Internet users
-
ఇంటర్నెట్ యూజర్లు 90 కోట్లు
న్యూఢిల్లీ: భారతీయ భాషల్లో డిజిటల్ కంటెంట్‌కు డిమాండ్ నెలకొనడంతో దేశీయంగా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య ఈ ఏడాది 90 కోట్ల స్థాయిని దాటనుంది. గతేడాదితో పోలిస్తే 8 శాతం వృద్ధి చెందనుంది. 2024లో యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 88.6 కోట్లుగా ఉంది. ఐఏఎంఏఐ, కాంటార్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఇంటర్నెట్ యూజర్లలో దాదాపు సగం మంది గ్రామీణ భారతదేశంలో ఉన్నారు. వీరి సంఖ్య 48.8 కోట్లుగా ఉంది. దాదాపు 98 శాతం యూజర్లు భారతీయ భాషల్లో కంటెంట్‌ను వినియోగిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కంటెంట్ లభ్యత, డిమాండ్ అధికంగా ఉంది. పట్టణ ప్రాంత యూజర్లలో సగం మంది (సుమారు 57 శాతం) ప్రాంతీయ భాషల్లో కంటెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. డిజిటల్ వినియోగంలో లింగ అసమానతలు క్రమంగా తగ్గుతున్నాయని, ప్రస్తుతం మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో 47 శాతం మంది మహిళలు ఉంటున్నారని నివేదిక పేర్కొంది. ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్నప్పటికీ, విస్తృతి వేగం నెమ్మదిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వృద్ధి రేటు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతోంది. స్మార్ట్‌టీవీలు, స్మార్ట్ స్పీకర్లలాంటి సాంప్రదాయేతర సాధనాల వినియోగంలో పట్టణ ప్రాంతాలు ముందంజలో ఉన్నాయి. 2023తో పోలిస్తే 2024లో ఇది 54 శాతం పెరిగింది. ఓటీటీ వీడియోలు, మ్యూజిక్ స్ట్రీమింగ్, సోషల్ మీడియా మొదలైన వాటి వినియోగంలో పట్టణ యూజర్లను మించి గ్రామీణ యూజర్లు ముందుంటున్నారు. డిజిటల్ చెల్లింపులు, ఈ–కామర్స్, ఆన్లైన్ చదువులు తదితర అంశాల్లో పట్టణ ప్రాంతాల వారు ముందంజలో ఉంటున్నారు. -
ఓటీటీని ఆస్వాదిస్తున్న నెటిజన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ వినియోగదార్లలో 86 శాతం మంది ఓటీటీ (ఓవర్ ది టాప్) ఆడియో, వీడియో సేవలను ఆస్వాదిస్తున్నారు. వీరిలో సగానికిపైగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారని ఓ నివేదిక వెల్లడించింది. లక్షదీ్వప్ మినహా కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన 90,000 పైచిలుకు గృహాల నుంచి సమాచారాన్ని సేకరించి నివేదికలో పొందుపరిచారు. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ (ఐఎంఏ), మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ కంపెనీ కాంటార్ సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. స్మార్ట్ టీవీ, స్మార్ట్ స్పీకర్స్, ఫైర్‌స్టిక్స్, క్రోమ్కాస్ట్ల పెరుగుదల ద్వారా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ సేవలు 2021తో పోలిస్తే 2023లో 58 శాతం ఎగసింది. 18.1 కోట్ల మంది సంప్రదాయ టీవీ వీక్షణ సాగిస్తే, ఇంటర్నెట్ ఆధారిత పరికరాల ద్వారా వీడియో కంటెంట్‌ను 20.8 కోట్ల మంది ఆస్వాదిస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం ఇలా.. ఇంటర్నెట్ వినియోగదార్లలో కమ్యూనికేషన్స్ కోసం 62.1 కోట్ల మంది, సామాజిక మాధ్యమాలను 57.5 కోట్ల మంది వాడుతున్నారు. 2023 నాటికి యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య భారత్‌లో 82.3 కోట్లు ఉంది. జనాభాలో 55 శాతంపైగా గతేడాది ఇంటర్నెట్ వాడారు. 2022తో పోలిస్తే గతేడాది ఈ సంఖ్య 8 శాతం ఎక్కువ. మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో గ్రామీణ ప్రాంతాల వారు అత్యధికంగా 44.2 కోట్ల (53 శాతంపైగా) మంది ఉన్నారు. స్థానిక భాషల్లో కంటెంట్‌ను వీక్షించేందుకే 57 శాతం యూజర్లు మొగ్గు చూపుతున్నారు. తమిళం, తెలుగు, మలయాళం భాషలకు అధిక డిమాండ్ ఉంది. ఇక 2015లో మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో పురుషులు 71 శాతం కాగా, స్త్రీలు 29 శాతం నమోదయ్యారు. 2023లో పురుషుల వాటా 54 శాతానికి వచ్చి చేరింది. స్త్రీల వాటా 46 శాతానికి ఎగసింది. దేశంలోని లింగ నిష్పత్తికి దాదాపు సమంగా ఉంది. -
సోషల్ మీడియా 'కట్'.. వినోదానికే 'నెట్'..నివేదికలో ఆసక్తికర విషయాలు..
సాక్షి, అమరావతి: దేశంలో అత్యధిక వినియోగదారులు ఇంటర్నెట్ను వినోద మాద్యమాలను వీక్షించేందుకే ఉపయోగిస్తున్నారు. వారు వినోదమే ప్రధానం అంటున్నారు. సోషల్ మీడియాపట్ల వారిలో నెమ్మదిగా ఆసక్తి సన్నగిల్లుతోంది. అదే సమయంలో ఆన్లైన్ షాపింగ్ కోసం ఇంటర్నెట్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. మరోవైపు.. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య అమాంతంగా పెరుగుతుండటం మార్కెట్‌పై ప్రభావం చూపుతుందన్నది స్పష్టమవుతోంది. ‘ఇండియా ఇంటర్నెట్ రిపోర్ట్–2022’ నివేదిక భారతీయుల ఇంటర్నెట్ వినియోగ అభిరుచి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆ వివరాలు.. ముందు వినోదం.. ఆ తర్వాతే సమాచారం దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. అత్యధికులు వినోదం కోసమే దానిని వినియోగిస్తున్నారు. మొత్తం వినియోగదారుల్లో 85 శాతం మంది వినోదం కోసమే నెట్‌ను ఉపయోగిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. టీవీ చానళ్లు, యూట్యూబ్ చానళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ఆన్లైన్ గేమ్స్, క్రీడా కార్యక్రమాల వీక్షణం మొదలైన వాటికే ఇంటర్నెట్ను అత్యధికంగా వినియోగిస్తున్నారు. అంతేకాక.. ► వినోదం తరువాత రెండో స్థానంలో అత్యధికులు సమాచార సాధనంగా ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. 77శాతం మంది వాట్సాప్, ఫోన్‌కాల్స్, వెబ్సైట్లు, తమ ఆఫీసు వ్యవహారాల కోసం ఇంటర్నెట్పై ఆధారపడుతున్నారు. ► 2022లో ఇంటర్నెట్ వినియోగదారుల్లో వచి్చన గణనీయమైన మార్పు సోషల్ మీడియాపై ఆసక్తి సన్నగిల్లడం. 2021లో 78శాతం మంది సోషల్ మీడియా కోసం ఇంటర్నెట్ను వినియోగించేవారు. అదే 2022 నాటికి అది 70 శాతానికి పడిపోయింది. ఇప్పటికీ మొత్తం వినియోగదారుల్లో సోషల్ మీడియా కోసం ఇంటర్నెట్ను వినియోగించే వారు మూడో స్థానంలో ఉన్నారు. ► ఇక వాణిజ్య, వ్యాపార లావాదేవీల కోసం ఇంటర్నెట్ వినియోగించే వారు 52% మంది. 2021 కంటే వాణిజ్య అవసరాల కోసం ఇంటర్నెట్ వినియోగించే వారు 14% మంది పెరిగారు. వీరిలో పట్టణ, నగర ప్రాంతాలకు చెందిన వారు 65% మంది. ► ఇక దేశంలో ఆన్లైన్ షాపింగ్ పట్ల వినియోగదారుల ఆసక్తి క్రమంగా పెరుగుతోందని ఈ నివేదిక వెల్లడించింది. ఇంటర్నెట్ వినియోగదారుల్లో 34 శాతం మంది ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ కోసం ఇంటర్నెట్ను ఉపయోగించే వారు 2021 కంటే 2022లో 19 శాతం మంది పెరిగారు. ► ఇక ఇంటర్నెట్ వినియోగదారుల్లో 61% మంది పట్టణ, 31% మంది గ్రామీణ ప్రాంతాల నుంచి ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. భారీగా పెరుగుతున్న వినియోగదారులు ప్రపంచంలో ఇతర దేశాల కంటే భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య అత్యధికంగా పెరుగుతోంది. 2022 డిసెంబర్ నాటికి దేశంలో 75.90 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. అంటే దాదాపు సగం మంది ఏదో ఒక రీతిలో దీనిని వినియోగిస్తున్నారు. 2021 కంటే 2022లో ఇంటర్నెట్ వినియోగదారులు 10శాతం పెరిగారు. 2025 నాటికి ఈ సంఖ్య 90 కోట్లకు పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. చదవండి: వాట్సాప్‌లో చీటింగ్! -
నెట్ వాడకంలో ఇండియా జెట్ స్పీడ్.. రిపోర్టులో ఆసక్తికర అంశాలు!
సాక్షి, హైదరాబాద్: ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్.. ప్రతిచోటా కంప్యూటర్.. వీటికితోడు స్మార్ట్ టీవీలు, ఇతర డివైజ్‌లు.. మొత్తంగా అంతా ఇంటర్నెట్కు కనెక్ట్ అయిపోయారు. నిత్యం ఇంటర్నెట్లో గడిపేస్తున్నారు. ఒకరిద్దరు కాదు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడాలేదు.. దేశవ్యాప్తంగా 75.9 కోట్ల మంది ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. ఇందులో పట్టణ ప్రాంతాల వారు 36 కోట్లు అయితే.. గ్రామీణ ప్రాంతాల యూజర్లు అంతకన్నా ఎక్కువగా 39.9 కోట్ల మంది ఉండటం గమనార్హం. ఇక యూజర్లలో 52 శాతం మంది కనీస స్థాయిలోనైనా ఇంటర్నెట్ను వాడుతున్నారు. అంటే మనదేశంలో తొలిసారిగా మెజారిటీ ప్రజలు యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లుగా నిలవడం విశేషం. తాజాగా ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ)–కాంటార్ (మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ కంపెనీ) సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన ‘ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్–2022’లో ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని 86 వేల కుటుంబాలపై ‘ఐక్యూబ్–2022’పేరిట నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఏటేటా పెరిగిపోతూ.. నివేదిక ప్రకారం.. దేశంలో యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ఏటా 10 శాతం పెరుగుతోంది. 2022లో 75.9 కోటుŠాల్గ ఉన్న వినియోగదారుల సంఖ్య 2025 నాటికల్లా 90కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రధానంగా వినియోగదారులు మొబైల్ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ను ఉపయోగిస్తుండగా.. ట్యాబ్లెట్లు, స్మార్ట్ టీవీలు, ఇతర స్ట్రీమింగ్ పరికరాలు, స్మార్ట్ పరికరాల ద్వారా వినియోగం కూడా ఇటీవలికాలంలో బాగా పెరిగింది. నూతన సాంకేతికతలు, సేవలను యాక్సెస్ చేసే విషయంలో భారతీయులు ముందుంటున్నారు. ఈ–కామర్స్ సేవలను పొందడంతోపాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు వేగంగా మారుతున్నారు. నివేదికలోని ముఖ్య అంశాలివీ.. - 2022లో భారత్‌లో యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య మొత్తంగా 75.9 కోట్లు. గతేడాది పట్టణ ప్రాంతాల్లో 6% యాక్టివ్ యూజర్లు పెరిగారు. - ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో14 శాతానికి వినియోగదారులు పెరిగారు. 2022లో కొత్తగా చేరిన యూజర్లలో 57% మహిళలే. - 2025 కల్లా కొత్త ఇంటర్నెట్ వినియోగదారుల్లో 56 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే ఉండే అవకాశం. ఇందులో మహిళలే 65 శాతం ఉండే చాన్స్. - ఇంటర్నెట్ వినియోగం విషయానికొస్తే.. డిజిటల్ ఎంటర్టైన్మెంట్, డిజిటల్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉంది. - ఇండియన్లు వేగంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫా మ్స్ వైపు మారుతున్నారు. ఈ–కామర్స్‌ను అందిపుచ్చుకుంటున్నారు. 2022లో ట్యాబ్లెట్లు, స్ట్రీమింగ్ పరికరాలను వాడేవారు 13% పెరిగారు. ఇది కూడా చదవండి: ఆస్తుల అమ్మకాలకు హెచ్ఎండీఏ రెడీ.. రూ.5 వేల కోట్లకు ప్లాన్! -
కేంద్రం కీలక నిర్ణయం! కాల్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ కాల్స్ వివరాలన్నీ..!
న్యూఢిల్లీ: సాధారణ నెట్‌వర్క్‌లతో పాటు ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నేషనల్ కాల్స్, శాటిలైట్ ఫోన్ కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్, మెసేజీల సర్వీసులను అందించే సంస్థలు కూడా ఇకపై ఆ వివరాలను రెండేళ్ల పాటు తప్పనిసరిగా నిల్వ చేయాల్సి రానుంది. టెలికం శాఖ ఈ మేరకు సర్క్యులర్లను జారీ చేసింది. భద్రతా కారణాల రీత్యా తర్వాత ఎప్పుడైనా అవసరమైతే వీటిని సమీక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. నిల్వ చేయాల్సిన కాల్ డేటా రికార్డుల పరిధిని ఇంటర్నెట్ కాల్స్‌కు కూడా పెంచుతూ ఏకీకృత లైసెన్సు(యూఎల్) నిబంధనలకు టెలికం శాఖ డిసెంబర్లో సవరణలు చేసింది. దీనికి కొనసాగింపుగా టెల్కోలతో పాటు వాయిస్ మెయిల్, ఆడియోటెక్స్, యూనిఫైడ్ మెసేజింగ్ సర్వీస్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకునే సంస్థలకు కూడా వర్తించేలా తాజా నిబంధనలతో జనవరి 27న టెలికం విభాగం సర్క్యులర్లు జారీ చేసింది. శాటిలైట్ ఫోన్ సేవలు, డేటా సర్వీసులు అందించేందుకు లైసెన్సు పొందిన బీఎస్ఎన్ఎల్కు కూడా ఇదే తరహా సవరణను వర్తింపచేస్తూ మరో సర్క్యులర్ జారీ చేసింది. ఈ తరహా లైసెన్సులు తీసుకున్న టాటా కమ్యూనికేషన్స్, సిస్కోకు చెందిన వెబెక్స్, ఏటీఅండ్‌టీ గ్లోబల్ నెట్వర్క్ మొదలైన వాటికి ఈ సవరణలు వర్తించనున్నాయి. శాటిలైట్ ఫోన్ సర్వీసులు కాకుండా మిగతా అన్ని రకాల టెలికం సర్వీసులు అందించే భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి కంపెనీలను ఏకీకృత లైసెన్స్ హోల్డర్లుగా పరిగణిస్తారు. (చదవండి: భారత కంపెనీల జోరు..! బొక్కబోర్లపడ్డ చైనా..!) -
రెండేళ్లలో 150 కోట్ల మందికి ఇంటర్నెట్
న్యూఢిల్లీ: రెండేళ్లలో దేశంలో ఇంటర్నెట్ యూజర్లు రెండింతలు కానున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ‘భారత్‌నెట్ ప్రాజెక్ట్ గ్రామీణ భారతాన్ని అనుసంధానించనుంది. దీంతో రెండేళ్లలో ఇంటర్నెట్ వినియోగదార్ల సంఖ్య 150 కోట్లకు చేరనుంది. ప్రపంచంలోనే ఇంటర్నెట్తో అనుసంధానించిన అతిపెద్ద దేశం భారత్. ఇంట్రానెట్ కారణంగా చైనా ఆ స్థాయిలో కనెక్ట్ కాలేదు. భారత్‌లో ప్రస్తుతం 80 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ దేశంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను నడిపిస్తుంది. డేటా ప్రొటెక్షన్ బిల్లు డిసెంబర్‌లోగా రానుంది. నైతిక విలువలు, అలాంటి విషయాలు పట్టింపు లేని దేశాల నుండి కాకుండా భారతదేశం నుండి వచ్చే ఏఐ సాంకేతికతలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. డేటా గోప్యతను ప్రాథమిక హక్కుగా మనం పొందాము. చైనాలో అందుకు భిన్నం’ అని అసోచాం కార్యక్రమంలో మంత్రి వ్యాఖ్యానించారు. -
2023 నాటికి 90 కోట్ల ఇంటర్నెట్ యూజర్లు: సిస్కో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 2023 నాటికి ఇంటర్నెట్ వినియోగదార్ల సంఖ్య 90.7 కోట్లకు చేరుతుందని, జనాభాలో ఈ సంఖ్య 64 శాతమని సిస్కో తన వార్షిక ఇంటర్నెట్ నివేదికలో వెల్లడించింది. 2018లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 39.8 కోట్లుగా ఉందని తెలిపింది. ఈ సంఖ్య జనాభాలో 29 శాతమని వివరించింది. ‘2018లో 76.3 కోట్ల మొబైల్ యూజర్లు ఉంటే, 2023 నాటికి 96.6 కోట్లకు చేరతారు. నెట్వర్క్డ్ డివైసెస్ 150 కోట్ల నుంచి 210 కోట్లకు చేరతాయి. మొబైల్ కనెక్టెడ్ డివైసెస్ 110 కోట్ల నుంచి 140 కోట్లకు ఎగుస్తాయి. వైర్డ్/వైఫై కనెక్టెడ్ డివైసెస్ 36 కోట్ల నుంచి 69.7 కోట్లను తాకనున్నాయి. నెట్వర్క్డ్ డివైసెస్‌లో స్మార్ట్ఫోన్ల వాటా 42 శాతం నుంచి 38 శాతంగా ఉండనుంది. 2023 నాటికి నెట్వర్క్డ్ డివైసెస్‌లో 66% స్మార్ట్ఫోన్లు, 34% వైఫై/వైర్డ్ కనెక్టెడ్ డివైసెస్ ఉంటాయి. 5జీ కనెక్షన్లు 6.72 కోట్లకు చేరతాయి. మొబైల్ కనెక్షన్లలో 4జీ వాటా 53.1%కి ఎగుస్తుంది. 2018లో ఇది 37.9%గా ఉంది. 2018లో 2,070 కోట్ల మొబైల్ యాప్స్ డౌన్లోడ్ అయితే, 2023 నాటికి ఈ సంఖ్య 4,620 కోట్లకు చేరుతుంది. మొబైల్ కనెక్షన్ సగటు స్పీడ్ 4.6 ఎంబీపీఎస్ నుంచి 16.3 ఎంబీపీఎస్‌కు చేరనుంది’ అని తన నివేదికలో వివరించింది. -
నెట్ యూజర్లు@ 63 కోట్లు!
ముంబై: భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. ఈ ఏడాది ఇంటర్నెట్ వాడకందారుల సంఖ్య రెండంకెల వృద్ధితో 63 కోట్లకు పెరగగలదని కాంటర్ ఐఎమ్ఆర్బీ సంస్థ అంచనా వేసింది. గ్రామాల్లో ఇంటర్నెట్ వృద్ధి జోరుగా ఉందని, దీంతో నెట్ వాడకందారుల సంఖ్య భారీగా పెరుగుతోందని ఈ సంస్థ తన తాజా ఐక్యూబ్ 2018 నివేదికలో పేర్కొంది. ఇంటర్నెట్ కోసం దాదాపు 97 శాతం మంది మొబైల్ ఫోన్లనే వినియోగిస్తున్నారని, మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో మహిళల సంఖ్య 42 శాతంగా ఉందని పేర్కొన్న ఈ నివేదిక... ఇంకా ఏం చెప్పిందంటే... ►గతేడాది ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 18% వృద్ధి చెంది, తొలిసారిగా 50 కోట్లు దాటేసింది. పల్లెల్లో ఇంటర్నెట్ వృద్ధి, వినియోగం జోరుగా పెరగడమే దీనికి ప్రధాన కారణం. ►ఇంటర్నెట్ను వినియోగిస్తున్న వారిలో 87% మంది రెగ్యులర్ వినియోగదారులే. వీరంతా కనీసం నెలకు ఒక్కసారైనా నెట్ వాడుతున్నారు. ►మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో 29 కోట్ల మంది పట్టణ ప్రాంతాల వారు కాగా, 25 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల వారు. ►ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య–పట్టణ ప్రాంతాల్లో 7 శాతం పెరగ్గా, గ్రామీణ ప్రాంతాల్లో 35 శాతం వృద్ధి చెందడం విశేషం. ►2018లో గ్రామీణ ప్రాంతాల్లో 25 కోట్ల మేర ఉన్న ఇంటర్నెట్ వినియోగ దారుల సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి 29 కోట్లకు చేరవచ్చు. -
నిషేధించినా నెట్టింట..
సాక్షి, హైదరాబాద్: ‘శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు’అన్నారు పెద్దలు. అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అశ్లీల(పోర్న్), సినిమా పైరసీ సైట్ల నిర్వాహకులు ప్రస్తుతం ఇదే సూత్రాన్ని అమలు చేస్తున్నారు. దేశంలో జరుగుతున్న పలు అత్యాచారాలకు కారణంగా నిలుస్తోన్న ఈ వెబ్సైట్లను నిషేధించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ (డీవోటీ)కు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయినా తిమ్మిని బమ్మి చేసే ఆయా సైట్ల నిర్వాహకులు సైట్ల పేరులోని స్పెల్లింగ్‌లో కొద్దిపాటి మార్పు చేసి వీటిని చలామణిలోకి తీసుకొచ్చారు. తిరిగి ఎప్పట్లాగే ఇవి అందరికీ అందుబాటులోకి రావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఎందుకు నిషేధించారు.. ఉత్తరాఖండ్ హైకోర్టులో ఇటీవల ఓ రేప్ కేసు విచారణకు వచ్చింది. స్కూలు విద్యార్థినిపై తోటి బాలుడు అత్యాచారానికి పాల్పడిన కేసు అది. తాను ఈ అఘాయిత్యానికి పాల్పడే ముందు పోర్న్ సైట్లు చూశానని ఆ బాలుడు కోర్టుకు చెప్పాడు. దీనిపై స్పందించిన కోర్టు అత్యాచారాలకు కారణమవుతోన్న ఇలాంటి అశ్లీల వెబ్సైట్లను వెంటనే నిషేధించాలని సెప్టెంబర్ 27న కేంద్రానికి ఆదేశాలిచ్చింది. నవంబర్ 15లోగా ఈ పనిని పూర్తి చేయాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులు మంత్రిత్వ శాఖకు అక్టోబర్ 8న అందాయి. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ (డీవోటీ)కు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా దేశంలో 827 పోర్న్ వెబ్సైట్లను గుర్తించి బ్లాక్ చేశారు. అంతేకాకుండా ఈ జాబితాలోని సైట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రన్ చేయవద్దని ఇంటర్నెట్ సంస్థలకు నోటీసులు కూడా ఇచ్చింది. వీటితోపాటు టెలికామ్ సంస్థలు కూడా ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి. నియంత్రణ కష్టమే.. ‘మాకు ఆదేశాలు వచ్చిన వెంటనే మేం నిషేధాన్ని అమల్లో పెట్టాం. జాబితాలోని 827 అశ్లీల సైట్లను నిషేధించాం. కానీ, వారు తెలివైనవారు. ప్రపంచంలో ఏదో మూల నుంచి ఆపరేట్ చేస్తారు. తమ వెబ్‌సైట్‌కు వీక్షకులు తగ్గిన విషయం వీరికి తెలిసిన వెంటనే, ఐపీ అడ్రస్, వెబ్సైట్ చిరునామాలో స్వల్ప మార్పులు చేసి నెట్లో సులువుగా దొరికేలా చేస్తారు’అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ప్రైవేటు టెలికామ్ సంస్థ ఉన్నతాధికారి తెలిపారు. మనమే ఎందుకు లక్ష్యం..! భారత్‌లో జనాభా అధికం. ప్రపంచంలో రెండో స్థానం. జనాభాలో యువత దాదాపు 40 శాతం పైమాటే. దీనికితోడు భారత్‌లో పెరిగిపోతున్న ఇంటర్నెట్ యూజర్లు, మొబైల్ వినియోగదారులను ఈ వెబ్సైట్లు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ ఏడాది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ (డీవోటీ) ఇచ్చిన నివేదిక ప్రకారం.. భారత్‌లో ప్రస్తుతం 46.36 కోట్లకుపైగా బ్రాడ్‌బాండ్ వినియోగదారులు ఉన్నారు. ఇది గతేడాదితో పోలిస్తే.. 0.74 శాతం అధికం. ఇక జూన్ 2018 నాటికి స్మార్ట్ ఫోన్ వినియోగదారులు 50 కోట్ల మంది వరకు ఉన్నారు. ఓ సంస్థ అందించిన రిపోర్టు ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పోర్న్ వీడియోలు చూసే దేశంలో 2015లో ఇండియా 4వ స్థానంలో ఉండగా, 2016లో 3వ స్థానానికి ఎగబాకింది. తొలి రెండు స్థానాల్లో బ్రెజిల్, ఫిలిప్పీన్స్ ఉన్నాయి. పేరు మార్చి మళ్లీ ప్రత్యక్షం.. పోర్న్ వెబ్సైట్లపై నిషేధం విధిస్తారని ఆయా వెబ్సైట్ల నిర్వాహకులకు ముందే తెలుసు. అలాగే 2 వారాలుగా ఆన్లైన్లో వీటిని శోధించినా ఎవరికీ దొరకలేదు. దీంతో వీక్షకులు తగ్గిపోయిన విషయాన్ని ఆయా సైట్ నిర్వాహకులు గుర్తించారు. అందుకే వాటి ఐపీ అడ్రెస్లు, యూఆర్ఎల్ లింకులు, వెబ్సైట్ చిరునామా( డొమైన్ నేమ్) స్పెల్లింగ్‌లో స్వల్ప మార్పులు చేసి తిరిగి రన్ చేస్తున్నారు. ఆ పాత సైట్లన్నీ స్పెల్లింగ్‌లో స్వల్ప మార్పులతో తిరిగి నెట్లో హల్చల్ చేస్తున్నాయి. రాష్ట్రంలో అయితే దాదాపు 1,350 పోర్న్‌తోపాటు పైరసీ సినిమా వెబ్సైట్లను పోలీసులు గుర్తించి వాటిని నిషేధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, వారు పేర్లు మార్చుకుని తిరిగి వస్తుండటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. -
యూట్యూబ్ యూజర్లు ఎంత మందో తెలుసా?
