customers
-
ఎలక్ట్రిక్ వాహనాలు.. ఎన్నెన్నో అనుమానాలు!
సాక్షి, సిటీబ్యూరో: నగర వాసుల్లో విద్యుత్ వాహనాలపై అనేక అనుమానాలు, సందేహాలు నెలకొన్నాయి. గత కొంతకాలంగా విద్యుత్ వాహనాల వినియోగం విరివిగా పెరిగింది. దీనికితోడు ప్రభుత్వాల ప్రోత్సాహం కూడా ఓ కారణం అయితే, మెయింటెనెన్స్ కూడా మరో కారణంగా పలువురు వినియోగదారులు చెబుతున్నారు.అయితే ధరల విషయంలో కాస్త ఎక్కువగా ఉన్నాయని, సామాన్యులకు అందుబాటులో లేవని పలువురి వాదనలు వినిపిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు దేశంలో అనేక కంపెనీలు ఈవీ వాహనాలను తయారు చేస్తున్నాయి. వీటిలో కొన్ని బ్రాండెడ్ కాగా మరికొన్ని హైబ్రిడ్ వెహికల్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే విద్యుత్ వాహనాల గురించి సమాచారం తెలుసుకునే వారికి పలు సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.కంపెనీల వారీగా వాహనాల ధర, ఒక సారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఎంత దూరం ప్రయాణించవచ్చు. మన్నిక, లేటెస్ట్ ఫీచర్స్, ఇతర అంశాలపై ఆన్లైన్లో శోధించడం పరిపాటిగా మారింది. స్నేహితులు, కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తీసుకుని, అన్నింటినీ సరిపోల్చుకున్నాకే నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే విద్యుత్తు మోటారు సైకిల్ వరకూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నా, కార్లు, ఆటో రిక్షాల విషయంలో వినియోగదారుల మన్ననలు పొందలేకపోతున్నాయి.ఛార్జింగ్ స్టేషన్ల కొరత.. ప్రధానంగా విద్యుత్ వాహనాల కొనుగోలుకు వెనుకాడటానికి నగరంలో సరైన ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో లేకపోవడమే అనే వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని రాయితీలు ఇచ్చినా నగర పరిధి దాటి బయటకు వెళ్లాలనుకుంటే మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాహనాలకు ఉన్న ఫిల్లింగ్ స్టేషన్లను విద్యుత్ ఛార్జింగ్ విషయంలో కనిపించడం లేదు. దీంతో లోకల్లో తిరగడానికి మాత్రమే విద్యుత్ వాహనాలు ఉపయోగపడతాయనే వాదన బలంగా వినిపిస్తోంది. నగరంలో విద్యుత్ వాహనాల అమ్మకాల సంఖ్య సైతం దీన్నే సూచిస్తోంది. టూవీలర్ కొనుగోలుకు సై.. ఇప్పటి వరకూ సుమారు 1.20 లక్షల విద్యుత్ మోటారు సైకిళ్లు మార్కెట్లో అమ్మకాలు జరగగా, కార్లు, ఆటో రిక్షా, ఇతర వాహనాలన్నీ కలపి సుమారు 16 వేలు అమ్ముడయ్యాయి. సాధారణంగా మోటారు సైకిళ్లు 70 శాతం ఉంటే, ఇతర వాహనాలు 30 శాతం ఉంటాయి. విద్యుత్తు వాహనాల విషయంలో ఇతర వాహనాల సంఖ్య 15 శాతం కంటే తక్కువ ఉంది. భవిష్యత్తులో ప్రభుత్వం మరిన్ని ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తే ఈవీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.లాంగ్‌డ్రైవ్ వెళ్లాలంటే ఇబ్బంది హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లాలనుకుంటే బస్సు, ట్రైన్ నమ్ముకుంటే సమయానికి చేరుకోలేము. డ్యూటీ అయ్యాక రాత్రి బయలుదేరితే ఉదయం విశాఖ చేరుకునేట్లు ప్లాన్ చేసుకుంటాం. విద్యుత్ కారులో పోవాలంటే ఛార్జింగ్ సరిపోదు. ప్రతి 300 కిలో మీటర్లకు ఒక దఫా ఛార్జింగ్ చేయాల్సి వస్తుంది. ఒక వేళ ఎక్కడైనా ఛార్జింగ్ పెడదాం అంటే సుమారు 6 గంటలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ లైఫ్ 8 ఏళ్లు అన్నారు. ఆ తరువాత కారు విలువలో సుమారు 40 శాతం బ్యాటరీ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే పెట్రోల్ కారు తీసుకున్నాను. – వై.రాజేష్, కేపీహెచ్‌బీ నెలకు రూ.3 వేల ఖర్చు తగ్గిందిరెండేళ్ల క్రితం ఈవీ మోటారు సైకిల్ కొన్నాను. ప్రతి 5 వేల కిలో మీటర్లకు సర్వీసింగ్ చేయించాలి. ఫుల్ ఛార్జింగ్ చేశాక ఎకానమీ మోడ్‌లో వెళితే 105 కిలో మీటర్లు వస్తుంది. స్పోర్ట్స్ మోడ్‌లో వెళితే 80 కిలో మీటర్లు వస్తుంది. పెట్రోల్ స్కూటీకి నెలకు రూ.3,500 పెట్రోల్ అయ్యేది. ఈవీ కొన్నాక నెల కరెంటు బిల్లు రూ.500 నుంచి రూ.700కి పెరిగింది. అదనంగా రూ.200 పెరిగినా పెట్రోల్ రూ.3,500 వరకూ తగ్గింది. – గాదిరాజు రామకృష్ణంరాజు, హైటెక్ సిటీ -
ఫెస్టివల్ సీజన్‌కూ క్యూ–కామర్స్ కిక్కు
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో పండుగల సీజన్ మొదలైంది. దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా గణేశుని నిమజ్జనంతో వినాయకచవితి ఉత్సవాలు ముగియగా...ఇక దసరా, దీపావళి వరుస పండుగల సందడి ప్రారంభం కానుంది. వచ్చే జనవరి మధ్యలో జరగనున్న సంక్రాంతి దాకా రాబోయే ఫెస్టివల్ సీజన్‌కు ఈసారి క్విక్–కామర్స్ అనేది కీలకంగా మారనుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా మరికొన్ని రాష్ట్రాల్లో సంక్రాంతి ముగిసే దాకా సుదీర్ఘకాలం పాటు పండుగ ఉత్సవాలు కొనసాగుతాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వస్తువులు, ఆయా ఉత్పత్తులు వేగంగా ఇళ్లు, కస్టమర్లకు చేరవేయడం అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.దేశంలోని సంప్రదాయ ఎల్రక్టానిక్ (ఈ)–కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఇప్పటికే వివిధ వర్గాల వినియోగదారులపై తమ ముద్రను బలంగానే చూపాయి. దీంతో రిటైల్ రంగంలోని వ్యాపార సంస్థలు, వ్యాపారులను ఈ–కామర్స్ దిగ్గజాలు కొంతమేరకు దెబ్బకొట్టాయి. అయితే మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఈ–కామర్స్‌ను తలదన్నేలా క్విక్ (క్యూ)–కామర్స్ అనేది ఓ కొత్త కేటగిరీగా ముందుకొచి్చంది. అమెరికాతో సహా వివిధ దేశాల్లో నిత్యావసరాలు మొదలు వివిధ రకాల వస్తువులను ఆ¯Œన్లైన్లో ఆర్డర్ చేశాక మరుసటి రోజుకు చేరవేయడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లి అవసరమైన వస్తువులను తెచ్చుకున్నంత సులువుగా వివిధ వినియోగ వస్తువులు, ఉత్పత్తులను పది నిమిషాల్లోనే కస్టమర్లకు చేరవేసే డెలివరీ మోడళ్లు మనదేశంలో హైదరాబాద్‌తో సహా పలు ప్రముఖనగరాల్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. దీంతో సంప్రదాయ ఈ–కామర్స్ సంస్థలకు పోటీగా క్యూ–కామర్స్ ఎదుగుతోంది. ఇదిలా ఉంటే...డైరెక్ట్ టు కన్జూమర్ బ్రాండ్స్ కూడా వేగంగా తమ వినియోగదారులను చేరుకోవడం ద్వారా తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవాలని పట్టుదలతో ఉన్నాయి. ప్రస్తుత పండుగల సీజన్లో దేశవ్యాప్తంగా ఈ–కామర్స్ పరిశ్రమ ద్వారా 35 శాతం అమ్మకాలు పెరుగుతాయని ‘టీమ్ లీజ్’తాజా నివేదిక వెల్లడించింది. డిమాండ్‌ను తట్టుకొని ‘ఆన్ టైమ్ డెలివరీ’చేసేందుకు వీలుగా ఆయా సంస్థలు ఇప్పటి నుంచే ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. ⇒ క్విక్–కామర్స్ సెగ్మెంట్లో.. వచ్చే అక్టోబర్‌లో నిర్వహించనున్న వార్షిక ఉత్సవం ‘బిగ్ బిలియన్ డేస్–2024’కోసం ఫ్లిప్‌కార్ట్ ‘మినిట్స్’ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాననగరాల్లో వంద దాకా ‘డార్క్ స్టోర్స్’ను తెరవనుంది ⇒ ప్రస్తుతమున్న 639 డార్క్ స్టోర్ల నుంచి 2026 ఆఖరుకల్లా రెండువేల స్టోర్లకు (ఈ ఆర్థిక సంవత్సరంలోనే 113 స్టోర్ల ఏర్పాటు) బ్లింకిట్ ప్రణాళికలు సిద్ధం చేసింది ⇒ వచ్చే మార్చికల్లా దేశవ్యాప్తంగా 700 డార్క్ స్టోర్లను ఏర్పాటు చేయాలని (ఇప్పుడున్న 350 స్టోర్ల నుంచి) జెప్టో నిర్ణయించింది. ⇒ డెలివరీ పార్ట్నర్స్, లాజిస్టిక్స్ సపోర్ట్‌ను అందించే ‘షిప్ రాకెట్, ఈ–కామ్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బీస్ వంటివి కస్టమర్లకు వేగంగా డెలివరీలు చేసేందుకు వీలుగా తమ మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకుంటున్నాయి ⇒ హైదరాబాద్‌తో సహా ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, కొచ్చి, పణే వంటి నగరాల్లో షిప్ రాకెట్ ఇప్పటికే ‘షిప్ రాకెట్క్విక్’లను ప్రారంభించింది. పలు నగరాల్లో మరో నెలలో ఈ సరీ్వసులు మొదలుకానున్నాయి ⇒ కస్టమర్లకు వారి ఆర్డర్లను వేగంగా చేరవేసేందుకు వీలుగా షిప్‌రాకెట్ కంపెనీ స్థానిక లాజిస్టిక్ ప్లాట్‌ఫామ్స్ పోర్టర్, ఓలా, బోర్జె, ర్యాపిడో, షాడో ఫాక్స్‌తో భాగస్వామ్యాన్ని తయారు చేసుకుంది ⇒ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే దేశంలోని పది మెట్రో నగరాల్లో ఈ–కామ్ ఎక్స్‌ప్రెస్ అదే రోజు లేదా మరుసటి రోజు డెలివరీ సర్వీస్‌ను ప్రవేశపెట్టింది ⇒ గిఫ్టింగ్ ఫ్లాట్‌ఫామ్స్ ’ఫెర్న్స్ ఏన్పెటల్స్’క్విక్ కామర్స్ ద్వారా పంపిణీకి సిద్ధం చేసిన ప్రత్యేక ఉత్పత్తుల రేంజ్‌లు సిద్ధం చేసింది. ఇందుకు ప్రముఖ కంపెనీలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దేశంలో క్యూ–కామర్స్‌కు ఆదరణ పెరిగిన నేపథ్యంలో ఈ పండుగల సీజన్లో తమ అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని విశ్వసిస్తోంది ⇒ లాజిస్టిక్స్ మేజర్ డెలివరీ సంస్థ ఇప్పటికే ఈ–కామర్స్ కంపెనీలకు డార్క్ స్టోర్స్ నెట్‌వర్క్‌ను అందించేందుకు ‘సేమ్‌డే డెలివరీ’అనే కొత్త సర్వీస్‌ను ప్రకటించింది‘డార్క్ స్టోర్స్’అంటే... ఇలాంటి స్టోర్ట్స్ కస్టమర్లు ప్రత్యక్షంగా వెళ్లి షాపింగ్ చేసేందుకు ఉద్దేశించినవి కాదు. వినియోగదారుల నుంచి వచ్చే ఆన్లైన్ ఆర్డర్లకు వీలైనంత ఎక్కువ వేగంగా వారి ఇళ్లకు డెలివరీ చేసేందుకు ఉద్దేశించి... విభిన్న రకాల వస్తువులు, ఉత్పత్తులను భద్రపరుచుకునేందుకు నగరంలోని బిజీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునే స్టోర్లు ఇవి. పలురకాల వస్తువులను స్టోర్ చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి, అక్కడి నుంచి కస్టమర్ల ఇళ్లకు తరలించడానికి ఉద్దేశించినవి. ఇవి డి్రస్టిబ్యూషన్న్ఔట్లెట్లుగా పనిచేస్తాయి. ప్రధానంగా మెరుగైన పంపిణీ, వేగంగా డెలివరీ, విభిన్నరకాల ఉత్పత్తులను స్టోర్ చేసే అవకాశం, తదితరాలకు సంబంధించినవి. -
Nitin Gadkari: కస్టమర్ సర్విసులపై మరింతగా దృష్టి పెట్టండి
న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడంపై మరింతగా దృష్టి పెట్టాలని వాహన సంస్థలకు కేంద్ర రహదారి రవాణా, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. నాణ్యతకు భరోసానిస్తూ, విక్రయానంతర సేవలను మెరుగుపర్చుకునే విధంగా కొత్త ఆవిష్కరణలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా కార్యక్రమానికి పంపిన వీడియో సందేశంలో మంత్రి ఈ విషయాలు తెలిపారు. స్వయం సమృద్ధి సాధించాలన్న భారత లక్ష్యాన్ని సాకారం చేసుకోవడంలో ఆటోమోటివ్ డీలర్లు ప్రధాన పాత్ర పోషించగలరని ఆయన తెలిపారు. దేశ ఎకానమీలో కీలకంగా ఉంటున్న ఆటో రిటైల్ పరిశ్రమకు ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతునిస్తుందని గడ్కరీ హామీ ఇచ్చారు. పర్యావరణహిత మొబిలిటీ సొల్యూషన్స్ విషయంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగేందుకు భారత్ కృషి చేస్తోందని ఆయన చెప్పారు. -
25 కోట్ల కుటుంబాలకు ఐటీసీ ఉత్పత్తులు
న్యూఢిల్లీ: ఐటీసీ ఉత్పత్తులు దేశంలోని 25 కోట్లకు పైగా కుటుంబాలు వినియోగిస్తున్నాయి. తమ ఉత్పత్తులపై కస్టమర్ల వార్షిక వ్యయం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 12 శాతం పెరిగి రూ.32,500 కోట్లకు చేరినట్టు ఐటీసీ ప్రకటించింది. కస్టమర్లు ఐటీసీ ఉత్పత్తుల కొనుగోలుకు వెచి్చంచే మొత్తం ఆధారంగా వార్షిక వ్యయాలను ఐటీసీ లెక్కిస్తుంటుంది. 25కు పైగా ప్రపంచస్థాయి భారత బ్రాండ్లు ఎఫ్ఎంసీజీలో భాగంగా ఉన్నాయని, ఇవన్నీ సొంతంగా అభివృద్ధి చేసినవేనని ఐటీసీ తన వార్షిక నివేదికలో తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఐటీసీ ఉత్పత్తులపై కస్టమర్ల వ్యయం రూ.29,000 కోట్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 23 కోట్లకు ఐటీసీ ఉత్పత్తులు చేరువ కాగా, గత ఆర్థిక సంవత్సరంలో మరో రెండు కోట్ల కుటుంబాలకు చేరుకున్నట్టు సంస్థ తెలిపింది. ఐటీసీ ఎఫ్ఎంసీజీ కింద బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల, విద్య, స్టేషనరీ ఉత్పత్తులు, అగర్బత్తీలు, అగ్గిపెట్టెలు ఉన్నాయి. గడిచిన కొన్నేళ్లలో వీటి అమ్మకాలు గణనీయంగా పెరిగినట్టు ఐటీసీ తెలిపింది. బ్రాండెడ్ గోధుమ పిండిలో ఆశీర్వాద్ అగ్రస్థానంలో ఉందని.. స్నాక్స్‌లో బింగో, క్రీమ్ బిస్కెట్లలో సన్‌ఫీస్ట్ ముందంజలో ఉన్నట్టు వివరించింది. అలాగే నోట్బుక్లలో క్లాస్మేట్, నూడుల్స్‌లో ఇప్పీ, బాడీవాష్లో ఫియామా, అగర్‌బత్తీల్లో మంగళ్‌దీప్ బ్రాండ్లు బలంగా ఉన్నట్టు తెలిపింది. సవాళ్లతో కూడిన వాతావారణంలో, తీవ్ర పోటీ పరిస్థితుల మధ్య కంపెనీ ఎఫ్ఎంసీజీ వ్యాపారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమ సగటు కంటే మెరుగ్గా ఉన్నట్టు వెల్లడించింది. వినియోగం పుంజుకుంటుంది.. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2024–25) అధిక వృద్ధి పథాన్ని కొనసాగిస్తుందని ఐటీసీ విశ్వాసం వ్యక్తం చేసింది. స్థిరమైన పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం పుంజుకోవడాన్ని గుర్తు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం కోలుకుంటున్నందున ఇవన్నీ సమీప కాలంలో వినియోగ డిమాండ్‌కు ఊతమిస్తాయని అంచనా వేసింది. సాధారణ వర్షపాతంతో రబీ సాగు మంచిగా ఉండడం వృద్ధికి మద్దతునిస్తుందని పేర్కొంది. ‘‘భౌతిక, డిజిటల్ వసతుల విస్తరణకు, తయారీ రంగం పోటీతత్వాన్ని ఇతోధికం చేసేందుకు, ప్రత్యక్ష/పరోక్ష, ఆర్థిక రంగ సంస్కరణలు, వ్యాపార సులభతర నిర్వహణకు కేంద్ర సర్కారు తీసుకున్న చర్యలు రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థను బలంగా ముందుకు నడిపిస్తాయని ఐటీసీ తన నివేదికలో అంచనా వేసింది. ‘‘మూలధన వ్యయాల పెంపు, మౌలిక వసతులపై దృష్టి సారించడం దేశీయ తయారీని నడిపిస్తాయి. వ్యవసాయ సంబంధిత పథకాలు రైతులకు మేలు చేస్తాయి. తద్వారా గ్రామీణ వినియోగ డిమాండ్ పుంజుకుంటుంది. ఇది పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను ఇతోధికం చేస్తుంది’’ అని అంచనా వేసింది. వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు చర్యలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విలువ జోడింపు, మార్కెట్ అనుసంధానత చర్యలు వ్యవసాయరంగ పోటీతత్వాన్ని బలోపేతం చేసేందుకు కీలకమని అభిప్రాయపడింది. -
పిస్తా హౌస్‌లో రౌడీ షీటర్ల వీరంగం.. కస్టమర్లపై దాడి
సాక్షి, రంగారెడ్డి: రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలోని ఓ హోటల్లో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు. హోటల్లోకి ప్రవేశించి భోజనం చేస్తున్న వారిపై దాడికి పాల్పడ్డారు. హోటల్లో సామాగ్రి ధ్వంసం చేసి భోజనం చేస్తున్న యువకులపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. దీంతో భయంతో బయటకు యువకులు పరుగులు తీశారు. పార్కింగ్ వద్ద హంగామా సృష్టించిన రౌడీషీటర్లు టూ వీలర్స్‌ను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన సిబ్బంది పై దాడికి దిగారు. సీసీ టీవీ కెమెరాలో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. హోటల్లోకి మొత్తం 17 మంది గ్యాంగ్ సభ్యులు వచ్చారు. మొబైల్ ఫోన్లో వీడియోలు తీస్తూ రెచ్చిపోయారు. ఒక్కసారిగా కస్టమర్స్ భయబ్రాంతులకు గురయ్యారు. అత్తాపూర్ పోలీసులకు హోటల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కస్టమర్ల వివరాల కోసం పేటీఎంకు ఈడీ నోటీసులు
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో (పీపీబీఎల్) లావాదేవీలు జరిపే కస్టమర్ల వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇతరత్రా దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్నాయి. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ బుధవారం స్టాక్ ఎక్సే్చంజీలకు ఈ విషయం తెలియజేసింది. తమతో లావాదేవీలు జరిపిన వారి వివరాలను ఇవ్వాలంటూ ఈడీ సహా ఇతరత్రా దర్యాప్తు సంస్థల నుంచి తమకు, తమ అనుబంధ సంస్థలు, అసోసియేట్ సంస్థ పీపీబీఎల్‌కు నోటీసులు, అభ్యర్ధనలు వస్తున్నట్లు వన్97 తెలిపింది. అధికారులు అడుగుతున్న సమాచారాన్ని, పత్రాలను, వివరణను ఎప్పటికప్పుడు అందజేస్తున్నామని పేర్కొంది. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై పీపీబీఎల్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన ప్రభావంతో పేటీఎం షేర్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈడీ కూడా విచారణ జరుపుతోందన్న వార్తలతో కంపెనీ షేర్లు బుధవారం మరో 10 శాతం క్షీణించి రూ. 342 వద్ద క్లోజయ్యాయి. -
బిర్యానీ గొడవ: కస్టమర్లపై దాడి.. రాజాసింగ్ సీరియస్
హైదరాబాద్: హైదరాబాద్‌లోని అబిడ్స్ గ్రాండ్ హోటల్లో బిర్యానీ విషయంలో గొడవ కాస్త పరస్పర దాడి దారి తీసింది. మటన్ బిర్యానీ సరిగా ఉడకలేదని.. డబ్బులు చెల్లించమని హోటల్ వెయిటర్లతో వినియోగదారులు చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెద్దది కావటంతో వెయిటర్లు వినియోగదారులపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది యువతీ యువకులకు గాయాలై ఆస్పత్రి పాలయ్యారు. ఫిర్యాదు రావడంతో.. 10మంది వెయిటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు హోటల్ యజమానిపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కస్టమర్లపై దాడి చేసిన ముగ్గురు వెయిటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. ధూల్‌పేటకు చెందిన కస్టమర్లపై దాడి చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాండ్ హోటల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: బైరి నరేష్ అడ్డగింత.. వాహనం ఢీ కొట్టి అయ్యప్ప భక్తుడికి గాయాలు -
ఫ్రీ మీల్స్ కోసం అమ్మడి కక్కుర్తి.. చివరికి ఏమైందంటే?
ఆన్లైన్లో, రెస్టారెంట్‌లోగానీ ఆర్డర్ చేసిన ఫుడ్‌లో ఏదైనా లోపం ఉన్నా, లేదా ఇంకేమైనా వెంట్రుకలు లాంటి అవాంఛిత పదార్థాల్ని, వస్తువులను గుర్తించినా, వెంటనే సంబంధిత డెలివరీ సంస్థకు ఫిర్యాదు చేయడం, దానికి వాళ్లు సారీ చెప్పడం, లేదా ఫ్రీ మీల్ ఆఫర్ చేయడం ఇదంతా మనకు తెలిసిన కథే. అయితే ఇలాంటి ఫ్రీ మీల్స్ కోసం ఆశపడిన ఒక అమ్మడు అడ్డంగా బుక్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రెస్టారెంట్లు కస్టమర్లు ఫిర్యాదులు ఆధారంగా వారికి నష్టపరిహారం ఫ్రీ మీల్స్ ఆఫర్ చేస్తాయి. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం కథనం ప్రకారం ఇలా ఉచిత భోజనం కక్కుర్తి పడిన బ్రిటీష్ మహిళ రెస్టారెంట్‌ను మోసం చేయాలని ప్లాన్ చేసింది. ఇంగ్లాండ్‌లోని బ్లాక్‌బర్న్‌లోని ప్రసిద్ధ తినుబండారం అయిన అబ్జర్వేటరీలో భోజనం చేస్తూ ఆహారంలో జుట్టు వచ్చిందంటూ హడావిడి చేసింది. దీంతో హోటల్ యజమాని మహిళ బీఫ్ రోస్ట్ డిన్నర్‌ను తిరిగి ఆఫర్ చేశారు. అయితే, నిఘా కెమెరాలున్నాయన్న సంగతిని ఆ మహిళ మర్చిపోయింది. కానీ రెస్టారెంట్ యజమాని మాత్రం మర్చిపోలేదు. అందుకే పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చే తమ హోటల్లో ఇలా జరిగిందేమిటబ్బా అని ఆందోళన చెందిన అతను ఆ తరువాత అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించాడు. దీంతో అసలు విషయం తెలిసి ఖంగుతిన్నాడు. వీడియోలో మహిళ జుట్టును తీసి తన భాగస్వామి సగం తిన్న ప్లేట్లో ఉంచడం క్లియర్ కనిపించింది.టామ్ క్రాఫ్ట్ దీనిపై సోషల్ మీడియాలోపోస్ట్ పెట్టడంతో ఇది వైరల్‌గా మారింది. బిజినెస్ బాబులూ బీ అలర్ట్ జాగ్రత్త ఇలాంటి వాళ్లూ కూడా ఉంటారు అంటూ ఫేస్బుక్లో CCTV ఫుటేజీని షేర్ చేశాడు. ఇది చాలా అసహ్యంగా అనిపించిందని, కేవలం 15.88 డాలర్లు(రూ. 1300) కోసం ఇంతకు దిగజారతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు తమకు ఫైవ్ స్టార్ ఫుడ్ హైజీన్ రేటింగ్ ఉందనీ, అన్ని ఆహార భద్రతా మార్గదర్శకాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపాడు. నిజంగా సీసీటీవీ ఫుటేజీని గమనించకపోతే ఆమె ఆరోపణతో తన వ్యాపారం, ప్రతిష్ట గంగలో కలిసిపోయేదిగా అంటూ వాపోయాడు.. -
ప్రతీ రెండు రోజులకు ఇదే పరిస్థితి: ఎస్బీఐ వినియోగదారుల ఫిర్యాదులు
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) దేశవ్యాప్తంగా యూపీఐ సేవల అంతరాయం ఖాతాదారుల్లో అసహనానికి దారి తీసింది. ఎస్బీఐ యూపీఐ పేమెంట్స్ ఫెయిల్ కావడం, లేదంటే ఇన్ సఫీషియంట్ బ్యాలెన్స్ అన్న మెసేజ్ రావడంతో పాటు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంలో ఇబ్బందులతో కస్టమర్లు గందరగోళంలో పడి పోయారు. గత రెండు, మూడు రోజులుగా ఈ ఇబ్బందులు ఎదురు కావడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సోమవారం సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రతీ రెండు రోజులు ఇదే పరిస్థితి అంటూ కొంతమంది యూజర్లు ట్విటర్లో వ్యాఖ్యానించడం గమనార్హం. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి డిజిటల్ లావాదేవీలు చాలాసార్లు ఫెయిల్ కావడంతో కస్టమర్లలో ఆందోళన తలెత్తింది. ఈ సమస్య గత రెండు రోజుల నుండి జరుగుతోంది, ఎవరు పట్టించుకోవడంలేదు. ఖాతాదారుల ఇబ్బందులను బ్యాంకు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారా? అసలు ఈ సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారంటూ ఒకరు ప్రశ్నించారు. టెక్నికల్ అప్డేట్ కోసం మూడురోజులా అంటూ మరొక యూజర్ ఎస్బీఐపై ధ్వజమెత్తారు. అయితే తమ కస్టమర్ల యూనిఫైడ్స్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవల్లో ఇబ్బందులు రావచ్చని బ్యాంకు ముందుగానే ఎక్స్ ద్వారా ఒక ప్రకటన జారీ చేసింది. టెక్నాలజీని అప్డేట్ చేస్తున్నట్టు ఈ నెల 14న వెల్లడించింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలోనే అప్డేట్ అందిస్తామని ట్వీట్ చేసింది. అయితే,ఇప్పటివరకు కొత్త అప్డేట్ ఏమీలేదు.. ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి అన్న అసహనం వినియోగదారుల్లో నెలకొంది. pic.twitter.com/yi5DVQjkYi — State Bank of India (@TheOfficialSBI) October 14, 2023 @TheOfficialSBI the UPI server of SBI is not working from today morning.. gpay, phonepe even yonosbi UPI isn't working. Could you please tell when these problems are solved? pic.twitter.com/hZmhtRm5mr — Gokul Kannan (@gokulanyms) October 14, 2023 Dear @RBI please investigate and give heavy penalty to @TheOfficialSBI for keeping UPI system down for days. @sbi_care Last few days its down. #sbi #upi #phonepe #paytm @nsitharamanoffc pic.twitter.com/grPrF0xgqV — Sudipta (@ghosh1s) October 15, 2023 -
ఫెస్టివ్ బొనాంజా: కస్టమర్లకు బంపర్ ఆఫర్లు, ఐఫోన్ 15పై స్పెషల్ ఆఫర్
దేశీయ రెండో అతిపెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండుగ సీజన్ ప్రారంభంలో తన కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లు, తగ్గింపులు రూ. 26 వేల వరకు క్యాష్‌బ్యాక్‌తో ‘ఫెస్టివ్ బొనాంజా’ను ప్రారంభించినట్లు ప్రకటించింది. లేటెస్ట్ యాపిల్ ఐఫోన్ 15 పై ప్రత్యేక ఆఫర్ కూడా అందిస్తోంది. అంతేకాదు గృహ రుణాలు, వాహన రుణాలు ద్విచక్ర వాహన రుణాలపై త్వరలోనే గుడ్ న్యూస్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, రూపే క్రెడిట్ కార్డ్‌ల ద్వారా UPI , కార్డ్‌లెస్ EMI కొనుగోళ్లపై భారీ ప్రయోజనాలను పొందవచ్చు. నో-కాస్ట్ EMI సదుపాయం కూడా కస్టమర్లకు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా ఐఫోన్ 15పై నో-కాస్ట్ EMI ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. (రికార్డ్ సేల్స్: మోదీ పిలుపు, ఖాదీ గెలుపు) కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లను అందించే లక్ష్యంతో ప్రముఖ బ్రాండ్లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ ఝా తెలిపారు. ముఖ్యంగా బిగ్ బిలియన్ డేస్ సేల్ (అక్టోబర్ 8 - అక్టోబర్ 15 వరకు), మింత్రా బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ (అక్టోబర్ 6 -అక్టోబర్ 19 వరకు), అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. అలాగే గృహ, బైక్, ఫోర్‌వీలర్ వాహన రుణాలపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తామని కూడా తెలిపారు. (కళ్లద్దాల్నే నమ్ముకున్నాడు: కట్ చేస్తే..వేల కోట్ల వ్యాపారం, లగ్జరీ లైఫ్!) దీని ప్రకారం యాపిల్ ఐఫోన్ 15తోపాటు,ఎలక్ట్రానిక్స్, మొబైల్, ఫ్యాషన్, జ్యువెలరీ, ఫర్నిచర్, ట్రావెల్, ఫుడ్, ఇతర కేటగిరీలపై ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మేక్మైట్రిప్, టాటా న్యూ, వన్‌ప్లస్, హెచ్‌పి, మైక్రోసాఫ్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఎల్జి, సోనీ, శాంసంగ్, తనిష్క్, తాజ్, స్విగ్గీ, జొమాటో వంటి ప్రధాన బ్రాండ్స్‌తో డీల్ కనుగుణంగా ఆఫర్లు పొందవచ్చు. కాగా ICICI బ్యాంక్ లిమిటెడ్‌కు జూన్ 30, 2023 నాటికి బ్యాంక్ మొత్తం ఆస్తులు రూ.16,47,000 కోట్లుగా ఉన్నాయి. -
ఈ బ్యాంకు కస్టమర్లకు సర్ప్రైజ్: పండగ బొనాంజా
DCB Rates Hike డీసీబీ బ్యాంకు తన ఖాతాదారులకు సర్ప్రైజ్ ఇచ్చింది. తన సేవింగ్స్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంచి వారికి పండగ బొనాంజా అందించింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, సవరించిన వడ్డీరేట్లు ఈ రోజు (సెప్టెంబరు 27) నుంచే అమలులోకి వచ్చాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువున్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. అలాగే సేవింగ్స్ ఖాతాలో ఉన్న నిల్వ ఆధారంగా డీసీబీ కస్టమర్లకు గరిష్టంగా 8.00 శాతం వడ్డీ లభించనుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ట వడ్డీరేటు 7.90 శాతంగా ఉంచింది. సేవింగ్స్ ఖాతాల నిల్వపై వడ్డీ రేట్లు ఒక లక్ష వరకు ఉన్న పొదుపు ఖాతా నిల్వలపై బ్యాంక్ 1.75శాతం, 5 లక్షల లోపు నిల్వలపై 3.00 శాతం వడ్డీ అందిస్తుంది. 5 - 10 లక్షల లోపు , 10 లక్షల నుండి 2 కోట్ల లోపు ఖాతాలకు వరుసగా 5.25శాతం, 8.00శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. అలాగే . రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల మధ్య పొదుపు ఖాతా నిల్వలపై బ్యాంక్ 5.50శాతం రూ. 10 కోట్ల లోపు నిల్వ ఉన్న ఖాతాలకు 7.00శాతం వడ్డీ రేటును అందిస్తోంది. (UP Scorpio Accident Death: ఆనంద్ మహీంద్రపై చీటింగ్ కేసు, కంపెనీ క్లారిటీ ఇది) బ్యాంక్ FDలపై చెల్లించే రేట్లు 7- 45 రోజుల డిపాజిట్లపై 3.75శాతం , ఏడాదిలోపు డిపాజట్లపై 7.15శాతం వడ్డీరేటు వర్తిస్తుంది. 12 నెలల 1 రోజు నుండి 12 నెలల 10 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే FDలపై, బ్యాంక్ 7.75శాతం వడ్డీ రేటును చెల్లిస్తుంది. 38 నెలల నుండి 61 నెలల లోపు మెచ్యూరిటీ ఉన్న వాటికి 7.40శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు అన్ని పదవీకాలానికి ప్రామాణిక రేటు కంటే 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటు అందిస్తోంది. (డెల్టా కార్ప్ కథ కంచికేనా? జియా మోడీ మేజిక్ చేస్తారా? అసలెవరీ మోడీ?) -
యాక్సిస్ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్
Axis Bank Fd Rates: ప్రైవేటు రంగ బ్యాంకు యాక్సిస్బ్యాంకు తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. రూ. 2 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై (FDs) వడ్డీ రేట్లను యాక్సిస్ బ్యాంక్ సవరించింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం సవరించిన వడ్డీ రేట్లు సోమవారం (సెప్టెంబర్ 18, 2023) నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ ఇప్పుడు 15 నెలల నుండి 5 సంవత్సరాల లోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్టంగా 7.10శాతం వడ్డిని చెల్లిస్తుంది. 5 నుండి 10 ఏళ్లలో మెచ్యూరయ్యే ఎఫ్‌డిలపై 7శాతం వడ్డి లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 5-10 సంవత్సరాల ఎఫ్డీలపై 7.75శాతం గరిష్ట స్టాండర్డ్ రేటు వర్తిస్తుంది. (చంద్రయాన్-3 సక్సెస్: వాళ్ల ఏడుపు చూడలేకే, టీ బండి నడుపుకుంటున్నా!) 7- 10 ఏళ్ల లోపు మెచ్యూరిటీ ఉన్న FDలపై సాధారణ ప్రజలకు 3-7శాతం, సీనియర్ సిటిజన్లకు 3నుంచి 5 ఏళ్ల డిపాజిట్లపై గరిష్టంగా 7.75 శాతం వరకు వడ్డీ రేట్ యాక్సిస్ బ్యాంక్ చెల్లిస్తుంది.13 - 30 నెలల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై, నాన్-సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.85 శాతం వడ్డీ వర్తిస్తుంది. అలాగే 15 నెలల నుండి 5 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై 7.10శాతంగా ఉంటుంది. కాగా కేంద్ర బ్యాంకు ఆర్బీఐ వడ్డీరేట్ల ఆధారంగా ఆయా ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు లోన్లు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వర్తించే వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. -
పాత కారే అని చీప్‌గా చూడకండి: ఈ విషయం తెలిస్తే..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాత కారు.. పేరులో పాత ఉందని చిన్నచూపు చూడకండి. దేశంలో అమ్ముడవుతున్న పాత కార్ల సంఖ్య తెలిస్తే నోరెళ్లబెడతారు. 2022–23లో దేశవ్యాప్తంగా 15 శాతం వృద్ధితో 50 లక్షల యూనిట్ల యూజ్డ్ కార్లు చేతులు మారాయి. ఇందులో అవ్యవస్థీకృత రంగం వాటా 70 శాతం కాగా వ్యవస్థీకృత (ఆర్గనైజ్డ్) రంగం వాటా 30 శాతం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ 65 లక్షల యూనిట్లను తాకనుంది. ఈ రంగంలో దేశంలో ఎనిమిదవ స్థానంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 8 శాతంగా ఉంది. భారత్‌లో 2030 నాటికి పాత కార్ల పరిశ్రమ కొత్త వాటితో పోలిస్తే రెండింతలకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. తొలిసారిగా కారును సొంతం చేసుకుంటున్న కస్టమర్లలో 70 శాతం మంది పాత కారును కొనుగోలు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. వ్యవస్థీకృత రంగమే.. యూజ్డ్ కార్ల మార్కెట్‌ను వ్యవస్థీకృత రంగమే నడిపిస్తోందని కార్స్24 కో–¸పౌండర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గజేంద్ర జంగిద్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘పాత కార్ల రంగంలో అవ్యవస్థీకృత మార్కెట్ వార్షిక వృద్ధి 10 శాతమే. ఆర్గనైజ్డ్ మార్కెట్ ఏకంగా 30 శాతం వృద్ధి చెందుతోంది. కొత్త కార్ల విషయంలో 75 శాతం మందికి రుణం లభిస్తోంది. అదే పాత కార్లు అయితే ఈ సంఖ్య 15 శాతమే. యూజ్డ్ కార్లకు రుణం లభించడం అంత సులువు కాదు. ఇక కారు ఉండాలనుకోవడం ఒకప్పుడు ఆకాంక్ష. నేడు అవసరంగా భావిస్తున్నారు. అందుకే కొత్తదానితో పోలిస్తే సగం ధరలో దొరికే యూజ్డ్ కారు స్టీరింగ్ పట్టుకుంటున్నారు. ఇటీవలి కాలంలో సర్టీఫైడ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. క్వాలిటీ చెక్స్, వారంటీ, రిటర్న్ పాలసీ, ఈజీ ఫైనాన్స్.. ఇన్ని సౌకర్యాలు ఉండడంతో సర్టీఫైడ్ కార్ల పట్ల వినియోగదార్లలో నమ్మకం ఏర్పడింది’ అని ఆయన వివరించారు. రెండు నగరాల్లోనే.. భారత్‌లో యూజ్డ్ కార్ల విక్రయ రంగంలో ఉన్న కంపెనీలు, విక్రేతలు వాహనాలను కొనుగోలు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. అదే హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లలో మాత్రమే పార్కింగ్ విధానం ఉందని కార్స్24 చెబుతోంది. అంటే పాత కారు యజమానులు యూజ్డ్ కార్స్ విక్రయ కేంద్రాల్లో అద్దె చెల్లించి తమ వాహనాన్ని పార్క్ చేయవచ్చు. మంచి బేరం వస్తే యజమాని సమ్మతి మేరకు కారును విక్రయిస్తారు. కమీషన్ ఆధారంగానూ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఇక 2015లో 100 కొత్త కార్లు రోడ్డెక్కితే అంతే స్థాయిలో పాత కార్లు చేతులు మారాయి. ఇప్పుడీ సంఖ్య 150 యూనిట్లకు చేరింది. యూఎస్, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో 100 కొత్త కార్లకు 400 పాత కార్లు అమ్ముడవుతున్నాయి. సగటు ధర రూ. 6 లక్షలు.. పాత కారు కొనుగోలు సగటు ధర రూ.6 లక్షలు ఉంటోంది. అమ్ముడవుతున్న మొత్తం పాత కార్లలో హ్యాచ్‌బ్యాక్ వాటా 60 శాతం కైవసం చేసుకుంది. ఈ విభాగం వృద్ధి నిలకడగా ఉంది. 20 శాతం వాటా ఉన్న సెడాన్స్ వృద్ధి రేటు తగ్గుతూ ప్రస్తుతం 20 శాతానికి వచ్చి చేరింది. ఎస్‌యూవీల వాటా క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 20 శాతంగా ఉంది. అయితే వృద్ధి ఏకంగా 30 శాతానికి చేరింది. 2030 నాటికి ఎస్‌యూవీల వాటా పాత కార్ల కొనుగోళ్లలో 40 శాతానికి ఎగుస్తుందని పరిశ్రమ భావిస్తోందని సుదీర్కార్స్.కామ్ ఫౌండర్ బండి సు«దీర్ రెడ్డి తెలిపారు. అదే కొత్త కార్ల విషయంలో ప్రస్తుతం ఎస్‌యూవీల వాటా 45 శాతం తాకిందన్నారు. హ్యాచ్బ్యాక్స్ వాటా 30 శాతముందని చెప్పారు. దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో 38.9 లక్షల యూనిట్ల కొత్త కార్లు రోడ్డెక్కాయి. 2023–24లో ఈ సంఖ్య 40 లక్షల యూనిట్లు దాటుతుందన్న అంచనాలు ఉన్నాయి. -
కొంపముంచుతున్న క్రెడిట్ కార్డు బకాయిలు: డిఫాల్ట్ అయితే ఏం చేయాలో తెలుసా?
ప్రస్తుతకాలంలో క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగింది. దాదాపు ప్రతీ బ్యాంకు ఖాతాదారుడికి క్రెడిట్ కార్డు ఉంటుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే అకౌంట్లో తగినంత డబ్బు లేకపోయినా, క్రెడిట్ ద్వారా సులువుగా కొనుగోళ్లు చేసుకునే వెసులుబాటుతోపాటు, క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్ల , డిస్కౌంట్ల వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాదు క్రెడిట్ స్కోరుతో లోన్లను సులువుగా పొందవచ్చు. ఈనేపథ్యంలోనే గత రెండేళ్లలో క్రెడిట్ కార్డ్ హోల్డర్లు తమ లిమిట్‌ను భారీగా పెంచు కున్నారు. క్రెడిట్ కార్డ్‌లపై బకాయిల మొత్తం రెండేళ్లలో దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. అదేసమయంలో క్రెడిట్ కార్డ్‌లపై లావాదేవీ విలువ రెండింతల పెరిగిందని TruBoardPartners అధ్యయనం తెలిపింది. రూ. 951 కోట్లు పెరిగిన క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్స్ సమాచార హక్కు చట్టం (RTI) కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటా ప్రకారం, క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్‌లు 2022 ఆర్థిక సంవత్సంలో లో రూ. 3,122 కోట్ల నుండి 2023లో రూ.951 కోట్లు పెరిగి రూ. 4,073 కోట్లకు చేరాయి. (ప్రౌడ్ ఫాదర్ జస్ప్రీత్ బుమ్రా నెట్‌వర్త్, లగ్జరీ కార్లు, ఈ వివరాలు తెలుసా?) క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ అంటే ఏమిటి? అవకాశం ఉంది కదా అని ఇబ్బబిముబ్బడిగావాడటం, చెల్లింపులు చేయకపోవడం ఆందోళన కరంగా మారుతోంది. విచక్షణా రహితంగా క్రెడిట్ కార్డు వాడేసి, తరువాత చెల్లించడంలో విఫలమైనా, అనుకోని కారణాలతో చెల్లింపులు చేయలేకపోయినా కూడా తిప్పలు తప్పవు. ఈ క్రమంలో క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ అంటే ఏమిటి? క్రెడిట్ కార్డ్ చెల్లింపు డిఫాల్ట్ అయితే పరిష్కారం ఏమిటి అనే విషయాలను ఒకసారి చూద్దాం. (జీతాల పెంపు: దిగ్గజ ఐటీ కంపెనీల ఉద్యోగులకు షాక్! ) క్రెడిట్ కార్డ్ ద్వారా సాధారణ ఖర్చులు, మెడికల్ బిల్లు,తదితర అత్యవసర కొనుగోళ్లు చేయవచ్చు. ఆ తరువాత వీటిని బ్యాంకు నిర్దేశించిన గడువు లోపల చెల్లించాలి. ఒకవేళ భారీగా ఖర్చు చేసి, దానిని చెల్లించలేకపోతే, వాయిదా పద్దతిలో చెల్లించే విధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే, దురదృష్టవశాత్తూ, ఉద్యోగం కోల్పోవడం, లేదా వ్యాపారంలో నష్టాలు, ఇతర అత్యవసర పరిస్థితుల కారణంగా క్రెడిట్ కార్డ్ బిల్ తిరిగి చెల్లించడం మీకు కష్టంగా అనిపించే సందర్భాలు ఉండవచ్చు. కష్టం కావచ్చు.కానీ క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించడంలో విఫలమైతే, మీరు అనేక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి క్రెడిట్ కార్డ్ డిఫాల్టర్. నెలల తరబడి క్రెడిట్ కార్డ్ బిల్లుకనీస మొత్తాన్ని కూడా చెల్లించడంలో విఫలమైతే..దానినే క్రెడిట్ కార్డ్ పేమెంట్ డిఫాల్ట్ అంటారు. 30 రోజుల పాటు చెల్లింపు చేయడంలో విఫలం కావడం తొలి తప్పు. ఆరు నెలలు పాటు కనీస చెల్లింపులు చేయకుండా ఉంటే మాత్రం క్రెడిట్ కార్డ్ ఖాతా వెంటనే డియాక్టివేట్ అవుతుంది. డిఫాల్ట్ లిస్ట్‌లోకి వెళుతుంది. రీపేమెంట్‌కు సంబంధించి సదరు బ్యాంకు ఆయా ఖాతాదారులను సంప్రదిస్తాయి. దీని తర్వాత కూడా మీరు చెల్లించకపోతే, ఖాతా మూతపడుతుంది. ఈ సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు నో పేమెంట్ రిపోర్ట్ చేస్తారు.దీంతో క్రెడిట్ స్కోర్‌పై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. భవిష్యత్తులో రుణం తీసుకోవడం లేదా కొత్త క్రెడిట్ కార్డ్‌ని పొందడం కష్టం. క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ పరిణామాలు ఆలస్య చెల్లింపు రుసుములు ,అదనపు వడ్డీ ఛార్జీలు బ్యాంకులు బకాయిలపై 38 నుండి 42 శాతం వరకు వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. లోన్లు రావడం కష్టం. క్రెడిట్ పరిమితి తగ్గుతుంది. క్రెడిట్ కార్డ్ చెల్లింపును డిఫాల్ట్ అధిక-రిస్క్ రుణగ్రహీతగా మారిపోతారు. చట్టపరమైన చర్యలు: రికవరీ కోసం బ్యాంక్ సివిల్ దావా వేయవచ్చు.కొన్ని సందర్భాల్లో, బ్యాంక్ మోసం చేసినందుకు క్రిమినల్ కేసు కూడా నమోదు చేయవచ్చు.లీగల్ నోటీసును పంపవచ్చు. రికవరీ ఏజెంట్ల బాధలు: క్రెడిట్ కార్డ్ చెల్లింపును తిరిగి పొందడానికి బ్యాంకు రుణ సేకరణ ఏజెన్సీల ద్వారా రికవరీ ఏజెంట్లను నియమిస్తే, వారి దూకుడుని, వేధింపులను తట్టు కోవడం కష్టం. ఇది లేనిపోని అవమానాలు,ఆందోళనకు కారణం కావచ్చు. క్రెడిట్ కార్డ్ చెల్లింపు డిఫాల్ట్ అయితే ఏమి చేయాలి? ఫస్ట్చేయాల్సిన పని: బ్యాంక్‌ని సంప్రదించి పరిస్థితిని వివరించడం, క్రెడిట్ స్కోర్‌కు మరింత నష్టం జరగకుండా ఉండాలంటే పాక్షిక చెల్లింపు చేయడం. తక్కువ వడ్డీ రేటు, తగ్గిన ఫీజులు లేదా ఆలస్య చెల్లింపు ఛార్జీల మినహాయింపు కోసంబ్యాంక్ అధికారులతో చర్చించాలి. వృత్తిపరమైన సహాయం కోరవచ్చు. తద్వారా రుణ చెల్లింపు, అలాగే క్రెడిట్ కార్డును తిరిగి ట్రాక్‌లోకి తెచ్చుకోవచ్చు. అలాగే వన్-టైమ్ సెటిల్మెంట్ అవకాశముందేమో పరిశీలించి సెటిల్ చేసుకోవడం. మరిన్ని విషయాలు కాబట్టి, సకాలంలో చెల్లింపులు చేయడం, క్రెడిట్ కార్డ్‌ను బాధ్యతాయుతంగా నిర్వహించడం చాలా అవసరం. ఒక వేళ ఆర్థిక ఇబ్బందులెదురైతే, మీ క్రెడిట్ కార్డ్ చెల్లింపులో డిఫాల్ట్ కాకుండా ఉండటానికి మీ బ్యాంక్‌ను సంప్రదించి, సంబంధిత ఆప్షన్స్ ఎంచుకోవడం బెటర్.జూలై 1, 2022 నుండి అమలులోకి వచ్చే RBI మార్గదర్శకాల ప్రకారం, కార్డ్ జారీచేసేవారు కార్డ్ హోల్డర్లకు 7-రోజుల నోటీసు వ్యవధిని ఇవ్వాలి, క్రెడిట్ బ్యూరోలకు డిఫాల్టర్‌గా నివేదించాలనే ఉద్దేశ్యం గురించి సంబంధిత ఖాతాదారులకు తెలియజేయాలి. బకాయిలనుచెల్లించడానికి గడువు ఇవ్వాలి. సెటిల్మెంట్ , డిఫాల్ట్‌లు మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తాయి. ఇవి 7 సంవత్సరాల వరకు మీ రికార్డ్‌లో కనిపిస్తాయి! -
అకౌంట్లో డబ్బు లేకున్నా రూ. 80000 విత్‌డ్రా చేసుకోవచ్చు
సాధారణంగా మన బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉన్నప్పుడు మాత్రమే ఏటీఎమ్ నుంచి విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఖాతాలో డబ్బు లేకున్నా.. రూ. 80,000 వరకు విత్‌డ్రా తీసుకోవచ్చని ఒక బ్యాంక్ వెల్లడించింది. దీంతో వినియోగదారులు ATM సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్ (Bank Of Ireland) ఖాతాలో ఉన్న డబ్బుతో సంబంధం లేకుండా సుమారు వెయ్యి డాలర్లను విత్‌డ్రా చేసుకోవచ్చని ప్రకటించింది. గత కొన్ని రోజులుగా ఈ బ్యాంక్ ఆన్లైన్ సిస్టం కొంత మందకొడిగా ఉండటం వల్ల యాప్స్ పనిచేయడంలేదని.. కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ ఈ విధమైన ప్రకటన చేసింది. ఇదీ చదవండి: ఆరుపదుల వయసులో రూ. 23,000కోట్ల అధిపతిగా.. ఎవరీ లచ్మన్ దాస్ మిట్టల్ ఈ బ్యాంకులో ఖాతా ఉన్న వ్యక్తి అవసరాల కోసం వెయ్యి డాలర్లను తీసుకున్నట్లయితే.. ఆ తరువాత అతడు జరిపే లావాదేవీల్లో ఈ మొత్తం వసూలు చేస్తుందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది డబ్బు కోసం ఏటీఎమ్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. ఒక్కొక్కరు కనీసం మూడు, నాలుగు గంటలు వెయిట్ చేసి మరీ డబ్బు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్ వివరణ.. మొబైల్ యాప్ అండ్ 365ఆన్‌లైన్‌తో సహా మా అనేక సేవలపై ప్రభావం చూపుతున్న సాంకేతిక సమస్యపై పనిచేస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఈ సమస్య వీలైనంత త్వరగా పరిష్కారమవుతుందని స్పష్టం చేసింది. వినియోగదారులు ఎదుర్కొంటున్న అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నామని తెలిపింది. We are working on a technical issue that is impacting a number of our services including our mobile app and 365Online. We are working to fix this as quickly as possible and apologise to customers for any inconvenience caused. https://t.co/yO5ptZ6MfL — Bank of Ireland (@bankofireland) August 15, 2023 -
ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్న వారికి షాక్! డిస్కౌంట్ డబ్బు వెనక్కి కట్టాలి?
సబ్సిడీల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ (Electric Two wheeler) కంపెనీల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్నవారు ఆ వాహనాలపై తాము పొందిన డిస్కౌంట్‌ను ఆయా కంపెనీలకు వెనక్కి కట్టాల్సి రావచ్చు. ఫేమ్2 పథకం నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో సంస్థలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయా సంస్థలు పొందిన సబ్సిడీ మొత్తం రూ. 469 కోట్లు తిరిగి కట్టాలని భారీ పరిశ్రమల శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కాగా తమకు సబ్సిడీలు రద్దు చేసిన నేపథ్యంలో తాము కస్టమర్లకు ఇచ్చిన డిస్కౌంట్లను వారి నుంచి వెనక్కి కోరే అవకాశాన్ని పరిశీలించాలని ఆ ఏడు ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ ప్రతిపాదనను తెలియజేస్తూ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల సొసైటీ కేంద్ర భారీ పరిశ్రమల శాఖకు తాజాగా ఓ లేఖ రాసింది. ఇదీ చదవండి ➤ GST on EV Charging: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్‌పై జీఎస్టీ! పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో వర్తింపు హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్ , ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించి ఆర్థిక ప్రోత్సాహకాలను పొందినట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ జరిపిన విచారణలో వెల్లడైంది. దీంతో ఆయా కంపెనీలు పొందిన సబ్సిడీలను రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంపోర్టెడ్ పార్ట్స్ వినియోగం ఫేమ్2 పథకం నిబంధనల ప్రకారం.. మేడ్ ఇన్ ఇండియా కాంపోనెంట్లను ఉపయోగించి ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తే ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. కానీ ఈ ఏడు సంస్థలు విదేశాల దిగుమతి చేసుకున్న విడి భాగాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. చాలా ఈవీ కంపెనీలు ఈ ఎలక్ట్రిక్ వాహనాల దేశీయ తయారీని పెంచడానికి ఉద్దేశించిన దశల తయారీ ప్రణాళిక (PMP) నిబంధనలను పాటించకుండా సబ్సిడీలను క్లెయిమ్ చేస్తున్నారని ఆరోపిస్తూ అనామక ఈ-మెయిల్లు అందడంతో మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టింది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను ప్రోత్సహించడానికి 2019లో రూ. 10,000 కోట్లతో ఫేమ్2 ((ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది 2015లో రూ. 895 కోట్లతో ప్రారంభించిన ఫేమ్ పథకానికి కొనసాగింపు. -
కిలో టమాట రూ.200.. ఈ ఆటోవాలా ఆఫర్ చూడండి.. ఫ్రీ ఇస్తాడట!
దేశంలో ఇటీవల టమాటా సృష్టిస్తున్న లీలలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడ చూసిన టమాటా గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే టమాటా ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. కిలో టమాటా ధర రూ.200కు పైగా అమ్ముడు పోయాయి. టమాటా ధరలు ఆకాశాన్నింటి.. కొందరు రైతులను కోటీశ్వరులను చేశాయి. టమాటా ఉచిత పథకాల ద్వారా మరికొందరు తమ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకుని లాభాల బాట పట్టారు. ఆటోవాలా సరికొత్త ఆఫర్.. వినియోగదారులు టమాటాలు కొనడానికి సంశయిస్తున్న సమయంలో చంఢీగర్కు చెందిన ఓ ఆటో డ్రైవర్ కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చాడు. తన ఆటోలో ప్రయాణించినవారికి కేజీ టమాటాలు ఉచితంగా ఇస్తానని ఉచిత పథకాన్ని పెట్టాడు. కానీ అందుకు సదరు ప్రయాణికుడు కనీసం ఐదు రైడ్లు చేయాలని కండీషన్ పెట్టాడు. ఇదీ కాకుండా ఆర్మీలో పనిచేసే సైనికులకు ఆయన గత 12 ఏళ్లుగా ఉచితంగా సేవలు అందిస్తాడు. గర్భణీ మహిళలను కూడా ఉచితంగా ఆస్పత్రికి తరలిస్తాడు. తన జీవనోపాధికి ఆటో మాత్రమే ఏకైక మార్గమని తెలిపిన ఆయన.. ఈ సేవల వల్ల తనకు సంతృప్తి కలుగుతుందని అన్నారు. ఇదే కాకుండా పాకిస్థాన్‌పై ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిస్తే ఐదు రోజుల పాటు ఉచితంగా ఆటో రైడ్లు అందిస్తానని చెప్పాడు. ఉచిత ప్రకటనలు.. ఆటోవాలానే మొట్టమొదటి వ్యక్తి కాదు. టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో ఇలాంటి ఆఫర్లతో పలువురు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పంజాబ్‌లో ఓ చెప్పుల దుకాణం యజమాని రూ.1000కి పైగా కొనుగోలు చేస్తే రెండు కిలోల టమాటాలు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటన చేశాడు. తన దుకాణంలో మొబైల్ కొనుగోలు చేస్తే కేజీ టమాటాలు ఉచితం అంటూ మరోచోట ఓ యజమాని ఆఫర్ పెట్టాడు. తాజాగా ఆటో డ్రైవర్ తన ఆటోలో ప్రయాణిస్తే టమాటాలు ఉచితం అంటూ కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చాడు. టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఢిల్లీ, పట్నా, లక్నో సహా పలు ముఖ్య నగరాల్లో రూ.80 కే కేజీ టమాటా లభ్యమయ్యేలా చర్యలు చేపట్టింది. ఇదీ చదవండి: సీఎం నివాసంలోకి చొరబాటుకు దుండగుడి యత్నం.. మారణాయుధాలతో.. -
కిలో టమాటా రూ.50.. 2 కిలోమీటర్ల మేర క్యూ కట్టిన ప్రజలు (ఫొటోలు)
-
ఎస్బీఐ ఖాతాదారులకు అదిరిపోయే వార్త!
SBI home loans processing fees waiver: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. గృహరుణాలను తీసుకునే ఖాతాదారులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గృహ రుణాలపై రాయితీతోపాటు, 50 - 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. పరిమిత కాల ఆఫర్‌గా ఈ వెసులు బాటును అందిస్తోంది. ఎస్బీఐ హోమ్ లోన్ వెబ్సైట్ సమాచారం ప్రకారం ఆగస్ట్ 31 వరకే హోమ్ లోన్స్‌పై తగ్గింపు ఆఫర్ వర్తిస్తుందని ఎస్బీఐ వెల్లడించింది. (నిజంగా భయంకరమే..! రేణూ దేశాయ్ అద్భుతమైన పిక్స్ వైరల్!) రెగ్యులర్ హోమ్ లోన్, ఫ్లెక్సిబుల్ హోమ్ లోన్, ఎన్ఆర్ఐ హోమ్ లోన్, నాన్ శాలరీడ్ హోమ్ లోన్, ప్రివైలేజ్ హోమ్ లోన్, అప్నా ఘర్ హోమ్ లోన్ వంటి వాటిపై ఈ తగ్గింపు ప్రయోజనం అందుబాటులో ఉంటుందనేది గమనార్హం.రాయితీ లేకుండా ప్రాసెసింగ్ ఫీజు మొత్తం రుణంపై 0.35శాతం, జీఎస్టీ కలుపుకొని కనిష్టంగా రూ.2,000 - రూ. 10వేల మధ్య ఉంటుంది. (వెకేషన్లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?) గమనించవలసిన ముఖ్యమైన అంశాలు ♦ హెచ్ఎల్ రీసేల్, రడీ టూ మూవ్ ప్రాపర్టీలకు గతంలో సూచించిన రేట్ల కంటే 20 bps అదనపు రాయితీ. అయితే సిబిల్ స్కోర్ 700 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ♦ బిల్డర్ టై అప్ ప్రాజెక్ట్లకుపైన పేర్కొన్న సిఫార్సు చేసిన రేట్ల కంటే 5 bps ఎక్కువ తగ్గింపు. ♦ శౌర్య, శౌర్య ఫ్లెక్సీ పై ప్రతిపాదిత రేట్ల కంటే అదనంగా 10 బేసిస్ పాయింట్ల రాయితీ. హెచ్ఎల్ అండ్ టాప్ అప్ రుణాలకు ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం తగ్గింపు లభిస్తుంది. దీని ప్రకారం జీఎస్టీ కాకుండా రూ. 2 వేల నుంచి గరిష్టంగా రూ. 5 వేల వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. దీంతోపాటు 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ కూడా పొందొచ్చు. అలాగే ఇన్స్టాల్ హోమ్ టాప్ అప్, రివర్స్ మోర్ట్గేజ్, ఈఎంఐ వంటి రుణాలకు ఎలాంటి ప్రాపెసింగ్ ఫీజు మాఫీ బెనిఫిట్ ఉండదు. మ రోవైపు రుణాలపై వసూలు చేసే ఎంసీఎల్ఆర్ను తాజాగా పెంచింది. కాల వ్యవధి ఆధారంగా దీన్ని 8 శాతం నుంచి 8.75 శాతం మధ్య నిర్ణయించిన సంగతి తెలిసిందే. (కంపెనీ సీఈవో కాదు, అయినా రోజుకు నాలుగు లక్షల జీతం) -
‘ఎస్బీఐ యోనో’ ఇక అందరిది.. ఆ యూపీఐ యాప్‌లకు గట్టిపోటీ!
SBI YONO App: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ యోనో మొబైల్ యాప్ సేవలను మరింత విస్తృతం చేసింది. ఇకపై ఈ యాప్‌ను ఎస్బీఐ కస్టమర్లు మాత్రమే కాకుండా ఎవరైనా వినియోగించుకోవచ్చు. ఎస్బీఐ అకౌంట్ లేని వారు కూడా ఎస్బీఐ యోనో మొబైల్ యాప్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే సౌలభ్యాన్ని స్టేట్ బ్యాంక్ కల్పించింది. తమ డిజిటల్ బ్యాంకింగ్ యాప్ సేవలను ప్రతిఒక్కరికీ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ ఫీచర్‌ను ఎస్బీఐ తీసుకొచ్చినట్లు చెబుతోంది. ‘యోనో ఫర్ ఎవ్రీ ఇండియన్’ చొరవ ద్వారా స్కాన్ అండ్ పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి యూపీఐ సేవలను ఏ బ్యాంక్ కస్టమర్ అయినా పొందవచ్చని ఎస్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. యూపీఐ సేవలతో పాటు కార్డ్ లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ సౌకర్యాన్ని కూడా ఎస్బీఐ కల్పించింది. ఐసీసీడబ్ల్యూ సౌకర్యం ఉన్న ఏటీఎంలలో ఏ బ్యాంక్ కస్టమర్ అయినా ఎస్బీఐ యోనో యాప్‌లోని ‘యూపీఐ క్యూఆర్ క్యాష్’ అనే ఆప్షన్ ద్వారా ఏటీఎం కార్డు లేకుండానే నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ అకౌంట్ లేనివారికి కూడా యూపీఐ చెల్లింపుల సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ఎస్బీఐ యోనో యాప్.. ఇప్పుడున్న ఫేన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇతర బ్యాంక్ కస్టమర్లు యోనో యాప్‌ను ఉపయోగించండిలా.. ఎస్బీఐ యోన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ‘న్యూ టు ఎస్బీఐ’ను క్లిక్ చేసి ‘రిజిస్టర్ నౌ’పై నమోదు చేసుకోండి. మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిన ఫోన్ నంబర్‌ను ధ్రువీకరించి యూపీఐ చెల్లింపులకు నమోదు చేసుకోండి యూపీఐ ఐడీని సృష్టించడానికి మీ బ్యాంక్‌ని ఎంచుకోండి ఎస్బీఐ పే కోసం రిజిస్ట్రేషన్‌ని నిర్ధారిస్తూ ఒక మెసేజ్ మీ మొబైల్‌కు వస్తుంది అందించిన ఆప్షన్ల నుంచి ఒకదాన్ని ఎంచుకోవడం ద్వారా ఎస్బీఐ యూపీఐ హ్యాండిల్‌ను సృష్టించండి లాగిన్ చేయడానికి, చెల్లింపులు చేయడానికి ఆరు అంకెల శాశ్వత ఎంపిన్‌ను సెట్ చేసుకోండి క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం, కాంటాక్ట్స్‌కు డబ్బు పంపడం, ట్రాన్సాక్షన్ హిస్టరీని చెక్ చేసుకోవడం వంటివి ప్రారంభించండి ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. కార్డ్ లేకున్నా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయొచ్చు -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్: విలీనం తరువాత లక్షలాది కస్టమర్లకు భారీ షాక్
మెగా మెర్జర్ తరువాత ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాల్లో నిలిచిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు ఎంసిఎల్ఆర్ను పెంచి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. అవకాశం ఉంది. సవరించిన వడ్డీరేట్లు శుక్రవారం ( జూలై 7 ) నుంచే అమలులోకి వచ్చాయి. బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్) 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. హెచ్డీఎఫ్సీ తాజా నిర్ణయం ద్వారా లక్షలాది మంది ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. దీంతో హోమ్ లోన్, పర్సనల్ లోన్ ఆటో లోన్ సహా అన్ని రకాల రుణ గ్రహీతలపై ఈఎంఐ భారం పడనుంది. (డైనమిక్ లేడీ నదియా వ్యాపారం, ఆమె కిల్లర్ మూవ్ గురించి తెలుసా?) బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీంతో ఈ రేటు 8.1 శాతం నుంచి 8.25 శాతానికి చేరింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు కూడా 10 బేసిస్ పాయింట్లు పెంపుతో ఇది 8.2 శాతం నుంచి 8.3 శాతానికి చేరింది. మూడు నెలలపై వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.5 శాతం నుంచి 8.6 శాతంగానూ,5 బేసిస్ పాయింట్లు పెంపుతో ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.85 శాతం నుంచి 8.9 శాతంగా ఉండనుంది. అయితే ఏడాది ఆపైన వ్యవధి రుణాలపై వడ్డీరేటు 9.05 శాతం వద్ద యథాతథంగా ఉంటుంది. (మెక్‌డొనాల్డ్స్‌కి టొమాటో ‘మంట’ ఏం చేస్తోందో తెలుసా?) -
దేశీయంగా కీవే బైక్స్ తయారీ: లక్కీ కస్టమర్లకు భారీ ఆఫర్
సూపర్‌బైక్స్ బ్రాండ్ కీవే ఎస్ఆర్ 250, ఎస్ఆర్ 125 మోడళ్ల తయారీని దేశీయంగా ఈ ఏడాది నుంచి చేపట్టనున్నట్టు ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రకటించింది. ఇటీవలే ప్రీమియం సెగ్మెంట్లో నాన్-రెట్రో మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టింది కీవే. ఢిల్లీఎక్స్షోరూంలో పరిచయ ఆఫర్ ధర ఎస్ఆర్ 250 రూ.1.49 లక్షలు వద్ద అందుబాటులో ఉంటుంది. రూ.2,000కి బుక్ చేసుకోవచ్చు. ఇక ఎస్ఆర్ 125 రూ.1.19 లక్షలుగా ఉంది. కేవలం 1000కే బుక్ చేసుకోవచ్చు. వినియోగదార్లు దేశవ్యాప్తంగా ఉన్న 55 బెనెల్లి, కీవే షోరూంలు లేదా ఆన్లైన్లో ఈ బైక్స్‌ను కొనుక్కోవచ్చు. కీవే ఎస్ఆర్ 250 తొలి 500 డెలివరీల కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక లక్కీ డ్రాను ప్రకటించారు. ఈ లక్కీ డ్రాలో, ఐదుగురు లక్కీ కస్టమర్లు కీవే ఎస్ఆర్ ఎక్స్-షోరూమ్ ధరపై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకునే అవకాశం ఉంటుంది. అంతేనా దీనికి అదనంగా , AARI 'My SR My Way' అనే కొత్త ప్లాట్‌ఫారమ్‌ను పరిచయం చేస్తోంది. కీవే ఎస్ఆర్ 125 బెస్ట్ మైలేజీ సామర్థ్యాన్ని కోరుకునే బైక్ లవర్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్. 125 సీసీ 4-స్ట్రోక్ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్-ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్ ఇందులో అమర్చారు. ఇది గరిష్టంగా 9.7hp శక్తిని 8.2nm గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇంకా హాలోజన్ హెడ్‌ల్యాంప్, LCD కలర్ డిస్ప్లే, కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ , డ్యూయల్-పర్పస్ టైర్స్ 1 ఉంది. బ్రేకింగ్ సిస్ఠంలో 300ఎంఎం ఫ్రంట్ డిస్క్, వెనుకవైపు 210ఎంఎ డిస్క్‌ను అందించింది. బైక్‌కు 160ఎంఎ గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు, అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ లభిస్తుంది. Wishing a Happy World Motorcycle Day to those who love corners and the open highways.#HappyWorldMotorcycle #Bikers #MotorcycleDay #Passion #Riding #Keeway #India pic.twitter.com/sUPSPE272j — KeewayIndia (@keeway_india) June 20, 2023 -
వినియోగదారులకు ఓలా గుడ్ న్యూస్
-
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. మరింత మెరుగ్గా బ్రాడ్‌బ్యాండ్ సేవలు
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ బ్రాడ్‌బ్యాండ్ సేవలు మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టింది. భారత్‌ఫైబర్ పేరిట అందిస్తున్న బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించిన కస్టమర్ల కోసం నిరంతర టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. భారత్‌ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల కోసం 1800 4444 నెంబర్‌తో 24/7 నిరంతర హెల్ప్‌లైన్‌ను ప్రారంభించినట్లు ట్విటర్ ద్వారా బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. బ్రాడ్‌బ్యాండ్‌కు సంబంధించి ఏ సమస్య ఉన్నా కస్టమర్లు ఈ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు. కాగా భారత్‌ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా జీ5, డిస్నీప్లస్ హాట్‌స్టార్, సోనీలివ్ వంటి ఓటీటీ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. #BSNL has launched its 24/7 toll-free no. 1800-4444 for #BharatFibre Broadband customers.#G20India pic.twitter.com/T2yV1jyNpu — BSNL India (@BSNLCorporate) June 15, 2023 -
ఐసీఐసీఐ,పీఎన్బీ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్!
సాక్షి,ముంబై: బ్యాంకింగ్ దిగ్గజాలు కస్టమర్లకు భారీ షాకిచ్చాయి. ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ,పబ్లిక్ లెండర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రెండూ తమ మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లకు (ఎంసీఎల్ఆర్) రేట్లు పెంచాయి. సవరించిన రేట్లు జూన్ 1, 2023 నుండి అమలులోకి వచ్చాయి. ఐసీఐసీఐ అనూహ్యం కొన్నింటికి వడ్డీరేటును తగ్గించి, మరికొన్నింటిపై వడ్డీరేటును పెంచడం గమనార్హం. ఒక నెల ఎంసీఎల్ఆర్ను 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ఈ వడ్డీరేటు 8.50 శాతం 8.35శాతానికి దిగి వచ్చింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ కూడా 8.55 శాతం నుంచి 8.40 శాతానికి తగ్గించింది. అయితే ఆరు నెలలు, ఏడాది కాలవ్యవధి రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును 8.75 శాతంనుంచి 8.85 శాతానికి పెంచడం విశేషం. (సూపర్ ఆఫర్: ఐపోన్ 13పై రూ. ఏకంగా రూ. 36వేల డిస్కౌంట్) మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఇదే బాటలో నడిచింది. అధికారిక వెబ్సైట్ వివరాల ప్రకారం ఓవర్‌నైట్ బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ 8శాతంనుంచి 8.10శాతానికి పెంచింది. ఒకటి, మూడు, ఆరు నెలల రేట్లును కూడా పెంచి వరుసగా 8.20, 8.30, 8.50 శాతంగా ఉంచింది. అలాగే ఏడాది రుణాలపై వడ్డీరేటు 8.60శాతంగానూ, మూడేళ్ల రుణాలపై వడ్డీరేటు 8.80శాతంనుంచి 8.90 శాతానికి పెంచింది. ఇదీ చదవండి: అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? మరిన్ని ఇంట్రస్టింగ్ అప్డేట్స్, బిజినెస్ వార్తలకోసం చదవండి సాక్షిబిజినెస్ -
ఫోన్ నంబర్ తీసుకుని విసిగిస్తున్నారా? వినియోగదారుల శాఖ కీలక సూచన
న్యూఢిల్లీ: కస్టమర్ల నుంచి మొబైల్ నంబర్ తదితర కాంటాక్ట్ వివరాల కోసం రిటైలర్లు ఒత్తిడి చేయొద్దని కేంద్ర వినియోగదారుల శాఖ సూచన జారీ చేసింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సూచన జారీ అయింది. తమ కాంటాక్ట్ నంబర్‌ను ఇచ్చేందుకు నిరాకరించడంతో రిటైలర్లు సేవలు అందించేందుకు నిరాకరించినట్టు పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ‘‘కాంటాక్ట్ వివరాలు ఇవ్వకుండా బిల్లును జారీ చేయలేమని రిటైలర్లు చెబుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద ఇది పారదర్శకం కాదు. అనుచిత విధానం కూడా. వివరాలు తెలుసుకోవడం వెనుక ఎలాంటి హేతుబద్ధత లేదు’’అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఇక్కడ గోప్యత విషయమై ఆందోళన నెలకొందన్నారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే నంబర్‌వన్ హోటల్ ‘రాంబాగ్ ప్యాలెస్’.. ఎక్కడుందో తెలుసా? -
కష్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన HDFC బ్యాంక్
-
క్యాపిటల్ ఎస్ఎఫ్బీ కస్టమర్లకు మ్యాక్స్ లైఫ్ ప్లాన్లు
న్యూఢిల్లీ: మ్యాక్స్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్బీ) భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కస్టమర్లకు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు చెందిన సేవింగ్స్ ప్లాన్లు, ప్రొటెక్షన్ ప్లాన్లు, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన కస్టమర్లకు అందించనుంది. దీనివల్ల ఇరు సంస్థలకూ వ్యాపార అవకాశాలు పెరగనున్నాయి. -
ఖర్చుకు వెనకాడేది లేదు.. కోరుకున్నది కొనేస్తున్నారు!
