ముంబై: భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. ఈ ఏడాది ఇంటర్నెట్ వాడకందారుల సంఖ్య రెండంకెల వృద్ధితో 63 కోట్లకు పెరగగలదని కాంటర్ ఐఎమ్‌ఆర్‌బీ సంస్థ అంచనా వేసింది. గ్రామాల్లో ఇంటర్నెట్ వృద్ధి జోరుగా ఉందని, దీంతో నెట్ వాడకందారుల సంఖ్య భారీగా పెరుగుతోందని ఈ సంస్థ తన తాజా ఐక్యూబ్ 2018 నివేదికలో పేర్కొంది. ఇంటర్నెట్ కోసం దాదాపు 97 శాతం మంది మొబైల్ ఫోన్లనే వినియోగిస్తున్నారని, మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో మహిళల సంఖ్య 42 శాతంగా ఉందని పేర్కొన్న ఈ నివేదిక... ఇంకా ఏం చెప్పిందంటే...
►గతేడాది ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 18% వృద్ధి చెంది, తొలిసారిగా 50 కోట్లు దాటేసింది. పల్లెల్లో ఇంటర్నెట్ వృద్ధి, వినియోగం జోరుగా పెరగడమే దీనికి ప్రధాన కారణం.
►ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్న వారిలో 87% మంది రెగ్యులర్ వినియోగదారులే. వీరంతా కనీసం నెలకు ఒక్కసారైనా నెట్ వాడుతున్నారు.
►మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో 29 కోట్ల మంది పట్టణ ప్రాంతాల వారు కాగా, 25 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల వారు.
►ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య–పట్టణ ప్రాంతాల్లో 7 శాతం పెరగ్గా, గ్రామీణ ప్రాంతాల్లో 35 శాతం వృద్ధి చెందడం విశేషం.
►2018లో గ్రామీణ ప్రాంతాల్లో 25 కోట్ల మేర ఉన్న ఇంటర్నెట్ వినియోగ దారుల సంఖ్య ఈ ఏడాది చివరి నాటికి 29 కోట్లకు చేరవచ్చు.
నెట్ యూజర్లు@ 63 కోట్లు!
Published Thu, Mar 7 2019 1:22 AM | Last Updated on Thu, Mar 7 2019 5:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment