సాక్షి, హైదరాబాద్: ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్.. ప్రతిచోటా కంప్యూటర్.. వీటికితోడు స్మార్ట్ టీవీలు, ఇతర డివైజ్‌లు.. మొత్తంగా అంతా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయిపోయారు. నిత్యం ఇంటర్నెట్‌లో గడిపేస్తున్నారు. ఒకరిద్దరు కాదు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడాలేదు.. దేశవ్యాప్తంగా 75.9 కోట్ల మంది ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇందులో పట్టణ ప్రాంతాల వారు 36 కోట్లు అయితే.. గ్రామీణ ప్రాంతాల యూజర్లు అంతకన్నా ఎక్కువగా 39.9 కోట్ల మంది ఉండటం గమనార్హం.
ఇక యూజర్లలో 52 శాతం మంది కనీస స్థాయిలోనైనా ఇంటర్నెట్‌ను వాడుతున్నారు. అంటే మనదేశంలో తొలిసారిగా మెజారిటీ ప్రజలు యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లుగా నిలవడం విశేషం. తాజాగా ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ)–కాంటార్ (మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ కంపెనీ) సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన ‘ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్–2022’లో ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని 86 వేల కుటుంబాలపై ‘ఐక్యూబ్–2022’పేరిట నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
ఏటేటా పెరిగిపోతూ..
నివేదిక ప్రకారం.. దేశంలో యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ఏటా 10 శాతం పెరుగుతోంది. 2022లో 75.9 కోటుŠాల్గ ఉన్న వినియోగదారుల సంఖ్య 2025 నాటికల్లా 90కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రధానంగా వినియోగదారులు మొబైల్‌ఫోన్ల ద్వారా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తుండగా.. ట్యాబ్లెట్లు, స్మార్ట్ టీవీలు, ఇతర స్ట్రీమింగ్ పరికరాలు, స్మార్ట్ పరికరాల ద్వారా వినియోగం కూడా ఇటీవలికాలంలో బాగా పెరిగింది. నూతన సాంకేతికతలు, సేవలను యాక్సెస్ చేసే విషయంలో భారతీయులు ముందుంటున్నారు. ఈ–కామర్స్ సేవలను పొందడంతోపాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు వేగంగా మారుతున్నారు.
నివేదికలోని ముఖ్య అంశాలివీ..
- 2022లో భారత్‌లో యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య మొత్తంగా 75.9 కోట్లు. గతేడాది పట్టణ ప్రాంతాల్లో 6% యాక్టివ్ యూజర్లు పెరిగారు.
- ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో14 శాతానికి వినియోగదారులు పెరిగారు. 2022లో కొత్తగా చేరిన యూజర్లలో 57% మహిళలే.
- 2025 కల్లా కొత్త ఇంటర్నెట్ వినియోగదారుల్లో 56 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే ఉండే అవకాశం. ఇందులో మహిళలే 65 శాతం ఉండే చాన్స్.
- ఇంటర్నెట్ వినియోగం విషయానికొస్తే.. డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, డిజిటల్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉంది.
- ఇండియన్లు వేగంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫా మ్స్ వైపు మారుతున్నారు. ఈ–కామర్స్‌ను అందిపుచ్చుకుంటున్నారు. 2022లో ట్యాబ్లెట్లు, స్ట్రీమింగ్ పరికరాలను వాడేవారు 13% పెరిగారు.
ఇది కూడా చదవండి: ఆస్తుల అమ్మకాలకు హెచ్‌ఎండీఏ రెడీ.. రూ.5 వేల కోట్లకు ప్లాన్!
Comments
Please login to add a commentAdd a comment