ఆన్లైన్ షాపింగ్‌పై మధ్య వయస్కు ల అధికాసక్తి బ్రాండెడ్ వస్తువులు, దుస్తులు, తదితరాల కొనుగోళ్లకు మొగ్గు కరోనా కాలంలో పెరిగిన ఆసక్తి క్రమంగా అలవాటుగా మారుతున్న వైనం బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, మాట్రిక్స్ పార్ట్నర్స్ ఇండియా అధ్యయనంలో వెల్లడి సాక్షి, హైదరాబాద్ : ఓ కొత్త వర్గం కస్టమర్లు ఆన్లైన్ షాపింగ్‌పై అధికాసక్తి చూపిస్తున్నారు. నవతరం ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల లోపు యువతే ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తారనే అభిప్రాయం ఉంది. కానీ 35 ఏళ్లకు పైబడిన వారు ఈ తరహా షాపింగ్‌పై అధికంగా మొగ్గుచూపుతున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వివిధ రకాల బ్రాండెడ్ వస్తువులు మొదలుకుని ఫ్యాషన్ దుస్తులు, ఇతర కొనుగోళ్లలో వీరు ముందున్నట్టు స్పష్టమౌతోంది. వివిధ రకాల యాప్‌లు, వెబ్సైట్ల వాడకంలో యువతరం ముందున్నా, ఇప్పుడు మధ్య వయస్కు లు కూడా ఈ విషయంలో వారితో పోటీ పడుతున్నారు. కరోనా మహమ్మారి కాలంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొనుగోళ్లు ఊపందుకోగా తర్వాతి కాలంలో ఇది మరింత విస్తరించింది. క్రమంగా ఇది అలవాటుగా కూడా మారినట్లు వెల్లడవుతోంది. 2021లో మూడు నుంచి నాలుగు కోట్ల మంది కొత్తగా ఆన్లైన్ షాపర్స్ జాబితాలో చేరగా, అందులో 67 శాతం మంది 35 ఏళ్లకు పైబడిన వారే ఉండటం గమనార్హం. కాగా అందులోనూ అధికశాతం మెట్రో నగరాలకు చెందని చిన్న పట్టణాల మహిళలే ఎక్కువగా ఉండడం మరో విశేషం. వివిధ బ్రాండ్ల దుస్తులు గతంలో అందుబాటులో లేక నిరుత్సాహపడిన వీరంతా, ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ ద్వారా పెద్దమొత్తంలో ఖర్చు చేస్తూ బ్రాండెడ్ వస్తువులపై తమకున్న మోజును, ఇష్టాన్ని చాటుతున్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, మాట్రిక్స్ పార్ట్నర్స్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన తాజా అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ముఖ్యాంశాలివే... కొత్త ఆన్లైన్ కస్టమర్లు డిజిటల్ విధానాలను గతంలో అంతగా వినియోగించక పోయినా, ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో సులభంగా షాపింగ్ చేసే పద్ధతులను అన్వేషిస్తున్నారు ఆన్లైన్లో వివిధ వస్తువులను షాపింగ్ చేస్తున్నపుడు ప్రాంతీయ భాషల్లో వాయిస్, వీడియో అసిస్టెన్స్ సర్విసులను సైతం వీరు ఉపయోగిస్తున్నారు ఈ సెగ్మెంట్ కస్టమర్లకు దగ్గరయ్యేందుకు చిన్న, మధ్యతరహా విక్రయదారుల ద్వారా స్థానికంగా ఆయా ఉత్పత్తులుఅందుబాటులోకి వచ్చేలా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషో వంటి ఈ కామర్స్ కంపెనీలు తమ వంతు కృషి చేస్తున్నాయి తమకు గతేడాది రెండో శ్రేణి నగరాలు, అంతకంటే కిందిస్థాయి ప్రదేశాల నుంచే 80 శాతం ఆర్డర్లు వచ్చినట్టుగా మీషో వెల్లడించింది రాబోయే మూడేళ్లలో చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచే 50 శాతం ఆదాయం వస్తుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది గతంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆన్లైన్ కంపెనీలు డిస్కౌంట్లు, ఇతర మార్కెటింగ్ టెక్నిక్లను ఉపయోగించేవి. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్విసెస్ వంటివి మామూలై పోయాయి. గతంలో ఏవైనా దుస్తులు, వస్తువులు, ఇతర వస్తువులను కస్టమర్లు కొనేలా చేసేందుకు వాటిని వారి చేరువగా తీసుకెళ్లి తమ ఉత్పత్తులు అమ్ముడయ్యేలా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ అందుబాటులోకి రావడంతో వీరు, వారు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు ఖర్చుకు వెనకాడకుండా తమకు నచ్చి న వస్తువులు కొనేందుకు సిద్ధమౌతున్నారు. - తరుణ్ తావ్డా, ఎండీ, మ్యాట్రిక్స్ పార్ట్నర్స్ ఇండియా -
ఓటీటీ బెనిఫిట్స్‌తో వొడాఫోన్ ఐడియా కొత్తప్లాన్స్, రోజుకి 2 జీబీ డేటా
సాక్షి, ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్లను ప్రకటించింది. జియో, ఎయిర్టెల్ లాంటి దిగ్గజాలతో పోలిస్తే 5జీ సేవల్లో వెనుకబడి ఉన్న వొడాఫోన్ ఐడియా కస్టమర్లను ఆకట్టుకునే క్రమంలో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. త్వరలో 5జీని తీసుకు రావాలని యోచిస్తున్నట్లు హామీ ఇచ్చిన కంపెనీ తాజాప్లాన్లు ప్రకటించడం విశేషం. (Infinix INBook Y1 Plus Neo రూ. 20వేలకే ల్యాప్‌ట్యాప్, ఎట్రాక్టివ్ ఫీచర్స్!) యాక్టివ్ కస్టమర్ బేస్‌ను నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా,రూ 368, రూ 369 ధరలతో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించింది. రోజువారీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు పలు ఓటీటీ ప్లాట్ ఫారమ్ లకు సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తోంది. రూ.368, రూ.369 ప్లాన్స్ మధ్య ఉన్న తేడా ఏంటంటే.. వొడాఫోన్ ఐడియా రూ.368 అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకి 2జీబీ డేటా, రోజుకి 100 ఎస్ఎంఎస్ ఉచితం. వాలిడిటీ 30 రోజులు. అంటే టోటల్‌గా 60జీబీ డేటాని వినియోగదారులు ఎంజాయ్ చేయొచ్చు. దీంతోపాటు 30 రోజులు చెల్లుబాటు అయ్యేలా సన్‌నెక్ట్స్ యాప్ కి యాక్సెస్ లభిస్తుంది. వీకెండ్ రోలోవర్ ఫెసిలిటీ, వీఐ మూవీస్ సబ్స్క్రిప్షన్, ప్రతినెల 2జిబి డేటా బ్యాకప్ లభిస్తాయి. అయితే ఈ బెనిఫిట్స్ పొందేందుకు వీఐ యాప్ యూజర్లు 121249 కి డయల్ చేయాల్సి ఉంటుంది. (బీ అలర్ట్: మంటల్లో టాటా నెక్సాన్ ఈవీ, కంపెనీ స్పందన ఏంటంటే?) వొడాఫోన్ ఐడియా రూ.369 ఈప్లాన్లోకి రూ.368 ప్లాన్ లాంటి ప్రయోజనాలే లభ్యం. కానీ బింజ్ ఆల్ నైట్, వీకెండ్ డేటా రోలోవర్, సోనిలివ్ యాప్ యాక్సెస్, వీఐ మూవీస్, టీవీ యాప్స్, ప్రతినెల 2జీబీ వరకు డేటా బ్యాకప్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. వీటిని క్లెయిమ్ చేయడానికి 121249 కి డయల్ చేయాల్సి ఉంటుంది. (layoffs: షాకిచ్చిన ఇండియన్ ట్విటర్, 30 శాతం మందికి గుడ్ బై?) -
యాపిల్ స్టోర్ ముందు బారులుతీరిన కస్టమర్లు
ఢిల్లీలోని సాకేత్‌లో ఉన్న సెలెక్ట్ సిటీవాక్ మాల్లో గురువారం (ఏప్రిల్ 20) యాపిల్ రెండో స్టోర్ ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు యాపిల్ సీఈవో టిమ్‌కుక్ ప్రారంభించారు. స్టోర్ తెరవకముందే తెల్లవారుజాము నుంచే కస్టమర్లు, ఢిల్లీ నగరవాసులు పెద్దఎత్తున తరలి వచ్చారు. స్టోర్ బయట క్యూలో నిలబడ్డారు. (Apple Retail Store In Delhi: రెండో యాపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్‌కుక్) యాపిల్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో స్టోర్ ప్రారంభానికి ముందే కస్టమర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యాపిల్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. ఉత్పత్తుల కొనుగోలు కంటే స్టోర్‌ను సందర్శాలనే ఉద్దేశంతో చాలా మంది తరలివచ్చారు. #WATCH | People stand in queues at Delhi's Select City Walk Mall in Saket to witness the opening of India’s second Apple Store. pic.twitter.com/9mwk5gZmlu — ANI (@ANI) April 20, 2023 కాగా ముంబై స్టోర్ తర్వాత ఢిల్లీలో ప్రారంభించిన ఈ యాపిల్ స్టోర్ భారత్‌లో రెండోది. యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్లు, ఐప్యాడ్లకు కస్టమర్ల నుంచి అధిక డిమాండ్ ఉంది. అలాగే యాపిల్ టీవీలు, వాచ్‌లు, మొబైల్‌కు సంబంధించిన యాక్సెసరీలను ఈ స్టోర్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉంచారు. ఇదీ చదవండి: apple saket: యాపిల్ ఢిల్లీ స్టోర్ ఫస్ట్ లుక్.. అదిరిపోయింది! -
వెయిట్రస్‌తో అనుచిత ప్రవర్తన.. ఒక్క పంచ్‌తో శివంగిలా విరుచుకుపడి..
ఆత్మ రక్షణ ప్రతి ఒక్కరికి అవసరం. ఎటు నుంచి ఏ విపత్తు వస్తుందో ఎవరికి తెలియదు. ఆపద కాలంలో మనల్ని ధైర్యంగా ఉంచడమే కాకుండా.. ప్రత్యర్థి, ఆగంతకుల బారి నుంచి సురక్షితంగా తప్పించుకునేందుకు ఆత్మ రక్షణ తోడ్పడుతుంది. అచ్చం ఇలాంటి కోవకే చెందిన ఓ ఘటన రెస్టారెంట్లో చోటుచేసుకుంది. తనతో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కస్టమర్లకు ఓ మహిళ వెయిట్రస్ దిమ్మతిరిగే పంచ్‌లతో సమాధానమిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో రెస్టారెంట్‌లోని టేబుల్ వద్ద ఇద్దరు వ్యక్తుల కూర్చొని ఉండగా.. వారి ముందు ఓ లేడీ వెయిట్రస్ నిల్చొని ఉంది. టేబుల్లో కొన్ని ఖాళీ బీర్ సీసాలు కూడా ఉన్నాయి. ఇంతలో ఇద్దరు కస్టమర్లలో ఒక వ్యక్తి నిలబడి వెయిట్రస్ చేయి బలవంతంగా పట్టుకున్నాడు. రెండోసారి కూడా పట్టుకునేందుకు ప్రయత్నించగా సదరు యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. అంతటితో ఆగకుండా అతని ముఖంపై పిడిగుద్దులు గుద్ది, కడుపులో తన్ని కింద పడేసింది. ఇది చూసిన రెండో వ్యక్తి మహిళపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయినా బెదరని వెయిట్రస్ అతన్ని ధైర్యంగా ఎదుర్కొంది. సినిమాలో హీరోకు ఏమాత్రం తీసిపోకుండా అతనిపై శివంగిలా విరుచుకుపడింది. ఆమె పైకి కుర్చీ విసరగా.. యువతి తన కాలితో ఒక్క కిక్ ఇవ్వగానే ఎగిరి కిందపడిపోయాడు. ఈ దృశ్యాలన్నీ రెస్టారెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీనిని ఓ ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో ఫేర్ చేయగా.. 15 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటికే 10 లక్షల మంది వీక్షించారు. అయితే ఈ ఘటన ఎప్పుడూ, ఎక్కడ జరిగింది అనేది స్పష్టత లేదు. ఇదిలా ఉండగా యువతి ధైర్య సాహసాలను చూసి నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నైపుణ్యాలను మెచ్చుకుంటూ పోకిరీలతో పోరాడిన యువతిని ‘ఫిమేల్ బ్రూస్ లీ’ అంటూ కొనియాడుతున్నారు. Female Bruce Lee 💪💪 pic.twitter.com/Fg3Ben0IpQ — CCTV IDIOTS (@cctvidiots) April 15, 2023 -
కరోనా తరువాత ఖర్చు తగ్గించేశారు
-
ఈ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్: రుణాలపై భారీగా తగ్గనున్న భారం
సాక్షి,ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ వినియోగదారులకు తీపి కబురు చెప్పింది. ఇటీవలి కాలంలో రుణాలపై వడ్డీరేట్ల పెంపుతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు తాజా నిర్ణయంతో వడ్డీ రేట్లను తగ్గించి భారీ ఊరటనిచ్చింది.మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)ని 85 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఫలితంగా ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐ భారం తగ్గనుంది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, సవరించిన రుణ రేట్లు ఏప్రిల్ 10 నుంచే అమల్లోకి వచ్చాయి. ఎంసీఎల్ఆర్ రేటు తగ్గింపు తర్వాత బ్యాంకు ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 8.65 శాతం నుంచి 7.95 శాతానికి తగ్గింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 40 బేసిస్ పాయింట్లు తగ్గి 8.30 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు తగ్గి 8.7 శాతానికి దిగొచ్చింది. మరోవైపు 1-3 ఏళ్ల కాలానికి చెందిన ఎంసీఎల్ఆర్ స్థిరంగా ఉంటాయని బ్యాంకు ప్రకటించింది. కాగా రివ్యూలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లనుయథాతథంగానే ఉంచిన సంగతి తెలిసిందే. (‘ఆడి చాయ్‌వాలా’ ఏమైంది భయ్యా? వైరల్ వీడియో) ఇదీ చదవండి: Lava Blaze-2: అదిరిపోయే ఫీచర్లు: పరిచయ ఆఫర్ చూస్తే ఫిదా! -
కోటక్ మహీంద్ర బ్యాంకు వినియోగదారులకు గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంకు తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఎంపిక చేసిన కాల వ్యవధిలోని ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డి) వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు సోమవారం( ఏప్రిల్ 10, 2023)నుంచి అమల్లోకి వచ్చాయి. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల ఎఫ్డీలపై సాధారణ ఖాతాదారులకు 2.75 శాతం నుంచి 7.20 శాతం వరకు వడ్డీ రేటును కోటక్ మహీంద్రా బ్యాంకు చెల్లిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం నుండి 7.70 శాతం వరకు వడ్డీ రేట్లను చెల్లిస్తుంది. సాధారణ ఖాతాదారులతో పోల్చితే, సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటును అందిస్తుంది. (చిన్న రుణాలనుంచి..వరల్డ్ టాప్ బ్యాంకర్స్‌లో స్థానం దాకా! కిక్ అంటే ఇది!) అలాగే 390 రోజుల నుంచి రెండేళ్ల లోపు ఎఫ్డీలపై సాధారణ ఖాతాదారులకు గరిష్టంగా 7.20 శాతం, అలాగే సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.70 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. (మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ దెబ్బ! మస్క్‌కు భారీ ఝలక్!) ఎఫ్డీలపై కోటక్ మహీంద్రా బ్యాంకు ప్రస్తుత వడ్డీ రేట్లు 2 నుంచి మూడేళ్ల లోపు కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 7 శాతం 3 నుంచి నాలుగేళ్ల లోపు పరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 6.50 శాతం 4- 5 సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.25 శాతం 5 - 10 సంవత్సరాల వరకు కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 6.20 శాతం వడ్డీ రేటును బ్యాంకు చెల్లిస్తుంది. -
జీపే యూజర్లకు భారీగా క్యాష్‌బ్యాక్ సంచలనం: మీ రివార్డ్స్ చెక్ చేసుకోండి!
సాక్షి, ముంబై: ఆన్లైన్ చెల్లింపుల సంస్థ గూగుల్ పే ద్వారా కొంతమంది వినియోగదారులకు మనీ క్రెడిట్ అవ్వడం సంచలనంగా మారింది. కొంతమంది జీపే వినియోగదారుల ఖాతాల్లో అనూహ్యంగా ఏకంగా రూ. 88,000 వరకు జమ అవ్వడం కలకలం రేపింది. అయితే కంపెనీ వెంటనే లోపాన్ని గుర్తించి, క్రెడిట్ చేసిన మొత్తాలను సాధ్యమైన చోట వెనక్కి తీసుకుందిట. ఈ వార్త గుప్పుమనడంతో చాలామంది తమ ఖాతాలో ఏంత జమ అయిందా అని తెగ వెదికేశారట. అయితే ఇది అమెరికాలో జరిగిన పరిణామం మాత్రమే. భారతీయ వినియోగదారులకు ఇలాంటి క్రెడిట్స్ కు ఏ రకమైన సంబంధం లేదని గూగుల్ తెలిపింది. గూగుల్ పే యూజర్లకు స్క్రాచ్ కార్డ్స్ ద్వారా మహా అయితే రూ. 6 క్యాష్‌బ్యాక్ రివార్డ్స్ రావడమే గొప్ప. సాధారణంగా బెటర్ లక్ నెక్ట్స్ టైం అనే సందేశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటిది తాజాగా గూగుల్ పే యూజర్ల అకౌంట్లలోకి రూ.80 వేల వరకు ట్రాన్స్ఫర్ కావడంతో యూజర్లు గందరగోళంలో పడిపోయారు. గూగుల్ పే లో సాంకేతిక లోపం కారణంగానే ఈ పరిణామం చోటు చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా "డాగ్ఫుడింగ్" అనే ఫీచర్ పరీక్షిస్తున్న సమయంలో ఈ పొరబాటు దొర్లినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. కంపెనీ కొత్త ఫీచర్ టెస్టింగ్ సందర్భంగా తమ ఉద్యోగులకు చెల్లించే బదులు అనుకోకుండా నగదును కొంతమంది యూజర్లకు పంపించినట్టు సమాచారం. Uhhh, Google Pay seems to just be randomly giving users free money right now. I just opened Google Pay and saw that I have $46 in "rewards" that I got "for dogfooding the Google Pay Remittance experience." What. pic.twitter.com/Epe08Tpsk2 — Mishaal Rahman (@MishaalRahman) April 5, 2023 దీంతో పొరపాటున తమకు భారీగా డబ్బులు వచ్చినట్టు మిషాల్ రెహమాన్ అనే జర్నలిస్ట్ సహా కొంతమంది రెడిట్ యూజర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక్కొక్కరికి 10 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకు జమ అయిందట.అయితే ఎంతమంది వినియోగదారుకు ఈ క్రెడిట్ లభించింది అనేది అస్పష్టం. అలాగే ఈ నగదు జమ గూగుల్ పిక్సెల్ వినియోగదారులకు పరిమితమైందా? లేక ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లనుకూడా ప్రభావితం చేసిందా అనేది కూడా స్పష్టత లేదు. ఈ విషయంలో కొంత మంది యూజర్లను మెయిల్ ద్వారా సంప్రదించింది గూగుల్. వీలైనంత సొమ్మును వెనక్కి తీసుకుంది. అంతేకాదు సంబంధిత క్రెడిట్‌ను యూజర్లు వాడేసినా, వేరే ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసేసినా, తాము రివర్స్ చేయలేకపోతే, ఇక ఆ డబ్బు మీదే.. తదుపరి చర్యలు అవసరం లేదని కూడా గూగుల్ పేర్కొంది. మరోవైపు ఈ వ్యవహారంపై ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ కూడా ‘నైస్’ అంటూ వ్యంగ్యంగా స్పందించడం విశేషం. -
బార్లో రగడ..పదిమంది అరెస్టు
బార్లో సిబ్బందికి, కస్టమర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఘటనకు సంబంధించి పదిమందిని అరెస్టు చేశారు. ఈ ఘటన ముంబైలోని బార్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..నిన్న సాయంత్రం ముంబై బార్ సిబ్బందికి కస్టమర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలు ఒకరినొకరు చెప్పుతో కొట్టుకోవడం, కుర్చీలు విసురుకోవడం వంటివి చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఏడుగురు సిబ్బందిని, ముగ్గురు కస్టమర్లను అరెస్టు చేశారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. Mumbai Bar Brawl Caught On Camera, 10 Arrested Read here: https://t.co/djgS4TaDUJ pic.twitter.com/3nTUca4O7f — NDTV Videos (@ndtvvideos) April 8, 2023 (చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్‌దే హవా! శరద్ పవార్) -
ఎస్బీఎం కస్టమర్లకు అలర్ట్: ఆ క్రెడిట్ కార్డులపై బ్యాన్
సాక్షి, ముంబై: విదేశీ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్‌కు (State Bank Of Mauritius) అనుబంధ సంస్థ ఎస్బీఎం ఇండియా క్రెడిట్ కార్డు కస్టమర్లకు అలర్ట్. అన్ని కమర్షియల్ క్రెడిట్ కార్డులను బ్లాక్ చేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.ఫిన్‌టెక్ భాగస్వాములకు చెందిన కొందమంది కస్టమర్లకు జారీ చేయబడిన కార్పొరేట్ క్రెడిట్ కార్డ్‌ల వినియోగాన్ని మార్చి 31, 2023 నుంచి బ్లాక్ చేసింది. (IDBI: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్, పూర్తి వివరాలు చూడండి!) భారతదేశంలోని అనేక ఫిన్‌టెక్ ప్లేయర్లతో భాగస్వామ్యంతో అందించే కార్పొరేట్ క్రెడిట్ కార్డ్‌లను బ్లాక్ చేసింది. కేవేసీవివరాలను ఆయా ఖాతాల్లో అప్డేట్ చేయడానికి బ్లాక్ చేసినట్టు భావిస్తున్నారు. దీని ప్రకారం కేవైసీ అప్డేట్ తర్వాత ఎస్బీఎం బ్యాంక్ ఇండియా క్రెడిట్ కార్డులు యథావిధిగా పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో సంబంధిత కస్టమర్లు కేవైసీ వివరాలను నమోదు చేయాలి.(బంపర్ ఆఫర్: గూగుల్ పిక్సెల్ 7పై రూ.39 వేల తగ్గింపు) ఎస్బీఎం బ్యాంక్ ఇండియా పలు ఫిన్‌టెక్ కంపెనీల భాగస్వామ్యం కుదుర్చుకొని వివిధ రకాల క్రెడిట్ కార్డులను అందిస్తుంది. అయితే ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం నో యువర్ కస్టమర్ (KYC) వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే కస్టమర్లకు ఇ-మెయిల్స్ సమాచారాన్ని అందించింది ఎస్బీఎం బ్యాంక్ ఇండియా. అయితే తమకు సమాచారం అందిందని, తక్కువ టైం ఉందని కొంతమంది ఖాతాదారులు విమర్శిస్తున్నారు. కాగా ఎస్బీఎం బ్యాంకులో 10 లక్షలకుపైగా క్రెడిట్ కార్డు అకౌంట్లు ఉన్నాయి. సరళీకృత చెల్లింపు పథకం (LRS) కింద అన్ని లావాదేవీలను నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించిన దాదాపు ఒక నెల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. (ఇదీ చదవండి: షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు) -
సహారా కస్టమర్లకు గుడ్‌న్యూస్: ఇన్వెస్టర్లకు చెల్లింపులు
న్యూఢిల్లీ: సహారా గ్రూపునకు చెందిన నాలుగు కోపరేటివ్ (హౌసింగ్) సొసైటీల పరిధిలోని 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు, 9 నెలల్లోగా చెల్లింపులు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సెబీ వద్ద ఎస్క్రో ఖాతాలో సహారా గ్రూప్ డిపాజిట్ చేసిన రూ.24,000 కోట్ల నిధుల నుంచి రూ.5,000 కోట్లను సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్స్కు బదిలీ చేయాలంటూ జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. (ఇదీ చదవండి: మీకీ విషయం తెలుసా? ఈ డెబిట్ కార్డ్‌పై: రూ. కోటి దాకా కవరేజ్) ఓ ప్రజాహిత వ్యాజ్యం విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు రిటైర్ట్ జడ్జి ఆర్ సుభాష్ రెడ్డి చెల్లింపుల ప్రక్రియను పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది. పెద్ద ఎత్తున ప్రజల ప్రయోజనాలు ఇమిడి ఉండడంతో పిటిషనర్ల అభ్యర్థన సహేతుకంగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చిందని కోపరేషన్ శాఖ ప్రకటన విడుదల చేసింది. (రెడ్మి 12సీ, రెడ్మి నోట్12 వచ్చేశాయ్! అందుబాటు ధరలే) -
సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు..
న్యూఢిల్లీ: ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు జరిపే సాధారణ యూపీఐ చెల్లింపులపై ఎలాంటి చార్జీలు ఉండబోవని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) స్పష్టం చేసింది. ప్రీపెయిడ్ పేమెంట్ సాధానాల (పీపీఐ) ద్వారా జరిపే మర్చంట్ లావాదేవీలకు మాత్రమే ఇంటర్చేంజ్ చార్జీలు వర్తిస్తాయని, వాటికి సంబంధించి కస్టమర్లపై చార్జీల భారం ఉండబోదని ఒక ప్రకటనలో వివరించింది. ఇదీ చదవండి: కేజీ బేసిన్లో ఓఎన్జీసీ చమురు ఉత్పత్తి వాలెట్ల వంటి పీపీఐ సాధనాల ద్వారా రూ. 2,000కు మించి జరిపే చెల్లింపులపై 1.1 శాతం ఇంటర్చేంజ్ చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, బ్యాంకులు, ప్రీపెయిడ్ సాధనాలు, వ్యాపారవర్గాలకు మాత్రమే ఇది పరిమితం కానున్నప్పటికీ దీనితో కస్టమర్లపై చార్జీల భారం పడనుందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎన్పీసీఐ తాజా వివరణ ఇచ్చింది. మరోమాటలో చెప్పాలంటే ఒక కంపెనీకి చెందిన వాలెట్ గల కస్టమరు మరో కంపెనీ వాలెట్ ఉన్న వర్తకులకు చెల్లింపులు జరిపినప్పుడు ఈ చార్జీలు వర్తిస్తాయి. రెండు వాలెట్ల మధ్య లావాదేవీలకు సంబంధించిన ఇంటర్చేంజ్ ఖర్చులను సర్దుబాటు చేసుకోవడానికి ఈ చార్జీలు సహాయపడతాయి. ప్రస్తుతం మొబైల్ వాలెట్ పేమెంట్ మార్కెట్లో ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటివి ప్రధాన సంస్థలుగా ఉన్నాయి. బ్యాంకు ఖాతా లేదా పీపీఐ/పేటీఎం వాలెట్ ద్వారా చెల్లింపులు జరిపినా ఏ కస్టమరుకూ ఎటువంటి చార్జీలు ఉండవని పేటీఎం తెలిపింది. -
IPL 2023: జియో అదిరిపోయే ఆరు ప్రీపెయిడ్ ప్లాన్స్
సాక్షి, ముంబై: దేశంలో క్రికెట్ పండుగ ప్రారంభానికి ముందు టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో క్రికెట్ అభిమానులకు 6 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఐపీఎల్ 2023 మార్చి 31 నుంచి షురూ కానున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానుల కోసం ఈ కొత్త ప్లాన్లను జియో ప్రకటించింది. (జియో కస్టమర్లకు భారీ షాక్: ఎంట్రీ-లెవల్ బాదుడే మామూలుగా) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023కి ప్రారంభానికి ముందు రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ఆరు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది.ఐపీఎల్ , ఈసారిJioCinema యాప్‌లో వీక్షించే వినియోగదారులకు ఇవి మరింత సౌకర్యంగా మారనున్నాయి. 4కేలో గేమ్‌ను చూడాలంటే ఎక్కువ డేటా కావాల్సిందే. అందుకే జియో కస్టమర్ల కోసం ఆరు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. వీటిల్లో మూడు వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో పాటు అపరిమిత డేటాప్రయోజనాలతో వస్తాయి మిగిలిన మూడు డేటా యాడ్-ఆన్ వోచర్లు మాత్రమే అనేది గమనించాలి. (ఇదీ చదవండి: ఫాంటసీ క్రికెట్ యాప్ ‘క్రిక్‌పే’ లాంచ్... అదీ ఐపీఎల్‌కు ముందు) జియో రూ.999, రూ.399, రూ.219, రూ.222, రూ.444, రూ.667 ప్లాన్ల వివరాలు రూ.999: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. రోజూ 3జీబీ హై స్పీడ్ డేటా ఉచితం. ఇక అపరిమిత కాల్స్, రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా లభిస్తాయి. ఇవి కాకుండా మరో రూ.241 వోచర్ ఉచితంగా లభిస్తుంది. ఇందులో 40 జీబీ బోనస్ డే డేటా కూడా ఉంటుంది. రూ.399, రూ.219: ఈ రెండు ప్లాన్లలో రోజువారీ 3జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాల్స్. ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉంటాయి. రూ.399 ప్లాన్ లో రూ.61 విలువైన వోచర్ ఉచితంగా వస్తుంది. 6జీబీ అదనపు డేటా కూడా పొందొచ్చు. వ్యాలిడిటీ 28 రోజులు. 6 జీబీ బోనస్ డేటా రూ.219 ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు. రోజువారీ 3 జీబీ ఉచిత డేటాకు అదనంగా 2 జీబీ బోనస్ డేటా ఉచితం. (సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు) డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ డేటా యాడ్-ఆన్ వోచర్లు బేస్ ప్రీపెయిడ్ ప్లాన్‌పై అదనపు డేటా రూ.222ప్లాన్‌లో ప్రస్తుత ప్లాన్ ఎక్స్ పైరీ గడువు 50జీబీ డేటా లభిస్తుంది. రూ.444: ఈ ప్లాన్ లో 100 జీబీ డేటా లభిస్తుంది. వ్యాలిడిటీ 60 రోజులు. రూ.667 డేటా ప్యాక్ తో 150 జీబీ ఉచిత డేటా వస్తుంది. 90 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. -
జియో కస్టమర్లకు ట్విస్ట్ : ఎంట్రీ-లెవల్ రూ.199 ప్లాన్ ఇక రూ. 299లు
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో ఎంట్రీ లెవల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను రూ.199 నుండి రూ.299కి పెంచేసింది. 100 రూపాయిలు పెంచిన ఈ ప్లాన్‌లో మిగిలిన ప్రయోజనాల్నీ ఒకేలా ఉండగా, 5 జీబీ డేటా అదనంగా అందిస్తోంది. (ఇదీ చదవండి: ఫాంటసీ క్రికెట్ యాప్ ‘క్రిక్‌పే’ లాంచ్... అదీ ఐపీఎల్‌కు ముందు) కొత్త జియో రూ. 299 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ వెబ్సైట్ ప్రకారం, జియో ఎంట్రీ-లెవల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ. 299 నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 30జీబీ హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSల ఉచింతం అర్హతగల జియో సబ్స్క్రైబర్లు అపరిమిత 5జీ డేటాతో Jio వెల్కమ్ ఆఫర్‌ను పొందవచ్చు. (సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు) పాత జియో రూ. 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ పాత రూ. 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 25 జీబీ హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందించింది. JioPrime సభ్యత్వం కోసం రూ. 99 వసూలు చేస్తుంది. ఈ ప్లాన్ రూ JioTV, JioCinema, JioSecurity , JioCloud వంటి అంతర్గత యాప్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇపుడిక పాత ఎంట్రీ-లెవల్ పోస్ట్‌పెయిడ్ రూ. 199 ప్లాన్ కస్టమర్లకు అందుబాటులో లేదు. కాగా గత వారం రిలయన్స్ జియో పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం రూ. 299తో ప్రారంభమయ్యే జియో ప్లస్ పేరుతో నాలుగు కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాన్లు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. (Upasana Konidela:ఉపాసన అరుదైన ఘనత.. సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ!) -
గడువు సమీపిస్తోంది, ఖాతాదారులకు అలర్ట్: లేదంటే తప్పదు మూల్యం!
సాక్షి, ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) తన కస్టమర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. మార్చి 24, 2023లోపు సెంట్రల్ కేవైసీ (C-KYC)ని పూర్తి చేయాలని తన వినియోగ దారులను కోరింది. అలా చేయకపోతే భారీ మూల్యం తప్పదని కూడా హెచ్చరించింది. ఈ మేరకు అధికారిక ట్విటర్లో ఒ కప్రకటన జారీ చేసింది. నిర్ధేశిత సమయంలోపు బ్యాంకు వినియోగదారులు సెంట్రలైజ్డ్ నో యువర్ కస్టమర్ (సీ-కేవైసీ)ని పూర్తి చేయని పక్షంలో అకౌంట్ డీయాక్టివేట్ అవుతుందని తెలిపింది. ఇప్పటికే ఎస్ఎంఎస్, నోటీసులు సంబంధిత ఖాతాదారులకు పంపించామని, వెంటనే వారు సమీప ఖాతాను సందర్శించిన అవసరమైన పతత్రాలు సమర్పించాలని సూచించింది. మార్చి 24, 2023లోపు సెంట్రల్ KYC ప్రాసెస్‌ను పూర్తి చేయని కస్టమర్లు తమ ఖాతాలను యాక్సెస్ చేయడంలో ఇబ్బంది పడవచ్చు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) సీ-కేవైసీని నిర్వహిస్తుంది. దీంతో కస్టమరు బ్యాంకుకో, డీమ్యాట్ ఖాతాకో ఇలా ఏదో ఒకదానికి ఒకసారి నో యువర్ కస్టమర్ వివరాలిచ్చిన తరువాత డిజిటల్ ఫార్మాట్ సెంట్రలైజ్డ్ నంబరు కేటాయిస్తారు. కేవైసీ వివరాలకు ఈ నంబరు ఇస్తే సరిపోతుంది. అంటే కస్టమర్ ఒక్కసారి సీ-కేవైసీని పూర్తి చేశాక కొత్త ఖాతాలను తెరవడం, జీవిత బీమా, లేదా డీమ్యాట్ ఖాతా లాంటి విభిన్న ప్రయోజనాల కోసం మళ్లీ ప్రక్రియను కొనసాగించాల్సిన అవసరం లేదు. ఆ నంబరు తీసుకున్న ఆర్థిక సంస్థ ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. కేవైసీ ప్రాసెస్‌ను, కేవేసీ రికార్డ్లను సమర్థవంతంగా వినియోగించు కోవడం లక్ష్యాలుగా ‘సీ-కేవైసీ’ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. pic.twitter.com/HZOMQN9pbJ — Bank of Baroda (@bankofbaroda) March 13, 2023 -
ఎస్బీఐ షాకిచ్చిందిగా.. రేపటినుంచే అమలు
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజంస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది. తన బేస్ రేట్, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్లను పెంచింది. బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బీపీఎల్ఆర్)ని 70 బేసిస్ పాయింట్లు లేదా 0.7 శాతం పెంచింది. దీంతో బీపీఎల్ఆర్ రేటు 14.85 శాతానికి చేరింది. అలాగే పబ్లిక్ లెండర్ కూడా బేస్ రేటును 9.40 శాతం నుండి 10.10 శాతానికి పెంచింది. రేపటి(మార్చి15) నుంచి సవరించిన రేట్లు అమల్లోకి రానున్నాయి. దీంతో ఎస్సీబీలో రుణాలు తీసుకున్న వినియోగ దారుల నెలవారీ ఈఎంఐ పెరగనున్నాయి. అన్ని రుణాలకు వర్తించే కనీస రేటునే బేస్ రేటు అంటారు. అంటే నిర్ణయించిన రేటు కంటే తక్కువకు రుణాలివ్వడానికి వీలుండదు. ఇక బీపీఎల్ఆర్ అనేది బేస్ రేటుకు ముందున్న రుణాలకు మాత్రమే వర్తించే రేటు. అయితే ఫండ్స్ ఆధారిత రుణ రేట్ల మార్జినల్ రేటు యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. ఇది గృహ రుణాల రేటుపై ప్రభావం చూపదని తెలిపింది. ఎంసీఎల్ఆర్ అంటే బ్యాంకు ఖాతాదారులకు రుణాలు ఇచ్చే రేటు. కాగా ఫిబ్రవరి 15, 2023న 10 బేసిస్ పాయింట్లు లేదా 0.1 శాతం పెంచింది. దీని ప్రకారం ఒక సంవత్సరం రుణాలు, రెండేళ్ల,మూడేళ్ల రుణాలకు వర్తించే వడ్డీ రేట్లు వరుసగా 8.50 శాతం, 8.60 శాతం మరియు 8.70 శాతంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేక్రమంలో ఆర్బీఐ తన తాజా( ఫిబ్రవరి 8) నాటి పాలసీ రివ్యూలోరెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి పెంచింది. -
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఇక ఆ అవసరమే లేదు!
సాక్షి, ముంబై: రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) తన వినియోగ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్‌లైన టికెంట్ బుకింగ్ పద్ధతిని మరింత సులువు చేయనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ వాయిస్ సెంట్రిక్ ఈ-టికెటింగ్ ఫీచర్‌ను త్వరలోనే ఐఆర్సీటీసీ ప్రవేశపెట్టనుంది. తాజా నివేదికల ప్రకారం తొలి దశ టెస్టింగ్ విజయవంతమైంది. ఏఐ ఆధారిత చాట్‌బాట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇకపై ఐఆర్సీటీసీ లాగిన్ కావడానికి ఐడీ, పాస్వర్డ్, ఓటీపీలతో పనిలేకుండానే, కేవలం వాయిస్ ద్వారా రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు వివరాలు ఇవ్వడానికి బదులుగా, Actually అని చెబితే సరిపోతుంది. దీని కోసం కొన్ని అవసరమైన మార్పులతో AskDisha (డిజిటల్ ఇంటరాక్షన్ టు సీక్ హెల్ప్ ఏనీటైం)పరీక్షిస్తోంది. తొలి దశ పరీక్షలు విజయవంతం కావడంతో మలి దశ టెస్టింగ్‌ను మరింత వేగవంతం చేయనుంది. ఈ ఫీచర్‌ను వచ్చే 3 నెలల్లోనే కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దీని ద్వారా ఐఆర్సీటీసీ బ్యాకెండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్మెరుగ వుతుందని భావిస్తున్నారు. ఆస్క్ దిశ 2.0 ఫీచర్ రైలు ప్రయాణానికి సంబంధించి కస్టమర్లకు ప్రశ్నలకు సమాధానాలిస్తుంది. వీటిని హిందీ లేదా ఇంగ్లిష్‌లో ప్రశ్నలు అడగవచ్చు. ఇంగ్లిష్‌లో అయితే ‘యాక్చువల్లీ’ అనే పదంతో చాటింగ్‌ను స్టార్ట్ చేయాలి. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్ తన టిక్కెట్‌ను రద్దు చేసుకోవచ్చు. రద్దు చేసిన టికెట్ల నగదు రీఫండ్ స్థితిని, పీఎన్‌ఎర్ స్టేటస్‌ను కూడా చూడవచ్చు.అంతేకాదు ప్రయాణికులు బోర్డింగ్ లేదా డెస్టినేషన్ స్టేషన్‌ని కూడా మార్చుకోవచ్చు. రైలు టికెట్లను ప్రివ్యూ, ప్రింట్, షేర్ చేయవచ్చని తెలుస్తోంది. నిజానికి ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగం గత ఏడాది మార్చిలోనే ఈ ఫీచర్ గురించి ట్విటర్లో పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను కూడా వెబ్సైట్లో పొందుపర్చింది. -
ఐసీఐసీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్
సాక్షి, ముంబై: దేశీయ దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ)లపై వడ్డీ రేట్లను భారీగా పెంచింది. బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 7.15 శాతం వడ్డీ రేటును చెల్లించ నున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. డిపాజిట్ల రకాలు, వ్యవధి ఆధారంగా వడ్డీ రేట్లులో మార్పులుంటాయి. రూ.2 కోట్లకుపైన రూ.5 కోట్ల లోపు ఉండే ఎఫ్డీలపై వడ్డీ రేట్లను బ్యాంక్ పెంచింది. (ఇదీ చదవండి: సుమారు 5 వేలమంది సీనియర్లకు షాకిచ్చిన ఈ కామర్స్ దిగ్గజం) ప్రస్తుతం 4.75 శాతం నుంచి 7.15 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది ఐసీసీఐ. ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 23 నుంచి వర్తిస్తాయని బ్యాంక్ వెల్లడించింది. సవరించిన వడ్డీ రేట్లు నేటి (ఫిబ్రవరి 23 )నుంచే అమలులోకి వస్తాయని ఐసీఐసీఐ వెల్లడించింది. రెండు నుంచి మూడేళ్ల బల్క్ డిపాజిట్లపై 7.00 శాతాన్ని అలాగే 290రోజుల నుంచి రెండేళ్ల వ్యవధిలోని డిపాజిట్లపై అత్యధికంగా 7.15 శాతం వడ్డీని అందిస్తుంది. (నెలకు రూ.4 లక్షలు: రెండేళ...కష్టపడితే, కోటి...కానీ..!) సవరించిన బల్క్ ఎఫ్డీ వడ్డీ రేట్లు ♦ 7 - 29 రోజుల వ్యవధి డిపాజిట్లపై 4.75 శాతం ♦ 30 - 45 రోజులకు 5.50 శాతం ♦ 46 - 60 రోజులకు 5.75 శాతం ♦ 61 -90 రోజులకు 6.00 శాతం ♦ 91 -184 రోజులకు 6.50 శాతం ♦ 185 - 270 రోజులు 6.65 శాతం ♦ 3 నుంచి అయిదేళ్ల డిపాజిట్లపై 6.75 శాతం ♦ 5 -10 సంవత్సరాల డిపాజిట్లపై 6.75 శాతం కాగా ఇటీవల మానిటరీ పాలసీ రివ్యూలో ఆర్బీఐ రెపో రేటును పెంచిన సంగతివ తెలిసిందే. దీంతో అన్ని బ్యాంకులు వడ్డీరేట్లను సవరిస్తున్నాయి. ఇప్పటికే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీ వడ్డీ రేట్లను పెంచింది. సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 7.60 శాతం వరకు వడ్డీ రేటును ప్రకటించింది. ఈ సవరించిన రేట్లు ఫిబ్రవరి 21 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
దూసుకుపోతున్న జియో, ఎయిర్టెల్.. కొత్తగా ఎన్ని లక్షల కస్టమర్లంటే!
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా నవంబర్‌లో కొత్తగా 25 లక్షల మంది మొబైల్ కస్టమర్లను సొంతం చేసుకున్నాయి. వొడాఫోన్ ఐడియా 18.3 లక్షల మంది వినియోగదార్లను కోల్పోయింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకారం.. జియో నూతనంగా 14.26 లక్షల మందిని చేర్చుకుంది. దీంతో సంస్థ మొబైల్ చందాదార్ల సంఖ్య నవంబర్ చివరినాటికి 42.28 కోట్లకు చేరింది. భారతీ ఎయిర్టెల్ 10.56 లక్షల మంది కొత్త కస్టమర్ల చేరికతో మొత్తం సబ్స్క్రైబర్ల సంఖ్య 36.60 కోట్లను తాకింది. వొడాఫోన్ ఐడియా చందాదార్లు 24.37 కోట్లకు వచ్చి చేరారు. భారత్‌లో మొ త్తం మొబైల్ కనెక్షన్లు 114.3 కోట్లు ఉన్నాయి. చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా! -
నెలకు రూ.12వేలు పెన్షన్ కావాలా? ఇలా ట్రై చేయండి!
సాక్షి, ముంబై: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఇన్సూరెన్స్ కవర్‌తో పాటు,భారీ రాబడితో కస్టమర్ల ఆదరణతో మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది. తాజాగా ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. వినియోగదారులు ఒకసారి పెట్టుబడి పెట్టి నెలకు 11వేలు ఆర్జించే ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి ద్వారా నెలకు రూ.11000 ఎలా? ఎల్ఐసీ కొత్త జీవన్ శాంతి పథకంలో పెట్టుబడి పెట్టగల కనీస మొత్తం రూ. 1.5 లక్షలు. ఈ పథకం ద్వారా 12వేల కనీస రాబడి లభిస్తుంది. అలాగే ఈ పథకంలో పెట్టుబడి మొత్తంపై గరిష్ట పరిమితి లేదు.. ఎంతయినా ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే నెలకు రూ. 11,000 కంటే ఎక్కువ సంపాదించాలంటే మాత్రం కనీసం రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. తద్వారా ఈ ప్లాన్ ద్వారా నెలవారీ పెన్షన్ రూ. 11,192 పొందవచ్చు. అలాగే జాయింట్ లైఫ్ డిఫర్డ్ యాన్యుటీ విషయంలో, నెలవారీపెన్షన్ రూ. 10,576. మరింత సమాచారం కోసం LIC ఎల్ఐసీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. -
రూ.61లకే కొత్త ప్లాన్‌తో వచ్చిన రిలయన్స్ జియో.. ఆ కస్టమర్లకు పండగే!
దేశంలో 5జీ సేవల ప్రారంభంతో టెలికాం సంస్థలు.. ఈ సర్వీసులను అన్నీ నగరాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. మరో వైపు కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి. ఇందులో ఓటీటీ బెనిఫిట్స్, అన్లిమిటెడ్ కాలింగ్, డేటా ఇలా పలు రకాలు సేవలను తక్కవ ధరకే కస్టమర్లకు ఆకర్షించేలా సరికొత్త ప్లాన్లను తీసుకొస్తున్నాయి. టెలికాం కంపెనీలు ఎన్ని కొత్త ప్లాన్లు తీసుకొచ్చినా దాదాపు తక్కువ రీఛార్జ్‌తో ఎక్కువ బెనిఫిట్స్ ఉండేలా జాగ్రత్త పడుతుంటాయి. తాజాగా ప్రముఖ టెలికాం దిగ్గజం 'రిలయన్స్ జియో' తన యూజర్ల కోసం కొత్త రీచార్జ్ ప్లాన్‌ని ప్రకటించింది. డేటా ఎక్కువ ఉపయోగిస్తున్న కస్టమర్లకు దృష్టిలో ఉంచుకుని వారి కోసం ప్రత్యేకంగా ఓ ఆఫర్‌ని తీసుకొచ్చింది రిలయన్స్ జియో. ఇంటర్నెట్ స్పీడ్‌తో పాటు వీడియో కాలింగ్ యూజర్లు కోసం ప్రత్యేకంగా రూ. 61 రీఛార్జ్ ప్లాన్ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులకు పలు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో తక్కువ ధరకే 6 GB డేటాను లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ మీ ఇతర ప్లాన్ ఉన్నంత వరకు ఉంటుంది. చదవండి: ఉద్యోగులకు ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ మరో షాక్! -
కొత్త సంవత్సరం.. కస్టమర్లకు షాకిచ్చిన బ్యాంక్!
ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ కొత్త సంవత్సరం తన కస్టమర్లకు షాకిచ్చింది. జనవరి నెల నుంచి రుణ రేట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారిపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం పడనుంది. తాజా పెంపుతో రుణగ్రహితలపై అధిక వడ్డీల భారం పడనుంది. ఇప్పటికే పలు బ్యాంకుల తమ వడ్డీరేట్లను పెంచిన సంగతి తెలిసిందే. కెనరా బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR) 15 నుంచి 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజాగా ప్రకటించిన పెంపు నిర్ణయం జనవరి 7 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. రేట్ల పెంపు తర్వాత వీటిపై లుక్కేస్తే.. ఓవర్ నైట్, ఒకనెల రోజులకు ఎంసీఎల్ఆర్ రేటు 7.5 శాతంగా ఉండగా, 3 నెలలకు ఎంసీఎల్ఆర్ 7.85 శాతంగా ఉంది. 6 నెలల ఎంసీఎల్ఆర్ 8.2 శాతం, ఇక ఏడాది ఎంసీఎల్ఆర్ 8.35 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం పెంచిన కొత్త రేట్లు కారణంగా ఇకపై కొత్తగా రుణాలు తీసుకునే వారికి వర్తించనున్నాయి. వీటితో పాటు రెన్యూవల్, రీసెట్ డేట్ తర్వాత కూడా ఈ కొత్త రుణ రేట్లు అమలులోకి వస్తాయి. చదవండి: అమెజాన్: భారత్‌లో ఊడిన ఉద్యోగాల సంఖ్య ఇది -
కొత్త ఏడాదిలో యూజర్లకు షాక్.. ఆ ఓటీటీ పాస్వర్డ్ షేర్ చేస్తే పైసలు కట్టాలి!
కరోనా లాక్డౌన్ కారణంగా ఓటీటీ చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇది వందల కోట్ల నుంచి వేల కోట్ల మార్కెట్‌గా అవతరించింది. ఇందులో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అత్యంత జనాదరణ పొందడంతో పాటు కాస్త ఖరీదైన ఓటీటీగా పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరంలో నెట్‌ఫ్లిక్స్ తన కస్టమర్లకు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యూజర్లకు షాక్.. నో షేరింగ్ సంవత్సరాలుగా, నెట్‌ఫ్లిక్స్ తన చందాదారులను కోల్పోవడానికి పాస్వర్డ్ షేరింగ్ ప్రధాన కారణాలలో ఒకటిగా పేర్కొంది. ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ ఒక ఇంటిని దాటి పాస్వర్డ్ షేరింగ్‌ను నిలిపివేయడం ద్వారా ఈ సమస్యకు ముగింపు పలకాలని యోచిస్తోందట. ఓటీటీ సంస్థలు ఇప్పటి వరకు పాస్ వర్డ్ షేరింగ్ అవకాశాన్ని కల్పించాయి. ఒకరికి అకౌంట్ ఉంటే సుమారు నలుగురు పాస్ వర్డ్ షేర్ చేసుకునే అవకాశం ఉండేది. ఒక్కరు రీఛార్జ్ చేసుకుంటే మిగతా వారంతా ఉచితంగా కంటెంట్ ను చూసే అవకాశం ఉంటుంది. అయితే, ఇకపై పాస్ వర్డ్ షేరింగ్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ పాస్వర్డ్ షేరింగ్‌పై నిషేధానికి సంబంధించిన కొత్త విధానాన్ని 2023 లోపు యునైటెడ్ స్టేట్స్లో అమలు చేయనుంది. ఆ తర్వాత ఈ రూల్‌ని మిగిలిన దేశాలకు అమల్లోకి తీసుకురావాలిని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోంది. ఇదిలా ఉండగా.. పాస్వర్డ్ షేరింగ్ బ్యాన్ కాకుండా, నెట్‌ఫ్లిక్స్ కొత్త నియమాన్ని కూడా అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూజర్లు వారి సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించి పే-పర్-వ్యూ కంటెంట్‌ను అద్దెకు తీసుకునేలా వీలు కల్పిస్తుంది. వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్ అతి త్వరలోనే ప్రకటన-ఆధారిత సబ్స్క్రిప్షన్ ప్యాకేజీని ప్రారంభించే ప్లాన్‌లో ఉంది. దీని ట్రయల్స్ 2023లో మొదలుపెట్టేందుకు యోచిస్తోంది. నెట్‌ఫ్లిక్స్( Netflix ), అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), హెచ్‌బీఓ (HBO) వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఇప్పటికే యునైటెడ్ కింగ్డమ్లో పాస్వర్డ్ షేరింగ్ చట్టవిరుద్ధం అని, ఇది తమ కాపీరైట్ చట్టానికి విరుద్ధమని పేర్కొన్నాయి. మరో వైపు నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ రేటు కూడా గణనీయంగా పడిపోయింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ యూజర్లుకు తమ పాస్‌వర్డ్‌లను ఇతరులతో షేరింగ్ చేసుకునే వెసలుబాటును నిలిపేవేయనుంది. చదవండి: అవును.. కొత్త ఏడాది కలిసొచ్చే కాలమే, ఎందుకో తెలుసా? -
ఉండేందుకైనా, అద్దెకైనా అవే కావాలి.. ఆ ఇళ్లకు బీభత్సమైన డిమాండ్!
సాక్షి, హైదరాబాద్: సొంతంగా ఉండేందుకైనా, అద్దెకు ఇవ్వడానికైనా మూడు పడక గదుల గృహాలకే నగరవాసులు జై కొట్టారు. అత్యధికంగా 56 శాతం మంది గ్రేటర్‌వాసులు 3 బీహెచ్‌కే, ఆపై ఇళ్లకు ఆసక్తి చూపించగా.. 41 శాతం మంది మాత్రం 2 బీహెచ్‌కే మొగ్గుచూపించారు. 3 శాతం మంది సింగిల్ బెడ్రూమ్ కోసం శోధించారని మ్యాజిక్ బ్రిక్స్ ‘హోమ్ సెర్చ్–2022’ సర్వే వెల్లడించింది. 71% మంది గృహ కొనుగోలుదారులు బహుళ అంతస్తుల భవనాల కోసం శోధించగా.. 25 శాతం మంది మాత్రం వ్యక్తిగత గృహాలు, విల్లాల కొనుగోలుకు ఆసక్తి చూపించారు. ► 41 శాతం మంది 1,000 చదరపు అడుగులు (చ.అ.) నుంచి 1,500 చ.అ. మధ్య విస్తీర్ణం ఉండే గృహాలకు జై కొట్టారు. 23 శాతం మంది రూ.50–75 లక్షల మధ్య ధర ఉండే ప్రాపర్టీల కోసం వెతకగా.. 20 శాతం మంది మాత్రం రూ.25–50 లక్షల మధ్య ధర ఉండే గృహాల కోసం పరిశోధన చేశారు. 4వ స్థానం.. దేశంలోని ప్రధాన నగరాలలో నిర్వహించిన సర్వేలో చూస్తే.. 2022లో గృహ కొనుగోలుదారులను ఆకర్షించిన నగరాల జాబితాలో హైదరాబాద్ నాల్గో స్థానంలో నిలిచింది. తొలి బెంగళూరు, ఆ తర్వాత ముంబై, పుణే నగరాలు నిలిచాయి. 80 శాతం మంది అపార్ట్మెంట్లకే మొగ్గు చూపించారు. అయితే ఈ డిమాండ్ 2021లో 67 శాతం, 2020లో 57 శాతంగా ఉంది. అత్యధికంగా 35 శాతం మంది రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉండే గృహాల కొనుగోలుకు ఆసక్తి చూపించగా.. 25 శాతం మంది రూ.1–2 కోట్లు, 16 శాతం మంది రూ.2 కోట్లపైన, 19 శాతం మంది రూ.25–50 లక్షల మధ్య, 5 శాతం మంది రూ.25 లక్షల లోపు ధర ఉన్న ఇళ్లకు మొగ్గు చూపించారు. అయితే అద్దెకు ఇవ్వడానికైతే 26 శాతం 2 బీహెచ్‌కే యూనిట్లకు, 35 శాతం మంది 3 బీహెచ్‌కే, 19 శాతం సింగిల్ బెడ్రూమ్లకు జై కొట్టారు. ఈ ప్రాంతాలు హాట్‌స్పాట్స్.. ప్రధానంగా కొండాపూర్, మియాపూర్, గచ్చిబౌలి, మణికొండ, బీరంగూడ ప్రాంతాలలో గృహాల కొనుగోలు కోసం నగరవాసులు తెగ పరిశోధన చేశారు. ఇక అద్దెల కోసం అయితే పశ్చిమ హైదరాబాదే నగరవాసుల మోస్ట్ హాట్ డెస్టినేషన్‌గా నిలిచింది. ప్రధానంగా గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్పల్లి, హైటెక్‌సిటీ, మాదాపూర్ ప్రాంతాలలోని గృహాలను అద్దెకు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల అద్దె కోసం యజమానులు ఆసక్తి చూపించారు. చదవండి: అయ్యో.. ఎలన్ మస్క్! సంచలన పతనం.. మానవ చరిత్రలో కనీవినీ ఎరుగని నష్టం! -
న్యూ ఇయర్ ఆఫర్ అదరహో.. ఎయిర్టెల్ యూజర్లుకు 50జీబీ డేటా ఫ్రీ!
కొత్త సంవత్సరం రాబోతున్న సందర్భంగా పలు కంపెనీలు తమ కస్టమర్ల ఆకట్టుకునేందుకు ఆఫర్లును ప్రకటిస్తున్నాయి. దేశీయ టెలికాం రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న భారతీ ఎయిర్టెల్ తాజాగా న్యూ ఇయర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఎయిర్టెల్ వినియోగదారుల కోసం ఉచితంగా 50 జీబీ డేటా (Data) ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫ్రీ డేటా ఆఫర్ పొందాలనుకున్న కస్టమర్లు ఏం చేయాలంటే.. ఎయిర్టెల్ కంపెనీ కొత్త ఏడాదిని పురస్కరించుకుని వింక్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ తీసుకునే యూజర్లకు 5 జీబీ నుంచి 50 జీబీ డేటాను ఆఫర్‌ను అందిస్తోంది. వినియోగదారులు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే.. యాడ్స్ లేకుండా మ్యూజిక్ ఎంజాయ్ చేయడం, డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు ఇలా వివిధ రకాల ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే.. ఎయిర్టెల్ యూజర్లు వింక్ మ్యూజిక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను నెల రోజులు తీసుకుంటే వారి 5 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రూ. 98కే ఈ సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. 50 జీబీ డేటా ఉచితంగా పొందాలంటే మీరు ఏడాది వింక్ మ్యూజిక్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని విలువ రూ. 301గా ఉంది. గమనించాల్సిన విషయం ఎంటంటే.. ఇక్కడ ఎవరైతే వింక్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకే ఈ ఉచిత డేటా ఆఫర్ వర్తిస్తుంది. చదవండి: వేల సంఖ్యలో ఉద్యోగాల కోత.. అక్కడ మాత్రం జాబ్ ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయ్! -
స్వరా ఫైనాన్స్ కస్టమర్లకు నివాబూపా కవరేజీ
న్యూఢిల్లీ: స్వరా ఫైనాన్స్‌తో నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఒప్పందం చేసుకుంది. దీనికింద స్వరా ఫైనాన్స్ నుంచి రుణాలు తీసుకునే వారికి ‘ఎక్స్‌ప్రెస్ హెల్త్ – సీరియస్ ఇల్నెస్ ప్లాన్ బెనిఫిట్’ను ఆఫర్ చేయనుంది. ఈ ప్లాన్ ఏడాది, రెండేళ్ల కాలానికి లభిస్తుంది. స్వర ఫైనాన్స్ రుణ గ్రహీతలు ఈ ప్లాన్ తీసుకుని, ఏదైనా అనారోగ్యంతో ఐదు రోజులు, అంతకుమించి ఎక్కువ కాలానికి హాస్పిటల్లో చేరినప్పుడు.. మూడు ఈఎంఐలను నివా బూపా చెల్లిస్తుంది. నేడు గ్రామీణ ప్రాంతాల్లో 20 శాతం మందికి ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేదని.. ఈ అంతరం పూడ్చేందుకు స్వరా ఫైనాన్స్‌తో కలసి ఈ పాŠల్న్తో ముందుకు వచ్చామని నివాబూపా తెలిపింది. బ్యాంకుల పరిధిలో లేని కస్టమర్లకు స్వరా ఫైనాన్స్ రూ.50వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు ఇస్తుంటుంది. చదవండి: ముకేశ్ అంబానీ రిలయన్స్ పగ్గాలు చేపట్టి 20 ఏళ్లు.. ఆదాయం, లాభాలు ఎన్ని రెట్లు పెరిగాయో తెలుసా? -
కస్టమర్లకు ట్రూ 5జీ సేవలు.. రిలయన్స్ జియోతో జతకట్టిన షావోమి ఇండియా!
దేశంలోని నంబర్ వన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమి ఇండియా, రిలయన్స్ జియోతో భాగస్వామ్యం కుదుర్చుకుని వినియోగదారులకు 'ట్రూ 5 జీ' అనుభవాన్ని అందిస్తోంది. షియోమి, రెడ్ మి స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అంతరాయం లేని ట్రూ 5 జీ కనెక్టివిటీని యాక్సెస్ చేసుకోవడానికి, అంతరాయం లేని వీడియోలను స్ట్రీమ్ చేయడానికి, అధిక రిజల్యూషన్ వీడియో కాల్స్ ఆస్వాదించడానికి, వారి పరికరాలలో తక్కువ-లేటెన్సీ గేమింగ్ ఆడటానికి ఈ అనుబంధం వీలు కల్పిస్తుంది. జియో ట్రూ 5 జీస్టాండ్‌లోన్ (ఎస్ఎ) నెట్ వర్క్‌ను యాక్సెస్ చేసుకోవడానికి వినియోగదారులు తమ షియోమి, రెడ్ మి స్మార్ట్ ఫోన్ స్టెట్టింగ్‌లలో ఇష్పడే నెట్ వర్క్‌ను 5జీకి మార్చాలి. రిలయన్స్ జియో ట్రూ 5 జీ ఎస్ఎ నెట్ వర్క్ లో సజావుగా పనిచేయడానికి ఎస్ఎ నెట్ వర్క్ మ్దదతు ఇచ్చే మోడళ్లు సాఫ్ట్వేర్ అప్డేట్ పొందాయి. 5జీ స్టేవలు పొందే పరికరాలలో ఎంఐ 11 అల్ట్రా 5జీ, షియోమి 12ప్రో 5జీ, షియోమి 11ట్రీ ప్రో 5జీ, రెడ్ మి నోట్ 11 ప్రో+ 5జీ, షియోమి 11 లైట్ ఎన్ 5జీ, రెడ్ మి నోట్ 11టీ 5జీ, రెడ్ మి 11 ప్రైమ్ 5జీ, రెడ్ మి నోట్ 10టీ 5జీ, ఎంఐ 11ఎక్స్ 5జీ, ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ, రెడ్ మి కే50ఐ 5జీ, షియోమి 11ఐ 5జీ, షియోమి 11ఐ హైపర్ ఛార్జ్ 5జీ ఉన్నాయి. రెడ్ మీ కే50ఐ, రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్ఫోన్లను రిలయన్స్ జియో ట్రూ 5జీ నెట్‌వర్క్‌తో పరీక్షించారు. ప్రస్తుతం షియోమి, రెడ్ మీ నుంచి చాలా 5 జీ ఎనేబుల్ అయిన పరికరాలు రిలయన్స్ జియో ట్రూ 5 జీ నెట్ వర్క్ తో బాగా పనిచేస్తున్నాయి. ఈ భాగస్వామ్యం గురించి షియోమీ ఇండియా ప్రెసిడెంట్ మురళికృష్ణన్ మాట్లాడుతూ “గత రెండేళ్లుగా షియోమి #IndiaReady5G చేయడానికి కట్టుబడి ఉంది. మేము 5 జీ విప్లవానికి నాయకత్వం వహిస్తున్నాం. మా స్మార్ట్ఫోన్లు టాప్- ఆఫ్- లైన్ ఫీచర్లతో ఆకర్షణీయమైన 5 జీ అనుభవాన్ని అందిస్తున్నాయన్నారు. ఈ అనుబంధం గురించి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.., “కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడానికి, తన వినియోగదారుల చేతుల్లోకి అత్యాధునిక ఆవిష్కరణలను తీసుకురావడానికి షియోమి ఎప్పుడూ ముందంజలో ఉందన్నారు. వారితో కలిసి తమ వినియోగదారులకు 5జీ సేవలు అందించడంతో సంతోషంగా ఉందన్నారు. జియో ట్రూ 5 జీ మూడు రెట్లు ప్రయోజనాన్ని కలిగి ఉండడంతో పాటు భారత్‌లో ఏకెైక ట్రూ 5జీ నెట్ వర్క్‌గా నిలిచింది 1. 4జి నెట్ వర్క్ పై జీరో డిపెండెన్సీతో అధునాతన 5 జీ నెట్ వర్క్ తో 5 జీ ఆర్కిటెక్చర్ 2. 700 MHz, 3500 MHz , 26 GHz బ్యాండ్ల లో 5జీ స్పెక్ట్రం అతిపెద్ద, అత్యుత్తమ మిశ్రమం 3. క్యారియర్ అగ్రిగేషన్ అనే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ 5 జీ ఫ్రీక్వెన్సీలను ఒకే బలమైన "డేటా హైవే"గా సజావుగా మిళితం చేసే కాయరియర్ అగ్రిగేషన్. చదవండి: Meesho Shopping Survey: ఆన్లైన్ షాపింగ్ అంటే ఆ ఒక్కరోజే, ఎగబడి కొనేస్తున్నారు! -
ఆన్లైన్ షాపింగ్ అంటే ఆ ఒక్కరోజే, ఎగబడి కొనేస్తున్నారు!
ఆదివారాలంటే విశ్రాంతి తీసుకోవడానికే అని భావించవచ్చు కానీ, అది ఒకప్పుడు భారతీయులు మాత్రం ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి ఆదివారమే అత్యంత అనువైన రోజుగా భావిస్తున్నారు. ఆ రోజున బిజీ బిజీగా కొనుగోళ్లు సాగిస్తున్నారు. ఈ–కామర్స్ సంస్థ మీషో... తన డేటా ఆధారంగా జరిపిన ఇ షాపింగ్ 2002 అధ్యయనం ఇలాంటి పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. వీటిలో... ► ఈ ఏడాది ఈ కామర్స్ షాపర్స్.. ఆదివారం ఎక్కువగా కొనుగోళ్లు జరిపారు. అంతకు ముందు సంవత్సరం అత్యధిక కొనుగోళ్లు జరిపింది బుధవారం, అలాగే ప్రతి రోజూ రాత్రి 8 గంటలకు షాపింగ్ ప్రైమ్‌టైమ్‌గా కొనసాగింది. గత 2021లో మధ్యాహ్నం 2–3 గంటలలో అధికంగా ఈ– ట్రాఫిక్ కనిపించేది. ►2022లో ఎక్కువ మంది వెదికిన రెండవ ఉత్పత్తిగా స్మార్ట్ వాచ్ నిలిచింది. ఇది శారీరక ఆరోగ్యంపై, వ్యాయామాల పట్ల పెరిగిన ఆసక్తికి అద్దం పడుతోంది. ► గ్రూమింగ్ ఉత్పత్తులపై పురుషులు అమితాసక్తి చూపుతున్నారు. తృతీయశ్రేణి, నాల్గవ శ్రేణి నగరాల మార్కెట్ల నుంచి 60% కు పైగా ఆర్డర్లు లభించాయి. ► ద్వితీయశ్రేణి నగరాల నుంచీ శానిటరీ న్యాప్కిన్స్కు ఆర్డర్లు 9 రెట్లు పెరిగాయి. ఇది మహిళలకు ఈ–కామర్స్ ఏ విధంగా చేరువవుతుందో తెలియజేస్తుంది. ► దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి నిమిషానికి 148 చీరలు కొనుగోలు చేశారు. అలాగే రోజుకు 93వేల టీషర్టులు, 51, 275 బ్లూ టూత్ ఇయర్ఫోన్లు, 21,662 లిప్స్టిక్స్ విక్రయం జరిగింది. ► వినియోగదారులు స్థానిక ల్యాండ్‌మార్క్‌లు అయిన పిపాల్ క పేడ్, బర్గాద్ కా పేడ్, అట్టా చక్కీ కీ పీచే నియర్ వాటర్ ట్యాంక్ వంటివి వినియోగించడం ద్వారా డెలివరీ పర్సనల్‌కు సహాయపడ్డారు. దేశీ నేవిగేషన్ టూల్ కచ్చితత్త్వం ముందు డిజిటల్ మ్యాప్స్ పోటీపడలేవని ఇది వెల్లడిస్తుంది. ► ఈ సంవత్సరం అమ్మకాల పరంగా ఆంధ్రప్రదేశ్ వినియోగదారులు కొనుగోలు చేయడానికి అమిత ఆసక్తిని కనబరిచిన ఉత్పత్తులలో స్మార్ట్ వాచ్‌లు, వైర్లెస్ హెడ్‌ఫోన్స్, ఇయర్ ఫోన్స్, బాడీ లోషన్స్ కుర్తీలు ఉన్నాయి. ఈ షాపింగ్.. పదనిసలు... ► గతంలో ఎన్నడూ లేనంతగా పురుషులు గ్రూమింగ్ మీద ఖర్చు చేశారు. ► జిమ్ ఎక్విప్ మెంట్‌కి సంబంధించిన ఆర్డర్స్ దాదాపుగా 3 రెట్లకు పైనే పెరిగిపోయాయి. ► అత్యధిక సంఖ్యలో యోగామ్యాట్స్ కొన్న నగరాల్లో బెంగుళూర్, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌లు ఉన్నాయి. ► ప్రతీ 10 పుస్తకాల్లో 8 పుస్తకాలకు ఆర్డర్స్ ద్వితీయశ్రేణి నగరాలు, మార్కెట్ల నుంచే వచ్చాయి. చదవండి: MNCs Quitting India: భారత్‌ను వదిలి వెళ్లిపోతున్న దిగ్గజ కంపెనీలు.. కారణం అదే! -
ఎల్ఐసీ కస్టమర్లకు గుడ్ న్యూస్: ఇక ఆ అవసరమే ఉండదు
LIC WhatsApp Service: దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) వినియోగదారులకు అద్భుతమైన వార్త అందింది. పాత, కొత్త పాలసీ వివరాలు, ప్రీమియం, బోనస్ ఇతర సర్వీసులపై తన కస్టమర్లకు పూర్తి సమాచారం అందించేలా వాట్సాప్ సర్వీస్‌ను ఎల్ఐసీ ప్రారంభించింది. ఇకపై ప్రతీ చిన్న పనికి ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఏజెంట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఈ చక్కటి అవకాశాన్ని అందిస్తోంది. ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ వాట్సాప్ సర్వీస్ ప్రారంభమైందంటూ శుక్రవారం ట్వీట్ చేశారు. తమ పాలసీ వివరాలను ఎల్ఐసీ పోర్ట్‌లో రిజస్టర్ చేసుకున్న రిజిస్టర్డ్ మెంబర్స్‌కు ఈ సేవలు అందుబాటులో ఉంటాయిని తెలిపారు. (లగ్జరీ కారు కొన్న కుమార్తెలు: గర్ల్ పవర్ అంటున్న మ్యూజిక్ డైరెక్టర్) వాట్సాప్ నంబర్ ద్వారా అనేక సేవలు రిజిస్టర్డ్ వినియోగదారులు మొబైల్ ఫోన్ నుండి ‘8976862090’నంబర్‌కు 'హాయ్' అని మెసేజ్ పంపితే చాలు.. క్లయింట్లు ఎలాంటి సమాచారాన్నైనా పొందవచ్చు. (మారుతి కార్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్: ఆ కారణం చెప్పి..!) ►ప్రీమియం బకాయి ► బోనస్ సమాచారం ► పాలసీ స్థితి ►లోన్ అర్హత కొటేషన్ ►లోన్ రీపేమెంట్ కొటేషన్ ►చెల్లించవలసిన రుణ వడ్డీ ► ప్రీమియం చెల్లింపు సర్టిఫికేట్ ►ULIP-యూనిట్ల స్టేట్మెంట్ ►LIC సర్వీస్ లింక్‌లు ►సేవలను ప్రారంభించడం/నిలిపివేయడం ఎలా నమోదు చేసుకోవాలి? ► పాలసీ నంబర్స్, ఇన్స్టాల్మెంట్ ప్రీమియం, పాస్‌పోర్ట్ లేదా పాన్ కార్డ్ స్కాన్ చేసిన కాపీ (ఫైల్ సైజ్ 100kb) ►ఎఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ‘కస్టమర్ పోర్టల్’ ఎంచుకోవాలి. ►మీరు ఇంతకు ముందు నమోదు చేసుకోకుంటే, ‘న్యూ యూజర్’పై క్లిక్ చేయండి. ►బేసిక్ సర్వీసెస్‌లో వినియోగదారు ID, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. పాలసీ వివరాలను నమోదు చేసి యాడ్ పాలసీని సెలెక్ట్ చేయాలి. దీంతో మీ పాలసీ వివరాలన్నీ స్వయంచాలకంగా రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో రిజిస్టర్ అయి ఉంటాయి. కాగా ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్, కొత్త టెక్-టర్మ్ అనే రెండు ప్లాన్లు ఇటీవలే పునఃప్రారంభం చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం విడుదల చేసిన ఈ రెండు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను మళ్లీ లాంచ్ చేశామని ఎల్ఐసీ తెలిపింది. ఈ పాలసీలు ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో లేదా ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. -
ICICI ఖాతాదారులకు సూపర్ గుడ్ న్యూస్
-
ఆన్లైన్ షాపింగ్ మోసాలు: రూల్స్ ఏం చెప్తున్నాయి, ఎలా కంప్లైంట్ చేయాలి!
మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రస్తుతం భారత ప్రజలు డిజిటలైజేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కరోనా దెబ్బకు అంతా ఆన్లైన్ వైపు మళ్లారు. ఇటీవల ఇంటర్నెట్ వినియోగం పెరగడం, మరో వైపు ఆన్లైన్ లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. పుడ్, దుస్తులు, వస్తువులు ఇలా ప్రతీది నెట్టింట చెల్లిస్తూ ఇంటికే పరిమితం అవుతున్నారు ప్రజలు. వీటి కారణంగా దేశంలోని ఇ-కామర్స్ కంపెనీల వ్యాపారంలో నిరంతర వృద్ధి నమోదు అవుతోంది. ఈ క్రమంలో అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart), మింత్రా ( Myntra), జియో మార్ట్ (Jio Mart) కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు , డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. కొన్నిసార్లు కస్టమర్లు ఈ ఆన్లైన్ షాపింగ్‌లో మోసాలకు గురవుతుంటారు. అయితే మనం నేరుగా షాపింగ్ చేసిన వాటిలో మోసాలకు పాల్పడితే ఫలానా వ్యక్తిని వెళ్లి ప్రశ్నించవచ్చు. కానీ ఆన్లైన్ అలా కుదరుదు. వీటికంటూ ప్రత్యేక నియమాలు ఉంటాయి. ఈ క్రమంలో ఫిర్యాదుకు సంబంధించిన నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో ఓ సారి చూద్దాం! ఇవే నిబంధనలు... ఈ తరహా మోసాలకు సంబంధించి భారత ప్రభుత్వ వినియోగదారుల విభాగం కొన్ని నిబంధనలను రూపొందించింది. దీని ప్రకారం, ఈ-కామర్స్ వెబ్‌సైట్‌కు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే, అతను దీన్ని సులభంగా చేయగల హక్కు కస్టమర్‌కు ఉంది. నిబంధనల ప్రకారం, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఏదైనా కస్టమర్ ఫిర్యాదుపై 48 గంటల్లోగా స్పందించాలి. కస్టమర్ ఫిర్యాదును స్వీకరించిన తర్వాత, సదరు కంపెనీ ఆ ఫిర్యాదును ఒక నెలలోపు పరిష్కరించడం కూడా తప్పనిసరి. కస్టమర్లు తమ ఫిర్యాదులను కంపెనీ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా, సందేశం పంపడం ద్వారా లేదా వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకుని సమస్యను పరిష్కరించుకోవచ్చు. చదవండి: అమ్మకానికి బంకర్.. అణుదాడి జరిగినా తప్పించుకోవచ్చు! -
కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఐఓబీ
చెన్నై: ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) డిపాజిట్ రేట్లను పెంచింది. రిటైల్ టర్మ్ డిపాజిట్ రేట్లు 60 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ పెరిగినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 10 నుంచి తాజా రేట్లు అమల్లోకి వస్తాయని తెలపింది. ప్రకటన ప్రకారం, దేశీయ, నాన్-రెసిడెంట్ డిపాజిటర్లు 444 రోజులు, మూడేళ్లు, ఆపైన డిపాజిట్లపై 7.15 శాతం వరకూ వడ్డీరేటును పొందుతారు. 270 రోజుల నుంచి యేడాది, ఏడాది నుంచి మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటు 60 బేసిస్ పాయింట్ల వరకూ పెరిగింది. -
వారెవ్వా.. ఆ బ్యాంక్ కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు!
ప్రైవేట్ రంగంలో దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై (Fixed Deposits) మరోసారి వడ్డీ రేట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 15 రోజుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్ణయం తీసుకోవడం ఇది రెండో సారి. తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం నవంబర్ 7 నుంచి అమలులోకి రానున్నాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీలకు ఈ పెంపు వర్తిస్తుంది. 15 నెలల ఒక రోజు నుంచి 18 నెలల లోపు కాలవ్యవధి ఎఫ్డీలు 6.40% వడ్డీని పొందుతారు. 18 నెలల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి కలిగిన ఎఫ్డీపై 6.50% వడ్డీని పొందనున్నారు. సీనియర్ సిటిజన్స్ హెచ్డీఎఫ్సీ తన కస్టమర్లకు ఎఫ్‌డీల వడ్డీ రేటు పెంచిన సంగతి తెలిసింతే. అయితే 60 ఏళ్లు పైబడిన వారికి ప్రస్తుతం పెంచిన వడ్డీ రేటుపై మరో 0.50 శాతం అదనపు రేటు ప్రయోజనాన్ని అందిస్తోంది. దీంతో ఈ బ్యాంక్ ఖాతాదారులకు ఒకే సారి రెండు శుభవార్తలను అందించింది. బ్యాంక్‌లో వీరికి వడ్డీ రేటు 3.5 శాతం నుంచి ప్రారంభం కాగా గరిష్టంగా 7 శాతం వరకు వడ్డీ వస్తుంది. వీటితో పాటు రికరింగ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను పెంచేసింది. 15 నెలల ఒక రోజు నుండి 18 నెలల కంటే తక్కువ కాల వ్యవధికి ఇప్పుడు 6.90% వడ్డీని అందిస్తోంది. చదవండి: ఆ ఐఫోన్‌ను కొనే దిక్కులేదు!..తయారీ నిలిపేసిన ‘యాపిల్’! -
వావ్.. ఇల్లు, ఆఫీసు పక్కపక్కనే! ఉద్యోగులకు బంపర్ ఆఫర్
ఒకవైపు కార్యాలయాలు, మరోవైపు గృహ నిర్మాణాలు.. ఇంకేం ఎంచక్కా నడుచుకుంటూ ఆఫీసుకు వెళ్లిపోవచ్చు. ఉదయం నడకకు బద్ధకించేవారికి ఇదొక వాకింగ్ గానూ ఉపయోగపడుతోంది. ఆరోగ్యం దృష్ట్యా సైకిల్‌పైనా ఆఫీసులకు వెళ్లొచ్చు కూడా. కరోనాతో కస్టమర్లలో వచ్చిన మార్పులతో నగరంలో వాక్ టు ఆఫీసు ప్రాజెక్టులకు ఆదరణ పెరుగుతోంది. కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. కోవిడ్‌తో వర్క్ ఫ్రం హోమ్ అలవాటైన ఉద్యోగస్తులు తిరిగి కార్యాలయానికి రావటానికి ఆసక్తి చూపించడం లేదు. గంటల కొద్ది ప్రయాణం చేస్తూ.. కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందులతో ఆఫీసుకు వెళ్లేందుకు ఇష్టం పడటం లేదు. ఈ నేపథ్యంలో వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌లకు డెవలపర్లు శ్రీకారం చుట్టారు. ఆఫీసులకు చేరువలోనే గృహాలతో పాటు స్కూల్, ఆసుపత్రి, షాపింగ్ మాల్, పార్కు వంటి అన్ని రకాల వాణిజ్య ఏర్పాట్లు ఉండటం వీటి ప్రత్యేకత. దీంతో ఈ తరహా ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. పనిచేసే కార్యాలయానికి చేరుకోవడానికి అత్యధిక శాతం మంది తక్కువలో తక్కువ గంటసేపు బస్సుల్లోనో, లేదా ఇతరత్రా వ్యక్తిగత వాహనాల్లోనో గడిపేస్తున్నారు. దీంతో విలువైన సమయం వృథా అవుతోంది. దీంతో కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. అయితే ఈ వాక్ టు వర్క్ ప్రాజెక్ట్స్‌లో ఇల్లు, ఆఫీసు, మాల్, పార్కులు, స్కూల్, ఆసుపత్రి.. ఇలా సమస్త అవసరాలూ ఒకే చోట ఉంటాయి. ఈ ప్రాజెక్ట్‌లతో వేగంగా అభివృద్ధి.. నడిచి వెళ్లేందుకు అనువైన దూరంలో కార్యాలయం, షాపింగ్ మాళ్లు ఉండాలని కోరుకునే వారి సంఖ్య నగరంలో రోజురోజుకూ పెరుగుతుంది. ‘‘ఈ మధ్యకాలంలో మా వద్దకు వచ్చే ఐటీ నిపుణులు చాలా మంది ఇలాంటి ఫ్లాట్లే కావాలని అడుగుతున్నారని ఫార్చూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ సీఎండీ బీ శేషగిరిరావు చెప్పారు. అయితే ఈ వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌ల్లో కేవలం అన్ని సౌకర్యాలు ఒకే చోట ఉంటే సరిపోదు. ఆ ప్రాంతం కూడా అభివృద్ధికి చిరునామాగా నిలవాలని పేర్కొన్నారు. అందుకే ఐటీ, బీపీఓ వంటి వాటితో గచ్చిబౌలి, మాదాపూర్లు ఎలా అయితే వృద్ధి చెందాయో అంతకు రెట్టింపు అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. నగరం నలువైపులా.. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వాక్ టు వర్క్ ప్రాజెక్టులు ఇప్పుడు నగరం చుట్టూ విస్తరిస్తున్నాయి. ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌తో వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌లకు మరింత ఊపొచ్చింది. ఆదిభట్ల, ఉప్పల్, పోచారం, మహేశ్వరం వంటి శివారు ప్రాంతాల్లోనూ ఐటీ సంస్థలు రానున్నాయి. దీంతో ఈ ప్రాంతాలకు చుట్టూ 4 కి.మీ. పరిధిలో వాక్ టు వర్క్ ప్రాజెక్టులు నిర్మించేందుకు బిల్డర్లు ముందుకొస్తున్నారు. నగరంలోని మొత్తం రెండు లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగుల్లో అత్యధికులు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోనే విధులు నిర్వహిస్తుంటారు. ఇక్కడికి సిటీ నలువైపుల నుంచి వచ్చే వారు కొందరైతే, ఐదారు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిపోయేవారు మరికొందరు. వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌లతో ఇప్పుడు ఈ దూరం కూడా తగ్గిపోతుంది. -
ఫిక్స్డ్ డిపాజిట్లపై ఖాతాదారులకు గుడ్‌న్యూస్
సాక్షి, ముంబై: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల 7 శాతం దాకా వడ్డీని అందిస్తుంది. గత రెండు నెలల్లో, పలు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ వస్తున్నాయి. తాజాగా ఈ కోవలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ జాబితాలో చేరింది. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లన పెంచుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. కంపెనీ వెబ్సైట్ ప్రకారం, సవరించిన ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు అక్టోబర్ 17 నుండి అమలులోకి వచ్చాయి. 7 - 14 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3 శాతం, 599 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్టంగా ఏడు శాతం వడ్డీ లభిస్తుంది. 45 రోజులకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 3 శాతం వడ్డీ లభిస్తుండగా, 46 -90 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 4.05శాతం వడ్డీ లభిస్తుంది. 91-120 రోజుల డిపాజిట్ 4.3 శాతం, 121-180 రోజులకు 4.4శాతం వడ్డీని అందిస్తుంది. 181 రోజుల నుండి ఒక ఏడాది లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై, 5.25శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఒక సంవత్సరం మెచ్యూరిటీ కాలానికి, రాబడి రేటు 6.30 శాతం. సంవత్సరం - 443 రోజుల కంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉన్న FDలకు వడ్డీ రేటు 6.6 శాతంగా ఉంది. అయితే 600 రోజుల నుండి 10 సంవత్సరాల మెచ్యూరిటీ డిపాజిట్లపై 6.6 - 6.7 శాతం మధ్య వడ్డీ లభిస్తుంది. -
తొందరవద్దు, ప్రాణాలు తీస్తున్న యాప్‌లు.. క్లిక్ చేస్తే కష్టాలే!
సాంకేతిక విప్లవం కొన్ని సందర్భాల్లో దారి తప్పుతోంది. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న మొబైల్ టెక్నాలజీ.. అదే చేత్తో ప్రజల ప్రాణాలను కూడా బలి తీసుకుంటోంది. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని లోన్ యాప్‌ల నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. వారి వలలో పడి రుణాలు తీసుకు న్న అమాయకులు తిరిగి చెల్లించలేనప్పుడు వారి వేధింపులు తాళలేక తనువు చాలిస్తున్నారు. ఇటు వంటి సంఘటనల్లో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. నిర్వాహకుల వేధింపులు, పరువు, ప్రతిష్టలు రోడ్డున పడతాయనే భయంతో ఆందోళన లో ఏం చేయాలో తెలియక ప్రాణాలు పైకి తెచ్చుకుంటున్నారు. ఒక్క క్లిక్‌తో... మీ మొబైల్ ఫోన్లో ఒకే ఒక క్లిక్‌తో యాప్ డౌన్లోడ్ చేసుకోండి... ‘హామీ లేకుండానే రుణం పొందండి’ లోన్ యాప్స్ నిర్వాహకులు ఇచ్చే ప్రకటనలు ఇవి. హామీ అవసరమే లేదనడంతో పేద, మధ్యతరగతి వర్గాల వారు ఆకర్షితులై తమ మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. వివరాలు ఇవ్వడమే ఆలస్యం. క్షణాల్లో రూ.50వేల లోపు రుణం ఖాతాలో జమైపోతుంది. ఇలా ఆన్లైన్ ఆధారిత లోన్‌యాప్ ఉచ్చులోకి లాగుతున్నారు. రుణం ఇచ్చేటప్పుడు హుందాగా వ్యవహరించే నిర్వాహకులు చెల్లించడం ఒక్క రోజు ఆలస్యమైనా బెదిరింపులు, వేధింపులకు దిగుతున్నారు. డౌన్లోడ్ చేసుకునేటప్పుడే మొబైలోని కాంటాక్టు నంబర్లు, ఫొటోలు, వీడియోలు సహా అన్నింటికీ యాప్ నిర్వాహకులకు యాక్సెస్ ఇవ్వాలి. లేదంటే రుణం రాదంటారు. యాక్సెస్ ఇవ్వగానే రుణం తీసుకున్న వారి రుణ యాప్ సర్వర్లకు అనుసంధానమవుతుంది. అవసరార్థం అప్పుఇస్తే చాలనుకునే సందర్భంలో షరతులు, నిబంధనలను చూసుకోకుండానే చాలామంది అంగీకరిస్తున్నారు. అదే వారి పాలిట యమపాశమవుతోంది. దా‘రుణ’ వేధింపులు రుణం తీసుకున్న రోజు నుంచే చెల్లింపుల కోసం నిర్వాహకులు ఒత్తిడి తెస్తున్నారు. చెల్లింపు ఆలస్యమ య్యే కొద్దీ వేధింపులు పెరిగిపోతాయి. రుణగ్రహీత మొబైల్ నంబర్లకు పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే పోస్టులు, దుష్పచారాలతో కూడిన సందేశా లు, ఫొటోలు పంపిస్తారు. బెదిరింపులు లెక్క చేయకపోతే రుణగ్రహీత కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్ చేసి మొబైల్లోని కాంటాక్టు నంబర్లన్నింటికీ వాట్సప్‌లలో పంపుతారు. బతికుండగానే అతడి ఫొటోకు దండేసి చనిపోయినట్లు ప్రచారం చేస్తారు. వీరి ఆగడాలను కొందరు బయటకు చెప్పుకోలేక కుమిలిపోతూ బలవన్మరణాలకు పాల్పడుతుంటే.. ఇంకొందరు ఒక యాలో అప్పు తీర్చేందుకు మరో యాప్‌లో రుణాలు తీసుకుని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈజీ రుణంతో వల... ►లోన్ యాప్‌లో రుణం కోసం ఎటువంటి హామీ అవసరం లేదు. ►మొబైల్ ఉండి, లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ►హామీ లేకుండా రూ.2,000 నుంచి రూ.50 వేల వరకు లోన్యాప్లో మంజూరు చేస్తారు. ►రుణం చెల్లింపులో ఒక్కరోజు ఆలస్యమైనా లోన్‌యాప్ నిర్వాహకులు ఉపేక్షించరు. ►లోన్‌యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మొబైలోని వ్యక్తిగత డేటా (సమగ్ర సమాచారం) నిర్వాహకుల గుప్పెట్లోకి వెళ్లిపోతుంది. కొత్త కొత్త పేర్లతో... యాప్‌లను మొబైల్లోని ప్లేస్టోర్ నుంచి తొలగించడంతో నిర్వాహకులు ఇప్పుడు కొత్తకొత్త పేర్లతో మళ్లీ తెరపైకి యాప్‌లను తెస్తున్నారు. క్యాన్ బెస్, లెండ్ మాల్ క్యాష్ అడ్వా న్స్ రుపీ కింగ్, రుప్ బాక్స్, ఓకే సన్ ఫైన్, టౌ న్ మనీ గ్రాంట్, భారత్ లోన్, ముషీ గ్రాంట్ గోల్డ్ బీ టెండ్ మాల్, భారత్ క్యాష్, క్యాష్ ఏపూర్, లెండ్ రోజెటెండ్, స్మాల్ క్యాష్, ఎక్స్ పీ క్యాష్, మనలీ మాస్టర్, లెండ్ కింగ్, లిండ్ పోస్ట్, కోకో ఫాస్ట్, కోకో లెండ్ వంటి పేర్లతో నిర్వాహకులు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. కొన్ని యాప్‌లలో వడ్డీ మినహా యించుకుని మిగతా మొ త్తాన్నే రుణగ్రహీత ఖాతాలో వేస్తారు. ఉదాహరణకు రూ.10 వేలు రుణం తీసుకుంటే రూ.7,200లు జమచేస్తా రు. వారంలో రూ.10వేలు జమ చేయాలి. ఒక్కో సందర్భంలో ఒక యాప్‌లో చేసిన అప్పు తీర్చటానికి మరో యాప్ నుంచి అప్పు ఇప్పించేలా నిర్వాహకులే సహాయం చేస్తుండటం గమనార్హం. చదవండి: Viral Video: అరే ఏంది ఇది? రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలా? -
ఫెస్టివ్ బొనాంజా: కెనరా బ్యాంకు కస్టమర్లకు శుభవార్త!
హైదరాబాద్: ప్రభుత్వరంగ కెనరా బ్యాంకు ప్రత్యేక టర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను తన కస్టమర్ల కోసం ప్రకటించింది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 135 బేసిస్ పాయింట్ల వరకు పెంచి తన ఖాతాదారులకు ఈ ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్ అందించింది. కెనరా బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం సవరించిన కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 7 నుండి అమలులోకి వచ్చాయి. (మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్, ధర తక్కువ, ఇక జియో ఆఫర్ తెలిస్తే!) 666 రోజుల కాల వ్యవధికి డిపాజిట్ చేస్తే 7 శాతం వార్షిక రేటును ఆఫర్ చేస్తోంది. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఇదే డిపాజిట్‌పై అర శాతం అధికంగా 7.50 శాతం రేటును ఆఫర్ చేస్తోంది. రూ.2 కోట్లలోపు ఉండే డిపాజిట్లకు ఇది వర్తిస్తుందని కెనరా బ్యాంకు ప్రకటించింది. ప్రభుత్వరంగ బ్యాంకు నుంచి ఇది అత్యధిక రేటుగా పేర్కొంది. (సంచలనం: ఓలా, ఉబెర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం) ఇదీ చదవండి : హీరో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. బుకింగ్.. ఫీచర్లు, ధర వివరాలు -
పీకల్లోతు మునిగిన వొడాఫోన్ ఐడియా: కస్టమర్లకు బ్యాడ్ న్యూస్
సాక్షి, ముంబై: దేశంలో మూడో అతిపెద్ద టెలికాం ప్రొవైడర్ వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. మీడియా నివేదికల ప్రకారం భారీగా అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం కంపెనీకి చెందిన 25 కోట్ల మంది కస్టమర్లు భవిష్యత్తులో భారీ షాకే తగలనుంది. కంపెనీ అప్పులు చెల్లించకపోవడంతో ఈ ముప్పు ఏర్పడింది. ఇండస్ టవర్స్ వొడాఫోన్-ఐడియా హెచ్చరించిన వైనం ఇపుడు సంచలనంగా మారింది. (హీరో పండుగ కానుక అదిరిందిగా!ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ 2.0) విషయం ఏమిటంటే.. టెల్కో వొడాఫోన్ ఐడియా ఇండస్ టవర్స్‌కు దాదాపు రూ. 7000 కోట్లు బకాయిపడింది. వీలైనంత త్వరగాఈ రుణాన్ని చెల్లించకపోతే, నవంబర్ నాటికి టవర్లనుఉపయోగించడాన్ని నిలిపివేస్తామని ఇండస్ టవర్స్ హెచ్చరించింది. ఈ చెల్లింపుల విషయంలో వొడాఫోన్-ఐడియా విఫలమైతే మొబైల్ నెట్‌వర్క్‌లను మూసి వేస్తుంది. ఫలితంగా యూజర్లకు కష్టాలు తప్పవు. (Tiago EV: టాటా టియాగో ఈవీ వచ్చేసింది, వావ్...తక్కువ ధరలో!) సోమవారం ఇండస్ టవర్స్ డైరెక్టర్ల బోర్డు సమావేశం కంపెనీ ఆర్థిక పరిస్థితిని సమీక్షించింది. ఈ సందర్బంగా సుమారు 7,000 కోట్ల రూపాయల బకాయిలను గుర్తించింది. దీనిపై ఆందోళన చెందిన డైరెక్టర్లు బకాయిల చెల్లింపుపై లేఖ రాశారు. ముఖ్యంగా ప్రస్తుత నెలవారీ బకాయిలలో 80 శాతం వెంటనే చెల్లించాలని వొడాఫోన్ ఐడియాకు సూచించినట్లు జాతీయ మీడియా నివేదించింది. నెలవారీ బకాయిల్లో 100 శాతం "సకాలంలో" చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. కాగా కంపెనీ మొత్తం టవర్ బకాయిలు రూ. 10,000 కోట్లు మించిపోయాయి. ఇందులో కేవలం ఇండస్ టవర్స్‌కే రూ.7,000 కోట్లు రావాల్సి ఉంది. అమెరికన్ టవర్ కంపెనీ (ఏటీసీ)కి రూ.3,000 కోట్లు బకాయి ఉంది. ఇదీ చదవండి: 28 రోజుల మొబైల్ రీఛార్జ్ ప్లాన్ వెనక మతలబు ఇదే! -
యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్
సాక్షి,ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా రేట్లు నిన్న (మంగళవారం, సెప్టెంబర్ 20) నుంచి అమల్లోకి వచ్చాయి. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై సవరించిన రేట్లు వర్తిస్తాయి. వివిధ డిపాజిట్లపై సాధారణ పౌరులకు అందించే వడ్డీ 2.75 శాతం నుంచి 5.75 మధ్య ఉండనుంది. అలాగే సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై అందించే వడ్డీ 2.75 శాతం నుండి 6.50 శాతం వరకు ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు 11 రోజుల నుండి 1 సంవత్సరం, 25 రోజులు, 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీలకు 5.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇదే అత్యధిక వడ్డీ. 7 రోజులు నుంచి 29 రోజుల కాలవ్యవధికి, బ్యాంక్ 2.75 శాతం అందిస్తుంది; 7 రోజుల నుండి 14 రోజుల వరకు, సాధారణ ప్రజలకు 2.75 శాతంఅందిస్తుండగా, సీనియర్ సిటిజన్లకు 2.75 శాతం రేటు వర్తిస్తుంది. 30 నెలల నుండి 3 సంవత్సరాల డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 5.70 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.45 శాతం అందిస్తుంది. 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకుగాను సాధారణ ప్రజలకు 5.70 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.45 శాతం. అలాగే 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం వడ్డీని అందిస్తుంది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్ న్యూస్,రూ.2 కోట్ల వరకు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రూ.2 కోట్ల వరకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.20 శాతం వరకు పెంచింది. పెరిగిన రేట్లు ఈ నెల 13 నుంచి అమల్లోకి వచ్చాయి. ఏడాది టర్మ్ డిపాజిట్‌పై రేటు 5.30 శాతం నుంచి 5.50 శాతానికి పెరిగింది. 400 రోజులు దాటి, మూడేళ్ల వరకు కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపై రేటు 5.45 శాతం నుంచి 5.50 శాతానికి చేరింది. మూడేళ్లు దాటి, పదేళ్ల వరకు డిపాజిట్లపై రేటు 0.15 శాతం పెరిగి 5.65 శాతానికి చేరుకుంది. ఏడాది కాల డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 5.80 శాతం రేటు లభిస్తుంది. ఇతర కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపైనా వృద్ధులకు కొంచెం అదనపు వడ్డీని బీవోబీ ఆఫర్ చేస్తోంది. ‘బరోడా ట్యాక్స్ సేవింగ్స్ టర్మ్ డిపాజిట్’ 5–10 ఏళ్ల కాల వ్యవధికి 5.65 శాతం రేటు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 0.15 శాతం అదనపు రేటును బ్యాంక్ అందిస్తోంది. -
ఖాతాదారులకు షాకిచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ మరోసారి తన ఖాతాదారులకు షాకిచ్చింది. రుణాలపై వసూలు చేసే మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపు వాహన, గృహ అన్ని రకాల రుణాలపై వర్తిస్తుంది . ఈ రేట్లు నేడు(సెప్టెంబర్ 1, 2022) నుంచే వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది. తాజా వడ్డీ రేట్ల సవరణలో రుణ గ్రహీతలపై ఈఎంపై భారం మరింత పెరగనుంది. తాజాగాపెంచిన పెంపుతో ఓవర్‌నైట్ , ఒక నెల ఎంసీఎల్ఆర్ రేటును 7.65 శాతం నుండి 7.75 శాతానికి పెంచినట్లు బ్యాంక్ వెబ్సైట్ తెలిపింది. దీని ప్రకారం మూడు నెలల కాల పరిమితి రుణాలపై 7.80 శాతంగానూ, ఆరు నెలలకు 7.95 శాతంగా ఉండనుంది. ఇక వార్షికరుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 8 శాతంగా ఉంటుంది. గత నాలుగు నెలల్లో వడ్డీ రేట్లను పెంచడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు జూన్, జూలై, ఆగస్టులలో రేట్లు సవరించింది. ఆగస్టులో, బ్యాంక్ తన రేట్లను 15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఇది చదవండి: షాకింగ్ రిపోర్ట్: వదల బొమ్మాళీ అంటున్న ఎలాన్ మస్క్ windfall profit tax: మరోసారి విండ్‌ఫాల్ టాక్స్ షాక్ SC On Check Bounce Case: చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు -
నోరూరించే వార్త చెప్పిన జొమాటో.. బంపర్ ఆఫర్
సాక్షి,ముంబై: ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో తన కస్టమర్లకు నోరూరించేవార్త చెప్పింది. తమ వినియోగదారులు ఇప్పుడు భారతదేశంలోని అన్ని నగరాల నుండి తమకు ఇష్టమైన వంటకాలను ఆర్డర్ చేసి మరుసటి రోజేవాటిని డెలివరీ చేసుకోవచ్చట. దేశంలోని ప్రముఖ నగరాల నుంచి ఆర్డర్ చేసిన వంటకాలు మరుసటి రోజు కస్టమర్లకు డెలివరీ చేయనుంది. (Anand Mahindra వీడియో వైరల్: లాస్ట్ ట్విస్ట్ ఏదైతో ఉందో..) ఈ విషయాన్ని జొమాటో ఫౌండర్, సీఈవో దీపిందర్ గోయల్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుండి బాగా ఇష్టపడే కొన్ని వంటకాలను తన కస్టమర్లకు రుచి చూపించనున్నట్టు తెలిపారు. తమ ఇంటి వద్ద నుండే ఐకానిక్ వంటకాలను ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చని వెల్లడించారు. భారతదేశంలోని ప్రతిమూల ఏదో అద్భుతమైన వంటకం ఉంది. కోల్‌కతా రసగుల్లా, హైదరాబాద్ బిర్యానీ, లక్నో కబాబ్స్, జైపూర్ కచోరీ, పాత ఢిల్లీ నుండి బటర్ చికెన్ లేదా ప్యాజ్ వంటి వంటకాలను ఆర్డర్ చేసి ఆస్వాదించవచ్చు. దేశంలోని పాపులర్ వంటకాలు ఏవైనా ఇంటర్సిటీ లెజెండ్స్ద్వారా పొందవచ్చు.అంతేకాదురంగురుచీవాసన,నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా బెస్ట్‌ఫుడ్ అందిస్తామని కూడా చెప్పారు. (పెప్సీ, కోకా-కోలాకు రిలయన్స్ షాక్: కాంపా కోలా రీఎంట్రీ) ప్రస్తుతానికి ఇప్పుడు (ప్రస్తుతానికి పరిమిత ప్రదేశాలలో పైలట్ ప్రాజెక్టుగా) జొమాటో యాప్ ద్వారా ఈ ఐకానిక్ వంటకాలను ఆర్డర్ చేసుకోవచ్చు అని ట్వీట్ చేశారు. బిజినెస్-టు-బిజినెస్ నేరుగా ‘హైపర్‌ప్యూర్’ విధానంలో సరఫరా చేయనున్నామని పేర్కొన్నారు. తన ఫుడ్ డెలివరీ వ్యాపారం కంటే ఇది చాలా పెద్దది కానుందని జొమాటో పేర్కొంది. ప్రస్తుతానికి, కొత్త ‘ఇంటర్సిటీ లెజెండ్స్’ సేవను గుర్గావ్ .దక్షిణ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. There's a jewel in every corner of India – Baked Rosogollas from Kolkata, Biryani from Hyderabad, or Kebabs from Lucknow. Zomato's Intercity legends (pilot at limited locations for now) now lets you order these iconic dishes through our app. Read more: https://t.co/O8DOR23Wk5 pic.twitter.com/peL55DgRYM — Deepinder Goyal (@deepigoyal) August 31, 2022 -
2 కోట్ల మంది వొడాఫోన్ యూజర్ల డేటా బహిర్గతం
న్యూఢిల్లీ: టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా (వీఐ) సిస్టమ్‌లోని పలు లోపాల వల్ల దాదాపు 2 కోట్ల మంది పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కాల్ డేటా రికార్డులు బహిర్గతం అయినట్లు సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ సైబర్ఎక్స్9 ఒక నివేదికలో వెల్లడించింది. ఏ కాల్స్‌ను ఎవరికి, ఎన్నింటికి, ఎంత సేపు, ఎక్కడ నుంచి చేశారనే వివరాలతో పాటు కస్టమర్ల పూర్తి పేరు, చిరునామా మొదలైన సమాచారం అంతా కూడా వీటిలో ఉన్నాయని పేర్కొంది. ఈ విషయాన్ని వీఐకి ఆగస్టు 22న తెలియజేయగా, సిస్టమ్‌లోని లోపాలను గుర్తించినట్లు ఆగస్టు 24న కంపెనీ తమకు ధృవీకరించినట్లు వీఐ తెలిపింది. మరోవైపు, నివేదికలో పేర్కొన్నట్లుగా డేటా ఉల్లంఘన వార్తలను వీఐ ఖండించింది. నివేదికంతా తప్పుల తడకని, విద్వేషపూరితమైనదని వ్యాఖ్యానించింది. తమ ఐటీ సెక్యూరిటీ వ్యవస్థ పటిష్టంగానే ఉందని, కస్టమర్ల డేటా సురక్షితంగానే ఉందని స్పష్టం చేసింది. బిల్లింగ్ విషయంలో లోపాలు తలెత్తే అవకాశం ఉందని గుర్తించామని, దాన్ని వెంటనే సరిచేశామని పేర్కొంది. చదవండి: (Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు పెరిగాయ్) -
జొమాటో తన కస్టమర్లకు షాకిచ్చిందిగా...కానీ ఇక్కడో ట్విస్ట్
సాక్షి,ముంబై: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన కస్టమర్లకు షాకిచ్చింది...కాదు కాదు..మరో కొత్త స్కీంతో కస్టమర్లను ఆకర్షించనుంది. ఈ నేపథ్యంలోనే లాయల్టీ ప్రోగ్రామ్ ‘జొమాటో ప్రో’ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్కీం కింద ఇక కస్టమర్లకు అదనపు డిస్కౌంట్లు, ఫ్రీడెలివరీ లాంటి ఫెసిలిటీలు రద్దు అన్నమాట. కస్టమర్ అడిగిప్రశ్నకు సమాధానంగా ట్విటర్లో స్పందించిన జొమాటో ‘జొమాటో ప్రో’ సేవలపై ఈ మేరకు వివరణ ఇచ్చింది. గడువు ముగిసిన ప్రో మెంబర్‌షిప్‌ను రెన్యువల్ చేయడం కుదరదని జొమాటో తెలిపింది. దీనికి వెనుకకారణాలను మాత్రం జొమాటో స్పష్టం చేయలేదు. జొమాటో ప్రో, ప్లస్ లకు కొత్తగా సభ్యత్వం ఇవ్వడం లేదు. అయితే ఇప్పటికే మెంబర్షిప్ వాలిడిటీ ఉన్నవారు తమ ప్రయోజనాలు యధావిధిగా పొందుతారు. సభ్యత్వ గడువు ముగిసిన తర్వాత, దాన్ని పొడిగించలేరు/ పునరుద్ధరించలేరు అని జొమాటో ప్రతినిధి తెలిపారు. (Electric Scooters: కేవలం వేలం వెర్రేనా? సర్వేలో షాకింగ్ విషయాలు) ఇటీవలికాంలో జొమాటో రోజూ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటూ వస్తోంది. నిన్నగాక మొన్న హృతిక్ రోషన్ యాడ్‌కు సారీ చెప్పిన జొమాటో 'ప్రో' అనే మెంబర్షిప్ ప్రోగ్రామ్‌ను నిలిపివేయడం విశేషం. ఇప్పటికే ప్రో ప్లస్‌కు గుడ్ బై చెప్పేసింది. అలాగే క్రెడిట్ కార్డ్ నిబంధనలను కూడా సవరించిన సంగతి తెలిసిందే. (పండుగ సీజన్: డిపాజిటర్లకు బ్యాంకుల బంపర్ ఆఫర్) మరోవైపు తన వినియోగదారుల కోసం "కొత్త ప్రోగ్రామ్"ను లాంచ్ చేయనుందట. అప్డేట్ చేసిన ప్రోగ్రామ్‌తో మెరుగైన సేవలందిస్తామని, మరిన్ని ఆఫర్లు/అప్డేట్స్ కోసం వేచి ఉండాలంటోంది. దీనికోసం కస్టమర్లతో, రెస్టారెంట్ భాగస్వాములతో ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నామని పేర్కొంది. కొత్త ప్రోగ్రాం టైమ్‌లైన్‌ను పేర్కొనలేం గానీ రావడం పక్కా అని తెలిపింది. (ఇదీ చదవండి: వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్) Hi there, we regret hearing this from you. Please be informed that Zomato Pro Plus is unavailable for renewal as we are working on a new experience for you. We will get back with an update soon. We'd also like to thank you for being a part of the Zomato Pro program.[1/2] — zomato pro (@ZomatoProHelp) August 22, 2022 -
ప్రత్యేక డిపాజిట్ స్కీమ్: లక్ష డిపాజిట్ చేస్తే దాదాపు లక్షా 28 వేలు!
ముంబై: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) 6 శాతం వరకూ అత్యధిక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తూ, ‘బరోడా తిరంగా డిపాజిట్ పథకం’ పేరుతో ప్రత్యేక రిటైల్ టర్మ్ ప్లాన్‌ను ఆఫర్ చేసింది. అధిక వడ్డీ రేట్లను అందించే ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకాన్ని తీసుకువచ్చినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, వినియోగదారులకు అధిక వడ్డీరేటుతో తిరంగా డిపాజిట్ స్కీమ్ అందించడం సంతోషంగా ఉందనీ, అత్యంత విశ్వసనీయ బ్యాంకులలో బీఓబీ ఒకటని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కె. ఖురానా ప్రకటనలో తెలిపారు. (ఇన్స్టాగ్రామ్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు..ఇక పండగే!) 2022 డిసెంబర్ 31 వరకూ ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. రూ.2 కోట్లలోపు రిటైల్ డిపాజిట్లకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లు అదనపు వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. తిరంగా డిపాజిట్ స్కీమ్ వివరాల ప్రకారం, 555 రోజుల కాలవ్యవధికి డిపాజిట్‌పై 6.15శాతం వడ్డీని పొందవచ్చు. ఇందులో సీనియర్ సిటిజన్లకు 0.5శాతం అదనపు వడ్డీని, నాన్-కాలబుల్ డిపాజిట్లకు 0.15 శాతం అదనపు వడ్డీని అందిస్తుంది. అంటే సీనియర్ సిటిజన్లు ఈ పథకం కింద నాన్-కాలబుల్ 555 రోజుల డిపాజిట్ పై 6.65 శాతం వరకూ వరకు వడ్డీ లభిస్తుంది. దీని ప్రకారం 555 రోజులకు రూ. 1 లక్ష డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ. 1.26 లక్షల కంటే ఎక్కువే పొందవచ్చు. అదే సీనియర్ సిటిజన్లకు మెచ్యూరిటీ మొత్తం రూ. 1.28 లక్షల కంటే ఎక్కువగా ఉంటుంది. -
ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన పీఎన్బీ
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తనఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని కాలాల ఫిక్స్డ్ డిపాజిట్లపై అందించే 10-20 బేసిస్ పాయింట్ల వడ్డీరేటును పెంచింది. కొత్త వడ్డీ రేట్లు ఆగస్టు 17, 2022 నుండి అమలులోకి వస్తాయని బ్యాంక్ అధికారిక వెబ్సైట్ పేర్కొంది. పెరిగిన వడ్డీ రేట్లు కొత్త డిపాజిట్లు, ఇప్పటికే ఉన్న డిపాజిట్ల పునరుద్ధరణ రెండింటికీ వర్తిస్తాయని పీఎన్బీ స్పష్టం చేసింది. సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు, 3 సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 నుంచి 20 బేసిస్ పాయింట్లు పెంచింది. ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. రెండేళ్లలోపు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటు 15 బేసిస్ పాయింట్లు పెరిగి 5.50శాతంగా ఉంటుంది. రెండు నెంచి మూడు సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.60 శాతం వడ్డీ చెల్లిస్తుంది. పీఎన్బీ ఉత్తమ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ బ్యాంక్ అందించే ప్రత్యేక డిపాజిట్ స్కీమ్ పీఎన్‌బీఉత్తమ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడిదారులు రూ. 15 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేయవచ్చు. ఈ డిపాజిట్ పథకం వ్యవధి 91 రోజుల నుండి 1111 రోజుల వరకు ఉంటుంది . ఈ డిపాజిట్లపై వడ్డీ రేటు వరుసగా 4.05శాతం 5.55 శాతం దాకా ఉంటుంది. -
ఖాతాదారులకు షాకిచ్చిన ఎస్బీఐ: మూడు నెలల్లో మూడోసారి
సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులకు షాకిచ్చింది. రుణాలపై వసూలు చేసే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటును మరోసారి పెంచింది. తాజాగా ఎంసీఎల్ఆర్ రేటును 20 బీపీఎస్ పాయింట్లు పెంచి రుణ గ్రహీతలపై మరింత భారం మోపింది. బాహ్య బెంచ్‌మార్క్ ఆధారిత రుణ రేటు (EBLR), రెపో-లింక్డ్ లెండింగ్ రేటును 50 బీపీఎస్ పాయింట్ల మేర పెంచింది. ఆగస్టు 15 నుండి సవరించిన వడ్డీరేట్లు అమలులోకి వచ్చినట్టు బ్యాంకు ప్రకటించింది. ఓవర్‌నైట్ నుండి మూడు నెలల వరకు ఎస్బీఐ MCLR రేటు 7.15 శాతం నుండి 7.35 శాతానికి పెరిగింది. ఆరు నెలల వ్యవధి రుణాల వడ్డీరేటు 7.45 శాతం నుండి 7.65 శాతానికి పెరిగింది. సంవత్సర పరిధి లోన్లపై 7.90 శాతం, రెండేళ్లు,మూడు సంవత్సరాల 8 శాతంగా ఉంచింది. మూడు నెలల్లో మూడో పెంపు ఇది. ఇటీవల ఆర్బీఐ రెపో రేటు పెంచిన నేపథ్యంలో ఎస్బీఐ ఈ నిర్ణయం ప్రకటించింది. -
వినియోగదారులకు ప్రభుత్వ రంగ బ్యాంకు షాక్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటును 15 బేసిస్ పాయింట్లు లేదా 0.15 శాతం పెంచింది. అన్ని రకాల టెన్యూర్స్‌పై ఈపెంపు వర్తిస్తుందని బుధవారం ప్రకటించింది. దీంతో రుణాల ఈఎంఐలపై భారం పడనుంది. సవరించిన కొత్త రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పీఎన్బీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఏడాదికాల రుణాలపై ఎంసీఎల్ ఆర్ 7.25 - 7.40 శాతానికి పెరిగింది. అలాగే ఓవర్‌నైట్, ఒక నెల, మూడు నెలల రుణాలపై వడ్డీరేటు వరుసగా 6.7, 6.80, 6.90 శాతానికి చేరుకోగా, ఆరు నెలల వడ్డీరేటు 7.10 శాతానికి పెరిగింది. గత నెల మేలో ఆర్బీఐ రేటును పెంచిన తర్వాత ఈ మార్పు చోటు చేసుకొంది. -
పోస్టాఫీసుల్లో డిజిటల్ సేవలు
సాక్షి, హైదరాబాద్: తపాలా శాఖ డిజిటల్ సేవలకు సిద్ధమైంది. ఇప్పటి ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా డిజిటల్ సేవలందిస్తున్న పోస్టల్ శాఖ తాజాగా పోస్టాఫీసుల్లో జరిగే సాధారణ లావాదేవీలను సైతం డిజిటల్ సేవలకు శ్రీకారం చుట్టింది. స్పీడ్, రిజిస్టర్డ్, పార్శిల్ సర్వీస్ చార్జీలను డిజిటల్ చెల్లింపులకు అనుమితిస్తోంది. నగదుతో పని లేకుండా జీ పే, ఫోన్‌పే ద్వారా చార్జీలను స్వీకరిస్తోంది. వినియోగదారులకు వెసులుబాటు కలిగినట్లయింది. (చదవండి: సిలిండర్ వెయ్యి అయ్యింది. మహిళలకు కట్టెల పొయ్యే దిక్కయింది: కేటీఆర్) -
క్యాన్ వాటర్ తాగుతున్నారా? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే!
ఈ చిత్రంలోని వాటర్‌ప్లాంట్ గోదావరిఖని పట్టణంలోనిది. అపరిశుభ్రంగా ఉన్న ఈ ప్లాంట్‌లో నిబంధనలు పాటించడం లేదు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో 2021లో అధికారులు మొత్తం 19 వాటర్ ప్లాంట్లు ఉన్నాయని గుర్తించినట్లు వెల్లడిస్తున్నారు. కానీ లెక్కలకు మించి 50కు పైగానే పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఇలా జిల్లా మొత్తంగా 67 అనధికార వాటర్ ప్లాంట్లు గుర్తించగా.. బీఎస్ఐ ప్రమాణాలతో ఒక్కప్లాంట్ నిర్వహించడం లేదు. సాక్షి, పెద్దపల్లి: ‘మినరల్... ఫ్యూరీఫైడ్.. ఫ్రెష్.’ డ్రింకింగ్‌వాటర్‌కు ప్లాంట్ల నిర్వాహకులు పెట్టిన పేర్లు ఇవీ. వినడానికి బాగున్నా... రుచి చూస్తే మాత్రం పచ్చి అబద్ధం. శుద్ధిచేసిన తాగునీరు పేరుతో కొందరు జిల్లాలో అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. గుక్కెడు మంచినీళ్లు గరళంగా మారుతున్నాయి. గొంతు తడుపుకునేందుకు ఒక్కో కుటుంబం నెలకు రూ.వందల్లో వెచ్చించాల్సి వస్తోంది. విచ్చలవిడిగా వెలుస్తున్న నీటిశుద్ధి కేంద్రాల(ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు)పై అధికారుల నిఘా కరువైంది. బీఎస్ఐ స్టాండర్డ్ గుర్తింపు లేకుండానే ప్లాంట్ల నిర్వాహకులు వ్యాపారం చేస్తున్నారు. అపరిశుభ్రమైన నీళ్లలో కెమి కల్స్ కలిపి జనాల గొంతులో విషం పోస్తున్నారు. ఇదీ తయారీ పద్ధతి ముందుగా బోరులోని నీటిని ట్యాంక్‌లోకి నింపి క్లోరినేషన్ చెయ్యాలి. తర్వాత శాండ్ ఫిల్టర్‌లో శుభ్రం చేయాలి. కార్బన్ ఫిల్టర్స్, మైక్రాన్ ఫిల్టర్స్‌లో శుభ్రం చేసి రివర్స్ ఆస్మాసిస్ చెయ్యాలి. మినరల్స్‌ను జతచేసి ఓజోనైజేషన్ జరపాలి. ఆల్ట్రావైయోలెట్ రేడియేషన్ ద్వారా శుద్ధిచేసి నమూనాలు తీయాలి. మైక్రోబయాలజీ, కెమెస్ట్ ప్రయోగశాలలో నమూనాలను పరీక్షించాలి. ఆ తర్వాత క్యాన్లలోకి, బాటిళ్లలోకి తీసుకోవాలి. గతంలోని మోసాలివీ.. గతంలో గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు, రామగుండం నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగం అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అనేక వాటర్ ప్లాంట్లలో మోసాలు బహిర్గతం అయ్యాయి. చాలా వరకు ప్లాంట్లను సీజ్ చేశారు. నీళ్లు నిల్వచేసే ట్యాంకులు పాకురుపట్టి ఉండడం, పైపులు, శుద్ధి చేసే యంత్రాలు దుమ్ము, దూళితో నిండిపోయి పారిశుధ్యం అధ్వానంగా ఉన్నట్లు గుర్తించారు. తనిఖీలు నిర్వహిస్తాం అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నా వాటర్ ప్లాంట్స్‌లో త్వరలో తనిఖీలు నిర్వహిస్తాం. అటువంటి వాటిపై కేసులు నమోదు చేస్తాం. – అనూష, ఇన్చార్జి ఫుడ్ సెఫ్టీ ఆఫీసర్ నిబంధనలకు ‘నీళ్లు’ ►వాటర్ప్లాంట్లలో ఎయిర్ కండీషనర్లతోపాటు కెమికల్ ల్యాబ్, మైక్రోబయాలజీ ల్యాబ్, వాటర్ ఫిల్లింగ్ గది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్(బీఎస్ఐ) నిబంధనలకు అనుగుణంగా ప్లాంట్ పూర్తిగా స్టేయిన్‌లెస్ స్టీల్‌తో ఉండాలి. ►సంబంధిత అధికారులు ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఆయా ప్లాంట్లలో తనిఖీలు చేసి నమూనాలను సేకరించి, పలు రకాల పరీక్షలు నిర్వహించాలి. సంతృప్తికరంగా ఉంటే లైసెన్స్‌లు ఇవ్వడం, అంతకు ముందు ఇచ్చి ఉంటే వాటికి రెన్యూవల్ చేస్తారు. ►ప్లాంట్ నిర్వహణతోపాటు బాటిళ్లు, ప్యాకెట్లకు కూడా ప్రత్యేంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వాటర్ ప్యాకెట్లు, 20 లీటర్ల క్యాన్లపై కంపెనీల పేర్లు, ఫోన్ నంబర్లు, తయారు తేదీలు ముద్రించని సంస్థలు, అపరిశుద్ధమైన నీళ్లను అమ్ముతున్నారు. ► వాటర్ప్లాంట్లు అందించే నీటిలో కోలీఫామ్స్, ఫ్లోరైడ్, బ్యాక్టీరియా, సుడోమోనాస్, ఫంగే తదితరాలు ఉంటాయని ఆరోపణలు వస్తున్నాయి. ►వీటి ద్వారా ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కొందరు నిర్వాహకులు అనధికార బోర్లు వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
ఎండలే కాదు ధరలు మండుతున్నాయ్.. కొనలేం.. తినలేం
సాక్షి,కౌటాల(అదిలాబాద్): జిల్లాలో ఈ ఏడాది కేవలం 30 ఎకరాల్లో పుచ్చకాయల పంటను రైతులు సాగు చేశారు. కాగజ్‌నగర్ డివిజన్లోని మోసం, సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో 25 ఎకరాల్లో, ఆసిఫాబాద్ డివిజన్లోని, కెరమెరి, రెబ్బెన మండలాల్లో కేవలం 5 ఎకరాల్లో పుచ్చకాయ పంట సాగవుతున్నట్లు ఉద్యాన శాఖ జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని ఆరెగూడ, ఈజ్గాం, నజ్రుల్‌నగర్, సిర్పూర్(టి), వెంపల్లి, రెబ్బెన, గురుడుపేట, డబ్బా, బాబాసాగర్ గ్రామాల్లో రైతులు పుచ్చకాయ పంట అధికంగా సాగుచేస్తున్నారు. వేడిమి నుంచి ఉపశమనం.. వేసవి కాలంలోనే కాకుండా ప్రతీ కాలంలో ప్రజలు పుచ్చకాయలను ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ వీటిపై ఆసక్తి చూపుతారు. రుచిగా, తియ్యగా ఉండే ఈ కాయల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ప్రస్తుతం కర్భూజాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఎండలు ముదురుతున్న సమయంలో పుచ్చకాయలు రుచి చూడడానికి అందరూ ఇష్టపడతారు. అందుకే జిల్లాలో ప్రస్తుతం వీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. అధిక ధరలు జిల్లాలో ఒక్కో పుచ్చకాయ ధర కనిష్టంగా రూ.40 నుంచి గరిష్టంగా రూ.120కు పైబడి ధర పలుకుతున్నాయి. కాయ సైజును బట్టి వ్యాపారులు ధర చెబుతున్నారు. వేసవిలో మాత్రమే పండించే పుచ్చకాయలకు ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడడంతో సహజంగానే వ్యాపారులు ధర పెంచి క్రయవిక్రయాలు చేస్తున్నారు. ఎండతీవ్రత పెరిగే కొద్ది పుచ్చకాయల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ఆశించిన స్థాయిలో రైతులు పుచ్చకాయ పంటను సాగు చేయకపోవడంతోనే జిల్లాలో పుచ్చకాయల ధరలు మండిపోతున్నాయని పుచ్చకాయ ప్రియులు పేర్కొంటున్నారు. పేద, సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని స్థితిలో రేట్లు పెరుగుతుండడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. ధరలు భారీగా పెరిగిపోవడంతో పుచ్చకాయలను తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగుకు ఆసక్తి చూపని రైతులు గతంలో జిల్లాలో వందల ఎకరాల్లో పుచ్చకాయ పంటను రైతులు సాగు చేసేవారు. పుచ్చకాయ పంట సాగుపై రైతులకు అవగాహన లేకపోవడంతో పాటు సాగునీటి సౌకర్యం లేకపోవడంతో పంటను సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. ఈ సంవత్సరం రైతులు జిల్లా వ్యాప్తంగా కేవలం 30 ఎకరాల్లో పుచ్చకాయ పంటను సాగు చేశారు. ఏటేటా పుచ్చకాయ పంట సాగు తగ్గుతుందని, పంటకు సాగునీరు అందక సరైన ఉత్పత్తి లేక పుచ్చకాయ ధర పెరిగిందని పలువురు చెబుతున్నారు. ధరలు తగ్గించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, జిల్లాలో పుచ్చకాయ పంటను అధికంగా సాగు చేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. కొనలేని పరిస్థితులు ఉన్నాయి మార్కెట్లో పుచ్చకాయ ధర చూస్తే కొనలేని పరిస్థితులు ఉన్నాయి. సాధారణ సైజు పుచ్చకాయ ధర కూడా పేదలకు అందుబాటులో ఉండటం లేదు. జిల్లాలో రైతులు పుచ్చకాయ పంటను అధికంగా సాగు చేయడం లేదు. అందుకే పుచ్చకాయ ధరలు అమాంతం పెరిగాయి. – జె.రాందాస్, ముత్తంపేట ధరలు బాగా పెరిగాయి పుచ్చకాయల ధరలు అమాంతం పెరిగాయి. మేం ఒక ట్రాక్టర్ పుచ్చకాయలను రూ.10 వేలు పెట్టి కొనుగోలు చేస్తున్నాం. దీంతో పుచ్చకాయకు రూ. 40 నుంచి రూ. 100 వరకు అమ్ముతున్నాం. పుచ్చకాయల ధరలు అధికంగా ఉండండతో ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. – డి.గంగారం, పండ్ల వ్యాపారి, కౌటాల -
సారీ.. తప్పు జరిగింది.. కస్టమర్లకు క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్
ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ప్లిప్‌కార్ట్.. చిన్న తప్పిదం కారణంగా తమ కస్టమర్లకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ప్లిప్‌కార్ట్ కిచెన్ అప్లెయెన్స్‌ను ప్రమోట్ చేసుకుంది. మార్చి 8వ తేదీన(అంతర్జాతీయ మహిళా దినోత్సవం) రూ.299 నుంచి కిచెన్ అప్లెయెన్స్‌ను పొందవచ్చునని ప్లిప్‌కార్ట్ తెలిపింది. అయితే, ఈ ఆఫర్‌ను బేస్ చేసుకొని కొంత మంది మహిళలు ప్లిప్ కార్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం రోజున వంట గదికి సంబంధించిన ఆఫర్‌ను మాత్రమే ఎందుకు ప్రకటించారు. వంట గది మాత్రమే మా ప్రపంచం కాదంటూ ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలోనే మీ ఆఫర్‌కు నో థ్యాంక్స్ అంటూ కామెంట్ చేశారు. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ప్లిప్కార్ట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో తమ తప్పును తెలుసుకున్న ప్లిప్ కార్ట్.. ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పింది. తాము ఎవరి మనోభావాలను కించపరచాలని అనుకోవడంలేదని, ఆందోళన చెందుతున్నామని తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కిచెన్ సామాగ్రిని ప్రమోట్ చేస్తూ వార్త ప్రచురించిన ఈ-కామర్స్ సైట్ మార్కెటింగ్ విభాగం తప్పు చేసిందని ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లను క్షమాపణలు కోరింది. మరోవైపు.. ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ప్లిప్‌కార్ట్ హోలీ పండుగ సందర్బంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. మార్చి 12-16వ తేదీ వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్స్‌ను ప్రారంభించనుంది. హోలీ పండుగ సేల్స్‌లో భాగంగా పలు ప్రొడక్ట్‌లపై 80 శాతం డిస్కౌంట్, యాపిల్, శాంసంగ్, రియల్ మీ, ఒప్పో వంటి స్మార్ట్ ఫోన్లపై 60 శాతం వరకు భారీ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. It's offensive Why women are being identified with kitchen appliance..only ?? Whole world is ours & certainly kitchen is not our whole world!! No thanks!! — Harmeet Kaur (@iamharmeetK) March 8, 2022 We messed up and we are sorry. We did not intend to hurt anyone's sentiments and apologise for the Women's Day message shared earlier. pic.twitter.com/Gji4WAumQG — Flipkart (@Flipkart) March 8, 2022