village back ground
-
పల్లె బాట పట్టిన టాలీవుడ్ హీరోలు.. హిట్ కొట్టేనా?
పల్లె కథలు, మట్టి కథలకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. గత ఏడాది థియేటర్స్‌లోకి వచ్చిన నాని ‘దసరా’, సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, సందీప్ కిషన్ ‘ఊరిపేరు భైరవకోన’, కార్తికేయ ‘బెదురు లంక 2012’, ప్రియదర్శి ‘బలగం’ వంటి పూర్తి స్థాయి పల్లెటూరి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద హిట్స్‌గా నిలిచాయి. ఇటీవల హిట్స్‌గా నిలిచిన ‘ఆయ్, కమిటీ కుర్రోళ్ళు’ కూడా పల్లె కథలే. దీంతో ఓ హిట్‌ని ఖాతాలో వేసుకోవడానికి పల్లెకు పోదాం చలో... చలో అంటూ కొందరు హీరోలు పల్లె కథలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇక ఏయే హీరోలను పల్లె పిలిచిందో తెలుసుకుందాం. పల్లె ఆట రామ్‌చరణ్ కెరీర్‌లోని పర్ఫెక్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ ‘రంగస్థలం’. 2018లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ‘రంగస్థలం’కు దర్శకత్వం వహించిన సుకుమార్ వద్ద ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన బుచ్చిబాబు సాన ఇప్పుడు రామ్‌చరణ్‌తో సినిమా చేసేందుకు ఓ పల్లెటూరి కథను రెడీ చేశారు. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని తెలిసింది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా సాగే ఈ సినిమాలో రామ్‌చరణ్ అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా మేకోవర్ పనులతో బిజీగా ఉన్నారు రామ్‌చరణ్. కథ రీత్యా పాత్ర కోసం బరువు పెరుగుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. స్పెషల్ డైట్ ఫాలో అవుతున్నారు. దసరా తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న చిత్రం ఇది. జాన్వీకపూర్ హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్.తెలంగాణ కుర్రాడు తెలంగాణ పల్లెటూరి అబ్బాయిలా హీరో శర్వానంద్‌ను రెడీ చేస్తున్నారు దర్శకుడు సంపత్ నంది. వీరి కాంబినేషన్లో ఓ పల్లె కథ తెరకెక్కనుంది. కేకే రాధామోహన్ నిర్మిస్తారు. యాక్షన్, ఎమోషన్ ప్రధానాంశాలుగా ఈ చిత్రం 1960 కాలంలో సాగుతుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెలంగాణ–మహారాష్ట్రల సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో కథనం ఉంటుంది. శర్వానంద్ కెరీర్‌లోని ఈ 38వ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా లుక్కు సంబంధించిన మేకోవర్ పనుల్లో ఉన్నారు శర్వానంద్. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తారు. బచ్చల మల్లి కథ వీలైనప్పుడల్లా సీరియస్ కథల్లోనూ నటిస్తుంటారు హీరో ‘అల్లరి’ నరేశ్. అలా ఆయన టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. 1990 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మేజర్ సన్నివేశాలు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయని తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో దొంగగా పేరుగాంచిన బచ్చలమల్లి అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ సినిమా కథనం ఉంటుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను ‘సోలో బతుకే సో బెటర్’ సినిమా ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. పల్లె బాటలో తొలిసారి... హీరో విజయ్ దేవరకొండ పల్లెటూరి బాట పట్టారు. కెరీర్లో తొలిసారిగా పల్లెటూరి కుర్రాడిగా సెట్స్‌కు వెళ్లనున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణివారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. పక్కా పల్లెటూరి యాక్షన్ డ్రామాగా రానున్న ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తారు. ఈ పీరియాడికల్ ఫిల్మ్ చిత్రీకరణ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి సినిమాతో బిజీగా ఉన్నారు విజయ్. