దీపావళి పండక్కి బయట టపాసులు పేలుతుంటే థియేటర్స్‌లో వెంకటేశ్, నాగచైతన్య నవ్వుల కాకరపువ్వొత్తులను విరజిమ్మబోతున్నారు. బాబీ దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా ‘వెంకీమామ’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వెంకీ సరసన పాయల్‌రాజ్‌పుత్, చైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. రైస్ మిల్ ఓనర్‌గా వెంకీ, ఆర్మీ అధికారి పాత్రలో నాగచైతన్య కనిపిస్తారని తెలిసింది. రియల్ లైఫ్‌లో మామాఅల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగచైతన్య ఈ సినిమాలోనూ మామా అల్లుళ్లగానే నటిస్తుండటం విశేషం. డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఒక పాట మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందట. ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబరు చివరి వారంలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందని తాజా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment