కరెక్టా? కాదా? అని ఆలోచిస్తారు. బహుశా ఆ లక్షణం ఆయన చదువు, అనుభవం వల్లే ఉండొచ్చు. ఆయన టార్చర్ స్మూత్‌గా ఉంటుంది. కానీ ఒత్తిడి చేయరు. ► వెంకటేశ్‌గారి సినిమాల్లో ‘లక్ష్మీ‘ సినిమా చాలా ఇష్టం. అందులో ఆయన పాత్ర మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. మిలటరీలో ఉండే నాగచైతన్య గ్రామంలో ఉన్న మావయ్య వద్దకు వస్తాడు. వారి మధ్య వచ్చే భావోద్వేగాల సన్నివేశాలు ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి. వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్లో సినిమా చెయ్యాలన్నది రామానాయుడుగారి కల అని సురేష్‌బాబుగారు చెప్పడంతో మరింత బాధ్యతతో ఈ సినిమా చేశా. ► ‘వెంకీ మామ’ ప్రివ్యూ చూసిన తమన్ ఏడ్చేశాడు. ఇది వీర లెవల్ సినిమా అని సురేష్‌బాబుగారికి చెప్పాడు. తనొక్కడే కాదు.. డిస్ట్రిబ్యూటర్లతో పాటు మరికొందరు ఈ టైమ్‌కి ‘వెంకీ మామ’ కరెక్ట్ సినిమా అన్నారు. వ్యక్తిగతంగా నాకు కమర్షియల్ సినిమాలంటేనే ఇష్టం. ‘బాబీ భావోద్వేగాలను కూడా బాగా చూపించగలడు’ అని ప్రేక్షకులు నమ్మాలి. అది ‘వెంకీ మామ’తో కుదిరింది. -
ఖమ్మంలో వెంకీమామ ప్రీ రిలీజ్ వేడుక
ఖమ్మం మయూరి సెంటర్ : సురేష్ ప్రొడక్షన్ అండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన చిత్రం వెంకీమామ ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 7వ తేదీన నగరంలోని లేక్‌వ్యూ క్లబ్ ఆవరణలో నిర్వహించనున్నట్టు శ్రేయాస్ మీడియా అధినేత, ఈవెంట్ ఆర్గనైజర్ గండ్ర శ్రీనివాస్ తెలిపారు. లేక్‌వ్యూ క్లబ్ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దర్శకుడు బాబీ, సురేష్ ప్రొడక్షన్ అధినేత సురేష్ బాబు, హీరోలు విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య, హీరోయిన్లు రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్, సంగీత దర్శకుడు థమన్, హాస్యనటుడు హైపర్ ఆదిలు విచ్చేస్తారని తెలిపారు. థమన్ మ్యూజికల్ నైట్, హైపర్ ఆది స్కిట్స్, సత్యా మాస్టర్ బృందం నృత్య ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. యాంకర్‌గా శ్రీముఖి వ్యవహరిస్తారని తెలిపారు. రెండున్నర గంటల పాటు వేడుక నిర్వహించనున్నట్టు తెలిపారు. సినీ అభిమానులు అధిక సంఖ్యలో హాజరై వేడుకను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో దొడ్డారవి, రావూరి సైదుబాబుచ, చారుగండ్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.