న్యూఢిల్లీ: ఇంట్లోకి ఉప్పుకావాలన్నా పప్పుకావాలన్నా ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్న ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్ ఉపయోగించడంలో భారత్ ఇంకా వెనకబడే ఉందంటే ఆశ్చర్యం కలుగుతోంది. భారత్‌లో ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నవారి సంఖ్య కేవలం 20 శాతం మాత్రమేనని ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ చేసిన అధ్యయనంలో తేలింది. 32 వర్ధమాన దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. భారత్‌లో ఇంటెర్నెట్‌ను ఉపయోగిస్తున్న 20 శాతం ప్రజల్లో 65 శాతం మంది సామాజిక వెబ్‌సైట్లను ఉపయోగిస్తున్నారు. 55 శాతం మంది ఉద్యోగాల కోసం ఇంటర్నెట్‌ను సర్చ్ చేస్తున్నారు. ఇక దేశం మొత్తం జనాభాలో కేవలం 14 శాతం మంది మాత్రమే స్మార్ట్ ఫోన్లు కలిగివున్నారు.
ఇండోనేషియాలో 24 శాతం మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తుండగా, భారత్‌లో 20 శాతం, బంగ్లాదేశ్‌లో 11 శాతం, పాకిస్థాన్‌లో 8 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ మొత్తం నాలుగు దేశాల జనాభా కలిపితే ప్రపంచ జనాభాలో మూడోవంతు ఉంటుంది. యువకులు, బాగా చదువుకున్నవారు, ఆంగ్ల భాషా పరిజ్ఞానం కలిగినవారే భారత్‌లో ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనంలో తేలింది. ఇంటర్నెట్ ప్రభావం సమాజంపై సానుకూలంగా ఉందని అభిప్రాయ సేకరణలో పాల్గొన్న వారిలో 29 శాతం అభిప్రాయపడగా, ప్రతికూల ప్రభావం చూపుతోందని, నైతిక విలువలు దెబ్బతింటున్నాయని 42 శాతం మంది అభిప్రాయపడ్డారు.
భారత్‌లో ఇంటర్నెట్ యూజర్స్ 20 శాతమే
Published Tue, Mar 24 2015 2:13 PM | Last Updated on Sat, Sep 2 2017 11:19 PM
Advertisement