భారత్.. ఇంటర్నెట్ మయం
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ రాకతో ప్రపంచమంతా ఓ కుగ్రామంగా మారితే.. భారత్ ఇంటర్నెట్ మయంగా మారుతోంది. భారత్లో నెటిజెన్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల అయితే మరింతగా పుంజుకుంటోంది. 2017 నాటికి భారత్లో ఇంటర్నెట్ వినియోగదారులు 50 కోట్ల మందికి చేరుకుంటారని అంచనా.
భారత్లో ప్రతిఏటా మొబైల్ నెట్ వినియోగదారులు 27 శాతం మేర పెరుగుతున్నారు. 2015 జూన్ నాటికి దేశంలో మొత్తం నెటిజన్లు (వైర్లైన్, వైర్లెస్) 35 కోట్లమంది ఉన్నారు. 2017 నాటికి ఈ సంఖ్య 50 కోట్లను దాటనుంది. ఐఏఎమ్ఏఐ, కేపీఎమ్జీ సంయుక్తంగా 'భారత్లో మొబైల్ ఇంటర్నెట్ విజన్' పేరిట ఓ నివేదిక రూపొందించింది. రెండేళ్ల నాటికి దేశంలో 31.4 కోట్ల మంది మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులు ఉంటారని వెల్లడించింది. మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యం వేగంగా పెరుగుతోందని నివేదిక పేర్కొంది.