-
యూట్యూబ్ వాడేది ఎంత మందో తెలుసా?
స్మార్ట్ఫోన్ల వాడకం అంతకంతకు పెరిగిపోవడం, సరసమైన ధరల్లో డేటా అందుబాటులోకి రావడం వంటి వాటితో యూట్యూబ్ వాడకం రోజురోజుకి పెరుగుతోంది. దేశంలోని అన్ని వయస్సు గ్రూప్‌ల్లో 80 శాతం ఇంటర్నెట్ వినియోగదారులు యూట్యూబ్‌ను యాక్సస్ చేస్తున్నట్టు గూగుల్ ఇండియా తెలిపింది. ‘బ్రాడ్కాస్ట్ 2018’ ఈవెంట్ సందర్భంగా దేశీయ ఇంటర్నెట్ వృద్ధిలో యూట్యూబ్ ఎలా అసోసియేట్ అయి ఉంది అనే అంశాన్ని హైలెట్ చేసింది. బ్రాండుల పరంగా యూట్యూబ్ అనేది ప్రస్తుతం ఎండ్-టూ-ఎండ్ ప్లాట్పామ్ అని గూగుల్ ఆగ్నేయ ఆసియా వైస్-ప్రెసిడెంట్ రాజన్ అనందన్ తెలిపారు. కేవలం మొబైల్లోనే 225 మిలియన్ మంది నెలవారీ యాక్టివ్ యూజర్లును తాకినట్టు పేర్కొన్నారు. వీడియో ప్లాట్ఫామ్లో భారత్ వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా కంపెనీ పేర్కొంది. లక్షల కొద్దీ సబ్స్క్రైబర్లతో 300 పైగా ఛానల్స్ ఉన్నాయని, 2014లో ఇవి కేవలం 16 ఉన్నట్టు యూట్యూబ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాబర్ట్ చెప్పారు. క్రియేటర్లకు సపోర్టు చేయడానికి, మరింత వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి, కంటెంట్ పంపిణీ వంటి ప్రొగ్రామ్స్‌లో తాము ఎల్లప్పుడూ పెట్టుబడులు పెడుతూనే ఉంటామన్నారు. 2020 నాటికి మొత్తం ఆన్లైన్ వీడియో కన్జ్యూమర్లు 500 మిలియన్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. -
ఇంటర్నెట్ యూజర్లు@50 కోట్లు!
న్యూఢిల్లీ: దేశంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2018 జూన్ నాటికి 50 కోట్లకు చేరుతుందని అంచనా. ఐఎంఏఐ–కంటర్ ఐఎంఆర్బీ సంయుక్త సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. సర్వేలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ∙ 2017 డిసెంబర్లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 11.34 శాతం వృద్ధితో 48.1 కోట్లకు చేరింది. ∙ పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2017 డిసెంబర్ నాటికి వార్షిక ప్రాతిపదికన 9.66 శాతం వృద్ధితో 29.5 కోట్లకు చేరి ఉంటుందని అంచనా. ఇక ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 14.11 శాతం వృద్ధితో 18.6 కోట్లకు పెరిగి ఉండొచ్చు. ∙ దేశీ మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో విద్యార్థులు, యువత వాటా దాదాపు 60%. ∙ ఇంటర్నెట్ను ప్రతి రోజూ వినియోగిస్తున్న వారి సంఖ్య 18.29 కోట్లుగా ఉండొచ్చు. -
ఈ జూన్ నాటికి వీరి సంఖ్య 50కోట్లకు పైనే
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2018 జూన్ నాటికి 50కోట్ల (500 మిలియన్లు) మార్క్నుఅధిగమిస్తుందని ఓ సర్వే తెలిపింది. 170 నగరాల్లో, 750 గ్రామాలలో నిర్వహించిన ఉమ్మడి సర్వే తర్వాత ఈ నివేదిక విడుదల చేసింది. ముఖ్యంగా ఈ 170 నగరాల్లో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాలు అగ్రస్థానంలో ఉండగా, ఫతేపూర్, జగదల్పూర్, ఇంఫాల్ ఆఖరిస్థానంలో ఉన్నాయి. మొత్తం తొమ్మిది నగరాల్లో 35 శాతం మంది పట్టణ ఇంటర్నెట్ వినియోగదారులు నమోదయ్యారు. అయితే చిన్న మెట్రోలు, నాన్ మెట్రో నగరాల్లో జాతీయ సగటు కన్నా ఇంటర్నెట్ వ్యాప్తి స్థాయి తక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 'ఇంటర్నెట్ ఇన్ ఇండియా 2017' అంనే అంశంపై ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ), కంతర్ ఐఎంఆర్బీ ఈ రిపోర్టును విడుదల చేసింది. 2017 డిసెంబరు నాటికి మొత్తం జనాభాలో 35శాతం మంది ఇంటర్నెట్ వినియోగదారులుగా ఉన్నారని నివేదించింది. నివేదిక ప్రకారం, 2016 డిసెంబర్ -2017 డిసెంబర్ నాటికి అర్బన్ ఇండియాలో 9.66 శాతం వృద్ధిని సాధించి 295 మిలియన్లమంది ఇంటర్నెట్ వినియోగదారులున్నారని అంచనా వేసింది. మరోవైపు, 2016 డిసెంబర్ నుంచి 2017 డిసెంబర్ నాటికి గ్రామీణ ప్రాంతాల్లో డబుల్ డిజిట్ వృద్ధిని సాధించింది. 14.11శాతం వృద్ధితో 186 మిలియన్ల మంది ఇంటర్నెట్ రోజువారీ వినియోగించుకున్నా రని నివేదిక పేర్కొంది. 2017 జూన్ , ఆగస్టు నెలల మధ్య 170 నగరాల్లో 60వేల మందిని, గ్రామీణ ప్రాంతంలో 750 గ్రామాల్లో 15వేల మందిపై ఈ సర్వే నిర్వహించింది. -
ఇంటర్నెట్ కనెక్టివిటీకి దూరంగా 95 కోట్ల మంది
అసోచామ్–డెలాయిట్ నివేదిక న్యూఢిల్లీ: ఇంటర్నెట్ యూజర్లను అధికంగా కలిగిన రెండో అతిపెద్ద దేశంగా భారత్ కొనసాగుతున్నప్పటికీ.. దేశంలో 95 కోట్ల మందికి ఇంకా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో లేదని అసోచామ్–డెలాయిట్ సంయుక్త నివేదిక పేర్కొంది. దేశంలో ఇంటర్నెట్ డేటా ప్లాన్ ధరలు ప్రపంచ దేశాల కన్నా తక్కువగా ఉన్నాయని, స్మార్ట్‌ఫోన్స్ కూడా తక్కువ ధరలకు లభ్యమౌతున్నాయని అయినా కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఇంకా చాలా మందికి అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యకరమని తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 35 కోట్లుగా ఉందని, చైనా తర్వాతి రెండో స్థానంలో కొనసాగుతోందని పేర్కొంది. -
ఇంటర్నెట్ యూజర్ల సంఖ్యలో మహారాష్ట్ర టాప్
న్యూఢిల్లీ: దేశంలో ఇంటర్నెట్ యూజర్లు అధికంగా మహారాష్ట్రలో వున్నారు. ఈ రాష్ట్రంలో 2.95 కోట్ల మంది ఇంటర్నెట్ చందాదారులు వుండగా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటకలు తర్వాతి స్థానాన్ని ఆక్రమిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. తమిళనాడులో 2.80 కోట్లు, తెలంగాణ, ఆంధప్రదేశ్ల్లో సంయుక్తంగా 2.49 కోట్లు, కర్నాటకలో 2.26 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు వున్నారు. దేశం మొత్తం మీద ఈ సంఖ్య 34.26 కోట్లు. -
అమెరికాను వెనక్కి నెట్టిన ఇండియన్స్
