పల్లెటూరి వీరయ్యగా మెగస్టార్‌? | Chiranjeevi Bobby film title Veerayya | Sakshi
Sakshi News home page

పల్లెటూరి వీరయ్యగా మెగస్టార్‌?

Published Tue, Mar 30 2021 3:23 AM | Last Updated on Tue, Mar 30 2021 4:35 AM

Chiranjeevi – Bobby film title Veerayya - Sakshi

పల్లెటూరి వీరయ్యగా కనిపించనున్నారట చిరంజీవి. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్‌ ప్రారంభించారు బాబీ. ఈ చిత్రం పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందనే టాక్‌ వినిపిస్తోంది. ‘వీరయ్య’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నారు చిరంజీవి. ఆ సినిమా తర్వాత మోహన్‌ రాజా దర్శకత్వంలో మలయాళ ‘లూసిఫర్‌’ తెలుగు రీమేక్‌లో నటిస్తారు చిరంజీవి. ఆ తర్వాత బాబీ తెరకెక్కించే సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement