ఇంటర్నెట్ కనెక్టివిటీకి దూరంగా 95 కోట్ల మంది
అసోచామ్–డెలాయిట్ నివేదిక
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ యూజర్లను అధికంగా కలిగిన రెండో అతిపెద్ద దేశంగా భారత్ కొనసాగుతున్నప్పటికీ.. దేశంలో 95 కోట్ల మందికి ఇంకా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో లేదని అసోచామ్–డెలాయిట్ సంయుక్త నివేదిక పేర్కొంది. దేశంలో ఇంటర్నెట్ డేటా ప్లాన్ ధరలు ప్రపంచ దేశాల కన్నా తక్కువగా ఉన్నాయని, స్మార్ట్‌ఫోన్స్ కూడా తక్కువ ధరలకు లభ్యమౌతున్నాయని అయినా కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఇంకా చాలా మందికి అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యకరమని తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 35 కోట్లుగా ఉందని, చైనా తర్వాతి రెండో స్థానంలో కొనసాగుతోందని పేర్కొంది.