Bobby Direction
-
అన్నదమ్ముల పాత్రల్లో చిరు, రవితేజ ? 'అన్నయ్య' మళ్లీ రిపీట్ !
Chiranjeevi Ravi Teja As Brothers In Director Bobby Movie: టాలీవుడ్ అగ్రహీరో, మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది చిరు తన సినిమాలతో అభిమానులకు మాస్ ఫీస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చిరు తనయుడి రామ్ చరణ్‌తో నటించిన 'ఆచార్య' మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీంతోపాటు గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు చిరంజీవి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్‌ను పరిశీలిస్తోందట చిత్రబృందం. వైజాగ్ షిప్ యార్డ్ నేపథ్యంలో మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కనుందని సమాచారం. అయితే ఈ చిత్రంలో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చిరంజీవికి తమ్ముడిగా రవితేజ అలరించనున్నాడని సమాచారం. రవితేజ పాత్ర సుమారు 40 నిమిషాలు ఉంటుందని పుకార్లు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే సుమారు 22 ఏళ్ల తర్వాత చిరు, రవితేజ కలిసి మరోసారి అన్నదమ్ముల పాత్రలో అలరించున్నారు. 2000 సంవత్సరంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం 'అన్నయ్య'లో చిరంజీవి, రవితేజ, వెంకట్ అన్నదమ్ములుగా యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో చిరంజీవి అండర్ కవర్ పోలీస్ పాత్రలో నటించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగే అవకాశం ఉంది. ఇదీ చదవండి: లాయర్‌గా రవితేజ సందడి.. విలన్‌గా అందాల తార ఢీ -
చిరంజీవి 154వ సినిమా లాంచింగ్
-
మెగాస్టార్‌తో బాలీవుడ్ భామ రొమాన్స్!
డైరెక్టర్ కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ-మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఎమోషనల్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో బాబీ, చిరు కోసం ప్రత్యేకంగా రేడి చేసిన ఈ స్క్రిప్ట్ చిరుకు నచ్చడంతో వెంటనే ఒకే చెప్పాడు. అంతేగాక బాబీతో ఓ మూవీ చేయబోతున్న అంటూ మెగాస్టార్ స్వయంగా ప్రకటించడం విశేషం. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అసక్తికర అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో చిరుకు జోడీగా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాబీ టీం సోనాక్షిని సంప్రదించి కథ వివరించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని సినీ వర్గాల నుంచి సమాచారం. కాగా చిరు ప్రస్తుతం ‘ఆచార్య’ మూవీ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత మెగాస్టార్ మోహన్ రాజా డైరెక్షన్లో తెరకెక్కబోయే లూసిఫర్ రీమేక్‌లో నటించనున్నాడు. అనంతరం బాబీతో సినిమాను చిరు ప్రారంభించనున్నాడు. కాగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. -
పల్లెటూరి వీరయ్యగా మెగస్టార్?
పల్లెటూరి వీరయ్యగా కనిపించనున్నారట చిరంజీవి. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ ప్రారంభించారు బాబీ. ఈ చిత్రం పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ‘వీరయ్య’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నారు చిరంజీవి. ఆ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో నటిస్తారు చిరంజీవి. ఆ తర్వాత బాబీ తెరకెక్కించే సినిమా షూటింగ్లో పాల్గొంటారు. -
నవ్వుల టపాసులు
దీపావళి పండక్కి బయట టపాసులు పేలుతుంటే థియేటర్స్‌లో వెంకటేశ్, నాగచైతన్య నవ్వుల కాకరపువ్వొత్తులను విరజిమ్మబోతున్నారు. బాబీ దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా ‘వెంకీమామ’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వెంకీ సరసన పాయల్‌రాజ్‌పుత్, చైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. రైస్ మిల్ ఓనర్‌గా వెంకీ, ఆర్మీ అధికారి పాత్రలో నాగచైతన్య కనిపిస్తారని తెలిసింది. రియల్ లైఫ్‌లో మామాఅల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగచైతన్య ఈ సినిమాలోనూ మామా అల్లుళ్లగానే నటిస్తుండటం విశేషం. డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఒక పాట మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందట. ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబరు చివరి వారంలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందని తాజా సమాచారం. -
రవితేజ సరసన మరోసారి?