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమా సెట్స్‌లోకి అడుగుపెడతారు విజయ్ దేవరకొండ. పల్లెటూరి పోలీస్ పల్లెటూరి రాజకీయాల్లో విశ్వక్ సేన్ జోక్యం చేసుకుంటున్నారు. విశ్వక్ సేన్ హీరోగా ఓ విలేజ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ తెరకెక్కనుంది. విశ్వక్ కెరీర్‌లోని ఈ 13వ సినిమాతో శ్రీధర్ గంటా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ సంపద హీరోయిన్గా కనిపిస్తారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. విశ్వక్ కెరీర్లో పూర్తి స్థాయి విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ఉండబోతోందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అమ్మాయి కథ యాక్షన్... లవ్‌స్టోరీ... పొలిటికల్... ఇవేవీ కాదు... భార్యాభర్తల అనుబంధం, స్త్రీ సాధికారత వంటి అంశాలతో సరికొత్తగా ఓ సినిమా చేస్తున్నారు తరుణ్ భాస్కర్. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్‌తో పాటు ఈషా రెబ్బా మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాను సంజీవ్ ఏఆర్ దర్శకత్వంలో సృజన్ యరబోలు, వివేక్ కృష్ణ, సాధిక్, ఆదిత్య పిట్టీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై స్పష్టత రానుంది. కాగా మలయాళ సూపర్ హిట్ ‘జయ జయ జయ జయ హే’ సినిమాకు తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందిందనే టాక్ వినిపిస్తోంది. కాలేజ్ సమయంలో ప్రేమించి, మోస΄ోయిన ఓ అమ్మాయి వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత అత్తింట్లో కొత్త సమస్యలు ఎదుర్కొంటుంది. ఆ తర్వాత భర్తకు ఎదురు తిరిగి, సొంతంగా వ్యాపారం పెట్టుకుని జీవితాన్ని ఎలా లీడ్ చేస్తుంది? అనే అంశాలతో ‘జయ జయ జయ జయ హే’ సినిమా కథనం సాగుతుంది. పోస్ట్‌మ్యాన్ స్టోరీ‘క’ అనే ఓ డిఫరెంట్ టైటిల్‌తో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా కిరణ్ అబ్బవరం ఓ సినిమా చేశారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఓ గ్రామంలో సాగే ఈ సినిమా కథలో కిరణ్ అబ్బవరం పోస్ట్‌మ్యాన్ రోల్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే హీరో క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ నిర్మించారు. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో స్పష్టత రానుంది. ఇలా పల్లెటూరి కథలతో రూపొందుతున్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
పల్లె పిలిచింది
పల్లెటూరి కథలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఎక్కువగా సిటీ చుట్టూ తిరిగే కథలే చూస్తుంటారు కాబట్టి పల్లె కథలు వచ్చినప్పుడు ప్రేక్షకులు చూడాలని అనుకుంటారు. పైగా ఆ కథల్లో స్టార్ హీరోలు నటిస్తే క్రేజ్ రెండింతలు ఉంటుంది. అలా ‘పల్లె పిలిచింది’ అంటూ కొందరు హీరోలు రూరల్ స్టోరీలతో చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. పల్లెటూరి ఆట రామ్‌చరణ్ రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమా అంటే ప్రేక్షకులకు ‘రంగస్థలం’ (2018) సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమా తర్వాత మరో రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు రామ్‌చరణ్. కాగా తనకు ‘రంగస్థలం’ వంటి హిట్ ఫిల్మ్‌ను అందించిన సుకుమార్‌తో మరో సినిమాకు రామ్‌చరణ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది ‘రంగస్థలం’కు సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది.అలాగే ఇది వార్ డ్రామా మూవీ అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌పై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబుతో రామ్‌చరణ్ హీరోగా చేయనున్న సినిమా మాత్రం పక్కా రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాయే. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో అన్నదమ్ముల పాత్రలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారట. ఈ పల్లె కథలో జాన్వీ కపూర్ హీరోయిన్. రాజు కథ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 24 మంది మత్స్యకారులు 2018లో జీవనోపాధికి గుజరాత్ సముద్ర తీరానికి వెళ్లి, పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు బందీలుగా చిక్కుతారు. ఈ ఘటనలో ఉన్న ఓ మత్స్యకారుడి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘తండేల్’. ప్రధానంగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. రాజు పాత్ర కోసం నాగచైతన్య పూర్తిగా మేకోవర్ అయ్యారు. అలాగే శ్రీకాకుళం యాస కూడా నేర్చుకున్నారు. ‘తండేల్’ను డిసెంబరు 20న విడుదల చేయాలనుకుంటున్నారు. దసరా కాంబో రిపీట్‘దసరా’ వంటి రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీతో మంచి హిట్ అందుకున్నారు హీరో నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. హీరో నాని– దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో మళ్లీ ఓ సినిమా రానుంది. ఈ సినిమా కథాంశం కూడా గ్రామీణ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. అలాగే ‘బలగం’ దర్శకుడు వేణు ఎల్దండి గ్రామీణ నేపథ్యంలో నాని హీరోగా ఓ సినిమా చేయనున్నారట. ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో ్రపారంభం కానుందని సమాచారం. మాస్ కుర్రాడు సిల్వర్ స్క్రీన్‌పై విజయ్ దేవరకొండ ఎక్కువగా సిటీ అబ్బాయిలానే కనిపించారు. ఫస్ట్ టైమ్ పూర్తి స్థాయిలో ఓ రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీలో హీరోగా నటించేందుకు రెడీ అవుతున్నారు. ‘రాజావారు రాణిగారు’ వంటి పల్లె ప్రేమకథను తీసిన దర్శకుడు రవి కిరణ్ కోలా ఈ సినిమాను తెరకెక్కిస్తారు. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు ఈ నెల 9న... విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా వెల్లడి కానున్నాయి. లంకల రత్న విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. గోదావరి పరిసర ్రపాంతాల్లోని గ్రామాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. చీకటి సామ్రాజ్యంలో లంకల రత్న అనే సాధారాణ వ్యక్తి అసాధారణ స్థాయికి ఎలా చేరుకుంటాడు? అన్నదే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కథ అని యూనిట్ పేర్కొంది. లంకల రత్న పాత్రలో విశ్వక్ సేన్ కనిపిస్తారు. కృష్ణచైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కానుంది. అలాగే హీరోలు రక్షిత్ అట్లూరి ‘శశివదనే’, నార్నే నితిన్ ‘ఆయ్..’ సినిమాలు గోదావరి నేపథ్యంలో సాగే కథలే. ఇంకా గ్రామీణ నేపథ్యంలో పలు చిత్రాలు ఉన్నాయి. -
పల్లెకు పోదాం..
‘పల్లెకు పోదాం సినిమా చేద్దాం. ఛలో చలో’ అని పాడుకుంటున్నారు కొందరు హీరోలు. ఈ హీరోలతో వెండితెరపై పల్లె కథలను చూపించేందుకు రెడీ అవుతున్నారు దర్శకులు. ఈ పల్లెటూరి కథల్లోకి వెళదాం. 1990లో ఓ గ్రామం నాగార్జున కెరీర్లో విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ చాలానే ఉన్నాయి. మరోసారి నాగార్జున ఓ విలేజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ నున్నారట. రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ఈ విలేజ్ స్టోరీని డెవలప్ చేశారు. అంతేకాదు... ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయం కానున్నారని సమాచారం. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తారని తెలిసింది. 1990 నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్ ఈ నెలలోనే ఆరంభం కానుంది. కేరాఫ్ స్టువర్టుపురం 1970లలో స్టువర్టుపురంలోని నాగేశ్వరరావు గురించి తెలియనివాళ్లు ఉండి ఉండరు. ఆయన జీవితంతో ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం రూపొందింది. రవితేజ హీరోగా వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గాయత్రీ భరద్వాజ్, నూపుర్ సనన్ నాయికలు. టైగర్ నాగేశ్వరరావు జీవితం ఏ విధంగా గడిచింది? ఆయన్ను కొందరు దొంగ అని, మరి కొందరు పేదలకు హెల్ప్ చేసే ఆపద్భాందవుడు అని ఎందుకు చెప్పుకుంటున్నారు? అనే కోణంలో ఈ సినిమా ఉంటుందట. అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 20న రిలీజ్ కానుంది. పల్లెటూరి ఆటగాడు హీరో రామ్‌చరణ్ కెరీర్లో ‘రంగస్థలం’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్ సూపర్బ్. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనతో ఓ సినిమా చేసేందుకు రామ్‌చరణ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది పల్లెటూరి నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ ఫిల్మ్ అని, ఇందులో అన్నతమ్ములుగా రామ్‌చరణ్ డ్యూయల్ రోల్ చేయనున్నారని భోగట్టా. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఓ విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ ఇదని సమాచారం. వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. భైరవకోన మిస్టరీ శ్రీకృష్ణదేవరాయల కాలంలో చెలామణిలో ఉన్న గరుడ పురాణానికి, ఇప్పటి గరుడ పురాణానికి నాలుగు పేజీలు తగ్గాయట. ఆ గరుడ పురాణంలో మిస్ అయిన ఆ నాలుగు పేజీల కథే భైరవకోన అని హీరో సందీప్ కిషన్ అంటున్నారు. మరి.. ఆడియన్స్‌కు ఈ మిస్టరీ తెలియాలంటే థియేటర్స్‌కు రానున్న ‘ఊరిపేరు భైరవకోన’ సినిమా చూడాలి. సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. రంగబలి రాజకీయం రంగబలి అనే విలేజ్‌లో జరిగే çఘటనలు, రాజకీయ కోణాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘రంగబలి’. నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ బాసంశెట్టి దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 7న విడుదల కానుంది. కుప్పంలో హరోంహర చిత్తూరు జిల్లా కుప్పంలో ‘హరోంహర’ అంటున్నారు సుధీర్‌బాబు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరోం హర’. 1989 చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే కథగా ‘హరోం హర’ సాగుతుంది. సుమంత్ జి. నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 22న రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఆదికేశవ ఆగమనం రాయలసీమలోని ఓ గ్రామంలో ఉన్న దేవాలయంపై మైనింగ్ మాఫియా చూపు పడింది. ఈ మాఫియాకు అడ్డుగా నిలబడతాడు రుద్రకాళేశ్వర్ రెడ్డి. ఈ గ్రామాన్ని రుద్రకాళేశ్వర్ రెడ్డి ఏ విధంగా రక్షించాడు అనేది తెలుసుకోవాలంటే జూలైలో వచ్చే ‘ఆదికేశవ’ సినిమా చూడాలి. రుద్రకాళేశ్వర్ రెడ్డి పాత్రలో హీరోగా వైష్ణవ్ తేజ్ నటిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో ఎస్. నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్మగ్లింగ్ నేపథ్యంలో... కథ ప్రకారం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో జరుగుతున్న స్మగ్లింగ్‌ను అడ్డుకోవాలనుకుంటున్నారట విశ్వక్ సేన్. 1994 నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కాస్త గ్రే షేడ్స్ ఉన్న హీరో క్యారెక్టర్లో విశ్వక్ సేన్ నటిస్తున్నారు. ఇది రూరల్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వాస్తవ ఘటన ఆధారంగా.... ‘గంగతలపై ఉన్నంత వరకే శివుడు చల్లగా ఉంటాడు. కంట్లోంచి గానీ జారిందా శివమెత్తుతాడు’ అనే పవర్ఫుల్ డైలాగ్ సాయిరామ్ శంకర్ నోట వచ్చింది ఓ సినిమా కోసం. విలేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రకాష్ జూరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, రమణి జూరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయారాజా సంగీతం అందిస్తుండటం విశేషం. ఇలా విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథలతో ప్రేక్షకులను అలరించేందుకు మరికొందరు హీరోలు రెడీ అవుతున్నారు. -
నెట్ వాడకంలో ఇండియా జెట్ స్పీడ్.. రిపోర్టులో ఆసక్తికర అంశాలు!
సాక్షి, హైదరాబాద్: ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్.. ప్రతిచోటా కంప్యూటర్.. వీటికితోడు స్మార్ట్ టీవీలు, ఇతర డివైజ్‌లు.. మొత్తంగా అంతా ఇంటర్నెట్కు కనెక్ట్ అయిపోయారు. నిత్యం ఇంటర్నెట్లో గడిపేస్తున్నారు. ఒకరిద్దరు కాదు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడాలేదు.. దేశవ్యాప్తంగా 75.9 కోట్ల మంది ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. ఇందులో పట్టణ ప్రాంతాల వారు 36 కోట్లు అయితే.. గ్రామీణ ప్రాంతాల యూజర్లు అంతకన్నా ఎక్కువగా 39.9 కోట్ల మంది ఉండటం గమనార్హం. ఇక యూజర్లలో 52 శాతం మంది కనీస స్థాయిలోనైనా ఇంటర్నెట్ను వాడుతున్నారు. అంటే మనదేశంలో తొలిసారిగా మెజారిటీ ప్రజలు యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లుగా నిలవడం విశేషం. తాజాగా ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ)–కాంటార్ (మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ కంపెనీ) సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన ‘ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్–2022’లో ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని 86 వేల కుటుంబాలపై ‘ఐక్యూబ్–2022’పేరిట నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఏటేటా పెరిగిపోతూ.. నివేదిక ప్రకారం.. దేశంలో యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ఏటా 10 శాతం పెరుగుతోంది. 2022లో 75.9 కోటుŠాల్గ ఉన్న వినియోగదారుల సంఖ్య 2025 నాటికల్లా 90కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రధానంగా వినియోగదారులు మొబైల్ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ను ఉపయోగిస్తుండగా.. ట్యాబ్లెట్లు, స్మార్ట్ టీవీలు, ఇతర స్ట్రీమింగ్ పరికరాలు, స్మార్ట్ పరికరాల ద్వారా వినియోగం కూడా ఇటీవలికాలంలో బాగా పెరిగింది. నూతన సాంకేతికతలు, సేవలను యాక్సెస్ చేసే విషయంలో భారతీయులు ముందుంటున్నారు. ఈ–కామర్స్ సేవలను పొందడంతోపాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు వేగంగా మారుతున్నారు. నివేదికలోని ముఖ్య అంశాలివీ.. - 2022లో భారత్‌లో యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య మొత్తంగా 75.9 కోట్లు. గతేడాది పట్టణ ప్రాంతాల్లో 6% యాక్టివ్ యూజర్లు పెరిగారు. - ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో14 శాతానికి వినియోగదారులు పెరిగారు. 2022లో కొత్తగా చేరిన యూజర్లలో 57% మహిళలే. - 2025 కల్లా కొత్త ఇంటర్నెట్ వినియోగదారుల్లో 56 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే ఉండే అవకాశం. ఇందులో మహిళలే 65 శాతం ఉండే చాన్స్. - ఇంటర్నెట్ వినియోగం విషయానికొస్తే.. డిజిటల్ ఎంటర్టైన్మెంట్, డిజిటల్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉంది. - ఇండియన్లు వేగంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫా మ్స్ వైపు మారుతున్నారు. ఈ–కామర్స్‌ను అందిపుచ్చుకుంటున్నారు. 2022లో ట్యాబ్లెట్లు, స్ట్రీమింగ్ పరికరాలను వాడేవారు 13% పెరిగారు. ఇది కూడా చదవండి: ఆస్తుల అమ్మకాలకు హెచ్ఎండీఏ రెడీ.. రూ.5 వేల కోట్లకు ప్లాన్! -
పల్లెటూరి వీరయ్యగా మెగస్టార్?
పల్లెటూరి వీరయ్యగా కనిపించనున్నారట చిరంజీవి. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ ప్రారంభించారు బాబీ. ఈ చిత్రం పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ‘వీరయ్య’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నారు చిరంజీవి. ఆ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో నటిస్తారు చిరంజీవి. ఆ తర్వాత బాబీ తెరకెక్కించే సినిమా షూటింగ్లో పాల్గొంటారు. -
గ్రామీణ మేధస్సుకు నిరాదరణే విఘాతం
భారతీయ సివిల్ సర్వీసుల తుది ఫలితాలు వెలువడగానే అంతిమవిజేతలకు, ర్యాంకర్లకు ప్రత్యేక అభినందన సభల ఏర్పాటు, మీడియాలో వారి విజయగాథల ప్రసారం వంటి నూతన ధోరణులు చోటుచేసుకోవడం అభినందనీయమే. 2017 సివిల్ సర్వీసుల తుది ఫలితాలలో ప్రథముడిగా నిలిచిన తెలంగాణ అబ్యర్థిని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. పరీక్షలో తెలంగాణ ప్రతిష్టను నిలబెట్టినట్లే విధి నిర్వహణలో కూడా రాష్ట్ర ప్రత్యేకతను చాటాలని అతనికి సూచించారు. సివిల్ సర్వీసుల పరీక్షలు రాసే తెలంగాణ అభ్యర్థుల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను స్థాపించాలని, ఇంటర్వ్యూకు వెళ్లేవారికోసం నిపుణులచే శిక్షణ ఇప్పించాలని కూడా సీఎం నిర్ణయం తీసుకున్నారు. అమలైతే ఇదొక ఆదర్శవంతమైన కార్యక్రమం అవుతుంది. అయితే వర్తమానంలో మన సివిల్ సర్వీసు వ్యవస్థ నడుస్తున్న వాస్తవ తీరును కూడా విశ్లేషించాలి. సివిల్ సర్వెంట్లు ఏయే సంస్కరణలకు శ్రీకారం చుట్టారు, వారేం సాధించారనే పురోగతికి సంబంధించిన సూదిమొనంత సమాచారం కూడా ప్రజలకు అందలేదు. ఉన్నతోద్యోగుల నిబ ద్ధతతో పాటు వారు వృత్తిగతంగా సాధించిన విజ యాలను కూడా ప్రజలకు తెలియచేయకపోతే సివిల్ సర్వీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో అనుమానాలు తలెత్తే అవకాశముంది. ఐఏఎస్ సాధించాలనే ప్రయత్నంలో ఒక ఐపీఎస్ ట్రెయినీ అవినీతికీ పాల్పడుతూ పరీక్షల్లో రహస్య ఎలక్ట్రానిక్ పరికరాలతో పట్టుబడ్డ ఇటీవలి సంఘటన సివిల్ సర్వీసుల ఎంపిక నిబద్ధతను ప్రశ్నార్థకం చేసింది. ఏ కొద్దిమందినో మినహాయిస్తే ఎక్కువశాతం అభ్యర్థులు ప్రోత్సాహక పరిసరాలు, వనరుల పరిపుష్టి, పరీక్ష పట్ల స్పష్టమైన అవగాహనం ఉన్నవారు మాత్రమే సివిల్ సర్వీసుల్లో విజయం సాధిస్తున్నారు. ప్రైవేట్ విద్యాలయాలు, కార్పొరేట్ కళాశాలలు, ప్రతిష్టాత్మక ప్రొఫెషనల్ విద్యాసంస్థల్లో చదివి, సమస్యలు బాధ్యతలు లేని ప్రేరణాత్మక వాతావరణానికి నోచుకున్న వారికి మాత్రమే సివిల్ సర్వీసుల్లో ప్రవేశం సాధ్యపడుతోంది. కానీ విజేతలవుతున్న గ్రామీణ అభ్యర్థులు చాలా కొద్దిమందే. వారు కూడా తమ ఊళ్లనుండి వసతులు లభ్యమవుతున్న ప్రదేశాలకు తరలి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. సిలబస్‌లోని ప్రతి అంశానికి సంబంధించిన విస్తృత సమాచారం, అవగాహన, పరీక్షలో సమాధానాలను ప్రభావవంతంగా రాయగల నేర్పు, లక్ష్యాత్మకంగా అలవర్చుకున్న మానవీయ వ్యక్తిత్వాన్ని ఇంటర్వ్యూలో ప్రదర్శించే ప్రతిభ వంటి నైపుణ్యాలన్నీ నూరు శాతం గ్రామీణ నేపథ్యం ఉన్న అభ్యర్థుల్లో కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఐతే ప్రోత్సాహక వాతావరణ లేమి, అహగాహనా రాహిత్యం, ఆర్థిక పరిమితులు, సాధనాత్మక ప్రేరణ కొదువల కారణంగా గ్రామీణ అభ్యర్థులు ఆ ఉద్యోగాలకు నోచుకోవడం లేదు. దీంతో మన దేశంలో సివిల్ సర్వీసులకు సంబంధించి అందుబాటులో ఉన్న వసతుల తోడ్పాటుతో ఎంపికను సాధించి అవకాశాలను పొందుతున్న వారు, వసతులకు నోచుకోక అవకాశాలను కోల్పోతున్న వారనే రెండు వర్గాలు పుట్టుకొచ్చి సంఘర్షణాత్మక అగాథం ఏర్పుడుతోంది. సివిల్ సర్వీసుల్లలో ప్రవేశానికి గ్రామీణ అభ్యర్థులకు ఇవ్వాల్సిన చేయూతను ఒక మహా యజ్ఞంలా కొనసాగించాలి. 2017 సివిల్ సర్వీసుల పరీక్షలో తొలి 25 ర్యాంకులను సాధిం చివారు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, విశ్వవిద్యాల యాల్లో చదివారు. అయినప్పటికీ 9 మంది ఫిజి కల్లీ ఛాలెంజెడ్, 8 మంది విజువల్లీ ఛాలెంజ్డ్, 12 మంది వినికిడి సమస్య ఉన్న అభ్యర్థులు కూడా ఈసారి విజేతల్లో ఉన్నారనే వాస్తవం తెలిస్తే ఎవరిలోనైనా విశ్వాసం ఉబికి వస్తుంది. కాబట్టి తెలంగాణ సీఎం ప్రతిపాదించిన శిక్షణను కేవలం ఇంటర్వ్యూ అభ్యర్థులకే కాకుండా అన్ని స్థాయిల్లో ఇవ్వాలి. ప్రభుత్వం, విద్యాసంస్థలు దీక్షబూని గ్రామీణ విద్యార్థులకు కూడా సివిల్ సర్వీసుల్లో ఎంపికయ్యేలా శిక్షణ నిస్తే పరిపాలనలో పల్లెటూళ్ల ప్రతిభ మెరుస్తుంది. గ్రామీణ భారతావని పులకరిస్తుంది. వంగీపురం శ్రీనివాసాచారి, ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ (మొబైల్ : 99480 90051) -
నిరుద్యోగులకు శుభవార్త
సాక్షి ప్రతినిధి, వరంగల్: నిరుద్యోగులకు ఉపాధి బాట చూపేందుకు జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ముందుగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతను లక్ష్యంగా ఎంచుకుంది. దాదాపు 20వేల మందికి ఉపాధి కల్పించే ధ్యేయంతో అడుగు ముందుకేస్తోంది. కలెక్టర్ జి.కిషన్ స్వీయ ఆలోచనతో ఈ కొత్త ప్రాజెక్టు పురుడు పోసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ కిరణాలు, వృత్తి విద్య, ఉపాధి కోర్సులన్నింటినీ ఇందులో భాగంగా ఒకే గొడుగు కిందకు తీసుకు వస్తారు. సమీకృత ప్రణాళికను సిద్ధం చేసి డీఆర్డీఏ సారథ్యంలో ‘ఉపాధి బాట’ చేపట్టాలని భావిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15 నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా యంత్రాంగం కంకణం కట్టుకుంది. ఇప్పటికే ముందస్తు కసరత్తు చేపట్టింది. ప్రతి వంద మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో అయిదుగురికే ప్రతిష్టాత్మక సంస్థలలో ఉపాధి దొరుకుతుందని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. ప్రతి 1000 మంది డిగ్రీ గ్రాడ్యుయేట్లలో ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. మరి మిగతా వారికేమైనా ఉపాధి మార్గాలున్నాయా...? ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశాలేమన్నా ఉన్నాయా...? అనే కోణంలో కలెక్టర్ తన ఆలోచనలకు కార్యరూపమిచ్చే కసరత్తు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థిని, విద్యార్థుల్లో ప్రతిభ ఉన్నప్పటికీ ఇంగ్లిష్‌పై పట్టు లేకపోవడం.. కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్ లేకపోవడంతో కార్పొరేట్, మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. అందుకే నిరుద్యోగులకు ఆయా రంగాల్లో శిక్షణ తరగతులు నిర్వహించి... వారిని ఉపాధి బాట పట్టించే వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ(నిట్) ప్రొఫెసర్లు, కాకతీయ యూనివర్సిటీ, కాకతీయ డిగ్రీ కళాశాల, ఎల్బి కళాశాల, ఆర్ట్స్ సైన్స్ కళాశాలలతో పాటు జిల్లాలోని వివిధ డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్, ఐటీఐల ప్రిన్సిపాళ్లతో ఇప్పటికే కలెక్టర్ సమావేశమయ్యారు. ముందుగా గ్రామీణ విద్యార్థులకు ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది 20 వేల మందికి శిక్షణ ఇప్పించేందుకు డీఆర్డీఏ సారథ్యంలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. శిక్షణ ఇలా.. ముందుగా గ్రామాల్లో సర్వే చేసి ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబిఎ, బి ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులను గుర్తిస్తారు. వీరిలో ఆసక్తి ఉన్న వారికి ఉపాధి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. వీరిని మూడు కేటగిరీలుగా విభజించి.. ఐఏఎస్, గ్రూపు-1 గ్రూపు-2 తదితర ఏపీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలకు వెళ్లే వారికి బీసీ, ఎస్సీ, గిరిజన స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ ఇప్పిస్తారు. ఇంటర్ పూర్తి చేసిన వారికి సర్వీస్ సెక్టారు కింద వృత్తి విద్య కోర్సులు నేర్పిస్తారు. ల్యాబ్ టెక్నీషియన్, ప్లంబింగ్, వైరింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, కంప్యూటర్లు, షాపింగ్‌మాల్స్, హాస్పిటల్ తదితర రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఐటీఐలు, పాలిటెక్నిక్‌లతో పాటు నిర్మితి కేంద్రాలు, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ తదితర సంస్థలన్నింటినీ ఇందులో భాగస్వాములు చేయాలని నిర్ణయించారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు బీసీ, ఎస్సీ, మైనారిటీ, ఐటీడీఏ నిధులతో కమ్యూనికేషన్ స్కిల్స్, ఆంగ్లంలపై శిక్షణ ఇప్పించనున్నారు. ప్రతి డిగ్రీ కాలేజీలో ఈ శిక్షణ ఇచ్చేందుకు రిసోర్సు పర్సన్లను నియమిస్తారు. కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్, ఆంగ్లంపై పట్టు సాధించేందుకు కనీసం మూడు నెలల పాటు ప్రత్యేక శిక్షణనిచ్చేలా ఈ ప్రోగ్రాం రూపొందిస్తారు. రిసోర్సు పర్సన్లకు ఎన్ఐటీ, కేయూ అధ్యాపకులతో ముందుగా శిక్షణను ఇప్పిస్తారు. ఈ శిక్షణను పంద్రాగష్టు నుంచే ప్రారంభించాలని యోచిస్తున్నారు.