వాషింగ్టన్: ఇంటర్నెట్ వినియోగంలో భారతీయులు దూసుకుపోతున్నారు. అగ్రరాజ్యం అమెరికాను వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకారు. అత్యధిక మంది ఇంటర్నెట్ యూజర్లతో చైనా మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం 27.7 కోట్ల మంది భారతీయులు ఇంటర్నెట్ను వినియోగిస్తున్నట్టు పెట్టుబడి సంస్థ కేపీసీబీ భాగస్వామి మేరీ మీకర్ రూపొందించిన వార్షిక 'ఇంటర్నెట్ ట్రెండ్స్' నివేదిక వెల్లడించింది. గత సంవత్సరంతో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 7 శాతమే పెరగగా.. భారత్‌లో 40 శాతం వృద్ధి చెందటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య పెరగడంలో ఒక్క భారతే 2 శాతం పాయింట్లను జతచేయడం గమనార్హం. వాస్తవానికి అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఇంటర్నెట్ కు ఎక్కువ ఖర్చు అవుతుంది. భవిష్యత్ లో నూతన వినియోగదారులు దొరికే పరిస్థితి లేకపోవటం వల్ల గూగుల్, ఫేస్బుక్, యాపిల్ వంటి సంస్థలు భారతీయులపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని 'ఇంటర్నెట్ ట్రెండ్స్' నివేదిక రూపకర్త మీకర్ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న పేద దేశాల నుంచి ఇంటర్నెట్ వాడకం పెరుగుతోందని వెల్లడించారు. -
గూగుల్ ఓ అవసరం..ప్రమాదం
గూగుల్ లేని ఇంటర్నెట్ను ఊహించడమే అసాధ్యం కంప్యూటర్లు, మొబైల్స్‌పై పూర్తి ఆధిపత్యం దానిదే ♦ మొబైల్లో ప్రతి సమాచారం గూగుల్ కనుసన్నల్లోనే ♦ పేరుకే ఆండ్రాయిడ్ అందరికీ ఓపెన్... కానీ ప్లేస్టోర్దే నియంత్రణ ♦ జీమెయిల్లో ఏది పంపినా రహస్యంగా ఉండదు! ♦ సర్చ్ ఫలితాల్లోనూ వాణిజ్య ప్రయోజనాలున్నాయనే విమర్శలు ♦ సమాచారం చేరవేత నుంచి కాపలాదారు పాత్రలోకి.. ♦ పలు సర్వీసులపై విదేశాల్లో విమర్శలు... కొన్నింటి నిషేధం కూడా గూగుల్ అంటే... ఇంటర్నెట్కు గుండెకాయ. గుండె చప్పుడు ఆగిపోయే క్షణ కాలాన్ని కూడా మనమెలా ఊహించుకోలేమో... మన లాంటి దేశాల్లో గూగుల్ లేని ఇంటర్నెట్ను కూడా అలానే ఊహించలేం. గూగుల్ సెర్చ్, జీమెయిల్, గూగుల్ క్రోమ్, గూగు ల్ ప్లస్, యూ ట్యూబ్, పికాసా, గూగుల్ ఎర్త్, మ్యాప్స్, బుక్స్, మొబైల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, గూగుల్ ప్లే స్టోర్... ఇలా గూగుల్ ఉత్పత్తుల్ని చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పెపైచ్చు వీటిలో చాలావరకూ మన జీవితంలో విడదీయరాని భాగంగా పెనవేసుకుపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మొబైల్లో, కంప్యూటర్లో ఇంటర్నె ట్ వాడేవారు... గూగుల్ ఉత్పత్తుల్ని వాడకుండా ఉండటం దాదాపు అసాధ్యం. అయితే... ఇదంతా గూగుల్‌కు ఒక కోణమే. మరి ఇంకో కోణమేంటి...? శ్రీధర్ తన ఫ్రెండ్ రాధికకు జీమెయిల్ ద్వారా లేఖ పంపాడు. తాను వారం రోజుల్లో విదేశాలకు వెళుతున్నానని, నెలరోజులు అక్కడే ఉంటానని రాశాడు. రాధిక ఆ మెయిల్‌కు జవాబిచ్చేలోపే... విదేశాలకు వెళితే తమ సిమ్‌కార్డు తీసుకోండి అంటూ ఓ టెలికం కంపెనీ మార్కెటింగ్ విభాగం నుంచి శ్రీధర్‌కు మెయిలొచ్చింది. అంతేకాదు... విమానం టికెట్లు, ఫారెక్స్ ప్రకటనలు కూడా శ్రీధర్ మెయిల్ బాక్స్‌లోకి వచ్చేశాయి. ఇదెలా సాధ్యమైందంటే జీమెయిల్ ద్వారా శ్రీధర్ పంపిన వివరాల్ని గూగుల్ కంప్యూటర్లు స్కాన్ చేసి... వివరాలను థర్డ్ పార్టీ సంస్థలకు పంపాయి. ఫలితమే ఆ అడ్వర్టయిజ్మెంట్ లేఖలు. ఇదే కాదు... మొబైల్ ఫోన్లో, కంప్యూటర్లో ఇంటర్నెట్ వాడేవారి సమస్త సమాచారం ఇప్పుడు బహిరంగమే. మీరు పంపే మెయిల్ నుంచి మీ కాంటాక్టుల వరకూ ఏదీ మీ ఒక్కరి సొత్తే కాదు. మొబైల్ అయితే మీరు సందర్శించిన ప్రాంతం నుంచి మీరు వాడుతున్న అప్లికేషన్లు, కాంటాక్టుల దాకా అన్నీ గూగుల్ చేతిలోనే ఉంటాయి. ప్రతి వివరాలూ అందరికీ తెలుస్తాయి. కొన్నిటివల్ల మీకు ఉపయోగం ఉన్నా.. కొన్ని మీకు ఇబ్బందులూ తెచ్చిపెడతాయి. అందుకే... గూగుల్ అంటే ఓ అవసరం. ఓ ప్రమాదం. అదే ఈ వారం ‘ఫోకస్’ జీమెయిల్ రహస్యమేమీ కాదు జీమెయిల్ ద్వారా మెయిల్‌ను పంపిన వారు, అందుకున్న వారు తప్ప మూడో మనిషి దాన్ని చదివే అవకాశం లేదని గూగుల్ చెబుతోంది. అయితే కొన్నింటిని బ్లాక్ చేయటానికి, కావాల్సిన ప్రకటనలు మాత్రమే అందించడానికి కంప్యూటర్లు దాన్ని స్కాన్ చేస్తాయని చెబుతోంది. అయితే యాహూ, అవుట్‌లుక్ వంటి పాపులర్ ఈమెయిల్స్ మాత్రం... మెయిల్స్ కాక యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని మాత్రమే ప్రకటనల కోసం విశ్లేషిస్తామని చెబుతాయి. అందుకే గూగుల్ చేస్తున్న మెయిల్ స్కానింగ్‌పై 2013లో మైక్రోసాఫ్ట్ విమర్శలు చేసింది. చాలామంది వినియోగదారులకు తమ మెసేజ్‌లను గూగుల్ స్కాన్ చేస్తోందన్న విషయమే తెలియదని పేర్కొంది. తమ ఔట్లుక్ సర్వీసు మెయిల్స్‌ను స్కాన్ చేయదని తెలిపింది. మరో విశేషం ఏమిటంటే గూగుల్ పాలసీ ప్రకారం అది సేకరించిన డేటాను ఎన్నాళ్లయినా నిల్వ ఉంచుకోవచ్చు. దీనిపై గూగుల్ ఒక సందర్భంలో కోర్టుకు అఫిడవిట్ ఇస్తూ... గూగుల్ యూజర్లెవరూ తమ ఈమెయిల్స్ రహస్యమని అనుకోవడం లేదని చెప్పటం గమనార్హం. దీన్ని ‘కన్స్యూమర్ వాచ్డాగ్’ సంస్థ 2013 ఆగస్టులో బయటపెట్టింది. గార్డియన్ పత్రిక ఈ విషయాన్ని ప్రచురిస్తూ... ‘‘గూగుల్ తన అఫిడవిట్లో ఉద్దేశించింది ఇతర ఈమెయిల్స్ వాడుతున్న వారు జీమెయిల్స్కు పంపిన మెయిల్స్ గురించి’’ అని పేర్కొంది. క్రోమ్‌తో నిరంతరం ట్రాకింగ్ ఫైర్ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, సఫారీ, ఒపెరా వంటి ప్రధాన బ్రౌజర్లన్నిటా ‘డు నాట్ ట్రాక్’ అనేది ఉంటుంది. దీన్ని చేర్చడానికి ఇవన్నీ సంతకాలు చేశాయి. గూగుల్ మాత్రం క్రోమ్‌లో దీన్ని చేర్చడానికి అంగీకరించలేదు. నిజానికి 2011లో వెబ్ అడ్వర్టయిజింగ్ ద్వారా యూజర్ల ప్రవర్తన, అలవాట్లు అన్నిటినీ ట్రాక్ చేయటానికి సంబంధించి గూగుల్‌కు పేటెంట్ లభించింది. ‘డు నాట్ ట్రాక్’పై సంతకం చేస్తే ఈ వ్యాపారం దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే గూగుల్ చేయలేదన్న విమర్శలొచ్చాయి. యూజర్ల అలవాట్లకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లను ఇవ్వలేకపోతే టెక్నాలజీకి అర్థం లేదని గూగుల్ వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గమనార్హం. చివరకు గూగుల్ తన బ్రౌజర్లో ‘కీప్ మై ఆప్ట్ అవుట్స్ (నాకు అక్కర్లేనివి దూరంగా ఉంచు)’ అనే ఎక్స్‌టెన్షన్‌ను అందిస్తోంది. దీనివల్ల ప్రకటన కంపెనీలు తమ కుకీలను మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయకుండా ఉంటాయి. అయినా విమర్శలు ఆగకపోవడంతో 2012 నవంబర్‌లో గూగుల్ ‘డునాట్ ట్రాక్’ ఫీచర్‌ను చేరుస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. సెట్టింగ్స్‌లో దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. పుస్తకాల కాపీరైట్పైనా విమర్శలు మిలియన్ల కొద్దీ పుస్తకాల్ని స్కాన్ చేసి.. వాటిని తమ సెర్చ్ ఇంజిన్ ద్వారా చదవటానికి వీలు కల్పిస్తున్న గూగుల్ బుక్స్ ప్రాజెక్టుపై పలు విమర్శలున్నాయి. అసోసియేషన్ ఆఫ్ లెర్న్డ్ అండ్ ప్రొఫెషనల్ సొసైటీ పబ్లిషర్స్, అమెరికన్ యూనివర్సిటీ... గూగుల్ ప్రింట్‌ను వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశాయి. ‘‘గూగుల్ విజయవంతమైన కంపెనీ. తమ వాణిజ్య ప్రయోజనాల కోసం ఎవరి ప్రాపర్టీపై అయినా పూర్తి హక్కులు దక్కించుకుంటోంది. ప్రతి పుస్తకంపైనా అనుమతి వస్తేనే అలా చేయాలి’’ అని వారు కోరారు. 2009లో తలెత్తిన మరో వివాదంలో.... చైనా రచయితల హక్కుల్ని కాపాడే చైనా రిటెన్ వర్క్ కాపీరైట్ సొసైటీ... అనుమతి లేకుండా 570 మంది చైనా రచయితలకు చెందిన 18 వేల పుస్తకాల్ని స్కాన్ చేశారంటూ గూగుల్‌ను నిందించింది. దీనిపై వారితో గూగుల్ చర్చలు జరిపింది. చివరకు 2009 నవంబర్ 20న... గూగుల్ తాను స్కాన్ చేసిన పుస్తకాల జాబితాను విడుదల చేసింది. కాపీరైట్ చట్టాల్ని ఉల్లంఘించినట్లు మాత్రం అంగీకరించలేదు. అయితే 2010 జనవరి 9న గూగుల్ బుక్స్ ఏసియా పసిఫిక్ అధిపతి ఒక ప్రకటన చేస్తూ... చైనా రచయితలతో చర్చలు అంత సజావుగా సాగటం లేదంటూ... రచయితలకు క్షమాపణ చెప్పారు. ప్రైవసీలో అతితక్కువ రేటింగ్ 2012 మార్చి 1 గూగుల్ తన ప్రైవసీ పాలసీని మార్చింది. దీనిప్రకారం తనకు అందిన డేటాను వివిధ సర్వీసులతో పంచుకుంటుంది. ఇలా పంచుకునే వాటిలో యాడ్సెన్స్, అనలిటిక్స్‌ను వాడే లక్షల కొద్దీ థర్డ్ పార్టీ వెబ్సైట్లూ ఉన్నాయి. ఇంటర్నెట్ యూజర్లు ఆన్‌లైన్‌లోకి రావాలంటేనే భయపడే ఈ పాలసీపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. వీటికి గూగుల్ సీఈఓ ఎరిక్ స్మిత్ సమాధానమిస్తూ... మీకు సంబంధించిన సమాచారం ఎవరికీ తెలియకూడదనుకుంటే... అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే వాస్తవంగా గూగుల్ వంటి సెర్చింజిన్లు కూడా ఆ సమాచారాన్ని కొన్నాళ్లు తమ వద్ద ఉంచుకుంటాయి. ఉదాహరణకు మనందరం అమెరికా పేట్రియాట్ చట్టంలో భాగస్తులమే. మన సమాచారం మొత్తం అధికారులకు అందుబాటులో ఉంటుంది’’ అని చెప్పారు. కాకపోతే ప్రైవసీ లేకుండా గూగుల్ చేస్తున్న చర్యలపట్ల ప్రైవసీ ఇంటర్నేషనల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత అమెరికన్ చట్టాల ప్రకారం గూగుల్ తన దగ్గరున్న డేటా మొత్తాన్ని అమెరికా ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. 2007 నాటి నివేదికలో ప్రైవసీ ఇంటర్నేషనల్ సంస్థ గూగుల్‌ను ‘హోస్టైల్ టు ప్రైవసీ’గా వర్ణించి అతితక్కువ రేటింగ్ ఇచ్చింది. ఈ జాబితాలో ఇంత తక్కువ ర్యాంకింగ్ వచ్చింది గూగుల్‌కే. యూజర్లు తెచ్చిన డేటాతో మ్యాప్స్ వ్యాపారం యూజర్లు తాము గుర్తించిన ప్రాంతాలు, రో డ్లు, భవనాల పే ర్లను గూగుల్ మ్యాప్స్‌లో నమోదు చేయొచ్చు. అంటే వివిధ ప్రాంతాలు, మానవీయ ప్రయత్నాల్ని తెలిపే ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ మాదిరేనన్న మాట. కాకపోతే ఉచితంగా బయటి జనం ఇచ్చిన డేటాను వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తోందన్న విమర్శ గూగుల్ మ్యాప్స్పై ఉంది. వాణిజ్యపరంగా తానే యజమానినని చెప్పుకోవటం కూడా వివాదమయింది. డేటా అప్డేట్ చేసినవారికి ఏమీ తిరిగివ్వకుండా... పెపైచ్చు లెసైన్సుతో నియంత్రిస్తుండటంపై విమర్శలు రేగాయి. సమాచార కాపలాదారు స్థాయికి! గూగుల్ ఉండాల్సింది సమాచారాన్ని ఒకచోటి నుంచి మరోచోటికి చేరవేసే పాత్రలో.. కానీ ఇపుడది సమాచార కాపలాదారు పాత్రకు ఎదిగిపోయిందనేది మైక్రోసాఫ్ట్‌కు చెందిన జో విల్కాక్స్ అభిప్రాయం. ‘‘సెర్చ్‌లో గూగుల్ ఆధిపత్యం బాగా పెరిగింది. సమాచారాన్ని సేకరించటం, దాని చుట్టూ ఉన్న ప్రకటనలకు సహకరించటంలో సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోంది’’ అనేది ఆయన మాట. నిజానికి సెర్చ్‌లో తనకున్న ఆధిపత్యాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందంటూ రేగిన ఆందోళనలపై 2010లో యూరోపియన్ కమిషన్ విచారణ కూడా జరిపింది. దీర్ఘకాలం విచారణ కొనసాగితే నష్టమని భావించడంతో దీనిపై 2013 మొదట్లో గూగుల్... కొన్ని రకాల సెర్చ్‌లకు సంబంధించి తన పద్ధతులు మార్చుకుంటాననే ప్రతిపాదనలు చేసింది. వీటికి ఈయూ కాంపిటీషన్ కమిషన్ అంగీకరించలేదు. మెరుగైనవి ఇవ్వాలంటూ గూగుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎరిక్ స్మిత్‌కు లేఖ కూడా రాశారు. అమెరికాలో కూడా ఇలాంటి ఆరోపణలు రేగి 2008 నుంచి 2013 వరకూ విచారణ జరిగింది. దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీపేజ్ వైట్‌హౌస్‌లోని ఫెడరల్ ట్రేడ్ అధికారుల్ని కలుసుకున్నారు. స్వచ్ఛందంగా కొన్ని మార్పుల్ని ప్రతిపాదించారు. దాంతో దర్యాప్తు నిలిచిపోయింది. 2009 జనవరి నుంచి 2015 మార్చి వరకూ గూగుల్ సీనియర్ అధికారులు దాదాపు 230 సార్లు వైట్‌హౌస్ అధికారుల్ని కలసినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. సెర్చ్ ఫలితాల దుర్వినియోగం ఇలా.. 2006-07లో ఆస్ట్రేలియన్ పరిశోధకుల బృందమొకటి గూగుల్ ఫలితాలు ఎలా దుర్వినియోగమవుతున్నాయనేది విశ్లేషించింది. సాధారణంగా సమాచారాన్ని కోరే జర్నలిస్టులతో సహా నె టిజన్లు గూగుల్ సెర్చ్ ఫలితాల్లో మొదటి పేజీపైనే ఎక్కువగా ఆధారపడతారు. ఆ పేజీలో లేనివి అంత ప్రాధాన్యం లేనివని భావిస్తారు. గూగుల్ తనకు అవసరమైనవి, ప్రకటనలు ఇక్కడ చూపిస్తే... ఆ రకంగా దుర్వినియోగం జరిగినట్టే. గూగుల్ ఫలితాల తొలి పేజీలో తమ వెబ్సైట్లు కనిపించకుండా పోవడంతో మై ట్రిగ్గర్స్ డాట్ కామ్ వంటి పలు సంస్థలు, సర్ బ్రియాన్ సూటర్ వంటి వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇవన్నీ జరిగాక 2012 మేలో గూగుల్ ఒక ప్రకటన చేసింది. తాము సెర్చ్ ఫలితాలకు, ప్రకటనలకు మధ్య స్పష్టమైన విభజనను కొనసాగించలేమని పేర్కొంది. అందుకే ఇపుడు ఏదైనా ఉత్పత్తి కోసం సెర్చ్ చేస్తే... దానికి సంబంధించిన ప్రకటనలు ముందు దర్శనమిస్తాయి. యూట్యూబ్‌పై విమర్శలు.. నిషేధాలు వీడియో షేరింగ్ వెబ్సైట్ ‘యూ ట్యూబ్’ను 2006లో గూగుల్ కొనుగోలు చేసింది. దీన్లో కాపీరైట్ ఉల్లంఘించిన వీడియోల తో పాటు... పోర్నోగ్రఫీ, చట్టవిరుద్ధ చర్యల, హేట్ స్పీచ్‌ల వీడియోల్ని నిషేధించింది. యూజర్లెవరైనా ఇలాంటి వీడియోలను పోస్ట్ చేస్తే... ‘ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది గనక లభ్యం కాదు’ అనే మెసేజ్‌తో వీటిని తొలగించడం ఆరంభించింది. అయితే కంటెంట్‌ను పర్యవేక్షించటంలో విఫలమైందంటూ యూట్యూబ్‌ను పలు ప్రభుత్వాలు విమర్శించాయి. హింసను ప్రేరేపించేవి, దురుద్దేశాలతో అప్లోడ్ చేసినవి కూడా ప్రత్యక్షమవుతున్నాయని పేర్కొన్నాయి. దీంతో పలు ప్రభుత్వాలు దీన్ని నిషేధించాయి. ⇒ 2006లో థాయ్‌లాండ్ యూట్యూ బ్ సేవల్ని బ్లాక్ చేసింది. థాయ్ ఐపీ అడ్రస్‌లతో యాక్సెస్ చేసుకునేవారికి అందుబాటులో లేకుండా చేసింది. ⇒ 2007లో ముస్తఫా కెమల్ అటాటర్క్ను అవమానించేవిగా ఉన్న వీడియోలను పబ్లిష్ చేసినందుకు యూట్యూబ్‌ను దేశంలో నిషేధించాలని టర్కీ జడ్జి ఒకరు ఆదేశించారు. ⇒ 2008 ఫిబ్రవరి 22న ప్రభుత్వాదేశాల మేరకు పాకిస్తాన్ టెలి కాం అథారిటీ యూట్యూబ్ యాక్సెస్‌ను ప్రాంతీయంగా నిషేధించటానికి ప్రయత్నించింది. దీంతో రెండు గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ ఎవ్వరికీ అందుబాటులోకి లేకుండా పోయింది. యూట్యూబ్ కొన్ని మత వ్యతిరేక వీడియోలు తొలగించటంతో 4 రోజుల అనంతరం పీటీఏ ఈ నిషేధాన్ని తొలగించింది. గూగుల్ ఉత్పత్తులను నిషేధించిన దేశాలు... పాకిస్తాన్.. యూట్యూబ్: 2012 సెప్టెంబర్ 17 నుంచీ ఇరాన్.. గూగుల్ సైట్స్: 2014 ఏప్రిల్ 7 నుంచీ యూట్యూబ్: 2009 జూన్ 13 నుంచీ చైనా.. 2014 డిసెంబర్ 25 నుంచి ఇప్పటి వరకూ గూగుల్ సెర్చ్, జీమెయిల్, గూగుల్ సైట్స్, పికాసా వెబ్ ఆల్బమ్స్, యూట్యూబ్‌లను నిషేధించింది. 2014 డిసెంబర్ 25 నుంచీ జీ-మెయిల్ 2014 మే 31 నుంచీ గూగుల్ సెర్చ్ 2009 అక్టోబర్ 11 నుంచీ గూగుల్ సైట్స్ 2009 జూలై 16 నుంచీ పికాసా వెబ్ ఆల్బమ్స్ 2009 మార్చి 23 నుంచీ యూట్యూబ్ తజకిస్తాన్.. యూట్యూబ్: 2015 ఆగస్టు 25 నుంచి ఉత్తర కొరియా.. దేశీ ఇంటర్నెట్ మాత్రమే లభ్యం. ప్రపంచంతో కనెక్షన్ ఉండదు. గూగుల్ ఉత్పత్తుల గురించి అందరికీ తెలుసు. వాటి ఉపయోగం కూడా తెలియంది కాదు. ఇంటర్నెట్ మొత్తం గూగుల్ మయమే. గూగుల్‌కు మరో కోణం మాత్రం కాస్త ఇబ్బంది కరంగానే ఉంటుంది. దీనిపై ఇప్పటికే పలు విమర్శలు కూడా వచ్చాయి. సెర్చ్‌లో తనకున్న ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని, నమ్మక ద్రోహానికి పాల్పడుతోందని చాలా విమర్శలున్నాయి. ఆండ్రాయిడ్‌ను చూస్తే ఇది గూగుల్ అభివృద్ధి చేసిన ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. దీన్ని ఎవరైనా మార్చి, అభివృద్ధి చేయొచ్చు. అందుకే దీనిపై పలువురు డెవలపర్లు యాప్‌లను అభివృద్ధి చేయటం వంటివి చేస్తున్నారు. కంపెనీలూ ఈ ఓఎస్‌లో తమ ఉత్పత్తులకు అనుగుణంగా మార్పులు చేస్తున్నాయి. కాకపోతే గూగుల్ తన ప్లేస్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ మొత్తాన్ని తన చేతిలో పెట్టుకుంది. ఏ యాప్ కావాలన్నా ప్లేస్టోరే శరణ్యం. దీనికి పరాకాష్ట ఏమిటంటే... మీ మొబైల్ ఫోన్లో మీరు దేన్నయినా తొలగించగలరుకానీ గూగుల్ సేవల్ని మాత్రం తొలగించలేరు. ఇంకా గూగుల్ బుక్స్‌లో అనుమతి లేని పుస్తకాలను కూడా స్కాన్ చేసి విక్రయిస్తోందని, మ్యాప్స్‌లో యూజర్లంతా ప్రాంతాలు గుర్తిస్తే... వాటితో తాను వ్యాపారం చేస్తోందని, డెవలపర్స్‌కు తాను అందిస్తున్న అనలిటిక్స్, గూగుల్ ఫాంట్స్, గూగుల్ ఏపీఐల ద్వారా ఇంటర్నెట్ యూజర్ల గురించి సమాచారం సేకరిస్తోందని పలు విమర్శలున్నాయి. - సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
వచ్చే ఏడాది 50 కోట్ల ఇంటర్నెట్ యూజర్లు
న్యూఢిల్లీ: భారత్‌లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య వచ్చే ఏడాది 50 కోట్లకు చేరుతుందని టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం 40 కోట్ల ఇంటర్నెట్ యూజర్లున్నారని చెప్పారు. ప్రస్తుత జోరు చేస్తే వచ్చే ఏడాదిలోనే ఈ సంఖ్య 50 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని తెలియజేశారు. రానున్న సంవత్సరాల్లో ఆప్టికల్ ఫైబర్ ద్వారా రెండున్నర లక్షల గ్రామ పంచాయతీలను అనుసంధానం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఒక గ్రామాన్ని డిజిటల్ విలేజ్‌గా ఎంపిక చేసి, టెక్నాలజీ సాయంతో విద్యా, ఆరోగ్య సరంక్షణ సేవలందిస్తామని, వర్చువల్ క్లాస్‌రూమ్‌గా పనిచేసేలా రిసోర్స్ సెంటర్‌గా ఆ గ్రామాన్ని తీర్చిదిద్దుతామని, వై-ఫై సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. -
30 నిమిషాల ముందు రైలు టికెట్ బుకింగ్
న్యూఢిల్లీ: రైలు బయలుదేరటానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ అమల్లోకి తేనుంది. నవంబర్ 12 నుంచి ఇది అమల్లోకి రానుంది. అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా ఇంటర్నెట్ వినియోగదారులకు మాత్రమే ఈ సదుపాయం వర్తించనుంది. దీంతో..ఇప్పటి వరకు ఒకసారే చార్ట్ సిద్ధం చేసే రైల్వే ఇక రెండుసార్లు చార్ట్ సిద్ధం చేయాల్సి వస్తుంది. రైలు బయలుదేరే ముందు టీటీఈలకు ఈ చార్ట్ అందజేస్తారు. -
నెట్ న్యూట్రాలిటీపై కేంద్రానికి 73వేలకు పైగా కామెంట్స్
న్యూఢిల్లీ : వివాదాస్పదమైన నెట్ న్యూట్రాలిటీ అంశంపై కేంద్రానికి 73,326 మంది తమ అభిప్రాయాలు తెలిపారు. టెలికం శాఖ నివేదిక మీద మైగవ్డాట్ఇన్ వెబ్సైట్లో వీటిని పొందుపర్చారు. నెట్ యూజర్లకు అందించే వెబ్సైట్లపై పక్షపాత ధోరణి లేకుండా టెలికం సంస్థలు తటస్థ వైఖరిని పాటించేందుకు ఉద్దేశించినది నెట్ న్యూట్రాలిటీ అంశం. కొన్ని టెల్కోలు ప్రత్యేక ప్లాన్ల పేరిట డేటా చార్జీలు లేకుండా నిర్దిష్ట వెబ్సైట్లను ఉచితంగా అందిస్తుండటంతో వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి టెలికం శాఖ నివేదికపై కేంద్రం ప్రజాభిప్రాయాన్ని కోరింది. దీనికి ఆగస్టు 15 డెడ్‌లైన్ అయినప్పటికీ.. కామెంట్స్ వెల్లువెత్తుతుండటంతో ఆగస్టు 20 దాకా పొడిగించింది. ఆయా అంశాల ప్రాతిపదికన పటిష్ట నిబంధనలను కేంద్రం రూపొందించనుంది. -
భారత్.. ఇంటర్నెట్ మయం
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ రాకతో ప్రపంచమంతా ఓ కుగ్రామంగా మారితే.. భారత్ ఇంటర్నెట్ మయంగా మారుతోంది. భారత్‌లో నెటిజెన్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల అయితే మరింతగా పుంజుకుంటోంది. 2017 నాటికి భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారులు 50 కోట్ల మందికి చేరుకుంటారని అంచనా. భారత్‌లో ప్రతిఏటా మొబైల్ నెట్ వినియోగదారులు 27 శాతం మేర పెరుగుతున్నారు. 2015 జూన్ నాటికి దేశంలో మొత్తం నెటిజన్లు (వైర్‌లైన్, వైర్లెస్) 35 కోట్లమంది ఉన్నారు. 2017 నాటికి ఈ సంఖ్య 50 కోట్లను దాటనుంది. ఐఏఎమ్ఏఐ, కేపీఎమ్‌జీ సంయుక్తంగా 'భారత్‌లో మొబైల్ ఇంటర్నెట్ విజన్' పేరిట ఓ నివేదిక రూపొందించింది. రెండేళ్ల నాటికి దేశంలో 31.4 కోట్ల మంది మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులు ఉంటారని వెల్లడించింది. మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యం వేగంగా పెరుగుతోందని నివేదిక పేర్కొంది. -