గాసిప్స్ రాశీఖన్నా ఏ హీరో సరసన నటించినా ఆ హీరోకి యాప్ట్‌గా ఉంటారు. ఒకవైపు సాయిధరమ్ తేజ్లాంటి యువహీరోలు, మరోవైపు రవితేజ లాంటి సీనియర్ హీరోలతో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. రవితేజతో ఆమె ‘బెంగాల్ టైగర్’లో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరి కెమిస్ట్రీ బాగుంటుంది. మరోసారి ఈ జంట సందడి చేయనున్నారని సమాచారం. బాబీ దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రంలో నటించనున్నారు. ఇందులో రాశీఖన్నాను కథానాయికగా తీసుకున్నారట. ఈ చిత్రం అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఒకవైపు తెలుగు చిత్రాలు చేస్తూనే రాశీఖన్నా తమిళ చిత్రాలపై కూడా దృష్టి పెట్టారు. ఇప్పటికే తమిళంలో సిద్ధార్థ్ సరసన ‘సైతాన్ కా బచ్చా’ అనే తమిళ చిత్రంలో నటించడానికి అంగీకరించారు. తాజాగా, యువహీరో అథర్వ సరసన ఓ తమిళ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం మీద రాశీఖన్నా బిజీ బిజీ. -
‘విక్రమార్కుడు’ రేంజ్లో...
‘‘మూడు, నాలుగేళ్ల నుంచి సినిమా చేద్దామని అడుగుతున్నారు రాక్‌లైన్ వెంకటేష్. ఇన్నాళ్లకు సరైన కథ కుదిరింది. ‘బలుపు’ నుంచి బాబీతో ట్రెవెల్ చేస్తున్నాను. బ్రహ్మాండమైన లైన్ తయారు చేశాడు తను. ఈ సినిమా తనకు మంచి బ్రేక్‌గా నిలవాలి. తెలుగులో నిర్మాత వెంకటేష్‌గారు రాక్ అనిపించాలి’’అని రవితేజ అన్నారు. కె.ఎస్.రవీంద్రనాథ్(బాబీ)ని దర్శకునిగా పరిచయం చేస్తూ రవితేజ కథానాయకునిగా రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న చిత్రం బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి మునిరత్నం నాయుడు కెమెరా స్విచాన్ చేయగా, ఆనంద్ నాయుడు క్లాప్ ఇచ్చారు. ‘‘తెలుగులో నేను చేస్తున్న తొలి సినిమా ఇది. బాబీతో కథ వినిపించి నచ్చితే చేయ్ అన్నారు రవితేజ. బాబీ కథ చెప్పిన తీరు నాకు నచ్చింది. ఏదో సాధించాలనే తపన కథ చెప్పేటప్పుడు బాబీలో చూశాను. దర్శకునిగా బాబీకి, నిర్మాతగా నాకూ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఇది. ఇందులో రవితేజ పాత్ర ‘విక్రమార్కుడు’ రేంజ్లో ఉంటుంది’’ అని రాక్‌లైన్ వెంకటేష్ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘‘బలుపు’ సినిమాతో నన్ను రైటర్ని చేశారు రవితేజ. ఇప్పుడు దర్శకుణ్ణి చేశారు. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందీ సినిమా’’అని తెలిపారు. ఇంకా కోన వెంకట్ కూడా మాట్లాడారు. హన్సిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, రావురమేష్, ముఖేష్‌రుషి, ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: కోనవెంకట్, కెమెరా: ఆర్ధర్ ఎ.విల్సన్, సంగీతం: తమన్. -
బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్
తన సినిమా ద్వారా పరిచయమైన దర్శకుణ్ణి... స్టార్‌ని చేసే దాకా వదలడు రవితేజ. ‘నీకోసం’ సినిమా ద్వారా శ్రీను వైట్ల పరిచయం అయ్యారు. ‘వెంకీ’ సినిమాతో ఆయన స్టార్ డెరైక్టర్ అయిపోయారు. ‘షాక్’ చిత్రంతో హరీష్‌శంకర్ దర్శకుడయ్యారు. ‘మిరపకాయ్’తో స్టార్ అయిపోయారు. ఇక మలినేని గోపిచంద్ సంగతి సరేసరి. తొలి సినిమా ‘డాన్‌శీను’తో ఆయన్ను దర్శకునిగా పరిచయం చేసిన రవితేజానే, తర్వాత ‘బలుపు’తో ఆయన్ను స్టార్ డెరైక్టర్ని చేశారు. సో... రవితేజ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయమైతే... వాళ్లను స్టార్‌ని చేసేదాకా రవి వదలరన్నమాట. డిసెంబర్ 11న రవితేజ కొత్త సినిమా ప్రారంభం కానుంది. ప్రముఖ కన్నడ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా ‘బలుపు’ కథా రచయిత కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకునిగా పరిచయం అవుతున్నారు. రవితేజ కోసం బాబీ అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేశారు. కచ్చితంగా రవితేజ కెరీర్లో మైలురాయిలా ఈ సినిమా నిలుస్తుందని సన్నిహిత వర్గాల భోగట్టా. హన్సిక కథానాయిక. ఇందులో మరో కథానాయిక ఎంపిక జరగాల్సి ఉంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘ధూమ్, రేస్ తదితర బాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అలెన్ అమీన్ ఈ చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. రవితేజ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని సమాచారం. హైదరాబాద్, కోల్‌కతాల్లో చిత్రీకరణ జరగనుంది. ఈ చిత్రానికి కెమెరా: ఆర్థర్ విల్సన్, ఆర్ట్: బ్రహ్మ కడలి.