భారత్‌లో ఇంటర్నెట్ యూజర్స్ 20 శాతమే
న్యూఢిల్లీ: ఇంట్లోకి ఉప్పుకావాలన్నా పప్పుకావాలన్నా ఇంటర్నెట్పై ఆధారపడుతున్న ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్ ఉపయోగించడంలో భారత్ ఇంకా వెనకబడే ఉందంటే ఆశ్చర్యం కలుగుతోంది. భారత్‌లో ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నవారి సంఖ్య కేవలం 20 శాతం మాత్రమేనని ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ చేసిన అధ్యయనంలో తేలింది. 32 వర్ధమాన దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. భారత్‌లో ఇంటెర్నెట్ను ఉపయోగిస్తున్న 20 శాతం ప్రజల్లో 65 శాతం మంది సామాజిక వెబ్సైట్లను ఉపయోగిస్తున్నారు. 55 శాతం మంది ఉద్యోగాల కోసం ఇంటర్నెట్ను సర్చ్ చేస్తున్నారు. ఇక దేశం మొత్తం జనాభాలో కేవలం 14 శాతం మంది మాత్రమే స్మార్ట్ ఫోన్లు కలిగివున్నారు. ఇండోనేషియాలో 24 శాతం మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తుండగా, భారత్‌లో 20 శాతం, బంగ్లాదేశ్‌లో 11 శాతం, పాకిస్థాన్‌లో 8 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. ఈ మొత్తం నాలుగు దేశాల జనాభా కలిపితే ప్రపంచ జనాభాలో మూడోవంతు ఉంటుంది. యువకులు, బాగా చదువుకున్నవారు, ఆంగ్ల భాషా పరిజ్ఞానం కలిగినవారే భారత్‌లో ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనంలో తేలింది. ఇంటర్నెట్ ప్రభావం సమాజంపై సానుకూలంగా ఉందని అభిప్రాయ సేకరణలో పాల్గొన్న వారిలో 29 శాతం అభిప్రాయపడగా, ప్రతికూల ప్రభావం చూపుతోందని, నైతిక విలువలు దెబ్బతింటున్నాయని 42 శాతం మంది అభిప్రాయపడ్డారు. -
ఇంటర్నెట్ వినియోగంలో ఎగబాకుతున్న భారత్!
హైదరాబాద్: మనిషి జీవితంలో ప్రస్తుతం ఇంటర్నెట్కు ఎంత ప్రాధాన్యత పెరిగిపోయిందో అందరికీ తెలుసు. మొబైల్‌కు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి రావడంతో దాని వినియోగదారులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఇంటర్నెట్ వినియోగంలో 2016 నాటికి భారత్ ప్రపంచంలో రెండవ స్థానానికి ఎగబాకుతుందని నిపుణుల అంచనా. ప్రస్తుతం భారత్‌లో నెట్ యూజర్ల సంఖ్య 28.38 కోట్లకు చేరనున్నట్లు ఈమార్కెటర్ నివేదిక ఒకటి తెలుపుతోంది. ప్రస్తుతం భారత్‌లో మొబైల్ మార్కెట్ 350 కోట్ల రూపాయలు ఉంది. ఇది 2019 నాటికి 1210 కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందని అంచనా. స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు పెరిగిపోతుండటం వల్లే మొబైల్ మార్కెట్ విస్తరిస్తోంది. ఆ రకంగా ఇంటర్నెట్ వినియోగదారులు పెరిగిపోయే అవకాశం ఉంది. ** -
వీడియో రెజ్యుమె ఆకట్టుకోవాలంటే?
జాబ్ స్కిల్స్: వీడియో రెజ్యుమె/కరిక్యులమ్ విటే.. ఇది మనకు కొత్త కావొచ్చు. కానీ, విదేశాల్లో ఎప్పటినుంచో ఈ విధానం అమల్లో ఉంది. ఇంటర్నెట్ వినియోగం విస్తృతం కావడంతో మనదేశంలోనూ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. రిక్రూటర్లు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా రెజ్యుమె/సీవీని కాగితంపై రాసి కంపెనీలకు పంపిస్తుంటాం. రిక్రూటర్లు వీటిని చూసి, తగిన అర్హతలున్న అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తుంటారు. వీడియో రెజ్యుమె అంటే.. అభ్యర్థి తన వివరాలను, అర్హతలను, అనుభవాలను స్వయంగా వివరిస్తూ వీడియోను చిత్రీకరించుకోవడం. అభ్యర్థి తనను తాను వ్యక్తీకరించుకోవడం. దీన్నే కంపెనీలకు పంపించాల్సి ఉంటుంది. రిక్రూటర్లు వీటిని పరిశీలించి, తమకు తగిన వారిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. వీడియో రెజ్యుమె ఆకర్షణీయంగా ఉంటే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. పొరపాట్లు చేస్తే అవకాశాలు దెబ్బతింటాయి. ఇంటర్వ్యూ పిలుపు రాదు. ఈ విషయంలో అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే రిక్రూటర్లను ఆకట్టుకొనే వీడియో రెజ్యుమె/సీవీని తయారు చేసుకొని, పంపించొచ్చు. ఇందుకు నిపుణుల సూచనలు తెలుసుకుందాం.. - ఇంటర్నెట్లో అందుబాటులోని వీడియో రెజ్యుమె నమూనాలను పరిశీలించాలి. - వీడియో చిత్రీకరణ కంటే ముందే స్క్రిప్ట్‌ను బిగ్గరగా చదువుతూ కొన్నిసార్లు సాధన చేయాలి. - వస్త్రధారణ ప్రొఫెషనల్‌గా ఉండేలా చూసుకోవాలి. - ఆకర్షణీయమైన నేపథ్యం(బ్యాక్ గ్రౌండ్) ఉన్న డెస్క్ వెనుక పద్ధతిగా కూర్చోవాలి. అక్కడ వెలుతురు సక్రమంగా వచ్చేలా జాగ్రత్తపడాలి. రణగొణ ధ్వనులు వినిపించకూడదు. - నేరుగా కెమెరావైపే చూడాలి. మాట్లాడేటప్పుడు పక్కకు, పైకి, కిందికి చూడొద్దు. - వీడియో క్లుప్తంగా ఉండాలి. వ్యవధి ఒకటి నుంచి మూడు నిమిషాల్లోపే ఉండడం మంచిది. - నోటిలో నుంచి మాట స్పష్టంగా రావాలి. ఆందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. - మొదట అభ్యర్థి తన పేరు చెప్పాలి. తర్వాత మిగిలిన వివరాలను వెల్లడించాలి. - అర్హతలు, అనుభవాలను తెలియజేయాలి. కంపెనీ అవసరాలకు తాను సరిగ్గా సరిపోతాననే భావం వ్యక్తమవ్వాలి. - ఈ అవకాశం కల్పించినందుకు రిక్రూటర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో చిత్రీకరణను ముగించాలి. -
హైదరాబాద్ ఇంటర్నెట్ యూజర్స్ 22,00,000
హైదరాబాద్: మహానగరంలో ఇంటర్నెట్ వినియోగం అధికంగా పెరిగింది. నాలుగేళ్ల క్రితం వరకు ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి అంతర్జాలాన్ని వినియోగించేవారిలో మార్పు వచ్చింది. తమ ఇంటికే నేరుగా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటున్నారు. బీఎస్ఎన్ఎల్, ఐడియా, ఎయిల్టెల్ తదితర పెరొందిన కంపెనీలతో పాటు సుమారు 200 వరకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. నెట్ కనెక్షన్‌దారుల సంఖ్య సుమారు 22 లక్షల వరకు ఉంటుందని అంచనా. మరోవైపు సుమారు 10 లక్షల వరకు మొబైల్ కనెక్షన్ దారులు ఇంటర్నెట్ యూజర్లుగా మారారు.